Lockdown Update
-
ఒకరికి కరోనా పాజిటివ్.. లాక్డౌన్లోకి 3 లక్షల మంది!
బీజింగ్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తాజాగా.. ఓ చిన్న నగరంలో మంగళవారం ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలటం వల్ల ఆ నగరం మొత్తం లాక్డౌన్ విధించింది జిన్‌పింగ్ ప్రభుత్వం. దీంతో 3 లక్షల మందికిపైగా లాక్డౌన్లోకి వెళ్లాల్సి వచ్చింది. హెనాన్ ప్రావిన్స్‌లోని వుగాంగ్ నగరంలో సోమవారం ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వ్యాధిని అరికట్టేందుకంటూ మూడు రోజుల లాక్డౌన్ విధించారు అధికారులు. నగరంలోని 3,20,000 మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు నగరంలోని ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. అయితే.. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను స్థానిక ప్రభుత్వ సంస్థలు అందిస్తాయని తెలిపారు. మరోవైపు.. అత్యవసర పరిస్థితిలో కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆంక్షల చట్రంలో 25 కోట్ల మంది చైనాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రకాల ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మంగళవారం 347 స్థానిక కేసులు నమోదయ్యాయి. అందులో 80 శాతానికిపైగా మందిలో ఎలాంటి లక్షణాలు లేవని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇదీ చూడండి: ప్రమాదకరంగా బీఏ5 వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకుతోంది -
ఆటో డిమాండ్‌కు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం షాక్!
న్యూఢిల్లీ: కీలక విడిభాగాల సరఫరాకు సంబంధించిన సవాళ్లు, వివిధ విభాగాల్లో డిమాండ్‌పరమైన (ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు) సమస్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వాహన రంగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో గానీ ఆటో పరిశ్రమ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ (ఫాడా) మంగళవారం ఈ విషయాలు వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, చైనాలో లాక్డౌన్ వంటి అంశాల కారణంగా కీలకమైన విడిభాగాల సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని ఫాడా పేర్కొంది. ఫలితంగా దేశీ ఆటో పరిశ్రమ రికవరీపై ప్రభావం పడనున్నట్లు వివరించింది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఫాడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. ‘వివిధ సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితం కావచ్చని భావిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద 2024 ఆర్థిక సంవత్సరంలో గానీ ఆటో పరిశ్రమ కోలుకుని, అమ్మకాలు తిరిగి కరోనా పూర్వ స్థాయికి చేరకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు గులాటీ చెప్పారు. 2020–21లో 1,52,74,314 వాహనాలు అమ్ముడవగా 2021–22లో 7.21 శాతం వృద్ధితో ఆటో విక్రయాలు 1,63,75,799కే పరిమితమయ్యాయి. చమురు ధరల సెగ.. ‘రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, చైనాలో లాక్డౌన్ వంటి ప్రతికూలతల కారణంగా దేశీ ఆటో పరిశ్రమకు సమీప భవిష్యత్తులో సవాళ్లు తప్పవు. క్రూడాయిల్ రేటు భారీగా పెరిగింది. ఇంధన ధరలు సుమారు రూ.10 వరకూ పెరిగాయి. ఇవి ఇంకా పెరుగుతాయి. ఫలితంగా సెంటిమెంటు దెబ్బతినవచ్చు‘ అని గులాటీ పేర్కొన్నారు. వాహనాల తయారీలో కీలకంగా ఉండే విలువైన లోహాలు, నియాన్ గ్యాస్ మొదలైనవి యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల నుంచే రావాల్సి ఉన్నందున ప్యాసింజర్ వాహనాల విభాగంపై ప్రభావం పడనుందని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ల సరఫరా మరింత మందగించడం వల్ల ప్యాసింజర్ వాహనాల కోసం నిరీక్షించే సమయం ఇంకా పెరిగిపోవచ్చన్నారు. టూవీలర్లపై ప్రభావం .. ముడి వస్తువుల ధరలు పెరగడం వల్ల ఆటో కంపెనీలు తమ వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని గులాటీ చెప్పారు. ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో డిమాండ్ తగ్గకపోయినప్పటికీ .. రేట్లపరంగా చాలా సున్నితంగా ఉండే ద్విచక్ర వాహనాల విభాగంపై మాత్రం కచ్చితంగా ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పీవీల రిటైల్ విక్రయాలు 14.16 శాతం వృద్ధి చెందగా, టూవీలర్ల అమ్మకాలు 4 శాతమే పెరిగాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 45 శాతం, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 50 శాతం ఎగిశాయి. కోవిడ్ వల్ల 2020–21లో విక్రయాలు గణనీయంగా పడిపోయిన ప్రభావం (లో–బేస్ ఎఫెక్ట్) వల్లే 2021–22లో కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోందని గులాటీ వివరించారు. ఇక తాజాగా మార్చి నెలను తీసుకుంటే మాత్రం .. ఫాడా గణాంకాల ప్రకారం గత నెలలో ఆటోమొబైల్ అమ్మకాలు మొత్తం మీద 3 శాతం క్షీణిచాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గతేడాది మార్చితో పోలిస్తే సుమారు 5 శాతం తగ్గి 2,71,358 యూనిట్లకు పరిమితమయ్యాయి. టూవీలర్లు 4 శాతం క్షీణించి 11.57 లక్షలుగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో సవాళ్ల కారణంగా ద్విచక్ర వాహనాల విభాగం ఇప్పటికే ఒత్తిడి లో ఉండగా, ఇంధనాల రేట్లు పెరగడం.. వాహనాల ధరల పెరగడం వంటి కారణాలతో మరింత ప్రతికూల ప్రభావం పడిందని గులాటీ చెప్పారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందవచ్చని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఎకనమీలో కరోనా కట్టడిపరమైన ఆంక్షల ఎత్తివేత, డిమాండ్ మెరుగుపడటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. సెమీకండక్టర్ల సరఫరా సంబంధించిన సవాళ్లు, రిటైల్ ఇంధన ధరల పెరుగుదల వంటి కారణాలతో అమ్మకాల పరిమాణంపై కొంత మేర ప్రభావం పడొచ్చని ఎక్యూట్ రేటింగ్స్ పేర్కొంది. సెమీకండక్టర్ల కొరతతో సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్, ఉత్పత్తి కోతలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా పీవీ అమ్మకాలు సుమారు 15 శాతం పెరిగాయని వివరించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో లో–బేస్ ప్రభావం ఇందుకు కొంత కారణమని తెలిపింది. టూవీలర్ల డిమాండ్‌పై అనిశ్చితి .. కోవిడ్ విజృంభణ సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం వల్ల అసంఘటిత రంగం .. చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఆ ప్రభావం టూవీలర్ల డిమాండ్‌పై గణనీయంగా కనిపిస్తోందని ఎక్యూట్ తెలిపింది. కోవిడ్ కట్టడిపరమైన ఆంక్షల ఎత్తివేత, వ్యవసాయ రంగ ఆదాయాలు మెరుగ్గా ఉండొచ్చన్న అంచనాలతో 2023 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ .. అది ఎప్పటికి జరుగుతుందనే దానిపై అనిశ్చితి నెలకొందని పేర్కొంది. ఇంధనాల ధరల పెరుగుదల దీనికి ఆజ్యం పోస్తోందని వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ రహదారుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుండటంతో వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ కొనసాగవచ్చని ఎక్యూట్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి చెప్పారు. 2021–22లో సీవీల అమ్మకాలు 25 శాతం వృద్ధి చెందాయి. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం, ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెరగడం వంటి అంశాలతో ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో డిమాండ్ మెరుగుపడటం ఇందుకు కారణమని చౌదరి తెలిపారు. -
శనివారం రాత్రి నుంచే పూర్తి లాక్డౌన్
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆదివారం జనవరి 23న పూర్తి లాక్డౌన్ విధించింది. అయితే ఈ లాక్డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలోనే తమిళనాడు ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జనవరి 9 నుంచి ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాక మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించింది. అయితే పాల దుకాణాలు ఏటీఎం కేంద్రాలు, ఆసుపత్రులు, సరుకు రవాణ, పెట్రోల్ బంక్‌లు అనుమతించింది. కాగా రెస్టారెంట్లు, హోటళ్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు టేకౌట్ సేవలను అందిస్తాయని తెలిపింది. ఈ మేరకు తమిళనాడులో గురువారం 24 గంటల్లో 28,561 కొత్త కోవిడ్-19 కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి: ఉగ్రరూపం దాల్చిన కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా ఎన్నంటే!) -
Telangana Cabinet Meet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై ఊహాగానాలు..
-
South Africa: నో లాక్డౌన్! ఆంక్షల్లేవ్.. కరోనా వైరస్‌తో కలిసి జీవిస్తాం..
No lockdown In South Africa: కోవిడ్ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. లాక్డౌన్ కానీ, క్వారంటైన్ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని దక్షిణాఫ్రికా తాజాగా మీడియాకు తెల్పింది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెల్పింది. ఆంక్షల విధింపు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఇతర సామాజిక అంశాలపై ప్రమాదకర ప్రభావాన్ని చూపుతున్నాయని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు జనవరి 9న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్ -19 ఆంక్షలను ప్రభుత్వం గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని, అవి కేవలం నామమాత్రపు ప్రయోజనాలను మాత్రమే ఇస్తాయన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకూ 93 వేల కోవిడ్ మరణాలు సంభవించగా, 33,60,879 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,02,476 కోవిడ్ యాక్టీవ్ కేసులున్నాయి. మొత్తం 35 లక్షల (3.5 మిలియన్లు) కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే! దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ నాలుగో వేవ్‌లో కొట్టుమిట్టాడుతోంది. కొత్త వేరియంట్ దాటికి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతుంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అధిక స్థాయి లాక్డౌన్లకు వెళ్లకుండా, తక్షణ ఆరోగ్య ముప్పు పొంచి ఉందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపిందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌కు ముందు వచ్చిన కోవిడ్ మూడు వేవ్‌లు సహజ సంక్రమణల ద్వారా రోగనిరోధక శక్తి బలం పుంజుకుందని వారు తెలిపారు. ఒమిక్రాన్ ప్రమాదాన్ని టీ సెల్ ఇమ్యునిటీ ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ దేశంలో తక్కువ స్థాయిలో నమోదవుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని అధిక రిస్క్ గ్రూపుల కోసం బూస్టర్ డోస్‌లతో సహా వ్యాక్సినేషన్ ప్రక్రియలను పెంచడం, ఐసోలేషన్ వంటి ఆచరణాత్మక విధానాలను ప్రభుత్వం ఎంచుకోవాలని నిపుణులు సూచించారు. చేతి పరిశుభ్రత, థర్మల్ స్క్రీనింగ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకపోవడం, వెంటిలేషన్ లేని ఇండోర్ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, తగినంత వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవడంపై అక్కడి ప్రభుత్వ దృష్టి నిలిపింది. చదవండి: కన్నీళ్లకు కరగని తాలిబన్లు! అతని కళ్ల ముందే.. -
సంపూర్ణ లాక్డౌన్ అమలు!
సాక్షి, చెన్నై(తమిళనాడు): రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా.. దేనికీ అనుమతి లేదని పోలీసుయంత్రాంగం ప్రకటించింది. దీంతో శనివారం చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. ఇక రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేలకు అటుఇటుగా.. కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఆదివారం లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని వారు సూచిస్తున్నారు. శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు. దీంతో శనివారం మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్లలో రద్దీ నెలకొంది. లక్ష మందికి రెండో డోస్... 18వ విడతగా రాష్ట్రంలో శనివారం వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. 50 వేల శిబిరాల్లో లక్షలాది మందికి రెండో డోస్ టీకా వేశారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్లలోపు బాల, బాలికలకు సైతం ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక, చెన్నై విమానాశ్రయంలో కరోనా, ఫీవర్ టెస్టులు విస్తృతం చేయడం కోసం ప్రత్యేకంగా కొత్త ఏర్పాట్లు జరిగాయి. చెన్నైలో మాస్క్ ధరించని 7,616 మందికి జరిమానా విధించి రూ. 15 లక్షలు జరిమానా వసూలు చేశారు. తమిళనాడులో మళ్లీ పూర్తిస్థాయిలో లాక్డౌన్ అవసరం రాదని.. కరోనా ప్రజల జీవితంలో కలిసి పయనిస్తుందని శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇక, చెన్నైలో కరోనా కట్టడి లక్ష్యంగా చర్యలు విస్తృతం చేయడం కోసం 15 మంది ఐఏఎస్‌లతోప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే చెన్నైలో ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళల్లో రెండు డోస్‌ల టీకా వేయించుకున్న వారినే సోమవారం నుంచి అనుమతించనున్నారు. చదవండి: కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు -
లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు
Maharashtra's Omicron tally breached the 100 mark on Friday ముంబై: రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య శుక్రవారం సెంచరీ దాటింది. దేశంలోనే తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందని సర్వత్రా చర్చకొనసాగుతోంది. ఐతే మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే శనివారం లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులకు చేరుకుంటే తప్ప, అప్పటివరకూ లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని మీడియాకు వెల్లడించారు. మరోవైపు కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ నిర్దిష్ట మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. డిసెంబర్ 24-25 రోజుల్లో విధించిన రాత్రి కర్ఫ్యూ (రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు) విధించింది. అంతేకాకుండ బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. పబ్లిక్ ఫంక్షన్లకు సంబంధించి ఇండోర్ వెడ్డింగ్లలోనైతే 100 మంది, ఔట్‌డోర్ వెడ్డింగ్‌లలో 250 కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు. ఇతర సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు ఇవే సంఖ్యలు వర్తిస్తాయి. రెస్టారెంట్లు, జిమ్‌లు, స్పాలు, సినిమాహాళ్లు, థియేటర్లు 50% సామర్థ్యంతో పని చేస్తూనే ఉంటాయి. వీటితోపాటు పలు ఆంక్షలను పరిస్థితిని బట్టి మరింత కఠినతరం చేయడానికి, సడలించడానికి స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. కాగా శనివారం ఉదయం నాటికి మహారాష్ట్రలో 12,108 కరోనా క్రియాశీల కేసులు, 110 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. చదవండి: మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం.. -
కేరళలో మళ్లీ ఆదివారం లాక్ డౌన్
-
ఈనెల 23 వరకు లాక్డౌన్.. సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అదనపు ఆంక్షలు విధిస్తూ లాక్‌డౌన్‌ను ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడిగించింది. అదేవిధంగా వారాంతం మూడు రోజులు ప్రార్థనాలయాల్లోకి భక్తుల ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ నెల 16 నుంచి వైద్య, నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వైద్య నిపుణులతో కలిసి జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు, వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు, క్వారంటైన్ జోన్ల స్థితిగతులపై సమీక్షించారు. సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు రాష్ట్రంలో పాఠశాలలు తెరవాల్సిన ఆవశ్యకతను వైద్య నిపుణులు ముఖ్యమంత్రికి వివరించారు. నెలల తరబడి ఇళ్లలోనే ఉంటూ ఆన్లైన్ పాఠాలు వినడం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని వివరించారు. అంతేగాక ఆన్లైన్ క్లాసులు అందరికీ అందుబాటులో లేవని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను విన్న సీఎం స్టాలిన్ సెపె్టంబర్ 1వ తేదీ నుంచి 9, 10, 11, 12 తరగతులను ఒకే సమయంలో 50 శాతం మంది విద్యార్థులతో నిర్వహించాలని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూ ళ్లు తెరవవచ్చని చెప్పారు. స్కూళ్లు తెరిచే విషయంలో చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వైద్య, నర్సింగ్ కళాశాలలు, వైద్య సంబంధిత కాలేజీలు ఈ నెల 16వ తేదీ నుంచి పనిచేసేందుకు అనుమతించారు. ఇంకా కొన్ని శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాలు మూత. మాంసం, చేపల దుకాణాలను వేర్వేరుగా నిర్వహించాలి. దుకాణాల ప్రవేశద్వారం వద్ద వినియోగదారులు భౌతికదూరం పాటించడంతోపాటు శానిటైజర్ వాడడం, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలకు చర్యలు. స్వేచ్ఛగా బయటి గాలి వచ్చేలా దుకాణాలు, షోరూంల నిర్వహణ. క్వారంటైన్ జోన్లలో అత్యవసర పనుల కోసమే జనసంచారానికి అనుమతి. వైద్యపరమైన సేవలకు మినహా ఇతరుల రాకపోకలపై నిషేధం. కరోనా లక్షణాలు కనపడగానే సమీపంలోని ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు తప్పనిసరి. ఇవేగాక ఇప్పటి వరకు అమలులో ఉన్న ఆంక్షలు యధాతథంగా కొనసాగుతాయి. 30 నిమిషాల్లో ఫలితం వచ్చేలా విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చే ప్రయాణికులకు ‘ర్యాపిడ్ కరోనా టెస్ట్’ పరికరం ద్వారా పరీక్షలు జరిపి 30 నిమిషాల్లోనే ఫలితాలు అందించే విధానాన్ని చెన్నై విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రూ.900 వసూలు చేసి ఆరీ్టపీసీఆర్ పరీక్షలు చేసే విధానం కొంతకాలంగా కొనసాగుతోంది. ఫలితాల వెల్లడికి సుమారు 4 గంటలు పడుతోంది. ఇకపై అంత జాప్యం ఉండదని, ‘ర్యాపిడ్ కరోనా టెస్ట్’ పరికరాన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చామని చెన్నై విమానాశ్రయ అధికారి తెలిపారు. చదవండి: New Zonal Policy: తెలంగాణ ఉద్యోగుల కేడర్లు ఖరారు -
Unlock 4: థియేటర్లు, డిగ్రీ కాలేజీలకు ఓకే
సాక్షి, బెంగళూరు: అన్‌లాక్–4 వెసులుబాట్లు అందుబాట్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నేపథ్యంలో గత మూడునెలల నుంచి మూతబడిన సినిమా థియేటర్లను సగం సీట్లతో తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే డిగ్రీ, ఆపై ఉన్నత విద్యాసంస్థలకూ సై అంది. ఆదివారం కావేరి నివాసంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సీనియర్ మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నేటి నుంచే థియేటర్లు ఏప్రిల్‌లో కోవిడ్ సెకెండ్ వేవ్ విరుచుకుపడడంతో రాష్ట్రమంతటా సినిమా థియేటర్లకు తాళాలు వేశారు. స్కూళ్లు, కళాశాలలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు అదుపులోకి రావడంతో అన్‌లాక్– 4కు గేట్లు తీశారు. సోమవారం నుంచి సగం మంది ప్రేక్షకులతో సినిమా టాకీస్‌లను నడుపుకోవచ్చు. ఈ నెల 26 నుంచి డిగ్రీ, పీజీ తదితర కాలేజీలను ప్రారంభించవచ్చు. అయితే కాలేజీకి హాజరయ్యే విద్యార్థులు కనీసం ఒక డోస్ కోవిడ్ టీకా అయినా తీసుకుని ఉండాలి. పబ్, క్లబ్, ఈతకొలనుల మూసివేత కొనసాగుతుంది. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. పర్యాటకంపై సడలింపు యోచన పర్యాటక ప్రాంతాల్లో కరోనా నియమాలను సడలించాలని సర్కారు నిశ్చయంతో ఉంది. లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉవ్విళ్లూరుతుంటారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉండడంతో పర్యాటక కేంద్రాల్లో విశ్రాంతి తీసుకుంటూ పని చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కొడగు, చిక్కమగళూరు, మైసూరు ప్రాంతాల్లో అడవులు, రిసార్టు టూర్లకు గిరాకీ పెరుగుతోంది. చారిత్రక ప్రాంతాలైన హంపీ, హళేబీడు, బాదామి తదితర ప్రాంతాల్లోనూ పర్యాటకుల సంఖ్య పెరిగింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పర్యాటక రంగాన్ని ఆదుకునేలా ఆంక్షలను సడలించి ప్యాకేజీలను ప్రకటించాలని సర్కారు భావిస్తోంది. మెడికల్ కాలేజీలకూ అనుమతి యశవంతపుర: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుమతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి కే.సుధాకర్ ట్విట్టరలో తెలిపారు. ఆయుష్, దంతవైద్య, పారా మెడికల్ కాలేజీలను తెరుచుకోవచ్చని చెప్పారు. కరోనా టీకా వేయించుకున్న విద్యార్థులు, బోధన సిబ్బంది మాత్రమే హాజరు కావాలన్నారు. మూడో వేవ్‌కు ముందుజాగ్రత్తగా ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లల చికిత్సలకు అన్నీ సిద్ధం చేసినట్లు తెలిపారు. -
లాక్డౌన్ పొడిగింపు: ఈ నెల 31 వరకు వాటికి మాత్రమే అనుమతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా తగిన ఆంక్షలతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈనెల 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. గత సడలింపులు, ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంటూ అదనపు సడలింపులను శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటలతో ముగుస్తున్న దృష్ట్యా ఆ తరువాత నుంచి ఈనెల 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ కిందివాటిపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. అదే విధంగా.... రాష్ట్రాల మధ్య ప్రభుత్వ, ప్రయివేటు బస్సుల రాకపోకలు. కేంద్రప్రభుత్వం అనుమతించిన మార్గాల్లో మినహా అంతర్జాతీయ విమాన సేవలు, థియేటర్లు, బార్లు, ఈతకొలనులు, ప్రజలు పాల్గొనే సభలు, సమావేశాలు, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు, కాలేజీలు, పాఠశాలలపై నిషేధం ఉందని తెలిపారు. వివాహాలకు 50 మంది, అంతిమసంస్కారాలకు 20 మందికి మాత్రమే అను మతని అన్నారు. షోరూంలు, షాపింగ్ మాళ్లలో ఏసీ వినియోగంలో ఉంటే తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. ఒకేసారి పెద్ద సంఖ్యలో వినియోగదారులను అనుమతించరాదు. విధులు నిర్వర్తించేచోట ప్రజలు, ఉద్యోగులు మాస్క్, భౌతికదూరం తప్పనిసరి. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాల పంపిణీ నిర్వాహణ పనులకు అవసరమైన మేర పాఠ శాలలకు వెళ్లేందుకు అధ్యాపకులకు అనుమతి ఉందని ఆయన వివరించారు. -
జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగింపు: వాటికి మాత్రమే అనుమతి
చెన్నై: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. అయితే, హోటళ్లు, టీ షాపులు, బేకరీలు, చిరు తిండ్ల షాపులు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేలా సడలింపులు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే, భైతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని పునరుద్ఘాటించింది. అదే విధంగా.. పుదుచ్చేరితో రవాణా కార్యకలాపాలు ముఖ్యంగా బస్సు సర్వీసులు పునః ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇక, పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, మద్యం దుకాణాలు, స్విమ్మింగ్ ఫూల్స్, జూలు తదుపరి ఆదేశాల వరకు మూసే ఉంటాయని స్టాలిన్ సర్కారు స్పష్టం చేసింది. కాగా తమిళనాడులో శుక్రవారం కొత్తగా 3039 కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా, 69 మంది కోవిడ్ బాధితులు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 25 లక్షల 13 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
సడలింపులు: థియేటర్లు, పబ్బులకు అనుమతి లేదు!
బెంగళూరు: కర్ణాటకపై పంజా విసిరిన కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించింది. వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. అన్‌లాక్ ప్రక్రియ మూడో దశలో భాగంగా జూలై 5 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తిరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా... తాజా నిబంధనల ప్రకారం.. జిల్లా యంత్రాంగాలు ఆయా చోట్ల ఉన్న కరోనా పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని సడలింపులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సడలింపులు.. నిబంధనలు ఇలా! 1. థియేటర్లు, సినిమా హాళ్లు, పబ్బులు తెరిచేందుకు అనుమతి లేదు. 2. క్రీడా శిక్షణకై ఉద్దేశించిన స్విమ్మింగ్‌పూల్స్ మాత్రమే ఓపెన్ చేయాలి. 3. ప్రాక్టీసు కోసం మాత్రమే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు తెరవాలి. 4. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, ఇతరత్రా వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం పూర్తిగా నిషిద్ధం. 5. వివాహాది శుభకార్యాలకు కేవలం 100 మంది అతిథులకు మాత్రమే అనుమతి. 6. అంత్యక్రియలకు అత్యధికంగా 20 మందికి అనుమతి. 7. మందిరాలు, ప్రార్థనా స్థలాల దర్శనానికి మాత్రమే అనుమతి. సేవల్లో పాల్గొనరాదు. 8. సామర్థ్యం ఉన్నంత మేర ప్రజా రవాణా సక్రమంగా నిర్వహించుకోవచ్చు. 9. షాపులు, రెస్టారెంట్లు, మాల్స్, ప్రైవేటు ఆఫీసుల్లో కరోనా నిబంధనలు పాటించనట్లయితే విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కఠిన చర్యలు. 10. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేత. 11. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ప్యూ కొనసాగుతుంది. -
కొత్తగా 133 కేసులు: సినిమా హాళ్లు, జిమ్‌లు తెరవచ్చు!
లక్నో: అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని నిబంధనలు సడలించింది. సినిమా హాళ్లు, మల్టీపెక్సులు, క్రీడా మైదానాలు, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జూలై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సడలింపులు అమల్లో వస్తాయని తెలిపింది. కోవిడ్-19 అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్ల ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోయారని, సోమవారం నుంచి వారు థియేటర్లు తెరవవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. తాజా సడలింపుల ప్రకారం... వారంలో ఐదు రోజుల పాటు 50 శాతం సామర్థ్యంతో.. ఉదయం 7 గంటల నుంచి జిమ్‌లు, సినిమా హాళ్లు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఉంటుంది. కాగా కోవిడ్ వ్యాప్తి నివారణ సంబంధిత కమిటీల చీఫ్‌లతో సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సమావేశమయ్యారు. కోవిడ్ ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో నిబంధనలు సడలించాలనే నిర్ణయానికి వచ్చిన సీఎం యోగి.. ప్రజావసరాలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక జూన్ 21 నుంచే 50 శాతం కెపాసిటీతో రెస్టారెంట్లు, మాల్స్ ఓపెన్ చేసేందుకు యోగి సర్కారు అనుమతించిన విషయం తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో యూపీలో 133 కేసులు వెలుగుచూడగా, 228 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య 58 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 0.05 శాతంగా ఉంది. -
ఏపీలో ఈనెల 30 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు
-
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత
అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. సామాజిక, రాజకీయ, మతపర, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోయాయి. ప్రార్థన స్థలాలు, సినిమా హాళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, పబ్స్, జిమ్‌లు, స్టేడియాలు తెరుచుకోవచ్చు. వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యపై పరిమితి ఉండదు. ‘‘లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయినట్టు కాదు. జనజీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ నిబంధనలను విధిగా అనుసరించాలి. పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి..’’ - ప్రజలకు మంత్రివర్గం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను ఉప సంహరిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌కు ముందున్నట్టుగా రోజువారీ వ్యవహారాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పునః ప్రారంభించుకోవచ్చని తెలిపింది. శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ రాత్రి 8.30 గంటల వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందంటూ, కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ వైద్యారోగ్య శాఖ అందించిన నివేదికలను పరిశీలించింది. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన అంశంపై పరిశీలన జరిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వేగంగా నియంత్రణలోకి వచ్చిందన్న అంశాలను నిర్ధారించుకుని.. లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. వెంటనే ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం మే 12 నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఉదయం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపు ఇవ్వగా.. తర్వాత ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల వరకు పెంచారు. తాజాగా పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. లాక్డౌన్ ఎత్తివేస్తూ, దానికి ముందు కొనసాగిన అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. జూన్ 1 నుంచే విద్యా సంస్థలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్లైన్ క్లాసుల కొనసాగింపు తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని విద్యా శాఖను మంత్రివర్గం ఆదేశించింది. విద్యార్థులకు భౌతిక తరగతులు (ఫిజికల్ క్లాసెస్) ప్రారంభించాలని సూచించింది. లాక్డౌన్ ఎత్తివేతతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగినా.. అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై మాత్రం స్పష్టత రాలేదు. గ్రామాల్లో ఆధునిక సెలూన్లు యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలోనే నిర్ణయించిన ప్రకారం క్షౌ ర వృత్తిలోని నాయీ బ్రాహ్మణులకు గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగా.. చేనేత, గీత కార్మికులు, ఇతర వృత్తి కులాల వారికి సైతం త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించింది. మత్స్య, గీత కార్మికులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, ఎంబీసీ కార్పోరేషన్‌కు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రోగుల రద్దీతో కిటకిటలాడుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడం, ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించడం లక్ష్యంగా.. కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతమున్న ‘టిమ్స్’ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని.. కొత్తగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తీర్మానించింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి తరలించిన పండ్ల మార్కెట్ స్థలంలో మరొకటి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మధ్య మరొకటి నిర్మించాలని నిర్ణయించింది. దీనివల్ల జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు శివారు ప్రాంతాల్లోనే వైద్య సౌకర్యం అందుతుందని పేర్కొంది. కొత్తపేటలోని కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. -
తెలంగాణ: అన్‌లాక్ మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో సర్కారు తాజాగా అన్‌లాక్ మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్కు ధరించడం తప్పనిసరి అని, లేనిపక్షంలో వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆఫీసులు, దుకాణాలు తదితర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోట్ల కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొంది. అదే విధంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో శనివారం భేటీ అయిన మంత్రివర్గం ఆస్పత్రుల నిర్మాణ విషయమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్ ►జులై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు పునఃప్రారంభం ►భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి ►మాస్క్ లేకుంటే వెయ్యి రూపాయల ఫైన్ ►కార్యాలయాలు, దుకాణాల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి ►నిబంధనలు పాటించకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చర్యలు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ►హైదరాబాద్‌లో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం ►టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని నిర్ణయం ►చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాల్లో ఆస్పత్రుల నిర్మాణం ►అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రి నిర్మాణం చదవండి: Telangana Lockdown Update: తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత -
లాక్డౌన్, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా భేటీ కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను కొనసాగించాలా, ఎత్తివేయాలా, మరిన్ని సడలింపులు ఇవ్వాలా? అన్న దానితోపాటు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపుతోపాటు.. ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట అదనంగా మినహాయింపు ఉంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు, కరోనా కేసుల నమోదు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసి.. రాత్రి 9 గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను రాత్రి తొమ్మిదింటికే మూసేసి, ఇళ్లకు చేరుకోవడానికి ఒక గంట సమయం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. సినిమా హాళ్లు, షూటింగ్‌లు, థీమ్ పార్క్‌లు, జిమ్‌లు వంటి వాటికి అనుమతి ఇస్తారా, మరికొంత కాలం మూసే ఉంచుతారా అన్నది కూడా కేబినెట్ సమావేశంలో తేలనుంది. ఇక ఈ నెల 21వ తేదీ నుంచి విద్యా సంస్థల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దీనిపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యా సంస్థలు తెరుచుకున్నా కొంతకాలం పాటు ఆన్లైన్ తరగతులే కొనసాగించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. వ్యవసాయ అంశాలపైనా.. వానాకాలం మొదలైన నేపథ్యంలో.. సాగు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువైన నేపథ్యంలో మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. రైతుబంధు పథకం కింద రైతాంగానికి అందిస్తున్న ఆర్థిక సాయం, విత్తనాలు, ఎరువుల లభ్యత అంశాలను చర్చిస్తారని చెబుతున్నారు. కాళేశ్వరం నుంచి ఇప్పటికే ఎత్తిపోతలు ప్రారంభమైన నేపథ్యం మరింత సమర్థవంతంగా గోదావరి నీటిని వినియోగించుకోవడంపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంతోపాటు కరోనా మూడో వేవ్ రావొచ్చనే ఆందోళన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. నిధుల సమీకరణకు సంబంధించి కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. -
ఏపీ కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపు
-
ధరదడ: నిత్యావసరాల ధరలతో గుండెపోటే
బరంపురం: విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఒడిశా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ప్రధానంగా రోజూ వినియోగించే కందిపప్పు, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్లు వినియోగదారులను బెదిరేలా చేస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల చెబుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉడకని పప్పులు మార్కెట్లో పప్పుల ధరలు ఆందుబాటులో లేకుండా పోయాయి. కొద్ది రోజుల వ్యవధిలో కిలో కందిపప్పు రూ.150 కు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో దీని ధర రూ.90 నుంచి రూ.95 ఉండేది. నెల రోజుల కిందట రూ.90 ఉండేది. అయితే వారం రోజుల కిందట రూ.120లకు పెరిగి, ప్రస్తుతం కిలో రూ.140కి ఎగబాకింది. ఇక కిలో మినపప్పు ధర రూ.150కి చేరింది. దీంతో సామాన్యులు ఇడ్లీ, దోశ వంటి వాటిని వండుకోవడం మానేశారు. వంటనూనె సలసల వంట నూనెల ధర మార్కెట్లో సలసల కాగుతున్నాయి. పేదలు, సామాన్యులు అధికంగా వినియోగించే పామోలిన్ లీటర్ ధర రూ.130కి చేరింది. గతంలో దీని ధర రూ.80 ఉండగా ప్రస్తుతం రూ.130కి చేరింది. ఇక సన్‌ఫ్లవర్ నూనె లీటర్ రూ.200కు పెరిగింది. మిగిలిన వంట నూనెలు వందకు పైగా ధరలు పెరగడంతో పేదలు, సామాన్య ప్రజల బతుకు జీవనం కష్టంగా మారింది. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ఉల్లి లేనిదే కూర రుచించదు. అన్ని తరగతుల వారు వినియోగించే దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే దీనిధర కొండెక్కడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. రిటైల్ బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో రూ.30 నుంచి రూ.40 వరకూ పలుకుతోంది. కూరగాయల ధరలు ఆకాశానికి ఇక టమాటో కిలో రూ.30, బంగాళదుంపలు కిలో రూ.35, ఇతర కురగాయలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, షట్‌డౌన్ కారణంగా దిగుమతులు తగ్గడాన్ని అసరాగా చేసుకున్న వ్యాపారస్తులు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ధరలు మరింతగా పెంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టి ధరలు తగ్గించే ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
కరోనా రక్కసి మారణహోమం: 514 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి మారణహోమం కొనసాగిస్తోంది. కేసులు తగ్గినప్పటికీ మృత్యు బీభత్సం అదుపులోకి రావడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 514 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. మరోవైపు 18,324 మంది కరోనా బారిన పడగా, 24,036 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,53,446 కి పెరిగింది. అందులో 23,36,096 మంది కోలుకున్నారు. 30,531 మంది కన్నుమూశారు. 2,86,798 మంది చికిత్స పొందుతున్నారు. మంగళ, బుధవారాల కంటే గురువారం కేసులు రెండువేల వరకూ పెరిగాయి. బెంగళూరులో 3,533 పాజిటివ్‌లు.. బెంగళూరులో 3,533 పాజిటివ్‌లు, 7,672 డిశ్చార్జిలు, 347 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 11,74,275కు పెరిగింది. అందులో 10,25,614 మంది కోలుకున్నారు. 14,276 మంది కన్నుమూశారు. ప్రస్తుతం 1,34,384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,82,306 మందికి టీకా.. మరో 1,50,168 నమూనాలను పరీక్షించగా, మొత్తం టెస్టులు 3,01,49,275 కు పెరిగాయి. 1,82,306 మందికి కరోనా టీకా ఇచ్చారు. మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 1,43,27,273 కు పెరిగింది. తాజా మరణాల్లో టాప్ 5 జిల్లాలు.. బెంగళూరు సిటీ - 347 మండ్య - 14 హాసన్ - 14 మైసూరు - 12 బెంగళూరు రూరల్ - 11 -
లాక్డౌన్ ఎత్తివేత?: అన్‌లాక్ వైపు ప్రభుత్వం మొగ్గు
బనశంకరి: రాష్ట్రంలో వారం నుంచి కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అన్‌లాక్ గురించి యోచిస్తోంది. రెండో దశ కోవిడ్ వికటాట్టహాసం చేసి భారీగా ప్రాణాలను బలిగొంటున్న తరుణంలో మే 10 నుంచి రెండో లాక్డౌన్ ఆరంభమైంది. జూన్ 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఒకనెల రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోగా కరోనా మెల్లగా అదుపులోకి వస్తోంది. బెంగళూరు కూడా కరోనా పీడ నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అన్‌లాక్‌కు సన్నాహాలు చేస్తోంది. దిగ్బంధం వల్ల పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. దీంతో అన్‌లాక్ చేయడం యడియూరప్ప సర్కారుకు అనివార్యమైంది. జూన్ 7 నుంచి దశలవారీగా దిగ్బంధాన్ని సడలించి ఆర్థిక కార్యకలాపాలకు పచ్చజెండా ఊపడం తప్ప గత్యంతరం లేదని ఆర్థికశాఖ అధికారులు సర్కారుకు సూచించారు. పొడిగించాలని కమిటీ నివేదిక జూన్ 7వ తేదీ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలి అనే అంశాలతో కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందించింది. లాక్డౌన్ కొనసాగించాలా వద్దా, కొనసాగిస్తే ఎన్నిరోజులు, అన్‌లాక్ ఎలా ఉండాలి తదితర అంశాలను పేర్కొంది. ఈ నివేదిక ను ఆరోగ్య మంత్రి సుధాకర్‌కు సమితి అందజేసింది. నివేదికను కృష్ణాలో సీఎం యడియూరప్పకు ఆయన అందజేశారు. మరో 14 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించాలని సమితి నివేదికలో సిఫార్సు చేసింది. దీని గురించి ఇరువురూ చర్చించారు. జూన్ 4, 5 తేదీల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని సీఎం తెలిపారు. 2-3 వేలకు తగ్గినప్పుడే: అశోక్ కోవిడ్ సలహాసమితి నివేదిక ఆధారంగా లాక్డౌన్ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ కేసుల సంఖ్య ఆధారంగా తీర్మానం చేస్తామని అన్నారు. బెంగళూరులో నిత్యం 500 కంటే తక్కువ కోవిడ్ కేసులు నమోదు కావాలి, రాష్ట్రంలో వెయ్యి, మూడు వేల కేసుల స్థాయికి తగ్గినప్పుడే లాక్డౌన్ సడలింపుపై నిర్ణయానికి వస్తామన్నారు. దొడ్డబళ్లాపుర వద్ద అత్యాధునిక వసతులతో కోవిడ్ తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించామని, ఇందులో 100 పడకలు ఉంటాయని, ఐసీయూ, వెంటిలేటర్ వసతి ఉందని తెలిపారు. -
England: లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!
లండన్: గతేడాది ఇంగ్లాండ్ దేశాన్ని కరోనా మహమ్మారి అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశం కరోనాపై విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే బ్రిటన్‌లో లాక్డౌన్ అమలులో ఆంక్షలను ఎత్తివేయాలా... వద్దా అని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఈ సమయంలో లాక్‌డౌన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం అభిప్రాయపడ్డారు. అయితే బ్రిటన్ ప్రభుత్వం సోమవారం లాక్‌డౌన్‌పై కొన్ని ఆంక్షలను ఎత్తివేయనుండగా.. మిగతా వాటిని జూన్ 21వ తేదీన ఎత్తివేయాలని నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపించవచ్చు బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను సురక్షితంగా ఉంచడానికి తమ ప్రభుత్వం ఏదైనా చేస్తుందని తెలిపారు. ఇంగ్లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..బీ1.617.2 కరోనా వేరియంట్ ఆ దేశ వాయువ్య ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెందుతోందని, దీనిని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో 50 సంవత్సరాలు దాటిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేసే ప్రక్రియ వేగం పెరిగిందని, ఇది కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుదని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కొత్త రకం కరోనా వేరియంట్ మిగతా వాటి కంటే వేగంగా వ్యాప్తిసుందా..లేదా అనే సమాచారం కోసం తమ ప్రభుత్వం వేచి ఉందని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి అంతగా లేకుంటే మళ్లీ దేశంలో కార్యక్రమాలు పునః ప్రారంభమవుతాయని జాన్సన్ తెలిపారు. కాగా శాస్త్రవేత్తలు కరోనా సెకండ్ వేవ్ తొందరగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కానీ ఎంతవరకు నిజం అనేది పరిశోధనల్లో తెలియాల్సి ఉందని బ్రిటన్ ప్రధాన వైద్య అధికారి క్రిస్ విట్టి వెల్లడించారు. దీనిపై లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలో ఎపీడెమియాలజీ సీనియర్ లెక్చరర్ దీప్తి గురుదాసిని మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో మరిన్ని ఆంక్షలను విధించాలి’ అని చెప్పారు. కరోనా కేసులు గతవారం 520 నుంచి ఈ వారం 1,313కి పెరగడంతో ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మా టీకాలను నమ్మండి ‘‘బ్రిటన్‌లో కొన్ని నెలలుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. దానికి కారణం వ్యాక్సిన్లు, అవి కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. మా టీకాలు కరోనాను ఎదుర్కోవడంలో తక్కువ ప్రభావం కలిగిస్తాయని ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు. గతంలో బ్రిటన్ కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కొన్నప్పటి కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయి. దానికి కారణం వ్యాక్సినేషన్. కాబట్టి వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచాలి.’’ అని జాన్సన్ అభిప్రాయపడ్డారు. కాగా బ్రిటన్‌లో కరోనా ఉధృతి తగ్గుతుండడంతో క్రమంగా ఆ దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. ఇక భారత్‌లో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో బ్రిటన్‌కి వచ్చే ప్రయాణికులపై నిషేధం కొనసాగుతోంది. భారత్ నుంచి ప్రయాణికులు వస్తే బ్రిటన్ ప్రభుత్వం కొన్నిరోజులపాటు వారిని హోటల్లో ఉంచుతోంది. (చదవండి: ఆన్లైన్ ఉగ్రవాదంపై పోరుకు అమెరికా మద్దతు) -
పెళ్లి వేడుకలో 31 మందికే చాన్స్, ఒక్కరు పెరిగినా..
జైపూర్: పెళ్లి..రెండు మనసులు ఏకం చేసే అపురూప వేడుక. ఆ అపురూపమైన ఘట్టాన్ని బంధుమిత్రుల సమక్షంలో కలకాలం గుర్తుండి పోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, ఆ పెళ్లి వేడుకపై మహమ్మారి విజృంభిస్తుంది. దీంతో పెళ్లిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పుడు పెళ్లి వేడుకలన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసుల పహారా మధ్య జరుపుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయినప్పటికీ కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లి వేడుకలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా పెళ్లిళ్లకు సంబంధించి రాజస్తాన్ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్యను గతంలో 50కి పరిమితం చేసిన గహ్లోత్ ప్రభుత్వం.. ఆ సంఖ్యను 31 కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. పెళ్లిలో ఆ సంఖ్య కన్నా ఒక్కరు పెరిగినా లక్షరూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దాంతోపాటు వివాహ తంతును మూడుగంటల్లోగా పూర్చి చేయాలని, ఆ సమయం మించితే లక్ష రూపాయల జరిమానా తప్పదని తెలిపింది. అలాగే తప్పుడు సమాచారంతో అధికారుల సమయాన్ని వృథా చేసినవారికి రూ.5 వేలు జరిమానా విధించాల్సి ఉంటుందని వెల్లడించింది. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కు సంబంధిత పెళ్లి ఫోటోల్ని తప్పని సరిగా చూపించాలని రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్లో వివరించింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మే 17 వరకు లాక్ డౌన్ ఆంక్షల్ని పొడిగించిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం రాజస్థాన్‌లో కొత్తగా 17,296 కోవిడ్ కేసులు నమోదవ్వగా 154 మంది మరణించారు. -
మళ్లీ లాక్డౌన్ ఆలోచనలు
దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసి, ఫలితాలు కూడా వచ్చాక కరోనా కట్టడికి ఏం చేయాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గత కొన్ని రోజులుగా మళ్లీ లాక్డౌన్ విధింపే పరిష్కారమని వివిధ వర్గాలనుంచి వినబడుతుండగా, ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం ఆ సంగతిని పరిశీలించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితరచోట్ల కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా వున్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి రోజూ మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. కేవలం ఉదయం 6 గంటలనుంచి 12 గంటలవరకు మాత్రమే పౌరులు రోడ్లపై రావడానికి అనుమతిస్తారు. ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం విద్యార్థుల్ని, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సుల్ని పూర్తిచేసుకుని నర్సులుగా అర్హతపొందినవారిని కరోనా విధుల్లో నియమించాలని కేంద్రం సూచించింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో వున్న వైద్యులు, నర్సుల సంఖ్య సరిపోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచిదే. కానీ ఇంకా ముందే ఈ పని చేసివుండాల్సింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. శుక్రవారం 4.01 లక్షల కేసులు నమోదు కాగా, శనివారం ఆ సంఖ్య 3.92 లక్షలు. రోజుకు సగటున 18 నుంచి 19 లక్షలమందికి కోవిడ్ పరీక్షలు జరుపుతున్నారని అంచనా. గత నెల 18న తొలిసారి 30,000 కేసులు బయటపడిన ఉత్తరప్రదేశ్‌లో, అప్పటినుంచీ అది ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇంత విషాదంలోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్వల్పంగానైనా తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ విషయంలో తొలుత మహారాష్ట్ర గురించి చెప్పుకోవాలి. అక్కడ కరోనా మహమ్మారి కట్టడికి తీసుకున్న చర్యలు ఫలించడంతో క్రమేపీ తగ్గుతున్నాయి. ఒక దశలో ఆ రాష్ట్రంలో రోజుకు 50,000 కేసులు నమోదైన సందర్భాలు కూడా వున్నాయి. కర్ణాటక, కేరళల్లో కూడా గత కొన్నాళ్లుగా రోజూ 30,000 కేసులు బయటపడటం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఆ ధోరణి తగ్గింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండురోజులుగా కేసులు తగ్గడం మంచి పరిణామమే. కానీ ఆక్సిజన్ కొరత ప్రాణాలు తోడేస్తున్నది. సకాలంలో దాని లభ్యత లేకపోవడం వల్ల కరోనా బారినపడినవారు చనిపోతున్నారు. సామాజిక మాధ్యమాల నిండా ఆక్సిజన్ సిలెండర్ కోసం అభ్యర్థిస్తూ పెడుతున్న సందేశాలే ఎక్కువగా కనబడటం విషాదకర పరిణామం. ఒకపక్క రెండో దశ కరోనా వైరస్ వల్ల రోగుల్లో మరణాల సంఖ్య పెరుగుతుండగా, అదునుకు ఆక్సిజన్ అందని పరిస్థితి వుండటం విషాదకరం. ఏడాదిక్రితం కరోనా మొదలై, అది తీవ్రమైన ప్రస్తుత తరుణంలో కూడా రోగుల్ని చేర్చుకోవడంలో, వారి చికిత్సలో నిర్దిష్టమైన విధానాలు లేకపోవడం ఆందోళనకరం. వైద్యులు ఎప్పటికప్పుడు ఈ రంగంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకుంటూ దానికి తగినట్టుగా చికిత్సా విధానాలను ఎటూ రూపొందించుకుంటున్నారు. అందువల్ల గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు కూడా కనబడుతున్నాయి. కానీ అక్కడక్కడ ఈ విషయంలో సమస్యలున్నాయి. వాటిని సరిచేయాల్సిన అవసరం వుంది. అవగాహన లేకనో, సొమ్ము చేసుకుందామనో అవసరం వున్నా లేకపోయినా రోగులకు సీటీ స్కాన్ చేయించే ధోరణి ఎక్కువైంది. దీనిపై వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తుండటం మంచిదే అయినా, ఈ విషయంలో ఇంత జాప్యం చేసివుండాల్సింది కాదు. అలాగే ఆక్సిజన్ గురించి లేదా ఔషధాల గురించి అర్థిస్తున్నవారిపై ఉత్తరప్రదేశ్‌లో ఎడాపెడా కేసులు పెడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అలా వేధించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని సుప్రీంకోర్టు హెచ్చరించటం స్వాగతించదగ్గది. అయితే లాక్డౌన్ విధించేముందు ప్రభుత్వాలన్నీ బడుగుజీవుల పరిస్థితేమిటన్న అంశంపై శ్రద్ధ పెట్టాలి. క్రితంసారి విధించిన లాక్డౌన్ వల్ల ఆ వర్గాలవారు చెప్పనలవికాని అగచాట్లు పడ్డారు. స్థానికంగా వుండేవారికి ఆకలి మాత్రమే ప్రధాన సమస్య. కొంతమందికైనా గూడు వుంటుంది. కానీ వలస వచ్చినవారికి ఆకలితోపాటు ఎక్కడ తలదాచుకోవాలన్న సమస్య వుంటుంది. వారిని పనిలోకి తీసుకున్నవారే ఆ రెండు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కానీ దాన్ని పాటించినవారు చాలా తక్కువ. కనుకనే ఆకలికి తట్టుకోలేక, రోడ్డున పడి లక్షలాదిమంది వలసజీవులు కాలినడకన స్వస్థలాలకు ప్రయాణం కట్టారు. లాక్డౌన్ వల్ల రవాణా సాధనాలన్నీ నిలిచిపోయి ఎండనకా, వాననకా రాత్రీ పగలూ తేడా లేకుండా జనం నడక సాగించాల్సివచ్చింది. ఇందువల్ల వారిలో కొందరు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ గురించి ఆలోచిస్తున్న వేళ అలాంటివారి విషయంలో ఏం చేయాలన్న ఆలోచన చేయటం తప్పనిసరి. కరోనా కేసులు పెరుగుతున్నాయన్న పేరిట గతం మాదిరి లాక్డౌన్ విధించటం కాక ఆ బడుగుజీవుల గురించి స్పష్టమైన విధానం రూపొందించాకే, దాన్ని సక్రమంగా అమలు చేయడానికి తగిన కార్యాచరణను నిర్ణయించాకే ఆ విషయంలో ముందడుగేయాలి. అలాగే కేసుల తీవ్రత బాగా ఎక్కువున్న ప్రాంతాలు, అవి అంతగా లేని ప్రాంతాలమధ్య తేడా చూపేలా లాక్డౌన్ నిబంధనలుండాలి. దానివల్ల కరోనా వైరస్ నియంత్రణ సమర్థవంతంగా వుంటుంది. ఆర్థిక కార్యకలాపాలకు జరిగే నష్టం కూడా పరిమితంగా వుంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.