Ponniyin Selvan
-
పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్
అక్కినేని కాబోయే కోడలు శోభిత.. హిందీలో సినిమాలు చేస్తూ కాస్త బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం హీరో నాగచైతన్యతో ఈమెకు నిశ్చితార్థం జరగ్గా.. త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండొచ్చని అంటున్నారు. అయితే పెళ్లికి ముందే పిల్లల గురించి, వాళ్లకు ఏం చెప్పాలో శోభిత డిసైడ్ అయిపోయింది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)తెలుగులో 'మేజర్', 'గూఢచారి' సినిమాలు చేసిన శోభిత.. ఇతర భాషల్లో మాత్రం చాలా చిత్రాల్లో నటించింది. అలా తమిళంలో చేసిన మూవీ 'పొన్నియిన్ సెల్వన్'. మణిరత్నం తీసిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. తాజాగా ఐఫా వేడుకలో బోలెడన్ని అవార్డులు దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం రిలీజై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సినిమాలోని యాక్టర్స్ అందరూ అవెంజర్స్ అని పొగిడేస్తూ పోస్ట్ పెట్టింది.'వీళ్లందరూ అవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతాను' అని శోభిత మూవీ టీమ్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఇదలా ఉంచితే తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'పొన్నియిన్ సెల్వన్'. ఇదే పేరుతో సినిమా తీశారు. ఇందులో త్రిషకి తోడుగా ఉండే పాత్రలో శోభిత నటించింది.(ఇదీ చదవండి: దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
సూపర్‌స్టార్ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో మెరిసింది. గతేడాది పొన్నియిన్ సెల్వన్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య లీడ్ రోల్ ఉత్తమనటిగా(క్రిటిక్స్) సైమా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది.ఈ వేడుకకు హాజరైన ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన తల్లిని చూసి పరుగెత్తుకుంటూ స్టేజీ వద్దకు వచ్చింది. తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని అభినందించింది. అదే సమయంలో అక్కడే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కాళ్లకు ఆరాధ్య నమస్కరించింది. ఆయన పాదాలకు మొక్కిన ఆరాధ్య ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్ నటించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు గానూ ఫీమేల్ లీడ్ రోల్ (క్రిటిక్స్) విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. కాగా.. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను మణిరత్నం తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న చైల్డ్ ఆర్టిస్ట్!
సారా అర్జున్.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చే చిత్రం దైవతిరుమగళ్. విక్రమ్, అనుష్క, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ఆ చిత్రంలో కీలక పాత్రను పోషించిన బాలనటి సారా. ఆ తరువాత సైవం చిత్రంలోనూ బాల నటిగా ముఖ్యపాత్ర పోషించి పేరు తెచ్చుకుంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందితగా నటి ఐశ్వర్యరాయ్ పోషించిన విషయం తెలిసిందే. అందులో చిన్న నందినిగా సారా నటించింది. ఆ బాలనటి హీరోయిన్గా.. ఆ బాల తార ఇప్పుడు హీరోయిన్గా మారుతోంది. దివంగత ఛాయాగ్రాహకుడు, దర్శకుడు జీవా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్ ధూమ్ వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈయన వారసురాలు సనా మరియం ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈమె దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటి సారా అర్జున్ కథానాయికగా పరిచయం కానుంది. ఆ బాలనటుడు హీరోగా మరో విశేషం ఏమిటంటే పొన్నియిన్ సెల్వన్‌లో విక్రమ్ చిన్ననాటి పాత్రను పోషించిన బాలనటుడు సంతోష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. దీన్ని కుష్బూ, సుందర్ సి.. అవ్నీ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. చదవండి: 'యానిమల్' విజయంలో ఎందుకు కనిపించలేదంటే.. -
యంగ్ హీరోతో జతకట్టనున్న పొన్నియిన్ సెల్వన్ భామ!
వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్న యంగ్ హీరో అశోక్‌సెల్వన్. ఇటీవల ఈయన నటించిన పోర్ తొళిల్, బ్లూస్టార్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించాయి. తాజాగా అశోక్‌సెల్వన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పొన్ను ఒన్ను కండేన్. వి. ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఫేమ్ ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటిస్తున్నారు. వసంత రవి మరో ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. పొన్ను ఒన్ను కండేన్ చిత్రం యువతను ఆకట్టుకునే పలు ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందని సమాచారం. అశోక్‌సెల్వన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి చిన్న గ్యాప్ తరువాత ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
స్పీడ్ పెంచిన విక్రమ్
నటుడు విక్రమ్ వరుస సనిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయం ఈయనలో నూతనోత్సాహాన్ని పెంచింది. దీంతో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. విక్రమ్ కథానాయకుడిగా చాలా కాలం నిర్మాణంలో ఉన్న ధృవనక్షత్రం చిత్రం విడుదలకు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటోంది. త్వరలో ఈ చిత్రం తెరపై రానుందని సమాచారం. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం తంగలాన్ సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల కానుంది. కేఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తాజాగా చిత్తా చిత్రం ఫేమ్ యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వెలువడింది. ఇదిలా ఉంటే విక్రమ్ తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. ఇంతకు ముందు హిప్హాప్ తమిళా ఆది హీరోగా నటించిన అన్బరివు చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ రామ్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలిసింది. దీన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా విక్రమ్ అభిమానులు తంగలాన్ చిత్రం విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
RRR, పుష్ప చిత్రాలను చూడకుండానే తప్పుబట్టిన సీనియర్ నటుడు
ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుంది. దానికి నిదర్శనమే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ వంటి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు అందుకున్నాయి. ఈ రెండు బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాల గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాలను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. (ఇదీ చదవండి: రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్ రెహ్మాన్‌పై ఫిర్యాదు) ఈ మధ్య వస్తున్న సినిమాల్లో హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కనిపిస్తోందని ఆయన తెలిపాడు. అమెరికాలోని మార్వెల్ చిత్రాలు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితే భారత్‌లో కూడా ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాడు. ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ చిత్రాలను ఇప్పటివరకూ చూడలేదంటూ ఈ చిత్రాల్లో హీరోయిజం ఎక్కువగా ఉందని ఆయన తెలిపాడు. ఇలాంటి చిత్రాలు చూసిన ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చూశానని, ఆయన గొప్ప దర్శకుడని కొనియాడాడు. ఆయన ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారని అందుకే ఆ సినిమా కూడా బాగా వచ్చిందని నసీరుద్దీన్ షా తెలిపాడు. ఇక్కడ ఆయన మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ సినిమాలు చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన నసీరుద్దీన్ షాను పలువురు విమర్శిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్‌ను ఆయనకు గుర్తుచేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది మర్చిపోయారా అని చెబుతూనే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డును దక్కించుకున్నాడని నెటిజన్లు ఆయనకు గుర్తు చేస్తున్నారు. -
తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్ 2023 వేడుక ముగిసింది. తమిళ్ నుంచి విక్రమ్ సినిమాకు గాను కమల్ హాసన్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్, కీర్తి సురేష్, మణిరత్నం,మాధవన్ వంటి సూపర్ స్టార్స్‌కు అవార్డ్స్ దక్కాయి. తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (తమిళం): (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ దర్శకుడు (తమిళం): లోకేష్ కనగరాజ్ (విక్రమ్) * ఉత్తమ నటుడు (తమిళం): కమల్ హాసన్ (విక్రమ్) * ఉత్తమ నటి (తమిళం): త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని * ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (విక్రమ్) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) * ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా * ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి) * ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్) * ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే) * ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల * ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి) * ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే) * ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ (విరుమాన్) * ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం * ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) (ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) -
17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ స్టార్ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. ఆమె ఎవరో కాదు.. నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్. ఈ ఏడాది రిలీజైన మణిరత్నం బ్లాక్‌బస్టర్ మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రంలోనూ కనిపించింది. 2010లో విజయ్ చిత్రం దైవ తిరుమగల్లో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్ జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తమిళం, హిందీతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నటించింది. శైవం చిత్రంలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1లో యువ నందిని(ఐశ్వర్యరాయ్ పాత్రకు)గా కనిపించింది. ఈ క్యారెక్టర్ సారాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పార్ట్-2లోనూ మరింత అందంగా కనిపించింది. సారా అర్జున్ 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపును తెచ్చిపెట్టింది. తన రాబోయే ప్రాజెక్ట్‌లో దళపతి విజయ్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసిన అతను రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Panniru Rajkumar (@rajkumar_sara_arjun) -
త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్
నాలుగుపదుల వయస్సులోనూ త్రిషకు అవకాశాలు వెల్లవెత్తుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ చైన్నె సుందరికి మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో బిగ్ బ్రేక్ ఇచ్చారు. దీనిని రెండు భాగాలుగా త్రిష అందాలను మెరుగుపరచడమే కాకుండా అమెలోని అద్భుతమైన అభినయాన్ని బయటకు తీశారు. (ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం') ఆ చిత్రంలోని ఘటనకు ప్రశంసల వర్షం కురిపించుకున్న త్రిష ఆ తరువాత అవకాశాల జోరులో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం విజయ్ సరసన లియో చిత్రంలో నటించిన ఈ బ్యూటీ తదుపరి అజిత్ కథానాయకుడిగా నటించనున్న విడాముయిర్చి చిత్రంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు సుదీర్ఘ విరామం తరువాత తెలుగులో చిరంజీవితో జతకట్టే అవకాశం వరించింది. మరికొన్ని నూతన అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో త్రిషకు దర్శకుడు మణిరత్నం నుంచి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన మెద్రాస్ టాకీస్ పతాకంపై చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన నిర్మించే చిత్రంలో త్రిషను కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కృతి శెట్టితో సినిమా ప్రకటించిన 'పొన్నియిన్ సెల్వన్'
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో అరుళ్మొళిగా టైటిల్ పాత్రను పోషించి అందరి ప్రశంసలను పొందిన నటుడు జయంరవి. ఈయన నటించిన చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఎల్కేజీ, కోమాలి, మూక్కుత్తి అమ్మన్, వెందు తనిందదు కాడు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. దీనికి జీనీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. (ఇదీ చదవండి: Salaar Teaser: ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి .. 'సీజ్ఫైర్' అంటే ఏమిటో తెలుసా?) ఈ చిత్రం ద్వారా మిష్కిన్ శిష్యుడు జేఆర్ అర్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నటి కల్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, వామిక కబి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటి దేవయాని ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్థానిక తిరువేర్కాడు సమీపంలోని పీజీఎస్ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖుల హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మహేశ్ ముత్తుసామి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ సహా ఐదు భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్) -
లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!
భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. (ఇది చదవండి: లైకా ఖాతాలో.. అరుణ్ విజయ్ చిత్రం) చెన్నైలో లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఆస్తులపై ఈడీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ప్రొడక్షన్ హౌస్‌లో అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై లైకా ప్రతినిధులు ఎలాంటి అధికారికి ప్రకటన చేయలేదు. ఈడీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్) తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థగా పేరుంది. రజినీకాంత్ రోబో'2.0', మణిరత్నం'పొన్నియిన్ సెల్వన్ 1', 'పొన్నియిన్ సెల్వన్ 2'తో సహా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది. గతంలో రజనీకాంత్ 'దర్బార్' చిత్రాన్ని కూాడా తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయనతో 'లాల్ సలామ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా.. హిందీలో జాన్వీ కపూర్ నటించిన 'గుడ్ లక్ జెర్రీ' (2022), అక్షయ్ కుమార్ యొక్క 'రామ్ సేతు' (2022) చిత్రాలను నిర్మించింది. కాగా.. ఇటీవలే టాలీవుడ్‌లోనూ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ED conducts raids at LYCA Productions in Chennai. More details awaited: Sources pic.twitter.com/lZOX7pE9ks — ANI (@ANI) May 16, 2023 -
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్
-
రోజూ బిర్యానీ తినలేం కదా.. సాంబారు అన్నం తినక తప్పదు : నటుడు
మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్‌సెల్వన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా నటుడు జయం రవి పేర్కొన్నారు. శుక్రవారం ఈ చిత్ర రెండవ భాగం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో జయం రవి టైటిల్ పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఐదేళ్ల శ్రమ పొన్నియిన్ సెల్వన్ (రెండు భాగాలు) అని ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులతో కలిసి నటించడం మరచిపోలేని మధురానుభూతిగా జయం రవి పేర్కొన్నారు. చదవండి:రోజూ బిర్యానీ తినలేం కదా.. సాంబారు అన్నం తినక తప్పదు : నటుడు షూటింగ్ సమయంలో అందరం పలు విషయాల గురించి ముచ్చటించుకునే వాళ్లమని చెప్పారు. మళ్లీ ఇంతమంది ప్రముఖ నటీనటులతో కలిసి నటించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అలాంటి చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ముందుకు రావాలిగా అని పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని భారీ చిత్రాల్లో నటించిన తరువాత మీరు నటిస్తున్న తర్వాత చిత్రాలను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్న ప్రశ్నకు మనం రోజూ బిరియానీ తినలేము కదా, సాంబారు అన్నం తినక తప్పదు కదా. అదే విధంగా పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు అరుదుగా వస్తాయని కాబట్టి తన తర్వాత చిత్రాలకు ఆదరణ లభిస్తుందా అనే సందేహం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇరైవన్ చిత్రాన్ని పూర్తి చేశానని, నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని చెప్పారు. ప్రస్తుతం సైరన్ చిత్రంలో నటిస్తున్నానని ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. కాగా సైరన్ చిత్రంలో తండ్రి పాత్ర కోసం సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు రాజేష్ ఎం.దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నట్లు ఇది కూడా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? మెగా ఫోన్ ఎప్పుడు పట్టనున్నారు అన్న ప్రశ్నకు ఆ ఆలోచన ఉందని అందుకు చిన్నచిన్న కథలను కూడా తయారు చేసుకున్నట్లు చెప్పారు. అందులో ఒక కథ గురించి చెప్పగా బాగుంది నువ్వు మంచి దర్శకుడు అవుతావు అని పేర్కొన్నారు. కాగా తాను దర్శకత్వం వహించే చిత్రంలో కార్తీ నటిస్తారని ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పానని జయంరవి చెప్పారు. -
బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం గతేడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న (ఏప్రిల్28) రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైంది. ఈ చిత్రానికి ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రివ్యూ) వీటిలో ఒక్క తమిళనాడులోనే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. కేరళలో రూ.2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు, కర్ణాటకలో రూ.4.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్లో రూ.24.70 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తంగా రూ.170 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.172 కోట్లు సాధించాలి. తొలి రోజే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: నాటు నాటు నా టాప్ సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్ కామెంట్స్) మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. -
PS2 Movie Review: ‘పొన్నియన్ సెల్వన్-2’ మూవీ రివ్యూ
టైటిల్: పొన్నియన్ సెల్వన్-2 నటీనటులు: చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ దర్శకత్వం : మణిరత్నం సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ విడుదల తేది: ఏప్రిల్28, 2022 ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 పై ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుగు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రివ్యూలో చూద్దాం. కథేంటంటే... చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్ రాజ్) చిన్న కుమారుడు అరుళ్‌మోళి అలియాస్ పొన్నియన్ సెల్వన్(జయం రవి) నౌకలో తన రాజ్యానికి తిరిగివెళ్తుండగా శత్రువుడు దాడి చేయడం.. పోరాటం చేస్తూ ఆయన సముద్రంలో పడిపోవడం.. ఒక ముసలావిడ సముద్రంలో దూకి అతన్ని కాపాడటం. ఆ ముసలావిడకు పళవూరు రాణి నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలు ఉన్నట్లు చూపించి మొదటి భాగాన్ని ముగించాడు దర్శకుడు మణిరత్నం. (చదవండి: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) అసలు ఆ ముసలావిడ ఎవరు? నందినికి ఆ ముసలావిడకి ఎలాంటి సంబంధం ఉంది? అరుళ్మోళికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ ముసలావిడ ఎందుకు కాపాడుతుంది? చోళరాజ్యాన్ని నాశనం చేయాలని ప్రతీజ్ఞ పూనిన పాండ్యుల లక్ష్యం నెరవేరిందా? ఆదిత్య కరికాలుడు(చియాన్ విక్రమ్)పై పగ పెంచుకున్న నందిని.. అతన్ని అంతం చేసేందుకు పన్నిన కుట్రలు ఫలించాయా? నందిని విషయంలో తప్పు చేశానని బాధపడుతున్న ఆదిత్య కరికాలుడు చివరకు ఏం చేశాడు? అసలు మందాకిని ఎవరు? ఆమెకు సుందర చోళుడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చోళ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యారు? అనేది తెలియాలంటే పొన్నియన్ సెల్వన్ 2 చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తొలి భాగంలో చోళ రాజ్య వ్యవస్థను.. సింహాసనం కోసం సొంతమనుషులే అంతర్గత కుట్రలు చేయడం.. చోళ రాజ్యాన్ని పతనం చేసేందుకు శత్రురాజ్యాలు వేచి చూడడం చూపించారు. ఇక రెండో భాగంలో ఆ కుట్రల వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. కథను మరింత లోతుగా చూపించాడు. ఆదిత్య కరికాలుడు, నందినిల ప్రేమ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. నందినిని పెళ్లి చేసుకోకుండా ఎవరు అడ్డుపడ్డారనేది మొదట్లోనే చూపించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర, ఎక్కడంటే?) ఆ తర్వాత అరుళ్‌మోళి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అతను చనిపోయాడని భావించిన శుత్రువులు.. కరికాలుడిని, సుందర చోళుడిని చంపడానికి వేసిన కుట్రలు.. బౌద్దుల సమక్షంలో జరిగే నాటకీయ పరిణామాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెండాఫ్లో మందాకిని నేపథ్యం గురించి తెలిపే సన్నివేశాలు.. ఆదిత్య కరికాలుడు, నందిని మధ్య జరిగే సంఘర్షణలు ఆకట్టుకుంటాయి. నందిని పాత్రకి సంబంధించిన ట్విస్టులు బాగుంటాయి. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లే చేసే కుట్రలు.. ప్రేమ, స్నేహం కోసం చేసే త్యాగాలు ఇందులో చూపించారు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ అనేది చోళ రాజులకు సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మణిరత్నం పీఎస్ 2ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో ఎక్కువ పాత్రలు ఉండడం.. అందులో ఒక్కో పాత్రకి రెండు,మూడు పేర్లు ఉండడం.. పైగా చరిత్రపై అందరికి పట్టుఉండకపోవడం ఈ సినిమాకు మైనస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు చోళుల చరిత్రపై అంతగా అవగాహన ఉండకపోవచ్చు. అందుకే పీఎస్1 టాలీవుడ్లో పెద్దగా ఆడలేదు. పీఎస్ 2 విషయంలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. పీఎస్ 1 చూసిన ప్రేక్షకులకు చోళ రాజ్య వ్యవస్థపై కాస్త అవగాహన వస్తుంది కాబట్టి.. రెండో భాగం నచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం చూసి వెళ్తేనే రెండో భాగం అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది. నందినిగా ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుంది. విక్రమ్ పాత్రకు నిడివి తక్కువే అయినా.. అతను కనిపించే సన్నివేశాలన్నీ అందరికి గుర్తిండిపోతాయి. పొన్నియన్ సెల్వన్‌గా జయం రవి చక్కగా నటించాడు. కుందవైగా త్రిష తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె నిడివి కూడా చాలా తక్కువే. మొదటి భాగంలో కార్తి పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఇందులో అంత నిడివి ఉండదు కానీ..ఒకటి రెండు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్గా ఆర్.పార్తిబన్, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ అంత బాగాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘పొన్నియన్ సెల్వన్ 2’ ట్విటర్ రివ్యూ
ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’నవల ఆధారంగా రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందులో మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించింది. ఇక రెండో భాగం నేడు (ఏప్రిల్ 28)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 కథ ఏంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. (చదవండి: ఆ ముసలావిడ ఎవరు? నందినిని చంపేశాడా?.. ఎన్నో ప్రశ్నలకు సమాధానమే పొన్నియన్ సెల్వన్ 2) పొన్నియన్ సెల్వన్ 2 మొదటి భాగం కంటే చాలా బాగుందంటున్నారు.పార్ట్ 1లో కథనం స్లోగా సాగితే.. పార్ట్ 2లో మాత్రం వేగంగా ఉంటుందని చెబుతున్నారు. చిత్రంలోని ఆర్ట్ డిజైన్ మరియు పాటలతో పాటు డ్రామా చాలా వరకు డీసెంట్‌గా ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి అంతటా పాజిటివ్ టాక్ కనిపిస్తోంది. స్క్రీన్‌ప్లే కూడా పార్ట్ 1 కంటే బాగుందట. మణిరత్నం దర్శకత్వం, రవివర్మ సినిమాటోగ్రఫీపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. #PS2 #PonniyanSelvan2 in USA… Better than first! Everything department top notch 🥵 House full on a weekday show! Mani Ratnam GOAT for a reason!!!@rekhshc @suhansidh — Reev Mani (@reev_mani) April 28, 2023 Movie is so entertaining !! First half is 🔥.. Second half got some lag but at the end looks great.. Some Goosebumps scenes are there.. Great effort from the technicians and ARR did a great job in #PonniyanSelvan2.. Ratting 4/5#PonniyanSelvan2Review #PS2 — VENKATESH ENGLISH PROFESSOR (MOTIVATIONAL SPEAKER) (@venkyjohn67) April 28, 2023 Blockbuster #PonniyanSelvan2 🙏 Part-2 >>>> Next level opening across!! AR Rehman Music ✨🔥 — THE VILLAIN (@NBKzealot) April 28, 2023 Completed watching #PonniyanSelvan2 a well executed movie than its prequel @Karthi_Offl rocked and @actor_jayamravi blasted as #ponniyanselvan @trishtrashers lovely♥️ #Chiyaanvikram totally a blockbuster sequel after some years in kollywood 👍 pic.twitter.com/25DMAUyD0Z — Navaneetha Krishnan (@navaneethanjuno) April 28, 2023 The best feel for chiyaan Anna fans after anniyan I think. Though mahaan is there it’s different case. Today the applause he is deserving is 🔥🔥🔥😭😭😭. @chiyaan finally ur hardwork and success matched bro. #PS2 — Greeshmanth Pulikanti (@PulikantiGreesh) April 28, 2023 #PS2 satisfiable continuation which justifies the part 1. Important events were sequenced appropriately and every character was given its due. Mani Ratnam’s ability to romance stands out again, but we get to see only few in this part. Technically sound, neatly performed. — Abiram Pushparaj (@abirampushparaj) April 28, 2023 #PonniyinSelvan2 Review POSITIVES: 1. Casting 2. Performances (#ChiyaanVikram & #AishwaryaRai) 3. Screenplay 4. Direction 5. Visuals 6. Music & BGM NEGATIVES: 1. Can be slow for some Overall, #PS2 is a terrific sequel that has soul in it👏#PonniyinSelvan2Review #PS2Review pic.twitter.com/mpopG6jx5h — Kumar Swayam (@KumarSwayam3) April 28, 2023 #PonniyinSelvan2 ~ #PS2 is as good as PS1 with an Impressive 2nd half. The big highlight scene of Vikram - Aishwarya is emotionally good. A proper conclusion. (3.5☆/5) pic.twitter.com/olOK1UTLAW — Prince Prithvi (@PrincePrithvi) April 28, 2023 முதல் பகுதி அப்படியே போர் அடிக்காம மெதுவா போகுது இன்டர்வெல் Goosebump மொமண்ட் இரண்டாம் பகுதி தெறிக்க விடுது செம்மையா இருக்கு படத்தின் மேல வச்ச நம்பிக்கைய காப்பற்றி விட்டது 🔥🔥🔥 தமிழ் சினிமாவில் பெருமை #PonniyinSelvan #PonniyinSelvanFDFS — S.NIRMAL KUMAR (@Nirmal_twitt) September 30, 2022 -
Ponniyin Selvan 2: ఆ ముసలావిడ ఎవరు? కుందవై ఏం చేసింది?
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ మూవీ మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఆదరించపోయినా.. తమిళంలో మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం రెండో భాగం రేపు (ఏప్రిల్ 28)న విడుదల కాబోతుంది. మొదటి భాగంలో మిగిలిపోయిన అనేక సందేహాలకు ఈ చిత్రంలో సమధానాలు దొరకనున్నాయి. అసలు పార్ట్ 1లో చెప్పిన స్టోరీ ఏంటి? పార్ట్ 2లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించబోతున్నాయి? నందిని ప్లాష్‌బ్యాక్ ఏంటి? ఆదిత్య కరికాలుడు(విక్రమ్) ప్రేమించిన యువతి నందిని(ఐశ్వర్యరాయ్)ని పెద్ద పళవేట్టురాయల్ పెళ్లి చేసుకున్నట్లు పార్ట్ 1లో చూపించారు. ఆమె అనాథ అయిన కారణంగా ఆదిత్య చెల్లి కుందవై(త్రిష) నందినిని తన సోదరుడుకి దక్కకుండా చేస్తుంది. ఒకవైపు యుద్దం చేస్తునే.. మరోవైపు నందిని కోసం వెతుకుతాడు కరికాలుడు. అప్పటికే పాండ్యరాజు నందినిని కూతురిలా పెంచుకుంటాడు. వీరిని కరికాలుడు చూస్తాడు. పాండ్యరాజును హత్య చేయ్యొద్దని వేడుకున్నా.. కరికాలుడు అతడిని చంపేస్తాడు. ఆ కోపంతో నందిని చోళ రాజ్య కోశాధికారి పళవేట్టు రాయర్ని పెళ్లి చేసుకొని తంజావురుకు వచ్చినట్లు పార్ట్ 1లో చూపించారు. అసలు నందిని నేపథ్యం ఏంటి? పాండ్య రాజుని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది? పెద్ద పళవేట్టురాయర్‌తో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది? లంకలో ఉన్న అరుణ్మొళిని చంపాలని ఎందుకు కుట్ర చేస్తుంది? అనేది రెండో భాగంలో తెలియనుంది చోళరాజులపై పెద్ద పళవేట్టురాయర్‌కు ఎందుకు కోపం? కోశాధికారిగా ఉన్న పెద్ద పళవేట్టురాయర్(శరత్ కుమార్).. రాజ్య చక్రవర్తి సుందరచోళుడి(ప్రకాశ్ రాజ్) అన్న కొడుకు మధురాంతకుడి(రెహమాన్)కి ఎందుకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఒకవైపు కోశాధికారిగా ఉంటూనే... లోలోపల సామంత రాజులను ఎందుకు రెచ్చగొడుతున్నాడు? వయసులో తనకంటే చాలా చిన్నదైన నందినిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సుందర చోళుడిపై ఎందుకు కోపం? మధురాంతకుడి కోరిక నెరవేరేనా? చోళ సామ్రాజ్యానికి ఎలాగైనా తానే అధిపతి కావాలని ఆశపడుతున్నాడు మధురాంతకుడు. తల్లి వద్దని చెప్పిన వారించినా.. వినకుండా కోశాధికారి పెద్ద పళవేట్టురాయర్‌తో చేతులు కలిపాడు. సామంత రాజులతో సమావేశమై పన్నాగాలు పన్నుతుంటాడు. మరి ఆయన ప్రయత్నాలు ఫలించాయా? చోళ రాజ్యానికి రాజు అయ్యాడా? లేదా బాబాయ్ కొడుకుల చేతిలో బలైపోయాడా? అనేది పార్ట్ 2లో తెలుస్తుంది. రాజ్యాన్ని కాపాడడానికి కుందవై ఏం చేసింది? చోళ రాజ్యానికి ఆపద ఉందని తెలుసుకున్న రాజకుమారి కుందవై(త్రిష).. తన రాజకీయ చతురతతో సామాంతుల రాజులను కలిసి .. వారి కుమార్తెలను తన సోదరులకి ఇచ్చి వివాహం చేస్తానని చెబుతుంది. దాంతో సామంత రాజుల మధ్య విభేదాలు వస్తాయి. మరి నిజంగానే వారి కుమార్తెలను తన సోదరులకు ఇచ్చి పెళ్లి చేసిందా? పెద్ద పళవేట్టురాయర్ కుట్రలను తన తెలివి తేటలతో ఎలా తిప్పికొట్టింది? ఆ ముసలావిడా ఎవరు? పొన్నియన్ సెల్వన్ క్లైమాక్స్.. అరుణ్మొళి సముద్రంలో పడిపోయినప్పుడు ఒక ముసలావిడ కాపాడానికి వస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సముద్రంలో దూకేస్తుంది. అసలు ఆ ముసలావిడా ఎవరు? అరుణ్మొళిని కాపాడాల్సిన అవసరం ఆమెకేంటి? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రేమించిన నందినిని కరికాలుడు చంపేస్తాడా? తన సోదరుడు అరుణ్మొళి చావుకు నందినినే కారణమని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడు.. కోపంతో ఆమెను చంపడానికి తంజావురు వస్తాడు. మరి నిజంగానే నందినిని కరికాలుడు చంపేశాడా? లేదా ఆమె చేతిలోనే బలైపోయాడా? అనేది రెండో భాగంలో తెలియనుంది. -
PS2: నాలుగు పదుల వయసులోనూ తగ్గని త్రిష అందం
తమిళ సినిమా: కుందవై అనగానే ఠక్కున గుర్తొచ్చేది నటి త్రిషనే. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకటి యువరాణి కుందవై. మణిరత్నం అద్భుత సృష్టి పొన్నియిన్ సెల్వన్ చిత్రం. దివంగత ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి నవలకు వెండి తెర రూపం ఇది. నటుడు విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, నటి ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. దీన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్, లైక్ ప్రొడక్షనన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిభాగం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఈనెల 28వ తేదీన భారీ అంచనాల మధ్య తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమిళనాడు, తెలంగాణ, ముంబై అంటూ పలు ప్రాంతాలను కాళ్లకు బలపం కట్టుకొని చుట్టేస్తున్నారు. అయితే ఇందులో కుందవై యువరాణి పాత్రకు దర్శకుడు ఏ ముహూర్తంలో త్రిషను ఎంపిక చేశారో గాని, చిత్ర ప్రచారాల్లో ప్రముఖ పాత్రదారులందరూ పాల్గొంటున్నా నటి త్రిషనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారడం విశేషం. నాలుగు పదుల వయసులో త్రిష కుందవై పాత్రలో రాజసాన్ని ప్రదర్శిస్తూ ఆ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి. చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్రలో నటించిన ఐశ్వర్యరాయ్‌పై.. కుందవై యువరాణిగా తన నటనతో త్రిష పైచేయి సాధించారని చెప్పకతప్పదు. దీంతో ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. దీంతో చిత్రం కూడా ఇప్పుడు ఆమె పేరును ఎక్కువగా వాడుకుంటోందనే చెప్పాలి. తాజాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా త్రిష పోషించిన కుందవై పాత్రకు ఇతర పేర్లు ఏమిటి? అనే కాంటెస్ట్‌తో చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో అభిమానులు రకరకాల పేర్లతో సెల్ఫీ వీడియోలను విడుదల చేస్తూ పొన్నియిన్ సెల్వన్ చిత్ర ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళాల్లని నిర్ణయించారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
రాజమౌళి ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు: మణిరత్నం
‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. రాజమౌళికి థ్యాంక్స్. ఎందుకంటే ‘బాహుబలి’ రెండు భాగాలుగా రాకపోయిఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’(పీఎస్)తెరకెక్కేది కాదు. ఈ విషయాన్ని రాజమౌళితో కూడా చెప్పాను.‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తీసే దారిని తను చూపించాడు. చారిత్రాత్మక సినిమాలను తీసే ఆత్మవిశ్వాసాన్ని సినిమా ఇండస్ట్రీకి రాజమౌళి ఇచ్చా రు. భారదేశ చరిత్ర ఆధారంగా చాలామంది ఇప్పుడు సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ మణిరత్నం. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలోని రెండో భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడానికి కారణమైన సుభాస్కరన్, వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి, తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న ‘దిల్’రాజుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా గురువు మణిరత్నంతో మరో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చినందుకు టీమ్‌కు శుభాకాంక్షలు’’ అన్నారు విక్రమ్. ‘‘ఒకేసారి రెండు విభాగాలు చిత్రీకరించి, తొలి భాగం రిలీజ్ చేసిన ఆరు నెలల తర్వాత రెండో భాగాన్ని రిలీజ్ చేస్తానన్న గుండె ధైర్యం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరూ రెండు విభాగాలను ఒకేసారి చిత్రీకరించలేదు. మణిరత్నంగారి ధైర్యానికి హ్యాట్సాఫ్’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘భారతదేశ చరిత్ర తెలియాలని మణిరత్నంగారు ఈ సినిమా తీశారు’’అన్నారు కార్తీ. ‘‘పొన్నియిన్ సెల్వన్’ మ్యాజికల్ వరల్డ్’’ అన్నారు ఐశ్వర్యారాయ్. ‘‘హైదరాబాద్ నాకు రెండో ఇల్లు’’ అన్నారు త్రిష. ‘‘పొన్నియిన్ సెల్వన్ పార్టు 2’లో అద్భుతం చూడబోతున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ కార్యక్రమంలో శోభిత, ఐశ్వర్యాలక్ష్మీ, ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ కుమరన్, లైకా డిప్యూటీ ౖచైర్మన్ ప్రేమ్ పాల్గొన్నారు. -
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్
Ponniyin Selvan 2: కొచ్చి లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ టీం ప్రమోషన్స్ -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు. -
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పొన్నియిన్ సెల్వన్ తీయాలంటే ధైర్యం కావాలి
‘‘పొన్నియిన్ సెల్వన్ ’ చిత్రాన్ని తీయాలంటే ధైర్యం కావాలి.. అది డైరెక్టర్ మణిరత్నం, నిర్మాత సుభాస్కరన్ గార్లకు ఉంది. అందుకే ఈ చిత్రం అద్భుతంగా తెరకెక్కింది’’ అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఐశ్వర్యా రాయ్, విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. సుభాస్కరన్ , మణిరత్నం నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల వేడుకని చెన్నైలో నిర్వహించారు. ఈ మూవీ ఆడియోను కమల్ హాసన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పొన్నియిన్ సెల్వన్ ’ నవల రాసిన కల్కీని చూసి ఇతర రచయితలు అసూయ పడుతున్నట్లుగా, మణిరత్నంగారిని చూసి రచయితలు, దర్శకులు అసూయ పడుతున్నారు.. వారిలో నేనూ ఒకణ్ణి. ఈ మూవీలో నటించే అవకాశం నాకు మిస్ అయ్యింది. తమిళ చిత్ర పరిశ్రమకు ఇది స్వర్ణయుగమే. దీన్ని కాపాడుకోవాలి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ఈ వేడుకలో తమిళనాడు రాష్ట్ర మంత్రి దురైమరుగన్, దర్శకుడు భారతీరాజా, నటుడు శింబు, నటి ఐశ్వర్యారాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రవివర్మన్ కెమెరామేన్‌గా పనిచేశారు.