Meteorological Centre
-
బలపడుతున్న వాయుగుండం
Cyclone dana: తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పారాదీప్‌కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24వ తేదీకి తుపానుగా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 24వ తేదీన పూరి–పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.తుపాను కారణంగా నేడు, రేపు పలు రైళ్లు రద్దురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేకు ‘దనా’ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. నేడు రద్దయిన రైళ్లు కామాఖ్య–బెంగళూరు (12552), సిల్చార్–సికింద్రాబాద్ (12514), డిబ్రుగర్–కన్యాకుమారి (22504), సికింద్రాబాద్–భువనేశ్వర్ (17016), చెన్నై సెంట్రల్–హౌరా (12840), పుదుచ్చేరి–హౌరా (12868), చెన్నై సెంట్రల్–షాలీమార్ (22826), పుదుచ్చేరి–భువనేశ్వర్ (12897), బెంగళూరు–భువనేశ్వర్ (18464), ముంబై–భువనేశ్వర్ (11019), బెంగళూరు–గౌహతి (12509), హైదరాబాద్–హౌరా (18046), కన్యాకుమారి–డిబ్రుగర్ (22503), సికింద్రాబాద్–హౌరా (12704), బెంగళూరు–హౌరా (22888), సికింద్రాబాద్–మాల్దాటౌన్ (03429), యశ్వంత్‌పూర్–హౌరా (12864), తిరునెల్వేలి–షాలీమార్ (06087) రైళ్లను బుధవారం పూర్తిగా రద్దు చేశారు. రేపు రద్దయ్యే రైళ్లు... హౌరా–సికింద్రాబాద్ (12703), ఖరగ్‌పూర్–విల్లుపురం (22603), హౌరా–భువనేశ్వర్ (12073), షాలీమార్–హైదరాబాద్ (18045), సత్రగచ్చి–మంగుళూరు సెంట్రల్ (22851), షాలీమార్–చెన్నై సెంట్రల్ (12841), హౌరా–తిరుచ్చిరాపల్లి (12663), హౌరా–బెంగళూరు (12863), షాలీమార్–వాస్కోడిగామా(18047), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), పాట్నా–యర్నాకులం (22644), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (06090), చెన్నై సెంట్రల్–హౌరా (12842), చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (22808), బెంగళూరు–ముజఫర్‌పూర్ (15227), తాంబరం–సత్రగచ్చి (06095), బెంగళూరు–హౌరా (12246), పూరి–తిరుపతి (17479) రైళ్లను 24న పూర్తిగా రద్దు చేశారు. -
నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరం, పశి్చమ–మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీంతో బుధవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంది. దేవరుప్పులలో 11.5 సెం.మీ. మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 10.9 సెం.మీ., దామరచర్ల మండలం తిమ్మాపూర్ లో 9.9, శాలిగౌరారంలో 9.1, రంగారెడ్డి జిల్లా నాగోల్‌లోని రాక్‌టౌన్ కాలనీలో 8.9, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉదిత్యాల్లో 8.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండ లం మండలపల్లిలో 8.7, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో 8.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఊళ్లు.. నీళ్లు.. కోస్తా కకావికలం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కోస్తా జిల్లాలు వణికిపోయాయి. వర్షపు నీరు వాగులా మారి రోడ్లపై ప్రవహిస్తుండడంతో విజయవాడ నగరం పూర్తిగా స్తంభించింది. మచిలీపట్నంలోనూ అదే పరిస్థితి నెలకొంది. విజయవాడ మొగల్రాజపురంలో ఇళ్లపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మంగళగిరిలో కొండరాయి తలపై పడి ఓ వృద్ధురాలు మరణించింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని మురికివాగులో కారు కొట్టుకుపోవడంతో ఓ టీచర్, ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడడంతో అమ్మవారి దేవస్థానం కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భూపరిపాలన కమిషనర్ జయలక్ష్మి నేతృత్వంలో 19 మంది అధికారులతో కమిటీని నియమించింది. మచిలీపట్నం, విజయవాడలో అన్ని ప్రధాన రోడ్లు, వీధులు, సందులు, ఖాళీ స్థలాలు వరద ప్రవాహంతో నిండిపోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో కొండ చరియలు ఇళ్లపై విరిగి పడటంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక విద్యార్థి ఉన్నారు. నలుగురు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులను నవుడు మేఘన (25), బోలెం లక్ష్మీ(49), పుర్కట్ లాలో (38), జంపాన అన్నపూర్ణ (55), కమ్మరి సంతోషాచారి (18)గా గుర్తించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన యశ్వంత్ అనే విద్యార్థి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఘటన స్థలం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కొండ రాళ్లను తొలగించి యశ్వంత్ ఆచూకీ నిర్ధారించాల్సిందిగా పొలీసులను కోరారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం లేదని, పెద్ద రాళ్లను తొలగించటం సాధ్యం కాదని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం పెద్ద రాళ్లను తొలగిస్తే తప్ప నిర్ధారణకు రాలేమన్నారు. మరోసారి కొండ చరియలు విరిగి పడే సూచనలు కనిపిస్తుండటంతో సహాయ బృందాలు పలు ఇళ్లలో ప్రజలను ఖాళీ చేయించాయి. కాయ కష్టం చేసుకుని జీవించే వారంతా ఈ ఘటనతో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో సమాచార కేంద్రం, డోనార్ సెల్ ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాలతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి మిరప పైర్లు నీట మునిగిపోయాయి. పసుపు, అరటి, కూరగాయ తోటలు ముంపుబారిన పడ్డాయి. మెట్ట రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం యనమలకుదురులో కొండ చరియలు విరిగిపడి షెడ్డు ధ్వంసం కావడంతో 20 జీవాలు మృత్యువాత పడ్డాయి. విజయవాడలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా 8181960909 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ⇒ ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గుంటూరులో వర్షం బీభత్సం సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 250 నుంచి 399 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రోడ్లు జలాశయాలుగా మారాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కలకత్తా–చెన్నై రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కాజా టోల్గేట్ వద్ద నాలుగు అడుగుల మేర వరద ప్రవాహంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పెదకాకాని మండలం ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో నంబూరు ప్రైవేట్ విద్యాసంస్థలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నడుంపల్లి రాఘవేంద్రరావు(39), విద్యార్థులు పసుపులేని సౌదీస్ (6), కోడూరి మాన్విత్(9) మృత్యువాత పడ్డారు. మంగళగిరి కొత్తపేటలో కొండ చరియ విరిగి పడి రూకా నాగరత్నమ్మ (85) గాయాల పాలై మృతి చెందింది. ⇒ పల్నాడు జిల్లాలో 28 మండలాల పరిధిలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అచ్చంపేట మండలంలో దోసపాటి చెరువుకు గండి పడింది. ⇒ ఏలూరు జిల్లాలో కరాటం కృష్ణమూర్తి జల్లేరు జలాశయంలోకి వరద పోటెత్తింది. నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడి పొలాలు ముంపునకు గురయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లాలో శనివారం చలిగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నెమలి గుండ్లరంగనాయకస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన 40 మంది భక్తులు చిక్కుకుపోయారు. ⇒ బాపట్ల జిల్లా పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఐదువేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ⇒ శ్రీకాకుళం జిల్లాలో రోజంతా జల్లులు పడటంతో వాగులు, చెరువులు ఉరకలెత్తుతున్నాయి. కడలి కల్లోలంగా మారింది. ⇒ వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో అత్యధికంగా 97 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కర్నూలు జిల్లాను ముసురు కమ్మేసింది. జిల్లా మొత్తంగా సగటున 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ⇒ విశాఖలో శనివారం గరిష్టంగా సగటున 50 మి.మీ వర్షపాతం నమోదైంది.అష్ట దిగ్బంధంలో అమరావతిసాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: జోరు వర్షాలకు రాజధాని అమరావతి ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాజధానిని వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొండవీటి వాగు ఉప్పొంగడంతో హైకోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. ఎస్ఆర్ఎం, విట్ వర్సిటీలు, పలు నివాస భవనాలు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ మండలం లాం గ్రామం వద్ద అమరావతి– గుంటూరు ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు ఉప్పొంగడంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయ్యన్న వాగు, పాలవాగు కూడా పొంగి పొర్లుతున్నాయి. దొండపాడు టిడ్కో గృహాల వద్ద నీరు చేరడంతో బయటకు వచ్చే పరిస్థితి లేక అల్లాడుతున్నారు. నెక్కల్లు వద్ద వాగులో ఓ ఆటో గల్లంతు కావడంతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ట్రాక్టరుపై వెళ్లి తాడు సాయంతో ముగ్గురిని రక్షించారు. అమరావతి ప్రాంతంలో ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. చెరువులు ప్రమాదకర పరిస్థితికి చేరాయి. కొండవీటి వాగు గట్టుపై నుండి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగులో భారీగా జమ్ము, తూటికాడ అడ్డం పడుతుండటంతో నీరు ముందుకు కదలటం లేదు. దీంతో ఎగువ నుండి వస్తున్న వరద నీరంతా వెనక్కి తన్ని గ్రామాలు, పొలాల్లోకి వస్తోంది. దీంతో రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో రికార్డుస్థాయిలో వర్షంవిజయవాడలో వందేళ్ల చరిత్రలో ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం 4 నుంచి శనివారం 4 గంటల వరకు 24 గంటల్లో నగరంలో 26.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు తెనాలిలో 17.9, వత్సవాయిలో 17.75, మంగళగిరిలో 15.47, దాచేపల్లిలో 15.2, నూజివీడులో 15, వీరులపాడులో 14.95, ఆగిరిపల్లిలో 12.65, పెదకాకానిలో 11.25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరులో ఇందుకే అధిక వర్షాలు నైరుతి రుతుపవనాలు కొనసాగుతున్న సమయంలో ఉత్తరాంధ్రలో వాయుగుండం ఏర్పడితే నైరుతి సెక్టార్లో ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రధానాధికారి స్టెల్లా తెలిపారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడానికి ఇదే కారణమని చెప్పారు. -
పొంచివున్న వాయు‘గండం’
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ, ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పï³డనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి అనంతరం వాయుగుండంగా మారే సూచనలున్నాయి. అనంతరం పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా విశాఖకు సమీపంలో తీరం దాటవచ్చని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. -
Telangana: రెండు రోజులు వర్షాలే.. వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ రెడ్అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ... మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచి్చంది. శుక్రవారం రాష్ట్రంలో సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో ఒకరి గల్లంతు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం తానిçపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకని గురువారం వెళ్లిన రాజు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా ట్రాలీ ఆటో గుండ్రాత్‌పల్లి సమీపంలో గల అలుగువాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో గమనించిన స్థానికులు రక్షించారు. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
తెలంగాణకు అలర్ట్.. వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నుంచి వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ అంతటా పగ టి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఆదివారం కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఒక్క రోజు మాత్రం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా దక్షిణ చత్తీస్ఘడ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఉంది. -
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను.. రుతుపవనాలపై ప్రభావం ఉండదు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం కూడా సకాలంలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావం రుతుపవనాలపై ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నా అందుకు అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అకాల వర్షాల ప్రభావం రుతుపవనాలపై ఉండే అవకాశం ఏమాత్రం లేదని అమరావతి వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అరేబియా సముద్రంలో తుపాను వస్తే దాని ప్రభావం రుతుపవనాలపై కొంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. బంగాళాఖాతంలో వచ్చే తుపానుల ప్రభావం రుతుపవనాలపై ఉండదన్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయి. ఈసారి కూడా అదే సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రుతుపవనాలు మే నెలలో అండమాన్ నికోబార్‌లో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను వల్ల వీచే బలమైన గాలులతో అవి ఇంకా ముందే కదిలే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రుతుపవనాలు 4, 5 రోజులు ముందుగానే కేరళలో ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మంత్రాలయంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత మే నెలాఖరు వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శుక్రవారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పచ్చవలో 43.3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో 43.1, చినఅరికట్లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
ప్రకృతికి శిరమొగ్గి నిలిచిన ‘శివుడు’!
ఎండలు మండిపోతాయని ప్రతిసారీ చెప్పుకొంటున్నప్పటికీ, ఈసారి ఆ మండిపోవడం అక్షరాలా నిజమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవం చేస్తాయని భయపెడుతున్నారు కూడా. అయితే వాతావరణ మార్పుల వల్ల దుర్భరమైన వేడిగాడ్పులు ఎలా వస్తున్నాయో, భరించలేని చలిగాలులు కూడా అంతే వీస్తున్నాయి. ఇలాంటివన్నీ ఎప్పుడో మనకు కవి సమయాలయ్యాయి. దప్పిక వల్ల చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు నన్నెచోడుడు. శివుడు కూడా చలి భరించలేక హిమాలయాలను వదిలాడని చమత్కరించాడు సారంగు తమ్మయ్య. ఏమైనా మనుషుల శరీరాలు ఈ రెంటికీ అలవాటు పడాలి. వీటన్నింటినీ భరిస్తూనే లోకయాత్ర చేస్తూ ఉండాలి. ‘‘చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని ఎండలు, వేడి గాలులు ఆసియా దేశాల్ని పీల్చి పిప్పి చేస్తాయి. ఈ అసాధారణ పరిణామం భారత, చైనా దేశాలలో పెక్కుమంది ప్రజల దుర్మరణాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్–మే నెలలు ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవంగా భావించవచ్చు. ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గవు. ఒకవేళ వేడి తీవ్రత తగ్గని పక్షంలో పరిణామాలు ప్రమాదకరంగా మారవచ్చు’’ – మాక్సిమిలియానో హెరీరా, వాతావరణ శాస్త్రవేత్త (‘గార్డియన్’ పత్రిక; 20 ఏప్రిల్ 2023) వాతావరణ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందన్న వార్త ‘కలగుండు’ పడినట్లయింది. అంటే సృష్టి, వినాశాల మధ్య భూమి, ప్రకృతి పబ్బం గడుపుకుంటూ వచ్చాయని భావించాలి. సృష్టి, వినాశాలు ప్రాకృతిక సహజాలు. పెరుగుతూ వచ్చిన సృష్టి రహస్యాల పరిజ్ఞానంతో మానవ జాతి తన మనుగడను కాపాడుకుంటూ వస్తోంది. ఇదిలా ఉండగా, దక్షిణాసియా దేశాలకు దఫదఫాలుగా వినాశంగా పరిణమి స్తున్న ఇండో–పసిఫిక్ వాతావరణ మార్పులు ఒకసారి దుర్భరమైన వేడి గాలులకు (ఎల్‌నినో), మరోసారి అమితమైన చలి గాడ్పులకు (లానినా) కారణమవుతున్నాయి. 2009 నుంచి 2018 వరకు మన దేశంలో అసాధారణ వేడిగాడ్పులకు కారణమైనది ఎల్‌నినో. ఫలితంగా ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. ప్రతీ 2–7 సంవత్సరాలకు ఎల్‌నినో వరసగా దెబ్బతీస్తూనే వచ్చింది. ప్రకృతి వైపరీత్యం ఎంత దెబ్బతీయకపోతే, లోకాల్ని శాసించే శివుడు సహితం చలికి తట్టుకోలేక హిమాలయాల్ని వదిలి భూమ్మీద చెట్ల నీడను ఆశ్రయించాల్సిన గతి పడుతుంది! (‘హరుడు కైలాస కుధర నాథాగ్ర వసతి విడిచి/ వటమూల తలముల విశ్రమించె’.) ఈ సత్యాన్ని ‘వైజయంతీ విలాసం’ కావ్యం ద్వారా సారంగు తమ్మయ్య ప్రజలపై ప్రకృతి ప్రభావాన్ని తెలియ జెప్పడం కోసం ప్రకటించాడు. దుర్భాక రాజశేఖర శతావధాని తన ‘రాణా ప్రతాప సింహ చరిత్ర’లో హల్దీ్దఘాట్ కనుమ దగ్గర రాజపుత్రులకూ, మొగలాయీలకూ మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణిస్తూ, మధ్యాహ్నాన్నిలా చిత్రించాడు: ‘‘మెండై ఎండలు నిండె, నల్దెసల గ్రమ్మెన్ నిప్పులన్ గుప్పుచు ద్దండ గ్రీష్మ సమీరముల్ నిఖిల జగంబుల్ కడున్ డస్సె బ్ర హ్మాండబందు పొగల్ సెగల్ తటుములై వ్యాపించి మధ్యాహ్నమా ర్తాండుండుజ్వల కాండుడై గగనమధ్యం బందు మెల్గొందగన్.’’ ఇదిలా ఉండగా నన్నెచోడుడు ‘కుమార సంభవం’ కావ్యంలో, పార్వతి మండుటెండలకు పంచాగ్ని మధ్యంలో ఘోర తపస్సు చేస్తున్న సందర్భాన్ని వర్ణించాడు. ‘లోకులు భయపడేంత’గా వడగాలి వీచడాన్ని, ఆ వడగాలికి ఏనుగుల తలలు పేలిపోయి లోపలి ముత్యాలు పేలాలుగా పటపటా చిట్లిపోయినట్లు, దప్పిక కోసం ఎదురు చూసే చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు. ఇక విశ్వనాథ పగటి ఎండల తీవ్రతల వల్ల జిల్లేడు కాయల్లా, వడ్లగింజల్లా, సున్నపురాయిలా విరిగిపోయి భూమి కాస్తా కకావికలైపోయిందని వర్ణించాడు! ఆధునికుడైన కవి కాకరపర్తి కృష్ణశాస్త్రి తన కాలంలోనే సముద్రం ఉప్పొంగడం, అది భూమిని ముంచేసిన ఘటనలను ‘ప్రళయ సంరంభం’ కవితలో కళ్లకు కట్టి చూపాడిలా: ‘‘ఆకసమంటుచున్ ఘుమ ఘుమార్భటితో దిశలన్ స్పృశించుచునే భీకర లీల లేచి అతివేల జవంబున వచ్చి వచ్చియ స్తోక తరంగ మొండుపడు దుస్సహమై ధరముంచి వైచి తా నేక పయోధి సూత్రముగ ఎంతయు జేసి శమించెనంతటన్’’! ఆంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి ‘రాళ్లు’ కూడా దుఃఖంతో ఎలా కరిగిపోయాయో కవి కొడాలి సుబ్బారావు ఎంతో ఆర్ద్రతతో గుండె చెరువై ఇలా వర్ణించాల్సి వచ్చింది: ‘‘శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్రలో పల గుడి గోపురంబులు, సభాస్థలులైనవి కొండ ముచ్చుగుం పులకు, చరిత్రలో మునిగి పోయిన దాంధ్ర వబంధరాధిపో జ్జ్వల విజయ ప్రతాప రభ సంబొక స్వప్న కథావిశేషమై.’’ ఇంతకూ, సంభవించే ప్రకృతి వైపరీత్యాలకేమిగాని మానవ హృదయంలో సహజంగానే ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం మాత్రం చచ్చిపోదని చెబుతూ ప్రసిద్ధ కళాకారుడు, కవి అడవి బాపి రాజు ఓ చిరంతన సత్యాన్ని ప్రకటించిపోయారు: ‘‘అందరికీ ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం ఉంది. ఆ ప్రకృతి భౌతిక రూపంగా, మనోమయ రూపంగా, బుద్ధి రూపంగా ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రకృతిలో మనస్సుకుగాని, హృదయానికిగాని, బుద్ధికిగాని, ఆత్మకుగాని ఆనందం కల్గించే ఒక దృశ్యం, ఒక రూపం, ఒక జీవితం, ఒక భావం, కళాశక్తి కలిగిన రసజ్ఞునికి గోచరించినప్పుడు – తనలో ఉండే ఆ కళా శక్తి పైకి ఒక స్వరూపంగా జన్మించాలని ఆవేదన పొందడం చేత కళా స్వరూపం ఉద్భవిస్తున్నది. ఆ కళా స్వరూపంలో ఉన్న ముఖ్య లక్షణం ఆనందం. ఆ సృష్టి భాషా స్వరూపమైతే కవిత్వం, వర్ణ స్వరూపమైతే చిత్ర లేఖనం, మూర్తి స్వరూపమైతే శిల్పం, అంగ విక్షేప స్వరూపమైతే నృత్యం, భవన స్వరూపమైతే ఆలయం అవుతుంది’’! ప్రకృతిలో మనం భాగం కాబట్టి, అందులో దఫదఫాలుగా ఇదే మానవుడి చేష్టల వల్లనో, ప్రకృతి సహజంగానో పెల్లుబుకి వచ్చే ఉపద్రవాలను భరిస్తూనే లోకయాత్ర సాగుతూండటం సహజ పరిణామం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నాలుగు రోజులపాటు భారీ వర్షాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం నుంచి వాయువ్య దిశలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు గురువారం తెలిపింది. ఫలితంగా ఉత్తరాంధ్రతోపాటు యానాం, దక్షిణ కోస్తాలో 8, 9, 10, 11 తేదీల్లో అక్కడక్కడా మెరుపులు, ఉరుములతో కూడిన భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుందని తెలిపింది. కాగా, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో 74.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సీతంపేటలో 52.8, పెందుర్తిలో 45.6, ఆనందపురంలో 42.2, వేలేరుపాడులో 30.6, మంత్రాలయంలో 31.2, కూనవరంలో 20.4, నందికొట్కూరులో 24.4, కుకునూర్‌లో 25, వంగరలో 28.2, కోటనందూరులో 21.4, కోసిగిలో 21.6, సీతానగరంలో 20.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. -
200 ఏళ్లలో ఇలా సాగిన తుపాను లేదు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/మహారాణిపేట(విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో పూరి తీరం వైపు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 370 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి 50, గోపాల్‌పూర్‌కు 130, పారదీప్‌కు 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తరువాత 24 గంటల్లో పూరి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మినహా రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంపై ఇక జవాద్ ప్రభావం ఉండదని పేర్కొంది. వచ్చే పదిరోజులు రాష్ట్రంలో సాధారణ వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. చలి తీవ్రత పెరగనుందని, రాత్రి సమయంలో శీతల గాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించారు. కూలిన ఆర్కే బీచ్ వద్ద చిల్డ్రన్ పార్కు గోడ 140 బోట్లు, మత్స్యకారులు సురక్షితం తుపాను బలహీనపడటంతో అధికారులు, మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 140 మరబోట్లు పారదీప్, గంజాంలో చిక్కుకుపోవడంతో మత్స్యకారుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు ఒడిశా అధికారులు, పోర్టు అధికారులను సంప్రదించారు. దీంతో 140 బోట్లకు పారదీప్, గంజాంలలో ఆశ్రయం కల్పించారని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మత్స్యకారులకు అందించి మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు ఎంతో సహకారం అందించారని విశాఖ డాల్ఫిన్ బోటు సంఘం అధ్యక్షుడు చోడిపల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం అర్ధరాత్రి ఎగసిపడిన అలలతో సముద్రం దూసుకొచ్చింది. అలల దాటికి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద చిల్డ్రన్స్ పార్కు గోడ కూలిపోయింది. దీంతో సుమారు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లిందని జీవీఎంసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి గోకుల్ పార్క్ వరకు ప్రవేశాన్ని నిషేధించారు. 200 ఏళ్లలో ఇలా సాగిన తుపాను లేదు జవాద్ తుపాను ప్రయాణం భిన్నంగా సాగింది. దక్షిణ చైనా సముద్రంలో మొదలైన దీని ప్రయాణం.. పశ్చిమ బెంగాల్ వైపు సుదీర్ఘంగా సాగింది. పైగా సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతోంది. ఇలా సుదీర్ఘ ప్రయాణం చేసి.. తీరం దాటకుండానే బలహీనపడిన తుపాను గడిచిన 200 ఏళ్లలో లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 110, కరైకల్‌కు తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద చెన్నైకి సమీపంలో శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. శనివారం ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. భారీవర్షాలు పడే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో వడమాలపేటలో 132.75 మిల్లీమీటర్లు, పాకాలలో 110.75, తవణంపల్లెలో 108.25, చిత్తూరులో 106.50, రామచంద్రాపురంలో 104.25, చంద్రగిరిలో 96, శ్రీకాళహస్తిలో 94, కలకడ, రొంపిచర్లల్లో 93, యాదమర్రిలో 91.75, రేణిగుంటలో 90, చిట్వేల్‌లో 85, శ్రీరంగరాజపురంలో 82.75, కొత్తపల్లిలో 82, పలమనేరులో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నెలాఖరున బంగాళాఖాతంలో అల్పపీడనం?
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రెండు రోజులపాటు భిన్న వాతావరణం ఏర్పడనుంది. రాజస్థాన్ నుంచి పొడి గాలులు వీస్తుండటం.. అదే సమయంలో సముద్రం నుంచి తేమ గాలులు రావడంతో బుధ, ఆదివారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పగలు ఎండలు, సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గాలిలో తేమ పెరుగుతూ పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోందని, వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో 28వ తేదీ తర్వాత నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గడచిన 24 గంటల్లో బొబ్బిలిలో 55.75 మి.మీ., పరవాడలో 49, లేమర్తిలో 46.25, నాగులుప్పాలపాడులో 44, ఆరిలోవలో 39.25, పరవాడ ఫార్మాసిటీ, మల్లంపేట, నర్సీపట్నంలో 39, దర్శిలో 36 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
15న రెండు అల్పపీడనాల ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రెండు రోజుల్లో మొదలవుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లిపోతున్నాయని పేర్కొంది. ఈ నెల 15న రాష్ట్రంలో వాతావరణపరంగా అరుదైన ప్రక్రియ.. రెండు అల్పపీడనాలు ప్రభావం చూపే సూచనలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది అల్పపీడనంగా మారి ఈ నెల 15న చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనుంది. ఇది ఈ నెల 15న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు అల్పపీడనాలు రాష్ట్రంపై ప్రభావం చూపించడం అరుదని చెబుతున్నారు. అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదని, రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే రెండురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గత 24 గంటల్లో చిల్లకూరులో 72 మిల్లీమీటర్లు, బండారుపల్లెలో 65.5, మారేడుమిల్లిలో 60, వెంకటగిరికోటలో 56.5, పలమనేరులో 56, గోపాలపురంలో 52, సైదాపురంలో 49.5, బోగోలులో 47.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం: దంచికొట్టి.. ముంచెత్తి..
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని శనివారం రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి 8 గంటల సమయంలో కుండపోత వర్షం మొదలైంది. అర్ధరాత్రి వరకు కుండపోతగా పడుతూనే ఉంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రాగల మూడు రోజులు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను కోరింది. నగరంలోని ఎల్బీనగర్, మణికొండ, షేక్‌పేట, శేరిలింగంపల్లి, మాదాపూర్, ఆసిఫ్‌నగర్, బాలనగర్, రాంనగర్, ముషీరాబాద్, విద్యానగర్, అంబర్పేట్, తార్నాక, అత్తాపూర్, కార్వాన్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగరంలోని నల్లగొండ చౌరస్తాలో వర్షం నీటిలో మునిగిన కార్లు మణికొండ (8.8 సెం.మీ.), ఉప్పల్ (4.4 సెం.మీ.), ఎల్బీనగర్ (4.7 సెం.మీ.) ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కురిసిన ఎడతెగని వర్షంతో ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దిల్సుఖ్నగర్, మలక్‌పేట, మహేశ్వరం పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముసారాంబాగ్‌లో... కాలనీలు, బస్తీల్లోని డ్రైనేజీలు పొంగి వరదతో కలిసి మురుగునీరు రహదారులపై ప్రవహించింది. ఈ ప్రాంతాల పరిధిలోని పలు కాలనీలు నీటమునిగాయి. బంజారాహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనదారులు నరకాన్ని చవిచూశారు. -
100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో (2030 నాటికి) పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిర్దేశించుకుంది. హైడ్రోజన్ కేజీ ధరను 1 డాలర్ కన్నా చౌకగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసే పర్యావరణ హిత హైడ్రోజన్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చవచ్చని, దీన్ని కార్లు, ఇళ్లు మొదలైన వాటిల్లో విద్యుత్ అవసరాల కోసం వినియోగించవచ్చని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రోలసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు వ్యయాలు భారీగా ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. హైడ్రోజన్ నిల్వ, రవాణా కోసం కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వీటితో పంపిణీ వ్యయాలు భారీగా తగ్గగలవు‘ అని అంబానీ చెప్పారు. ప్రస్తుతం పునరుత్పాదక వనరులతో ఉత్పత్తి చేసే హరిత హైడ్రోజన్ ధర కేజీకి 3–6.54 డాలర్ల మధ్యలో ఉంటోందని వివరించారు. దీన్ని 2 డాలర్ల లోపునకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాము మరింత ముందుకెళ్లి రేటును 1 డాలర్ లోపునకు తగ్గించడంపై దృష్టి పెడుతున్నట్లు ముకేశ్ చెప్పారు. ఇందుకోసం 1–1–1 ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. 1 దశాబ్దంలో 1 కేజీ హైడ్రోజన్‌ను 1 డాలర్ లోపు ధరకు అందించడం దీని ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. -
కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యం..
తిరువనంతపురం: దేశంలో నైరుతి రుతుపవనాలు రెండ్రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నట్లు భారత దేశ వాతావరణ విభాగం తెలిపింది. అయితే, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అదే విధంగా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం, మధ్య భారతదేశంలో ఓ మోస్తరు అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం ఒక ప్రకటనలో తెలియ చేసింది. -
AP: రానున్న మూడు రోజుల వాతావరణ ఇలా ఉండనుంది
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాడు సౌత్ బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు, మొత్తం దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశించాయి. రానున్న 48 గంటలలో నైరుతి బంగాళాఖాతము మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు, ఈస్ట్‌సెంట్రల్ కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 3.1కి.మి & 5.8 కి.మిలో మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24వ తేదీకి బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి సుమారుగా 26వ తేదీ ఉదయాన ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరానికి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం : ►ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా, భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది . అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ►ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు)తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ: ►ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు)తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ►ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ వివరాలను భారత వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: INS Rajput: ‘రాజ్‌పుత్’కు వీడ్కోలు -
‘టౌటే’ ప్రభావంతో వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌటే తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ/ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటివల్ల రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నంలో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. ఇంకొన్నిచోట్ల ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడ్డారు. అప్రమత్తమైన వ్యవసాయ శాఖ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వీస్తున్న ఈదురు గాలులు, చిరు జల్లులతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉండడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేస్తోంది. చేలల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని, పరదాలు కప్పి పంట తడవకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. తడిసిన ఉత్పత్తులను ఆరబెట్టే డ్రైయర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రైతులు ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న, ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈదురు గాలులకు పండ్లు, కూరగాయల పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండడంతో అరటి చెట్లకు కర్రలు కట్టి ఊతమిస్తున్నారు. రైతులకు అవసరమైన సాయం అందించేలా అధికారులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఆదేశాలిచ్చారు. -
రెండురోజులు కోస్తాంధ్రలో వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కర్నూలు (అగ్రికల్చర్): నైరుతి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాప్తి చెందుతోంది. ఉత్తర దక్షిణ తమిళనాడులో ఏర్పడిన ఆవర్తనం ఇప్పడు ద్రోణిగా మారి విస్తరిస్తోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల వరకు ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కర్నూలు జిల్లాలో మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. పెనుగాలులు వీచాయి. పిడుగులు పడ్డాయి. సంజామల మండలం మిక్కినేనిపల్లిలో పిడుగుపడి షేక్ రజియా అలియాస్ రేష్మ (18) మృతిచెందింది. పెనుగాలులకు ఓర్వకల్లు, వెల్దుర్తి, బేతంచర్ల తదితర మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. -
నేటి నుంచి వడగాడ్పులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 15 మండలాల్లో మంగళవారం నుంచి వడగాడ్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖలో సోమవారం 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎండలు మండుతున్నాయని, వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. కొద్దిరోజులు ఇలాగే ఉంటుందని, ప్రస్తుతం గాలులు ఉత్తర దిశ నుంచి వీస్తున్నాయని తెలిపారు. సాధారణం కంటే 2 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాయలసీమలో ఎండలు మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. -
నిలకడగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): కృష్ణా, పెన్నా, వంశధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి తుంగభద్ర, హంద్రీ వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 1,58,230 క్యూసెక్కులు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు 1,66,994 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 6 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 1,39,685 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 27,309 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం మధ్యాహ్నానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 86,330 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ► పులిచింతల ప్రాజెక్టులో 174.73 అడుగుల్లో 45.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► ప్రకాశం బ్యారేజీలోకి 96,560 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 9700 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 87,775 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా కడలిలోకి వదులుతున్నారు. సోమశిలలోకి పెన్నా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 95,491 క్యూసెక్కులు చేరుతుండగా.. కండలేరుకు 10,407 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు, రేపు తేలికపాటి వర్షాలు సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో అమలాపురంలో 2 సెం.మీ., కైకలూరు, కుక్కునూరు, నూజివీడు, డెంకాడ, పూసపాటిరేగ, చెన్నెకొత్తపల్లిలో 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు శనివారం పెరిగాయి. సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఎండ తీవ్రతతోపాటు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా, ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు, మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ వరకు విస్తరించింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో అంటే ఆదివారం, సోమవారం రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. -
కోస్తాంధ్రలో వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణం): ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాలు వాయవ్య భారత దేశం నుంచి ఉపసంహరణ మొదలు కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటీరియల్ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోంది. దీని వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాల వాయవ్య భారతదేశం నుంచి ఉపసంహరణ మొదలు కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. -
పగలూ గజగజ
సాక్షి, హైదరాబాద్/కోహిర్ (జహీరాబాద్): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతు న్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం 8 గం. వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో మంగళవారం ఉదయం రికార్డు స్థాయిలో 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ), జహీరాబాద్ మండలం అల్గోల్‌లో 3.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. ఇక కోహిర్ మండలానికి పక్కనే ఉన్న మర్పల్లి, ఆసిఫాబాద్ జిల్లా కొమురంభీం మండలం గిన్నెధారిలో 3.8 డిగ్రీల æచొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్, కామారెడ్డి జిల్లా భిక్కనూర్, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 4.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లా మంగల్‌పల్లి, వికారాబాద్ జిల్లా నాగారంలో 4.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండ్రోజుల పాటు చలిగాలులు.. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా తెలంగాణలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ రెండ్రోజులు ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, నిజామా బాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 5 డిగ్రీలు, మెదక్‌లో 6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.