meekosam
-
మెసేజ్ పంపారు.. సాయం మరిచారు..
అతడు చదువుల్లోనే కాదు..ఆటల్లోనూ ఫస్టే. అయితే రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని కకావికలం చేసింది. ఇంజినీర్ కావాలన్న అతడి కలలను చిదిమేసింది. తల్లిదండ్రులు అతడి చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేశారు. మరికొన్ని ఆపరేషన్ల కోసం సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చిత్తూరు, మదనపల్లె : పెద్దమండ్యం మండలం గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణారెడ్డికి తన కుమారుడు భరత్‌సింహారెడ్డి చదువుకోసం ఉన్న ఊరిని వదిలి మదనపల్లెకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట చిన్న దుకాణం పెట్టుకుని కుటుంబా న్ని పోషిస్తున్నారు. పదోతరగతిలో 9.0 పాయింట్లతో ఉత్తీర్ణుడైన భరత్‌సింహారెడ్డి ఇంటర్మీడియెట్ ఏపీఆర్జేసీ గ్యారంపల్లెలో సీటు పొందా డు. 2016లో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్ పూర్తిచేశాక పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. 2017నవంబర్ 5న స్నేహితుడు ఇంటికి వెళ్లి పుస్తకాలు తీసుకువస్తున్న భరత్నసింహారెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో స్నేహితుడు అక్కడికక్కడే మరణించగా, భరత్‌సింహారెడ్డికి ఎడమకాలు నుజ్జు నుజ్జైంది, చేయి, భుజం పూర్తిగా దెబ్బతినడంతోపాటు మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామంలోని నాలుగెకరాల వ్యవసాయభూమిని విక్రయించి ఆ సొమ్ముతో భరత్‌సింహారెడ్డికి అతడి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక అప్పట్లో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం త్వరలోనే చెక్కును పంపనున్నట్లు కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపింది. అయితే ఆ సాయం అందలేదు. చివరకు స్నేహితులు, దాతలు, బంధువులు చేసిన సాయం మూలాన చేయించిన చికిత్సతో భరత్ కొంతవరకు కోలుకున్నాడు. అతడికి నరాలకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తే నడిచే అవకాశం ఉందని, రూ.3.5 లక్షల నుంచి 5లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కుమిలిపోతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించదలిస్తే 9676520586, 9493871077 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. ఎస్బీఐ, ఎన్టీఆర్ సర్కిల్ అకౌంట్ నంబర్ 30757452216, ఐఎఫ్ఎస్సీ కోడ్..ఎస్బీఐఎన్0012727కు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘మీ కోసం’లో వినతుల వెల్లువ
అనంతపురం అర్బన్ : జిల్లాలోని మండలాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, జెడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి, డ్వామా పీడీ జ్యోతిబసు, మీ కోసం ఇన్చార్జి అనుపమ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 285 అర్జీలు ప్రజల నుంచి అందాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో కొన్ని.. ♦ తమ ఇంటి ముందు పూర్వం నుంచి ఉన్న రస్తాలో రాకపోకలు సాగిస్తున్నామని, అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆ రస్తాకు ముళ్ల కంప అడ్డుగా వేసి ఇబ్బంది పెడుతున్నారని రాప్తాడు మండలం మరూరుకు చెందిన కె.లక్ష్మిదేవి ఆమె భర్త కె.బాబయ్య ఫిర్యాదు చేశారు.దీనిపై ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారని చెప్పారు. ♦ ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన దుకాణ సముదాయంలో గది కోసం రూ.3 వేలు డీడీ చెల్లించానని, నెలలు గడుస్తున్నా తనకు గదిని అప్పగించలేదని నగర పరిధిలో బుడ్డప్పనగర్‌కు చెందిన మద్దిలేటి ఫిర్యాదు చేశాడు. ♦ తాను 90 శాతం వైకల్యంతో బాధపడుతున్నానని లేపాక్షి మండలం చోళసముద్రానికి చెందిన జి.రాధామ్మ చెప్పింది. తనకు ఇంటి స్థలం కేటాయించారని, అయితే పట్టా ఇవ్వలేదని వేడుకుంది. ♦ తన భూమి కొందరు వ్యక్తులు శ్మశానవాటికగా వాడుకుంటూ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారని పామిడి మండలం రాందాసుపురానికి చెందిన వీరభద్రయ్య ఫిర్యాదు చేశాడు. పామిడి పొలం సర్వేనంబరు 201లో తమకు మూడు ఎకరాల భూమి ఉందని చెప్పాడు. ♦ ఇరవై ఏళ్లగా సాగు చేస్తున్న భూమికి పట్టా ఇప్పించాలని లేపాక్షి మండలం విబూదిపల్లికి చెందిన గంగాధరప్ప కోరాడు. సర్వే నంబరు 171.6లో 4.91 ఎకరాల భూమిని ఇరవై ఏళ్లగా సాగు చేసుకుంటున్నామని చెప్పాడు. ♦ కాలువ నిర్మాణానికి భూమి తీసుకొని పరిహారం ఇవ్వలేదని కొత్తచెరువు మండలం గుంటిపల్లికి చెందిన ఊరువాకిలి వెంకటరమణప్ప విన్నవించాడు. కె.లోచర్ల గ్రామ పొలం సర్వే నంబరు 490–2లో 2.96 ఎకరాల భూమి తమకు ఉండగా హంద్రీ–నీవా కాలువ కోసం 34 సెంట్ల భూమి తీసుకున్నారని, నెలలు గడుస్తున్నా పరిహారం ఇవ్వలేదని వాపోయాడు. ♦ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని జాతీయ అంధుల సమాఖ్య జిల్లా కోఆర్డినేటర్ సి.రవి ఫిర్యాదు చేశాడు. ♦ అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారంగా ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారని గుంతకల్లుకు చెందిన దామోదర్ నాయుడు ఫిర్యాదు చేశాడు. కొందరు స్వార్థపరులు డోనుముక్కల, కొనకొండ్ల పరిధిలోని ప్రభుత్వానికి చెందిన కొండలు, గుట్టలు, భూముల్లో ఎర్రమట్టి తవ్వి తరలిస్తున్నారన్నారు. -
మట్కా నిర్మూలించండి
కర్నూలు: ‘నగరంలో ఇద్దరు మట్కా డాన్లు మనుషులను ఏర్పాటు చేసుకుని ఆన్లైన్ ద్వారా పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్నారు. కూలీనాలీతో జీవనం సాగించే పేదలు, మధ్య తరగతి ఉద్యోగులు ఈ ఉచ్చులో ఇరుక్కుని ఆర్థికంగా నష్టపోతున్నారు’ అంటూ బుధవారపేటకు చెందిన పలువురు ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గోపీనాథ్ జట్టి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 సెల్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. నేరుగా ప్రజాదర్బార్‌కు వచ్చి కలసిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. బుధవారపేటతో పాటు పాతబస్తీలో కొంతమంది మట్కా నిర్వహిస్తున్నారని, పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని బుధవారపేట వాసులు ఫిర్యాదు చేశారు. జిల్లా నలుమూలల నుంచి 92 ఫిర్యాదులువచ్చాయి. వాటిలో కొన్ని.. ♦ ఆడ పిల్లలు పుడుతున్నారని వేధించడం, ముందే స్కానింగ్ చేయించి మగబిడ్డ, ఆడబిడ్డ అని తెలుసుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి అబార్షన్ చేయించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, సంబంధిత డాక్టర్లు స్కానింగ్ సెంటర్లపై కఠినమైన కేసులు నమోదు చేయాలని కొంతమంది వ్యక్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ♦ తన తలారీ ఉద్యోగాన్ని పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు తీసుకుని బతికినంత కాలం సగం జీతం ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ, అన్నం పెట్టడం లేదని మిడుతూరు మండలం చింతలపల్లె గ్రామానికి చెందిన పక్కీరయ్య ఫిర్యాదు చేశారు. ♦ తన 20 ఎకరాల పొలాన్ని కుమారుడు లాక్కున్నాడని, అందులో ఆరెకరాలు ఇప్పటికే అమ్మేశాడని, కనీసంతమ బాగోగులు కూడా చూడకుండా కొట్టి, గాయపరిచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన భద్రాద్రి చెన్నయ్య ఫిర్యాదు చేశారు. ♦ తాను ప్రస్తుతం మట్కా రాయడం లేదని, ఐదేళ్లుగా కిరాణం షాపుతో జీవనం సాగిస్తున్నానని, తనపై ఉన్న మట్కా షీటు తొలగించాలని హాలహర్వి మండలం చింతకుంట గ్రామానికి చెందిన ముళ్ల జాఫర్ కోరారు. ♦ కొట్టం విక్రయిస్తానని చెప్పి రూ.60 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి మోసం చేశాడని సంతోష్‌నగర్‌కు చెందిన మేకల సుజాత ఫిర్యాదు చేశారు. ♦ రైల్వే ఉద్యోగం చేస్తున్న కుమారుడు తన పేరుతో ఉన్న ఆరెకరాల పొలాన్ని రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని శిరివెల్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. పోలీస్ దర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, బాబుప్రసాద్, నజీముద్దిన్, వినోద్‌కుమార్, మురళీధర్, సీఐలు ములకన్న, మహేశ్వర్‌రెడ్డి, వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది సునిత పాల్గొన్నారు. ♦ కర్నూలు నగరం వెంకటరమణ కాలనీకి చెందిన మూర్తి.. గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.60 లక్షలు తీసుకుని మోసం చేశాడని బంగారుపేటకు చెందిన కరుణాకర్ ఫిర్యాదు చేశారు. -
నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో ‘మీ కోసం’
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వినతులు స్వీకరించే మీ కోసం(ప్రజాదర్బార్) కార్యక్రమం నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి సోమవారం నంద్యాలలో నిర్వహిస్తున్నారు. వచ్చే సోమవారం ఆదోని, ఆ తర్వాతి సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని రకాల సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. 1 గంట నుంచి 2 వరకు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. 3 నుంచి 6 గంటల వరకు అక్కడే మీ కోసం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై డివిజన్ స్థాయి సదస్సు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ డివిజన్ కేంద్రాల మీ కోసం కార్యక్రమ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. -
26న డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం కార్యక్రమాలు రద్దు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 26వ తేదీ సోమవారం రంజాన్ పర్వదినం ఉన్నందున ఆ రోజు నిర్వహించాల్సిన డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం( ప్రజాదర్బార్)కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆదే విధంగా సాయంత్రం జరిగే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ను కూడా రద్దుచేశామన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ శనివారం ప్రకటనలో తెలిపారు. -
మీ కోసం.. ఏదీ పరిష్కారం ?
– పదే పదే అర్జీలు ఇస్తున్నా ఫలితం శూన్యం – పరిష్కరించినట్లుగా నివేదికలు – వారంవారం పెరుగుతున్న అర్జీదారుల సంఖ్య ఇళ్ల పట్టాల కోసం తిరుగుతున్నాం – రాకెట్ల గ్రామ ఎస్సీలు ‘ఇరవై ఏళ్లుగా ఇళ్ల పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నాము. మీ కోసంలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు’. అని ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఎస్సీలు తులసమ్మ, లక్ష్మిదేవి, నాగమ్మ, రామాంజినమ్మ, విజయమ్మ, తిప్పమ్మ, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాల కోసం 75 కుటుంబాలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాయని చెప్పారు. అనంతపురం అర్బన్ : ప్రతివారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో అర్జీలు ఇస్తే పరిష్కారమవుతాయనే ఆశతో జిల్లా నలమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. అయితే చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అర్జీదారులు ఆవేదనకు గురవుతున్నారు. ఒకే సమస్యపై పదేపదే అర్జీలు ఇస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వారం వారం అర్జీదారుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే సమస్యలను పరిష్కరించినట్లుగా అధికారులు నివేదికలు ఇస్తుండటం విమర్శలు తావిస్తోంది. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మీ కోసం, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గీవెన్స్లను నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, జెడ్పీ సీఈఓ రామచంద్ర అర్జీలు స్వీకరించారు. ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదు పరిగి మండలం వన్నంపల్లి పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాలేదని బీజీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దేకుంట వెంకటేశ్వరరెడ్డి, రైతులు రమేశ్, నరిసింగప్ప, నరేశ్, హనుమంతప్ప, శ్రీరాములు, నరసింహమూర్తి, తదితులు విన్నవించారు. వ్యవసాయ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సమస్య వచ్చిందన్నారు. బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోనూరు సతీశ్ శర్మ విన్నవించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఉపకార వేతనంపై ఉన్న ఆంక్షలు తొలగించాలన్నారు. విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేయండి జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న విద్యావ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, శ్రీహరి, జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున నాయక్, సాకేనరేశ్, తదితరులు వినతిపత్రం అందజేశారు. -
ప్రత్యేక గ్రీవెన్స్‌కు మంగళం
– ‘మీ కోసం’తో పాటే ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ – మూడు నెలలుగా ఇదే తంతు అనంతపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి నెలలో ఒక రోజు ప్రత్యేక గ్రీవెన్స్ తప్పని సరిగా నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు అధికారులు మంగళం పాడారు. మీ కోసం కార్యక్రమంతో పాటుగా నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు సాగుతోంది. తాజాగా ఈ నెల 12న కూడా అదే తరహాలో మీ కోసంతో కలిపి నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందేందుకు నెలలో రెండో గురువారం ఆ వర్గాల కోసం ప్రత్యేక గ్రీవెన్ నిర్వహించే విధానాన్ని గత కలెక్టర్ కోన శశిధర్ అమలులోకి తెచ్చారు. కొద్ది నెలలు సక్రమంగానే సాగింది. అయితే అటు తరువాత ప్రత్యేక గ్రీవెన్స్ ప్రక్రియను నీరుగార్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీ కోసం, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించలేదు. అటు తరువాత ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను మరిచారు.. అయితే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ను మాత్రం నెలలో రెండో గురువారం నిర్వహించడం లేదు. నెలలో ఏదో ఒక సోమవారం మీ కోసం కార్యక్రమంతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్‌ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజున ఇటు సామాన్య ప్రజలు, అటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు హాజరవుతూ తమ సమస్యలను విన్నివించుకుంటున్నారు. రద్దీ ఎక్కువై ఎస్సీ, ఎస్టీలు ప్రత్యేకంగా తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సమయం ఉండడం లేదు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తే రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ వర్గాల ప్రజలు తమ సమస్యలను అధికారులకు సావధానంగా వివరించి పరిష్కారం పొందేందుకు వీలవుతుంది. ఇదే విషయంపై గతనెల 15న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసంలో జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణికి దళిత సంఘాల నాయకులు పెద్దన్న తదితరులు విన్నవించారు. -
వారం రోజులే డెడ్‌లైన్
- ‘మీ కోసం’ వినతులపై అధికారులకు కలెక్టర్ హెచ్చరిక - వచ్చే వారం నాటికి పరిష్కారించాలని ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సమస్యలకు సంబంధించి డయల్ యువర్ కలెక్టర్, మీ కోసం కార్యక్రమాలకు అందిన వినతులపై విచారణ జరిపి వచ్చే వారం నాటికి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సమస్యలు మున్సిపాలిటీల్లో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని వచ్చే వారానికి క్లియర్ చేయకపోతే సంబంధిత అధికారులకు చార్జి మెమోలు ఇస్తామని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కర్నూలు బాలాజినగర్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకరావడంతో సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆస్పరి మండలం నగరూరు అభివృద్ధికి రిలయన్ సంస్థ విడుదల చేసిన నిధులను గ్రామ సర్పంచ్ దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులు పిర్యాదు చేయగా విచారణ జరిపిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. బనగానపల్లి ఆయుష్ ఆసుపత్రికి మెడికల్ ఆఫీసర్ వారంలో 2 రోజులు మాత్రమే వస్తున్నారని ఆ ప్రాంతం వారు ఫోన్ చేయగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జేసీ-2 రామస్వామిని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఒ గంగాధర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు. -
ఆషామాషీగా తీసుకుంటే కుదరదు
- వందశాతం పరిష్కరించాలి - ప్రజా సమస్యలపై కలెక్టర్ సత్యనారాయణ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆషామాషీగా తీసుకోకుండా సమగ్రంగా విచారణ జరిపి వందశాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలకు సంబంధించి 2017-18 ఆర్థిక సంవత్సర కార్యాచరణ ప్రణాళికలను రెండు రోజుల్లో సమర్పించాలన్నారు. సోమవారం ఉదయం తన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అన్ని కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్లను పకడ్బందీగా రూపొందించాలన్నారు. మీ కోసం, డయల్ యువర్ కలెక్టర్, ఎస్సీ,ఎస్టీ గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలను 100 శాతం పరిష్కరించాలన్నారు. జూన్ 2నుంచి జరిగే నవనిర్మాణ దీక్షలకు ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలన్నారు. నీటిపారుదల, వ్యవసాయం మినహా మిగిలిన అన్ని అంశాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నామని, పక్కా ప్రణాళికలతో లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. ప్రతి శాఖలోనూ బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలన్నారు. సమావేశంలో జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ-2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు -
ఎవరి పని వారే చేయండి
- ఇతరులతో చేయిస్తేనే సమస్యలు - తాజా ప్రగతి నివేదికలు ఇవ్వండి - కలెక్టర్ ఎస్. సత్యనారాయణ - జిల్లా అధికారులతో సమావేశం కర్నూలు(అగ్రికల్చర్): ఎవరికి కేటాయించిన పని వారే స్వయంగా చేస్తే ఏ సమస్యలుండవని, పైగా పరిష్కారం కూడా పక్కాగా ఉంటుందని కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అన్నారు. వివిధ జిల్లాల్లో మీ కోసం కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారం 99శాతం ఉందని, మన జిల్లాకు సంబంధించి కొత్తపల్లి, శ్రీశైలం, కొసిగి, తుగ్గలి, పాములపాడు, అవుకు తదితర మండలాల్లో 90శాతానికి మించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ప్రజాపంపిణీ కూడా 81.08 శాతం మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవ్వరికి అప్పగించిన పనులు వారే స్వయంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. బ్యాంకుల వారీగా అధికారులతో చర్చించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను వంద శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు, బ్యాంకర్లు పరస్పర సహకారంతో పనిచేసినపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా నిర్వహించాలని ఆదేశించిన కలెక్టర్.. కంప్యూటర్ల కొరత ఉంటే కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలివ్వాలని ఆదేశించారు. తాజా ప్రగతి నివేదికలు ఇవ్వండి.. సీఎం చంద్రబాబు ఈ నెల 17, 18వతేదీల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లా అధికారులందరూ తమ శాఖలకు సంబంధించి తాజా ప్రగతి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు, పింఛన్ల పంపిణీ, మీ కోసం దరఖాస్తుల పరిష్కారం, మీసేవ కేంద్రాల పనితీరు, రెవెన్యూ అంశాలపై నివేదికలివ్వాలన్నారు. దీపం పథకం కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ గ్యాస్ క¯ðనెక్షన్ ఇవ్వాలని, ఈ దిశగా చర్యలను వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ-2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో నీళ్లివ్వకపోతే సస్పెండ్ చేస్తా
- బొందిమడుగుల దళిత కాలనీకి నీటి సరఫరా నిలిపేసిన టీడీపీ నేతలు - వారం క్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని అధికారులు - మళ్లీ ‘మీకోసం’లో వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు - తుగ్గలి తహసీల్దార్‌పై కలెక్టర్ ఆగ్రహం కల్లూరు (రూరల్): ‘కలెక్టర్ ఆదేశాలు అంటే లెక్క లేదా.. రెండు రోజుల్లో బొందిమడుగుల దళిత కాలనీకి నీరివ్వకపోతే సస్పెండ్ చేస్తా’ అని కలెక్టర్ సత్యనారాయణ తుగ్గలి ఇన్చార్జ్ తహసీల్దార్ పుల్లయ్యను హెచ్చరించారు. బొందమడుగుల గ్రామంలోని దళిత వాడలో తాగునీటి పైపులైన్ కోసం 400 మీటర్ల గుంతలు తవ్వించి పైపులు వేశారని, అయితే అధికార పార్టీకి చెందిన నేతలు తాగునీటిని సరఫరా చేయించకుండా రాజకీయం చేస్తున్నారని తమరే న్యాయం చేసి మంచినీటిని సరఫరా చేయించాలని తుగ్గలి మండలం వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టి.ఎం.రమేష్, మండల్ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ వడ్డె రంగస్వామి, రాయలసీమ మాదిగ దండోరా ప్రెసిడెంట్ అనంత రత్నం మాదిగ, గ్రామ ప్రజలు మునిస్వామి, మద్దిలేటి, బాలరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నెల 1వ తేదీన మోస్ట్ అర్జెంట్ కలెక్టర్స్ గ్రీవెన్స్ నుంచి నోటీసులు జారీ అయింది. అయితే కలెక్టర్ ఆదేశాలను తుగ్గలి మండల అధికారులు లెక్కచేయలేదు. దీంతో స్పందించిన కలెక్టర్ రెండు రోజుల్లో సమస్యను పరిష్కారం చేయకపోతే సస్పెండ్ చేస్తానని ఇన్చార్జి తహశీల్దార్ పుల్లయ్యను హెచ్చరించారు. సోమవారం సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీ కోసం’లో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ 2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీసీఈఓ ఈశ్వర్, హౌసింగ్ పీడీ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బుద్ధీ, జ్ఞానం ఉందా ఆస్పరి తహసీల్దార్‌పై కలెక్టర్ మండిపాటు ఆస్పరి గ్రామానికి చెందిన కె. గోవిందు తన రెండు సెంట్ల స్థలాన్ని కొందరు ఆక్రమించారని, తహసీల్దార్ సర్వే చేయిస్తే తనదేనని తేలిందని, ఎండార్స్మెంట్ ఇచ్చారే కానీ పొజిషిన్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆస్పరి తహసీల్దార్ౖ ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది మంచిది కాదు.. స్థలం బాధితుడిదేనని ఎండ్రార్స్మెంట్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఎందుకివ్వడం లేదు.. బుద్ధీ.. జ్ఞానం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజా సమస్యలను పరిష్కరించండి
–జిల్లా కలెక్టర్‌ను కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ పూర్వ జిల్లా కలెక్టర్ హయాంలో ప్రతి చోట అన్యాయం జరిగింది... చివరికి కలెక్టర్ సమావేశ మందిరంలో నీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్చార్జీలను మాత్రమే పిలిచి మమ్మల్ని పిలువ లేదు.. కొత్త కలెక్టర్‌గా మీరు వచ్చారు... చార్జీ తీసుకున్నట్లు ఫోన్ చేసి చెప్పారు సంతోషం.. ఇప్పటి నుంచైనా మేము తీసుకువచ్చే ప్రజా సమస్యలను పరిష్కరించండి’’ అంటూ జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఎస్.త్యనారాయణను కోరారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, డోన్, ఆదోని, పాణ్యం, నందికోట్కూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలు కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిశారు. ఈ సందర్భఃగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్‌కు మంత్రాలయం రాఘవేంద్రస్వామి చిత్రపటం, ప్రసాదం అందచేశారు. జిల్లా అంతటా నీటి సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు అల్లాడుతున్నా పూర్వ కలెక్టర్ తమను పిలువ కుండానే టీడీపీ ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పందిస్తూ అందరూ కలసి వచ్చారు సంతోషం అంటూ.. తాను చేయగలిగిందంతా చేస్తానని స్పష్టం చేశారు. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మాట్లాడుతూ... బేతంచెర్లలో రక్షిత మంచి నీటి పథకం బోరు నీటిని టీడీపీ నేతలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. రాష్ట్రంలో నియంత పాలన... రాష్ట్రంలో నియంతపాలన నడుస్తోందని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీలకు అధికారాలు లేవని, జన్మభూమి కమిటీలు, టీడీపీ ఇన్‌చార్జీలకు మాత్రమే అధికారాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. పోలీసు అధికారులు సైతం జన్మభూమి కమిటీలకే విలువ ఇస్తున్నారన్నారు. పింఛన్, రేషన్ కార్డు, పక్కా గృహం..ఎటువంటి ప్రయోజనం పొందాలన్నా జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు. -
‘మీకోసం’.. జనం కోసమేనా?
► ‘మీ కోసం’లో పెరిగిపోతున్న బాధితుల అర్జీలు ► పెద్ద సంఖ్యలో పరిష్కరించినట్లు అధికారిక లెక్కలు ► గణాంకాలతో సమస్యలను కప్పిపుచ్చుతున్న యంత్రాంగం ► నూతన కలెక్టర్ వినయ్చంద్పై ఆశలు పెట్టుకున్న ప్రజల ఒంగోలు టౌన్: ‘ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలకు సంబంధించి గత రెండేళ్లలో 6,04,404 అర్జీలు వచ్చాయి. వాటిలో 5,71,007 అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. కేవలం 33,397 అర్జీలను మాత్రమే పరిష్కరించాల్సి ఉందని ఘనంగా ప్రకటించింది. మీకోసం అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 8వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ గణాంకాలు చూస్తే మీకోసం కార్యక్రమంలో అర్జీ ఇస్తే చాలు చిటికెలో పరిష్కారం అవుతుందన్న భ్రమను అమాయక ప్రజలకు జిల్లా యంత్రాంగం కల్పిస్తోంది. అయితే జిల్లా యంత్రాంగం ప్రకటించిన గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఏ వారానికి ఆ వారం అర్జీలను పరిష్కరించినట్లు గణాంకాలను ఘనంగా ప్రకటించుకుంటుంటే ఒకే సమస్యపై బాధిత ప్రజలు పదేపదే సుదూర ప్రాంతాల నుంచి మీకోసం కార్యక్రమానికి ఎందుకు వస్తున్నారో జిల్లా అధికారులే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోయి వడగాలులు వీస్తున్నాయి. ప్రజలకు వారి సమస్యల ముందు ఎండలు, వడగాలులు పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన తమ సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరిస్తే అదే మాకు చల్లటి ఉపశమనం కలిగిస్తుందంటూ సుదూర ప్రాంతాల నుంచి మీకోసంకు అర్జీలు తీసుకొస్తూనే ఉన్నారు. మీకోసం నుంచి సంబంధిత శాఖకు వెళితే పరిష్కారమైనట్లేనా? తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు మండల కార్యాలయల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి చివరకు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు చేరుకొని జిల్లా ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంటుంటారు. వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖకు పంపిస్తున్నట్లుగా చూపించి అర్జీదారునికి రసీదు అందిస్తారు. అంటే ప్రజల నుంచి వచ్చిన అర్జీని సంబంధిత శాఖకు పంపిస్తే పరిష్కారమైనట్లేనని జిల్లా యంత్రాంగం విచిత్రమైన ప్రకటన చేయడాన్ని అర్జీదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎండలు, వడగాల్పులకు ఎదురెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తే.. వారు అర్జీని తీసుకొని రసీదు ఇవ్వడం, ఒకటి రెండు రోజుల తరువాత సమస్య పరిష్కరించినట్లు సంబంధిత వ్యక్తి సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆనందంతో ఆ కార్యాలయానికి వెళితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సమస్య పరిష్కారం కాకుండా అర్జీ ఆ కార్యాలయంలో అలాగే కనిపిస్తుంటుంది. తన సమస్యను పరిష్కరించలేదా అని బాధితుడు అడిగితే కలెక్టరేట్ నుంచి మాకు అర్జీ మాత్రమే వచ్చిందని సంబంధిత సిబ్బంది సమాధానం ఇవ్వడంతో అవాక్కవడం బాధితుడికి అలవాటుగా మారింది. అర్జీలను పరిష్కరించకుండానే సంబంధిత శాఖకు పంపిస్తే పరిష్కారమైనట్లుగా జిల్లా యంత్రాంగం అడ్డగోలుగా లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త కలెక్టర్‌పైనే కోటి ఆశలు: జిల్లా కలెక్టర్‌గా వి.వినయ్‌చంద్ మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తొలిసారిగా సోమవారం మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయనపైనే బాధిత ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత కలెక్టర్ సుజాతశర్మ మీకోసం కార్యక్రమానికి మొక్కుబడిగానే హాజరయ్యారు. జిల్లాలో దాదాపు రెండేళ్లపాటు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ కొన్ని పర్యాయాలు వారాల తరబడి మీకోసం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా ప్రజలు తమ సమస్యలను సుజాతశర్మకు విన్నవించుకున్నప్పటికీ తెలుగు భాషపై ఆమెకు పూర్తి స్థాయిలో పట్టులేకపోవడంతో కొన్నిసార్లు బాధితుల ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోయేది. ఈ నేపథ్యంలో నూతన కలెక్టర్‌గా వినయ్‌చంద్ బాధ్యతలు స్వీకరించడం, ఆయనకు క్షేత్ర స్థాయిలో ప్రజల సాధక బాధకాలు తెలియడంతోపాటు భాష సమస్య లేకపోవడంతో మీకోసంలో అర్జీలకు త్వరితగతిన పరిష్కారం దక్కుతుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. -
పరిహారం మహాప్రభో!
- వరుస కరువుతో బతుకు భారమైంది - 2015-16కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదు - అధికారుల ఎదుట ఆదోని మండల రైతులు ఆవేదన – ‘మీ కోసం’కు వినతుల వెల్లువ అయ్యా..వంద కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. భూమాతను నమ్ముకుని కాయాకష్టంతో బ్రతుకుతున్నాం. కరువుతో అల్లాడిపోతున్నాం... బ్రతుకు బండిని లాగుతున్నాం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. కల్లూరు (రూరల్): ‘మాది ఆదోని మండలం బసరకోట గ్రామం. మాకు ఆస్పరి మండలం డి.కోటకొండలో పొలం ఉంది. అదే మాకు ఆధారం. వరుస కరువులతో కొన్నేళ్లుగా పంటలు పండటం లేదు. 2015–16 సంవత్సరానికి సంబంధించి 57 మంది రైతులకు ఇప్పటి వరకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. చాలా నెలల క్రితమే పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాలు (ఇన్పుట్ సబ్సిడీ 2015–16) ఇచ్చారు. ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేద’ని ఆ గ్రామానికి చెందిన బాధిత రైతులు అధికారుల ఎదుట వాపోయారు. పరిహారం రాకపోవడానికి కారణమేమిటని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని రైతులు స్వామి, దాసు, పెద్ద ఆంజనేయులు, చిన్న ఆంజనేయులు, పెద్ద నర్సన్న, చిన్న నర్సన్న, పరమేశ్వరప్ప, కిరీటప్ప, రాముడు, హనుమంతు తదితరులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలిసి విన్నవించారు. ఇలాంటి పలు సమస్యలపై జిల్లా నుంచి పలువురు కలెక్ట్టరేట్కు వచ్చారు. వీరి నుంచి జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వినతులు స్వీకరించారు. అందులో కొన్ని.. అర్బన్ హెల్త్ సెంటర్లో పని చేస్తున్న డాక్టర్లకు, ఏఎన్ఎంలకు పెండింగ్‌లో ఉన్న 22 నెల పరా్ఫ్ మెన్స్ అలవెన్స్ ఇప్పించండని ఏఎన్ఎంలు ఎన్. సువర్ణ, ఎస్.శోభారాణి, ఎం.పద్మావతి, వి.సూర్యకళ, సుజాత, వి.పద్మావతి, భాగ్యమ్మ జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కు పెండింగ్ వేతనాలు, అమ్మ అమృతహస్త బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలితమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి జేసీకి కోరారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో సక్రమంగా వేతనలు ఇవ్వడమే కాక భారీగా పెంచారని చెప్పారు గుత్తిపెట్రోల్ బంకు సమీపంలోని 32వార్డులోని బీఆర్ విజ్జీనగర్లో గురుదత్త గుడి నుంచి 160 మీటర్ల పొడవున సీసీ రోడ్డు వేయాల్సి ఉండంగా 60 మీటర్ల వరకు మాత్రమే వేసి మిగతా 100 మీటర్ల రోడ్డును పక్క వీధిలోకి మళ్లించరు. దీనిపై విచారించి న్యాయం చేయాలని జేసీకి సయ్యద్ అమ్ము, జయచంద్ర, నాగేశ్వరరావు, లాజర్, సామేల్, ప్రభాకర్, హుస్సేన్‌లు ఫిర్యాదు చేశారు. డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు నరేష్, సురేంద్ర, మరి, మహేష్, అశోక్ జేసీకి ఫిర్యాదు చేశారు. పాములపాడు మండలం బానుముక్కల గ్రామంలో తన పేరు మీద ఉన్న భూమిని తహసీల్దార్, వీఆర్ఓ ఆన్లైన్ అడంగల్‌లో నమోదు చేయడం లేదని చాకలి గంగమ్మ జేసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పాములపాడు తహసీల్దార్ నాగేంద్రతో మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా ఆన్లైన్ అడంగల్‌లో బాధితుల భూమిని ఎందుకు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలని ఆదేశించారు. బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలోని సర్వే నంబర్ 73–2లో 7.18 సెంట్ల పొలం ఉందని, ఈ పొలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నట్లు రైతు మిద్దె రామ్మోహన్‌రెడ్డి జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఆదోని షాహి ఈద్గాలో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఆ ప్రాంతంలో లైటింగ్, శానిటేషన్, పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని ఆ ఈద్గా ప్రెసిడెంట్ అలి హజ్మసాహబ్, సెక్రటరీ అబ్దుల్ రషీద్ అధికారులకు విన్నవించారు. -
మద్యం షాపు పెడితే ఉద్యమిస్తాం
– ప్రజాదర్బార్‌లో అధికారులతో మహిళల వాగ్వాదం కల్లూరు (రూరల్): ‘‘మీ కాళ్లు పట్టుకుని మొక్కుతాం సార్.. మా కాలనీలో మద్యం షాపు వద్దు. ఇక్కడ రామాలయం ఉంది. 15వేల మంది విద్యార్థులు బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రతి రోజూ వందల మంది విద్యార్థులు వివిధ విద్యా సంస్థలకు వెళ్తుంటారు. మద్యం షాపు పెడితే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది. కాలనీలో మద్యం షాపును తెరిచేందుకు నిర్మాణాలు చేపడుతున్నారు. దయచేసి మద్యం షాపుకు అనుమతి ఇవ్వొద్దు... ఇచ్చారంటే మహిళలు, పురుషులమంతా ఏకమై ఉద్యమం చేస్తాం’’ అంటూ నంద్యాలలోని ఎన్జీఓ కాలనీ, నివర్తినగర్ మహిళలు చెన్నమ్మ, సుంకులమ్మ, నాగార్జున, పెద్ద ఎల్లయ్య, లింగమయ్య, మురళి, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రప్పలు.. మీ కోసం ప్రజాదర్బార్‌లో తమ గోడును డీఆర్ఓ గంగాధర్‌గౌడుకు విన్నవించారు. మద్యం షాపు అనుమతిని రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేయాలని డీఆర్ఓ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారితో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. సోమవారం నిర్వహించిన మీ కోసం ప్రజాదర్బార్‌లో కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వినతులను స్వీకరించారు. వినతుల్లో కొన్ని... సి. బెళగల్ మండలం ఈర్లదిన్నె గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట ఇసుకను అమ్ముకుంటున్నారని, ఈ విషయమై తహసీల్దార్, ఎస్ఐకు తెలియజేసినా చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామంలో 2009లో వరద ముంపుకు గురైన వారికి ఇళ్ల స్థలాల కోసం 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కేటాయించారని, ఇంతవరకూ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదని..న్యాయం చేయాలని కోరారు. తన పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించారని జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామానికి చెందిన దేవమ్మ.. జిల్లా కలెక్టర్ విజయమోహన్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని జూపాడుబంగ్లా తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సంవత్సరాలు గడిచిపోతున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదని దేవమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 216లోని ఐదు ఎకరాల్లో మామిడి పంటను సాగు చేశానని, పాత బ్యాటరీలను కాల్చి పొగను వెదజల్లడంతో తోట నాశనమైందని.. న్యాయం చేయాలని డీఆర్ఓకు రైతు బి.నాగలక్ష్మయ్య విన్నవించారు. మిడ్తూరు మండలం 49 బన్నూరులో రేషన్‌కార్డు నెంబర్ డబ్ల్యూఏపీ131600500173, డబ్ల్యూఏపీ 131600500306లకు వేలిముద్రలు పడడం లేదని, రేషన్ ఇవ్వడం లేదని, షేక్ మహబూబ్‌బాష, బి రామలక్ష్మమ్మ డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. పిహెచ్సీ, సీహెచ్‌సీల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నామని, ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని 104 స్టాఫ్ వెంకటరమణ, రహిమాన్, అబ్దుల్లా, కిరణ్‌కుమార్, నాగేశ్వర్‌రెడ్డి, అభిమన్యుడు మొరపెట్టుకున్నారు. పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలోని సర్వే నెంబర్ 201లోని ప్రభుత్వానికి సంబంధించిన 8.92 సెంట్ల భూమిని 24.84 సెంట్ల భూమిగా మార్పు చేసి స్థానిక ఆంధ్రబ్యాంకులో రుణాలు తీసుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారని బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆ గ్రామ నివాసి బి.శివశంకర్ ఫిర్యాదు చేశారు. -
నేడు డయల్ యువర్ కలెక్టర్, మీకోసం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సమస్యలపై వినతిపత్రాల స్వీకరణ కోసం నిర్వహిస్తున్న మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలను సోమవారం చేపడతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్, ఆ తర్వాత సునయన ఆడిటోరియంలో మీ కోసం కార్యక్రమాలు జరుగుతాయని డీఆర్వో గంగాధర్‌గౌడ్ తెలిపారు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్(08518- 277100)ద్వారా సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావచ్చని డీఆర్వో తెలిపారు. -
మహాప్రభో పంటలను కాపాడండి
- కలెక్టర్‌ను కోరిన ప్రాతకోట గ్రామస్తులు - నెలన్నర తర్వాత మీకోసం - తరలివచ్చిన బాధితులు కల్లూరు (రూరల్): ముచ్చుమర్రి ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కేసీ కెనాల్‌కు రెండు పంపుల ద్వారా సాగునీటిని అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామ పెద్దలు అంబటి శివశంకర్‌రెడ్డి, ఎంపీటీసీలు రాములు, చిన్న కిష్టన్న, రైతులు శంకర్, పక్కీరప్ప, జలీల్ అహ్మద్, లింగారెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోఉండడంతో నెలన్నరపాటు మీకోసం కార్యక్రమం వాయిదా పడి సోమవారం తిరిగి ప్రారంభమైంది. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో సునయన ఆడిటోరియం కిటకిటలాడింది. జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్, జేసీ సి హరికిరణ్, జేసీ 2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, హౌసింగ్ పీడీ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వినతి పత్రాలు స్వీకరించి ఆయా విభాగాలకు రెఫర్ చేశారు. వినతుల్లో కొన్ని – డోన్ మున్సిపల్ టెండర్లను ఏకపక్షంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకుడు కేశన్నగౌడుతో పాటు అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్‌కు బీసీ జన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి శేషఫణి యాదవ్ ఫిర్యాదు చేశారు. కల్లూరు మండలం ఉలిందకొండ మజరా గ్రామమైన కొల్లంపల్లి తండాలో రెండు నెలలుగా చుక్క మంచినీరు లేదని ఉన్న రెండు బోర్లలో ఒక్క బోరు పూర్తిగా ఎండిపోయిందని మరోబోరులో చుక్కనీరు రావడం లేదని, పొలాల వెంట వెళ్లి తాగునీటిని ఎత్తుకొచ్చుకుంటున్నామని జేసీ2 రామస్వామితో మొరపెట్టుకున్నారు. మద్దికెర మండలం బూర్జుల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు రామనాయక్, లక్కీ నాయక్, లక్ష్మీనాయక్, సుగాలి రెడ్డమ్మ, సుబ్బరాయుడు వినతి పత్రం అందజేశారు. గూడూరు మండలం ఆర్ ఖానాపురం గ్రామంలోని 2వేల ఎకరాల్లోని పొలాలకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను పరిష్కరించాలంటూ రైతులు శ్రీనివాసులు, పెద్ద హనుమన్న, సోలోమాన్ కలెక్టర్‌కు విన్నవించారు. మంత్రాలయం ప్రభుత్వ సర్వేయర్ రాజేశ్వరి ప్రైవేట్ సర్వేయర్లను రానివ్వడం లేదని ప్రైవేట్ సర్వేయర్లు జేసీ హరికిరిణ్కు విన్నవించడంతో హాజరు పట్టిక వివరాలను తీసుకురావాలని సమస్యను రాకుండా సమన్వయంతో పని చేయాలని జేసీ సూచించారు. -
నేడు డయల్ యువర్ కలెక్టర్, మీకోసం
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నేటి సోమవారం నుంచి మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు యదావిధిగా నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్, తర్వాత సునయన ఆడిటోరియంలో మీ కోసం కార్యక్రమాలు జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 08518- 277100కు పోన్ చేసి సమస్యలను చెప్పవచ్చని అధికారులు తెలిపారు. -
నేటి ‘మీ కోసం’ రద్దు
అనంతపురం సెంట్రల్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో యథావిధిగా మీకోసం కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆయా మండలాల్లోనే అర్జీలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. -
సమస్యల పరిష్కారానికి సమయమివ్వండి
ఏలూరు (మెట్రో) : సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం వేచి చూడాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వారి సమస్య పరిష్కారం కాలేదంటూ తర్వాతవారమే మీ కోసం కార్యక్రమానికి వచ్చి వినతులు అందిస్తున్నారన్నారని, ప్రజలిచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ చేస్తారని, కొన్ని సందర్భాల్లో ఇరుపక్షాల వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో ఆ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రజలు డబ్బు, సమయం వృథా చేసుకోకుండా కొన్నిరోజులు వేచి చూడాలన్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే తన దగ్గరకు వస్తే ఆ సమస్య ఏ పరిస్థితుల్లో ఉందో తాను తెలుసుకుని వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత తొందరలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. lభీమడోలు మండలం గుండుగొలను 2వ వార్డులో పంచాయతీకి చెందిన రోడ్డును ఆక్రమించుకుని కొందరు షాపులు, ఇళ్లు నిర్మాణాలు చేపట్టారని రెడ్డి దుర్గారావు, మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. lగోపాలపురం మండలం కొవ్వూరుపాడులోని ఎస్సీ పేటకు ఆనుకుని ఇళ్ల మధ్యలో కోళ్లఫారం ఏర్పాటు చేశారని, దానివల్ల దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఈగలు, దోమలు, విషపురుగుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కె.చిట్టిబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. lచింతలపూడి మండలం ఊట సముద్రం గ్రామ ఉప సర్పంచి పాములపాటి నర్సారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ గ్రామ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు చేశారు. lపోలవరం మండలం గూటాలకు చెందిన ముంగర రమణరావు, మల్లిపూడి వెంకటలక్ష్మి తాము కులాంతర వివాహం చేసుకున్నామని, కులాంతర వివాహ ప్రోత్సాహకం నిధులు తమకు అందలేదని ఫిర్యాదు చేశారు. lదెందులూరు మండలం కొవ్వలికి చెందిన యర్రా రాము, చాట్ల ధర్మయ్య, చప్పిడి ముసలయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ పంచాయతీకి చెందిన ఎకరా 25 సెంట్లు భూమి ఇళ్లస్థలాలుగా అందించాలని కోరారు. lఆకివీడు మండలం సిద్ధాపురానికి చెందిన సర్పంచి తోట శివాజీ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ సిద్ధాపురం పంచాయతీ పరిధిలోని వందమిల్లిపాడులో ఉన్న 38 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యలపై స్పందించిన కలెక్టర్ సమస్యలపై విచారణ చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారాల్లో అధికారులు తాత్సారం చేస్తే అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, హౌ సింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి సమయమివ్వండి
ఏలూరు (మెట్రో) : సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం వేచి చూడాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వారి సమస్య పరిష్కారం కాలేదంటూ తర్వాతవారమే మీ కోసం కార్యక్రమానికి వచ్చి వినతులు అందిస్తున్నారన్నారని, ప్రజలిచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ చేస్తారని, కొన్ని సందర్భాల్లో ఇరుపక్షాల వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో ఆ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రజలు డబ్బు, సమయం వృథా చేసుకోకుండా కొన్నిరోజులు వేచి చూడాలన్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే తన దగ్గరకు వస్తే ఆ సమస్య ఏ పరిస్థితుల్లో ఉందో తాను తెలుసుకుని వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత తొందరలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. lభీమడోలు మండలం గుండుగొలను 2వ వార్డులో పంచాయతీకి చెందిన రోడ్డును ఆక్రమించుకుని కొందరు షాపులు, ఇళ్లు నిర్మాణాలు చేపట్టారని రెడ్డి దుర్గారావు, మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. lగోపాలపురం మండలం కొవ్వూరుపాడులోని ఎస్సీ పేటకు ఆనుకుని ఇళ్ల మధ్యలో కోళ్లఫారం ఏర్పాటు చేశారని, దానివల్ల దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఈగలు, దోమలు, విషపురుగుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కె.చిట్టిబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. lచింతలపూడి మండలం ఊట సముద్రం గ్రామ ఉప సర్పంచి పాములపాటి నర్సారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ గ్రామ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు చేశారు. lపోలవరం మండలం గూటాలకు చెందిన ముంగర రమణరావు, మల్లిపూడి వెంకటలక్ష్మి తాము కులాంతర వివాహం చేసుకున్నామని, కులాంతర వివాహ ప్రోత్సాహకం నిధులు తమకు అందలేదని ఫిర్యాదు చేశారు. lదెందులూరు మండలం కొవ్వలికి చెందిన యర్రా రాము, చాట్ల ధర్మయ్య, చప్పిడి ముసలయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ పంచాయతీకి చెందిన ఎకరా 25 సెంట్లు భూమి ఇళ్లస్థలాలుగా అందించాలని కోరారు. lఆకివీడు మండలం సిద్ధాపురానికి చెందిన సర్పంచి తోట శివాజీ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ సిద్ధాపురం పంచాయతీ పరిధిలోని వందమిల్లిపాడులో ఉన్న 38 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యలపై స్పందించిన కలెక్టర్ సమస్యలపై విచారణ చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారాల్లో అధికారులు తాత్సారం చేస్తే అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, హౌ సింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీల్లో టాప్‌లో ఉండాలి
మచిలీపట్నం(చిలకలపూడి) : నగదు రహిత లావాదేవీల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాబు.ఎ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపుహాలులో సోమవారం మీకోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై కౌన్సిల్ ఎష్యురెన్స్ కమిటీలను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండు వేల లోపు జనాభా ఉన్న గ్రామాలు పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు, రెండు నుంచి ఐదు వేల జనాభా ఉండి పూర్తిస్థాయిలో నగదు రహితలావాదేవీలు నిర్వహిస్తే రూ.20 వేలు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. 5 నుంచి 10 వేలలోపు ఉన్న గ్రామాలు పూర్తిస్థాయిలో లావాదేవీలు నిర్వహిస్తే రూ.50 వేలు, 10 వేలు జనాభా దాటిన గ్రామాలు పూర్తిస్థాయిలో లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఒక గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా గురువారం నాటికి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 41 వేల మంది వ్యాపారులకు ఈ పోస్ మిషన్లు అందజేసేందుకు 120 టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. నాలుగు రోజుల్లో రికార్డుస్థాయిలో రేషన్‌షాపుల ద్వారా 2.10 లక్షల నగదు రహిత లావాదేవీలను నిర్వహించినట్లు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో సీపీవో కేవీకే రత్నబాబు, డీఎంహెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఆర్ యుగంధర్, సాంఘిక సంక్షేమశాఖ జేడీ పీఎస్ఏ ప్రసాద్, డీసీవో ఆనందబాబు పాల్గొన్నారు. అర్జీలు ఇవే.. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, స్టాఫ్‌నర్సుల నిర్లక్ష్యంతో కుమార్తె కె.శివపార్వతి కొంత కాలం క్రితం చనిపోగా ఇంత వరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని, తగిన న్యాయం చేయాలని కోరుతూ మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన అద్దంకి లక్ష్మణ అర్జీ ఇచ్చారు. గ్రంథాలయ పన్ను పంచాయతీలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అర్జీ ఇచ్చారు. జిల్లాలోని 33 సీపీడబ్ల్యూఎస్ స్కీంల నిర్వాహకులకు జీతం బకాయిలు చెల్లించాలని కె.భూపతిరెడ్డి అర్జీ ఇచ్చారు. మచిలీపట్నంలోని అమృతపురం, ముస్తాఖాన్‌పేట, నారాయణపురం తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరుతూ వై.వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. -
భూమా బంధువుల దౌర్జన్యం
బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ - జేసీ2కు ఫిర్యాదు – మీకోసంకు వెల్లువెత్తిన వినతులు కల్లూరు (రూరల్): ఆళ్లగడ్డ మండలం పి. చింతకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1562, 1564లో దళితులు సాగుచేసుకుంటున్న ఏడబ్ల్యూ ల్యాండ్‌ను అధికారపార్టీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బంధువులు భూమా రుద్రారెడ్డి, గనిశ్రీను మరికొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సైతం తీసుకెళా్లను. మీరైనా స్పందించి రెవెన్యూ రికార్డులోని ఆర్ఓఆర్లో ఉన్న దళితుల భూములను కాపాడి బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి డాలు రత్నమయ్య జిల్లా అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి జేసీ సి. హరికిరణ్, జేసీ2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ వినతులు స్వీకరించారు. అందులో.. – సర్వే నంబర్ 367/ఏ లోని ఎకరన్నర పొలాన్ని సర్వే చేయాలని ఏడు నెలలుగా వెల్దుర్తి తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వి. తిమ్మయ్య శెట్టి జేసీకి ఫిర్యాదు చేశారు. – డోన్ మండలం కమలాపురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ ఆర్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్ఎస్ రామకృష్ణారెడ్డి తదితరులు అధికారులకు విన్నవించారు. – కొర్రబియ్యం విక్రయానికి కలెక్టరేట్ ఆవరణం, సీ క్యాంపు రైతు బజార్లో షాపు కేటాయించాలని తెర్నేకల్లు వాసులు నాగభూషణం, జనార్దన్ కోరారు. – పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని తమదంటూ చాకలి శేషన్న కుమారుడు చిన్న నరసింహులు దౌర్జన్యం చేస్తున్నాడని మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన నల్లబోతుల బోడెన్న తెలిపారు. – పగిడ్యాల మండలం ప్రాతకోట, వనములపాడు, నందికొట్కూరు మండలం 10 బొల్లవరంలో డీలర్ల నియామకానికి నిర్వహించిన రాతపరీక్షలో ముగ్గురు ఎంపికయ్యారని. అయితే వారిని కాదని ఇతరులకు రేషన్‌షాపులు కట్టబెట్టారని కొందరు జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. – గ్రూపు 2, 3 పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక నాయకులు తగ్గుపర్తి రామన్న, మహరాజ్, రాము, మల్లేష్, దివాకర్, వలి, సోము, ప్రసాద్, రాజేష్, దాసు జేసీకి ఫిర్యాదు చేశారు. పరిహారం ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి – రక్షణ శాఖకు కేటాయించనున్న ఓర్వకల్లు మండలం పాలకొలనులోని సర్వే నంబర్లు 99, 232,235, 250,252, 250లలోని 186 ఎకరాల భూమికి ఎకరాకు రూ.1.80లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని జేసీ హరికిరణ్ బాధిత రైతులకు వెల్లడించారు. తాము అందుకు అంగీకరించమని భూములు కోల్పోయే రైతులు సుధాకర్‌రెడ్డి మరికొందరు మీకోసం కార్యక్రమంలో జేసీని విన్నవించారు. ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అరెస్ట్ చేసి లోపలేయండని స్థానిక పోలీసులకు ఆదేశించారు. దీంతో బాధితులు, జేసీ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్పమాలలో ఉన్న తనను కనీస మర్యాద లేకుండా జేసీ మాట్లాడుతున్నారని, వారికి భయపడి భూములు అప్పగించే ప్రసక్తే లేదని సుధాకర్‌రెడ్డి చెప్పారు. -
పని చేస్తేనే నిధులు వస్తాయి
మచిలీపట్నం (చిలకలపూడి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పనులపై ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ బాబు.ఎ చెప్పారు. చేసిన పనులను బట్టే నిధులు విడుదలవుతాయని ఆయన తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డీఆర్వో రంగయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని, కూలీలకు ఎక్కువ గంటలు పని కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో రహదారుల నిర్మాణం కూడా వేగవంతం చేయాలన్నారు. ప్రతి వారం జిల్లాలో 20 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. అన్ని మండలాల్లో నూతన గృహాలు మంజూరు చేశామని, పనులు వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశారు. త్వరలోనే పట్టణాల్లో కూడా గృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం 120 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. మరో 54 భవనాల నిర్మాణానికి స్థలాల సేకరణ జరుగుతుందని చెప్పారు. 10 రోజుల్లో సర్వే పూర్తి చేయాలి జిల్లాలో ప్రజాసాధికార సర్వేను పది రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 80 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వే పూర్తికాని ప్రజలు 1077 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదిస్తే వెంటనే సిబ్బందిని పంపి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో ఇప్పటికి 53 శాతం సర్వే పూర్తయిందన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు, జెడ్పీ సీఈవో టి.దామోదరనాయుడు, డీఎస్వో వి.రవికిరణ్, సీపీవో కేవీకే రత్నబాబు, డ్వామా పీడీ మాధవీలత, డీఈవో ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలు గాలికి.. అధికారులు నిద్రలోకి!
– సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఎదుటే నిద్రలోకి జారుకున్న అధికారులు – సెల్ఫోన్లలో మాట్లాడుతూ బిజీబీజీ...మరికొందరు పిచ్చపాటిగా చర్చలు – ప్రజాదర్బార్‌లో ఎవరి దారి వారిదే కల్లూరు (రూరల్): ప్రజల సమస్యలు అధికారులకు పట్టడం లేదు. జిల్లా నలుమూలల నుంచి ప్రయాసపడిన ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలు తమ కష్టాలు తీరుతాయని ఆశించినా .. ప్రయోజనం కనిపించడం లేదు. సమస్య అధికారులకు చెబితే పరిష్కరిస్తారనుకుంటే.. మన ప్రభుత్వ అధికారులు మాత్రం సునయన ఆడిటోరియంలోని చల్లని వాతావరణంలో తమకేమి పట్టనట్లు కునుకు తీస్తున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే ప్రజాదర్బార్‌కు హాజరైన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కలెక్టర్ ఎదుటే నిద్రలోకి జారుకోవడాన్ని చూస్తుంటే, విధి నిర్వహణలో వారికున్న శ్రద్ధఏ పాటిదో అర్థమవుతోంది. మరికొందరు సెల్ఫోన్లలో మాట్లాడుతూ బిజీబీజీగా ఉండడం, ఇంకొందరు పిచ్చపాటిగా ఒకరికొకరు మాట్లాడుకుంటు కాలక్షేపం చేస్తున్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు అర్జీలిచ్చి అధికారులకు చెప్పుకుంటే పరిష్కరిస్తారనుకుంటే పొరపాటే. వారి సమస్యలను ఏమాత్రం చెవికెక్కించుకోకుండా ప్రభుత్వ అధికారులు గాలికొదిలేశారని చెప్పడానికి ఈ ఫోటోలే ఇందుకు సాక్ష్యం. ఫిర్యాదులు ఇవీ.. నందికొట్కూరులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకొని, భూసేకరణ చట్ట ప్రకారం షాపుల యజమానులకు నష్టపరిహారం అందించాలని డీసీసీ ప్రెసిడెంట్ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్‌రత్నం జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్‌ను కోరారు. -కర్నూలు మండలం రేమట ఎత్తిపోతల నుంచి నీళ్లు అందక కొత్తకొట, తొలశాపురం, బసాపురం, ఆర్ కానాపురం గ్రామాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయని..ఆదుకోవాలని రైతులు వెంకటేశ్వర్లు, మద్దిలేటి, జయన్న, మునిస్వామి మౌలాలి విజ్ఞప్తి చేశారు. గోకులపాడులో సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, సుంకేసుల నుంచి గోకులపాడు మినీడ్యాంకు సాగునీళ్లివ్వాలని గ్రామ సర్పంచ్ లక్ష్మీవరదారెడ్డి, రైతులు రఘునాథరెడ్డి, పార్వతిరెడ్డి, మహేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి కలెక్టర్‌ను వినతిపత్రం అందించారు. వర్షాభావ పరిస్థితుల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయని జుర్రేరు ప్రాజెక్టు నుంచి దద్దణాల ప్రాజెక్టుకు సాగు, తాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని కె. మూలారెడ్డి, రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్, రబీలో వేసుకున్న పత్తి, మిరప, కంది, జొన్న, మినుము, మొక్కజొన్న నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, మల్యాల ఎత్తిపోతల పథకం వద్ద అదనంగా పంపును ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని గడివేముల కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఒడ్డు ప్రతాపరెడ్డి, కరిమద్దెల ఎంపీటీసీ ఈశ్వర్‌రెడ్డి, తూడిచెర్ల, పెసరవాయి, కరిమిద్దెల, ఎర్రగుంట్ల, భూజనూరు, చిందకూరు, గ్రందివేముల, గడిగరేవుల, తిరుపాడు, కోరటమద్ది, పులిమద్ది గ్రామాల రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. మదారి కురువ, మదాసి కురువలను ఎస్సీలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ మదారి కురువ, మదాసి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు దిబ్బనగంట రంగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కె సుంకన్న, ట్రెజరర్ చంద్రశేఖర్, జిల్లాలోని 40 మండలాల్లోని మదారి కురువ, మదాసి కురువలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.