New Judges
-
మణిపూర్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టుకు.. ఎవరీ ఎన్ కోటీశ్వర్?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు చేరారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం వెల్లడించారు.కాగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కోలిజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా.. ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జీగా ఉన్నారు. ఇక కొత్తగా ఇద్దరు జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఇటీవల హింసాత్మకంగా మారిన ఈ ఈశాన్య రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైన తొలి జడ్జిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కడారు.జస్టిస్ కోటీశ్వర్ మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ అండ క్యాంపస్ లా సెంటర్లో పూర్వ న్యాయ విద్యను పూర్తి చేశారు. అనంతరం 1986లో న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయన జడ్జి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. గతంలో అస్సాంలోని గువాహటి హైకోర్టు, మణిపూర్ హైకోర్టులోనూ విధులు నిర్వర్తించారు.ఇక చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యాయవాదిగా ఆయన 9,000 కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్‌గా(పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది, మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. -
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తులతో సీఎం వైఎస్ జగన్
-
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు
-
తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం
-
తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మంగళవారం కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నగేష్, పి. కార్తీక్, కె. శరత్‌లు ప్రమాణం చేశారు. కొత్తగా నియమితులైన హైకోర్టు జడ్జిలతో సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణం చేయించారు. -
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
-
AP: హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏడుగురు న్యాయాధికారులు గురువారం ప్రమాణం చేశారు. ఏవీ రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తాళ్లప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలతో గవర్నర్ హరిచందన్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణం చేయించారు. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి (సీజే) ప్రమాణం చేయించడం ఆనవాయితీ. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఆయన వచ్చే పరిస్థితి లేదు. దీంతో గవర్నర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. -
Telangana: హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ సోమవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి.ఎలమందర్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సుల్లో పేర్కొంది. ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాగా, సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. ఏడాది కాలంలో 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కు పెరగనుంది. కొలీజియం సిఫార్సు చేసిన వారి నేపథ్యమిదీ.. ఈవీ వేణుగోపాల్.. 1967, ఆగస్టు 16న కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటలో బాలాకుమారి, రాజేశ్వరరావులకు జన్మించారు. తండ్రి చేనేత, వస్త్ర పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. వేణుగోపాల్.. డాక్టర్ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. 1992లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. తొలుత సీనియర్ న్యాయవాది జే. రామ్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. కరీంనగర్ కోర్టులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. 2007 నుంచి 2013 వరకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. వివిధ విభాగాల్లో రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లలో వాదించారు. ఉమ్మడి హైకోర్టులో రైల్వే కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. నాగేశ్ భీమపాక... 1969, మార్చి 8న భద్రాచలంలో శాంతమ్మ, భూపతిరావులకు జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన భూపతిరావు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నాగేశ్.. పాఠశాల విద్య భద్రాచలంలో, ఇంటర్ ఖమ్మంలో, ఎల్ఎల్బీ సీఆర్ రెడ్డి కళాశాలలో, ఎల్ఎల్ఎం నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్‌లో అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదిస్తున్నారు. సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్, లేబర్, రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. పరిశ్రమలు, గనుల కౌన్సిల్‌గా, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ గా, అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. పుల్లా కార్తీక్... 1967, జూన్ 4న జగిత్యాల పట్టణంలో పోచమల్లమ్మ, ఒగ్గు హనుమంతులకు జన్మించారు. పాఠశాల విద్య జగిత్యాలలోనే పూర్తి చేశారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయ్యారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా నుంచే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1996, మార్చి 27న అడ్వొకేట్‌గా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నారు. అన్ని విభాగాల న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ న్యాయవాదిగా నియమితులయ్యారు. కాజా శరత్... 1971, జనవరి 29న భద్రాచలంలో లలితాంబ, సీతారామయ్యలకు జన్మించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, డిగ్రీ(బీఎస్సీ) భద్రాచలంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ పట్టాపొందారు. ఆంధ్రా వర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా, ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1997, డిసెంబర్ 31న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. తొలుత కొత్తగూడెం, భద్రాచలం ట్రయల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2002 నుంచి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో అన్ని విభాగాల న్యాయవాదిగా పలు కేసులు వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. జగన్నగారి శ్రీనివాసరావు.. 1969, ఆగస్టు 31న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో జన్మించారు. ఈయన తండ్రిపేరు మాణిక్యరావు. తల్లిపేరు లక్ష్మీబాయి. పాఠశాల విద్య లింగన్నపేట లో.. గంభీరావుపేటలోని ప్రభుత్వ కాలేజీ నుంచి ఇంటర్మీడియెట్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సై న్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999, ఏప్రిల్ 29న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ మ్యాటర్స్‌కు సంబంధించి లో యర్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. నామవరపు రాజేశ్వర్‌రావు.. 1969, జూన్ 30న మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లిలో జన్మించారు. తల్లి పేరు గిరిజా కుమారి, తండ్రిపేరు సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైస్కూల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2001, ఫిబ్రవరి 22న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో.. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తొలుత సీవీ రాములు ఆఫీస్‌లో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు పనిచేశారు. యూజీసీ తరఫు అడ్వొకేట్‌గా విధులు నిర్వహించారు. 2016, ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019, నవంబర్‌లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. -
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఆరుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఈవీ వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజా శరత్, జె.శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావు ఉన్నారు. న్యాయాధికారుల పేర్లను కొలీజియం.. కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. చదవండి: భట్టీతో భేటీ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
-
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఏడుగురు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. వీరిలో రవీంద్రబాబు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, రాధాకృష్ణ కృపాసాగర్ కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, శ్యాంసుందర్ విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, శ్రీనివాస్ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా, చక్రవర్తి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా, మల్లికార్జునరావు నూజివీడు 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా, వెంకటరమణ హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడుగురితోపాటు ఇప్పటికే కేంద్రానికి చేరిన న్యాయవాది ఎస్.ఎం.సుభాని పేరుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుతుంది. హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకుగాను ప్రస్తుతం 24 మంది ఉన్నారు. తాజా నియామకాలు పూర్తయితే ఇంకా ఐదుపోస్టులు ఖాళీగా ఉంటాయి. త్వరలో కొన్ని ఖాళీలను భర్తీచేసేందుకు హైకోర్టు చర్యలు తీసుకోనుంది. ఆశావహులు తమ బయోడేటాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అడుసుమల్లి వెంకటరవీంద్రబాబు 1962 జూన్ 20న ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాళెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి రాఘవరావు, తల్లి సీతారావమ్మ. 1988లో న్యాయవాదిగా ఎల్‌రోల్ అయ్యారు. చీరాలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994 మే 5న మునిసిఫ్ మేజిస్ట్రేట్‌గా జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పనిచేశారు. 2021 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా కొనసాగుతున్నారు. బండారు శ్యాంసుందర్ 1962 సెప్టెంబర్ 1న అనంతపురంలో జన్మించారు. తండ్రి బండారు సుబ్రహ్మణ్యం, తల్లి సుబ్బలక్ష్మి. తాత బండారు రంగనాథం ప్రముఖ క్రిమినల్ న్యాయవాది. 1986లో ఎల్ఎల్బీ పూర్తిచేసి అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఐదేళ్లపాటు అనంతపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1991లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. న్యాయాధికారిగా 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఊటుకూరు శ్రీనివాస్ కృష్ణాజిల్లా తిరువూరు గ్రామంలో జన్మించారు. తండ్రి లక్ష్మణరావు, తల్లి లీలావతి. భార్య లక్ష్మీప్రసన్న. మచిలీపట్నం డీఎస్ఆర్ హిందూ న్యాయకళాశాలలో న్యాయవిద్య పూర్తిచేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. బొప్పన వరాహలక్ష్మీనర్సింహచక్రవర్తి 1964 ఆగస్టు 15న తూర్పు గోదావరి జిల్లా కందులపాళెం గ్రామంలో జన్మించారు. తండ్రి డాక్టర్ బి.పాపారాయచౌదరి, తల్లి విజయలక్ష్మి. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకు జడ్జిగా వ్యవహరించారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా వ్యవహరించారు. 2019లో విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా కొనసాగుతున్నారు. తల్లాప్రగడ మల్లికార్జునరావు 1964 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా పుల్లేటికుర్రులో జన్మించారు. తండ్రి శ్రీరామచంద్రమూర్తి. తల్లి రమణ. 10వ తరగతి వరకు నేదునూరులో విద్యాభ్యాసం కొనసాగించారు. అమలాపురంలో బీఎస్సీ పూర్తిచేశారు. రాజమండ్రిలోని జి.ఎస్.కె.ఎం.లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1988–1994 వరకు అమలాపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సీనియర్ న్యాయవాది పారెపు శ్రీరామచంద్రమూర్తి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2015లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం నూజివీడు అదనపు జిల్లా, సెషన్స్‌జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డా. వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ 1963లో జన్మించారు. తండ్రి వి.బి.కె.విఠల్, తల్లి పుష్పవతి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. ఏడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు. ఐదేళ్ల పాటు లెక్చరర్‌గా వ్యవహరించారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. రాజమండ్రి, పెద్దాపురం, ఒంగోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టు న్యాయసేవాధికార సంస్థగా పనిచేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సతీమణి వి.ఎ.ఎల్.సత్యవతి కర్నూలు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. దుప్పల వెంకటరమణ 1963 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా చినబోడేపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి అప్పన్న, తల్లి వరహాలమ్మ. తండ్రి రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలోనే కన్నుమూశారు. అన్న పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రాథమిక విద్యాభ్యాసం బోడేపల్లి, తోటాడ గ్రామాల్లో పూర్తిచేశారు. విశాఖపట్నం ఎన్.వి.పి.లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1994లో జ్యుడిషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది పలు ప్రాంతాల్లో బాధ్యతలు నిర్తరించారు. టీటీడీ లా ఆఫీసర్‌గా వ్యవహరించారు. 2017–19 వరకు న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: ఇవేం రాతలు, ఇవేం కూతలు? -
తెలంగాణ హైకోర్టులో 10 మంది న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
తెలంగాణ హైకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో 10 మంది నూతన న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్ శ్రవణ్‌కుమార్ వెంకట్, గుణ్ణు అనుపమ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్‌దేవరాజ్ నాగార్జునలతో హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. -
హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు మరో 10 మంది నూతన న్యాయమూర్తులు రానున్నారు. వీరి నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజేందర్ కశ్యప్ నోటిఫికేషన్ జారీచేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ బుధవారం లేదా గురువారం వీరితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. కొత్త జడ్జీలుగా నియమితులైన వారిలో న్యాయవాదులు కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, నట్చరాజు శ్రావణ్‌కుమార్ వెంకట్‌తోపాటు జిల్లా న్యాయమూర్తుల కోటా నుంచి పదో న్నతి పొందిన గున్ను అనుపమ చక్రవర్తి, మాటూరి గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేతో కలిపి 19 ఉండగా... నూతన న్యాయమూర్తులతో ఈ సంఖ్య 29కి చేరనుంది. ఇదిలా ఉండగా, హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచుతూ గతంలో కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో మరో 13 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కాగా, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారిలో మరో ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించలేదు. -
ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. న్యాయమూర్తులుగా కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత నియామకాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. చదవండి: ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. -
ఏడుగురు జడ్జిల నియామకానికి ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జ్యుడీషియల్ అధికారులు పెరుగు శ్రీసుధ, చిళ్లకూర్ సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఐటీఏటీ సభ్యురాలు పటోళ్ల మాధవిదేవిలకు పదోన్నతి కల్పిస్తూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి. పోస్టుల సంఖ్య పెంచాక.. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 10 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరింది. జిల్లా జడ్జిల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ, చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. న్యాయవాదుల నుంచి కూడా న్యాయమూర్తులుగా ఎంపిక చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త జడ్జిలు బాధ్యతలు స్వీకరించిన తరువాత కేసుల విచారణ వేగం పెరగనుంది. కొత్త న్యాయమూర్తులు వీరే.. పి.శ్రీసుధ: 1967, జూన్ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్నారు. డాక్టర్ సి.సుమలత: 1972, ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. డాక్టర్ జి.రాధారాణి: 1963, జూన్ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా ఉన్నారు. ఎం.లక్ష్మణ్: వికారాబాద్ జిల్లాకు చెందిన ఈయన 1965, డిసెంబర్ 24న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం లేబర్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఎన్.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మిం చారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యా రు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి: 1961, ఏప్రిల్ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ ఆవరణలోని స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. పి.మాధవిదేవి: ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) జ్యుడిషియల్ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. -
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 మంది న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. తెలంగాణ ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావును పంజాబ్ హరియాణా హైకోర్టుకు బదిలీ చేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాను, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
సర్వోన్నత న్యాయస్థానంలో... సరికొత్త చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా నియమితులైన తొమ్మిది మంది మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు అదనపు బిల్డింగ్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఉద యం 10.30 నిమిషాలకు వారితో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియారిటీ ప్రకారం వారితో ప్రమాణం చేయించారు. ఏడు దశాబ్దాల చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. ప్రమాణం చేసిన తొమ్మిది మందిలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పీఎస్ నరసింహలు వరుసగా ఫిబ్రవరి 2027 నుంచి మే, 2028 వరకూ ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు న్యాయమూర్తులు తదనంతర కాలంలో సీజేఐలు కానుండటం ఇదే తొలిసారి. మంగళవారం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ప్రమాణం చేయడంతో కోర్టులో ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీతో కలిపి మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగు చేరింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి నలుగురు సిట్టింగ్ మహిళా న్యాయమూర్తులు ఉండటం కూడా ఇదే తొలిసారి. 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతకుముందు ఎనిమిది మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా పనిచేశారు. మంగళవారం ప్రమాణం చేసిన ముగ్గురితో కలుపుకుంటే మొత్తం 11 మంది మహిళలకే అవకాశం దక్కింది. 1980లో జస్టిస్ ఫాతిమా బీవి తొలి మహిళా జడ్జీగా నియమితులయ్యారు. అనంతరం జస్టిస్ సుజాత వి.మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞానసుధా మిశ్రా, జస్టిస్ రంజనా పి దేశాయ్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఎవరు ఎప్పటిదాకా సుప్రీంలో... 1.జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. ఆయన పేరెంట్ హైకోర్టు బాంబే హైకోర్టు. సుప్రీంకోర్టులో మే 25, 2025 వరకూ సేవలు అందించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ప్రధాన ధర్మాసనంలో కూర్చొన్నారు. 2. జస్టిస్ విక్రమ్‌నాథ్: గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయయూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. ఫిబ్రవరి 2027 నుంచి సుమారు ఏడు నెలలపాటు సీజేఐగా ఉండడనున్నారు. రెండో కోర్టులో జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనంలో కూర్చొన్నారు. 3. జస్టిస్ జేకే మహేశ్వరి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. పేరెంట్ హైకోర్టు మధ్యప్రదేశ్ హైకోర్టు. సుప్రీంకోర్టులో జూన్ 29, 2026 వరకూ సేవలందించనున్నారు. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన మూడో ధర్మాసనంలో కూర్చొన్నారు. 4. జస్టిస్ హిమా కోహ్లి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. పేరెంట్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు. సెప్టెంబరు 2, 2024 వరకూ సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన నాలుగో ధర్మాసనంలో కూర్చొన్నారు. 5. జస్టిస్ బీవీ నాగరత్న: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. సీనియారిటీ ప్రకారం 2027లో సీజేఐ కానున్నారు. సెప్టెంబరు 24, 2027 నుంచి అక్టోబరు 30, 2027 వరకూ 36 రోజులపాటు సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్న తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్రకెక్కనున్నారు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ఐదో ధర్మాసనంలో కూర్చొన్నారు. 6. జస్టిస్ సీటీ రవికుమార్: కేరళ హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జనవరి 6, 2025న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌లో కూడిన ఆరో ధర్మాసనంలో కూర్చొన్నారు. 7. జస్టిస్ ఎంఎం సుందరేశ్: మద్రాస్ హైకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జులై 21, 2027న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణమురారిలతోకూడిన ఏడో ధర్మాసనంలో కూర్చొన్నారు. 8. జస్టిస్ బేలా ఎం త్రివేది: గుజరాత్ హైకోర్టులో ఐదో సీనియర్ న్యాయమూర్తిగా ఉంటూ పదోన్నతి పొందారు. జూన్ 10, 2025న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ఎనిమిదో ధర్మాసనంలో కూర్చొన్నారు. 9. జస్టిస్ పీఎస్ నరసింహ: సుప్రీంకోర్టు బార్ నుంచి పదోన్నతి పొందారు. సీనియారిటీ ప్రకారం అక్టోబరు 30, 2027 నుంచి మే 2028 వరకూ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన తొమ్మిదో ధర్మాసనంలో కూర్చొన్నారు. -
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. నిన్న(బుధవారం) జరిగిన కొలీజియం సమావేశంలో న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన వారిలో శ్రీ సుధ, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, ఎన్. తుకారాం, వెంకటేశ్వర రెడ్డి , మాధవి దేవి ఉన్నారు. వీరిని హైకోర్టు జడ్జిలుగా పదోన్నతిపై నియమించాలన్న ప్రతిపాదనలకు సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది. చదవండి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు -
సుప్రీం కొలీజియం భేటీ
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అయ్యింది. సుప్రీంకోర్టులో త్వరలో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల స్థానంలో ఎంపిక చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పరిశీలించింది. ఇందులో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు ఇద్దరు హైకోర్టు జడ్జీల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ పేర్లను కేంద్రం పరిశీలన నిమిత్తం పంపాల్సి ఉంది. అయితే, ఈ భేటీలో పేర్ల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్‌లో జరిగే తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 నవంబర్ 18వ తేదీన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే వచ్చే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు తన స్థానంలోకి ఎవరినీ ప్రతిపాదించలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు. -
సుప్రీంకోర్టు నలుగురు జడ్జీల ప్రమాణం
సాక్షి, న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తన కార్యాలయంలో వీరి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరింది. -
సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక సంఖ్య. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు సోమవారం ప్రమాణస్వీకారం చేసే వీలుంది. గత నెలలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను కేంద్రానికి సూచించింది. వీరిలో జస్టిస్ రామసుమ్రమణియన్ హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాను, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, హృతికేశ్ రాయ్‌లు రాజస్తాన్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరనుంది. సుప్రీంకోర్టులో 59,331 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జూలై 11న రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు. -
హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు తడకమళ్ల వినోద్‌కుమార్, అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కూనూరు లక్ష్మణ్ నియమితులయ్యారు. వీరి నియామకాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. అనంతరం ఈ ముగ్గురి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నియామకపు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈ ముగ్గురూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వీరిని అభినందించారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు హైకోర్టులో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ ముగ్గురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరుకుంది. మరో 10 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఖాళీల భర్తీకి హైకోర్టు సీజే జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని కొలీజియం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. అర్హులైన న్యాయవాదుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. కొత్త జడ్జీల నేపథ్యమిదీ.. తడకమళ్ల వినోద్‌కుమార్ 1964 నవంబర్ 17న జన్మించారు. నల్లగొండ జిల్లా దాచారం గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు లక్ష్మీ నర్సింహారావు, శకుంతల. హైదరాబాద్ ఎంబీ హైస్కూల్లో ఎస్సెస్సీ, గన్‌ఫౌండ్రీలోని ఆలియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్, జాంబాగ్‌లోని వీవీ కాలేజీ లో బీఏ, ఓయూలో ఎల్ఎల్బీ చదివారు. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1993లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2016 నుంచి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. కూనూరు లక్ష్మణ్ 1966 జూన్ 8న జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భోగారం గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు గోపాల్, సత్తెమ్మ. వీరిది చిన్న వ్యవసాయ కుటుంబం. రామన్నపేట జూనియర్ కాలేజీలో ఇంటర్, అమీర్‌పేట న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీ, నెల్లూరు వీఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ చదివారు. 1993లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎం.రాధాకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా చేరి వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1999 నుంచి ప్రాక్టీస్ ప్రారంభించారు. యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు న్యాయవాదిగా వ్యవహరించారు. సివిల్, రాజ్యాంగ, లేబర్ కేసుల్లో ప్రావీణ్యత సంపాదించారు. 2017 నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా కొనసాగుతున్నారు. అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి 1967 నవంబర్ 7న జన్మించారు. రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. తల్లిదండ్రులు పుల్లారెడ్డి, శశిరేఖారెడ్డి. హైదర్‌గూడ సెయింట్ పాల్స్ పాఠశాలలో పదో తరగతి, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్లో ఇంటర్, నిజాం కాలేజీలో బీఏ, ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్బీ చదివారు. వాషింగ్టన్‌లోని వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లాలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోలయ్యా రు. ప్రముఖ న్యాయవాది అయిన తండ్రి ఎ.పుల్లారెడ్డి వద్ద న్యాయవాద జీవితాన్ని ఆరం భించి, వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. హైకోర్టుతో పాటు సివిల్ కోర్టు, భూ ఆక్రమణల నిరోధక కోర్టులో ఎక్కువ కేసులు వాదించారు. సివిల్, రాజ్యాంగ కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2004–07 మధ్య కాలంలో భూ ఆక్రమణ ల నిరోధక కోర్టులో ప్రభుత్వ న్యాయవాది కమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2007–09 కాలంలో హైకోర్టులో ఉన్నత, సాంకేతిక విద్యాశాఖల తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ, తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీకి న్యాయవాదిగా ఉన్నారు.