pitition
-
వాసుదేవరెడ్డి కేసులో పూర్తి వివరాలివ్వండి..
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్)కు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను తరలించారంటూ ఆ సంస్థ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డిపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న వాసుదేవరెడ్డి అభ్యర్థనపట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ విచారణను 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్.. ఏపీఎస్‌బీసీఎల్ కార్యాలయం నుంచి ఆ సంస్థకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తీసుకెళ్లారని, ఇవన్నీ ఆయన తన కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఈనెల 6న వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతాం.. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఈ కేసులో తాను సీఐడీ తరఫున హాజరవుతున్నానని తెలిపారు. ఈ కేసు మొదటిసారి విచారణకు వస్తోందని, అందువల్ల వివరాల సమర్పణకు గడువునివ్వాలని కోర్టును కోరారు. ఈ సమయంలో వాసుదేవరెడ్డి తరఫు న్యాయవాది ఎస్. నగే‹Ùరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.చంద్రబాబుపై ఫిర్యాదు చేసినందుకే కేసు.. నిజానికి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబుపై పిటిషనర్ వాసుదేవరెడ్డి గతంలో ఫిర్యాదు చేశారని, ఈ కక్షతోనే అతనిపై ఇప్పుడు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్తున్నట్లు ఫిర్యాదు అందగా, రాత్రి 11.30కి సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఆ మరుసటి రోజు 200 మంది పోలీసులు వాసుదేవరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారని.. పోలీసులకు ఏమీ దొరకలేదని, ఆయన పిల్లల ల్యాప్‌టాప్‌లను జప్తు చేశారని వివరించారు. పిటిషనర్‌పై ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసులే ఉన్నాయని, అందువల్ల ఆయన విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏను అనుసరించి నడుచుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. పోసాని జోక్యం చేసుకుంటూ, పిటిషనర్‌పై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఐపీసీ సెక్షన్లు 409, 467, 471 కింద కూడా కేసు నమోదు చేశామని, ఇవన్నీ ఏడేళ్లు అంతకు మించి శిక్షపడే కేసులేనన్నారు. అందువల్ల 41ఏ ప్రకారం నడుచుకోవడం సాధ్యంకాదన్నారు.ఫిర్యాదులో గుర్తుతెలియని వ్యక్తి అని ఉంది.. నగేష్ రెడ్డి స్పందిస్తూ.. ఫిర్యాదులో ఎక్కడా వాసుదేవరెడ్డి కారు నెంబర్ లేదని, ఎఫ్ఐఆర్లో చేర్చారన్నారు. ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు అని ఉంటే, ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరును చేర్చారన్నారు. ఇది పూర్తిగా తప్పుడు కేసన్నారు. సోదాలు జరిగిన రోజు పిటిషనర్ ఢిల్లీలో ఉన్నారన్నారు. పోసాని స్పందిస్తూ.. వాసుదేవరెడ్డి మామ, బావమరిది ఇళ్లలో సోదాలు నిర్వహించామని, వాసుదేవరెడ్డి కారులో కీలక పత్రాలు స్వా«దీనం చేసుకుని సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. సోదా చేసిన కారులో రూ.4 కోట్ల విలువచేసే 6 కేజీల బంగారం కొనుగోలు తాలుకు బిల్లులు, వాసుదేవరెడ్డి ఐడీ కార్డు దొరికాయన్నారు. ఈ వివరాలను మేజి్రస్టేట్ ముందుంచామన్నారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారు..ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను 18కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నగేష్ రెడ్డి జోక్యం చేసుకుంటూ, అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అభ్యరి్థంచారు. లేకుంటే ఈలోపు పిటిషనర్‌ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్ స్వా«దీనం చేస్తామన్నారు. అయితే, మధ్యంతర ముందస్తు బెయిల్ అభ్యర్థనను పోసాని తీవ్రంగా వ్యతిరేకించారు. వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, బేవరేజస్ కార్పొరేషన్లో అతని సహచరులు ఇంకా ఉన్నారని, వారి ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. దీంతో.. మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
వివేకా హత్య కేసులో అజేయ కల్లం పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హై కోర్టు
-
వైఎస్ సునీత పిటిషన్ పై విచారణ జులై 3కు వాయిదా
-
యడ్డి, తనయుడిపై లోకాయుక్తలో కేసు
శివాజీనగర: బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. యడ్డి, ఆయన తనయుడు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన బీ.వై.విజయేంద్రలపై కేసు నమోదైంది. వివరాలు.. యడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) పనుల కాంట్రాక్టు మంజూరులో భారీగా ముడుపులు తీసుకున్నారని టీజే అబ్రహాం అనే సామాజిక కార్యకర్త కోర్టులో ప్రైవేట్ కేసు వేయగా కోర్టు తిరస్కరించింది. అబ్రహాం హైకోర్టులో సవాల్ చేయగా, ఆయన పిటిషన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఇటీవల ప్రజా ప్రతినిధుల కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవాలనీ యడ్డి అన్నారు. (చదవండి: IRTC Scam: తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయండి) -
ప్రధాని ఫోటో తొలగించాలంటూ పిటిషన్.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు!
PM Photo On Vaccination Certificate: కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని చిత్రాన్ని ఉపయోగించడం వల్ల ఉపయోగం లేదా ఔచిత్యం లేదంటూ పిటిషనర్ పీటర్ మైల్‌పరంబిల్ అక్టోబర్ నెలలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఈ పిటిషన్ విచారణ సంధర్బంగా హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్ వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందని, ప్రజా ప్రయోజనాల కోసం కాదని కేవలం ప్రచారం కోసమేనని కోర్టు పేర్కొంది. (చదవండి: ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు నవ్వకూడదట!!) ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టీస్ పీవీ కున్హికృష్ణన్ మాట్లాడుతూ... "ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని గానీ బీజేపీ ప్రధాని అని గానీ లేదా ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానీ ఎవరూ చెప్పలేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఒకసారి ప్రధాని పదవికి ఎన్నికైతే ఆయనే మన దేశానికి ప్రధానమంత్రి." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వ విధానాలపైన లేదా ప్రధాన మంత్రి రాజకీయ వైఖరిపై కూడా విభేదించవచ్చు. కానీ పౌరులకు ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధానమంత్రి ఫోటోతో కూడిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకువెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అన్నారు. ప్రజా తీర్పుతోనే మోదీ ప్రధాని అయ్యారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌కి హైకోర్టు రూ. 1 లక్ష జరిమానాను విధించింది. పైగా ఆరు వారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కెఎల్‌ఎస్‌ఎ)కి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతని ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు కోర్టులో తీవ్రమైన కేసులు నమోదవుతున్నప్పుడు, అలాంటి అనవసరమైన పిటిషన్లను ప్రోత్సహించలేము అని కూడా హెచ్చరించింది. (చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!) -
మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్
సాక్షి, చెన్నై: మదురై కేంద్ర కారాగారంలో రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు న్యాయవాది పుగలేంది మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. ఖైదీలు సిద్ధం చేసిన వస్తువుల్ని ప్రభుత్వ ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు తరలించినట్టుగా గణాంకాల్లో జైళ్లశాఖపేర్కొని ఉన్నట్టు సమాచార హక్కు చట్టం మేరకు వివరాల్ని పుగలేంది సేకరించారు. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) ఈ లెక్కలు తప్పుల తడకగా ఉండడంతో కోర్టు తలుపు తట్టారు. మదురై కారాగారంలో 2016–2020 మార్చి వరకు రూ. వంద కోట్లు అవినీతి జరిగినట్టు, జైళ్ల శాఖలోని కొందరి మాయా జాలంతో ప్రభుత్వం నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హోం శాఖ, జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సూచించారు. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న గణాంకాలే అవినీతి జరిగినట్టు స్పష్టం చేస్తున్నాయని, తక్షణం కేసును ఏసీబీ విచారణకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ సాధ్యమైనంతవరకు త్వరిగతిన విచారణకు వచ్చే అవకాశం ఉంది. (చదవండి: అయ్! బాబోయ్!.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదరా!) -
హైకోర్టులో ఏఆర్ రెహ్మాన్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్ రెహ్మాన్ 2000 సంవత్సరంలో ఒక సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాళియప్పన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. తాను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదని, ఏఆర్ రెహ్మాన్ మాత్రం లబ్ధి పొందారని..తనకు నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని కాళియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి ఆర్.సుబ్రమణియం శుక్రవారం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకు ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి పిటిషన్‌దారుడు తరఫు న్యాయవాది వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి గురువారమే పిటిషన్ దాఖలు ప్రక్రియ పూర్తైందని, పిటిషన్‌కు నెంబరు కేటాయింపు లాంటి అంశాలు న్యాయస్థానం పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపధ్యంలో కౌంటింగ్‌కు అనుమతించాలంటూ పిటిషన్లో అభ్యర్థించినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదికిపైగా ఎన్నికల ప్రక్రియ.. వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏడాదికిపైగా సుదీర్ఘంగా కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసి తుది అభ్యర్ధుల జాబితాలు ఖరారైన తర్వాత అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా పేరుతో ఆ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలోనే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నా నిమ్మగడ్డ కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారన్న ఆరోపణలున్నాయి. నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 8వతేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, టీడీపీ, జనసేన తదితర పార్టీలు పరిషత్ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయిన ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు వెలువరించింది. గెలిచినా ఏడాదిగా నిరీక్షణ.. 2020 మార్చిలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. హైకోర్టు తాజా తీర్పు తర్వాత కూడా ఆ ఏకగ్రీవాలన్నీ యధాతథంగానే కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతంలోనే స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత కూడా దాదాపు ఏడాదికిపైగా వారంతా పదవీ బాధ్యతలు చేపట్టకుండా ఎదురుచూస్తూనే ఉన్నారు. 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పరిషత్ ఫలితాలతో లింక్ శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 11 ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి కావాలని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు జిల్లాలవారీగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ ఖాయంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మండలిలో అధికార వైఎస్సార్సీపీ బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ పరిషత్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉస్మానియా కూల్చివేతపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉస్మానియా పురాతన కట్టడం అని దానిని కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరిందని, దానిని తొలగించి నూతన భవనం నిర్మిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. కొత్త నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఎర్రమంజిల్ భవనంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన పిటిషనర్లు ఈ తీర్పు ఉస్మానియాకు కూడా వర్తిస్తుందని వాదించారు. పురాతన కట్టడాన్ని కూల్చివేయకుండా పక్కన ఉన్న16 ఎకరాల స్థలంలో నూతన నిర్మాణం చేపట్టాల్సిందిగా పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రి సైట్‌కి సంబంధించిన మొత్తం గూగుల్ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి హైకోర్టు వాయిదా వేసింది. (‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’) -
ఆన్లైన్ క్లాస్‌ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక ఆన్లైన్ క్లాసుల వల్ల ఆర్థికంగా వెనుకబడిన వారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఈ నెల 13వ తేదీలోగా లిఖితపూర్వకంగా నిర్థిష్ట ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. (‘కొత్త బిల్లుతో మూడు రకాల నష్టాలున్నాయి’) అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్‌పై ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోషియేషన్ ఇంప్లీడ్(ఇస్మా) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించిందని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం లేదని, ఇది వారికి ఆప్షన్ మాత్రమేనని ఇస్మా పిటిషన్లో పేర్కొంది. సీబీఎస్ఈపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని ఇస్మా న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇస్మాకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. (కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?) -
షాదీ. కామ్‌లో ఇకపై ఆ ఆప్షన్ ఉండదు
ప్రముఖ మ్యాట్రియమోనియల్ వెబ్సైట్ షాదీ. కామ్ తన వెబ్సైట్ నుంచి కలర్ ఫిల్టర్‌ను తొలిగించింది. స్కిన్‌టోన్ ఆధారంగా భాగస్వామిని ఎంపిక చేసుకునే ఆప్షన్‌పై ఆన్లైన్లో పిటిషన్ దాఖలవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కావాలని చేసింది కాదని ఏదో పొరపాటు జరిగిందని సదరు వెబ్సైట్ వివరణ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జాత్యాంహకారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షాదీ.కామ్ వెబ్‌సైట్‌పై వివాదం చర్చనీయాంశమైంది. దీని ప్రకారం భాగస్వామిని ఎంపిక చేసుకునేముందు సదరు వ్యక్తి వాళ్ల చర్మరంగు ఏదో సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫెయిర్, వైటీష్, డార్క్ వంటి ఆప్షన్లుంటాయి. తద్వారా స్కిన్‌టోన్ ఆధారంగా వారికి తగ్గ జోడీలు దర్శనమిస్తాయన్నమాట. దీంతో ఈ అంశంపై వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి లఖాని అనే మహిళ ఆన్లైన్లో సదరు వెబ్‌సైట్‌పై పిటిషన్ దాఖలుచేసింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని రంగు ఆధారంగా భాగస్వామిని ఎలా సెలక్ట్ చేస్తారంటూ మండిపడింది. అంతేకాకుండా ఈ ఫిల్టర్‌ను వెబ్సైట్ నుంచి శాశ్వతంగా తొలిగించాలని డిమాండ్ చేసింది. లఖానీ దాఖలు చేసిన పిటిషన్‌పై దాదాపు 1600కి పైగానే ప్రజలు సంతకాలు చేసి తమ మద్దతు ప్రకటించారు. (మహిళ ఉద్యోగిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోండి ) -
మద్యం దుకాణాలపై పిటిషన్.. రూ.లక్ష ఫైన్
ఢిల్లీ : కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మద్యం షాపులు తెరవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా పిటిషనర్‌పై లక్ష రూపాయల జరిమానా విధించింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం, మస్కులు ధరించడం లాంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున లిక్కర్ షాపులు తక్షణం మూసి వేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. గౌతమ్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయని, ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం షాపుల ముందు ప్రజలు బారులు తీరుతున్నందున ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ-టోకెన్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కేజ్రివాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం..టోకెన్ నెంబర్ ఆధారంగా వారిచ్చిన సమయంలోనే మద్యం కొనాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ముందుగానే వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా టోకెన్ నెంబర్ ఇస్తారు. (మందుబాబుల కోసం సరికొత్త వ్యూహం ) -
నిమ్మగడ్డ తొలగింపు విచారణ రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు రేపటి(బుధవారం)కి వాయిదా వేసింది. మంగళవారం పిటిషనర్ల వాదనలను సుదీర్ఘంగా విన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణలతో కూడిన బెంచ్ విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బుధవారం(ఏప్రీల్ 29)న హైకోర్టులో మరోసారి నిమ్మగడ్డ తొలగింపుపై వాదనలు కొనసాగనున్నాయి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై ఏపీ ప్రభుత్వం గతవారం తుది కౌంటర్‌ను హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో తుది అఫిడవిట్ టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ? -
పాప్ సింగర్ జెన్నీఫర్‌పై కేసు
న్యూయార్క్: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్పై మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో సోమవారం కేసు నమోదైంది. ప్రముఖ న్యూయార్క్ ఫొటో గ్రాఫర్ స్టీవ్ సాండ్స్ తీసిన ఫొటోను అనుమతి లేకుండా జెన్నీ సోషల్ మీడియాలో ఫోస్టు చేసిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేగాక జెన్నీ నుంచి తనకు రూ. 1.14 కోట్ల నష్టాపరిహరాన్ని కూడా ఇప్పించాలని సాండ్స్ కోర్టును విజ్ఞప్తి చేశాడు. (నా భర్త కరణ్‌లా ఉంటే ఇష్టపడను) దీనిపై సాండ్స్ తరపు న్యాయవాది రిచర్డ్ లీబోవిట్జ్ మాట్లాడుతూ.. ‘గాయని జెన్నీఫర్ లోపెజ్ అనుమతి లేకుండ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని ఫొటోగ్రాఫర్ సాండ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేగాక జెన్నీ నుంచి తనకు రూ. 150,000 డాలర్లనష్ట పరిహారంతో పాటు న్యాయవాది ఫీజును కూడా ఇప్పించాలని పిటిషన్లో పేర్కొన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక జెన్నీఫర్ సోంత నిర్మాణ సంస్థ నుయోరికాన్ ప్రోడక్షన్ బ్రాండ్ ప్రమోషన్ కోసమే తన ఫొటోను వాడుకుందని సాండ్స్ పిటిషన్లో పేర్కొన్నట్లు చెప్పాడు. తన ఫొటోను జెన్నీ 2017 జూన్ 23న తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని.. దానికి ఇప్పటి వరకూ 650, 000 లైక్‌లు కూడా వచ్చినట్లు కూడా చెప్పాడని రిచర్డ్ పేర్కొన్నాడు. అయితే దీనిపై జెన్నీఫర్ కానీ ఆమె న్యాయవాది కానీ ఇంత వరకూ స్పందించలేదు. (హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం) -
సరెండర్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
-
మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా తాజా పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తన కుటుంబ సభ్యుల ఆధీనంలోని కంపెనీల ఆస్తులు జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను ఆగస్టు13వ తేదీకి వాయిదా వేసింది. మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్ వేసిన పిటిషన్‌ను అనుమతించిన ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై ఆగస్టు 2వ తేదీన వాదనలు వింటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మినహా, ఇతర సంస్థలపై కేసులు లేనందున, వాటిని జప్తు చేయడం సరికాదన్నది మాల్యా వాదిస్తున్నాడు. -
‘నిబంధనలకు అనుగుణంగానే పంచాయతీరాజ్ ఆర్డినెన్స్’
సాక్షి, న్యూఢిల్లీ : పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముందు పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కృష్ణయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఇళయరాజాపై హైకోర్టులో కేసు
పెరంబూరు(చెన్నై): సంగీత జ్ఞాని ఇళయరాజాకు వ్యతిరేకంగా చిత్ర నిర్మాతలు చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఏ వేదికపైనా పాడరాదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, గత ఐదేళ్లుగా తన పాటలకు రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి చెక్‌పెట్టేలా ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ తదితర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పీటీ సెల్వకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగీతాన్ని అందించిన పాటలపై తనకే హక్కంటూ వాటిపై ఇళయరాజానే రాయల్టీ పొందడం చట్ట విరుద్ధమన్నారు. పాటల రాయల్టీలో చిత్ర నిర్మాతకు కనీసం 50 శాతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశామన్నారు. -
‘నోటా’పై ఓయూ జేఏసీ నేత పిటిషన్!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో ‘విజయ్ దేవరకొండ’ నటించిన ‘నోటా’ సినిమాకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా నోటా సినిమాను నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కాగా నోటా అనే పదాన్ని సినిమా టైటిల్‌గా వాడటాన్ని తప్పుపడుతూ ఓయూ జేఏసీ నేత కైలాస్ నేత ఈ బుధవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటా అనే పదాన్ని వాడే ముందు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని హైకోర్టుకు తెలిపారాయన. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చిత్రాన్ని, ఎన్నికల సంఘం వీక్షించి అభ్యంతర సన్నివేశాలు ఉంటే తొలిగించిన తర్వాతే చిత్రం విడుదలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, ఎన్నికల సంఘం సినిమా చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ గురువారం పిటిషన్ విచారణకు రానుంది. -
హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేశాం: టీటీడీ
సాక్షి, తిరుమల : దైవ దర్శనానికి వచ్చే భక్తుల జేబులు గుళ్ల చేస్తున్న తిరుమలలోని హోటళ్లపై తీసుకున్న చర్యల గురించి హైకోర్టు ధర్మాసనానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నివేదిక సమర్పించింది. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల దగ్గర హోటల్ యాజమాన్యాలు అక్రమంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నారని ఓ భక్తుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం టీటీడీ నివేదిక కోరింది. ఈ మేరకు టీటీడి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. హోటళ్లపై తనిఖీలు చేసి, అక్రమాలకు పాల్పడుతున్న వారి లైసెన్సులను రద్దు చేశామని ఆ నివేదికలో టీటీడీ తెలిపింది. వాటి స్థానంలో కొత్త టెండర్లు వేశామని, అక్రమాలకు తావివ్వకుండా ఒక నూతన సాఫ్ట్వేర్ తీసుకొచ్చామని పేర్కొంది. టీటీడి ఇచ్చిన నివేదికపై వివరణ ఇవ్వడానికి నాలుగు వారాల సమయం కావాలని పిటిషనర్ కోరాడు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 24కు వాయిదా వేసింది. -
ట్రంప్‌పై టెక్ వార్.. మాజీ కార్యదర్శుల మద్దతు
వాషింగ్టన్: ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా టెక్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లకు అమెరికా మాజీ కార్యదర్శులు జాన్ కెర్రీ, మడెలైన్ అల్బర్ట్ లు మద్దతు తెలిపారు. ముస్లిం ప్రాబల్యం కలిగిన ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై అమెరికాకు చెందిన 100 టెక్నాలజీ కంపెనీలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రావెల్ బ్యాన్ వల్ల అమెరికా వ్యాపారపరంగా, అభివృద్ధిపరంగా.. తీవ్రంగా నష్టపోతుందని తాము వేసిన జాయింట్ పిటిషన్లో పేర్కొన్నాయి. ప్రఖ్యాత కంపెనీలైన ఆపిల్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఈబే, ఉబెర్, ట్విట్టర్లు పిటిషన్ దాఖలు చేసిన కంపెనీల్లో ఉన్నాయి. (ట్రంప్‌పై టెక్ దిగ్గజాల లీగల్ వార్) ట్రంప్ నిర్ణయం వల్ల దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉంటుందని, ప్రపంచదేశాల్లో ఉన్న అమెరికా బలగాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన ఎంతో మంది వారి పరిశోధనలతో అమెరికా అభివృద్ధి కారణమయ్యారని టెక్ కంపెనీలు తమ పిటిషన్లో పేర్కొన్నాయి. కాగా, ట్రంప్ ట్రావెల్ నిషేధాన్ని సీటెల్ కోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్ దేశభద్రతకు ముప్పువాటిల్లితే ఆ బాధ్యత సదరు జడ్జి, న్యాయవ్యవస్ధ స్వీకరించాలని అన్నారు. ప్రస్తుతం ట్రావెల్ బ్యాన్ నిలుపుదల అంశం అమెరికా సుప్రీంకోర్టులో ఉంది. -
రేవంత్ రెడ్డిని అనుమతించొద్దంటూ పిటిషన్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం జరగనున్న జనజాతర సభకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాకుండా చూడాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలరాజ్ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున.. ఆయన్ను అడ్డుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీకి బాలరాజ్ పిటిషన్ సమర్పించాడు. సభకు రేవంత్‌ను అనుమతించొద్దని బాలరాజ్ కోరాడు. -
'సుజనాపై సిట్ విచారణకు ఆదేశాలివ్వండి'
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి (సుజనాచౌదరి) కంపెనీలైన సుజనా గ్రూపు సంస్థల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్ఐటీ) ఏర్పాటు చేసి విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఇది విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘మీరు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్‌ను గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను గానీ ఎందుకు సంప్రదించరు? ముందుగా ఈ వ్యవహారాలపై సరైన ఫోరానికి ఫిర్యాదు చేయండి. ఏం జరుగుతోందో వారికి చెప్పండి. ఆ తర్వాత అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి..’ అని సూచించారు. ఈ మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం అనుమతించింది. -
హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరి
సాక్షి, హైదరాబాద్: మారిషస్ బ్యాంక్ రుణం కేసులో కేంద్రమంత్రి సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణం చెల్లింపు వ్యవహారంలో మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు. మారిషస్ బ్యాంక్ తనపై దురుద్దేశాలతో కేసు పెట్టిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా, మంత్రిగా తన ప్రతిష్టను దెబ్బతియ్యాలన్న ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టిందని సుజనా చౌదరి ఆరోపించారు. కేసుల ద్వారా పరోక్షంగా తనపై ఒత్తిడి తెచ్చి వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ బ్యాంకు ఆలోచన అని పేర్కొన్నారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న హేస్టియా లిమిటెడ్ మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకుందని, సుజనా యూనివర్సల్‌లో తాను కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌ను మాత్రమేనని వివరించారు. ఆ కంపెనీ రోజువారీ వ్యవహారాలతో తనకు ఎంతమాత్రం సంబంధం లేదన్నారు. అధికారిక కార్యక్రమాలు, ముందస్తు షెడ్యూళ్ల వల్ల కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నానని, అందువల్ల మినహాయింపునివ్వాలని కోరినా కింది కోర్టు పట్టించుకోలేదన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
కాల్ మనీ వ్యవహారంపై హెచ్ఆర్సీలో పిటిషన్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. న్యాయవాది అరుణ్ కుమార్ ఈ మేరకు హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. కాల్ మనీ కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని హెచ్ఆర్సీని కోరారు. కాగా, కాల్ మనీ వ్యవహారంపై జనవరి 18 లోగా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని సోమవారం హెచ్ఆర్సీ ఆదేశించింది.