marrage
-
తెలుగమ్మాయే కానీ తమిళంలో ఫేమస్.. రీసెంట్గా ప్రియుడితో పెళ్లి (ఫొటోలు)
-
పోలీసుల అదుపులో ప్రేమజంట
చంద్రగిరి(తిరుచానూరు): ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ప్రేమ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుండగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన అలేఖ్య(26), శివ(33) గత 11 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో గురువారం అన్నవరంలోని ఓ రామాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయిఏత అలేఖ్య అదృశ్యమైందంటూ ఆమె తల్లిదండ్రులు భవానీ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అలేఖ్య వివరాలను అన్ని పోలీసు స్టేషన్లకు అందించి అప్రమత్తం చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో వస్తున్న అలేఖ్య, శివ దంపతులను తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్థానిక పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడి నుంచి తిరుచానూరుకు బయల్దేరారు. ఇదిలా ఉండగా ప్రేమజంట అలేఖ్య, శివ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. తమకు ఇష్ట్రపకారమే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఈ పెళ్లి అలేఖ్య తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను పోలీసులే రక్షించాలంటూ వారు ఆ వీడియోలో కోరారు. దీనిపై సీఐ సునీల్‌కుమార్‌ను వివరణ కోరగా... విజయవాడలో అలేఖ్య మిస్సింగ్ అయ్యినట్లు కేసు నమోదైందని, దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించామన్నారు. వారు ప్రేమజంటను తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. -
ఇంటి పేరు మార్చుకుంటున్నారా..?
వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు చూస్తుంటాం. ఆమెకు, ఆమె సంతానానికి సహజంగానే భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. అప్పటి వరకు తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసిన ఆమె, తన విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్లో అదే పేరును కలిగి ఉంటుంది. మరి పెళ్లి తర్వాత ముఖ్యమైన పత్రాల్లో భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా..? వద్దా..? ఇదొక పెద్ద సందేహం. చాలా మంది ఈ విషయంలో డోలాయమాన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. వివాహానంతరం తండ్రి ఇంటి పేరుతో కొనసాగేందుకు అందరూ అంగీకరించకపోవచ్చు. భర్త అంగీకరించినా, మార్చుకోవడం సులభమేమీ కాదు. ఇందులోని సాధక బాధకాలను పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో సులభంగా తేల్చుకోవచ్చు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కేవలం ఆధార్‌లో మాత్రమే ఇంటి పేరును మార్చుకుని వదిలివేయడం సరైనది కాదు. విద్యార్హతలు సహా చట్టబద్ధమైన అన్ని పత్రాలు, పెట్టుబడుల డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కేవలం పాన్, ఆధార్‌లోనే ఇంటి పేరు మార్చుకుంటే, అది ఎన్నో ఇక్కట్లకు దారితీయవచ్చు. ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతాల్లోని పేర్లకు, పాన్, ఆధార్‌లోని పేర్ల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఆయా ఖాతాల నుంచి నిధులను వెనక్కి తీసుకోవాలంటే.. పేరును అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం మరోసారి కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయక తప్పదు. పేర్ల అప్డేట్ కోసం అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావచ్చు. ‘‘వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఈ విషయంలో లాభ, నష్టాలు రెండింటినీ పరిశీలించుకోవాలి. పేరును మార్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే కుటుంబం అంతటికీ ఒకే విధమైన గుర్తింపు, ఏకరూపత ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు శ్రమ పడాల్సి రావడమే ప్రతికూలం’’అని ఫిన్‌ఎడ్జ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా భారతి వివరించారు. పెళ్లయిన తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ‘అలగ్ అండ్ కపూర్ లా ఆఫీసెస్’ (న్యాయ సేవల సంస్థ) పార్ట్నర్ సోనాల్ అలఘ్ పేర్కొన్నారు. గతంలోని పేరుకు, ప్స్ట్రేతుత పేరుకు మధ్య మార్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎన్నో పరిశీలనలకు తోడు వృత్తిపరమైన ధ్రువీకరణలు అవసరం పడతాయన్నారు. భర్త ఇంటి పేరు అప్పటి వరకు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకుంటున్నట్టు అయితే చట్టబద్ధంగా గుర్తింపును మారుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అధికారిక రికార్డుల్లో పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాలనాపరమైన పెద్ద చిక్కుగా, సవాలుతో కూడుకున్నదిగా అభివర్ణించారు సోనాల్ అలఘ్. ‘‘దీనికి తోడు విద్యా, ప్రభుత్వ సంస్థల్లో పేరు మార్పునకు సంబంధించిన కఠిన ప్రక్రియ కష్టాలను మరింత పెంచుతుంది. దీంతో గుర్తింపు సమస్యలు ఎదురుకావచ్చు’’అని ఆమె పేర్కొన్నారు. మహిళ ఇంటి పేరును మార్చుకుంటుంటే, అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేసుకోవాలని దీపికా భారతి సూచించారు. కేవలం కొన్నింటిలోనే మార్పు చేసుకుని వదిలేస్తే, విదేశాలకు వెళ్లే సందర్భాల్లో, పెట్టుబడుల సమయంలో, లేదంటే నామినీగా ఉండి పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆస్తులు తదితర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పాలసీల్లో పేరులో మార్పు చేయకపోతే, గుర్తింపును నిరూపించుకునేందుకు లేదా ఆయా ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కరంజ్వాలా అండ్ కో పార్ట్నర్ మేఘనా మిశ్రా పేర్కొన్నారు. ఆస్తి పత్రాల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకున్న ప్రతి ఒక్కరూ.. తమ పేరిట ఉన్న భౌతిక, ఆర్థిక ఆస్తులు అన్నింటిలోనూ ఆ మేరకు సవరణ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కసారి ఆధార్, పాన్‌లో కొత్త ఇంటి పేరు ఆధారంగా సవరణ చేసుకుంటే, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల్లో మార్చుకోవడం సులభతరం అవుతుందని భారతి తెలిపారు. ఉద్యోగం చేసే చోట అధికారిక రికార్డుల్లోనూ ఇంటి పేరులో మార్పు చేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించొచ్చు. మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? నేటి రోజుల్లో దాదాపు అధిక శాతం మహిళలు పెళ్లయిన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటున్నారు. భర్త ఇంటి పేరుకు మారిపోవడం వల్ల గుర్తింపు సులభంగా ఉంటుందని మిశ్రా తెలిపారు. సామాజికంగా ఒకే కుటుంబం అన్న భావన, కుటుంబంలో ఐక్యతకు ఇది అనుకూలిస్తుందన్నారు. పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కీలక పత్రాల్లో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ (వివాహ ధ్రువీకరణ) సమరి్పంచాల్సి వస్తుంది. పాస్ పోర్ట్ ఆఫీస్, ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి నిర్ధేశిత దరఖాస్తుకు అనుబంధంగా వివాహ ధ్రువీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలి. మ్యారేజ్ సర్టిఫికెట్‌తోపాటు గుర్తి్తంపు, చిరునామా ధ్రువీకరణ, పేరు మార్పునకు సంబంధించి అఫడవిట్ అవసరమవుతాయని మిశ్రా తెలిపారు. ‘‘నిర్ధేశిత మార్పునకు సంబంధించి చటబద్ధమైన ప్రక్రియలకు కట్టుబడి ఉండడం కీలకం. ఇక్కడ చెప్పినవన్నీ ప్రాథమికంగా సమర్పించాల్సినవి. విడిగా ఆయా డాక్యుమెంట్లలో మార్పులకు గాను సమరి్పంచాల్సినవి వేరేవి కూడా ఉండొచ్చు’’అని మిశ్రా పేర్కొన్నారు. పదో తరగతి మెమో చాలా వాటికి పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో పేరు మార్చుకోవడం కష్టమేనంటున్నారు మేఘన మిశ్రా. ‘‘సీబీఎస్ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లలో పేర్ల మార్పునకు అనుమతించడం లేదు. పాన్, పాస్‌పోర్ట్‌కు టెన్త్ సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. పాన్/ఆధార్‌కు, సీబీఎస్ఈ పదో తరగతి సర్టిఫికెట్లో పేరుకు వ్యత్యాసం ఉంటే బ్యాంక్ ఖాతా లేదా పాస్‌పోర్ట్ తీసుకునే విషయంలో ధ్రువీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. వివాహానంతరం వృత్తిపరమైన విద్యార్హతల డాక్యుమెంట్లు, కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు, అంతకుముందు డాక్యుమెంట్లలో మాదిరే ఉండాలి’’అని మిశ్రా వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఏక్తా రాయ్ అభిప్రాయం భిన్నంగా ఉంది. స్కూల్ సర్టిఫికెట్లు అన్నవి ఒక నిరీ్ణత కాలం వరకు పుట్టిన తేదీకి ధ్రువీకరణలుగా కొనసాగుతాయి. ఇతర కీలక డాక్యుమెంట్లు అయిన పాన్, ఆధార్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇంటి పేరును అప్డేట్ చేసుకున్న తర్వాత, స్కూల్ సర్టిఫికెట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వివాహానంతరం మహిళ పాన్ లేదా ఆధార్‌లో పేరు మార్చుకునేట్టు అయితే లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు అయితే తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని, వివాహ రిజిస్ట్రేటేషన్ సర్టిఫికెట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా మేజి్స్ట్రేట్ నుంచి పాఠశాల సర్టిఫికెట్లలో ఇంటి పేరు మార్పును ధ్రువీకరిస్తున్నట్టు అటెస్టేషన్ తీసుకున్నా అది కూడా పరిగణనలోకి వస్తుంది’’అని ఏక్తా రాయ్ తెలిపారు. ఆస్తుల క్లెయిమ్ కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు. కుమార్తెలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే పేర్కొంటారు. వీలునామా రాసిన వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చే నాటికి మహిళలు వివాహాలు చేసుకుని, భర్త ఇంటి పేరుకు మారి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వీలునామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాపర్టి, యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లలోని ఇంటి పేరు ఒకే మాదిరిగా ఉండకపోతే సవాళ్లు ఎదురవుతాయని ఏక్తారాయ్ అంటున్నారు. వీలునామాలోని పేరుకు, ప్స్ట్రేతుతం మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే, అదనపు రుజువులు, డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుందని సోనాల్ అలఘ్ తెలిపారు. మహిళ ఇంటి పేరు మార్పు వెనుకనున్న అంశాలను కోర్టులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అందుకు సంబంధించి సహేతుక ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, దాంతో ఆస్తుల బదిలీ సాఫీగా పూర్తవుతుందని సూచించారు. వీసాకు దరఖాస్తు ‘‘వీసాలో పేరు అప్డేట్ చేసుకోవడం లేదంటే భాగస్వామి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న భిన్నమైన కుటుంబ నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాల్లో గుర్తించేందుకు ఎన్నో రకాల రుజువులు సమరి్పంచాల్సి రావచ్చు. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మారిన పేరుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని భావించే వారికి ఈ సవాలు ఎదురవుతుంది’’అని అలఘ్ అంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, అప్పుడు వివాహ స్థితిని తెలిపే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇది వీసా జారీని ఆలస్యం చేయవచ్చు. అందుకే పెళ్లి తర్వాత పాస్‌పోర్ట్‌లో భర్త ఇంటి పేరు ప్రతిఫలించేలా మార్పు చేసుకోవాలని మిశ్రా సూచించారు. దీనివల్ల ధ్రువీకరణ సమస్యలు తక్కువగా ఉంటాయన్నారు. పేరు మార్చుకోకపోతే..? వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించే మహిళలూ కొందరు ఉన్నారు. అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును పేర్కొనే సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. కనుక తనకు, తన భర్తకు మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ‘‘వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని నిరూపించుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఆస్తుల లావాదేవీల సమయంలో ఇది అవసరపడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే భర్త పేరుతో అప్డేట్ చేసిన ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ జాయింట్ అకౌంట్ పాస్‌బుక్ లేదా స్టేట్మెంట్, ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టు రుజువులు, అఫిడవిట్ సాయపడతాయి’’అని మిశ్రా తెలిపారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్ వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు.. ఆ దంపతులకు జని్మంచే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో తల్లి, తండ్రి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా.? అన్న సందేహం రావచ్చు. పిల్లల పేరిట పీపీఎఫ్, సుకన్య సముృద్ధి యోజన తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చే యాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికెట్ అవసరం పడు తుంది. అంతేకానీ, అందులో తల్లి, తండ్రి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే ఎలాంటి సమస్య రాదని మిశ్రా పేర్కొన్నారు. మొత్తం పేరే మారితే? కొన్ని వర్గాల ప్రజల్లో పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరే కాకుండా, మొదటి పేరులోనూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సమస్యలకు దారితీస్తుందని మిశ్రా చెప్పారు. అధికారిక రికార్డులతో పోలిస్తే పేర్ల మధ్య పోలిక లేకపోవడం వల్ల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేరు మార్చుకునే విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం వల్ల సవాళ్లను అధిగమించొచ్చని సూచించారు. -
అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..
ఢిల్లీ: 1860 నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపును దాచిపెట్టి యువతిని వివాహం చేసుకుంటే ఇలాంటి నేరాలకు ఇకపై 10 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా నింబంధనలను పొందుపరిచారు. ఇదే కాకుండా ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానంతో మహిళను వివాహమాడటం లేదా లైంగిక చర్యలకు పాల్పడితే కూడా పదేళ్ల వరకు శిక్ష పడే విధంగా నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో నిబంధనలు పొందుపరిచారు. ఉద్యోగం, పదోన్నతి, వివాహం వంటి అంశాల్లో తప్పుడు వాగ్దానాలతో స్త్రీతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేదు కానీ పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అత్యాచార ఘటనల్లో.. కొత్త న్యాయ చట్టాల ప్రకారం గ్యాంగ్‌రేప్ నేరంలో దోషికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే మరణిశిక్ష ఉంటుంది. అత్యాచారంలో బాధితురాలు మరణిస్తే.. 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష, జీవితకాలం లేదా మరణశిక్ష పడే అవకాశాలను చట్టంలో సూచించారు. 12 ఏళ్లలోపు బాలలపై రేప్ ఘటనల్లోనూ ఇదే తరహా శిక్షలు అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా శుక్రవారం పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!
జార్ఖండ్‌లోని రాంచీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతో పాటు ఇతర లాయర్లు చావచితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు చేరుకుని, భర్తపై దాడి చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం చెలరేగింది. కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్‌కు అతని ముగ్గురు భార్యలకు మధ్య జరిగిన వివాదం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న స్థానికులంతా కలసి ఆ లాయర్‌పై తలొదెబ్బ వేశారు. తమ భర్త తమ కళ్లుగప్పి, నాలుగో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని అతని భార్యలు మీడియాకు తెలిపారు. నయీముద్దీన్ ఉరఫ్ నూరి అనే న్యాయవాది ముగ్గురు భార్యలు మీడియాతో మాట్లాడుతూ తమ భర్త అతని దగ్గర పనిచేసే జూనియర్‌తో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆమెను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. ఆ న్యాయవాది ముగ్గురు భార్యలు ఈ విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నయీముద్దీన్ రాంచీలోని సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల అతని ముగ్గురు భార్యలు అతనిని కలుసుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు అతను వారిని నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ముగ్గురు భార్యలు అతనిపై చేయిచేసుకున్నారు. నయీముద్దీన్ మొదటి భార్య అదే సివిల్ కోర్టు ఉద్యోగి. దీంతో ఆమె సహోద్యోగులు ఆమెకు సహకారం అందిస్తూ, ఆ న్యాయవాదిపై దాడి చేశారు. ఈ ఉదంతంపై భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్‌హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక..
కర్నూలు: తనను ప్రేమించి.. పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలు జన్మించాక వదిలేయడం అన్యాయమని, తనకు న్యాయం చేయాలంటూ రజియాబీ అనే మహిళ ఆదివారం భర్త వినోద్‌కుమార్ ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు.. కడివెళ్ల గ్రామానికి చెందిన గొల్ల వినోద్‌కుమార్ తమ ఇంటి సమీపంలో నివాసముంటున్న రజియాబీనీ ప్రేమించాడు. 13 సంవత్సరాల క్రితం ముంబైకి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం కాపురాన్ని ఎమ్మిగనూరుకు మార్చాడు. వీరికి గొల్ల తేజ(7), గొల్ల అంజలి(5) ఇద్దరు సంతానం ఉన్నారు. ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామమైన కడివెళ్లకు వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో వర్గం యువతిని పెళ్లి చేసుకున్నావని, కులం వాళ్లు నుంచి మాట వస్తోందని వినోద్‌కుమారుకు కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో కొన్ని నెలల నుంచి రజియాబీకి దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా నెల క్రితం కర్ణాటకలోని తమ బంధువుల అమ్మాయితో వినోద్‌కుమార్‌కు రహస్యంగా పెళ్లి జరిపించారు. విషయం తెలుసుకున్న రజియాబీ రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 5న వినోద్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అయితే తనకు న్యాయం చేసేంత వరకు భర్త ఇంటి ముందు నుంచి కదలబోనని కడివెళ్లలో రజియాబీ ఆదివారం దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. అయినా ఆమె వినుకోలేదు. తన భర్త ఇంట్లోకి పిలుచుకోవాలని లేదంటే బయటే కూర్చుంటానని తేల్చిచెప్పారు. వినోద్ కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చిస్తున్నారు. -
‘రెండు రోజులు లేటయ్యింది.. సారీ ప్రియా..’ అంటూ నవవివాహిత ఆత్మహత్య
రాజస్థాన్‌లోని బాడ్మేర్లో తన ప్రియురాలికి పెళ్లి కావడంతో కలత చెందిన ప్రియుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ప్రియుని ఆత్మహత్య విషయం తెలుసుకున్న నవవివాహిత తనకు పెళ్లి అయిన మూడవ రోజున బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకునేముందు సోషల్ మీడియాలో తన ప్రియుని ఫొటోతో పాటు ‘మనం జీవించినా, మరణించినా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం.. మరి నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?’ అని రాస్తూ.. ‘ఈ బాధిత ప్రపంచంలో నన్ను ఎందుకు వంటరిగా వదిలేశావు? మరే పర్వాలేదు.. ఇప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నువ్వు ఎప్పటికీ నా ప్రాణానివే. రెండు రోజులు లేటయ్యింది. సారీ ప్రియా’ అని రాసింది. ఈ విషాదకర ఉదంతం ఘోరీమన్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని షోభాలా జైత్మాలాలో చోటుచేసుకుంది. జూలై 4న వివాహం మీడియాకు అందిన సమాచారం ప్రకారం షోభాలా జైత్మాలాకు చెందిన అనిత(22), పుర్ఖారామ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరూ కాంపిటీటివ్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు జూలై 4న వివాహం జరిగింది. దీంతో తీవ్రంగా కలతచెందిన పుర్ఖారామ్ జూలై 4న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 5న ఆ ప్రియురాలికి తన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసింది. బావిలో తేలిన నవవివాహిత మృతదేహం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్లయిన అనిత తన ఇంటి నుంచి పాలు తీసుకువచ్చేందుకు పశువులశాలకు వెళ్లింది. ఎంతసేపయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెదుకులాట సాగించారు. వారికి ఒక బావి దగ్గర ఒక పాల పాత్ర కనిపించింది. దీంతో వారు అనుమానంతో బావిలోకి తొంగి చూశారు. బావిలో వారికి అనిత మృతదేహం తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, అది పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమికుల ఆత్మహత్య గ్రామంలోని వారందరినీ శోకసంద్రంలో ముంచింది. ఇది కూడా చదవండి: కొడుకును ఎనిమిదేళ్లు ఎందుకు దాచిపెట్టింది? అమ్మతనానికి మచ్చ! -
ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే తమిళ్, కన్నడలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్లో మాత్రం తన ఎంట్రీ ప్రకటనతోనే సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు సంబంధించి ఓ వార్త కోలీవుడ్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) అదేమిటంటే..ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అనే వార్త వైరల్ అవుతుంది. అబ్బాయి కూడా కోలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని కూడా తెలుపుతున్నారు. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోందని సమాచారం. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వారి కుటుంబాల నుంచి రాలేదు. కానీ జరిగేది ఇదేనని బలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇదీ చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!) కోలీవుడ్‌లో 'అదగపాతుతు మగజనంగలే' అనే సినిమాతో 2017లో ఉమాపతి రామయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన పలు టీవి షోలతో పాటు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఐశ్వర్య విషయానికొస్తే తెలుగులో హీరోయిన్గా లాంచ్ చేయాలని అర్జున్ చాలా కసరత్తు చేశాడు. అందుకు కోసం హీరోగా విష్వక్సేన్ పేరును కూడా ప్రకటించాడు. అయితే, ఈ మూవీ నుంచి విష్వక్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్వరలో మరో హీరో పేరును ప్రకటిస్తామని ఆయన గతంలో తెలిపాడు. Umapathy Ramaiah (Thambi Ramaiah Son) & Aishwarya Arjun (Arjun’s Daughter) to tie the knot soon! pic.twitter.com/r0dRY3i6js — Christopher Kanagaraj (@Chrissuccess) June 25, 2023 -
ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు!
అక్కడ బంధువులందరి సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. దీంతో ఆనందంగా వధువును తీసుకుని వరుడు తమ ఇంటికి బయలుదేరాడు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. వరుడు ఆ నూతన వధువును పుట్టింటికి దిగబెట్టేశాడు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తురక్‌వలీ గ్రామం నుంచి మగపెళ్లివారు ఊరేగింపుగా ఆలమ్‌పురి గ్రామానికి చేరుకున్నారు. ఆడపెళ్లివారు వారికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. రాత్రివేళ వివాహతంతు ఘనంగా ముగిసింది. అయితే ఆడపెళ్లివారు వరునికి బంగారు ఉంగరం, గొలుసు ఇచ్చుకోలేకపోయారు. దీంతో వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్యాణమండపం బయట నిలిపివుంచిన కారు వద్దకు నేరుగా చేరుకున్నాడు. దీంతో వధువు కూడా వచ్చి అదే కారులో కూర్చుంది. వారు ప్రయాణిస్తున్న కారు వరుని ఇంటివైపు బయలుదేరింది. అయితే కొద్దిదూరం వెళ్లాక వధువు పుట్టింటివారికి ఫోను చేసిన వరుడు.. తాము వధువుతోపాటు తిరిగి వెనక్కి వస్తున్నామని చెప్పాడు. కొద్దిసేపటి తరువాత వధువు ఇంటికి చేరుకున్న వరుడు తనకు వెంటనే బంగారు ఉంగరం, గొలుసు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వధువు తాను అత్తారింటికి వెళ్లేదిలేదని తెగేసి చెప్పింది. తరువాత పెళ్లికూతురి తరపు బంధువులు వరునితోపాటు అతని తండ్రిని, మరో బంధువును తాళ్లతో కట్టేసి, తాము పెళ్లి ఖర్చుచేసిన రూ.6 లక్షలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ పంచాయితీ జరిగిన అనంతరం వరుని తరపువారు అమ్మాయి తరపువారి నుంచి తీసుకున్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. అలాగే ఈ పెళ్లికి ఆడపెళ్లివారు ఖర్చుచేసిన దానిలో ఒక లక్షా 90 వేల రూపాయలను తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ వివాహం రద్దయ్యింది. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారి కేకే అవస్థీ మాట్లాడుతూ ఈ పెళ్లికి సంబంధించి ఇరువర్గాలవారు రాజీమార్గంలో వివాహాన్ని రద్దు చేసుకున్నారని తెలిపారు. -
వింత ఆచారం.. కుక్కతో పిల్లకు పెళ్లి.. కీడు తొలగిపోవాలని తంతు!
భువనేశ్వర్: విద్య, వైజ్ఞానికతతో దూసుకుపోతున్న సమాజంలో ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి. సంప్రదాయ ముసుగులో అంధ విశ్వాసాల ఆచరణ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు వింతలు, విడ్డూరాలు వర్ధమాన సమాజంలో వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి వింత ఆచారం బాలాసోర్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. కుక్కతో బాల్య వివాహం చేస్తే బాలారిష్టాలు తొలగి పోతాయని ఇరువురు బాలలకు వివాహం జరిపించారు. సంప్రదాయ గిరిజన సమాజంలో పసి పిల్లలకు తొలి దంతం/పన్ను పైవరుసలో మొలిస్తే అరిష్టంగా పరిగణిస్తారు. ఈ అరిష్టం తొలగించేందుకు ఆ బాలుడు లేదా బాలికను కుక్కతో పెళ్లి జరిపించడం ఆచారంగా కొనసాగుతోంది. బాలలకు పైవరసలో తొలి దంతం మొలిస్తే పలు రకాల వ్యాధులు వేధిస్తాయని ఈ వర్గం ఆందోళన. పిల్లల్లో ఈ బాలారిష్టం తొలగించేందుకు కుక్కతో పెళ్లి జరిపిస్తే రోగాలు, వ్యాధులు తొలగి.. పెళ్లి జరిపించిన శునకానికి సంక్రమించి, మరణిస్తుందని నమ్మకం. దీంతో బాలలు జీవితకాలం ఆరోగ్యవంతులుగా చలామణి అవుతారని సంప్రదాయ గిరిజన వర్గం ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో బాలాసోర్ జిల్లా సొరొ మండలం సింగాఖుంటా పంచాయతీ బొంధొసాహి గ్రామంలో ఇద్దరు బాలలకు తొలి దంతంపై చిగుళ్లపై మొలిచాయి. వీరివురినీ అవాంఛిత రోగ పీడల నుంని సంరక్షించేందుకు రెండు కుక్కలతో వేర్వరుగా బాల్య వివాహం వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ ఆచారాలతో పెళ్లి.. బొంధొసాహి గ్రామంలో మఛువాసింగ్ కుమారుడు, మానస్సింగ్ కుమార్తెకి తొలి దంతంపై చిగుళ్లపై మొలిచింది. ఈ ఇరువురు బాలలకు కుక్కతో పెళ్లి జరిపించారు. మఛువా సింగ్ కుమారుడికి ఆడ కుక్క, మానస్సింగ్ కుమార్తెకు మగ కుక్కతో పెళ్లి వేడుకగా జరిపించారు. పెళ్లి తంతును సంప్రదాయ రీతుల్లో అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. గ్రామంలో 7 కుటుంబాలకు చెందిన సభ్యులు పసుపు, ఆవాలు, మరుగునీళ్లతో పెళ్లి వారింటికి చేరారు. ఈ బృందంతో కలిసి వధూవరుల కుటుంబీకులు గ్రామం నాలుగు దిక్కుల కూడలి ప్రాంతానికి చేరారు. ఈ కుటుంబాల సభ్యులు తీసుకు వచ్చిన మరుగునీటితో బాలలకు స్నానం చేయించారు. ఆభరణాలతో అలంకరించి పెళ్లికి సిద్ధం చేశారు. ఈ తంతు ముగియడంతో శునక వధూవరులను పెళ్లి వేదిక ప్రాంగణానికి ఆర్భాటంగా అలంకరించి తీసుకు వచ్చారు. కుక్క చీలమండకు సంప్రదాయ సూత్రం తొడిగి పెళ్లి జరిపించారు. కుక్కకు కాలం చెల్లినట్లే..! ఇలా బాలలతో పెళ్లి చేసుకున్న శునక వధూవరులకు కాలం చెల్లినట్లే. పెళ్లి జరిగిన కొంత కాలానికి బాలలతో పెళ్లి జరిపించుకున్న కుక్కలు పలు రకాల రోగాల బారినపడి చనిపోతాయని స్థానికుల విశ్వాసం. ఇవి చనిపోవడంతో కుక్కలను పెళ్లాడిన బాలలకు సకల అరిష్టాలు తొలగిపోయి, జీవితాంతం ఆనందోత్సాహాలతో బతుకుతారు. ఇదీ శునకంతో బాల్య వివాహం వాస్తవ వృత్తాంతం. -
3 కోట్లు కట్నం .. పెళ్లికి ముందు మద్యం మత్తులో యువకుడి వీరంగం
బంజారాహిల్స్: పెళ్లికి ముందు మద్యం మత్తులో అసభ్యకంగా ప్రవర్తించడంతోపాటు పెళ్లికుమార్తె మీద దాడికి పాల్పడిన వ్యవహారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లికొడుకు ప్రవర్తనతో పెళ్లి రద్దు కాగా తీసుకున్న ఆభరణాలను, పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వలేదంటూ పెళ్లికుమార్తె ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదయింది. వివరాలివీ... జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే యువతి(24) కుటుంబానికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా చిత్తూరు పట్టణంలో ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి, తేజ స్వీట్స్ అధిపతి ఎ.రవిబాబు కుటుంబంతో పరిచయం ఏర్పడింది. తమ కొడుకు ఎ.వైష్ణవ్(27)తో పెళ్లి సంబంధం ప్రతిపాదనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరువర్గాలు అంగీకరించాయి. పెళ్లి కోసం రూ. 3 కోట్లు కట్నంగా ఇవ్వాలని, పెళ్లిని ఆడంబరంగా డెస్టినేషన్ మ్యారేజ్‌లా చేయాలని వైష్ణవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ► ఈ క్రమంలో పెళ్లికి అంగీకరించిన యువతి కుటుంబ సభ్యులు గత ఏడాది సెపె్టంబర్లో ఎంగేజ్‌మెంట్‌ను తిరుపతిలోని తాజ్ హోటల్లో అరేంజ్ చేశారు. చివరి నిమిషంలో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు నవంబర్ 20న లగ్న పత్రిక రాసుకున్నారు. ఆ సమయంలో రూ. 6 లక్షల విలువచేసే డైమండ్ రింగ్, రూ. 2 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచీ, రూ. 2 లక్షల విలువైన బంగారు గొలుసును వైష్ణవ్‌కు పెట్టారు. ► ఫిబ్రవరి 9న మొయినాబాద్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఫిబ్రవరి 7 నుంచి 10 దాకా బుక్ చేశారు. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ. 50 లక్షలను ఖర్చు చేశారు. కాగా ఫిబ్రవరి 7న రిసార్ట్‌కు వచి్చన బంధువులంతా మరుసటి రోజున సంగీత్ కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో సంగీత్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ► అప్పటికే వైష్ణవ్‌తో పాటు స్నేహితులంతా కలిసి మద్యం సేవించారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పీకలదాకా మద్యం సేవించి మత్తులో ఉన్న వైష్ణవ్ కొరియోగ్రాఫర్‌తో పాటు ఇతర మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించిన పెళ్లికూతురు నిలదీసింది. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. స్నేహితులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ►మరోసారి అదే విధంగా ప్రవర్తించడంతో గట్టిగా మందలించిన పెళ్లికూతురిపై వైష్ణవ్ బూతులు మాట్లాడటంతో పాటు దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ఆమె సోదరుడు అడ్డుకునేందుకు యతి్నంచగా అతడిపై స్నేహితులతో కలిసి దాడి చేశారు. ►తన కళ్లముందే మద్యం సేవించడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటూ మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వైష్ణవ్‌ను పెళ్లి చేసుకునేదిలేదని పెళ్లి కుమార్తె తేల్చిచెప్పింది. దీంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. ► పెళ్లి కోసం పెట్టిన రూ. 50 లక్షల ఖర్చును, తమకు పెట్టిన ఆభరణాలను తిరిగి ఇస్తామని చెప్పిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ► రెండు నెలలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న వైష్ణవ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బా«ధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ► ఈ మేరకు వైష్ణవ్, అతడి తండ్రి ఎ.రవిబాబు, తల్లి దేవితో పాటు బంధువులు తేజు, శ్రవణ్, శరత్‌కుమార్‌రెడ్డి తదితరులపై ఐపీసీ 354, 420, 406, 506లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఖైదీ పెళ్లికి పెరోల్ మంజూరు చేయండి
బనశంకరి: హత్యకేసులో పదేళ్ల జైలుశిక్షకు గురైన ఖైదీ పెళ్లి చేసుకోవడానికి 15 రోజుల విరామం (పెరోల్) పై విడుదల చేయాలని హైకోర్టు పరప్పన సెంట్రల్ జైలు అధికారులను ఆదేశించింది. వివరాలు.. 2015 ఆగస్టు 16న కోలారు జిల్లా మాస్తి హోబళి నాగదేవనహళ్లిలో ఒక హత్య జరిగింది. ఇందులో ఆనంద (29) అనే నిందితున్ని పోలీసులు అరెస్టు చేయగా కేసు నడిచింది. నేరం రుజువు కావడంతో సెషన్స్‌కోర్టు 2019లో యావజ్జీవిత శిక్ష విధించింది. దీనిని అతడు హైకోర్టులో అప్పీల్ చేయగా, శిక్షను 10 ఏళ్లకు తగ్గించింది. మరోవైపు ఊర్లోనే ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అతన్ని తాత్కాలికంగా విడుదల చేయాలని అతని తల్లి, ప్రియురాలు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. ఇరువర్గాల వాదనలు ఆలకించిన తరువాత, అతనికి కట్టుదిట్టమైన షరతులతో ఏప్రిల్ 5 మధ్యాహ్నం లోగా 15 రోజులు పెరోల్ ఇవ్వాలని ఆదేశించారు. అతని పెళ్లికి అడ్డంకి తొలగింది. -
డాక్టర్‌ను రెండోపెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం, కేజ్రీవాల్ శుభాకాంక్షలు
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఆయన పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో అతికొద్ది మంది సమక్షంలో ఈ విహహం జరిగింది. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇందులో బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు పంజాబ్ సీఎం. భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లినవారిలో ఉన్నారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. Chandigarh | Wedding rituals underway of Punjab CM Bhagwant Mann with Dr. Gurpreet Kaur pic.twitter.com/4QjnNsRXtg — ANI (@ANI) July 7, 2022 AAP convenor and Delhi CM Arvind Kejriwal arrives in Mohali ahead of party leader and Punjab CM Bhagwant Mann's wedding which will be held in Chandigarh..."He is embarking on a new journey today, I wish him a happy married life," he says pic.twitter.com/YowaFASB8V — ANI (@ANI) July 7, 2022 అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన మీ పెళ్లి ఎప్పుడు అని చద్దాను ట్విట్టర్లో ఓ జర్నలిస్ట్ అడిగారు. ముందు పెద్దవాళ్ల పెళ్లి జరిగిన తర్వాతే చిన్నవాళ్లు చేసుకుంటారని ఆయన చమత్కరించారు. Waheguru Ji Apne Bacche Utte Aashirwad Banaye Rakheo 🙏🏻 pic.twitter.com/snnmdTi1sw — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 పసందైన విందు భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్ స్టఫ్డ్ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు. Saade veer da vyah Saanu gode gode chah pic.twitter.com/0c09v6YG4N — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 -
ప్రేయసిని పదేళ్లపాటు దాచి.. పెళ్లి చేసుకున్నాడు
పాలక్కాడ్ (కేరళ): రెహమాన్.. గుర్తున్నాడా? ప్రియురాలు సజితాను ఏకంగా పదేళ్లపాటు తన ఇంట్లోనే ఓ గదిలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రెహమాన్ ఇప్పుడు ఆమెను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెన్మారా పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద బుధవారం ఈ పెళ్లి జరిగింది. పాలక్కాడ్ జిల్లా అయిలూర్కు చెందిన రెహమాన్ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచిపెట్టాడు. కొన్ని నెలల క్రితం బయటపడిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. చట్టవిరుద్ధంగా యువతిని నిర్బంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ అతడిపై కేసు పెట్టింది. చదవండి: ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో! -
షాకింగ్: భార్యను చెల్లిగా పరిచయం చేస్తూ పెళ్లి, ఆ పై..
జైపూర్: కష్ట పడకుండా ఈజీగా మనీ సంపాదించడానికి కొందరు దొంగతనాలు చేస్తారు. ఇంకొకరు మోసాలు చేస్తారు. కానీ రాజస్ధాన్ లో ఓ జంట మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు ఓ భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు, బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్‌లో చోటు చేసుకుంది. కోట జిల్లా కునాడి లో నివసించే రవి అనే యువకుడు పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ సుమన్ అనే మ్యారేజి బ్రోకర్‌ను సంప్రదించాడు. సుమన్ కొన్ని ఫోటోలు చూపించాడు. వాటిలో కోమల్ అనే యువతి రవికి నచ్చింది. ఆమె వివరాలు అడగ్గా.. కోమల్‌కు తల్లితండ్రులు లేరని అన్నయ్య ఒక్కడే ఉన్నాడని చెప్పాడు. సరే కోమల్‌ను పెళ్లి చేసుకుంటానని రవి చెప్పాడు. అయితే యువతి అన్నయ్యని కలవాలని మ్యారేజి బ్రోకర్‌తో రవి అన్నాడు. కోమల్ వాళ్ల అన్నయ్య సోనూ కార్పరే, సుమన్, రవి హోటల్లో కలిశారు. తాము కట్నం ఇచ్చుకోలేమని కోమల్ వాళ్ల అన్నయ్య ముందే చెప్పుకొచ్చాడు. తక్కువ సమయంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి పెళ్లి ఒక గుళ్లో జరిపాడు సోనూకార్పరే. తరువాత కోమల్ తన భర్తతో కాపురానికి వెళ్లింది. పెళ్లైన మూడో రోజుకే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కనిపించడం లేదని భర్త స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయాలు బయట పడ్డాయి. మ్యారేజి బ్రోకర్ సుమన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండోర్ కు చెందిన సోనూ కార్పరే, కోమల్ భార్యా భర్తలని.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గం చెప్పారని.. తనకు డబ్బులు వస్తాయని ఈ సంబంధం కుదిర్చానని వెల్లడించాడు. సుమన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సోనూకార్పోరేను, కోమల్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణభయంతో తప్పించుకునే యత్నం.. వెంటాడి చంపేశారు -
వయసు 73.. వరుడు కావలెను; నెటిజన్ల ప్రశంసలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇటీవల 73ఏళ్ల రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు జీవిత భాగస్వామి కోసం ‘వరుడు కావలెను’ అని పెళ్లి ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన స్థానికంగానూ, సామాజిక మాధ్యమంలోనూ విపరీతంగా చర్చకు దారితీసింది. చాలామంది ఆమె ధైర్యానికి, పాజిటివ్ ఆలోచనను మెచ్చుకోగా, మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినవారూ ఉన్నారు. ఇంకొందరు ఈ బామ్మ ట్రెండ్‌సెటర్ బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరు, వయసేంటో మర్చిపోయావా బామ్మా అని ఇంకొకరు.. ఇలా తలా ఒక మాట అన్నవారూ ఉన్నారు. ఈ ప్రకటన వెనుక ఉన్న అంతర్లీన సమస్యపై మాత్రం ఎవరూ అంతగా దృష్టిపెట్టలేదు. ఒంటరి జీవితం.. ప్రకటనలో ఆమె ..‘సంప్రదాయ కుటుంబం, ఆరోగ్యంగా ఉన్న 70 ఏళ్ల పైబడిన వ్యక్తితో జీవితం పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాన’ని తెలిపింది. ఆమె తన గురించి తెలియజేస్తూ– ‘నాకు నా సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. నా మొదటి వివాహం, విడాకులు బాధాకరమైనవి కావడంతో ఇన్నేళ్లుగా తిరిగి వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఒంటరి జీవితం నన్ను భయపెడుతోంది. ఎవరి సాయం లేకుండా బస్‌స్టాప్ నుండి ఇంటికి, ఇంటి నుండి బయటకు నడవడానికి, ఇంట్లో ఒంటరిగా ఉండటానికి కూడా భయపడుతున్నాను. అందుకే జీవితభాగస్వామి కోసం చూస్తున్నాన’ని తెలిపింది. మూసధోరణులు విచ్ఛిన్నం వివాహం, జీవిత భాగస్వామి అనే విషయాలు ఇంకా మన వ్యవస్థలో సంప్రదాయక కోణం నుంచే ఆలోచిస్తున్నారు. కానీ, ఒంటరి జీవితానికి ఏ వయసులోనైనా తోడు అవసరం అనే విషయం అంతగా పట్టించుకోరు. అందుకే, ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే, యువత నుంచి మాత్రం ఆమె నిర్ణయం సమాజంలో సాంస్కృతిక మూసలను విచ్ఛిన్నం చేస్తుందని విపరీతంగా ప్రశంసలు అందుకుంది. సామాజిక కార్యకర్తలు ఈ విషయం పట్ల స్పందిస్తూ ‘మహిళలు అనేకాదు మగవారు కూడా ఒంటరితనం పట్ల భయపడుతుంటారు. అయితే, భాగస్వామి కోసం ఎంచుకునే స్వతంత్రం మగవారికే అధికంగా ఉంటుంది. దీనినే ఇప్పటివరకు సమాజం ఆమోదిస్తూ వచ్చింది. ఇలాంటి ధోరణికి ఈ ప్రకటన ఓ సమాధానం అవుతుంది’ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అద్దం ‘సమాజంలో వృద్ధుల పరిస్థితి ఎలా ఉందో ఈ పరిస్థితి కళ్లకు కడుతుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కూడా మానసిక సమస్యలు పెరగడానికి కారణం అవుతున్నాయని’ మానసిక నిపుణులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఒంటరిగా ఉండే వాళ్లు తోడు కోరుకుంటారు. అయితే, ఆమె సంప్రదాయ కోణంలో జీవితాంతం ఉండే తోడు అవసరం గురించి ఆలోచించి ఆ ప్రకటన ఇచ్చింది. చాలాకాలంగా మూస పితృస్వామ్య ఆలోచనకు, యవ్వనంగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటారనే ఆలోచనలకు ఈ ప్రకటన ఒక అడ్డంకిని తొలగిస్తుంది. ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసిన 69 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు తోడుగా ఉంటాననే స్పందన రావడం గమనార్హం. -
నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో
మహానంది: నిశ్చితార్థం ఒకరితో చేసుకొని, మరో యువతిని పెళ్లాడిన సీఆర్పీఎఫ్ జవాన్‌పై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నె గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మధుభాస్కర్‌తో మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ యువతికి జనవరి 16న నిశ్చితార్థం అయ్యింది. అయితే మధుభాస్కర్ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 15వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇదేం న్యాయమని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఎక్కువ కట్నం ఇచ్చారు అని సమాధానమిచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు.. పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం -
పెళ్లి కోసం 200 కి.మీ. సైకిల్ ప్రయాణం
హరింపుర్: ఉత్తరప్రదేశ్‌లోని హరింపూర్ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి (23) తన పెళ్లి కోసం ఏకంగా 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ప్రజాపతి వివాహం ఏప్రిల్ 25న జరగాల్సి ఉండగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం, వండిపెట్టేందుకు ఎవరూ లేకపోవడంతోనే ప్రజాపతి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే, సైకిల్‌పై పక్క జిల్లాలో ఉన్న వధువు ఇంటికి వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకొని తిరుగు ప్రయాణంలో సతీసమేతంగా సైకిల్‌పై స్వగ్రామం చేరుకున్నాడు. -
పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు
‘‘నేను ఇప్పటివరకూ చేసినవి దాదాపు హోమ్లీ క్యారెక్టర్లే. అయితే ‘పహిల్వాన్’లో కొంచెం గ్లామరస్ రోల్ చేశా. హోమ్లీ రోల్సే కాదు.. ఏ పాత్ర అయినా చేస్తా’’ అన్నారు ఆకాంక్షా సింగ్. నాగార్జున సరసన ‘దేవదాస్’, సుమంత్‌తో ‘మళ్ళీరావా’, సుదీప్తో ‘పహిల్వాన్’ చిత్రాల్లో నటించిన ఆకాంక్షా సింగ్ చెప్పిన విశేషాలు. ► ‘మళ్ళీరావా’ నుంచి ‘పహిల్వాన్’ వరకూ నా సినిమాలను ప్రేక్షకులు ఆదిరించి, సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌లో ఎక్కువమంది హైదరాబాద్‌వారే కావడం హ్యాపీ జైపూర్‌లో పుట్టి పెరిగాను. తెలుగులో ఎక్కువ కాలం పని చేయాలని ఉంది. ‘బాహుబలి’లో అనుష్కగారి పాత్ర చూసి ‘దేవుడా.. ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఇవ్వు’ అనుకున్నా. ► పెళ్లి చేసుకున్నందు వల్ల నా కెరీర్‌కి ఇబ్బంది అనే ఆలోచనే లేదు. ఎంతో మంది పెళ్లి అయినా హీరోలుగానే చేస్తున్నారు.. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. అలాంటప్పుడు పెళ్లి వల్ల కెరీక్‌కి ఇబ్బంది అని హీరోయిన్లనే ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. సినిమా రంగంలోనే కాదు ఏ రంగంలోనూ పెళ్లి అనేది కెరీర్‌కి అడ్డంకి కాదు. నా భర్త కునాల్ నటుడు కాదు. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా పని చేస్తున్నా. దానికి కారణం ఆయన ప్రోత్సాహమే. ప్రస్తుతం తెలుగు, తమిళ ద్విభాషా సినిమాలో హాకీ ప్లేయర్ పాత్ర చేస్తున్నా. -
పెళ్లి ఏడాది తరువాత చేస్తామని చెప్పడంతో..
సాక్షి, సదాశివనగర్(ఎల్లారెడ్డి): వివాహం చేయడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోడెగాం గ్రామానికి చెందిన కడతల సంతోష్‌రెడ్డి(27) అనే యువకుడు విదేశాలకు వెళ్లి సెలవుపై మూడు నెలల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను అడిగాడు. ఏడాది తర్వాత చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపంతో రెండు రోజుల క్రితం కామారెడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని బైకుపై ఇంటి నుంచి బయలు దేరాడు. ఇంటికి వస్తున్నాను అని శనివారం ఉదయం 8గంటలకు ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ 10 గంటలకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. ఆదివారం ఉదయం 6గంటలకు గ్రామ శివారులోని బురుజురాళ్ల దగ్గర ఉన్న వ్యవసాయ బావి వద్ద పశువుల రేకుల కొట్టంలోని సిమెంట్ ఫోల్‌కు నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబీకులు గుండెలు బాదుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, సుజాత బోరున విలపించడంతో కంటతడి పెట్టించాయి. మృతుడికి సోదరుడు కృష్ణారెడ్డి ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణం
కోటపల్లి(చెన్నూర్) : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మండలంలోని పుల్లగామ గ్రామానికి చెందిన గుంపుల శైలజ(22) పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వెంకన్న తెలిపిన వివరాలివీ.. గుంపుల శంకరయ్య–అంకులకు ఎనిమిది మంది సంతానంలో శైలజ ఆరవది. రోజు వారీగా చేను పనులకు కాపాల వెళ్లేది. అందులో భాగంగానే గురువారం ఉదయం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగి పడిఉండడంతో చుట్టుపక్కల వారు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా శైలజ మృతి చెందింది. శైలజకు మరో రెండు రోజుల్లో కొండంపేటరే చెందిన యువకుడితో పెళ్లి కానుండటంతో ఇష్టంలేకనే తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు తాగి మృతి చెంది ఉంటుం దని ఎస్సైతెలిపారు. తండ్రి శంకరయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
శుభకార్యానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
బత్తలపల్లి : రోడ్డుపక్కనున్న బావిలో ఈతకొట్టేందుకు పైనుంచి దూకిన టైల్స్‌వర్కర్ కడుపుభాగంలో బలమైన దెబ్బతగిలి నీటమునిగి మృతిచెందాడు. ఈదులముష్టూరులో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులతోపాటు ఎస్ఐ హారున్‌బాషా తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డుకు చెందిన టైల్స్‌వర్కర్ బలిజ వన్నూరుస్వామి (25) తన స్నేహితులు రాము, అనిల్, శేఖర్‌తో కలిసి బంధువుల గృహప్రవేశం కోసం శుక్రవారం ఆటోలో ధర్మవరం వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగుపయనమయ్యారు. బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలోని వ్యవసాయ బావి వద్ద కొందరు చిన్నారులు ఈత కొడుతుండడం గమనించారు. ఎండలకు ఉక్కపోతగా ఉండటంతో ఆటోను పక్కన ఆపి ఈతకొట్టేందుకు వెళ్లారు. బావిలో నీరు బాగా ఉండటంతో వన్నూరుస్వామి రెండుసార్లు పై భాగం నుంచి నీళ్లలోకి దూకాడు. మూడోసారి నీటిలోకి దూకినపుడు కడుపుభాగంలో దెబ్బతగిలింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు నీటి అడుగుభాగంలో గాలించి అతడిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఊపిరాడక వన్నూరుస్వామి మృతిచెందాడు. తహసీల్దార్ సురేష్‌బాబు, ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ద్విచక్ర వాహనం ఢీ దంపతులు మృతి
వర్ధన్నపేట : వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న క్రమంలో కారు ఎదురుగా అతివేగంగా వచ్చి ఢీ కొనడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని కట్య్రాల శివారులో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం...వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ తాళ్ల మహేందర్‌రెడ్డి(50) ఆయన భార్య ప్రభావతి(45) కలిసి వివాహ వేడుకకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో తొర్రూరు నుంచి వరంగల్‌కు వెళ్తున్న కారు అతి వేగంతో వచ్చి అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభావతి స్థానిక మహిళా సంఘంలో సీఏగా పని చేస్తుంది. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉండగా కూతురుకు వివాహం చేశారు. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కొత్తూరులో విషాదఛాయలు.. రాయపర్తి: మహేందర్‌రెడ్డి, ప్రభావతి మృతితో రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో అందరితో కలిసిమెలసి ఉంటూ ప్రజలతో మమేకమై తిరిగే దంపతులు ఇక లేరనే విషయం తెలుసుకుని భోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు చివరి చూపుకోసం పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. -
పెళ్లింట.. విషాదం
సాక్షి,సిరిసిల్ల: రెండ్రోజుల్లో కూతురు పెళ్లి.. ఇంటి నిండా సందడి.. పచ్చని తోరణాలు కట్టాలని తలచిన తండ్రి మామిడాకులు తీసుకురావడానికి వెళ్లాడు. మామిడి చెట్టెక్కి ఆకులు తెంపుతూ.. జారికిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. స్థానిక సంజీవయ్యనగర్‌కు చెందిన సిరిగిరి రాములు(55) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి భార్య సంతోష. నలుగురు కూతుళ్లు ఉన్నారు. 1న మూడో కూతురు పెళ్లి.. మూడో కూతురు ఆమని పెళ్లి ఏప్రిల్ 1న జరుగనుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో అందరూ నిమగ్నమయ్యారు. మామిడి తోరణాలకని రాములు శుక్రవారం ఉదయం 8గంటలకు ఇంట్లోంచి వెళ్లాడు. మామిడి తోటలో చెట్టు పైనుంచి పడిపోయిన రాములు అచేతనంగా ఉండగా మధ్యాహ్నం 3గంటలకు తోటమాలి బాలయ్య గమనించి రాములు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో ఇంటి సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు వచ్చేసరికి రాములు విగత జీవిగా పడిఉన్నాడు. పెళ్లింట్లో ఈ సంఘటన పెనువిషాదాన్ని నింపింది. మిన్నంటిన రోదనలు రాములు ఆటో నడుపుతూ.. నలుగురు కూతుళ్లను చదివించి పెద్దచేశాడు. కష్టజీవిౖయెన రాములు ఫంక్షన్ హాలు తీసుకోవడం ఖర్చుతో కూడింది కావడంతో ఉన్నంతలో వైభవంగా జరిపించాలని ఉబలాటపడ్డాడు. ఈక్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోస్టుమార్టం చేయడానికి సమయం మించిపోవడంతో శవాన్ని మార్చురీలో ఉంచారు. సిరిసిల్ల ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.ఎస్సై నరేశ్ కేసు నమోదు చేశారు. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్’
కుల్కచర్ల: అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీనివాస్ శంకర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి రాములు హెచ్చరించారు. మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన బాలయ్య, మంగమ్మల కుమార్తె (17)కు మైనారిటీ తీరకుండానే పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఈ విషయం చైల్డ్ లైన్ ప్రతినిధులకు తెలియడంతో గురువారం స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో బండవెల్కిచర్ల గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలకు పెళ్లి వయస్సు రాకముందే వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి వివరించారు. తహసీల్దార్ శ్రీనివాస్ దగ్గరకు తీసుకొచ్చి వారితో హమీ పత్రం రాయించుకున్నారు. తమ బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తరువాతనే పెళ్లి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.