Melbourne Stars
-
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం?
BBL 2024- Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పటికే జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మాక్సీ మెల్బోర్న్ స్టార్స్ నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు సీజన్లలో కెప్టెన్‌గా అదరగొట్టిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు పర్యాయాల్లో తొలుత మెల్బోర్న్ రెనెగేడ్స్.. తర్వాత సిడ్నీ సిక్సర్స్ చేతిలో మెల్బోర్న్ స్టార్స్ ఓడిపోయింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడి టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతర ఎడిషన్లలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన స్టార్స్.. బీబీఎల్ 12 సీజన్లో కెప్టెన్ మాక్స్వెల్ సేవలు కోల్పోయింది. కాలు విరిగిన కారణంగా మాక్సీ గతేడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా జరుగుతున్న పదమూడో ఎడిషన్‌తో తిరిగి జట్టుతో చేరాడు. ఈ క్రమంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 243 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. మాక్సీ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన మెల్బోర్న్ స్టార్స్.. తర్వాత కోలుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత పాత కథే పునరావృతమైంది. మరుసటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ఫైనల్ చేరే అవకాశాలు చేజార్చుకుంది మెల్బోర్న్ స్టార్స్. తద్వారా పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా నిరాశచెందిన మాక్స్వెల్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. కాగా ఐదేళ్లపాటు మెల్బోర్న్ స్టార్స్ సారథిగా కొనసాగిన గ్లెన్ మాక్స్వెల్.. 35 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అదే విధంగా అతడి ఖాతాలో 31 ఓటములు కూడా ఉన్నాయి. కాగా మాక్సీ స్టార్స్‌తో కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకోవాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడితో మరో రెండేళ్లు బంధం కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీబీఎల్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా శనివారం మెల్బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. క్లియర్‌గా నాటౌట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్‌గా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అసలేం జరిగిందంటే? సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇమాడ్ వసీం బౌలింగ్‌లో జేమ్స్ విన్స్ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. బౌలర్ వసీమ్ బంతి ఆపేందుకు ప్రయత్నించగా అతడి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్బోర్న్ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫీర్ చేశారు. రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లు క్లియర్‌గా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే అనూహ్యంగా బిగ్‌స్క్రీన్‌లో ఔట్ కన్పించింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో గందరగోళం నెలకొంది. అయితే థర్డ్ నాటౌట్ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్ నొక్కడంతో ఇలా జరిగింది. తన తప్పిదాన్ని గ్రహించిన థర్డ్ అంపైర్ వెంటనే నాటౌట్ బటన్ నొక్కడంతో బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ — KFC Big Bash League (@BBL) January 6, 2024 -
ఫ్రీ హిట్‌కు క్యాచ్ పట్టి సెలబ్రేషన్స్.. పాక్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్-2023లో భాగంగా శనివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న పాకిస్తాన్ ఆటగాడు ఉసామా మీర్ గ్రౌండ్లో నవ్వులు పూయించాడు. ఏం జరిగిందంటే? మెల్బోర్న్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతి వేసే క్రమంలో బౌలర్ స్టిక్టీ ఓవర్ స్టాప్ చేశాడు. దీంతో మెల్బోర్న్ బ్యాటర్ బెన్క్రాప్ట్కు ఫ్రీహిట్ లభించింది. ఫ్రీహిట్ బంతిని బెన్‌క్రాప్ట్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని థర్డ్‌మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఉసామా మీర్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన అది ఫ్రీహిట్ అని మర్చిపోయిన ఉస్మామీర్ బంతిని త్రో చేయకుండా సంబరాల్లో మునిగితేలిపోయాడు. వెంటనే మరో సిడ్నీ ఆటగాడు బాల్ త్రో చేయమని సైగ చేస్తే.. అప్పుడు మీర్ వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మీర్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. The old catch off a free hit! Unlucky, Usama 😅 #BBL13 pic.twitter.com/eOnQC7v8p9 — KFC Big Bash League (@BBL) December 23, 2023 చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే? -
కొలిన్ మున్రో ఊచకోత.. తృటిలో సెంచరీ మిస్.. ఎందుకంటే?
బిగ్ బాష్ లీగ్ 2023 సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గురువారం (డిసెంబర్ 7) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై బ్రిస్బేన్ హీట్ 103 పరుగుల భారీ విజయం సాధించింది. బ్రిస్బేన్ గెలుపులో కొలిన్ మున్రో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 99 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో మున్రోకు సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాక్స్ బ్రయాంట్ (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) కారణంగా ఆ అవకాశం చేజారింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీశాక మున్రో స్కోర్ 99కి చేరింది. అయితే ఆతర్వాత మూడు బంతులను బ్రయాంట్ బౌండరీలుగా తరలించడంతో మున్రోకు సెంచరీ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్.. మున్రో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (28), లబూషేన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మెల్బోర్న్ బౌలర్లు జోయెల్ పారిస్, మ్యాక్స్‌వెల్, కౌల్డర్‌నైల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ను బ్రిస్బేన్ బౌలర్లు 111 పరుగులకే (15.1 ఓవర్లలో) కుప్పకూల్చారు. మిచెల్ స్వెప్సన్ 3, మైఖేల్ నెసర్, జేవియర్ బార్ట్లెట్ చెరో 2 వికెట్లు, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కున్హేమన్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో హిల్టన్ కార్ట్‌వైట్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ
ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టోయినిస్, స్పిన్నర్ ఆడమ్ జంపాల పేరు చెప్పగానే ఒక విషయం గుర్తుకురాక మానదు. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య 2019 బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్)లో జరిగిన బ్రొమాన్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు గే(హోమోసెక్సువల్స్) రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలపై అటు స్టోయినిస్ కానీ.. ఇటు జంపా కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీనిని బట్లే స్టోయినిస్, జంపాలు హోమోసెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. వీరిద్దరు లివింగ్ఇన్ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే అటు ఆస్ట్రేలియా క్రికెట్లో.. ఇటు బిగ్‌బాష్ లీగ్‌లో చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరు బ్రొమాన్స్ చేసుకోవడం కెమెరాల కంట పడింది. తాజాగా ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు దినోత్సవం పురస్కరించుకొని బీబీఎల్ ఫ్రాంచైజీ మెల్బోర్న్ స్టార్స్ ఒక ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ ఫోటోలో స్టోయినిస్ చెంపపై ఆడమ్ జంపా ముద్దుపెట్టడం కనిపిస్తుంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ ''హ్యాపీ వాలెంటైన్స్ డే'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథను పరిచయం చేసినందుకు బీబీఎల్‌కు కృతజ్ఞతలు అంటూ కొందరు అభిమానుల ట్వీట్ చేశారు. ఇక బీబీఎల్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆడమ్ జంపా.. ఈ సీజన్లో జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనప్పటికి.. ఆటగాడిగా మాత్రం అదరగొట్టాడు. టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన జంపా 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొదటిస్థానంలో లూక్‌వుడ్(14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు) ఉన్నాడు. ఇక స్టోయినిస్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలో సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మెల్బోర్న్ స్టార్స్ బీబీఎల్ 2022-23లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియా తరపున మార్కస్ స్టోయినిస్ 57 వన్డేల్లో 1296 పరుగులు, 51 టి20ల్లో 803 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. ఎన్నోసార్లు తన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లతో చాలాసార్లు విజయాలందించాడు. ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా 76 వన్డేల్లో 127 వికెట్లు, 72 టి20ల్లో 82 వికెట్లు పడగొట్టాడు. happy valentine's day 🥰 pic.twitter.com/tv5dkKlxi3 — KFC Big Bash League (@BBL) February 13, 2023 Ohk, happy Valentines Day 🌝👍🏻 pic.twitter.com/XgGrTDNYvS — 𝐀𝐬𝐡𝐦𝐢𝐭𝐚 (@samaira__kohli) February 14, 2023 చదవండి: క్రికెటర్ మనసు దోచుకున్న మల్లికా సాగర్ -
ఆఖరి బంతికి సిక్సర్ కావాలి, స్ట్రయిక్‌లో స్టోయినిస్.. ఏం జరిగిందంటే..?
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో మరో రసవత్తర సమరం జరిగింది. గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మెల్బోర్న్ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్సర్ బాదాల్సి ఉండింది. స్ట్రయిక్‌లో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించిన స్టోయినిస్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని స్టోయినిస్ భారీ షాట్‌గా మలిచేందుకు విఫలయత్నం చేశాడు. మెల్బోర్న్ కేవలం ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకుని, 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ఓవర్లో (ఇన్నింగ్స్ 19వ ఓవర్) 21 పరుగులు పిండుకున్న స్టోయినిస్ (23 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), హిల్టన్ కార్ట్‌రైట్ (24 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) జోడీ ఆఖరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. సామ్ హెయిన్ (41 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), పియర్సన్ (43 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెల్బోర్న్ బౌలర్లలో లూక్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్ నైల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో మెల్బోర్న్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ వారికి విజయం దక్కలేదు. జో క్లార్క్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు), థామస్ రోజర్స్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), క్యాంప్‌బెల్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు), స్టోయినిస్ (36 నాటౌట్), హిల్టన్ (33 నాటౌట్) తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో మెల్బోర్న్ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. బ్రిస్బేన్ బౌలర్లలో స్వెప్సన్ 2, జేమ్స్ బాజ్లీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో బ్రిస్బేన్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (13 పాయింట్లు) ఎగబాకింది. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించాడు
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఇవాళ (జనవరి 16) ఓ రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఆఖరి బంతికి విజయం సాధించింది. బ్రిస్బేన్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (56 బంతుల్లో 90 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఆఖరి బంతిని బౌండరీగా తరలించి తన జట్టును గెలిపించాడు. బ్రిస్బేన్ గెలవాలంటే చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, రెన్షా అద్భుతమైన స్కూప్ షాట్ ఆడి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు. Matt Renshaw scoops for four to win the game off the last ball 😮 Talk about holding your nerve!#BBL12 pic.twitter.com/l4GamZxqK4 — Wisden (@WisdenCricket) January 16, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బ్రిస్బేన్.. మైఖేల్ నెసర్ (4/25), స్పెన్సర్ జాన్సన్ (1/41), బాజ్లీ (1/35), రెన్షా (1/5) రాణించడంతో మెల్బోర్న్ హీట్‌ను 159 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో నిక్ లార్కిన్ (58) అర్ధసెంచరీతో రాణించగా.. థామస్ రోజర్స్ (26), వెబ్‌స్టర్ (36) పర్వాలేదనిపించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ను రెన్షా ఒంటి చేత్తో గెలిపించాడు. బిస్బేన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఉస్మాన్ ఖ్వాజా (14), జిమ్మీ పియర్సన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేసినప్పటికీ.. రెన్షా ఆఖరి బంతి వరకు పట్టువదలకుండా క్రీజ్‌లో ఉండి తన జట్టును గెలిపించాడు. మెల్బోర్న్ బౌలర్లలో లియామ్ హ్యాచర్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ కౌల్టర్ నైల్, క్లింట్ హింక్లిఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
కిందా మీదా పడ్డాడు.. నీ కష్టం ఊరికే పోలేదు!
బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య తొలి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఫలితం సంగతి ఎలా ఉన్నా మ్యాచ్‌లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్రాడీ కౌచ్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే ఇదంతా చోటుచేసుకుంది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని మాథ్యూ గైక్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే నిల్చున్నబ్రాడీ కౌచ్ లో-లెవెల్లో వచ్చిన క్యాచ్‌ను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చేజారింది. ఆ తర్వాత బంతి అతని కాళ్లకు తాకి పైకి లేవగా అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మరోసారి మిస్ అయింది. చివరకు ఎలాగోలా బంతి సురక్షితంగా తీసుకోవడం జరిగింది. మొత్తానికి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన బ్రాడీ కౌచ్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. నిక్ లార్కిన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బర్న్స్ 18 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో గురీందర్ సందు, ఫజల్హక్ ఫరుఖీ, డేనియల్ సామ్స్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. బ్రెండన్ డొగ్గెట్, క్రిస్ గ్రీన్ చెరొక వికెట్ పడగొట్టారు. Absolutely INSANE from Brody Couch 🤯🤯🤯 #BBL12 pic.twitter.com/GFKsXCM3GS — KFC Big Bash League (@BBL) December 13, 2022 చదవండి: కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 10 వికెట్లు తీస్తారు.. -
మెల్బోర్న్ స్టార్స్ తరపున ఆడనున్న భారత స్టార్ బ్యాటర్
భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ బిగ్ బాష్ లీగ్-2022లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. దీంతో మెల్బోర్న్ స్టార్స్‌తో ఒప్పందం కుదర్చుకున్న మొదటి భారత క్రికెటర్‌గా రోడ్రిగ్స్ నిలిచింది. కాగా గత బీబీఎల్ సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరుపున ఆడిన రోడ్రిగ్స్ అద్భుతంగా రాణించింది. ఆమె గతేడాది టోర్నీలో 116 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేసింది. ఇక 2018లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోడ్రిగ్స్.. ఇప్పటి వరకు 58 టీ20లు, 21 వన్డేల్లో ఆడింది. ఇక ఇప్పటికే పలు భారత మహిళా క్రికెటర్లు బిగ్‌బాష్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బిగ్ బాష్ లీగ్‌లో భారత స్టార్ క్రికెటర్లు ఇక ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు బిగ్‌బాష్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. చదవండి: Suresh Raina Retirement: సురేష్ రైనా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై -
మ్యాక్స్‌వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్‌లు!
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విద్వంసం సృష్టించాడు. బుధవారం హాబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో అతడు సెంచరీ సాధించాడు. హరికేన్స్ బౌలర్లను మ్యాక్సీ ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 154 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. కాగా మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌కు స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్ తోడు అవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్బోర్న్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కాగా ఇప్పటి వరకు బిగ్‌బాష్ లీగ్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇక మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ 154 పరుగులు సాధించగా, స్టోయినిస్ 75 పరుగులుతో రాణించాడు. హరికేన్స్ బౌలర్లలో జోష్ ఖాన్, థాంమ్సన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 274 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హరికేన్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. చదవండి: షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలకు పాక్ మాజీ కెప్టెన్ కౌంటర్ -
వికెట్ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్
పాకిస్తాన్ పేస్ బౌలర్ హారిస్ రౌఫ్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. మెల్బోర్న్ స్టార్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హారిస్ రౌఫ్ వికెట్ తీసిన ఆనందంలో వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో రూపం మార్చుకొని ప్రపంచదేశాలపై తన పడగను విప్పింది. ఈ సెగ బీబీఎల్‌కు కూడా తాకింది. చదవండి: Glenn Maxwell: 'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' ఇప్పటికే బీబీఎల్‌లో సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.ఈ సందర్భంగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి తోటి ఆటగాళ్లను నవ్విస్తూనే సెలబ్రేట్ చేయడం వైరల్‌గా మారింది. మూడో ఓవర్లో కుర్టీస్ పాటర్సన్‌ను ఔట్ చేసిన హారిస్.. ముందు చేతులను సానిటైజ్ చేసుకున్నట్లుగా.. ఆ తర్వాత జేబులో నుంచి మాస్క్ తీసి ముఖానికి పెట్టుకొని అవగాహన కల్పించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేస్తూ..'' హారిస్ రౌఫ్ సెలబ్రేషన్ కొత్తగా ఉంది.. కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం సూపర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. చదవండి: IND Vs WI: కోహ్లి దిగిపోయాడు.. రోహిత్ వచ్చేస్తున్నాడు..! Incredible COVID-safe wicket celebration from Harris Rauf! 🤣#BBL11pic.twitter.com/tG4QmFRbMO — cricket.com.au (@cricketcomau) January 11, 2022 -
'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా'
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే తాను క్యాచ్ పట్టేశానా అన్న విధంగా మ్యాక్సీ ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను నాథన్ కౌల్టర్‌నీల్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని గుడ్‌లెంగ్త్‌తో వేయగా.. సామ్ హీజ్లెట్ మిడాఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న మ్యాక్స్‌వెల్ వెనక్కి పరిగెట్టి.. డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మ్యాక్సీ విన్యాసాన్ని తోటి ఆటగాళ్లు సహా మైదానంలోని ప్రేక్షకులు ఎంజాయ్ చేయగా.. అతను మాత్రం క్యాచ్ అందుకున్నాన్నా అనే భ్రమలోనే ఉండిపోవడం విశేషం. దీనిపై అభిమానులు వినూత్నరీతిలో స్పందించారు. ' మ్యాక్సీ నువ్వు క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022 Auction: ఈ ఏడాది ఐపీఎల్లో వారి మెరుపులు లేనట్టేనా..? ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జో క్లార్క్ 62 పరుగులతో రాణించగా.. మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. GLENN MAXWELL! WHAT A CATCH! 😱#BBL11 pic.twitter.com/czENSVwG2s — 7Cricket (@7Cricket) January 16, 2022 -
వికెట్ పడగొట్టాడు.. మాస్క్ ధరించాడు.. వీడియో వైరల్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గీలాంగ్ వేదికగా మంగళవారం పెర్త్ స్కాచర్స్తో మెల్బోర్న్ స్టార్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన పెర్త్స్కాచర్స్కు మెరుపు ఆరంభం లభించింది. తొలి రెండు ఓవర్లలో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఓపెనర్ పీటర్సన్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో వికెట్ సాధించిన హరీస్ రౌఫ్ వెరైటీ సెలబ్రేషన్‌ను జరుపుకున్నాడు. కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ.. శాని టైజర్తో చేతులు శుబ్ర పరుచుకోవడం, మాస్క్ ధరించడం వంటివి మైదానంలో రౌఫ్ చేసి చూపించాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్‌బాష్ లీగ్ మేనేజ్మెంట్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రౌఫ్ కన్న ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ ఇటువంటి సెలబ్రేషన్లు జరుపుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కాచర్స్ 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. పెర్త్ బ్యాటర్లలో ఎవాన్స్(69),టర్నర్(47) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. "Cleanly" taken for Haris Rauf's first wicket of the day... 😷🧼@KFCAustralia | #BBL11 pic.twitter.com/hLWA0XXoth — KFC Big Bash League (@BBL) January 11, 2022 చదవండి: Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్.. టాస్ గెలిస్తే.. -
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడికి కరోనా.. ఇప్పటికే 12 మందికి!
BBL 2021 22: బిగ్‌బాష్ లీగ్ జట్టు మెల్బోర్న్ స్టార్స్‌ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కోవిడ్ సోకింది. యాంటీజెన్ టెస్టులో భాగంగా అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక అంతకుముందు స్టార్స్ జట్టు ఆటగాళ్లు ఆడం జంపా, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయినిస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఐసోలేషన్ పూర్తి కావడం, కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో వీరు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నారు. చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా Ashes 2021- 22: సిడ్నీ టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే.. రెండేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ! -
ఔట్ అని వేలు ఎత్తాడు.. వెంటనే లేదు లేదు అన్నాడు!
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్- పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ 14వ వేసిన జేవియర్ క్రోన్ బౌలింగ్‌లో అష్టన్ టర్నర్ పుల్ షాట్ ఆడాడు. అయితే బంతి అతడి హెల్మెట్‌కు తగిలి కీపర్ చేతికి వెళ్లింది. దీంతో కీపర్‌తో పాటు మెల్బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా వేలు ఎత్తాడు. అయితే వెంటనే బంతి హెల్మెట్‌ను తాకినట్లు గ్రహించి తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్‌బాష్ లీగ్ మేనేజ్మెంట్ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుర్టిస్ ప్యాటర్సన్(54), మున్రో(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మెల్బోర్న్ బౌలర్లలో హరీస్ రవూఫ్, కైస్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో 50 పరుగుల తేడాతో పెర్త్ స్కార్చర్స్ విజయం సాధించింది. చదవండి: SA vs IND: "అతడు వైస్ కెప్టెన్ అవుతాడని అస్సలు ఊహించలేదు" Xavier Crone had his first BBL wicket on debut - for all of three seconds! 👷♂️💥@KFCAustralia | #BBL11 pic.twitter.com/LDz2frhXOV — KFC Big Bash League (@BBL) January 2, 2022 -
ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు!
Liam Guthrie BBL, 70 Runs In 4 Overs: బిగ్ బాష్ లీగ్-2021లో బ్రిస్బేన్ హీట్ బౌలర్ లియామ్ గుత్రీ ఓ చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో గుత్రీ ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన గుత్రీ 70 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ 61 పరుగులు ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్బోర్న్ స్టార్స్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అయితే ఓపెనర్ క్లార్క్, కార్ట్‌రైట్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. క్లార్క్ 44 బంతుల్లో 85 పరుగులు సాధించగా, కార్ట్‌రైట్ 44 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. దీంతో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో స్టీక్టీ మూడు వికెట్లు పడగొట్టగా,గుత్రీ, బ్లేజీ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి బ్రిస్బేన్ హీట్ బ్యాటర్లలో క్రిస్ లిన్(57), బెన్ డకెట్(54) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో187 పరుగులకు ఆలౌటైంది. దీంతో 20 పరుగుల తేడాతో బ్రిస్బేన్ ఓటమి చెందింది. మెల్బోర్న్ బౌలర్లలో బ్రాడీ కౌచ్, కైస్ అహ్మద్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్‌ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్ The Bucket Ball free-hit is sent straight back over Liam Guthrie's head 😳 @KFCAustralia | #BBL11 pic.twitter.com/ua4VNZG0DS — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
'మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి!'
బిగ్‌బాష్ లీగ్ 2021లో శుక్రవారం మెల్బోర్న్ స్టార్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మెల్బోర్న స్టార్స్ బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ నాలుగో బంతిని హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ బెన్ మెక్‌డెర్మోట్ డీప్ బ్యాక్వర్డ్స్క్వేర్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. అయితే బంతి వెళ్లి స్డేడియం అవతల చాలా దూరంలో పడింది. దీంతో దెబ్బకు అంపైర్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..'' మా బంతి పోయింది.. ఒకవేళ కనిపిస్తే బ్లండ్స్స్టోన్ ఎరీనాకు తెచ్చివ్వండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 24 పరుగుల తేడాతో మెల్బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్‌కు ఓపెనర్లు బెక్ డెర్మోట్(67 పరుగులు), మాధ్యూ వేడ్(39 పరుగులు) తొలి వికెట్‌కు 93 పరుగుల జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ తలా ఒక చెయ్యి వేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జో క్లార్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జో బర్న్స్ 22, హిల్టన్ కార్ట్‌రైట్ 26 పరుగులు చేశారు. Lost ball: if found, please return to @BlundstoneArena 💥#BBL11 pic.twitter.com/Pvo3rzCp7t — KFC Big Bash League (@BBL) December 24, 2021 -
Short Run: ఏకంగా 5 పరుగుల పెనాల్టీ విధించిన అంపైర్
Tim David Attempts Short Run In BBL 2021: బీబీఎల్ 2021-22లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఆటగాడు టిమ్ డేవిడ్.. స్ట్రయిక్‌ని అట్టిపెట్టుకోవడం కోసం క్రీజ్ సగం మధ్య వరకు మాత్రమే పరిగెత్తి రెండో పరుగు కోసం వెనక్కు వెళ్లాడు. నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో నాథన్ ఎల్లీస్కు స్ట్రయిక్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్ రన్ తీసినట్టు నిర్ధారణ కావడంతో అంపైర్లు హోబర్డ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. Stars will start their innings with 5 free runs courtesy of this... #BBL11 pic.twitter.com/lz9tRxNLLB— KFC Big Bash League (@BBL) December 24, 2021 దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. సాధారణంగా షార్ట్ రన్ అంటే.. క్రీజ్ దగ్గరి దాకా వెళ్లి పొరపాటున రెండో పరుగు కోసం తిరిగి వెళ్లడం. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో అలా జరగలేదు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హోబర్ట్ హరికేన్స్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ మెక్‌డెర్మాట్ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం 181 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ -
శివాలెత్తిన మ్యాక్స్‌వెల్.. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం
Glenn Maxwell In BBL 2021: బిగ్‌బాష్ లీగ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెచ్చిపోయాడు. ప్రస్తుత లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ(57 బంతుల్లో 103)తో శివాలెత్తాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో లీగ్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. హాఫ్ సెంచరీని 33 బంతుల్లో పూర్తి చేసిన మ్యాక్సీ.. ఆతర్వాత గేర్ మార్చి ప్రత్యర్ధి బౌలర్లపై విచక్షాణారాహిత్యంగా విరుచుకుపడ్డాడు. ఫలితంగా మెల్ బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. జోష్ ఫిలిప్(61 బంతుల్లో 99; 11 ఫోర్లు, సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవడం కొసమెరుపు. ఫిలిప్ ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చినప్పటికీ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫిలిప్ అద్బుతమైన పోరాటం చేసి జట్టును గెలిపించడంతో మ్యాక్స్‌వెల్ విధ్వంసం మరుగునపడింది. చదవండి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో టీమిండియా కెప్టెన్.. -
గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్స్ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్‌లు.. పంచ్‌లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్ 12న మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంది. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ ఇక మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. A reasonable question from @isaguha 👀😂😂😂😂😂😂 pic.twitter.com/Tzu5F2emUg — Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 -
ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం
Andre Russell: విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బిగ్ బాష్ లీగ్ 2021-22లో సునామీ ఇన్నింగ్స్‌తో ప్రళయంలా విరుచుకుపడ్డాడు. ప్రస్తుత సీజన్లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరీబియన్ యోధుడు.. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు పిండుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్బోర్న్ జట్టు 12 ఓవర్లలో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రసెల్.. 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, ఫోర్‌తో అజేయమైన 42 పరుగులు సాధించి మరో 17 బంతులు మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన రసెల్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ఈ లీగ్‌లో(3 మ్యాచ్‌ల్లో) ఇది రెండో విజయం చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు -
సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు
BBL 2021 Melbourne Stars vs Sydney Thunders.. సిడ్నీ థండర్స్ బౌలర్ మెక్ ఆండ్రూ మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్ నిక్ లార్కిన్‌కు ఫుల్‌టాస్ బంతి వేశాడు. దీంతో లార్కిన్ స్వేర్‌లెగ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఉన్న డేనియల్ సామ్స్ వెనక్కు వెళ్లి రెండు చేతులతో బౌండరీలైన్ తాకుకుండా అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టాననే ఊహలో ఉన్న అతను సెలబ్రేషన్ షురూ చేశాడు. కానీ క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నారు. చదవండి: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ డేనియల్ సామ్స్‌కు ఒక్కక్షణం ఏం అర్థం కాలేదు. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత తనకు అదృష్టం లేదంటూ తెగ ఫీలయ్యాడు. మెక్ ఆండ్రూ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ ఫ్రంట్‌ఫుట్ నోబాల్‌గా పరిగణించాడు. దీంతో బ్యాటర్ నాటౌట్ అని తేలడంతో ప్రత్యర్థి జట్టు ఈ గ్యాప్‌లో మూడు పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం డేనియల్ సామ్స్ హావబావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెల్బోర్న్ స్టార్స్.. సిడ్నీ థండర్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నిక్ లారిన్ 52 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కార్ట్‌రైట్ 42 పరుగులు చేశాడు. ఇక సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మాథ్యూ గ్లైక్స్ 56 పరుగులతో రాణించినప్పటికి ఆఖర్లో ఔట్ కావడంతో జట్టు ఓటమి పాలయింది. చదవండి: 74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 20 Daniel Sams couldn't believe his luck! 😫 Absolutely robbed by the @KFCAustralia Bucket Ball free-hit #BBL11 pic.twitter.com/TRWcmPvVvr — KFC Big Bash League (@BBL) December 10, 2021 -
BBL 2021-22: బిగ్ బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టించనున్న రస్సెల్..
Melbourne Stars sign Andre Russell for Big Bash league 2021: వెస్టిండీస్ విద్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి బిగ్ బాష్ లీగ్‌లో అడుగు పెట్టనునన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న11వ ఎడిషన్ కోసం మెల్బోర్న్ స్టార్స్‌తో ఒప్పందం రస్సెల్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని మెల్బోర్న్ స్టార్స్ కోచ్ డేవిడ్ హస్సీ సృష్టం చేశాడు. రస్సెల్ లాంటి స్టార్ ఆటగాడు మాతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషకరమని హస్సీ తెలిపాడు. రస్సెల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని హస్సీ చెప్పాడు. డిసెంబర్10న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్‌లో రస్సెల్ ఆడనున్నాడని హస్సీ పేర్కొన్నాడు. కాగా రస్సెల్‌కు బిగ్ బాష్ లీగ్‌లో ఆడడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు రస్సెల్ ఈ లీగ్‌లో 2014 నుంచి 2017 వరకు సిడ్నీ థండర్స్ తరుపున ఆడాడు. కాగా ఐపీఎల్-14 సీజన్లో రస్సెల్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇటీవల ముగిసిన అబుదాబి టీ10 లీగ్‌లో రస్సెల్ అద్బుతంగా రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మరి ఈ ఆస్ట్రేలియాన్ లీగ్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా బిగ్ బాష్ లీగ్ డిసెంబర్ 5న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. చదవండి: Ashes Series: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ -
కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం
BBL 2021: Melbourne Stars All Out For 61 Vs Sydney Sixers.. బిగ్‌బాష్ లీగ్ 2021-22లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ప్రత్యర్థి విధించిన భారీ టార్గెట్‌ను చేధించలేక 61 పరుగులకే కుప్పకూలింది. కాగా సిడ్నీ సిక్సర్స్ 152 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్.. జోష్ ఫిలిప్(83, 47 బంతులు; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిక్స్( 38 బంతుల్లో 76 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 44 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 11.1 ఓవర్లలో 61 పరుగులకే ఆలౌటైంది. పీటర్ నెవిల్ 18 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. హిల్టన్ కార్ట్‌రైట్ 10 పరుగులు చేశాడు. సిడ్నీ సిక్సర్స్ బౌలింగ్ దాటికి ఎనిమిది మంది మెల్బోర్న్ బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడం విశేషం. స్టీవ్ ఓకిఫీ 4 వికెట్లతో సత్తా చాటగా.. సీన్ అబాట్ 3 వికెట్లు తీశాడు. చదవండి: వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు.. The first boundary of the #BBL11 season goes to Josh Philippe! pic.twitter.com/axrDNIhy2a — cricket.com.au (@cricketcomau) December 5, 2021 He turns 37 this week but Steve O'Keefe is as sprightly as ever! #BBL11 pic.twitter.com/jn3iDkFe4y — cricket.com.au (@cricketcomau) December 5, 2021 -
పాపం ఫ్లెచర్.. సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ వైరల్‌గా మారింది. మెరుపు వేగంతో చేసిన ఆ రనౌట్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ క్రేజీ రనౌట్ హోబర్ట్ హరికేన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అండ్రీ ఫ్లెచర్ మిడాఫ్ దిశగా పుష్ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కార్ట్‌రైట్ పరుగుకు పిలుపివ్వగా.. ప్లెచర్ క్రీజు నుంచి పరిగెత్తాడు. (చదవండి : స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్) అప్పటికే బంతిని మెరుపు వేగంతో అందుకున్న షార్ట్ నాన్‌స్ట్రైకింగ్ వైపు త్రో విసరగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అప్పటికీ ప్లెచర్ క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగాడు. డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. షార్ట్ ఏంటి ఆ వేగం.. నీ రనౌట్‌తో ఫ్లెచర్ బిక్కమొహం వేశాడు. పాపం ఫ్లెచర్‌కు సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు.. అంటూ కామెంట్లు చేశారు. (చదవండి : ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ) The rocket arm from D'Arcy Short runs out Fletcher and the Stars lose their second wicket #BBL10 pic.twitter.com/4wGRhQuyKr — KFC Big Bash League (@BBL) January 2, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మలన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 70 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినా అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. అటు హరికేన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మెల్బోర్న్ స్టార్స్ పరాజయం మూటగట్టుకుంది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు)