malasia
-
సిగరెట్ కాల్చిన మలేసియా మంత్రికి రూ.95 వేల జరిమానా
కౌలాలంపూర్: కేంద్ర మంత్రి. అందులోనూ కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి. బహిరంగంగా సిగరెట్ తాగి ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని నెటిజన్లు మంత్రి మొహమ్మద్ హసన్‌పై ఆన్లైన్లో విమర్శల వరద పారించారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన ఘోర నేరం ఏంటంటే బహిరంగంగా సిగరెట్ కాల్చడం. భారత్‌లోలాగే మలేసియాలోనూ బహిరంగంగా ధూమపానంపై నిషేధం అమల్లో ఉంది. బహిరంగంగా సిగరెట్ కాల్చే పొగరాయుళ్లపై జరిమానాల విధించడం, శిక్షించడం భారత్‌లో ఏ స్థాయిలో అమలవుతోందో భారతీయ పౌరులందరికీ బాగా తెలుసు. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో పార్లమెంట్ సభ్యులు ఒకరిద్దరు బహిరంగంగా సిగరెట్ గుప్పుగుప్పుమని కాల్చినా జరిమానా వేసిన పాపానపోలేదు. కానీ మలేసియా ప్రభుత్వం మాత్రం సదరు మంత్రికి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అక్కడి చట్టాల ప్రకారం బహిరంగ ధూమపాన నేరానికి కనీసం 5,000 రింగెట్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.95,000 జరిమానా విధిస్తారు. తప్పుకు శిక్షగా జరిమానా కట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి హసన్ చెప్పారు. హోటల్ వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో సిగరెట్ కాల్చడం నేరం. అందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన చెప్పారు. నెగేరీ సెంబిలాన్ రాష్ట్రంలోని ఒక హోటల్లో ఆరుబయట కూర్చొని స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ సిగరెట్ కాల్చుతున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే తప్పును తెల్సుకున్న మంత్రి స్వయంగా ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రతించి తనకు జరిమానా విధించాలని కోరినట్లు తెలుస్తోంది. తానేం చట్టానికి అతీతుడిని కాదని, మంత్రి స్వయంగా జరిమానా విధించాలని వేడుకున్నారని ఆరోగ్య మంత్రి జుల్కెఫీ అహ్మద్ వెల్లడించారు. వంటశాలలు, రెస్టారెంట్లలో ధూమపానంపై నిషేధం 2019 ఏడాది నుంచి అమల్లో ఉంది. 2024 అక్టోబర్ నుంచి మరింత కఠినమైన నియమనిబంధనలను అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా మంత్రిపైనే విమర్శలు రావడం గమనార్హం. సెరెంబన్ జిల్లా ఆరోగ్య కార్యాలయం నుంచి సదరు నోటీస్‌ను బుధవారం అందుకున్నానని మంత్రి అహ్మద్ వెల్లడించారు. ‘‘ఈ అంశం నిజంగా చర్చనీయాంశమై ఆందోళన కల్గించి ఉంటే సారీ చెప్పేందుకు నేను సిద్ధం. ఆరోగ్య శాఖ ఎంత జరిమానా విధించినా నేను కట్టేస్తా. నాపై మరీ పెద్దమొత్తాలను జరిమానాగా మోపబోరని భావిస్తున్నా’’అని బుధవారం ఒక పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు. -
స్టార్ హీరోయిన్ సౌందర్య మళ్లీ పుట్టిందా?.. అచ్చం ఆమెలానే అలరిస్తోంది!
తెలుగులో స్టార్ హీరోయిన్లలో సౌందర్య ఒకరు. అప్పట్లో మీనా, రమ్యకృష్ణ తర్వాత తనదైన అలరించిన హీరోయిన్ ఆమెనే. కన్నడకు చెందిన భామ.. మనవరాలి పెళ్లి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన సౌందర్య.. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. దీంతో ఆమె మృతిని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. భౌతికంగా సౌందర్య దూరమైన ఆమె సినిమాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. మహానటి సావిత్రి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఎవరంటే సౌందర్య పేరే వినిపిస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. సౌందర్య తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. 12 ఏళ్ల పాటు వెండితెరపై అభిమానులను అలరించింది. అయితే అచ్చం సౌందర్యలాగే అమ్మాయి సోషల్ మీడియాలో అలరిస్తోంది. మలేషియాకు చెందిన చిత్ర టిక్ టాక్ ఉన్న సమయంలోనే సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. చూడడానికి సేమ్ టు సేమ్ మన సౌందర్యలాగే ఉండడం ఆమెకు కలిసొచ్చింది. చిత్ర తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మనదేశంలోని అభిమానులకు సైతం దగ్గరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన చిత్ర తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిత్ర మాట్లాడుతూ..' మా అమ్మది తమిళనాడు. నేను పుట్టి పెరిగింది మాత్రం మలేషియాలోనే. నేను కన్నడ, తెలుగు భాషలు అర్థం చేసుకోగలను. ఆమెలాగే ఉండడం నా అదృష్టం. మలేషియా నుంచే నేను రీల్స్ చేస్తున్నా. సినిమాల్లో నటించమని తెలుగువాళ్లు కొంతమంది నాకు కాల్స్ చేశారు. నాకు యాక్టింగ్ రాదు. సౌందర్య నటించిన అమ్మోరు, అంతఃపురం సినిమాలంటే ఇష్టం. సౌందర్య కుటుంబ సభ్యులు ఎవరు నాకు ఫోన్ చేయలేదు.' అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు చిత్ర తెలిపింది. View this post on Instagram A post shared by Chitra❤ (@chitra_jii2) View this post on Instagram A post shared by Chitra❤ (@chitra_jii2) -
హాకీ చాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్లు.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే!
సాక్షి, చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి గురువారం ఎగ్మూర్‌లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో తెర లేవనుంది. భారత్‌తోపాటు పాకిస్తాన్, చైనా, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తొలి రోజు కొరియాతో జపాన్ (సాయంత్రం గం. 4 నుంచి); మలేసియాతో పాకిస్తాన్ (సాయంత్రం గం. 6:15 నుంచి); చైనాతో భారత్ (రాత్రి గం. 8:30 నుంచి) పోటీపడతాయి. భారత్, పాక్ మ్యాచ్ ఆగస్టు 9న జరుగుతుంది. ఆరు జట్ల మధ్య ముందుగా రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో నెగ్గిన జట్లు ఆగస్టు 12న ఫైనల్లో తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో
న్యూఢిల్లీ: ఇంట్లో పనిచేసే సహాయకులకు ఏ పండగ్గో,పబ్బానికో కొత్త బట్టలు, లేదంటే ఎంతో కొంత నగదు బోనస్‌లు ఇవ్వడం సహజం. ఎంత పెద్ద గొప్ప వ్యాపారవేత్తలయినా కాస్త అటూ ఇటూగా దాదాపు ఇదే చేస్తారు. కానీ మలేషియాకు చెందిన మహిళా వ్యాపారవేత్త మాత్రం అద్భుతమైన బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచింది. వెబ్సైట్ మదర్షిప్ ప్రకారం, ఫరావెన్ అనే మహిళ తన ముగ్గురు ఇంటి పనివాళ్లకు భారీ బహుమతి ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్. తన ముగ్గురు మహిళా గృహ సహాయకులకు సుమారు రూ. 1.8 లక్షల గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కవర్లు ఇస్తూ టిక్‌టాక్ వీడియోను ఫరా షేర్ చేసింది. ముస్లింలకు అతిపెద్ద సెలవుదినాలలో ఒకటైన హరి రాయ (దీనిని హరి రాయ ఐడిల్ఫిత్రి అని కూడా పిలుస్తారు) కోసం ద్వీపానికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసింది. (ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) డిపింగ్ పూల్, బాత్‌టబ్, లాంజ్ ఏరియాతో కూడిన విలాసవంతమైన ప్రైవేట్ సూట్లో ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం వారికి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ వీడియోలో హెలికాప్టర్లో సదరు ద్వీపానికి ప్రయాణం అవ్వడాన్ని, అలాగే యజమాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. Jadi bibik pun dapat duit raya 5 angka, siap dapat pakej healing 😭 pic.twitter.com/94Sz6Gzj6V — 🇲🇾 (@localrkyt) April 13, 2023 టిక్‌టాక్‌లో మిలియన్ల వ్యూస్‌తో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఇతర సోషల్‌మీడియాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఆమె దాతృత్వాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. మరి కొందరు ఇది వాళ్లకి సంతోషాన్నిస్తుందా అని, ఇది ఫేక్ అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళల పట్ల ఓనర్లు ఔదార్యాన్ని చూపించడం ఇదే మొదటిసారి గతేడాది దీపావళి రోజున చెన్నై వ్యాపారి తన సిబ్బందికి రూ.1.2 కోట్లకు పైగా విలువైన కార్లు, బైక్‌లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) -
'బిచ్చగాడు' హీరోకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు దాదాపు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్–2 (బిచ్చగాడు-2) తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతుండడం ప్రత్యేకత. అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిచ్చగాడు టాలీవుడ్‌లోనూ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అమ్మ కోసం 48 రోజుల పాటు రహస్య జీవితాన్ని గడిపే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు, హీరోగా పిచైక్కారన్- 2 చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఈ ఏడాది తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, కొలై, రథం, మజై పిడిక్కత మనితన్ లాంటి తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నారు. -
రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో
ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో ఊహించలేం. చేయని తప్పుకు కూడా కొన్నిసార్లు అనుకోకుండా బలికావాల్సి వస్తోంది. అచ్చం ఓ మహిళకు కూడా ఇలాంటి ఓ భయంకర సంఘటనే ఎదురైంది. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఊహించని ఈ ఘటన మలేషియాలో జరిగింది. తన స్నేహితురాలితో కలిసి మహిళ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది. అయితే రహదారి పక్కన కొన్ని కొబ్బరి చెట్లు రోడ్డుపైకి వంగి ఉన్నాయి. ఇంతలో ఒక కొబ్బరి చెట్టుపై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళ తలపై నేరుగా పడింది. దీంతో మహిళ ఒక్కసారిగా స్కూటర్ పై నుంచి రోడ్డుపై పడిపోయింది. అయితే మహిళ హెల్మెట్ ధరించి ఉండటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్కూటర్‌పై ఉన్న స్నేహితురాలు, స్థానికులు అప్రమాత్తమయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కాగా టూవీలర్ వెనకాల వెళ్తున్న కారు డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. చదవండి: ‘యూకే ప్రధాని’ని ఛేజ్ చేస్తున్నపోలీసులు!: వీడియో వైరల్ -
రాజీనామా చేయనున్న మలేషియా ప్రధాని!
కౌలాలంపూర్: మలేషియా దేశ ప్రధాన మంత్రి ముహిద్దీన్ యాసిన్ రేపు(సోమవారం) రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ముహిద్దీన్ ప్రధాని పదవికి రాజీనామా చేయన్నుట్లు ఆ దేశ అధికార పోర్టల్ ఆదివారం వెల్లడించింది. బల నిరూపణలో భాగంగా మలేషియా ప్రధాని మెజారిటీ కోల్పోయారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో ముహిద్దీన్ మెజారిటీ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆర్దిక మాంద్యం, కరోనా కేసులతో మలేషియాలో మరింత అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. మలేషియా ప్రధానిగా ముహిద్దీన్ 17 నెలల పాటు సేవలందించారు. ఇక తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై మలేషియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయింస్తారని సమాచారం. -
ఇండోనేషియాలో ప్రాజెక్టు.. ఇండియన్లకి తాకిన పన్నుల పోటు
న్యూఢిల్లీ : ఇండోనేషియాలో నిర్మిస్తున్న పామ్‌బేస్‌డ్ బయో డీజిల్ ప్రాజెక్టు ఇండియాకు చేటు తెచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీగా నిధులు సమకూర్చుతోంది ఇండోనేషియా. అందు కోసం ఆ దేశ ప్రధాన ఆదాయ వనరులో ఒకటైన పామాయిల్ ఎగుమతులపై భారీగా కస్టమ్స్ డ్యూటీ విధిస్తోంది. ఏడు నెలలుగా ఓ వైపు అమెరికా, బ్రెజిల్‌లలో కరువు కారణంగా వంట నూనె ధరలు పెరిగాయి. వాటికి ప్రత్యామ్నాయంగా పామాయిల్‌కి మళ్లుదామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. వంట నూనెల్లో ఎప్పుడు చవకగా లభించే పామాయిల్ ధర సైతం లీటరు రూ. 150 దగ్గర ఉంది. దీనికి కారణం ఇండోనేషియాలో పెరిగిన ఎగుమతి పన్నులు. నిధుల సేకరణ పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా పామ్ బేస్డ్ బయో డీజిల్ ఉత్పత్తి ప్రాజెక్టును ఇండోనేషియా చేపట్టింది. దీనికి నిధుల సమీకరణకు పామ్నే ఎంచుకుంది. దీంతో ఒక్కసారిగా పామాయిల్ ఎగుమతిపై గత డిసెంబరులో ఉన్నట్టుండి పన్నులు పెంచింది. టన్ను పామాయిల్ కస్టమ్స్ డ్యూటీని 438 డాలర్లకు పెంచింది. అంతటితో ఆగకుండా క్రూడ్ పామాయిల్ లేవీని టన్నుకు రూ. 225 డాలర్లుగా నిర్ణయించింది. మన దేశ పామాయిల్ అవసరాల్లో యాభై శాతం ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. గత డిసెంబరు నుంచి పెరిగిన పన్నులతో ఇండియాలో కూడా పామాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మలేషియా ఇండోనేషియాలో పన్నుల భారం భరించలేని విధంగా పెరిగిపోవడంతో మలేషియా నుంచి పామ్ఆయిల్ ఇండియా దిగుమతి చేసుకుంటోంది.మలేషియా సైతం సుంకాలు తగ్గించడంతో ఇండియాకి పామాయిల్ ఎగుమతులు ఏకంగా 238 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఇండోనేషియా దిగుమతులు 32 శాతం తగ్గాయి. ధరలు తగ్గేదెన్నడు ఇండోనేషియాలో ఎగుమతి సుంకం పెరిగిపోవడంతో మలేషియా వైపు ఇండియా మళ్లింది. దీంతో ఎగుమతి పన్నులు తగ్గించాలంటూ ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఇండియా అవసరాలను గమనించిన మలేషియా సైతం క్రమంగా క్రమంగా పన్నులు పెంచుతోంది. ఏతావతా ఇండోనేషియా, మలేషియాల మధ్య జరుగుతున్న పామాయిల్ వాణిజ్యంలో ఇండియాలో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. కనీసం పామాయిల్ ధరలైనా తగ్గేలా చూడాలని కోరుతున్నారు. చదవండి : చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు! -
వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు
కౌలలాంపూర్: నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేని స్థితిలో బతుకీడుస్తున్నారు అనేది అక్షర సత్యం. ఓ వైపు కొందరు తినలేక ఆహారాన్ని వృధా చేస్తుంటే.. మరి కొందరు చాలినంత తిండిలేక ఆకలితో కృశించి మరణిస్తున్నారు. 21వ శతాబ్దంలో కూడా ఆకలి చావులు ఉండటం నిజంగా సిగ్గు చేటు. ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి తాజాగా ఫేస్బుక్లో వైరలవుతోంది. దీని చూసిన వారంతా పాపం.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. మలేషియాకు చెందిన అపిత్ లిడ్ అనే ఫేస్బుక్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేసిన ఈ ఫోటోలో సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి లంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అతడి బాక్స్‌లో నీటిలో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ.. మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి. కూర, రసం, పెరుగులాంవంటివి ఏవి లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని.. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ నంజుకుని తింటాడు. ఈ ఫోటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు అపిత్ లిడ్. ‘‘ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తం తనకోసం ఉంచుకుంటాడు. అలా మిగుల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడు. ప్రతి రోజు ఇదే అతడి ఆహారం. దీని గురించి అతడు బాధపడడు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఆరు వేల మంది ఈ స్టోరిని షేర్ చేశారు. ‘‘ఇతడి పరిస్థితి చూస్తే.. చాలా బాధగా ఉంది..ఇలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతావు’’.. ‘‘ఇతడికి సాయం చేయండి’’.. ‘‘ఇతడి జీవితం మనకు ఓ పాఠం నేర్పుతుంది’’.. ‘‘ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్.. నీకు మంచి జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వైరల్: చేప కడుపులో 10 కేజీల ప్లాస్టిక్ బ్యాగ్ -
గ్లౌజుల కంపెనీలో కరోనా వీర విహారం
కౌలాలంపూర్ : కరోనా లాంటి వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు ధరించే పీపీఈ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) కిట్స్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోన్న మలేసియాకు చెందిన ‘టాప్ గ్లోవ్’ కంపెనీలో ఊహించని సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. కంపెనీలో పని చేస్తోన్న 2,453 మంది కార్మికులు కరోనా వైరస్ బారిన పడడంతో మలేసియా ప్రభుత్వం ఆదేశాలతో టాప్ గ్లోవ్ కంపెనీ కౌలాలంపూర్‌కు వెలుపల ఉన్న 28 కంపెనీ యూనిట్లన్నింటిని మూసివేసింది. కరోనా బారిన పడిన కార్మికులను క్వారంటైన్లోకి పంపించింది. కార్మికుల కదలలికలను నియంత్రించేందుకు కార్మికుల వసతి గృహం వద్ద ముళ్ల ఇనుప తీగెలను ఏర్పాటు చేసింది. మొన్నటి వరకు కరోనా కేసులు అతి తక్కువగా ఉన్న మలేసియాలో హఠాత్తుగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా రోజుకు 2,188 కేసులు సగటున వస్తున్నాయని, మంగళవారం నాటికి మలేసియాలో కరోనా కేసులు 58,847కు చేరుకున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ ఓ అధికార ప్రకటనలో వెల్లడించింది. టాప్ గ్లోవ్ కంపెనీకి 47 కంపెనీ యూనిట్లు ఉండగా, వాటిలో 41 కంపెనీలు ఒక్క మలేసియాలోనే ఉన్నాయి. థాయ్‌లాండ్, చైనా, వియత్నాం దేశాల్లో మిగతా కంపెనీ యూనిట్లు ఉన్నాయి. అందులో పనిచేసే వారిలో ఎక్కువ మంది నేపాల్ నుంచి వచ్చిన వారే. వారంతా కంపెనీకి చెందిన వసతి గృహాల్లో కిక్కిర్సి ఉంటారు. మంగళవారం నాటికి కంపెనీలోని 5,700 మంది కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,453 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తం ఈ కంపెనీల్లో 16 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వలస కార్మికులను టాప్ గ్లోవ్ కంపెనీ చిన్నచూపు చూస్తోందని కంపెనీ కార్మికులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టాప్ గ్లోవ్‌కు చెందిన రెండు కంపెనీలను పీపీఈల దిగుమతిని గత జూలై నెలలో అమెరికా రద్దు చేసుకుంది. (కరోనా: భారత దేశంలో ఎందుకు ఇలా అవుతోంది?) -
ఫ్రాన్స్‌ను ముస్లింలు శిక్షించవచ్చు
పారిస్: ఫ్రాన్స్‌ను శిక్షించే అధికారం ముస్లింలకు ఉందంటూ మలేసియా మాజీ ప్రధానమంత్రి మహథిర్ మహ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర సంచలనానికి తెరతీసింది. ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా నుంచి వరుసగా 13 ట్వీట్లు చేశారు. ‘‘ఫ్రాన్స్ గతంలో నరమేధం సాగించింది. అందుకు ప్రతీకారంగా లక్షలాది మంది ఫ్రెంచ్ పౌరులను హతమార్చే అధికారం ముస్లింలకు ఉంది. కానీ, కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని ముస్లింలు పాటించరు. ఫ్రాన్స్ కూడా అందుకు కట్టుబడి ఉండాలి. ఇతర మతస్తుల మనోభావాలను గౌరవించడం ఫ్రాన్స్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం నేర్పాలి’’అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మహథిర్ మహ్మద్‌పై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ సెక్రెటరీ సెడ్రిక్ ఓ వెంటనే రంగంలోకి దిగారు. మహథిర్ చేసిన ట్వీట్‌ను తక్షణమే తొలగించాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని కోరారు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం మహథిర్ మహ్మద్ ట్వీట్‌ను తొలగించింది. చర్చి ఘటనలో మరొకరి అరెస్టు నైస్(ఫ్రాన్స్): ఫ్రాన్స్‌లో నైస్ నగరంలోని చర్చిలో జరిగిన నరమేధంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్యునీషియాకు చెందిన ఇబ్రహీం ఇస్సాయ్ అనే ముష్కరుడు చర్చిలో కత్తితో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 47 ఏళ్ల ఈ అనుమానితుడు కత్తితో దాడి చేసిన ముష్కరుడితో అంతకు మందు రోజు రాత్రే మాట్లాడినట్లు తెలుస్తోంది. -
టీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
కౌలాలంపూర్: టీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు నిర్వహించారు. కోవిడ్ -19 కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెరాస మలేషియా కమిటీ సభ్యులు, మలేషియా లో ఉంటున్న ప్రవాస తెలంగాణ ప్రజలు ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల, గౌరవ అతిథిగా తెలంగాణ జానపద గాయని రేలారే గంగ తర సభ్యులతో కలిసి కాన్ఫరెన్స్ కాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొన్నారు. ముందుగా అధ్యక్షులు చిట్టిబాబు తెలంగాణ తల్లి పటానికి పుష్పాలంకరణ చేసి జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సభ్యులందరు అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేసుకొని వారికి నివాళులర్పించి 2 నిముషాలు మౌనం పాటించారు. ముఖ్య అతిథి మహేష్ బిగాల మాట్లాడుతూ సభ్యులకు మరియు యావత్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షాలు తెలియజేసారు. లాక్డౌన్సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న ప్రణాళికలు, కార్యక్రమాలను గురించి వివరించారు. టీఆర్ఎస్ మలేషియా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీవిషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. సభ్యులకు, ప్రవాస తెలంగాణ వాసులకు అధ్యక్షులు చిట్టిబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసారు. ఇతర దేశాల నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్న వారిని ప్రభుత్వం ఆదరిస్తున్న తీరును, కల్పిస్తున్న సదుపాయాలను ప్రశంసించారు. దుబాయ్ నుంచి వచ్చిన 25 మంది బాధితులకు వారి ఆర్ధిక స్థితిని తెలుసుకొని తన సొంత ఖర్చులతో వారికి క్వారంటైన్ శిభిరంలో చేర్చిన మహేష్ బిగాలను అభినందించారు. రేలారే గంగ మాట్లాడుతూ ఒక కొత్త తీరుగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో తనని బాగస్వామ్యురాలిని చేసినందుకు ఉపాధ్యక్షులు మారుతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమ సమయంలో పాడిన పాటలను పాడుతూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమ వివరాలను, మలేషియాలో చిక్కుకున్న బాధితుల వివరాలను, వారికి అందించిన సహాయాన్ని గురించి మహేష్ బిగాలకి వివరించారు. కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు రమేష్, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రవిందర్ రెడ్డిలు పాల్గొన్నారు. -
కరోనా హీరో: ‘నూరు’ పిపిఇ గౌన్లు
కరోనా పోరాటంలో నేను సైతం అంటూ ఎంతో మంది కదిలారు. అందులో పిల్లలు కూడా తమ వంతు సాయం అందిస్తూ తమ సత్తా చాటుతున్నారు. వారిలో ముందు వరసలో ఉంటుంది తొమ్మిదేళ్ల నూరు అఫియా కిస్టినా. మలేషియాకు చెందిన నూరు ఆడుతు పాడుతూ తల్లి వద్ద ఐదేళ్ల వయసు నుంచే మిషన్ కుట్టడం నేర్చుకుంది. తల్లి టైలరింగ్ చేస్తుండటంతో కూతురు కూడా ఆ పనిలో మెల్ల మెల్లగా నిమగ్నమయ్యేది. ఇంటికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలోని వైద్యులకు, నర్సుల బృందానికి పిపిఇ గౌన్లు అవసరమని అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంది. తల్లిదండ్రుల సాయంతో కావల్సిన మెటీరియల్ తీసుకొని మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 130 పిపిఇ గౌన్లు తయారుచేసింది. వాటిని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అందజేసింది. పిపిఇ కిట్స్ కుడుతున్న నూరు ఒకే రోజులో 4 గౌన్లు ‘ఇవి చెడు రోజులు. ప్రజలు ఎంతగా కష్టపడుతున్నారో వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది అని తెలుసుకున్నాను. దీనికి అడ్డుకట్ట వేసే వారికి సహాయం చేయాలని ఉందని మా అమ్మకు చెప్పాను. లాక్డౌన్ కారణంగా మాకు స్కూల్ కూడా లేదు. ఆన్లైన్లో చదువుకుంటున్నాను. ఖాళీ సమయంలో పిపిఇ గౌన్లు తయారు చేస్తున్నాను. రోజుకు నాలుగు గౌన్లు తయారు చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ కూడా సాయం చేస్తుంటుంది. ఇప్పుడు మరో 60 గౌన్లను తయారు చేయడానికి అన్ని పనులు పూర్తి చేసుకున్నాను’ అంటుంది నూర్. పొరుగువారి దుస్తులు మరమ్మతు మిషన్ పైన కుట్టడం అనే నైపుణ్యాన్ని తల్లి నుండి నేర్చుకుంది నూర్. ఇరుగుపొరుగు వారి దుస్తులను బాగు చేయగా వచ్చే డబ్బును తన పాకెట్ మనీగా వాడుకునేది. ఇప్పుడు ఈ నైపుణ్యాన్ని పిపిఇ గౌన్లు తయారు చేయడానికి ఉపయోగపడింది. ఇలా కరోనా వారియర్స్‌కి నా వంతు సాయపడుతున్నాను అని సంతోషంగా చెబుతుంది నూర్. వయసు చిన్నదే. కానీ, మనసు పెద్దది అనిపించక మానదు నూర్ చేస్తున్న పని చూస్తుంటే. -
దినసరి కార్మికులకు టీఆర్ఎస్ మలేషియా అండ
కౌలాలంపూర్ : లాక్డౌన్ కారణంగా మలేషియాలో చిక్కుకుని ఇక్కట్లు పడుతున్న దినసరి కార్మికులకు టీఆర్ఎస్ మలేషియా అండగా నిలిచింది. నిత్యావసర వస్తువులు అందించి వారి ఆకలి తీర్చింది. కొద్దిరోజులక్రితం సామాజికమాద్యమాల ద్వారా టీఆర్ఎస్ మలేషియా సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి, శ్రీనివాస్ ముల్కల దృష్టికి ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ద్వారా బ్రతుకుదెరువు కోసం మలేషియా వచ్చి దినసరి కార్మికులుగా పనిచేస్తూ లాక్డౌన్ కారణంగా ఎటూవెళ్లలేక, తినటానికి లేక ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులను సామాజికసేవలో ముందుండే శ్రీకాంత్ గుర్తించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు చిట్టిబాబు చిరుత ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మలేషియా చేసిన సహాయానికి సంతోషం వ్యక్తం చేశారు. మలేషియాలో ఇబ్బందుల్లో ఉన్న వారికి అన్ని సమయాల్లో సహాయ సహకారాలు అందించే టీఆర్ఎస్ మలేషియా దాతృత్వాన్ని కొనియాడారు. అనంతరం అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరోనా ఉధృతిని అడ్డుకునే నేపథ్యంలో కేసీఆర్ సమయస్ఫూర్తి, వ్యూహరచనలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో గడగడలాడుతున్న వేళ తెలంగాణ వాసుల యోగక్షేమాలు టీఆర్ఎస్ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల చిట్టిబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్నివేళలా మేము ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు. నిధులు సమకూర్చడంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి, ఇతర దాతలు, ఓంప్రకాష్ బెజ్జంకి, రాజ్ కుమార్ రాకం, సురేష్ రామడుగు, శ్రీ హరి సహకరించారు. -
మలేసియా ప్రధాని అనూహ్య రాజీనామా
కౌలాలంపూర్: మలేసియా ప్రధానమంత్రి అనూహ్యంగా పదవినుంచి తప్పుకున్నారు. ప్రధాని మహతీర్ మొహమాద్ (94)తన రాజీనామాను ఆ దేశ రాజుకు సమర్పించినట్టు సమాచారం. దీనిపై స్పందించడానికి ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినప్పటికీ త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్టు మాత్రం వెల్లడించారు. ఇటీవల నెలకొన్ని రాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటుచేయనున్నారన్న అంచనాల మధ్య ప్రధాని రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. 2018, మేలో మలేసియా మహతీర్ ప్రధానిగా రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. JUST IN: PM @chedetofficial has just sent his resignation letter to the King, after a day of political turmoil in Malaysia. A press statement is to be issued soon. — TheMalaysianInsight (@msianinsight) February 24, 2020 -
జగనన్న దయతో సొంతూళ్లకు వచ్చాం
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ): దేశంకాని దేశం. వీసా గడువు తీరిన తరువాత అక్కడ దొంగచాటుగా బతకాల్సి వచ్చింది. మంచి ఉపాధి అని నమ్మించి ఏపీకి చెందిన వారిని బోగస్ ఏజెంట్లు మలేసియా తీసుకెళ్లి బానిసలుగా మార్చేశారు. అక్కడికి వెళ్లిన తరువాత వారి పాస్‌పోర్టులు తీసుకుని కూలి పనుల్లో చేర్పించారు. చివరికి అక్కడి ప్రభుత్వ దృష్టిలో వారు నేరస్తులుగా మారిపోయారు. అలాంటి దయనీయ స్థితిలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ ఫలితంగా మలేసియా ప్రభుత్వ క్షమాభిక్ష లభించింది. దానికి వారధిగా నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎన్ఆర్టీసీ) నిలిచింది. దీంతో తొలి విడతగా 18 మంది ఆదివారం రాత్రి విశాఖ చేరుకున్నారు. వీరు విశాఖ చేరుకోగానే తమ బాధలు సాక్షితో చెప్పుకున్నారు. సీఎం జగనన్న మాకు మళ్లీ పునర్జన్మ ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు. మొత్తం ఖర్చులన్నీ భరించిన ఏపీ ప్రభుత్వం... మలేసియాలో బాధితుల్ని రప్పించడానికి ఆంధ్రప్రదేశ్, మలేసియా ప్రభుత్వ అధికారులతో ఎన్ఆర్టీసీ సమన్వయం చేసి అన్ని అనుమతులు సాధించింది. తొలి విడతలో వచ్చిన వారిలో కడప జిల్లా వారు ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఆరుగురు, శ్రీకాకుంళ జిల్లా వాసులు ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లా వారు ముగ్గురు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ చైర్మెన్ మేడపాటి వెంకట్ తెలిపారు. మలేసియా నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకు రావడానికి ఫీజులు.. జరిమానాలు.. చార్జీలు మొత్తం కలిపి ఒక్కొక్కరికి రూ. 32 వేలు చొప్పున ఏపీ ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు. తమను రక్షించాలని ఇప్పటి వరకూ 250 మంది బాధితులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విశాఖ చేరుకున్న బాధితులు సాక్షితో మాట్లాడుతూ.. అక్కడ తమను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి ఇళ్లను చేరుకుంటామని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కూలీలుగా మార్చేశారు మంచి ఉద్యోగమని ఏజెంట్లు చెప్పారు. కాని అక్కడికి వెళ్లిన తరువాత కూలీలుగా మార్చేశారు. చాలా ఇబ్బందులు పడ్డాం. సుమారు 12 నెలలనుంచి జీతాలు ఇవ్వలేదు. – పలిమెల మేరి, తూర్పుగోదావరి జిల్లా కార్ వాషింగ్ షెడ్డులో పెట్టారు... మంచి పరిశ్రమలో పని కల్పిస్తామని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత కార్లు కడిగే పనిలో పెట్టారు. ఊరుకాని ఊరు వచ్చి ఏంచేయాలో తెలియని దుస్థితి. 8 నెలలుగా నరకంలో బతికాం. – వెంకటేష్, కడప -
డాక్టర్ సారంగపాణికి మలేసియా ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: మలేసియాలో జరిగే వర్మ, ఆయుర్వేద, సిద్ధ, యోగా అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం నగరానికి చెందిన డాక్టర్ ఎస్. సారంగపాణికి దక్కింది. ఈ మేరకు మలేసియా సొసైటీ ఆఫ్ ఆయుష్ మెడిసిన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. సెలంగొర్‌లోని మహసా యూనివర్సిటీలో ఈనెల 6 నుంచి 8 వరకు జరిగే సమ్మేళనానికి ఆయన హాజరవుతారు. ఆయుర్వేదం ద్వారా అందిస్తున్న వివిధ చికిత్సా పద్ధతులు, వాటి ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనల పురోభివృద్ధి గురించి ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగాలు ఉంటాయి. ఆయుర్వేదంలో సుశృతునిచే చెప్పబడిన క్షారసూత్ర, క్షార కర్మ, రక్తమోక్షణ, జలగ చికిత్సలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు శాస్త్రీయంగా ఎలా నిరూపించబడ్డాయో ప్రపంచ దేశాలకు వైద్యులకు తెలియజేసే అవకాశం ఈ సదస్సు ద్వారా కలుగుతుందని డాక్టర్ సారంగపాణి అన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలో విశేష అనుభం ఉన్న ఆయన డాక్టర్ బీర్ఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం సీసీఐఎం ఎడ్యుకేషన్ కమిటీకి గతంలో మార్గదర్శకుడిగా, వైస్ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. -
ఆ నలుగుర్ని రక్షించాలంటూ విజయసాయిరెడ్డి లేఖ
హైదరాబాద్: మలేసియాలో చిక్కుకున్న నలుగురు తెలుగు యువకులను రక్షించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. బాధితులు విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాంకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి నిమిత్తం వారు మలేసియాకు వెళ్లినట్లు తెలిసిందని, మలేసియాకు వెళ్లిన వెంటనే వారి పాస్‌పోర్టులు లాక్కుని ఏజెంట్ చించేశాడని ఆ తర్వాత గదిలో బంధించాడని తెలిపారు. మలేసియాలో చిక్కుకున్న యువకుల్ని సహృదయంతో కాపాలడాలని సుష్మను కోరారు. -
‘చావాలో.. బతకాలో మీరే తేల్చండి’
కౌలలాంపూర్ : ఇన్స్టాగ్రామ్ పోల్ ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఆమె ఫాలోవర్లు చేసిన సూచనలతో ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. సరవాక్‌కు చెందిన ఓ పదహారేళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోల్ కండక్ట్ చేసింది. దానిలో ‘ఇది నాకు చాలా ముఖ్యం. చావో, బతుకో తేల్చుకోవడంలో నాకు సాయం చేయండి’ అంటూ తన ఫాలోవర్లను కోరింది. ఏదో సరదాకు అనుకున్న నెటిజన్లు.. దాదాపు 69 శాతం మంది ఆమెను చనిపోమ్మని సూచించారు. దాంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై రామ్కర్పాల్ సింగ్ అనే ఎంపీ, లాయర్ స్పందిస్తూ.. ‘పోల్‌లో పాల్గొని చనిపోమని సూచించిన వారందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమెకు చనిపోమ్మని సలహా ఇచ్చింది వారే. తమ సమాధానం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో వారు ఊహించలేకపోయారు. యువతి అనాలోచిత చర్యకు వీరు మద్దతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా దురదృష్టం’ అన్నారు. -
సునామీలు రావడానికి గల 4 కారణాలు!
వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే సునామీలు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలుంటాయి. భూకంపాలు: ఎక్కుసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్లే వస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ ఫలకాల్లో కదలికలు సంభవిస్తుంటాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై, ఆ తర్వాత భూమ్యాకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామీలు సంభవిస్తాయి. మంచుపర్వతాలు విరగడం సముద్రం మధ్యలో ఉండే కొండచరియలు విరిగిపడటం, భారీ మంచుపర్వతాలు పర్వతాలు విరిగిపోవడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి. 1980ల్లో ఫ్రాన్స్‌లో సముద్ర తీరంలో రన్‌వే నిర్మిస్తుండగా, సముద్రంలో మంచుపర్వతం విరిగింది. దీంతో థేబ్స్ నౌకాశ్రయం సమీపంలో సునామీ సంభవించింది. అగ్నిపర్వతాలు పేలడం సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్నిపర్వతం పైభాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీలు వస్తాయి. గ్రహశకలాలు పడటం అప్పుడప్పుడు భూమిపైకి గ్రహశకలాలు, ఉల్కలు రావడం తెలిసిందే. అయితే వీటిలో అత్యధిక శాతం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆకాశంలో మండి బూడిదవుతాయి. అలాకాకుండా భారీ ఆకారంలో ఉండే గ్రహశకలాలు, ఉల్కలు సముద్రంలో కూలినా సునామీ అలలు వస్తాయి. ఇలా జరగడం అత్యంత అరుదు. సముద్రం వెనక్కు ఎందుకు వెళ్తుంది? సునామీకి ముందు కొన్నిసార్లు సముద్రం కొన్ని వందల మీటర్లు వెనక్కు వెళ్తుంది. అయితే సునామీ వచ్చే ప్రతీసారీ ఇలాగే జరగదు. ప్రతీ అలకూ రెండు దశలుంటాయి. ఒకటి ముందుకు రావడం, రెండోది వెనక్కు వెళ్లడం. సునామీ అలా ఎక్కడో తీరానికి దూరంలో, సముద్రం మధ్యలో ముందుగా మెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత అది దశలవారీగా పరిమాణం పెంచుకుంటూ తీరంపై భారీ ఎత్తున ఎగసిపడుతుంది. తీరానికి వచ్చే అల ముందుగా ముందుకు వచ్చి తర్వాత వెనక్కు వెళ్లేది అయితే సముద్రం వెనక్కు వెళ్లదు. ఒక్కసారిగా సునామీ వచ్చి మీదపడుతుంది. అదే తీరానికి వచ్చే అలా ముందు వెనక్కు వెళ్లి తర్వాత ముందుకు వచ్చేది అయితే సముద్రం సాధారణం కన్నా బాగా వెనక్కు వెళ్లి మళ్లీ పెద్ద అలగా వస్తుంది. ఎప్పుడైనా సముద్రం ఎక్కువ దూరం వెనక్కు వెళ్లడాన్ని గమనిస్తే అక్కడే చూస్తూ నిల్చోకుండా వెంటనే పరుగెత్తుతూ వెనక్కు వచ్చేయాలి. అక్కడే ఎందుకు ? జకార్తా: ఇండోనేసియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కవగా సంభవించే పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఇండోనేసియా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు వాతావరణ మార్పులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. కరువు కాటకాలు, ఆర్థిక వనరుల కొరత, అవినీతి వల్ల ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా మౌలిక వసతుల నిర్మాణం అక్కడ జరగడం లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయానికి తోడు ఇండోనేసియాలో విస్తారంగా అడవులను నరికివేస్తున్నారు. దీంతో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటోంది. అంతేకాకుండా ఇండోనేసియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 129 క్రీయాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. యురేసియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇండో–ఆస్ట్రేలియన్ ప్లేట్ల మధ్య రాపిడి కారణంగా ఇక్కడి భూపొరల్లో ఒత్తిడి పెరిగి తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇండోనేసియాలో 50 లక్షల మంది ప్రజలు అగ్నిపర్వతాల ‘డేంజర్ జోన్’లో ఉంటున్నారు. 10 అత్యంత భీకర సునామీలు సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యమేనని ఇండోనేసియా సునామీ మరోసారి రుజువు చేసింది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో సునామీ విధ్వంసం సృష్టించే వరకు ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. వాటిల్లిన ఆస్తి, ప్రాణ నష్టం ఆధారంగా చరిత్రలో నమోదైన 10 అత్యంత భీకర సునామీల వివరాలిలా ఉన్నాయి. 1. సుమత్రా, ఇండోనేసియా, 2004 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. 2.ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్, 2011 పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్‌కు ఐదేళ్లు పడుతుందని అప్పట్లో ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది. 3.లిస్బన్, పోర్చుగల్, 1755 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు. 4. క్రకటోవా, ఇండోనేసియా, 1883 క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు. 5.ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్‌లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది. 6.నాంకైడో, జపాన్, 1707 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్‌లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి. 7.సాంక్రికు, జపాన్, 1896 జపాన్‌లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు. 8.ఉత్తర చిలీ, 1868 8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. 9.రైకూ దీవులు, జపాన్, 1771 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 10. ఐస్ బే జపాన్, 1586 రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. సునామీ నుంచి ఇలా తప్పించుకోవచ్చు! సునామీల సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సెంట్రల్ అమెరికా సెస్మలాజికల్ సెంటర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సునామీ వచ్చేముందు ఏర్పడే పరిస్థితులపై తీరప్రాంత ప్రజలు అవగాహన కలిగిఉండాలని వ్యాఖ్యానించారు. సాధారణంగా తీరప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడు భారీ రాకాసి అలలతో సునామీలు విరుచుకుపడతాయని వెల్లడించారు. అలాగే సునామీ వచ్చేముందు సముద్రంలో నీరు బాగా వెనక్కి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. ఒకవేళ మీరు తీరప్రాంతంలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. è భూకంపం రాగానే కంగారుపడకుండా సురక్షితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ► అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఎత్తైన ప్రాంతం, లేదా ఎత్తైన భవనం పైకి చేరుకోండి. ఈ ప్రాంతం లేదా భవనం సముద్రమట్టం కంటే 30 మీటర్ల ఎత్తులో ఉండేలా చూసుకోండి. ► సముద్రంలో నీరు వెనక్కు వెళుతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడి నుంచి వీలైనంత దూరంగా వచ్చేయండి. ► ఒకవేళ తీరప్రాంతాల్లో ఎత్తైన భవనాలు లేకుంటే అటవీ ప్రాంతంలోకి వెళ్లాలి. ► సునామీల ప్రభావంతో నదులు సైతం కొన్ని కిలోమీటర్ల మేర ► వెనక్కు చొచ్చుకొస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాగులు, వంకలకు దూరంగా ఉండండి. ► అధికారులు చెప్పేవరకూ తిరిగి ప్రభావిత ప్రాంతాలకు రాకండి. ఇది క్రకటోవా పిల్లనే... జకర్తా: ఇండోనేసియన్ భాషలో ఆనక్ అంటే బిడ్డ, శిశువు అని అర్థం. క్రకటోవా అనే మరో అగ్నిపర్వతం నుండి ఏర్పడింది కాబట్టి దీనిని ఆనక్ క్రకటోవా అని పిలుస్తారు. సుండా జలసంధిలోనే క్రకటోవా అగ్నిపర్వతం ఉండేది. 1883లో అది పేలి ఏకంగా 36 వేల మంది చనిపోయారు. ఆ అగ్నిపర్వతం అవశేషాల నుంచే మళ్లీ 1928లో ఆనక్ క్రకటోవా ఏర్పడింది. అందుకే దీనిని పిల్ల క్రకటోవా అంటారు. ఇక్కడ మనుషులెవరూ నివసించకపోయినప్పటికీ ఇదో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ‘ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతంలో మార్పుల కారణంగానే సముద్రంలో భూ పొరలు స్థానభ్రంశం చెందాయి. ఇది సరిగ్గా పున్నమి నాడు జరగడంతో ఈ భారీ విధ్వంసం సంభవించింది’ అని ఇండోనేసియా జాతీయ విపత్తు స్పందన దళం అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రోహో చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచే అగ్నిపర్వతం అప్పుడుప్పుడు లావాను, బూడిదను వెదజల్లుతోంది. భారీ మొత్తంలో బూడిద ఆకాశంలోకి వెళ్లడం కనిపిస్తుండేది. అక్టోబర్ నెలలో లావా ఎగిరొచ్చి ఓ టూరిస్ట్ బోట్‌కు అతి సమీపంలో పడింది. అగ్నిపర్వతం తీరానికి సమీపంలోనే ఉండటంతో ఇప్పుడు చాలా తొందరగా అలలు వచ్చి తీరప్రాంతాలపై విరుచుకుపడ్డాయని ‘ది ఓపెన్ యూ నివర్సిటీ’ ప్రొఫెసర్ డేవిడ్ రోథరీ తెలిపారు. తీరానికి దగ్గర్లో ఉన్నందునే సునామీ ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసే పరికరాలు సముద్రంలో ఉంటాయనీ, ఇలాంటి పరికరం అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నప్పటికీ.. అగ్నిపర్వతం కూడా తీరానికి దగ్గర్లోనే ఉండటంతో పరికరం నుంచి వచ్చిన సంకేతాలను అందుకునేలోపే భారీ అలలు ఎగసిపడ్డాయని డేవిడ్ వివరించారు. రెండు మూడేళ్లకోసారి ఈ అగ్నిపర్వతం అప్పుడప్పుడూ చిన్నగా పేలుతూనే ఉందని ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. ఇప్పుడు కూడా అగ్నిపర్వతం పేలుడు తీవ్రత చాలా తక్కువగానే ఉంటుందనీ, అయితే అప్పుడే భూ ఫలకలు కదలడం వంటి చర్యల కారణంగా సునామీ సంభవించి ఉండొచ్చని ఆయన చెప్పారు. ఇండోనేసియాలో దాదాపు 130 వరకు క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే దీన్ని పసిఫిక్‌లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. -
మలేసియాలో మస్త్ మజా
బిజీ షెడ్యూల్స్ మధ్య కాస్త తీరిక సమయం దొరికితే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు మహేశ్‌బాబు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఆయన మలేసియాలో హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆయన సతీమణి నమ్రత. ఇక సినిమాల విషయానికి వస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ కానుంది. వచ్చే నెల మొదటి వారంలో అక్కడ చిత్రీకరణ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈలోపు ఈ హాలిడేను ప్లాన్ చేసుకున్నట్లున్నారు. -
మలేషియా ఉద్యోగాల పేరుతో మోసం
నిజామాబాద్ : మలేషియాలో 10 మంది నిజామాబాద్ వాసులు ఇరుక్కుపోయారు. ఓ గల్ఫ్ ఏజెంట్, రూ.35 వేలు జీతం అని చెప్పి విజిట్ వీసాలతో పది మందిని మలేషియా పంపించాడు. మలేషియాలో తిండీ గూడు లేక తిరిగొచ్చేందుకు డబ్బులు నరకయాతన పడుతున్నారు. బాధితుల స్వస్థలం బాల్కొండ మండలం జక్రాన్ పల్లి. రూ.60 వేలు కట్టబెట్టి వచ్చినా నిలువునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వాట్సప్ వీడియోల ద్వారా బంధువులకు, స్నేహితులకు సమాచారం పంపారు. ఈ సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
‘జకీర్‌ను అప్పగించే ప్రసక్తే లేదు’
పుత్రజయ, మలేషియా : వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ అప్పగింత విషయంలో భారత్‌కు మలేషియా షాకిచ్చింది. జకీర్‌ను భారత్‌కు అప్పగించే ప్రసక్తే లేదని మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ శుక్రవారం స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జకీర్ మలేషియాలో శాశ్వత నివాస హోదా కలిగి ఉన్నారు. ఆయన వల్ల మాకు సమస్యలు రానంత వరకు దేశం విడిచి వెళ్లాలంటూ ఒత్తిడి చేయలేమని’ మహతీర్ వ్యాఖ్యానించారు. కాగా మలేషియాలో నివాసముంటున్న జకీర్‌ను అప్పగించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ మలేషియా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. అప్పగింత ఒప్పందంలో భాగంగా గత జనవరిలో భారత్ చేసిన అభ్యర్థనకు మలేషియా సానుకూలంగా స్పందిస్తుందంటూ విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధానే స్వయంగా ఈ విషయమై స్పష్టతన్విడం గమనార్హం. అవన్నీ అవాస్తవాలు.. ఆర్థిక ఉల్లంఘనలతో పాటు మత విద్వేషాలకు పాల్పడుతున్నారని జకీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా కొద్ది రోజులుగా.. జకీర్ భారత్‌కు తిరిగి వస్తున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ‘భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగినప్పుడే భారత్‌కు తిరిగి వస్తాను. అంతవరకు ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేరంటూ’ జకీర్ పేర్కొన్నారు. -
పెరుగుతున్న మలేషియా బాధితులు
వేంపల్లె : మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు రాబట్టి.. వారికి టూరిస్టు వీసా ఇచ్చి మోసం చేసిన కేసులో మామాఅల్లుళ్లు ఫకృద్దీన్, సలీం బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. వేంపల్లె, చిలంకూరు, కడపకు చెందిన ఏడుగురు యువకులకు వారు ఈ విధంగా చెప్పి మోసం చేశారు. ఈ కారణంగా బాధితులు విదేశాల్లో అష్టకష్టాలు ఎదుర్కొని స్వదేశానికి తిరిగి వచ్చారు. వారితోపాటు మరికొందరు మంగళవారం వేంపల్లె గరుగువీధిలో నివసిస్తున్న ఫకృద్దీన్, సలీం ఇంటి వద్దకు వెళ్లారు. తమకు జరిగిన మోసంపై పలువురు నిలదీశారు. దీనికి వారు సానుకూలంగా స్పందించకపోగా.. ఏం చేసుకుంటారో చేసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మామ, అల్లుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మరి కొంత మంది బాధితులు వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నారు. బాధితులు ఇంకెంత మంది ఉన్నారోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొంత మంది మలేషియాలోని జైలులోనే ఉన్నట్లు తెలియవచ్చింది. ఫిర్యాదుదారులతో నిందితులు బేరసారాలు సాగిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ చలపతిని వివరణ కోరగా.. ఇప్పటి వరకు 15 మంది బాధితులు తమను సంప్రదించారని తెలిపారు. -
మలేసియాలో స్టార్స్ క్రికెట్
తమిళసినిమా(చెన్నై): మలేసియాలో కోలీవుడ్ సినీ ప్రముఖులు స్టార్స్ క్రికెట్ పోటీ, ఆటపాటలతో సందడి చేశారు.మలేసియాలోని బూకీజాలీ స్టేడియంలో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్ సహా దాదాపు 340 మంది నటీనటులు పాల్గొన్నారు. తొలుత క్రికెట్‌తో, అనంతరం పలు సినీ, సాంస్కృతిక కార్యక్రమాలతో మలేసియా ప్రేక్షకులను కోలీవుడ్ స్టార్స్ అలరించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం కోసం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం మలేసియా చేరుకున్న తమిళ నటులకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మలేసియా ప్రధాని అబ్దుల్ రజాక్ రజనీకాంత్‌ను కలసి అభినందించారు.