kupwara
-
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుప్వారాలోని గుగల్‌ధర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నంపై నిఘా సమాచారం అందిన వెంటనే, భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.కొన్ని గంటలపాటు కొనసాగిన ఎన్కౌంటర్ తర్వాత, కుప్వారాలోని గుగల్ధర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది హతమార్చారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయని భారత సైన్యం తెలిపింది.గుగల్‌ధార్‌లో భారత సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారని ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తెలిపింది. చొరబాటుదారులను తిప్పికొడుతూ, భారత సైన్యం కాల్పులు ప్రారంభించింది. గుగల్ధార్ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది.ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదికి జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా రాజౌరీ జిల్లాలోని థానమండి ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ నుంచి అందిన ఇన్పుట్ ఆధారంగా, థానమండిలోని మణియల్ గలి వద్ద భద్రతా బలగాలు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అని ఒక పోలీసు అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా? -
ఆపరేషన్ ఆలౌట్ ఉగ్రమూకలను ఏరిపారేస్తున్న ఆర్మీ
-
సరిలేరు మీకెవ్వరు.. జవాన్లపై ప్రశంసలు
శ్రీనగర్: భారత జవాన్లు నిజమైన హీరోలు అన్న పేరును మరోసారి నిలబెట్టుకున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నారు. గడ్డకట్టే చలిలో, మోకాళ్లలోతు మంచులో ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల దూరం మేర మోసుకువెళ్లారు. సదరు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వివరాలు.. కుప్వారాలోని ఫకియాన్ గ్రామానికి చెందిన మంజూర్ అహ్మద్ షేక్ భార్య గర్భవతిగా ఉన్నారు. ఈ క్రమంలో జనవరి 5 అర్దరాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఓవైపు తీవ్రమైన చలి.. మరోవైపు మంచువర్షం.. సమీపంలో ఒక్క వాహనం కూడా కానరాలేదు.. రెండు కిలోమీటర్లు దాటితే గానీ ఆస్పత్రికి చేరుకోలేరు.(చదవండి: మహిళా రైతుల ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్) ఇలాంటి పరిస్థితుల్లో భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్దామంటే అతడికి ఎటువంటి మార్గం కనిపించలేదు. దీంతో హృదయ విదారకంగా విలపిస్తూ సహాయం అర్థించసాగాడు. వెంటనే స్పందించిన ఆర్మీ జవాన్లు వైద్య బృందంతో అహ్మద్ ఇంటికి చేరుకున్నారు. అతడి కుటుంబ సభ్యులు వెంటరాగా నలుగురు సైనికులు ఆమెను భుజాలపై మోస్తూ కరాల్‌పురాలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో భారత జవాన్ల మానవతా గుణంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘సరిలేరు మీకెవ్వరు’’ అంటూ సెల్యూట్ చేస్తున్నారు. Heavy snow in Kashmir brings unprecedented challenges for citizens, especially in higher reaches. Watch the Soldier & Awam fighting it out together by evacuating a patient to the nearest PHC for medical treatment. #ArmyForAwam#AmanHaiMuqam pic.twitter.com/DBXPhhh0RP — PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2021 -
కశ్మీర్లో ఉగ్రదాడి
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్‌పాయింట్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్ హజీమ్ భట్ అనే 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ‘వాంగమ్– ఖాజియాబాద్ వద్దనున్న చెక్పాయింట వద్ద సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు’ అని అధికారులు సోమవారం వెల్లడించారు. ఘటనాప్రాంతానికి అదనపు దళాలను తరలించామని, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని వివరించారు. -
కుప్వారాలో ఉగ్రవాదుల ఏరివేత
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భారత సైనికులు ఆదివారం మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు భారత సైనికులు మరణించినట్లు రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా ధృవీకరించారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్‌ను భారత సైన్యం చేపట్టింది. రెండు రోజుల క్రితం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్లు కల్నల్ రాజేశ్ కలియా ప్రకటించారు. అయితే దురదష్టవశాత్తూ ఈ ఆపరేషన్‌లో పలువురు భారత సైనికులు గాయాలపాలు కాగా ముగ్గురు సైనికులు అమరవీరులయ్యారని తెలిపారు. శనివారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు స్పష్టం చేశారు. వీరు ఏప్రిల్ 4న అమాయక పౌరులను పొట్టనపెట్టుకున్నారని తెలిపారు. కాగా ఉగ్రవాదులను ఏరివేసే ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మొత్తంగా ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు తొమ్మిదిమంది ఉగ్రవాదులు మరణించారు. (లాక్డౌన్: మహిళను కాల్చి చంపిన జవాను!) -
టీచర్ పైశాచికం : చదవడంలేదని గొడ్డలితో..
కశ్మీర్ : సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. మైనర్ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. ఓ పదేళ్ల విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే గొడ్డలితో నరుకుతా’ అంటూ విద్యార్థిని బెదిరిస్తున్నాడు. బాలుడు భయంతో గట్టిగా ఏడుస్తున్నా కూడా అతన్ని వదిలిపెట్టలేదు. తరగతి గదిలోని మిగతా విద్యార్థుల వైపు చూస్తూ .. ‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’ అని హెచ్చరించాడు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనపై స్థానిక నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పైశాచిక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతను గురువు కాదు నరరూప రాక్షసుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఈ వీడియో చూడగానికే భయంగా ఉంది. ఆ సమయంలో ఆ విద్యార్థి ఎంత భయానికి లోనైయ్యాడో ఉహించుకోలేం. నిందితులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని’ డిమాండ్ చేశారు. -
విద్యార్థిని గొడ్డలితో బెదిరించిన టీచర్
-
రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
న్యూఢిల్లీ : భారీ మొత్తంలో హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆపిల్లను సరఫరా చేసే డబ్బాల్లో ఈ హెరాయిన్‌ను దాచి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా నుంచి ఈ హెరాయిన్ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. -
జమ్మూ కశ్మీర్: కుప్వారాలో ఎన్కౌంటర్
-
వాహనంపై పడిన భారీ మంచుకొండ
సాక్షి, కశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ మంచుకొండచరియలు విరిగిపడటంతో ఎనిమిదిమంది గల్లంతయ్యారు. కుప్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో పడిన వారంతా కుప్వారా నుంచి కర్ణా ప్రాంతానికి వెళుతున్నారు. వారు తమ వాహనంలో వెళుతుండగా సరిగ్గా సాధనటాప్ అనే ప్రాంతంలోని తంగ్దార్ వద్ద సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఓ భారీ మంచుకొండ విరిగి వారి వాహనంపై పడింది. దాంతో దాదాపు ఎనిమిదిమంది మంచుదిబ్బల కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ, పర్వత ప్రాంతాల్లో భద్రతను చూసేవారు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు రహదారుల విభాగంలో పనిచేసే ఓ అధికారి కూడా ఈ ప్రమాదంలో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. -
మరో ఇద్దరు మిలిటెంట్లు హతం
సాక్షి, న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లకు ప్రయత్నించిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతాబలగాలు హతమార్చాయి. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద శనివారం ఉదయం ఇద్దరు మిలిటెంట్లు ఎల్ఓసీని దాటేందుకు ప్రయత్నించారు. వీరిని మొదటగా భద్రతాబలగాలు నిరోధించే ప్రయత్నం చేశాయి. దీంతో మిలిటెంట్లు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ప్రతికాల్పులకు దిగడంతో.. ఇద్దరూ ఉగ్రవాదులు మరణించారు. ఇదే విషయాన్ని రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేష్కలియా ధృవీకరించారు. టెర్రరిస్టుల నుంచి ఆయుధాలు, గుర్తింపు కార్డులు, ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నియంత్రణ రేఖ, జమ్మూ కశ్మీర్ సరిహద్దులో 22 సార్లు మిలిటెంట్లు చొరబాట్లకు ప్రయత్నించారని రాజేష్ తెలిపారు. అదే విధంగా.. చొరబాట్లకు ప్రయత్నించిన 38 మంది మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుపెట్టాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా మాచిల్ సెక్టార్లో ఆగస్టు నుంచి ఇప్పటివరకూ చొరబాట్లకు ప్రయత్నించిన 5 మంది మిలిటెంట్లను చంపేసినట్లు ఆయన తెలిపారు. -
సరిహద్దులో పాక్ దురాగతం
► ఆ దేశ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు జవాన్ల బలి ► కాల్పుల విరమణకు పాక్ తూట్లు ► మరో ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం శ్రీనగర్: సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విర మణకు మళ్లీ తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్లో బుధవారం నియంత్రణ రేఖ వద్ద ఆ దేశ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతిచెందారు. పాక్ నుంచి మిలి టెంట్లు భారత్‌లోకి చొరబడే ఫుర్కియా ప్రాంతంలో ఈ దురాగతం చోటుచేసుకుం దని, మృతులు జమ్మూకశ్మీర్ రైఫిల్స్ దళానికి చెందినవారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోపక్క బుడ్గాం జిల్లా రెడ్బగ్లో జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో భద్రతా బలగా లు ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవా దులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నా రనే పక్కా సమాచారంతో జవాన్లు ఆ ప్రాంతాన్ని మంగళవారం సాయంత్రం చుట్టుముట్టారు. తమపై మిలిటెంట్లు జరిపిన కాల్పులకు దీటుగా బదులిచ్చారు. మంగళ వారం రాత్రి ఆపరేషన్‌ను నిలిపేసి ముష్క రులు తప్పించుకోకుండా గట్టి నిఘా ఉంచా రు. బుధవారం ఉదయం ఇరుపక్షాల మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఘటనాస్థలి నుంచి కొన్ని ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకు న్నామని పోలీసులు చెప్పారు. మృతులను గూడిపోరాకు చెందిన ఆకిక్ గుల్, జావేద్ అహ్మద్ షేక్, సాజిద్ అహ్మద్ గిల్కర్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. -
అమరులైన ఇద్దరు ఆర్మీ జవానులు
-
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
-
ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం
కుప్వార: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్యకాల్పులు మొదలయ్యాయి. హంద్వారాలోని వరిపోరా ప్రాంతంలో బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాల తెలిపాయి. చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నలుగురు ఉగ్రవాదులు హతం
-
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: అక్రమంగా భారత్‌లోకి అడుగుబెట్టడానికి యత్నించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది తుదిముట్టించారు. కెరాన్ సెక్టార్ ప్రాంతంలో చొరబాటుకు యత్నిస్తుండగా.. భద్రతా సిబ్బంది వారిపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులు హతమయ్యారని.. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని.. అధికారులు తెలిపారు. -
ఉగ్రవాదులతో హోరాహోరీ ఎదురుకాల్పులు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కుప్వారా జిల్లా ద్రుగ్‌ముల్లా గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేశారన్న సమాచారంతో భద్రతాదళాలు, పోలీసులు రంగంలోకి దిగడంతో ఆదివారం ఉదయం 11 గంటలకు ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఇక్కడ మాటువేశారని, వారి వద్ద అధికస్థాయిలో ఆయుధాలున్నాయని సమాచారం అందుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రవాదులను ఏరివేసేందుకు సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆపరేషన్ కొనసాగిస్తున్నది. ఇప్పటివరకు ఎవరైనా చనిపోయారా? అన్నది తెలియరాలేదు. కానీ, ఉగ్రవాదులతో ఇప్పటికీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం అందుతోందని ఆర్మీ తెలిపింది. మరోవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో భారత సైన్యం దీటుగా సమాధానమిస్తోంది. -
ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. కశ్మీర్ కుప్వారా జిల్లా తంగ్ ధర్ ప్రాంతంలో సైనికులకు, ఉగ్రవాదులకు కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్రమంగా దేశంలో చొరబడడానికి వీరు ప్రయత్నించారు. వీరి వద్ద నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, కరెన్సీని ఆర్మీ స్వాధీనం చేసుకుంది. మృతి చెందిన ముగ్గురిని లష్కర్ ఇ తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. -
కశ్మీర్లో జవాను బలి
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసినట్లు ఆర్మీ తెలిపింది. అయితే ఎదురుకాల్పుల్లో ఓ జవాను మరణించినట్లు పేర్కొంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా జవాన్లు కాల్పులు జరపడంతో పారిపోయారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. -
కల్నల్ భర్త మరణం.. ఆర్మీలోకి భార్య!
గత నవంబర్ లో జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఆర్మీ కమాండో సంతోష్ మహాదిక్ భార్య స్వాతి మహాదిక్ వచ్చే ఏడాది ఇండియన్ ఆర్మీలో చేరనున్నారు. సంతోష్ మహాదిక్ అంత్యక్రియల సమయంలో ఆమె ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ ఆమెకు వయసు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) పరీక్షలో ఆమెకు వయోపరిమితి నుంచి మినహాయింపు ఇచ్చారు. గత వారం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో కష్టతరమైన ఐదు రౌండ్లను ఆమె ఎదుర్కొన్నారు. సోమవారం మెడికల్ పరీక్షకు హాజరై.. విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో 38 ఏళ్ల స్వాతి మహాదిక్ వచ్చే ఏడాది ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. దీనిపై స్పందించడానికి ఆమె తిరస్కరించారు. గత ఏడాది నవంబర్ 27న కుప్వారాలోని ఎల్ఓసీ వద్ద జరిగిన మిలిటెంట్ల దాడిలో యూనిట్ 41-రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సంతోష్ మహాదిక్ వీరమరణం పొందారు. గణతంత్ర దినోత్సవం నాడు భారతప్రభుత్వం ఆయనను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది. -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు గురువారం మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల సమాచారంతో వాస్తవాధీన రేఖ(ఎల్ఓసీ) సమీప ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఐదు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియా సంస్థకు తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల సమాచారంతో కుప్వారా ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
బలగాలకు మిలిటెంట్లకు మధ్య కాల్పులు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి తుపాకుల చప్పుడు వినిపించింది. కుప్వారా జిల్లాలోని లాల్ పోరా ప్రాంతంలోగల షేక్ పురాలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్‌కు సరిగ్గా 100 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, సైనికులు కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. వారికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుపడి కాల్పులు జరపడంతో ప్రతిగా బలగాలు కాల్పులు జరిపాయి. అయితే, జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. -
కుప్వారాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకొని ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుప్వారా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ కారణంగా ఓ లెఫ్టినెంట్ కల్నల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అక్కడి చుట్టుపక్కల అడవిలో తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉగ్రవాదులు ఎదురవ్వగా.. ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సమయంలో వారు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఓ ఉగ్రవాది పోలీసుల కాల్పులకు హతమయ్యాడు. హంద్వారాలోని భవన్ అనే గ్రామంలో ఉగ్రవాదుల అలికిడి ఉందని గత శనివారం సమాచారం అందినప్పటి నుంచి బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ముగ్గురు తీవ్రవాదుల ఎన్ కౌంటర్
శ్రీనగర్: ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. ఈ సంఘటన జమ్మూ - కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల ద్వారా కుప్వారాకు 100 కిలో మీటర్ల దూరంలో మిలిటెంట్లు ఉన్నట్టు తెలుసుకున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి కూడా గాయపడ్డాడని అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.