Normal delivery
-
ముట్టుకున్నా నొప్పి?!
నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.విశాల, నాచారంమీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్‌ని కలవాలి. ఇంటర్నల్‌గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్మెంట్ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయింట్మెంట్ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్‌కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్‌తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్ఫ్యూమ్లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?– సృజన, శంకరపల్లిఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్‌లలో ఐరన్శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్‌తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్మెంట్ చేస్తారు. -
రికవరీ ఎలా ఉంటుంది?
వారం కిందట నాకు నార్మల్ డెలివరీ అయింది. ఎన్ని రోజుల్లో మళ్లీ నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తాను? ఈలోపు ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే.. ఎలాంటి సమస్యకు హాస్పిటల్‌కి వెళ్లాలి? – యోగిత, దేవరకొండడెలివరీ అయిన తరువాత తల్లికి, బిడ్డకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు వారాల తరువాత ఇద్దరినీ చెకప్‌కి తీసుకువెళ్ళాలి. కొన్ని హై రిస్క్ కేసుల్లో ఐదవ రోజే చెకప్‌కి వెళ్ళాలి. బేబీకి సరిగ్గా పాలు ఇవ్వడం, నిద్ర పుచ్చటం, టైమ్‌కి మల్టీ విటమిన్ డ్రాప్స్ వేయడం లాంటివి చేయాలి. జాండీస్ చెకింగ్ గురించి కూడా డిశ్చార్జ్ టైమ్‌లో చెప్తారు. బేబీ ఎక్కువగా ఏడుస్తున్నా, యూరిన్, మోషన్ పాస్ చెయ్యకపోయినా, బరువు తగ్గిపోతున్నా, చర్మం పసుపు రంగులోకి మారినా వెంటనే డాక్టర్ని కలవాలి. మీరు సరైన పోషకాహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.మొదటి వారంలో మీకు ఫీవర్, బాడీ పెయిన్స్ ఉన్నాయా అని చూస్తారు. బిడ్డకి పాలు పట్టించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేస్తారు. యూటరస్ పెయిన్ చాలా కామన్‌గా ఉంటుంది. అది యూటరస్ నార్మల్ సైజు అవుతున్నప్పుడు వచ్చే పెయిన్ మాత్రమే! నార్మల్‌గా బ్లీడింగ్ 12 వారాల వరకు ఉంటుంది. ఒకవేళ మీకు హై టెంపరేచర్, తట్టుకోలేని పొట్టనొప్పి, బ్రెస్ట్ పెయిన్, హెవీ బ్లీడింగ్, క్లాట్స్, వెజైనా పెయిన్, ఫౌల్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటే అవి ప్రమాదం. వెంటనే డాక్టర్ని కలవాలి. తల తిరుగుతున్నట్లు, స్పృహ కోల్పోతున్నట్లు అనిపించినా, కాళ్లలో రక్తం గడ్డకట్టినా ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ అంటే బ్రెస్ట్‌లో నొప్పి పుట్టించే గడ్డలు వచ్చినా డాక్టర్ని కలవాలి. కొంత యాంగై్జటీ, భయం అందరికీ ఉంటాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా మాట్లాడవచ్చు.బిడ్డకు పాలు ఇచ్చే సందేహాల మీద ఇంటి నుంచే సలహాలు తీసుకోవచ్చు. మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యమైనది. హెల్దీ ఫుడ్ తీసుకోవడం, రోజూ కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకొని మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు వెజైనా వద్ద కుట్లు వేసుంటే రెండు వారాల్లో మానిపోతాయి. కొన్నిసార్లు పెయిన్‌కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడాల్సివస్తుంది. డెలివరీ అయిన వెంటనే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు ప్రారంభించాలి. దీనికి సంబంధించి డిశ్చార్జ్‌కి ముందే డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. మలబద్ధకం చాలామందికి ఉంటుంది. మైల్డ్ లాక్సాటివ్స్ వాడాలి. ఒకటి రెండు వారాల్లో ఎక్సర్సైజులు, డైట్‌తో నార్మల్ అవుతుంది. ప్రమాదకరమైన మార్పులు లేనప్పుడు రెండు వారాల తరువాత డాక్టర్ని కలవాలి. ప్రతి నెలా బేబీకి చెకప్స్ ఉంటాయి. -
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
Janhavi Nilekani: నార్మల్ డెలివరీలు ‘నార్మల్’ కావాలి
గర్భవతుల విషయంలో సాధారణ ప్రసవం అనే మాట ఈ రోజుల్లో ఆశ్చర్యంగా మారింది. దేశమంతటా సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తన నివేదికల్లో చూపింది. అయితే, ప్రభుత్వ– ప్రైవేట్ ఆసుపత్రులలో నార్మల్, సిజేరియన్ ప్రసవాల సంఖ్యలో తేడా మాత్రం ఉంది. ఈ విషయాన్ని తన సొంత అనుభవంతో గమనించిన ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ జాన్హవి నిలేకని మెటర్నల్ హెల్త్‌కేర్ వైపు దృష్టి సారించింది. బెంగళూరులో మురికివాడల్లోని నగర గర్భిణుల్లో సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆస్ట్రికా మిడ్వైఫరీ పేరుతో ప్రసవాల సెంటర్‌నూ ప్రారంభించింది. సాధారణ ప్రసవం ఆవశ్యకతవైపు వేసిన ఆమె అడుగుల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘చదువుకుంటున్నప్పుడే స్వదేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండేవి. అమ్మ మరాఠీ, నాన్న కోంకణి. పుణేలో పుట్టి, బెంగుళూరులో పెరిగాను. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లాను. నా భర్త యేల్ జార్ఖండ్‌కు చెందినవాడు. ఆ విధంగా నేను ఒకే ఒక ప్రాంతానికి చెందినదానిని అని చెప్పలేను. 2012లో పెళ్లయ్యింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కర్ణాటక లో రీసెర్చ్ చేస్తున్నాను. ఆ సమయంలో నార్మల్ డెలివరీ కోసం నగరాల్లోని చాలా ఆసుపత్రుల వారిని కలిశాను. కానీ, నార్మల్ డెలివరీకి వారెలాంటి హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో గర్భిణులకు సరైన సమయంలో మందులు, డాక్టర్లు, నర్సుల సేవ అందడం లేదనీ, దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆ సమయంలోనే తెలుసుకున్నాను. ప్రయివేటు ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాన్ని వ్యాపారంలా మార్చేశాయి. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 80 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. సి–సెక్షన్ ఆ మహిళకు, బిడ్డకు మంచిది కాదు. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నప్పటికీ సర్జరీ చేయడం తప్పు. కానీ, వైద్యులు సాధారణ ప్రసవానికి చాలా సమస్యలు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎన్నో సందేహాలు తలెత్తాయి. చివరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. దేశమంతటా.. మొదట వాయుకాలుష్యంపై పరిశోధనలు చేస్తూ వచ్చాను. కానీ, బిడ్డ పుట్టాక మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనుకున్నాను. 2019లో ఆస్ట్రికా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీని ద్వారా భారతదేశం అంతటా ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, జీఎన్ఎమ్లకు శిక్షణ ఇచ్చాను. దీంతో వారు సురక్షితమైన ప్రసవం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనవసరమైన సిజేరియన్ ప్రసవాల నుంచి వారిని రక్షించగలుగుతున్నారు. ప్రసవ సమయంలో అగౌరవం ప్రతి గర్భిణి గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ పొందాలి. కానీ, ఒక గర్భిణికి నొప్పులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలోని లేబర్‌రూమ్‌లో సిబ్బంది ఆమె మీద చెడు మాటలతో విపరీతంగా అరుస్తారు. చెప్పుతో కొట్టడం కూడా చూశాను. ఇది నాకు చాలా పాపం అనిపించింది. ఇలా జరగకూడదు, దీన్ని ఆపాలి అనుకున్నాను. 2021 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వచ్చాను. అది కూడా సరిపోదని ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టాను. ధనికులైనా, పేదవారైనా ప్రతి స్త్రీకీ మంచి చికిత్స పొందే హక్కు ఉంది. ఇది గుర్తించే, బెంగళూరులోనే ఒక పేరున్న ఆసుపత్రిలో నా ఏడు పడకల కేంద్రాన్ని ప్రారంభించాను. గర్భిణిని కూతురిలా చూసుకునే మంత్రసాని ఉండాలని నమ్ముతాను. విదేశాల నుంచి సర్టిఫైడ్ మంత్రసానులను, వైద్యులను ఈ సెంటర్లో నియమించాను. ఎందుకంటే, ఇక్కడ చేరడానికి డాక్టర్లు ఎవరూ రెడీగా లేరు. దీంతో బయటివారిని సంప్రదించాల్సి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ పనిచేయడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అంతేకాదు, హాస్పిటల్లో ప్లేస్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకంటే సి–సెక్షన్ లకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక నార్మల్ డెలివరీ అంటేనే మహిళలు, వారి కుటుంబసభ్యులు కూడా భయపడుతున్నారు. వారి దృష్టిలో సిజేరియన్ డెలివరీ సురక్షితమైంది. కౌన్సెలింగ్‌తో నార్మల్... నా సంస్థ కర్ణాటక వాణివిలాస్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఓ రోజు హాస్పిటల్ బోర్డ్ మెంబర్ డ్రైవర్ భార్య మా సెంటర్‌కి వచ్చింది. ఆమె నార్మల్ డెలివరీకి భయపడింది. మా మంత్రసాని ఆమె మనసులోని భయాన్ని కౌన్సెలింగ్ ద్వారా తొలగించింది. ఫలితంగా ఆమెకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాధారణ ప్రసవం జరిగింది. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. అంటే, వారికి మానసిక, శారీరక బలాన్ని అందిస్తాం. వారికి సహాయం చేయడానికి మా బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండేళ్లలో 200 మంది గర్భవతులలో కేవలం ఇద్దరికి మాత్రమే సిజేరియన్ అవసరం పడింది. అది కూడా వారికి ప్రసవంలో సమస్య ఉండటం వల్ల. మిగతా అందరికీ సాధారణ ప్రసవాలు జరిగాయి. ఆస్ట్రికా మిడ్వైఫరీ సెంటర్లో ముప్పైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న నర్సులు, మంత్రసానుల కోసం ఆస్ట్రికా స్పియర్ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా సిబ్బంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది సర్టిఫికెట్లు పొందారు. యూరప్ నుంచి కూడా అధ్యాపకులు ఉన్నారు. మా మెటర్నిటీ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి కోర్సులను కూడా అందిస్తుంది. ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని వివరిస్తారు జాన్హవి. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. – డాక్టర్ జాహ్నవి నిలేకని -
కడుపు కోతకు చెక్..!
సాక్షి, రాజమహేంద్రవరం: బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అదీ సహజ పద్ధతిలో జరిగితే తల్లీ, బిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహం అమ్మ కడుపును కోసేస్తోంది.. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్లు యథేచ్ఛగా చేసేస్తున్నారు. గర్భిణి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే శస్త్ర చికిత్స తప్పుకాదు. కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా శ్రస్త్ర చికిత్సలనే ప్రోత్సహిస్తున్నారు. సిజేరియన్‌కు రూ.40 వేల నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి(కోత కనబడని శస్త్ర చికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రుతలకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్ర చికిత్సలే చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ దుస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్య శాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్ల వల్ల కలిగే అనర్ధాలు, సహ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు పోత్రహించేందుకు ‘సీ–సేఫ్’ విధానాన్ని రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం సన్నద్ధమవుతోంది. ఇదీ సంగతి జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 300కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రాజమహేంద్రవరం జీజీహెచ్, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, కడియం పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వైద్య శాఖ గణాంకాల ప్రకారం 50 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటిలో 80 శాతం శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే 50 శాతానికి పైగా అపరేషన్లు జరుగుతున్నాయి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండటంతో బాలింతలకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మార్చి 22 వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 22,648 ప్రసవాలు జరిగాయి. అందులో ప్రైవేటులో అత్యధికంగా 15,804, అందులో 10,433 సిజేరియన్లు జరిగాయి. 5,370 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,844 జరగ్గా.. కేవలం 3,552 శస్త్ర చికిత్సలు మాత్రమే చేశారు. అదీ హైరిస్క్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. 3,763 సాధారణ ప్రసవాలు జరిగాయి. నర్సులకు శిక్షణ సహజ ప్రసవాలు పెంచే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైఫరీ(ఎన్‌పీఎం) కోర్సులో శిక్షణ అందించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళలకు అవసరమైన వైద్యం ఎలా అందజేయాలో వివరించారు. హైరిస్క్‌లో ఉన్న గర్భిణులను గుర్తించడం, వారికి అందించాల్సిన వైద్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డులో పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. సీ–సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియనుల చేయాలన్నదే ‘సీ–సేఫ్’ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాతృశిశు మరణాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తుంది. సాధారణ కాన్పులే మేలు నవమాసాలు మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో శస్త్రచికిత్సలను ప్రోత్సహించడం తగదని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నార్మల్ డెలివరీ జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితిని బట్టి రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్ర చికిత్స చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్‌ను ప్రోత్సహిస్తున్నారు. వైద్యుల్లో సైతం వేచి చూసే ధోరణి ఉండాలి. రోగుల ఒత్తిడి మేరకు శస్త్ర చికిత్సలను ప్రోత్సహించడం తగదు. గర్భం దాల్చినప్పటి నుంచి తేలికపాటి వ్యాయామాలు చేస్తే కాన్పు సమయంలో ఇబ్బందులు పడాల్సి అవసరం ఉండదని సూచిస్తున్నారు. జిల్లాలో మూడు నెలలుగా శస్త్ర చికిత్సలు, నార్మల్ డెలివరీలు ఇలా.. ఆస్పత్రి నెల సిజేరియన్లు నార్మల్ డెలివరీ ప్రభుత్వ జనవరి 236 251 ఫిబ్రవరి 253 250 మార్చి 215 244 ప్రైవేటు జనవరి 916 389 ఫిబ్రవరి 631 345 మార్చి 599 292 గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అవసరం లేకుండా చేపట్టే జిసేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకు గాను ప్రతి పీహెచ్సీ, గ్రామాల్లో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నా.ం ఈ క్రమంలో సీ–సేఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం... – డాక్టర్.కె. వెంకటేశ్వరరావు,జిల్లా వైద్య శాఖాధికారి -
ఇప్పటికే ఏడుగురు.. ఇప్పుడు మరో ముగ్గురు.. మొత్తం 10 మంది పిల్లలు
భద్రాచలం అర్బన్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఆదివాసీ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది సాధారణ కాన్పు కావడం విశేషం. కాగా ఆమెకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బట్టిగూడెంకు చెందిన పుజ్జ అనే మహిళకు ఈనెల 2వ తేదీన పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం పుజ్జ మొదట ఇద్దరు మగ శిశువులకు జన్మనివ్వగా వైద్యులు కవల పిల్లలనే అనుకున్నారు. ఇంతలోనే పుజ్జ మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, పుజ్జ వయసు 29 ఏళ్లు మాత్రమే కాగా, ఆమెకు ఇది ఎనిమిదో కాన్పు అని చెప్పారు. ఇప్పటికే ఆమెకు నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు ఉండగా, ఇప్పుడు పుట్టిన ముగ్గురితో కలిపి ఆమెకు మొత్తం పది మంది సంతానం అయ్యారు. పుజ్జకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాక డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పుజ్జకు సాధారణ ప్రసవం జరిగేలా కృషి చేసిన హెడ్‌నర్సు విజయశ్రీ, ఇతర సిబ్బందిని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అభినందించారు. -
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ విధంగా చేస్తే నార్మల్ డెలివరీ పక్కా..
-
ప్రెగ్నెన్సీ ఐదో నెల..సిజేరియన్‌కి వెళ్లొచ్చా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు అయిదవ నెల. ఎలాంటి పరిస్థితిలో సిజేరియన్‌కి వెళ్లొచ్చో చెప్తారా? – సీహెచ్. రమోల, చెన్నై మీకిప్పుడు అయిదవ నెల అంటున్నారు. సాధారణంగా సుఖ ప్రసవమా? లేక సిజేరియనా అనేది తొమ్మిదవ నెలలో అయితే కచ్చితంగా చెప్పగలుగుతాం. తల్లీ, బిడ్డ కండిషన్‌ను ఫిజికల్ ఎగ్జామ్, స్కానింగ్ ద్వారా చెప్పవచ్చు. కానీ కొన్ని కండిషన్స్‌లో మాత్రం తప్పకుండా సిజేరియనే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంతకుముందేమైనా గర్భసంచికి సంబంధించిన సర్జరీ, రెండు లేదా ఎక్కువసార్లు సిజేరియన్ అయినా, మైయోమెక్టమీ (ఫైబ్రాయిడ్‌ను తొలగించే శస్త్రచికిత్స) సర్జరీ అయినా, యూటరైన్ అనామలీస్ (పుట్టకతోనే గర్భసంచీకి సంబంధించిన సమస్య) ఉన్నా, తొమ్మిదోనెలలో మాయ కిందకి ఉన్నా, పొట్టలో బిడ్డ ట్రాన్స్వర్స్ పొజిషన్ లేదా బ్రీచ్ పొజిషన్లో ఉన్నా, కవలలు, ట్రిప్లెట్స్ ఉన్నా. బిడ్డ రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉన్నా, బిడ్డ నాలుగున్నర కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్నా, బీపీతో ఫిట్స్ వచ్చినా, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా, తొమ్మిదవనెలలో 38–39 వారాల మధ్య ముందుగానే అనుకుని సిజేరియన్ చేస్తారు. ఒకవేళ సాధారణ కాన్పులో నొప్పులు వస్తున్నప్పుడు.. బిడ్డ హార్ట్ బీట్ తగ్గినా, రక్తస్రావం అధికంగా అవుతున్నా.. ప్రోగ్రెస్ సరిగా లేనప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లమ్ లేకపోయినా ఈ మధ్య మెటర్నల్ రిక్వెస్ట్ మీద కొంతమందికి ఆపరేషన్ చేస్తున్నారు. ఇది తల్లి ఆరోగ్యానికి అంత మంచిదికాదు. పేషంట్, కుటుంబానికి కౌన్సెలింగ్ చేసి.. సాధారణ కాన్పుతో ఉన్న ఉపయోగాలను, ఆపరేషన్ వల్ల కలిగే ఇబ్బందులను వివరించి అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లను ఆపుతున్నారు. -
Dr. Shilpi Reddy: డ్యాన్సింగ్ మామ్స్
ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేయించుకుంటున్న ఈ రోజుల్లో డ్యాన్సింగ్ థెరపీ ద్వారా నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి. మారిన జీవనశైలి కారణంగా పెరుగుతున్న సిజేరియన్ రేషియో తగ్గించడానికి ఏడేళ్లుగా ఈ డాక్టర్ చేస్తున్న కృషి ఎంతో మంది కాబోయే తల్లులకు వరదాయినిగా మారింది. ఈ విషయాల గురించి డాక్టర్ మరింతగా ఇలా వివరించారు. ‘ఈ మధ్య కాలంలో గర్భిణులు చేసే పనుల్లో ఫోర్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు బాగా తగ్గిపోయాయి. గతంలో నీళ్లు చేదడం, ముగ్గులు పెట్టడం, ఇండియన్ టాయిలెట్లు వాడటం, కూర్చొని బట్టలు ఉతకడం, దంచడం, రుబ్బడం, వంటలు చేయడం.. ఇలాంటి పనులన్నీ డెలివరీ అయ్యే దారిని అనువుగా మార్చేవి. ఇప్పుడు ఈ పనులన్నీ తగ్గిపోయాయి. ఫలితంగా డెలివరీ అయ్యే దారి ఇరుకుగా మారి ప్రసవం కష్టమైపోయింది. గర్భవతి అని తెలిసిన రోజు నుంచి ఆహారం బాగా తీసుకోవాలనే విధానం పెరిగింది. కూర్చొని వర్క్ చేసుకునే గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి. శారీరక శ్రమ తగి, క్యాలరీలు పెరగడంతో లోపల బేబీ కూడా పెరుగుతుంది. ఇక ప్రసవ సమయానికి నొప్పి లేకుండా డెలివరీ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే, ప్రసవం నొప్పి అనేసరికి ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. దీని నుంచి బయటకు రాలేక ‘ఎందుకు రిస్క్...’ సిజేరియన్ అయితేనే బెటర్ అనుకుంటారు. సాధారణంగా వ్యాయామాలు, ఆహార నియమాలు గురించి చెబుతాం కానీ, ప్రసవం సమయానికి నొప్పి భయంతో కూడిన స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఈ వలయం నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు నుంచీ భయం పోగొడుతూ వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలి. అందుకే మంచి పాటలతో చిన్న చిన్న డ్యాన్సింగ్ మూమెంట్స్ చేయిస్తుంటాం. గర్భవతిగా ఉన్నన్ని రోజులూ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వ్యాయామాలు, జుంబా క్లాసులు కూడా ఉంటాయి. సహజ ప్రసవానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ ఇది. సిజేరియన్ల రేషియో పెరగడంతో నార్మల్ డెలివరీల వైపు ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అందరిలోనూ సహజ ప్రసవాల విషయంలో ఆలోచనలు పెరిగాయి. దీంతో దీని వెనక ఉన్న కారణాలనూ కూడా అవగాహనలోకి తీసుకొని చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్లానింగ్ అమల్లోకి రావాలంటే మంచి టీమ్, నిపుణులు అందుబాటులో ఉండాలి. ఎవరికి వారు సొంతంగా చేయలేరు. అలా చేస్తే, ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. నాలో పుట్టిన ప్లానింగ్ కాబట్టి ఎక్కడైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించాలో కూడా నాకు తెలుసు. ఇక్కడ మా కడల్ హాస్పిటల్లో పెద్ద యోగా హాల్, ఫిజియోథెరపిస్టులు, ఎమర్జెన్సీ టీమ్, గైనకాలజిస్టులు .. ఈ సెటప్‌ను మాకు అనుగుణంగా మార్చుకున్నాం. దీనిని కాపీ చేయడం కూడా సులువు కాదు. నాలాగా చేయాలంటే సేమ్ సెటప్‌ను ఫాలో అవ్వాలి. ఈ ప్లానింగ్‌గా అమలు చేస్తే నాలుగైదేళ్లకు సక్సెస్ రావచ్చు. కోవిడ్ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు నుంచీ ప్లానింగ్ విషయంలో శ్రద్ధ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కూడా మా సేవలు పొందడానికి వస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా కావల్సిన సేవలు అందిస్తున్నాం’ అని వివరించారు ఈ డాక్టర్. రోజువారీ పనులు అధిక ఆహారం తీసుకోకుండా, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, బామ్మల కాలం నాటి బలవర్ధకమైన ఆహారం తయారీ, చేయాల్సిన రోజువారీ పనులు.. ఇలాంటివన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అయితే ప్రసవానికి వచ్చినప్పుడు భయమనేది లేకుండా గర్భిణిలో ఒక నిశ్చింత కలుగుతుంది. ఏడేళ్లుగా చేస్తున్న కృషి క్రమం తప్పకుండా ఏడేళ్లుగా చేయడంతో మంచి స్పందన వస్తోంది. గతంలో నోటి మాట ద్వారా వచ్చిన వారే ఎక్కువ. సోషల్‌మీడియా ద్వారా రెండేళ్లుగా చాలా మందిలోకి వెళ్లింది. మనకు వచ్చిన ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టినప్పుడు ‘ఎవరో నవ్వుతారు, ఏదో అంటారు’ అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అప్పుడే సరైన ఫలితాలు పొందుతాం. ఈ ప్లానింగ్ విషయంలో జరిగినది అదే. గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీకి వస్తుందో తెలిసిపోతుంది. అయితే, కొంతమంది మాత్రం మంచి ముహూర్తం అని చెప్పిన టైమ్‌కి సిజేరియన్ చేయమని అడుగుతుంటారు. ఇది సరైనది కాదని, నార్మల్ డెలివరీయే మేలైనదని చెబుతాం. సమాజంలో ఒక చిన్నమార్పు రావడానికి చేస్తున్న కృషి ఇది. – నిర్మలారెడ్డి -
Health: పందొమ్మిదేళ్లు.. తొలి చూలు ప్రెగ్నెంట్.. నార్మల్ డెలివరీ కావాలంటే?!
నాకు పందొమ్మిదేళ్లు. ఇప్పుడు నేను తొలి చూలు ప్రెగ్నెంట్‌ని. టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్‌కి వెళ్లాలి? ఆపరేషన్ లేకుండా ప్రసవం కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – టీ. ప్రణీత, ధర్మవరం ప్రెగ్నెన్సీలో వేసుకునే టెటనస్ ఇంజెక్షన్ వాక్సినేషన్లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. మన గవర్నమెంట్ సెటప్‌లో T.T plain ఇంజెక్షన్‌ను 13–39 వారాల మధ్యలో నాలుగు వారాల తేడాతో రెండు డోస్‌లు ఇస్తారు. సెకండ్ డోస్ టీటీ వాక్సీన్‌ను ప్రసవానికి కనీసం మూడు నెలల ముందు తీసుకునేట్టు చూడాలి. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకి యాంటీబాడీస్ పాస్ అవడానికి.. హైకాన్సంట్రేషన్ ఉండటానికి సహాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు.. ప్రెగ్నెన్సీ సమయంలో 27– 36 వారాల మధ్య.. Tdap అనే కాంబినేషన్ వాక్సిన్ సింగిల్ డోస్‌ను ఇస్తున్నారు. దీన్ని మన దేశంలో కూడా ఐఏపీ (ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్), ఎఫ్ఓజీఎస్ఐ (ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) అనుమతించాయి. చెకప్స్ విషయానికి వస్తే ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చెకప్స్ విషయానికి వస్తే.. మొదటి ఏడు నెలల వరకు నెలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెలదాకా రెండు వారాలకు ఒకసారి చెకప్స్‌కి వెళ్లాలి. తొమ్మిదవ నెలలో వారానికి ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఇలా కరెక్ట్‌గా చెకప్స్‌కి వెళ్తే తల్లీ, పొట్టలోని శిశువు ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. బీపీ, సుగర్, థైరాయిడ్లాంటివి డిటెక్ట్ చేసి.. వెంటనే చికిత్సను అందించే వీలు ఉంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన మందులను ఇస్తూ ప్రసవం సాఫీగా అయ్యేలా చూసే చాన్స్ ఉంటుంది. గర్భస్థ శిశువు పెరుగుదలను చూడ్డానికి స్కాన్, TIFFA స్కాన్, NT స్కాన్‌ను సజెస్ట్ చేస్తారు. ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావడానికి ప్రెగ్నెన్సీ మొదలు పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ కొన్ని మెడికల్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ముందుగానే డాక్టర్‌ను కలిస్తే.. మెడికల్ హిస్టరీ తెలుసుకుని.. ప్రెజెంట్ కండిషన్‌ను అంచనా వేస్తారు. రిస్క్ ఉంది అనుకుంటే.. తొమ్మిదవ నెల నిండాక ఆపరేషన్ తప్పనిసరి అని చెబుతారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే మాత్రం వంద శాతం నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తారు. తొమ్మిదవ నెలలో పెరినియల్ మసాజెస్.. నార్మల్ డెలివరీకి కొంతవరకు సాయపడవచ్చు. కనీసం ఒక గంట వాకింగ్, 15– 20 స్క్వాట్స్ చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామం అందుతుంది. అధిక బరువు లేకుండా, బీపీ, సుగర్, థైరాయిడ్లు రాకుండా స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలి. రెగ్యులర్ చెకప్స్‌లో ఇంటర్నల్ పెల్విస్ చెక్ చేసి నార్మల్ డెలివరీ చాన్స్ ఎంత ఉందో మీ డాక్టర్ చెబుతారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
పక్కా కమర్షియల్.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్‌కే మొగ్గు
బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి తల్లికీ పునర్జన్మ వంటిదే. సహజంగా సాధారణ (నార్మల్) డెలివరీ, సిజేరియన్ అని రెండు పద్ధతులు ఉంటాయి. సాధారణ పద్ధతిలో కాకుండా శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ – సెక్షన్ డెలివరీ అంటారు. సాధారణ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లి, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సిజేరియన్ చేస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా కాసుల కోసం.. లేనిపోని భయాందోళనలు సృష్టించి సిజేరియన్ ఆపరేషన్‌కు ఒప్పిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: = గుత్తి మండలానికి చెందిన లక్ష్మీదేవి గత బుధవారం పురిటినొప్పులు రాగానే అనంతపురంలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు వచ్చింది. నాలుగు గంటల వ్యవధిలోనే ఆమెకు సిజేరియన్ చేసి కాన్పు చేశారు. పూర్తి స్థాయిలో రక్తపరీక్షలు చేయకుండానే కోత కాన్పు కానిచ్చేశారు. = ఉవరకొండకు చెందిన 21 ఏళ్ల సుల్తానా రజియా రెండో కాన్పు కోసం అనంతపురం వచ్చింది. మొదటి కాన్పు సుఖప్రసవం అయినా రెండో కాన్పులో మాత్రం ఆ అవకాశం లేదని సిజేరియన్ చేయాలని ఓ నర్సింగ్ హోం డాక్టర్లు చెప్పారు. దీంతో విధిలేక సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సుఖప్రసవం జరిగి తల్లీ బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వాస్పత్రిలోనూ అవసరమైన అన్ని వసతులూ కల్పించింది. సిజేరియన్ ప్రసవాలు అత్యవసరమైతేనే చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా కోత కాన్పులు (సిజేరియన్లు) చేస్తూనే ఉన్నాయి. పేషెంటు రావడమే ఆలస్యం... ఏదో ఒక కారణం చెప్పి సిజేరియన్ ప్రసవం చేస్తున్నారు. సిజేరియన్ ద్వారా ప్రసవం చేయడం అటు తల్లికీ బిడ్డకూ మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో కోతల ప్రసవాలకు నియంత్రణే లేకుండాపోతోంది. వ్యాపారంగా మారిన ప్రసవాలు ప్రసవాలు పక్కా వ్యాపారమయ్యాయి. సాధారణ ప్రసవమైతే నర్సింగ్‌హోంలో రూ.10 వేలు కూడా బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే ఆస్పత్రి శ్రేణులను బట్టి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తారు. మూడు రోజులు ఇన్పేòÙంటుగా ఉంటే కనిష్టంగా రూ.50వేలు వేయొచ్చు. దీనికోసమే ఎక్కువ నర్సింగ్ హోంలలో సిజేరియన్ ప్రసవాలకే మొగ్గుచూపుతున్నారు. అదే ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటుతో పోల్చుకుంటే చాలా తక్కువ సిజేరియన్ ప్రసవాలుంటాయి. ఇకనైనా ప్రైవేట్ వైద్యులు తల్లీబిడ్డల ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. అనవసరంగా సిజేరియన్ చేయొద్దు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ చేశామంటే దానికి ఆడిట్ జరుగుతుంది. కారణం కచ్చితంగా చెప్పాలి. అందుకే ప్రభుత్వాస్పత్రుల్లో విధిలేకపోతే తప్ప సిజేరియన్ చేయం. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా నియంత్రణ ఉంది. డీఎంహెచ్ఓ పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరైనా సరే ప్రత్యేక కారణం లేకుండా సిజేరియన్ ప్రసవం చేయకూడదు. –డాక్టర్ కృష్ణవేణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్), అనంతపురం సిజేరియన్ డెలివరీతో నష్టాలు = డెలివరీ సమయంలో తల్లికి ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. = సిజేరియన్ గాయం వల్ల తల్లికి భవిష్యత్‌లో ఇతర సమస్యలు రావచ్చు. = ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు సోకితే తల్లికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. = సాధారణ ప్రసవమైతే వెంటనే శిశువుకు తల్లిపాలు వస్తాయి. సిజేరియన్ అయితే ఆలస్యం కావచ్చు. = సిజేరియన్ ప్రసవం వల్ల శిశువుకు శ్వాసకోశ సమస్యలు రావచ్చు. = ఒకసారి సిజేరియన్ అయితే రెండోసారి గర్భం దాల్చినప్పుడు మరిన్ని సమస్యలుంటాయి. = సిజేరియన్ వల్ల దీర్ఘకాలంలో వెన్నుపూస సమస్యలు లేదా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. -
Health: నార్మల్ డెలివరీ.. దగ్గితే... తుమ్మితే... యూరిన్ లీక్ అవుతోంది? ఎందుకిలా?
నాకు 30 ఏళ్లు. ఏడాదిన్నర కిందట డెలివరీ అయింది. నార్మల్ డెలివరీనే. ఇప్పుడు దగ్గినా.. తుమ్మినా కొంచెం యూరిన్ లీక్ అవుతోంది. ఇదేమైనా పెద్ద సమస్యా? దీనికి ట్రీట్మెంట్ ఉందా? – బి. ప్రసూన, నందిగామ చాలా మంది ఆడవాళ్లకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ ఉంటుంది. ఈ కండరాలు కింది భాగంలో ఉంటాయి. ఇవి ఒక స్లిప్లాగా ఉండి, పైన ఉన్న బ్లాడర్, గర్భసంచి, రెక్టమ్ (మలవిసర్జన పైప్)ను సపోర్ట్ చేస్తాయి. వయసు పెరిగేకొద్దీ సహజంగానే ఇవి కొంత వీక్ అవుతాయి. ఇవి నడుము కింద టైల్బోన్ నుంచి ముందు వైపున్న ప్యూబిక్ బోన్‌కు అటాచ్ అవుతాయి. ఈ కండరాలనూ శరీరంలోని అన్ని కండరాల్లాగే శక్తిమంతం చేసుకోవాలి. దానికోసం కొన్ని వ్యాయామాలు చేయాలి. దాంతో కండరాలు పటుత్వం కోల్పోవు. దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు యూరిన్ లీక్ కాదు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ కండరాలు ఆటోమేటిగ్గా టైట్ అయి ఆ ఓపెనింగ్స్‌ను క్లోజ్ చేసి లీక్ అవకుండా చేస్తాయి. కానీ ఈ కండరాలు ఆల్రెడీ వదులైపోతే లీకేజ్ తప్పదు. ప్రసవం తర్వాత ఎక్కువగా దగ్గు, ఎక్కవ కాలం శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అధిక బరువుతో బాధపడుతున్నా, ఎక్కువ కాలం బరువు పనులు చేస్తున్నా.. రుతుక్రమం ఆగిన తరువాత వీక్ అవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రసవం తరువాత వెజైనా స్ట్రెచ్ అయి ఈ కండరాలు వదులవుతాయి. వ్యాయామాల ద్వారా ఈ కండరాలను టైట్ చేయవచ్చు. బరువు తగ్గడం, పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ యూరిన్ లీక్ ప్రాబ్లమ్ 80 శాతం కేసెస్‌లో తగ్గుతుంది. ఏ రిజల్ట్ లేనప్పుడు యూరో గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ప్రతిరోజు కనీసం మూడుసార్లయినా ఈ వ్యాయామాలు చేయాలి. ప్రతిసారి 8 కాంట్రాక్షన్స్ చేయాలి. ఇలా మూడు నెలలు చేస్తే చాలా ఫలితం కనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే వాళ్లు ఈ వ్యాయామాలు ఎలా చేయాలో వివరిస్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? Gynecology: 60 ఏళ్ల వయసులో ఎందుకిలా? ఏదైనా ప్రమాదమా? -
Health Tips: నార్మల్ డెలివరీ అవ్వాలంటే!
నాకు తొమ్మిదో నెల. నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా కోరికగా ఉంది. కానీ నొప్పులు ఎలా భరించాలనీ భయంగా ఉంది. ఈ మధ్య చాలామంది ‘ఎపిడ్యూరాల్’ తీసుకుంటున్నారు. దాని గురించి చెప్పగలరా? వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? – రాధ, వరంగల్ నొప్పులు డెలివరీలో భాగమే. నొప్పిని పూర్తిగా తగ్గించి, తేలికగా డెలివరీ చేయడం కష్టం. ‘లేబర్ ఎనాల్జినా’ అంటే డెలివరీ టైమ్‌లో తీసుకునే నొప్పి తెలియనివ్వని మందులు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఎన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నా, పాజిటివ్ థింకింగ్, రిలాక్సేషన్ టెక్నిక్స్, ప్రసవ సమయంలో కుటుంబ సభ్యుల ఆసరా అనేవి అత్యవసరం. ఇవి ఉంటే చాలా వరకు మందులు లేకుండా లేబర్ పెయిన్‌ను మేనేజ్ చేయవచ్చు. డెలివరీ టైమ్‌లో గర్భసంచి కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఆ నొప్పులు కింద సెర్విక్స్‌ను ఓపెన్ చేసి, బిడ్డ డెలివరీ కావడానికి దోహదపడతాయి. ఈ నొప్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మీ గైనకాలజిస్ట్, అనెస్థటిస్ట్లతో మీ భయాల గురించి ముందే మాట్లాడుకునే అవకాశాన్ని చాలా ఆస్పత్రులు కల్పిస్తున్నాయి. యాంటీనేటల్ క్లాసెస్‌లో ఇవి కూలంకషంగా చర్చిస్తారు. మీకు పర్టిక్యులర్‌గా ఎలాంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ సరైనవో విశ్లేషించి, వివరిస్తారు. ఈ రోజుల్లో పెయిన్ రిలీఫ్ కోసం సహజ మార్గాల వైపే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఇందులో సహజ మార్గాలంటే ప్రత్యేకమైన బ్రీతింగ్ టెక్నిక్స్‌ను బర్తింగ్ క్లాసెస్‌లో నేర్పిస్తారు. వీటిలో మీ శరీరం, మనసు రిలాక్స్ అయ్యే పద్ధతులను చెబుతారు. నొప్పిని తగ్గించే కొన్నిరకాల మసాజ్ పద్ధతులను వివరిస్తారు. కొంతమంది ఈ టెక్నిక్స్‌తో పాటు కొన్ని మందులు కూడా తీసుకుంటారు. కాబట్టి మిక్స్డ్ మెథడ్స్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్‌ను ఒక స్పెషల్ కోచ్‌తో గాని, మీ ఫ్యామిలీ మెంబర్‌తో గాని లేదా మీ భర్తతో గాని కలసి చేయవచ్చు. వాటర్ బర్త్ అనేది కూడా ఒక ఆప్షన్. మీ ప్రెగ్నెన్సీ స్టేటస్ ఎలా ఉంది, హైరిస్క్ ఏదైనా ఉందా, కడుపులోని బిడ్డకు నిరంతర పర్యవేక్షణ అవసరమా అనేదానిపై మీ డాక్టర్ వాటర్ బర్త్ ఆప్షన్ తీసుకోవచ్చా లేదా చెబుతారు. లేబర్‌లో పొజిషన్ చేంజ్ చేయడం, వాకింగ్, యోగా, స్ట్రెచింగ్, హీటింగ్ ప్యాడ్, మ్యూజిక్, మెడిటేషన్ వంటివి కూడా బాగా పనిచేస్తాయి. ఈ మెథడ్స్‌తో నొప్పి తగ్గనప్పుడు మెడికల్ మెథడ్స్ సూచిస్తారు. వీటిలో కొన్నిరకాల ఐవీ ఇంజెక్షన్స్, ‘ఎంటనాక్స్’ అనే నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ పీల్చుకోవడం, వెన్నులోకి ఇచ్చే ‘ఎపిడ్యూరాల్’ ఇంజెక్షన్ వంటివి ఉంటాయి. వీటిలో ఐవీ ఇంజెక్షన్స్ వల్ల కొంచెం ఎసిడిటీ, కళ్లుతిరగడం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. నైట్రస్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్‌తో కలిపి ఇచ్చే గ్యాస్. దీనిని ఒక హ్యాండ్‌హెల్డ్ మాస్క్ ద్వారా పీల్చుకోవడం జరుగుతుంది. నొప్పులు పడుతున్నప్పుడు ఒకటి రెండు నిమిషాలు తీసుకుంటే నొప్పి తెలియదు. ఎక్కువమంది దీనినే ఎంపిక చేసుకుంటారు. ‘ఎపిడ్యూరాల్’ అనేది లేబర్ టైమ్‌లో అనుభవజ్ఞులైన అనెస్థటిస్ట్ వెన్నులోకి చేసే ఇంజెక్షన్. ఇది లేబర్ టైమ్ అంతా పనిచేస్తుంది. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్‌లోని మందు నొప్పిని తెలిపే నరాలను బ్లాక్ చేస్తుంది. ఇది చేసినప్పుడు బిడ్డ గుండె కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇది నొప్పిని పూర్తిగా తగ్గించదు. కొంచెం తెలుస్తూనే ఉంటుంది. మీరు ప్రసవానికి సిద్ధంగా ఉన్నప్పుడు లేబర్ ప్రెజర్ సెన్సేషన్ తెలియటానికి కొన్నిసార్లు ఎపిడ్యూరాల్ను నిలిపివేస్తారు. దీనిని తీసుకోవడం వల్ల కాన్పు కోసం కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే నొప్పి అంటే భయం ఉండి, నార్మల్ డెలివరీ కోరుకునే వారికి ఈ ఇంజెక్షన్‌తో కొంత పెయిన్ రిలీఫ్ కల్పించి, నార్మల్ డెలివరీకి ప్రయత్నించ వచ్చు. అనెస్థీషియా ఇచ్చే ముందు దీని లాభనష్టాలను వివరంగా చెబుతారు. అంతకంటే ముందుగా జరిగే బర్తింగ్ క్లాసెస్‌లో మీ సందేహాలన్నింటినీ తీర్చుకోవచ్చు. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ చదవండి: Gynaecology- Chronic Pelvic Pain: 8 నెలలుగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.. గర్భసంచి తీసేయించాలా?! -
తొలిసారి సిజేరియన్... రెండోసారీ తప్పదా? తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు..
మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే... అదే మహిళకు రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్ తప్పదనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ అది సరికాదు. రెండోసారి నార్మల్ డెలివరీకి అవకాశం ఉందా లేక సిజేరియనే అవసరమా అనే అంశం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్నో నెలలో చేశారు వంటివి. ఎందుకు... అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే... మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉందనుకుందాం. కానీ... ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్ తప్పనిసరి కాకపోవచ్చు. మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే మార్గంలో సాఫీగా వెళ్లే అవకాశం లేదనీ, తత్ఫలితంగా మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే మామూలు డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా (కాంట్రాక్టెడ్ పెల్విస్) ఉంటే మాత్రం సిజేరియన్ తప్పదు. తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు, ఆమె బిడ్డ బయటకు వచ్చే దారి అయిన ‘పెల్విక్ బోనీ క్యావిటీ’ సన్నగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివారిలో చాలాసార్లు సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీయాల్సి రావచ్చు. ఈ అంశాలను బట్టి మనకు తెలిసేదేమంటే... మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు. మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... తల్లి ప్రాణానికీ ప్రమాదం. చదవండి: Fashion: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! Cancer Awareness: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? లోదుస్తులు బాగా బిగుతుగా ఉంటే.. -
ఇక్కడ గర్భిణులు ఆడుతారు, పాడుతారు, వ్యాయామం చేస్తారు...
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం / భద్రాచలం : ఇక్కడ గర్భిణులు ఆడుతారు.. పాడుతారు.. వ్యాయామం చేస్తారు. ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా భయపడరు. సాధారణ ప్రసవం అవుతామనే ధీమా అందరిలోనూ కనిపిస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు మించిన మిషనరీలు, వైద్య సిబ్బంది సేవలు ఈ ఆస్పత్రి సొంతం. ఇక్కడ గత రెండేళ్లుగా గర్భిణులు, శిశు మరణాల సంఖ్య ఒకటి, రెండుకు మించి లేకపోవడం విశేషం. అందుకే జిల్లా నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్.పురం, కుక్కునూరు, వేలేరుపాడు, యటపాక మండలాల వారు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సైతం గర్భిణులు సుఖ ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారు. సామాన్యులే కాదు.. వీఐపీలకూ ఈ ఆస్పత్రిపై అపార నమ్మకం. ప్రస్తుత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల సతీమణులు కూడా ఈ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేయించుకోవడం గమనార్హం. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అందుతున్న సేవలపై అన్ని వర్గాల వారిలోనూ భరోసా రోజురోజుకూ పెరుగుతోంది. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే మార్పు తెచ్చిన ‘మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ సిస్టం’ సరిగ్గా రెండేళ్ల క్రితం.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 80 శాతం ప్రసవాలు ఆపరేషన్లే జరిగేవి. ఈ ఆస్పత్రితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి, కాగజ్‌నగర్, ఏటూరునాగారం, పెద్దపల్లి, కోస్గి సీహెచ్‌సీలు, మంచిర్యాల, మహబూబాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, గజ్వేల్, భద్రాచలం ఏరియా ఆస్పత్రులు, ఎంసీహెచ్ కరీంనగర్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువని తేలింది. చదవండి: విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులతో వ్యాయామం చేయిస్తున్న మిడ్వైఫ్ ప్రాక్టీషనర్లు దీంతో ఆయా ఆస్పత్రుల్లో తల్లీ బిడ్డల మరణాల రేటు తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో 2017లో ప్రభుత్వం ‘నర్స్ మిడ్వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్’ సిస్టమ్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 దరఖాస్తులు రాగా 30 మందిని ఎంపిక చేసి, వారికి కరీంనగర్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 12 నెలలు, సంగారెడ్డి ఎంసీహెచ్‌లో ఆరు నెలలు, మరో చోట ఆరు నెలలు.. ఇలా మొత్తం రెండేళ్ల పాటు శిక్షణ ఇప్పించింది. అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్న 12 ఆస్పత్రులకు ఇద్దరు, ముగ్గురు చొప్పున నియమించింది. 1,250 సాధారణ ప్రసవాలు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు మొత్తం 1,984 ప్రసవాలు జరిగాయి. అందులో 1,250 సాధారణ ప్రసవాలే ఉండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల వారీగా చూస్తే.. సాధారణ కాన్పుల్లో ‘భద్రాచలం ఏరియా ఆస్పత్రి’ మొదటి స్థానంలో ఉండడం విశేషం. కాగా రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్య దేవరాజన్, సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్ గతంలో ఈ ఆస్పత్రిని సందర్శించారు. మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ల పనితీరును స్వయంగా తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గర్భిణుల వివరాలు తెలుసుకుంటున్న వాకాటి కరుణ, ఐటీడీఏ పీఓ (ఫైల్) -
యోగా సాధనతో సుఖ ప్రసవం
సాక్షి, హైదరాబాద్: యోగా అంటే మంచి ఆరోగ్యం కోసం, శరీర సౌష్టవం కాపాడుకునేందుకు చేస్తారనే చాలామందికి తెలుసు. అలాగే యోగా వత్తిడిని తగ్గిస్తుందనీ అంటారు. కరోనా నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ప్రెగ్నెన్సీ యోగాతో గర్భిణులకు చాలా మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉండటంతో పాటు సిజేరియన్ బాధ లేకుండా సహజమైన సుఖ ప్రసవం జరిగే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు అనిత అత్యాల. ఆరోగ్యవంతమైన బిడ్డ జననానికి ఈ ప్రత్యేక ప్రెగ్నెన్సీ యోగా దోహదపడుతుందని అంటున్నారు. అయితే డాక్టర్ల సలహాతో నిపుణుల వద్దే యోగా సాధన చేయాలని సూచిస్తున్న అనిత అత్యాలతో.. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ఆరోగ్యానికి అనుగుణంగా ఆసనాలు గర్భిణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన (మోడిఫై చేసిన) ఆసనాలు, ప్రాణయామాన్నే ప్రెగ్నెన్సీ యోగా అని చెప్పవచ్చు. వీరికి చాప (మ్యాట్)తో పాటు కుర్చీ, బోలస్టర్ సహాయంతో వారి ఆరోగ్యానికి అనుగుణంగా ప్రత్యేక తరగతులు ఉంటాయి. అపోహతో అనర్థం గర్భం దాల్చిన తర్వాత ఏ పనీ చేయకూడదు.. విశ్రాంతిగా ఉండాలి అనే ఒక విధమైన అపోహతో సరైన వ్యాయామం చేయకపోవటం వల్ల సహజ ప్రసవాలు చాలా తగ్గిపోయాయి. కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇందుకు కారణం శరీరాన్ని కొన్ని భంగిమలలో మాత్రమే ఉంచటం ద్వారా కండరాల పటుత్వం పెరగకపోవటం, బిడ్డ ఎదుగుదలకు అనువుగా మార్పులు చెందకపోవడం. దీంతో అనేక సమస్యలు ఏర్పడి ప్రసవ సమయంలో ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల గర్భిణులు ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, యోగా సాధన చేసినట్లయితే సిజేరియన్ బాధలేకుండా సహజ ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. గర్భంలో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతాయి. బిడ్డ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హార్మోన్లను సమతుల్య పరుస్తుంది గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. హార్మోనల్ మార్పులు కూడా సంభవిస్తుంటాయి. వాటి మధ్య అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో యోగాసనాలు గర్భిణీకి చాలా ఉపయోగపడతాయి. అలాగే తలతిప్పడం, మలబద్దకం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో మహిళలు తరచుగా ఆందోళన ఒత్తిడి, కోపం, మూడ్ స్వింగ్‌కు గురవుతుంటారు. అనులోమ, విలోమ, భ్రమరి, ప్రాణాయామాలు ఒత్తిడి ఆందోళనలను తగ్గించేందుకు సహాయపడతాయి. దీని ద్వారా శిశువుకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది. గర్భం దాల్చిన తర్వాత యోగా సాధన చేయడం వల్ల గర్భిణులకు మంచి ఉపశమనం లభిస్తుందని మిచిగన్ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ముందస్తు ప్రసవం తప్పించుకోవచ్చు గర్భిణులు ఆరోగ్యంగా ఉండటానికి సురక్షితమైన, సున్నితమైన మార్గంగా యోగా నిర్ధారించబడింది. 2012 లోనే జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రెనటల్ యోగా (స్ట్రెచింగ్, శ్వాస సంబంధిత)ను సాధన చేయడం ద్వారా శిశువు బరువు మెరుగవుతుందని, ముందస్తు ప్రసవ ప్రమాదం తగ్గుతుందని తేలింది. ఇక ఈ సమయంలో వెన్నునొప్పి, వికారం, నిద్రలేమి, తలనొప్పి, మధుమేహం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో ప్రెనటల్ యోగా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రెనటల్ యోగా ఆసనాలను అభ్యసిస్తున్నప్పుడు తల్లి శరీర కండరాలు, రక్తప్రసరణ గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. యోగా సాధనతో తల్లితో పాటు శిశువుకు సులువుగా ఆక్సిజన్ అందుతుంది. గర్భిణీ స్త్రీ శరీర కండరాలు, లిగ్మెంట్స్ సాగదీయడానికి ఈ యోగా సహాయపడుతుంది. గర్భిణులకు మేలు చేసే ముఖ్యాసనాలు 1. వీరభద్రాసన 2. బద్ధ కోణాసన 3. తాడాసన 4. కటి చక్రాసన 5. ఊర్ధ్వ వజ్రాసన 6. మార్జారి ఆసన 7. త్రికోణాసన 8. పశ్చిమోత్తాసన -
ఒకసారి సిజేరియన్ అయితే ప్రతిసారీ అదే తప్పదా?
మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే చేయాలనే అపోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అలాంటి నియమమేదీ లేదు. కాకపోతే రెండోసారి అయ్యే డెలివరీ నార్మల్‌గానే అవుతుందా లేక తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వస్తుందా అనే అంశం చాలా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఎన్నో నెలలో చేశారు వంటి అనేక అంశాలపై రెండోసారి నార్మల్ డెలివరీయా లేక సిజేరియనా అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు... ►కొందరిలో మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉంటే సిజేరియన్ చేసి ఉండవచ్చు. ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉండదు. బిడ్డ తల కిందికే ఉంది కాబట్టి నార్మల్ డెలివరీ కోసం ఎదురు చూడవచ్చు. ►మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే దారిలో మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా (కాంట్రాక్టెడ్ పెల్విస్) ఉంటే మాత్రం తప్పనిసరిగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిందే. ►సాధారణంగా తల్లుల ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నవారికి బిడ్డ బయటకు వచ్చే దారి అయిన పెల్విక్ బోనీ క్యావిటీ సన్నగా ఉండే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటివారిలో చాలా సార్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సివచ్చే అవకాశాలు ఎక్కువ. ►మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... పెద్ద ప్రాణానికీ ప్రమాదం. ►మొదటిసారి సిజేరియన్ చేసే సమయంలో గర్భసంచికి నిలువుగా గాటు పెట్టి ఉంటే (క్లాసికల్ సిజేరియన్) ఇక రెండోసారి సిజేరియనే చేయక తప్పదు. (ప్రస్తుతానికి క్లాసికల్ సిజేరియన్స్ చాలా అరుదుగా చేస్తున్నారు). ఒకవేళ అప్పట్లో అడ్డంగా గాటు పెట్టి ఉంటే ఈ సారి నార్మల్ డెలివరీ కోసం అవకాశం ఇచ్చి చూడవచ్చు. పై అంశాల ఆధారంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారీ తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు. తల్లీ, బిడ్డా ఆరోగ్యం బాగా ఉండి, పైన పేర్కొన్న అంశాల ఆధారంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటే దాని కోసం ప్రయత్నించవచ్చు. అయితే... మొదటిసారి సిజేరియన్ అయిన మహిళ... రెండోసారి ప్రసవాన్ని తప్పనిసరిగా ఆసుపత్రిలో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీ) జరిగేలా చూసుకోవాలి. ఎందుకంటే అవసరాన్ని బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో డాక్టర్లు నిర్ధారణ చేసి, తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. డాక్టర్ స్వప్న పుసుకూరి కన్సల్టెంట్ ఆబ్‌స్టట్రీషియన్ – గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్, హైదర్‌నగర్, హైదరాబాద్ -
కోతకైనా సిద్ధం. ..సర్కారీ ఆస్పత్రి నిషిద్ధం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలామంది గర్భిణులు సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కొందరు గర్భిణులు సాధారణ ప్రసవాలకు అంగీకరించడంలేదు. పురుటి నొప్పుల సమయంలో పరిస్థితి చేజారిపోతున్నా సాధారణ ప్రసవమే చేద్దామని ప్రభుత్వ వైద్యు లు చేస్తున్న ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రసవాలు చేసే లేబర్ రూంలు సరిగా లేకపోవడం, కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆందోళ చెందుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ ప్రసవం చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీన్నే ఆసరాగా తీసుకొని ప్రైవేటు ఆసుపత్రులు అవసరమున్నా లేకపోయినా సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనే కనిపిస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు చేస్తే మంచిదేనని, కానీ గర్భిణీలను మానసికంగా సిద్ధం చేయకుండా ఒత్తిడి చేస్తే ప్రయోజనం ఉండదని వైద్యులు అంటున్నారు. దీంతో ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య ఒకట్రెండు శాతం తగ్గిందని వైద్య విధాన పరిషత్‌లోని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఏడాది 3.83 లక్షల మంది ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3.83 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో 2.18 లక్షల (57%) మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 1.65 లక్షల (43%) మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. గతేడాది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటి సంఖ్య ఒకట్రెండు శాతం అధికంగా ఉందని, ఇప్పుడు తగ్గిందని అంటున్నారు. ఇక ఇప్పటివరకు జరిగిన ప్రసవాల్లో మొత్తంగా 59% సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేశారు. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 45%, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 78% సిజేరియన్ ద్వారా జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో గర్భిణులు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవం అంటేనే హడలిపోతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించా యి. సాధారణ ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం రూ. 25 వేలతో ముగించేయవచ్చు. అదే సిజేరియన్ ఆపరేషన్ చేసినందుకు, వారం పది రోజులపాటు ఆస్పత్రిలో అద్దె గదుల్లో ఉంచినందుకు ఆస్పత్రి స్థాయిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. -
డోంట్ వర్రీ.. ఈజీ డెలివరీ
గర్భం దాల్చిన రోజు నుంచే సిజేరియన్‌కు మానసికంగా సిద్ధమైపోతోంది ఆధునిక మహిళ. నార్మల్ డెలివరీ అనేది దాదాపు అసాధ్యం అనే స్థాయికి ఆలోచనలు స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో వ్యాయామం అలవాటు నార్మల్ డెలివరీకి, చక్కని సంతానభాగ్యానికి హామీగా మారుతూ పలువురిలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. సిజేరియన్ బాధ లేకుండా పిల్లల్ని కనాలనుకునే వివాహితలకు సహకరించడం దగ్గర్నుంచి గర్భిణిగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ, ప్రసవానంతరం తలెత్తే పలు ఆరోగ్య సమస్యల పరిష్కచారానికి, డెలివరీ అనంతరం శరీరాకృతి మెరుగు పరుచుకునేందుకు కూడా ఉపకరిస్తోంది. దీన్ని గుర్తిస్తున్న నగర మహిళ ఆ‘పరేషాన్’కి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో) : హిమాయత్ నగర్లో నివసించే రమ్య ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గర్భవతిగా తగినంత వ్యాయామం చేస్తూ.. నార్మల్ డెలివరీ ద్వారా చక్కని పాపకు జన్మనిచ్చారు. గర్భిణిగా ఉన్నా అన్ని వ్యాయామాలు, ఆసనాలు సాధన చేయవచ్చని స‘చిత్ర’ సమేతంగా నిరూపిస్తూ గర్భం దాల్చిన దగ్గర్నుంచి బిడ్డ పుట్టేవరకూ ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లు ఎంతో మందికి స్ఫూర్తిని అందించాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో ఆమె తన అనుభవాలను ఇలా పంచుకున్నారు. ఆసనాలు ఇలా వేయాలి.. సూర్యనమస్కారాలు కాస్త సులభతరం చేసి చేయాలి. ఇందులో కోబ్రా పోజ్ తప్ప అన్నీ చేయవచ్చు. వృక్షాసన, తాడాసన, సేతుబంధాసన (ఇది ఎక్కువ సేపు కాకుండా 2 శ్వాసల కాలం మాత్రమే) అథోముఖ శ్వాసాసన వంటివి చేయవచ్చు. బటర్‌ఫ్లై ఆసనం కూడా చేయవచ్చు. ఫార్వర్డ్ బెండ్స్ చేసేటప్పుడు సగం మాత్రమే బెండ్ అవాలి. నెలలు నిండుతుంటే... వైడ్ లెగ్ ఫార్వార్డ్ ఫోల్డ్ చేయాలి. శశాంకాసన వంటివి చేయకూడదు. మాలాసన బాగా చేయాలి. నొప్పులు రాని పరిస్థితిని నివారించేందుకు ఇదిఅవసరం. మాలాసన చాలా ఉపయుక్తం. ఇది నేచురల్ డెలివరీకి బాగా ఉపకరిస్తుంది. నా విషయంలో.. 37 వారాల తర్వాత బేబీ తల రివర్స్ అయింది. దీంతో మంచం మీద కాళ్లు పెట్టి తల కిందకు పెట్టి చేసే ఇన్వర్షన్స్ వర్కవుట్ చేశాను. ప్రాబ్లం సాల్వ్ అయింది. గర్భిణులకు ఆహారం తీసుకున్న తర్వాత అరుగుదల కాసింత ఆలస్యం అవుతుంది. కాబట్టి.. తిన్నాక కనీసం 4గంటల తర్వాత మాత్రమే వ్యాయామాలు/ఆసనాలు చేయడం మంచిది. లంచ్ అయ్యాక ఈవినింగ్ స్నాక్స్‌కి ముందు సమయం అయితే బెటర్. ఆరోగ్య సంతాన ‘ప్రాప్తి’కోసం.. సంతానభాగ్యానికి అడ్డుపడే ఆరోగ్యపరమైన ఇబ్బందులని తొలగించుకోవడానికి నడక వంటి వ్యాయామాలను, యోగాసనాలు ఉపకరిస్తాయి. వీటిని దినచర్యలో భాగం చేసుకోగలిగితే హార్మోన్ల సమతుల్యత పెంపొందడం, రక్తప్రసరణ సజావుగా సాగడం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడతాయి. తద్వారా సంతానలేమికి కారణమైన సమస్యల నివారణకు అవకాశం ఎక్కువ. గర్భం దాల్చాలని ఆశిస్తున్న వివాహితలు తమ ఆరోగ్య పరిస్థితికి అనువైన అన్ని రకాల యోగాసనాలను సాధన చేయవచ్చు. అలాగే ప్రసవానంతరం కూడా... శరీరం వదులు కావడం వంటి కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి కూడా యోగాయే సమాధానం. వాకింగ్‌తో క్వీన్.. గర్భధారణ సమయంలో కూడా ఎప్పటిలాగే చురుగ్గా ఉండాలి. గర్భవతులకు వాకింగ్ చాలా ఉపయుక్తం. తొలి రెండు త్రైమాసికాల్లో ప్రతిరోజూ స్లో వాకింగ్ చివర్లో బ్రిస్క్ వాకింగ్ చేయవచ్చు. దాదాపు 28 వారాలు నిండాక ప్రీమేటల్ ఏరోబిక్స్ కూడా చేయవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చాలా హెల్ప్‌ఫుల్. ప్రాణాయామ, అనులోమ, విలోమ ప్రాణాయామాలు చేయవచ్చు. ఎంత బాగా డీప్ బ్రీత్ తీసుకుంటే అంత చక్కగా శ్వాసని కడుపులోని బేబీకి పంపుతున్నట్టు అర్థం. మరో 2, 3 రోజుల్లో డెలివరీ ఉందనగా మెట్లు ఎక్కి దిగడం వంటివి చేస్తే ప్రసవం మరింత సులభం అవుతుంది. అలాగే డెలివరీ సమయంలో నొప్పుల్ని తగ్గించుకోవాలంటే... వేణ్నీళ్ల టబ్ ఒక మార్గం. నా డెలివరీ వాటర్ టబ్‌లోనే అయ్యింది. శారీరక శ్రమ అవసరమే.. అడుగు తీసి అడుగేయవద్దు, అటు పుల్ల ఇటు తీసి పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు వంటి అతి జాగ్రత్తలు గర్ణిణుల విషయంలో సర్వసాధారణం. అయితే అవి సరికాదు. నడక వంటి తేలికపాటి వ్యాయామాలతో పాటు, గర్భంలోని శిశువు సజావుగా పెరగడానికి, తల్లి ఆరోగ్యంలో అసాధారణ మార్పు చేర్పులు చోటు చేసుకోకుండా ఉండడానికి యోగాసనాల సాధన అత్యంత ఉపయుక్తం. మూడోనెల నుంచీ.. గర్భధారణ తర్వాత 3 నెలల తర్వాత నుంచి ఆసనాలు సాధన చేయవచ్చు. తగినంత యోగా నైపుణ్యం ఉన్నవారైతే ఇంకాస్త ముందుగానే మొదలుపెట్టవచ్చు. తేలికపాటి భంగిమలకు, ఆసనాలకు పరిమితం కావాలి. ముఖ్యంగా వెనుకకు బాగా వంగి చేసే ఆసనాలు వేయకూడదు. అలా చేస్తే ప్లెసెంటా డిటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెచ్చింగ్లు (శరీరాన్ని సాగదీసే వ్యాయామ భంగిమలు) అన్నీ చేయవచ్చు కానీ అశ్వసంచలాసన లాంటి ట్విస్ట్స్ చేయకూడదు. ఓపెన్ ట్విస్ట్స్ చేయవచ్చు. భరద్వాజాసన లాంటివి చేయవచ్చు. దీనిలోనే క్లోజ్ ట్విస్ట్స్ చేయకూడదు. అధిక ఆహారం అవసరం లేదు.. కొంత మంది తల్లీ, బిడ్డ.. ఇద్దరి కోసం తింటున్నాం అనే భావనతో రోజువారీగా తీసుకునే ఆహారం అమాంతం పెంచేస్తారు. అది సరికాదు. సగటున మహిళకు సాధారణ పరిస్థితుల్లో.. 300 కేలరీల కంటే ఎక్కువ ఆహారం అవసరం లేదు. గర్భవతిగా ఉన్నప్పుడు అత్యధికంగా 10 నుంచి 12 కిలోల బరువు పెరగడం వరకూ ఫర్వాలేదు. అంతకన్నా ఎక్కువైతే ఇబ్బందులే. డ్రైఫ్రూట్స్, ఆకు కూరలు, ప్రొటీన్‌ఫుడ్ బాగా తీసుకోవాలి. స్వీట్స్ ఎక్కువ తింటే జెస్టేషనల్ డయాబెటిస్ రావచ్చు. స్వీట్స్ బాగా తక్కువగా తీసుకోవాలి. పన్నీర్, పెరుగు వంటి కాల్షియం పుష్కలంగా ఉండేవి తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ఖర్జూరం, బీట్రూట్.. క్యారెట్, పాలకూర, తోటకూర వంటివి బాగా తీసుకోవాలి. -
సాధనతో స‘ఫలం’
యోగా మరో జీవికి జన్మనిచ్చే సమయంలో గర్భిణుల్లో ఎన్నో సందేహాలు, ఎన్నో అపోహలు. అలాంటి సందేహాల్లో యోగ సాధన చేయవచ్చా? చేస్తే ఎంత కాలం చేయవచ్చు? నిండు గర్భిణిగా ఉండి కూడా చేయవచ్చా? ఇలాంటి విషయాల్లో చాలా మందికి సరైన అవగాహన లేదు. ఆసనాల సాధన చేయవచ్చునని కొందరు, చేయకూడదని కొందరు అంటుండడంతో... గర్భిణులు అయోమయానికి లోనవుతున్నారు. అయితే నవమాసాలు నిండి పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు యోగా చేయడం చాలా అవసరం. గర్భం దాల్చక ముందు యోగ సాధన అలవాటు ఉన్నవారు లేదా అప్పుడే ప్రారంభిస్తున్నవారు కూడా చేయవచ్చు. చేయాలి కూడా. అదెలా అంటే... విభజించుకుని... నవమాసాలు పూర్తయ్యేవరకూ యోగా చేయవచ్చు. అయితే దీనిని 3 రకాలుగా విభజించుకోవాలి. గర్భం దాల్చిన తొలి త్రైమాసికంలో (3నెలల్లో) మామూలు ఆసనాలు సాధన చేయవచ్చు. ఆ తర్వాత రెండవ త్రైమాసికంలో కాస్త తేలికపాటి ఆసనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక చివరిదైన... మూడవ త్రైమాసికంలో బాగా సులభంగా ఉండేవి మాత్రమే చేయాలి. అయితే ఆసనాలు వేసేటప్పుడు ఏదైనా ఆధారాన్ని వినియోగించుకోవాలి. గోడ లేదా కుర్చీ, లేదా దిండ్లును గాని సపోర్ట్‌గా ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... బోర్లా పడుకుని చేసే ఆసనాలు మాత్రం నిషిద్ధం. చేయదగిన ఆసనాలేవి? నిలబడి చేసే ఆసనాల్లో తాడాసన, వృక్షాసన, కటి చక్రాసన, ఉత్కటాసన, అర్ధ చంద్రాసన, సాధారణ త్రికోణాసన, వీరభధ్రాసన వేరియంట్ 1, వేరియంట్2 లు చేయవచ్చు. ► కూర్చుని చేసే వాటిలో స్వస్తికాసన, కటి చక్రాసన, వక్రాసన, భద్రకోణాసన (బటర్ ఫ్లై), భరధ్వాజాసన, పక్కవైపునకు వంగి చేసి వికృష్ట జానుశిరాసన చేయాలి. ► అరచేతులు, మోకాలి మీద నిలబడి చేసే ఆసనాల్లో (నీల్ డవున్ పోస్చర్స్) మార్జాలాసన, వ్యాఘ్రవాలచాలన, బాలాసన, అర్ధ అథోముఖ శ్వానాసన, ప్రసారిత మార్జాలాసన వంటివి సూచించదగ్గవి. ►వెల్లకిలా పడుకుని చేసే ఆసనాల్లో సేతుబంధాసన, మోచేతులు నేలపై ఆధారంగా ఉంచి మోకాళ్లు వంచి 40డిగ్రీల యాంగిల్లో చేసే విచిత్ర కర్ణి, 90 డిగ్రీల యాంగిల్లో చేసే విపరీత కర్ణి, సర్వాంగాసన వంటివి చేయదగినవి. మరికొన్ని సూచనలు... ►కాళ్లు కంఫర్టబుల్‌గా, సుఖవంతంగా ఎడంగా ఉంచి, మోకాలిని మడిచి, కటి ప్రదేశం, పొత్తికడుపు భాగాలు ఓపెన్ అయ్యేట్టుగా రిలాక్స్ చేస్తూ సాధన చేయడం చాలా ముఖ్యం. ►ఎటువంటి అలసటా ఫీలవకుండా ఉండాలి. కేవలం కండరాలని, టిష్యూలను లిగమెంట్స్, జాయింట్స్ అన్నీ రిలాక్స్ చేయడానికి చేసే యోగసాధన ఉపయోగపడాలి. ►ముఖ్యంగా పొట్ట భాగంపై ఏ మాత్రం ఓత్తిడి లేకుండా అక్కడి కండరాలు రిలాక్స్ అవుతూ సున్నితంగా మసాజ్ అయ్యేలా ఆసనాల సాధన ఉండాలి. ఉపయోగాలు... గర్భిణులు యోగ సాధన చేయడం వల్ల నార్మల్ డెలివరీకి అవకాశాలు పెరుగుతాయి. ఇది ఇప్పటికే ప్రయోగాత్మకంగా రుజువు చేయడం జరిగింది. పాశ్చాత్యదేశాల్లోనే దీనిని బాగా అనుసరిస్తున్నారు. ప్రసవానికి ముందు చేసే ప్రీ నాటల్ యోగా, ప్రసవానంతరం చేసే పోస్ట్ నాటల్ యోగాలను పాశ్చాత్యులు బాగా అనుసరిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే కొన్ని యోగా సెంటర్లలో అవగాహన కలిగిస్తున్నారు. సమన్వయం: సత్యబాబు -
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. గతంలో ఒకసారి ‘ముత్యాల గర్భం’ అనే దాని గురించి విని ఉన్నాను. అయితే వివరాలేవీ సరిగా గుర్తులేవు. ఇంతకీ ‘ముత్యాల గర్భం’ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? నాలాంటి వాళ్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? – రమ్య, కరీంనగర్ గర్భం దాల్చినప్పుడు గర్భాశయంలో పిండంతో పాటు దానికి తల్లి నుంచి రక్తం సరఫరా అందించేందుకు మాయ ఏర్పడుతుంది. కొందరిలో సరిగా తెలియని అనేక రకాల కారణాల వల్ల పిండం పెరగకుండా, మాయ మాత్రమే గర్భాశయంలో ముత్యాల్లాంటి నీటి బుగ్గలుగా మారి, అది పెరిగిపోతూ ఉంటుంది. దీనినే ముత్యాల గర్భం అంటారు. పిండం నిర్మాణంలో లోపం, ఒక అండంలోకి రెండు శుక్రకణాలు వెళ్లి ఫలదీకరణ చెందినప్పుడు, నిర్వీర్యమైన అండంలోకి ఒక శుక్రకణం వెళ్లి, ఫలదీకరణ చెంది, అది విభజన జరిగినప్పుడు హార్మోన్ల అసమతుల్యత, వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పులు, విటమిన్ ఎ లోపం వంటి ఎన్నో కారణాల వల్ల ముత్యాల గర్భం ఏర్పడుతుంది. నెలలు పెరిగే కొద్దీ ముత్యాల నీటి బుగ్గలు రెట్టింపు అవుతూ, గర్భాశయం పెద్దగా పెరుగుతూ ఉండి, మధ్యమధ్యలో నీరు, రక్తం కలిసి కొద్దికొద్దిగా బ్లీడింగ్, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. లేకపోతే అది గర్భాశయంలోని అన్ని పొరలలోకి పాకి, లోపలే బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి, మనిషి పాలిపోయినట్లుండి, బాగా ఆయాసపడిపోతూ, షాక్‌లోకి వెళ్లిపోవచ్చు. కొందరిలో ఉన్నట్లుండి రక్తస్రావం అధికంగా అయ్యి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లవచ్చు. దీనికి చికిత్స... ముత్యాల గర్భాన్ని డి మరియు సి లేదా సక్షన్ ఎవాక్యుయేషన్ ద్వారా తీసివేయడం. ముత్యాల గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మన చేతిలో ఏమీ లేదు. కాకపోతే రెండు, మూడు నెలలలో స్కానింగ్ చేయించుకోవడం వల్ల ముందుగానే ఈ సమస్యను గుర్తించి కాంప్లికేషన్స్లోకి వెళ్లకముందే దానిని తొలగించవచ్చు. మా బంధువుల్లో ఒకరికి చాలాకాలం నుంచి పిల్లలు లేరు. ‘డి అండ్ సీ ఆపరేషన్’ ద్వారా మహిళలకు పిల్లలు కలిగేలా చేస్తారని చదివాను. ‘డి అండ్ సీ ఆపరేషన్’ అంటే ఏమిటి? ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ‘కొందరు మాత్రమే ఈ ఆపరేషన్‌కు అర్హులు’ (శారీరక పరిస్థితులను బట్టి)లాంటివి ఏమైనా ఉన్నాయా? తెలియజేయగలరు? – డి.జానకి, విజయనగరం డి అండ్ సీ ఆపరేషన్ అంటే డైలటేషన్ అండ్ క్యూరెటాజ్. గర్భసంచి ద్వారమైన సర్విక్స్‌ను డైలేట్ చేసి అంటే కొద్దిగా తెరవడానికి వెడల్పు చేసి గర్భాశయంలోని పొరను క్యూరెట్ అనే పరికరం ద్వారా శుభ్రం చేయడం (గీకటం). కేవలం డి అండ్ సీ చెయ్యడం వల్లనే గర్భం దాల్చరు. అండం విడుదల అవ్వడం, సరిగా ఉండి, ట్యూబ్స్ తెరుచుకుని ఉండి, మగవారిలో వీర్య కణాలు సరిగా ఉన్నా, మిగతా హార్మోన్లలలో అసమతుల్యత వంటి ఇతర సమస్యలు ఏమీ లేకుండా ఉండి, గర్భాశయ ద్వారం చాలా సన్నగా ఉన్నప్పుడు డి అండ్ సీ ద్వారా, ఆ ద్వారాన్ని వెడల్పు చెయ్యడం వల్ల వీర్య కణాలు తేలికగా గర్భాశయంలోకి ప్రవేశించడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతే కాని, డి అండ్ సీ ద్వారా గర్భం కచ్చితంగా వస్తుందని చెప్పలేం. అలాగే గర్భాశయంలోని పొరను శుభ్రం చేయటం, అలానే దానిని గీకటం వల్ల కొందరిలో మళ్లీ పొర ఆరోగ్యంగా ఏర్పడి పిండం గర్భాశయంలో (అతుక్కోవడానికి) నిలబడడానికి (ఇంప్లాన్టేషన్) దోహద పడుతుంది. ఆధునిక చికిత్స లేని పాతకాలంలో పిల్లలు కలగనివారికి దాదాపుగా అందరికి డి అండ్ సీ చేసేవాళ్లు. దాంతో మిగతా ఇబ్బందులు లేనప్పుడు, చాలామందికి గర్భం రావడం జరిగేది. దీనినే వాడుక భాషలో కడుపు కడగటం, గర్భ సంచిని కడగటం అంటారు. ఈ ఆపరేషన్ ఎవరైనా చేయించుకోవచ్చు. నొప్పి తెలియకుండా మత్తు ఇచ్చి, యోని భాగంలో నుంచి డి అండ్ సీ చేస్తారు. శుభ్రత పాటించని హాస్పిటల్స్‌లో చెయ్యించుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. గర్భాశయంలో శుభ్రం చేసిన పొరను బయాప్సీకి పంపిస్తే, దానిలో ఏవైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. నాకు కొత్తగా పెళ్లయింది. అయితే నా భర్త నాకు దూరంగా ఉంటున్నారు. ‘ఆమె దగ్గర విపరీతమైన దుర్వాసన వస్తుంది’ అని నా గురించి ఎవరితోనో చెప్పారట. నిజానికి శుభ్రత విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ‘అతి శుభ్రత పాటిస్తావు’ అని కూడా వెక్కిరించేవాళ్లు. అలాంటి నా దగ్గర దుర్వాసన రావడం ఏమిటో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఏదైనా చెబుతారని ఆశిస్తున్నాను. – డి.కె, నిర్మల్ మీ వారి దృష్టిలో దుర్వాసన అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తున్నారో. కొంతమందిలో నోటి నుంచి కూడా దుర్వాసన రావచ్చు. కొందరిలో యోనిలో ఇన్ఫెక్షన్స్ వల్ల దుర్వాసన రావచ్చు. కొంతమంది మగవారు మనసులో ఏదో పెట్టుకుని, కారణం ఏదో ఒకటి చెబుతుంటారు. నిజంగా ఆయనకి ఏదైనా నీవల్ల ఇబ్బంది అనిపిస్తే అది నీతో మాట్లాడి, సమస్యకు మార్గం ఏమిటో, డాక్టర్‌కు చూపించటమో ఏదో చెయ్యాలి కాని, బయటవాళ్లకి నీమీద చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా! ఒకసారి నువ్వే ఆయనతో నీ వల్ల ఆయనకు ఏమి ఇబ్బందిగా ఉందో మాట్లాడి, సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్‌కి చూపించి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే ఈ దూరం పెరిగిపోయి, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. -
పిల్స్ అంటేనే భయం...
నాకు కొత్తగా పెళ్లయింది. పిల్లలు అప్పుడే వద్దనుకుంటున్నాం. పిల్స్ ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎక్కడో చదివాను. అప్పటి నుంచి పిల్స్ అంటేనే భయం పట్టుకుంది. అసలు మాత్రలు వాడడం మంచిదేనా, ఏ మేరకు వాడొచ్చు అనేది చెప్పగలరు. పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలు కొత్తగా ఏమైనా వచ్చాయా తెలియజేయగలరు. – రాగిణి, చిత్తూరు తాత్కాలికంగా పిల్లలు వద్దనుకున్నప్పుడు, అనేక మార్గాలలో గర్భ నిరోధక మాత్రలు వాడటం ఒక మార్గం. ఈ మాత్రలలో ఈస్ట్రోజన్, ప్రొజస్టరాన్ హార్మోన్లు వివిధ రకాల మోతాదులో ఉంటాయి. వీటి ప్రభావం వల్ల, అండం తయారు కాకపోవడం లేదా గర్భాశయ ముఖద్వారంలోని ద్రవాలను చిక్కగా మార్చడం, వీర్య కణాలు గర్భాశయం లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడం, తద్వారా గర్భం రాకుండా ఆపుతాయి. వీటిలోని హార్మోన్ల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో వికారం, వాంతులు, కళ్లు తిరిగినట్లు ఉండి మెల్లగా అలవాటు పడతారు. కొందరిలో తర్వాత కూడా ఈ లక్షణాలు తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు మాత్రల వాడకం ఆపివేయవలసి ఉంటుంది. మాత్రలలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదును బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు, మైగ్రేన్ ఉన్నవారు, లివర్ సమస్యలు ఉన్నవారు, రక్తం త్వరగా గూడు కట్టే గుణం ఉన్నవాళ్లు ఇవి వాడకపోవటం మంచిది. ఇప్పుడు మూడు అతి తక్కువ మోతాదులో దొరికే లో డోస్ పిల్స్ రెండు, మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. ఇవి డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు వాడటం మంచిది. మగవారు కుటుంబ నియంత్రణ కోసం వాడటానికి మందులు, ఇంజక్షన్లు ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. వారు వాడుకోవటానికి కేవలం కండోమ్స్ మాత్రమే ఉన్నాయి. కాని జాగ్రత్తగా వాడకపోతే ఫెయిల్ అయ్యి గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాక్టరు గారు... నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన వయసు 28 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం దాటింది. మాకు సంతానం కలగలేదు. నాకు పిరియడ్స్ సక్రమంగానే వస్తుంది. వైద్య పరీక్షల్లో ఏ సమస్య లేదని చెప్పారు. మాకు పిల్లలు కలగాలంటే ఏ సమయాల్లో కలుసుకుంటే బాగుంటుంది తెలియజేయగలరు. – వి.బిందు, పాడేరు సాధారణంగా భార్య, భర్తల్లో ఏ సమస్య లేనప్పుడు, 80 శాతం మంది పెళ్లయిన సంవత్సరం లోపల గర్భం దాల్చుతారు. 15 శాతం మంది రెండు సంవత్సరాల లోపల గర్భం దాల్చుతారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే, చికిత్స అవసరమవుతుంది. మీకు పెళ్లై సంవత్సరమే అయ్యింది. వైద్య పరీక్షలలో సమస్యలు ఏమీ లేవు కాబట్టి, ఇంకొక సంవత్సరం పాటు సాధారణ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. వైద్య పరీక్షలు నీకు మాత్రమే చేశారా లేక మీ వారికి కూడా వీర్య పరీక్ష చేశారా అనే విషయం సరిగా తెలుపలేదు. మీ వారికి కూడా వీర్య పరీక్ష చేసి, వీర్య కణాల సంఖ్య, కదలిక సరిగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ చెయ్యకపోతే, చేయించి చూడండి. అన్నీ బాగుంటే నీకు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయి కాబట్టి, బ్లీడింగ్ మొదలైన రోజు మొదటి రోజుగా లెక్కపెట్టి, 9వ రోజు నుంచి 16వ రోజు లోపల కలవడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. నేను చాలా బలహీనంగా ఉంటాను. బరువు కూడా చాలా తక్కువ. వైట్ డిశ్చార్జి సమస్య ఉంది. మరోవైపు మా వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకున్న సమస్య వల్ల పెళ్లి చేసుకోవడం సరైనదేనా? పెళ్లి వల్ల సమస్యలేమైనా వస్తాయేమోనని భయంగా ఉంది. మీ సలహా కావాలి. – డి.కె, మార్టూర్ సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు, ఎందుకు అలా ఉన్నానని విశ్లేషించుకోవాలి. ఆకలి లేకపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, మానసిక, శారీరక ఒత్తిడి, హార్మోన్ల లోపం, ఆరోగ్య సమస్యలు వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. రక్తహీనత వల్ల కూడా నీరసంగా ఉండటం, ఇన్ఫెక్షన్స్ ఏర్పడటం, కడుపులో నులిపురుగులు వంటి కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుండవచ్చు. నీ వయస్సు ఎంతో రాయలేదు. సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కూడా నీరసంగా ఉండటం, త్వరగా అలసిపోవటం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్తో కూడినది. అయితే, పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువ అయ్యి దురద, వాసన, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పాలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం, గుడ్లు వంటి పౌష్టికాహారం రోజూ తీసుకుని, కొద్దిగా బరువు పెరిగి, బలహీనతను పోగొట్టవచ్చు. అలా చేసినా ఉపయోగం లేనప్పుడు, డాక్టర్ని సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో పరీక్షలు చేయించుకుని దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. -
ఎందుకిలా జరుగుతోంది?
నా వయసు 32. ఎత్తు 5.2 అడుగులు. బరువు 59 కిలోలు. ఆరేళ్ల కిందట పెళ్లయింది. నాలుగుసార్లు గర్భం దాల్చినా నిలవలేదు. నెల్లాళ్ల కిందటే నాలుగో అబార్షన్ జరిగింది. డాక్టర్ల సూచనలను పాటిస్తూనే ఉన్నాను. అయినా ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? – రామలక్ష్మి, హోసూరు నాలుగుసార్లు అబార్షన్లు అయ్యాయి అని రాశారు. అవి ఎన్ని నెలలకు అయ్యాయి? గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్ చేశారా లేదా, పిండం ఏర్పడలేదన్నారా లేదా పిండం గుండె కొట్టుకోవట్లేదన్నారా, రక్త పరీక్షలు చేశారా అనే విషయాలను తెలిపి ఉంటే బాగుండేది. ఈ విషయాల మీద, కొంతమందిలో అబార్షన్లకు గల కారణాలను అంచనా వేసుకుని, దానిని బట్టి, మరలా గర్భం దాల్చిన ముందు నుంచే చికిత్స తీసుకుని తర్వాత గర్భం కోసం ప్రయత్నిస్తే, చాలావరకు అబార్షన్లు అయ్యే అవకాశం తగ్గుతుంది. కొంతమందిలో థైరాయిడ్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో పొరలు, ఫైబ్రాయిడ్స్ అండాశయాలలో నీటి బుడగలు, జన్యుపరమైన సమస్యలు, మధుమేహ వ్యాధి, తల్లిలో శిశువుకి వ్యతిరేకంగా యాంటి ఫాస్పొలిపిడ్∙యాంటీ బాడీలు వంటి అనేక కారణాల వల్ల అబార్షన్లు మళ్లీ మళ్లీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానినే హ్యాబిట్యువల్ అబార్షన్స్ అంటారు. (భార్య, భర్త ఇద్దరూ రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకుని, మరలా ప్రయత్నించండి) భార్యభర్తల్లో జన్యు పరమైన సమస్యలు ఉంటే పిండం సరిగా ఏర్పడకుండా అబార్షన్లు అవ్వవచ్చు. అలాంటప్పుడు భార్య, భర్త ఇద్దరూ జన్యుపరమైన పరీక్షలు కోసం కారియో టైపింగ్ చేయించుకుని సమస్య ఎక్కడుందో తెలుసుకోవటం మంచిది. నా వయసు 42. బరువు 70 కిలోలు, ఎత్తు 5.2 అడుగులు. నాకు మూడేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఆలస్యంగా పెళ్లి కావడం వల్ల గర్భందాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సంతానం కోసం రెండుసార్లు ఐవీఎఫ్ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. మరోసారి ప్రయత్నించవచ్చా? ఒకవేళ ప్రయత్నిస్తే ఎన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది? ఐవీఎఫ్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? – జగదాంబ, కర్నూలు మీరు గమనించవలసిన విషయాలు. ఒకటి వయసు 42 సం., మీ ఎత్తుకి 70 కిలోలు అంటే అధిక బరువు. సాధారణంగా ఆడవారిలో 35 సం.లు దాటేకొద్దీ అండాల సంఖ్య, అలాగే వాటి నాణ్యత తగ్గటం మొదలవుతాయి. అవి 40 దాటితే నాణ్యత ఇంకా క్షీణిస్తుంది. అండం నాణ్యత సరిగా లేనప్పుడు, పిండం ఏర్పడటంలో లోపాలు, పిండాన్ని గర్భాశయం స్వీకరించకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల మీకు ఐవీఎఫ్ చేసినా ఫలితం దక్కకపోయి ఉండవచ్చు. వయసు తక్కువగా ఉండి ఉంటే మూడోసారి కూడా ప్రయత్నించి ఉండవచ్చు. మీకు ఇంకా చూడాలను కుంటే ఐవీఎఫ్ తర్వాత 6 నెలలు లేదా సంవత్సరం ఆగి ప్రయత్నించ వచ్చు. కాని మళ్లీ వయసు పెరుగుతోంది కదా. కాబట్టి మీరు ఈసారికి డోనార్ నుంచి (దాత నుంచి) స్వీకరించిన అండంతో, ఐవీఎఫ్ ప్రయత్నించ వచ్చు. దీనివల్ల, అండం నాణ్యత బాగా ఉన్నప్పుడు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. అలా చేసినా గర్భం నిలవకపోతే, మీ గర్భాశయం, పిండాన్ని స్వీకరించట్లేదు కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితి తెలిసిన చికిత్స ఇస్తున్న డాక్టర్ అభిప్రాయం మేరకు సరోగసీకి ప్రయత్నం చేయవచ్చు. ఈ లోపల మీరు పది కేజీల అధిక బరువు ఉన్నారు. బరువు తగ్గి చికిత్స మొదలుపెట్టడం మంచిది. లేదంటే గర్భం ఆగడానికి ఇబ్బందులు, ఒకవేళ గర్భంవచ్చిన తర్వాత 42 వయసుతో పాటు, బరువు వల్ల బీపీ, షుగర్ వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు ఇటీవలే పెళ్లి జరిగింది. నా వయసు 21. ఎత్తు 5.4, బరువు 47 కిలోలు. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నాను. గత నెలలో ఊరికి వెళ్లినప్పుడు మూడు రోజులు పిల్స్ వేసుకోవడం కుదరలేదు. దీనివల్ల ఏవైనా సమస్యలు ఉంటాయా? – సుప్రియ, ఏలూరు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేటప్పుడు, అవి తప్పకుండా రోజు ఒకే సమయానికి మర్చిపోకుండా వేసుకుంటేనే అవి సరిగా పనిచేసి, గర్భం రాకుండా ఆపుతాయి. వీటిని సాధారణంగా పీరియడ్ మొదలైన మూడవ రోజు నుంచి మొదలుపెట్టి, మొత్తం ప్యాకెట్ అయిపోయేవరకు వేసుకోవాలి. కొన్ని పిల్స్ ప్యాకెట్లో హార్మోన్ల మోతాదును బట్టి, కొన్నింటిలో 21 మాత్రలు, కొన్నింటిలో 24 మాత్రలు, కొన్నింటిలో 28 మాత్రలు. వాటిలో 21 హార్మోన్ మాత్రలు తెల్ల రంగులో, మిగతా 7 ఐరన్ మాత్రలు నల్ల రంగులో ఉంటాయి. హార్మోన్ల మాత్రలను నెలలో ఒకసారి కంటే ఎక్కువ మర్చిపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. నువ్వు 3 రోజులు ఏ రోజుల్లో ఎప్పుడు వేసుకోలేదో రాయలేదు. వీటిని ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారికి రెగ్యులర్ పీరియడ్స్ కాదా అనేదాని బట్టి, ఒకవేళ ఆఖరు రోజుల్లో మర్చిపోతే , గర్భం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్యాకెట్ మధ్యలోనే మాత్రలు వేసుకోకపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా, ట్యాబ్లెట్స్ సరిగా వేసుకోకుండా మర్చిపోవడం వల్ల, బ్లీడింగ్ తొందరగా మొదలవటం లేదా కొద్దికొద్దిగా కనిపించటం, ఆ నెలంతా బ్లీడింగ్‌లో అవకతవకలు కనిపించవచ్చు. డా‘‘ వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుందా?
నా వయసు 29 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది. డాక్టర్ల సలహాపై చాలాకాలం మందులు, ఇన్హేలర్ వాడాను. ఇప్పుడు నేను గర్భిణిని. నాలుగో నెల. ఇదివరకు నేను వాడిన మందుల ప్రభావం నాకు పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? ఒకవేళ ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుందా? - సౌజన్య, ఇల్లెందు ఉబ్బసం వ్యాధి అంటే ఆస్తమా. కొన్ని రకాల అలర్జీల వల్ల లేదా శ్వాస నాళాలలో లేదా ఊపిరితిత్తులలో సమస్య వల్ల రావచ్చు. వీటికోసం దీర్ఘకాలం మందులు వాడవలసి ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత, ఆ సమయంలో ఏర్పడే హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, ఉబ్బసం లక్షణాల తీవ్రత ఉంటుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా మందులు వాడవలసి ఉంటుంది. వాడకపోతే తల్లికి ఇబ్బందితో పాటు కడుపులో బిడ్డకు కూడా శ్వాస తగ్గడం, ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాల వల్ల, కొన్ని సార్లు బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గర్భంలో ఉన్నప్పుడు మందులు వాడవలసినప్పుడు, డాక్టర్ పర్యవేక్షణలో బిడ్డపై ప్రభావం పడని మోతాదులో మందులు వాడవచ్చు. నువ్వు మందులు గర్భం దాల్చిన తర్వాత వాడలేదు కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడినా, మందులను డాక్టర్‌కు చూపిస్తే ఆ మందులలో మోతాదు ఎంత ఉంది, వాటివల్ల బిడ్డపై ప్రభావం ఎంత వరకు ఉండవచ్చు అనేది అంచనా వేసి చెప్తారు. ఒకసారి 5వ నెల చివరిలో టిఫా స్కానింగ్ చేయించుకుంటే, పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది 90 శాతం వరకు గుర్తించవచ్చు. నా వయసు 33 ఏళ్లు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 62 కిలోలు. ప్రస్తుతం నేను ఐదో నెల గర్భిణిని. చిన్న వయసులోనే జుట్టు నెరవడంతో నాలుగేళ్లుగా జుట్టుకు రంగు వేసుకుంటూ వస్తున్నాను. గర్భంతో ఉండగా జట్టుకు రంగు వేసుకుంటే లోపల ఉన్న పిండానికి ప్రమాదం అని కొందరు చెబుతున్నారు. నిజమేనా? - శ్రావ్య, ఖమ్మం జుట్టుకు వేసుకుని రంగు కేవలం తలమాడుకి, వెంట్రుకలకే వేయడం జరుగుతుంది. మళ్ళీ అది అరగంట, గంటలోపే కడిగేయడం జరుగుతుంది కాబట్టి అది రక్తంలోకి కలసి, పిండానికి చేరి ప్రమాదం కలిగించడం జరగదు. కాకపోతే మొదటి మూడు నెలల్లో పిండంలో అవయవాలు ఏర్పడుతాయి. కాబట్టి, రిస్క్ తీసుకోకుండా ఉండటం కోసం ఈ సమయంలో వీలైనంత వరకు హెయిర్ డై నివారించడం మంచిది. ఒకవేళ వేసుకున్నా మాడుపై జుట్టుని పైకి లాగి, మాడుకి ఎక్కువగా తగలకుండా రంగు వేసుకుని, వీలైనంత త్వరగా కడిగి వేయడం మంచిది. మా అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. మెచ్యూర్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. ఏ విధమైన ఆహారాన్ని ఇవ్వాలో, ఎన్ని రోజుల తర్వాత స్కూలుకు పంపాలో తెలియజేయండి. - స్వర్ణ కుమారి, కాకినాడ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, అమ్మాయిలు 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల ఎప్పుడైనా మెచ్యూర్ అవ్వవచ్చు. ప్రతి తల్లి కూతురికి 10 సంవత్సరాల ముందు నుంచి శరీరంలో వచ్చే మార్పుల గురించి వివరించడం మంచిది. దీనివల్ల పిల్లలు తమ శరీరంలో జరిగే మార్పులకు ఆందోళన చెందకుండా వాటిని స్వీకరించడానికి సన్నద్ధం అవుతారు. మెచ్యూర్ అవ్వడానికి 2 సంవత్సరాల ముందు నుంచే వక్షోజాలు బుడిపెలాగా మొదలయ్యి, కొద్దికొద్దిగా పెరగడం జరుగుతుంది. అలాగే చంకలో, గజ్జలో సన్న సన్న వెంట్రుకలు పెరగడం, కొద్దికొద్దిగా వైట్ డిశ్చార్జ్ వంటి మార్పులు ఎన్నో మొదలవుతాయి. ఒకవేళ స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ మొదలయినా, వారు కంగారుపడకుండా, వారి స్కూల్ బ్యాగ్‌లో న్యాప్కిన్, ప్యాంటీ వంటివి ఉండేటట్లు చూడడం మంచిది. అలాగే వారికి పెరిగే వయసు బట్టి పౌష్టికాహార విలువలు, శారీరక శుభ్రత వంటి అంశాల మీద అవగాహన పెంచటం మంచిది. మెచ్యూర్ అయ్యారని ఆహారంలో నియమాలు స్పెషల్‌గా ఏమీ ఉండవు. అందరి పిల్లల లాగానే పప్పులు, పండ్లు, పాలు, పెరుగు వంటి పౌష్టికాహారం ఇవ్వవచ్చు. దీనికోసం స్కూలుకి పంపివ్వకుండా ఇంట్లో ఉంచుకోవలసిన అవసరం లేదు. పాపకి ఎక్కువ బ్లీడింగ్; కడుపులో నొప్పి వంటివి అసౌకర్యంగా ఉంటే మూడు, నాలుగు రోజులు పంపించకండి. అన్నింటి కంటే మొదటగా, ఆ సమయంలో మీ పాపకి మానసికంగా తోడుండటం ఎంతో అవసరం. -
శాశ్వత పరిష్కారం లేదా?
నా వయసు 19 ఏళ్లు. ఎత్తు 5.5 అడుగులు, బరువు 42 కిలోలు. నాకు మూతి మీద, గడ్డం మీద పలచగా వెంట్రుకలు వస్తున్నాయి. షేవ్ చేసుకుంటే మరింత గరుగ్గా మారతాయని భయంగా ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏదైనా సూచించగలరా? - దివ్య, పొద్దుటూరు కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అవాంఛిత రోమాలు ఏర్పడుతాయి. మగ వారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజన్ హార్మోన్ కొందరి ఆడవారిలో కూడా అనేక కారణాల వల్ల ఎక్కువగా స్రవిస్తుంది. దీనివల్ల పెదవులపైన, గడ్డంమీద, కొందరిలో ఛాతిపైన, కాళ్లు, చేతులుపైన ఎక్కువగా వెంట్రుకలు వస్తాయి. అండాశయాలలో ఎక్కువగా నీటిబుడగలు, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ (పిసిఓడీ), అడ్రినల్ గ్రంథిలో కంతులు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి ఎన్నో సమస్యల వల్ల అవాంఛిత రోమాలు ఏర్పడు తాయి. నీకు గల కారణాన్ని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి టెస్టోస్టిరాన్, డీహెచ్ఈఎస్ వంటి అవసరమైన హార్మోన్, రక్తపరీక్షలతోపాటు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్ చేయించుకుని, కారణాన్ని బట్టి దీర్ఘకాలంగా చికిత్స తీసుకోవలసి ఉంటుంది. శరీరంలో ఉన్న హార్మోన్లని తగ్గించడానికి చికిత్స తీసుకోవడం వల్ల కొత్తగా వచ్చే వెంట్రుకల సాంద్రత మెల్లగా తగ్గుతూ వస్తుంది. ముందు నించి వెంట్రుకలను తొలగించుకోవడానికి తాత్కాలిక పద్ధతులను పాటించవచ్చు. ఇప్పుడు ఆధునికంగా చేసే లేజర్ ట్రీట్మెంట్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యతను బట్టి వాటి సిట్టింగ్స్‌కు సమయం పడుతుంది. శాశ్వత అవాంఛిత రోమాల నివారణకు చాలా సమయం పడుతుంది. ఖర్చు అవుతుంది. కాబట్టి ఓపికతో చికిత్స తీసుకోవలసి ఉంటుంది. శరీరంలో ఉన్న హార్మోన్స్‌ను నియంత్రణ చెయ్యకుండా కేవలం లేజర్ చికిత్స తీసుకోవడం వల్ల కొంత కాలం వెంట్రుకలు లేకపోయినా, మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా వయసు 44 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 66 కిలోలు. మూడు నెలలుగా నాకు నెలసరి రాలేదు. మెనోపాజ్ అనుకున్నాను. రెండు రోజుల కిందటే మళ్లీ బ్లీడింగ్ మొదలైంది. బాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతోంది. కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా అనిపిస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. - జగదాంబ, అనకాపల్లి మధ్యవయసు దాటిన తర్వాత సాధారణంగా పీరియడ్స్ సంవత్సరం పాటు రాకపోతే దానిని మెనోపాజ్‌గా పరిగణిస్తాము. కొందరిలో మెనోపాజ్ వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలు ఇంకా ముందు నుంచి కూడా శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతుంటాయి. వాటి అసమతుల్యత వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకుండా, బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ వయసులో ఇది మామూలే కదా అని నిర్లక్ష్యం చెయ్య కూడదు. ఎందుకంటే ఈ వయసులో గర్భాశయంలో, అండాశయంలో కంతులు, సిస్ట్లు, క్యాన్సర్లు ఇంకా ఇతర సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో మూడు నెలల నుంచి బ్లీడింగ్ అవ్వకుండా, ఇప్పుడు ఎక్కువగా అవ్వడం వల్ల రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉండడం, కాళ్ళనొప్పులు, తిమ్మిర్లు వంటివి ఉండి ఉండవచ్చు. అలాగే మూడు నెలల నుంచి బ్లీడింగ్ కానప్పుడు కొందరిలో ఎండోమెట్రియం పొర మందంగా ఏర్పడి, అతి తర్వాత బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేటప్పుడు కొందరిలో పొత్తికడుపు, నడుం నొప్పి వస్తుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చెయ్యకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి బ్లీడింగ్ తగ్గడానికి మందులు వాడుకుంటూ, ఈ సమస్యకు గల కారణాన్ని తెలుసుకొని దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. దీనికోసం కంప్లీట్ బ్లడ్‌కౌంట్, థైరాయిడ్ ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్, పాప్‌స్మియర్ వంటివి చేయించుకుంటే మంచిది. వీటిలో ఏ సమస్యా లేకపోతే మెనోపాజ్ ముందు వచ్చే మార్పులుగా అనుకుని, భయపడాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది తగ్గడానికి మందులు వాడుకుంటూ, రక్తహీనత ఉంటే సరైన పోషకాహారంతో పాటు ఐరన్‌మాత్రలు, విటమిన్స్, కాల్షియం మందులు వాడటం మంచిది. మీ ఎత్తుకి 55 కేజీల వరకు బరువు ఉండవచ్చు. మీరు 10 కేజీల అధిక బరువు ఉన్నారు. అధిక బరువు ఉన్నప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రావు. కాబట్టి బ్లీడింగ్ అరికట్టడానికి మందులు వాడుకుంటూ, బరువు తగ్గడానికి వాకింగ్, వ్యాయామాలు, పరిమితమైన పౌష్టికాహారం తీసుకోవడం మంచిది.