Metaverse
-
ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!
Meta Layoffs: ఐటీ రంగంలో లేఆఫ్స్ పర్వానికి ఇంకా తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాలో మరోసారి ఉద్యోగాల కోత వార్త కలకలం రేపుతోంది. త్వరలోనే మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విడత తొలగింపుల్లో కంపెనీలోని చిప్ డెవలప్మెంట్ టీమ్‌పై ప్రభావం చూపుతుంది. గత నవంబర్ నుండి 21వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన Meta, ఈసారి తన Metaverse డివిజన్ నుండి ఎంప్లాయిస్‌పై వేటు వేయనుంది. దీంతో ఆగ్మెంటెడ్ , వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభావితం చేయవచ్చు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్ లేదా ఫాస్ట్ టీంలో ఉద్యోగులను సాగనంపాలని భావిస్తోంది. కంపెనీ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బాధిత ఉద్యోగులకు సమాచారం అందిందనీ, దాదాపు 600 మంది ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ బుధవారం ఉంటుందని భావిస్తున్నారు. అయితే తొలగింపులపై మెటా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కృత్రిమ మేధస్సు పనిపై దృష్టి కేంద్రీకరించిన మెటాలోని మరొక చిప్-మేకింగ్ యూనిట్ కష్టాల్లో పడింది. ఆ ప్రయత్నాలకు బాధ్యత వహించిన ఎగ్జిక్యూటివ్ ఇటీవల రాజీనామా చేశారు. కాగా Meta ప్రస్తుతం క్వెస్ట్ వంటి మిశ్రమ రియాలిటీ హెడ్సెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరికరాలు AI వర్చువల్ అసిస్టెంట్ ద్వారా వీడియోను ప్రసారం చేయగలవు మరియు ధరించిన వారితో కమ్యూనికేట్ చేయగలవని కంపెనీ తెలిపింది. కంపెనీ సాధారణ కళ్లద్దాలను పోలి ఉండే సరళమైన డిజైన్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన AR గ్లాసెస్, స్మార్ట్‌వాచ్‌లపై కూడా పని చేస్తోంది. కాగా గ్లోబల్ ఆర్థిక మాంద్య పరిస్థితులు, ఆదాయాల క్షీణత నేపథ్యంలో ఐటీ సహా చాలాకంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ లాంటి దిగ్గజాలు వేలాది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. -
కంపెనీ కార్యకలాపాలకు ‘మెటావర్స్’ - పీడబ్ల్యూసీ ఇండియా ఏం చెబుతుందంటే?
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెటావర్స్‌తో అనుసంధానించే ప్రణాళికతో ఉన్నాయి. ఈ విషయాన్ని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. మెటావర్స్ అనేది సంస్థ ఉత్పత్తులు, వ్యాపార కార్యకలాపాలను కస్టమర్ ఉన్న చోట నుంచే వర్చువల్‌గా చూపించే టెక్నాలజీ. మెటావర్స్‌తో సంప్రదింపులు చేస్తున్న కంపెనీల్లో అధిక శాతం ఏడాదిలోనే తమ కార్యకలాపాలను మెటావర్స్‌తో అనుసంధానించేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు చెప్పాయి. మెటావర్స్ పట్ల తమకు సరైన అవగాహన ఉన్నట్టు 60 శాతం వ్యాపార సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు (ఉన్నతోద్యో గులు) చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 కంపెనీల ప్రతినిధులను పీడబ్ల్యూసీ సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. ‘‘మెటావర్స్‌తో అవకాశాలు అపారం. మెటావర్స్‌తో విశేషమైన వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం. వివిధ ప్రాంతాలు, తరాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు నూతన టెక్నాలజీ పట్ల అనుకూలంగా ఉన్నారు. దీంతో కంపెనీలు మెటావర్స్ సాంకేతికత అమలు కోసం అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా డిజిటల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్ట్నర్ అశుతోష్ చాంద్ తెలిపారు. అంతర్జాతీయంగా పలు కంపెనీలు మెటావర్స్ విషయంలో కంపెనీలతో భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాల కోసం సంప్రదింపులు మొదలు పెట్టినట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. ఆరంభ దశలో.. మెటావర్స్ సాంకేతికత భారత్‌లో ఇంకా ఆరంభంలోనే ఉన్నట్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 25 శాతం మంది తాము ఏడాదిలోపే మెటావర్స్‌తో తమ కార్యకలాపాలను అనుసంధానిస్తామని చెప్పగా, 47 శాతం కంపెనీల ప్రతినిధులు 2–3 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు. కస్టమర్లతో అర్థవంతంగా సంప్రదింపులు చేసేందుకు వీలుగా కంపెనీలకు మెటావర్స్ వినూత్న అవకాశం కల్పిస్తుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ సుదీప్త ఘోష్ చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది సైబర్ సెక్యూరిటీ వ్యాపారాలకు పెద్ద రిస్క్ అని చెప్పగా, 28 శాతం కంపెనీల ప్రతినిధులు టెక్నాలజీ పరిమితులను సవాలుగా పేర్కొన్నారు. -
ప్రపంచాన్ని ఊపేస్తున్న మెటావర్స్ ఫీవర్..వినియోగంలోకి వచ్చేది అప్పుడే!
న్యూఢిల్లీ : మెటావర్స్కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వినియోగంలోకి రావడానికి మరో 8–10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 2030 నాటికి రిటైల్, తయారీ, మీడియా, హెల్త్‌కేర్, టెలికం, ప్రొఫెషనల్ సర్వీసెస్, బ్యాంకింగ్ తదితర రంగాలు దీనిపై గణనీయంగా వెచ్చించనున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మెటావర్స్ సాధనాల వినియోగం తీరుతెన్నులను వివరించారు. దీని ప్రకారం 2017లో కృత్రిమ మేథ (ఏఐ) విషయంలో ఎలాంటి ధోరణులు కనిపించాయో ఇప్పుటు మెటావర్స్‌ను కంపెనీలు వినియోగించడంపైనా అలాంటి ధోరణులే కనిపిస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలికంగా మెటావర్స్ సొల్యూషన్స్‌ను ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు గతేడాది 57 శాతం మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ తెలిపినట్లు సర్వేలో తేలింది. ఇటీవలి సాంకేతికత పురోగతి కారణంగా ఇంటర్నెట్లో తదుపరి విప్లవంగా మెటావర్స్ ముందు వరుసలో ఉండనుందని నివేదిక పేర్కొంది. భారీగా పెట్టుబడులు .. మెటావర్స్ విభాగంలోకి ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. గతేడాది ప్రథమార్ధంలో 120 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. వివిధ మాధ్యమాల ద్వారా కస్టమర్‌కు సర్వీసులు అందించడం, రియల్ టైమ్‌లో ఉత్పత్తుల డిజైనింగ్‌ను పరీక్షించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడగలదని వివరించింది. 3డీ/టెక్నికల్ ఆర్టిస్ట్‌లు, మోషన్ డిజైనర్లు, గ్రాఫిక్స్ ఇంజినీర్లు మొదలైన వారు ఈ టెక్నాలజీ విస్తరణలో కీలకపాత్ర పోషిస్తారని నివేదిక తెలిపింది. అయితే, దీన్ని భారీ స్థాయిలో విస్తరించాలంటే .. పెట్టుబడులపై రాబడులు, టెక్నాలజీ, టాలెంట్ సంసిద్ధత వంటి అంశాలపై స్పష్టత అవసరమని నివేదిక పేర్కొంది. -
2023లో డిమాండ్ ఎక్కువగా ఉండే ఉద్యోగాలు ఇవే..
గతేడాది లేఆఫ్స్, రిమోట్ వర్క్, మూన్‌లైటింగ్, క్వైట్ క్విట్టింగ్, కోవిడ్ వంటి అంశాలు జాబ్ మర్కెట్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఈ కొత్త ఏడాదిలో ఏ జాబ్ చేస్తే బాగుంటుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులేంటని తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో పలు సంస్థలు ట్రెండింగ్ జాబ్స్ గురించి ఆసక్తికరమైన నివేదికల్ని విడుదల చేశాయి. ఆ నివేదికల ప్రకారం.. ప్రతిచోటా ఏఐ 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని సంస్థలు ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏఐ నిపుణులకు ఈ ఏడాది ఉద్యోగానికి ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా కోడింగ్‌తో పనిలేకుండా డ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్‌ఫేస్‌లు ఉపయోగించి ప్రొడక్ట్ సంబంధిత సేవల్ని అందించే వ్యాపార సంస్థల్లో వారికి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెటావర్స్ మెటావర్స్ పరిచయం అక్కర్లేని టెక్నాలజీ. ఇంటర్నెట్ రాకతో ఇప్పటివరకు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయిన మనుషులను వర్చువల్ వరల్డ్‌ను పరిచయం చేస్తుందీ మెటావర్స్. ఈ టెక్నాలజీ సాయంతో ఎక్కడో ఉన్న స్నేహితుల్ని, కుటంబసభ్యుల్ని వర్చువల్‌గా కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్‌గా, రియల్‌టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. 2030 నాటికి మెటావర్స్ $5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నదన్నుగా నిలవనుంది. ఈ ఏడాదే మెటావర్స్ దిశను మార్చేసే సంవత్సరమని నిపుణులు అంటున్నారు. వెబ్3 మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మంచి డిమాండ్ రాబోతోంది. వాణిజ్య, వ్యాపార అవసరాలకు వెబ్ 3.0 ఉపయోగపడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల సంస్థలకు వెబ్ 3 ఉద్యోగులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వెబ్ 3.0 అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్.. ఇలా రెండింటినీ మేళవిస్తూ అభివృద్ధి చెందిన టెక్నాలజీ. దీనిద్వారా క్రిప్టోకరెన్సీ, టోకనైజేషన్‌తో కూడిన బ్లాక్‌చెయిన్ ఆధారిత ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేయొచ్చు. ఇప్పటి నుంచే విద్యార్థులు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరుస్తాయి. వెబ్ 3లో రస్ట్, సాలిడిటీ, మూవ్, సబ్‌స్ట్రేట్ వంటి లాంగ్వేజ్ కోర్సులు వచ్చాయి. భవిష్యత్తుని శాసించేవి ఇవే. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా గ్రాడ్యుయేట్స్ సైతం వెబ్ 3 డెవలపర్స్‌గా శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
మెటా ఊహించని షాక్, భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనున్న జూకర్బర్గ్!
ట్విటర్ తర్వాత మెటా సైతం భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనుంది. మరికొన్ని వారాల్లో మెటాలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులపై సీఈవో మార్క్ జూకర్బర్గ్ వేటు వేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో తెలిపింది. ఇదే అంశంపై మెటా యాజమాన్యం బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ప్రకటన ఖర్చులపై పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం పెట్టుబడిదారుల్లో భయాందోళనకు దారితీసింది. దీనికి తోడు టిక్‌టాక్ నుండి పోటీ,యాపిల్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేయడం, మెటావర్స్‌పై భారీ ఎత్తున ఖర్చు చేయడం, సంస్థపై నియంత్రణ వంటి అంశాలు మెటాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటి ఫలితంగా అక్టోబర్‌లో నెలలో మెటావర్స్ షేర్లు 25 శాతం పడిపోయాయి. దీంతో మార్క్ జూకర్బర్గ్ సంపద విలువ అక్టోబర్ 27 నాటికి 11 బిలియన్ డాలర్లు తగ్గిపోవడంతో మెటా కంపెనీ షేర్ 36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడాది మెటా స్టాక్ మార్కెట్ విలువ నుండి సుమారు 67 బిలియన్లకు పడిపోనుందని అంచనా వేసింది. దీంతో జూకర్ బర్గ్ ఖర్చుల్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో మెటా ఫలితాల విడుదల సందర్భంగా మార్క్ జూకర్బర్గ్ మాట్లాడుతూ, మెటావర్స్‌పై పెట్టిన పెట్టుబడులకు ఫలితాలు వచ్చేందుకు దశాబ్దం పడుతుంది. ఈలోగా హైరింగ్ నిలిపివేయడం,ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగ బృందాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. 2023లో ఉద్యోగుల సంఖ్యను ఇలాగే ఉంచడం లేదా, తగ్గించడం చేయాల్సి ఉంటుందని అన్నారు. తాజాగా అందుకు ఊతం ఇచ్చేలా మెటా ఉద్యోగుల్ని తొలగిస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి రావడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 మార్క్ జుకర్‌బర్గ్ 'కక్కుర్తి' పని, వందల కోట్లకు ఇల్లు అమ్మకం! -
మార్క్ జుకర్‌బర్గ్‌కు ఇన్వెస్టర్ల షాక్: మార్కెట్ వాల్యూ ఢమాల్!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి ఫలితాల్లో ఢమాల్ అంది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ఆదాయ క్షీణత నమోదు చేసింది. మెటావర్స్‌పై అనాసక్తతకు తోడు ప్రకటనల ఆదాయం క్షీణించడం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా మెటా ఆదాయం పడిపోయింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్యార్టర్-2 ఫలితాల్లో ఆదాయం 4శాతం తగ్గి 27.71 బిలియన్ల డాలర్లకు చేరింది. అంతకుముందు ఇది 29.01 బిలియన్ల డాలర్లుగా ఉంది. మెటావర్స్ ప్రాజెక్ట్‌పై చేసిన అపారమైన, ప్రయోగాలకు మొత్తం ఖర్చుల్లో ఐదవ వంతు ఖర్చుపెట్టారు మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్ . అయితే కంపెనీ ఒక్కోషేరు ఆదాయంలో అంచనాలకు అందుకోలేక చతికిలపడింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన3.22 డాలర్లనుంచి 52 శాతం పడిపోయి 1.64 డాలర్లను మాత్రం సాధించింది. అలాగే మెటా రియాలిటీ ల్యాబ్స్ యూనిట్, దాని మెటావర్స్ మూడవ త్రైమాసికంలో 3.67 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాన్నినమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో నష్టంతో పోలిస్తే ఇది అధికం. ఈ ఫలితాల నేపథ్యంలోవాల్ స్ట్రీట్‌లో మెటా షేరు ఏకంగా 20 శాతం కుప్పకూలింది. 2016 కనిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాదిలో మెటాషేరు 61శాతం క్షీణించడం గమనార్హం. తాజా నష్టంతో 67 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ హరించుకు పోయింది. కాగా మెటా పెట్టుడులపై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో మెటావర్స్ పేరిట కంపెనీ అనవసర ఆలోచనలు చేస్తోందని మెటా వాటాదారు ఆల్టిమీటర్ క్యాపిటల్ సీఈఓ బ్రాడ్ గెర్స్ట్నర్ ఈ వారం ప్రారంభంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్క్‌పై లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఎఫ్బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్, కష్టాల్లో మెటా
న్యూఢిల్లీ: మెటా సీఈవో, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పౌండర్ మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత ప్లాట్‌ఫాంలోనే ఊహించని ఝలక్ తగిలింది. ఒక్కసారిగా 118 లక్షల ఫాలోవర్లను కోల్సోయారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను ప్రభావితం చేసే బగ్ కారణంగా కొన్ని సెకన్లలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఫేస్బుక్లో జుకర్‌బర్గ్‌కు 119 మిలియన్ల (11.9 కోట్ల)మంది ఫాలోవర్లు ఉండగా అకస్మాత్తుగా అది కాస్తా 10వేల కిందికి (9920) పడి పోవడం సంచలనం రేపింది. మరోవైపు జుకర్‌బర్గ్‌తో పాటు పలువురు సెలబ్రిటీల పాలోవర్ల సంఖ్య కూడా లక్షల్లో తగ్గిపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా ప్రముఖ రచయత్రి తస్లిమా నస్రీన్ ట్వీట్ చేశారు.ఫేస్బుక్ సునామీతో తన ఫాలోవర్లు కూడా ఒక్కమారుగా 9లక్షల నుంచి 9వేలకు పడిపోయారంటూ మీడియా కథనాన్ని షేర్ చేశారు. అంతేకాదు తనకు ఫేస్బుక్ కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ ఆమె ట్వీట్ చేయడం విశేషం. తర్వాత కొన్ని గంటల్లో ఈ లోపాన్ని కంపెనీ సరిచేయడంతో యథాతథంగా ఆయా సెలబ్రిటీల ఫాలోవర్లు కనిపించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లోపాన్ని త్వరగా గుర్తించి మెటా పరిస్థితిని సరిదిద్దే పనిలో ఉన్నామని, సాంకేతికత లోపాలే కారణమని మెటా తెలిపింది. అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. అయితే, పొరపాటు ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా మెటా వర్స్ సక్సెస్‌లో ఇబ్బందులు పడుతున్న మోటాకు తాజాగా ఫాలోవర్ల కౌంట్ తగ్గిపోవడంతో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్‌లో రష్యన్ మిలిటరీకి వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చే పోస్ట్‌లను మెటా అనుమతిస్తోందని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ను ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాబితాలో చేరుస్తూ ఆర్థిక పర్యవేక్షణ ఏజెన్సీ రోస్ఫిన్‌మోనిటరింగ్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, లింక్డ్ఇన్ సీఈవొ ర్యాన్ రోస్లాన్స్కీతో సహా అనేక మంది అమెరికన్ పౌరులపై క్రెమ్లిన్ విధించిన ఆంక్షలలో భాగంగా జుకర్‌బర్గ్ రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. .@facebook created a tsunami that wiped away my almost 900,000 followers and left only 9000 something on the shore: @taslimanasreen. Several users of @Meta's #facebook are complaining losing majority of their #followers. read more here. #MarkZuckerberghttps://t.co/QbxBSgMvId — The Telegraph (@ttindia) October 12, 2022 -
జుకర్ బర్గ్‌కు భారీ షాక్! 71 బిలియన్ డాలర్లు తుడుచుపెట్టుకుపోయాయ్!
న్యూఢిల్లీ: ‘మెటా’ అభివృద్ధి, రీబ్రాండింగ్‌పై దృష్టిపెట్టిన ఫేస్బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు భారీ షాక్ ఇస్తోంది. మార్క్ సంపద భారీగా తాజాగా మరింత క్షీణించింది. ఫలితంగా కేవలం 55.9 బిలియన్ డాలర్ల నికర విలువతో మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచ బిలియనీర్లలో 20వ స్థానంలో ఉంది, 2014 నుండి ఇదే అత్యల్ప స్థానం. ఈ సంపద రెండేళ్ల కిందటే 106 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. మెటా డెవలప్మెంట్ కోసం దాదాపు 71 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నారు. ఫలితగా మార్క్ సంపద ఈ మేరకు తుడుచుపెట్టుకుపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అత్యంత సంపన్నులలో అతని నికర సంపద సగానికి తగ్గిపోయింది. 2014లో ప్రపంచ బిలియనీర్లలో రెండు స్థానంలో ఉన్నారు ఇటీవల కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో 24 శాతం పడిపోయాయి. అంచనాలకు భిన్నంగా మెటా బలహీన ఫలితాల కారణంగా చరిత్రలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అలా ఒక్క రోజులోనే మార్క్ సంపద 31 బిలియప్ డాలర్లకు పడిపోయింది. సెప్టెంబర్, 2021లో కంపెనీ షేర్లు 382 డాలర్ల వద్ద జుకర్ బర్గ్ అతని సంపద గరిష్టంగా 142 బిలియన్ డాలర్లగా ఉన్న సంగతి తెలిసిందే. మెటావర్స్‌లో కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల స్టాక్ డ్రాప్ అవుతోందనీ, రాబోయే మూడు నుండి ఐదేళ్లలో "గణనీయమైన" సంపద కోల్పోతుందని తాను భావిస్తున్నట్లు నీధమ్ అండ్ కంపెనీ ఇంటర్నెట్ విశ్లేషకుడు లారా మార్టిన్ చెప్పారు. -
సీఈవోగా టాంగ్ యు! షాక్‌లో చైనీయులు..ఇక ‘సాఫ్ట్వేర్’ బతుకుడెట్లా?
ఇన్ని రోజులు ఏ టెక్నాలజీని చూసి అబ్బురపడ్డామో..అదే టెక్నాలజీ మన ఉద్యోగాల్ని కొల్లగొడుతుంది. ఉద్యోగాలు అనడం కన్నా.. మన బతుకులు అనడం సరైందేమో. మన పనులన్నీ రోబోలు చేసేస్తుంటే మనమేం చేయాలి. కొత్త కొత్త ఉద్యోగాల కోసం ఎక్కడని వెతుక్కోవాలి. ఇదిగో ఈ తరహా అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు చైనా నిరుద్యోగులు ! అక్కడి ప్రజలు! ఎందుకంటారా? ఇప్పటి వరకు దిగ్గజ సంస్థల్లో సీఈవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మనుషుల్ని చూశాం. ఇకపై ఆ పప్పులుడకవ్. ఎందుకంటే? డ్రాగన్ కంట్రీ టెక్నాలజీ పేరుతో సీఈవోలుగా పనిచేసే మనుషుల స్థానంలో ఇప్పుడు మర మనుషుల్ని నియమించుకుంటుంది. చైనా మెటావర్స్ కంపెనీ తన సీఈవో పదవిలో రోబోను నియమించుకుంది. దీంతో 'శ్రీమతి టాంగ్ యు' ఏఐ పవర్డ్ వర్చువల్ హ్యూమనాయిడ్ రోబోట్ ఎగ్జిక్యూటివ్ పదవికి అధ్యక్షత వహించిన ప్రపంచంలోనే మొదటి రోబోట్‌గా నిలిచింది. చైనాకు చెందిన నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ కంపెనీ మొబైల్ కోసం అప్లికేషన్లను తయారు చేస్తుంది. మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్‌లను తయారు చేస్తుంది. అయితే ఈ సంస్థకు నిర్వహణ బాధ్యతలు కష్టంగా అనిపించాయోమో. అందుకే ఆ కంపెనీ అనుబంధ సంస్థ ఫుజియాన్ నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ తన పనిని పర్యవేక్షించేందుకు హ్యూమనాయిడ్ రోబోట్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీఈవోగా మనుషులు ఎలాంటి విధులు నిర్వహిస్తారో హ్యుమనాయిడ్ రోబోట్ అలాంటి పనులు చేయదు. కానీ 10 బిలియన్ డాలర్ల సంస్థకు నాయకత్వం వహించడానికి వర్చువల్ సీఈవో పనిచేసేందుకు పూర్తిగా ఫంక్షనల్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీలో ఉంచబడుతుందని, కంపెనీ సంస్థాగత, సమర్థతా విభాగాలను ఇది చూసుకోవాలని కంపెనీ భావిస్తోందని నెట్ డ్రాగన్ ఛైర్మన్ డాక్టర్. డెజియన్ లియు తెలిపారు. టాంగ్ యు నియామకం గురించి డెజియన్ లియు మాట్లాడుతూ, “ఏఐ అనేది కార్పొరేట్ మేనేజ్మెంట్ భవిష్యత్తు అని మేము విశ్వసిస్తాం. అంతిమంగా మా వ్యాపారం, మా భవిష్యత్ వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
ప్రపంచంలోనే తొలి మెటావర్స్ 5జీ స్మార్ట్ ఫోన్, విడుదల ఎప్పుడంటే!
మనిషి తనకున్న కొద్ది పాటి జీవితాన్ని సుసంపన్నం చేసుకునేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాడు. అందుకే తాను అనుకున్న ఊహా ప్రపంచంలో విహరించేందుకు మెటావర్స్ పేరుతో రెండో ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడీ మెటావర్స్ టెక్నాలజీ పేరుతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ప్రపంచంలోనే తొలి మెటావర్స్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆ ఫోన్ విశేషాలేంటో తెలుసుకుందాం. 2008లో తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం హెచ్‌టీసీ సంస్థ ప్రపంచంలోనే తొలిసారి ఆండ్రాయిడ్ ఫోన్‌ను పరిచయం చేసింది. ఆ ఫోన్ సేల్స్ విభాగంలో యాపిల్, శాంసంగ్‌లకు గట్టి పోటి ఇచ్చింది. కానీ టెక్నాలజీ అప్డేట్ చేయడంలో అలసత్వం, మార్కెటింగ్ వ్యూహాలు, తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఫోన్లు సేల్ చేయాలన్న చైనా కంపెనీల మార్కెట్ సూత్రం ముందుకు హెచ్‌టీసీ నిలవలేకపోయింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలైన షావోమీ, వివో, ఒప్పోతో పాటు శాంసంగ్, యాపిల్ కంపెనీల ఆధిపత్యంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పింది. కొత్త స్ట్రాటజీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌పై పాగే వేసేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇతర దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల కంటే విభిన్నంగా ఫోన్లలో మెటావర్స్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నట్లు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2022 వేదికగా ప్రకటించింది. 5జీ ప్రీమియం సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు హెచ్‌టీసీ ఆసియా పసిఫిక్ జనరల్ మేనేజర్ చార్లెస్ హుయాంగ్ తెలిపారు. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ ఫోన్లో అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్),వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీలు అందుబాటులో ఉండనున్నాయి. మెటావర్స్ ఫోన్ ఫీచర్లు ఫోన్లో ఏఆర్, వీఆర్ టెక్నాలజీ ఇంటిగ్రీట్ చేస్తూ 'వైవర్స్' పేరుతో మెటావర్స్‌ను పరిచయం చేయనుంది. 6 అంగుళాలు, 3500ఏఎంహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ ప్లస్ 16ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ ప్లస్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 వంటి ఫీచర్లు ఉండగా.. ఈ మెటావర్స్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారని హెచ్‌టీసీ ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న హెచ్‌టీసీ మెటావర్స్ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది. -
ఎక్కడికెళ్లినా ఈ పాడు బుద్ది పోదా.. మెటావర్స్‌లో లైంగిక దాడి
పాడుబుద్ది గల మగవాళ్లు ఎక్కడికి వెళ్లినా తమ వంకర చేష్టలను వదులుకోవడం లేదు. ఇప్పటికే అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్ల స్త్రీలపై లైంగికదాడికి పాల్పడుతున్న కామంధులు ఆఖరికి టెక్నాలజీతో పుట్టుకొచ్చిన మెటావర్స్‌ను వదలడం లేదు. ఈ వర్చువల్ ప్రపంచంలోనూ మహిళలపై దుశ్చర్యలకు దిగుతూనే ఉన్నారు. లైంగిక వేధింపులు కార్పొరేట్ జవాబుదారీ గ్రూప్‌కి చెందిన రీసెర్చర్లు సమ్ ఆఫ్ ఆజ్ పేరుతో తెలిపిన వివరాల ప్రకారం మెటావర్స్‌లో పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ 21 ఏళ్ల యువతి లైంగిక వేధింపులకు గురైంది. హారిజోన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మరో యువకుడు మెటావర్స్‌లోకి ఎంటరై..ఆ యువతి మెటావర్స్ బాడీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తేలింది. ఇటీవల జరిగిన మెటా వార్షిక సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఏం చేద్దాం మెటావర్స్ అనుభూతిని మరింత సమర్థంగా అందించే వ్యవస్థగా హారిజోన్స్ ఉంది. కెనాడా, యూఎస్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మెటా ప్రపంచంలోకి ఎంటర్ కావొచ్చు. అంటే మనం వాస్తవ ప్రపంచంలో ఉంటే మనలాంటి అవతరామే కృత్రిమ ప్రపంచంలో విహరిస్తుంది. ఇది పూర్తిగా నియంత్రిత ఆర్టిఫిషియల్ ప్రపంచం అయినందున ఇక్కడికి వచ్చే వారి సెక్యూరిటీ గ్యారెంటీ అనే భావన ఉండేది. కానీ మెటావర్స్‌లోనూ సెక్యూరిటీ పరంగా కొన్ని లోపాలు ఉన్నట్టు తాజా ఘటనతో వెల్లడైంది. దీంతో మెటావర్స్‌లో యూజర్ల భద్రతకు సంబంధించి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మెటావర్స్ అంటే మెటావర్స్ అసలు నిజమైన ప్రపంచం కాదు. మనం జీవిస్తున్న యూనివర్స్‌కి అనుబంధంగా వర్చువల్ రియాల్టీ, ఆగ్యుమెంటెడ్ రియల్టీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వంటి టెక్నాలజీ జోడించి సాంకేతిక పరికరాలు ధరించి మరో కొత్త ప్రపంచాన్ని మెటా సృష్టించింది. దీనికి మెటావర్స్ అని పేరు పెట్టింది. నియంత్రిత సాంకేతిక ప్రపంచం అయినందున అక్కడికి వెళ్లే ‘అవతార్’లకు ఎటువంటి సమస్య ఉండదని అంతా నమ్మారు. కానీ తాజా ఘటనతో మెటావర్స్‌లోకి వచ్చే యూజర్లలోనూ ఎవరైనా హద్దులు మీరితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉదయించాయి. మరి వీటికి మెటా ఎలాంటి పరిష్కారం కనుక్కుంటుందో చూడాలి. చదవండి: మన ముందుకు మెటా ప్రపంచం.. ఎప్పటి నుంచి అంటే? -
మెటావర్స్ వెర్షన్లో 'విక్రమ్'.. తొలి మూవీగా రికార్డ్
Kamal Haasan Launch Metaverse Experience Of Vikram Movie: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నలుగురు సూపర్ టాలెంటెడ్ హీరోలు కలిసి నటించిన ఈ మూవీపై అంచనాలు మాములుగా లేవు. అయితే నటనతో ఆకట్టుకోవడమే కాదు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు కమల్ హాసన్. ఈ సినిమాను మెటావర్స్ వెర్షన్లో రిలీజ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్ఎఫ్టీలు, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ మెటావర్స్ ద్వారా ఆడియెన్స్ ముందుకు వస్తున్న తొలి చిత్రంగా 'విక్రమ్' నిలవనుంది. దీనికి సంబంధించిన వివరాలను 'విస్టావర్స్' వెబ్సైట్లో అందుబాటులోకి తేనున్నారు. ఈ వెబ్సైట్లో పోస్టర్లు, ఇంటర్వ్యూలు, లేటేస్ట్ అప్డేట్స్ తదితర అన్ని విషయాలు ఉంటాయి. చదవండి: 👇 రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ? బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్ -
కౌబెక్.. ఏషియాలోనే మొదటి ఎడ్యుకేషన్ మెటావర్స్ క్రిప్టో ప్రాజెక్ట్
ఈమధ్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఎక్కువ మంది నోట నానుతున్న మాట క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో కాయిన్స్. ఎందుకు ఈ క్రిప్టోకరెన్సీ గురించి ఇంత మధ్య చర్చిస్తున్నారనేందుకు సింపుల్ ఉదాహారణగా శిబా ఐఎన్‌యూ కాయిన్ గురించి చెప్పుకోవాలి. ఈ కాయిన్ విలువ 2021 జనవరి 1న 100 డాలర్లు ఉంటే అదే ఏడాది అక్టోబరు నాటికి దాని విలువ 47 మిలియన్లకు చేరుకుంది. రియల్ ఎస్టేట్, బంగారం ఆఖరికి జాక్పాట్లో కూడా ఈ స్థాయి రిటర్నులు రావడం కష్టం. అందుకే అందరి దృష్టి క్రిప్టో కరెన్సీ మీద పడింది. క్రిప్టో కాయిన్లలో లాభాలు అధికంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు ఈ కాయిన్లను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎకనామిక్స్‌కి మరో ప్రత్యామ్నయంగా టోకెనామిక్స్ అనేట్టుగా పరిస్థితి మారింది. ఉదాహారణకు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ కర్ట్ ఏంజెల్, క్రికెటర్ క్రిస్‌గేల్ తదితరులు ఇప్పటికే ఇందులో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో కాయిన్ల వ్యవహారం అంతా సెలబ్రిటీలకేనా సామాన్యుల పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చింది కౌబెక్ ప్రాజెక్ట్. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై అమితమైన ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎంతో లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. ఏషియాలోనే మొదటి మెటావర్స్ క్రిప్టో ప్రాజెక్టుగా ముందుకు వచ్చిన కౌబెక్ ప్రాజెక్టు ఇప్పుడు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ, టోకెనామిక్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెటావర్స్, క్రిప్టో టోకెన్ల ట్రేడింగ్ అంశాల్లో లోతైన అవగాహన కల్పించే ఎడ్యుటెక్‌గా కౌబెక్ సేవలు అందిస్తోంది. ఇదే పరంపరలో కౌబెక్ ప్రాజెక్ట్ నుంచి కౌబెక్ టోకెన్లు మార్కెట్లోకి వచ్చాయి. విలువ తరగడమన్నదే లేకపోవడంతో అనతి కాలంలోనే సగానికి పైగా కాయిన్లు ఇప్పటికే అయిపోయాయి. కౌబెక్ ప్రాజెక్టు ప్రారంభమైన రెండు నెలల్లోనే కౌబెక్కు తొమ్మిది వేల మందికి పైగా హోల్డర్లు, 12 వేల మందికి పైగా సోషల్ మీడియా మెంబర్లను సాధించి ఇండియాలో టాప్ 10 క్రిప్టో సర్వీసెస్ జాబితాలో చోటు సాధించింది. అంతేకాదు ప్రఖ్యాతి చెందిన క్రిప్టో ఎక్సేంజీలైన కాయిన్ ఎక్సేంజీ వరల్డ్, కాయిన్స్ బిట్, కాయిన్గైకో, ఎల్ బ్యాంక్ తదితర చోట్లలో సుస్థిర స్థానం సాధించింది. కౌబెక్ ప్రాజెక్టులో డెవలపింగ్, మార్కెటింగ్ టీమ్స్ ప్రత్యేకంగా పని చేస్తున్నాయి. కౌబెక్ కాయిన్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు డిజిటల్ గురుకుల్ ఎడ్యుటెక్ కంపెనీతో ఒప్పందం జరిగింది. దీంతో డిజిటల్ గురుకుల్ 44,850 విద్యార్థులు ఆన్లైన్లో లావాదేవీలు జరిపేందుకు ఆస్కారం ఏర్పడింది. అంతేకాదు ఏషియాలో మరో 37 ఎడ్యుటెక్ సంస్థలతో కూడా సంప్రదింపులు సాగుతున్నాయి. 2022 మే 1 నుంచి కౌబెక్ స్టోర్ కూడా ప్రారంభమైంది. డాలర్ కౌబెక్ టోకెన్ చెల్లింపుల ద్వారా ఇక్కడ సేవలు/సర్వీసులు పొందే వీలుంది. (అడ్వెటోరియల్) -
మన ముందుకు మెటా ప్రపంచం.. ఎప్పటి నుంచి అంటే?
సోషల్ మీడియాలో ఫేస్బుక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కాలంలో ఇన్‌స్టా, ట్విటర్, టిక్‌టాక్‌లు సోషల్ మీడియాను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. ఇప్పుడు సోషల్ మీడియా కాదు ఏకంగా వర్చువల్ యూనివర్స్‌గా మెటావర్స్ తెస్తానంటున్నాడు మార్క్ జూకర్బర్గ్. దాదాపు ఏడాది కాలంగా మెటావర్స్ గురించి వింటున్నా చాలా మందికి ఇంకా అది కొరుకుడు పడని విషయంగానే ఉంది. దీన్ని గమనించిన జూకర్బర్గ్ మెటావర్స్ ఎక్సీపీరియన్స్ మరింత చేరువ చేసే పనిలో పడ్డారు. మెటావర్స్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్ అవసరం. లేటెస్ట్ సెన్సార్ల ఆధారంగా పని చేసే ఈ గ్యాడ్జెట్స్ ఉన్నప్పుడే మెటావర్స్ అనుభూతిని ‘ఫీల్’ అవగలం లేదంటూ వర్చువల్ రియాలిటీ, యానిమేషన్ వీడియోలకు మరో రూపం మెటావర్స్ అన్నట్టుగా ఉంటుంది. దీంతో మెటావర్స్ ఫీల్‌కు ఉపయోగపడే గ్యాడ్జెట్స్‌తో మెటాస్టోర్ను అందుబాటులోకి తెస్తున్నారు. కాలిఫోర్నియాలో బర్లింగేమ్ క్యాంపస్‌లో తొలి మెటాస్టోర్ని 2022 మే 9న ప్రారంభించబోతున్నారు. అదే విధంగా ఆన్లైన్ పోర్టల్ మెటాడాట్కామ్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో దొరికే గ్యాడ్జెట్స్‌ని కొనుగోలు చేసి ఉపయోగించిన తర్వాతే మెటావర్స్ మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మెటా గ్యాడ్జెట్స్ ఎంత ధరలో లభిస్తున్నాయనే అంశంపై ఇంకా పూర్తి వివరాలు జూకర్బర్గ్ రిలీజ్ చేయలేదు. చదవండి: యాపిల్ నుంచి కొత్తగా స్మార్ట్ బాటిల్స్! ధర ఎంతంటే? -
చలో చలో.. మెటాలోకం అంటున్న యూత్! మీకేం తెలుసు?
‘ఆహా! అలాగా!!’ అనే ఆశ్చర్యాలకు అంతు ఉండదు. ‘అసలు ఇది ఎలా సాధ్యం’ అనే ప్రశ్నలకు విరామం ఉండదు. ఊరిస్తున్న వర్చువల్ వరల్డ్ ‘మెటావర్స్’ యూత్లోకానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వినోదానికి పరిమితమైన ఆట కాదు. కాల్పానిక ప్రపంచంలో సేద తీరే పాట కాదు. యూత్ జీవనశైలిలో మెగా మార్పు తీసుకువచ్చే మెటావర్స్! నిన్నటి సైన్స్–ఫిక్షనే రేపటి కొత్త ఆవిష్కరణ అనే మాట అన్ని సందర్భాలలోనూ నిజమై ఉండకపోవచ్చుగానీ ‘మెటావర్స్’ వరకైతే నిజమే. నీల్ స్టీఫెన్సన్ అమెరికన్ సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్ (1992)’లో కనిపించిన ‘మెటావర్స్’ ఇప్పుడు యూత్ ఫేవరేట్ సౌండ్ అయింది. ఫేస్బుక్ తన కంపెనీ పేరును ‘మెటా’గా మార్చుకోవడం ఒక్కటి చాలు అది మెటావర్స్కు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పడానికి. భారీ ఖర్చుతో సరికొత్త డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే పనిలో భాగంగా ప్రపంచంలోనే వేగవంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ (ఏఐ రిసెర్చ్ సూపర్‌క్లస్టర్.. ఆర్ఎస్సీ) రూపొందించడం, యూనివర్సల్ స్పీచ్ ట్రాన్స్‌లేటర్(ఇన్స్టంట్ స్పీచ్–టు–స్పీచ్ ట్రాన్స్లెషన్: అన్ని భాషల్లో)... మొదలైనవి రూపొందిస్తుంది మెటా. కేవలం మెటా మాత్రమే కాదు రాబోయే కాలంలో రకరకాల మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ప్రభావంతో యువప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. వినోదరంగానికి వస్తే... టీవీ చూడడం కంటే మెటావర్స్ లోకంలోనే ఎక్కువ సమయం గడపడానికి యువతరం ఇష్టపడుతుందనేది ఒక అంచనా. ‘యూత్ వ్యూయర్షిప్ను కాపాడుకోవడానికి టీవి రంగం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఆకట్టుకునే విభిన్నమైన కంటెంట్‌ను సమకూర్చుకోక తప్పదు’ అంటున్నారు మాథ్యూ వర్నెఫోర్డ్. ఈయన మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు గేమ్స్‌ను సమకూర్చే ‘డూబిట్’ కో–ఫౌండర్. రాబోయే కాలంలో ‘ఫిట్నెస్ మెటావర్స్’ ట్రెండ్ ఊపందుకోబోతుంది. ‘వెల్టు డూ 2022 కన్జ్యూమర్ వెల్నెస్ట్రెండ్’ రిపోర్ట్ ప్రకారం యంగ్ ఫిట్నెస్ ప్రేమికులు సంప్రదాయ జిమ్‌లలో కంటే వర్చ్వల్లోనే ఉత్తేజకరమైన వర్కవుట్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకుంటారు. ‘మ్యూజిక్, విజువల్స్, వేరుబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్...మొదలైన వాటిని ఒకే వేదికపై తీసుకు రావడం ద్వారా మెటావర్స్‌లో జిమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫిట్నెస్ ఆర్గనైజేషన్స్ కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ అవుతారు’ అంటుంది రిపోర్ట్, ఇన్–పర్సన్ ఇంటర్వ్యూలు, జూమ్ కాల్స్ కాలంలో ఉన్న కుర్రకారు రిప్రెజెంటేటివ్ అవతార్‌ను ఎంచుకొని, వర్చువల్ వేదికపై ఇంటర్వ్యూలకు వెళ్లే రోజులు వస్తున్నాయి. సోషల్ మెటావర్స్ స్టార్టప్ ఫామ్ ‘వన్ ఎబౌ’ పేరుతో ‘వాక్–ఇన్ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్’ను లాంచ్ చేసింది. క్యాండిడేట్ ప్లాట్‌ఫామ్‌పై క్లిక్ చేయడంతో ఇంటర్వ్యూ ప్రదేశంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఉన్న 45 ఆప్షన్లలో తనను బెస్ట్‌గా రిప్రెజెంట్ చేసే అవతార్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వర్చువల్ లాబీ నుంచి హెచ్ఆర్ రిప్రెజెంటేటివ్ వీరికి స్వాగతం పలుకుతూ రిక్రూటింగ్‌కు ప్యానల్‌కు పరిచయం చేస్తారు. ‘దైవిక శక్తులలాంటి శక్తులతో మెటావర్స్‌తో ఎవరికి వారు తమదైన ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు’ అని ఊరిస్తున్నాడు మార్క్ జుకర్ బర్గ్. -
ఎన్టీఎఫ్లలో కేజీఎఫ్ 2 హవా
కేజీఎఫ్ సినిమాతో హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు అందులో పాత్రలకు ప్రత్యేకంగా ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో కేజీఎఫ్ 2 సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా నాన్ ఫంజిబుల్ టోకెన్లు, కేజీఎఫ్వెర్స్ను నిర్మాతలు అందుబాటులోకి తెచ్చారు. కేజీఎఫ్ సినిమాలో కీలకమైన ఎల్డోరాడో క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని పది వేలకు పైగా నాన్ ఫంజిబుల్ టోకెన్లను (ఎన్ఎఫ్టీ) మార్కెట్లో రిలీజ్ చేయగా కేవలం గంట వ్యవధిలోనే ఐదు వందల ఎన్ఎఫ్టీ టోకెన్లు అమ్ముడయ్యాయి.ఇప్పటి వరకు రెండు వేలకు పైగా టోకెన్లు అమ్ముడైపోయాయి. వివిధ రకాలైన కళలకు డిజిటల్ రూపమే నాన్ ఫంజిబుల్ టోకెన్లు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ ఎన్ఎఫ్టీ లావాదేవీలు జరుగుతుంటాయి. మిగిలిన టెక్నికల్ రూపాలకంటే కూడా ఎన్ఎఫ్టీలలో భద్రత అధికం. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్లను భవిష్యత్తుల అమ్ముకోవచ్చు కూడా. కేజీఎఫ్ ఎన్ఎఫ్టీ టోకెన్లు సొంతం చేసుకున్న వారు వాటి సాయంతో కేజీఎఫ్వర్స్లోకి (మెటావర్స్)లోకి వెళ్లి వర్చువల్ 3డీ వరల్డ్‌లో కేజీఎఫ్‌లోని అద్భుతాలను చూసే అవకాశం ఉంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ విస్త్రృతమైన తర్వాత సినిమాల ప్రమోషన్లలో ఎన్ఎఫ్టీలు కూడా ఓ భాగమయ్యాయి. అమితాబ్ బచ్చన్, రామ్‌గోపాల్ వర్మ వంటి వారు ఇప్పటికే ఈ రంగంలో అడుగు పెట్టారు. రాధేశ్యామ్ ట్రైలర్‌ని మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. ఈ పరంపరలో కేజీఎఫ్ నిర్మాతలు సైతం ఎన్ఎఫ్టీల రూపంలో ఈ కొత్త ప్రచారానికి ముందుకు రాగా మంచి స్పందన వచ్చింది. చదవండి: సింగర్ కార్తీక్ తొలి అడుగు.. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మెటావర్స్ కాన్సెర్ట్ -
సింగర్ కార్తీక్ సాహసం.. లైవ్ కాన్సెర్ట్లను కాదని..
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలెగా.... అంటూ యువతరాన్ని ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ మ్యూజిక్ కాన్సెర్ట్లలో కొత్త ఒరవడికి తెర లేపారు. దేశంలోనే తొలిసారిగా మెటావర్స్ కాన్సెర్ట్ నిర్వహించేందుకు రెడీ అయ్యాడు. అంతేకాదు ఈ కాన్సెర్ట్‌లో ఆలపించిన గీతాలను నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా (ఎన్ఎఫ్టీ) మార్చి తన అభిమానులకు అందివ్వనున్నాడు. ఏప్రిల్ 14న సింగర్ కార్తీక్ నిర్వహించే మెటావర్స్ కాన్సెర్ట్ 2022 ఏప్రిల్ 14న జరగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాల్గొనాలంటే ప్రత్యేకంటా టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్టు ధర రూ. 29,000లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో క్రిప్టో చెల్లింపులతో పాటు డెబిట్, క్రెడిట్, యూపీఏ పేమెంట్స్ ద్వారా ఈ టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై పని చేస్తున్న జూపిటర్మెటా సంస్థ ఈ కాన్సెర్ట్‌కి సంబంధించి డిజిటల్ వర్క్స్ అన్నింటీని పర్యవేక్షిస్తోంది. 45 నిమిషాలు మెటావర్స్ ఫ్లాట్‌ఫామ్‌పై దేశంలోనే తొలిసారిగా జరగబోతున్న ఈ కాన్సెర్ట్‌లో సింగర్ కార్తీక్ తాను స్వయంగా బాణీకట్టి ఆలపించిన గీతాలను పాడబోతున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ కాన్సెర్ట్ కొనసాగనుంది. ఈ కాన్సెర్ట్‌లో పాడిన గీతాలలో రెండు పాటలను వీక్షకులకు ఎన్ఎఫ్టీలుగా అందివ్వనున్నారు. ఇక ఈ మెటావర్స్ కాన్సెర్ట్‌లో పాల్గొనే వారికి చేతులు ఊపడం, చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం వంటి అన్ని పనులు చేస్తూ ప్రత్యక్ష అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మెటావర్స్ ? ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ మేథ నుంచి పుట్టిన మరో అద్భుతం మెటావర్స్. ఎక్కడెక్కడో ఉన్న జనాలు తమ ముందున్న ఫోన్ల ద్వారానే ఒకే చోట ఉన్నట్టుగా అనూభూతి కలిగించడమే సింపుల్‌గా మెటావర్స్‌గా పేర్కొనవచ్చు. అంటే మీరు మీ ఇంట్లో ఉంటూనే లైవ్ కాన్సెర్ట్‌లో ప్రత్యక్షంగా భాగం అయ్యే ఛాన్స్ మెటావర్స్ కలిగించనుంది. అందరికీ సాధ్యమేనా? మెటావర్స్, ఎన్ఎఫ్టీ కాన్సెప్టులు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల రాధేశ్యామ్ ట్రైలర్ సైతం మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. అంతకు ముందు సింగర్ దలేర్ మెహందీ 2022 జనవరి 26న ఇండియాలోనే ఫస్ట్మెటావర్స్ కాన్సెర్ట్ నిర్వహించారు. అయితే మెటావర్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మెటావర్స్ అనుభూతి పొందేందుకు అవసరమైన స్పీడ్ ఇంటర్నెట్, వివిధ రకాలైన సెన్సార్లు కలిగిన ఫోన్లు, వీఆర్ హెడ్ సెట్ తదితర విషయాలు మరింత మెరుగు కావాల్సి ఉంది. చదవండి: డేటాకు ‘మెటావర్స్’ దన్ను.. -
మెటావర్స్‌లో భూమిని కొన్న దలేర్ మెహందీ.. దేశంలోనే రికార్డు!
మీరు అవతార్ సినిమా చూశారా? అందులో హీరో అతని టీం ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ వేసుకుని తమ అవతార్ వెర్షన్‌ని పండోరా గ్రహానికి తగ్గట్లు మార్చేసుకుంటారు. అంటే వాళ్లు రియాలిటీలో వేరేగా ఉన్నా, మరో చోట, మరో రూపంలో పండోర వాసులతో కలిసి బతుకుతుంటారు. ఫైటింగ్‌లు చేస్తారు. ప్రేమలూ నడుస్తాయి. ఆ పాత్ర జీవితం అంతా ఒట్టిదే అని తెలుసు. అయినా సరే ఎంజాయ్ చేస్తాం. మెటావర్స్ కూడా అంతే ఇదొక డిజిటల్ ప్రపంచం. ఇందులో మనకు నచ్చినట్లు బతక వచ్చు. కానీ, ఇది ఒక డిజిటల్ ప్రపంచం. మెటావర్స్ అనేది నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీ. ఓ రకంగా చెప్పాలంటే ఫ్యూచరిస్టిక్ త్రీడి ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. ఫిజికల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కలిసిందే మెటావర్స్. అయితే, అలాంటి మెటావర్స్‌లో ప్రముఖ ఇండియన్ సింగర్ దలేర్ మెహందీ భూమిని కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. దీంతో, దలేర్ మెహందీ ఒక రికార్డు సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా మెటావర్స్‌లో భూమిని కొన్న వ్యక్తిగా మెహందీ నిలిచారు. మెటావర్స్‌లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ సెలబ్రిటీగా చరిత్ర సృష్టించాడు. అతను ట్రావిస్ స్కాట్, జస్టిన్ బీబర్, మార్ష్‌మల్లో, అరియానా గ్రాండే వంటి అంతర్జాతీయ కళాకారుల లిస్టులో చేరాడు. వీరు మెటావర్స్‌లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు, డాలర్ మెటా-యూనివర్స్‌లో తన కోసం భూమిని కొనుగోలుచేసినట్లు తెలిపాడు. మెటావర్స్‌లో కొనుగోలు చేసిన భూమికి "బల్లె బల్లె" అని పేరు పెట్టారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో ప్లేయబుల్ ఎన్ఎఫ్టిలతో కూడిన ఈ వేదికను హైదరాబాద్ నగరానికి చెందిన గేమ్ స్టూడియో గమిత్రోనిక్స్ రూపొందించింది. (చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి మహీంద్రా తీపికబురు.. ఈ ఏడాదిలోనే!) -
డార్లింగ్ ప్రభాస్.. రాధేశ్యామ్.. హాలీవుడ్ కంటే ముందుగా..
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ రిలీజ్‌కి ముందే అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా మెటావర్స్ వెర్షన్ ట్రైలర్‌ని లాంచ్ చేసింది. రాధేశ్యామ్ సినిమాలో భూత, వర్తమాన, భవిష్యత్తులను చెప్పే వ్యక్తిగా కనిపిస్తున్న ప్రభాస్.. తన సినిమాని ఫ్యూచర్ టెక్నాలజీగా చెప్పుకుంటున్న మెటావర్స్‌లో రిలీజ్ చేశారు. మార్క్ జుకర్‌బర్గ్ మరో అద్భుత సృష్టి మెటావర్స్. వాస్తవ ప్రపంచం రూపు రేఖలను మెటావర్స్ మార్చేయగలదని టెక్ నిపుణులు చెప్పుకుంటున్నారు. వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో ఓ కొత్త ప్రపంచపు అనుభూతిని కలిగించడమే మెటావర్స్ ప్రత్యేకత. History has been made! For the first time ever in the history of cinema, a film trailer has been launched in the metaverse. Click on the link for an enthralling experience! #RadheShyamOnMetaversehttps://t.co/J3BCANbeEf — Radhe Shyam (@RadheShyamFilm) March 3, 2022 రాధేశ్యామ్ మెటావర్స్ ట్రైలర్‌ని 2022 మార్చి 3న చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. మెటావర్స్‌లో చూసేందుకు వీలుగా లింక్ కూడా ఇచ్చారు. మెటావర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొన్ని ప్రత్యేక యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు వీఆర్ హెడ్సెట్, ఇయర్‌ఫోన్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఇంకా ప్రారంభ దశలోనే ఈ టెక్నాలజీలో ట్రైలర్ రిలీజ్ చేసి కొత్త సంప్రదాయానికి చిత్ర యూనిట్ తెర లేపింది. 🙌Congrats to the entire #RadheShyam team on an incredible movie premier in @spatialxr! We're honored to host all 90k+ that have joined your space for this experience! @TSeries @hegdepooja @director_radhaa @UV_Creations@RedGiantMovies_ @RadheShyamFilm #RadheShyamOnMetaverse pic.twitter.com/IDzldinEKB — Spatial (@spatialxr) March 3, 2022 మెటావర్స్ వినియోగించేందుకు ఇండియన్ సెలబ్రిటీలు పోటీ పడుతున్నారు. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ పాప్ సింగర్ దలేర్ మెహందీ తొలిసారిగా మెటావర్స్‌లో లైవ్ కన్సర్ట్ ఇచ్చారు. ఇంకా ఆ వేడి చల్లారకముందే డార్లింగ్ ప్రభాస్ తన సినిమా ట్రైలర్ మెటావర్స్‌లో అందించించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్‌కి భారత సినిమా ఏమాత్రం తీసిపోదని నిరూపించారు. చదవండి: డేటాకు ‘మెటావర్స్’ దన్ను.. -
టెక్ మహీంద్రా భారీ స్కెచ్.. వెయ్యి మందితో అదిరిపోయే ప్లాన్
ఫ్యూచర్ టెక్నాలజీగా అందరిచేత అభివర్ణించబడుతున్న మెటావర్స్‌పై ఫోకస్ చేసింది టెక్ మహీంద్రా. మిగిలిన కంపెనీల కంటే ముందుగానే మెటావర్స్‌పై పట్టు సాధించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. హైదరాబాద్ వేదికగా ప్లాన్ అమలు కానుంది. మెటావర్స్ రంగంలో పని చేసేందుకు ప్రత్యేకంగా వెయ్యి మంది ఇంజనీర్లను ఎంపిక చేసింది టెక్ మహీంద్రా. ఈ గ్రూప్‌కి టెక్ఎంవర్స్గా పేరు పెట్టింది. ఈ గ్రూపుకి చెందిన ఇంజనీర్లు మెటావర్స్ ఆధారిత సేవలపై పని చేస్తారు. హైదరాబాద్, పూనే, డల్లాస్, లండన్ వేదికగా నాలుగు టీమ్‌లను టెక్ఎంవర్స్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్‌చెయిన్, 5జీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాల్టీ, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర టెక్నాలజీతో మెటావర్స్ సమ్మిళతం చేస్తూ సరికొత్త బిజినెస్ మోడళ్లను రూపొందించడం టెక్ఎంవర్స్లు ప్రధాన బాధ్యతలు. సంక్లిష్టమైన ఈ పనిని సుళువుగా చేసి భవిష్యత్తుకు అనుగుణంగా బిజినెస్‌ను విస్తరించేందుకే ఈ వెయ్యిమందితో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసింది టెక్ మహీంద్రా. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్, మెటా బ్యాంక్ (వర్చువల్ బ్యాంక్), గేమింగ్ సెంటర్, మెటావర్స్ బేస్డ్ కార్ డీలర్షిప్, మిడిల్మిస్ట్ తదితర అనేక ఆవిష్కరణలకు మెటావర్స్‌లో చోటుంది. మెటావర్స్‌తో మన రియాల్టీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తాయి. అందుకు అనుగుణంగా మా ప్రణాళికలు ఉంటాయని టెక్ మహీంద్రా ప్రతినిధుతులు తెలిపారు. చదవండి: భవిష్యత్తు మెటావర్స్‌దే అంటున్న గార్ట్నర్ -
పబ్జీకి చుక్కలే.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై కొత్త గేమ్.. ఊహించని రివార్డులు
హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ గేమింగ్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనాలకు తెర తీస్తోంది. బ్లాక్ చెయిన్ , మెటావర్స్ టెక్నాలజీను అనుసంధానం చేస్తూ సరికొత్త గేమ్‌ని రూపొందించింది. ఈ గేమ్‌లో హై లెవల్స్‌కి వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను బహుమతిగా గెలుచుకోవచ్చు. ఇలా గెలుచుకున్న టోకెన్లను క్రిప్టో ఎక్సేంజీల్లో సొమ్ము చేసుకోవచ్చు. యూత్ టార్గెట్ చేసి మరీ ఈ గేమ్‌ని మార్కెట్లోకి తెస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన బ్లాక్ చెయిన్ స్టార్టప్ క్లింగ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాక్సే ఇన్ఫినిటీని స్ఫూర్తితో సరికొత్త గేమ్‌ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి బీటా వెర్షన్ 2022 మార్చిలో రిలీజ్ చేయనుంది. ఆ తర్వాత 2022 జూన్‌లో ఫుల్ వెర్షన్‌ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ గేమ్‌లో పలు స్థాయిల్లో విజేతలుగా నిలిచిన వారికి క్లింగ్ టోకెన్లను జారీ చేస్తారు. ఈ టోకెన్లను మనీ మార్చుకునేందుకు వీలుగా పాన్కేక్ స్వాపింగ్ డీ సెంట్రలైజ్డ్ ఎక్సేంజీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు హాంగ్‌కాంగ్, కజకిస్తాన్, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లలో కూడా ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఇండియాలో ఎంతో ఫేమస్ పబ్జీ. ఈ గేమ్‌లో చికెన్ డిన్నర్ వంటి గిఫ్ట్‌లు, ఒకేసారి టీమ్‌లుగా అడుతూ ఛాలెంజ్‌లు బెట్టింగ్‌లు చేసుకునే వీలుంది. ఆన్లైన్లో ఒకేసారి చాలా మంది ప్లేయర్లు కూడా ఆడొచ్చు. ఇక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తీసొకొచ్చే గేమ్‌లో మెటావర్స్ టెక్నాలజీని పొందు పరిచారు. దీంతో వర్చువల్ రియాల్టీలో ఒకే సారి ఎక్కువ మంది ఈ గేమ్ ఆడే వీలుంటుంది. అంతేకాదు చాలా కఠినంగా ఉండేలా గేమ్‌ని రూపొందించారు. ఈ గేమ్‌లో పై స్థాయిలకు వెళితే క్లింగ్ టోకెన్లు పొందవచ్చు. -
డేటాకు ‘మెటావర్స్’ దన్ను..
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవస్థ క్రమంగా మెటావర్స్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరగనుంది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది 20 రెట్లు వృద్ధి చెందనుంది. దేశీయంగా కూడా ఇదే ధోరణి కారణంగా.. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. క్రెడిట్ సూసీ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వర్చువల్ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగించే మెటావర్స్ వల్ల యూజర్లు స్క్రీన్ చూడటంపై వెచ్చించే సమయం పెరగనుండటంతో.. డేటా వినియోగానికి గణనీయంగా ఊతం లభిస్తుందని పేర్కొంది. ‘ఇంటర్నెట్ వినియోగంలో 80 శాతం భాగం వీడియోలదే ఉంటోంది. ఇది వార్షికంగా 30 శాతం మేర వృద్ధి చెందుతోంది. మెటావర్స్‌ను ఒక మోస్తరుగా వినియోగించినా .. దీనివల్ల డేటా యూసేజీ, వచ్చే దశాబ్దకాలంలో ఏటా 37 శాతం చొప్పున వృద్ధి చెంది, ప్రస్తుత స్థాయి కన్నా 20 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక తెలిపింది. మెటావర్స్‌కి సంబంధించిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీల వినియోగం భారీగా పెరగనుందని వివరించింది. బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకం.. మెటావర్స్ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకమని క్రెడిట్ సూసీ తెలిపింది. ప్రజలు రోజూ అత్యధిక సమయం మొబైల్‌ను వినియోగించే టాప్ దేశాల్లో భారత్ కూడా ఉన్నప్పటికీ.. మిగతా దేశాలతో పోలిస్తే ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇక్కడ తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో దీని విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతానికి పెరగవచ్చని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉంది. ‘భారతీయ టెల్కోల ఆదాయాలపై మెటావర్స్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ .. మెటావర్స్ ప్రేరిత డేటా వినియోగం దన్నుతో ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో భారతి ఎయిర్టెల్ (ఆదాయాల్లో బ్రాడ్‌బ్యాండ్ వాటా 17 శాతం), జియో గణనీయంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాం‘ అని క్రెడిట్ సూసీ తెలిపింది. 6జీతో మరింత ఊతం .. మెటావర్స్ వ్యవస్థకు 5జీ టెలికం సర్వీసులు తోడ్పడనున్నప్పటికీ దీన్ని మరిన్ని అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చేందుకు 6జీ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మిగతా విభాగాలతో పోలిస్తే ఎక్కువగా గేమింగ్ సెగ్మెంట్లో మెటావర్స్ వినియోగం ఉండవచ్చని పేర్కొంది. దేశీయంగా గేమింగ్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్ఫోన్లు, 4జీ డేటా సర్వీసుల కారణంగా అధిక స్థాయిలో గేమింగ్.. మొబైల్ ఫోన్ల ద్వారానే ఉంటోందని వివరించింది. ‘స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల ఆన్లైన్ వినియోగానికి భారత యూజర్లు.. మొబైల్ ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమ్స్‌కు సంబంధించి మొబైల్ గేమింగ్ వాటా భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయి‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. -
వర్క్, షాపింగ్, ఎడ్యుకేషన్ అన్నింటికీ మెటావర్స్ !
ఫేస్బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్ మరో అద్భుత ఆవిష్కరణగా చెప్పుకుంటున్న మెటావర్స్‌తో త్వరలో ప్రపంచం మారిపోనుందని చెబుతోంది ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్. మెటావర్స్‌తో వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ వంటి టెక్నాలజీ ప్రజలకు మరింత సన్నిహితం కానుంది. దీంతో వర్క్, షాపింగ్, ఎడ్యుకేషన్ ఇలా అనేక రకాల పనులు మెటావర్స్‌లోనే ఎక్కువగా జరుగుతాయంటూ గార్ట్నర్ అంటోంది. 2026 చివరి నాటికి భూగోళంలో ఉన్న ప్రతీ నలుగురిలో ఒకరు ప్రతీ రోజు కనీసం గంట సమయమైన మెటావర్స్‌పై గడపకతప్పదని జోస్యం చెబుతోంది. భవిష్యత్తు మెటావర్స్‌దే అని జుకర్‌బర్గ్ నమ్మకంగా చెబుతున్నారు. ఫేస్బుక్ పేరును సైతం మెటాగా మార్చేశారు. వాల్‌మార్ట్ వంటి బడా సంస్థలు సైతం మెటావర్స్ టెక్నాలజీకి అనుగుణంగా తమ షాపింగ్ సెంటర్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ కామర్స్ వచ్చిన తర్వాత షాపింగ్ తీరుతెన్నులు మారిపోయినట్టే మెటావర్స్ మన జీవిన విధానంలో పెను మార్పులు తేవడం ఖాయమని గార్ట్నర్ అంటోంది. చదవండి: ఫేస్బుక్ మెటావర్స్‌తో మహిళలు, పిల్లలకు ప్రమాదం -
Metaverse: కనీవినీ ఎరుగని రీతిలో సామూహిక అత్యాచారం
ప్రపంచంలో ఏదో ఒక మూల.. ప్రతీ నిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు మృగాల చేతిలో చితికిపోతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన.. బహుశా ఇది వరకు విని, చదివి ఉండరు. వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఆడవాళ్ల భద్రతపై అనుమానాల్ని పెంచే ఘటన ఇది. పైగా అవి మరింత ఘోరంగా.. ఆందోళనకరంగా ఉంటాయనే విషయాన్ని రుజువు చేసింది ఇది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(43).. ఫేస్బుక్ మెటావర్స్ ‘హోరిజోన్ వెన్యూస్’పై సంచలన ఆరోపణలకు దిగింది. ఆ వేదికపై తాను గ్యాంగ్‌రేప్‌నకు గురయ్యానని ఆమె ఫిర్యాదు చేసింది. వర్చువల్ వరల్డ్‌లోకి జాయిన్ అయిన నిమిషానికే.. తనను ముగ్గురు-నలుగురు (మేల్ అవతార్స్) చుట్టుముట్టి బలాత్కారం చేశారని, ఆపై ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు సైతం తీశారని ఆమె వాపోయింది. ఆర్తనాదాలు. అరణ్యరోదనే! అఘాయిత్యం జరుగుతున్న టైంలో తను గట్టిగట్టిగా అరిచినా.. స్పందన కరువైందని ఆమె వాపోయింది. ఆ సమయంలో చాలామంది లాగిన్‌లో ఉన్నారు. కానీ, నా అరుపులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా నా అవతార్ మీద ఘాతుకానికి పాల్పడ్డ మగ అవతార్లు మృగాళ్లా ప్రవర్తించాయి. దుర్భాషలాడాయి.. నాపై దాడి చేశాయి. దుస్తులు చించేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడానికే నాకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆ భయంకరమైన అనుభవంతో వెంటనే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తీసేసి, లాగౌట్ అయ్యానని ఆమె పేర్కొంది. ఇక ఘటనపై తన అనుభవాన్ని ఓ బ్లాగ్‌లో పంచుకున్న బాధితురాలు. వర్చువల్ ఘటనను అనవసరంగా సీన్ చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, వాస్తవాల నుంచి వర్చువల్ అనుభవాలు వేరు చేయలేవని ఆమె అంటోంది. అందుకే వర్చువల్ ప్రపంచంలోనూ అనుభవాలకు 'వాస్తవికత' ఉంటుందని పేర్కొంది. వర్చువల్ రియాలిటీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు.. అక్కడ వాస్తవికతకు ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలని, తనకు ఎదురైన అనుభవం వర్చువల్ ప్రపంచంలోనూ మరెవరికీ ఎదురు కాకూడదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించని ఫేస్బుక్ మెటావర్స్.. భద్రత విషయంలో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక ప్రకటనతోనే సరిపెట్టింది. సంబంధిత వార్త: పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని’!! -
మైక్రోసాఫ్ట్ చేతికి యాక్టివిజన్
న్యూయార్క్: గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా గేమింగ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలుకి తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 69 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 5.15 లక్షల కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలు ద్వారా మొబైల్, పీసీ, కన్సోల్, క్లౌడ్ విభాగాల్లో గేమింగ్ బిజినెస్‌ను మరింత విస్తరించుకునే వీలుంది. డీల్‌ను క్యాండీ క్రష్, వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్ తదితర పలు సుప్రసిద్ధ గేములను రూపొందించిన కంపెనీ కొనుగోలులో భాగంగా షేరుకి 95 డాలర్ల చొప్పున ధరను చెల్లించనుంది. వారాంతాన ముగింపు ధరతో పోలిస్తే ఇది 45 శాతం ప్రీమియం. డీల్ పూర్తయ్యేవరకూ యాక్టివిజన్ ప్రస్తుత సీఈవో బాబీ కొటిక్ ఆ పదవిలో కొనసాగనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. తదుపరి మైక్రోసాఫ్ట్ గేమింగ్ హెడ్ ఫిల్ స్పెన్సర్ అధ్యక్షత వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మహిళా ఉద్యోగులపై వేధింపుల సంబంధిత కేసుల నేపథ్యంలో ఇటీవల యాక్టివిజన్ షేరు డీలా పడినట్లు పరిశ్రమ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. యాక్టివిజన్ కొనుగోలుతో ఎక్స్‌బాస్ కన్సోల్ ఆఫరింగ్స్‌ను మైక్రోసాఫ్ట్ మరింత విస్తరించనుంది. తద్వారా సోనీ కార్ప్ ప్లేస్టేషన్‌తో మరింత సమర్థంగా పోటీ పడే అవకాశమున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.