play off
-
IPL 2024 Playoffs: ప్లే ఆఫ్స్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. పరిస్థితి ఏంటి?
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ సమరానికి రంగం సిద్దమైంది. మంగళవారం(మే 21)తో ప్లే ఆఫ్స్‌కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్-1లో టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. అనంతరం మే 22న క్వాలిఫియర్-2లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే గత 8 లీగ్ మ్యాచ్‌ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ సైతం రద్దు అయింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే ఏంటి పరిస్థితి అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.ప్లే ఆఫ్స్‌కు రిజర్వ్ డే..ఐపీఎల్-2024 సీజన్లో క్వాలిఫియర్-1, ఎలిమినేటర్, క్వాలిఫియర్-2 మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ట్రా టైమ్ కూడా ఉంటుంది. ఫలితం తేలాలంటేఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫలితం తేలాలంటే 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఉదహరణకు క్వాలిఫియర్-1లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో ఉన్న కేకేఆర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. -
IPL 2024 Playoffs: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ పడినప్పటకి మరోసారి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఇక లీగ్ స్టేజీ ముగియడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లపై ఓ లూక్కేద్దం. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల టేబుల్లో కేకేఆర్(19) పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ 17(నెట్ రన్‌రేట్ +0.414), రాజస్తాన్ 17(నెట్ రన్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్లతో వరసగా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంతరం మే 24 క్వాలిఫియర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫియర్-1లో ఓడిన జట్టు తలపడనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
IPL 2024: సీఎస్కేపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తాచాటింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను బెంగళూరు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖరిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ రెండు వికెట్లు, మాక్స్వెల్, సిరాజ్, గ్రీన్, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించారు.అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయినప్పటికి.. ఛేజింగ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి ఉండేది. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి.ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చితన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. -
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తాచాటింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్(38), కెప్టెన్ రిషబ్ పంత్(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చెలరేగిన ఇషాంత్..అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. లక్నో టెయిలాండర్ అర్షద్ ఖాన్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 7వ స్ధానంలో బ్యాటింగ్‌లో వచ్చిన అర్షద్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్ష్య చేధనలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్.. గెలుపు అంచుల దాకా తీసుకువచ్చాడు. 33 బంతులు ఎదుర్కొన్న అర్షద్.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(61) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు, ఖాలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, స్టబ్స్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. -
వర్షం ఎఫెక్ట్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షర్ఫాణమైంది. ఎడతరిపి లేని వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దు అయింది. సాయంత్రం నుంచే అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తోంది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఇరు జట్లకూ చేరో పాయింట్ లభించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఐదింట విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే . ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ తొమ్మిదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
ఐపీఎల్-2024లో దాదాపుగా ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై మరింత సంక్లిష్టం చేసుకుంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(56) ఒక్కడే పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్, రస్సెల్, చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్యర్ 70 పరుగులు చేశాడు. అయ్యర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలోతుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో నిలిచింది. -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
ప్లేఆఫ్‌లో సెంచరీ చేసిన ఏడో బ్యాటర్‌గా; ఒక్క శతకంతో ఇన్ని రికార్డులా
గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్లోనే పీక్ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన క్వాలిఫయర్-2 పోరులో గిల్ శతకంతో మెరిశాడు. 49 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న గిల్‌కు ఇది సీజన్లో మూడో సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక్క సెంచరీతో గిల్ తన పేరిట చాలా రికార్డులు లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. Photo: IPL Twitter ► ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌లో సెంచరీ బాదిన ఏడో క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంతకముందు ఐపీఎల్ 2014లో వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులు, ఐపీఎల్ 2018లో షేన్ వాట్సన్ 117 పరుగులు, ఐపీఎల్ 2014లో వృద్ధిమాన్ సాహా 115 పరుగులు, ఐపీఎల్ 2022లో మురళీ విజయ్ - 113, ఐపీఎల్ 2022లో రజత్ పాటిదార్ 112 పరుగులు, ఐపీఎల్ 2022లో జోస్ బట్లర్ 106 పరుగులు ప్లేఆఫ్‌లో సెంచరీలు చేశారు. ► ఐపీఎల్లో ఒకే సీజన్లో మూడు సెంచరీలు బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా(23 ఏళ్ల 260 రోజులు) శుబ్‌మన్ గిల్ నిలిచాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో 129 పరుగులు చేసిన గిల్.. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ తరపున 122 పరుగులు ఇప్పటివరకు టీమిండియా తరపున ఏ బ్యాటర్‌కైనా ప్లేఆప్లో అత్యధిక స్కోరు. తాజాగా గిల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ► ఐపీఎల్లో టీమిండియా తరపున అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇక 2020లో పంజాబ్ కింగ్స్ తరపున 132 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టీమిండియా తరపున ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్లో ఒక సీజన్లో 800 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇంతకముందు విరాట్ కోహ్లి 2016లో 973 పరుగులు చేశాడు. ఇక సెంచరీల విషయంలోనూ మరొక రికార్డు సాధించాడు. ఒక సీజన్లో మూడు సెంచరీలు చేసిన గిల్.. ఐపీఎల్లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి(2016లో నాలుగు సెంచరీలతో) ఉన్నాడు. ఓవరాల్‌గా కోహ్లి(2016), బట్లర్(2022) నాలుగు సెంచరీలతో సంయుక్తంగా తొలి స్థానంలో ఉండగా.. గిల్ మూడు సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ► ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా గిల్.. సాహా, రజత్ పాటిదార్లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్ 49 బంతుల్లోనే శతకం అందుకోగా.. గతంలో సాహా ఐపీఎల్ 2014 ఫైనల్లో, రజత్ పాటిదార్(2022 ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో) 49 బంతుల్లోనే శతకం సాధించారు. Photo: IPL Twitter ► ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో గిల్ తొలిస్థానంలో ఉన్నాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు ఉన్నాయి. ఇంతకముందు వృద్దిమాన్ సాహా(2014 ఫైనల్). క్రిస్ గేల్(2016 ఫైనల్), వీరేంద్ర సెహ్వాగ్(2014 క్వాలిఫయర్-2), షేన్ వాట్సన్(2018 ఫైనల్) తలా 8 సిక్సర్లు బాదారు. 𝙂𝙄𝙇𝙇𝙞𝙖𝙣𝙩! 👏👏 Stand and applaud the Shubman Gill SHOW 🫡🫡#TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/ADHi0e6Ur1 — IndianPremierLeague (@IPL) May 26, 2023 His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes - Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv — JioCinema (@JioCinema) May 26, 2023 చదవండి: గిల్ సెంచరీ.. ఒకే సీజన్లో మూడు శతకాలు బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా -
వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరంటే?
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వర్షం కారణంగా టాస్ కూడా కాస్త ఆలస్యం కానుంది. మరి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎలిమినేటర్ సహా రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు షెడ్యూల్లో ఎలాంటి రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు వెళుతుంది. లీగ్ స్టేజీలో 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా గుజరాత్ నిలవగా.. ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌కు చేరుకుంది. ప్లేఆఫ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రూల్ ప్రకారం లీగ్ స్టేజీలో ఏ జట్టు ఎక్కువ పాయింట్స్ సాధించి టేబుల్ టాపర్‌గా నిలుస్తుందో ఆ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. అయితే ఇది లాస్ట్ ఆప్షన్ మాత్రమే. దానికంటే ముందు వర్షం అంతరాయం కలిగించినప్పటికి ఐదు ఓవర్ల మ్యాచ్‌కు అవకాశమిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. ఒకవేళ భారీ వర్షం కారణంగా అది కూడా వీలు కాకపోతే ఇరుజట్లలో లీగ్ స్టేజీలో టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. లండన్‌లో కోహ్లి -
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ముంబై లక్నోని ఎందుకు ముంచేసింది... ఇక కష్టమే...
-
#LSG: ఎలిమినేటర్ గండం దాటలేక.. ఓటమికి కారణాలెన్నో!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి ప్లేఆప్స్కే పరిమితమైంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో 81 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్లో గతేడాదే కొత్తగా వచ్చి లక్నో సూపర్‌జెయింట్స్ ఎలిమినేటర్ గండాన్ని వరుసగా రెండోసారి కూడా దాటలేకపోయింది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన లక్నో.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు దాసోహమంది. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమికి చాలా కారణాలున్నాయి. మొదటిది పదేపదే జట్టును మార్చడం లయను దెబ్బతీసింది. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కృనాల్ పాండ్యా లీగ్ స్టేజీలో బాగానే నడిపించాడు. కైల్మేయర్స్ను కాదని ప్రేరక్ మన్కడ్‌ను తీసుకోవడం.. క్వింటన్ డికాక్‌కు అవకాశం ఇవ్వడం వరకు బాగానే ఉంది. అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌కు డికాక్‌ను పక్కనబెట్టి కృనాల్ పెద్ద తప్పే చేశాడు. అసలు ఏమాత్రం ఫామ్‌లో లేని దీపక్ హూడాకు అవకాశమిచ్చి చేతులు కాల్చుకున్నాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా ఔట్ చేసి చివరకు తాను కూడా రనౌట్ అయి కర్మ ఫలితం అనుభవించాడు. ముంబైతో ఎలిమినేటర్ మ్యాఛ్‌లో కైల్ మేయర్స్, డికాక్‌తో ఓపెనింగ్ చేయించి ఉంటే లక్నో పరిస్థితి వేరుగా ఉండేదేమో. కేఎల్ రాహుల్ ఉన్నప్పుడు జట్టు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికి మిడిలార్డర్లో స్టోయినిస్, పూరన్‌లు చాలా మ్యాచ్‌ల్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు, అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పూరన్ గోల్డెన్ డకౌట్ అవ్వడం.. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న స్టోయినిస్ రనౌట్ కావడం లక్నో ఓటమిని ఖరారు చేసింది. మరి వచ్చే సీజన్లోనైనా సరికొత్త ప్రణాళికతో ఎలిమినేటర్ గండం దాటి కప్ కొడుతుందేమో చూద్దాం. -
ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.కామెరాన్ గ్రీన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ 33, తిలక్ వర్మ 26, నిహాల్ వదేరా 23 పరుగులతో రాణించారు. ఇక జట్టులో ఒక్కరు కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోనప్పటికి ప్లేఆఫ్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ తొలిస్థానంలో నిలిచింది. ఇంతకముందు 2018 ఫైనల్లో సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ 178 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఒక్క ఫిఫ్టీ కూడా నమోదు కాలేదు. 2018లోనే క్వాలిఫయర్-2లో ఎస్ఆర్హెచ్.. కేకేఆర్‌పై 174 పరుగులు, 2013 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 165 పరుగులు, 2008 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌పై సీఎస్కే 163 పరుగులు చేసింది. చదవండి: కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు! -
జడ్డూ చిరుత పులిలా.. మొయిన్ అలీ ముసలోడిలా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. షమీ వేసిన 20వ ఓవర్ నాలుగో బంతిని మొయిన్ అలీ మిస్ చేశాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జడేజా పరుగు కోసం చిరుత పులిలా పరిగెత్తుకొచ్చాడు. అయితే ఇది గమనించని మొయిన్ అలీ అప్పుడు క్రీజు నుంచి కదిలాడు. అయితే బంతిని అందుకున్న సాహా వికెట్ల వైపు విసరగా.. అప్పటికే జడ్డూ తన బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. జడేజా బ్యాట్ పెట్టేలోపు మొయిన్ అలీ ఇంకా అతని వెనకాలే ఉన్నాడు. ఒకవేళ సాహా నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు బంతిని విసిరి ఉంటే మొయిన్ అలీ కచ్చితంగా రనౌట్ అయ్యేవాడే కానీ తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు..''జడ్డూ చిరుతపులిలా పరిగెత్తుకొస్తే.. మొయిన్ అలీ మాత్రం ముసలోడిలా పరిగెత్తాడు'' అంటూ కామెంట్ చేశారు. Jadeja returned from School and Moeen Ali is just going to School 😭 pic.twitter.com/9xz1SFhUpT — ♚ (@balltamperrer) May 23, 2023 చదవండి: దీపక్ చహర్ అరుదైన ఘనత.. -
#NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు..
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 పోరులో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే నోబాల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మూడో బంతిని గైక్వాడ్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న గిల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ రుతురాజ్ వెనుదిరగడంతో తొలి వికెట్ దక్కిందన్న సంతోషం దర్శన్ నల్కండే మొహంలో కనిపించింది. కానీ మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైంది. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో రుతురాజ్ ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చాడు. అలా నోబాల్ అవడంతో బతికిపోయిన రుతురాజ్ ఆ తర్వాత 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అంటే ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు అన్నమాట. తొలి ఇన్నింగ్స్ కావడంతో రుతురాజ్ ఇన్నింగ్స్ ఎంతవరకు గుజరాత్‌కు నష్టం తెస్తుందనేది చెప్పలేం. Gaikwad: From🙁 to 🤩 A twist of fate sees Ruturaj maximize with the bat in #GTvCSK ⚔️#IPLPlayOffs #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/dOfabAaXTS — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్ -
డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ను స్టార్స్టోర్ట్స్లో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌లో ఒక్కో డాట్ బాల్‌ను సదరు బ్రాడ్కాస్ట్ సంస్థ స్కోరుబోర్డులో ఒక్కో చెట్టు గుర్తును చూపించింది. అదేంటి డాట్ బాల్ అనగానే స్కోరు బోర్డును సున్నా కనిపించాలి గాని ఇలా చెట్టు కనిపించడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక బీసీసీఐ చేసిన ఒక గొప్ప ఆలోచన బయటకొచ్చింది. అదేంటంటే.. Green Initiative(పర్యావరణం పెంపొందించడానికి) పేరిట బీసీసీఐ ఒక వినూత్న కార్యం చేపట్టింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్‌లో అన్ని డాట్ బాల్స్‌ను కలిపి 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. బీసీసీఐ ఆలోచనను అభినందించిన స్టార్స్టోర్ట్స్ యాజమాన్యం గుజరాత్, సీఎస్కే ప్లేఆఫ్ మ్యాచ్‌లో నమోదైన డాట్ బాల్స్ స్థానంలో చెట్టు గుర్తును ఉంచేలా ప్రణాళిక రూపొందించింది.ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పర్యావరణాన్ని కాపాడేందుకు బీసీసీఐ చేసిన గొప్ప ఆలోచనను మెచ్చుకుంటున్నారు. Qualifier 1 | #GTvCSK What's that Tree for @JioCinema??#IPLPlayOffs #CricketTwitter pic.twitter.com/TYiOy8tczr — Anika🇮🇳 (@SportsIndia036) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు -
మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను క్రొయేషియా మూడోస్థానంతో ముగించింది. శనివారం మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో క్రొయేషియా.. మొరాకోను 2-1 తేడాతో ఓడించింది. క్రొయేషియా తరపున ఆట 7వ నిమిషంలో జోస్కో గ్వార్డియోల్, ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్స్ చేశారు. ఇక మొరాకో తరపున ఆట 9వ నిమిషంలో అచ్రఫ్ డారీ గోల్ చేశాడు. అయితే ఆట తొలి అర్థభాగంలోనే ఇరుజట్లు గోల్స్ చేశాయి. రెండో అర్థభాగంలో గోల్స్ కోసం ప్రయత్నించినప్పటికి సఫలం కాలేకపోయాయి. ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో తొలిసారి సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్ దశలో బెల్జియం.. నాకౌట్స్‌లో పోర్చుగల్, స్పెయిన్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకున్న మొరాకో డిఫెడింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆదివారం(డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఫైనల్‌తో మెగాటోర్నీ ముగియనుంది. -
'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు'
క్రికెట్లో ఒక జట్టుకు వీరాభిమానులు ఉండడం సహజం. అయితే ఆ జట్టు ఒక మేజర్ కప్‌ను గెలిచేవరకు పెళ్లి చేసుకోమంటూ కొందరు భీష్మించుకు కూర్చోవడం మూర్కత్వం కిందకే వస్తుంది. ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీకి వీరాభిమానిగా ఉన్న ఒక యువతి.. ఐపీఎల్లో ఆ జట్టు కప్ కొట్టేవరకు పెళ్లి చేసుకోనంటూ మైదానంలో ప్లకార్డు పట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. అయితే ఆర్సీబీ ఈ సీజన్లో ప్లే ఆఫ్ చేరడం.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించడం జరిగిపోయాయి. ఇక ఈసారి ఆర్సీబీ టైటిల్ కొట్టినట్లేనని.. ఆ యువతి పెళ్లి చేసుకోవడం ఖాయమని అంతా భావించారు. కానీ విధి మరొకటి తలిచింది. ప్లేఆఫ్‌లో ఆర్సీబీకి ఉన్న ఒత్తిడి మరోసారి బయటపడింది. చివరిదాకా ఊరించి కచ్చితంగా టైటిల్ కొడుతుంది అనుకునే దశలో ఊసురుమనిపించే ఆర్సీబీ మరోసారి అదే పంథాను అనుసరించింది. శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పరాజయం చవిచూసింది. దీంతో ఆర్సీబీ విజేతగా నిలవాలనే కోరిక మరోసారి తీరని కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ప్లకార్డుతో హల్చల్ చేసిన యువతిని ఉద్దేశించి అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు.. నిరీక్షణ ఫలించలేదు.'' అంటూ పేర్కొన్నారు. ఇక రాజస్తాన్ ఓపెనర్ జాస్ బట్లర్ మెరుపులతో క్వాలిఫయర్-2 వన్‌సైడ్‌గా మారిపోయింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఆర్సీబీ పోరాటపటిమ చూపించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ రాజస్తాన్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానిక 157 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. రజత్ పాటిదార్ 58 పరుగులతో టాప స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ బట్లర్ దూకుడుతో లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించింది. బట్లర్ సిక్సర్లు, ఫోర్ల వర్షానికి ఆర్సీబీ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. అలా వరుసగా మూడోసారి ప్లేఆఫ్ చేరినప్పటికి ఆర్సీబీ.. ఈసారి కూడా ఐపీఎల్ కప్ కొట్టకుండానే ఇంటిబాట పట్టింది. చదవండి: Jos Buttler: వారెవ్వా.. బట్లర్ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాత గాయాన్ని గుర్తుపెట్టుకొని చావుదెబ్బ తీసింది..
ఆట అన్నాకా గెలుపోటములు సహజం. మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగినా ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది. యాదృశ్చికం అనాలో లేక అలా జరగాలని రాసిపెట్టి ఉందో తెలియదు కానీ ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి నాలుగేళ్ల ప్రతీకారాన్ని తీర్చుకొని దెబ్బకు దెబ్బ తీసింది. ఐపీఎల్ 2022 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. లీగ్ దశ మ్యాచ్‌లు నేటితో ముగియనున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండడంతో ఏ జట్టు విజేతగా అవతరిస్తుందనేది ఆసక్తిగా మారింది. కాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్సమధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. మ్యాచ్ గెలిచి ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా ప్లే ఆఫ్స్ వెళ్లేది. ఆ అవకాశం ఇవ్వని ముంబై ఢిల్లీని తమతో పాటు ఇంటికి తీసుకెళ్లి ఆర్సీబీకి మేలు చేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే సీన్ రిపీట్ అయింది. 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్) సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. మ్యాచ్ గెలిస్తే ముంబై ప్లే ఆఫ్ చేరుతుంది.. ఓడితే రాజస్తాన్ రాయల్స్ అర్హత సాధిస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ డేర్‌డెవిల్స్. అలా నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పుడు బంతి ముంబై ఇండియన్స్ కోర్టులో పడింది. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా ముంబైని ఓడించాల్సిందే. కానీ ముంబై ఆ అవకాశం ఇవ్వకుండానే ఢిల్లీని ఇంటిబాట పట్టించి.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు పంపించి ఒక రకంగా ప్రతీకారం తీర్చుకుంది. చదవండి: Tilak Varma: ఐపీఎల్లో తెలుగుతేజం తిలక్ వర్మ కొత్త చరిత్ర var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్ కప్ కొట్టబోతుంది..'
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ లీగ్ దశను రెండో స్థానంతో ముగించింది. శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 151 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. మొదట ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అర్థ సెంచరీతో మెరిసినప్పటికి.. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 40 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స ఆడి జట్టును ప్లేఆఫ్ చేర్చడంతో పాటు రెండో స్థానంలో నిలిపాడు. అంతకముందు బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఓవరాల్‌గా తనలోని ఆల్‌రౌండర్‌ను మరోసారి బయటపెట్టిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం అశ్విన్ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.''కీలక సమయంలో అర్థసెంచరీతో మెరవడం సంతోషంగా అనిపించింది. ఒత్తిడిలో ఆడడం నాకు ఎప్పుడు ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయమే కదా మనలో ఉన్న ప్రతిభను భయటపెట్టేది. జైశ్వాల్ మంచి పునాది వేయగా... దానిని నేను కంటిన్యూ చేశాను. ప్లేఆఫ్లోనూ ఇదే ప్రదర్శన చేసి ఫైనల్ చేరుకుంటాం. రాసిపెట్టుకోండి.. ఈసారి కచ్చితంగా రాజస్తాన్ కప్ కొట్టబోతుంది'' అని పేర్కొన్నాడు. అశ్విన్ ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడి 183 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. అశ్విన్ కామెంట్స్ విన్న క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో స్పందించారు. రాజస్తాన్ రాయల్స్‌కు కప్ అందించాలని అశ్విన్ కంకణం కట్టుకున్నాడు.. రాజస్తాన్‌కు కప్ అందించే వరకు వదలడంట.. ఒక్క ఇన్నింగ్స్‌తో మొయిన్ అలీని పక్కకు నెట్టేశాడు.. తన పాత జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్‌తో మెరుస్తాడని ఎవరు ఊహించి ఉండరు. అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ సీజన్‌ను రెండో స్థానంతో ముగించిన రాజస్తాన్ రాయల్స్.. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఒకవేళ మ్యాచ్‌లో ఓడినప్పటికి రాజస్తాన్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో తలపడుతాయి. కాగా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను మే 24(మంగళవారం) ఆడనుంది. Playoffs Qualification ✅ No. 2⃣ in the Points Table ✅ Congratulations to the @IamSanjuSamson-led @rajasthanroyals. 👏 👏 Scorecard ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK pic.twitter.com/PldbVFTOXo — IndianPremierLeague (@IPL) May 20, 2022 -
ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ మరొక పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్లేఆఫ్‌కు దగ్గరైన వేళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఓటమిపాలై అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. పంజాబ్ భారీ స్కోరు చేసినప్పటికి ఆర్సీబీ అసలు పోరాడే ప్రయత్నమే చేయలేదు. మరి ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి మ్యాచ్ ఆడనున్న ఆర్సీబీ ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. ప్రస్తుతం ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఆరు పరాజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీనికి తోడు ఆర్సీబీ నెట్‌రన్‌రేట్ కూడా మైనస్‌లో ఉంది. గుజరాత్‌తో మ్యాచ్ గెలిస్తే.. 16 పాయింట్లతో ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా ఆర్సీబీకి గుజరాత్‌తో మ్యాచ్ డూ ఆర్ డై అనొచ్చు. ఆర్సీబీ ఓడినా కూడా ఒక అవకాశం ఉంది. ప్లే ఆఫ్‌లో తొలి రెండు స్థానాలు గుజరాత్, లక్నోలు దాదాపు ఖరారు చేసుకున్నట్లే. ఇక మూడో జట్టుగా రాజస్తాన్ రాయల్స్‌కు అవకావం ఉన్నప్పటికి.. మూడు, నాలుగు స్థానాలకు ఎక్కువ జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ప్లస్ నెట్ రన్‌రేట్‌తో ముందంజలో ఉన్నాయి. ఒకవేళ పంజాబ్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఏ జట్టైనా తమ చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఆర్సీబీ కథ ముగిసినట్లే. మరి ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకుంటుందా లేక మరోసారి లీగ్ దశలోనే ఇంటిబాట పడుతుందా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కోహ్లి బ్యాడ్ ఫామ్‌పై స్పందించాడు. ''కోహ్లికి నా మద్దతు ఉంటుంది. అతను బ్యాడ్‌ఫేజ్ చూస్తున్న మాట నిజమే.. కానీ అతని కోసం ఒక మంచి ఇన్నింగ్స్ ఎదురుచూస్తుంది.. దానిని అందుకుంటానని కోహ్లి గట్టిగా నమ్ముతున్నాడు. కోహ్లి తేలికైన ఆటను ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు.. కానీ అన్ని మార్గాలు అతని ఔట్ కోసం వచ్చేస్తున్నాయి. ఒక గేమ్‌లో ఇలా జరగడం సహజం. ఏదైనా సరే.. పాజిటివ్‌గా ఉంటూ కష్టపడితే ఫలితం కనిపిస్తుంది. వాస్తవానికి ఈరోజు మ్యాచ్‌లో కోహ్లి కొన్ని మంచి షాట్లు ఆడాడు. ఇలాంటి ఆటను మున్ముందు కూడా ఆడుతూ భారీ స్కోర్లు చేయాలని కోరుకుంటున్నా..'' అంటూ తెలిపాడు. చదవండి: Virat Kohli: అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం! IPL 2022: దీని దుంపతెగ.. పాడు పిల్లి ఎంత పనిచేసింది A clinical win for @PunjabKingsIPL! 👏 👏 6⃣th victory of the season for @mayankcricket & Co. as they beat #RCB by 54 runs. 👍 👍 Scorecard ▶️ https://t.co/jJzEACTIT1#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/Zo7TJvRTFa — IndianPremierLeague (@IPL) May 13, 2022 -
'కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్.. తలదించుకొనే బ్యాటింగ్ కొనసాగించా'
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్లో ఉంటుందని.. మనం తట్టుకోవడం కష్టమంటూ పేర్కొన్నాడు. గౌరవ్ కపూర్ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ యూట్యూబ్ షోలో సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోహ్లితో జరిగిన అనుభవాన్ని సూర్య ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. ''165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాం. అయితే రెండు వికెట్లు కోల్పోవడంతో మా చేజింగ్ కాస్త స్లోగా సాగుతుంది. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఎవరు ఏం చేసినా నా బ్యాటింగ్ ఫోకస్‌ను కోల్పోకూడదని భావించాను. కానీ అప్పటి ఆర్సీబీ కెప్టెన్ కోహ్లి రూపంలో నాకు ఎదురుగా కనిపించాడు. గ్రౌండ్లో ఉంటే కోహ్లి ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి. అతను పొరపాటు స్లెడ్జింగ్‌కు దిగాడో తట్టుకోవడం కష్టం. ఒక రకంగా కోహ్లికి ఎనర్జీ లాంటిది. తన చర్యలతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లను కన్ఫూజ్ చేస్తాడు. అతని మాయలో పడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. పైగా ఇరుజట్లకు అది కీలక మ్యాచ్. ఓడిన జట్టు ఇంటికి.. గెలిచిన జట్టు ఫైనల్‌కు. ఈ పరిస్థితుల్లో కోహ్లి కళ్లలో పడకూడదనే ఉద్దేశంతో బ్యాటింగ్ కొనసాగించా. కోహ్లి నాకు ఎదురుగా ఉన్నప్పుడు తలదించుకొని బ్యాటింగ్ చేశా. దీనివల్ల నా ఫోకస్ దెబ్బతినలేదు. నేను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కోహ్లిని నేను ఏమి అనలేదు.. నన్ను కోహ్లి ఎలాంటి స్లెడ్జ్ చేయలేదు. మ్యాచ్ విజయానికి చేరువవుతున్న తరుణంలో మనుసులో ఈ విధంగా అనుకున్నా.'' ఇంతవరకు అంతా సక్రమంగానే జరిగింది. ఇంకో 10 సెకన్లు ఓపిక పడితే మ్యాచ్ గెలుస్తాం.. ఈ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు''.. ఇక కోహ్లి ఒక సందర్బంలో నా దగ్గరికి వచ్చాడు. కానీ అదే సమయంలో నా బ్యాట్ కిందపడిపోవడంతో ఏం మాట్లాడకుండా బ్యాట్ తీసుకోవడానికి కిందకు వంగాను. కోహ్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేము మ్యాచ్ గెలవడం.. ఆపై టైటిల్ గెలవడం జరిగిపోయింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గి ఐదోసారి ఐపీఎల్ టైటిల్ ఎగురేసుకపోయింది. చదవండి: IPL 2022: కోహ్లి చెత్త రికార్డు.. ప్లీజ్.. భారంగా మారొద్దు.. ఇకనైనా! Kohli-Wasim Jaffer: కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?!
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్ మధ్య జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్ చివర్లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. సిడ్నీ సిక్సర్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో హెడెన్ కెర్ 94 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. స్ట్రైకింగ్లోనూ అతనే ఉండడంతో సిడ్నీ సిక్సర్స్ ఈజీగానే విజయం సాధిస్తుందనుకున్నాం. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్ సిల్క్ గాయపడ్డాడు. ఆఖరి బంతి తర్వాత ఎలాగో పెవిలియన్ చేరాల్సి ఉంటుంది. అయితే ఆఖరి బంతికి మందు గాయపడిన సిల్క్‌ను రిటైర్డ్‌హర్ట్‌గా వెనక్కిపిలిచి అతని స్థానంలో జే లెంటన్‌ను నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌కు పిలిచారు. చదవండి: Rovman Powell: 10 సిక్సర్లతో విండీస్ బ్యాటర్ విధ్వంసం క్రికెట్ పుస్తకాల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ ఆట చివర్లో గాయపడితే రిటైర్డ్‌హర్ట్‌గా అతని స్థానంలో కొత బ్యాట్స్‌మన్‌ను తీసుకోవచ్చు. కానీ సిక్సర్స్ ఆ రూల్‌ను ఫాలో అయ్యే లెంటన్‌ను తీసుకొచ్చింది. అయితే గెలిచే సమయానికి ఇలాంటి నిర్ణయం ఎందుకన్నది ఎవరికి అంతుచిక్కలేదు. పైగా ఆఖరి బంతికి ఫోర్ కొట్టి సెంచరీతో హెడెన్ కేర్ జట్టును ఫైనల్ చేర్చాడు. ''మ్యాచ్ ఎలాగో గెలిచారు.. మరి ఆఖర్లో ఈ డ్రామాలేంటి'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. వెల్స్ 62 నాటౌట్, ఇయాన్ కాక్బ్రెయిన్ 48, రెన్ షా 36 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్.. పెర్త్ స్కార్చర్స్‌తో తలపడనుంది. The @sixersBBL decision to retire Jordan Silk hurt on the final ball caught us all off-guard 🤔 #BBL11 pic.twitter.com/GbU2qfBgBi — KFC Big Bash League (@BBL) January 26, 2022 -
ప్లే ఆఫ్స్: ఢిల్లీ వెళ్లింది.. బెంగళూరునూ తీసుకెళ్లింది
రన్‌రేట్‌తో పనిలేకుండా... ఇతర జట్లతో సంబంధం లేకుండా ఢిల్లీ క్యాపిటల్స్ దర్జాగా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గత నెల 17వ తేదీ వరకే క్యాపిటల్స్ 7 మ్యాచ్‌ల్ని గెలిచింది. ఇంకా ఐదు మ్యాచ్‌లుండగానే బెర్త్ ఖాయమనుకున్నారంతా! కానీ అటుమీదట వరుసగా ఓడిపోవడంతో... ‘బెంగ’తో ఇప్పుడీ ఆఖరి పోరాటం తప్పలేదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో విజయంతో రెండో స్థానానికి ఎగబాకింది. లీగ్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ బెంగళూరు ఓడినప్పటికీ ఢిల్లీ ఛేజింగ్ నెమ్మదిగా ఉండటంతో కోహ్లి బృందం తమ రన్‌రేట్‌ను కోల్‌కతా నైట్రైడర్స్కంటే మెరుగుపర్చుకొని ప్లే ఆఫ్స్‌కు చేరింది. అబుదాబి: ఢిల్లీ తమ పరాజయాల పరంపరకు అవసరమైన దశలో చెక్ పెట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో (ఆర్సీబీ) కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై సరసన నిలిచింది. దీంతో పాయింట్ల పట్టకిలో టాప్–2లో నిలిచిన ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌లో ఓడినా... ఫైనల్ చేరేందుకు రెండో దారి (క్వాలిఫయర్–2) ఉంటుంది. ఈనెల 5న జరిగే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. 6న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడే ప్రత్యర్థి కోల్‌కతానా, హైదరాబాదా నేడు తేలుతుంది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నోర్జే 3 వికెట్లు తీయగా...రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ రన్‌రేట్ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది. విరాట్ విఫలం... ముందుకెళ్లెందుకు, టాప్–2ను పదిల పరుచుకునేందుకు ఆఖరి అవకాశమైన మ్యాచ్‌లోనూ కెప్టెన్ కోహ్లి సత్తా చాటలేకపోయాడు. ఆట మొదలైన కాసేపటికే ఓపెనర్ ఫిలిప్ (12) ఔటయ్యాడు. దేవ్‌దత్ చక్కగా ఆడుతుండగా... కెప్టెన్ కోహ్లితో జతయ్యాడు. కానీ ఆశించినంత వేగంగా మాత్రం ఇన్నింగ్స్ సాగలేదు. అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో కవర్స్ మీదుగా సిక్సర్ కొట్టిన కోహ్లి కాసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో స్టొయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి డివిలియర్స్ రాగా.. పడిక్కల్ 40 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. కానీ మరుసటి ఓవర్లోనే బెంగళూరుకు కోలుకోలేని దెబ్బలు తగిలాయి. నోర్జే చక్కని బంతులతో క్రీజులో పాతుకుపోయిన దేవ్‌దత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బంతి వ్యవధిలో అప్పుడే వచ్చిన మోరిస్ (0)ను డకౌట్ చేశాడు. ఒక ఓవర్లు దగ్గరపడుతుండటంతో ఏబీ డివిలియర్స్, శివమ్ దూబేలు తమ బ్యాట్లకు పనిచెప్పారు. డేనియల్ సామ్స్ వేసిన 18వ ఓవర్లో డివిలియర్స్ బౌండరీ కొట్టగా, దూబే సిక్స్, ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. రబడ 19వ ఓవర్లో ఏబీ స్క్వేర్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. దూబే ఎక్స్ట్రా కవర్లోకి బౌండరీ కొట్టాడు. కానీ మరో షాట్‌కు ప్రయత్నించి డీప్‌మిడ్ వికెట్లో రహానే చేతికి చిక్కాడు. ఆఖరి ఓవర్‌ను నోర్జే అద్భుతంగా కట్టడి చేశాడు. స్ట్రయిక్ కోసం లేని పరుగుకు ప్రయత్నించిన ఏబీ రనౌట్ కాగా... ఉదాన ఫోర్ కొట్టిన మరుసటి బంతికే ఔటయ్యాడు. దీంతో 20వ ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. మెరిసిన ధావన్, రహానే... ఢిల్లీ పరుగుల వేట ధాటిగా మొదలైంది. మోరిస్ తొలి ఓవర్లో ధావన్ 2 బౌండరీలు కొట్టాడు. తర్వాత సిరాజ్ ఓవర్లో పృథ్వీ షా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ సిరాజ్ అద్భుతమైన డెలివరీతో పృథ్వీ షాను బౌల్డ్ చేశాడు. బెంగళూరు శిబిరం ఆనందతాండవం చేసింది. కానీ అనుభవజ్ఞుడైన రహానే, సీనియర్ ఓపెనర్ ధావన్ నింపాదిగా ఆడటంతో బెంగళూరుకు కష్టాలు తప్పలేదు. ఇద్దరు అనవసర షాట్లకు వెళ్లకుండా ఒకట్రెండు పరుగులు తీస్తూనే అడపాదడపా బౌండరీలు కూడా బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. చేయాల్సిన రన్‌రేట్‌ను పడిపోకుండా ఇద్దరు బాధ్యతగా పరుగులు జతచేశారు. ఈ క్రమంలోనే ముందుగా ధావన్ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే షాబాజ్ బౌలింగ్ స్వీప్ షాట్ ఆడబోయి దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7)ను కూడా షాబాజే పెవిలియన్‌కు దారి చూపాడు. రహానే కూడా 37 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఆఖరి దశకు చేరుతున్న సమయంలో రహానే కూడా 18వ ఓవర్లో ఔట్ కావడంతో బెంగళూరులో ఆశలు చిగురించాయి. కానీ సిరాజ్ రెండు వైడ్లతో పాటు 8 బంతులు వేయడంతో స్టొయినిస్ 6, 4 కొట్టి ఓవర్కంటే ముందుగానే మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిలిప్ (సి) పృథ్వీ షా (బి) రబడ 12; దేవదత్ (బి) నోర్జే 50; కోహ్లి (సి) స్టొయినిస్ (బి) అశ్విన్ 29; డివిలియర్స్ (రనౌట్) 35; మోరిస్ (సి) పంత్ (బి) నోర్జే 0; శివమ్ దూబే (సి) రహానే (బి) రబడ 17; సుందర్ (నాటౌట్) 0; ఉదాన (సి) శ్రేయస్ (బి) నోర్జే 4; అహ్మద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–25, 2–82, 3–112, 4–12, 5–145, 6–146, 7–150. బౌలింగ్: డేనియల్ సామ్స్ 4–0–40–0, రవిచంద్రన్ అశ్విన్ 4–0–18–1, నోర్జే 4–0–33–3, రబడ 4–0–30–2, అక్షర్ పటేల్ 4–0–30–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సిరాజ్ 9; శిఖర్ ధావన్ (సి) శివమ్ దూబే (బి) షాబాజ్ అహ్మద్ 54; రహానే (సి) శివమ్ దూబే (బి) సుందర్ 60; శ్రేయస్ అయ్యర్ (సి) సిరాజ్ (బి) షాబాజ్ అహ్మద్ 7; రిషభ్ పంత్ (నాటౌట్) 8; స్టొయినిస్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–19, 2–107, 3–130, 4–136. బౌలింగ్: మోరిస్ 2–0–19–0, సిరాజ్ 3–0–29–1, సుందర్ 4–0–24–1, ఉదాన 2–0–24–0, చహల్ 4–0–29–0, షాబాజ్ నదీమ్ 4–0–26–2. -
వార్నర్ లేకుండానే...
సాక్షి, హైదరాబాద్: ప్లే ఆఫ్ బెర్తు సాధనే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక సమరానికి సిద్ధమైంది. నేడు ముంబై వేదికగా జరుగనున్న లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై ఇండియన్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లు దాదాపు అంతిమ దశకు చేరుకోవడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై 16 పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ విజయం హైదరాబాద్‌ను వరిస్తే 14 పాయింట్లతో ముంబై, హైదరాబాద్ సమంగా నిలుస్తాయి. వార్నర్ లేకుండానే... లీగ్‌లో రైజర్స్ ప్రస్థానం భిన్నంగా సాగుతోంది. అయితే గొప్ప విజయాలు, లేకపోతే చెత్త ఓటములను నమోదు చేస్తూ నిలకడ లేమిని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్, ఓపెనర్ వార్నర్ లేకుండానే నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ బరిలో దిగనుంది. ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడి ఒక శతకం, 8 అర్ధశతకాలతో అతను 692 పరుగుల్ని సాధించాడు. కీలక సమయంలో వార్నర్ లేకపోవడం సన్‌రైజర్స్ జట్టుకు పెద్ద లోటు. వార్నర్ స్థానంలో రానున్న మార్టిన్ గప్టిల్ అతని స్థానాన్ని భర్తీ చేయాలని రైజర్స్ యాజమాన్యం ఆకాంక్షిస్తోంది. మనీశ్ పాండే పుంజుకోగా... కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంకా ధాటి కనబరచలేకపోతున్నాడు. విజయ్ శంకర్ అంచనాలకు తగ్గట్లుగా రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లోనూ రషీద్ ఖాన్, నబీపై రైజర్స్ ఆధారపడుతోంది. వీరిద్దరితో పాటు పేసర్లు భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్నారు. లీగ్ దశలో 12 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 6 విజయాలు, 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ముంబై కన్నా హైదరాబాద్‌కు మరింత కీలకం. ఒకవేళ ముంబైతో మ్యాచ్‌లో రైజర్స్ ఓడిపోతే తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దానితో పాటు కోల్‌కతా, పంజాబ్ జట్ల ఫలితాలపై ఆధారపడి రైజర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్క విజయం దూరంలో... లీగ్ ప్రారంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు కుదురుకుంది. హర్దిక్ పాండ్యా, పొలార్డ్ విధ్వంసక ఆటతీరుతో కొన్ని అద్భుతమైన విజయాలు మూటగట్టుకుని ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. వీరిద్దరూ తమ బ్యాట్లకు పనికల్పిస్తే హైదరాబాద్ ఎంత లక్ష్యం విధించినా తక్కువే అవుతుంది. మరోవైపు ప్లే ఆఫ్ బెర్తుకు కేవలం ఒక విజయం దూరంలోనే ఉండటంతో ఈ మ్యాచ్‌లోనే దాన్ని సాధించాలని ముంబై పట్టుదలగా ఉంది. కెప్టెన్ రోహిత్ (307 పరుగులు), డికాక్ (393 పరుగులు) ఓపెనింగ్‌లో రాణిస్తుండగా... మిడిలార్డర్లో హార్దిక్, పొలార్డ్ అదరగొడుతున్నారు. సూర్యకుమార్, కృనాల్ భారీ స్కోర్లపై దృష్టి సారిస్తే ముంబై బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారుతుంది.