most wanted criminal
-
15 ఏళ్ల వేట.. చివరకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్
వాషింగ్టన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న నేరస్తుడిని బ్రిటన్‌లో అరెస్టు చేశారు. 2009లో కాలిఫోర్నియా బయోటెక్నాలజీ సంస్థపై జరిగిన బాంబు దాడి ఘటనలో డేనియల్ ఆండ్రియాస్ ప్రధాన అనుమానితుడు. అమెరికాలో అప్పట్లో అతన్ని మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల లిస్టులో చేర్చారు.బాంబు దాడి తర్వాత పరారీలో ఉన్న డేనియల్ను బ్రిటన్‌లోని వేల్స్లో అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది.బ్రిటన్ పోలీసులు,ఎఫ్‌బీఐ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డేనియల్ను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.డేనియల్ 2009 నుంచి పరారీలో ఉన్నా తాము అతడిని వెంబడించడం ఆపలేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు.2009కు ముందు కూడా డేనియల్ పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడన్నఅభియోగాలుండడంతో అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. -
USA: ఇరవై ఏళ్ల తర్వాత చిక్కిన మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్
న్యూయార్క్: అమెరికా మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు ఒకరిని ఫేస్బుక్ పట్టిచ్చింది. 2004లో ఎల్డియాబ్లో రియానో అనే క్రిమినల్ ఒహియోలోని బార్లో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోయాడు. అప్పటి నుంచి రియానో పోలీసుల మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.తాజాగా ఫేస్బుక్ చూస్తున్న అమెరికా పోలీసులకు మెక్సికోలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి రియానో పోలికలకు దగ్గరగా ఉండటాన్ని గమనించారు. ఇంకేముంది వెళ్లి చూస్తే ఆ పోలీసు అధికారి రియానో అని తేలింది. దీంతో వెంటనే అతడిని అరెస్టు చేసి అమెరికాకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని సిన్సినాటిలోని బట్లర్ కౌంటీ జైలులో ఉంచారు. -
యోగి ఇలాకాలో మరో మోస్ట్‌వాంటెడ్ ఎన్కౌంటర్
-
యూపీలో మరొకటి.. పొద్దుపొద్దున్నే ఎన్కౌంటర్
లక్నో: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ఒకడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తాజాగా ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. పలు హత్యా, దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న గుఫ్రాన్‌ను మంగళవారం ఉదయం కౌశంబి జిల్లాలో పోలీసుల చేతిలో హతమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం కౌశంబి జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఐదు గంటల సమయంలో గుఫ్రాన్ పోలీసులకు ఎదురయ్యాడు. పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో రక్షణ కోసం ఎదురు కాల్పులకు దిగగా.. గుఫ్రాన్ శరీరంలోకి పోలీస్ తుటాలు దిగబడ్డాయి. గాయపడిన గుఫ్రాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. గుఫ్రాన్‌పై మొత్తం 13 కేసులు ఉన్నాయి. ప్రతాప్గఢ్తో పాటు పలు జిల్లాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. అతని ఆచూకీ కోసం.. లక్ష రూపాయల నజరానా ప్రకటించారు యూపీ పోలీసులు. 2017 నుంచి యూపీలో యోగి పాలనలో ఇప్పటిదాకా 10,900 ఎన్కౌంటర్లు జరగ్గా.. 185 మంది కరడుగట్టిన నేరస్థులు చనిపోయారు. ఇదీ చదవండి: కండోమ్ ప్యాకెట్‌తో కేసును చేధించిన పోలీసులు! -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు అరెస్ట్
అనంతపురం: హైదరాబాద్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు. గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసులో సుంకర ప్రసాద్ నాయుడుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్ నాయుడితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. వారికి చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్ నాయుడు గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయి. ఇటీవలే ఆకుల వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు ప్రసాద్ గ్యాంగ్. ఈ క్రిమినల్ గ్యాంగ్‌ను స్వయంగా విచారించారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఇదీ చదవండి: డామిట్.. కథ అడ్డం తిరిగింది -
51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని మూడు కమిషనరేట్ల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఘరానా రౌడీషీటర్ మహ్మద్ అష్వఖ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై 51 కేసులు ఉండటంతో విచారణ తప్పించుకోవడానికి 2014 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం తెలిపారు. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన అష్వఖ్ 2000 సంవత్సరం నుంచి నేరాలు చేస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ అయూబ్ ఖాన్‌ను అనుచరుడిగా వ్యవహరించాడు. కాలాపత్తర్, ఫలక్‌నుమ, రెయిన్‌బజార్, శాలిబండ, సంతోష్‌నగర్, అంబర్పేట్, రాజేంద్రనగర్, పహాడీషరీఫ్ల్లో ఇతడిపై కేసులు ఉన్నాయి. దీంతో 2005లో ఇతడిపై కాలాపత్తర్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. దాడి, హత్యాయత్నం, దొంగతనం, దోపిడీలతో పాటు తుపాకులతో బెదిరించిన ఆరోపణలపై 51 కేసులు నమోదయ్యాయి. పహాడీషరీఫ్ ప్రాంతంలో తన అనుచరులతో కలిసి 2014లో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. ఈ కేసులో అనుచరులు అంతా అరెస్టు కాగా... అష్వఖ్ మాత్రం గుజరాత్ పారిపోయాడు. అక్కడి ఉండీ కాలాపత్తర్‌లో ఇద్దరిని బెదిరించడంతో రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇతడిపై ఉన్న కేసుల విచారణను తప్పించుకోవడానికి కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో వివిధ కేసులకు సంబంధించిన 16 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇలా మోస్ట్ వాంటెడ్‌గా మారిన అష్వఖ్‌ను పట్టుకోవడానికి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ తమ బృందాలతో నిఘా ఉంచారు. గుజరాత్ నుంచి రాజస్థాన్‌కు మకాం మార్చిన ఇతగాడు రహస్యంగా నగరానికి వచ్చిపోతున్నాడనే సమాచారం అందడంతో నెల రోజులుగా కాపుకాశారు. ఆదివారం సిటీకి వచ్చిన అష్వఖ్‌ను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కాలాపత్తర్ పోలీసులకు అప్పగించామని చక్రవర్తి తెలిపారు. చదవండి: కట్నం డబ్బుతో వరుడు పరార్.. ఇంకెవరూ తనలా మోసపోకూడదని ఏం చేసిందంటే! -
సోషల్ యాప్‌లే అతడి అడ్డా: యువతులతో నగ్నంగా..
కడప అర్బన్ : ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంతిరెడ్డి, అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ బూడిద సునీల్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ప్రసన్నకుమార్ చిన్నవయసులోనే వ్యసనాలకు బానిసయ్యాడు. బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదవు మానేశాడు. జల్సాలకు కావాల్సిన డబ్బుల కోసం 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు సీఎస్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు (ఇన్సెట్లో) నిందితుడు ప్రసన్న కుమార్ ప్రసన్నకుమార్‌కు కడప నబీకోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్‌చాట్ ద్వారా 2020 డిసెంబర్లో పరిచయం అయ్యాడు. శ్రీనివాసుతో తన పేరు ప్రశాంత్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అని, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో పనిచేస్తానని, అక్కడ చాలామంది తెలుసునని నమ్మబలికాడు. శ్రీనివాసుకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని అతని తల్లిని నమ్మించాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించాలని డబ్బులు కావాలని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి డబ్బు ఇచ్చింది. తరువాత ప్రశాంత్‌రెడ్డికి శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. జూలై 29న కడప అక్కాయపల్లెలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 30 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవి రింగులను దొంగిలించుకుని వెళ్లాడు. ప్రసన్నకుమార్‌ను పోలీసులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అల్లరి, చిల్లరగా తిరిగేవాడు. కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసేవాడు. వారితో పరిచయం చేసుకుని ప్రేమలోకి దించి, వారితో అసభ్యకరరీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వివస్త్ర రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకుంటాడు. తద్వారా వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్‌పే, ఫోన్ పేల ద్వారా డబ్బులను వసూలు చేసేవాడు. మరికొంతమందిని శారీరకంగా కూడా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లి, వాటిని అమ్మి జల్సాగా తిరిగేవాడు. ఈ విధంగా సుమారు 200 మంది అమ్మాయిలు, 100 సంఖ్యలో మహిళలను మోసగించినట్లు తెలిసింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్ఐలు ఎస్‌కెఎం హుసేన్, బి.రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ జి.సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు ఎస్.ఓబులేసు, పులయ్య, ప్రదీప్‌లను డిఎస్పీ సునీల్ అభినందించారు. ఈ సంఘటనలో నిందితుడి నుంచి రూ.1,26,000 నగదును, 30గ్రాముల బరువున్న బంగారుగాజులు, ఒక జతకమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవిరింగ్, నిందితుడి సెల్ఫోన్లను రికవరీ చేశారు. -
బాక్సర్ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు..
న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన ఓ కుర్రాడు.. చెడు సహావాసాలు, వ్యసనాల కారణంగా బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకొని గ్యాంగ్‌స్టర్‌గా మారి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలోకెక్కాడు. హర్యానాలోని సోనేపట్ జిల్లా గానౌర్ గ్రామానికి చెందిన దీపక్ పహల్ అనే 25 ఏళ్ల యువకుడు, చిన్నప్పటి నుంచి బాక్సర్ కావాలని కలలుకన్నాడు. అయితే చెడు సహవాసాల కారణంగా అతను ట్రాక్ తప్పాడు. బాక్సింగ్ రింగ్‌లో రికార్డులు సృష్టించాల్సిన అతను ప్రస్తుతం పోలీసు రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా నిలిచాడు. కిడ్నాప్, మర్డర్ సహా పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతనిపై పోలీసులు 2లక్షల రివార్డు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనేపట్ జిల్లాకు చెందిన దీపక్ పహల్, చిన్నతనం నుంచి బాక్సింగ్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. అతనికి 12 ఏళ్ల వయసున్నప్పుడు బీజింగ్ ఒలంపిక్స్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. విజేందర్ సింగ్‌ను స్పూర్తిగా తీసుకున్న అతను.. ఎలాగైనా ఆ స్థాయికి చేరాలని స్థానిక బాక్సింగ్ క్లబ్లో సాధన చేయడం మొదలు పెట్టాడు. దీపక్‌లోని ప్రతిభను గమనించిన కోచ్ అనిల్ మాలిక్ అతనికి కఠినమైన శిక్షణను అందించాడు. దీంతో క్లబ్లో చేరిన మూడేళ్లకే 2011లో అతను జూనియర్ స్థాయిలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆతరువాత జాతీయ బాక్సింగ్ జట్టులో స్థానం సంపాదించిన అతను భారత్ తరఫున ఎన్నో పతకాలు సాధించాడు. అయితే చెడు స్నేహాల కారణంగా దీపక్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం అతన్ని ఢిల్లీలో గోగి అనే గ్యాంగ్‌స్టర్ వద్దకు చేర్చింది. గోగి.. ఉత్సాహవంతులైన కుర్రాలను చేరదీసి, ఒక ముఠాగా మార్చి సుపారీ హత్యలు చేయించేవాడు. దీపక్ స్వతాహాగా చురుకైన కుర్రాడు కావడంతో కొద్ది కాలంలోనే గోగి బృందంలో కీలక సభ్యుడిగా మారిపోయాడు. హత్యలు, దొమ్మీలలో ఆరితేరిపోయాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం పెరోల్‌పై బయటకు వచ్చిన అతను.. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ హత్య కేసుకు సంబంధించి గోగీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీ నుంచి గోగిని తప్పించడానికి పహల్ ఏకంగా పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు. గత వారంలో గోగిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దీపక్ మార్గమధ్యంలో కాల్పులు జరిపాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గోగి మరణించగా, దీపక్ తప్పించుకున్నాడు. ప్రస్తుతం దీపక్‌పై ఢిల్లీ పోలీసులు 2 లక్షల రివార్డును ప్రకటించారు. కొడుకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారడంపై తల్లి, కోచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపక్ సాధించిన పతకాలు చూసి అతని తల్లి కన్నీరుమున్నీరవుతుంది. ఏదో ఒక రోజు దేశమంతా నా గురించి మాట్లాడుకోవాలని చెప్పిన కుర్రాడు చివరికి ఇలా తయారవుతాడని ఊహించలేదంటున్నాడు కోచ్ అనిల్ మాలిక్. -
ముగ్గురు భార్యలు.. మరో ముగ్గురితో సహజీవనం
సాక్షి,హైదరాబాద్: మంత్రి శంకర్..దాదాపు నలభై ఏళ్లుగా అన్ని పోలీసు విభాగాలకు సుపరిచితమైన పేరు. ఇతడి గురించి చెప్పాలంటే అనేక దొంగతనాల్లో ఆరితేరిన తస్కర యోధవృద్ధుడు..చోరకళా తపస్వి. అవును.. 256 నేరాలు..32 సార్లు జైలు శిక్ష..నాలుగుసార్లు పీడీ యాక్ట్..ఇదీ మంత్రి శంకర్ అలియాస్ శివన్న ట్రాక్ రికార్డు. అయితే..ఏంటి? అనుకుంటున్నారా?? ఇన్నిసార్లు జైలుకెళ్లినా అతగాడి దొంగబుద్ధి మాత్రం మారలేదు. మరీ!! ఇరవై ఏళ్ల వయసులోనే దొంగతనాలు ప్రారంభించిన మంత్రి శంకర్ 60 ఏళ్ల వయసొచ్చినా తన బుద్ధి మార్చుకోలేక పోలీసుల చేతికి మళ్లీ చిక్కాడు. ఈసారి ఆరు నేరాల్లో నిందితుడిగా ఉన్న మంత్రి శంకర్‌తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురినీ కూడా అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సాధారణంగా బోయిన్పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ ఠాణాల పరిధిల్లో ఒంటరిగానే చోరీలు చేసే మంత్రి శంకర్ వయసు మీదపడుతుండటంతో గత రెండేళ్లుగా ముఠాలను కట్టి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చదవండి: న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం గతంలో ఓ కేసులో జైలుకెళ్లిన మంత్రి శంకర్ ఈనెల 4న జైలు నుంచి బయటకొచ్చాడు. అయితే ఈసారి ఫలక్‌నుమాకు చెందిన అబ్దుల్ లతీఫ్ ఖాన్, భవానీనగర్ వాసి మహ్మద్ మజీద్, నల్లకుంట వాసి మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్‌లతో కలసి మంత్రి శంకర్ ముఠాను ఏర్పాటు చేసుకుని నల్లకుంట, కుషాయిగూడ, వనస్థలిపురం ప్రాంతాల్లో తన చేతివాటం చూపించాడు. ఈనెల 11వ తేదీ రాత్రి బేగంపేటలో వరుసగా ఐదు ఇళ్ళ తాళాలు పగులకొట్టి ‘సోదా’చేయగా..రెండు ఇళ్ళల్లో మాత్రం బంగారం, నగదు లభించడంతో ఎత్తుకుపోయారు. బేగంపేటలో నమోదైన కేసుల దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్లు మంత్రి శంకర్ తోపాటు అతడికి సహకరించిన ముగ్గురినీ మహారాష్ట్రలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షల నగదుతో పాటు బంగారం, వాహనాలు, చోరీకి వాడే వస్తువులు స్వా«దీనం చేసుకున్నారు. అలా దొంగగా మారి.. సికింద్రాబాద్‌లోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్ అప్పట్లో తన తల్లితో తరచూ గొడవపడుతున్న వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన శంకర్ 1979 డిసెంబర్లో తొలిసారిగా ఓ చోరీ చేసి దొంగగా మారాడు. ఈ కేసులో ఆ తర్వాత చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్‌గా మారాడు. ఈ నేరం కింద పోలీసులకు చిక్కడంతో రిమాండ్ నిమిత్తం అప్పటి ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్ళాడు. అక్కడే శంకర్‌కు నాటి ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధికి చెందిన దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్ సింగ్, దీపక్ సక్సేనా, నాగులు వద్ద తాళం ఎలా పగులకొట్టాలో నేర్చుకున్నాడు. అక్కడే జైలులోని వంటగది తాళం పగులకొట్టించి చోరీ చేయిస్తూ వంట సామాను బయటకు తెప్పించి వండుకుని తినేవాళ్ళు. మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న నగర సీపీ అంజనీకుమార్. దొంగే..దొరబాబులా దొరబాబులా ఖరీదైన వస్త్రాలు, బూట్లు, టై ధరించి కార్లలో తిరుగుతూ రెక్కీలు చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇల్లు రోడ్డు మీదికి కనిపిస్తే చాలు కాస్త దూరంలో వాహనాన్ని ఆపి దర్జాగా వెళ్ళి ‘పని’పూర్తి చేసుకుని వచ్చేవాడు. చిన్న రాడ్డు, స్క్రూ డ్రైవర్లను తనతో ఉంచుకునే శంకర్ ఎలాంటి తాళాన్నైనా కేవలం పది సెకన్లలో పగులకొట్టేవాడు. అర్ధరాత్రి దొంగతనం చేసి ఆ ఇంటి మిద్దె మీద తెల్లవారే వరకు కూర్చుని..మార్నింగ్ వాకర్స్ హడావుడి మొదలైనప్పుడు వారితో కలసిపోయేవాడు. ఇతడు పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా మకాం మారుస్తూ ఉంటాడు. చోరీల ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే ఇతగాడికి వ్యభిచారం ప్రధాన బలహీనత. వ్రస్తాలు, బూట్లతో సహా ప్రతీదీ బ్రాండెడ్వే ఖరీదు చేసి వాడతాడు. ఇతగాడికి ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం మరో ముగ్గురు యువతులతో సహజీవనం చేస్తున్నాడు. -
మోస్ట్ వాంటెడ్.. మంత్రి శంకర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : కరుడుగట్టిన నేరస్థుడిగా ముద్రపడిన మంత్రి శంకర్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. శంకర్‌తో పాటు అతని ముగ్గురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ. 12 లక్షల నగదు, సిల్వర్ ఆభరణాలు,రెండు వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి నేరాలకు పాల్పడడంలో శంకర్ దిట్ట. ఇప్పటివరకు సుమారు 300 దొంగతనాలకు పాల్పడ్డ శంకర్ 30 సార్లు అరెస్ట్ అయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్‌కు అతని స్వగ్రామంలో మంచి దానఖర్ముడని పేరు ఉండడం విశేషం. కాగా హైదరాబాద్‌లో సెటిల్ అయిన మంత్రి శంకర్‌కు ముగ్గురు భార్యలు.. ఆరుగురు సంతానం ఉన్నారు. (చదవండి : గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు) హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. 'ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ముద్రపడిన మంత్రి శంకర్‌ను పట్టుకున్నాం. అతనితో పాటు అనుచరులు అబ్దుల్ లతీఫ్ ఖాన్, మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నాం. నిందితుల నుంచి 12 లక్షల 9వేల నగదు, 100 గ్రాముల అర్నమెంట్ బంగారం,రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాం. మంత్రి శంకర్ 1979 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. అతనిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 250 కేసులు ఉన్నాయి.ఈ గ్యాంగ్ పగలు రెక్కీ చేసి రాత్రి 1 నుంచి 4 గంటల మధ్య దొంగతనాలు చేస్తుంది. ఈ నెల 4న జైలు నుంచి విడుదలైన శంకర్ బయటకు వచ్చి 20 రోజుల్లోనే 6 దొంగతనాలకు పాల్పడ్డాడు. కుషాయిగూడ,వనస్థలిపురం,బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశారన్నారు. (చదవండి : ఇళ్లు అద్దెకు తీసుకొని..గుట్టుగా వ్యభిచారం) -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నదీమ్ అరెస్ట్
ఢిల్లీ: ఘాజిపూర్ ఎన్కౌంటర్ అనంతరం మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నదీమ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటి కమిషనర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం గాజిపూర్ ముర్గా సమీపంలో నదీమ్‌ను అదుపులోకి తీసుకుంది. అయితే పోలీసులను చూసి నదీమ్ కాల్పులకు తెగబడటంతో ఇరువర్గాల మధ్య కాల్పుల కలకలం రేగింది. ఈ ఏడాది జులైలో సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పై కూడా ఆయన కాల్పులు జరిపి నదీమ్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు కూడా హత్యాయత్నం సహా పలు క్రిమినల్ కేసుల్లో నదీమ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్: వేషం మార్చి..
ముంబై/మీరట్ : ప్రముఖుల హత్యలతో సహా 51 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వేషం మార్చి పండ్లు అమ్ముకునే వాడిలా కొత్త అవతారం ఎత్తాడు. పాత నేస్తాల కారణంగా పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆషు జాత్(32) హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు వంటి 51 కేసుల్లో ప్రధాన నిందితుడు. నోయిడాకు చెందిన ప్రముఖులు గౌరవ్, హపుర్, బీజేపీ నాయకుడు రాకేశ్ శర్మలను హత్య చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ( డ్రగ్స్ కేసు: రియా చక్రవర్తి అరెస్టు! ) ఉత్తరప్రదేశ్‌నుంచి ముంబైకి మకాం మార్చాడు. వేషం మార్చి పండ్లముకునే వాడిలా అవతారం ఎత్తాడు. అయితే అతడు ముంబైలోనే ఉంటున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందింది. కానీ, ఆషు వేషంలో మార్పు కారణంగా అతడ్ని కనుక్కోవటం కష్టంగా మారింది. వేషం మార్చినా అతడు పాత స్నేహితులతో సంబంధాలు తెంచుకోలేదు. ఓ రోజు యూపీలోని అతడి సహచరుడికి ఫోన్ చేయటంతో ట్రాక్ చేసిన పోలీసులు శనివారం ఆషుని అరెస్ట్ చేశారు. -
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్
కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర నేరాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కడప అర్బన్ సీఐ కార్యాలయ ఆవరణలో సీఐ ఎస్ఎం అలీ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ, అర్బన్ సీఐ ఎస్ఎం అలీ, చెన్నూరు ఎస్ఐ పెద్ద ఓబన్న జిల్లా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. చెన్నూరు మండలంలోని కొండపేట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న షేక్ సింపతి జాకీర్ అలియాస్ సింపతి లాల్‌బాషాతోపాటు మరో పది మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో చాపాడు మండలానికి చెందిన చిన్న దండ్లూరు మహమ్మద్ నాసీర్, జి.రజాక్‌వల్లీ, రైల్వేకోడూరు మస్తాన్, సీకే దిన్నె మండలానికి చెందిన నాగదాసరి మహేష్, తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా వాసులు తంగవేలు, కనకరాజ్, «సుబ్రమణి, ధర్మపురి జిల్లాకు చెందిన వెంకట్రామన్, లక్ష్మణ్, రఘు ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన షేక్ సింపతి జాకీర్ గతంలో ఆటో నడిపే వాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాల కు పాల్పడే వాడు. క్రమేణా అంతర్జాతీయ స్మగ్లర్లతో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. ఇతనిపై జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో దాదాపు 60 కేసులు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి 16 ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 31 లక్షలు ఉంటుంది. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎస్బీ సీఐ పుల్లయ్య, ఎస్ఐ మధుమల్లేశ్వర్‌రెడ్డి, ఏఆర్ ఎస్ఐ మురళి, హెడ్‌కానిస్టేబుళ్లు శివ, సాగర్, రాజేష్, రమణ, కొండయ్య, గోపి నాయక్, స్పెషల్ పార్టీ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
మాజీ పోలీస్.. 8 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు అస్లుప్.. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్సై. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు దారితప్పి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి వరుస నేరాలు చేస్తూ ఎనిమిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. గత వారం హరియాణాకు చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) ఇతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో.. హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అస్లుప్ అంగీకరించాడు. దీనిపై తమకు అధికారిక సమాచారం లేదని ఇక్కడి పోలీసులు చెబుతున్నారు. ఎస్సై దొంగగా మారాడిలా.. హరియాణాలోని నుహ్ జిల్లాకు చెందిన అస్లుప్ పదేళ్ల క్రితం ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్–ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. జల్సాలకు అలవాటుపడి తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు పెడదారి పట్టాడు. కొందరు నేరగాళ్లకు సహకరిస్తూ వారితో చోరీలు, దోపిడీలు చేయించేవాడు. చోరీ సొత్తును విక్రయించడానికి సహకరిస్తూ భారీగా కమీషన్లు తీసుకునేవాడు. ఆరేళ్ల క్రితం ఇది గుర్తించిన ఢిల్లీ పోలీసులు అస్లుప్‌ను అరెస్టు చేశారు. దీంతో ఉద్యోగం కోల్పోయిన అతడు జైలు నుంచి బయటకొచ్చాక నేరాలు చేయడాన్నే వృత్తిగా చేసుకున్నాడు. ఏటీఎంల్లో చోరీలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు. పోలీసులకు చిక్కకుండా, తన ఉనికి బయటపడకుండా ఈ నేరాలన్నీ ఒంటరిగానే చేసేవాడు. హైదరాబాద్‌తో పాటు హరియాణా, కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతా, గుజరాత్, రాజస్తాన్, ఒడిశాలోని పలు నగరాల్లో మొత్తం 24 నేరాలు చేసిన ఇతడు మోస్ట్ వాంటెట్‌గా మారాడు. హరియాణా పోలీసులు రూ.50 వేల రివార్డు సైతం ప్రకటించారు. హైదరాబాద్‌లోనూ అస్లుప్ నేరాలు? హరియాణాకు చెందిన సీఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి అస్లుప్‌పై నిఘా ఉంచింది. గత శుక్రవారం.. ఢిల్లీ–అల్వాల్ హైవేపై ఉన్న కేఎంపీ రోడ్‌లోని రేవాసన్ హోటల్ వద్ద ఇతడిని వలపన్ని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అస్లుప్‌ను కోర్టులో హాజరుపరిచిన సీఐఏ తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుంది. అనంతరం ఇతడికి సంబంధించి కేసులున్న ఇతర నగరాల పోలీసులకు అధికారిక సమాచారం ఇవ్వనున్నారు. నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి దీనిపై మాట్లాడుతూ... ‘అస్లుప్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో ఎక్కడెక్కడ నేరాలు చేశాడనేది ఇప్పుడే చెప్పలేం. హరియాణా పోలీసుల నుంచి అధికారిక సమాచారం అందితే స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఎదురు చూడాల్సిందే’అని చెప్పారు. -
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అనుచరుడి అరెస్ట్
కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ మూలె వినయ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు మామిళ్ల పత్తయ్యగారి చిన్నరాజను అరెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 2లక్షలు విలువచేసే మద్యం, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ తెలిపారు. సోమవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు కరోనావై రస్ నియంత్రణలో భాగంగా సోమవారం ఉదయం నుంచి మాస్క్‌లపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పాతబైపాస్లో సుబ్బిరెడ్డి కళాశాల వద్ద సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్ఐ ఎం. సత్యనారాయణ తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు (కేఏ03 ఏడీ 1801)లో వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్‌స్టర్ మూలె వినయ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు మామిళ్ల పత్తయ్యగారి చిన్నరాజ హైదరాబాద్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ ఉండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు రూ. 2 లక్షలు విలువ చేసే( 57పుల్‌బాటిళ్లు, 321 క్వార్టర్ బాటిళ్లు) మద్యం బాటిళ్లను, సుమారు 4 లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని విచారించగా, వినయ్‌కుమార్‌రెడ్డి, చిన్నరాజ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సిటీలో కొన్ని మద్యంషాపులలో మద్యం కొనుగోలు చేశారు. వాటిని వినాయ్కుమార్రెడ్డి తన అనుచరుడి ద్వారా కడపకు పంపించాడు. వినయ్కుమార్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకబృందాన్ని ఏర్పాటు చేశామని డీఎస్సీ తెలిపారు. ఇతనిపై చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్ఐలు ఎం. సత్యనారాయణ, హెచ్‌కానిస్టేబుల్ జె. రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు ఏ. శివప్రసాద్, ఎం. జనార్ధన్‌రెడ్డి, వి. చెండ్రాయుడు, పి. రాజేష్, ఎం. శ్రీనివాసరావు, వి. తిరుపతయ్య, సీ. సుధాకర్ యాదవ్‌లను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, డీఎస్పీ సూర్యనారాయణలు అభినందించారు. -
రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష
కడప అర్బన్: నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఐతం రవిశంకర్ అలియాస్ రవి ఆచూకీ కోసం తెలంగాణా రాష్ట్ర పోలీసులు వైఎస్సార్ జిల్లాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పోలీసులకు పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పోలీసుల బృందం ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశేఖర్ అలియాస్ రవి (45) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ నాలుగు రాష్ట్రాల్లో అతనిపై 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇతను వైజాగ్ కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తూ, ఈ ఏడాది మే 21న కోర్టుకు ఎస్కార్ట్‌తో వాయిదాకు వెళుతున్న సమయంలో కన్నుగప్పి పరారయ్యాడు. కర్ణాటకలో ఐ20 కారును దొంగిలించి, దానికి నకిలీ నంబర్ (ఏపీ 39 ఏక్యూ 1686) వేసుకుని ఫార్మసీ చదువుతున్న రంగారెడ్డి జిల్లా రంగన్నగూడకు చెందిన యువతి సోని(21)ని కిడ్నాప్ చేశాడు. అంతకు ముందు ఈనెల 23న ఉదయం సోని తల్లిదండ్రులు నడుపుతున్న హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లి వారితో మాటలు కలిపాడు. సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమె తండ్రితో కలిసి తన కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం వరకు తిరిగారు. తరువాత ఆమె తండ్రిని కుమార్తెకు సంబంధించిన సర్టిఫికెట్లను జిరాక్స్ చేయించుకు రమ్మని పంపాడు. ఆయన తిరిగి వచ్చేసరికి కారు వెళ్లిపోయింది. అందులో తన కుమార్తెను తీసుకుని వెళ్లాడని, ఆమె కిడ్నాప్‌నకు గురైందని రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ నిందితుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు ఆధ్వర్యంలో అదే రోజున కారు ఆచూకీని వెతుక్కుంటూ వైఎస్సార్ జిల్లాలోకి వచ్చారు. 24వ తేదీన కడపలో ప్రవేశించిన కారు ఉదయం ఒంటిమిట్ట హరిత హోటల్ వరకు వెళ్లిన పుటేజీలు కనిపించాయి. కడపలో ఓ సీసీ కెమెరా ఫుటేజీలో కారులో వెనుకసీటులో సోని ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడిన టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిగా ప్రకటించామన్నారు. -
ఎదురుకాల్పుల్లో నేరస్తుడికి గాయాలు
బరంపురం: గంజాం జిల్లా రంబాలో పోలీసుల ఎదురు కాల్పుల్లో మోస్ట్‌వాంటెడ్ క్రిమి నల్ సంతోష్ బెహరా గాయా లపాలయ్యాడు. ఈ సందర్భం గా డీఐజీ ఆశిష్ కుమార్‌సింగ్ అందించిన సమాచారం ప్రకా రం వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు గంజాం పోలీ స్ జిల్లా, రంబా పోలీస్‌స్టేషన్ పరిధి బలియాగడ, పాలురి జంక్షన్ రోడ్లో పోలీసుల లిస్ట్‌లో మోస్ట్‌వాంటెడ్‌గా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడు సంతో ష్ బెహరా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో తారసపడ్డాడు. పోలీసులు వచ్చినట్లు పసిగట్టిన నేరస్తు డు సంతోష్ బెహరా తొలుత పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణగా ఎదురు కాల్పులు జరపడంతో నేరస్తుడు సంతోష్ బెహరా రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల అనంతరం నేరస్తుడి నుంచి 1 మౌజర్ (పిస్టల్), 3 పేలని గుళ్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని నేరస్తుడు సంతోష్ బెహరాకు రంబా ప్రభుత్వ అస్పత్రి లో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. నేరస్తుడు సంతోష్ బెహరాపై గంజాం, నయగడ్, కొందమాల్ జిల్లాల్లో సుమారు 19కి పైగా దోపిడీలు, దొంగతనాలు, హత్యాయత్నాల వంటి కేసులు ఉన్నాయని డీఐజీ ఆశిష్‌కుమార్ సింగ్ తెలియజేశారు. -
మనిషే కుక్కను కరిచాడు
అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్నిరుగుతుందన్నాడు ఓ సినీరైటర్. రొటీన్‌కి భిన్నంగా జరిగే దురదృష్టాలకు ఈ డైలాగ్ సరిగా సూట్ అవుతుంది. ఇదంతా ఎందుకంటే... ఓ కుక్కని మనిషి కరిచాడు!! కుక్క ప్లేస్‌లో మనిషి, మనిషి ప్లేస్‌లో కుక్క అని ప్రింట్ మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారేమో! ఇందులో మిస్టేకేమీ లేదు.జర్మనీలో గారెత్ గ్రీవ్స్ క్రూరాత్ముడు కనీసం మూగజీవి అనే కనికరం లేకుండా కుక్కను కసుక్కున కరిచేశాడు. ఇంతకీ ఆ ప్రబుద్ధుడికి ఇదేం పోయే కాలం అని అనుకుంటున్నారా? మరేం లేదు... గ్రీవ్స్ దొరవారు అక్కడి పోలీసులకు ‘బాగా కావలసిన వాడు’... అనగా ‘మోస్ట్ వాంటెడ్’ క్రిమినల్. మార్టిన్ స్ట్రీట్ ప్రాంతంలో గ్రీవ్స్ పోలీసుల నుంచి పారిపోతుండగా, మన్పోల్ థియో అనే పోలీసు జాగిలం వెంటబడి తరిమింది. వృత్తి ధర్మంలో భాగంగా అతగాణ్ని అటకాయించింది. తనను పట్టుకోవడానికి పోలీసులే ముప్పుతిప్పలు పడుతుంటే ఆఫ్ట్రాల్ ఒక కుక్క తనను అటకాయించడం గ్రీవ్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. తన దారికి అడ్డు తగిలిన కుక్కపై అతగాడికి కోపం ముంచుకొచ్చింది. కోపం అదుపు తప్పడంతో కుక్కపై కాట్లకుక్కలా విరుచుకుపడ్డాడు. దంతబలం కొద్దీ దాని చెవి మీద, తల మీద ఎడాపెడా కొరికేశాడు. అయినప్పటికీ విశ్వాసానికి మారుపేరైన థియో ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అతగాడి పిక్క పట్టుకుని నిలువరించింది. పోలీసులు వచ్చి, గ్రీవ్స్‌ను అదుపులోకి తీసుకునేంత వరకు అది తన పట్టును ఏమాత్రం సడలించలేదు. ఈ తతంగమంతా గమనించిన ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కుక్క కాటుకి మందుంది కానీ, మనిషి కాటుకి మందు లేదంటారు. మరి చూడాలి... థియో ఈ కష్టం నుంచి ఎలా బయటపడుతుందో! ఏమో!! -
‘మనసా... వినవా’ దొంగను చేసింది
సాక్షి, హైదరాబాద్: ‘మనసా... వినవా’ అంటూ తెలుగు సినిమాను తెరకెక్కించి తన నిర్మాత కలను నిజం చేసుకోవడంతో పాటు మేనల్లుడిని హీరోగా పరిచయం చేయాలనుకున్న తమిళనాడు తిరువరూర్‌కు చెందిన బాలమురుగన్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. బ్యాంక్ దోపిడీలు చేస్తూనే... సినీ రంగంలో స్థిరపడాలనుకున్న మురుగన్ విలాసవంతమైన జీవితంతో ప్రాణాంతక వ్యాధి బారిన పడి రోజులు లెక్కిస్తున్నాడు. ‘ఆత్మ’ కథతో అదరగొట్టాలని అనుకున్నా... తన చోరీల గురించి పోలీసులకు తెలిసిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు మూడు నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడంతో సైబరాబాద్ పోలీసులు పీటీ వారంట్‌పై మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు బాలమురుగన్‌పై 29 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. సినిమా కోసం అడ్డదారి... సినీ కెరీర్లో స్థిరపడాలని 2008లోనే బాలమురుగన్, సురేశ్ కలసి దినకరన్‌తో రాత్రివేళలో బెంగళూరు, మడివాల, కరమంగళ, జ్ఞానభారతి ప్రాంతాల్లో ఇళ్ల దొంగతనాలు, దోపిడీలు చేశారు. 2011లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లోనే ఉన్న బాలమురుగన్ 2012లో విడుదలైన తర్వాత మకాం హైదరాబాద్‌కు మార్చాడు. దోచుకున్న సొత్తుతో హిమాయత్‌సాగర్‌లోని కిస్మత్పుర్లో ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ వారికి దగ్గరయ్యేందుకు ఈవెంట్స్ చేశాడు. కొందరు ప్రముఖుల వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఎన్.రాజమల్ల ఫిల్మ్స్ బ్యానర్ పేరుతో సౌత్ ఇండియా ఫిల్మ్ గిల్డ్ సభ్యత్వాన్ని తీసుకున్నాడు. తన సినీ కలను నెరవేర్చుకునేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో బ్యాంక్ దోపిడీలు, ఇళ్ల దొంగతనాలు చేశాడు. 2012 సంవత్సరంలో 50 లక్షల వ్యయంతో మనసా వినవా అనే సినిమా తీశాడు. అది ఇప్పటికీ విడుదల కాలేదు. రాజమండ్రిలో ఈ సినిమా ప్రారంభానికి పోలీసులు, రెవెన్యూ అధికారులతోనే క్లాప్ కొట్టించాడు. గుడువచేరికి చెందిన రైటర్ సంపత్తో కలసి ఆత్మ సినిమా తీయాలనుకున్నాడు. ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారం మేరకు బాలమురుగన్ పారిపోయాడు. ఫింగర్ ప్రింట్సే పట్టిచ్చాయి... ఇంటర్నెట్లో గూగుల్ సహకారంతో రూరల్, సబ్అర్బన్ ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంక్‌ల గురించి శోధన చేస్తాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న బ్యాంక్‌లనే టార్గెట్ చేసుకొని దోపిడీ చేస్తాడు. దినకరన్, అల్లుడు సురేశ్‌తో పాటు భార్య, కుమారుడు, కుమార్తెను కూడా తీసుకెళతాడు. గ్రేట్ డెన్ కుక్క కూడా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యామిలీతో చోరీకి వెళతాడు. పిల్లలిద్దరూ దత్తత తీసుకున్నవారే. బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో సురేశ్, బాలమురుగన్ కుటుంబసభ్యులతో వేచి చూస్తుంటే బాలమురుగన్, దినకరన్ బ్యాంక్‌లోకి వెళ్లి దోపిడీ చేస్తారు. ఆ తర్వాత తమిళనాడుకు పరారవుతారు. గతేడాది ఆగస్టులో మహబూబ్‌నగర్‌లోని గ్రామీణ బ్యాంక్‌లో రూ.40 లక్షల సొత్తు, నవంబర్ 16న చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో రూ.55 లక్షల సొత్తును, డిసెంబర్ 8వ తేదీ రాత్రి ఘట్కేసర్లోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో రూ.36 లక్షల సొత్తు చోరీ చేశారు. అయితే ఈ ఏడాది జనవరి 10న ఇబ్రహీంపట్నంలోని హెచ్‌డీసీసీ బ్యాంక్‌లో దోపిడీ చేస్తుండగా బ్లూకోర్డ్స్ రాకను గమనించి పరారయ్యారు. అక్కడే వెల్డింగ్ గ్యాస్, ఇన్నోవా కారును వదిలివెళ్లారు. అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ బెంగళూరులో ఓ కేసులో నిందితుడిగా ఉన్న బాలమురుగన్ చేతివేళ్లకు మ్యాచ్ అయ్యాయి. అలా బాలమురుగన్‌కు ఈ బ్యాంక్ దోపిడీ కేసుల్లో నిందితుడిగా గుర్తించగలిగారు. గత మార్చిలో తమిళనాడులోని తిరవరూర్లో మురుగన్ ఇంటిపై దాడులు చేయగా పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఈ సమయంలో అతనికి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రులకు సమాచారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఎట్టకేలకు 3 నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడంతో సైబరాబాద్ పోలీసులు పిటీ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
హైదరాబాద్: వరుస బ్యాంక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల ముఠాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, తమిళనాడుకు చెందిన మురుగున్ ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి రూ.1.7 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ఘట్ కేసర్ గ్రామీణ బ్యాంకుల్లో ఈ ముఠా చోరీకి పాల్పడిందన్నారు. వరదయ్యపాలెం, ఇబ్రహీంపట్నం బ్యాంకుల్లో కూడా నిందితులు చోరీకి పాల్పడి ఉండొచ్చునని వారు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయినట్లు వివరించారు. నిందితులను విచారణ చేస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
మోస్ట్‌వాంటెడ్ గజదొంగ అరెస్ట్
విజయవాడ సిటీ : అంతర్ జిల్లా మోస్ట్ వాంటెడ్ గజదొంగ దున్న కృష్ణను విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు చోరీ సొత్తు విక్రయించేందుకు సహకరించిన కోల్‌కతాకు చెందిన మహ్మద్ షబీర్ ఆలీ నయ్యాను అరెస్టు చేసి రూ.80 లక్షల విలువైన 2.5 కిలోల బంగారం, 15 కిలోల వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ ఈ వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా మిలియాకుట్టి మండలం చాప్రా గ్రామానికి చెందిన దున్న కృష్ణ బతుకుదెరువు కోసం కుటుంబం సహా విశాఖపట్నానికి వలస వెళ్లాడు. అక్కడ వెల్డర్‌గా జీవితం ప్రారంభించి వచ్చిన సంపాదన చాలకపోవడంతో 1995 నుంచి చోరీలను వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రారంభంలో విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చోరీలు చేశాడు. ఆయా జిల్లాల్లో 150కి పైగా కేసులు నమోదు కావడంతో పలుమార్లు పోలీసులు అరెస్టు చేసి విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో డీసీ షీటు తెరిచారు. 2011 నుంచి కోల్‌కతాకు మకాం మార్చిన దున్న కృష్ణ తరచూ ఇక్కడికి రాకపోకలు సాగిస్తూ చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 4, రాజమండ్రిలో 9, ఏలూరులో ఒక చోరీతో పాటు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 68 భారీ చోరీలు చేశాడు. ఆయా చోరీల్లో కొల్లగొట్టిన సొత్తును కోల్‌కతాకు చెందిన ఆలీ నయ్యా ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటూ వచ్చిన మొత్తాన్ని జల్సాలకు వినియోగించుకుంటున్నాడు. గత కొంతకాలంగా జరిగిన భారీ చోరీలపై నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు దున్న కృష్ణపై నిఘా పెట్టారు. అతను నగరంలో తిరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో కాపు కాసి అదుపులోకి తీసుకోవడంతో పాటు సహకరించిన వ్యక్తిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ కాళిదాస్ తెలిపారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ ఎస్కేప్..
అనంతపురం క్రైం : కడప, అనంతపురం జిల్లాల్లో పలు కిడ్నాప్ కేసుల్లో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ లీడర్, బలవంతపు వసూళ్లకు పాల్పడే వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ తప్పించుకోవడం సంచలనం కల్గిస్తోంది. సెక్యూరిటీగా ఉండే ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల కళ్లుగప్పి పరారీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కేసు విషయమై కడప సబ్‌జైలులో ఉన్న సునీల్‌ను గురువారం ఉదయం అనంతపురం ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్ (1977), వెంకటరమణారెడ్డి (2177) అనంతపురం కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం కడపకు తీసుకెళ్లారు. అయితే సబ్‌జైలు సమీపంలో సునీల్ పరారయ్యాడు. ఇంతటి కీలకమైన నిందితుడి విషయంలో సెక్యూరిటీ సిబ్బంది అజాగ్రత్తగా ఎలా వ్యవహరించారనేది అర్థం కాని విషయం. వీరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ సెక్యూరిటీ పోలీసుల కళ్లగప్పి పారిపోవడాన్ని అనంతపురం ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు తీవ్రంగా పరిగణించారు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇంతియాజ్ అహమ్మద్, వెంకట రమణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ పోలీసుల చెర నుంచి తప్పించుకోవడం అటు పోలీసులు, ఇటు ప్రజలను కలవరపెడుతోంది. బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం, కిడ్నాప్ చేయడం, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని సునీల్ తప్పించుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. సునీల్‌ను పట్టుకోవడానికి పోలీసు బృందాలు వేట ప్రారంభిం చాయి. కాగా, సునీల్ నేర చరిత్ర తెలిసీ అతడి చేతులకు బేడీలు వేయకుండా కోర్టుకు తీసుకురావడం చర్చనీ యాంశమైంది. -
ఎల్లంగౌడ్‌పై అరెస్ట్ వారెంట్
వేములవాడ : మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌గా వార్తల్లోకెక్కిన ఎల్లం గౌడ్‌పై వేములవాడ ఠాణా పరిధిలోనూ అరెస్ట్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. మంగళవారం ఆయన హైదరాబాద్ కోర్టులో లొంగిపోయిన దరిమిలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2006లో జరిగిన ఓ దారిదోపిడీలో నిందితుడిగా ఉన్న ఆయన రెండేళ్లుగా కోర్టుకు గైర్హాజరవుతుండడంతో అరెస్ట్వారెంట్ జారీ అయ్యింది. వేములవాడకు చెందిన ఉపాధ్యాయ దంపతులు బోయినపల్లి మండలం కొదురుపాకలో ఓ శుభకార్యానికి వెళ్లివస్తుండగా ఈదారిదోపిడీ జరిగింది. అంబటి ఎల్లంగౌడ్తోపాటూ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సయ్యద్ అన్వర్, ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన పత్తెం మహేందర్ ఉరఫ్ మహేశ్ ఈదోపిడీ ముఠాలో భాగస్వాములయ్యారు. పోలీసులకు పట్టుబడ్డ ఈ ముఠా కోర్టుద్వారా బెయిల్ పొందింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరు రెండేళ్లుగా కోర్టుకు గైర్హాజరవుతుండటంతో అరెస్టు వారంట్ జారీ అయినట్లు వేములవాడ టౌన్ సీఐ సీహెచ్.దేవారెడ్డి తెలిపారు. ప్రస్తుతం కోర్టులో లొంగిపోయిన ఎల్లంగౌడ్‌ను త్వరలోనే వేములవాడ కోర్టులో హాజరు పరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్ అయ్యాడు. సునీల్‌తో పాటు అతడి గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి స్కార్పియో, ఇండికా, 5 కొడవళ్లతో పాటు రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు ‘అనంత’ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. అనంతపురం క్రైం : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. డబ్బు కోసం కిడ్నాప్, హత్యలు, బలవంతపు వసూళ్లకు దిగుతున్న ఇతడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఇటీవల అనంతపురం జిల్లా నార్పలలో ఎరువుల వ్యాపారి ప్రసాద్‌శెట్టి అలియాస్ శ్రీనివాస్ శెట్టి కిడ్నాప్‌తో పాటు పలు కిడ్నాప్, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూ ళ్లు, ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి సునీ ల్‌పై అనంతపురం, వైఎస్ఆర్, కర్నూలు జిల్లా ల్లో 14 కేసులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులను చేరదీసి వారిని జల్సాలకు అల వాటు చేయడం.. వారిని నేరాలకు పాల్పడేలా చేయడంలో సునీల్ సిద్దహస్తుడు. ఇలా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ టి.రామప్రసాదరావు పర్యవేక్షణలో ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, నార్పల ఎస్ఐ శేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అతడిపై నిఘా ఉంచి ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సునీల్, కడప నగరానికి చెందిన లాయం హరి నాథ్, షేక్ హుసేన్‌బాషా, పక్కీర్లగార్ల సునీల్‌కుమార్, మైదుకూరుకు చెందిన జెన్నే మురళీకృష్ణ ఉన్నా రు. ఈ ముఠా నుంచి స్కార్పియో, టాటా ఇండికా కారు, ఐదు వేటకొడవళ్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాతో సునీల్ నేర ప్రస్థానం మొదలు ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ కొన్నేళ్లుగా పులి వెందులలో ఉంటున్నాడు. ఇతడి తండ్రి వెంకట రమణ 2011కు ముందు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్.. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో నేర ప్రవృత్తి వైపు మళ్లాడు. ఈ క్రమంలో 2011లో కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఎర్రచందనం అక్రమ రవాణాతో నేర జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కిడ్నాప్‌లు,హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు దిగాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్ షాపు యజ మానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్ చేశాడు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చా రు. ప్రొ ద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వ సూళ్ల కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్స్టేషన్లలో రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న సునీల్ గ్యాంగ్‌ను సోమవారం నార్పల మండలం బం డ్లపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సునీ ల్ బయట ఉంటే సమాజానికి ప్రమాదకరంగా మారతాడని భావించి అతడిపై పీడీ యాక్టు నమోదుకు పోలీసులు కలెక్టర్‌కు నివేదించారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి పట్టివేత
హైదరాబాద్; మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖురేషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతూ తప్పించుకుపోయిన ఖురేషి అనే ఖైదీని వెస్ట్ జోన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.అతను గుల్బర్గాలో పోలీసుల చేతికి చిక్కాడు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి . డిసెంబర్ 2 వతేదీన ఖురేషీ ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి పరారైయ్యాడు. తరచు ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడు. అతను తప్పించుకున్న ముందురోజు భార్యతో ములాఖత్ కు పోలీసులు నిరాకరించడంతో భయానక వాతావరణం సృష్టంచాడు.