Krishna Janmashtami
-
రెండవ రోజు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
కర్నాటకలోని ఉడుపిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన వేడుకలు ఈరోజు (మంగళవారం) కూడా కొనసాగుతున్నాయి. యూపీలోని మధురలో నిన్న(సోమవారం) రాత్రి అత్యంత వేడుకగా శ్రీకృష్ణునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. Shri Krishna Matha, Udupi 🙏#KrishnaJanmashtami pic.twitter.com/IBmWwwCudS— Visit Udupi (@VisitUdupi) August 26, 2024ఉడిపి శ్రీకృష్ణుని ఆలయంలో నేడు శ్రీకృష్ణ లీలోత్సవం అత్యంత వేడుకగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు శ్రీ కృష్ణ భక్తులు ఇప్పటికే ఉడుపికి తరలివచ్చారు. ఉత్సవాల్లో తొలి రోజున పలువురు చిన్నారులు బాలకృష్ణుని వేషధారణలో ఆలయంలో కనువిందు చేశారు. అలాగే రోజంతా స్వామివారి సమక్షంలో వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.#WATCH | Mathura, Uttar Pradesh: Aarti begins at Shri Krishna Janmasthan temple at the time of Shri Krishna Janma as the clock hits midnight pic.twitter.com/i80lWyaGb3— ANI (@ANI) August 26, 2024నేడు జరిగే శ్రీకృష్ణుని లీలోత్సవంలో బంగారు రథంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. అలాగే మఠంలో భక్తులకు సంప్రదాయాలకు చిహ్నంగా నిలిచే వివిధ పోటీలను నిర్వహించనున్నారు.#WATCH | Manipur | Shri Krishn Janmashtami being celebrated at Shree Shree Govindajee Temple, in Imphal pic.twitter.com/nQXk2aGK3b— ANI (@ANI) August 26, 2024ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి గోవిందరాజ ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జన్మాష్టమి వేడులను నిర్వహిస్తున్నారు. -
కృష్ణాష్టమి వేడుకలు.. రాధా కృష్ణుడి వేషాల్లో అలరించిన చిన్నారులు (ఫొటోలు)
-
హైదరాబాద్ : అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..
కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మరీ ఈ పర్వదినం రోజున చిన్ని కృష్ణయ్యకు సమర్పించే నైవేద్యాలు ఏంటీ..? ఎలాంటి పదార్థాలు నివేదిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దాం..!.ఈ పర్వదినం పురస్కరించుకుని వీధుల్లో జరిగే ఉట్టికొట్టే వేడుకు కోసం వేలాదిగా ప్రజలు గుమిగూడతారు. చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. మరీ ఈ వేళ చిన్ని కన్నయ్యకి సమర్పించే సంప్రదాయ వంటకాలేంటంటే..చప్పన్ భోగ్ విందు ఏర్పాటు చేస్తారు. ఇది ప్రజలంతా భక్తితో సమర్పించే గొప్ప విందు. ఈ చప్పన భోగ్ విందు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..చప్పన్ భోగ్ వెనుక స్టోరీ..ఉత్తర ప్రదేశ్‌లో మధుర శ్రీ కృష్ణుడు నడయాడిన ప్రదేశం ఉందని తెలుస. అక్కడ బృందావనంలో కృష్ణుడి పెరిగినట్లుగా మనం పురాణల్లో విన్నాం. అక్కడ బృందావన్‌లో ప్రజలు అంతా ముద్దుల కృష్ణయ్య, కన్నయ్య అనే పిలుచుకునేవారు. యశోదమ్మ కృష్ణుడికి చేసిన గారాభం కారణంగా అందరిని ఆటపట్టిస్తూ తుంటరిగా ఉండేవాడు. అంతా.. అమ్మ యశోదమ్మ నీ కృష్ణుని అల్లరి భరించలేకపోతున్నాం అని ఫిర్యాదులు చేస్తే తిరిగి వాళ్లదే తప్పు అన్నట్లు మందలించే యశోదమ్మ కృష్ణ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఒకరోజు బృందావనంలోని ప్రజలంతా ఇంద్రుడిని ఆరాధించే నిమత్తం చప్పన్ భోగ్ కార్యక్రమానికి సన్నహాం చేస్తున్నారు. దీన్ని చూసిన చిన్ని కృష్ణుడు తన తండ్రి నందుడుని ఏంటీ వేడుక? ఎందుకు చేస్తున్నాం అని అడగగా..వర్షాలు బాగా పడేలా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న పూజ అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా పండ్లు, కూరగాయాలు, జంతువులకు మేత అందించే గోవర్థన గిరిని పూజించాలని అంటారు. అందుకు గ్రామస్తులు అంగీకరించి గోవర్థన గిరికి పూజ చేస్తారు. దీంతో ఇంద్రుడు కోపంతో ఏకథాటిగా ఎనిమిది రోజులు కుండపోత వర్షం కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు బృందావన ప్రజలను గోవర్థన గిరి వద్దకు వచ్చి తలదాచుకోవాల్సిందిగా చెప్పి ఆ పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఉంచి రక్షించాడు. ఆయన వారందర్నీ రక్షించేందుకు ఎనిమిది రోజులగా నిరాహారంగా ఉండిపోతాడు. అన్ని రోజుల తమ కోసం తినకుండా సంరక్షించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞతగా ఈ చప్పన్ భోగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు బృందావన ప్రజలు. అప్పటి నుంచి కృష్ణుడికి ఇష్టమైన ఆహారాలతో భారీ విందు ఏర్పాటు చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అలాగే యశోదమ్మను కృష్ణుడు ఇష్టంగా ఏం తింటాడని అడిగిమరీ వండి నివేదించడం జరిగిందని పురాణ వచనం. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ చప్పన భోగ్లో మొత్తం 56 రకాల ఆహారాలను సిద్ధం చేస్తారు. ఇందులో వివిధ రుచులతో కూడిన ఆహార పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చేదు, ఘాటు, పులుపుతో కూడిన వంటకాల నుంచి మొదలై, తీపి వంటకాలతో ముగుస్తుంది. ఇందులో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు, మీగడ, పెరుగుకి సంబంధించిన వివిధ తీపి వంటకాలు కూడా ఉంటాయి. (చదవండి: కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!) -
కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!
దేవుళ్ల అందరిలోనూ ప్రత్యేక విలక్షణమూర్తి శ్రీకృష్ణుడు!. ఆయన బాల్యం- లీలా మాధుర్యానికి ఆట పట్టు, అనంత దార్శనిక సూత్రాల తేనెపట్టు. ఆయన శృంగార మహత్వం- లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒకరకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు. మరో కోణంలో మహా విషాద నాయకుడు ఇలా ఇద్దరు కృష్ణుడిలో తారసపడతారు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను- మోక్షమార్గాలుగానూ, స్వర్గద్వారాలుగానూ అద్భుతంగా నిరూపించాడాయన. ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కంధంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తలలతో మన మానస్సు అనే సరోవరాన్ని అను నిత్యం కలవరపరుస్తుంటుంది. అవే మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుద ముట్టించాలంటే, కోపం అనే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకుని గజేంద్ర మోకంలోని గజేంద్రుడిలా భగవంతుణ్ని ఆశ్రయించాలికృష్ణుడి ప్రత్యేకత ఏమంటే... ఆ ఆరింటినీ సాధనాలుగా మార్చు కొని, వాటి సాయంతోనూ తనను పొందవచ్చునని హామీ ఇచ్చాడాయన. కోరిక, కోపం, భయం, భక్తి, అనురక్తి, ఆసక్తి, ద్వేషం, స్నేహం... చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ని తమవాణ్ని చేసుకోని పొందొచ్చ్చని భాగవతం నిరూపించింది. అలా ఎవరెవరు ఏయే మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు కూడా. దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నాడాయన ధర్మరాజుతో. అదెలా అంటే..మనం చెప్పుకొన్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకొన్నారు. కామం అంటే కోరిక ఆసక్తి అనురక్తి... తనకు దక్కాలనే తహతహ. ధర్మా ర్థకామమోక్షాలనే నాలుగు రకాల పురుషార్థాలకు సంబంధించి- కామంలోని నాలుగు కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు. గోపికలది మధురభక్తికి చెందిన కామం. మోక్ష కాంక్షలోంచి ఉప్పొంగిందది. కాబట్టి వారిది 'మోక్ష సంబంధి శృంగారం' అన్నారు పెద్దలు. భరతుడి వివరణలోని మోక్షకామానికి సరైన ఉదాహ రణ గోపికల కామం.'కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయాద్వేషాలతో శిశు పాలాదులు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా ముని జనులు శ్రీకృష్ణుడికి చేరువ అయ్యారు' అన్నది నారదమహర్షి విశ్లేషణ. ఇదేవిధంగా ఇకృష్ణుడు చెప్పిన మోక్ష మార్గాలు..ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్దరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్ర మైనది. కళ్లు తెరిచింది- కటకటాల్లో. ఊపిరి పీల్చింది అపాయాల్లో. బతుకు గడిచింది- గండాల్లో. చివరకు ఆయన చరమదశా- పరమ దారుణం. తన కళ్లముందే తన వారంతా ఒకళ్లనొకళ్లు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే- కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలి బొటనవేలికి వేటగాడి బాణం నాటుకుని బొట్టుబొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరిపోవడమంటే- ఎంత విషాదకరమైన ముగింపు!. ఏమనాలి ఆయన జీవితాన్ని?.ఇది అద్భుతమా..!కృష్ణకథను చెబుతూ వ్యాసమహర్షి 'అద్భుతం' అనే పదాన్ని ప్రయోగించారంటే- ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కృష్ణుడి పుట్టుక అద్భుతం. ఆయన లీలలు అద్భుతం. ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం. 'ధర్మం' అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు- అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే- అది కృష్ణుడు. ఎంత చక్కగా ఆయన జీవిత కథ జీవిత పరమార్థాన్ని విశదరపరుస్తుంది. భగవంతుడు సైతం మనిషిగా పుట్టినప్పుడూ కష్టాలు అనుభవించక తప్పదని, ఉన్నత, పతన స్థితుల కలబోత అనే ఆయనే స్వయంగా అవతారం ఎత్తి చూపించాడు. సో కష్టాలకు కలవరపడొద్దు, ఆ జగన్నాథుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మీద భారం వేసి నిశ్చింతగా జీవించి సుఖమయ జీవితాన్ని పొందుదాం. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?) -
మధుర, బృందావనమే కాదు... ఇక్కడ కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి.. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకగా చేసుకునే పండుగ. ఈ ఏడాది ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చేసుకోనున్నారు. భారతదేశమంతటా ఈ పండుగ వేళ భక్తులలో ఆనందం వెల్లివిరుస్తుంది. జన్మాష్టమి వేడుకలు కేవలం మధుర-బృందావనంలోనే కాకుండా గుజరాత్, ముంబై, కేరళలో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. మధుర- బృందావనం (ఉత్తర ప్రదేశ్)బృందావనం శ్రీకృష్ణుని జన్మస్థలం. అందుకే జన్మాష్టమి వేళ ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బృందావనంలో జన్మాష్టమి వేడుకలు 10 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇక్కడి ఆలయాలను వివిధ రకాల అందమైన పూలతో అలంకరిస్తారు. రోజంతా భక్తులు భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఇక్కడి వాతావరణమంతా భక్తితో నిండిపోతుంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో నివసించే వారు జన్మాష్టమి నాడు మధుర, బృందావనాలను సందర్శిస్తుంటారు.ద్వారక (గుజరాత్)గుజరాత్‌లోని ద్వారకలో శ్రీకృష్ణుని పురాతన ఆలయం ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే జన్మాష్టమి సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు.పూరి (ఒడిశా)ఒడిశాలోని పూరీలో కూడా మధుర-బృందావనంలో మాదిరిగానే వారం రోజుల ముందుగానే జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుని జీవితం ఆధారంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణునికి ఇచ్చే హారతిని చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ముంబై (మహారాష్ట్ర)జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే దహీ-హండీ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదర్, వర్లీ, థానే, లాల్బాగ్లలో నిర్వహించే దహీ హండీని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.గురువాయూర్(కేరళ)గురువాయూర్ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయాన్ని బృహస్పతి, వాయుదేవుడు నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి గురువాయూర్ దేవాలయం అని పేరు వచ్చిందంటారు. ఇక్కడ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయి. -
Sunita Kejriwal: గొప్ప కార్యాలు సాధించేందుకే పుట్టారు!
యమునానగర్: అరవింద్ కేజ్రీవాల్‌కు భగవంతుడి అనుగ్రహం ఉందని, గొప్ప కార్యాలను సాధించేందుకే ఆయన పుట్టారని భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. ‘1968 ఆగస్టు 16న అరవింద్ కేజ్రీవాల్ పుట్టారు. ఆ రోజు కృష్ణ జన్మాష్టమి. ఇది యాధృచ్చికం కాదు. ఆయన ద్వారా దేవుడు ఏదో చేయించాలని అనుకుంటున్నాడని భావిస్తున్నా’ అని ఆమె పేర్కొన్నారు. మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వొద్దని హరియాణ ప్రజలను కోరారు. శనివారం సునీత హరియాణాలో సదౌరాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. పాఠశాలలు, ఆసుపత్రుల స్థితిగతులను మార్చడం, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత విద్యుత్.. ఇవి ఆప్‌తోనే సాధ్యమన్నారు. హరియాణా పుత్రుడు కేజ్రీవాల్‌తోనే ఇవి సాధ్యమని చెప్పారు. తప్పుడు కేసులో తన భర్తను బీజేపీ జైలుకు పంపిందని ఆరోపించారు. ‘మోదీ.. కేజ్రీవాల్‌ను కాదు హరియాణా పుత్రుడిని జైళ్లో పెట్టారు. నేను మీ కోడలిని. ఈ అవమానాన్ని మీరు సహిస్తారా? నిశ్శబ్దంగా ఉంటారా? కేజ్రీవాల్ ఒక సింహం. ఆయన మోదీ ముందు మోకరిల్లరు’ అని సునీత అన్నారు. -
ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు.. శ్రీ వేణుగోపాల స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. భూమన కరుణాకర రెడ్డికి అర్చకులు సంప్రదాయంగా తలపాగా చుట్టారు. గోపూజ, గోప్రదర్శనం చేసుకున్న తర్వాత పాలుపితికి, గోవులకు దాణా అందించారు టీటీడీ చైనర్మన్. అనంతరం శ్రీ వేంకటేశ్వర దివ్య మహావృత స్థూపం వద్ద నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. టీటీడీ తరఫున చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలందరికీ గోకులాష్టమి శుభాభినందనలు తెలియశారు. పరమ పూజ్యమైన పండగ గోకులాష్టమి రోజున టీటీడీ గో సంరక్షణ శాలలో గోకులాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు. గోకులాష్టమి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతోందన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా సాహ్నివాల్ జాతి గోవును టీటీడీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల ముందే 40 కోట్ల రూపాయల గ్రాంట్‌ను గోశాలకు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. చదవండి: తిరుమల ఆలయంపై విమాన సంచారం.. టీటీడీ సీరియస్ సనాతన భారతదేశంలో గాటికి ఆవు లేని ఇల్లు లేనేలేదు. అంతటి పరమ పవిత్రంగా కొలిచే హిందువులకు గోకులాష్టమి అత్యంత ముఖ్యమైనది. గోవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు వందేగోమాతరం పేరిట జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది. దానికి ఇద్దరు నోబుల్ లారెన్స్ కూడా రావడం జరిగింది. గోవులను రక్షించుకోవాలని, గోవులు ఉత్పత్తి చేసేపదార్థాల ద్వారా మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపతాయని వంటి అనేక రకాలుగా సెమినార్ అభిప్రాయాలు, సూచానలు వెల్లువెత్తాయి. రెండు రోజుల పాటు జరిగిన సెమినార్లో మేధావులంతా పెద్ద ఎత్తున చర్చించిన కారణంగా మంచి అవుట్ పుట్ వచ్చింది. ఆ తరహా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తాం. గోవు మనదరికీ పూజ్యనీయమైన తల్లి లాంటిది.’ అని భూమన పేర్కొన్నారు. -
మందుబాబులకు షాక్.. ఐదు రోజులు వైన్స్ బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మందుబాబులకు అలర్ట్. ఢిల్లీలో వరుసగా ఐదు రోజుల పాటు వైన్స్ షాప్‌లు మూడపడనున్నాయి. కాగా, ఢిల్లీలో జీ20 సమావేశాలు, పండుగల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వివరాల ప్రకారం.. ఢిల్లీలో వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, జీ20 సమావేశాల సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వైన్ షాపులను క్లోజ్ చేయనున్నారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఆ మూడు రోజులు మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులతోపాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. మరోవైపు.. శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నెల 6, 7 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించింది. దీంతో వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో వరుస సెలవుల కారణంగా మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. గత వారం రోజులుగా రాజధానిలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడం విశేషం. ఇది కూడా చదవండి: 'పాక్‌కు వెళ్లండి..' విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
భాగ్యనగరంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
విశాఖలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
కృష్ణం వందే జగద్గురుం
-
Srikrishna Janmashtami 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ తేదీన జరుపుకోవాలంటే!
చిన్నా పెద్దా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే పండుగ కృష్ణాష్టమి. అయితే, కొన్నిసార్లు తిథులు తగులు, మిగులు (ముందు రోజు తర్వాత రోజు) వచ్చినప్పుడు పండుగను ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధం చాలా మందిలో ఉంటుంది. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి విషయంలోనూ అదే తరహా సందిగ్దం. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే సందేహం. మరి ఈ ఏడాది ఈ పండుగను ఏ రోజున జరుపుకోవాలంటే...? శ్రీ కృష్ణుడు 64 కళలు కలవాడని నమ్మకం. శ్రీకృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే.. జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలను తొలగించి.. సుఖ సంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. విష్ణువుకు సంబంధించిన దశావతారాల్లో శ్రీ కృష్ణావతరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు తన చిన్నతనంలో అల్లరి చేష్టలతోనూ జీవిత పరమార్థాన్ని చెప్పాడని చాలా మంది నమ్ముతారు. కన్నయ్య వెన్న దొంగగా అందరి మనసులను కొలగొట్టేశాడు. గోప బాలుడిగా, సోదరుడిగా, అసురసంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో కీలకమైన పాత్రలను పోషించాడు. ఆయన ఉపదేశించిన భగవద్గీత మరెంతో ప్రత్యేకం. అయితే కృష్ణుని లీలలన్నీ లోక కళ్యాణం కోసమే. ఆరోజే పండుగ! నిజానికి ఆగష్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది. తదుపరి అష్టమి వచ్చింది. ఆగష్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది. పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగష్టు 19 శుక్రవారం జరుపుకోవాలని స్పష్టత ఉంది. అయితే, ఆగష్టు 18న జరుపుకోవాలన్న వాదన ఎందుకు తెరపైకి వచ్చిందో గమనిద్దాం… శ్రీకృష్ణుడు అష్టమి తిథి అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని, అందుకే ఆగష్టు 18న ఆ సమయానికి అష్టమి రావడంతో అదేరోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలంటున్నారు కొంతమంది. ఇదిలా ఉంటే.. హిందువుల పండుగల్లో 90 శాతం సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగష్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు. గోకులాష్టమి నాడు.. కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని పర్వదినంగా జరుపుకుంటారు. కిట్టయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కన్నయ్య పుట్టినరోజైన పండుగ రోజున ఒకపూట భోజనం చేసి వేణుమాధవుడికి పూజ చేసి.. శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతాన గోపాల మంత్రం పూజిస్తే.. అదే విధంగా సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః! ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః! ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదంటారు. కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా భగవానుడి నామ స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణుడిని పూజించి మర్నాడు ఉదయం దగ్గర్లో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు. -ఇన్పుట్స్: డి.వి.ఆర్ చదవండి: ద్వివిధుడి వధ -
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
రారా కృష్ణయ్య..!
బృందావనమది అందరిదీ అవునో కాదోగాని, గోవిందుడు అందరివాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీమద్భాగవత పురాణంలో, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించిన విపులమైన గాథలు ఉన్నాయి. బాలకృష్ణుడిగా చేసిన చిలిపిచేష్టలు, ఆ చిన్నారి వయసులోనే తనను చంపడానికి మేనమామ కంసుడు పంపిన పూతన, శకటాసుర, ధేనుకాసురాది రాక్షసుల హననం, చివరకు తనను చంపదలచిన మేనమామ కంసుడినే వధించడం శ్రీకృష్ణుడి అవతార మహిమకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. మన్ను తిన్నావెందుకని నిలదీసిన తల్లి యశోదకు తన నోట చతుర్దశ భువనభాండాలను చూపిన బాలకృష్ణుడు తనను తాను సర్వంతర్యామిగా ఆనాడే ప్రకటించుకున్నాడు.యవ్వనారంభంలో రాధా మనోహరుడిగా, గోపికా మానస చోరుడిగా చేసిన రాసలీలలు, అష్టమహిషుల ప్రభువుగా అలరారిన శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవ పక్షపాతిగా, అర్జునుని సారథిగా, యుద్ధానికి వెనుకంజ వేసిన అర్జునుడికి గీతబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. గోపాలుడైన గోవిందుడు ఆబాల గోపాలాన్నీ ఆకట్టుకున్నవాడు. అందుకే గోవిందుడు అందరివాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 24) సందర్భంగా ఈ ప్రత్యేక కథనం... నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పై జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా జిల్లెడు మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో! మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే! శ్రీకృష్ణుని రూపురేఖల గురించి శ్రీమద్భాగవతంలో పోతనామాత్యుడు చేసిన వర్ణన ఇది. నల్లనివాడు కావడం వల్లనే అతడికి కృష్ణుడనే పేరు వచ్చింది. కృష్ణుడు ఉత్త నల్లనివాడేనా? చాలా అల్లరివాడు కూడా. బాల్యావస్థలో చిన్నికృష్ణుని అల్లరి చేష్టలను కూడా పోతనామాత్యుడు కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. చిన్నప్పుడు అల్లరి చేష్టలతో పెరిగిన కృష్ణుడే మహాభారతంలో రాజనీతి చతురుడైన పార్థసారథిగా, లోకానికి గంభీరంగా కర్తవ్యబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. అల్లరి కృష్ణుడిగానే అవతార మహిమలు అల్లరి కృష్ణుడిగా పేరుమోసిన చిన్నారి వయసులోనే శ్రీకృష్ణుడు తన అవతార మహిమలను ప్రదర్శించాడు. ద్వాపరయుగంలో లోకంలో అధర్మం ప్రబలింది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ధర్మపరిరక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమ్మీద అవతరించదలచాడు. దేవకీ వసుదేవులకు జన్మించదలచాడు. అప్పుడు యాదవ క్షత్రియుడైన శూరసేన మహారాజు మధురా నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకితో వసుదేవునికి వివాహం జరిపిస్తారు. వివాహం తర్వాత చెల్లెలిని అత్తవారింట దిగవిడచడానికి కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతాడు. రథం మార్గమధ్యంలో ఉండగానే ‘నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదో కుమారుడు నిన్ను సంహరిస్తాడు’ అని అశరీరవాణి పలకడంతో ఆగ్రహోదగ్రుడైన కంసుడు చెల్లెలు దేవకిని, బావ వసుదేవుడిని చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా తన కత్తికి బలిచేస్తాడు. దేవకి ఏడోగర్భంలో ఉండగా విష్ణువు తన మాయతో ఆ పిండాన్ని నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. రోహిణికి కొడుకుగా బలరాముడు పుడతాడు. దేవకికి చెరసాలలోనే గర్భస్రావం అయి ఉంటుందని కంసుడు సరిపెట్టుకుంటాడు. కొన్నాళ్లకు దేవకి ఎనిమిదోసారి గర్భందాలుస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రివేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడిని పొత్తిళ్లలో పట్టుకుని వసుదేవుడు చెరసాల దాటి బయలుదేరుతాడు. దారిలో ఉన్న యమునా నది రెండుగా చీలి అతనికి దారి ఇవ్వడంతో నందుని ఇంటికి చేరుకుంటాడు వసుదేవుడు. నందుని మరో భార్య యశోద పక్కనున్న శిశువును తీసుకుని, ఆమె పక్కన కృష్ణుడిని విడిచిపెట్టి, తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. ఉదయాన్నే దేవకి శిశువును ప్రసవించిందన్న వార్త విన్న కంసుడు బిడ్డను చంపడానికి చెరసాలకు వెళతాడు. పుట్టినది కొడుకు కాదు, ఆడశిశువు అంటూ దేవకీ వసుదేవులు వారిస్తున్నా, కంసుడు ఆ శిశువును లాక్కును నేలకేసి కొట్టబోతాడు. శిశువు యోగమాయగా పైకెగసి, ‘నిన్ను చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులను కంసుడు ఇంకా చెరసాలలోనే ఉంచుతాడు. మరోవైపు వ్రేపల్లెలోని నందుని ఇంట కృష్ణుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంటాడు. తనను చంపబోయే బాలుడు ఎక్కడున్నాడో వెదికి పట్టుకుని చంపాలంటూ కంసుడు తన చారులను నలువైపులా పంపుతాడు. కంసుడు పంపిన వారిలో పూతన తొలుత కృష్ణుడి జాడ కనుక్కుంటుంది. విషపూరితమైన పాలు ఇవ్వబోయిన పూతనను పాలుతాగే వయసులోనే కృష్ణుడు పరిమార్చుతాడు. దోగాడే వయసులో కృష్ణుడి అల్లరి ఎక్కువవడంతో యశోద అతణ్ణి రోకలికి కట్టేస్తుంది. రోకలిని ఈడ్చుకుంటూ దోగాడుతూనే వెళ్లి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిస్తాడు. బుడిబుడి నడకల ప్రాయంలోనే కంసుడు పంపిన బక, ధేనుక, శకటాసురాదులను సంహరిస్తాడు. ఆరుబయట ఆటలాడుకుంటూ ఒకసారి బాలకృష్ణుడు మన్నుతినడంతో తోటి గోపబాలకులు యశోదకు ఫిర్యాదు చేస్తారు. తినడానికి ఇంట్లో వెన్న మీగడలుండగా మన్ను తిన్నావెందుకని యశోద గద్దించితే, నోరు తెరిచి తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించి, ఆమెను సంభ్రమానికి గురిచేస్తాడు. తనను పూజించడం మానేసినందుకు గోకులంపై ఆగ్రహించిన ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి, అల్లకల్లోలం సృష్టించినప్పుడు చిటికిన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, ఆ కొండ నీడన వ్రేపల్లె వాసులకు, గోవులకు రక్షణ కల్పిస్తాడు. కాళింది నదిని విషపూరితం చేస్తూ, జనాలను భయభ్రాంతులను చేస్తున్న కాళీయుని పడగపైకెక్కి తాండవమాడి కాళీయుని మదమణచి తాండవకృష్ణుడిగా చిన్నారి వయసులోనే జేజేలందుకుంటాడు. చిన్న వయసులోనే ఇన్ని మహిమలు చూపినా, మళ్లీ ఏమీ ఎరుగని వానిలాగానే తోటి గోపబాలకులతో కలసి ఆలమందలకు కాపలాగా వెళతాడు. వాళ్లతో కలసి అల్లరి చేస్తూ ఆటలాడుతాడు. ఎవరూలేని గోపాలుర ఇళ్లలోకి చొరబడి వెన్నమీగడలను దొంగిలిస్తాడు. ఇంటి మీదకు తగవులు తెచ్చి, మామూలు అల్లరిపిల్లవాడిలాగానే తల్లి యశోదతో చీవాట్లు తింటాడు. అరుదైన గురుదక్షిణ అల్లరిగా ఆటపాటలతో గడిపే కృష్ణబలరాములకు విద్యాభ్యాసం జరిపించాలనుకుంటాడు నందుడు. సాందీపని మహర్షి గురుకులంలో చేరుస్తాడు. కృష్ణబలరాములు సాందీపని మహర్షి గురుకులంలో చేరేనాటికి ఆయన పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటాడు. బాల్యంలోనే ఆయన కొడుకు ప్రభాస తీర్థంలో మునిగిపోతాడు.. గురువుకు శుశ్రూషలు చేసి మిగిలిన శిష్యుల మాదిరిగానే బలరామ కృష్ణులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయి, గురుకులాన్ని విడిచిపెట్టే సమయంలో గురుదక్షిణగా ఏమివ్వమంటారని అడిగాడు కృష్ణుడు. గురుపత్ని విలపిస్తూ ప్రభాసతీర్థంలో మునిగి కనిపించకుండా పోయిన తమ కుమారుడిని తెచ్చివ్వగలరా అని అడుగుతుంది. బలరామకృష్ణులు ప్రభాసతీర్థానికి చేరుకుంటారు. ప్రభాసతీర్థంలో గురుపుత్రుడిని అపహరించుకుపోయిన పాంచజన్యునితో పోరాడి, అతనిని తుదముట్టించి, గురుపుత్రుని సురక్షితంగా తీసుకువచ్చి, అతడిని గురుదక్షిణగా సమర్పించి, గురుకులం వీడి ఇంటికి చేరుకుంటారు కృష్ణబలరాములు. కృష్ణుడిని ఎలాగైనా తుదముట్టించాలన్న పట్టుదలతో కంసుడు పథకం పన్నుతాడు. ఉద్ధవుడిని దూతగా పంపి కృష్ణ బలరాములను మథురకు రప్పిస్తాడు. వారిని చంపడానికి చాణూర ముష్టికులనే మల్లులను ఉసిగొల్పుతాడు. కృష్ణుడు చాణూరుడిని, బలరాముడు ముష్టికుడిని సంహరిస్తారు. తర్వాత కృష్ణుడు కంసుడిని తుదముట్టించి, చెరలో ఉన్న తాత ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుడిని చేసి, తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను కూడా చెర నుంచి విడిపిస్తాడు. గురుకులంలో చెలికాడైన నిరుపేద బ్రాహ్మణుడు సుదాముడు పెద్దయిన తర్వాత తన ఇంటికి వస్తే, సముచిత రీతిలో ఆతిథ్యమిచ్చి, అతడి దారిద్య్రబాధను కడతేరుస్తాడు. అష్టమహిషులు కృష్ణుడు ఎనిమిదిమంది భార్యలను వివాహమాడాడు. రుక్మిణి కృష్ణుడిని ప్రేమించింది. ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తలుస్తాడు ఆమె సోదరుడు రుక్మి. బలవంతపు పెళ్లి ఇష్టంలేని రుక్మిణి రహస్య సందేశం పంపడంతో కృష్ణుడు ఆమెను ఎత్తుకుపోయి రాక్షసవివాహం చేసుకుంటాడు. అడ్డు వచ్చిన రుక్మికి సగం శిరస్సు, సగం మీసాలు గొరిగి బుద్ధిచెబుతాడు. సత్రాజిత్తు వద్దనున్న శమంతకమణి పోయి, అతడి సోదరుడు ప్రసేనుడు సింహం నోటపడి మరణించడంతో ఆ నింద కృష్ణునిపై పడుతుంది. శమంతకమణిని జాంబవంతుని గుహలో కనుగొన్న కృష్ణుడు అతడిని యుద్ధంలో గెలవడంతో జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కృష్ణుడికి సమర్పిస్తాడు. శమంతకమణిని తిరిగి తెచ్చివ్వడంతో సత్రాజిత్తు తన కూతురు సత్యభామతో కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. వసుదేవుడి చెల్లెలైన శ్రుతకీర్తి కూతురు భద్రను, మరో మేనత్త కూతురు అవంతీ రాజపుత్రిక మిత్రవిందను స్వయంవరంలో పెళ్లాడతాడు. కోసలరాజు నగ్నజిత్తు వద్ద ఏనుగులంత బలం ఉండే ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి కూతురునిస్తానని ప్రకటించడంతో, కృష్ణుడు ఏడు రూపాల్లో ఏడు వృషభాలనూ నిగ్రహించి, నగ్నజిత్తు కూతురు నాగ్నజితిని వివాహమాడతాడు. మద్ర దేశాధిపతి కూతురు లక్షణ స్వయంవరంలో కృష్ణుడిని వరిస్తుంది. ఈ ఎనిమిదిమంది ద్వారా కృష్ణుడికి పదేసిమంది చొప్పున కొడుకులు కలిగారు. మహాభారతంలో కృష్ణుడు మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడికి మొదటి నుంచి స్నేహబాంధవ్యాలు ఉండేవి. ముఖ్యంగా పాండవ మధ్యముడైన అర్జునుడితో శ్రీకృష్ణుడిది విడదీయరాని బంధం. నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని ప్రతీతి. పాండవపత్ని ద్రౌపదిని సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. శ్రీకృష్ణుడి సలహాల మేరకే ధర్మరాజు మొదలుకొని పాండవులంతా నడుచుకునేవారు. ద్యూత వ్యసనుడైన ధర్మరాజు కృష్ణుడి సలహా తీసుకోకుండానే శకుని ఆహ్వానించగానే మాయజూదంలో చిక్కుకుని సర్వస్వాన్ని కోల్పోతాడు. జూదంలో ధర్మరాజు పణంగా ఒడ్డిన ద్రౌపదిని దుశ్శాసనుడు కురుసభలోకి ఈడ్చుకొచ్చి వలువలు వలిచే ప్రయత్నం చేసినప్పుడు ఆమె తలచినంతనే చీరలు ప్రసాదించి, మానసంరక్షణ చేస్తాడు. మాయజూదంలో ఓటమిపాలై అరణ్య, అజ్ఞాతవాసాల్లో ఉన్న పాండవులకు శ్రీకృష్ణుడు అడుగడుగునా అండగా నిలుస్తాడు. తన రాజ్యానికి బెడదగా ఉన్న జరాసంధుని భీముడి సాయంతో తుదముట్టిస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయం చేసినప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిస్తాడు. శిశుపాలుడు దీనిని ఆక్షేపించి, శ్రీకృష్ణుడిని దూషిస్తాడు. మేనత్తకు ఇచ్చిన వరం మేరకు శిశుపాలుడి వందతప్పులను సహించిన శ్రీకృష్ణుడు, అతడు వందతప్పులనూ పూర్తి చేయడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించక తన చక్రాయుధంతో అతడిని సంహరిస్తాడు. పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత వారి తరఫున రాయబారిగా కురుసభకు వెళతాడు. దుర్యోధనుడు మొండికేసి సూదిమొన మోపినంత చోటైనా పాండవులకు ఇవ్వననడమే కాకుండా, కృష్ణుడిని బంధించడానికి తెగబడటంతో నిండుసభలోనే విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడానికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తాత్కాలికంగా చూపునిస్తాడు. యుద్ధం అనివార్యమైనప్పుడు తాను పాండవులపక్షా నిలిచి, అర్జునుడికి సారథిగా కురుక్షేత్ర రణరంగానికి వెళతాడు. రణరంగంలో అయినవారిని చూసి, తాను వారిని తన చేతులతో సంహరించలేనంటూ అర్జునుడు వెనుకాడినప్పుడు కురుక్షేత్రంలో మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించి, గీతబోధ చేసి, అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం బారి నుంచి ఉత్తర గర్భస్థ శిశువును తన చక్రాన్ని అడ్డువేసి కాపాడతాడు. ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షిత్తు పాండవుల తర్వాత రాజ్యభారం వహిస్తాడు. అవతార పరిసమాప్తి కురుక్షేత్రం యుద్ధంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్న గాంధారి, దీనంతటికీ కృష్ణుడే కారణమని తలచి అతడిపై ఆక్రోశం పెంచుకుంటుంది. యుద్ధంలో కురువంశం నాశనమైనట్లే యదువంశం కూడా నాశనమవుతుందని గాంధారి శపిస్తుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు యాదవ యువకులు కొందరు కృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన సాంబుడికి ఆడవేషం కట్టి, నిండుచూలాలి మాదిరిగా అలంకరిస్తారు. అటుగా వచ్చిన మునులను అడ్డగించి, ఆడవేషంలోని సాంబుడిని చూపి, పుట్టబోయేది ఆడబిడ్డో, మగశిశువో చెప్పాలంటూ ఆటపట్టిస్తారు. ఆగ్రహించిన మునులు యదుకులాన్ని నాశనం చేసే ముసలం పడుతుందని శపిస్తారు. సాంబుడికి వేషం తీసేశాక, అతడి దుస్తుల్లోంచి లోహపు ముసలం ఒకటి బయటపడుతుంది. దానిని చూసి యాదవులు భయపడతారు. దానినేం చేయాలని పెద్దలను అడిగితే, అరగదీసి సముద్రంలో కలిపేయమని సలహా ఇస్తారు. వీలైనంత వరకు దానిని అరగదీసి సముద్రంలో కలిపేస్తారు. చిన్న ములుకులాంటి భాగం మిగిలిపోవడంతో దానిని ఒడ్డున పడేస్తారు. ముసలాన్ని అరగదీసిన ప్రదేశంలో రెల్లుగడ్డి మొలుస్తుంది. ములుకులాంటి భాగం ఒక నిషాదుడికి దొరకడంతో, అతడు దానిని తన బాణానికి ములుకులా అమర్చుకుంటాడు. కొన్నాళ్లకు యాదవులు తప్పతాగి వారిలో వారే కొట్లాడుకుని ఒకరినొకరు చంపుకుంటాడు. జరిగిన దారుణానికి తల్లడిల్లిన బలరాముడు యోగమార్గంలో దేహత్యాగం చేస్తాడు. కృష్ణుడు ఒంటరిగా ఒక చెట్టునీడన కూర్చుని వేణువూదుతూ కాలిని ఆడిస్తుండగా, అక్కడేదో మృగం ఉందని భ్రమించి నిషాదుడు బాణం సంధిస్తాడు. ఆ బాణం వల్లనే కృష్ణుడు దేహత్యాగం చేశాడని, బాణాన్ని సంధించిన నిషాదుడు గతజన్మలో వాలి కొడుకైన అంగదుడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వాలిని రాముడు చెట్టుచాటు నుంచి వధించడం వల్లనే ద్వాపరయుగంలో నిషాదుడిగా జన్మించిన అంగదుడు చెట్టుచాటునున్న కృష్ణుడిపై బాణం సంధిస్తాడని కొన్ని పురాణాల కథనం. శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపరయుగం అంతరించి కలియుగం ప్రారంభమైందని కూడా పురాణాలు చెబుతాయి. అయితే, శ్రీకృష్ణుడు జరామరణ రహితుడని రామానుజాచార్యులు మొదలుకొని గౌడీయ వైష్ణవ గురువుల వరకు పలువురు ఆచార్యలు చెప్పారు. పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు ఆదిమధ్యాంత రహితుడని, పాంచభౌతిక దేహానికి అతీతుడని వైష్ణవుల విశ్వాసం. పురాణాలు... చారిత్రక ఆధారాలు... శ్రీకృష్ణుని ప్రస్తావన పురాణాల్లోనే కాకుండా, ఉపనిషద్వాంగ్మయంలోనూ కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాచీనమైనదని భావిస్తున్న ‘ఛాందోగ్యోపనిషత్తు’లో కృష్ణుడి ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఇదే. ఇందులో శ్రీకృష్ణుడు దేవకీసుతుడని, ఘోర అంగీరసుడికి శిష్యుడని ఉంది. ‘నారాయణ అధర్వశీర్ష’, ‘ఆత్మబోధ’ వంటి ఉపనిషత్తులు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పాయి. హరివంశం, విష్ణుపురాణం వంటి పురాణగ్రంథాల్లో కూడా కృష్ణుని గురించిన గాథలు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో మగధ రాజ్యానికి వచ్చిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన రచనల్లో కృష్ణుడిని ‘హెరాకిల్స్’గాను, బలరాముడిని ‘అగాథకిల్స్’గాను ప్రస్తావించాడు. మధుర రాజైన శూరసేనుడు ‘హెరాకిల్స్’ను పూజించేవాడని మెగస్తనీస్ రాశాడు. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది నాటి గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదిశ ప్రాంతంలోని బేస్‌నగర్‌లో నెలకొల్పిన స్థూప శాసనంలో ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం’ ఆ గరుడ స్తంభాన్ని భక్తుడైన తాను వేయించినట్లు పేర్కొన్నాడు. ఇండో–గ్రీకు పాలకుడైన అగాథోక్లెస్ క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దిలో కృష్ణబలరాముల బొమ్మలున్న నాణేలను ముద్రించాడు. ఆ కాలంలోనే వృష్టివంశానికి చెందిన ఐదుగురు వీరులు: కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు పూజలందుకునేవారు. మధుర సమీపంలోని మోరా వద్ద లభించిన శాసనంలో ఈ ఐదుగురు వృష్టివంశ వీరులకు పూజలు జరిపేవారనేందుకు ఆధారాలు బయటపడ్డాయి. సుమారు అదేకాలంలో వ్యాకరణకర్త పతంజలి రచనల్లో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల పేర్లు కనిపిస్తాయి. కృష్ణుని ఆరాధన... ఆలయాలు... దేశం నలుమూలలా కృష్ణుని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడిగా, కేరళలోని గురువాయూర్‌లో గురువాయూరప్పగా, గుజరాత్‌లోని నాథద్వారలో శ్రీనాథుడిగా, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనాలలో శ్రీకృష్ణుడిగా, గుజరాత్‌లోని ద్వారకలో ద్వారకాధీశునిగా, మహారాష్ట్రలోని పండరిపురంలో పాండురంగ విఠలునిగా, తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాలునిగా ఆరాధిస్తారు. మీరాబాయి, చైతన్య మహాప్రభువు, సూరదాసు, భక్త జయదేవుడు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వంటివారు కృష్ణభక్తుల్లో సుప్రసిద్ధులు. భారతీయ సంప్రదాయ సంగీత సాహిత్యాలలో కృష్ణునికి విశేషమైన స్థానం ఉంది. కృష్ణుని గురించిన అనేక కీర్తనలు, కృతులు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. భక్తజయదేవుని గీతగోవిందం, అష్టపదులు, సూరదాసు గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట కచేరీల్లో వినిపిస్తూనే ఉంటాయి. పోతన భాగవతంలో శ్రీకృష్ణుని వర్ణన నిరుపమానమైనవి. తెలుగునాట అన్నమయ్య వంటి పలు వాగ్గేయకారులు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తూ రాసిన కీర్తనలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆధునిక కాలంలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద ‘హరేకృష్ణ’ ఉద్యమాన్ని ప్రారంభించి, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ (ఇస్కాన్) స్థాపించారు. ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో దేశ దేశాల్లో ఆలయాలు నడుస్తున్నాయి. ధార్మిక జీవనశైలి, భగవద్గీత, కృష్ణతత్వం ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ‘హరేకృష్ణ’ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంది. పలువురు విదేశీయులు సైతం ‘ఇస్కాన్’ ఆలయాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. వైష్ణవ సంప్రదాయం పాటించేవారు ఇళ్లలో కూడా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి పాటలు పాడుతారు. ముంగిళ్లలో బాలకృష్ణుని పాదముద్రలను తీర్చిదిద్దుతారు. ఆ పాదముద్రలనే ఆనవాలు చేసుకుని బాలకృష్ణుడు తమ నట్టింట నడయాడుతాడని కొందరు భక్తులు నమ్ముతారు. ఇంట్లోని పూజమందిరంలో కృష్ణుని ప్రతిమను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పాలు, అటుకులతో తయారుచేసిన మధుర పదార్థాలను, వెన్న మీగడలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి, బంధుమిత్రులతో కలసి ఆరగిస్తారు. కృష్ణాష్టమి రోజున పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీకృష్ణ లీలలను పఠించడం లేదా ఆలకించడం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించితే చతుర్విధ పురుషార్థాలూ ప్రాప్తిస్తాయని ‘స్కందపురాణం’ చెబుతోంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో చిన్నారులు ఉంటే కృష్ణుడిలా, గోపికల్లా వారికి వేషాలు కడతారు. కొన్ని చోట్ల ఉట్టికొట్టే వేడుక జరుపుతారు. భాగవత పారాయణ, భగవద్గీత పారాయణ, విష్ణుసహస్రనామ పారాయణ, కృష్ణాష్టక పారాయణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. -
చిన్ని కృష్ణుల చిద్విలాసం
-
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
అందరివాడు గోవిందుడు
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!ఆది శంకరాచార్యులు శ్రీకృష్ణుడిని జగద్గురువుగా కీర్తిస్తూ కృష్ణాష్టకాన్ని విరచించారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సనాతన ధర్మంలోని సర్వమతాలకు ఆరాధ్య గ్రంథం. అద్వైతాన్ని స్థాపించిన ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడిని జగద్గురువుగా తలచి కొలిచి తరించారు. కృష్ణుడు బోధించిన భగవద్గీతకు అనేకమంది ఆధ్యాత్మిక గురువులు వ్యాఖ్యానాలు రాశారు. చైతన్య మహాప్రభువు కృష్ణభక్తికి విస్తృత ప్రచారం కల్పించారు. భక్త జయదేవుడు, మీరాబాయి, సూరదాసు, నామదేవ్ వంటి వారు కృష్ణలీలలను గానం చేశారు. జయదేవుడి అష్టపదులు, మీరబాయి, సూరదాసుల భజన గీతాలు, నామదేవ్ విరచిత అభంగ్లు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. పండితులు, ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే కాదు, బృందావనంలోని గోపికలు మొదలుకొని వ్రేపల్లెలోని ఆబాల గోపాలం సహా సామాన్యులు కూడా కృష్ణుని ఆరాధనలో తరించారు. అందుకే గోవిందుడు అందరివాడని ప్రతీతి పొందాడు. సంభవామి యుగే యుగే లోకంలో అధర్మం ప్రబలినప్పుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో లోకంలో అధర్మం పెచ్చుమీరిన కాలంలో బ్రహ్మదేవుడు, భూదేవి ప్రార్థించగా, శ్రీమహావిషువు దేవకీ, వసుదేవులకు జన్మించ సంకల్పించాడు. అప్పుడు మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలించేవాడు.వసుదేవుడు ఆయన కొడుకు. వసుదేవుడికి యుక్తవయసు రావడంతో ఉగ్రసేన మహారాజు కూతురు దేవకీదేవితో వివాహం జరిపిస్తారు. చెల్లెలు దేవకీదేవిని అత్తవారింట దిగబెట్టేందుకు కంసుడు స్వయంగా రథం నడుపుతాడు. రథం తోవలో ఉండగానే ‘దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టిన కొడుకు చేతిలో కంసుడి చావు తప్పదు’ అని అశరీరవాణి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికతో ఆగ్రహించిన కంసుడు దేవకీదేవిని, వసుదేవుడిని, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో పెడతాడు. చెరసాలలో దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను కంసుడు దారుణంగా చంపేస్తాడు. దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు. కొన్నాళ్లకు దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది. శ్రావణ శుద్ధ అష్టమినాడు అర్ధరాత్రివేళ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకుని యమునానది వైపు బయలుదేరుతాడు. యమునానది రెండుగా చీలి వసుదేవుడికి దారి ఇస్తుంది. వ్రేపల్లెలోని నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళతాడు. నందుడి భార్య యశోద పక్కన కృష్ణుడిని విడిచి, ఆమె పక్క నిద్రిస్తున్న శిశువును ఎత్తుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు రాగానే ఆ శిశువు ఏడుస్తుంది. దేవకికి శిశువు పుట్టిన సమాచారం తెలుసుకుని, కంసుడు హుటాహుటిన చెరసాలకు చేరుకుంటాడు. శిశువును చంపడానికి పైకి విసిరికొడతాడు. అయితే, ఆ శిశువు ఆకాశమార్గానికి ఎగసి, అష్టభుజాలతో, శంఖ చక్ర గదాది ఆయుధాలతో కనిపిస్తుంది. తాను యోగమాయనని, కంసుడిని చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి, నందుల వద్ద పెరిగాడు. ఆబాలగోపాలుడు యోగమాయ హెచ్చరికతో ప్రాణభయం పట్టుకున్న కంసుడు దేవకీ గర్భాన పుట్టినవాడు ఎక్కడ ఉన్నా, వెతికి వాడిని చంపాలంటూ తన వద్దనున్న రాక్షసులను పురమాయిస్తాడు. కంసుడు పంపగా వచ్చిన పూతనను పాలుతాగే వయసులోనే సంహరించాడు బాలకృష్ణుడు. బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసుడిని, ధేనుకాసురుడిని, బకాసురుడు తదితరులను వధించాడు. దోగాడే వయసులోనే చిన్నికృష్ణుడు తెగ అల్లరి చేసేవాడు. అతడి అల్లరిని అరికట్టడానికి నడుముకు తాడు చుట్టి, దానిని రోలుకు కట్టేస్తుంది యశోద. నడుముకు అంత పెద్ద రోలు ఉన్నా, దాంతోనే పాకుతూ పోయి రెండు మద్ది చెట్లను కూల్చి, వాటి రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు. ‘తమ్ముడు మట్టి తింటున్నాడు’ అంటూ బలరాముడు ఫిర్యాదు చేయడంతో, ‘ఏదీ నోరు తెరువు’ అని గద్దించిన యశోదకు తన నోటిలోనే పద్నాలుగు లోకాలనూ చూపి, ఆమెకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాడు. అన్న బలరాముడితో కలసి, వ్రేపల్లెలోని గోపబాలకులతో ఆవులను మేతకు తీసుకుపోయే వాడు. వారితో ఆటలాడుకునేవాడు. వెదురును వేణువుగా మలచి, అద్భుతమైన వేణుగానంతో ఆబాలగోపాలాన్నీ మైమరపించి వేణుగోపాలుడిగా, వంశీమోహనుడిగా ప్రఖ్యాతి పొందాడు. కాళిందినదిలో ఉంటూ గోపాలురను భయభ్రాంతులు చేస్తున్న కాళీయుని తలపై నృత్యం చేసి, కాళింది నుంచి దూరంగా తరిమికొట్టి తాండవ కృష్ణుడిగా పేరు పొందాడు. ఇంద్రుడు వర్షబీభత్సం సృష్టించినప్పుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై నిలిపి, వ్రేపల్లె వాసులను ఆ కొండ నీడలోకి చేర్చి, వారిని కాపాడి, వారి మనసుల్లో భగవంతుని స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో మురిపించి, ఆపత్సమయాల్లో ఆదుకుని వ్రేపల్లెలోని ఆబాలగోపాలాన్నీ అలరించాడు. కృష్ణుడిని ఎలాగైనా చంపాలనే పథకంలో ఉద్ధవుడిని దూతగా పంపి, కృష్ణ బలరాములను మధురకు రప్పిస్తాడు కంసుడు. చాణూర ముష్టికులనే మల్లులను బాలురైన కృష్ణబలరాముల మీదకు ఉసిగొల్పుతాడు. చాణూర ముష్టికులను వధించాక, కంసుడిని సంహరించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను, తాత ఉగ్రసేనుడిని చెరసాల నుంచి విడిపిస్తాడు. ఉగ్రసేనుడికి రాజ్యాన్ని అప్పగించి, దేవకీ వసుదేవులతో కలసి ద్వారకకు చేరుకుంటాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యాభ్యాసం కోసం సాందీపని మహాముని ఆశ్రమంలో చేరుతారు కృష్ణబలరాములు. బాల్యంలోనే మరణించిన గురుపుత్రుని బతికించి తెచ్చి, గురుదక్షిణ సమర్పించుకుంటారు. సాందీపని మహాముని గురుకులంలోనే విద్యాభ్యాసం చేసిన కుచేలుడు శ్రీకృష్ణుడికి ప్రాణస్నేహితుడవుతాడు. గురుకులం విడిచిపెట్టిన తర్వాత పేదరికంలో కూరుకుపోయిన కుచేలుడు అటుకుల మూటతో తన వద్దకు వచ్చినప్పుడు అతడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి, అడగకపోయినా అతడి దారిద్య్రాన్ని తీర్చి, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. కృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణాష్టమి వేడుకలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతాయి. కృష్ణాష్టమినే గోకులాష్టమి అని, జన్మాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. కృష్ణాలయాలలో మాత్రమే కాకుండా, అన్ని వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీనివాసుని పక్కనే కొలువై ఉన్న శ్రీకృష్ణుని రజతమూర్తికి పూజలు చేస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున సాయంత్రంపూట శ్రీవారు ప్రత్యేకంగా కొలువుతీరుతారు. ఈ కొలువును ‘గోకులాష్టమి ఆస్థానం’గా వ్యవహరిస్తారు. స్వామివారు సర్వాలంకార భూషితుడై సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి వేంచేస్తారు. పౌరాణికులు భాగవతంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని పఠిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో ఉట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. శ్రీకృష్ణుని బాల్యక్రీడా విశేషమైన ఈ వేడుకను తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యులు క్రీస్తుశకం 1545లో ప్రత్యేకంగా ప్రారంభించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణాష్టమి సందర్భంగా దేశంలోని చాలా చోట్ల ఉట్టెకొట్టే వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. గుజరాత్‌లోని ద్వారకలోను, ఉత్తరప్రదేశ్‌లోని మథురలోను, బృందావనంలోను కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలోను, బృందావనంలోని రాధా మదనమోహన మందిరం, బంకె బిహారి మందిరం, జుగల్‌కిశోర్ మందిరం, ప్రేమ్ మందిరం, రాధారమణ ఆలయాలలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతాయి. ఒడిశాలోని పూరీ శ్రీజగన్నాథ ఆలయంలోను, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయంలోను, హంపి బాలకృష్ణాలయంలోను, మైసూరు వేణుగోపాల స్వామి ఆలయంలోను, కేరళ గురువాయూర్లోని గురువాయూరప్పన్ ఆలయంలోను, రాజస్థాన్‌లోని నాథ్వాడాలో ఉన్న శ్రీనాథ్జీ ఆలయంలోను, తమిళనాడులో దక్షిణ ద్వారకగా పేరుపొందిన తిరువారూరులోని రాజగోపాల ఆలయంలోను, చెన్నైలోని పార్థసారథి ఆలయంలోను కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ప్రత్యేక అలంకరణలతో ఈ ఆలయాలు కనువిందు చేస్తాయి. ఇవే కాకుండా దేశ విదేశాల్లోని ‘ఇస్కాన్’ మందిరాలు సైతం కృష్ణాష్టమి నాడు భక్తులతో కిటకిటలాడతాయి. శ్రీకృష్ణ స్తోత్రాలు, భజన సంకీర్తనలతో మార్మోగుతాయి. కృష్ణాష్టమి రోజున భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు జరుపుతారు. అటుకులు, వెన్న, పెరుగు, పాలు, మీగడ, బెల్లం, పండ్లు నైవేద్యంగా పెడతారు. ఊయలలు కట్టి, బాలకృష్ణుని విగ్రహాలను వాటిలో ఉంచి వాటిని ఊపుతూ పాటలు పాడతారు. మహాభారత సారథి కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు పార్థసారథిగా పేరుపొందాడు. కేవలం అర్జునుడి రథాన్ని మాత్రమే కాదు, యావత్ మహాభారతాన్ని నడిపించినది శ్రీకృష్ణుడే. మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడి అనుబంధం ప్రత్యేకమైనది. కృష్ణుడి చెల్లెలు సుభద్ర అర్జునుడిని వరించడంతో కృష్ణార్జునుల అనుబంధం విడదీయరానిదైంది. పాండవులందరూ ప్రతి పనిలోనూ కృష్ణుడి సలహా తీసుకునేవారు. ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేసిన ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తాడు. ఆ సభకు వచ్చిన శిశుపాలుడు కృష్ణుడిని, ధర్మరాజును నానా మాటలంటాడు. శిశుపాలుడు కూడా కృష్ణుడి మేనత్త కొడుకే. మేనత్తకు ఇచ్చిన మాట మేరకు నూరు తప్పుల వరకు సహించి, ఆ తర్వాత చక్రాయుధంతో శిశుపాలుడిని తుదముట్టిస్తాడు. శకునితో జూదం ఆడేటప్పుడు మాత్రం ధర్మరాజు కృష్ణుడిని సంప్రదించలేదు. శకుని ఆడిన మాయజూదంలో ఓటమిపాలై పాండవులు అడవుల పాలయ్యారు. దుర్యోధనుడు పురిగొల్పడంతో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి తెగబడినప్పుడు ఆమె కృష్ణుడినే తలచుకుంటూ రోదిస్తుంది. దూరాన ఉన్నప్పటికీ ఆమె మొర విని తన మహిమతో ఆదుకుంటాడు. జూదంలో ఓడిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం, ఆ తర్వాత విరాటరాజు కొలువులో ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అరణ్యవాసంతో పాండవులకు ఎదురైన అనేక సమస్యలను శ్రీకృష్ణుడే పరిష్కరించాడు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని తిరిగి వచ్చాక, వారి రాజ్యాన్ని తిరిగి వారికి అప్పగించాలంటూ కృష్ణుడు స్వయంగా రాయబారానికి వెళతాడు. రాయబారానికి వచ్చిన కృష్ణుడిని దుర్యోధనుడు బంధించబోతే విశ్వరూప ప్రదర్శన చేసి, కౌరవులను హెచ్చరిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడం కోసం పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి చూపును ప్రసాదిస్తాడు. కురుక్షేత్రంలో ఆయుధాలు విడిచి, యుద్ధవిముఖుడైన అర్జునుడికి గీతోపదేశంతో కర్తవ్యబోధ చేసి, యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. యుద్ధం ముగిసేంత వరకు పాండవులకు అండదండగా ఉంటాడు. యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ సంధించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావానికి ఉత్తర గర్భంలోని శిశువు మృత్యువును ఎదుర్కోగా, తన చక్రంతో రక్షణ కల్పిస్తాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి, పాండవుల తర్వాత రాజ్యభారాన్ని వహిస్తాడు. కృష్ణుడి పరివారం కృష్ణుడు అష్టమహిషులు ఉన్నారు. వారు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, భద్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ. కృష్ణుడికి ఒక్కొక్క భార్యతోను పదేసి మంది పిల్లలు కలిగారు. సత్యభామతో కలసి వెళ్లి నరకాసురుడిని వధించాక, అతడి చెరలో ఉన్న పదహారువేల నూరుమంది గోపికలను కృష్ణుడు బంధవిముక్తులను చేశాడు. వారు శ్రీకృష్ణుని ఆశ్రయంలోనే ఉండేవారు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కౌరవుల నాశనం చేసినందుకు ఫలితంగా యాదవకులం కూడా నశిస్తుందని గాంధారి శపిస్తుంది. శాపప్రభావం వల్ల కృష్ణుడి కొడుకుల్లో ఒకడైన సాంబుడికి ఆడవేషం వేసి, అతడికి పుట్టబోయేది మగబిడ్డో, ఆడబిడ్డో చెప్పాలంటూ యాదవ యువకులు మునులను ఆటపట్టిస్తారు. దానికి ఆగ్రహించిన మునులు యాదవకులాన్ని నాశనం చేసే ముసలం పుడుతుందని శపిస్తారు. సాంబుడి వేషం విప్పేస్తున్నప్పుడు అతడు కడుపు దగ్గర దాచుకున్న దుస్తుల నుంచి ముసలం పుడుతుంది. భయపడిన యాదవులు దానిని బాగా అరగదీస్తారు. ఎంత అరగదీసినా, చిన్న మొన మిగిలిపోతుంది. దానిని సముద్రతీరంలో పడేస్తారు. కొన్నాళ్లకు అదే ప్రదేశంలో తాగితందనాలాడి గొడవపడిన యాదవులు ఒకరినొకరు చంపుకుని నశించారు. ముసలం మొనతో బాణం తయారు చేసుకున్న ఒక నిషాదుడు జంతువులను వేటాడుతూ విడిచినప్పుడు అది చెట్టు కింద సేదదీరుతున్న కృష్ణుడి పాదానికి తాకుతుంది. బాణం దెబ్బ వల్ల కృష్ణుడు నిర్యాణం చెందినట్లు కొన్ని పురాణాలు చెబుతుంటే, రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు శ్రీకృష్ణుడిని జరామరణ రహితుడిగా అభివర్ణించారు. విశిష్టాద్వైతాన్ని పాటించే వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు కృష్ణుడిని జరామరణ రహితుడిగానే విశ్వసిస్తారు. -
కేరళలో జన్మాష్టమి వేడుకలపై వివాదం
సాక్షి, తిరువనంతపురం: గాడ్స్ ఓన్ కంట్రీగా గుర్తింపు పొందిన కేరళ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వివాదాస్పదంగా మారాయి. పిల్లలను హింసిస్తున్నారంటూ హిందుత్వ సంఘాలపై సీపీఐ(ఎం) భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో వరుసగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి. కన్నూర్ జిల్లా తలిపరంబలో శనివారం బాలగోకులం(సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ) అనే సంస్థ జన్మాష్టమి ర్యాలీ నిర్వహించింది. ఓ మూడేళ్ల పిల్లాడికి శ్రీకృష్ణుడి వేషాధారణ చేసి ఓ వాహనంపైన పడుకోబెట్టి ఊరేగింపు చేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన వామపక్ష సంస్థ బాల సంఘం పోలీస్ ఫిర్యాదు చేసింది. పిల్లలను హింసించారన్న ఆరోపణలపై వారిపై కేసు నమోదు చేసినట్లు కన్నూర్ డీఎస్పీ కేవీ వేణుగోపాల్ తెలిపారు. అయితే పిల్లలెవరినీ హింసించలేదని, అన్ని రక్షణ చర్యలతోనే వారిని ఊరేగింపుగా తీసుకెళ్లామని, పైగా తల్లిదండ్రుల నుంచి అనుమతి కూడా తీసుకున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యప్రకాశ్ చెబుతున్నారు. పిల్లలను స్వచ్ఛందంగా పంపటం ద్వారా స్వయంగా ఆ శ్రీకృష్ణుడికే సేవ చేసినట్లు తల్లిదండ్రులు భావిస్తారు. కానీ, కొందరు దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారు. గతంలో వాళ్లు (సీపీఎంకు చెందిన బాల సంఘం) కూడా పిల్లలతో ఇలాంటి ర్యాలీలే నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి అని ఆయన అంటున్నారు. కాగా, పయ్యన్నూర్ లో వివేకానంద సమితి అనే సంస్థ శుక్రవారం కూడా ఇదే రీతిలో ఓ మూడేళ్ల చిన్నారిని ఓ ఆకుపై పడుకోబెట్టి వాహనంపై ఊరేగించిన విషయం తెలిసిందే. ఈ అంశపై తక్షణమే స్పందించాలని శ్రీకాంత్ ఉషా ప్రభాకరన్ అనే సామాజిక వేత్త బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
కృష్ణార్పణం
కన్నయ్య వెన్నదొంగ. కన్ను పడిందా... కుండ వణికిందే! ఉట్టికెగిరి ఓ పట్టు పట్టేస్తాడు... అంతిష్టం వెన్నముద్ద అంటే..! కానీ, పాపం! పండగ పూట చిన్ని కృష్ణయ్యకు ఈ పాట్లెందుకు చెప్పండి... బాగా వెన్నపూసను దట్టించి వెరైటీగా మీరే రకరకాల మిఠాయిలు తయారు చేయండి. ఎలా తయారు చే యాలో చెబుతున్నాముగా... చేతకావని దిగులెందుకు... శ్రద్ధతో తయారు చేసి ‘కృష్ణార్పణం’ అంటూ భక్తితో సమర్పించండి.. ఆ తర్వాత కృష్ణుడి ప్రసాదంగా... మీరు, మీ కుటుంబమంతా హాయిగా లాగించెయ్యండి. తియ్యతియ్యగా..! కార కారంగా అక్కర వడిసాల్ కావలసినవి: బియ్యం–అర కప్పు; పెసరపప్పు–ఒక కప్పు; చక్కెర– ఒక కప్పు; వెన్న తీసిన పాలు– 3 కప్పులు; (ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా వాడవచ్చు); వెన్న తీయని పాలు– అర కప్పు; కుంకుమ పువ్వు– నాలుగు రేకలు; బాదం, జీడిపప్పు పలుకులు– టేబుల్ స్పూన్; వెన్న– ఒక కప్పు. తయారీ: బియ్యం, పెసర పప్పు కలిపి మందపాటి పెనంలో వేసి సన్న మంట మీద వేయించాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించి దించేయాలి. చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి అందులో మూడున్నర కప్పుల పాలు పోసి ఆ గిన్నెను ప్రెషర్‌కుకర్‌లో పెట్టి ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట తగ్గించి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ లోపు... ∙అరకప్పు మీగడ పాలను మరిగించి కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి ∙పెనంలో రెండు స్పూన్ల వెన్న వేసి జీడిపప్పు, బాదం పలుకులను వేయించి పక్కన పెట్టుకోవాలి ∙కుకర్‌లో ఉడికించిన అన్నం, పప్పు మిశ్రమాన్ని గరిటతో మెదపాలి ∙ఇప్పుడు వెడల్పాటి పెనంలో వెన్న వేసి కరిగిన తర్వాత అన్నం, పప్పు మిశ్రమం వేసి అందులో చక్కెర కలపాలి. చక్కెర కరిగినప్పుడు అన్నం గరిటె జారుడుగా అవుతుంది. అడుగు పట్టకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. చివరగా కుంకుమ పువ్వు పాలను పోసి కలిపి, వేయించిన జీడిపప్పు, బాదం పలుకులతో గార్నిష్ చేయాలి. గమనిక: ప్రెషర్ కుకర్‌లో నీటిని పోసి అందులో అన్నం, పప్పు ఉన్న పాత్రను పెట్టి ఉడికించాలి. ఈ పాత్ర చిన్నదైతే ఉడికేటప్పుడు పాలు ఒలికిపోతాయి. కాబట్టి పాత్ర సగం ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు మిశ్రమం ఉడికిన తర్వాత కూడా పాత్రలో ముప్పావుకు మించదు. శ్రీఖండ్ కావలసినవి : పెరుగు: మూడు కేజీలు; పంచదార: కేజి; ఏలకుల పొడి: టీ స్పూన్; రోజ్‌వాటర్: 1 టీ స్పూన్; లెమన్ కలర్: కొన్ని చుక్కలు; బాదంపప్పు: 2 టీ స్పూన్లు; పిస్తా: 2 టీ స్పూన్లు తయారి : ∙పెరుగుని మెత్తని బట్టలో కట్టి నీళ్లు పోయేటట్లు రెండు గంటలపాటు ఉంచాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, ఏలకుల పొడి, రోజ్‌వాటర్, లెమన్ కలర్ వేసి బాగా కలియపెట్టాలి ∙ఇలా తయారైన శ్రీఖండ్ని ఫ్రిజ్‌లో చల్లబడేవరకూ ఉంచాలి ∙సర్వ్ చేసేముందు పిస్తా, బాదంతో అలంకరించుకోవాలి. వెన్న ఉండలు కావలసినవి : మైదా–కప్పు; బియ్యప్పిండి–1/4 కప్పు; పంచదార–కప్పు; ఉప్పు–చిటికెడు; వంటసోడా–చిటికెడు; నూనె– వేయించడానికి సరిపడా. తయారి : ∙మైదాలో బియ్యప్పిండి, ఉప్పు, వెన్న, వంటసోడా వేసి బాగా కలిపి తగినన్ని వేడినీళ్లు పోసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి ∙తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని వేడినూనెలో తక్కువ మంటమీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో పంచదార తీసుకొని, మునిగే వరకు నీళ్లు పోసి ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించాలి ∙అప్పుడు వేయించిన ఉండలను పాకంలో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. పన్నీర్ లడ్డు కావలసినవి : పాలు: రెండు లీటర్లు; మైదా: అయిదు టీస్పూన్లు; నెయ్యి: అరకప్పు; పంచదార: రెండు కప్పులు; వెనిగర్: కప్పు; జీడిపప్పు: రెండు టీస్పూన్లు; కిస్మిస్: రెండు టీస్పూన్లు తయారి : ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి ∙మరో చిన్న గిన్నెలో మైదాపిండి తీసుకొని నీళ్లు కలిపి వేడి చేసిన పాలలో పోయాలి ∙దీంట్లో వెనిగర్ కలిపితే పాలు విరుగుతాయి ∙విరిగిన పాలను సన్నని బట్టలో వేసి చల్లటి నీళ్లలో రెండు నిమిషాలు ఉంచాలి ∙నీళ్లు పూర్తిగా పిండేసి గట్టిపడిన మిశ్రమాన్ని ప్లేట్లో ఆరనివ్వాలి ∙బాణలిలో పంచదార, నెయ్యి, విరిగిన పాల మిశ్రమం వేసి కలపాలి ∙ చేతికి కొద్దిగా నెయ్యి అద్దుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ జీడిపప్పు, కిస్మిస్లను చేర్చుతూ కావల్సిన సైజులో లడ్డూలు కట్టాలి. అజ్మీరీ కలాకండ్ కావలసినవి : పాలు: అయిదు లీటర్లు; పంచదార: అరకిలో; నెయ్యి: అరకప్పు; జాజికాయ పొడి: చిటికెడు. తయారి : ∙పాలను ఒక బాణలిలో తీసుకుని దానిలో పంచదార వేసి బాగా చిక్కగా అయ్యేవరకు మరగనివ్వాలి ∙ఆ తరువాత నెయ్యి చేర్చి బాగా కలియపెట్టాలి . జాజికాయ పొడిని కలిపి దించాలి. ఉప్ప సీదై కావలసినవి : బియ్యప్పిండి – ఒక కప్పు; (రెడీమేడ్‌గా పిండి లేకపోతే ఒకటిన్నర కప్పు బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టి వడపోసి, తడి పోయే వరకు మందపాటి టవల్ మీద ఆరబెట్టి మిక్సీలో పొడి చేసి జల్లించాలి); మినప్పప్పు– 2 టేబుల్ స్పూన్లు; ఎండు కొబ్బరి తురుము– 2 టేబుల్ స్పూన్లు; వెన్న – ఒక కప్పు; నువ్వులు– ఒక టేబుల్ స్పూన్; ఉప్పు– తగినంత; నూనె – వేయించడానికి సరిపడినంత. తయారీ : మందపాటి పెనంలో మినప్పప్పును దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేయాలి. బియ్యప్పిండి, మినప్పిండిని కలిపి జల్లించాలి. ఈ పిండిలో ఉప్పు, వెన్న, నువ్వులు, కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని వేస్తూ ముద్ద చేయాలిబాణలిలో నూనె పోసి కాగేలోపు పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నూనెలో కొద్దిగా పిండి వేసిన వెంటనే అది పైకి తేలితే నూనె కాగినట్లు. అప్పుడు ఉండలను వేసి చిల్లుల గరిటెతో కలియతిప్పుతూ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక ఉండలు బఠాణి గింజల కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి. మరీ పెద్దవయితే లోపల సరిగా కాలవు. అలాగే మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. మంట ఎక్కువైతే లోపల పచ్చిగా ఉండగానే పైన నల్లగా అవుతాయి ∙వెన్న ఉండలు మరింత మృదువుగా కావాలనుకుంటే బియ్యప్పిండిలో మైదా కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యం కోసం మైదాను మినహాయించడమే మంచిది. -
గోవిందుని ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఆస్థానం ఘనంగా జరిగింది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారే ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆలయంలో జన్మాష్టమి వేడుకలు నిర్వహించటం సంప్రదాయం. ఇందులో భాగంగా రాత్రి 8 నుండి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఉత్సవమూర్తులైన ఉగ్రశ్రీనివాసమూర్తి, శ్రీదేవి , భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణ స్వామికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ద్వాదశ తిరువారాధనం, అభిషేక నివేదన అనంతరం ఉగ్రశ్రీనివాసమూర్తి దేవేరులతో కూడి ఆనంద నిలయంలోకి వేంచేపు చేశారు. బంగారు సర్వభూపాల వాహనంలో వెన్నముద్ద ధరించిన శ్రీకష్ణస్వామిని శయనించినట్లుగా అలంకరించి దివ్యప్రబంధంతో పారాయణం నివేదించారు. సేవాకాలం ముగిసిన తర్వాత తులసితో అర్చించారు. ఇదే సందర్భంగా శ్రీ మద్భాగవతంలోని తృతీయ అధ్యాయంలోని శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని అర్చకులు పురాణ పఠనం, పూజా నివేదనలతో ఆస్థానం ఘనంగా నిర్వహించారు.అలాగే గోకులాష్టమిని పురస్కరించుకుని ఆలయం వెలుపల ఉన్నగోగర్భం ఉద్యానవనంలోని ఖాళీయ మర్థనునికి శాస్త్రోక్తంగా అభిషేకం, పూజలు, ఉట్లోత్సవం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం వేళ ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. -
శ్రీశైలంలో ఘనంగా గో పూజ
శ్రీశైలం (కర్నూలు) : శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని శ్రీగోకులంలో శనివారం గోకులాష్టమి సందర్భంగా గో పూజలను నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని నిత్య సేవతో పాటు గోశాలలో 11గోవులకు,11 గోవత్సాల(ఆవుదూడలు)కు శ్రీసూక్తం, గో అష్టోత్తర మంత్రం, గోవులకు షోడశ ఉపచార పూజలను అర్చకులు, ఈఓ సాగర్‌బాబు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత వేదపరాయణలు జరిగాయి. పూజల అనంతరం నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర విశేషపూజలను చేశారు. మన వేదసంస్కృతిలో గోవులకు ఎంతో విశేషస్థానం ఉందని, మన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు తదితరవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయని వేదపండితులు తెలిపారు. గోవు 33 కోట్ల దేవతలకు ఆవాస స్థానం కావడంతో గోపూజ వలన 33 కోట్ల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని ఈఓ తెలిపారు. గోపూజను ఆచరించడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని, జగన్మాత లలితా పరమేశ్వరి గోవు రూపంలో భూమిపై సంచరిస్తుందని లలితా సహన్రామం తెలియజేస్తుందని వేద పండితులు పేర్కొన్నారు. తాను చేసిన ప్రతి పనిలో వైశిష్ట్యాన్ని బోధించిన శ్రీకృష్ణపరమ్మాత ఆవుల మందలు అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన వ్రేపల్లెలో పెరిగి గోవులను కాసి గోపాలునిగా పేరుగాంచి గోవు యొక్క అనంత మహిమను లోకానికి తెలియజేశారని పేర్కొన్నారు. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయంగా వస్తుందన్నారు. -
వైభవంగా శ్రీకృష్ణాష్టమి
పింప్రి, న్యూస్‌లైన్ : నగరంలోని వివిధ కూడళ్లు, మందిరాల్లో వేలాది మంది భక్తులు శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పింపలే గురవ్‌లోని శ్రీకృష్ణ దేవాలయంలో తెల్లవారుజామున ప్రారంభమైన అభిషేకాలు, జపాలు, నామ పారాయణాలు ఉత్సాహంగా కొనసాగాయి. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం ఆదివారం రాత్రి 12 గంటల నుంచి మహిళలు శ్రీ కృష్ణుని ప్రతిమలను గొల్ల భామల మధ్య ఉంచి ఉయ్యాలలు ఊపుతూ పాటలను పాడారు. ఉదయం నుంచి తీర్థ ప్రసాదాలాను పంచి పెట్టారు. ఈ ప్రాంతంలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండడంతో తెలుగు దనం ఉట్టి పడింది. రావేత్లోని ఇస్కాన్ వారి శ్రీరాధాగోవింద మందిరంలో శ్రీకృష్ణుని జనన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సుమారు 40-50 వేల మంది భక్తులు పాల్గొన్నట్లు దేవాలయ వ్యవస్థాపకులు తెలిపారు. నిగిడిలో రోజంతా భజనలు నిగిడిలోని తమిళ సమాజం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ మందిరంలో జన్మాష్టమిని అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలి వచ్చారు. రోజంతా ధూప, దీప హారతులతోపాటు భజనలు, కీర్తనలతో దేవాలయం మార్మోగింది. విశ్వం శ్రీరాం సేన ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తరుణ్ మండల్ తరఫున చికిలీలో జన్మాష్టమి వేడుకలు జరుపుకొన్నారు. భోజ్‌పూరిలో గాయకుడు ప్రమోద్లాల్ యాదవ్, గాయని బిందు రాగిణి పాడిన పాటలు భక్తులను పరవశింపజేశాయి. ఈ కార్యక్రమంలో శివసేనకు చెందిన సులభా ఉభాలే, నగర కార్పొరేటర్ సురేష్ మాత్రే, దత్తా సానే, పర్యావరణ శాస్త్రవేత్త వికాస్ పాటిల్, విశ్వ శ్రీరాం సేన సంచాలకులు లాలాబాబు గుప్తా, పోలీస్ అధికారి విఠల్ సాలుంకే, పూణే జిల్లా పరిషత్ మాజీ సమన్వయకులు రంగనాథ జాదవ్ తదితరులు హాజరయ్యారు. నగరంలోని పలు కూడళ్లలో సాయంత్రం దహీహండి (ఉట్టీల) కార్యక్రమాలు, ఆటపాటలతో యువత ఊగిపోయింది. ఉట్టీల పోటీ ల్లో సినీ, నాటక కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఘనంగా శ్రీకృష్ణజన్మాష్టమి
సాక్షి, ముంబై : ఉట్టి ఉత్సవాలకు ముంైబైతోపాటు దాదాపు అన్ని ప్రాంతాలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి శ్రీకష్ణుని జన్మదినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ఉట్టి ఉత్సవాలు ఇదే స్ఫూర్తితో నిర్వహించడానికి ఉట్టికొట్టేమండళ్లన్నీ ఏర్పాట్లు చేసుకొన్నాయి. ఈ సారి మానవపిరమిడ్ల విషయంపై కోర్టులో వ్యాజ్యం దాఖలుచేయడంతో ఉట్టి ఉత్సవాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించడంతో ఉట్టి కొట్టే మండళ్లతోపాటు ఉట్టి నిర్వాహకుల్లో ఆనందం కన్పిస్తోంది. ఉత్సవాలను సంప్రదాయంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకొన్నారు. దాదర్‌లోని మార్కెట్లు రద్దీగా మారాయి. మానవ పిరమిడ్లు ఏర్పాటు చేసి ఉట్టి పగుల కొట్టే సమయంలో ప్రమాదాలకు గురయ్యే గోవిందలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీ ఎంసీ) ఆదుకోనుంది. ముంబై, ఠాణేలో పెద్దఎత్తున ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తారు.ఉత్సవాలను తిలకించడానికి చిన్నపెద్ద, ఆడ మగా తరలివస్తారు.