PAC
-
పెద్దిరెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్
-
PAC ఛైర్మన్ ను ప్రతిపక్షానికే ఇవ్వాలి
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
పీఏసీ ఎన్నికల విషయంలో YSRCP కీలక నిర్ణయం
-
YSRCP: పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీలో ఈ మధ్య కీలక బాధ్యతల అప్పగింత జరుగుతోంది. తాజాగా.. సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.ఈ బాధ్యతలతో పాటు అదనంగా నాలుగు నియోజకవర్గాలను భర్తీ చేస్తూ తిరుపతి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. మరోవైపు.. పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్కే రోజా, ఆరె శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
టెక్నికల్ గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
-
పీఏసీ చైర్మన్ పదవిపై హరీష్ రావుకు ఆరెకపూడి గాంధీ కౌంటర్
-
పీఏసీ పదవిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ
-
సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) విచారణకు ఆమోదించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పీఏసీ ఈ నెలాఖరులో సెబీ పనితీరును సమీక్షించనుందని చెప్పారు.ఆగస్టు 29న జరిగిన పీఏసీ ప్యానెల్ సమావేశంలో సెబీ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలకు అనుగుణంగా సంస్థ పనితీరుపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. దాంతో కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే పీఏసీకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నాయకత్వం వహించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు అధికార ఎన్డీఏ పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ కమిటీలో భాగంగా ఉంటారు.పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరుపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ క్షణమైనా విచారణ జరిపే అధికారం కలిగి ఉంది. అందుకోసం ఆయా సంస్థలకు ముందుగా సమాచారం అందించాల్సిన అవసరం ఉండదు. సెబీ కూడా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థ. పీఏసీ తన తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్ 10న నిర్వహించనుంది. ఆ తేదీన సెబీ విచారణ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.సెబీ చీఫ్ పనితీరుపై ఉద్యోగుల ఫిర్యాదుసెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’అదానీ కంపెనీలో పెట్టుబడులుఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. -
కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు... డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణలో 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో సోమవారం (డిసెంబర్ 18) కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మంత్రులు, కాంగ్రెస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ తదితర సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
China Pak cpec Corridor: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)కి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కింద చైనా.. పాకిస్తాన్లో పది బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. దీనిలో భాగంగా భారీ రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసింది. మిశ్రమ ఫలితాలు రాజకీయ తిరుగుబాట్లు, ఉగ్రవాద దాడుల భయం సీపెక్‌కు ఎల్లప్పుడూ సవాలుగా నిలిచింది. ఈ దశాబ్దంలో సీపెక్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా ప్రాథమిక లక్ష్యం అరేబియా సముద్రానికి ప్రత్యక్ష అనుసంధానం. ఇది ఇప్పటికీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. అయితే కారిడార్ కారణంగా పాకిస్తాన్ తన స్వల్పకాలిక లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. పాక్‌కు చైనా ఉపశమనం ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు అత్యంత విశ్వసనీయ విదేశీ భాగస్వాములలో చైనా ఒకటిగా నిలిచింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్‌కు చైనా ఎంతగానో సహాయం చేసింది. తాజాగా పాకిస్తాన్‌కు చైనా $ 2.4 బిలియన్ల రుణాన్ని అందించింది. ఇది దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌కు పెద్ద ఉపశమనంలా మారింది. గత ఏడాది ఐఎంఎఫ్ అందించిన నివేదిక ప్రకారం పాకిస్తాన్‌కు ఉన్న మొత్తం అప్పులో 30 శాతం చైనా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి వచ్చింది. పాక్-చైనాల బంధం ఇలా.. భారత పొరుగుదేశాలైన పాక్- చైనాలు 596 కిలో మీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటాయి. ఇది సియాచిన్ నుండి కారాకోరం వరకు విస్తరించి ఉంది. పాకిస్తాన్ రాజకీయ నేతలు చైనాతో తమ సంబంధాలను ప్రస్తావించినప్పుడు అవి హిమాలయాల కంటే ఎత్తుగా, సముద్రం కంటే లోతుగా, తేనె కంటే తియ్యగా' ఉండాలని అభివర్ణిస్తారు. అయితే సీపెక్ కొన్నేళ్లుగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉంది. సీపెక్ మార్గంలో చైనా నేరుగా హిందూ మహాసముద్రం వరకూ చేరుకుంటుంది. పాక్ ప్రజల నిరసన అయితే సీపెక్‌లో పనిచేస్తున్న పౌరుల భద్రత ఇరు దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రాజెక్ట్ చుట్టూ తీవ్రవాద దాడులు జరిగాయి. వీటిలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు కూడా మరణించారు. తాజాగా సీపెక్ పరిధిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. సీపెక్ కారిడార్ చైనాకు పశ్చిమ ప్రాంతంలోని జిన్జియాంగ్ను పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోగల గ్వాదర్ ఓడరేవుకు కలుపుతుంది. కాగా ఈ ప్రాజెక్టుల వల్ల తమకు ప్రయోజనం కలగడం లేదని వాయువ్య పాకిస్తాన్‌లోని ప్రజలు నిరసరన వ్యక్తం చేస్తున్నారు. చైనా ప్రయోజనాలను కాపాడేందుకు తమపై వేలాది మంది పాక్ సైనికులను మోహరించినట్లు బలూచ్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. పాక్ వాదనకు చైనా ఖండన 2021లో క్వెట్టాలోని ఒక విలాసవంతమైన హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. అలాగే దాసు డ్యామ్ వైపు వెళ్తున్న చైనా ఉద్యోగులతో నిండిన బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది చైనీయులతో సహా మొత్తం 12 మంది మరణించారు. గ్యాస్ లీకేజీ వల్లే ఈ పేలుడు సంభవించిందని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ చైనా మాత్రం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణిస్తోంది. ఇది కూడా చదవండి: నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్ -
ప్రతి నెలా పీఏసీ
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ప్రతి నెలా మొదటి వారంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సంబంధిత అంశాలు పీఏసీలో చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయాలు అమలు చేయాలని తీర్మానించారు. శుక్రవారం గాందీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌జావెద్, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పీఏసీ ఉన్నట్టా లేనట్టా? రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్‌రావ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఏసీ సమావేశాలు నిర్వహించకపోవడంపై చర్చ జరిగింది. తొలినాళ్లలో ఒకసారి మాత్రమే నిర్వహించారని, ఆ తర్వాత ఎలాంటి సమావేశం జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యా నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ‘వచ్చే నెల రెండో తేదీన జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి న సోనియాగాం«దీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె చిత్రపటాలకు పాలాభి షేకం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం రోజుకో కార్యక్రమం చొప్పున 20 రోజుల పాటు ‘దశాబ్ది దగా’పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పాలి..’ అని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నన్ని రోజులు పార్టీ శ్రేణులు తమ ఇళ్లపై కాంగ్రెస్ జెండాలు ఎగురవేయాలని సమావేశం పిలుపు నిచ్చి ంది. ఇప్పుడు వారికే దోచిపెడుతున్నారు: మధుయాష్కీ గతంలో ఆంధ్ర వాళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వారికే దోచిపెడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ముఖ్య నేతల భేటీ అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వీహెచ్, సంపత్‌కుమార్, నదీమ్ జావెద్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన ఏర్పాటు చేస్తామని, ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను ఆహా్వనిస్తామని చెప్పారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా బహిష్కరించనున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హిమాచల్ సీఎం సుఖుపై బీఆర్ఎస్ నేతల విమర్శలను వారి విచక్షణకే వదిలివేస్తున్నామని శ్రీధర్‌బాబు అన్నారు. -
ఏదో జరిగింది.. వివరణ ఇవ్వండి!
బెంగళూరు: కరోనా సంక్షోభం నేపథ్యంలో కర్ణాటకలో యడియూరప్ప వెలగబెట్టిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వలస కార్మికులకు సహాయం పేరుతో బీజేపీ సర్కారు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) విచారణలో వెల్లడైంది. ఎటువంటి వివరాలు లేకుండా 1.25 లక్షల మందికి రూ. 5 వేలు చొప్పున ఎలా పంపిణీ చేశారని ప్రభుత్వాన్ని పీఏసీ నిలదీసింది. దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ‘లబ్దిదారుల జిల్లాల పేర్లు కూడా తెలియకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కార్మికుల పేర్లు, చిరునామాలు లేకుండా ప్రభుత్వ సాయాన్ని ఎలా అందించారు? మొత్తానికి ఏదో అవకతవకలు జరిగినట్టు కమిటీ అనుమానిస్తోంద’ని పీఏసీ చైర్మన్ హెచ్‌కే పాటిల్ అన్నారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు వెళ్లకుండా ఆపేందుకు మే నెలలో ముఖ్యమంత్రి యడియూరప్ప రూ. 1600 కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. గుర్తింపు పొందిన కార్మికులకు అంతకుముందు ఇచ్చిన 2 వేల రూపాయలకు అదనంగా మరో 3 వేల రూపాయలు ఇస్తామని హామీయిచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కర్ణాటకలో 15.8 లక్షల మంది గుర్తింపు పొందిన కార్మికులు ఉన్నారు. ఆశ్చర్యకరంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో 43 వేల మంది కార్మికులు నమోదు చేసుకుంటే, బీదర్ జిల్లాలో 66 వేల మంది కార్మికులు రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. ‘నిర్మాణ రంగానికి కేంద్ర బిందువైన బెంగళూరులో.. బీదర్, ఇతర ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో కార్మికులు ఎలా ఉన్నార’ని పీఏసీ చైర్మన్ హెచ్‌కే పాటిల్ ప్రశ్నించారు. దర్యాప్తుకు సిద్ధం: డిప్యూటీ సీఎం పీఏసీ విచారణ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ స్పందించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి సాధ్యమైనంత ఉత్తమమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేశామని ఆయన అన్నారు. ఇప్పటికీ అనుమానాలు ఉంటే, తాము ఎల్లప్పుడు దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించారు. (అమూల్య కేసు ఎన్ఐఏకి అప్పగించండి) కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం కర్ణాటకలో ఇప్పటివరకు 8,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,210 మంది కోలుకుకున్నారు. ప్రస్తుతం 2,947 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈనెల 30తో ముగుస్తుంది. (కరోనా: మిఠాయి రాజాకు ఎదురుదెబ్బ) -
పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపీ సంతోష్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. లోక్‌సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు ఎంపీలు, మొత్తంగా 22 మంది కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాధాన్యతా ఓటు ఆధారంగా రెండు సభలకు చెందిన ఎంపీలు ఈ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. కమిటీకి చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయటం, వాటి ఖాతాలను పరిశీలించటంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ కేంద్రానికి నివేదికలు అందజేస్తుంది. పార్లమెంటరీ కమిటీకి తాను ఎంపిక కావటంపై సంతోష్‌కుమార్ సంతృప్తి వ్యక్తంచేశారు. -
లక్షకు మించి రుణాలుంటే పోటీకి అనర్హులు
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలకు మించి రుణాలున్న రైతులెవరైనా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. లక్ష రూపాయలలోపున్న రైతులకు మాత్రం పోటీ చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణమాఫీ ప్రకటించినందున, ఆ మేరకు మినహాయింపు ఇస్తూ సహకార ఎన్నికల అథారిటీ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా రూ.లక్షకు మించి రుణాలుంటే, వారు నామినేషన్ నాటికి లక్షకు పైబడి ఉన్న బకాయిలను చెల్లించాలి. లేదంటే వారి నామినేషన్‌ను తిరస్కరిస్తారు. అదీ రుణమాఫీకి గడువుగా ప్రకటించిన గతేడాది డిసెంబర్ 11లోపు రూ.లక్షలోపు బకాయి ఉన్న రైతులకే వర్తిస్తుంది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ అప్పు చేసి ఉంటే దాన్ని చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ నిబంధనలు వర్తించబోవని స్పష్టంచేశారు. బకాయిలు వసూలు చేసేందుకు సహకారశాఖ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహిళలు, బీసీలకు చెరో 1,812 పదవులు.. మొత్తం 906 ప్యాక్స్‌కు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతీ ప్యాక్స్‌కు 13 మంది డైరెక్టర్లను రైతులు ఎన్నుకుంటారు. వాటిలో 2 డైరెక్టర్ పదవులు మహిళలకు, మరో 2 డైరెక్టర్ పదవులు బీసీలకు, ఒక డైరెక్టర్ పదవి ఎస్సీ, ఎస్టీల్లో ఎవరో ఒకరికి రిజర్వు చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 906 ప్యాక్స్‌ల్లో 11,778 డైరెక్టర్ పదవులుంటే, వాటిల్లో మహిళలకు 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేసినట్లయింది. బీసీలకూ 1,812 డైరెక్టర్ పదవులు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 906 డైరెక్టర్ పదవులు రిజర్వు చేస్తారు. అయితే ప్యాక్స్ చైర్మన్ పదవులను రిజర్వు చేయలేదు. ప్యాక్స్ ఎన్నికలకు దాదాపు రూ.12 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ సొమ్మును ప్యాక్స్‌లే సమకూర్చుకోవాలి. లేదంటే డీసీసీబీ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చుకోవాలి. ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్యాక్స్ డైరెక్టర్లు ఎన్నికయ్యాక, వారంతా ఆయా జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్లను ఎన్నుకుంటారు. డీసీసీబీ చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్యాక్స్ ఎన్నికలయ్యాక డీసీసీబీ, టెస్కాబ్ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. -
ఎక్స్ అఫీషియో ఓటుపై కోర్టుకు ?
సాక్షి,హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లతో ప్రజాతీర్పునకు విఘాతం కలిగించేలా వ్యవహరించిందని, ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని టీపీసీసీ నిర్ణయించింది.తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఓటేయడం, ముందుగా తుక్కుగూడకు టీఆర్ఎస్ ఎక్స్అఫీషియోగా కేటాయించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని మళ్లీ నేరెడుచర్లకు మార్చడం, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలుత బడంగ్‌పేటకు ఆప్షన్ ఇచ్చి, ఆ తర్వాత తుక్కుగూడలో ఓటేయడం వంటి ఉదంతాలపై చట్టపరంగా కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఆయా సందర్భం, అవసరాన్ని బట్టి రాజ్యసభ ఎంపీల ఎక్స్ అఫీషియో ఓటు వ్యవహారంపై రాజ్యసభ చైర్మన్‌ను, సెక్రటేరియట్‌ను కోరాలని కొందరు నేతలు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ ఓటు విషయంలో తాము ముందు నుంచి హెచ్చరిస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిగా స్పందించలేదని, అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించిన తీరును ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.శుక్రవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి. ప్రజాతీర్పును కాదని ... మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలు, ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరుపై చర్చించారు. న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు దీనిపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్‌నేతలతో పాటు, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పాల్గొన్నారు. త్వరలోనే జరగనున్న సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో అధికార టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓటింగ్ విషయంలో వ్యవహరించిన తీరుపై చర్చించినట్టు తెలిపారు.ప్రజాతీర్పును కాదని పలు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ అక్రమంగా కైవసం చేసుకుందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా భయపెట్టారని ధ్వజమెత్తారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ హయాం లో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ భేటీలో సహకార ఎన్నికల పై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించామన్నారు. టీఆర్ఎస్ను సహకార ఎన్నికల్లో ఓడించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్యనేతల సమావేశంలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు డా.జి.చిన్నారెడ్డి, డా.సీహేచ్ వంశీచంద్‌రెడ్డి, మాజీ మంత్రులు మహ్మద్ అలీ షబ్బీర్, మర్రి శశిధర్‌రెడ్డి, కిసాన్సెల్నేత ఎం.కోదండరెడ్డి, టీపీసీసీనేత నిరంజన్ పాల్గొన్నారు. సమావేశంలో ఉత్తమ్. చిత్రంలో జగ్గారెడ్డి, నిరంజన్, జీవన్‌రెడ్డి, జానా, కోదండరెడ్డి, వంశీ చంద్, షబ్బీర్ అలీ, శశిధర్‌రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు -
రఫేల్‌పై తీర్పును రీకాల్ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకోవాలని (రీకాల్) కాంగ్రెస్ పార్టీ ఆదివారం కోరింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంతోపాటు పార్లమెంటు సమగ్రతను దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలంది. రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి కాగ్ తన నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి సమర్పించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుగా చెప్పడం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత అనంద్ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘అసలు విమానాల కొనుగోలుపై కాగ్ ఇంకా నివేదికే తయారు చేయకపోతే పీఏసీకి ఎప్పుడు అందజేసింది? పార్లమెంటుకు ఎప్పుడు సమర్పించింది’ అని ప్రశ్నించారు. రఫేల్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి తీర్పునే ప్రభావితం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి తీర్పును వెనక్కు తీసుకుని కేసును పునర్విచారించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తమ తప్పును అంగీకరించి, ప్రాయశ్చిత్తంగా గంగా నదిలో మునిగితేలాలని ఆనంద్ శర్మ అన్నారు. అసలు రఫేల్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారానే సాధ్యపడుతుందని ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పే అంతిమం: జైట్లీ రఫేల్‌పై జేపీసీని ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పే ఈ విషయంలో అంతిమమనీ, ఆ కోర్టే తమ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చాక జేపీసీ ఎందుకని జైట్లీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. రఫేల్‌పై కాగ్ నివేదిక సిద్ధమయ్యాక అది ఎలాగూ పీఏసీ ముందుకు వెళ్లక తప్పదన్నారు. రఫేల్‌పై పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్‌కు తెలుసనీ, వారిది విధ్వంసకర పార్టీ అని విమర్శించారు. కాగా, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం చేరిన అంశంపై అటార్నీ జనరల్ (ఏజీ), కాగ్‌లకు నోటీసులిస్తామన్న పీఏసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని పీఏసీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. -
‘సుప్రీం’నే తప్పుదారి పట్టించారు
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అంశంలో కేంద్ర ప్రభుత్వం తన అబద్ధాలతో సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి కూడా చూపించకపోయినా పీఏసీ కాగ్ నివేదికను పరిశీలించిందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా బీజేపీ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందనీ, అసత్యాలను చెప్పిందని దుయ్యబట్టింది. రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వచ్చిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేస్తూ, ఈ ఒప్పందంలో అవకతవకలేమీ లేవంటూ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని 21వ పేజీ, 25వ పేరాలో ‘రఫేల్ ఒప్పందాన్ని కాగ్ పరిశీలించింది. కాగ్ నివేదికను పీఏసీ కూడా తనిఖీ చేసింది’ అని ఉంది. అయితే వాస్తవానికి రఫేల్‌పై కాగ్ నివేదిక ఇంకా కనీసం సిద్ధం కాలేదు. కాబట్టి పీఏసీ ముందుకు ఆ నివేదిక వచ్చే ప్రసక్తే లేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం కాగ్ నివేదికను పీఏసీ పరిశీలించిందని తన తీర్పులో పేర్కొంది. కోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లనే ఇలా జరిగిందనీ, కేంద్రం సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించిందని కాంగ్రెస్‌తోపాటు ఇతర పిటిషనర్లు తాజాగా ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పు దోషాలతో కూడుకున్నదని వారంటున్నారు. కేంద్రం తప్పు కారణంగా తీర్పు ప్రభావితమైందనీ, కాబట్టి రఫేల్ కేసును సుప్రీంకోర్టు పునర్విచారించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కోరింది. టైపింగ్‌లో పొరపాటు కారణంగానే ఈ అనర్థం జరిగి సుప్రీంకోర్టుకు సమాచారం తప్పు గా వెళ్లిందని కేంద్రం శనివారం స్పష్టతనిచ్చింది. మాకు వచ్చిన వివరాల్లో అది లేదు.. పిటిషనర్లలో ఒకరైన ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు తీర్పులోని 21వ పేజీలోని 25వ పేరా వాస్తవ దూరంగా, అబద్ధాలతో ఉంది. అంతేగాక మాకు అందించిన కేంద్రం స్పందనల్లో ఇది లేదు’ అని అన్నారు. మరో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వమే కదా. ఆ అఫిడవిట్‌ను అటార్నీ జనరల్ ఎలా ఆమోదించారు?’ అని ప్రశ్నించారు. రఫేల్ యుద్ధ విమానాల ధరలు, ఇతరత్రా సాంకేతికాంశాలపై సుప్రీంకోర్టు లోతుగా విచారణ జరపలేదనీ, ఒప్పందంలో అవకతవకలు తేలాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాల్సిందేనని కాంగ్రెస్ పేర్కొంది. అది టైపింగ్‌లో తప్పు.. సరిచేయండి: కేంద్రం టైపింగ్‌లో పొరపాటు కారణంగానే ఈ అనర్థం జరిగి సుప్రీంకోర్టుకు సమాచారం తప్పుగా వెళ్లిందని కేంద్రం శనివారం స్పష్టతనిచ్చింది. దీనిని సరిచేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టైపింగ్‌లో పొరపాటు కారణంగా ఈ అంశం వివాదమవుతోందని కేంద్రం కోర్టుకు విన్నవించింది. కాగ్ నివేదికను పీఏసీ పరిశీలించిందని గానీ, కాగ్ నివేదికలో కొంత భాగాన్ని మాత్రమే పార్లమెంటుకు సమర్పించామని గానీ తాము సుప్రీంకోర్టుకు చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది. తమ స్పందనలో ‘ఈజ్’ అనే పదానికి బదులుగా ఓ చోట ‘హ్యాజ్ బీన్’ అని, మరోచోట ‘వాజ్’ అని తప్పుగా టైప్ చేయడం కారణంగానే ఇలా జరిగిందని కేంద్రం వివరించింది. అంతేతప్ప సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించే లేదా అబద్ధాలు చెప్పే ఉద్దేశం తమకు లేదంది. -
‘దిద్దుబాటు చర్యల’ మార్గదర్శకాల్లో మార్పులు!
న్యూఢిల్లీ: ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులను చక్కదిద్దడానికి ఉద్దేశించిన ‘దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలను సమీక్షించిన అనంతరం, బ్యాంకింగ్ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు ఉంటాయి. కొద్ది వారాల్లో ఇందుకు సంబంధించి నిర్ణయాలు వెలువడతాయి. మంగళవారం జరిగిన ఆర్బీఐ 18 మంది సభ్యుల బోర్డ్ సమావేశం ఈ వార్తల నేపథ్యం. పీసీఏ నిబంధనల గురించి ఈ బోర్డ్ సమావేశం చర్చించినట్లు తెలుస్తోంది. పీసీఏ మార్గదర్శకాల పరిధిలో దాదాపు 11 బ్యాంకులు ఉన్నాయి. దేనాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌తోపాటు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ పదకొండు బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిలో రెండు బ్యాంకులు– దేనాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వ్యాపార విస్తరణ నియంత్రణలను సైతం ఎదుర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలు కొంత సరళతరం చేయాలని బ్యాంకులు ఇప్పటికే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇందుకు ఆర్బీఐ ససేమిరా అంది. కాగా జూన్ త్రైమాసికం ముగిసేనాటికి బ్యాంకింగ్ వ్యవస్థ రుణాల్లో మొండిబకాయిలు 11.6 శాతం దాటిన (రూ.12 లక్షల కోట్లు) సంగతి తెలిసిందే. పలు భారీ మొండి అకౌంట్లు ఎన్సీఎల్టీ విచారణలో ఉన్నాయి. -
పాలనలో కేరళ టాప్
బెంగళూరు: దేశంలో అత్యుత్తమ పాలన సాగి స్తున్న రాష్ట్రంగా కేరళ అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. కర్ణాటకకు చెందిన ప్రజా వ్యవహారాల కేంద్రం (పీఏసీ) శనివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమం లో 2018 ప్రజా వ్యవహారాల సూచిక (పీఏఐ) ను విడుదల చేసింది. ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త శామ్యూల్ పాల్ 1994లో స్థాపించిన ఈ సంస్థ.. దేశంలో మెరుగైన పాలన సాధిం చడం కోసం కృషి చేస్తూ వస్తోంది. ఈ క్రమం లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపై అధ్యయనం చేసి గత మూడేళ్లుగా ర్యాంకులు ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లో సాం ఘిక, ఆర్థికాభివృద్ధిని గణాంకాల సహితంగా పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటా యిస్తోంది. తాజా నివేదిక ప్రకారం మెరుగైన పాలన చేస్తున్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానం సాధించగా.. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్ అట్టడుగున నిలిచాయి. చిన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ టాప్ పీఏసీ నివేదిక ప్రకారం మెరుగైన పాలన సాగి స్తున్న చిన్న రాష్ట్రాల్లో (జనాభా రెండు కోట్ల కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు) హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గోవా, మిజో రం, సిక్కిం, త్రిపుర వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. నాగా లాండ్, మణిపూర్, మేఘాలయ సూచికలో అట్ట డుగున మిగిలిపోయాయి. పెరుగుతున్న జనాభా ఆధారంగా అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ కస్తూరిరంగన్ పేర్కొన్నారు. -
చివరిరోజు ఆమోదించారు
న్యూఢిల్లీ: 2014లో లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు. ప్రైవేటు కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పలు బిల్లులను ఆమోదించారని బీజేపీ ఆరోపించింది. గీతాంజలి జెమ్స్ సహా పలు కంపెనీలకు మేలు చేసేలా బంగారు దిగుమతి పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొంది.ఈ నిర్ణయం ద్వారా చిదంబరం ఎంత లాభం పొందారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. విపక్షాలు బీజేపీపై చేస్తున్న అసత్యాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ.. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.మొండి బకాయిలు బ్యాంకు పుస్తకాల్లో లేకుండా చేసింది. ప్రభుత్వం చివరి ఆరేళ్లలో రూ.52.15లక్షల కోట్లను అడ్వాన్స్‌గా కంపెనీలకు ఇచ్చింది. ఇందులో 36 శాతం నిధులు మొండి బకాయీలుగా గుర్తించగా.. అవి ప్రభుత్వం గద్దెదిగే సమయానికి 82 శాతానికి చేరాయి. గొప్ప ఆర్థికవేత్తలైన మన్మోహన్ సింగ్, చిదంబరంల హయాంలో అనవసర జోక్యం, మొండి బకాయిలను ప్రోత్సహించటం, ఒత్తిడి చేయటంతో బ్యాంకింగ్ వ్యవస్థ పట్టాలు తప్పింది’ అని వెల్లడించారు. 80:20 పథకం ద్వారా ఏడు ప్రైవేటు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరిందన్నారు. ‘మే 16న మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఓడిపోయింది. చిదంబరం కుర్చీ ప్రమాదంలో పడింది. చివరి రోజు అత్యవసరంగా ఏడు ప్రైవేటు కంపెనీలకు మేలు చేసేలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో.. చిదంబరం, రాహుల్ గాంధీ వెల్లడించాలి’ అని రవిశంకర్ చెప్పారు. పీఏసీకి ‘80:20’ వివరాలు యూపీఏ హయాంలో తెచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం వివరాలను పార్లమెంటు ప్రజాపద్దుల సంఘానికి (పీఏసీ) ఆర్థిక శాఖ అందజేయనుంది. ఈ పథకంలోని లొసుగులను వినియోగించుకునే గీతాంజలి గ్రూప్ ప్రమోటర్ మెహుల్ చోక్సీ మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారం టూ పీఏసీలోని బీజేపీ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆర్థిక శాఖ పథకం వివరాలను సేకరిస్తోంది. పథకం, తదనంతర పరిణామాలపై 10 రోజుల్లో పీఏసీకి వివరాలు ఇవ్వనుంది. 80:20 బంగారు దిగు మతి పథకం ప్రకారం.. వ్యాపారస్తులు తా ము గతంలో దిగుమతి చేసుకున్న బంగారంలో కనీసం 20 శాతమైనా ఎగుమతి చేసి ఉంటేనే.. తర్వాత మరోసారి బంగారం దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. -
ఆన్లైన్ వ్యయాల తగ్గింపుపై కసరత్తు
• మెరుగుపడిన నగదు లభ్యత • డీమోనిటైజేషన్‌తో వృద్ధిపై స్వల్పకాలిక ప్రభావం • దీర్ఘకాలంలో ఎకానమీకి ప్రయోజనకరమే • పీఏసీకి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరణ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు దరిమిలా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ఆన్లైన్ చెల్లింపు లావాదేవీల వ్యయాలు తగ్గించే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీకి రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వివరించింది. ద్రవ్యపరపతి విధాన సమీక్షపై మౌఖిక వివరణనిచ్చేందుకు శుక్రవారం పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ముందు హాజరైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. కమిటీకి ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు తగ్గించే విధానం రూపకల్పనపై బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు మొదలైన వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు పీఏసీకి ఆర్బీఐ వివరించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా నగదు సరఫరా మెరుగుపడిందని.. కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కాస్త సమస్యలు ఉన్నప్పటికీ.. రాబోయే కొద్ది వారాల్లో పరిస్థితి చక్కబడగలదని పటేల్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీమోనిటైజేషన్ ప్రభావం స్వల్పకాలికంగా వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావం చూపినా.. మధ్య, దీర్ఘకాలికంగా ఎకానమీకి ప్రయోజనం చేకూర్చగలదని ఆయన వివరించారు. మరిన్ని అంశాలు చర్చించేందుకు ఫిబ్రవరి 10న ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్నట్లు, అవసరమైతే పటేల్‌ను కూడా మరోసారి పిలిపించనున్నట్లు సమావేశం అనంతరం పీఏసీ చైర్మన్ కేవీ థామస్ చెప్పారు. దాదాపు 4 గంటల పాటు సాగిన సమావేశంలో పలు సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు ఒక్కసారిగా ఎగియడం గురించి ప్రశ్నించిన కమిటీ.. ఈ అంశంపై దృష్టి సారించాలని ఆర్బీఐకి సూచించింది. నోట్ల రద్దు అంశంపై గతేడాది జనవరి నుంచి ప్రభుత్వంతో చర్చలు జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. గవర్నర్ పటేల్, ఇద్దరు డిప్యూటీ గవర్నర్స్ (ఆర్ గాంధీ, ఎస్ ఎస్ ముంద్రా), అయిదుగురు ఆర్బీఐ డైరెక్టర్లు (నచికేత్ మోర్, భరత్ ఎన్ దోషి, సుధీర్ మన్కడ్, శక్తికాంత దాస్, అంజలీ చిబ్ దుగ్గల్) హాజరయ్యారు. -
పీఏసీకి సమాధానమిచ్చిన ఉర్జిత్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన నగదు కొరత ప్రభావం త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రజాపద్దుల కమిటీకి చెప్పారు. అనుమానిత డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ, ఫైనాన్సియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ లాంటి ప్రత్యేక ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నాయని ఉర్జిత్ పేర్కొన్నారు. జీడీపీపై డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మధ్య, దీర్ఘకాలంలో నోట్ల రద్దు సానుకూల ప్రభావానే చూపుతుందని తెలిపారు. లావాదేవీలను ఛార్జీలను తగ్గించేందుకు బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లతో ఆర్బీఐ చర్చలు జరుపుతుందని పీఏసీ సభ్యులకు ఉర్జిత్ సమాధానమిచ్చారు. పెద్ద నోట్ల రద్దు తదనాంతరం ఏర్పడిన పరిణామాలపై ప్రజాపద్దుల కమిటీకి వివరణ ఇవ్వడానికి ఉర్జిత్ పటేల్ శుక్రవారం ఆ కమిటీ ముందు హాజరయ్యారు. నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్రం, నల్లధనం వసూళ్లు, విత్ డ్రాయల్ పరిమితిపై ఆంక్షలు వంటి పలు ప్రశ్నలను ఉర్జిత్‌కు సంధిస్తూ ఆయనకు అంతకముందే పీఏసీ నోటీసులు జారీచేసింది. ఇదే విషయంలో బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు కూడా ఉర్జిత్ పటేల్, ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో ఉర్జిత్ పలు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్బీఐ స్వతంత్రకు ముప్పు తెచ్చే పలు ప్రశ్నలను పార్లమెంటరీ కమిటీ సంధించింది. వీటికి సమాధానం చెప్పవద్దంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాతో కొన్నింటికి ఉర్జిత్ సమాధానం చెప్పలేదు. -
రాష్ట్రంలో నియంత పాలన
– ప్రజాహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం – సీమ కేబుల్ కమ్యూనికేషన్ సెంటర్ సీజ్ అన్యాయం – అఖిలపక్ష సమావేశంలో పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని శాసనసభా ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, డోన్ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం స్థానిక పాత బస్టాండులోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో అఖిల పక్ష రాజకీయ పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ తరపున జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, మాజీ కార్పొరేటర్ తోట వెంకటకష్ణారెడ్డి, కాంగ్రెస్ తరపున జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య, సీపీఎం తరపున కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్, సీపీఐ తరపున జిల్లా నాయకుడు భీమలింగప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తూ స్వేచ్ఛ లేకుండా చేస్తుందన్నారు. కర్నూలులో సీమ కేబుల్ కమ్యూనికేషన్స్‌ను సీజ్ చేయడం అన్యాయమని ఖండించారు. జిల్లాలో ఐరన్‌ఓర్ దోపిడీ జరుగుతుందని, టన్నుకు రూ. 250 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కష్ణా పుష్కరాల సందర్భంగా ముందుజాగ్రత్త లేకుండా హడావుడిగా పుష్కర పనులు ప్రారంభించడంలో మతలబు ఏమిటన్నారు. తాను శాసన సభ్యుడి స్థాయిలో 2 పబ్లిక్ లెట్రిన్లు అడిగినా జిల్లా కలెక్టర్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్, లోక్‌సత్తా, సీపీఐ ఎంఎల్ జనశక్తి, జమాతే ఇస్లామీ హింద్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి సవాల్: ఎం.ఎ.గఫూర్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు మౌలికమైన ప్రజాస్వామ్యానికి కర్నూలులో సవాల్ ఎదురవుతోంది. జిల్లా కలెక్టర్ పచ్చచొక్కాల మాట విని సీమ డిజిటల్ కమ్యూనికేషన్స్‌ను సీజ్ చేయడం అన్యాయం. లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలకు అందుబాటులో ఉండేలా సీమ డిజిటల్ కేబుల్ కమ్యూనికేషన్స్ పెడితే లైసెన్స్ లేదంటున్నారు. మరి టీడీపీ నాయకుడు శిల్పా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు ప్రాంతాల్లో కేబుల్స్ తీసుకున్నారో లేదో ఒకసారి తనిఖీ చేయాలి. మిగతా వాళ్లు వ్యాపారం చేయకూడదా: బి.వై.రామయ్య, డీసీసీ అధ్యక్షుడు కేఈ, ఎస్వీ, టీజీ కుటుంబాలు మాత్రమే వ్యాపారం చేయాలనుకుంటే ఎలా. కేఈ కుటుంబీకులు శ్యాండ్, ల్యాండ్, లిక్కర్, మైనింగ్, కేబుల్ వంటి అన్ని వ్యాపారాల్లో భాగస్వాములై ఉన్నారు. వీరు చేయని ఏదైనా వ్యాపారం ఉంటే అది చెబుతే మిగతా వాళ్లు అదే చేసుకుని బతుకుతారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలాంటి ఉన్నతాధికారులు నాయకుల అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం ఏమొచ్చింది. దాడుల పరంపర ఈనాటిది కాదు: భీమలింగప్ప, సీపీఐ జిల్లా నాయకుడు కేఈ కుటుంబం దాడుల పరంపర ఈనాటిది కాదు, తరతరాలుగా కొనసాగుతుంది. రోజూ టీవీల్లో వీరి బొమ్మలు కనబడాలనే వేరే నెట్‌వర్క్‌లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ కప్పట్రాళ్లను మార్చడం కాదు, ముందు కర్నూలులో దౌర్జన్యాలు అరికట్టాలని సూచించారు. ఆమోదించిన తీర్మానాలు: – సీమ కమ్యూనికేషన్స్‌పై అధికారుల పక్షపాత వైఖరిని, అధికార పార్టీకి అనుకూలంగా సాగిస్తున్న దాడులను ఖండించాలి. మీడియా స్వేచ్ఛను హరిస్తున్న అధికారుల చర్యలను నిరసించాలి. – జిల్లాలో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన జిల్లా అధికారులను బదిలీ చేయాలి, కార్పొరేషన్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి. -
జనరిక్ మందులనే వైద్యులు సూచించాలి
సాక్షి, హైదరాబాద్: తమ వద్దకు వచ్చే రోగులకు ప్రతి ఒక్క వైద్యుడు విధిగా జనరిక్ ఔషధాలనే రాసేలా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) సూచించింది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని స్పష్టం చేసింది. కమిటీ సమావేశం శుక్రవారం ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు పి. విష్ణుకుమార్‌రాజు, గద్దె రామ్మోహన్‌లతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. జనరిక్ మందులు ప్రజలకు తక్కువ ధరలకు లభ్యమౌతున్న నేపథ్యంలో వారి ప్రయోజనాల దృష్ట్యా వైద్యులు ఆ మందులనే రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాము రాసే మందుల పేర్లు రోగులకు సులభంగా అర్థమయ్యేలా వైద్యులు చూడాలని చెప్పారు. ఈ బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ తీసుకోవాలని స్పష్టం చేశారు. మానసిక రోగులకు చికిత్సకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను విజయనగరం జిల్లాలో నిర్ధేశించిన గడువులోగా ఖర్చు చేయకపోవటంతో ఆ తరువాత నిధులను కేంద్రం విడుదల చేయకపోవటాన్ని గుర్తించిన పీఏసీ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. రాష్ర్టంలోని క్యాన్సర్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలులో జరిగిన జాప్యం పట్ల పీఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.