lift irrigation project
-
సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధం
-
మరో స్కామ్...తవ్వినకొద్దీ బయటపడుతున్న టీడీపీ బండారం
-
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, నిర్మల్ జిల్లా: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లిల వద్ద శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌తో నిర్మించిన కాళేశ్వర ప్రజెక్టు ప్యాకేజీ-27ను (శ్రీలక్ష్మీ నరసింహాస్వామి లిఫ్ట్ ఇరిగేషన్) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. తరువాత దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించి పూజ నిర్వహించారు. అదే విధంగా సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆశా కార్యకర్తల ఆందోళన.. గుండంపెల్లిలో ఉద్రిక్తత గుండంపెల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ ఆశా కార్యకర్త సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసుల తీరుపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. చివరికి ప్యాకేజీ 28 కాళేశ్వర పనులు ప్రారంభించిన తర్వాత మంత్రికి ఆశా కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు. -
ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఒక్క రైతుకు మేలు
-
మూడు నెలల్లో ‘ఉదయ సముద్రం’ ఎత్తిపోతల
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును మూడు నెలల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. మంగళవారం ఆయన నార్కట్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును ప్రారంభించే రోజు లక్ష మందితో సభ ఏర్పాటు చేస్తామన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, పెండింగ్ బిల్లులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. సోమవారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌తో ఉదయ సముద్రంపై చర్చజరిగిందని, తక్షణమే సీఎం స్పందించి అధికారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారని ఆయన వివరించారు. ప్రాజెక్టులో ప్రధానమైన అప్రోచ్ కాలువ, సొరంగం, సర్జ్‌పూల్, పంప్‌హౌస్, సబ్ స్టేషన్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. -
‘పాలమూరు’కు హోదా ఇస్తారనుకున్నాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తున్నామని చెప్పేందుకు ఇటీవల కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చినట్లు భావించామని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కానీ, వీరి వైఖరి చూస్తుంటే పాలమూరుకు నిధులివ్వడం పక్కనబెట్టి ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు సృష్టించడమే ఉద్దేశంగా కనిపిస్తోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని వెంకటాపూర్, మాచన్‌పల్లితండాలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్ హామీ నెరవేర్చేందుకు కేంద్రమంత్రి వచ్చారని అనుకున్నామని, ఒకరి ఇంట్లో టిఫిన్, మరొకరి ఇంట్లో భోజనం, స్టార్ హోటల్లో సేదతీరుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. పాలమూరుకు జాతీయ హోదాతోపాటు రూ.లక్ష కోట్ల నిధులు విడుదల చేసి బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. పొలాలకు సాగునీరు పారించాలని తాము చూస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం రక్తం పారించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
ప్రాజెక్టులపై చర్చిద్దాం.. పాలమూరుకు రండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలో నిర్మించిన, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు పాలమూరు రావాలని సవాల్ విసిరారు. ప్రజాసంగ్రామ యాత్ర–2లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏ గ్రామానికి వెళ్లినా సాగునీటి సమస్యలు, వలసలు, ఉపాధి అంశాలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. శనివారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సంజయ్ బహిరంగ లేఖ రాశారు. వెనుకబడిన పాలమూరు జిల్లాలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తాము పాదయాత్ర చేపడితే మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా కేసీఆర్ ఉన్నప్పుడు జిల్లాను దత్తత తీసుకొని సాగునీటి సమస్యలేకుండా సస్యశ్యామలం చేస్తానని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి వలసలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానన్న హామీలేవీ అమలుకు నోచుకోలేదన్నారు. ‘గత 8 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులను మీ ఖాతాలో వేసుకొని పాలమూరు అంతా సస్యశ్యామలమైందని అసత్యప్రచారం చేస్తున్నారు’అని మండిపడ్డారు. ‘ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలమూరు ప్రజలపట్ల జరుగుతున్న వివక్షపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది’అని అన్నారు. ‘పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు మేం సిద్ధం. మీరు ఓకేనా? ఈ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేసి, వలసలు అరికట్టి ప్రజలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం స్పందించకుంటే పాలమూరు ప్రజలపట్ల తన వివక్షను, నిర్లక్ష్యాన్ని కొనసాగించేందుకే కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు భావించాల్సి వస్తోంది’అని సంజయ్ ఈ లేఖలో పేర్కొన్నారు. -
ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం అవసరం లేదు: ఎన్జీటీ తీర్పు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతి తీసుకున్న తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దిశానిర్దేశం చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన (ఈఐఏ)–2006 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి.. పర్యావరణ అనుమతి జారీచేసే ప్రక్రియను వేగంగా ముగించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్జీటీ (చెన్నై బెంచ్) ఉత్తర్వులు జారీచేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతు, తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ విచారించింది. డీపీఆర్ రూపకల్పన కోసం అవసరమైన పనులు మాత్రమే చేశామని ఏపీ సర్కార్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఎత్తిపోతల పనులు చేపట్టినందుకుగానూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. డీపీఆర్ రూపకల్పన కోసం చేసిన పనులను మదింపు చేయడానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం, సీడబ్ల్యూసీ అధికారి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కమిటీతో ఎత్తిపోతల పనులను మదింపు చేసి.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా విఘాతం కలిగిందా? లేదా? అనే కోణంలో అధ్యయనం చేసి, నాలుగు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. డీపీఆర్ రూపకల్పన కోసం మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ సూచించిన మార్గదర్శకాలను ఈఐఏ–2006లో చేర్చి.. పర్యావరణ అనుమతివ్వాలని నిర్దేశించింది. నివేదిక, పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ డీపీఆర్‌కు సంబంధించిన పనులతో సహా ఎలాంటి పనులు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. చదవండి: చురుగ్గా ‘వైద్య’ పోస్టుల భర్తీ -
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ
న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పర్యావరణ ఉల్లంఘనలు, ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నివేదిక నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని ఎన్జీటీ వెల్లడించింది. ఆగస్టు 27కల్లా నివేదిక దాఖలు చేయాలని కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. కేఆర్ఎంబీ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. అయితే జులై 7వ తేదీనే పనులు నిలిపివేసినట్టు ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. కేఆర్ఎంబీ నివేదికపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏపీ న్యాయవాదులకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం సూచించింది. -
ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరిన ఎన్జీటీ
సాక్షి, చెన్నై/ అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) బుధవారం విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్ తనిఖీ బృందంలో తెలంగాణ స్థానికత ఉన్న సీడబ్ల్యూసీ అధికారిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ఆంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్‌తో కూడిన ఎన్జీటీ చెన్నై బెంచ్ ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరింది. దీంతో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా తనిఖీకి వెళ్లేందుకు సిద్ధమని కృష్ణా బోర్డు పేర్కొంది. ఈనెల 9న నివేదిక అందజేయాలని ఎన్జీటీ కృష్ణా బోర్డును ఆదేశించింది. -
AP: ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించలేదని, తమకు అలాంటి ఉద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, అందులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో ప్రధానాంశాలు ఇవీ.. ► కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపుల మేరకే శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు కన్నా దిగువన ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు వాటా నీటిని తీసుకునే అవకాశం లేదు. ► 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేందుకు ప్రతిపాదిత పథకాన్ని చేపట్టాం. ఈ నీటిని శ్రీశైలం కుడికాలువ, తెలుగు గంగ ద్వారా చెన్నై నగరానికి తాగునీరు, తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు–నగరి సుజల స్రవంతి, ఎస్ఆర్బీసీకి తరలించాలి. రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన 101 టీఎంసీల మేరకు శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపడుతున్నాం. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నప్పుడు కేటాయింపులున్నా నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. అందువల్లే కేటాయించిన వాటా నీటిని వినియోగించుకునేందుకే 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేలా సీమ ఎత్తిపోతలకు ప్రణాళిక రూపొందించాం. అది కూడా పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకే. ► 2020 జూలై 13న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ అవసరమైన అధ్యయనం చేయాలని ఎన్జీటీ పేర్కొంది. తదనుగుణంగా తక్కువ ధరకు బిడ్ చేసిన బిడ్డర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చారు. ► 2020 అక్టోబర్ 29న ఇచ్చిన ఆదేశాల్లో ట్రిబ్యునల్ పలు సూచనలు చేసింది. బిడ్డర్ సమగ్ర సర్వే చేయాలని, ముచ్చుమర్రి వద్ద భూసేకరణను నివారించడంలో భాగంగా మరే ఇతర ప్రాంతంలోనైనా పథకం నిర్మాణం చేపట్టవచ్చా? అనే అంశంపై సర్వే చేయాలని సూచించింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎడమ వైపున రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని బిడ్డర్ తెలిపారు. ► బిడ్డర్ నివేదికను సాంకేతిక కమిటీ పరిశీలించి అనుమతించింది. అనంతరం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పథకం నిర్మాణం నిమిత్తం తనిఖీ చేయాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2020 డిసెంబర్ 4న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫీజిబిలిటీ నివేదిక ఇచ్చింది. నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంత కన్జర్వేటర్‌ను అభిప్రాయాలు చెప్పాలని కోరగా బిడ్డర్ సూచించిన ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్లోకి రాదని నివేదించారు. ఈ మేరకు మార్పులు చేసిన వివరాలను ఎన్జీటీ ముందు ఉంచుతున్నాం. మార్పుల ప్రకారం కొత్తగా సాగులోకి వచ్చే ప్రాంతం ఏమీ లేదు. ప్రస్తుత కాలువ సామర్థ్యం కూడా పెరగదు. ► పథకంలో మార్పులు చేసిన అనంతరం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఈ ఏడాది జూన్ 30న కేంద్ర జల సంఘానికి, జూలై 1న కృష్ణా బోర్డుకు అందచేశాం. మార్పులు చేసిన ప్రతిపాదిత పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఈ ఏడాది జూన్ 9న కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. జూన్ 17, జూలై 7న నిర్వహించిన సమావేశాల్లో జలశక్తి నిపుణుల కమిటీ మార్పుల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించి కొన్ని వివరణలు కోరింది. అది పెండింగ్‌లో ఉంది. ► సాగు, తాగు నీరు నిమిత్తం కేటాయించిన జలాలను తీసుకునేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారని నిపుణుల కమిటీ తేల్చింది. ఎత్తిపోతల ద్వారా తీసుకునే జలాలు ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి సుజల స్రవంతి కోసమేనని, కొత్తగా సాగు ప్రాంతం ఏమీ లేదని, పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. మార్పులు చేసిన ప్రతిపాదనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ► ఎన్జీటీ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉత్తరం వైపు ఎలాంటి కాంక్రీట్ పనులు జరగడం లేదు. ప్రతిపాదిత కొత్త స్థలంలో ఫౌండేషన్ నిమిత్తం తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 29 నాటి ఆదేశాలను ఉల్లంఘించలేదు. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆ పిటిషన్‌ను కొట్టివేసి భారీ జరిమానా విధించాలని కోరుతున్నాం. -
ఎత్తిపోతల పథకం.. సీమకు శరణ్యం
సాక్షి, కడప: శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం దిగువకు తోడేస్తుండడంతో కరువుకు నిలయమైన వైఎస్సార్ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే రాయలసీమ, ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కాకుండా సాధారణ వర్షపాతం నమోదయ్యే పక్షంలో దిగువ జిల్లాలకు ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాకు నీటి ఇక్కట్లు తప్పవు. గత రెండేళ్లలో ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపడంతో లక్షలాది ఎకరాలలో పచ్చని పంటలు కళకళలాడాయి. అప్పట్లో కృష్ణా జలాల కంటే తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియాల్లోని వర్షపు నీరే తాము వాడుకున్నామని ఈ ప్రాంత సాగు నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే కాలంలో వర్షాలు తగ్గుముఖం పట్టి తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే జిల్లా మళ్లీ కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరద సమయంలో త్వరితగతిన నీటిని తెచ్చుకుని ప్రాజెక్టులు నీటితో నింపాలన్న ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకమే శరణ్యమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో సాగునీటి వనరుల పరిస్థితి జిల్లాలో తెలుగుగంగ పరిధిలోని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌తోపాటు సబ్సిడరీ రిజర్వాయర్–1, సబ్సిడరీ రిజర్వాయర్–2, గండికోట, మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పైడిపాలెం, లోయర్ సగిలేరు, బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టు, వెలిగల్లు, పింఛా ప్రాజెక్టులతోపాటు కేసీ కెనాల్ ఉండగా, వీటి పరిధిలో 94.489 టీఎంసీల నీరు అవసరముంది. ఇందులో నాలుగు ప్రాజెక్టులు మినహా మిగిలిన 10 సాగునీటి వనరులు కృష్ణా, తుంగభద్ర జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. వీటి పరిధిలో 86.989 టీఎంసీల నీరు అవసరముంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక రెండు సంవత్సరాల్లో జిల్లాతోపాటు ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కృష్ణానదితోపాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం పరిధిలోని తుంగభద్ర నది సైతం పొంగి ప్రవహించాయి. తుంగభద్ర నీళ్లు పెద్ద ఎత్తున కృష్ణాలో కలిశాయి. దీంతో శ్రీశైలం నుంచి భారీ స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను ప్రభుత్వం నీటితో నింపింది. గండికోటలో పూర్తి సామర్థ్యం 26.850 టీఎంసీల నీటిని నిల్వ పెట్టింది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి వనరులకు 18 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు సుమారు 10 టీఎంసీల నీటిని తరలించారు. దీంతో జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, కడప తదితర నియోజకవర్గాల పరిధిలో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది. భూగర్భ జలాలు పెరిగి బోరు బావులకు నీరు చేరింది. అదనపు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తీరాయి. తెలంగాణ వైఖరితో జిల్లా వాసుల్లో ఆందోళన ఈ ఏడాది ముందస్తు వర్షాలు ప్రారంభం కావడంతో సకాలంలో కృష్ణా నీరు దిగువకు చేరి జిల్లాలోని ప్రాజెక్టులు నీటితో నిండితే గత రెండేళ్లు లాగే సాగునీటి ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్న జిల్లా వాసులకు తెలంగాణ వైఖరి మరింత ఆందోళన కలిగిస్తోంది. శ్రీశైలంలో నామమాత్రపు నీరు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు త్వరితగతిన నిండి రాయలసీమ జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాకు సకాలంలో నీరొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ స్థానికంగా సాధారణ వర్షపాతం నమోదై ఎగువ రాష్ట్రాల్లో నామమాత్రపు వర్షాలు కురిస్తే వైఎస్సార్ జిల్లాకు కృష్ణా జలాలు రావడం గగనం. ఎత్తిపోతల పథకం తప్పనిసరి.. వాస్తవానికి గత రెండేళ్లలోనూ కృష్ణానది నీరు కాకుండా జిల్లా ప్రాజెక్టులకు తుంగభద్ర నీరే వాడుకున్నట్లు సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తుంగభద్ర పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గత రెండేళ్లలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరు కృష్ణానదిలో చేరింది. ఆ మేరకు మాత్రమే జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని వాడినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంతేగానీ కృష్ణా జలాలు వాడింది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటి ఇక్కట్లు తలెత్తే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం తప్పనిసరి అని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రధాన కాలువల ఆధునికీకరణ, ఎత్తిపోతల పథకం ద్వారా వరద కాలంలో నీటిని తరలించుకునే అవకాశం ఉంటుంది. ఒప్పందం మేరకు 15 టీఎంసీల కృష్ణా జలాలను వైఎస్సార్ జిల్లా మీదుగా చెన్నై తాగునీటి అవసరాలకు తరలించాల్సి ఉంది. దీంతోపాటు నెల్లూరు జిల్లాలోని 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల రిజర్వాయర్‌తోపాటు అదే జిల్లాలోని కండలేరు రిజర్వాయర్‌కు జిల్లా మీదుగానే కృష్ణాజలాలను తరలిస్తున్నారు. తెలంగాణ వైఖరితో రాయలసీమ జిల్లాలతోపాటు అటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఇటు ప్రకాశం జిల్లాకు నీటి కష్టాలు తప్పవన్నది నిపుణుల వాదన. నీటిని వృథా చేయడం నేరం నీరు జాతీయ సంపద. దానిని వృథా చేయడం నేరం. అవసరం లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నీటిని వృథా చేస్తోంది. శ్రీశైలం నీటిని దిగువకు వదలడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. – దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి కన్వీనర్, కడప తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలను వెంటనే ఆపాలి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదలడం వల్ల వైఎస్సార్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచినీటి విడుదలను ఆపాలి. – సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, కడప మనం వాడుకున్నది తుంగభద్ర నీరే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఉన్న కాస్త నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు తోడేయడం సరికాదు. గత రెండేళ్లలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నింపుకున్నాం. మనం వాడుకున్నది కృష్ణా జలాలు కాదు. తుంగభద్ర నీరు మాత్రమే. – వెంకట్రామయ్య, ఈఈ, ఇరిగేషన్, కడప -
‘రాయలసీమ’కు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ)కి లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమ ప్రాజెక్టని, ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నీటి కేటాయింపులు లేవని, కేంద్ర జల సంఘం అనుమతులు సైతం లేవని దృష్టికి తెచ్చింది. గతంలో కేంద్ర జల సంఘం ద్వారా నీటి కేటాయింపులు జరగని ప్రాజెక్టులకు ఈఏసీ పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేసింది. సీడబ్ల్యూసీ నీటి కేటాయింపులు జరుపలేదన్న కారణంగానే తెలంగాణ చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం (ఫేజ్–1)కు సైతం 2018 అక్టోబర్‌లో పర్యావరణ అనుమతులు వాయిదా వేసిన విషయాన్ని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ ఈఏసీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు ఇవ్వకూడదో లేఖలో వివరించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని, ఇది కేంద్ర జల సంఘం ఆమోదించని అక్రమ ప్రాజెక్టని లేఖలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా కృష్ణా జలాలను బేసిన్ అవతలకు తరలించేలా ప్రయత్నాలు చేస్తోందని, దీనిద్వారా ఏపీ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని తెలిపింది. ముఖ్యంగా వన్యప్రాణి కేంద్రాలైన రొలియాపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీలంకమల్లేశ్వర, శ్రీ పెనుసిల నర్సింహ, రాజీవ్‌గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర పార్కులు ఈ ప్రాజెక్టు కాల్వలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయని వెల్లడించారు. వాటి వివరాలను జత చేశారు. ప్రతిపాదిత అలైన్మెంట్ కేవలం బఫర్ జోన్‌లోంచే కాకుండా కోర్ జోన్ల ద్వారా వెళుతున్నట్లు ఏపీ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని తెలిపారు. దీంతోపాటే జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించి, అనుమతులు పొందేవరకు ముందుకు వెళ్లరాదని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని దృష్టికి తెచ్చారు. వీటితో పాటే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిందని, తదనంతరం కేంద్ర ప్రభుత్వం సైతం సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చేంతవరకు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని లేఖలో తెలిపారు. ఈ అంశాల దృష్ట్యా పర్యావరణ అనుమతుల మంజూరుకు ముందు న్యాయపరమైన, పర్యావరణ, హైడ్రాలాజికల్ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈఎన్సీని కోరారు. -
భూసేకరణ అవసరం లేకుండా..
సాక్షి, అమరావతి: ఒక్క ఎకరా కూడా సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను రూపొందించింది. శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం (800 అడుగుల నీటి మట్టం) నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) వరకూ మూడు టీఎంసీలను తరలించే సామర్థ్యంతో భవనాశి నదిలో 17 కి.మీ.లు కాలువ తవ్వి.. అక్కడి నుంచి పీహెచ్ఆర్ దిగువన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా పంప్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. భవనాశి నదిలో కాలువ తవ్వడం వల్ల భూసేకరణ అవసరం ఉండదు. ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ) పనులు చేసే సమయంలో పీహెచ్ఆర్ వద్ద అదనంగా 123 ఎకరాల భూమిని సర్కార్ అప్పట్లోనే సేకరించింది. ఆ భూమిలో పంప్ హౌస్, 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించింది. తద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించింది. దీనివల్ల భూసేకరణకు వ్యయమయ్యే రూ. 854 కోట్లు ఆదా అవుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్ఆర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను రూ. 3,307.07 కోట్లకు ఎస్పీఎమ్మెల్(జేవీ) సంస్థకు సర్కార్ ఇప్పటికే అప్పగించిన విషయం విదితమే. రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా.. కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ప్రాంతమైన సంగమేశ్వరం వద్ద శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉంటుంది. సంగమేశ్వరం నుంచి ముచ్చుమర్రి వరకూ జలాశయంలో 4.5 కి.మీ.ల పొడవున తవ్వే అప్రోచ్ కెనాల్ ద్వారా మూడు టీఎంసీలు (34,722 క్యూసెక్కులు) తరలించి.. అక్కడి నుంచి ఒక్కో పంప్ 81.93 క్యూమెక్కులు (2,893 క్యూసెక్కులు) చొప్పున 12 పంప్‌ల ద్వారా 34,722 క్యూసెక్కులను 39.60 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేలా పంప్ హౌస్‌ను నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ముచ్చుమర్రి వద్ద నిర్మించే హౌస్ ద్వారా ఎత్తిపోసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైపులైన్ ద్వారా తరలించి.. డెలివరీ సిస్ట్రన్‌లో పోసి.. అక్కడి నుంచి 22 కి.మీ.ల పొడవున కాలువ తవ్వి.. పీహెచ్‌ఆర్‌కు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు పోయాలని తొలుత నిర్ణయించారు. అయితే జలాశయంలో బంకమట్టి పేరుకుపోయింది. దీనివల్ల అప్రోచ్ కెనాల్‌ను తవ్వడం ఇబ్బంది అవుతుంది. ముచ్చుమర్రి వద్ద పంప్ హౌస్, పైపులైన్, డెలివరీ సిస్ట్రన్ నిర్మాణం, 22 కి.మీ.ల పొడవున కాలువ తవ్వకం కోసం 1,200 ఎకరాల భూమిని సేకరించాలి. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులు చేపట్టినప్పుడు ముచ్చుమర్రి పరిసర గ్రామాల్లోనే భూసేకరణ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ప్రస్తుతం రైతుల చేతిలో అతి తక్కువ భూమి మాత్రమే మిగిలింది. మిగిలిన భూమిని కూడా సేకరిస్తే రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. భవనాశి నదిలో అప్రోచ్ కెనాల్, పీహెచ్ఆర్ వద్ద జలవనరుల శాఖ అధీనంలో ఉన్న 123 ఎకరాల్లో పంప్ హౌస్ నిర్మాణంతో ఒక్క ఎకరా భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదని, ఆ వ్యయం ఆదా అవుతుందని నివేదించారు. ఉభయతారకంగా ఉన్న ఈ ప్రతిపాదనపై సర్కార్ ఆమోదముద్ర వేసింది. శరవేగంగా పూర్తి చేస్తాం..: సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ. శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం నుంచి ముచ్చుమర్రి వరకూ బురద పేరుకుపోయి.. ఆ ప్రాంతమంతా ఊబిలా మారింది. అప్రోచ్ కెనాల్‌ను 800 అడుగుల మట్టంలో తవ్వడం వ్యయప్రయాసలతో కూడుకుంది. ముచ్చుమర్రి నుంచి పీహెచ్ఆర్ వరకూ 22 కి.మీ.ల కెనాల్ తవ్వాలంటే 1,200 ఎకరాల భూమిని సేకరించాలి. ఒక్క ఎకరా భూమిని సేకరించాల్సిన అవసరం లేకుండానే రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేసేలా అలైన్‌మెంట్‌ను రూపొందించాం. ఈ అలైన్మెంట్ ప్రకారం గడువులోగానే పనులు పూర్తి చేస్తాం. భవనాశి నది మార్గంలోనే..: మురళీనాథ్‌రెడ్డి, సీఈ, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్. నల్లమల అడువుల్లో జన్మించే భవనాశి నది పీహెచ్‌ఆర్‌కు దిగువన సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ నది ప్రవాహం వల్ల సంగమేశ్వరం నుంచి పీహెచ్ఆర్ వరకూ బురద పేరుకోలేదు. ఈ నదిలో పీహెచ్ఆర్ వరకూ 17 కి.మీ.ల పొడవున అప్రోచ్ కెనాల్ తవ్వడం ద్వారా 800 అడుగుల నుంచే నీటిని తరలించవచ్చు. పీహెచ్ఆర్ వద్ద అందుబాటులో ఉన్న 123 ఎకరాల్లో పంప్ హౌస్, సబ్ స్టేషన్‌ను నిర్మించి పనులు పూర్తి చేస్తాం. -
మూడు కోట్లు మూసీలో పోశారు!
వృథా నీటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షంగా మార్చాలన్న తలంపుతో మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుపయోగంగా మారింది. పథకం ఏర్పాటు లక్ష్యం మంచిదైనప్పటీకీ అధికారుల నిర్ణయాలు, ప్రజా ప్రతినిధుల దురాలోచనలతో అది మూలనపడింది. దీంతో రైతులకు మేలు జరగక పోగా, కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ కోవకు చెందినదే పొదిలి మండలంలోని పాములపాడు పంచాయతీలో గల కాశీపురం ఎత్తిపోతల పథకం. పొదిలి రూరల్: పొలం పక్కనే నీరు ప్రవహిస్తున్నా అది పైర్లకు ఉపయోగపడకపోవడంతో అప్పటి ప్రభుత్వం ఆ నీటిని సాగుభూములకు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసింది. మండలంలోని పాములపాడు, గొల్లపల్లి, కాశీపురం గ్రామాలకు చెందిన 625 ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో 1988–89 సంవత్సరంలో దాదాపు రూ.20 లక్షల వ్యయంతో మూíసీనదిపై ఈ పథకాన్ని నిర్మించారు. దీనికి 25 హెచ్‌పీ సామర్ధ్యం గల మూడు విద్యుత్ మోటార్లు, నీటి సరఫరాకు పైపు లైన్లు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో కాకున్నా పథకం మొదట్లో కొంతమేరకు పనిచేసింది. నీటి సరఫరా లేక సాగు తగ్గి నిర్వహణ లోపంతో మూడేళ్ల అనంతరం రైతులు ఒక లక్ష రూపాయలు పైబడి విద్యుత్ బకాయిలు పడ్డారు. కరెంట్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అధికారులు సరఫరా తొలగించారు. పథకం పని చేయక పోవడంతో మోటార్లు, భవనం తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో అక్కడ పిచ్చి చెట్లు పెరిగి సాగు భూములు బీడుగా మారాయి. ప్రజల విన్నపం మేరకు తరువాత వచ్చిన ప్రభుత్వాలు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం పథకం గ్రౌండ్ రిపోర్టు తయారు చేసింది. రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభిప్రాయాలు తెలుసుకొని పథకానికి అక్కడ అనువైన ప్రాంతం కాదని, కుంచేపల్లి మూసీనది మాగాణి వద్ద ఏర్పాటు చేస్తే ఉపయోగకరమని పెర్కొంటూ నివేదిక పంపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాసులకు కక్కుర్తిపడి: కాశీపురం ఎత్తిపోతల పథకంను కుంచేపల్లి వద్ద పునర్నిర్మాణం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని రైతులు, అధికారులు మొత్తుకున్నా వారి మాటలును గత తెలుగుదేశేం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాసుల కోసం కక్కుర్తి పడి ఆపార్టీ నాయకులు అప్పటి అధికారులపై వత్తిడి తెచ్చి పనిచేయని పథకానికి మరమ్మతుల కోసం రూ.3.20 కోట్లతో ఎస్టిమెషన్ వేయించి మంజూరు చేయించారు. ఈ పథకానికి 10 క్యూసెక్కులు నీటి పరిమాణం అవసరమని అధికారులు గుర్తించారు. దానికి తగ్గట్టు బావి, సంపు నిర్మాణాలు చేపట్టినట్లు కాకి లేక్కలు చూపి పాత పథకానికే ఏవో కొన్ని మొక్కుబడి పనులు చేసి మసిపూచి మారేడుకాయ చేశారు. పాత భవనాన్ని మర్మతులు చేసి, తలపులు బిగించి, మోటార్లు రీపేరు చేయించి, ట్రాన్స్పార్మర్లు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. పథకానికి నీరు రావాలంటే మూసీ నదిలో నీరు నిల్వ ఉండాలి. నీరు నిల్వ ఉండాలంటే నదికి అడ్డంగా కట్టనిర్మించాలి. కానీ ఇక్కడ అలాంటి పని చేయలేదు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించినా పథకం పనిచేయలేదు. మూసీనదిలో ఇసుక మేట వేయడం, పథకం ప్రాంతంలో చిల్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తుంది. దీంతో ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పటికీ నది వద్ద చుక్కనీరు నిల్వ ఉండక పోవడం కొసమేరుపు. వందలాది ఎకరాల భూములు బీడుగా ఉన్నాయని, ఈ స్కీం వినియోగంలోకి తీసుకురాక పోతే మరలా సామగ్రి దొంగల పాలౌతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతిగా ఖ్యాతిగాంచిన ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమైనా నదిలో నీరు నిల్వ ఉండటానికి అడ్డు కట్ట వేసి ఈ స్కీం వినియోగంలోకి తీసురావాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. -
‘వైఎస్సార్ వేదాద్రి’
-
ఫిబ్రవరికి ‘వైఎస్సార్ వేదాద్రి’
సాక్షి, అమరావతి/ పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంత కృష్ణా నదిపై రూ.490 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోని కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితి. ఐదేళ్లపాటు అధికారంలో ఉండీ కూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎత్తిపోతల పథకానికి క్యాంపు కార్యాలయంలో వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్ – మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. – ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీవీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నీరు అందిస్తాం. – దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. పెళ్లి రోజున చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వేదాద్రిలో ఎత్తిపోతల ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అనిల్‌కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ విప్ ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు రైతు బాంధవుడిగా నిలిచారు – వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు బాంధవుడిగా నిలిచారని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. – ‘ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. వేదాద్రి వద్ద కృష్ణా నది నుంచి 26 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నాగార్జునసాగర్ కాలువల్లోకి నీటిని విడుదల చేస్తారు. మంగొల్లు, గండ్రాడు, భీమవరం మీదుగా శనగపాడు వరకు ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు అందుతుంది. నాడు ఇదే ప్రాంతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి మేలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ పెళ్లి రోజు కానుకగా వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత రైతాంగానికి గొప్ప వరం. తద్వారా ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.10 లక్షలు విలువ పెరిగింది’ అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. – ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే పైలాన్ వద్ద సీఎం తన కార్యాలయంలో రిమోట్ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. – వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. – క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతం రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
మళ్లీ మొదలైన చంద్రబాబు మార్కు రాజకీయం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్‌కే పరిమితమై జూమ్ యాప్‌లో ఊదరగొడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయ నేతగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా మరోసారి సీమకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్దమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడటమే ఆయన లక్ష్యం. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే బాబు నైజం. (ఆరోపణలపై స్పందించిన ఏపీ పోలీస్ శాఖ ) రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతుంటే ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎదురు దాడి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆపాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు వెన్నుపోటు ఖాయం అనే ధోరణి బాబు కొనసాగిస్తూనే ఉన్నారు. సొంత రాష్ట్రానికి ముఖ్యంగా సొంత ప్రాంతానికి నష్టం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు. ('ఏ ఒక్కరి మీద ఆంక్షలు లేవు.. పూర్తిగా మీ స్వేచ్ఛ' ) తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. (చంద్రబాబు ట్వీట్‌పై స్పందించిన వైద్యారోగ్యశాఖ) తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగునీటితో పాటు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా పబ్బం గడవదని భావించారు. రాష్ట్రానికి ప్రయాజనం చేకూర్చే పథకాలకుఅడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. (రాజకీయాల కోసం వాడుకుంటున్నారు!) రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, నాగం మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పుడు వారికి ఏపీ నుంచి చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తనతో పాటు తనకు వంతపాడే తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిచక పోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా చంద్రబాబు ఉండాల్సిందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. -
రాయలసీమ ఎత్తిపోతల పథకం: ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసుకు సంబంధించి చెన్నైలోని జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ)లో ఇరువైపుల వాదనలు ముగిశాయి. మంగళవారం జరిగిన కోర్టు విచారణలో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే తమకు వాటాగా రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇది పాత పథకమేనని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలపాలని కోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. (కరువు సీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదమెందుకు?) కాగా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 20న విచారణ చేపట్టిన ఎన్జీటీ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని స్టే ఇచ్చింది. అయితే తన వాటా జలాలను వినియోగించుకునేందుకు ఈ పథకం చేపట్టామని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నివేదించింది. దీనిపై జూలై13న విచారించిన ఎన్జీటీ ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. (పర్యావరణ అనుమతి అక్కర్లేదు) -
‘సీతారామ’ పంపులకు మోక్షం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల సద్వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేయాల్సిన పంపులు, మోటార్ల రాకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చైనా నుంచి రావాల్సిన ఈ మోటార్లు, పంపులు ప్రస్తుత కరోనా సడలింపుల నేపథ్యంలో అక్కడి నుంచి కదిలాయి. వీటి షిప్పింగ్ ఇప్పటికే మొదలవగా, ఆగస్టు నాటికి అవి రాష్ట్రానికి చేరుతాయని ప్రాజెక్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మార్చి నాటికి వీటి ఏర్పాటును పూర్తి చేయనున్నారు. ఇప్పటికే 9 నెలలు ఆలస్యం... సీతారామ ఎత్తిపోతలను ఈ వర్షాకాలానికి ముందే సిద్ధం చేసేలా ప్రభుత్వం ముందునుంచీ ప్రణాళికలు రచించింది. అయితే పనులు వేగిరం అయిన సమయంలోనే మార్చి నుంచి కరోనా ప్రభావం పడటం, చైనా నుంచి రావాల్సిన మిషినరీ రాకపోవడంతో పెను ప్రభావం చూపింది. ప్రాజెక్టు మూడో పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేయదలిచిన 30 మెగావాట్ల మూడు పంపులు, మోటార్లు, 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మరో ఐదు పంపులు చైనాలోని షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి కొన్ని మరికొన్ని బీజింగ్, వూహాన్ నుంచి రావాల్సి ఉంది. ఈ పంపులు, మోటార్లు మార్చి నెలలోగానే రాష్ట్రానికి రావా ల్సి ఉన్నా ఫిబ్రవరి నెలాఖరు నుంచే షాంఘై, వూçహాన్‌లో లాక్డౌన్ నేపథ్యంలో పోర్టు ల ద్వారా వీటి తరలింపు నిలిచిపోయింది. మార్చి నెలలోనే ఈ పంపుల పరిశీలనకు ఇంజనీర్ల బృందం చైనా వెళ్లాల్సి ఉన్నా, వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాటిని పరీక్షించకుండానే రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మూడో పంప్‌హౌస్‌లోని మోటార్లు ఒక్కటీ సిద్ధం కాలేదు. అయితే ఇటీవల చైనాలో కొంత పరిస్థితి మెరుగవడంతో ఈ మోటార్ల తరలింపు ప్రక్రియ మొదలైందని, ఆగస్టు నాటికి రాష్ట్రానికి చేరతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పంప్‌హౌస్ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీకి చెప్పగా, అక్కడ ఆమోదం లభించింది. ఇక మొదటి పంప్‌హౌస్‌లో 6 మోటార్లకు మూడు సిద్ధమయ్యాయి. మరొకటి వారం పది రోజుల్లో పూర్తి కానుండగా, మిగతావి మరో నెల పట్టే అవకాశం ఉంది. అయితే వీటికి డ్రైరన్ నిర్వహించే దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. ఇక్కడి పనులన్నీ డిసెంబర్‌నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు అధికారులు ఎస్ఎల్ఎస్సీ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇక రెండో పంప్‌హౌస్‌లోనూ 6 మోటార్లు ఉండగా, ఇక్కడ రెండు సిద్ధమయ్యాయి. ఈ పనులు డిసెంబర్ నాటికే పూర్తికానున్నాయి. కార్మికులు లేక నెమ్మదించిన పనులు ఈ రెండు పంప్‌హౌస్‌ల పరిధిలో పనిచేస్తున్న జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో ఫిట్టింగ్, కాంక్రీట్, వెల్డింగ్, షట్టరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులన్నీ నెమ్మదించాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వలసకార్మికులను ఇప్పుడు తిరిగి రప్పించేలా ఏజెన్సీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
తెలంగాణకు తీరని నష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలిచిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం స్పష్టం గా చెబుతోందని పేర్కొన్నారు. అయినా దానికి విరుద్ధంగా ఏపీ నడుచుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా కొత్తదని, దీనికి ఎలాంటి అనుమతుల్లేవని, బోర్డు తక్షణం జోక్యం చేసుకొని దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీంతోపాటు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచడం కూడా తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు విఘాతం కలిగించేదేనని, ఈ దృష్ట్యా ఏపీ తీసుకొచ్చిన జీవో 203పై మరింత ముందుకెళ్లకుండా బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, నర్సింహా.. కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో బుధవారం జలసౌధలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు పేర్కొంటూ రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఏపీ ప్రాజెక్టులతో జరిగే నష్టాన్ని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు. ఈ అంశంపై తమ పరిధిలో ఏపీ నుంచి వివరణ కోరతామని బోర్డు వారికి హామీ ఇచ్చింది. అలా అయితే అభ్యంతరం లేదు: రజత్ భేటీ అనంతరం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టంపై బోర్డుకు వివరించామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించినట్లు చెప్పారు. గతంలోనే ఈ అంశంపై ఫిర్యాదు చేశామని, దీనిపై ఏపీ వివరణను బోర్డు కోరిందని, అయితే ఇప్పుడు అధికారికంగా జీవో వచ్చినందున తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. 3 టీఎంసీలతో చేపట్టే లిఫ్టు పథకం ముమ్మాటికీ కొత్తదేనని, దీనికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలని చెప్పామన్నారు. ఈ సందర్భంగానే తమ వాటా 512 టీఎంసీల నుంచే నీటిని వినియోగిస్తామని ఏపీ అంటోంది కదా అని ప్రశ్నించగా.. ‘ఏపీ తమ వాటా మేరకు నీటిని వాడుకుంటే అభ్యంతరం లేదు. అయితే అంతే నీటిని వాడుకుంటున్నారన్న దానికి సరైన విధానం లేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ పెట్టాలని చెప్పినా అది పూర్తిగా అమల్లోకి రాలేదు. అక్కడి నీటి వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదు. మాటల్లో చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటైతే సమస్యే కదా’అని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం మేరకు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర కేటాయింపులున్నాయని, అయితే పరీవాహకం ఆధారంగా చూస్తే తెలంగాణకు సైతం వాటా పెరగాల్సి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ ముందు తాము పోరాడుతున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో భారీ వరదలు వచ్చాయని, అలా వచ్చినప్పుడు సమస్య లేదని, అదే 2017, 2018లో వరద లేక క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలానికి వరద రాకుంటే తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలకు నీరందడం కష్టం అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రాజెక్టులను ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. -
వరద నీటిని ఒడిసి పడదాం
సాక్షి కడప : ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, వరద వచ్చిన 40 – 50 రోజుల్లోపే ఆ నీటిని ఒడిసి పట్టేందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వరద జలాలు సముద్రంపాలు కాకుండా ప్రాజెక్టులను నీటితో నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. రూ.2,300 కోట్లతో చేపట్టిన రాజోలి ప్రాజెక్టు, జొలదరాశి ప్రాజెక్టు, కుందూ – బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకాలతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సోమవారం మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా వుందని, ఆ పరిస్థితిని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి నీటిని బల్లేపల్లె నుంచి బనకచర్ల వరకు.. పెన్నా బేసిన్‌కు తరలించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందు కోసం సుమారు రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పగానే ప్రతిపాదనలు రూపొందించి రెండు మూడు నెలల్లో టెండర్లకు సన్నద్ధం కావాలని ఆదేశించామన్నారు. తద్వారా కరువు ప్రాంతాలకు నీటిని తరలించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏడాదికేడాది తగ్గుతున్న నీటి లభ్యత ‘‘కృష్ణా నది నుంచి శ్రీశైలానికి ఎంత నీరు వస్తోందనే విషయమై సీడబ్ల్యూసీ లెక్కలను పరిశీలిస్తే 47 సంవత్సరాల్లో సగటున 1,200 టీఎంసీలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత పదేళ్లలో 600 టీఎంసీలు, ఐదేళ్లలో అయితే కేవలం 400 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన ఏటా శ్రీశైలానికి రావలసిన నీటి లభ్యత తగ్గిపోతోంది. దీంతో దుర్భిక్ష పరిస్థితిలో వ్యవసాయం సాగుతోంది. ఈ పరిస్థితిలో రైతులకు మేలు జరగాలంటే కచ్చితంగా గోదావరి జలాలు సముద్రంపాలు కాకుండా సంరక్షించాల్సిందే. గత ప్రభుత్వాల వల్ల అపార నష్టం గడచిన కొన్నేళ్లుగా అనేక పరిస్థితులను చూశాం. ఎందుకు నీటిని ఒడిసి పట్టలేకపోయామని చూస్తే గత ప్రభుత్వాల అలసత్వం అని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే మనకున్న కాలువల ద్వారా నీటిని పరుగెత్తించలేకపోయాం. అందువల్లే ఇవాళ డ్యాముల్లో నీరు కనిపించడం లేదు. కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు ఇచ్చి వుంటే రిజర్వాయర్లలో నీరు నింపుకునేందుకు ఆస్కారముండేది. సర్వేలు, నష్టపరిహారం, పునరావాసం, ప్రదేశాలు గుర్తించడం వంటివి 8 నుంచి 10 నెలల్లో చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం కనీసం ఈ పని చేసి ఉన్నా, ఇవాళ సీమలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉండేవి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకముందే మొత్తం ప్రాజెక్టుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక రూపొందించాం. మీ రుణం తీర్చుకునే అవకాశం దొరికింది మీ బిడ్డ మీ అందరి దీవెనలతో ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులకు జీవో జారీ చేసి మనందరినీ వదిలి వెళ్లారు. ఆయన స్థానంలో నేను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మీ బిడ్డగా మీ రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఇదే రోజు.. 2008 డిసెంబర్ 23న నాన్న గారు ఈ ప్రాజెక్టులకు జీఓ ఇచ్చారని కలెక్టర్ చెప్పారు. ఇది యాదృచ్ఛికమే అయినా, ఇదే రోజు ఈ ప్రాజెక్టులకు నేను శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే నాన్న గారు తలపెట్టిన ఈ రెండు ప్రాజెక్టులను తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో ఈ ఆరు నెలల కాలంలో కళ్లెదుటే వరద నీరు తరలిపోతున్నా ప్రాజెక్టులను పూర్తిగా నింపలేకపోయాం. గండికోట పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలైతే కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. నా సొంత నియోజకవర్గమైన పులివెందులలోని చిత్రావతి 10 టీఎంసీల సామర్థ్యముంటే కేవలం 6 టీఎంసీలు మాత్రమే నింపాం. పక్కనే ఉన్న బ్రహ్మంసాగర్ 17 టీఎంసీల సామర్థ్యమైతే ఇంతగా నీరు వచ్చినా 8 టిఎంసీల నీటిని మాత్రమే తెచ్చుకోగలిగాం. వరద వచ్చినా, రిజర్వాయర్లు ఉన్నా నింపుకోలేని పరిస్థితిపై అధికారులు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయా. అందుకే గత ప్రభుత్వాల అలసత్వాన్ని పక్కనబెట్టి రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తిగా నీటితో నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళిక రూపొందించాం’’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మంత్రులు సురేష్, అనిల్‌కుమార్, కడప, నంద్యాల ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాథ్ దాస్, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య, గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, కడప, కర్నూలు కలెక్టర్లు హరికిరణ్, వీరపాండ్యన్, వైఎస్సార్ జిల్లా డీసీసీబీ చైర్మెన్ ఇరగంరెడ్డి తిరిపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలువల సామర్థ్యం పెంపు ఇలా.. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు తెలుగుగంగ కాలువ సామర్థ్యాన్ని కూడా 11,500 క్యూసెక్కుల నుంచి 18 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► కేసీకెనాల్, నిప్పుల వాగు కాలువల సామర్థ్యాన్ని 12,500 క్యూసెక్కుల నుంచి 35 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ కాలువల సామర్థ్యాన్ని 21,700 నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► అవుకు నుంచి గండికోటకు వెళ్లే కాలువ సామర్థ్యాన్ని 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుకుంటూవెళతాం. ► గండికోట నుంచి వెళ్లే కాలువల సామర్థ్యాన్ని 4 వేల నుంచి 6 వేల క్యూసెక్కులకు, గండికోట నుంచి చిత్రావతికి వెళ్లే కాలువను 2 వేల నుంచి 4 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ► గండికోట నుంచి పైడిపాళెం కాలువ సామర్థ్యాన్ని 1000 నుంచి 2500 క్యూసెక్కులకు పెంచుతాం. ► ఇందుకోసం దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చవుతుంది. వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి, టెండర్లకు సన్నద్దం కావాలని ఆదేశించాం. సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇంకా ఇలా.. ► కడప రిమ్స్‌లో రూ.107 కోట్లతో క్యాన్సర్ కేర్ సెంటర్, రూ.175 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్, రూ.40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన. ► కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులివీ.. ► కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో కుందూనదిపై రూ.1357 కోట్లతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి ప్రాజెక్టు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వద్ద రూ.312 కోట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో జొలదరాశి ప్రాజెక్టు. ► దువ్వూరు మండలం జొన్నవరం వద్ద రూ.564 కోట్లతో కుందూ నది నుంచి తెలుగంగ ఎస్ఆర్–1 ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీటిని అందించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగుగంగ కింద 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లోని తాగునీటి అవసరాలు తీరతాయి. రాయలసీమలో సాగునీటి కాలువల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. భారీగా వరద వచ్చినా, పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను నింçపుకోలేని దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం. రాబోయే రోజుల్లో కృష్ణా నదికి వరద వచ్చిన 40 – 50 రోజుల్లోనే మొత్తం రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. సీమతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని ప్రాజెక్టులనూ నింపుతాం. ఈ ఆరు నెలల కాలంలో అనేక ఆశ్చర్యకర విషయాలు చూశాం. మన కళ్ల ఎదుటే శ్రీశైలం గేట్లను ఎనిమిదిసార్లు ఎత్తడం చూశాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు సముద్రంలో కలవడమూ చూశాం. ఎన్నడూ లేని విధంగా కృష్ణా నది నిండుగా ప్రవహించినా, మన ఖర్మ కొద్దీ గత ప్రభుత్వ తీరు వల్ల మన ప్రాంతంలోని ప్రాజెక్టులు నిండకపోవడం కూడా చూశాం. -
ఎత్తిపోతలకు గట్టి మోతలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే ఏటా విద్యుత్ బిల్లులు తడిసి మోపెడు కానున్నాయి. యావత్ రాష్ట్రానికి ఏడాది పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అవుతున్న ప్రస్తుత వ్యయం కన్నా ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లు ల వ్యయం అధికం కానుంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, తుపా కులగూడెం, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు తదితర ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయితే ఏటా వాటి నిర్వహణకు 38,947.83 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కానుంది. ఎత్తిపోతల పథకాల విద్యుత్ ధర యూనిట్‌కు రూ.5.80 ఉండగా, ఏటా 38,947.83 ఎంయూల విద్యుత్ సరఫరా చేస్తే రూ.30,317.43 కోట్ల మేర ఎనర్జీ చార్జీలు కానున్నాయి. దీనికి రూ.2,203.01 కోట్ల డిమాండ్ చార్జీలు కలిపితే మొత్తం రూ.34,723.71 కోట్ల మేర కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఎత్తిపోతల పథకాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, ట్రాన్స్‌కో రిటైర్డు సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.పెంటారెడ్డి స్వయంగా ఈ విషయాన్ని నిర్ధారించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాలపై ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని ఇంజనీర్స్ భవనంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కాపీ ‘సాక్షి’చేతికి చిక్కింది. ఎత్తిపోతల పథకాల కరెంటు బిల్లు ఏటా రూ.34,723.71 కోట్లు అవుతుందని ఆయన అంచనా వేయగా.. 2018–19లో తెలంగాణకు విద్యుత్ సరఫరాకు రూ.31,137.99 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) వార్షిక టారిఫ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని కోటీ 49 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, వీధి దీపాలు, హెచ్‌టీ తదితర అన్ని రకాల కేటగిరీల విద్యుత్ సరఫరా వ్యయం కంటే ఎత్తిపోతల పథకాలకు చేసే విద్యుత్ సరఫరా వ్యయమే ఎక్కువన్న మాట. పంపులు నడిచినా, నడవకపోయినా బిల్లులు కృష్ణా, గోదావరి నదుల్లో 60 నుంచి 120 రోజులు మాత్రమే వరద ప్రవాహం ఉంటుంది. గరిష్టంగా 4 నెలల పాటే ఎత్తిపోతల పథకాల పంపులు నడుస్తాయి. మిగతా 8 నెలలు ఖాళీగానే ఉంటాయి. అయితే పంపులు నడిచినా, నడవకపోయినా ఏడాదిపాటు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. ప్రతి నెలా వినియోగించిన విద్యుత్ మొత్తానికి ఎనర్జీ చార్జీలతో పాటు కిలోవాట్‌కు రూ.165 చొప్పున విద్యుత్ లోడ్‌కు డిమాండ్ చార్జీలు కలిపి విద్యుత్ బిల్లులు జారీ కానున్నాయి. ఎత్తిపోతల పథకాల పంపులు నడిచిన కాలంలో రూ.21,731.11 కోట్ల ఎనర్జీ చార్జీలు, డిమాండ్ చార్జీలు రూ.1,756.14 కోట్లు కానున్నాయి. పంపులు నడిచే 4 నెలలకు రూ.23,487.25 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 8 నెలలకు లోడ్ సామర్థ్యంలో 20 శాతం ఎనర్జీ, డిమాండ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, పంపులు నడవకపోయినా రూ.8,586.32 కోట్ల ఎనర్జీ చార్జీలు, రూ.447 కోట్ల డిమాండ్ చార్జీలు కలిపి రూ.9033.32 కోట్లు చెల్లించాల్సిందేనని పెంటారెడ్డి పేర్కొన్నారు. చార్జీలు తగ్గించాలి... రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు పెనుభారంగా మారే పరిస్థితి ఉండటంతో వాటికి తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయాలని పెంటారెడ్డి కోరుతున్నారు. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.5.80 నుంచి రూ.3.50కు తగ్గించడంతో పాటు లోడ్‌పై వేయాల్సిన డిమాండ్ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఎత్తిపోతల పథకాలు 4 నెలలే నడవనున్న నేపథ్యంలో సీజనల్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.4.50 చొప్పున విధిస్తున్న చార్జీలను వర్తింపజేస్తే బాగుంటుందన్నారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలను తగ్గిస్తే ప్రయోజనం ఉండదని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. నీటిపారుదల శాఖ చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు మాత్రమే తగ్గుతాయని, తగ్గించిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి సబ్సిడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించుకోవడమే దీనికి పరిష్కారమని సూచిస్తున్నారు. -
రైతుల చేతికే తాళాలు
సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశాలతో మండల పరిధిలోని రామచంద్రాపురం ఎత్తిపోతల పథకం మరమ్మత్తులకు రూ.80 లక్షలతో అంచనాలు వేసి నిధులు మంజూరుకు కలెక్టర్‌కు నివేదించనున్నామని ఎత్తిపోతల పథకం డీఈఈ ఎన్.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఈ ఎత్తిపోతల పథకంతోపాటు పలు పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం ఎత్తిపోతల పథకం తాళాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండడం వాస్తవమేనన్నారు. వీటిని తీసుకుని పథకం చక్కగా నిర్వహిస్తున్న రైతులకు అప్పజెప్పనున్నామన్నారు. ఇటీవల ఎత్తిపోతల పథకం ఈఈ లక్ష్మీపతితోపాటు పలువురు అధికారులతో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారన్నారు. పథకం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. ఈ పథకం సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 250 ఎకరాలకు మాత్రమే అందిస్తుందని డీఈఈ తెలిపారు. 150 హెచ్‌పీ గల రెండు మోటార్లలో ఒకటి మాత్రమే (75 హెచ్‌పీ) పని చేస్తుందన్నారు. వీటి మరమ్మతులతోపాటు పైపులైన్లు కూడా బాగుస్తామన్నారు. గతంలో ఆర్సీసీ పైపులు ఉండేవని వీటి స్థానంలో పీసీఎస్ పైపులు వాడనున్నామన్నారు. పంపు హౌస్ నుంచి సుమారు 100 మీటర్లు దాటిన తరువాత పైపులైన్లు మరమ్మతులకు గురైనట్లు తెలిపారు. ఏఈలు, రైతులు పాల్గొన్నారు. అధికారులు, రైతులతో మాట్లాడుతున్న డీఈఈ శ్రీనివాసరావు -
జూరాల జలజల..రైతు గలగల
నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో చాలా వరకు సమస్యలు గత పాలకుల హయాం నుంచీ తిష్ట వేసుకుని కూర్చున్నాయి. దాదాపు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన హామీలేవీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఆయా సమస్యలతో ఇప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు సహవాసం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ దాదాపుగా అవే అంశాలు, సమస్యలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి తప్ప సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని జనం అంటున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు దశాబ్దాలుగా అమలుకు నోచుకోవడం లేదు. నెరవేరని హామీల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి కావడం గమనార్హం. మరికొన్ని స్థానిక సమస్యలు. అయితే టీఆర్ఎస్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా ఇదే అంశం త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కలిసి రానుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. సాగు..బాగు గతంలో జలయజ్ఞం పేరుతో వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులు నేడు సత్పలితాలను ఇస్తున్నాయి. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచడం, ఎత్తిపోతల పథకాలు చేపట్టడం వల్ల నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఆయకట్టు పెరిగింది. మిగతా పెండింగ్ పనులను పూర్తి చేస్తే రైతులకు పూర్తి ప్రయోజనం కలగడంతో పాటు ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలుగుతుందని అంటున్నారు. రూపం దాలుస్తున్న ‘కేఎల్ఐ’ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడిప్పుడే ఓ రూపం వస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 25 టీఎంసీల నీటిని వినియోగించుకొని నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా నిర్ధేశిత ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రణాళిక ఉంది. ఇటీవల కేఎల్ఐ సామార్థ్యాన్ని 40 టీఎంసీలకు పెంచారు. కాని రిజర్వాయర్లు, కాల్వలు పూర్తికాకపోవడం వల్ల కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల పరిధిలో 70 శాతం వరకు సాగునీరు అందుతుంది. మరోవైపు అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు కేఎల్ఐ సాగునీరు అండటం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు కేంద్రబిందువుగా ఉన్న జూరాల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.1650 కోట్లు ఖర్చు చేశారు. జూరాల ద్వారా సాగుకు నీటి విడుదల ప్రారంభమై 19 ఏళ్లు గడిచాయి. అయితే చివరి ఆయకట్టుకు ఇప్పటికీ నీరు అందని పరిస్థితి.. ఇంకా లైనింగ్ పనులు, ఫీల్డ్ చాన్స్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల్లో ఎదురౌతున్న అడ్డంకులను అధిగమించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు 55 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజోలి మండలంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులు తొలివిడత పూర్తయ్యాయి. మొదటి లిఫ్ట్ ద్వారా సాగునీటిని కూడా విడుదల చేశారు. కాని రెండో విడతలో చేపట్టాల్సిన రిజర్వాయర్లు పూర్తయితేనే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుంది. నడిగడ్డకు అత్యంత కీలకమైన నెట్టెంపాడు ప్రాజెక్ట్ కింద ఏడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా 20 టీఎంసీల నీటిని ఉపయోగించుకొని మొత్తం రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. పనులింకా కొనసాగుతున్నాయి. భూ సేకరణ కూడా పూర్తి కావాల్సి ఉంది. గత బడ్జెట్లో నెట్టెంపాడుకు రూ.200 కోట్లు కేటాయిస్తే రూ.45.92 కోట్లు ఖర్చు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కూడా పూర్తయ్యాయని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. జాతీయ హోదా కల్పిస్తే మరింత ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయాలని ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులను 18 ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నారు. ♦ గట్టు ఎత్తిపోతల పథకం, చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు,ధరూర్, కేటిదొడ్డి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల మొదటిదశ పూర్తయినప్పటికి రిజర్వాయర్ల నిర్మాణం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ♦ కొల్లాపూర్ నియోజకవర్గం పరి«ధిలో సోమశీల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణం హామీని నెరవేర్చడంలో గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి ఆనవాళ్లివి.. ♦ నల్లమల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలో కాగితపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామనే 40 ఏళ్లుగా కార్యరూపం దాల్చడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా చెంచుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు నిర్మించలేదు. ♦ జడ్చర్ల– నంద్యాల రైల్వేలైన్, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం వంటివీ నెరవేరలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద బ్రిడ్జికి 2008లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ముంపు నిర్వాసితులకు సంబంధించి 98జీఓ అమలు కావడం లేదు. 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, 35 మందికి మాత్రమే ఇచ్చారు. 1983 నుంచి ఈ సమస్య పెండింగ్‌లోనే ఉంది. ♦ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు లేవు. ♦ తుంగభద్ర నదిపై ఏపీకి తెలంగాణకు వారధిగా ఆలంపూర్ వద్ద నిర్మిస్తున్న ర్యాలంపాడు బ్రిడ్జి, అయిజ మండలం నాగులదిన్నెవద్ద నిర్మిస్తున్న వంతెనల నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. ♦ అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ♦ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాకు చేనేత పార్కు మంజూరైంది. అసెంబ్లీ ఎన్నికల ముందుకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇటిక్యాల వద్ద నేషనల్ ఫుడ్‌పార్కు మంజూరైంది. ఇవి అందుబాటులోకి వస్తే ఎందరికో మేలు జరుగుతుంది. రైలు కూత పెట్టేది ఎప్పుడో.. నాలుగు దశాబ్దాలుగా గద్వాల–మాచర్ల రైల్వేలైన్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారి, పోటీచేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్‌ను సాధిస్తామని చెబుతున్నా.. 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అయ్యింది. గద్వాల–వనపర్తి– నాగకర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం 1980లో అప్పటి ఎంపి మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డీపీఆర్ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో కేంద్రం గద్వాల– మాచర్ల రైల్వేలైన్ ప్రతి పాదనలు పక్కనబెట్టి, కేవలం నల్లగొండ నుంచి మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. కొన్నేళ్ల అనంతరం గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌కు అవకాశం ఉందని ఇందుకు రూ. 1,160 కోట్లు అంచనా వేశారు. 184 కిలోమీటర్ల మేర లైన్ ఏర్పాటుకు రూ.920 కోట్లు అవసరం అవుతాయని అంచనాకు వచ్చారు. రెండు విడతలుగా ఉన్న ఈ పథకంలో మొదటి విడతగా 2002లో రాయచూర్–గద్వాల రైల్వేలైన్ పనుల పూర్తి అయ్యాయి. రెండో దశలో ఉన్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. రిజర్వాయర్లు నిర్మిస్తే మేలు.. ఆర్డీఎస్ రైతులను ఆదుకోవడానికి రిజర్వాయర్లు నిర్మించాలి. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లందక బంగారం లాంటి∙పొలాలు బీళ్లు బారుతున్నాయి. ప్రత్యామ్నాయం గా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మించడం మంచిదే. కానీ ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలంటే తప్పకుండా రిజర్వాయర్లు అవసరం. కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలి.–శ్యాంసుందర్ రావు, వేముల, ఆలంపూర్ సెగ్మెంట్ అన్ని పార్టీలవి మాటలే.. గద్వాల–మాచర్ల రైల్వేలైన్ సాధిస్తామని ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీల నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ అడుగు ముందుకు పడటంలేదు. 1980 నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది ఈ లైన్. గద్వాల–వనపర్తి– నాగకర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ వస్తే 3 రాష్ట్రాలకు రవాణా మెరుగవుతుంది. – సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఎత్తిపోతలతో తిప్పలు తప్పాయి కేఎల్ఐ ఎత్తిపోతల పథకంతో సాగు కష్టాలు తొలగాయి. కేఎల్ఐ కాల్వ పక్కనే నాకు ఐదెకరాల పొలం ఉంది. అం దులో 2.5 ఎకరాల్లో వేరుశనగ, మిగతా సగం పొలంలో వరిపంట సాగు చేశాను. గతంలో వర్షాలపై ఆధారపడి ఒక్కపంటనే సాగు చేసేవాళ్లం. కాల్వల ద్వారా సాగునీరు రావడంతో రెండు పంటలు సాగు చేస్తున్నాం. దీంతో పాటు నిరంతర విద్యుత్‌తో సమస్యలు తొలగాయి.– పస్పుల నర్సింహ, పాన్‌గల్, వనపర్తి జిల్లా