narpala
-
విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
యువకుడి సాహసయాత్ర.. నార్పల టు లడఖ్
అనంతపురం డెస్క్ : మనం బైక్‌పై వంద, రెండు వందల కిలోమీటర్లు తిరగ్గానే బాగా అలసిపోతాం. బైక్‌లో కంటే బస్సులోనో, రైల్లోనో వెళ్లి ఉంటే బాగుండేదని అనుకుంటాం. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. బైక్‌పై దేశాన్ని చుట్టేయాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాడు. ఒకట్రెండు కాదు..ఏకంగా 177 రోజులు బైక్‌యాత్ర చేపట్టాడు. 10,020 కిలోమీటర్ల సుదీర్ఘదూరం ప్రయాణించాడు. అందరితో శభాష్ అనిపించుకున్న ఆ యువకుడే నార్పల మండల కేంద్రానికి చెందిన యనమచింతల బాలకృష్ణ అలియాస్ బాలు. ఆసక్తే ముందుకు నడిపించింది.. బాలు తల్లిదండ్రులు నార్పలలో హోటల్ నిర్వహిస్తున్నారు. అతను కూడా మొబైల్ సర్వీస్ సెంటర్‌తో పాటు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) చదివినప్పటికీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు. బైక్‌పై సుదూర ప్రాంతాలకు, కొత్త ప్రదేశాలకు వెళ్లిరావడం హాబీగా మలచుకున్నాడు. ఈ క్రమంలోనే గతంలో రామేశ్వరం, ఊటీతో పాటు కర్ణాటకలోని పలు ప్రదేశాలను బైక్‌పై వెళ్లి చూసొచ్చాడు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి కూడా వెళ్లాడు. ఈ కోవలోనే లడఖ్ యాత్రను కూడా విజయవంతంగా పూర్తి చేసి పలువురి మన్ననలు పొందాడు. సెకండ్ హ్యాండ్ బైక్‌పై యాత్ర బాలు లడఖ్ యాత్రకు అపాచీ 200 సీసీ సెకండ్ హ్యాండ్ బైక్ పై 2022 జూలై 13న నార్పల నుంచి బయలుదేరాడు. మొదట శ్రీశైల మల్లన్నను దర్శించుకుని యాత్ర కొనసాగించాడు. హైదరాబాద్, నాగపూర్, జాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీ, కురుక్షేత్ర, చండీగఢ్, అమృత్సర్, జమ్మూ, చీనాబ్ బ్రిడ్జ్, శ్రీనగర్, కార్గిల్ మీదుగా లడఖ్ చేరుకున్నాడు. మార్గమధ్యంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి..వాటికి సంబంధించిన వివరాలు సేకరించాడు. లడఖ్ నుంచి తిరుగు ప్రయాణంలో హిమాచల్‌ప్రదేశ్ మీదుగా కాంగ్రా, ధర్మశాల, జ్వాలాముఖి, నైనాదేవి, కేదర్‌నాథ్‌కు వెళ్లాడు. తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఈ ఏడాది జనవరి ఐదో తేదీన నార్పలకు చేరుకున్నాడు. సుదీర్ఘయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన బాలును గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. బైక్‌యాత్రలో భాగంగా బాలు పలు వీడియోలు చిత్రీకరించాడు. వాటిలో కొన్నింటిని తన యూట్యూబ్ చానెల్ (బాలు సన్‌రైజ్ ట్రావెలర్)లో అప్లోడ్ చేశాడు. ఆదుకున్న జవాన్లు ప్రపంచంలోనే రెండవ అత్యంత చల్లని ప్రదేశమైన ద్రాస్ వద్ద (కార్గిల్‌కు సమీపంలో) మైనస్ 10 డిగ్రీల చలిని తట్టుకోలేక బాలు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దగ్గరలోని వైద్యశాలకు వెళ్లి చూపించుకోగా.. మూడు రోజుల విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు. అప్పుడు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో భారత ఆర్మీ జవాన్లు తమ క్యాంపులో ఉండటానికి చోటు కల్పించారు. ఆరోగ్యం కుదుట పడేవరకు బాగా చూసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడగానే బాలు యాత్ర కొనసాగించాడు. కాగా.. బాలు తీసుకెళ్లిన నగదును జమ్మూలోని డార్మెటరీలో దొంగలు అపహరించారు. దీంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఆన్లైన్లో డబ్బు పంపి ఆదుకున్నారు. ఎవరెస్ట్‌కు వెళ్లాలనుంది నాకు బైక్ రైడింగ్‌తో పాటు ట్రెక్కింగ్ కూడా ఇష్టమే. కాలేజీ రోజుల్లో తరచూ ట్రెక్కింగ్ వెళ్లేవాడిని. ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్నది లక్ష్యం. కనీసం బేస్ క్యాంపు దాకా వెళ్లినా నా లక్ష్యం నెరవేరినట్టే. బైక్‌యాత్రలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను సందర్శించా. ఎక్కడా హోటల్లో విడిది చేయలేదు. డార్మెటరీలు, ఆలయాలు, గురుద్వారాల్లో విడిది చేస్తూ వెళ్లా. దీనివల్ల తక్కువ బడ్జెట్లోనే యాత్ర పూర్తి చేయగలిగా. వాఘా, సుచిత్ఘర్, కార్గిల్ దగ్గర.. ఇలా మూడుచోట్ల పాకిస్తాన్ బార్డర్‌ను చూడడం మరచిపోలేని అనుభూతి. – బాలకృష్ణ, నార్పల -
మరోసారి వాత్సల్యం చూపిన సీఎం వైఎస్ జగన్
-
ఒక ముఖ్యమంత్రికి ఇంతటి స్పందన రావడం జగన్ విషయంలోనే..
ఇకనుంచి ప్రజలు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ- 5 వంటి తెలుగుదేశం మీడియాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న కార్యక్రమాల గురించి ఎంత ఎక్కువ వ్యతిరేక వార్తలు రాశాయంటే ఆ ప్రోగ్రాం అంత విజయవంతం అయిందని గుర్తించాలి. అనంతపురం జిల్లా నార్పల వద్ద జగనన్న వసతి దీవెన కింద విద్యార్దుల తల్లుల ఖాతాలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర జమ చేయడానికి ఒక ఫంక్షన్ జరిగింది. జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని బటన్ నొక్కి ప్రజల ఖాతాలలోకి ఆ డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విశేష సంఖ్యలో వేలాది మంది తరలి వచ్చారు. వారిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. సభా ప్రాంగణం పట్టలేదు. జగన్ మాట్లాడిన ప్రతి మాటకు జనం చప్పట్లతో హోరెత్తించారు. జగన్ ను ఉద్దేశించి కొద్ది మంది విద్యార్ధులు చక్కగా మాట్లాడారు.ప్రోగ్రాం పూర్తి అయ్యాక అనుకోకుండా హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య రావడంతో జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్లపై కూడా జనం పెద్ద ఎత్తున గుమికూడి ఆయనకు అభివాదాలు చేశారు. నిజానికి ఇటీవలికాలంలో ఒక ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో స్పందన రావడం జగన్ విషయంలోనే జరుగుతోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ రాజకీయంతో పాటు,సినీ గ్లామర్ తోడవడంతో ప్రజలు బాగా తరలివచ్చేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్కు కొంతమేర జనం వచ్చినా, జగన్‌కు వచ్చిన స్థాయిలో కాదని చెప్పకతప్పదు. ఆయన ఎక్కడకు వెళ్లినా జనం రావడమే కాకుండా ఆ కార్యక్రమంలో లీనమై ఉంటున్నారు. జగన్ కూడా వారిని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. నార్పలలో జరిగిన సభ సూపర్ హిట్ అయింది. ఆ సభలో ఆయన పంచతంత్రం కథను ప్రస్తావించి ముసలి పులి బాటసారులను ఎలా మోసం చేసేదో వివరించి , దానిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వర్తింపచేశారు. ఈ కథ విన్నంత సేపు జనం ఒకటే నవ్వులు. ఒకటే స్పందన. ఒకటే చప్పట్లు. దీనిని గమనించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టీవీ 5 మీడియాలకు కడుపు మండిపోయింది. అక్కసు పెరిగిపోయింది. దాంతో దీనిని ఎలా పక్కదారి పట్టించాలా అన్న ఆలోచన చేశారు. అంతలో జగన్ రోడ్డు మార్గంలో వెళుతున్నారన్న సమాచారంతో దానిని ఒక అవకాశంగా వాడుకోవాలని యోచించారు. వెంటనే తెలుగుదేశం వారికి చెప్పి నాగేపల్లి అనేచోట ఒక పది మందిని పోగుచేసి తమకు పరిహారం రావడంలో జాప్యం అంటూ హడావిడి చేయించారు. తీరా చూస్తే ఆ పరిహారం ఇవ్వవలసింది తెలుగుదేశం హయాంలోనిది. 2018లో సేకరించిన భూములకు సంబందించిందట. ఏదో కారణం వల్ల జాప్యం అయిందేమో తెలియదు. కాని దానిని జగన్‌కు ముడిపెట్టి ఆ పది మందితో నిరసన డ్రామా ఆడించారు. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నారు కనుక ఫోటోలు, తదితర కవరేజీ ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు అనిపిస్తుంది.ఇక వారి టివీలలో, మరుసటి రోజు పత్రికలలో దానినే పతాక శీర్షికలలో కథనాలు వండి వార్చారు. అసలు ఇక జగన్‌కు వివిధ వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్ర ప్రజలందరిని మోసం చేయాలని వీరు కుట్ర పన్నారు. బ్రహ్మాండంగా జరిగిన సభను, పాల్గొన్న వేలాది మంది ప్రజలనేమో బాగా తక్కువచేసి చూపించారు. పట్టుమని పది మంది కూడా లేని సో కాల్డ్ ఆర్గనైజ్ డ్ నిరసనకేమో విపరీత ప్రచారం కల్పించారు. టీడీపీ కోసం బట్టలు ఊడదీసుకునే మరో పత్రిక అయితే పరదాలు లేకుంటే ఇంతేనా అంటూ కొత్త భాష్యం చెప్పి తన కుళ్లును బయటపెట్టేసుకుంది. ఆ పత్రిక బట్టలు లేకుండా తిరుగుతుంటే తాము ఎక్కడ వెనుకపడి పోతామో అని భావిస్తున్న ఈనాడు మరీ అసహ్యంగా తయారై ఎలాంటి కథనాలు ఇచ్చిందో చూడండి.. సి.ఎమ్. సభ అంటే పరుగో, పరుగో అని అంటున్నారట.. బారికేడ్ల బందనాలు దాటి బయటకు వెళుతున్నారట. అంటూ రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి అని పిక్చర్ ఇవ్వడానికి తెగ తాపత్రయపడింది. తద్వారా పత్రిక విలువల వలువలు వలిచి రామోజీరావు తన పత్రికను ఎలా అధ్వాన్నంగా నడుపుతున్నది ఇట్టే తెలిసిపోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు జనం వచ్చినా, రాకపోయినా పటం కట్టి అబ్బో .. అంటూ మొదటి పేజీలో వేస్తున్నారు. సి.ఎమ్ జగన్ కు మాత్రం నిరసనలు అంటూ చెత్తా, చెదారం ఫోటోలు వేసి ఆత్మవంచన చేసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడువచ్చిన జనం ఎందుకు వచ్చామురా బాబూ అన్నట్లుగా ఉసూరుమంటూ కూర్చునేవారు. కాని జగన్ సభలలో ఉత్సాహంగా పాల్గొంటున్న విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబు ఇటీవల బందరు, గుడివాడ వంటి చోట్ల సభలు పెట్టినప్పుడు వేసిన కుర్చీలలో మూడువంతులు పైగా ఖాళీగా కనిపించాయి. పొద్దుపోయాక సభ జరపడం వల్ల కావచ్చు. లేదా బోరు కొట్టి కావచ్చు.. వాటిని మాత్రం కనబడనీయకుండా వార్తలు ఇస్తున్న ఈ మీడియాలు జగన్ కు సంబంధించి ఆవ గింజంత ఏదైనా జరిగితే దానిని కొండంత చూపి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.దీని అంతటికి కొన్ని కారణాలు ఉన్నాయి. తాము ఎంత వ్యతిరేక వార్తలు ఇస్తున్నా జనం ఈ రకంగా జగన్ ను ఆదరించడం ఏమిటా అన్నది వారికి అర్ధం కావడం లేదు. ఎలాగైనా జనంలో ఆయనను పలచన చేయాలన్నది వారి లక్ష్యం. ఆ క్రమంలో వారే పరువు పోగొట్టుకుంటున్నారు. అది వేరే సంగతి . కొద్ది రోజుల క్రితం టైమ్స్ నౌ సర్వేలో వైసిపికి 24 లేదా 25 లోక్ సభ స్థానాలు వస్తాయని వెల్లడవడం ఇంకొ కారణం. దాంతో ఈ టీడీపీ మీడియాకు వెర్రి గంగుర్లు పుడుతున్నాయి తాము ఎంత కల్పిత వార్తలను సృష్టిస్తున్నా సర్వే లో ప్రజల మనోగతం ఇలా ఉండడంతో వారికి ఎటూ పాలుపోవడం లేదు. దాంతో మరింత విజృంభించి దారుణమైన రీతిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మరో వైపు మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ ఉతికి ఆరవేస్తున్నారు. దానిని కప్పిపుచ్చడానికి కూడా రామోజీ చేయని ప్రయత్నం లేదు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి షర్మిల చేసిన వ్యాఖ్యలకు విశేష ప్రాధాన్యత ఇచ్చిన ఈనాడు మరి మార్గదర్శి మోసాల గురించి ఎందుకు రాసుకోలేకపోతోంది?ఏది ఏమైనా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 మీడియా సంస్థలు ఇలాగే కుట్రలు చేస్తూ రెచ్చిపోతుంటాయి. దుష్టచతుష్టయం అన్న పేరును అవి సార్ధకం చేసుకుంటాయి. అయినా ప్రజలు ఇప్పటికే వీరి కుట్రలు,కుతంత్రాలు గమనించారు. వీరి కుట్రలతోనే టీడీపీ గెలుస్తుందా? భ్రమ కాకపోతే! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ -
నార్పలలో సీఎం జగన్ గొప్ప మనసు.. కలెక్టర్‌కు ఆదేశాలు, బాధితులకు సాయం
సాక్షి, అనంతపూర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. జిల్లాలోని నార్పలలో బుధవారం రోజున జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా అనారోగ్య బాధితులను కలిసి సీఎం జగన్ నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి సాయం చేయాలని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అవసరమైన సాయం అందజేశారు. తమ గోడు విని సత్వరం స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత త్వరగా ముఖ్యమంత్రి స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. (చదవండి: AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే) బాధితుల పూర్తి వివరాలు... 1.డి.రాజు, పి. అరుణ రాజు, అరుణల కుమారుడు ధనుష్ జెనెటికల్ సమస్యలతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ధనుష్‌కు అవసరమైన వైద్యచికిత్సలు ఉచితంగా చేయించాలని నిర్ణయం. 2.యోగిశ్వరి యోగిశ్వరి భర్త రంగారెడ్డి ప్రమాదంలో మరణించారని, ఇద్దరు కుమారులతో తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం. 3. రామచంద్ర, భవాని రామచంద్ర సోదరి భవాని కుమారుడు బాలచంద్ర (11) అంగవైకల్యంతో బాధపడుతున్నాడని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.1 లక్ష ఆర్ధిక సాయం, వీల్ ఛైర్. 4. చాకలి నవ్య ఇటీవల జరిగిన కెమికల్ బ్లాస్ట్ లో తన భర్తను కోల్పోయానని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ.7 లక్షల ఆర్ధిక సాయం. 5. ఏ.నారాయణమ్మ తన కుమారుడు జశ్వంత్ రెడ్డి (6) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆమె కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, ఉచితంగా చికిత్స. 6. జి.రామాంజి విద్యుత్‌శాఖలో టెంపరరీగా పనిచేస్తున్న తనకు విద్యుత్‌షాక్‌తో కుడి చెయ్యి కోల్పోయానని, సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం, విద్యుత్ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ట్ ఉద్యోగం. 7. వి.అమర్నాథ్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆ కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం 8. బి.గంగయ్య తన భార్య నాగలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం, వీల్ ఛైర్. 9. బి.కొండారెడ్డి తన మేనల్లుడు చేతన్ రెడ్డి కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్ధిక సాయం 10. ఎస్.నబీరసూల్ తనకు వైకల్యం కారణంగా ట్రైసైకిల్ ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకురాగా ఆయనకు ట్రైసైకిల్ అందజేసిన అధికారులు. (చదవండి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?) -
సీఎం జగన్ కాన్వాయ్ చూసి నార్పల ప్రజలు కేరింతలు
-
జగనన్న వసతి దీవెన
-
చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు: సీఎం జగన్
-
మా చిరునవ్వుకు కారణం మీరే జగనన్న.. నార్పల సభలో విద్యార్థిని భావోద్వేగం..
సాక్షి, అనంతపురం జిల్లా: ‘అన్నా నమస్తే, మా నాన్న టైలరింగ్ చేస్తారు.. మా అమ్మ గృహిణి, మాది ధర్మవరం.. అన్నా మీరు అంటుంటారు ఒక దీపం ఒక గదికి వెలుగులు ఇస్తుంది కానీ చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగులు నింపి ఆ కుటుంబ రూపురేఖలు మార్చేస్తుందని, మీరు విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.. ఆ చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు’’ అంటూ అనంతపురం జేఎన్టీయూ కాలేజ్ బీటెక్ సెకండియర్ విద్యార్ధిని దివ్య దీపిక భావోద్వేగానికి గురైంది. నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ‘జగనన్న వసతి దీవెన’ ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విద్యార్ధులు తమ స్పందన తెలిపారు. ‘జగనన్న వసతి దీవెన గురించి విద్యార్ధిని దివ్య దీపిక మాటల్లోనే.. మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. అన్నా నాది 2021లో ఇంటర్ పూర్తవగానే ఇక్కడ జేఎన్టీయూలో సీట్ తెచ్చుకున్నాను. నేను విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నాను. అలాగే మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతి దీవెన ద్వారా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని.. లాక్డౌన్ తర్వాత అంతంతగా ఉన్న మా ఆర్ధిక పరిస్ధితిపై మీరు కనుక ఈ పథకాలు పెట్టకపోయి ఉంటే ఎంతో భారం పడేది. మీ చిరునవ్వులో నేను భాగమవుతా.. మీ కుటుంబంలో ఒకడినవుతానని మీరు అంటుంటారు.. మా చిరునవ్వులో భాగమే కాదు చిరునవ్వుకు కారణం కూడా మీరే, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు.. విద్యా కానుక ద్వారా స్కూల్ బుక్స్, బ్యాగ్, ఇలా ప్రతీది అందిస్తున్నారు, ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యం కానిదంతా మీరు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. మీరు ప్రతి గుండెలో ఉంటారన్నా.. మా ఇంట్లో చాలా పథకాలు అందుతున్నాయి. మా ఇంట్లో ఇప్పటివరకు అక్షరాలా రూ. 3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది.. అన్నొచ్చాడని చెబుతాం, మంచి రోజులు వచ్చాయని చెబుతాం. చదవండి: ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది మీరు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారు. మీ పాదయాత్రకు ఏదీ సాటిరాదన్నా. నేను కోరుకుంటున్న ఉన్నతమైన సమాజానికి మీరు పునాదులు వేశారు. ప్రతి గ్రామంలో అన్నీ ఏర్పాటుచేస్తున్నారు. సచివాలయాల ద్వారా అన్నీ అందుతున్నాయి, మీ కష్టాన్ని చరిత్ర కచ్చితంగా గుర్తుంచుకుంటుంది. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర కొందరినే గుర్తించుకుంటుంది. ఆ చరిత్రలో జగన్ అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. యాదృచ్చికమో లేక దైవ నిర్ణయమో కానీ మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కళకళలాడుతుంది. అన్నొచ్చేశాడు మన బతుకులు మార్చేశాడు. రాబోయే రోజుల్లో మీరు చదివిస్తున్న ఈ బిడ్డ ఉన్నతస్ధాయికి ఎదిగి మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది అన్నా. మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నా వంతు పాత్రను నేను పోషిస్తాను, ధ్యాంక్యూ అన్నా. మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం సార్, మాది నిరుపేద కుటుంబం, చెన్నూరు గ్రామం, తిరుపతి జిల్లా. మా నాన్న కూలిపనులు చేస్తారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకుండా ఉంటే నేను చదువుకు దూరమయ్యేవాడిని, నాలాంటి ఎంతోమంది విద్యార్ధులకు మీరు సాయం చేస్తున్నారు, మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం, వసతి దీవెన ద్వారా మాకు సాయం అందుతుంది, మాకు చాలా సంతోషంగా ఉంది, చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయే మార్పులు మీరు విద్యారంగంలో చేస్తున్నారు. నాడు నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, విదేశీ విద్యాకానుక పథకాలు తీసుకొచ్చారు, ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి, మా ఒక్క కుటుంబానికే మీరు రూ. 4,59,976 అందజేశారు, మాలాంటి పేద విద్యార్ధులకు మీరు అండగా నిలిచి ఎప్పుడూ మాకు తోడుగా నిలిచి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం, నేను రాముడి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పుస్తకాలలో చదివాను కానీ ఇప్పుడు జగనన్న పాలనలో మేం అంతే సంతోషంగా ఉన్నాం, నేను మంచి ప్రయోజకుడిని అయి పది మంది విద్యార్ధులకు తోడ్పాటును అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను, నేను మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్, ధన్యవాదాలు. -గోవింద్ చంద్రశేఖర్, బీటెక్ ఫైనలియర్, ఎస్కేడీ యూనివర్శిటీ విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్.. సార్, నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఈ కాంపిటీటివ్ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివించడం అనేది మా తల్లిదండ్రులకు పెద్ద భారం, కానీ మీరు సమాజంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. మీరు మా విద్యార్ధులకు అనేక పథకాలు తీసుకొచ్చారు, దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్లో అనేక కోర్సులు ప్రవేశపెట్టారు, మా విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్‌గా నిలిచారు.. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మేం కూడా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై భవిష్యత్‌లో ఉన్నతంగా రాణిస్తాం.. నేను ఈ మధ్య మాల్కం గ్లాడ్వెల్ రచించిన అవుట్లేర్స్ పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో పదివేల గంటల సూత్రం చదివాను, దాని అర్ధం ఏంటంటే ఎవరైనా ఏ రంగంలోనైనా నిష్ణాతులు కావాలంటే పదివేల గంటలు అభ్యసించాలని, మీరు పాదయాత్రలో దానిని నిరూపించారు, ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది, మీరు మనసున్న మారాజులా నిలిచారు, మీరు మా యువతకు గొప్ప స్పూర్తిప్రదాతగా నిలిచారు. మీ పేరు నిలబెట్టేలా మేం ముందుకెళతాం, ధ్యాంక్యూ సార్. -గ్రేసీ, బీటెక్ సెకండియర్ విద్యార్ధిని, జేఎన్టీయూ, అనంతపురం -
అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సిన సీఎం.. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి బుధవారం.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకం నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. చదవండి: పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్ -
ఇదీ కదా సీఎం జగన్ విజన్.. ప్రత్యక సాక్షి ఈ అమ్మాయే
-
చంద్రబాబుపై సీఎం జగన్ పులి కథ.. వేరే లెవెల్..
-
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు)
అనంతపురం: జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం (ఫొటోలు) -
ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది
సాక్షి, అనంతపురం: ఒక ముసలాయన.. ఈ మధ్య జాతీయ మీడియాకు వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాటలు వినేప్పుడు.. నాకొక కథ గుర్తుకొచ్చింది. అది మన అందరికీ ఇష్టమైన, నీతిని పంచే పంచ తంత్రంలోని కథ.. అనగనగా ఓ పులి ఉండేదట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్థతి ప్రకారం రెగ్యులర్‌గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచాక ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుంది. మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్ వేసుకుంది. దారిలో ఓ ముడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’’ అంటూ ఊరించేది. ‘‘ఈ పులిని నమ్మాం అంటే.. తినేస్తుంది కదా’’ అని అందరూ నమ్మకుండా పోయారు. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్ మోస్ట్ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది. ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు.. వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉంది చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంట.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోంది. నేను సీనియర్ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ, చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు అని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. పంచతంత్రం కథల్లోని ముసలి పులి లాంటి వాడు మన సీనియర్ మోస్ట్ పోలిటీషియన్. మనిషి మాంసం రుచి మరిగిన పులి మారిందంటే ఎలా నమ్ముతారు?. బాంగారు కడియం ఆశచూపి మనుషుల్ని మింగేసే ఆ పులి బాపతే ఈ వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు. బాబు వచ్చాడు.. రైతుల్ని నట్టేట ముంచాడు పంచతంత్ర కథల్లో నీతి నేర్చుకుంటాం. రోజూ రాజకీయాల మధ్య మనం బతుకున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల్ని నండా ముంచారు. అక్కాచెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయప్పుడు. సున్నా వడ్డ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండి చేయి చూపాడు. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతాడు. దోచుకో, పంచుకో.. ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడుగా దత్తపుత్రుడు.. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండి. జగనన్న వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి.. ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మ విశ్వాసం ప్రజలే అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి అని ఆయన ప్రజలను కోరారు. -
పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్
సాక్షి, అనంతపురం: పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ.. వాళ్ల తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేస్తున్నాం. చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే మా తాపత్రయం. ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా.. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని సీఎం జగన్ పేర్కొన్నారు. పీజు రీయంబర్స్మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం.. పెత్తందారి ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడాలు ప్రజలు గమనించాలని సీఎం జగన్ ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. పేదలకు పెద్ద చదువులు అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అని సీఎం జగన్ పేర్కొన్నారు. గవర్నమెంట్ విద్యాసంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితి తెచ్చాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలనుకున్న పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. అందుకే బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. ప్రతీ మూడు నెలలకు తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో డ్రాపవుట్ల సంఖ్య తగ్గిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్లలా ఎదగాలి.. మన పిల్లలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా విద్యా సంస్కరణలు చేశాం. ఈ ప్రయత్నాలు కేవలం ఉద్యోగాలు కోసం కాదు. వాళ్లను లీడర్లుగా వారిని తీర్చిదిద్దడానికి తపన పడుతున్నాం. మన పిల్లలను లీడర్లుగా చేసేందుకు జగనన్న ఆలోచన చేస్తున్నాడు. మన పిల్లలంతా సత్యనాదెళ్లలా(సత్యనాదెళ్ల మూలాలు అనంతపురంవే కావడం గమనార్హం) తయారు కావాలి. ఒక్క సత్యనాదెళ్లకాదు… ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్ల కావాలి. స్కూళ్లలో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ పెడుతున్నామని సీఎం జగన్ వివరించారు. ఇదీ చదవండి: నా జగనన్న నన్ను చదివిస్తున్నాడు -
జగనన్న వసతి దీవెన: నిధులు విడుదల చేసిన సీఎం జగన్
CM Jagan Anantapur District Tour Updates: ► బటన్ నొక్కి రూ.912.71 కోట్లు నిధులు విడుదల చేసిన సీఎం జగన్. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం. ► చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజకి వర్గాన్నే మారుస్తుంది. పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం. చదువుల వల్ల ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ► జగనన్న వసతి దీవెన ద్వారా ఐటీఐ చదివే విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. ► గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలి. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయి. ► గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరిగింది. గవర్నమెంట్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ► ఇది విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న వసతిదీవెన. ఫీజురియింబర్స్‌మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.. బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ప్రతి 3 నెలలకు తల్లుల ఖాత్లాలో డబ్బులు జమ చేస్తున్నాం. ► నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్యా నాదెళ్లతో పోటీపడే పరిస్థితి రావాలి. యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్.. ఎడ్యూకేషన్ ఈజ్ పవర్. ► రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబును చూసి పంచతంత్రం కథ గుర్తొచ్చింది. వేటాగే శక్తి కోల్పోయిన పులి గుంటనక్కలను వెంటేసుకుని తిరిగినట్టు ఉంది. ► రోజూ రాజకీయాల మధ్య మనం బతుకుతున్నాం. నేను సీనియర్‌ను ఇప్పుడు మంచోడిని అయ్యాను అని నమ్మించే ప్రయత్నం చేశారు. బంగారు కడియం ఆశచూపి మనుషులను మింగేసే పులి బాపతు వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిఏ ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు. ► రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశాడు. బాబు వచ్చాడు.. రైతులను నట్టేట ముంచాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయి. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండిచేయి చూపాడు. ► దోచుకో, పంచుకో, తినుకో ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వీరికి తోడుగా దత్తపుత్రుడు. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్దాలను, మోసాలను నమ్మకండి. ► జగనన్న వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం ప్రజలే. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి. నా అన్న జగనన్న చదివిస్తున్నాడు ఒక దీపం ఒక గదికి వెలుగు ఇస్తుంది. కానీ, చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబాల రూపు రేఖల్ని మారుస్తుందని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. సీఎం జగన్‌తో ముఖాముఖి అయ్యింది దివ్య దీపిక. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతోంది. ధర్మవరానికి చెందిన దివ్య దీపిక.. తండ్రి కొంగాల బాలకృష్ణ టైలర్, తల్లి గృహిణి. విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటోంది. వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా.. నా అన్న జగనన్న చదవిస్తున్నాడంటూ భావోద్వేగానికి లోనైంది దీపిక. ► జగనన్న పాలనలో పేదల చదువులకు ఢోకా లేదు. నాణ్యమైన చదువుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాల రూపకర్త. అభివృద్దికి దిక్సూచి సీఎం జగన్. విద్యారంగంలో వినూత్న మార్పులు తెస్తున్నారు. 2019లో హిస్టరీ క్రియేట్ చేశాం. 2024లో హిస్టరీ రిపీట్ చేస్తాం.. అని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రసంగించారు. ► జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్యమంత్రి జగన్. ► దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్. ► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమ సభా ప్రాంగణం వద్ద అప్యాయ పలకరింపుతో ముందుకు సాగుతున్న సీఎం జగన్. ► అపూర్వ స్వాగతం నడుమ.. నార్పల సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్. నార్పల హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్‌కు ఘన స్వాగతం ► అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మాత్యులు కేవీ ఉషశ్రీ చరణ్, జిల్లా కలెక్టర్ గౌతమి, అనంతపురం డిఐజి ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్,సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ లు సీఎం జగన్‌కు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. ► జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా.. లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. ► అనంతపురం నార్పల పర్యటనలో భాగంగా.. పుట్టపర్తి నుంచి శింగనమల నియోజకవర్గం నార్పలకు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. ఆపై నార్పల క్రాసింగ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. ముందుగా విద్యార్థుల తల్లులను, స్థానిక నేతలను పలకరించి.. ఆపై వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. జగనన్న వసతి దీవెన లబ్ధిని బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేస్తారు. ► జగనన్న వసతి దీవెన నిధుల జమ కార్యక్రమం కోసం అనంతపురం నార్పలకు భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు. అక్కడి సభాప్రాంగణం నుంచి ప్రసంగించిన తర్వాత సీఎం జగన్ నిధుల నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ► జగనన్న వసతి దీవెన కింద నిధులు విడుదల కోసం.. తాడేపల్లి నుంచి అనంతపురం జిల్లా నార్పల బయలుదేరిన సీఎం జగన్. ► జగనన్న వసతి దీవెన పథకం ప్రకారం.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ► రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. ► సంక్షేమ క్యాలెండర్ అమలు హామీలో భాగంగా పేద విద్యార్థులకు ఆసరా అందిస్తూనే.. గత ప్రభుత్వం 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. ► గతంలోని టీడీపీ ప్రభుత్వం అరకోరగా ఫీజుల కోసం నిధుల్ని విడుదల చేసేది. పెండింగ్ బకాయిల్ని ఉంచింది కూడా. కానీ, అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. -
Anantapur: పసివాడి చికిత్సకు రూ.16 కోట్లు!
సాక్షి, అనంతపురం/నార్పల: అరుదైన వ్యాధి.. ఓ పేద కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి అనే జబ్బు వల్ల పెద్ద కుమారుడు దూరమవడం.. చిన్న కుమారుడూ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లకే రూ.16 కోట్లు అవసరం కావడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడగా.. పలు స్వచ్చంద సంస్థలు వారికి బాసటగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నాయి. అనంతపురం జిల్లా నార్పలకు చెందిన జేసీబీ డ్రైవర్ రాజు, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి సోకి పెద్ద కుమారుడు భరత్(6) కొంతకాలం కిందట మృతి చెందగా.. ఇప్పుడు రెండో కుమారుడు ధనుష్(2)కు కూడా ఆ వ్యాధి సోకింది. ఎంజైముల లోపంతో... దీనిని జన్యుపరంగా సోకే వ్యాధిగా గుర్తించారు. పెద్ద కుమారుడు భరత్‌కు అనారోగ్య సమస్య కొనసాగుతుండగానే.. రెండో కుమారుడు ధనుష్ 2020 సెప్టెంబర్‌లో జన్మించాడు. 5 నెలల వయసులోనే వ్యాధి లక్షణాలు గుర్తించిన తల్లిదండ్రులు డాక్టర్లను కలిశారు. ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని నాలుగు రకాల అట్రోఫిలు ఉంటాయి. ఎంజైము లోపంతో వచ్చే వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. మెదడు, వెన్నుపూస సరిగ్గానే ఉన్నా.. కండరాలు పనిచేయకపోవడంతో రోజురోజుకూ అవి బలహీనపడుతూ చివరకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ప్రస్తుతం ధనుష్‌కు టైప్ 2 సోకగా.. బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ఈ జబ్బుకు ఇటీవలే అమెరికాలో మందు కనిపెట్టారని.. ఇది సత్ఫలితాలనిస్తోందని ఆ ఆస్పత్రి వైద్యులతో పాటు వెన్నుపూస వైద్య నిపుణుడు డాక్టర్ జె.నరేష్‌బాబు చెప్పారు. జోల్గెన్స్మా అనే ఇంజక్షన్‌ను సరైన సమయంలో ఇస్తే ప్రాణాలను కాపాడవచ్చని.. దీని ధరను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ 1.79 మిలియన్ యూరోలు(రూ.16 కోట్లు)గా నిర్ణయించిందని తెలిపారు. కుమారుడిని దక్కించుకోవాలంటే రూ.16 కోట్లు కావాలని తెలియడంతో రాజు దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. చికిత్సకు ముందుకొచ్చిన సంస్థలు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ధనుష్‌కు అండగా ఉండేందుకు పలు స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చాయి. ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఆఫ్ ఇండియా సంస్థ ఇంజక్షన్లకయ్యే రూ.16 కోట్లు వెచ్చిస్తానని ప్రకటించింది. ఇలాంటి జబ్బుతోనే మరణించిన చిన్నారుల తల్లిదండ్రులంతా కలిసి నెలకొల్పిన క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఫౌండేషన్, ఇంపాక్ట్ గురు అనే సంస్థలు వైద్యానికి, ఇతర ఖర్చులకు ఆర్థిక సాయం భరించేందుకు ముందుకొచ్చాయని ధనుష్ తల్లిదండ్రులు రాజు, అరుణ చెప్పారు. ఆ సంస్థల మేలు ఎప్పటికీ మరవలేమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి
-
చిన్నారిపై లైంగికదాడి.. దేహశుద్ధి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని నార్పలలో దారుణం చోటుచేసుకుంది. కన్నూమిన్నూ కానక చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడో కామాంధుడు. వివరాలు.. నార్పలకు చెందిన ఆరేళ్ల చిన్నారి తమ ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నారాయణస్వామి అనే వ్యక్తి తలుపులు మూసి బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి చేష్టలతో బెంబేలెత్తిపోయిన చిన్నారి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చిన్నారి ఆర్తనాదాలు విన్న స్థానికులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నారాయణస్వామికి దేహశుద్ధి చేశారు. కాగా దేశ వ్యాప్తంగా యువతులు, మహిళలపైనే కాకుండా పసిపిల్లలపై కూడా అత్యాచార పర్వాలు కొనసాగుతునే ఉన్నాయి. కామాంధుల మృగవాంఛకు ఎంతో మంది చిన్నారులు బలైపోతున్న విషయం విదితమే. -
ఏపీలో నిజమైన రౌడీ చంద్రబాబు
-
అనంతపురం జిల్లా నార్పల సభలో వైఎస్ విజయమ్మ
-
‘గుండెపోటని చంద్రబాబు నాటకాలు ఆడతారు’
సాక్షి, అనంతపురం: పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో రైతులను, నిరుద్యోగులను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆమె మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను సీఎం చేస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారని విజయమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం భర్తీ చేయడంలేదని, జగన్ సీఎం అయిన వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా నార్పల సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. తన పుట్టినిల్లు ఆ జిల్లానే అని గుర్తుచేశారు. ఈ జిల్లా మనువడైన వైఎస్ జగన్‌ను ప్రజలంతా దీవించాలని ఆమె కోరారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని, బీసీ, మైనార్టీల ద్రోహి చంద్రబాబని ధ్వజమెత్తారు. మైనార్టీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, వైఎస్ జగన్ బీసీలకు పెద్దపీఠ వేశారని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని ఆమె గుర్తుచేశారు. చివరి వరకూ ప్రజల సంక్షేమం కోసమే తపించి.. ప్రజలే ముఖ్యమని వెళ్తూ వైఎస్సార్ మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై అనేక అక్రమ కేసులను పెట్టి.. ఎన్నో హింసలకు గురిచేశారని విజయమ్మ అన్నారు. ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వడంని ప్రజలను కోరారు. ‘‘ఏపీలో నిజమైన రౌడీ చంద్రబాబు. ఎవరైనా ఎదురు తిరిగితే.. తాటతీస్తా.. ఫినిష్ చేస్తా అంటూ బెదిరిస్తున్నారు. అమరావతి పేరుతో టీడీపీ నేతలు భూ దోపిడీ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఏపీ ప్రజల డాటా చోరీ చేసిన దొంగ చంద్రబాబు. భన్వర్‌లాల్‌కు.. రోజాకు సంబంధం ఉందని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గుందా. ఆడవాళ్లను గౌరవించే విధానం ఇదేనా. మహిళల మాన ప్రాణాలతో చంద్రబాబు నీచ రాజకీయలు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి చంద్రబాబు అనేక డ్రామాలు ఆడుతున్నారు. గుండెపోటు పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడే అవకాశం కూడా ఉంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. వైఎస్సార్సీపీకి ఓటు వేయండి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వడదెబ్బతో ఒకరి మృతి
నార్పల (శింగనమల) : నార్పల జంగాలకాలనీకి చెందిన ఆవుల రామాంజి(46)అనే మేకల కాపరి వడదెబ్బకు గురై బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమీపంలోని కూతలేరు వంక పరిసరాల్లో మేకలను మేత కోసం మంగళవారం తోలుకెళ్లిన అతను రాత్రి ఇంటికి రాగానే సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ఘనంగా తిక్కయ్యస్వామి తిరునాల
నార్పల : మండల కేంద్రంలో తిక్కయ్యస్వామి ఉట్ల పరుష శనివారం అత్యంత వైభవంగా సాగింది. వేకువ జామున వేద పండితులు ఆలయంలో హోమం నిర్వహించి స్వామివారి మూలవిరాట్‌ను గంగాజలంతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిలిపిన ఉట్లమాను ఎక్కేందుకు స్థానిక వాల్మీకి యువజన సంఘం సభ్యులు తాంబూలం స్వీకరించారు. అశోక్ అనే యువకుడు ఉట్లకాయను పగులగొట్టగా, ఉట్లమాను ఎక్కే పోటీలో రాము విజయం సాధించాడు. విజేతలకు డొక్కాకృష్ణ రూ.5116, రూ.3116లు బహుమతి ప్రదానం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉట్ల తిరునాల తిలకించేందుకు ఆలయ ప్రాంగణంలో కిక్కిరిశారు. అలాగే ఉత్సవాల సందర్భంగా తప్పెట పోటీలు నిర్వహించారు, విజేతలైన నార్పలకు చెందిన పెద్దగంగయ్య, వైఎస్సార్‌జిల్లా గురుజాలకు చెందిన లక్ష్మినారాయణ, వెలిదండ్లకు చెందిన పుల్లయ్య, గరిసినపల్లికి చెందిన ఈరప్పకు వెండి బహుమతులు సింగరయ్య అందజేశారు. రాత్రికి తిక్కయ్యస్వామి ఉత్సవ విగ్రహాన్ని పుర వీధుల్లో ఊరేగించారు. అలాగే భజన కార్యక్రమం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకం అలరించాయి. ఆదివారం అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సేవా కార్యకర్తలు రేకులకుంట లక్ష్మిరెడ్డి, తలారి ఆంజనేయులు చెప్పారు. -
అమెరికాలో ‘అనంత’ తేజం
తెలుగు భాషా సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికైన జిల్లా వాసి నార్పల /అనంతపురం కల్చరల్ : జిల్లాకు చెందిన నామాల వెంకట శివానందరెడ్డి అమెరికా తెలుగు భాషా సంఘానికి అధ్యక్షునిగా వారం రోజుల క్రితం ఎంపికయ్యారు. ఈ మేరకు అమెరికాలో స్థిరపడిన జిల్లా వాసులు సోమవారం వివరాలనందించారు. అమెరికా దేశంలో తెలుగుభాషా సంస్కృతి, కళలు, సాహిత్యం అభివృద్ధికి దోహదపడేందుకు అమెరికాలో స్థిరపడిన తెలుగువారు రెండు దశబ్దాల కిందట ఆస్టిన్ నగరంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటడమే కాకుండా అధికారికంగా గుర్తింపు వచ్చేలా చేయడంలో ఈ సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. సంప్రదాయ తెలుగు పండుగలైన ఉగాది, సంక్రాంతి, దసరా పండుగలను ఈ సంఘం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సంఘానికి నూతన అధ్యక్షునిగా ఎంపికైన వెంకటశివానందరెడ్డి తండ్రి నామాల సంజీవరెడ్డి నార్పల మండల కేంద్రంలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. వెంకట శివానందరెడ్డి నార్పల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989 బ్యాచ్‌లో పదో తరగతి చదివారు. జిల్లా వాసి అమెరికా తెలుగు సంఘానికి అధ్యక్షునిగా ఎంపిక కావడం పట్ల పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి మొరసు సంజీవరెడ్డి అభినందనలు తెలిపారు.