MEO
-
ఐదేళ్లు ఒకేచోట ఉంటే స్థానచలనం అంటూనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ బదిలీల్లో విద్యాశాఖను మినహాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలో గతేడాది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవడం, విడతల వారీగా డీఈవోలు, ఆర్జేడీల బదిలీలు పూర్తవడంతో ఈ శాఖను ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామీణ నేపథ్యం ఉన్న మండలాల్లో పనిచేస్తున్న వారు, ఆరోగ్య సమస్యలున్న ఎంఈవోలు మరోచోటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో ఐదు సంవత్సరాలు ఒకేచోట సర్వీసు ఉన్నవారికి తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలని నిర్ణయించింది. అంతకంటే సర్వీసు ఉన్నవారి అభ్యర్థన (రిక్వెస్ట్) మేరకు జీరో సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్న ప్పటికీ.. ఆ పరిధి నుంచి విద్యాశాఖను పక్కన పెట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో సర్వీసులోకి వచ్చిన దాదాపు 679 మంది మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) గత ఏడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నా.. వారిని ప్రభుత్వం విస్మరించడం పట్ల వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా..వాస్తవానికి విద్యాశాఖలో మండలానికి ఒకరు చొప్పున మొత్తం 679 మంది ఎంఈవో పోస్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేయడంతో మొత్తం ఎంఈవో పోస్టుల సంఖ్య 692కి చేరింది. ఇదిలా ఉండగా, మండల స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు గత ప్రభుత్వం 2023లో మండలానికి రెండో ఎంఈవో పోస్టును మంజూరు చేసి, జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 679 మంది ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ఎంఈవో–2గా నియమించింది. దీంతో ఎంఈవో పోస్టుల సంఖ్య 1,371కి పెరిగింది. ఎంఈవో–2లు తాజాగా రావడంతో పాటు దాదాపు అందరూ కోరుకున్న చోటనే పోస్టింగ్ పొందారు. కానీ, గత ఏడేళ్లుగా ఒకే మండలంలో పనిచేస్తున్న ఎంఈవో–1లకు ప్రస్తుతం చేపట్టిన సాధారణ బదిలీ ల్లో అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ఎంఈవో–1 రాష్ట్ర అసోసియేషన్ విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. -
స్కూల్లో తప్పదాగి చిందులేసిన ఎంఈఓ.. వీడియో వైరల్
సాక్షి,ఆదిలాబాద్: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు మద్యానికి బానిసై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు చూశాం. తాగి పాఠశాలకు వెళ్లిన టీచర్లపై అధికారులు చర్యలు తీసుకున్న వార్తలు చదివాం. అయితే, ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే మండల విద్యాధికారే పాఠశాల ఆవరణలో మందు పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన తాజాగా బయటపడింది. తాగిన మైకంలో ఆయన చిందులేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎంఈఓ నర్సింహులు మద్యం సేవించి ఓ స్కూల్ ఆవరణలో డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంఈవో, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ‘ఎంఈవో అధికారి తాగి చిందులేయడం దారుణం, ఇది చాలా హేయమైన చర్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే జైలుకే.. -
ఆదిలాబాద్: సోషల్ మీడియాలో ఎంఈవో వైరల్ వీడియో
-
ఎంఈఓ, ఎంపీడీఓ డిష్యుం..డిష్యుం
చిన్నచింతకుంట: ఒకరు మండల పరిపాలనను గాడిలో పెట్టే అధికారి..మరొకరు మండలం విద్యాధికారి. వీరి ఇద్దరి మధ్య ఏర్పడ్డ చిన్నపాటి మనస్పర్థలతో విమర్శలు చేసుకుంటూ ఎంపీపీ కార్యాలయంలోనే ఎంపీపీ సాక్షిగా ఒకరిపైనొకరు దాడులు చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల ఎంఈఓగా లక్ష్మణ్‌సింగ్ కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యనే కోయిల్‌కొండ విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నచింతకుంట మండలంలో బాధ్యతలు విస్మరిస్తున్నారని ఎంపీపీ హర్షవర్ధన్‌కు ఎంపీ డీఓ పలుమార్లు విన్నవించారు. ఈక్రమంలోనే మండల కార్యాలయానికి వచ్చిన ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ మూమెంట్ రిజిçస్ట్టర్‌లో సంతకం చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ ఫయాజుద్దీన్ ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ హర్షవర్ధన్ ఎంపీడీఓ, ఎంఈఓలను తన చాంబర్లోకి పిలిపించారు. ఇరువురు అక్కడికి వెళ్లి ఆరోపణలు చేసుకుంటు ఘర్షణలకు పాల్పడ్డారు. తనను కులంపేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడని ఎంపీడీఓపై ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ వివరణ కోరగా ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ జూలై నెల మూమెంట్ రిజిçస్టర్లో ముందస్తుగా మూమెంట్ రాసుకున్నారని ఇది సరికాదని ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి పిలిపించి అడగారన్నారు. ఇబ్బందిగా ఫీలైన ఎంఈఓ తనపై దురుసుగా మాట్లాడారన్నారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఎంఈఓ దాడిపై టీఎస్ యూటీఎఫ్, తెలంగాణప్రాంత ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాడిచేసిన అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. -
మెదక్‌లో బడికి బరోసా..
సాక్షి, మెదక్: ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం నెరవేరేలా కలెక్టర్ పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రస్ట్‌కు విరాళాల సేకరణ.. పాఠశాలల్లో సమస్యల గుర్తింపు, పరిష్కారానికి సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీతోపాటు జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీకి రూపకల్పన చేశారు. జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్లుగా జేసీ, ఎస్పీ వ్యవహరించనున్నారు. మండల కమిటీలకు ఎంఈఓ చైర్మన్‌గా, ముగ్గురు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు లేదా ధర్మదాతల సభ్యులుగా.. గ్రామ కమిటీల్లో ప్రధానోపాధ్యాయుడు, వీఆర్వో, వీఆర్ఏ, ఉపాధ్యాయుడు కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీల బాధ్యతలు ఏమిటి.. ఏం చేయాలి.. ఎవరు ఎన్నారైల వివరాలు సేకరించాలి.. ఎవరు మాట్లాడాలి.. వంటి అంశాలపై కూడా సంస్థ విధివిధానాల్లో పొందుపరిచారు. జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీ జిల్లా కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ ఆదేశా మేరకు నడవాల్సి ఉంటుంది. పక్కాగా బైలా.. రిజిస్ట్రేషన్ ట్రస్ట్‌కు సంబంధించి అవకతవకలకు చోటు లేకుండా పక్కాగా బైలా రూపొందించారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ధర్మారెడ్డి, డీఈఓ రవికాంతరావు, నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాష్, మరో ఇద్దరు ఉపాధ్యాయులు సాయికుమార్, రమేష్ చౌదరి కలిసి దాదాపు 15 రోజులు శ్రమించి ట్రస్టుకు సంబంధించి విధివిధానాలు రూపొందించారు. ఎవరైతే కలెక్టర్‌గా ఉంటారో వారే ఈ ట్రస్టుకు బాధ్యత వహిస్తారు. సంస్థ చిరునామాగా సమీకృత కలెక్టరేట్ సముదాయం, కలెక్టరేట్ కార్యాలయం, మెదక్ – 502110గా పేర్కొన్నారు. విరాళాలు అందించే వారితోపాటు విరాళాల మొత్తం, ఖర్చు వివరాలను వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సమస్యల గుర్తింపు.. దశల వారీగా పరిష్కారం గ్రామ, మండల కమిటీలు ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు గుర్తించి జిల్లా కమిటీకి పంపాలి. ప్రాధాన్యతా క్రమంలో ఆ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కమిటీ చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఐదు దశల్లో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు ప్లాన్ రూపొందించారు. మొదటి దశలో పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులతోపాటు భవనాలకు పాఠ్యాంశ చిత్రపటాలతో ఆకర్షణీయమైన రంగులు వేయనున్నారు. రెండో దశలో అన్ని పాఠశాలల్లో తాగు నీటి ఫిల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడో దశలో మండల స్థాయి నివేదికలకు పరిష్కారం చూపనున్నారు. నాలుగో దశలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్ నరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఐదో దశలో డిజిటల్ బోధన పరికరాలు, ఈ–లెర్నింగ్, ఆట వస్తువులు సమకూర్చడంతోపాటు బాలికల ఆత్మ రక్షణకు కరాటే శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రూ.కోటి.. గత నెల 25న మెదక్ కలెక్టరేట్లో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యా శాఖలో నెలకొన్న సమస్యలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ ధర్మారెడ్డి ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం వివరాలు వెల్లడించారు. తనవంతు వాటాగా రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు తన వేతనంలో నుంచి రూ.లక్ష ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుమారు 4 వేల వరకు ఉండగా.. వారు ఒక రోజు వేతనాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దాదాపు రూ.65 లక్షలు ట్రస్ట్ ఖాతాలో త్వరలో జమకానున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు సుమారు రూ.కోటి సేకరించినట్లు సమాచారం. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈవో
సాక్షి, ఉలవపాడు(ప్రకాశం) : చనిపోయిన టీచర్ కుటుంబానికి రావాల్సిన నగదుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎంఈవోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఉలవపాడులోని మండల విద్యావనరుల కేంద్రంలో జరిగింది. బాధితుడు, ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఉలవపాడుకు చెందిన బడితల పద్మజ అదే మండలం అలగాయపాలెం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ 2017 అక్టోబర్ 16న అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత ఏడాదికి ఆమె కుమారుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పరిస్థితుల్లో పద్మజ భర్త బడితల వెంకట రమణయ్య తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కోసం మండల విద్యాశాఖాధికారి నాలి కోటేశ్వరరావును కలిశాడు. భార్య ఎర్నడ్‌లీవులకు సంబంధించి రూ.3 లక్షలు, కుమారుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగ అర్హత లేని కారణంగా ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.8 లక్షల కోసం ఫైలు పెట్టి తనకు రావాల్సిన నగదు వచ్చేలా చూడాలని కోరారు. డీఈఓను కలిసి అక్కడ నుంచి ఫైలు ఉలవపాడుకు వచ్చేలా చేశారు. ఈ ఏడాది సెస్టెంబరు 20న ఎంఈఓ కోటేశ్వరరావును కలిసి ఫైల్ పై సంతకం పెట్టాలని కోరగా అందుకు ఎంఈవో రూ.10 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఈనెల 27న ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం ఉలవపాడు మండల విద్యావనరుల కేంద్రంలో రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎంఈవోను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ గుంటూరు అడిషనల్ ఎస్పీ ఎç.Üసురేష్‌బాబు, సీఐలు ఎన్.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లులు తన సిబ్బందితో దాడిలో పాల్గొన్నారు. నిందితుడిని అక్కడిక్కడే అరెస్టు చేసి, ఫైల్ సీజ్ చేశామని, అతడిని నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అడిషనల్ ఎస్పీ సురేష్‌బాబు తెలిపారు. -
ఏసీబీ వలలో ఎంఈఓ
సాక్షి, బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేలల్లో జీతాలను ఇస్తుంటే అవేవి చాలవన్నట్లు అదే ప్రభుత్వ ఉపాధ్యాయుల వద్ద లంచాలను తీసుకుంటున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి తేలుకంటి ముత్తయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా చిక్కిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ, ఇన్చార్జి మండల విద్యాధికారిగా కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్దికుంట కృష్ణారెడ్డి ఆరోగ్యం సహకరించక అనారోగ్యంతో జూలై 17, 18న సెలవులు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఎంఈఓ ముత్తయ్య ఆ పాఠశాలను ఆ సమయంలో తనిఖీ చేశాడు. మరుసటి రోజు డీఈఓ యాదయ్య కూడా అదే పాఠశాలను తనిఖీ చేయగా హెచ్ఎం లేక పోవడంతో ఆయన స్థానంలో విద్యావలంటీర్ ఉండడంతో, సమాచారం లేకుండా సెలవు ఎలా పెడతాడని ఆగ్రహం వ్యక్తం చేసి హాజరు రిజిస్టర్లో రిమార్కు వేశాడు. ఈ సాకును అదనుగా తీసుకున్న ఎంఈఓ ముత్తయ్య హెచ్ఎం కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయిస్తానని వేధించసాగాడు. డబ్బులు ఇస్తేనే అన్ని వ్యవహారాలు చక్కగా ఉంటాయని లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని పలు మార్లు హెచ్చరించాడు. ఇందులో పలువురు ఉపాధ్యాయులు మధ్యవర్తిత్వం చేసి చివరకు రూ.30 వేలు ఇవ్వాలని రాజీ కుదిర్చారు. దీనికి కృష్ణారెడ్డి కూడా ఒప్పుకొని ముందుగా రూ.10 వేలు ఇస్తానని తెలిపాడు. అనంతరం ఈ విషయంపై హెచ్ఎం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు అనుకున్నట్టుగానే ముందుగా రూ.10 వేలు అన్నీ ఐదు వందల రూపాయల నోట్లను కృష్ణారెడ్డికి ఏసీబీ అధికారులు ఇచ్చి పాఠశాలకు సోమవారం పంపించారు. కృష్ణారెడ్డి ఎంఈఓ ముత్తయ్యకు డబ్బులు ఇచ్చి పాఠశాల గేట్ కూడా దాటకముందే అనుకున్న పథకం ప్రకారం ఏసీబీ అధికారులు ముత్తయ్యను రెడ్ హ్యాడెపట్టుకున్నారు. ఈ దాడుల్లో సీఐ రవి, ఇన్స్పెక్టర్లు సతీష్, క్రాంతితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
సర్దుబాటా.. సౌకర్యంబాటా..?
సాక్షి, కరీంనగర్: టీచర్ల సర్దుబాటు ప్రక్రియ వ్యవహారం జిల్లాలో గందరగోళంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్దుబాటు జరిగిన టీచర్లంతా తమకు అన్యాయం జరిగిందంటూ డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొంత మంది అర్జీలు సమర్పిస్తున్నారు. మరికొంత మంది చోటామోటా నాయకులతో సర్దుబాటును రద్దు చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు 114 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారనే నెపంతో ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేసిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సర్దుబాటులో జరిగిన టీచర్ల వ్యవహరంపై మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. చిగురుమామిడి మండలంలో ప్రాథమిక పాఠశాల సుందరగిరి నుంచి ఒక టీచర్‌ను బొల్లోనిపల్లి ప్రాథమిక పాఠశాలకు డిప్యూటేషన్ పెట్టారు. తిరిగి అదే సుందరగిరి ప్రాథమిక పాఠశాలకు లాలయ్యపల్లె ప్రాథమిక పాఠశాల నుంచి టీచర్‌ను డిప్యూటేషన్ పెట్టారు. నిబంధనలు పాటించారా, ఏమైనా కొత్త నిబంధనలు వచ్చాయా అంటే అదేమిలేదు. విద్యార్థులు తక్కువ ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే విద్యార్థులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు తక్కువ ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలి. పై సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారి నిబంధనలు పాటించకుండా పై అధికారులకు తప్పుడుగా పంపించడం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కూడా చూసీచూడనట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం ఇంకా ఈ ఉత్తర్వులను కలెక్టర్ ఆమోదం పొందడం విడ్డూరంగా ఉంది. అధికారులు ఇలాంటి తప్పిదాలను వెంటనే సరి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టీచర్స్ సర్దుబాటు జాబితా పరిశీలిస్తే చాలా పొరపాట్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గంగాధర మండలంలో ప్రాథమికోన్నత పాఠశాల కొండన్నపల్లి నుంచి ఒక టీచరు అవసరం లేకున్నా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగాధరకు ఉపనియుక్తం చేశారు. మండలంలో చాలా ప్రాథమిక పాఠశాలలకు ఎస్జీటీలు అవసరం ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయడమేమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రామడుగు మండలంలో ప్రాథమిక పాఠశాల చిప్పకుర్తి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామడుగుకు ఎస్జీటీ టీచరును డిప్యూటేషన్ చేశారు. ఉన్నత పాఠశాల రామడుగులో అన్ని పోస్టులు ఉన్నాయి. కేవలం హెడ్మాస్టర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉన్నది. మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్న స్థానంలో ఒక టీచర్‌ను అదనంగా ఇచ్చినట్లయితే జిల్లా అంతటా కూడా హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట ఒక టీచర్‌ను సర్దుబాటులో ఎందుకు ఇవ్వలేదు. టీచర్ల సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారికి సరైన వివరాలు అందించలేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎక్కువగా ఉన్న పోస్టులను గుర్తించక సర్దుబాటు వివరాలు పంపారు. రామడుగు మండలం తిర్మలాపూర్ నుంచి ఒక స్కూల్ అసిస్టెంట్‌ను జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ హైస్కూల్లో సర్దుబాటు చేశారు. అదే మండలంలోని తిర్మలాపూర్ హైస్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుడిని చిగురుమామిడి మండలం రామంచకు సర్దుబాటు చేయడంపై కూడా అనుమానాలు తావిస్తున్నాయి. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో 400 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడే పనిచేసే తెలుగు పండిట్ ఉపాధ్యాయుడిని మానకొండూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో ముగ్గురు తెలుగు పండిట్లు ఉన్నా మరో తెలుగు పండిట్‌ను సర్దుబాటు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు నివ్వెరపోతున్నారు. ఒక హైస్కూల్లో రెండు మీడియంలో నడుస్తున్నప్పటికీ అక్కడ ఒకే సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు ముగ్గురు, నలుగురు ఉన్న సందర్భంలో వారిని సర్దుబాటు చేయడాన్ని అధికారులు విస్మరించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా జరిగింది. -
ఏం జరుగుతోంది..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని పలు మండలాల పరిధిలో విద్యాశాఖ అస్తవ్యస్థంగా మారింది. పూర్తిస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు లేకపోవడంతో పాఠశాలలు, ఎమ్మార్సీల్లో ఏం జరుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎమ్మార్సీల్లో ఎంఈఓలతో పాటు సిబ్బంది కూడా లేని కారణంగా అక్కడ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన ఐదు మండలాల్లో ఇప్పటి వరకు ఎంఈఓ కార్యాలయాల ఏర్పాటు, ఎంఈఓలు, సిబ్బంది నియామకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అలాగే, జిల్లాలో కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు విధులు నిర్వర్తిస్తుండగా.. మిగతా అన్ని చోట్ల సీనియర్ హెచ్ఎంలే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఎంఈఓలు అటు పాఠశాలతో పాటు ఇటు కార్యాలయ విధులు చూసుకోవాల్సి ఉండడంతో దేనిపైనా పట్టు సాధించలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా.. ఇన్చార్జి అధికారులతో మండల విద్యావ్యవస్థ కొనసాగుతుండడంతో పర్యవేక్షణ పూర్తిస్థాయిలో కొరవడింది. ఇదే అదునుగా ఎమ్మార్సీల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులు పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్సీల్లో బిల్లులు చేయడం, సర్వీస్బుక్ల నిర్వహణ తదితర అంశాలపై కొందరు ఎంఈఓలు కూడా ఉపాధ్యాయులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వారిని ఉపాధ్యాయులు తప్పుదోవ పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వారిదే పెత్తనం మండల వనరుల కేంద్రా(ఎమ్మార్సీ)ల్లో బోధన సిబ్బంది పని చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఎమ్మార్సీల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుతో పాటు అటెండర్లు మాత్రమే విధులు నిర్వర్తించాలి. అయితే, వీరి నియామకం లేకపోవడం.. ఒకవేళ ఉన్నా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ఎంఈఓలు ఆధారపడుతుండడం గమనార్హం. కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి రికార్డులు, సర్వీస్పుస్తకాలు, బిల్లుల నిర్వహణపై అవగాహన లేదని చెబుతూ కొందరు ఎంఈఓలు ఉపాధ్యాయులను ఉద్దేశపూర్వకంగానే విధుల్లో నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఉపాధ్యాయులు తామేది చెబితే అదే జరగాలన్న రీతిగా వ్యవహరిస్తూ ప్రతీ చిన్న పనికి చేతులు తడపాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, జిల్లాలోని 26 మండలాల్లో ఉన్న ఎమ్మార్సీల్లో నాలుగు మండలాలు మినహా చోట్ల 32 మందికిపైగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. భూత్పూర్ ఎంఈఓపై విచారణ ఇటీవల జిల్లాలోని భూత్పూర్ ఎంఈఓ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మండల ఎమ్మార్సీలో ఏటా విడుదలయ్యే నిధులకు సంబందించి గోల్మాల్ జరిగిందని.. నిధుల వినియోగానికి సంబందించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఓ వ్యక్తి ఐదు నెలల క్రితం ధరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా పలువురు ఉపాధ్యాయులు సెలవులపై వెళ్లినా వారికి వేతనం ఇచ్చారనే ఆరోపణలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే, దీనికి అక్కడి ఎమ్మార్సీలో పనిచేసే ఉపాధ్యాయుడే ప్రధాన సూత్రధారి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మిడ్జిల్, మరికల్ ఎంఈఓలపై కూడా ఆరోపణలు రావడం.. విచారణలో అవి నిజమేనని తేలడంతో అధికారులు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. అక్కడ కూడా వ్యవహారం కూడా ఉపాధ్యాయుల కనుసన్నల్లోనే జరిగినట్లు ప్రచారం సాగింది. నివ్వెరపోవాల్సిందే... భూత్పూర్ ఎమ్మార్సీకి వచ్చిన నిధుల ఖర్చు వివరాలను ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా సేకరించారు. ఈ మేరకు సెల్‌ఫోన్ కొనేందుకు రూ.8వేలు, ఇంటర్నెట్, ఫోన్ బిల్లుకు రూ.14,391, తాగునీటి కోసం రూ.3,200, జిరాక్స్ కాపీలకు రూ.6వేలు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఇక బ్యాటరీ మరమ్మతుకు రూ.5వేలు, సమావేశాల నిర్వహణ ఖర్చులుగా రూ.8వేలు, కంప్యూటర్ మరమ్మతుకు రూ.7వేలు, విద్యుత్ బిల్లులు రూ.7,500, ఫ్యాన్ల మరమ్మతుకు రూ.6వేలు, ఎఫ్‌టీఏ, ఎంవీడబ్ల్యూకు రూ.12వేలు, దినపత్రికలకు రూ.3వేలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇవన్ని కూడా సత్యదూరంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. కాగా, భూత్పూర్ మండలం మిత్యాతండాకు పాఠశాలకు గత ఆగస్టులో ఓ ఉపాధ్యాయురాలు విధులకు రాకుండా ఆయాతో పాఠాలు చెప్పించారని పత్రికలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై విచారణ జరిపించిన అధికారులు నివేదిక వచ్చినా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఆరోపణలతో తాజాగా భూత్పూర్ ఎంఈఓపై విచారణకు ఆదేశించారు. కొరవడిన పర్యవేక్షణ జిల్లాలో నాలుగు మండలాలు మినహా మొత్తం మండలాల్లో సీనియర్ హెచ్ఎంలు ఎంఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. కొత్త ఐదు మండలాల్లో అసలు కార్యాలయాలే లేవు. అక్కడ సిబ్బంది నియామకంపై ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్ నఅధికారులు మండలంలోని పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న విషయంపై పెద్దగా శ్రద్ధ వహించడం లేదు. అటు సొంత పాఠశాలలతో పాటు ఇటు మండలంలోని పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న విషయమై పరిశీలన జరపాలి. ఉపాధ్యాయుల హాజరు, నాణ్యమైన విద్య, సమయ పాలన, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను పర్యవేక్షించాల్సి ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, పనిభారంతోనే తాము రెండు అంశాలపై దృష్టి సారించలేకపోతున్నామనేది ఇన్చార్జిల వాదనగా ఉంది. ఈ మేరకు సర్వీస్ రూల్స్ అమలు చేసి, రెగ్యులర్ ఎంఈఓలను నియమిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు చెబుతున్నారు. అక్రమాలు తేలితే కఠిన చర్యలు ఎమ్మార్సీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించాం. ఇటీవల భూత్పూర్ ఎంఈఓపై ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఆరోపణలు నిజమేనని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్ ఎంఈఓల నియామకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య, అలాగే, ఎమ్మార్సీల్లో ఉపాధ్యాయులెవరూ విధులు నిర్వహించొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సర్వీస్ రూల్స్ అమలుతోనే పరిష్కారం ప్రభుత్వం సర్వీస్ రూల్స్‌ను అమలు చేయకపోవడంతో ఎంఈఓల నియామకం పెద్ద సమస్యగా మారింది. సర్వీస్‌రూల్స్ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి, పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఎంఈఓల నియామకం చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే, ఎమ్మార్సీల్లో ఒక జూనియర్ అసిస్టెంట్‌ను కూడా నియమించాలి. తద్వారా ఉపాధ్యాయులు ఎవరూ పని చేయాల్సిన అవసరం ఉండదు.. – గట్టు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ ఇన్చార్జ్ ఎంఈఓలపై భారం జిల్లాలో చాలా మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరు పాఠశాలలకు హెచ్ఎంలుగా ఉంటూ, ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. సొంత పాఠశాలతో పాటు మండలంలోని మిగతా పాఠశాలలను కూడా పర్యవేక్షించాలి. ఇది పెనుభారంగా మారింది. రెగ్యులర్ ఎంఈఓలను నియమించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. – సతీష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, టీఎస్టీయూ -
తండ్రి తప్పుచేశాడని..కూతురిని గెంటేశారు.
సాక్షి, నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్పేట మోడల్‌స్కూల్ హాస్టల్ నుంచి నందిని అనే పదో తరగతి విద్యార్థిని గెంటివేతపై మంగళవారం ఎంఈవో ఎ.వెంకటేశం పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థిని నందినితోపాటు ఆమె తండ్రి పీర్యాను పాఠశాలకు పిలిపించి మాట్లాడారు. కేర్‌టేకర్ తీరును నిరసిస్తూ తన కూతురిని పాఠశాలకు పంపబోనని, ఈ విషయమై తాను కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తానని విద్యార్థిని తండ్రి పీర్యా ఎంఈవోతో పేర్కొన్నారు. దీంతో హాస్టల్ కేర్‌టేకర్ నిర్మలతో మాట్లాడారు. తండ్రి తప్పుచేయడంతోనే అతని కూతురిని హాస్టల్ నుంచి తీసివేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీలత పేర్కొన్నారు. తండ్రి తప్పుచేస్తే కూతురికి శిక్ష వేయడం సరికాదని, నందినికి తిరిగి హాస్టల్లో సీటు కేటాయించాలని ఎంఈవో ఆదేశించారు. సిబ్బంది సంయమనం పాటించాలని సూచించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని పీర్యాకు నచ్చజెప్పి నందినిని హాస్టల్లో ఉంచేందుకు ఎంఈవో ఒప్పించారు. ఆయన వెంట సీఆర్పీ రాజయ్య ఉన్నారు. -
ఎంఈవోపై హెచ్ఎం దాడి
కృష్ణాజిల్లా, ఘంటసాల (అవనిగడ్డ): స్కూల్ తనిఖీకి వెళ్లిన మండల విద్యా శాఖాధికారిపై సంబంధిత పాఠశాల హెచ్ఎం దాడి చేసిన ఘటన సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో చోటు చేసుకుంది. ఎంఈవో భృగుమళ్ల వెంకట సుబ్బారావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన దేవరకోట గ్రామదర్శినిలో స్థానికులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ పాఠశాల (ఆర్) లో 20 మంది విద్యార్థులు ఉన్నారని, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే, ఒకరిని డెప్యూటేషన్‌పై వేరేచోటకు పంపారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ మండల ప్రత్యేకాధికారి ఏడీవీ నారాయణరావుకు అర్జీ ఇచ్చారు. దీనిపై విచారించి వివరణ ఇవ్వాలని ఎంఈవో సుబ్బారావును ప్రత్యేకాధికారి ఆదేశించారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం పాఠశాల తనిఖీకి ఎంఈవో వచ్చారు. హాజరు పట్టీ పరిశీలించారు. ఇరవై మంది విద్యార్థులకుగాను 14 మందే హాజరయ్యారు. హాజరుకాని విద్యార్థుల పేర్లను ఎంఈవో నమోదు చేసుకుంటున్నారు. దీంతో కుర్చీలో ఉన్న ఎంఈవోను పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన బోలెం శ్రీనివాసరావు కిందకు తోసేశారు. దీంతో ఎంఈవో కింద పడిపోయాడు. తేరుకున్న ఆయన లేచి నిలబడగానే మెడమీద హెచ్ఎం చేయి వేసి గొంతు నొక్కడంతో పాటు దుర్భాషలాడారు. ప్రతిదానికి నా పాఠశాలకే వస్తున్నావేంటి.. అని ఎంఈవోతో హెచ్ఎం వాగ్వాదానికి దిగారు. తాను ఎంఈవోనని ఎప్పుడైనా వస్తానని చెప్పడంతో, నువ్వు ఎంఈవో అయితే నాకేంటి ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని హెచ్ఎం హెచ్చరించారు. తాను పాఠశాల తనిఖీకి వచ్చినట్లు సంతకం చేయాలి విజిటింగ్ బుక్ ఇవ్వమని ఎంఈవో కోరగా ఉగ్రుడైన హెచ్ఎం అందుకు నిరాకరించారు. దీంతో ఎంఈవో తన కార్యాలయానికి వచ్చేశారు. అనంతరం ఎంఈవో ఘంటసాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం బోలెం శ్రీనివాసరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని, విధులు సక్రమంగా నిర్వహించడానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఇదే విషయాన్ని విద్యా శాఖ ఉన్నతాధికారులకు కూడా తెలియజేసినట్లు ఎంఈవో సుబ్బారావు వెల్లడించారు. -
జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఎంఈఓ
చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్‌లోని మం డల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. కార్యాలయం ఆ వరణలో ఎంఈఓ బోనగిరి రాములు జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటికే అక్కడికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తునవచ్చారు. ఇదే సమయంలో ఎంఈఓ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు. జాతీయ గీతాలాపన ప్రారంభించిన సమయంలో కొందరు పైకి చూసి విషయాన్ని గు ర్తించారు. దీంతో నాలుకర్చుకున్న ఎంఈఓ హు టాహుటిన జాతీయ పతాకాన్ని తిరిగి మార్చారు. అనంతరం మరోసారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వ్యక్తి జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటోనని పలువురు చర్చించుకున్నారు. -
లంచం తీసుకుంటూ చిక్కిన కూకట్పల్లి ఎంఈవో
-
ఉపాధ్యాయుడు డుమ్మా..!
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : మండలంలోని జగ్గాసాగర్ ప్రాథమిక పాఠశాలకు బడిపంతులు శనివారం డుమ్మాకొట్టాడు. ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో తరగతి గదులకు తాళాలు తీసే వారులేక విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డబ్బ రవి తన స్నేహితులతో కలిసి పాఠశాలను తెరిచారు. పాఠశాలలో హెచ్ఎం రవీంధ్రనాథ్, ముగ్గురు ఉపాధ్యాయులు శ్రీనాథ్, రాజేశం, రామకృష్ణ పనిచేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులకు 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 138 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు ఒక్క డే నిర్వహిస్తున్నాడు. ఆయన పాఠశాలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటల వరకు రాలేదు. దీం తో ఎస్ఎంసీ చైర్మన్ రవి, అతని స్నేహితులు సామ రమేశ్, డబ్బ రమేశ్, ముదాం శ్రీనివాస్, పాలెపు రాజే ందర్, కట్లకుంట రాజేశ్ సాయంత్రం వరకు విద్యార్థులకు పాఠాలు భోదించారు. అనంతరం ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈవో కనకతా రను వివరణ కోరగా ఆమె అందుబాటులో లేరు. -
హింసిస్తున్న ఎంఈఓ
పటాన్చెరు: మండల విద్యాధికారి తమను అనవసరంగా వేధిస్తున్నారని మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం ఆరోపించింది. ఆదివారం వారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిసి తమ బాధలను ఆయనతో ఏకరువు పెట్టారు. తమను బూతులు తిడుతున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. మరో రకంగా చెప్పాలంటే తమను హింసిస్తున్నాడని, ఆ ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కొన్ని పాఠశాలల మహిళా కరస్పాండెంట్లను వ్యక్తిగతంగా రావాలంటూ వేధిస్తున్నాడని ఆరోపించారు. అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా తాము ఇలాంటి విద్యాధికారిని చూడలేదన్నారు. ఇటీవల ఓ కరస్పాండెంట్‌ను సమావేశం పేరుతో పిలిచి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేకు వివరించారు. ఆ సంఘటనతో ఆ కరస్పాండెంట్ కన్నీటి పర్యంతమయ్యారని వారు చెప్పారు. చాలా ఇబ్బందికరంగా, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. పటాన్చెరు ఎంఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. వీరిలో సంఘం ప్రతినిధులు టి.ప్రమోద్, రాఘవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉపాధ్యాయురాలికి లైంగిక వేధింపులు
మోర్తాడ్(బాల్కొండ): తనతోటి ఉపా ధ్యాయుడు తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ ఉపాధ్యాయిని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఏర్గట్ల మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం ఏర్గట్ల పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఉన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో బయోసైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు శాంతికుమార్ కొన్నినెలల నుంచి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయురా లి సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లతోపాటు, ఫొటోలను పంపించేవాడు. దీం తో ఉపాధ్యాయురాలు తన భర్తకు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశారు. కాగా శాంతికుమార్ గతంలో ధర్మారం బీ పాఠశాలలో ఇలాగే వ్య వహరించడంతో అతనికి అక్కడ దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. కేసు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. అలాగే ఎంఈవో బి. రాజేశ్వర్ పాఠశాలలో విచారణ జరిపారు. -
టీచర్లు రాక.. ప్రార్థన చేయించిన ఎంఈఓ
చిన్నచింతకుంట(దేవరకద్ర): మండల పరిధిలోని అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ విద్యార్థులతో ప్రార్థన చేయించారు. ఆ సమయానికి ఉపాధ్యాయులు ఒక్కరు కూడా రాలేదు. చాలారోజులుగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారని ఎంఈఓ తెలిపారు. దీంతో వారిని పలుమార్లు హెచ్చరించినా పనితీరు మారలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశానని, ఉదయం 9:30 అవుతున్నా ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. హెచ్ఎం.బాలయ్య , ఉపాధ్యాయుడు నాగరాజు, గోపాల్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మైనర్ బాలికపై ఎంఈఓ అత్యాచారయత్నం
- పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు హిందూపురం (అనంతపురం జిల్లా) : ఉపాధ్యాయులకు మార్గదర్శిగా.. గురువులకే గురువుగా ఉండాల్సిన మండల విద్యాధికారి (ఎంఈఓ) ఆ స్థానానికే మచ్చ తెచ్చారు. కామంతో కన్ను మిన్ను కానకుండా మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే....అనంతపురం జిల్లా హిందూపురం మండలం ఎంఈఓ గంగప్ప ఇటీవల విధినిర్వహణలో భాగంగా మిట్టమీదపల్లి గ్రామానికి వెళ్లాడు. గ్రామంలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలికి స్కూల్ యూనిఫారాలు జత రూ.35 చొప్పున కుట్టించేలా ఖరారు చేశాడు. ఒప్పందం ప్రకారం తనకు రూ.5 కమీషన్ ఇవ్వాలని కూడా చెప్పాడు. ఈ విషయం మాట్లాడేందుకు ఈనెల 15న మిట్టమీదపల్లికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు మహిళ లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమె కూతురు(15)తో చనువుగా మాట్లాడాడు. అనంతరం ఇంట్లోకి వెళ్లి బాలికను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో బాలిక బయటకు పరుగు తీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఏడుస్తూ కూర్చున్న బాలిక రాత్రి ఇంటికివచ్చిన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 354ఏ సెక్షన్ కింద పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే కలెక్టర్‌కు కూడా విషయాన్ని తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఎంఈఓ గంగప్ప వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
‘అనుమతుల్లో’ అక్రమాలు!
⇒ ప్రీ ప్రైమరీ స్కూళ్ల రికగ్నైజేషన్లో ఇష్టారాజ్యం ⇒ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ⇒ సర్కారు ఆదేశాలు బేఖాతరు ⇒ సౌకర్యాలు, కనీస వసతులు లేకున్నా.. ⇒ ఎంఈవోల పరిశీలన లేకుండానే పర్మిషన్ ⇒ ఒక్కో పాఠశాల నుంచి రూ.20 వేలు వసూలు! నిజామాబాద్: ప్రీ ప్రైమరీ పాఠశాలల అనుమతుల మంజూరులో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఆయా పాఠశాలలకు ప్రభుత్వం నిర్దేశించిన సౌకర్యాలు లేకపోయినప్పటికీ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ముడుపులు పుచ్చుకొని కొన్ని పాఠశాలలకు అనుమతులు కట్టబెట్టారు. ఒక్కో పాఠశాలకు రూ.20 వేల వరకు వసూలు చేసి, వందల్లో పాఠశాలలకు అనుమతులు కట్టబెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చిన్నారుల భద్రతను దృష్టి ఉంచుకుని ప్రభుత్వం ప్రీ ప్రైమరీ పాఠశాలలకు కూడా అనుమతులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లో అనుమతి లేని ఓ ప్రీ ప్రైమరీ పాఠశాలలో లిఫ్టులో ఇరుక్కుని ఓ చిన్నారి మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైమరీ, హైస్కూల్స్ మాదిరిగానే ప్రీ ప్రైమరీ పాఠశాలలకు అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా ఈ పాఠశాలలు నిర్వహిస్తే వాటిని సీజ్ చేయడమే కాకుండా, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో నెం.1 ప్రకారం సౌకర్యాలు.. ప్రీ ప్రైమరీ పాఠశాలల నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సర్కారు ఆదేశించింది. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10 వరకు గడువు పొడగిస్తూ వచ్చింది. గతంలో జారీ చేసిన జీవో నెం.1 ప్రకారం నిర్దేశించిన సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలని, నిర్ణీత వైశాల్యంలో తరగతి గదులు, ఉపాధ్యాయులు, ఆయాలు, బస్సు, రోడ్డు దాటించడానికి ప్రత్యేక సిబ్బంది, చిన్నారులకు హాని చేయని విధంగా ఉన్న ఆట వస్తువులు, టాయిలెట్లు, తాగునీరు, ఆటస్థలం వంటి నిర్దేశిత సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని జీవోలో పేర్కొంది. అస్తవ్యస్తంగా అనుమతుల ప్రక్రియ అనుమతుల మంజూరు ప్రక్రియ జిల్లాలో అస్తవ్యస్తంగా జరిగింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 116 పాఠశాలకు అనుమతులిస్తే.. ఇందులో చాలా పాఠశాలలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చేశారనే విమర్శలున్నాయి. నిర్దేశిత సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్న పాఠశాలల నిర్వాహకులు రూ.10 వేలు చలానా చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయం సంబంధిత మండల ఎంఈవోలకు పంపుతారు. ఎంఈవోలు ఆయా దరఖాస్తులను పరిశీలించి, ఆయా పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలి. నిర్దేశించిన మేరకు సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయని నిర్ధారించుకున్నాక, అనుమతుల మంజూరు కోసం డీఈవో కార్యాలయానికి సిఫార్సులు చేయాలి. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా సాగింది. చాలా పాఠశాలలకు సంబంధిత ఎంఈవోల క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలు లేకుండానే అనుమతులు కట్టబెట్టారు. మరికొన్నింటికి వచ్చిన దరఖాస్తులను కనీసం ఎంఈవోలకు కూడా పంపకుండానే డీఈవో కార్యాలయం నుంచే నేరుగా అనుమతులు ఇచ్చేయడం విశేషం. ఇలా అక్రమంగా అనుమతులిచ్చిన ఒక్కో పాఠశాలకు రూ.20 వేల వరకు ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారినట్లు తెలిసింది. -
అమ్మాయిల భద్రతకు భరోసా
- ‘శాలసిద్ధి’ వివరాలు పక్కాగా నమోదు చేయాలి - ఎంఈఓలకు ఎస్ఎస్ఏ పీఓ ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత పాఠశాలలతోపాటు కేజీబీవీల్లో అమ్మాయిల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి దశరథరామయ్య తెలిపారు. స్థానిక ఆర్‌ఎంహెచ్‌ఎస్ స్కూల్లో శనివారం ‘శాలసిద్ధి’ కార్యక్రమంపై ఎంఈఓలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అందులో పీఓ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనాభ్యసన ప్రక్రియలు, విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల పనితీరు, హెచ్ఎంల పర్యవేక్షణ, సమాజ భాగస్వామ్యం తదితర అంశాలను మదింపు చేసి లోపాలను సరి చేయడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను అందించేందుకు ప్రభుత్వం ‘శాలసిద్ధి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. హెచ్ఎంలు చొరవ తీసుకుని ఈ వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ సీఎం డ్యాష్‌బోర్డుకు అనుసంధానంగా ఉంటుందన్నారు. వివరాలన్నీ పంపిన తర్వాత అన్ని పాఠశాలలకూ రేటింగ్స్ ఇచ్చి వెనుకబడిన పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో అమ్మాయిల కోసం 62 కేజీబీవీలు ఏర్పాటయ్యాయన్నారు. వాటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అమ్మాయిల భధ్రతకు భరోసా ఇస్తున్నామన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్‌భాను మాట్లాడుతూ బాలికలపై అత్యాచారాలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో విస్త్రత అవగాహన కల్పించాలన్నారు. అమ్మాయిలకు ఆకతాయిల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికల అక్రమ రవాణా, కిడ్నాప్‌లను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎస్ఎస్ఏ సెక్టోరియల్ ఆఫీసర్లు ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డి, అలెస్కో బాలమురళీ, జీసీడీఓ వాణీదేవి, ఐఈడీ కో-ఆర్డినేటర్ పాండురంగ, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఎంఈఓలపై ‘అధికార’ పెత్తనం!
అనంతపురం: ‘నాకు తెలీకుండా, మాట కూడా చెప్పకుండా నా నియోజకవర్గంలో ఎలా ఎంఈఓగా చేరతావు. చేరకూడదు అంతే. పొరబాటున చేరితే నీ ఇష్టం...’ ఇదీ ఓ మండల విద్యాశాఖ అధికారికి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి బెదిరింపు. ఆయన నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ శాఖల అధికారులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆ ఎంఈఓ అక్కడ చేరే సాహసం చేయలేదు. ఇలా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో ఎంఈఓలను విధుల్లో చేరకుండా అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. సీనియార్టీ ఆధారంగా ఈ నెల 26న కడపలో కౌన్సెలింగ్ నిర్వహించి ఎంఈఓ పోస్టులను భర్తీ చేశారు. అయితే గతంలో ఇన్ చార్జ్ ఎంఈఓలుగా పని చేసిన హెచ్ఎంలు కొందరు వారికి అనుకూలంగా ఉండడడంతో తిరిగి వారిని ఎంఈఓ పోస్టులో కూర్చొబెట్టాలని కొత్తవారిని విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నారు. సీనియార్టీ ఆధారంగా తమను ఎంఈఓ పోస్టుల్లో నియమించారని చెప్పుకున్నా అధికార పార్టీ నాయకులు వినే పరిస్థితుల్లో లేరు. ముదిగుబ్బ, శింగనమల, గాండ్లపెంట, నల్లచెరువు, నల్లమాడ, ఆమడగూరుతో పాటు మరికొన్ని మండలాల్లో విద్యాశాఖ అధికారులు విధుల్లో చేరలేదు. మరోవైపు అధికారులేమో ఆయా ఎంఈఓలపై విధుల్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. -
కొత్త ఎంఈవోలొచ్చారు..
ఏలూరు సిటీ : జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల (ఎంఈవో) పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ జరిగింది. జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీనియార్టీ ఆధారంగా మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో)గా నియామకాలు చేపట్టారు. స్థానిక సర్వశిక్ష అభియాన్ జిల్లా కార్యాలయంలోని సమావేశమందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మధుసూదనరావు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవో పోస్టులను భర్తీ చేశారు. చింతమనేని పేరుతో భయపెట్టిన యూనియన్ దెందులూరు నియోజకవర్గంలోని ఎంఈవో పోస్టులకు సంబంధించి ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుమతి లేకుండా ఇక్కడకు వస్తే ఇబ్బందులు తప్పవంటూ ఎమ్మెల్యే తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రధానోపాధ్యాయులను భయపెట్టారు. ఈ నియోజకవర్గంలో దెందులూరు ఎంఈవో పోస్టు భర్తీ చేయగా, పెదపాడు ఎంఈవో పోస్టు మాత్రం ఖాళీగా మిగిలిపోయింది. ఇలా ఎమ్మెల్యే పేరు చెప్పి ప్రధానోపాధ్యాయులను భయపెట్టేందుకు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబట్టారు. జిల్లాలో 42 ఎంఈవో పోస్టులు భర్తీ కాగా మూడు పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. 3 ఎంఈవో, ఒక డీఐ పోస్టు ఖాళీ జిల్లాలో ఇన్ఛార్్జల పాలనలో కొనసాగుతున్న మండల విద్యాశాఖ అ«ధికారి పోస్టుల్లో రెగ్యులర్ నియామకాలు చేపట్టారు. జిల్లాలో 48 మండలాల విద్యాధికారి పోస్టులు, ఏలూరు, భీమవరంలో రెండు అర్భన్ పాఠశాలల ఉప తనిఖీ అధికారి (డీఐ) పోస్టులు ఉన్నాయి. తాళ్లపూడి, ఆచంట మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు కాలేదు. ఇక మిగిలిన 46 పోస్టుల్లో ఒకచోట రెగ్యులర్ ఎంఈవో ఉండగా 45 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ పోస్టులకు జిల్లావ్యాప్తంగా 204 మంది అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. సీనియార్టీ జాబితా ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టులను భర్తీ చేశారు. వీరిలో 42 మంది ఆయా మండలాలను కోరుకోగా వారికి నియామక ఉత్తర్వులను డీఈవో అందజేశారు. పెదపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండల విద్యాశాఖ అధికారి పోస్టులు మాత్రం ఖాళీగానే మిగిలిపోయాయి. ఇక ఏలూరు అర్భన్ డీఐ పోస్టు భర్తీ చేయగా, భీమవరం డీఐ పోస్టు ఖాళీగా ఉంది. కొత్తగా నియమితులైన ఎంఈవోలు వీరే జంగారెడ్డిగూడెం – బి.రాముడు ఏలూరు రూరల్ – కె.అన్నమ్మ కొయ్యలగూడెం – జె.సురేష్‌బాబు తణుకు – జి.సత్యజ్యోతి యలమంచిలి – సీహెచ్ అరుణకుమారి పోడూరు – ఎం.చిట్టిరాజు పెంటపాడు – ఎం.శ్రీనివాస్ జీలుగుమిల్లి – కె.శ్రీనివాసరావు బుట్టాయగూడెం – టి.బాబూరావు చింతలపూడి – గుగ్గులోతు రామారావు కామవరపుకోట – డి.సుబ్బారావు గోపాలపురం – గుగ్గులోతు శ్రీనివాసరావు టి.నరసాపురం – టి.రామమూర్తి లింగపాలెం – కె.రామారావు తాడేపల్లిగూడెం – వి.హనుమ భీమవరం – బి.ఐజాక్ ఇజ్రాయెల్ న్యూటన్ కొవ్వూరు – జె.కెంపురత్నం ఉండ్రాజవరం – వైవీ మాణిక్యాలరావు దెందులూరు – ఎస్.సత్యనారాయణ నరసాపురం – పి.పుష్పరాజ్యం నిడదవోలు – పీవీ పాపారావు పెదవేగి – సీహెచ్ బుద్ధవ్యాస్ చాగల్లు – వి.ఖాదిర్బాబు ఇరగవరం – ఎస్.శ్రీనివాసరావు అత్తిలి – ఎస్.నరసింహమూర్తి పెరవలి – వి.హైమావతి గణపవరం – పి.శేషు భీమడోలు – వి.జయలక్ష్మి పాలకోడేరు – ఏఏవీబీ సత్యానంద్ పాలకొల్లు – యం.గంగరాజు పెనుగొండ – యం.కృష్ణారావు కాళ్ల – డి.సీతారామరావు పెనుమంట్ర – డి.శారదజ్యోత్స్న దేవరపల్లి – వీఎస్ఎన్ మూర్తి ఉంగుటూరు – డి.సుభాకరరావు నల్లజర్ల – వీఎస్ రత్నకుమార్ పోలవరం – పి.కృష్ణ వీరవాసరం – బి.వినాయకుడు ద్వారకాతిరుమల – ఎస్.ధర్మదాస్ నిడమర్రు – వి.నరసింహమూర్తి ఆకివీడు – ఎ.రవీంద్ర మొగల్తూరు – సీహెచ్ లక్ష్మణప్రభాకరరావు -
ఎట్టకేలకు ఎంఈఓ పోస్టుల భర్తీ
కౌన్సెలింగ్ ద్వారా 50 ఎంఈఓలు, రెండు డీఐ పోస్టుల భర్తీ ఏజెన్సీలో ఏడు ఎంఈవో పోస్టులు రాయవరం : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎంఈఓల పోస్టుల భర్తీ ఎట్టకేలకు బుధవారం పూర్తయింది. కౌన్సెలింగ్ ద్వారా జిల్లాలోని 50 ఎంఈఓ పోస్టులు, అర్బన్‌లో రెండు డీఐ పోస్టులు భర్తీ చేశారు. ఏజెన్సీలోని 11 ఎంఈఓ పోస్టుల్లో ఏడింటిపై ఎవరూ ఆసక్తి కనబర్చక పోవడంతో అవి భర్తీ కాలేదు. 1998లో కామన్ సర్వీస్ రూల్స్ ఉత్తర్వులను 505, 530 జీఓలుగా ప్రభుత్వం విడుదల చేసింది. 1998 తర్వాత కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండేలా 1998 నుంచి 2005 వరకూ పదోన్నతులను కల్పించారు. దీంతో ఎంఈఓ పోస్టులు కంబైన్డ్ సీనియారిటీ జాబితా ప్రకారం భర్తీ చేశారు. అయితే కంబైన్డ్ సర్వీస్ రూల్స్‌కు లోబడి పదోన్నతులు చేపట్టరాదంటూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు 2005లో సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీంతో పదోన్నతులు, బదిలీలు, నియామకాలు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ స్తంభించింది. ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని 2009లో సుప్రీంకోర్టు అనుమతితో అడహక్ సర్వీస్ రూల్స్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూపొందించింది. 1998లో వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఉమ్మడి సర్వీస్‌ల ప్రకారం 2005లో ఎంఈఓలకు పదోన్నతులు కల్పించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇప్పటివరకూ ఉన్నత పాఠశాలల హెచ్.ఎంలను సీనియారిటీ ప్రాతిపదికన ఎంఈఓ ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో గ్రేడ్–2 గెజిటెడ్ హెచ్ఎంలతో ఎంఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత ఇచ్చిన జీవోలు 10, 11లను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో వాటికి సవరణ చేసి తిరిగి జీవో నంబరు 16, 17 విడుదల చేసింది. దీని ప్రకారం గ్రేడ్–2 హెచ్ఎంలను ఎంఈవో పోస్టుల్లో బదిలీ ద్వారా నియమించేందుకు మార్గం సుగమమైంది. 60 ఎంఈఓ పోస్టులకు.. జిల్లాలో 57 ఎంఈఓ పోస్టులకు, రాజమండ్రి, కాకినాడ అర్బన్ డీఐ పోస్టులకు బుధవారం కాకినాడ ఎస్ఎస్ఏ సమావేశమందిరంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్‌కు సీనియార్టీ జాబితాలో ఉన్న 470 మంది హాజరయ్యారు. అయితే మైదాన ప్రాంతంలో ఉన్న 46, ఏజెన్సీలో నాలుగు ఎంఈఓ పోస్టులు, కాకినాడ, రాజమండ్రి డీఐ పోస్టులు భర్తీ అయ్యాయి. ఏజెన్సీలోని మారేడుమిల్లి, రంపచోడవరం, దేవిపట్నం, అడ్డతీగల, వై.రామవరం, చింతూరు, కూనవరం మండలాలకు వెళ్లేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. నేడు విధుల్లో చేరిక.. కౌన్సెలింగ్‌లో మండలాలకు కేటాయించిన ఎంఈఓలు గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. ఏజెన్సీ మండలాలను కోరుకున్న ఎంఈఓలు మాత్రం న్యాయ వివాదం అనంతరం విధుల్లో చేరాల్సిఉంటుంది. -
ఒక్కరు ఫెయిలైనా ఇంటికి పంపిస్తా!
– ఎంఈఓ, హెచ్ఎంలకు కలెక్టర్ హెచ్చరిక – జీతాల కోసం పని చేయొద్దని సూచన – ర్యాంకులు తెస్తే టీవీల్లో వేయిస్తానని ప్రకటన అనంతపురం టౌన్ : ‘పిల్లల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. జీతం కోసం కాకుండా బాధ్యతగా పని చేయండి. ఈసారి టెన్త్‌లో ఒక్కరు ఫెయిలైనా ఇంటికి పంపిస్తా’ అని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. మంగళవారం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను హెచ్ఎంలు సవాలుగా తీసుకోవాలన్నారు. పదోతరగతి పాస్ కాకుంటే కనీసం సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా రాదన్నారు. జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసే సమయంలో 20 పోస్టులుంటే పది వేల దరఖాస్తులు వస్తున్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని, సరైన విద్యాబోధన చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. కొందరు టీచర్ల పనితీరు చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. వాళ్లే ఇళ్ల వద్దకు వెళ్లి పిల్లలను స్కూల్స్‌కు తెస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇలా అందరూ ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయులపై ఆగ్రహం : గతేడాది పదో తరగతి ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలల హెచ్ఎంలతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ములకనూరు స్కూల్లో 26 శాతం ఉత్తీర్ణత రావడాన్ని చూసి హెచ్ఎం వెంకటేశ్వరరావుపై మండిపడ్డారు. రెగ్యులర్ టీచర్లు లేరని, మ్యాథ్స్ టీచర్ లేరని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంటిసాకులు చెప్పొద్దన్నారు. ‘మీలాంటి వాళ్లు గవర్నమెంట్ సర్వీస్‌లో పనికిరారు..టీచర్‌గా జాయిన్ అయ్యి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగకుంటే చర్యలు తీసుకుంటానని’ హెచ్చరించారు. కల్లూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వేదవతిపైనా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ పర్సంటేజ్ ఏంటిది.. అసలు మీరు స్కూల్‌కు వెళ్తున్నారా? లేదా? అని అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు టీచర్లు ఉండడంతో ఉత్తీర్ణత తగ్గిందని చెప్పడంతో ‘అసలు ఇలాంటి స్కూళ్లు మనకు అవసరమా? మీలాంటి వాళ్ల వల్లే పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారు’ అని మండిపడ్డారు. ఇదే పాఠశాలలో మ్యాథ్స్‌లో అందరూ ఫెయిల్ కావడం, ఆ సబ్జెక్ట్ టీచర్ కూడా ప్రధానోపాధ్యాయురాలే కావడంతో మరింత మండిపడ్డారు. ‘నీ సబ్జెక్టుకే దిక్కులేదు. పాస్ గురించి మాట్లాడతావు’ అని అన్నారు. అంతలో ఎంఈఓను పైకిలేపి ‘ఆమెకు ఎగ్జాం పెట్టండి.. అసలు పాస్ అవుతుందో లేదో’ అని సూచించారు. ఇంత దారుణంగా ఫలితాలు ఉంటే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం, కుందుర్పిలోని స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో వారినీ మందలించారు. ఎంఈఓల పనితీరుపై మండిపాటు : మండల విద్యాశాఖ అధికారుల పనితీరుపైనా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంటే ఎంఈఓలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘నువ్వు నా గురించి చెప్పొద్దు.. నేను నీ గురించి చెప్పను’ అన్న కోణంలో విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. అందరూ బయోమెట్రిక్ వేస్తున్నారా? అని ప్రశ్నించారు. దొంగ అటెండెన్స్లతో కాలం వెళ్లదీస్తే ఉపేక్షించేది లేదన్నారు. అన్ని స్కూళ్లలో బయోమెట్రిక్ తప్పనిసరి అని చెప్పారు. ర్యాంకులు తెండి.. టీవీల్లో వేయిస్తా : ఈసారి టెన్త్‌లో మంచి ర్యాంకులు సాధిస్తే కార్పొరేట్ స్కూళ్లు ఇస్తున్న తరహాలో తానే టీవీల్లో యాడ్స్ వేయించి, ఫొటోలు కూడా పెట్టిస్తానని కలెక్టర్ అన్నారు. ‘ఇన్ని స్కూళ్లు.. ఇంత స్టాఫ్ ఉన్నారు.. రిజల్ట్స్ రాకుంటే ఎలా? బెస్ట్ టీచర్లున్నారు. అందరూ బాగా పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాల’ని సూచించారు. జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అందరూ సంకల్పంతో పని చేసి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. సమీక్షలో జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీఈఓ లక్ష్మీనారాయణ, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతుల రగడ
ఎంఈవో పోస్టుల భర్తీకి సంబంధించి జీవోల జారీ జీవో 10, 11లపై ప్రభుత్వ ఉపాధ్యాయుల అభ్యంతరాలు సీనియార్టీ, పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని ఆవేదన భీమవరం టౌన్ : విద్యాశాఖలో ఎంఈవో పోస్టుల భర్తీపై జారీ చేసిన జీవోలు చిచ్చు రేపుతున్నాయి. విద్యారంగంపై ఇది తీవ్ర ప్రభావం కనబర్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంఈవో పోస్టుల స్థానంలో ఇన్చార్జిలను నియమిస్తూ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. సుమారు 18 ఏళ్లుగా బీఈడీ స్కూల్ అసిస్టెంట్లను ఇన్చార్జి ఎంఈవోలుగా నియమిస్తుండటంతో ఒకవైపు ప్రధానోపాధ్యాయులుగా మరోవైపు విద్యాశాఖాధికారులుగా ద్విపాత్రాభినయం చేయాల్సి వస్తోంది. జెడ్పీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీసు రూల్స్‌లో నెలకొన్న వివాదం విద్యారంగానికి శాపంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 10, 11 జీవోలు జారీ చేసింది. మండల విద్యాశాఖాధికారుల పోస్టులను రెండు భాగాలుగా చేస్తూ ఈ జీవోలు జారీ చేశారని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. జీవో 10 ప్రకారం జెడ్పీ ఉపాధ్యాయులకు, జీవో 11 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈవోలుగా పదోన్నతులు కల్పిస్తారని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. దీనిపై జెడ్పీ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ ఉపాధ్యాయవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోలపై న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే సీనియార్టీ, పదోన్నతుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే జీవోల జారీ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు 10, 11 జారీ చేసింది. పదోన్నతులపై అనేక ఏళ్లుగా న్యాయస్థానంలో పోరాడుతున్నాం. ఉమ్మడి సీనియార్టీపై విద్యాశాఖలో పదోన్నతులు కల్పించడాన్ని 2003లో హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్టేటస్కో ఇచ్చింది. 2015 సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే జెడ్పీ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలనుకుంటే సాంకేతిక పరమైన అభ్యంతరాలు లేకుండా రాష్ట్రపతి ఉత్తర్వులకు ప్రయత్నించాలని సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న జీవోలు 10, 11 జారీ చేయడం సరికాదు. దీనిపై న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తాం. మద్దూరి సూర్యనారాయణమూర్తి, ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు