kurnool
-
కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన
-
ఏపీలో మంత్రుల ఆండదండలతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
-
కర్నూలులో రోడ్డెక్కిన వాలంటీర్లు..
-
కర్నూలు జిల్లా కలెక్టర్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
-
అంతులేని.. అన్యాయం..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్‌లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు. లా వర్సిటీపై సందిగ్ధం.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్‌లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. సీమ టీడీపీ నేతల మౌనవ్రతం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. అందరూ హైకోర్టు కావాలన్నవారేకర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.కొప్పర్తి కడుపుకొట్టి..వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్‌తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్‌లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో రోడ్డుపై బైఠాయింపు
-
పురుగు మందు డబ్బాలతో నిరసన.. కర్నూలులో యురేనియం తవ్వకాలపై ఉద్రిక్తత
సాక్షి,కర్నూలు: జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. యురేనియం తవ్వకాలపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరిగి వెనక్కి వెళ్లారు. పురుగు మందు డబ్బాలు.. పెట్రోలు సీసాలతో రాస్తా రోకోలతో ప్రజల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశం నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.మరోవైపు, దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్‌లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల ప్రభావం 100 కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో దేవనకొండ మండలంతో పాటు పత్తికొండ మండల పరిసర ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చేపట్టారు. కప్పట్రాళ్ల, కోటకొండ, పల్దొడ్డి గ్రామాల రైతులు సైతం యురేనియం తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇవాళ యురేనియం తవ్వకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కర్నూలు-బళ్లారి రహదారిలో బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, ప్రజల ఆందోళనతో యురేనియం తవ్వకాల పనులను అధికారులు నిలిపివేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
మార్కెట్ నిండా ఉల్లి.. రైతులకు కష్టాల లొల్లి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్‌కు గ్రహణం పట్టింది. నాలుగు రోజులుగా సర్వర్ పనిచేయక వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారమయ్యేది. తొలిసారి నాలుగు రోజులుగా సర్వర్ మొండికేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ–నామ్ సాంకేతిక సమస్య కారణంగా ఉల్లి మినహా ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. రేయింబవళ్లు యార్డుల్లోనే నిరీక్షణ ప్రస్తుతం ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో వారం రోజుల ముందే పంటను కోసి రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌కు ఉల్లి వెల్లువెత్తుతోంది. విక్రయాలు ఒకరోజు ఆలస్యమైతే ధర పడిపోతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇదే సందర్భంలో ఈ–నామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తయి.. ధరలు ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లాలంటే రైతులు రేయింబవళ్లు మార్కెట్ యార్డులోనే నిరీక్షించాల్సి వస్తోంది. నిత్యం 20 వేల టన్నులు రాక రాష్ట్రంలో ఉల్లి క్రయవిక్రయాలకు ఏకైక ఆధారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ మాత్రమే. పశి్చమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతున్నా.. అది పూర్తిగా ప్రైవేట్ మార్కెట్. కర్నూలు మార్కెట్ ప్రభుత్వం అ«దీనంలో ఉన్నందున రైతులు 60 శాతం పంటను కర్నూలు మార్కెట్‌కే తీసుకొస్తారు. ఉమ్మడి కర్నూలుతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే ఉల్లిని తీసుకొచ్చి విక్రయిస్తారు. ఈ ఏడాది మొదటి నుంచి ఉల్లి ధరలు మెరుగ్గా ఉండటం వల్ల సాగు పెరిగింది. 2023 ఖరీప్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాఓ 39,431 ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. ఈ ఏడాది 43,875 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు సగటున 5 టన్నుల చొప్పున ఈ ఏడాది 2,19,375 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఉల్లి పంటను కోసి రబీ పంటగా శనగ విత్తుకోవాలనే ప్రయత్నాల్లో రైతులు ఉన్నారు. మరోవైపు పెరిగిన ధర ఎక్కడ పడిపోతుందోనన్న భయంతో వారం, 10 రోజుల ముందుగానే పంటను కోసి మార్కెట్‌కు తెస్తున్నారు. దీంతో కర్నూలు మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు 20 వేల క్వింటాళ్లు వస్తుండటం విశేషం. గతంలో అత్యధికంగా రోజుకు 8 వేల క్వింటాళ్ల వరకే వచ్చేది. ఎటూ చూసినా ఉల్లి వాహనాలే మార్కెట్ యార్డు విస్తీర్ణం 26 ఎకరాలు. మార్కెట్ మొత్తం ఉల్లి పంటతో నిండిపోయింది. మ్యాన్యువల్ టెండర్ల కారణంగా ధరల నిర్ణయం ఆలస్యమవుతోంది. కాటాల్లోనూ జాప్యం జరుగుతోంది. కొనుగోలు చేసిన ఉల్లిని బయటకు తరలించేందుకు తగినన్ని లారీలు లభ్యం కావడం లేదు. దీంతో యార్డులోని స్థలమంతా ఉల్లి వాహనాలతో నిండిపోయింది.అమ్ముకోవడానికి తెచ్చిన ఉల్లి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. అన్ని ప్రధాన రహదారుల్లో కిలోమీటర్‌కు పైగా ఉల్లి వాహనాలు బారులు తీరి ఉండిపోతున్నాయి. ఆ వాహనాలు అతి కష్టం మీద మార్కెట్లోకి వెళితే స్థలం దొరకడం లేదు. మరోవైపు అన్లోడ్ చేయడానికి హమాలీలు ఉండటం లేదు. పంటను అమ్ముకోవాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రమంతటా ఈ–నామ్ సమస్యే గతంలో ఈ–నామ్లో ఎటువంటి సమస్య ఏర్పడినా యుద్ధప్రాతిపదిక పరిష్కరించేవారు. తొలిసారిగా రోజుల తరబడి సాంకేతిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ సమస్య ఒక్క కర్నూలు మార్కెట్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లతోపాటు దేశవ్యాప్తంగా ఈ–నామ్ విధానం అమలవుతున్న అన్ని మార్కెట్లలో ఇదే సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తొలిసారి ఈ–నామ్ అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తోంది. ఎప్పుడు సమస్య వచ్చినా ఒకటి, ఒకటిన్నర రోజుల్లోనే పరిష్కారమయ్యేది. మొదటిసారిగా రోజుల తరబడి సమస్య ఉండిపోయింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే. ఇది రైతులకు శాపంగా మారింది. ఉల్లి మినహా అన్నిరకాల పంట క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. – కట్టా శేఖర్, అధ్యక్షుడు, కమీషన్ ఏజెంట్ల సంఘం, కర్నూలు రైతులకు నరకమే పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు నరకం చూపిస్తున్నారు. పంటను ఆమ్ముకునేందుకు వస్తే.. మార్కెట్లోకి ప్రవేశించేందుకే తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ–నామ్ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యాన్యువల్‌గా టెండర్ వేయడం వల్ల ఆలస్యమవుతోంది. ధరలను ప్రకటించే సరికి సాయంత్రమైంది. పంటను అమ్ముకుని ఇంటికి వెళ్లేది ఎప్పుడో తెలియడం లేదు. సర్వర్ సమస్య ఏర్పడినపుడు సత్వరం పరిష్కరించేందుకు యంత్రాంగం ఉండాలి. – తిప్పారెడ్డి, బేతపల్లి, దేవనకొండ మండలం -
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ..
-
కర్నూలులో కొనసాగుతున్న మద్యం షాపుల లాటరీ
-
రక్తమోడిన దేవరగట్టు
హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్ క్యాంప్‌లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్‌లో చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం.. ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం ఆలూరు రూరల్: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌పై వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్‌పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
దేవరగట్టు కర్రల సమరంలో విషాదం
-
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో పగిలిన తలలు
-
కర్నూల్లో నకిలీ డీఎస్పీ కలకలం
-
కర్నూలులో హైకోర్టు పెట్టాలి లేదంటే ప్రత్యేక రాష్ట్రం
-
టీడీపీ శ్రేణుల బరితెగింపు.. కర్రలు, కారంతో అటాక్
-
తుగ్గలిలో రైతు కూలీకి ఖరీదైన వజ్రం లభ్యం
-
కర్నూలులో గణేష నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం
-
వినాయక నిమజ్జనాలకు కర్నూల్ ముస్తాబు
-
ఉల్లి రైతుకు ‘సిండికేట్’ దెబ్బ
కర్నూలు (అగ్రికల్చర్) : ఉల్లి ధరలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినింది. ఈ నేపథ్యంలో సహజంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లికి డిమాండ్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉల్లి గడ్డలకు డిమాండ్ పెరిగి ధర కూడా జోరు మీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రం ధరలు తగ్గుతున్నాయి.మొన్నటి వరకు వర్షాల వల్ల ఉల్లి నాణ్యత దెబ్బతిని ధర లభించడం లేదు. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో గడ్డల నాణ్యత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో కర్నూలు మార్కెట్‌కు పోతే గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో వస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. సిండికేట్‌గా మారుతున్న వ్యాపారులువ్యాపారులు పథకం ప్రకారం ఉల్లి ధర పెరుగకుండా జట్టు కడుతున్నారు. సిండికేట్‌గా మారి ధరలపై ప్రభావం చూపుతున్నారు. గతంలో వేలంపాట ద్వారా కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు సైగలతో సిండికేట్ అయ్యేవారు. ప్రస్తుతం ఈ–నామ్లో టెండర్ ప్రాతిపదికన ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 40 మంది వ్యాపారులు ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 30 మంది వ్యాపారులు భారీగానే ఉల్లి క్రయ, విక్రయాలు చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో కొనుగోలు చేసిన ఉల్లి అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు తరలుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో కోల్‌కతా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయమే వ్యాపారులు దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్డర్లు, ధరల ఆధారంగా సిండికేట్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ ధర వరకు టెండరు వేయవచ్చనే విషయమై వ్యాపారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ–నామ్లో కూడా సిండికేట్‌గా మారి కొనుగోలు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలో ఉల్లికి ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తే కర్నూలు మార్కెట్లో కనీసం రూ.5వేల వరకు ధర పలకాలి. కానీ రూ.3,600 మించడంలేదు. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకే లభిస్తోంది. 40 శాతం లాట్లకు లభిస్తున్న ధర రూ.2వేల నుంచి 2,500 వరకు మాత్రమే ఉంటోంది. మిగిలిన అన్ని లాట్లకు రూ.1000 నుంచి రూ.2వేల మధ్యనే ధర లభిస్తోంది. ధర తీవ్ర నిరాశకు గురి చేసింది ఒక ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి అంతంత మాత్రంగానే వచి్చంది. మార్కెట్లో దిగుబడిని విక్రయానికి తీసుకెళ్తే క్వింటాకు రూ.2,000 లోపు ధర లభించింది. ఈ ధర చాలా నిరాశకు గురిచేసింది. వ్యాపారులు పథకం ప్రకారం సిండికేట్‌గా మారి ధర పెరగకుండా చేస్తున్నారు. – మద్దిలేటి, పర్ల, కల్లూరు మండలం -
టీడీపీ నేతలే చంపేశారు..
-
కర్నూలు: TDP నేత శ్రీనివాసులు హత్య కేసులో వెలుగులోకి నిజాలు
-
జననేత కోసం జనం
-
ఈ విజయం టీడీపీకి చెంపదెబ్బ.. కర్నూల్ లో YSRCP క్లీన్ స్వీప్..