Nominations ended
-
ఏపీ: ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ►గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ. ►మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు: 8వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ►పరిషత్ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బద్వేలు బరిలో 15 మంది
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్ ఉపఎన్నిక పోటీలో నిలిచారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక పోటీ నుంచి 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. హుజురాబాద్‌లో నామినేషన్ వేసిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ సతీమణి జమున తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్తులు సుమన్ నాయక్, వినోద్ కుమార్, రాజ్ కుమార్, నూర్జహాన్ బేగం, మల్లికార్జున్ తదితరులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 30 మంది అభ్యర్థులకు గాను రెండు ఈవీఎంలతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. -
నామినేషన్లు ముగిశాయి.. ఇక ప్రచారమే
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తిరుగుబాటు అభ్యర్థుల బెడద లేకుండా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో బీ ఫారాలు జారీ చేసింది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అభ్యర్థుల ఎంపికపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొనగా, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు మిగతా ఐదు మున్సిపాలిటీల్లో గురువారం మధ్యాహ్నమే అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకే ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో శుక్రవారం నుంచి క్ష్రేతస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ భావిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్లో నేతలు, అభ్యర్థులను కలిసేందుకు ఓటర్లు విముఖత చూపుతుండటంతో ప్రతీ ఓటరును చేరుకునేందుకు కార్యకర్తల యంత్రాంగంపైనే ఆధారపడి ప్రచారం చేయాలని యోచిస్తోంది. చివరి నిమిషంలో వచ్చిన వారికి కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకుని ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. సుదర్శన్‌గౌడ్‌తో పాటు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన ఆయన అనుచరులు ఒకరిద్దరికి టీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ టికెట్ దక్కింది. జడ్చర్ల మున్సిపాలిటీలో బీజేవైఎం మహబూబ్‌నగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రామ్మోహన్ భార్య సారికకు చివరి నిమిషంలో టీఆర్ఎస్ బీ ఫారం దక్కగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శోభ పోటీ నుంచి వైదొలిగారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వంగవీటి ధనలక్ష్మి ఏకంగా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్లు కలిసిరాకపోవడం, పనితీరుపై వ్యతిరేకత వంటి కారణాలతో చాలాచోట్ల సిట్టింగ్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కలేదు. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో వివిధ పార్టీల తరపున, స్వతంత్రులుగా గెలిచి తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్‌లకు మళ్లీ టీఆర్ఎస్ తరపున అవకాశం దక్కింది. అసంతృప్తులకు బుజ్జగింపులు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ నామినేషన్ దాఖ లు చేసినా అవకాశం దక్కని క్షేత్రస్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సర్వశక్తులూ ఒడ్డారు. పార్టీ టికెట్ ఆశిస్తూ లేదా స్వతంత్రులుగా నామినేషన్ వేసిన అభ్యర్థులను డివిజన్లు, వార్డుల వారీగా టీఆర్ఎస్ గుర్తించింది. పార్టీ తరపున గెలుపు గుర్రాలు మాత్రమే బరిలో ఉండాలనే ఉద్దేశంతో అవకాశం దక్కని ఆశావహులు, బలమైన స్వతంత్రులను పోటీ నుంచి తప్పించేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. దీనికోసం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వారితో పాటు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన వారిని గుర్తించి అవకాశమిచ్చింది. అక్కడక్కడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. సామాజిక న్యాయం, ఉద్యమకారులు, సీనియారిటీ తదితరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. -
నేటితో ముగిసిన తొలి విడత నామినేషన్లు
సాక్షి, అమరావతి: ఏపీలో నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాల్లో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరుగనుండగా, సర్పంచ్ పదవులకు 13వేలకు పైగా నామినేషన్లు, వార్డు మెంబర్ పదవులకు 35వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు (ఫిబ్రవరి 3న) తొలి విడత నామినేషన్ల పరిశీలన, అనంతరం నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం వెలువడుతుంది. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సాగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి. ఫిబ్రవరి 9న సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగనుంది. -
తొలి అంకానికి తెర
సాక్షి, మెదక్: ప్రాదేశిక ఎన్నికల పోరులో తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరిరోజు బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఎన్నికలు జరిగే ఆరు మండలాల (హవేళిఘణాపూర్, పాపన్నపేట, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట) పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు 357, జెడ్పీటీసీ స్థానాలకు 32 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ మండలాల పరిధిలో మొత్తంగా 65 ఎంపీటీసీ స్థానాలుండగా.. 433 నామినేషన్లు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నెల 25న (నేడు) నామినేషన్లను పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 26న విజ్ఞప్తుల స్వీకరణతోపాటు 27న స్క్రూటినీ నిర్వహించనున్నారు. 28న ఉపసంహరణ అనంతరం అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మే ఆరో తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. మండలాలు, పార్టీల వారీగా ఇలా.. హవేళిఘణాపూర్ మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 9, సీపీఎం, టీడీపీ నుంచి ఒకటి చొప్పున, కాంగ్రెస్ నుంచి 22, టీఆర్ఎస్ నుంచి 40, స్వతంత్రుల నుంచి 15 నామినేషన్ల చొప్పున మొత్తం 88 దాఖలయ్యాయి. అదేవిధంగా ఒక జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకటి చొప్పున, టీఆర్ఎస్ నుంచి రెండు.. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. పాపన్నపేట మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి 36, టీఆర్ఎస్ నుంచి 57, స్వతంత్రుల నుంచి 11.. మొత్తం 107 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మూడు, టీఆర్ఎస్ నుంచి రెండు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. టేక్మాల్ మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి నాలుగు, కాంగ్రెస్ నుంచి 26, టీఆర్ఎస్ నుంచి 31, స్వతంత్రుల నుంచి తొమ్మిది.. మొత్తం70 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి రెండు, టీఆర్ఎస్ నుంచి నాలుగు.. మొత్తం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అల్లాదుర్గం మండలంలో మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి రెండు, కాంగ్రెస్ నుంచి 20, టీఆర్ఎస్ నుంచి 26, టీజేఎస్ ఒకటి, స్వతంత్రుల నుంచి 13.. మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 5, టీఆర్ఎస్ నుంచి 4, స్వతంత్ర ఒకటి.. మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దశంకరంపేట మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి 17, టీఆర్ఎస్ నుంచి 32, స్వతంత్రుల నుంచి 10.. మొత్తం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి రెండు, టీఆర్ఎస్ నుంచి మూడు.. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. రేగోడ్ మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి 18, టీఆర్ఎస్ నుంచి 27, స్వతంత్రుల నుంచి ఒక నామినేషన్.. మొత్తం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ నుంచి మూడు, టీఆర్ఎస్ నుంచి నాలుగు, స్వతంత్ర రెండు.. మొత్తం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వివరించారు. ఇక ప్రచార పర్వం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తయిన నేపథ్యంలో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో పోరు రసవత్తరంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికే తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సైతం ప్రచారానికి కసరత్తు చేస్తున్నారు. టీడీపీ కనుమరుగు.. ఒకప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపిన టీడీపీ.. ప్రస్తుతం కనుమరుగైందనే చెప్పాలి. మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆ పార్టీ నుంచి ఒక్కచోట మాత్రమే నామినేషన్ దాఖలైంది. హవేళి ఘణాపూర్‌లో టీడీపీ అభ్యర్థి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. వామపక్షాల ప్రాబల్యం తగ్గిందనడానికి తొలి విడతలో దాఖలైన నామినేషన్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హవేళిఘణాపూర్ నుంచి ఒకరు సీపీఎం తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీపీఐ అభ్యర్థులు ఎవరు కూడా పోటీకి ముందుకు రాకపోవడం గమనార్హం. టీజేఎస్ సైతం ఈ ఎన్నికల బరిలో లేదు. అల్లాదుర్గం మండలంలో టీజేఎస్ తరఫున ఒకరు మాత్రమే దాఖలు చేయడం విశేషం. తొలి అంకానికి తెర -
తొలివిడతకు తెర
సాక్షి, వరంగల్ రూరల్: మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెరపడింది. మూడు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ల దాఖలు బుధవారంతో ముగిసింది. చివరి రోజున జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 22న దుగ్గొండి, నర్సంపేట, పర్వతగిరి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లోని 5 జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలిరోజున జెడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 29 నామినేషన్లు రాగా అందులో జెడ్పీటీసీ స్థానాలకు 3 నామినేషన్లు , ఎంపీటీసీ స్థానాలకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజున జెడ్పీటీసీ స్థానాలకు 54 నామినేషన్లు, ఎంపీటీసీ స్థానాలకు 338 నామినేషన్లు దాఖలైయ్యాయి. చివరిరోజున ఐదు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున మొత్తం 392 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తంగా 5 జడ్పీటీసీ స్థానాలకు 60 నామినేషన్లు, 62 ఎంపీటీసీ స్థానాలకు 373 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో జడ్పీటీసీ స్థానాల కోసం 53మంది అభ్యర్ధులు 60 నామినేషన్లు సమర్పించారు. జడ్పీటీసీ నామినేషన్లలో టీఆర్ఎస్ నుంచి 24 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 15 నామినేషన్లు, బీజేపీ నుంచి 8 నామినేషన్లు, సీపీఐ నుంచి 1,టీడీపీ నుంచి 4, ఇతరులు 14 చొప్పున నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. అదేవిధంగా 62 ఎంపీటీసీ స్థానాలకు 373 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ నుంచి 20, సీపీఐ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 124, టీఆర్ఎస్ నుంచి 182, టీడీపీ నుంచి 13, స్వతంత్రులు 68 చొప్పున నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన.. మొదటి విడతలో దాఖలైన నామినేషన్ల పరిశీలన గురువారం జరుగనుంది. నామినేషన్ల స్క్రూటినీ అధికారులు చేపట్టనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం సాయంత్రం 5గంటలకు సక్రమంగా ఉన్న నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. 26న నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను స్వీకరణ అనంతరం సక్రమంగా నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. 28న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడంతో పాటు పార్టీ గుర్తులను ప్రకటిస్తారు. -
ముగిసిన తొలివిడత నామినేషన్లు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పక్రియ బుధవారంతో ముగిసింది. చివరి రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. ఒక్కరోజే ఎనిమిది మండ లా ల్లో జెడ్పీటీసీ స్థానాలకు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ మండలంలో 5 , ధర్పల్లిలో 14, డిచ్‌పల్లిలో 3, ఇందల్వాయిలో 10, మాక్లూర్‌లో 4, మోపాల్‌లో 4, సిరి కొండలో 5, నవీపేటలో 7 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి మొత్తం 60 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ నుంచి 16 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి 15, టీఆర్ఎస్ నుంచి 21, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీ స్థానాలకు.. ఎంపీటీసీ స్థానాలకు చివరి రోజు 448 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో నిజామాబాద్ మండలంలో 27, ధర్పల్లి మండలంలో 50, డిచ్‌పల్లిలో 60, ఇందల్వాయిలో 75, మాక్లూర్‌లో 49, మోపాల్‌లో 62, సిరికొండలో 42, నవీపేటలో 83 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ ల వారీగా పరిశీలిస్తే బీజేపీ తరపున 105 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి 96, టీఆర్ఎస్ నుంచి 191, స్వతం త్రులు 121, సీపీఐ తరపున ఒక్కరు, ఎంఐఎం తరపున ఒక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి మొత్తం మొత్తం 515 నామినేషన్లు దాఖ లయ్యాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే 8 మండలాల్లోని 8 జెడ్పీటీసీ స్థానాలకు 60 నామినేషన్లు, 100 ఎంపీటీసీ స్థానాలకు 515 నామినేషన్లు దాఖ లయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27న అభ్యంతరాల స్వీకరణ, 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 6న పోలింగ్ జరుగనుంది. -
ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఘట్టం
కొండమల్లేపల్లి (దేవరకొండ) : దేవరకొండ డివిజన్లో మే 6న జరగనున్న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. డివిజన్ పరిధిలోని పది జెడ్పీటీసీ స్థానాలకు మొత్తంగా 167, 109 ఎంపీటీసీ స్థానాలకు 1,104 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ లింగ్యానాయక్ తెలిపారు. ఈనెల 22న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రెండు రోజులు నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగగా చివరి రోజు మాత్రం అత్యధికంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. డివిజన్ పరిధిలోని ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన స్వీకరణ కేంద్రాల్లో అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్లు సమర్పించారు. తొలిరోజు జెడ్పీటీసీ స్థానాలకు 3, ఎంపీటీసీ స్థానాలకు 66 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు జెడ్పీటీసీ స్థానాలకు 10, ఎంపీటీసీ స్థానాలకు 90 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండు రోజుల్లో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు పడడంతో నామినేషన్ల దాఖలు మందకొడదిగా సాగాయి. చివరి రోజు మాత్రం అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాలకు 153, ఎంపీటీసీ స్థానాలకు 946 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా సాధారణ ఎన్నికల అధికారి జిల్లా సాధారణ ఎన్నికల అధికారి చంపాలాల్ బుధవారం దేవరకొండ, కొండమల్లేపల్లి, గుర్రంపోడ్ మండలాల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను దేవరకొండ ఆర్డీఓ లింగ్యానాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ, వివరాలను ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోలాహలంగా నామినేషన్ కేంద్రాలు పెద్ద ఎత్తున మద్దతుదారులతో భారీ ర్యాలీలుగా అభ్యర్థులు రావడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు సైతం చివరి రోజు తమ మద్దతుదారులతో కలిసి పలు మండలాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమానికి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌లు హాజరయ్యారు. పోలీసుల బందోబస్తు నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద వాహనాల రాకపోకలను నిషేధించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులను అనుమతించారు. దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు నా మినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
త్రిముఖ పోటీ
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లోనూ త్రిముఖ పోటీయే కనబడుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యనే వార్ నెలకొననుంది. సాధారణంగా ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని పార్టీల్లో అసంతృప్తులు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా బరిలో ఉండే వారు. అయితే ప్రధాన పార్టీల నుంచి పోటీ కనిపిస్తుండగా, మిగతా నామమాత్రమే అయింది. గురువారం ప్రాదేశిక ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. ఆరు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు మే 6న జరగాల్సి ఉండగా, ఈ మండలాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి అన్నిచోట్ల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఒకట్రెండు చోట్ల టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు రంగంలో ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికలో కసరత్తు.. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తీవ్రంగా కసరత్తు చేశారు. ప్రధానంగా బుధవారం నామినేషన్లకు చివరి రోజు అయినా మంగళవారం వరకు ఆయా మండలాల నుంచి పార్టీల అభ్యర్థులు ఎవరనేది స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో అసలు పోటీలో ఎవరుంటారనేది ఆసక్తి కలిగించింది. ఆదిలాబాద్‌రూరల్ మండలం: ఆదిలాబాద్‌రూరల్ మండలంలో జెడ్పీటీసీ జనరల్ రిజర్వేషన్ కాగా టీఆర్ఎస్ నుంచి మార్కెట్ కమిటీ తాజా మాజీ చైర్మన్ ఆరె రాజన్న, బీజేపీ నుంచి రిటైర్డ్ ఉపాధ్యాయుడు దారట్ల జీవన్, కాంగ్రెస్ పార్టీ నుంచి మడావి హన్మంత్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మడావి హన్మంత్‌రావు తండ్రి మడావి రాజు బీజేపీ నుంచి తిరిగి సొంతగూటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తండ్రి, తనయులు కాంగ్రెస్‌లో చేరిన వెంటనే హన్మంత్‌రావు పేరును కాంగ్రెస్ ఖరారు చేయడం గమనార్హం. మడావి రాజు లోక్‌సభ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. ఇక టీడీపీ నుంచి ఆకుల రాము, సీపీఐ(ఎం) నుంచి ఆత్రం కిష్టన్న, సీపీఎం నుంచి పెందూర్ రాములు, స్వతంత్రులుగా కె.రాజేశ్వర్, ఎ.వినోద్‌కుమార్ నామినేషన్ వేశారు. మావల మండలం: మావల జెడ్పీటీసీ స్థానం ఎస్సీ(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి నల్ల వనిత, కాంగ్రెస్ నుంచి ధర్మపూరి నాగలత, బీజేపీ నుంచి ఎంబటి ప్రమిళ, టీడీపీ నుంచి గాలిపెల్లి ప్రియాంకలు బరిలో నిలిచారు. జైనథ్ మండలం: జైనథ్ జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి తుమ్మల అరుంధతి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి గడ్డం మమతారెడ్డి, బీజేపీ నుంచి బోయర్ షాలున, స్వతంత్ర అభ్యర్థిగా జి.సౌందర్య నామినేషన్ వేశారు. బేల మండలం: బేల జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి అక్షిత పవార్, కాంగ్రెస్ నుంచి నాక్లే సవిత, బీజేపీ నుంచి ఠాక్రే వర్ష, టీడీపీ నుంచి ఉధార్ వనిత బరిలో నిలిచారు. టీఆర్ఎస్ డమ్మి అభ్యర్థిగా పవార్ నానుబాయి నామినేషన్ దాఖలు చేశారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ జెడ్పీటీసీ స్థానం గతంలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఇక్కడ గెలువాలని టీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది. ఇక బీజేపీ సీనియర్ నేత కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపారు. ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. తాంసి మండలం: తాంసి జెడ్పీటీసీ స్థానం జనరల్ రిజర్వ్ కాగా, టీఆర్ఎస్ నుంచి తాటిపల్లి గంగాధర్, కాంగ్రెస్ నుంచి కౌడాల నారాయణ, బీజేపీ నుంచి సామ సంతోష్‌రెడ్డి, సామ కవిత ఇరువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి ఇప్పటి వరకు బీ–ఫాం ఇవ్వకపోవడం గమనార్హం. బీజేపీ నుంచి ఇరువురు నామినేషన్లు వేసినా బీ–ఫాం ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా బెల్లూరి భీమన్న బరిలో నిలిచారు. కాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సోదరుడు రామారావు రాథోడ్ ఇక్కడి నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరిగినా ఆయన నామినేషన్ వేయకపోవడంతో ఈ ప్రచారానికి తెరపడింది. అయితే తాటిపెల్లి గంగాధర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ అనుచరుడిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరగణాలు రెండు గ్రూపులుగా ఉన్న విషయం విధితమే. భీంపూర్ మండలం: భీంపూర్‌లో జెడ్పీటీసీ ఎస్టీ(జనరల్) కాగా, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి కుమ్రం సుధాకర్, కాంగ్రెస్ నుంచి మెస్రం హన్మంత్, బీజేపీ నుంచి మరప భరత్, టేకం బోన్, స్వతంత్ర అభ్యర్థిగా ఎం.నామ్‌దేవ్ వేశారు. అయితే బీజేపీ నుంచి ఇద్దరిలో ఎవరికి బీ–ఫాం ఇస్తారో ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఎంపీటీసీకి జోరుగా నామినేషన్లు ఎంపీటీసీ స్థానాలకు కొన్ని మండలాల్లో జోరుగా నామినేషన్లు వచ్చాయి. జైనథ్‌లో 14 స్థానాలకు గాను 71 నామినేషన్లు దాఖలయ్యాయి. బేలలో 11 స్థానాలకు గాను 63 రావడం గమనార్హం. మిగతా మండలాల్లో స్థానాల సంఖ్యకు ప్రధాన పార్టీల నుంచిపోను కొంత స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. గురు వారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26న అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 28న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. ఇక ఈ ఆరు మండలాల్లో ప్రచారం జోరందుకోనుంది. మే 6న ఎన్నికలు జరగనుండగా ఇక అభ్యర్థులు ఎవరనేది తేట తెల్లం కావడంతో పార్టీలు ప్రచారంలో వేగం పెం చనున్నాయి. కాగా రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. -
ముగిసిన నామినేషన్ల దాఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే పూర్తి వివరాలు మంగళవారం తెలియజేస్తామని ఆయన మీడియాకు వివరించారు. శుక్రవారం నాటికి అసెంబ్లీకి 1,419, లోక్‌సభకు 199 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని, ఎన్నికల ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో ఇది జరుగుతుందని, ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నట్లు ద్వివేదీ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 28గా తెలిపారు. గత శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుందని చెప్పారు. 788 మందిపై ఎఫ్ఐఆర్లు కాగా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 788 కేసులు నమోదు చేసినట్లు దివ్వేది తెలిపారు. అలాగే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.55 కోట్ల నగదు, 91 కేజీల బంగారం, 231 కేజీల వెండి, 60 డైమండ్లు, 125 వాహనాలు, రూ.12 కోట్ల విలువైన 2.5 లక్షల లీటర్ల మద్యం, 1,000 కేజీల గంజాయి ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులపై ఇప్పటివరకు 367 నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి నిర్మాత వచ్చి వివరణ ఇచ్చి వెళ్లారని, దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల సంఘం న్యాయ విభాగంతో చర్చించి ఈ సినిమాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవగా శుక్రవారం నాటికి 220 నామినేషన్లు దాఖలయ్యాయి. శని, ఆదివారం వరుస సెలవుల తర్వాత సోమవారం చివరిరోజు నామినేషన్ల స్వీకరణ జరగ్గా ఏకంగా 570 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 795కు పెరిగింది. చివరిరోజు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 182 నామినేషన్లు రావడంతో ఈ స్థానానికి మొత్తం నామినేషన్ల సంఖ్య 245కు పెరిగింది. మంగళవారం నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్థులు సరైన ఫారం–ఏ, బీలతోపాటు ఫారం–26లోని అన్ని ఖాళీలను పూరిస్తేనే నామినేషన్లను ఆమోదిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థితోపాటు మరో ముగ్గురు వ్యక్తులనే అనుమతిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థి తనతోపాటు తనను ప్రతిపాదించిన వ్యక్తి, ఎన్నికల ఏజెంట్, మరోవ్యక్తిని వెంట తెచ్చుకోవచ్చన్నారు. అన్ని రకాల పత్రాలతో అభ్యర్థులు పరిశీలన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఈ నెల 28తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఫలితాలను మే 23న ప్రకటించనున్నారు. నిజామాబాద్‌లో పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలు కావడంతో అక్కడ ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థులకు అవకా శం కల్పించవచ్చని, పాత మోడల్ ఈవీఎంలకు గరిష్టంగా 6 బ్యాలెట్ యూనిట్లనే అనుసంధానించేందుకు అవకాశముందన్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్య 95కు మించితే పాత రకం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించలేమన్నారు. కొత్త రకం ఈవీఎంలకు 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించే వీలుం దని, దీంతో 383 మంది అభ్యర్థులు పోటీ చేసినా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశముంటుందన్నారు. అయితే ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో వినియోగించిన కొత్త మోడల్ ఈవీఎంలను లోక్‌సభ ఎన్నికల్లో వాడలేకపోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌లో పేపర్ బ్యాలెట్‌తో ఎన్ని కలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలు వద్దు... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని అధికార టీఆర్ఎస్కు లేఖ రాసినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, ప్రభుత్వ భవనాలకు వర్తించే ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని ఎన్నికల సంఘం కోరిందన్నారు. నిజామాబాద్ స్థానానికి నామినేషన్లు వేయడానికి వచ్చిన రైతులను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు పంపించారని వచ్చిన ఫిర్యాదును పరిశీలించామని, అక్కడ ఓ వీఐపీ (సిట్టింగ్ ఎంపీ కవిత) నామినేషన్ వేయడానికి రావడంతో ఈ ఘటన జరిగిందని రజత్ కుమార్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద రైతులు గూమికూడి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారని, అప్పుడే అక్కడికి వీఐపీ నామినేషన్ వేసేందుకు రావడంతో ఆమెకు మొదట అవకాశం కల్పించారని, రైతులను పక్కకు పంపించారని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏమీ లేదన్నారు. నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి ‘హిందువు’పదాన్ని వినియోగించారని వచ్చిన ఫిర్యాదును పరిశీలించామని, అందులో సైతం ఎలాంటి ఉల్లంఘన ఉన్నట్లు తేలలేదన్నారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందా రాదా అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమకు విదేశాల్లో ఉన్న ఆస్తులను సైతం ప్రకటించాల్సిందేనని, లేకుంటే తీవ్రమైన తప్పిదం చేసినట్లు అవుతుందన్నారు. -
తొలిపోరు.. హోరే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఆదివారంతో ముగిసింది. తుదిపోరులో నిలిచిన అభ్యర్థులు ఎవరనేది తేలడంతోపాటు వారికి అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. ఇక ప్రచారానికి పదును పెట్టేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. షాద్‌నగర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని కొత్తూరు, నందిగామ, కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, శంషాబాద్ మండలాల్లో ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 179 పంచాతీయతీలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడగా. ఇందులో 8 పంచాయతీలకు మొన్నటి వరకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంకొన్ని జీపీల్లో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరిరోజు నామినేషన్లను ఉసంహరించుకోగా.. మరో 12 జీపీల్లో ఒకరు చొప్పున అభ్యర్థులే మిగిలారు. ఇలా మొత్తం 20 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి మినహాయించి మిగిలిన 159 జీపీలకు ఎన్నిక జరగనుంది. ఈ పంచాయతీలకుగాను 468 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. అలాగే మొత్తం 1,580 వార్డులకుగాను 201 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవిపోనూ మిగిలిన 1376వార్డులకు ఎన్నిక అనివార్యంగా మారింది. మొత్తం 3,654 మంది గెలుపుకోసం పోటీపడుతున్నారు. కేశంపేటలో మూడు వార్డుల్లో ఎన్నికను బహిష్కరించడంతో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. భారీగానే బరిలోకి.. పోటీ పడుతున్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఆయా రాజకీయ పార్టీలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఆయా మండలాల్లో పదుల సంఖ్యలో మాత్రమే నామినేషన్లను చివరి రోజు ఉపసంహరించుకున్నారు. మిగిలిన వారు వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. 179 పంచాయతీలకు మొత్తం 982 నామినేషన్లు అందగా.. 514 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. నామినేషన్లల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలతోనే ముగిసినా.. సకాలంలో ఈ తంతును పూర్తిచేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకూ తుది బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరనేది వెల్లడించలేకపోయారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
నిజామాబాద్‌అర్బన్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. బోధన్ డివిజన్ పరిధిలో ఈ నెల 11న ప్రారంభమైన నామినేషన్లు మూడు రోజుల పాటు కొనసాగాయి. ఆరు మండలాల్లోని 142 గ్రామ పంచాయతీలు, 1,296 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజైన ఆదివారం నామినేషన్లు జోరుగా కొనసాగాయి. బోధన్ మండలంలో 107, కోటగిరిలో 93, రెంజల్లో 167, రుద్రూర్లో 28, వర్నిలో 81, ఎడపల్లి మండలంలో 81 నామినేషన్లు చివరి రోజు దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు బరిలో ఉన్న సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలను వెల్లడిస్తారు. ఈ నెల 25న ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు కొనసాగుతాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. -
ఏకగ్రీవాల జోరు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. జిల్లాలో తొలి విడతలో జరుగుతున్న పంచాయతీల్లో 36 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో ఒకరిద్దరు మినహా మిగిలిన అన్ని పంచాయతీల సర్పంచ్‌లు టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 177 పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 20 శాతం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఈ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు బుజ్జగింపులు, బేరసారాలు జోరుగా సాగాయి. కొన్ని ఏకగ్రీవ సర్పంచ్ స్థానాలు రూ.లక్షలు పలికినట్లు సమాచారం. తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో ముట్టజెబుతామని ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సర్పంచ్ స్థానాలకు వేలం పాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ లోపాయికారి ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండున్నర సంవత్సరాలు ఒకరు సర్పంచ్‌గా ఉంటే, ఉప సర్పంచ్ తర్వాతి రెండున్నర సంవత్సరాలు సర్పంచ్ పదవి చేపట్టాలనే ఒప్పందంతో ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. మరికొన్ని పంచాయతీల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేసిన అభ్యర్థులతో మాట్లాడి ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. మొత్తం మీద 36 గ్రామపంచాయతీల్లో ఒకటీ రెండు మినహా అన్ని జీపీల్లో టీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంది. తేలిన అభ్యర్థులు.. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగి యడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తే లింది. ఆదివారం మధ్యాహ్నం మూడు గం టలకు ఉపసంహరణకు గడువు ముగిసింది. రిటర్నింగ్ అధికారులు వెంటనే బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 177 స్థానాల్లో ఏకగ్రీవమైన 36 స్థానాలు మినహాయిస్తే 141 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇచ్చింది. ఇక గ్రామాల్లో ప్రచార హోరు.. బరిలో ఉన్న అభ్యర్థులెవరో తేలడంతో గ్రామాల్లో ఇక ప్రచారం జోరందుకోనుంది. వారం రోజుల పాటు అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. ఇంటింటికీ తిరిగి తమకు గెలిపించాలని ఓట్లు అభ్యర్థించనున్నారు. గ్రామాల్లో కుల సంఘాలు కీలకం కావడంతో ఈ సంఘాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. పార్టీ రహిత ఎన్నికల కావడంతో ఎన్నికల అధికారులు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు ప్రచారం నిర్వహించనున్నారు. -
ముగిసిన రెండో విడత నామినేషన్ల ఘట్టం
మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కావడంతో మూడు రోజుల పాటు కొనసాగింది. రెండోవిడత మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో 276 సర్పం చ్‌లకు, 2,376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని పది మండలాల్లోఉన్న 276 గ్రామ పంచాయతీలకు 2,298 మంది నామినేషన్లు వేయగా 2,376 వార్డు సభ్యులకు గాను 6,783 మంది నామినేషన్లు వేశారు. అత్యధికం - అత్యల్పం.. రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాల్లో అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో సర్పంచ్‌లకు 337 నామినేషన్లు వచ్చాయి. మిర్యాలగూడ మండలంలోని వార్డు సభ్యులకు అత్యధికంగా 1,142 నామినేషన్లు వచ్చాయి. కాగా అతి తక్కువగా వేములపల్లి మండలంలోని సర్పంచ్ స్థానాలకు 89 నామినేషన్లు రాగా, వార్డు సభ్యులకు అడవిదేవులపల్లి మండలంలో తక్కువగా 324 వచ్చాయి. 17న ఉపసంహరణ.. నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. కాగా ఈ నెల 14 వ తేదీన పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలు స్క్రూటీని చేయనున్నారు. 15వ తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. 16వ తేదీన అభ్యర్థులపై వచ్చిన అభ్యంతరాలను ఆర్డీఓ పరిశీలించి వెల్లడిస్తారు. 17న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుకు గుర్తుల కేటాయింపు ఉంటుంది. -
ఇక పోలింగ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామపంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఎన్నికలను సజావుగా జరిపేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామపంచాయతీల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ మేరకు తొలి దశలో జిల్లాలోని 10 మండలాలు 249 గ్రామపంచాయతీలు, 2,274 వార్డుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించిన అధికారులు స్క్రూటినీ అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశమిచ్చారు. దీంతో ఆదివారం సాయంత్రానికి తొలి దశ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచేదెందరో తేలనుంది. ఆ వెంటనే అభ్యర్థుల జాబితాతో పాటు గుర్తులను కూడా అధికారులు కేటాయించనున్నారు. ఆ వెంటనే అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు గుర్తులు రాగానే దీనిని ముమ్మరం చేయనున్నారు. అధికారిక ఏర్పాట్లు మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఓ పక్క నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ చేపట్టిన అధికారులు ఉపసంహరణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. ఇదంతా జరుగుతుండగానే పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందిని ఎంపిక చేయడంతోపాటు వారి విధులను కూడా విభజించారు. అలాగే, శిక్షణ కూడా పూర్తిచేశారు. కాగా, మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈనెల 21న జరగనుంది. కాగా, ఈ దశలో 249 పంచాయతీలకు కలిపి సర్పంచ్ స్థానాలకు 1,454, వార్డు సభ్యుల స్థానాలకు 5,103 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ఆదివారం సాయంత్రం వరకు ఉపసంహరణకు గడువు ఉన్నందున అప్పటి వరకు బరిలో మిగిలిన వారి సంఖ్య తేలనుంది. అధికారుల నియామకం మొదటి దశ ఎన్నికలు జిల్లాలోని పది మండలాల్లో కలిపి 249 గ్రామపంచాయతీల్లో జరగనున్నాయి. ఇందుకోసం 5,518 మంది అధికారులను నియమించారు. వీరే కాకుండా జోనల్ అధికారులు 58 మంది అధికారులు, స్టేజ్–1 అధికారులు 66 మంది, స్టేజ్–1 సహాయకులు 66, స్టేజ్–2 అధికారులు 282, పీఓలు 2,274 మంది నియామకం జరిగింది. ఇంకా అదనంగా మరో 228 శాతం మందిని ఎంపిక చేసి రిజర్వ్‌లో ఉంచారు. అలాగే ఏపీఓలు 2,742 కాగా అదనంగా 274 మందిని రిజర్వ్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మండలాల్లోని పంచాయతీలను మొత్తం 60 క్లస్టర్లుగా విభజించారు. మొదటి విడుత ఎన్నికల షెడ్యుల్‌లో ఆదివారం మద్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కానుంది. ఆ తరువాత ఎన్నికలో బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. అలాగే, గుర్తులను కేటాయిస్తారు. విత్‌డ్రా కోసం విశ్వప్రయత్నాలు పోటీలో అసమ్మతి లేకుండా చేసుకోవడానికి అభ్యర్థులు తమ ప్రత్యర్థులతో నామినేషన్లను విత్‌డ్రా చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విత్‌డ్రాలకు ఆదివారం చివరి రోజు కావడంతో అసమ్మతి నేతలను బుజ్జగించేం దుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తమ మాట వినని వారిపై మండల, జిల్లా స్థాయి నేతల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా ఉంది. ప్రతీ గ్రామపంచాయతీ నుంచి ముగ్గురు.. మరికొన్ని గ్రామాల్లోనైతే టీఆర్ఎస్ మద్దతుదారులే నలుగురు కూడా నామినేషన్లను వేశారు. దీంతో వారిని విత్‌డ్రా చేయించేందుకు ప్రధాన అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ముగిసిన తొలి విడత నామినేషన్ల ఘట్టం
కొండమల్లేపల్లి : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెర పడింది. పలు గ్రామ పంచాయతీల్లో బుధవారం రాత్రి 10.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. సాయంత్రం 5 గంటల వరకు గ్రామ పంచాయతీ ప్రాంగణంలో క్యూలో ఉన్న వారికి స్లిప్పులు ఇచ్చి నామినేషన్లు తీసుకున్నారు. దేవరకొండ డివిజన్లోని దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి, డిండి, పీఏపల్లి, గుర్రంపోడు, మర్రిగూడ, చందంపేట, నేరేడుగొమ్ము, నాంపల్లి మండలాల పరిధిలోని 304 గ్రామపంచాయతీల 2,572 వార్డు స్థానాలకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా డివిజన్ పరిధిలోని 300 గ్రామపంచాయతీలకు గాను 2,229 మంది, 2,572 వార్డు స్థానాలకు 7,215మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆతర్వాత అర్హుల జాబితా రూపొందిస్తారు. ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు పెట్టారు. ఆ తర్వాత బరిలో ఉండే వారి జాబితా ప్రకటిస్తారు. పలు గ్రామాల్లో ఒకే నామినేషన్ దాఖలు జిల్లాలో కడపటి వార్తలందేసరికి 7 గ్రామ పం చాయతీల్లో సర్పంచ్‌లకు ఒకే నామినేషన్ దాఖ లైంది. దేవరకొండ మండలం రత్యాతండా (ఎమ్మెల్యే రవీంద్రకుమార్ స్వగ్రామం), కొండమల్లేపల్లి మండలం చెన్నమనేనిపల్లి, డిండి మండలం కాల్యాతండా, పీఏపల్లి మండలం గణపల్లి, పుట్టంగండి, నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామాల్లో ఒకే నామినేషన్ దాఖలయ్యాయి. -
ఆ మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ ఏయే పార్టీల మధ్య ఉంటుందనే స్పష్టత వచ్చింది. జిల్లాలో తొమ్మిది స్థానాల్లో మూడు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఆరు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు. జిల్లాలో తొమ్మిది స్థానాలకు మొత్తం 119 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద లేకుండా పోయింది. దీంతో ఆయా స్థానాల్లో నెలకొనే పోటీపై స్పష్టత వచ్చినట్లయిం ది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బీన్‌హందాన్‌లు నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. అనూహ్యంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణగుప్త పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గంలో గట్టి పోటీనిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, గడ్డం కేశ్‌పల్లి ఆనందర్‌రెడ్డిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తుండటంతో రూరల్ రణరంగాన్ని తలపిస్తోంది. బోధన్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు షకీల్ ఆమేర్, పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఆర్మూర్‌లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆకుల లలిత మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ అభ్యర్థులు పొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డిలు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. బాల్కొండలో ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌లు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్యాల సునీల్‌రెడ్డి తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు బలంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పోరు రసవత్తరంగా తయారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీ, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు తమ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎల్లారెడ్డిలో మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి బరిలో ఉండటంతో ఇక్కడ పోరు జోరందుకుంది. బాన్సువాడలో ద్విముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుల మధ్య పోరు సాగుతోంది. జుక్కల్‌లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే, కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాంలు సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అరుణతార బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పలు స్థానాల్లో బీఎల్ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహిస్తుండగా, ఆమ్ఆద్మీ, పిరమిడ్‌పార్టీ ఆఫ్ ఇండియా, సమాజ్‌వాది పార్టీ, శివసేన, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ వంటి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
సమరానికి సై
కీలక ఘట్టం ముగిసింది.. ఇక పోరు తుది ప్రచారానికి తెరలేచింది.. బరిలో నిలిచిన అభ్యర్థులు నిద్ర లేచింది మొదలు కాలికి, నోటికి, చేతికి పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.. గడప గడపకూ తిరగాలి.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి.. ఓటున్న ప్రతి ఒక్కరినీ పలకరించాలి.. అయినోళ్లయినా.. కానోళ్లయినా.. ఆఖరికి ప్రత్యర్థి అయినా.. అవసరం మరి.. ఓటు విలువంటే ఇప్పుడే కదా తెలిసేది.. గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి వివరించాలి.. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలి..ఓటరు నాడి పట్టుకోవాలి.. ఇలా శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఉన్న సమయాన్నిసాధ్యమైనంతవరకు పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులను వెంటేసుకుని ఓటర్లను కలిసే పనిలో పడ్డారు. బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం ఖరారు కావడంతో ప్రచారాన్ని మరింత ఉరకలెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో గురువారం 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి.. రాకపోవడంతో బరిలో నిలిచిన తిరుగుబాటు, స్వతంత్ర అభ్యర్థులను పార్టీల ముఖ్య నేత లు, అభ్యర్థులు బుజ్జగించడంతో ప్రధాన పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా అనేక మంది ఉపసంహరించుకున్నారు. ఖమ్మం జిల్లాలో నామినేషన్ల పరిశీలన అనంతరం 76 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 14 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 62 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నామినేషన్ల పరిశీలన తర్వాత 93 మంది అభ్యర్థులు ఉండగా.. వారిలో 22 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో భద్రాద్రి జిల్లా నుంచి 71మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుజ్జగింపులతో వెనక్కు.. పార్టీ టికెట్ రాకపోవడంతో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు బుజ్జగింపులతో వెనక్కు తగ్గారు. వీరిలో ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో రెబెల్‌గా నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థులున్నారు. చీమల వెంకటేశ్వర్లు, దళ్సింగ్నాయక్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరిప్రియనాయక్, ఇతర ముఖ్య నేతలు నామినేషన్ ఉపసంహరించుకోవాలని బుజ్జగించడం.. భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని.. పార్టీ, ప్రభుత్వపరంగా అనేక అవకాశాలు ఉంటాయని వారికి నచ్చజెప్పారు. దీంతో ఇద్దరు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇదే ప్రయత్నం వైరాలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషం వరకు చేసినా ఫలించలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించిన రాములునాయక్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆయనకు కొందరు కాంగ్రెస్ శ్రేణులతోపాటు టీఆర్ఎస్లోని అసమ్మతి వర్గం వెన్నుదన్నుగా నిలిచింది. దీంతో కాంగ్రెస్ నేతలు, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఐ వర్గాలు ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి కొందరు కాంగ్రెస్ నేతలను దూతలుగా పంపించి.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించలేదు. దీంతో నామినేషన్ ఉపసంహరణ గడువు వరకు వివిధ రకాల ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ నేతలు రాములునాయక్ వినకపోవడంతో వెనుదిరిగారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన సున్నం నాగమణి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆమెను సంప్రదించి.. ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా నామినేషన్ ఉపసంహరించుకోవాలని అభ్యర్థించడంతో ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకుని మెచ్చా విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. అలాగే అశ్వారావుపేటలో తెలంగాణ జనసమితి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మక్కా ప్రసాద్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ తిరుగు బాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఫజల్ అహ్మద్‌ను నామినేషన్ ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోర డం.. కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనకు నచ్చజెప్పడంతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడం తో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉంటున్నారనే అంశం స్పష్టం కావడంతో ఆయా రాజకీయ పక్షా లు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య చేత నామినేషన్ ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బరిలో నుంచి తప్పుకునేది లేదంటూ అబ్బయ్య ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకులతో మాట్లాడించారు. అయినా అబ్బయ్య వెనక్కు తగ్గక.. చివరికి బరిలో నిలిచారు. -
బరిలో..‘వీరు’లు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఆరు నియోజకవర్గాలు .. వంద మంది అభ్యర్ధులు. నల్లగొండ జిల్లా ఎన్నికల బరిలో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్నవారు, స్వతంత్రులు కలిపి అభ్యర్ధుల సంఖ్య సెంచరీ దగ్గర ఆగిపోయింది. ప్రధా న పార్టీలను మినహాయిస్తే వీరిలో ఇండిపెండెం ట్లు ఏకంగా ... మంది పోటీలో ఉన్నారు. గురువారం ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఈ లెక్క తేలింది. అత్యధికంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 29 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, అతి తక్కువగా దేవరకొండనుంచి 10 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టికెట్లు రాక అలక బూని రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరణ రోజు వెనక్కి తగ్గారు. మిర్యాలగూడలో నాటకీయ పరిణామాలు మిర్యాలగూడ నుంచి సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్ ఆశించారు. చివరి నిమిషం దాకా ఢిల్లీలో ఉండి ప్రయత్నాలు చేసినా, టికెట్ దక్కలేదు. ఇక, టీఆర్ఎస్లో టికెట్ దక్కక కాంగ్రెస్ గూటికి చేరిన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. రఘువీర్‌కు టికెట్ ఇవ్వని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని అలుగుబెల్లి కోరారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయన చివరకు రెబల్‌గా బరిలోఉంటానని నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే , బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఆయన తన నామినేషన్‌ను ఉప సంహరించుకోక తప్పలేదు. ఒకవేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్)కు ఈ స్థానాన్ని కేటాయిస్తే మాత్రం బరిలో కొనసాగుతానని ముందే ప్రకటించారు. చివరకు ఈ సీటును కాంగ్రెస్‌కే ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. ముందు నుంచీ ఈ స్థానం తమకు కేటాయించాలని పట్టుబట్టిన టీజేఎస్ తమ అభ్యర్థిగా విద్యాధర్ రెడ్డిని ప్రకటించి బీఫారమ్ కూడా ఇచ్చింది. దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కానీ, ఉప సంహరణ రోజు టీజేఎస్ అభ్యర్థి సైతం పక్కకు తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్‌కు రెబల్స్ బెడదతోపాటు, టీజేఎస్ నుంచి స్నేహపూర్వక పోటీ కూడా తప్పిపోవడంతో పార్టీ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు ‘ఇంటి’ పార్టీ మద్దతు మహాకూటమిలో చేరిన రోజునుంచి తమకు నకిరేకల్ స్థానం కావాలని డిమాండ్ చేసిన తెలంగాణ ఇంటి పార్టీ చివరకు ఆ స్థానం నుంచి పక్కకు తప్పుకుంది. ఆ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన చెరుకు లక్ష్మి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా పనిచేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రకటించారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఇంటి పార్టీ అభ్యర్థి పోటీలోనే ఉన్నారు. సీట్ల కేటాయింపు సమయంలో ఒక దశలో నకిరేకల్‌ను ఇంటి పార్టీకి కేటాయించినట్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ప్రకటన కూడా చేశారు. కానీ, కాంగ్రెస్ జిల్లా నాయకత్వంనుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో చివరకు చిరుమర్తినే టికెట్ వరించింది. రాష్ట్రంలో రెండు స్థానాలు కోరిన ఇంటి పార్టీ జిల్లాలో కనీసం ఒక్క స్థానమైనా కేటాయించాలని ఒత్తిడి పెంచినా ఉపయోగం లేకపోవడంతో నకిరేకల్‌లో పోటీకి దిగింది. కానీ, చివరకు నామినేషన్‌ను ఉపసంహరించుకుని చిరుమర్తికి మద్దతు ప్రకటించింది. పోటీలో 46 మంది స్వతంత్రులు జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో నూరు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో స్వతంత్రులే 46 మంది ఉన్నారు. మిగిలిన 54 మంది ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అత్యధికంగా మిర్యాలగూడ బరిలోనే 18 మంది ఇండిపెండెంట్లుగా ఉన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆరుగురు, నకిరేకల్‌లో ఇద్దరు, మునుగోడులో ఆరుగురు, దేవరకొండలో ముగ్గురు, నల్లగొండ నియోజకవర్గంలో పదకొండు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. -
ముగిసిన నామినేషన్ల బరిలో 33 మంది
ఆదిలాబాద్‌అర్బన్: అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో మరో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసింది. పోరు బరిలో నిలిచేదెవరో తేలింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్,ఖానాపూర్ నియోజకవర్గాల్లో 33 మంది బరిలో ఉన్నారు. బోథ్‌లో కాంగ్రెస్ రెబల్ అనిల్‌జాదవ్ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. ఖానాపూర్‌లో మహాకూటమి అభ్యర్థితోపాటు టీజేఎస్ అభ్యర్థి కూడా బరిలో నిలిచారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ముగ్గురు మాత్రమే ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా తయారీకి జిల్లా యంత్రాంగం రాత్రి వరకు కసరత్తు చేసి పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో 33 మంది పోటీ పడుతున్నారు. ఇందులో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 26 మంది ఉండగా, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. కాగా, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి 14 మంది, బోథ్ సానానికి ఏడుగురు బరిలో నిలిచారు. ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 15 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరి నామినేషన్లు తిరస్కరించగా.. 13 మంది నామినేషన్లు ఆమోదించారు. గురువారం ఒక్కరు మాత్రమే ఉప సంహరించుకున్నారు. దీంతో 12 మంది బరిలో ఉన్నారు. ముగిసిన ఉపసంహరణ ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించారు. వచ్చిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు. ఈ నెల 22 వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో గురువారం ఆయా రిటర్నింగ్ అధికారులు వారి వారి కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన గండ్రత్ ఆశన్న, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మేకల మల్లన్న విత్‌డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. కాగా, బోథ్‌లో ఏ ఒక్క అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోగా, నామినేషన్ల పరిశీలన అనంతరం నిలిచిన అభ్యర్థులే ఇప్పుడు అసెంబ్లీ బరిలో నిలిచారు. ఖానాపూర్‌లో ఒకరు ఉపసంహరించుకున్నారు. కాగా, ఎన్నికల బరిలో నిలచే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పోటీలో ఉండే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను వారి సమక్షంలోనే కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఫలించని బుజ్జగింపు.. కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన జాదవ్ అనిల్ కుమార్‌ను అధిష్టానం బుజ్జగించినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం వరకు నామినేషన్ ఉపసంహరించుకోలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు పోటీ చేసిన ఆయనకు నియోజకవర్గంలో పట్టు ఉండడంతో ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రచార సందడి ఇక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినందున శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచార పర్వానికి తెరలేవనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతుండగా, ఇక అసెంబ్లీ పోటీల్లో ఉన్న అభ్యర్థుల ప్రచారాలు కూడా జోరందుకోనున్నాయి. ఎన్నికల నియమావళికి లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు అభ్యర్థులకు సూచిస్తున్నారు. మొన్నటి వరకు స్తుబ్దుగా ఉన్న గ్రామాల్లో ఇక ఎన్నికల ప్రచార సందడి కన్పించనుంది. ప్రధాన పార్టీలు రోజు వారీ కార్యక్రమాలు, సభల షెడ్యూల్ రూపొందిస్తున్నాయి. -
బరిలో 67మంది
నిజామాబాద్‌అర్బన్: అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో మొత్తం 67 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగియగా ఆయా నియోజక వర్గాల్లో రిటర్నింగ్ అధికారులు బరి లో నిలిచిన అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఈనెల 12 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 21, 22 తేదీల్లో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 94 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయ గా 16 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 78 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందగా, అనంతరం 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా నియోజక వర్గాల్లో టికెట్లు ఆశించిన భంగపడిన వారు పోటీనుంచి తప్పుకున్నారు. బాన్సువాడలో కాంగ్రెస్ రెబెల్ మల్యాద్రి రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. రెబల్‌గా బరిలో నిలిచిన అభ్యర్థులను ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు బుజ్జగించారు. కొందరు రెబల్స్ పార్టీ నాయకుల సూచనల మేరకు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ టికెటు ఆశించిన భంగపడిన రత్నాకర్ ఆల్ఇండియా ఫార్వాడ్బ్లాక్ పార్టీ నుంచి పోటీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ నుంచి టికెటు ఆశించి భంగపడిన ధన్పాల్ సూర్యనారాయణ శివసేన పార్టీ నుంచి నామినేషన్ వేశారు. అనంతరం బీజేపీ రాష్ట నాయకుడు కిషన్‌రెడ్డి తదితరులు నిజామాబాద్ వచ్చి ధన్‌పాల్‌ను కలిసి పోటీనుంచి తప్పించారు. మిగిలిన నియోజక వర్గాల్లో పోటీ కొనసాగనుంది. పోలింగ్ రోజు సెలవు ప్రకటించాలి నిజామాబాద్ అర్బన్: వచ్చే నెల డిసెంబర్ 7న సాధారణ ఎన్నికలకు పోలింగ్‌జరుగనుందన అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాలు కార్మిక విభాగం సముదాయాలు సెలవు ప్రకటించాలని ఉప కార్మిక కమిషనర్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన తెలిపారు. కార్మికులందరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలన్నారు. పోలింగ్ రోజున తప్పనిసరిగా దుకాణాలు, వ్యాపారాలు మూసిఉంచాలన్నారు. -
ఇక సమరమే..
సాక్షి, భూపాలపల్లి: ముందస్తు ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండబోతున్నారో లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో ఇద్దరు, ములుగులో ముగ్గురు మొత్తం ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో భూపాలపల్లి ఎన్నికల బరిలో 14 మంది, ములుగులో 12 మంది పోటీలో మిగిలారు. ములుగు నియోజకవర్గంతో పోలిస్తే ఈసారి భూపాలపల్లిలో హోరాహోరీ తప్పకపోచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు డిసెంబర్ 7వ తేదీన తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భూపాలపల్లిలో హోరాహోరీ.. భూపాలపల్లిలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉండనుంది. ఈ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు బలంగా ఉన్నారు. 2009, 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. టీఆర్ఎస్ నుంచి సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డితోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గండ్ర సత్యనారాయణరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ రద్దు అనంతరం నుంచే ఈ నలుగురు నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సారి 14 మంది అభ్యర్థులు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి 14 మంది పోటీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో 12 మంది ఉండగా.. 2009 ఎన్నికల్లో 18 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగింది. ప్రస్తుతం చతుర్ముఖ పోరు నెలకొంది. అలాగే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. పోటీదారులు ఎక్కువైతే మెజారిటీతోపాటు గెలుపు అవకాశాలు సైతం దెబ్బతింటాయి. అందుకే భూపాలపల్లి నియోజకవర్గంలో హోరాహోరీ తప్పకపోవచ్చు. ఎవరు గెలిచిన పెద్దగా మెజారిటీ రాదని ప్రజలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా నోటాతో కలిపి మిగిలిన వారు 9,070 ఓట్లు సాధించారు. ఈసారి ఇంత మొత్తంలో ఓట్లు స్వతంత్ర సభ్యులకు బదిలీ అయితే గెలుపొందే వారి మెజారిటీపై తప్పకుండా ప్రభావం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ములుగులో పరిస్థితి.. ములుగులో ఈ సారి 12 మంది ఎన్నికల బరిలో నిలిచారు. భూపాలపల్లితో పోలిస్తే ఈ నియోజకవర్గంలో పోటీ తక్కువగానే ఉంది. ప్రధాన పార్టీల నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే కీలక పోటీ ఉండనుంది. 2009 ఎన్నికల్లో ములుగు నుంచి 9 మంది, 2014లో 11 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా ఇండిపెండెంట్లకు 13,140 ఓట్లు పోలయ్యాయి. 2009, 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీగా టీడీపీ ఉండేది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సీతక్క కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీకీ ప్రాతిని«థ్యం లేకుండా పోయింది. నియోజకవర్గంలో ప్రస్తుతం చందూలాల్, సీతక్కల మధ్యే పోటీ ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులకు పడే ఓట్లు మెజారీటిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భూపాలపల్లిలో ఇద్దరి విత్‌డ్రా భూపాలపల్లి: భూపాలపల్లి అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు. ఈ స్థానానికి మొత్తం 17 నామినేషన్లు రాగా స్క్రూటిని సమయంలో అర్షం అశోక్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించగా 16 మంది మిగిలారు. స్వతంత్ర అభ్యర్థులు కేతిరి క్రాంతికుమార్, సిరికొండ ప్రశాంత్ తమ నామినేషన్లను ఉపసహరించుకోవడంతో 14 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించి వారికి గుర్తులను కేటాయించారు. ములుగులో ముగ్గురు ఉపసంహరణ.. ములుగు: ములుగు శాసనసభ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ అనిమేష్‌దాస్ తెలిపారు. ఈ స్థానానికి 15 మంది నామినేషన్లు వేయగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. మిగిలిన వారికి అధికారులు ఎన్నికల గుర్తులను కేటాయించారు. కార్యక్రమంలో ములుగు ఆర్డీఓ రమాదేవి, తహసీల్ధార్ గనియా ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
బరిలో 41 మంది
సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 72 మంది నామినేషన్లు వేయగా అందులో 11 మంది నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. 61 మంది అభ్యర్థుల్లో 20 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 41 మంది బరిలో దిగుతున్నారు. ఇండిపెండెంట్లకు గుర్తులను కేటాయించనున్నారు. జోరుగా బేరసారాలు.. నామినేషన్ల విత్‌డ్రాల కోసం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా బేరసారాలు చేశారు. ఇండిపెండెంట్ల బరిలో ఉంటే ఓట్లు కోల్పోయే అవకాశం ఉంటుందని ఉపసంహరించుకునే విధంగా కృషి చేశారు. ఇప్పటివరకు అయిన ఖర్చు తామూ ఇస్తామంటూ చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లను మద్యవర్తులు రంగంలోకి దిగి మాట్లాడారు. కారులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరకి తీసుకవెళ్లి దగ్గర ఉండి ఉపసంహరించుకునే విధంగా చేశారు. ఇంక కొంత మంది పార్టీల్లో పదవులు ఇచ్చి ఆ పార్టీ అధికారంలో రాగానే నామినేట్ పదవిని సైతం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఇప్పిస్తామని హామీలు ఇచ్చారు. జాగ్రత్త పడిన అభ్యర్థులు.. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇతరుల నామినేషన్ల ఉపసంహరణకు వ్యయ ప్రయాసాలు పడ్డారు. ఒక్కో బ్యాలెట్ పత్రంలో 15 మందికే అవకాశం ఉంటుంది. దీంతో 15 మంది కంటే ఎక్కువ మంది బరిలో ఉంటే రెండు బ్యాలెట్లను పెట్టాల్సి వస్తుంది. దీంతో అప్రమత్తమైన అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. రెండు బ్యాలెట్లు అయితే పేరు ఎక్కడ ఉంటుందోనని అప్రమత్తమయ్యారు. పరకాల నియోజకవర్గంలో.. పరకాల నియోజకవర్గంలో 23 మంది నామినేషన్లు వేశారు. ఇద్దరివి తిరస్కరించబడ్డాయి. మొత్తం అభ్యర్థులు 21 ఉండగా అందులో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.చల్లా ధర్మారెడ్డి(టీఆర్ఎస్), కొండా సురేఖ(కాంగ్రెస్), డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి(బీజేపీ), పున్నం భాగ్యశ్రీ(ఇండియన్ న్యూ కాంగ్రెస్), దారం యువరాజు(సమాజ్‌వాది పార్టీ), ఈసంపెల్లి వేణు(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), ఇమ్మద్రి రవి(రిపబ్లికన్ పార్టీ), గోనె కుమారస్వామి(బీఎల్ఎఫ్), గుండా రాము(శివసేన), సింగారపు రాజు(బహుజన సమాజ్ పార్టీ), ఇండిపెండెంట్లు ఆడెపు రమేశ్, అబ్బిరెడ్డి బుచ్చిరెడ్డి, సాంబయ్య, కుమారస్వామి, ఉప్పుల శ్రీనివాస్‌లు ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గం.. నర్సంపేట నియోజకవర్గంలో 16 మంది నామినేషన్లు వేయగా ముగ్గురు అభ్యర్థుల దరఖాస్తుల తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 13 మంది అభ్యర్థులు ఉండగా అందులో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం బరిలో 11 మంది ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి(టీఆర్ఎస్), దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్), ఎడ్ల అశోక్‌రెడ్డి (బీజేపీ), మద్దికాయల అశోక్(బీఎల్ఎఫ్), దయాకర్(బీ ఎస్పీ), కురుమల్ల రామ్మూర్తి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), దేవేందర్(సమాజ్‌వాది పార్టీ), ప్రేమ్‌లాల్(జై మహా భారత్ పార్టీ), పూర్ణచందర్(శివసేన), ఇండిపెండెంట్లు చిన్ని క్రిష్ణ, నాగేశ్వర్రావు, కిరణ్‌కుమార్, విష్ణుకుమార్, సుధీర్‌లు ఉన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో.. వర్ధన్నపేట నియోజకవర్గంలో 33 మంది నామినేషన్లు వేశారు. ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 27 మంది అభ్యర్థులుండగా అందులో 12 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇంకా 15 మంది బరిలో ఉన్నారు. అరూరి రమేశ్(టీఆర్ఎస్), కొత్త సారంగరావు(బీజేపీ), పగిడిపాటి దేవయ్య(టీజేఎస్), నరసింహస్వామి(బీఎల్ఎఫ్), గంధం శివ(బీఎస్పీ), నద్దునూరి సంపత్(ఎస్పీ), ఇండిపెండెంట్లు సుదీమల్ల వెంకటస్వామి, జెట్టి స్వామి, లెనిన్, నర్సయ్య, జనార్దన్, కమలాకర్, నగేష్, రమేశ్, శోభన్‌బాబులు బరిలో ఉన్నారు. -
తొలి అంకం ముగిసింది..
సూపర్‌బజార్(కొత్తగూడెం): అసెంబ్లీ ఎన్నికల్లోని ముఖ్యమైన ఘట్టాలలో తొలి అంకం నామినేషన్ల దాఖలు సోమవారంతో ముగిసింది. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలలో గడువు ముగిసే సమయానికి 146 నామినేషన్లు దాఖలయ్యాయి. గత సోమవారం(12వ తేదీన) ఈ ప్రక్రియ ప్రారంభమైంది. నాటి నుంచి ఈనెల 22వ తేదీ వరకు ఉంది. సోమవారం మంచిరోజు కావడం.. ముహూర్త బలం ఉందనే కారణంతో అభ్యర్థులు తమ నామినేషన్లను ముహూర్త సమయానికి దాఖలు చేశారు. టీఆర్ఎస్ తరఫున పాలేరు నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యాహ్నం 1.40 గంటలకు ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.అంతకుముందు ఆయన తరఫున పార్టీ నేతలు మూడు సెట్లు నామినేషన్ దాఖలు చేయగా.. నాలుగో సెట్‌ను ముహూర్త సమయానికి అందజేసి.. రిటర్నింగ్ అధికారి ముందు ప్రతిజ్ఞ తీసుకున్నారు. అలాగే ఖమ్మం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్ మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మహాకూటమి తరఫున ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సరిగ్గా 2.14 గంటలకు నామినేషన్ వేశారు. ఇక పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థి బత్తుల హైమావతి, ఖమ్మం నియోజకవర్గం బీఎల్పీ అభ్యర్థిగా పాల్వంచ రామారావు నామినేషన్ దాఖలు చేయగా.. డమ్మీ అభ్యర్థిగా సీపీఎం తరఫున యర్రా శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు. వైరా నుంచి మహాకూటమి అభ్యర్థి సీపీఐకి చెందిన గుగులోతు విజయబాయి, మహాకూటమి తిరుగుబాటు అభ్యర్థిగా బాణోతు రాములునాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే భద్రాచలం మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పొదెం వీరయ్య నామినేషన్ వేయగా.. పినపాక శివసేన అభ్యర్థిగా పాయం పోతయ్య, భారతీయ బహుజన క్రాంతిదళ్ పార్టీ అభ్యర్థిగా గుగులోతు విజయ, స్వతంత్ర అభ్యర్థులుగా కొమరం రాంగోపాల్, చవలం అరుణ్, సీపీఎం డమ్మీ అభ్యర్థిగా కుంజా కృష్ణకుమారి, బీఎస్పీ అభ్యర్థిగా కేతావత్ స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. అలాగే గోండ్వాన గణతంత్ర పార్టీ అభ్యర్థిగా తుమ్మా నాగరాజు నామినేషన్ వేశారు. ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించిన వారిలో అనేక మంది ఆశావహులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా బాణోతు హరిప్రియ నామినేషన్ దాఖలు చేయగా.. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన దళ్‌సింగ్, చీమల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య, బాణోతు కిషన్, మంగీలాల్‌నాయక్ తదితరులు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు నామినేషన్ దాఖలు చేస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం జరిగినా.. కాంగ్రెస్ అధిష్టానం వారికి నచ్చజెప్పడంతో వారు నామినేషన్ దాఖలు చేయలేదు.కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నామా నాగేశ్వరరావుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ తదితరులు హాజరయ్యారు. అశ్వారావుపేటలో మొత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఒక్కరోజే 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పల శారద సోమవారం మరోసెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పక్షాలు భారీ ఎత్తున ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించాయి.