narayanpet
-
రష్యా ఆర్మీ చెర నుంచి విముక్తి
-
సాగుబడి: 15 నిమిషాల్లోనే.. ఎడ్ల బండితో పిచికారీ!
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్‌ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి. అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఫొటోలు: సుదర్శన్‌గౌడ్, నర్వ స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ.. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా. – మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ ► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు. ఇవి చదవండి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు! -
‘పేట’కు టెక్స్టైల్ పార్కు! : అమిత్ షా
సాక్షి, మహబూబ్‌నగర్/నారాయణపేట: ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు పెంచి.. జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు నారాయణపేట జిల్లాకేంద్రంలో చేనేత కార్మికుల కోసం టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువస్తే బీసీ సీఎం అవుతారని.. రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్రమోదీని మరోసారి పీఎం చేద్దామంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వారి జీవన పరిిస్థితులపై నరేంద్రమోదీ అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. మక్తల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాలకు నోచుకోలేదని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నాయకులు మక్తల్‌లో భూ కబ్జాలు, దాందాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భీమా ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఊట్కూర్ చెరువుతోపాటు జాయమ్మ చెరువుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు నెరవేరాలంటే జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మక్తల్‌లో మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, నారాయణపేటలో రతంగ్ పాండురెడ్డి, కొడంగల్‌లో బంటు రమేష్‌లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీతోనే సంక్షేమ పాలన! బీజేపీతోనే ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, మక్తల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. ఓడినా.. పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కోలార్ ఎంపీ మునిస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్మన్ అఖిలారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బాల్‌రాంరెడ్డి, తిమ్మప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్, కనకరాజు, మండలాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మలికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ కర్నిస్వామి, ఉపాధ్యక్షుడు సోంశేఖర్‌గౌడ్, నాగప్ప, కౌన్సిలర్లు కౌసల్య, సత్యనారాయణ, అర్చన, కొండయ్య, నాయకులు లక్ష్మణ్, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు! -
పురుగుమందుల స్ప్రే కోసం ఓ యువరైతు వినూత్న ఆవిష్కరణ
-
బోరు నీరు తాగి.. బాలిక మృతి
మద్దూరు: బోరు మోటారు ద్వారా వచ్చే నీరు తాగి ఓ బాలిక మృతిచెందగా...మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమినాపూర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో బోయిన, జీడివీధిలో ఉన్న బోరు మోటారు నీటిని స్థానికులు తాగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం బోరు మోటారు ద్వారా వచ్చే నీటిని తాగిన బొయిన అనిత(16)కు సాయంత్రం విరేచనాలు కావడంతో ఆశ కార్యకర్త దగ్గరకు వెళ్లగా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చింది. రాత్రికి వాంతులు, విరేచనాలు తీవ్రమై అస్వస్థతకు గురవడంతో తండ్రి బోయిని కనకప్ప వెంటనే ద్విచక్రవాహనంపై నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. ఆ తర్వాత ఇదే వీధికి చెందిన వార్ల చంద్రప్ప, బండగొండ కనకప్ప, మంగమ్మ అస్వస్థతకు గురవడంతో మద్దూరు సీఎస్సీ సెంటర్‌కు, బసపోళ్ల శ్రీనివాస్, బసపోళ్ల రాములు, బోయిని కవితలు కూడా అస్వస్థతకు గురికాగా వారిని మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి, బసపోళ్ల హన్మమ్మ, అజయ్‌లను నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, డీఎంహెచ్ఓ రాంమోహన్‌రావు గ్రామానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. -
KTR: మోదీ ఓ అసమర్థ ప్రధాని.. కార్పొరేట్ల కోసమే పాలన
సాక్షి, నారాయణపేట: మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రూ.12లక్షల కోట్లను మాఫీ చేసిందని.. ఇది నిజం కాకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం అంటారు.. అది నిజం కాదు. కేవలం అదానీ, అంబానీ కోసమే మోదీ పాలన కొనసాగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదలకు రావాల్సిన పైసలన్నీ మోదీ దోస్తులు అదానీ, అంబానీలకు చేరుతున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు రూ.12లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం చిత్తశుద్ధితో ఆలోచిస్తే దేశంలో రైతాంగానికి రూ.14.50 లక్షల కోట్లతో ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చన్నారు. మంగళవారం నారాయణపేటలో మంత్రులు మహముద్ అలీ, నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి రూ.196కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం సభలో కేటీఆర్ మాట్లాడుతూ దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానమంత్రుల పాలనలో రూ.56 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం రూ.వంద లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు మోపుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర బీజేపీ నేతలు జాతీయ హోదాను ఇప్పించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నా.. కృష్ణాజలాలపై ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ తెంపని అసమర్థత ప్రభుత్వం కేంద్రానిదేనని నిందించారు. ’’మహబూబ్‌నగర్‌లో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందంట కదా... తెలంగాణకు 500 టీఎంసీల నీటిని ఇవ్వాలనీ, ఈ ఏడాది కేంద్రబడ్జెట్లోనే నిధులు కేటాయిస్తూ పాలమూరు–రంగారెడ్డికి జాతీయహోదాను ఇప్పించాలని అక్కడి నుంచి కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపండి’’ అని సలహా ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ నేతలకు వెన్నముక ఉంటే ఈ పనులు చేయాలని సవాల్ విసిరారు. ఆదాయం కాదు.. కష్టాలు డబుల్ అయ్యాయి ‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్ అయ్యాయి...’’ అని కేటీఆర్ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. మోదీ ఓ అసమర్థ ప్రధాని ‘నరేంద్రమోదీ ఓ అసమర్థ, పనికి మాలిన ప్రధాని అని కేటీఆర్ ధ్వజమెత్తారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ రూ.30లక్షల కోట్లు అదనంగా గుంజింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. ’’పీఎం కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటుండు. ఎంత హస్యాస్పదమండి... మోదీ చూ మంత్రం వేస్తే కరోనా వ్యాక్సిన్ తయారైందంట...శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నర్సులు వారంతా ఎందుకున్నట్లు.’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదాయం కాదు.. కష్టాలు డబుల్ అయ్యాయి ‘మోదీ పాలనలో రైతుల ఆదాయం డబుల్ అయిందని నిన్న ఓ పత్రికలో ప్రధాని ఆర్థిక సలహాదారు ఓ కథనం రాశారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరి ఆదాయాలూ డబుల్ కాలేదు. కష్టాలు, పెట్టుబడులు డబుల్ అయ్యాయి...’’ అని కేటీఆర్ అన్నారు. ఒక్క తెలంగాణలో మన పాలనలో రైతులకు ఆరేళ్లలో రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు..అని చెప్పారు. బేకార్ గాళ్లతో మనకు పంచాయితీ ఎందుకనీ కులాల మతాల మధ్య చిచ్చులు పెడుతున్న చిల్లరగాళ్లు ఉన్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని గెలిపించి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దమోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అబ్రహం, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నారాయణపేటలో సీనియర్ సిటిజన్లకో పార్కు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్ల కోసం నారాయపేట జిల్లాకేంద్రంలో ఓ పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 8వ వార్డు సత్యసాయికాలనీలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ పార్కును మంత్రి ప్రారంభించి అద్భుతమంటూ కితాబునిచ్చారు. ఈ పార్కును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. పార్కులో ఉన్న ఓ చెట్టుకు విరగకాసిన చింతకాయలను చూస్తూ మంత్రి కేటీఆర్ భలే కాశాయని ముచ్చట పడ్డారు. అంతలోనే చెట్టు చింతకాయను ఓ ప్రజాప్రతినిధి తీసుకువచ్చి ఇవ్వగా కేటీఆర్ వాటిని తింటూ భలేగా ఉన్నాయంటూ అందరినీ ఊరించారు. -
వరసకు బాబాయ్! పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
కృష్ణ: వరసలు కలవకపోవడంతో తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంటలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పరిధిలోని కందానాటికి చెందిన మునికుమార్ (25), పారుపల్లికి చెందిన అనిత (16)ల కుటుంబ సభ్యులు బతుకుదెరువు కోసం కుటుంబాలతో కలసి ఇటీవల కృష్ణ మండలంలోని చేగుంటలో పత్తి తీయడానికి వచ్చారు. అదే ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మునికుమార్, అనిత ప్రేమించుకుంటున్నారు. అయితే మునికుమార్ అనితకు వరసకు బాబాయ్ అవుతాడు. వీరి విషయం తెలిసిన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమ ఫలించదని మనస్తాపానికి గురైన వారు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం రైల్వే గ్యాంగ్‌మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పంచనామా చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
50 రోజులు.. 1,300 కిలోమీటర్లు
(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 7న కేరళలో ప్రారంభమైన యాత్ర గురువారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. రాహుల్ పాదయాత్ర గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఎలిగండ్లకు చేరుకుంది. మొత్తం 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లోని 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 19 జిల్లాల్లో 1,325 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు. తమిళనాడులో 2 జిల్లాలు, కేరళలో 7 జిల్లాలు, కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్‌లో 2 జిల్లాల్లో యాత్ర పూర్తి కాగా ప్రస్తుతం తెలంగాణలోని మొదటి జిల్లా (నారాయణపేట)లో యాత్ర జరుగుతోంది. రాష్ట్రంలో ఈ యాత్ర నవంబర్ 7 వరకు సాగనుంది. తెలంగాణలో యాత్ర పూర్తయితే 5 రాష్ట్రాలు, 26 జిల్లాల్లో 1,670 కిలోమీటర్ల మేర యాత్ర సాగినట్లవుతుంది. -
Rahul Gandhi: ఆ రెండు పార్టీలు దొందూ.. దొందే!
సాక్షి, నారాయణ్‌పేట: కాంగ్రెస్ దృష్టిలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో ఆయన ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. గురువారం సాయంత్రం నారాయణపేటలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఒక్కటే. నాణేనికి బొమ్మాబొరుసుల్లాంటివి. ఢిల్లీలో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు కేసీఆర్ పార్టీ వంతపాడింది. రాజకీయాలను ఈ రెండు పార్టీలు ధనప్రమేయం చేశాయి. వ్యాపార సంస్థలుగా కొనసాగుతున్నాయి. రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఇంకా బాధపడుతూనే ఉన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. పెట్రోల్ , డిజీల్ , గ్యాస్ ధరలు ప్రజలకు భారంగా మారాయి. ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ పని. తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్.. అత్యంత అవినీతి ప్రభుత్వం. మియాపూర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. టీఆర్ఎస్పై రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసమే భారత్ జోడో యాత్ర. దాదాపు 3,500 కిలో మీటర్లు నడవటం ఆషామాషీ కాదు. కానీ, మీ శక్తిని ధారపోసి నాతో అడుగేస్తుంటే … కష్టం తెలియటం లేదు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
మాగనూర్: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేయగా దాదాపు 83 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీ హెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మధ్యాహ్న భోజనం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరో ఏడుగురు విద్యార్థులకు వాంతులు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. -
మాటల గారడీతో మోసం చేస్తున్నారు: షర్మిల
నర్వ: తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన సీఎం కేసీఆర్‌కు కాలం చెల్లిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా నర్వ మండలంలో పర్యటించిన ఆమె నర్వ, పెద్దకడ్మూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. నిరుద్యోగులు, దళితులు, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలు తప్పిన సీఎం కేసీఆర్‌ది ఇంతకు గుండెనా?.. బండనా? అని ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా కేవలం రూ.5 వేలు ఇస్తే బ్యాంకు వడ్డీలకు సరిపోవడం లేదన్నారు. ఎరువుల ధరలు పెంచి, సబ్సిడీలు ఎత్తివేసి, రైతుల నడ్డి విరుస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఆగస్టు 15 వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా మొదటి సంతకం చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. తనను వైఎస్సార్ బిడ్డగా ఆదరిస్తే వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొస్తానన్నారు. -
ఎందరో త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం
నారాయణపేట: ఎంతోమంది త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని వైఎస్సార్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర సోమవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి చేరుకుంది. స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దేనికి సేవ చేయడం గొప్ప గౌరవం అని, వైఎస్సార్ ఆఖరి నిమిషం వరకు ప్రజలకు సేవ చేస్తూనే చనిపోయారని గుర్తు చేశారు. దేశంలో మహిళలకు సమానత్వం లేదని ఇంకా చిన్నచూపే చూస్తున్నారని, మరియమ్మ అనే మహిళను జైల్లో పెట్టి చంపేశారన్నారు. మహిళలు అని చూడకుండా జైలో పెడుతున్నారని, మహిళలకు ఈ స్వతంత్ర దేశంలో గౌరవం లేదని, మద్యపాన నిషేధం అమలు చేయకుండా..మద్యం అమ్మకాల మీద రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే వైఎస్సార్ సుపరిపాలన తిరిగి అందిస్తానని హామీనిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిదన్నారు. అధికారం ఇస్తే ఉద్యమకారులను ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, ఉద్యమకారులకు ఇళ్లు, ఉద్యోగాలు, జీవితాంతం పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. -
Telangana: అక్కడ ముక్కోణపు పోటీ అనివార్యం
నారాయణ్‌పేట నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యం కానుంది. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన రాజేందర్‌రెడ్డి తర్వాత గులాబీ దళంలో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగి విజయం సాధించారు. ఈసారి కూడా కారు గుర్తు మీద రాజేందర్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్క్ చూపించారాయన. నారాయణపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయించగలిగారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడం ఆయనకు మైనస్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం డీసీసీ చీఫ్‌గా, నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న శివకుమార్‌రెడ్డి 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో కారు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి..వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో తొలినుంచీ బీజేపీకి కొంత పట్టుంది. బీజేపీ నేత రతంగ్‌పాండు రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో కూడా బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. సౌమ్యుడిగా పేరున్న రతంగ్పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నియోజకవర్గం ఓటర్లు ప్రతిసారీ భిన్నమైన తీర్పునిస్తున్నారు. బీజేపీ నేత డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కారు పార్టీలో చేరారు. 2018లో కూడా కారు గుర్తు మీద నెగ్గి...మూడోసారి గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషాతో పాటుగా..పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ ఆసక్తి చూపిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెంకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే..తొలినుంచీ కేడర్ అండగా ఉన్నందున స్థానిక మున్సిపాలిటీని గెలుచుకోగలిగింది. అయితే తొలినుంచీ పార్టీలో ఉండి రెండుసార్లు పోటీ చేసి ఓడిన కొండయ్యకు, కొత్తగా చేరిన జలంధర్‌రెడ్డికి పొసగడంలేదు. ప్రజాసంగ్రామ యాత్రలో కూడా ఇద్దరు పోటా పోటీగా బలప్రదర్శన చేశారు. సీటు విషయంలో ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం వస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది. లేదంటే కారు పార్టీకే మేలు జరుగుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టెం టీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది. మాజీ జడ్పీటీసీ శ్రీహరి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ ఎన్నిక ఈసారి రసవత్తరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్...కాంగ్రెస్‌లో చేరి 2018లో ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పనుల విషయంలో అధికార టీఆర్ఎస్తో కొట్లాడి చేయించారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను టార్గెట్ చేసి ఓడించారు. కొడంగల్‌లో రేవంత్ సోదరుడు పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవుతారనే ప్రచారం జరుగుతున్నందున కొడంగల్‌లో రేవంత్ విజయం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. కారు గుర్తు మీద గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి...పార్టీ నేతలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా నియోజకవర్గానికి చేసిన పనులు కూడా లేవు. కొడంగల్‌లో ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథరెడ్డి 2014లో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో గులాబీ గూటికి చేరి పోటీ చేసి..రేవంత్ చేతిలో ఓడిపోయారు. గుర్నాథరెడ్డి ఇటీవల వైఎస్ విజయమ్మను కలవడంతో...వైఎస్ఆర్టీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఇక కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి అద్వాన్నంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీకి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంత శక్తి లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
కలెక్టర్ హరిచందనపై.. మక్తల్ ఎమ్మెల్యే మండిపాటు
నారాయణపేట: ‘జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ జీరోగా తయారైంది.. నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు.. నేనేంటో చూపిస్తా.. ఇక్కడ నియంత పాలన సాగదు’ అంటూ నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్ దాసరి హరిచందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ ఎజెండా చదువుతుండగా సమావేశానికి డీఈవో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘కలెక్టరే సమావేశాలకు రారు.. ఇక జిల్లా అధికారులు ఎందుకు వస్తార’ని అసహనం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సమావేశమంటే పిల్లలాటైంది.. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ పనికిమాలిన వాళ్లా.. వచ్చేసారి అందరం కలసి కలెక్టరేట్‌కు వెళ్లి జెడ్పీ మీటింగ్ పెట్టాలి’అని అన్నారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే, అక్కడ (కలెక్టరేట్లో) కలెక్టర్ రహస్య సమావేశాలు పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ‘తెలంగాణ తెచ్చుకుంది.. జిల్లా వచ్చింది ఇందుకోసమేనా’ అని అసంతృప్తి వెళ్లగక్కారు. ఐదుగురు కనిపిస్తే కలెక్టర్‌కు బుగులు పుడుతుందని, వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తారని అన్నారు. సంగంబండ ముంపు బాధితులు కలెక్టరేట్‌కు వస్తే వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. మక్తల్ నుంచి ఓ మహిళా సర్పంచ్ సమస్య పరిష్కారం కోసం వస్తే అగౌరవపరిచారని, ఇదే కలెక్టర్ బిల్డింగ్‌పై నుంచి దూకి చస్తానని ఆమె తనతో ఫోన్లో చెప్పారన్నారు. జిల్లాకేంద్రంలో రూ.కోట్ల విలువైన ఎస్ఎల్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వానికి ఇస్తే తమ సొసైటీ బిల్డింగ్ దగ్గరికి ఆర్అండ్బీ అధికారులను పంపించి పెనాల్టీ కట్టాలని నోటీసులు పంపించారన్నారు. భారత్‌మాల కోసం దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ధర నిర్ణయించి తిరిగి నోటిఫికేషన్ వేసి భూములు తీసుకోవాలని కోరారు. (క్లిక్: టీఆర్ఎస్కు రాజయ్య గుడ్‌బై) -
Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ!
రాబోయేది పండగల సీజన్. సంప్రదాయ చీర కట్టులో భాగంగా వేడుకలో పట్టుకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. సౌత్ ఇండియన్ కాటన్స్తో సౌకర్యంగానూ, పండగ కళ పెంచేలా డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. మనవైన కాటన్స్ తలపునకు రాగానే ప్రముఖంగా మంగళగిరి, నారాయణ్ పేట్, పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, కలంకారీ.. వంటివి కళ్ల ముందు నిలుస్తాయి. అయితే, కాటన్ అనగానే చాలామంది ఈ సీజన్‌కి సరైనవి కావు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా మనవైన కాటన్స్ జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ ఉంటాయి. వాటిలో పండగల కాలంలో పట్టు కట్టకపోయినా ఏ మాత్రం వన్నె తగ్గని జరీ అంచు కాటన్ వినూత్నమైన కళను తీసుకువస్తాయి. వాటిలో చీరకట్టు మాత్రమే కాదు సౌకర్యంగా ఉండే కుర్తా సెట్, లాంగ్ అండ్ షార్ట్ గౌన్స్ కూడా ధరించవచ్చు. క్యాజువల్‌గానూ అదే విధంగా పార్టీవేర్‌గానూ ఎంపిక చేసుకోవచ్చు. అయితే, వీటిని రెడీమేడ్‌గా కాకుండా ఎవరికి తగినట్టుగా వారు డిజైన్ చేసుకోవచ్చు. సరైన డ్రెస్ అందుబాటులో లేదనుకుంటే మనదైన సంప్రదాయ జరీ అంచు కాటన్ దుపట్టా ధరించినా చాలు పండగ కళ వచ్చేస్తుంది. వీటికి సంప్రదాయ ఆభరణాలు లేదా టెర్రకోట, ఫ్యాబ్రిక్, సిల్వర్ జ్యువెల్రీ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఆభరణాల ఊసు లేకపోయినా అందంగానూ ఉంటాయి. చదవండి: Bindu Madhavi: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే! -
చీమూ నెత్తురుంటే బకాయిలు తెండి
నారాయణపేట: ‘తెలంగాణలోని గ్రామపం చాయతీలకు కేంద్రం నుంచి రూ.1,100 కోట్లు రావాల్సి ఉంది. ఆర్థిక సంఘం నుంచి జీఎస్టీ రూపంలో రూ.11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. బీజేపీ నేతలకు చీము, నెత్తురూ ఉంటే ఈ బకాయిలన్నీ తీసుకురావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. సోమవారం నారాయణ పేటలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి జిల్లా ఆస్పత్రిలో పలు యూనిట్లు ప్రారంభించడంతోపాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అప్పక్ పల్లి వద్ద బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లా డారు. పల్లె, పట్టణ ప్రగతి కోసం ఈ ఎనిమి దేళ్లలో రూ.11,711 కోట్లు వెచ్చించా మని, గత రెండేళ్లలో రూ.1,144 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వాస్తవాలు ఇలా వుంటే బిల్లులు రాలేదని నలుగురు బీజేపీ సర్పంచ్ లను వెంట బెట్టుకుని ఆ పార్టీ నేతలు దొంగ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ఎనిమిదేళ్లు అయినా విభ జన చట్టంలోని హామీలను నెరవేర్చలేద న్నా రు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, ఏపీ లో పోలవరం, మధ్య ప్రదేశ్‌లో మరో ప్రాజె క్టుకు జాతీయ హోదా ఇచ్చారంటూ.. పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకి వ్వడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. బీజేపీ ఫెయిల్..టీఆర్ఎస్ పాస్: ‘రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో లేవు. అధి కారంలోకి రావు. వారు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. వారి మాటలు నమ్మొద్దు..’ అం టూ మంత్రి హరీశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ల్లో అమలు కాని పథకాలు ఇక్కడ ఎలా అవుతాయని ప్రశ్నించారు. రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వం టివి ఆ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని నిలదీ శారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇప్ప టికే 40 లక్షల ‘ఆసరా’ పింఛన్లు ఇస్తున్నామని, త్వర లోనే 57 ఏళ్ల వయస్సు వారు పది లక్షల మం దికి అందించనున్నామని తెలిపారు. ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి టీఆర్ఎస్ ఇక్కడ పాసైతే, కర్ణాటకలో బీజేపీ ఫెయిలైందని హరీశ్ ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కులపిచ్చి, బీజేపీ నేత బండి సంజయ్‌కి మతపిచ్చి పట్టిం దని శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కులం ఓట్లతోనే రేవంత్‌రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అయ్యారా? అని ప్రశ్నించారు. కార్యక్ర మాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
‘నీకు పెళ్లయింది కదా’.. ‘నా భార్య మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’
పంజగుట్ట: ‘నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి తన భార్య త్వరలో చనిపోతుందని నన్ను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు తెలియకుండా ఫొటోలు తీసి వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు’అని బాధిత కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆవేదన చెందింది. శివకుమార్‌రెడ్డి అకృత్యాలపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏼 ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్ రెడ్డికి అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు 2020లో పరిచయమైంది. పార్టీ కార్యకలాపాల కోసం ఆయన్ను కలిసేందుకు తరచూ సదరు మహిళ రాగా ఆమెపై కన్నేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రేమిస్తున్నానన్నాడు. ‘నీకు పెళ్లయింది కదా’ అని ఆమె ప్రశ్నించగా ‘నా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’అని నమ్మబలికాడు. తనకో తోడు కావాలంటూ ఆమె మెడలో పసుపు తాడు కట్టి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయిందని చెప్పాడు. మాట్లాడుకుందామని పంజగుట్టలోని ఓ హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని నెట్లో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇప్పుడు దూరంగా ఉండటమే కాకుండా అనుచరులతో బెదిరింపులకు దిగుతున్నాడని ఆ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి👉🏾 వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. -
ఫ్లిప్‌కార్ట్‌లో నారాయణపేట హస్తకళాకృతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నారాయణపేట స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తులు, చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశమంతటా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నారాయణపేటకు చెందిన ఆరుణ్య ప్రాజెక్టుతో ఫ్లిప్‌కార్ట్ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ‘టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్’పై మంత్రి కేటీఆర్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా మహిళా చేతివృత్తులు, చేనేతకారులకు తరగతుల నిర్వహణ, క్షేత్రస్థాయి శిక్షణను అందించి.. వారు తయారుచేసే ఉత్పత్తులకు జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలోని చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సమ్మిళిత అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహిళల జీవనోపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం వంటివి తోడ్పడుతాయి’’అన్నారు. తెలంగాణ, ఆరుణ్యలతో భాగస్వామ్యం కావడం సంతోషకరమని.. మహిళలకు ఆర్థిక స్వా తంత్య్రం అందించడం, వారి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మార్కెటింగ్ అందించడం తమకు ఆనందాన్ని ఇస్తోందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ సంబంధాల అధికారి రజనీష్‌కుమార్ చెప్పారు. ఏమిటీ ఆరుణ్య? నారాయణపేటలో చేనేత, హస్తకళాకృతులకు ‘ఆరుణ్య’ ప్రసిద్ధమైన బ్రాండ్. కరోనా కాలంలో స్థానిక మహిళలకు ఉపాధి, వారు చేసే ప్రత్యేక ఉత్పత్తుల విక్రయం ద్వారా సాయపడేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మొదట పది మందితో మొదలై.. ఇప్పుడు కలంకారీ, బ్లాక్ పెయింటింగ్ అంశాల్లో మహిళలకు శిక్షణనిచ్చే స్థాయికి చేరుకుంది. -
Fashion: ఒక్కో బ్లవుజు ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు..!
ఏ ఇద్దరు మనుషులూ ఒక్కలా ఉండరు. ఏ ఇద్దరి అభిరుచులూ ఒక్కలా ఉండవు. మరి ధరించే దుస్తులు మాత్రం ఒకేలా ఎందుకుండాలి? దేనికది ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదు? ఇది ఓ సందేహం. చీరల కోసం వందలాది షోరూమ్‌లున్నాయి. బ్లవుజుకు ఒక్క షో రూమ్ కూడా ఉండదెందుకు? మరో సందేహం. అది లేదు... ఇది లేదు... అనుకోవడం కాదు, ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు? ఇన్ని సందేహాలు, సమాధానాల మధ్య రూపుదిద్దుకున్న ఐడియా ‘డిజైనింగ్ ఐడియాస్, జస్ బ్లవుజ్’. హైదరాబాదీ డిజైనర్ వర్షామహేంద్ర ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఓ కొత్త ఆలోచన ఆ తర్వాత వందలాది మందికి ఉపాధి మార్గంగా మారింది. వర్షామహేంద్రది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి బి.ఎ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ‘‘మా నాన్న వ్యాపారి. అమ్మ స్కూల్ టీచర్. నాకు డెస్క్ జాబ్ నచ్చేది కాదు. నాన్నలాగ బిజినెస్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని ఉండేది. అదే సమయంలో కెరీర్ సృజనాత్మకంగా, నాకంటూ ప్రత్యేకమైనదిగా ఉండాలనే కోరిక కూడా ఉండేది. దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ముంబై, జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఏడాది డిప్లమో కోర్సు చేశాను. పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్లడం నా లక్ష్యాన్ని సులువు చేసింది. అక్కడ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. నా పెళ్లి చీరలు, బ్లవుజ్‌ల అనుభవంతో కోర్సులో చేరినప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టితో ఫ్యాషన్ ప్రపంచాన్ని గమనించగలిగాను. ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) కోసం పని చేయడం నాకు మంచి అవకాశం. వర్షామహేంద్ర క్లోతింగ్‌లో అనేక ప్రయోగాలు చేశాం. కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ నా బలం. అలాగే సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన వడపోతలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరువందల మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉండడంతో నాకు సొంతంగా నా బ్రాండ్‌ను విజయవంతం చేయగలననే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే 2010లో హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సొంత స్టార్టప్ ప్రారంభించాను. ఇండియన్ బిజినెస్ స్కూల్– గోల్డ్మాన్సాచె ఫెలో పదివేల మంది మహిళల్లో స్థానం లభించడం నాకు మంచి సోపానం అయింది. ఇంటర్న్‌షిప్ కోసం న్యూయార్క్‌కి వెళ్లే అవకాశం వచ్చింది. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆహ్వానం అందింది. దాదాపుగా రెండు నెలలు అక్కడ క్రాఫ్ట్మెన్ను, విద్యార్థులను సమన్వయం చేస్తూ వాళ్లతో కలిసి పని చేసే అవకాశం ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. 2014లో యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి హాజరయ్యాను. అది నా ఫస్ట్ ఫ్యాషన్ షో. న్యూయార్క్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొన్నాను. ఇన్ని వేదికల మీద విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ... కేవలం బ్లవుజ్‌ల కోసమే ఒక వేదికకు రూపకల్పన చేస్తూ నేను స్టార్టప్ ప్రారంభించడం తెలివైన నిర్ణయమే అని అనిపించింది. మార్కెట్ స్టడీ చేయలేదు మామూలుగా స్టార్టప్ ప్రారంభించే ముందు మార్కెట్ స్టడీ చేయాలి. కానీ నేను మార్కెట్లో ఉన్న గ్యాప్‌ని గుర్తించగలిగాను. అదే నా విజయ రహస్యం. నాతోపాటు ఇద్దరు ఉద్యోగులతో మొదలైన స్టార్టప్ ఇప్పుడు డెబ్బై మందితో పని చేస్తోంది. వెయ్యి నుంచి పన్నెండు వందల బ్లవుజ్‌లు ఒక చోట దేనికది ప్రత్యేకంగా ఉంటే ఇంకేం కావాలి. ఒక్కో బ్లవుజ్ ధర రెండున్నర వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది. ఒకప్పుడు చీర కొనుక్కుని బ్లవుజ్ కోసం మ్యాచింగ్ సెంటర్లకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు నచ్చిన డిజైనర్ బ్లవుజ్ కొని ఆ తర్వాత దానికి సరిపడే సింపుల్ చీరను సెలెక్ట్ చేస్తున్నారు. బ్లవుజ్ హైలైట్ కావడమే ఫ్యాషన్ ట్రెండ్‌గా చేయగలిగాను. ఇది ఫ్యాషన్ రంగానికి నా కంట్రిబ్యూషన్ అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా నేను ఫ్యాషన్ రంగంలో ఉన్నాను. దేశవిదేశాల ఫ్యాషన్ వేదికలను చూశాను. మన భారతీయ వస్త్రధారణలోనే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇక నా స్వీయ అనుభవంలోకి వస్తే... నా పెళ్లికి హెవీ చీర కొనేశాను. బ్లవుజ్ కుట్టించుకోవడానికి పెద్ద–చిన్న టైలర్ల చుట్టూ తిరిగాను. ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. నా అసంతృప్తి నుంచి నేను డిజైన్ చేసుకున్న ఫ్యాషన్ ఇది. నేను సృష్టించుకున్న కెరీర్ ఇది. అప్పుడు నేను సృష్టించిన ట్రెండ్ వందలాది మందికి ఉపాధి మార్గం అయిందంటే ఎంతో సంతోషంగా కూడా ఉంది’’ అన్నారు వర్షామహేంద్ర. ఎల్లలు దాటిన మన నేత మన సంప్రదాయ నేతకు ఆదరణ తగ్గి నేతకారుల ఇంటి కొత్త తరం ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్న రోజుల్లో వర్ష వీవింగ్ ఫ్యూజన్‌కు తెర తీశారు. నేతకారుల జీవిక కోసం సహాయం చేస్తున్న యూకేలోని ఎన్జీవోతో కలిసి పోచంపల్లి నేతకారుల కోసం పని చేశారామె. అలాగే ఇప్పుడు పైథానీ, కంచిపట్టు, నారాయణపేట, చీరాల, లక్నో నేతకారులు, ఉదయ్‌పూర్–జైపూర్ బ్లాక్ ప్రింటింగ్ కళాకారులు, కోల్‌కతా రేషమ్ కళాకారులతో కలిసి ఒక చీరలో రెండు – మూడు రకాల సమ్మేళనానికి రూపమిస్తున్నారు. ‘‘ఒక చీరను విదేశీ వేదిక మీద ప్రదర్శించినప్పుడు దాని గురించి వివరించడానికి బోలెడంత సమాచారం ఉంటుంది. మన వస్త్ర విశేషం అదే’’ అన్నారామె. చీరకు చక్కటి కట్టు అందాన్ని తెస్తుంది, బ్లవుజ్‌కి చక్కటి కుట్టు అందాన్ని తెస్తుంది. ఈ రెండింటినీ మేళవించడంలో సక్సెస్ అయ్యారు వర్ష. – వాకా మంజులారెడ్డి చదవండి👉🏾Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
24 గంటల్లో పెళ్లి.. ఇంతలో వధువు ఆత్మహత్య
మక్తల్: తెల్లారితే బాజాభజంత్రీలు మోగాల్సిన ఇల్లు. మరో 24 గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే వధువు ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు తాళలేక ఉరేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్‌లో ఈ ఘటన జరిగింది. చందాపూర్ వాసి భీమేశ్వరి (19)కి మక్తల్ మండలం దండుకు చెందిన ఓ యువకుడితో వారం రోజుల క్రితం నిశ్చితార్థమైంది. ఈనెల 3న ఉదయం 9.55 గంటలకు వరుడి ఇంట్లో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా చందాపూర్‌కు చెందిన నర్సిములు (లిక్కి) కొన్నాళ్లుగా ప్రేమ పేరిట భీమేశ్వరిని వేధించసాగాడు. ‘నీకు వేరే వ్యక్తితో పెళ్లి కాకముందే ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటా’నని తరచూ బెదిరించేవాడు. ఆ బాధ ఎవరితోనూ చెప్పుకోలేక ఆ యువతి సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. లిక్కి వేధింపులు తాళలేక పెళ్లికి ముందే నేను చనిపోతున్నాను అని సూసైడ్ లెటర్ రాసింది. ఉదయం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకటప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రాములు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసి యువతి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ‘అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి బదులు మట్టి వేయాల్సి వచ్చింది’అంటూ కుటుంబీకులు, బం ధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి.. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అతను మేజర్.. ఆమె మైనర్.. ఇంట్లో చెప్పలేక..
సాక్షి, కోస్గి (నారాయణపేట): అతను మేజర్.. ఆమె మైనర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పలేక ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. బాలిక కుటుంబీకులు యువకుడిపై కిడ్నాప్, డబ్బు దొంగతనం కేసు పెట్టారు. మూడ్రోజులు గడిచింది. విడిపోయి బతకలేమనుకున్నారో ఏమో చెట్టుకు ఉరేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం బోగారం శివారులోని అమ్లికుంటలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం హుస్సేన్‌పూర్‌కు చెందిన యువకుడు శివకుమార్ (20) తల్లిదండ్రులు వెంకటయ్య, పద్మమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని నాగులపల్లికి చెందిన పదో తరగతి బాలిక (15) ప్రేమలో పడ్డాడు. ఈ నెల 27న ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబీకులు వాకబు చేయగా ప్రేమ విషయం బయటపడటంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో మైనర్ కిడ్నాప్‌తో పాటు డబ్బులు దొంగతనం జరిగినట్టు శివకుమార్, అతని కుటుంబీకులపై ఫిర్యాదు చేశారు. చదవండి: (యువతికి రూ.50 వేలు బురిడీ.. వైన్ ఆర్డర్ చేసి అగచాట్లు) ఇరు కుటుంబాలు రాజీ చేసుకొని రెండ్రోజుల్లో బాలికను అప్పగిస్తామని లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. ఇంతలో గురువారం సాయంత్రం కోస్గి మండలంలోని బోగారం చెరువు సమీపంలో అమ్లికుంటకు చెందిన ఓ రైతు పొలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్టు కొందరు రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి ప్రాథమికంగా విచారించగా సదరు ప్రేమజంటనే అని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Narayanpet Sarees: కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కలు.. రంగురంగుల చీరలు!
తెలంగాణలో నారాయణపేట పేరు వినగానే అక్కడి చేనేత చీరలు కళ్లముందు నిలుస్తాయి. వాటి ఘనత గురించి కాసేపయినా మాట్లాడుకోకుండా ఉండలేం. మగువల మనసులను అకట్టుకునే విధంగా నేతకారులు మగ్గాల పై పట్టు, కాటన్ చీరలను నేయడంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇక నుంచి నారాయణపేట చేనేతలకే కాదు, తమ ప్రాంత చిత్రకళా వైభవాన్ని చెప్పుకునేలా కృషి చేస్తూ తమ కలలకు కళానైపుణ్యాన్ని జత చేస్తున్నారు ఇక్కడి మహిళలు. భారతీయ హస్తకళలో కలంకారీ చిత్రకళ ప్రాచీనమైనది. ఇప్పటి వరకు ఈ కళ గురించి ప్రస్తావన వస్తే ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, శ్రీకాళ హస్తి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ప్రపంచ మార్కెట్లో కలంకారీ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నారాయణపేటలో మహిళలు శిక్షణ పొందుతున్నారు. వస్త్రాలపై కలంకారీ పెయింటింగ్‌తో పాటు బ్లాక్ ప్రింటింగ్ కూడా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. మహిళల ప్రతిభ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవారు నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. నాబార్డు సహకారంతో, డీఆర్డీఏ ఆధ్వర్యంలో కలంకారీలో 60 మంది మహిళలకు 80 రోజుల పాటు హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ శిక్షణ ఇస్తోంది. బ్లాక్ ప్రింటింగ్‌పై 30 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. రంగులు అద్దుతున్నారిలా... వెదురు పుల్లలకు దూది చుట్టి బ్రష్‌లా చేసుకొని.. చింతపుల్లలను కాల్చి, నల్లబెల్లం వాడుతూ, పాలు, పటిక పొడి కలిపిన ద్రావణంలో వస్త్రాన్ని నానబెట్టి, జాడించి, సబ్బునీళ్లలో ఉతికి ఆరబెడతారు. తొలిసారి చిత్రణ పూర్తయ్యాక పారుతున్న నీళ్లలో ఆరవేసినట్టుగా ఆ వస్త్రాన్ని పట్టుకుంటారు. మొదటి దశలో ఎరుపు, నలుపు రంగులను వాడుతారు. ఆ తర్వాత డిజైన్‌కు సంబంధించిన రంగులన్నీ ఉపయోగిస్తారు. అన్నీ సహజమైన రంగులే! కలంకారీ డిజైన్‌లో ప్రధానంగా వాడే నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కోసం తుమ్మజిగురు, కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కల ద్వారా తీసిన సహజమైన రంగులను వాడుతున్నారు. ఆకట్టుకుంటున్న వస్త్రాలు యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్న ఈ ప్రక్రియతో కలంకారీ పెయింటింగ్స్, బ్లాక్ ప్రింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతామని మహిళలు, యువతులు చెబుతున్నారు. దుపట్టాలు, చీరలు, టేబుల్ క్లాత్స్, బ్యాగ్స్ పై ఈ పెయింటింగ్‌తో అందమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతులు సర్టిఫికేట్లను అందుకోవడంతో పాటు ఈ కళలో నిమగ్నమయ్యారు. నారాయణపేట చేనేతలకు ప్రసిద్ది. ఇక్కడి చేనేత కార్మిక మహిళలు, యువతులు చదువుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవాలనే లక్ష్యంతో కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌పై శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాంత మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్ చీరలు మార్కెట్లోకి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతిని సాధించనున్నారు. – దాసరి హరిచందన, జిల్లా కలెక్టర్, నారాయణపేట ఉపాధికి ఊతం నేను మెహిందీ డిజైనర్‌ని. డ్రాయింగ్‌తో పాటు చీరలపై ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తుంటాను. దీంతో కలంకారీ చిత్రణ నేర్చుకోవడం నాకు చాలా సులభమైంది. ఇప్పటికే కలంకారీ కాటన్, పట్టు చీరల వ్యాపారం చేస్తున్నాను. ఈ డిజైన్ చీరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్వయంగా డిజైన్ చేసి నారాయణపేట చీరలంటే మరింత ఆదరణ పొందేందుకు కృషి చేస్తున్నాను. – అశ్విని కళ్యాణి, నారాయణపేట మంచి భవిష్యత్తు నేను డిగ్రీ చేస్తున్నాను. వస్త్రాలపై డిజైనింగ్‌కు అంతటా మంచి ఆదరణ ఉండటంతో చదువుతో పాటు కలంకారీ పెయింటింగ్ నేర్చుకుంటున్నాను. ఇది నా భవిష్యత్తును మరింత కళగా మార్చుతుందని ఈ పెయింటింగ్‌లో మెళకువలు తెలుసుకున్నాక అర్ధమైంది.– వైష్ణవి ప్రత్యేకమైన డిజైన్ నేను పీజీ పూర్తిచేశాను. వస్త్రాలపై రకరకాల డిజైన్లు వేయడం కొన్నేళ్లుగా చేస్తున్నాను. నా ‘కళ’కు ఇప్పుడీ కలంకారీ శిక్షణ తోడవడంతో మెరుగైన ఫలితాలు పొందుతానన్న పూర్తి నమ్మకం వచ్చేసింది. ఇక్కడి నుంచి ప్రపంచమార్కెట్లోకి మరింత విస్తృతంగా వెళ్లగలం. – లత, నారాయణపేట శిక్షణ ఇస్తున్నా! నేను బీఎస్సీ చదివాను. బ్లాక్ పెయింటింగ్ నేర్చుకున్నా. కాటన్, పట్టు వస్త్రాలపై అద్దకం డిజైన్లు మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నాను. స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి శిక్షణ ఇచ్చేవిధంగా సిద్ధమైనందుకు ఆనందంగా ఉంది. – శ్వేత, నారాయణపేట – కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, నారాయణపేట, సాక్షి చదవండి: Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
పైశాచిక ఘటన.. కాలిన గాయాలతో యువతి దుర్మరణం
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన దివ్యాంగ యువతి(21) చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపగా.. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక బాధితురాలిపై వెంకట్రాములు అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె కన్నుమూసింది. బాధితురాలిది మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం కాగా, వెంకట్రాములుది కోయిల్ కొండ మండలం ఇంజమూరు గ్రామంగా తెలుస్తోంది. వీళ్లిద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లో వలస కూలీలుగా ఉన్నాయి. నిందితుడు ఉప్పర్‌పల్లిలో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. బాధిత యువతి రాజేంద్రనగర్‌లోని పిన్ని ఇంట్లో ఉంటూ దివ్యాంగుడైన సోదరుడిని చూసుకుంటోంది. అయితే ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. ఫిబ్రవరి 13న ఆ దివ్యాంగ యువతిని, యువకుడు అపహరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు కూడా నమోదు అయ్యింది. అయితే లైంగిక దాడికి పాల్పడి.. ఆపై ఆమెను కాల్చి చంపాలని ప్రియుడి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని కోస్గీ సర్కిల్ ఎస్సై జనార్ధన్ గౌడ్ వెల్లడించారు. -
ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి..
శామీర్‌పేట్(హైదరాబాద్)/ధన్వాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ (23) బీఎస్సీ (బయో టెక్నాలజీ) పూర్తి చేశాడు. కొద్దికాలంగా శామీర్‌పేటలోని ఓ రూంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యో గం చేస్తున్నాడు. అయితే నరసింహ స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావు అంటూ అడుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యో గం చేసిన వాల్లే మనుషులా..ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తోటి మిత్రులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సోమవారం ఉదయం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలోని మల్క చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అరుదైన ‘మిడత’
కోస్గి: నారాయణపేట జిల్లా కోస్గి మండలం బొల్వోన్‌పల్లి శివారులోని ఓ పొలంలో గులాబీరంగులో గొల్లభామ (మిడత) కనిపించింది. ఆదివారం ముశ్రీఫా జెడ్పీహెచ్ఎస్ సైన్స్ క్లబ్ విద్యార్థి మహేష్ ఈ కీటకాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు మల్లేశానికి చెప్పారు. కాగా, అర్థో పోడా వర్గానికి చెందిన ఆర్చిలిమమ్ వల్గెర్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే గడ్డి మైదానాల మిడతల్లో జన్యు ఉత్పరివర్తనాల ప్రభావంతో చాలా అరుదుగా ఇలా గులాబీరంగు సంతరించుకుంటాయని ఉపాధ్యాయుడు తెలిపారు. ఇలాంటి గులాబీ రంగు మిడతలు మొదటిసారి అమెరికాలోని టెక్సాస్, ఆస్టిన్లోని ఓక్‌హిల్ ప్రాంతంలో గుర్తించారన్నారు.