Personal Protective Equipment
-
మోదీ జీ.. సీఎం సతీమణి అవినీతి మీకు కనిపించదా..?
సాక్షి, న్యూఢ్లిలీ: ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల అవినీతి కనిపించడం లేదా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ప్రశ్నించారు. బీజేపీ నేతల అవినీతిని బయట పెడతానంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చెందిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్యకు చెందిన కంపెనీలకు అక్రమంగా పీపీఈ కిట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. ‘‘పైగా ఒక్కో కిట్‌ను అసోం ప్రభుత్వం రూ.600కి కొంటుంటే భార్య కంపెనీకి రూ.990 చొప్పున చెల్లించేలా కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత దాన్ని రద్దు చేసి, కుమారుడు భాగస్వామిగా ఉన్న మరో కంపెనీకి ఒక్కో కిట్‌కు రూ.1,680 చెల్లించేలా కాంట్రాక్ట్ అప్పగించారు. ఇది అవినీతి కాదా?’’ అని ప్రశ్నించారు. వీటిపై హిమంత స్పందించారు. సిసోడియాపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడో ఏడేండ్ల కిందటి కేసును తిరగదోడి ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఆగమేఘాలపై ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ఇక ‘పీపీఈ కిట్ల’ స్కామ్‌లో బిశ్వశర్మపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని విపక్ష పార్టీలు మండిపడ్డాయి. పీపీఈ కిట్ల స్కామ్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక, 2020లో జరిగిన ఈ స్కామ్ సమాచార హక్కు చట్టం ద్వారా ఇటీవల వెలుగుచూసింది. అప్పుడు బిశ్వశర్మ ఆరోగ్యమంత్రిగా కొనసాగారు. ఇది కూడా చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది.. జై షా చక్రం తిప్పాడు..: బీజేపీ నేత కామెంట్స్ -
పీపీఈ కిట్ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి
కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. కేసుల సంఖ్య ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. రాఖీపై ఇంతలా ప్రశంసలు కురవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. తాజాగా రాఖీ సావంత్ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్‌కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్ ధరించి మార్కెట్ వెళ్లారు రాఖీ సావంత్. చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్ ధరించిన రాఖీ సావంత్.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొన్నారు. ఈ సమయంలో సదరు కూరగాయలమ్మే వ్యక్తిని మాస్క్ సరిగా ధరించమని సూచించారు. ఇక ఆమె షాపింగ్ అయిపోయిన తర్వాత రాఖీ ఒక్కసారిగా అరిచారు. ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రాఖీ సావంత్. అంతేకాక బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు. ఈ వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మాటలు చెప్పే రాజకీయ నాయకుల కన్నా మీరు చాలా బెటర్.. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
13 కోట్ల విలువైన చోరి.. కాపాడని పీపీఈ కిట్
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పీపీఈ కిట్ల వినియోగం బాగా పెరిగింది. సాధారణంగా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు ధరించే ఈ కిట్‌ని.. ఓ వ్యక్తి దొంగతనం చేయడానికి వాడి.. ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని చోరి చేశాడు. ట్విస్ట్ ఏంటంటే పీపీఈ కిట్ ధరించినప్పటికి పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక అతడు దొంగతనం చేసే సమయంలో నగల షో రూం బయట ఐదుగురు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉండటం గమనార్హం. వివరాలు.. కర్ణాటక హుబ్లీకి చెందిన మహ్మద్ షేక్ నూర్ అనే వ్యక్తి దక్షిణ ఢిల్లీ కల్క్‌జీలోని ఓ ఎలక్ట్రికల్ షాపులో పని చేస్తున్నాడు. ఇక అతడు పని చేసే షాపుకు ఎదురుగా ఓ బంగారు నగల షో రూం ఉంది. దాంతో అతడి మనసులో దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది. (చదవండి: అద్దె పిల్లలతో అతిథుల్లా వచ్చి.. ఆపై) ఇక తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటం కోసం పీపీఈ కిట్ ధరించి దొంగతనం చేయాలని భావించాడు. ఇక షోరూం బయట గట్టి కాపలా ఉండటంతో దాని ఎందురుగా ఉన్న భవనం మీదకు ఎక్కి.. అక్కడి నుంచి షో రూంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన నూర్ డెస్క్ మీద నుంచి అవతలి వైపుకు దూకి.. ఆభరణాల కోసం వెతికి.. దొరికిన కాడికి తీసుకుని షో రూం నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆటోలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు. ఇక అతడు షో రూంలో చేసిన విన్యాసాలు అన్ని సీసీటీవీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నూర్‌ని గుర్తించి అరెస్ట్ చేశారు. -
కోవిడ్ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్
జైపూర్: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఎన్నో పెళ్లిల్లు ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా సామాన్యులు పెళ్లి ఆలోచన మానేస్తే.. సెలబ్రిటీలు మాత్రం పెళ్లి పీటలేక్కారు. ఇక మహమ్మారి విజృంభణ కాలంలో వివాహం చేసుకున్న వారు కోవిడ్ నియమాలను పాటిస్తూ.. పెళ్లి తంతు ముగించారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కోవిడ్ కేర్ సెంటర్లో.. పీపీఈ కిట్లు ధరించి.. చేసుకున్న ఓ పెళ్లికి సంబంధించిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటుంది. రాజస్తాన్ కెల్వారా కోవిడ్ కేర్ సెంటర్లో ఈ వివాహ వేడుకు చోటు చేసుకుంది. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. తీరా పెళ్లి ముహుర్తం సమీపించాక ఆమెకి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో కరోనా కేర్ సెంటర్లో జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న వరుడు.. పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక ముందుగా అనుకున్న ముహుర్తానికే యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. (వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు) వధువు, వరుడు, పూజారితో పాటు మరోక వ్యక్తి ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వధువుకు కరోనా సోకడంతో ఆమెతో పాటు, పెళ్లి కుమారుడి, పూజారి, మరో వ్యక్తి నలుగురు పీపీఈ కిట్లు ధరించారు. ఇక వరుడు ఫేస్ షీల్డ్ కూడా ధరించాడు. పూజారి చెప్పిన విధంగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి తంతు ఆచరించారు. మూడ ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పీపీఈ కిట్లు ధరించి.. కోవిడ్ నియమాలు పాటిస్తూ.. జరిగిన ఈ వేడుక నెజినులను ఆకట్టుకుంది. కొత్త జంటను ఆశీర్వదించడమే కాక ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
పీపీఈ కిట్‌తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పీపీ కిట్‌తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతన్ని చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్ ధరించి కనిపించాడు. కనిపించిన వారందరిని పలకరిస్తూ దగ్గరకు వెళ్లాడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు అతను కోవిడ్ రోగిగా భావించి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలిసిన వైద్య అధికారులు తమ ఆసుపత్రిలో ఉన్న రోగులను సరి చూసుకున్నారు.అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు. చదవండి: ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు: కేటీఆర్ అయితే వ్యర్థాలతో పడేసిన పీపీఈ కిట్‌ను ధరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ షాక్‌కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించి వేశారు. -
విశాఖపట్నం: పీపీఈ కిట్‌తో హల్చల్..
-
పది గంటలపాటు గ్లౌజులు ధరిస్తే..
లక్నో: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ ఎంత హానికరంగా ఉందో తెలిసివచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో వైద్యుల కొరత ఎంత తీవ్రంగా ఉందో కరోనా సమయంలో అర్థమయ్యింది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుండగా.. మన దగ్గర మాత్రం 10,189 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అంటే 6 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విరుచుకుపడటంతో అరకొరగా ఉన్న వైద్య సిబ్బందిపై అదనపు భారం పడింది. అయినప్పటికి వారు వెనకడగు వేయలేదు. మహమ్మారిపై పోరాటంలో వారే ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’గా నిలిచారు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. అదనపు గంటలు పని చేస్తూ నిజమైన యోధులుగా నిలుస్తున్నారు. వైద్యం చేయడం ఒక ఎత్తయితే.. మహమ్మారి నుంచి రక్షణ కోసం పీపీఈ కిట్లు, గ్లౌజులు ధరించి గంటలపాటు విధులు నిర్వహించడం మరో ఎత్తు. (చదవండి: కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్) ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు పొందుతుంది. సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యువ వైద్యుడు ముడతలు పడిన తన చేతి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘కోవిడ్-19 వార్డులో దాదాపు 10 గంటలపాటు గ్లౌజులు ధరించడంతో నా చేతులు ఇలా అయ్యాయి’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో నెటిజనులను ఆకట్టుకుంటుంది. వెలకట్టలేని సేవ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఫైజాన్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఐదుగంటలకు ఒకసారి గ్లౌజులు మార్చాలి. ఇందుకు 5-7 నిమిషాల సమయం పడుతుది. కానీ చాలా సార్లు అది వీలుకాదు.. సమయం కూడా దొరకదు. ఎందుకంటే విధుల్లో మీరు ఒక్కరే ఉంటారు. పేషెంట్ దగ్గర ఇతర సిబ్బంది అందుబాటులో ఉండరు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మీరు వైద్యుడు, వార్డ్బాయ్, నర్స్ పాత్రలు కూడా పోషించాల్సి ఉంటుంది. నా షిఫ్ట్ అయిపోయింది.. ఇక నేను వెళ్తాను అనే పరిస్థితి కూడా ఉండదు’ అన్నారు సయ్యద్. (చదవండి: 26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి) My hands after doffing #PPE due to profuse sweating in extremely humid climate.#COVID19 #Covidwarrior #Doctor pic.twitter.com/wAp148TkNu — Dr Syed Faizan Ahmad (@drsfaizanahmad) August 24, 2020 అంతేకాక ‘ఇదంతా ఒక ఎత్తైతే ఇక పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించడం సవాలు వంటిది. చెమట పట్టి ముఖం మీదకు కారుతుంది. తుడుచుకోలేని పరిస్థితి. మాస్క్‌ను కూడా సరి చేసుకోలేం. ఇక తల మీద క్యాప్‌తో మరింత ఇబ్బంది. మొదట్లో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అలవాటయ్యింది. నేను సర్జన్‌ని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోవిడ్ డాక్టర్‌గా విధులు నిర్వహించాల్సిందే’ అన్నారు. ఎంత అలసిపోయినా.. ఇబ్బందులు ఎదుర్కొన్న పేషెంట్ల ప్రాణాలు కాపాడటంతో వాటన్నింటిని మర్చిపోతామన్నారు సయ్యద్. -
కరోనా అనుమానితుడు.. పీపీఈ కిట్ ధరించి
కోల్‌కతా: కరోనా వైరస్ మనిషిని చంపితే.. భయం మనలోని మానవత్వాన్ని చంపుతోంది. కళ్లెదుట మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నా దగ్గరకు వెళ్లి సాయం చేయట్లేం. కారణం వారికి కరోనా ఉంటే మనకు సోకుతుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఎవరికి వారే దూరంగా ఉంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ టీఎంసీ నాయకుడు చూపిన సాహసం ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశసంలు పొందుతుంది. వివరాలు.. గోపిబల్లవపూర్కు చెందిన అమల్ బారిక్(43) ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లాడు. లాక్డౌన్ కారణంగా సొంత ఊరికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గత 5-6 రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రి వెళ్లడానికి కూడా ఓపిక లేదు. దాంతో బారిక్ భార్య ఇరుగుపొరుగును సాయం కోరింది. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్, ప్రైవేట్ వాహనం బుక్ చేసుకునేంత ఆర్థిక స్థోమత లేదు వారికి. దాంతో ఏం చేయాలో తెలీక బాధపడుతోంది. (కరోనా జీవితం పోరాటంగా మారింది) అయితే ఈ విషయం గురించి గోపిబల్లవపూర్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సత్యకం పట్నాయక్‌కు తెలిసింది. దాంతో ఇతర కార్యకర్తలతో మాట్లాడి ఓ బైక్ ఏర్పాటు చేసుకున్నాడు. మెడికల్ షాప్‌కు వెళ్లి పీపీఈ కిట్ తెచ్చుకున్నాడు. అనంతరం బారిక్ ఇంటికి వెళ్లి అతడిని బైక్ మీద కూర్చోపెట్టుకుని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బారిక్‌ను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చి.. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని తెలిపారు. పట్నాయక్ తిరగి అతడిని ఇంటికి చేర్చాడు. పీపీఈ కిట్ ధరించి బైక్ మీద బారిక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలయ్యింది. దీని గురించి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘బారిక్ పరిస్థితి తెలిసి.. కామ్‌గా ఉండలేకపోయాను. నా కళ్ల ముందు ఎవరైనా బాధపడుతుంటే చూడలేను. దాంతో పీపీఈ కిట్ ధరించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాను’ అన్నాడు. (కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్) అంతేకాక ‘పాపం నేను అతడికి ఇంటికి వెళ్లేసరికి బారిక్ భార్య, ఇద్దరు కుమారులు అతడి పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తానని తెలిసి బారిక్ భార్య మాతో పాటు హస్పటల్‌కి వస్తానంది. కానీ ఆమెకు నచ్చచెప్పి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి తీసుకువచ్చాను. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వుంటే వారికి కూడా సాయం చేస్తాను. అందుకే మరో 4 పీపీఈ కిట్లు కూడా ఆర్డర్ చేశాను’ అని తెలిపాడు. పట్నాయక్ పీపీఈ కిట్ ధరించి బారిక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్‌ను ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. -
తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా సాయం విషయంలో కేంద్రం తెలంగాణకు భారీగానే చేయూతనందించింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. తెలంగాణకు కరోనా విషయంలో వైద్య పరంగా ఎలాంటి సహాయం అందించారో అన్న విషయంపై కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన కేంద్రం.. కరోనా సాయంలో భాగంగా తెలంగాణకు 1,400 వెంటిలేటర్లు, 10.9 లక్షల పీపీఈ కిట్లు, 2.44 లక్షల ఎన్–95 మాస్కులు, 42.50 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు అందజేసినట్లు వివరించింది. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే సంస్థకు ఈ ప్రొక్యూర్మెంట్–డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు.. ఆ సంస్థ ద్వారా మాస్కులు, కిట్లు ఇతర సాయాలు తెలంగాణకు పంపినట్లు తెలిపింది.(కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి) కుటుంబసభ్యులకు కరోనా బాధితుల సమాచారం గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. వైద్య ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రి పాలనా యంత్రాంగం, పలు విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉన్న బాధితుల సమాచారం తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రోజూ రెండుసార్లు బాధితుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
వివాహ వేడుకలో పీపీఈ కిట్లతో..
-
పెళ్లి వేడుకలో పీపీఈ కిట్లతో..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం వివాహ, ఇతర శుభకార్యాలను అతి తక్కువ మందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించారు. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు, అతిధులకు క్యాటరింగ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి భోజనాలు వడ్డించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యాటరింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..) ఈ వివాహ వేడుక కృష్ణా జిల్లా ముదినేపల్లిలో జరిగింది. గుడివాడకు చెందిన కోటి క్యాటర్స్ కరోనా కాలంలో ఇలా ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కావటంతో పరిమిత సంఖ్యలో పలు శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పీపీఈ కిట్లు ధరించి వివాహ కార్యక్రమాల్లో భోజనం అందిస్తున్నామని కోటి క్యాటర్స్ తెలిపారు. ఇక రాష్ట్రంలో వివాహం, పలు శుభకార్యాలు నిర్వహించుకోవాడానికి స్థానిక తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. (‘‘పెళ్లయ్యే వరకూ ఆగండి’’ ) -
కరోనాతో తల్లి మృతి.. పీపీఈ లేకుండానే!
మంబై : కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. మానవాళిని మహమ్మారిలా పీడిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో విషాద చాయలు మిగులుస్తోంది. తమ వారిని కోల్పోయి వారికి తీరని వేదనను గురిచేస్తోంది. తాజాగా అలాంటి వాటికి అద్దంపట్టే ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నగరంలోని బోరివాలకి చెందిన పల్లవి అనే మహిళకు(50) జూన్ 30న కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంతేగాక ఆమె భర్త సైతం కరోనా బారిన పడ్డారు. వీరికి 21 ఏళ్ల కుమారుడు కునాల్ ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృత్యువాత పడింది. తల్లి మరణ వార్తను కుమారుడికి చెప్పి వెంటనే ఆస్పత్రికి రావాలని కోరారు. (రెండుసార్లు కరోనా నెగిటివ్.. డాక్టర్ మృతి ) హుటాహుటిన అక్కడికి చేరిన యువకుడిని తన తల్లి శవాన్ని బ్యాగ్‌లో పెట్టేందుకు ఆస్పత్రి సిబ్బంది బలవంతం చేశారు. ఇందుకు ఆ యువకుడు తనకు పీపీఈ కిట్ ఇవ్వమని కోరినా.. అందుకు వారు నిరాకరించారు. ఒకవైపు తల్లి మరణ వార్తను తట్టుకోలేక తల్లడిల్లుతున్న యువకుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే కోవిడ్-19 వార్డులోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తల్లి మృతదేహాన్ని బ్యాగ్‌లోకి పెట్టేందుకు సహాయం అందిచాడు. (బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్) ఈ సంఘటను కునాల్ గుర్తు చేసుకుంటూ.. ‘ఆస్పత్రి సిబ్బంది పీపీఈ ఇవ్వడానికి నిరాకరించడం నాకు షాక్‌కు గురి చేసింది. పీపీఈ లేకుండా నేను కరోనా మృతదేహాన్ని ఎలా తాకాలని వారిని ప్రశ్నించాను. ఇందుకు వారు శరీరం బరువుగా ఉందని సాయం చేయాలని కోరారు. అక్కడుంది నా తల్లి, నాకు వేరే దారి లేదు. నా భయాన్ని పక్కన పెట్టి పీపీఈ లేకుండానే నా తల్లిని పట్టుకున్నాను’. అంటూ ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. ఆసుపత్రికి చెందిన ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (ఉబర్ ముంబై ఆఫీసు శాశ్వతంగా మూత?) -
భారీగా తగ్గిన పీపీఈ కిట్ల ధరలు
సాక్షి,హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లతో పాటుగా ఆర్టీ – పీసీఆర్ (కోవిడ్ టెస్టింగ్ కిట్ల) ధరలు భారీగా తగ్గాయి. లాక్డౌన్ ముందు వరకు దేశంలో అసలు ఈ కిట్ల ఉత్పత్తేలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వీటి ఉత్పత్తిలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. దీంతో పీపీఈ కిట్లతో పాటుగా కోవిడ్ టెస్టింగ్ కిట్ల ధరలు సుమారు 70%వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఒక్కొక్క 100 జీఎస్ఎం (గ్రాస్ స్క్వేర్ మీటర్) పీపీఈ కిట్ల ధర కొన్ని వారాల కింద రూ.600 ఉండగా ఇప్పుడు దాని ధర రూ.168కు పడిపోయింది. అదేవిధంగా ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్ల ధరలు గతంలోని రూ.1,700 నుంచి రూ.600 కు తగ్గిపోయింది. ప్రస్తుతం డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండటంతో పాటు వివిధ వినియోగ అవసరాలకు తగ్గట్టుగా పలురకాల ప్రమాణాలతో పీపీఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. వివిధ ప్రమాణాలకు సంబంధించిన కిట్లనే ఒక్కోదాన్ని రూ.300కు రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తుండగా, దాదాపు రెండు నెలల క్రితం దీని ధర రూ.900 వరకు ఉండేది. ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలున్న పీపీఈ కిట్ ధర కూడా రూ.1,200 నుంచి రూ.800 తగ్గిపోయినట్టుగా వీటి తయారీ సంస్థలు తెలిపాయి. చైనా తర్వాత మనమే.. పీపీఈ కిట్ల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉండగా దాని తర్వాతి స్థానంలో మనదేశం ఉంది. దేశంలో ప్రస్తుతం 600కు పైగా కంపెనీలు రోజుకు ఐదు లక్షల పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాయి. ఇక కోవిడ్ టెస్టింగ్ కిట్లను గతంలో రూ.1,700 వరకు వెచ్చించి ఒక్కో యూనిట్‌ను దిగుమతి చేసుకున్న పరిస్థితి నుంచి దేశంలో వీటిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాక రూ.600కే ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. భారత టెస్ట్ కిట్లు రూ.400కు, ఎక్స్ట్రాక్టర్, వైరల్ మీడియం రూ.200కు దొరుకుతున్నట్టుగా వైద్యపరికరాల ఉత్పత్తి సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని చిన్న కంపెనీలు, లఘు ఉత్పత్తిదారులు తమ యూనిట్లను మూసేశారు. ప్రస్తుతమున్న తక్కువ ధరలకు పీపీఈ కిట్లను ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కొన్ని వారాల క్రితం రూ.600 ఉన్న నాన్–వోవెన్ వాక్స్ కోటెడ్ 90 జీఎస్ఎం కిట్ ఇప్పుడు రూ.168కు లభిస్తుండటంతో ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటున్నారు. ఎగుమతి చేయాలనుకుంటున్న సంస్థలు దేశంలో పీపీఈ, ఆర్టీ–పీసీఆర్ కిట్ల ఉత్పత్తి జరుగుతున్నందున ఇతర దేశాలకు ముఖ్యంగా చిన్న, మూడో ప్రపంచదేశాలకు వీటి ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే బావుంటుందని కొన్ని పెద్ద కంపెనీలు కూడా భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అత్యున్నత నాణ్యతా ప్రమా ణాలున్న పీపీఈ కిట్లకు మంచి డిమాండ్ ఉన్నందున ఎగుమతి అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నాయి. -
అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్
‘‘అటాక్ మూవీ షూటింగ్ ప్రారంభమవుతోంది. ఆయనే మా డైరెక్టర్. మేమంతా భౌతిక దూరం పాటిస్తున్నాం. నాకెందుకో అంతరిక్షానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమిత తాను ఈరోజు షూటింగ్ కోసం విమానంలో ఢిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. మిషన్ఢిల్లీ హ్యాష్‌ట్యాగ్‌తో పీపీఈ కిట్ ధరించి ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అటాక్’ సినిమాలో జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి రకుల్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాతో పాటు అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కతున్న ఫ్యామిలీ డ్రామాలో నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ఇక లాక్డౌన్లో కుటుంబంతో సరదాగా గడిపిన రకుల్.. వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్‌తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మరింత చేరవయ్యారు. -
పీపీఈ కిట్లతో డ్యాన్స్ చేశారు
బెంగళూరు: దేశంలో కరోనా వ్యాప్తి బయటపడిన నాటి నుంచి పోలీసులు, వైద్యులు ఇళ్లకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమను తాము ఉత్సాహపర్చుకోవడం కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు ఓ నూతన మార్గాన్ని కనుగొన్నారు. పాత పాటలకు డ్యాన్స్ చేయడం, సహోద్యోగుల కోసం వంట చేయడం, మహిళలకు మెహందీ పోటీలు, పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తూ తమను తాము ఉత్సాహపర్చుకోవడమే కాక మిగతవారికి సంతోషాన్ని కల్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు ముగ్గురు.. 1960 నాటి హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో వైద్యులు ‘లిఖే జో ఖాత్ తుజే’ పాటకు డ్యాన్స్ చేశారు. వీరంతా గత వారం రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అస్మా బాను మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనా వైరస్ సోకిన వారిలో 18 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ధైర్యం నింపడం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల కోసం మెహందీ.. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నాము. విజేతలకు బహుమతులు కూడా ఇస్తాము. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, క్యారమ్ బోర్డులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక నేను డాక్టర్ బాలాజీ పైతో కలిసి మాకు కేటాయించిన గదిలో ఆహారాన్ని వండి ఇతర సిబ్బంది అందజేస్తున్నాం’ అని తెలిపారు -
బీజేపీకి బిందాల్ రాజీనామా ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యంలో వైరస్ల బారిన పడకుండా రక్షించుకునేందుకు వైద్య సిబ్బంది ధరించే ‘పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్వీప్‌మెంట్ (వ్యక్తిగత రక్షణ పరికరాలు)’ సేకరణలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హిమాచల్‌ప్రదేశ్ ‘డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ అజయ్ గుప్తాను మే 22వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అయిదు రోజుల అనంతరం ‘నాపై ఏ రకమైన ఒత్తిడి లేకపోయినప్పటికీ, కేసుపై ఎలాంటి ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఉన్నతాశయాలకు కట్టుబడి నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ రాజీనామా చేశారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. వైద్య రంగానికి చెందిన కొనుగోళ్లు చేయడానికి ఇతర రాష్ట్రాల్లోలాగా హిమాచల్‌కు ప్రత్యేక వైద్య కొనుగోళ్ల కార్పొరేషన్ అంటూ ఏదీ లేదు. అందుకని అజయ్ గుప్తా నాయకత్వంలో ఏర్పాటైన సాంకేతిక కమిటీయే కొనుగోళ్ల వ్యవహారాలు చూస్తోంది. కరోనా అత్యయిక పరిస్థితి కారణంగా ఎలాంటి బిడ్డింగ్‌లను పిలువకుండా చండీగఢ్‌లోని ‘బయోఏడ్ కార్పొరేషన్’ నుంచి 84 లక్షల రూపాయలకు ఆరువేల పీపీఈలు, కురుక్షేత్రంలోని ‘బన్సాల్ కార్పొరేషన్స్’ నుంచి 73.5 లక్షల రూపాయలకు ఏడువేల పీపీఈలు కమిటీ ఆధ్వర్యంలో అజయ్ గుప్తా కొనుగోలు చేశారు. ఇంతలో పృధ్వీసింగ్ అనే వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయలు లంచంగా తీసుకొని ఆయనకు పీపీఈల కొనుగోలు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఓ ఆడియో వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు దర్యాప్తును చేపట్టిన ‘స్టేట్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో’ పోలీసులు మే 22వ తేదీన గుప్తాను అరెస్ట్ చేశారు. లంచం తీసుకున్న వారితోపాటు లంచం ఇచ్చిన వారు కూడా నేరస్థులేనని, కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని దర్యాప్తు విభాగం పోలీసు సూపరిండెంటెంట్ షాలినీ అగ్ని హోత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా మీడియాకు తెలిపారు. ఈ కేసులో నేటికి కూడా పృధ్వీసింగ్ను అరెస్ట్ చేయక పోవడమే అసలైన వార్త. అసలు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకు బీజేపీ పదవికీ రాజీనామా చేసిన రాజీవ్ బిందాల్‌కు సంబంధం ఏమైనా ఉందా?! (అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు!) రాజీవ్ బిందాల్‌కు సబంధం ఏమిటీ? రాజీవ్ బిందాల్ కూతురు స్వాతీ బిందాల్ గాంధీ, అల్లుడు రాజ్‌కుమార్ గాంధీలు కలిసి సోలన్‌లో ‘అపెక్స్ డయాగ్నోస్టిక్ ల్యాబ్’ నిర్వహిస్తున్నారు. వారి బిజినెస్ కార్డులపై భార్యభర్తలైన ఇద్దరు గాంధీల పేర్లతోపాటు మార్కెటింగ్ మేనేజర్‌గా ‘పృధ్వీ సింగ్’ పేరుంది. ఆడియోలో గుప్తాతో మాట్లాడిన పృధ్వీ సింగ్ ఈయనేనని, పృధ్వీ సింగ్, ఆడియో టేపులోని స్వరం ఒకలాగే ఉన్నాయంటూ స్థానిక పత్రికలు ఆరోపించగా, తమకు సంబంధం లేదంటూ ముగ్గురు ఖండించారు. ప్రాథమిక ఆధారాలు పరిగణలోకి తీసుకొని పృధ్వీ సింగ్‌ను అరెస్ట్ చేసి, విచారించాల్సిన పోలీసులు, ఆయన జోలికి వెళ్లడం లేదు. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. 73 లక్షల రూపాయల పీపీఈ పరికరాలను సరఫరా చేసిన ‘బన్సాల్ కార్పొరేషన్’ అనే సంస్థనే కురుక్షేత్రలో లేదు. కాకపోతే ఆ పేరును పోలిన ‘బన్సాల్ సేల్స్ కార్పొరేషన్, బన్సాల్ పాలిమర్స్’ అనే రెండు సంస్థలు ఉన్నాయి. ఆ రెండు కంపెనీలు కూడా పీపీఈలను హిమాచల్‌కు సరఫరా చేయలేదని స్పష్టం చేశాయి. పైగా ఆ రెండు కంపెనీలు పీపీఈలనే ఉత్పత్తి చేయడం లేదు. పృధ్వీ సింగ్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మీడియా ప్రశ్నలకు పోలీసు అధికారులు మౌనం పాటిస్తుండగా, బీజేపీ నేత రాజీవ్ బిందాల్ తనకేమి సంబంధం లేదని ముక్తిసరిగా చెబుతూ బిజీ బిజీ అంటూ మొహం చాటేస్తున్నారు. పృధ్వీ సింగ్‌కు, రాజీవ్ బిందాల్‌కు సంబంధం లేకుండా బీజీపీ అధ్యక్ష పదవికి బిందాల్ ఎందుకు రాజీనామా చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుల్దీప్ రాథోడ్, హిమాచల్ సీపీఎం శాసన సభ్యుడు రాకేష్ సింగా ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాశయాలకు కట్టుబడి రాజీనామా చేశానని బిందాల్ స్పష్టం చేశారు. వైద్య పరికరాల సేకరణలో అవినీతి జరిగితే ఉన్నత ఆశయాల మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలిగానీ బిందాల్ రాజీనామా చేయడం ఎందుకు?! (భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు!) -
44డిగ్రీల ఎండలో..25 నిమిషాల పాటు
భోపాల్: బయట ఎండలు దారుణంగా ఉన్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలో కాస్తా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒళ్లంతా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు సేవలందించే వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఓ సారి ఊహించుకొండి. ఒంటి మీద పీపీఈ కిట్ వేడి.. బయట ఎండకి తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు ఓ ఆరోగ్య కార్యకర్త. దారుణం ఏంటంటే అతడు పని చేసే ఆస్పత్రి యాజమాన్యం సదరు వ్యక్తికి చికిత్స అందించడానికి నిరాకరించింది. దాంతో దాదాపు 25 నిమిషాల పాటు 44 డిగ్రీల ఎండలో ఆ వ్యక్తి అలానే ఉన్నాడు. తర్వాత అతని సహోద్యోగి ఒకరు మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు. వివరాలు.. హిరలాల్ ప్రజాపతి అనే వ్యక్తి 108 అంబులెన్స్‌కు అనుబంధ ఉద్యోగిగా బుండేల్ఖండ్ మెడికల్ కాలేజీ(బీఎంసీ)లో పని చేస్తున్నాడు. టీబీ హాస్పిటల్ నుంచి బీఎంసీకి కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులను తీసుకెళ్లే విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో విధుల్లో ఉన్నంతసేపు ప్రజాపతి పీపీఈ కిట్ ధరించి ఉంటాడు. దాంతో అధిక వేడికి తట్టుకోలేక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎంసీ ప్రాంగణంలో కుప్పకూలాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం ప్రజాపతికి చికిత్స అందించడానికి నిరాకరించడంతో దాదాపు 25నిమిషాల పాటు అలా ఎండలోనే ఉండిపోయాడు. (‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’) అనంతరం ప్రజాపతి సహోద్యోగి ఒకరు పారామెడికల్ సిబ్బంది సాయంతో అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బీఎంసీ అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వల్ల విమానాశ్రయాలు, విమానం లోపల పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విమానాయన సిబ్బంది తొలి రోజు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ‘రెండు నెలల తర్వాత ప్రయాణం చేస్తున్నాము. పద్దతుల్లో ఎలాంటి మార్పు లేదు.. విమానాలు సమాయానికి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.. మేం కాక్‌పిట్‌లో ఉన్నాం కాబట్టి చాలా భద్రంగా ఉన్నాము’ అని పైలెట్, కో పైలెట్ తెలిపారు. (ముఖానికి మాస్కులు.. షీల్డులు) అయితే క్యాబిన్ క్రూ మాత్రం పీపీఈ కిట్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘మా యూనిఫామ్‌లు చాలా సౌకర్యంగా ఉండేవి. అసలే వేసవి, అధిక ఉష్ణోగ్రత ఇలాంటి సమయంలో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉంది. గాలి సరిగా ఆడదు. కొన్ని సార్లు చెమట పట్టి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా అత్యసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించడానికి కుదరదు. అయితే ప్రస్తుతం విమానం లోపల ఆహారం, కూల్‌డ్రింక్‌లు వంటివి అనుమతించకపోవడం వల్ల మా పని కాస్తా సులువు అయ్యింది’ అన్నారు. (కరోనా ప్రభావమే ఎక్కువ..) విమానాశ్రయం లోపల కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రయాణికుల వస్తువులను ఓ డిసిన్ఫెక్టెంట్ కన్వేయర్ బెల్టు గుండా వెళ్లాయి. ప్రయాణికులు రాగానే భద్రతా సిబ్బంది వారి గుర్తింపు కార్డులు చూపించమని కోరారు. సిబ్బంది భద్రత కోసం విమానాశ్రయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు కూడా పూర్తి శరీర రక్షణ సూట్లు ధరించారు. ఓ వ్యక్తి మా తాతను కలవడానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాను. రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.(విడతలుగా విమాన సర్వీసులు?) కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.(630 విమానాలు రద్దు) -
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక సీఎం జగన్
-
ముఖానికి మాస్కులు.. షీల్డులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో దేశీయంగా నిల్చిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది డ్రెస్ కోడ్‌లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారు కూడా ముఖానికి మాస్కులు, ఫేస్ షీల్డులు, గౌన్లు వంటి వ్యక్తిగత భద్రత సాధనాలను (పీపీఈ) ఉపయోగించనున్నారు. విధుల నిర్వహణలో ప్రయాణికులకు దగ్గరగా తిరిగే సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆహార్యాన్ని అమలు చేయాలని ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27న ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా ఆవిష్కరించిన డ్రెస్ కోడ్ తరహాలోనే ఇది కూడా ఉండవచ్చని వివరించాయి. ఫేస్ షీల్డు, ఫేస్ మాస్కుతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఎరుపు రంగు ఫుల్ బాడీ సూట్‌ను ఫిలిప్పీన్స్ ఎయిర్ఏషియా రూపొందించింది. ఎయిర్ఏషియా తమ సిబ్బంది.. పీపీఈ కిట్ కింద ఫేస్ షీల్డులు, మాస్కులు, గౌన్లు, ఆప్రాన్స్, గ్లౌజులు ధరించవచ్చని తెలుస్తోంది. విస్తార సంస్థ సిబ్బంది కొత్త డ్రెస్ కోడ్‌లో ల్యాప్ గౌన్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డులు ఉండవచ్చని సమాచారం. అటు ఇండిగో సిబ్బంది గౌను లేదా బాడీ సూట్‌తో పాటు సర్జికల్ మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డు ధరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎయిరిండియా ఉద్యోగులు కూడా బాడీ సూట్, గ్లౌజులు, ఫేస్ షీల్డు, ఫేస్ మాస్క్ ఉపయోగించనున్నారని తెలిపాయి. -
సెలూన్ షాప్‌లో పీపీఈ కిట్లు..
అహ్మదాబాద్ : కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఓ సెలూన్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. కస్టమర్లకు హెయిర్ కట్ చేసే సమయంలో కరోనా సోకకుండా ఉండేందకు రక్షణగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్లను ధరిస్తున్నారు. గుజరాత్ నడియాద్లోని ఓ సెలూన్ షాప్ యజమాని.. తన షాప్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఆ సెలూన్ షాప్‌లోకి సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి కస్టమర్లకు హెయిర్‌కట్ చేస్తున్నారు. హెయిర్ కట్ చేసే సిబ్బంది పూర్తి స్థాయి పీపీఈ కిట్లు ధరించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆ సెలూన్‌కు వస్తున్న కస్టమర్లు కూడా ముఖానికి మాస్క్‌లు ధరించడంతోపాటుగా, భౌతిక దూరం నిబంధనను విధిగా పాటిస్తున్నారు. దీనిపై ఆ సెలూన్ షాప్ యజమాని విశాల్ మాట్లాడుతూ.. తమ సిబ్బందికి, కస్టమర్లకు కరోనా సోకకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్టు తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తికి అడ్డకట్టవేయడంలో పీపీఈ కిట్లు కీలక భూమిక పోషిస్తాయనే సంగతి తెలిసిందే. కేవలం కరోనా చికిత్స కేంద్రాలలోనే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా వీటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తే కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. (చదవండి : జూమ్ కాల్‌తో 3700మందికి ఉబెర్ ఉద్వాసన) -
'నాతో చేయి కలపండి.. వారికి సాయం చేద్దాం'
ముంబై : కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బంది కోసం వెయ్యి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేర్కొంది. ఈ సందర్భంగా తన ఫేస్బుక్లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. ' కోవిడ్-19పై వైద్యులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ సైనికులు బోర్డర్లో నిలబడి దేశ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకోసం కోసం కాపలా కాస్తున్నారు. ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తున్న వైద్యులు కూడా అలాగే కనిపిస్తున్నారు. కరోనా రోగులతో వైద్యులు క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నారు. వీరిలో ప్రాణాంతక వైరస్ ఒక్కరికి సోకినా అది పెద్ద ప్రమాదానికి తీస్తుంది. దీంతో పాటు క్వారంటైన్లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుపత్రులు నిండిపోతాయి. మనకోసం ఇంతచేస్తున్న వైద్యులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అందుకోసమే పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణక మొదలు పెట్టాను. నాకు తోడుగా సినీ నిర్మాత మనీష్ ముంద్రా, ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ అండగా ఉన్నారు. రండి నాతో చేయి కలపండి.. మీ అందరి సహకారం ఉంటే మన హీరోలకు మరింత సాయం చెయ్యొచ్చు' అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 26వేలకు చేరుకోగా, 800కు పైగా మృతి చెందారు. (మా ఇంటికాడ కరోనా పరీక్షలా?) -
కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌కు పటిష్టమైన ఆరోగ్య నిఘా వ్యవస్థ ఉంది. అది కరోనా వైరస్‌ను దేశ సరిహద్దు లోపలికి రానీయదు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ఫిబ్రవరి 22వ తేదీనా వ్యాఖ్యానించారు. జనవది 30వ తేదీనే దేశంలో తొలి కరోనా కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఆరోగ్య అత్యయిక పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయనే మార్చి 13వ తేదీన మరో ప్రకటన చేశారు. దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ యూపీఏ–1 ప్రభుత్వం ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్లు’ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. (వావ్.. క్వారంటైన్ ఫ్యాషన్ వీక్ చూశారా?) మరి ఇప్పుడేమైందీ? కరోనా వైరస్ యావత్ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేయడం లేదా ? హెల్త్ ఎమర్జెన్సీ కింద దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడం లేదా ? కేంద్ర ఆరోగ్య శాఖ అప్పుడే స్పందించి ఉంటే నేడు దేశంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)గా పేర్కొనే మాస్క్‌లు, గ్లౌజులు, సేఫ్టీ గ్లాసెస్, కవరాల్ సూట్ల కొరత వచ్చేది కాదు కదా! వీటి కొరత కారణఃగా వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ‘యునైటెడ్ రెసిడెంట్ అండ్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా’ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. పీపీఈల తయారీకి టెండర్లను ఖరారు చేయడంలో కూడా ఎంతో ఆలస్యం జరిగిందని రెండు అతిపెద్ద పీపీఈ ఉత్పత్తి కంపెనీల సంఘాలు ఆరోపించడం కూడా ఇక్కడ గమనార్హం. (ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయి? ) ‘అవును, పీపీఈలు చాలినన్ని లేవు. కొరత ఎక్కువగానే ఉంది’ అన్న విషయాన్ని మార్చి 18వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర జౌళీ శాఖ అంగీకరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పీపీఈలను ఉత్పత్తిచేసే అనేక కంపెనీలు ‘లాక్డౌన్’ కారణంగా మూతపడ్డాయి. దేశంలో వైద్యరంగానికి జీడీపీలో కొంత శాతాన్ని కేటాయిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి నెలలోనే ప్రకటించారు. అది జరిగి ఉన్నా దేశంలోని వైద్య రంగం కొంత బలపడి ఉండేది. (కరోనా మనకు కొత్త పాఠాలు నేర్పింది: మోదీ ) -
చైనా నుంచి మరో 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
బీజింగ్: కోవిడ్–19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను భారత్‌కు పంపినట్లు చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కిట్లను గ్వాంగ్ఝౌ నుంచి విమానంలో రాజస్తాన్, తమిళనాడుకు పంపామన్నారు. చైనా గతవారం 6.50 లక్షల యాంటీబాడీ కిట్లు, ఆర్ఎన్ఏ కిట్లను భారత్‌కు పంపింది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది రక్షణ కోసం భారత్ ఇప్పటికే 1.50 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ దుస్తుల కోసం చైనా కంపెనీలకు ఆర్డరిచ్చింది. అయితే, చైనా తయారీ వైద్య పరికరాల నాణ్యతపై వస్తున్న అనుమానాలపై చైనా ప్రభుత్వం స్పందించింది. వీటిని ప్రముఖ సంస్థలు తయారు చేస్తున్నందున నాణ్యతపై ఎలాంటి అనుమానాలు వద్దని ఆయా దేశాలకు హామీ ఇచ్చింది.