Mongolia
-
T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫియర్-ఎలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా మలేషియా వేదికగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మంగోలియా 10 ఓవర్లు ఆడి కేవలం 10 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో ఐదు డకౌట్లు కాగా.. నలుగురు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. మంగోలియా ఇన్నింగ్స్‌లో 2 పరుగులే టాప్ స్కోర్ కావడం గమనార్హం. ఇక సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ ఆరు వికెట్లు పడగొట్టగా.. ఆక్షయ్ పూరీ రెండు, రాహుల్, రమేష్ తలా వికెట్ సాధించారు. 10 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సింగపూర్ 0.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఆలౌటైన మంగోలియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన ఐస్లీ ఆఫ్ మ్యాన్ రికార్డును మంగోలియా సమం చేసింది. గతేడాది స్పెయిన్‌పై ఐస్లీ ఆఫ్ మ్యాన్ జట్టు కూడా 10 పరుగులకే చాపచుట్టేసింది.తుది జట్లుమంగోలియా: మోహన్ వివేకానందన్, సంచిర్ నట్సగ్డోర్జ్, దవాసురేన్ జమ్యాన్సురెన్, సోడ్బిలెగ్ గంతుల్గా, గండెంబెరెల్ గాన్బోల్డ్(వికెట్ కీపర్), లువ్సంజుండుయ్ ఎర్డెనెబుల్గాన్(కెప్టెన్), టెములెన్ అమర్మేండ్, జోల్జావ్ఖ్లాన్ షురెంత్సెట్సేగ్, టర్బోల్డ్ బట్జర్గల్, తుర్ముంఖ్ తుముర్సుఖ్, ఎంఖ్‌బాత్ బత్ఖుయాగ్సింగపూర్: సురేంద్రన్ చంద్రమోహన్, అర్జున్ ముత్రేజా, విలియం సింప్సన్, మన్‌ప్రీత్ సింగ్(వికెట్ కీపర్), అమన్ దేశాయ్, అమర్త్య కౌల్, హర్ష భరద్వాజ్, అక్షయ్ పూరి, రాహుల్ శేషాద్రి, రౌల్ శర్మ, రమేష్ కలిముత్తుచదవండి: Duleep Trophy: నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్.. ఆరు ఫోర్లు కొట్టి.. -
ప్యారిస్ ఒలింపిక్స్ : మంగోలియన్ల యూనిఫాం హాట్ టాపిక్
జూలై 26 నుండి ప్రారంభం కానున్న ప్యారిస్ ఒలింపిక్స్-2024 వేడుకల కోసం టీం మంగోలియా తన స్టయిల్‌తో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. సంస్కృతి, ఫ్యాషన్ కలగలిసిన యూనిఫాంతో అందర్నీ అబ్బురపర్చింది. అలాగే ఈ యూనిఫాంలోని ఇతర హైలైట్లను చూసి క్రీడా ఫ్యాన్స్, నెటిజన్లు శభాష్ మంగోలియా అంటున్నారు. ఉలాన్బాతర్కు చెందిన ఫ్యాషన్ లేబుల్ మిచెల్ అండ్ అమెజాన్కా ఈ దుస్తులను రూపొందించారు. మంగోలియాకు సొంతమైన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, తదితర మంగోలియన్ మూలాంశాలు, ఆ దేశ జెండాలోని “సోయోంబో” చిహ్నం , జాతీయ రంగులైన నీలం, ఎరుపు బంగారు రంగుల మేళవింపుతో వీటిని తయారు చేశారు. అలాగే ఈ ప్యారిస్ ఒలింపిక్ వేడుకలకు గుర్తుగా ఈఫిల్ టవర్ ఒలింపిక్ క్రీడా జ్యోతి మరింత హైలైట్‌గా నిలిచాయి.మంగోలియన్లు ధరించే సంప్రదాయ గౌనుకు డిజైనర్లు 'డీల్' అనే సొగసైన టచ్ ఇచ్చారు. ప్రారంభ వేడుకలో కాంటెంజెంట్ కవాతులో పాల్గొనే మంగోలియన్ క్రీడాకారులు ధరించే దుస్తులు, ఫ్లాగ్ జెండా బేరర్ల దుస్తులకు భిన్నంగా ఉంటాయి. ఇది స్టేడియం లోపల కాకుండా సెయిన్ నది వద్ద నిర్వహించనున్నారు. మంగోలియన్ అథ్లెట్లు గత రెండు ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా మిచెల్ అండ్ అమెజాన్కా రూపొందించిన దుస్తులను ధరించడం గమనార్హం. View this post on Instagram A post shared by Michel&Amazonka (@michelamazonka)ప్రతి అథ్లెట్ బాడీ కొలతలను తీసుకుని 3 నెలలకు పైగా సమయం పట్టిందని డిజైనర్లు వెల్లడించారు. ఒక్కో సెట్ రూపొందించడానికి 6 దశల్లో సగటున 20 గంటలు పట్టిందని డిజైనర్లు చెప్పారు.కాగా 1964 గేమ్స్ నుండి, లాస్ ఏంజిల్స్ 1984 మినహా ప్రతి వేసవి ఒలింపిక్స్‌లో మంగోలియా పాల్గొంటూ వస్తోంది. ప్రస్తుతం క్రీడా సమరంలో మంగోలియన్ బృందంలో 30 మందికిపైగా అథ్లెట్లు ఉన్నారు. 2008లో బీజింగ్ గేమ్స్‌లో జూడో , బాక్సింగ్ క్రీడలో బంగారు పతకాలను గెల్చుకున్నమంగోలియన్లు ఈసారి మరిన్ని బంగారు పతకాలను గెల్చుకోవాలని ఆశిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే 33వ ఎడిషన్ 2024 వేసవి ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరగబోతున్నాయి. 200 పైగా దేశాలు తమ అథ్లెట్లను 32 బరిలోకి దింపనున్నాయి. -
మంగోలియాలో చలి పులి పంజా
ప్రకృతి వైపరీత్యం ‘జడ్’మంగోలియాను ముంచెత్తుతోంది. అతి శీతల చలికాలంతో మంగోలియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇక్కడ కనీసం పచ్చగడ్డి కూడా మొలవకపోవడంతో లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే.. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్.. ఇప్పుడు తరచూ వస్తుండటంతో మంగోలియా ప్రజల ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని జడ్ అంటారు. ఈ వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది ఇదే. జడ్ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరింది. వాటిలో 80 శాతాన్ని, అంటే 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయని మంగోలియా ప్రభుత్వం పశువులను పాతిపెట్టింది. దేశంలో జడ్ వల్ల మున్ముందు మొత్తం కోటీ 49 లక్షల జీవాలు చనిపోవచ్చునని, ఇది మంగోలియా పశుసంపదలో 24 శాతానికి సమానమని ఉప ప్రధాని ఎస్.అమార్ సైఖాన్ చెప్పారు. మంగోలియా జనాభా 33 లక్షలైతే వారికి 6.5 కోట్ల పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి. వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది. మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తరవాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం. వ్యవసాయంలో 80 శాతం వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకానిదే. దీనివల్ల మంగోలియా జీడీపీలో 11 శాతం లభిస్తోంది.ప్రసుత్తం జడ్ వల్ల మంగోలియా ఆర్థికవ్యవస్థ అస్థిరతకు లోనవుతోంది. ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్ బటోర్కు, ఇతర పట్టణాలకు వలస పోతున్నారు. కానీ, అక్కడ వారందరికీ సరిపడా పనులు లేవు. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది.ప్రస్తుత జడ్ గడచిన పదేళ్లలో ఆరోది, మహా తీవ్రమైనది. జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది. మంగోలియాను ఆదుకోవడానికి 60 లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టినా మార్చి మధ్యనాటికి అందులో 20 శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. ఏషియన్ గేమ్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో భాగంగా జపాన్‌తో ఇవాళ (మే 8) జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 12 పరుగులకే ఆలౌటైంది. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ గతేడాది ఫిబ్రవరి 26న నమోదైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు 10 పరుగులకే చాపచుట్టేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.మంగోలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. జపాన్ ఇన్నింగ్స్‌లో శబరీష్ రవిచంద్రన్ (69) అర్దసెంచరీతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన మంగోలియా.. జపాన్ బౌలర్ల ధాటికి 8.2 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా జపాన్ 205 పరుగుల అతి భారీ తేడాతో విజయం సాధించింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో భారీ విజయంగా నమోదైంది. 2023లో నేపాల్ ఇదే మంగోలియాపై సాధించిన 273 పరుగుల విజయం పొట్టి క్రికెట్ చరిత్రలోనే అతి భారీ విజయంగా నమోదైంది.ఈ మ్యాచ్‌లో జపాన్ బౌలర్ కజుమా కటో స్టాఫోర్డ్ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డౌట్లయ్యారు. 4 పరుగులు చేసిన సుమియా టాప్ స్కోరర్ కాగా.. ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి. -
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
బాలి: ఇండోనేసియా టీనేజ్ బౌలర్ రొమాలియా మహిళల అంతర్జాతీయ టి20ల్లో అసాధారణ రికార్డును లిఖించింది. మంగోలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో 17 ఏళ్ల స్పిన్నర్ రొమాలియా (7/0) అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి... అనామక జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో చరిత్ర పుటలకెక్కింది. తద్వారా 2021లో నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్డిక్ (7/3) ఫ్రాన్స్‌పై నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. మొదట ఇండోనేసియా మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. రొమాలియా (3.2–3–0–7) వేసిన 3.2 ఓవర్లలో 3 మెయిడిన్లు కావడం విశేషం. ఆమె స్పిన్ ఉచ్చులో పడి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఎర్డెనెసుడ్ (0), అనుజిన్ (0), నమూంజుల్ (0), నరంజెరెల్ (0), ఎన్క్జుల్ (0) ఖాతానే తెరవలేకపోయారు. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.పురుషుల క్రికెట్లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్‌గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది. View this post on Instagram A post shared by Persatuan Cricket Indonesia (@cricket_ina) 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్‌ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. -
Reeni Tharakan: బామ్మ పవర్
53 ఏళ్ల వయసులో ఆమె జిమ్‌లో చేరింది ఫిట్నెస్ కోసం. పదేళ్లు తిరిగేసరికి 63 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ అయ్యింది. ఇటీవల మంగోలియాలో నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. ఏ వయసులోనైనా ఆరోగ్యంగా... దృఢంగ శరీరాన్ని మలుచుకునేందుకు స్త్రీలు శ్రద్ధ పెడితే సాధ్యం కానిది లేదని కొచ్చికి చెందిన రీని తారకన్ సందేశం ఇస్తోంది. మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్‌లో ఇటీవల ‘ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఫెడరేషన్’ (ఐ.పి.ఎఫ్) చాంపియన్‌షిప్స్ జరిగాయి. మన దేశం నుంచి 25 మంది పాల్గొంటే వారిలో 15 మంది స్త్రీలే. వారిలో కొచ్చిన్‌కు చెందిన రీని తారకన్ నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. 63 ఏళ్ల వయసులో ఆమె ఇలా దేశం తరఫున పతకాలు గెలుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలా జరిగింది. అందుకు ఆమె చేసిన పరిశ్రమ, చూపిన శ్రద్ధే కారణం. భారీ పోటీ మంగోలియాలో జరిగిన ఐ.పి.ఎఫ్‌కు 44 దేశాల నుంచి 145 మంది పవర్‌లిఫ్టర్లు హాజరయ్యారు. వీరిని 40, 50, 60, 70 ఏళ్లుగా నాలుగు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. మళ్లీ ఈ కేటగిరీల్లో బరువును బట్టి పోటీదార్లు ఉంటారు. స్త్రీ, పరుషులు వేరువేరుగా పాల్గొంటారు. రీని తారకన్ అరవై ఏళ్ల కేటగిరిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది. డెడ్లిఫ్టింగ్లో 112.5 కిలోల బరువు ఎత్తగలిగింది. ప్రశంసలు అందుకుంది. ‘ఈ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో నాకు బాగా నచ్చిన అంశం స్త్రీలు ఎక్కువగా పాల్గొనడం. మన దేశం నుంచి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నాం. అంటే నేటì కాలంలో స్త్రీలు తమ సామర్థ్యాలను ఏ వయసులోనైనా మెరుగు పరుచుకోవడానికి వెనుకాడటం లేదని తెలుసుకోవాలి’ అంది రీని తారకన్. బరువు తగ్గడానికి వెళ్లి రీని తారకన్ కొచ్చిన్ శివార్లలోని తైకట్టశ్శేరి అనే గ్రామంలో ఉంటుంది. భర్త ఆంటోని తారకన్ రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అమెరికాలో స్థిరపడితే మరొకరు చెన్నైలో రెస్టరెంట్‌ను నడుపుతున్నారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండటం వల్ల తాను బరువు పెరుగుతున్నానని రీని తారకన్కు అనిపించింది. దాంతో కొచ్చిన్ సిటీలోని వైట్టిలా ప్రాంతంలో ఒక జిమ్ లో చేరింది. ఇంటినుంచి జిమ్ పాతిక కిలోమీటర్ల దూరమైనా బరువు తగ్గాలనే కోరికతో రోజూ వచ్చేది. భర్త ఆమెను తీసుకొచ్చి దిగబెట్టేవాడు. అయితే ఆ జిమ్‌లోని ట్రైనర్ ఆమెలో బరువులెత్తే సామర్థ్యం ఉందని ఆ దారిలో ప్రోత్సహించాడు. పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా మారొచ్చని చెప్పాడు. అందుకు తర్ఫీదు ఇస్తానన్నాడు. 2021 నుంచి ఆమెను పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నాడు. అప్పటి నుంచి రీని మెడల్స్ సాధిస్తూనే ఉంది. ‘పదేళ్ల క్రితం నాకు జిమ్ అంటేనే తెలియదు. కాని క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు పవర్లిఫ్టర్ని అయ్యాను. ఈ గుర్తింపు సంతృప్తినిస్తోంది’ అంది రీని తారకన్. సమర్థింపులు, సూటిపోట్లు ‘నేను పవర్‌లిఫ్టర్ కావాలని ప్రయత్నించినప్పుడు నా కుటుంబం పూర్తి సహకారం ప్రకటించింది. నా పిల్లలు ‘‘ట్రై చెయ్యమ్మా’’ అన్నారు. కాని బంధువుల్లో కొందరు సూటిపోటి మాటలు అన్నారు. ఈ వయసులో ఇదంతా అవసరమా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారికి పని చేస్తూనే సమాధానం చెప్పాలనుకున్నాను. అప్పుడు అలా అన్నవాళ్లు ఇవాళ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిమ్ స్త్రీలకు చాలామంచిది. పవర్‌లిఫ్టింగ్ లాంటివి మన ఎముకలకు బలాన్నిస్తాయి. నేను నా బరువును అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉంటున్నాను. వారంలో నాలుగు రోజులు జిమ్‌కు వచ్చి రెండు గంటలు వర్కవుట్ చేస్తాను. రెండు రోజులు ఇంట్లో వ్యాయామం చేస్తాను. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను. వ్యాయామం ఉత్సాహాన్నిస్తుంది. తప్పక చేయండి’ అంటోంది రీని తారకన్. -
మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది. మేఘా ఇంజనీరింగ్ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్బటోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్ఎల్సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
కొడితే బంతి ఎవరెస్ట్‌కు...
హంగ్జౌ: ఆసియా క్రీడల్లో నేపాల్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పనికూనలాంటి ఆ జట్టు ఆటలో ఇప్పుడే నడక మొదలుపెట్టిన టీమ్‌పై తమ ప్రతాపాన్ని ప్రదర్శించింది. పరుగుల వాన, పరుగుల వరద అనే విశేషణాలు ఈ మ్యాచ్‌కు సరిపోవు... విధ్వంసం, దూకుడు అనేవి కూడా చిన్న పదాలు... ఒకదాని తర్వాత మరో కొత్త మరో రికార్డు... పరుగులు, బంతులు, బౌండరీలు... ఇలా అన్నింటిలోనూ కొత్త ఘనతలే. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో నేపాల్ ఏకంగా 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టి20ల్లో పలు రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), దీపేంద్ర సింగ్ ఐరీ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్స్‌లు) అతనికి అండగా నిలిచారు. అనంతరం మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. దవాసురెన్ (10) ఒక్కటే రెండంకెల స్కోరు చేయగా, ఎక్స్‌ట్రాలదే (23) అత్యధిక స్కోరు. మంగోలియా జట్టుకు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్‌గా కూడా ఆ జట్టుకు ఇదే తొలి టి20 మ్యాచ్. తుది జట్టులోని 11 మందీ తొలిసారి టి20 మ్యాచ్ బరిలోకి దిగినవారే. దాంతో కాస్త అనుభవం ఉన్న నేపాల్ ముందు ఈ జట్టు కనీసం నిలవలేకపోయింది. మ్యాచ్‌లో నమోదైన రికార్డులు... 314 అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఏ జట్టూ 300 పరుగులు చేయలేదు. 278 పరుగులతో ఉన్న రికార్డును (2019లో ఐర్లాండ్ జట్టుపై అఫ్గానిస్తాన్, 2019లో తుర్కియే జట్టుపై చెక్ రిపబ్లిక్) నేపాల్ బద్దలు కొట్టింది. 273 టి20ల్లో అతి పెద్ద విజయం. గతంలో చెక్ రిపబ్లిక్ 257 పరుగులతో తుర్కియేని ఓడించింది. 34 అంతర్జాతీయ టి20ల్లో కుశాల్ మల్లా 34 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో 35 బంతుల్లో రోహిత్ శర్మ (భారత్; 2017లో శ్రీలంకపై), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా; 2017లో బంగ్లాదేశ్‌పై), విక్రమశేఖర (చెక్ రిపబ్లిక్; 2019లో తుర్కియేపై) నెలకొల్పిన సెంచరీ రికార్డు తెరమరుగైంది. 9 అంతర్జాతీయ టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని దీపేంద్ర సింగ్ నమోదు చేశాడు. గతంలో 12 బంతులతో ఈ రికార్డు భారత స్టార్ యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది. 26 ఇన్నింగ్స్‌లో నేపాల్ అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు చేసింది. గతంలో అఫ్గానిస్తాన్ జట్టు ఐర్లాండ్‌పై (2019లో), వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాపై (2023లో) 22 సిక్స్‌లు చొప్పున కొట్టింది. -
ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన టీ20 మ్యాచ్.. ఓ వినూత్న రికార్డు నమోదు
ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిథ్యం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ టీ20 రికార్డులను తిరగరాసింది. మంగోలియాపై రికార్డు స్థాయిలో 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపాల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌తో (314/3) పాటు పరుగుల పరంగా భారీ విజయం (273), ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (26).. బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు (14 ఫోర్లు, 26 సిక్సర్లు కలిపి మొత్తంగా 212 పరుగులు), ఫాస్టెస్ట్ ఫిఫి (దీపేంద్ర సింగ్-9 బంతుల్లో), ఫాస్టెస్ట్ హండ్రెడ్ (కుషాల్ మల్లా-34 బంతుల్లో), మూడో వికెట్‌కు అత్యధిక పార్ట్నర్షిప్ (193 పరుగులు), అత్యధిక స్ట్రయిక్‌రేట్ (దీపేంద్ర సింగ్- 520 (10 బంతుల్లో 52 పరుగులు) ఇలా పలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టింది. Dipendra Singh Airee's fastest ever fifty in T20i history: 6,6,6,6,6,2,6,6,6. - A memorable day for Nepal cricket!pic.twitter.com/ih9cvYehCi — Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023 పై పేర్కొన్న రికార్డులతో ఈ మ్యాచ్‌లో మరో వినూత్న రికార్డు కూడా నమోదైంది. మంగోలియా చేసిన 41 పరుగుల స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే (23 పరుగులు, 16 వైడ్లు, 5 లెగ్ బైలు, 2 నోబాల్స్) టాప్ స్కోర్ కావడం. ఓ జట్టు స్కోర్‌లో 50 శాతానికి పైగా పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. మంగోలియా స్కోర్‌లో 56 శాతం పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఎక్స్‌ట్రాల తర్వాత మంగోలియన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ దవాసురెన్ జమ్యసురెన్ (10) చేశాడు. ఇతనొక్కడే మంగోలియా ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేశాడు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నేపాల్ బౌలర్లు కరణ్, అభినాశ్, సందీప్ లామిచ్చెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్, కుశాల్ భుర్టెల్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ దక్కించకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ (19), ఆసిఫ్ షేక్ (16) విఫలం కాగా.. కుషాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు), దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చరిత్రపుటల్లో చిరకాలం మిగిలుండిపోయే పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. -
పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్
Dipendra Singh Fastest T20I 50: నేపాల్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఆరీ పరుగుల సునామీ సృష్టించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట(ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో) ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా క్రీడలు -2023లో భాగంగా మెన్స్ క్రికెట్ ఈవెంట్లో నేపాల్- మంగోలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. చైనాలోని హోంగ్జూలో జరిగిన ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఈ మేర సుడిగాలి అర్ధ శతకంతో మెరిశాడు. ఐదోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ ఆల్‌రౌండర్ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. రెండు ఫార్మాట్లలో అద్భుత సెంచరీలు కాగా 23 ఏళ్ల దీపేంద్ర సింగ్ ఆరీ 2018లో నేపాల్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 52 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 889, 991 పరుగులు సాధించాడు. అదే విధంగా ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ ఖాతాలో వన్డేల్లో 36, టీ20లలో 21 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ వన్డేల్లో ఈ రైట్ హ్యాండ్‌బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105, టీ20లలో 110 కావడం విశేషం. సంచలనాలు సృష్టించిన నేపాల్ జట్టు ఇక టీ20 చరిత్రలో బుధవారం(సెప్టెంబరు 27) సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆసియా క్రీడలు- 2023 మెన్స్ క్రికెట్ ఈవెంట్లో మంగోలియాతో మ్యాచ్‌లో నేపాల్ పలు అరుదైన ఘనతలు సాధించి చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో 314 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అంతేకాదు మంగోలియాను 41 పరుగులకే ఆలౌట్ చేసి 273 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు -
314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు
Asian Games Mens T20I 2023- Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో మెన్స్ క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. చైనాలోని హోంగ్జూలో నేపాల్- మంగోలియాతో బుధవారం తొలి టీ20 మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన మంగోలియా నేపాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 19, వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ 16 పరుగులకే అవుట్ కావడంతో ఆరంభంలోనే నేపాల్‌కు భారీ షాక్ తగిలింది. అయితే, వన్‌డౌన్‌లో కుశాల్ మల్లా దిగగానే సీన్ రివర్స్ అయింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపిస్తూ మంగోలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ 34 బంతుల్లోనే శతకం బాదిన అతడు.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 137 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో ఏకంగా 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కుశాల్, దీపేంద్ర ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన నేపాల్ 314 పరుగులు స్కోరు చేసింది. ప్రపంచ రికార్డులు బద్దలు తద్వారా పొట్టి ఫార్మాట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. తద్వారా అఫ్గనిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 2019లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గన్ 3 వికెట్లు నష్టపోయి 278 పరుగులు చేసింది. సిక్సర్ల జట్టుగా ఇక ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో మరో అరుదైన ఘనత కూడా ఖాతాలో వేసుకుంది నేపాల్ క్రికెట్ జట్టు. టీ20 ఫార్మాట్ హిస్టరీలో సింగిల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్‌గా నిలిచింది. నేపాల్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 26 సిక్స్‌లు బాదగా.. గతంలో అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ మీద 22 సిక్స్‌లు కొట్టింది. సంచలన విజయం మంగోలియా 41 పరుగులకే ఆలౌట్ కావడంతో నేపాల్ ఏకంగా 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు
Asian Games Mens T20I 2023 - Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్(35 బాల్స్ సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. మంగోలియాతో మ్యాచ్ సందర్భంగా చైనా వేదికగా బుధవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్ ఈవెంట్ మొదలు కాగా ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం నేపాల్, మంగోలియా హొంగ్జూలోని పిన్ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్‌లో పోటీకి దిగాయి. గ్రూప్-ఏలో భాగమైన ఈ జట్ల మధ్య పోరుతో మెన్స్ టీ20 క్రికెట్ ఈవెంట్‌కు తెరలేచింది. టాస్ గెలిచిన మంగోలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ ఓపెనర్లు విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ మల్లా 50 బంతుల్లో 137, ఐదో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి నేపాల్ 314 పరుగులు చేసింది. చదవండి: పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..! -
ఇదేమి జట్టురా బాబు.. మొన్న 15 పరుగులు! ఇప్పుడు 22 పరుగులకే ఆలౌట్
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023లో మంగోలియా మహిళల క్రికెట్ జట్టు మరోసారి ఘోర ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మంగోలియా.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ ఈవెంట్లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఏకంగా 180 పరుగుల తేడాతో మంగోలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో కెప్టెన్ కారీ చాన్ (70) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. యీ షాన్ టోనోట్(34 నాటౌట్),మర్యం బీబీ(30) పరుగులతో రాణించారు. కాగా మంగోలియన్ బౌలర్లు ఏకంగా 36 పరుగులు ఎక్స్ట్రాస్గా ఇవ్వడం గమనార్హం. 22 పరుగులకే ఆలౌట్ అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా 12.4 ఓవర్లలో కేవలం 22 పరుగులకే కుప్పకూలింది. హాంకాంగ్ బౌలర్లలో అలిసన్ సియు, కానీ చాన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బీబీ, యూసఫ్, అమండా చెయుంగ్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇండోనేషియాపై మంగోలియా ఈ తరహా ప్రదర్శనే చేసింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా మంగోలియా చెత్త రికార్డు నెలకొల్పింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్! Indonesia Women win comprehensively over Mongolia Women in this Asian Games fixture. The Indonesians put up a huge total on the board first, then bowled out their opposition for just 15 runs!#AsianGames pic.twitter.com/FgxMI1mIub — AsianCricketCouncil (@ACCMedia1) September 19, 2023 -
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఏషియన్ గేమ్స్ వుమెన్స్ క్రికెట్లో మంగోలియా జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో మంగోలియన్లు ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా రికార్డైంది. ఇదే ఏడాది స్పెయిన్‌తో జరిగిన పురుషుల టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌటై, అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. ఇండోనేషియా-మంగోలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ రత్న దేవీ అర్ధసెంచరీతో (48 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించగా.. మరో ఓపెనర్ నందా సకరిని (35), మరియా వొంబాకీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మంగోలియా బౌలర్లలో మెండ్‌బయార్, నముంజుల్, జర్గల్సై ఖాన్, గన్సుఖ్ తలో వికెట్ పడగొట్టారు. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. ఆరియాని (3-0-8-4), రహ్మావతి (3-2-1-2), రత్న దేవీ (2-0-4-2) ధాటికి 10 ఓవర్లలో 15 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడుగురు డకౌట్లు కాగా.. ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో, ఓపెనర్ బత్జర్గల్ చేసిన 5 పరుగులే మంగోలియన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్స్‌గా నిలిచాయి. కాగా, ఆసియా క్రీడల్లో మొట్టమొదటిసారిగా క్రికెట్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలతో పాటు పురుషుల విభాగంలోనూ ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ కూడా పాల్గొంటుంది. -
‘మేఘా’కు మంగోలియా ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మౌలిక సదుపాయాల దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియా మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయంగా తొలి గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని నిర్మించే భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని విలువ 790 మిలియన్ డాలర్లు. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్వోఏ (లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ)ను అందుకున్నట్లు ఎంఈఐఎల్ తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ప్రాతిపదికన ఈ కాంట్రాక్టు కింద ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీలు, ప్లాంటు భవంతులు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుందని వివరించింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీలో రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయవచ్చు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) తలపెట్టిన భాగస్వామ్య అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో మంగోలియా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, హైడ్రోకార్బన్స్ రంగంలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండగలదని కంపెనీ తెలిపింది. దీనితో రష్యన్ ఇంధనంపై మంగోలియా ఆధారపడటం తగ్గుతుందని, అలాగే తమ పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను స్వయంగా తీర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. స్థానికంగా చిన్న పరిశ్రమలు, ప్రజల ఉపాధి అవకాశాల వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. -
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..!
ఆఫీసుకు రోజూ ఇలానే వస్తున్నారు..! -
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
కొత్తగా మూడు దేశాలకు ఐసీసీ సభ్యత్వం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా మూడు దేశాలకు సభ్యత్వం ఇచ్చింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల సంఖ్య 106కు చేరింది. ఆసియా ఖండం నుంచి మంగోలియా, తజకిస్థాన్.. యూరప్ నుంచి స్విట్జర్లాండ్‌కు ఐసీసీ సభ్యత్వాలు ఇచ్చింది. ఆదివారం వర్చువల్‌గా జరిగిన 78వ సర్వసభ్య సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా సభ్యత్వం లభించిన దేశాలు వారి వారి ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడాలని ఐసీసీ సూచించింది. అందుకు అవసరమైన మద్దతు తమవైపు నుంచి ఉంటుందని హామీ ఇచ్చింది. Congratulations to Mongolia, Switzerland and Tajikistan, who are now among ICC's 94 Associate Members 👏Know more about their journeys 👉 https://t.co/33UFKEgNZr pic.twitter.com/sw54PsPBir— ICC (@ICC) July 18, 2021 -
బజరంగ్‌కు స్వర్ణం
రోమ్: వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ మంగో లియా రెజ్లర్ తుల్గా తుమర్‌పై విజయం సాధించాడు. నిర్ణీత రెండు రౌండ్ల తర్వాత ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అయితే మంగోలియా రెజ్లర్ ఒక్కో పాయింట్ రెండుసార్లు సాధించగా... చివరి సెకన్లలో ఒకే పట్టుతో రెండు పాయింట్లు సాధించినందుకు బజరంగ్ ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 7–0తో సెలిమ్ కొజాన్ (టర్కీ)పై, సెమీఫైనల్లో 6–3తో క్రిస్టో ఫర్ (అమెరికా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన విశాల్ (70 కేజీలు) కాంస్యం సాధించాడు. -
కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రాజీనామా
ఉలాన్ బాతర్: కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితి గట్టెక్కేందుకు విశ్వమంతా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒక దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మంగోలియా దేశంలో వచ్చింది. కరోనా ప్రారంభ దశలో మంగోలియా కట్టడి చర్యలు పటిష్టం తీసుకుంది. (చదవండి: 7 లక్షల మందికి వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అన్న బిల్‌గేట్స్?) అయితే ఆ దేశంలో ఇప్పుడు రెండో దశ వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీనిపై ఆ దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. అయితే ఈ కరోనా విషయంలో ఇద్దరి ఆగ్రహావేశాలు తట్టుకోలేక ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే కరోనా రోగి, ఓ చిన్నారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారికి ఆ అవకాశం కల్పించకపోవడంపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసనలకు తట్టుకోలేక వాటికి బాధ్యత వహిస్తూ ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్‌లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలతో పాటు నిరసనలు వచ్చాయి. ఈ విధంగా కరోనా వ్యాప్తి ప్రధానికి చుక్కలు చూపించింది. (చదవండి: కరోనా కథలెన్నెన్నో..) -
భయపెట్టే వార్త చెప్పిన చైనా!
బీజింగ్: కరోనా కరాళ నృత్యంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు చైనా మరోసారి భయపెట్టే వార్త చెప్పింది. చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్‌లో ఇటీవల రెండు బుబోనిక్ ప్లేగ్ వ్యాధి కేసులు బయటపటపడ్డాయని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా ఆదివారం వెల్లడించింది. అడవి ఉడుత (మర్మోట్) మాంసం అమ్మే వ్యక్తి (27), అతని తమ్మునికి జూలై 1న ప్లేగ్ నిర్ధారణ అయిందని తెలిపింది. వారిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. వారితో కాంటాక్ట్ అయిన 146 మందిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారని వెల్లడించింది. (చదవండి: గులాబీ రంగు మంచు.. పర్యాటకుల ఆందోళన) ఇక బుబోనిక్ ప్లేగ్‌పై మంగోలియా అలర్ట్ అయింది. తమ దేశంలోని బయన్నూర్ పట్టణంలో గత శనివారం ఒక ప్లేగ్ కేసు నమోదైందని తెలిపిన అక్కడి ప్రభుత్వం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లెవల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. ప్లేగ్ నియంత్రణ, నివారణకు 2020 చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని తెలిపింది. కాగా, బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరీయా కీటకాల ద్వారా ఇతర జంతువులు, మనుషులకు వ్యాప్తిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం అందకుంటే 24 గంటల్లోనే రోగి మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తెలుస్తోంది. ఇదిలాఉండగా..గతేడాది మంగోలియాలోని బయాన్ ఉల్గీ ప్రాంతంలో అడవి ఉడుత పచ్చి మాంసం తిని బుబోనిక్ ప్లేగ్ బారినపడ్డ ఇద్దరు మరణించడం గమనార్హం. ఇక కరోనా విషయంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదనే విమర్శల నేపథ్యంలో చైనా ఇటీవల పందుల నుంచి వ్యాపించే జీ4 వైరస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కొత్త వైరస్ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేకున్నా.. భవిష్యత్తులో ఇది కరోనా మాదిరే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వుహాన్‌లో నియంత్రణలో ఉన్న కరోనా, బీజింగ్‌లో అధికమవుతోంది. అక్కడ కొత్తగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (భవిష్యత్ మహమ్మారి జీ4..!) -
ఉడుత పచ్చి మాంసం తిన్నందుకు..
మాస్కో : మెరుగైన ఆరోగ్యం కోసమని ఉడుత పచ్చి మాంసాన్ని తిన్న దంపతులు మృత్యువాత పడ్డారు. ప్లేగు వ్యాధితో వారు మరణించడంతో ఇరుగుపొరుగు వాళ్లతో పాటు స్థానిక ప్రజలంతా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఈ ఘటన మంగోలియా- రష్యా సరిహద్దులోని సగనూర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగోలియా సరిహద్దు వద్ద భద్రతా ఏజెంట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి అనారోగ్యం సోకడంతో ఉడుత మాంసం తినాలని భావించాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి ఉడుత కిడ్నీలు, గాల్ బ్లాడర్, ఉదర భాగాన్ని పచ్చిగానే ఆరంగించాడు. దీంతో ఇన్ఫెక్షన్ సోకి జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు శరీరంలోని వివిధ అవయవాలు పాడైపోవడంతో రావడంతో సదరు వ్యక్తి పదిహేను రోజుల క్రితం మరణించగా.. ఈనెల 1న అతడి భార్య ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో సగనూర్ పట్టణ ప్రాంతంలో అలర్ట్ విధించడంతో స్థానికులంతా అక్కడి నుంచి దూర ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఈ విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వాలంటీర్ ఆరిన్‌తుయా ఓచిర్‌పురేవ్ మాట్లాడుతూ.. పచ్చి మాంసం తినడం వల్లే దంపతులిద్దరు చనిపోయారని పేర్కొన్నారు. వీరికి తొమ్మిది నుంచి 14 నెలల వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారని.. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. మృతులకు సోకిన అత్యంత ప్రమాదకర నిమోనిక్ ప్లేగు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే కారణంగా ప్రభుత్వాధికారులు ప్రజలను వెంటనే అప్రమత్తం చేశారని వెల్లడించారు. ప్రజలతో పాటు టూరిస్టులను కూడా వేరే చోటికి తరలిస్తున్నారని పేర్కొన్నారు. కాగా 2010-15 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3200 మందికి ప్లేగు వ్యాధి సోకగా.. అందులో 584 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. అదే విధంగా అమెరికాలో ఏడాదికి సగటున ఏడు ప్లేగు వ్యాధి కేసులు నమోదవుతున్నాయని సీడీసీ పేర్కొంది. ముఖ్యంగా న్యూ మెక్సికో, నార్తన్ అరిజోనా, సదరన్ కొలరెడో, కాలిఫోర్నియా, సదరన్ ఓరెగాన్, వెస్ట్రన్ నెవాడలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. ఇక పచ్చి మాంసం తినడం వల్ల మరణాలు సంభవించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని హవాయి యూనివర్సిటీ ట్రాపికల్ మెడిసన్ డైరెక్టర్ విలియం గోస్నెల్ అన్నారు. పచ్చి మాంసం తినడం వల్ల శరీరంలోకి అనేక రకాల చెడు బ్యాక్టీరియా సులభంగా ప్రవేశించి.. ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని పేర్కొన్నారు. దీని కారణంగా విపరీతమైన కడుపు నొప్పి , తలనొప్పి, తీవ్ర జ్వరం, షాక్‌కు గురవ్వడం, చర్మ సంబంధ వ్యాధులు సోకుతాయని తెలిపారు.ఉడికించి తినడం వల్ల మాంసంలోని బ్యాక్టీరియా చనిపోతుందని.. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. -
ఆక్సిజన్ కాక్టయిల్స్కు యమ డిమాండ్
ఉలాన్బాతర్ : మంగోలియా ప్రజలు ఆక్సిజన్ కాక్‌టయిల్స్‌ను తెగ పీల్చేస్తున్నారు, లంగ్ టీని తెగ తాగేస్తున్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న మంగోలియా ప్రజలకు ఇవి మంచి ఉపశమనం ఇస్తున్నాయని ప్రచారం జోరందుకోవడంతో ఈ ఉత్పత్తుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఓ ఆక్సిజన్ కాక్‌టయిల్స్ క్యాన్‌ను తీసుకుంటే పచ్చటి అడవిలో నాలుగు గంటలపాటు నడిచినట్లేనన్న ప్రచారం ప్రజల్లో జోరుగా ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక కాలుష్యం ఉన్న ఓ దేశ రాజధాని నగరం ఉలాన్బాతర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన కాలుష్య ప్రమాణాలకన్నా ఉలాన్బాతర్ నగరంలో కాలుష్యం 133 రెట్లు ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ కాక్‌టయిల్స్, లంగ్ టీలను ఒక డాలర్ నుంచి రెండు డాలర్ల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. గర్భవతులైన తల్లులు తప్పనిసరిగా ఆక్సిజన్ కాక్‌టయిల్స్‌ను తీసుకోవాలని స్థానిక వైద్యులు ఎక్కువగా సూచిస్తున్నారు. గర్భవతులు కాలుష్యానికి గురైతే 20 శాతం మంది పిల్లలు ఏదో లోపంతో పుడతారని వైద్యులు చెబుతున్నారు. మంగోలియాలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా నిమోనియాతో మరణిస్తున్నారు. ‘లైప్ ఈజ్ ఏర్’ నినాదంతో ఆక్సిజన్ కాక్‌టయిల్స్‌ను అమ్ముతున్నారు. లంగ్ టీని సేవించడం వల్ల రక్తంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వస్తాయని, అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లాక శ్లేష్మంగా మారి బయటకు వచ్చేస్తాయని, ఈ టీని సేవించడం వల్ల రోగ నియంత్రణ శక్తి కూడా పెరుగుతుందని ‘లంగ్ టీ’ కంపెనీ సీఈవో డాక్టర్ బాతర్ ఛాంట్సాల్డులమ్ చెబుతున్నారు. ఈ టీ వల్ల ఊపిరితిత్తులు ప్రక్షాళన అవుతాయని స్థానిక ప్రజలు విశ్వసించడం వల్ల కాలుష్యం ఎక్కువగా ఉండే శీతాకాలంలో వీటి అమ్మకాలు 30 శాతం పెరుగుతున్నాయి. కాలుష్యం ప్రభావం తగ్గించుకోవాలంటే కాలుష్యానికి దూరంగా ఉండడం ఒక్కటే ఉత్తమమార్గమని, ఆక్సిజన్ కాక్‌టయిల్స్ తీసుకోవడం వల్ల కాలుష్యం ప్రభావం తగ్గుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య విభాగం అధిపతి మరియా నీరా తెలియజేశారు. -
అంకుశ్ పసిడి పంచ్
న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ అంకుశ్ దహియా సత్తా చాటాడు. మంగోలియాలో ఆది వారం ముగిసిన ఈ టోర్నీలో అతను పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 60 కేజీల విభాగం ఫైనల్లో 19 ఏళ్ల అంకుశ్ కొరియాకు చెందిన చో చోల్‌ను ఓడించాడు. మణిపూర్‌కు చెందిన దేవేంద్రో సింగ్ (52 కేజీలు) రజతాన్ని సాధించాడు. ఫైనల్లో దేవేంద్రో 2–3తో సుగురో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మొత్తం ఈ టోర్నీలో భారత్ స్వర్ణం, రజతం, 3 కాంస్య పతకాలను సాధించింది.