Plants plantation
-
వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు. ప్రధాని మోదీ సంతాపం పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
స్ఫూర్తిదాయక పని కోసం సెలవు
నైరోబీ: కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని ప్రకటించి కెన్యా తన సామాజిక స్పృహను చాటుకుంది. దేశంలోని వారంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13(సోమవారం) రోజున దేశవ్యాప్త సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే పది సంవత్సరాల్లో 1,500 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, వాయు కాలుష్యం సమస్యలతో సతమతమవుతున్న కెన్యాను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం దేశ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతంగా ఉన్న అడవులను 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. సోమవారం నాటి కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా 15 కోట్లకుపైగా మొక్కలను ప్రభుత్వ నర్సరీల్లో పౌరుల కోసం అందుబాటులో ఉంచింది. వీటిని ప్రభుత్వ ఏజెన్సీ నిర్దేశించిన చోట్ల నాటాలి. ఇవిగాక ‘ప్రతి కెన్యా పౌరుడు కనీసం రెండు మొక్కలు కొని నాటండి’ అని పర్యావరణ మంత్రి సోపాన్ తుయా పిలుపునిచ్చారు. -
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సల్మాన్ ఖాన్
Salman Khan Participate In Green India Challenge 5.0: ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0”లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. తర్వాత సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలి. అని కోరారు. ఇంకా సల్మాన్ మాట్లాడుతూ అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఈ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని సల్మాన్ తెలిపారు. నా అభిమానులంతా విధిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. (చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..) అనంతరం రాజ్యసభ సభ్యుడు, జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 'పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..) #GreenIndiaChallenge is delighted to have the Bollywood Sultan in Hyderabad. Euphoric to have the company of @BeingSalmanKhan to plant saplings. He not only accept our invitation but felt proud to be part of #GIC. This would definitely inspire millions of his fanbase to replicate pic.twitter.com/yylnOdqO2P — Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022 -
జాబిల్లిపై పచ్చదనం!
చందురిడిపై ఏరువాక సాగే రోజులు దగ్గరపడుతున్నాయి. పోషకాలు లేని చందమామ మృత్తికలో మొక్కలు పెరగవన్న అంచనాలను పటాపంచలు చేసే ప్రయోగాన్ని అమెరికా సైంటిస్టులు నిర్వహించారు. దీంతో భవిష్యత్‌లో చంద్రునిపై నివాసానికి ప్రధాన అడ్డంకి తొలగినట్లేనని భావిస్తున్నారు. వాషింగ్టన్: జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్ జాతికి చెందిన అరబిడోప్సిస్ థాలియానా మొక్కల్ని చంద్ర మృత్తికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. వీరి అధ్యయనం వివరాలను జర్నల్ కమ్యూనికషన్స్ బయాలజీ ప్రచురించింది. మొక్కల్ని ఇలా పెంచారు.. మొక్కలు పెంచాలంటే పోషకాలతో కూడిన మట్టి, సూర్యరశ్మి, నీళ్లు, బ్యాక్టీరియా వంటివెన్నో ఉండాలి.చంద్రుడి నుంచి అపోలో మిషన్ 11, 12, 17 సమయంలో మట్టిని తీసుకువచ్చి 50 ఏళ్లకుపైగా అయింది. ఈ మట్టిలో మొక్కల్ని పెంచాలంటే అత్యంత కష్టమైన విషయమే. చంద్రుడిపై మట్టికి, భూమిపై లభించే మట్టి మధ్య చాలా తేడాలుంటాయి. ముఖ్యంగా చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో పోషక విలువలు కాగడా వేసి చూసినా కనిపించవు. సహజసిద్ధంగా మట్టిలో ఎరువులుగా పని చేసే కీటకాలు, బ్యాక్టీరియా, తేమ ఉండవు. అందుకే ఇందులో మొక్కలు పెంచడాన్ని ఒక సవాల్ తీసుకున్నారు. అతి చిన్న కుండీలను తీసుకొని చంద్రుడి మట్టి ఒక్కో గ్రాము వేశారు. అందులో నీళ్లు పోసి విత్తనాలు నాటారు. వాటిని ఒక గదిలో టెర్రారియమ్ బాక్సుల్లో ఉంచారు. ప్రతీ రోజూ వాటిలో పోషకాలు వేస్తూ వచ్చారు. రెండు రోజుల్లోనే ఆ విత్తనాలు మొలకెత్తడంతో శాస్త్రవేత్తలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆరు రోజుల్లో అవి ఎదిగి పచ్చగా కంటికి ఆహ్లాదాన్నిచ్చాయని హార్టీకల్చర్ శాస్త్రవేత్త అన్నా లిసా పాల్ చెప్పారు. ఎలా పెరిగాయి? చంద్రుడిపై వ్యవసాయానికి వీలు కుదురుతుందా ? భవిష్యత్‌లో చంద్రుడిపై పరిశోధనల కోసం మరిన్ని రోజులు వ్యోమగాములు గడపాలంటే వారికి కావల్సిన పంటలు అక్కడ పండించుకోవడం సాధ్యమేనా? అన్న దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఇందులో చంద్రుడి మట్టిలో వ్యవసాయం సాధ్యమేనని తేలింది. అయితే ఈ మొక్కలు భూమిపై పెరిగినంత బలంగా, ఏపుగా పెరగలేదు. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత ఆ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించే ఆర్ఎన్ఏ పరీక్షలు చేశారు. ఆ మొక్కలు కాస్త ఒత్తిడి మధ్య పెరిగినట్టు ఆ పరీక్షల్లో తేలింది. అలాగే ఎక్కువ వయసున్న చంద్ర మృత్తికలో కన్నా తక్కువ వయసున్న చంద్ర మృత్తికలో మొక్కలు తక్కువ ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఏదైతేనేం, చంద్రుడి మట్టిలో విత్తనాలు వేస్తే మొలకెత్తడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ పరిశోధన భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి బాటలు వేస్తుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పుడమి సాక్షిగా.. పచ్చదనమే లక్ష్యం
మధురానగర్(విజయవాడ సెంట్రల్)/తిరుపతి రూరల్: కృష్ణా జిల్లా విజయవాడ, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆదివారం సాక్షి మీడియా గ్రూప్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘పుడమి సాక్షిగా..’ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ పడవల రేవు సెంటర్ నుంచి మధురానగర్ జంక్షన్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించగా, చంద్రగిరి నియోజకవర్గం వకుళాపురంలో వందలాది మంది విద్యార్థులతో మొక్కలు నాటారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చంద్రగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు బంగారు భవిష్యత్తని మంత్రులు చెప్పారు. భూ తాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు సాక్షి మీడియా రెండేళ్లుగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు అభినందించారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో సాక్షి మీడియా గ్రూప్‌తో కలిసి.. రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, గతేడాది పుడమి సాక్షిగా కార్యక్రమం తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో 10 లక్షల మొక్కలు నాటినట్లు చెవిరెడ్డి చెప్పారు. కార్యక్రమాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, విజయవాడ సీపీ టీకే రాణా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నరేంద్ర, ఎండీ రుహుల్లా, సాక్షి డీజీఎం కేఎస్ అప్పన్న, కృష్ణా జిల్లా బ్యూరో ఇన్చార్జ్ ఓ.వెంకట్రామిరెడ్డి, సాక్షి టీవీ బ్యూరో చీఫ్ వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఎన్.సతీష్, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. చిన్నారులు స్కేటింగ్ చేస్తూ ర్యాలీలో ఆకర్షణగా నిలిచారు. -
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
మరో గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసిన హీరో మోటోకార్ప్...!
భారత అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. హీరో మోటోకార్ప్ ఇంటర్నేషనల్ జీరో ఎమిషన్స్(ఉద్గారాలు) దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది. 'లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’ పేరిట హీరో మోటోకార్ప్ ప్రపంచరికార్డును ఆవిష్కరించింది. కర్భన ఉద్గారాలను తగ్గించడం కోసం హీరో మోటోకార్ప్ తన వంతుగా ‘హీరో గ్రీన్ డ్రైవ్’ ద్వారా దేశవ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ హీరో గ్రీన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,37,775 మొక్కలను నాటే ఫోటోలతో ‘లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’తో హీరో మోటార్‌కార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేయడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ.. "100 మిలియన్ అమ్మకాల మైలురాయితో ఈ ఏడాది కంపెనీ మరింత ఉత్సాహంగా ప్రారంభమైందని తెలిపారు. అంతేకాకుండా ఒకే రోజులో లక్ష యూనిట్ల విక్రయాలను హీరో మోటోకార్ప్ జరిపినట్లు గుర్తుచేశారు. ‘హీరో గ్రీన్ డ్రైవ్’ కార్యక్రమంతో జీరో ఎమిషన్స్‌పై కంపెనీ కట్టుబడి ఉందని వెల్లడించారు. గత నెలలో 'అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగో' సృష్టించినందుకుగాను హీరో మోటోకార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఫీట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు హీరో మోటోకార్ప్ ప్లాంట్‌లో అతిపెద్ద మోటార్సైకిల్లోగోను సుమారు 1845 స్ప్లెండర్ ప్లస్ బైక్స్నుపయోగించి గిన్నిస్ రికార్డును ఆవిష్కరించింది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! -
Green India Challenge: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్
-
ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో..
షోలాపూర్: కరోనా రెండో వేవ్ సమయంలో రాష్ట్రానికి 300 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి షోలాపూర్ జిల్లా కరమాల తాలూకా విటూ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కాకడే వీరాభిమానిగా మారాడు. వైఎస్ జగన్ స్ఫూర్తితో దాదాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రీ బ్యాంక్ స్థాపించి షోలాపూర్ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పటికే తమ చుట్టుపక్కలున్న 18 గ్రామాల్లో 4,700 మొక్కలు నాటాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ కాకడే పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ ముఖంలో చిరునవ్వు, సాదాసీదా దుస్తులతో ఉండే ఇలాంటి ముఖ్యమంత్రిని తాను ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సేవలకు తాను ఆకర్శితుడినయ్యానని చెప్పారు. ట్రీ బ్యాంకు ద్వారా కరమాల తాలూకాలో ఉన్న 118 గ్రామాల్లోని పాఠశాలల ఆవరణల్లో పండ్ల మొక్కలు నాటాలని సంకల్పించినట్లు తెలిపారు. ఒక్కో పాఠశాల పరిధిలో 25–30 మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజున హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌కు వెళ్లి, ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు పదిహేను రోజుల ముందే ఇక్కడి నుంచి సైకిల్‌పై బయలుదేరతానని పేర్కొన్నారు. తాను ఏమీ ఆశించకుండానే వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరిట సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆయన తనను వెన్ను తట్టి వెల్డన్ అంటే చాలని, తన జీవితం ధన్యమవుతుందని అన్నారు. -
మొక్కలు పెంచడం చాలా అవసరం: సీఎం జగన్
-
5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక: మంత్రి బాలినేని
-
చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి: సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి.. చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే... అవి ఎంత అవసరమో మనకు నిరంతరం తెలుస్తుంది. ఒకటి.. మనం పీల్చే గాలి ఆక్సిజన్. ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ వదిలేస్తుంది. ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్భన్ డై ఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ప్యూర్‌గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయన్నది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. రెండో అంశం.. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్ధితి ఉంటుంది. మనం పదో తరగితి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు తెలుసుకున్న విషయాలివి. ఆస్మోసిస్ అని, ట్రాన్సిపరేషన్, గటేషన్ అని రకరకాలు సిద్ధాంతాలు అన్నీ చదివాం. చెట్లు వలన వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయి అనే ఈ రెండు విషయాలును జ్ఞాపకం ఉంచుకోవాలి. చెట్లు వలన మనకు జరిగే మంచిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుంది. చెట్ల పెంపకం–ఒక యజ్ఞం రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి. రాష్ట్రంలో ఈరోజు 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచే దిశగా అందరం ప్రయత్నం చేయాలి. మనందరం కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ఈ ప్రతిజ్ఞ చేయాలి. చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేస్తే.. .మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది జరగాలని కోరుకుంటున్నాను. ఈ రోజు దాదాపు 5 కోట్ల మొక్కలను నాటడానికి అటవీశాఖను పురమాయిస్తూ... ప్రతిజ్ఞతో ఈ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నాను. అందరినీ ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. సభలో ప్రతిజ్ఞ చేయించిన సీఎం ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్ధితి అవసరాన్ని గుర్తిస్తూ... ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడవాడా, ఇంటా బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైఎస్.జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బాలినేని పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ‘‘ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 23 శాతం ఉన్న అటవీ విస్తీరణం 33 శాతం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. మన రాష్ట్రం అటవీ విస్తరణలో దేశంలో రెండో స్ధానంలో ఉంది, దానిని మొదటి స్ధానంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీనికి తోడు అటవీ శాఖ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాం, దీంతో పాటు నాడు-నేడు కార్యక్రమం, జగనన్న కాలనీలలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతీ విషయానికి ఎల్లో మీడియా దుర్మార్గంగా వక్రీకరిస్తుంది. సీఎం వైఎస్ జగన్‌పై ఎంత బురదచల్లినా ప్రజల మనసులో ఆయన చిరస్ధాయిగా నిలిచిపోయారు. అదే టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించలేదు కానీ, సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతీ కార్యక్రమం కూడా చెప్పిన తేదీకే అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని’’ మంత్రి బాలినేని అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా వృక్షంలా తయారయ్యేందుకు అందరూ కృషిచేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేలా మనం రాష్ట్రంలో ప్రతీ రోజూ వీలైనంత మేరకు మొక్కలు నాటాలన్నారు. వాతావరణ సమతుల్యం, వాతావరణ కాలుష్యం తగ్గడానికి, ఆక్సీజన్ అవసరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి, మొక్కలు, వృక్షాలు అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మనం తలంచి మొక్కలు విరివిగా పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటిన సీఎం వైఎస్ జగన్
-
ఏపీలో జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం
-
వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, మంగళగిరి: జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని సీఎం జగన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు ‘పచ్చ తోరణం, వన మహోత్సవం’
సాక్షి, అమరావతి/మంగళగిరి: వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. ఈ సారి దాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడ మొత్తం రెండు వేల మొక్కలను నాటతారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖాధికారులు చెప్పారు. వర్షాకాలమంతా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌కుమార్ చెప్పారు. 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎయిమ్స్ ఆవరణలో సీంఎ వైఎస్ జగన్ ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ పచ్చదనంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాక వాటిని పరిరక్షించాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులున్నారు, జేసీ దినేష్‌కుమార్ తదితరులున్నారు. -
బంపర్ ఆఫర్: మొక్కలు నాటితే ఎక్స్ట్రా మార్కులు..
చండీగఢ్: చదువులో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులకు ఎక్స్ట్రా మార్కులు ఇవ్వనున్నట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. 8-12 తరగతుల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు. పంచకుల జిల్లాలోని నేచర్ క్యాంప్ తప్లి అండ్ నేచర్ ట్రయల్స్ ఆఫ్ మోర్నిహిల్స్ ప్రాంతంలో పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్‌లాల్ ఖట్టర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ పరిరక్షణలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులను ప్రకృతితో కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్రపరిధిలోని పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది. 8-12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలి. దీని ప్రకారం ఆఖరి పరీక్షలో వారికి మార్కులు కేటాయిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. చదవండి: ఆమె అడవిగా విస్తరించింది -
ఆమె అడవిగా విస్తరించింది
పురుషుడి చేతిలో భూమి ఉంటే దానిని వ్యాపారం చేయాలని చూస్తాడు. స్త్రీ చేతిలో భూమి ఉంటే అందులో నాలుగు మొక్కలు నాటుదామని చూస్తుంది. నేలపై మొక్క లేదంటే ఆమడ దూరంలో కరువు ఉన్నట్టే. ఆ పైన ఆ నేల ఎడారి కానున్నట్టే. ప్రపంచం ఈ విషయం కనిపెట్టడానికి ముందే 40 ఏళ్ల క్రితం తన ఇంటి వెనుక ఉండే నాలుగున్నర ఎకరాలను అడవిగా మార్చడం మొదలెట్టింది దేవకీ అమ్మ. అందుకే ఆమెను అందరూ ‘అమ్మ చెట్టు’ అని పిలుస్తారు. ఆమె పరిచయం. దుబాయ్ నుంచి 12 ఏళ్ల ముని మనవరాలు కేరళ లో ఉన్న 85 ఏళ్ల దేవకీ అమ్మకు కుతూహలంగా ఫోన్ చేస్తుంది. ‘అవ్వా... నేను నాటిన మొక్క పెద్దదయ్యిందా’ అని అడుగుతుంది. దానికి దేవకీ అమ్మ కావాలనే జవాబు చెప్పదు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్... నువ్వొచ్చి కొత్త మొక్కలు నాటితే కదా’ అంటుంది. ‘వస్తా.. వస్తా... ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావాలని ఉంది’ అంటుంది మునిమనవరాలు. ఆ మునిమనవరాలే కాదు, మనవలు, కడుపున పుట్టినవారు అందరూ దేవకీ అమ్మ కోసం ఒక సంస్కారాన్ని పారంపర్యంగా స్వీకరించారు. అది వారి పూర్వికుల ఇంటి వెనుక ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిలో విత్తనాలు, మొక్కలు నాటడం. అది ఇవాళ్టి పరంపర కాదు. దాదాపు 40 ఏళ్లుగా వస్తోంది. దానిని మొదలెట్టింది దేవకీ అమ్మ. ముత్తుకులం కోడలు దేవకిది అలెప్పికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ముత్తుకులం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ వ్యవసాయం చేస్తారు. ఇంటి దగ్గర మొక్కలు పెంచడం కూడా ఆనవాయితీనే. ‘మా నాన్న వైద్యన్. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు విత్తనాలు, మొక్కలు తెచ్చి నాటేవారు. నేను ఇంట్లో అందరి కంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను నాటమనేవారు. అలా నాకు మొక్కలంటే ఇష్టం ఏర్పడింది’ అంటుంది దేవకీ అమ్మ. ఆమెకు వయసు వచ్చాక అదే ఊళ్లో ఉన్న గోపాలకృష్ణ పిళ్లై అనే ఇంగ్లిష్ టీచర్‌ను వివాహం చేసుకుంది. అత్తగారిది విశాలమైన ఇల్లు. దాని వెనుక దాదాపు నాలుగున్నర ఎకరాల పెరడు ఉంది. ఇంట్లో ఉన్న స్త్రీలందరూ వ్యవసాయ పనులు చేసి సొంత పొలంలో వరి పండించేవారు. ‘నాకు వ్యవసాయం ఇష్టం కనుక అత్తయ్యకు సాయం చేసేదాన్ని’ అంటుంది దేవకీ అమ్మ. 1980లో మారిన కథ 1980లో దేవకీ వెళుతున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కాలు కదల్లేని పరిస్థితి వచ్చి మూడేళ్లు మంచాన ఉండిపోయింది. పొలానికి వెళ్లొద్దని డాక్టర్లు చెప్పారు. ‘నాకేమో పొలం పనులు ఇష్టం. ఏం చేయాలో తోచక పెరట్లో ఒక మొక్క నాటాను. అది పెరిగింది. మరోటి నాటాను. ఆ తర్వాత ఆ నాలుగున్నర ఎకరాల స్థలమే నా నివాసం అయ్యింది. అక్కడ మొక్కలు నాటుతూ వెళ్లాను. నా భర్త ఆ పనిలో నేను ఆనందం పొందుతూ పూర్తిగా కోలుకోవడం చూసి రోజూ తప్పనిసరిగా కొత్త కొత్త మొక్కలు తెచ్చివ్వడం మొదలుపెట్టారు. నా మొక్కల ఇష్టం చూసి బంధువులు, స్నేహితులు ఎవరు మా ఇంటికి వచ్చినా మొక్కలు తీసుకు వచ్చారు. రోజులు గడిచాయి. నాకు తెలియకనే నా పెరడు ఒక అద్భుతమైన అడవిగా మారిపోయింది’ అంటుంది దేవకీ అమ్మ. స్త్రీ పెంచిన అడవి దేవకీ అమ్మ ఆ రోజుల్లోనే సేంద్రియ పద్ధతి లో ఆ అడవిని పెంచింది. ఎరువులు వాడలేదు. పేడనీళ్లే ఎరువు. అడవిలో ఏయే వృక్షాలు ఉంటాయో అవన్నీ ఆమె పెరట్లో ఉన్నాయి. దాదాపు 200 రకాల వృక్షజాతులు ఉన్నాయి. 3000 చెట్లు, మొక్కలు ఉన్నాయి. ‘నేను రోజూ ఈ అడివంతా తిరుగుతాను. చెట్లతో మాట్లాడతాను. నా మాటలు వాటికి అర్థమవుతాయి. మాకేం చింత లేదు... ఈమె ఉంది కదా అని అనుకుంటాయి’ అంటుంది దేవకీ అమ్మ. చిన్న ఊరి మధ్యలో ఇంటి వెనుక పెద్ద అడవి ఏర్పడటం నిజంగా వింతే. అందుకే వృక్షశాస్త్రం అభ్యసించేవారు తరచూ దేవకీ అమ్మ అడవిని సందర్శిస్తూ ఉంటారు. అధ్యయనం చేస్తూ ఉంటారు. ‘సాధారణంగా చాలామంది అడవికి కంచె వేస్తుంటారు. నేను వేయను. వచ్చే జంతువులన్నీ రానీ. వాలే పక్షులన్నీ వాలనీ. ఈ భూమి అందరిదీ. నేను రోజూ నా కుటుంబం మంచితో పాటు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల మంచిని కోరుతూ ప్రార్థిస్తాను’ అంటుంది దేవకీ అమ్మ. అమ్మ చెట్టు దేవకీ అమ్మకు ఇప్పుడు 85 ఏళ్లు. నిజానికి అడివంతా తిరగలేదు. అయినా సరే కొన్ని అడుగులైతే చెట్ల మధ్య వేసి వస్తుంది. పిల్లలు, మనమలు, మునిమనవలు ఎక్కడ ఉన్నా సెలవల్లో తప్పనిసరి గా వచ్చేస్తారు. అందరూ పండగలాగా అడవిలో కొత్త మొక్కలు నాటుతారు. ఈ నేల బతకాలంటే పచ్చగా ఉండాలని వారందరూ గట్టిగా నమ్ముతారు. ‘మా అమ్మ ప్రోత్సాహంతో నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివాను. మా పిల్లల్లో ఒకరిద్దరు బోటనీ స్టూడెంట్స్‌గా మారారు. ఇదంతా అమ్మ చలవే’ అని దేవకీ అమ్మ కుమార్తె ప్రొఫెసర్ టంకమణి అంటుంది. దేవకీ పెంచిన అడవిలోనే రెండు నీటి చెలమలు కూడా ఉన్నాయి. వాటిలో చేపలు ఆ చెట్ల నీడలతో ఆడుకుంటూ ఉంటాయి. ‘మా ఇంటికి వచ్చి చూసిన వారందరూ ఇలాంటి అడవిని పెంచడానికి తమ ఇళ్లల్లో స్థలాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి’ అంటుంది దేవకీ అమ్మ. జీవం ఎప్పుడూ బతుకునిస్తుంది. జీవం గురించి జీవం పోస్తే స్త్రీకి కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది. ఈ భూమి జీవంతో ఉండాలంటే... ఈ భూమిపై ఉన్నవారు జీవంతో ఉండాలంటే... ఈ భూమిని జీవంతో నింపాలి. అలా నింపే శక్తి చెట్టుకే ఉంది. దేవకీ అమ్మవంటి వారికి ఆ సంగతి తెలుసు. భూమిని నిర్జీవం చేసే కార్యకలాపాలను నియంత్రించుకుంటూ అవసరమైన నేలను మాత్రమే వాడుకుంటూ మిగిలిన నేలను ఎప్పుడూ పచ్చదనంతో నింపుకుంటూ రావాలి మనిషి. దేవకీ అమ్మ వంటి వారు అందుకు ఒక పచ్చటి సందేశంలా నిలుస్తూనే ఉంటారు. అవార్డులు దేవకీ అమ్మ కృషికి, పర్యావరణ ప్రేమకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ‘వృక్షమిత్ర’ పురస్కారం దక్కింది. కేరళ ప్రభుత్వం ‘హరి వ్యక్తి పురస్కారం’తో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ‘నారిశక్తి అవార్డు’ను బహూకరించింది. వీటన్నింటిని మర్యాద కోసం దేవకీ అమ్మ స్వీకరించింది. నిజానికి ఆమెకు ఒక ఉదయం లేచినప్పుడు కొన్ని పక్షులు వచ్చి తన అడవిలో వాలి కువకువలు వినిపించడమే అతి పెద్ద పురస్కారం. అది ఇచ్చే ఆనందం అనుభవించినవారికే తెలుస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు
చంఢీగడ్: ప్రజలు స్వచమైన గాలిని పీల్చాలని ఊరంతా మొక్కలు నాటిన ఓ వ్యక్తి.. చివరికి అదే గాలి అందక మరణించాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ధోబ్లాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ధోబ్లాన్‌కు చెందిన 67 ఏళ్ల హర్దయాళ్ సింగ్ ప్రతిరోజూ ఉదయం తన సైకిల్‌పై మొక్కలతో తన ఇంటి నుంచి బయలుదేరి, గ్రామ సరిహద్దులో మొక్కలు నాటుతుండే వాడు. ఆయన తన గ్రామస్తులకు స్వచ్ఛమైన గాలి అందించాలనే లక్ష్యంతో ఈ పనిని పూనుకున్నాడు. కాగా ఈ క్రమంలో సుమారు 10 వేల మొక్కలు పైగా నాటాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని సింగ్ భార్య గ్రామస్తులకు తెలిపింది. కాగా మే 18న గ్రామస్తులు సింగ్‌కు వైద్యం అందించాలని ఆస్పత్రిలో బెడ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా 28 గంటల వరకు వారికి బెడ్ దొరకలేదు. చివరకు మే 19న చండీఘర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే, అప్పటికే చాలా ఆలస్యం అయినందున మే 25 న సింగ్ మరణించాడు. ఎంతోమందికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని పరితపించిన సింగ్‌కు అదే గాలి అందక మరణించడం బాధాకరమని గ్రామస్తులు అంటున్నారు. చదవండి: ‘అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లనే అత్యాచారాలు’ -
సీడ్ బాల్స్‌తో ఉష్ణోగ్రతలకు చెక్!
సాక్షి, అమరావతి: విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు.. పచ్చదనాన్ని పెంచేందుకు కొండ ప్రాంతాల్లో సీడ్ బాల్ టెక్నాలజీ ద్వారా భారీగా మొక్కలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతం వెలుపల కూడా 33 శాతం వృక్ష సంపదను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాలతో సంబంధం లేకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే రెవెన్యూ కొండలపై భారీ స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టనుంది. సాధారణంగా రోడ్లకిరువైపులా ఒక్కొక్క మొక్క పెంపకానికి మూడేళ్లలో రూ.300 వరకు ఖర్చవుతోంది. దీనికి భిన్నంగా రెవెన్యూ కొండలపై పెంచే ఒక్కొక్క మొక్కకు కేవలం ఒక్క రూపాయి కంటే తక్కువ ఖర్చే కానుంది. ఇందుకోసం సరికొత్త ‘సీడ్ బాల్స్’ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 5 –6 వేల హెక్టార్లలో ఈ విధానంలో కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం చేపట్టనుంది. రానున్న సంవత్సరాల్లో మొత్తం 25 వేల హెక్టార్లలో కొండలపై భారీగా మొక్కలను పెంచనుంది. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కార్యక్రమం చేపడుతోంది. సీడ్ బాల్ విధానంలో మొక్కల పెంపకం ఇలా.. సీడ్ బాల్ విధానంలో.. ఎర్రమట్టి, బంక మట్టి కలగలిపిన మిశ్రమాన్ని 1.5 అంగుళాల నుంచి రెండు అంగుళాల సైజులో బంతి రూపంలో చిన్న ఉండలు చేస్తారు. ఆ బంతిపై చిన్న రంధ్రం చేసి 2–3 విత్తనాలు పెట్టి యథాతథంగా మారుస్తారు. తర్వాత ఆ మట్టి బంతులను 24 గంటల నుంచి 48 గంటల పాటు నీడలో ఆరబెడతారు. నాలుగైదు రోజుల తర్వాత కొండలపై నేరుగా చల్లుతారు. ఒక్కొక్క సీడ్ బాల్ తయారీకి అర్ధ రూపాయి.. వాటిని చల్లడానికి మరో అర్ధ రూపాయి కలిపి రూపాయికి మించి ఖర్చు కాదని అధికారులు తెలిపారు. మొలక వచ్చే వరకు సీడ్ బాల్లో విత్తనం సేఫ్.. కొండలపై సీడ్ బాల్స్‌ను చల్లాక వర్షాకాలంలో మొలక వచ్చే వరకు అందులో విత్తనం భద్రంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా.. లేకుంటే డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్‌ను కొండలపై చల్లిస్తామని తెలిపారు. సీడ్ బాల్స్ అన్నీ ఒకే చోట పడకుండా ప్రతి రెండు మీటర్ల దూరంలో అర అడుగు లోతు, అర అడుగు వెడల్పుతో సన్నని గాడులు తీస్తారు. రాళ్ల గుళ్లలు ఉన్నచోట సీడ్ బాల్స్‌ను చల్లుతారు. చల్లే సమయంలో బాల్స్ పగలకుండా తగిన చర్యలు తీసుకుంటారు. ఒక్కో హెక్టార్ పరిధిలో 2,000 నుంచి 2,500 సీడ్ బాల్స్.. ఒక్కో హెక్టార్ పరిధిలో 2000–2500 సీడ్ బాల్స్ పడేలా చల్లే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వేసవిలో ఉపాధి హామీ పథకం నిధులతో 1.10 కోట్ల సీడ్ బాల్స్‌ను తయారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పది లక్షల చొప్పున.. తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడున్నర లక్షలు చొప్పున, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ఐదు లక్షల చొప్పున సీడ్ బాల్స్‌ను వర్షాకాలం ప్రారంభం నాటికి అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సీడ్ బాల్స్ విధానంతోపాటు ఉపాధి హామీ పథకం నిధులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొండ ప్రాంతాల్లో మరో కోటి మొక్కలను నేరుగా నాటడానికి వేరుగా కార్యాచరణను సిద్ధం చేసుకున్నామని అధికారులు తెలిపారు. -
రోడ్డు మీద వరి పండించాడు
సాక్షి, తిరువనంతపురం: రహదారికి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాడని చదివాం.కాని ఈ ఉద్యోగం లేని బస్ డ్రైవర్ రోడ్డు పక్కన కొద్దిపాటి స్థలంలో తోట పెంచుతున్నాడు. వరిని కూడా పండిస్తున్నాడు. ఈ తోటలోని వస్తువులు ఊరి వారికి ఉచితం. త్రిచూర్‌కు గంట దూరంలోని పెరిన్‌జనమ్ అనే పల్లెలో అనిల్ కుమార్ అనే వ్యక్తి సాధించిన పచ్చదనం ఇది.అనిల్ కుమార్ అంటే ఊళ్లో అందరికీ గౌరవం. అతని గురించి వింటే మనకూ గౌరవం కలుగుతుంది. కేరళలోని త్రిచూర్‌కు దగ్గరగా ఉండే ‘పెరిన్‌జనమ్’ అనే పల్లె అతనిది. ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో బస్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి ఊళ్లో వ్యవసాయానికి బెత్తెడు స్థలం కూడా లేదు. అతను సంప్రదాయ రైతు కూడా కాదు. కాని నేలంటే విపరీతమైన ప్రీతి. ఒక మొక్కకు ప్రాణం పోయడం అంటే అమిత ఇష్టం. ఊళ్లో రోడ్డుకు ఇరువైపులా ఒక గజం మేర వెడల్పుతో మట్టి మార్జిన్ ఉంది. ఇలాంటి మార్జిన్ ప్రతి ఊళ్లో ప్రతి రోడ్డుకూ ఉంటుంది. ఆ మార్జిన్ నేల చాలు తనకు అనుకున్నాడు అనిల్ కుమార్. ఆ నేలలో మెల్లగా కూరగాయ మొక్కలు పెంచడం మొదలెట్టాడు. ఊరి పంచాయతీ ఇది గమనించింది. ‘రోడ్డు రాకపోకలకు అంతరాయం కలిగించను. ఈ కాయగూరలు నేను అమ్ముకొని తినను’ అని అన్నాడు. పంచాయతీ అంగీకరించింది. ఇక అనిల్ కుమార్ పని మొదలయ్యింది. డ్యూటీ లేనప్పుడల్లా రోడ్డుకు ఇరువైపులా అన్ని రకాల కాయగూరలూ సాగు చేశాడు. కొన్ని మొక్కలు ప్రభుత్వం వారి నుంచి తెచ్చుకున్నాడు. కొన్నిమొక్కలు గ్రామస్తులే ఇచ్చారు. విత్తనాలు కూడా ఇచ్చారు. చెట్లు ఏపుగా పెరిగాయి. కాయలు కాశాయి. ‘మేం కోసుకోవచ్చా’ అని ఊరివాళ్లు అడిగితే ‘నన్ను అడిగే పనే లేదు’ అని జవాబు చెప్పాడు. ఒక అందమైన తోటే రోడ్డు పక్కన వెలియడం అందరికీ ఆశ్చర్యం. సంతోషం. అనిల్ కుమార్ మీద గౌరవం అలా పెరిగింది. అంతే కాదు... ఆ గజం స్థలంలోనే గ్రామస్తులు వద్దని వారిస్తున్నా, ఓడిపోతావ్ అని హెచ్చరిస్తున్నా వరి వేసి ఆశ్చర్యపరిచాడు. వరి ఆ జానాబెత్తెడు స్థలంలోనే విరగపండింది. లాక్డౌన్ తర్వాత అనిల్ కు ఉద్యోగం పోయింది. అయినా సరే ఈ తోట మీద బతికే పని పెట్టుకోలేదు. ‘ఊరి స్థలం ఇది. దాని మీద వచ్చేది ఊరికే’ అంటాడు. అప్పుడప్పుడు అతడు కొన్ని కాయగూరలను కోసి ఇంటికి తీసుకెళ్లాడు నిజమే కాని ‘అలా కోయకపోతే అవి పాడవుతాయి... మొక్కల్ని పాడు చేస్తాయి’ అని జవాబు చెబుతాడు. ‘ఇలా ప్రతి ఊళ్లో చేయవచ్చు. ఆ సందేశం అందించడానికే ఈ పని చేస్తున్నాను’ అంటాడు అనిల్. కూరగాయల మధ్య మధ్య అతడు పూల మొక్కలను పెంచాడు. పూలు విరబూసి ఆ దారంతా ఎంతో అందంగా ఉంటుంది. అందమైన పనులు చేసే కొందరు మనుషులను చూసి మిగిలిన అందరినీ ఈ ధరిత్రి మోస్తూ ఉంటుంది. -
భావితరాలకు మొక్కలే బహుమతి
సాక్షి, సిద్దిపేట: ‘మన తాతలు నాటిన మొక్కలు నేటికీ పండ్లు, కాయలు ఇస్తున్నాయి. ఆ చెట్ల నీడన ఉంటున్నాం.. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం.. రాబోయే తరాలకు పండ్లు, నీడను, గాలిని ఇవ్వాలంటే ఇప్పుడు మనం కూడా మొక్కలను నాటాలి’అని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని అర్బన్ పార్కులో డ్రోన్ల ద్వారా విత్తనపు బంతులు చల్లే కార్యక్రమానికి రాష్ట్రఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామయ్య మాట్లాడు తూ చిన్ననాటినుంచే తనకు మొక్కలను పెంచడం అలవాటుగా మారిందన్నారు. తన కుటుంబ సభ్యులకు కూడా మొక్కల పేర్లు పెట్టి పీల్చుకుంటున్నామని చెప్పారు. పద్మశ్రీ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రతీ రోజు దేశంలో 50 వేల హెక్టార్ల విస్తీర్ణం గల అడవులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. అడవులు అంతరిస్తే రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి కరువు అవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా అలవాటు చేసుకోవాలన్నారు. విత్తనపు బంతుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రకృతి సిద్ధంగా మొలకెత్తిన మొక్కలు ఎక్కువ శక్తితో పెరుగుతాయని చెప్పారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. మానవాళి మనుగడ కోసం అడవులను నరుకుతూ పోతుంటే వనజీవి రామయ్య వంటి మహనీయులు మొక్కలు నాటడమే లక్ష్యంగా జీవించడం సంతోషకరమన్నారు. రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. -
భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి
‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అంటూ మొక్కలు నాటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దూసుకెళుతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు. ఈ కరోనా సమయంలో అందరికీ ప్రాణవాయువు విలువ తెలిసింది. ఈ భూమి తల్లికి కూడా వృక్షాలు, అడవులు ప్రాణవాయువు అందిస్తాయి’’ అని నటుడు చిరంజీవి అన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు మనం అందించే గొప్ప సంపద. మనం ఇచ్చే కాలుష్యాన్ని మొక్కలు పీల్చుకుని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయని సంతోష్‌గారు గుర్తించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మెగా అభిమానులందరూ మొక్కలు నాటాలి’’ అన్నారు. -
నేడు జగనన్న పచ్చ తోరణం
సాక్షి, అమరావతి: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఆయన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి పాల్గొననున్నారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం జీవరాశులకు ప్రాణవాయువు అందించే మొక్కలను విరివిగా నాటడం ద్వారా చెట్ల పెంపకానికి త్రికరణ శుద్ధితో పాటుపడతామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుదామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ఎన్.ప్రతీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన ‘జగనన్న పచ్చతోరణం’ ప్రచార సామగ్రిని మంగళవారం విడుదల చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే : పెద్దిరెడ్డి జగనన్న పచ్చతోరణంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వమే చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ కార్యక్రమ ప్రారంభ ఏర్పాట్లను మంగళవారం ఆయన మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి, సీఎం ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్‌లతో కలిసి పరిశీలించారు. -
గ్రీన్.. గ్రీన్.. ఎవర్గ్రీన్
లేబాక రఘరామిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక అటవీ విభాగానికి చెందిన అన్ని నర్సరీలు రకరకాల మొక్కలతో కొత్త కళ సంతరించుకున్నాయి. మొక్కలు నాటే పండుగ వన మహోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ బృందం ఇటీవల ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు, కొత్తపట్నం నర్సరీలను సందర్శించింది. వాతావరణం అనుకూలించడంతో నర్సరీల్లో మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. నల్లని, తెల్లని పాలిథిన్ సంచుల్లో లైను కట్టినట్లున్న రకరకాల మొక్కలతో నర్సరీలు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఆరు కోట్లకు పైగా మొక్కలతో సామాజిక అటవీ విభాగానికి చెందిన 737 నర్సరీలు ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. ఉద్యానవన విభాగం, ప్రయివేటు నర్సరీల్లో 6.03 కోట్ల మొక్కలు సిద్ధమయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో మొక్క.. ► గత ప్రభుత్వాలు మొక్కలు నాటి, వాటి సంరక్షణ గురించి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి చెట్టుగా మారేలా చూడాలని సీఎం జగన్ ఆదేశిం చారు. దీంతో ప్రభుత్వం ‘ఒక్కొ క్కరు ఒక్కో మొక్క’ నాటి సం రక్షించాలనే నినాదం తెచ్చింది. ► పచ్చదనం పెంపునకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల సేవలను ప్రణాళికా బద్ధంగా వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► అన్ని రకాల రహదారులు, విద్యా సంస్థలు, పారిశ్రా మిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతారు. 33% గ్రీన్ కవర్ లక్ష్యం ► పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం’ అమల్లోకి తెచ్చిన సీఎం జగన్ ఇప్పుడు పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టారు. ► జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్ కవర్ (పచ్చదనం) సాధన లక్ష్యంగా ముందుకెళ్లాలన్న సీఎం మార్గనిర్దేశం మేరకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ► రాష్ట్ర అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా అటవీ శాఖతో పాటు 29 ప్రధాన శాఖలు ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, వన సంరక్షణ సమితుల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ► రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం ఉంది. ఇందులో 37,258 చదరపు కిలో మీటర్ల (మొత్తం భూభాగంలో 23 శాతం) మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీంతో పాటు అడవి వెలుపల మూడు శాతం చెట్లు ఉన్నాయి. నాలుగు రకాల ప్లాంటేషన్లు ఎవెన్యూ ప్లాంటేషన్: జాతీయ రహదా రులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రహదారులు తదితర చోట్ల మొక్కలు పెంచుతారు. వేప, చింత, కానుగ, మర్రి, రావి, నిద్రగన్నేరు, బాదం, ఏడాకులపాయ, నేరేడు తదితర మొక్కలను ఈ ప్లాంటేషన్‌కు వినియోగిస్తారు. బ్యాంక్ ప్లాంటేషన్: స్థానిక పరిస్థితులు, భూమిని బట్టి సాగునీటి కాలువల వెంబడి టేకు, సుబాబుల్, మలబార్ నీమ్, వేప తదితర మొక్కలను నాటుతారు. బ్లాక్ ప్లాంటేషన్: చెట్లు క్షీణించిన అటవీ ప్రాంతం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, రెవెన్యూ పోరంబోకు, దేవాలయాల భూములు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటుతారు. ఆయా అటవీ ప్రాంతాల వాతావరణం, నేల పరిస్థితులను బట్టి మోదుగ, ఎర్ర చందనం, శ్రీగంధం, రోజ్ ఉడ్, నేరవేప, మద్ది, నీరుద్ది, ఏగిస తదితర మొక్కలు నాటుతారు. ఇళ్లు, పొలాలు: ఇళ్ల వద్ద, పొలం గట్లపైనా నాటుకోవడం కోసం అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది. సాధారణంగా రైతులు టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, చింత, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా తదితర మొక్కలను నాటుతారు. 3 రకాలుగా వర్గీకరణ ► పనస, మామిడి, ఉసిరి, సపోట, దానిమ్మ తదితరాలు ఫలసాయం ఇచ్చే మొక్కల జాబితాలో ఉన్నాయి. ► ఎర్రచందనం, శ్రీగంధం, వేప, వేగిస, నారవేప, టేకు, రోజ్ ఉడ్ తదితర మొక్కలను కలప ఇచ్చేవిగా పేర్కొంటారు. ► ఏడాకులపాయ, నిద్రగన్నేరు, సుబాబుల్ లాంటి మొక్కలను సాధారణంగా నీడ కోసం పాఠశాలల్లో నాటుతారు. రేపే శ్రీకారం వన మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు. ► గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ► నాటిన వాటిలో కనీసం 85 శాతమైనా బతికేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ట్రీ గార్డుల ఏర్పాటు: మంత్రి పెద్దిరెడ్డి జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాటే ప్రతి మొక్కను రక్షించేందుకు దాని చుట్టూ ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం ఏర్పాట్లపై సోమవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చినతాతయ్య తదితరులు పాల్గొన్నారు. 365 రోజులూ పని.. ప్రతిరోజూ పనికెళ్తున్నా. ఏడాదిలో 365 రోజులూ నర్సరీల్లో పని ఉంటోంది. లాక్‌డౌన్‌లోనూ పని దొరికింది. భర్త పనికి వెళ్లకపోయినా నాకు పని ఉండటం వల్ల కుటుంబ పోషణ సజావుగా సాగుతోంది. నర్సరీలో మాకు రోజుకు రూ.200 కూలి చెల్లిస్తున్నారు. – కొల్లిమేర వెంకటలక్ష్మి, కూలీ, ప్రియదర్శిని సెంట్రల్ నర్సరీ, ధవళేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా.