Ponnur
-
పొన్నూరులో ఆగని టీడీపీ దాడులు
-
పోయేకాలం వచ్చినప్పుడు విలన్లకి హీరో ఎప్పుడూ బచ్చానే..!
-
మరో రెండు వారాల్లో కురుక్షేత్రం..!
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)
-
గ్రావెల్ మీద ధూళిపాళ్ల దొంగ ఏడుపు ఏడుస్తున్నారు
-
చంద్రబాబు చేయలేనిది..సీఎం జగన్ చేశారు..
-
పొన్నూరు సభలో చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి, గుంటూరు జిల్లా: పొన్నూరు చంద్రబాబు సభలో తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఐలాండ్ సెంటర్లో చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. ఆ పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో దూరారు. తెలుగు తమ్ముళ్లు పీకల వరకు మద్యం సేవించి బయటికి వచ్చి తాగిన మైకంలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక వైపు చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. మరో వైపు టీడీపీ నేతలు మాత్రం ఆయనను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పాటు కాళ్లతో ఎగిరేగిరి తన్నుకున్నారు. ఇది చూసిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరకు పోలీసులు రంగంలో దిగడంతో తెలుగుదేశం పార్టీ తాగుబోతు తమ్ముళ్ల గొడవ సద్దుమణిగింది గొడవపడేవారిని విడదీసి పోలీసులు పంపించేశారు. చదవండి: చంద్రబాబు వీక్నెస్ అదే.. కొంప మునగడం ఖాయమా? -
చర్చకు రెడీ.. చంద్రబాబుకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్
సాక్షి, గుంటూరు: పొన్నూరు అభివృద్ధిపై చంద్రబాబు చర్చకు రావాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సవాల్ విసిరారు. బాబు సవాల్ స్వీకరిస్తున్నానని, ఐలాండ్ సెంటర్లో చర్చకు రెడీ అని రోశయ్య స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు.. ఏ ముహం పెట్టుకుని పొన్నూరుకు వచ్చారని నిలదీశారు. మూడున్నరేళ్లలో పొన్నూరులో రూ.1200 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. చదవండి: ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని -
ఇద్దరిదీ ఒకే ఊరు.. సినిమాను తలపించే లవ్‌స్టోరీ.. పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంట..
పొన్నూరు(గుంటూరు జిల్లా): ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రేమజంట తెలిపిన వివరాలు మేరకు.. వడ్డిముక్కల గ్రామానికి చెందిన శీలం అవినాష్, అదే గ్రామానికి చెందిన జె.ఏస్తేర్రాణి ఒకరినొకరు ప్రేమించుకొని ఆదివారం వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలతో తమకు హాని ఉందని రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమజంటకు చెందిన ఇరుకుటుంబాలతో ఎస్ఐ భార్గవ్ మాట్లాడి అబ్బాయి అవినాష్ తల్లిదండ్రులతో ప్రేమజంటను పంపించారు. చదవండి: బ్రష్ చేయడం కూడా మరిచిపోతున్నారా?.. అయితే కారణం ఇదే.. -
గుంటూరు జిల్లా పొన్నూరులో గడప గడపకూ మన ప్రభుత్వం
-
సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో..
పొన్నూరు (గుంటూరు): విహేతర సంబంధం నేపథ్యంలో భర్త జలచిత్ర నాగరాజును భార్య సయ్యద్ అబ్దుల్ సోనీ ప్రియుడు జవ్వాజి వెంకట సాయి, అతని స్నేహితుడు చొప్పవరపు బిన్నేంద్రకుమార్లతో కలసి హత్య చేయించిందని బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మాట్లాడుతున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ జలచిత్ర నాగరాజుకు సోనీతో తొమ్మిదేళ్ల కిందట ప్రేమ వివాహమైంది. ఒక సంవత్సరం హైదరాబాదులో కాపురం ఉన్నారు. పొన్నూరు పట్టణంలో ఏడేళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్నారు. పట్టణానికి చెందిన జవ్వాజి వెంకట సాయితో సోనీకి వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో సోనీని మందలించడంతోపాటు చంపుతానని భర్త బెదిరించాడు. సోనీ ప్రియుడు, అతని స్నేహితుడైన చొప్పవరపు బిన్నేంద్ర తో కలసి నాగరాజును హత్య చేసేందుకు సిద్ధమైంది. పథకం ప్రకారం 6వ తేదీ రాత్రి నాగరాజు తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపారు. ఇంటిలోని సోపాసెట్లో నిద్రపోతున్న నాగరాజును వెంకటసాయి, బిన్నేంద్రకుమార్లు కొబ్బరి బొండాలు నరికే కత్తితో మెడపై నరికి, ఇనుపరాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..) మృతదేహన్ని 7వ తేదీ రాత్రి కారులో తీసుకెళ్లి మూలపాలెం గ్రామ పరిధిలోని నాగరాజు కాలువ(యర్రకాలువ)లో పడవేశారు. మక్కేన మస్తాన్రా వుతో కలసి ఇంటిలోని రక్తపుమరకలు కడిగివేశారు. హత్యకు వాడిన కత్తి, ఇనుపరాడ్డు, రక్తంతో తడిసిన బట్టలను డీవీసీ కాలనీ రోడ్డులోని చేబ్రోలు కాలువ వద్ద పడవేసి ఏమి తెలియనట్లు తిరుగుతున్నారు. సోని చెల్లెలు సీమా ఇచ్చిన సమాచారంతో మృతుడి అన్న జలచిత్ర నాగేశ్వరరావు పట్టణ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ శరత్‌బాబు, సిబ్బంది నిందితులను మండల పరిధిలోని కట్టెంపూడి అడ్డరోడ్డు సమీపంలో అరెస్టు చేశారు. సమావేశంలో పట్టణ సీఐ శరత్‌బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
-
వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
పొన్నూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీకి చెందిన వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన సూర బ్రహ్మయ్యపై ఏడో వార్డుకు చెందిన బాణాల దుర్గారావు కత్తితో దాడిచేశాడు. కత్తి కడుపులో బలంగా దిగటంతో తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బ్రహ్మయ్య టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చాడు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు చాలా మందిని తనతో పాటు పార్టీలోకి తీసుకురావటంతో బ్రహ్మయ్యతో దుర్గారావు గొడవ పడ్డాడు. సోమవారం రాత్రి తన ఇంటి వద్ద దుర్గారావు, మరో వ్యక్తి ఘర్షణ పడుతుండగా వారికి బ్రహ్మయ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన దుర్గారావు ఇంటికి వెళ్లి కత్తి తెచ్చి బ్రహ్మయ్యపై దాడి చేశాడు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే దుర్గారావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బాధితుడు, అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
గుంటూరులో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
సాక్షి, గుంటూరు : జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పొన్నూరు మండలం కొండముదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో నలుగురు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య విజయోత్సవ ర్యాలీకి ఆటంకం కల్పించేందుకు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
పొన్నూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి రోశ్యయ్య ప్రచారం
-
పొన్నూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి రోశ్యయ్య ప్రచారం
-
‘సీన్ కట్.. యాక్షన్ అనగానే.. కళ్లలోంచి నీళ్లు కార్చారు’
సాక్షి, పొన్నూరు (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్కార్ రేంజ్లో యాక్షన్ కట్ అనగానే.. కళ్లలోంచి నీళ్లు కార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక హోదాపై ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను ఆయన ఎండగట్టారు. ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వరట. హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించరట. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మరోవైపు అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఇటీవల ప్రకటించిన 90 ఆస్కార్ అవార్డుల్లో పేపర్లు తిరగేస్తే చంద్రబాబు పేరు ఎక్కడా కనిపించలేదు. ఇదేంటబ్బా అని ఆలోచిస్తే.. ఆస్కార్‌ను అందించేది విదేశీ సంస్థలు కాబట్టి వాళ్లు మన రాష్ట్రాన్ని గమనించలేదు. మన అసెంబ్లీలో చంద్రబాబు నడిపించిన డ్రామాను చూడలేదు. ఆస్కార్ అవార్డును ప్రధానం చేసే స్థాయిలో అసెంబ్లీలో నటించారు చంద్రబాబు. సీన్ కట్.. యాక్షన్ అనగానే.. ఆయన కళ్లలోంచి నీరు కారినట్లు అద్భుతంగా నటించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు అన్నివిధాలా మోసగించారు. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చి ఉంటే రాష్ట్రానికి ఇప్పటికే హోదా వచ్చి ఉండేది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ను విడగొడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. 2014 జూన్ 2వ తేదీన కేంద్ర కేబినేట్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీర్మానాన్ని చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయిన ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఏపీకి చెందిన ప్రత్యేక హోదా ఆమోద ఫైలు ప్లానింగ్ కమిషన్‌లో ఏడు నెలల పాటు అలానే పడి ఉంది. జూన్‌లో సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కేంద్రంతో చంద్రబాబు హానీమూన్‌ను సాగిస్తూ.. హోదాను పట్టించుకోలేదు. కీలక సమయంలో హోదాను గురించి పట్టించుకోకుండా చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? 2015లో 14 వ ఆర్థిక సంఘ సూచనలు అమలులోకి వచ్చాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఒత్తిడి కనుక చేసి ఉంటే.. 13 వ ఆర్థిక సంఘ సూచనల్లో ఉన్న ప్రత్యేక హోదాను మనకు ప్రకటించేవారు. 14వ ఆర్థిక సంఘ సూచన్లో ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే సూచన ఎక్కడా లేదు. 13వ ఆర్థిక సంఘం హయాంలోనే హోదా ఫైలు ఆమోదం పొందిన విషయం వాస్తవం కాదా? ప్రత్యేక హోదా వద్దని, ఇవ్వొద్దని కేంద్రం ప్రకటించేలా చేసింది చంద్రబాబే. కేంద్రం ఏం చెప్పినా ఆయన గంగిరెద్దులా తలకాయ అటూ ఇటూ ఊపారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన హోదాకు అనుకూలంగా లేదని, తన కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజానికి 2016 సెప్టెంబర్ 8న జైట్లీ అర్ధరాత్రి చేసిన ప్రకటనకు.. తాజా ప్రకటనకు మధ్య తేడా శూన్యం. ఆ రోజు అర్ధరాత్రి జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించిన విషయం వాస్తవం కాదా? ఆ మరునాడు అసెంబ్లీలో జైట్లీ, మోదీలను అభినందిస్తూ.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయలేదా?. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల్లో చెప్పిన ఈ పెద్ద మనిషికి.. ప్రతి పేదవానికి ఇల్లు కట్టించానని చెప్పుకునే దమ్ముందా? కరెంటు, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు ఇలా అన్ని తగ్గిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికలు పూర్తై నాలుగేళ్లు గడిచాయి. వీటన్నింటినీ పెంచకుండా తగ్గించానని చెప్పుకునే ధైర్యముందా బాబుకు? కనీసం వ్యవసాయానికి పగలు ఏడు గంటల కరెంటును కూడా అందించలేకపోవడం దారుణం. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఏటా 6 శాతం వృద్ధిరేటు సాధిస్తుండగా.. ఏపీ మాత్రం 12 శాతం గ్రోత్ రేటుతో పరుగులు పెడుతోందని చంద్రబాబు ఊదరగొట్టారు. ఒకవైపు చదువుకున్న పిల్లలు ఉద్యోగులు రాక పొరుగు రాష్ట్రాలకు వలసపోతుండగా.. విశాఖపట్టణంలో సదస్సులు పెట్టి వందల సంఖ్యలో ఒప్పందాలు జరిగాయని చెబుతూ.. సూటుబూటు వేసుకున్న.. అనామకులతో సంతకాలు చేయించారు. దేశ తలసరి ఆదాయం కన్నా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందంటూ చంద్రబాబు చెప్పడం ధర్మమేనా? హోదా ఇవ్వకపోయినా రాష్ట్రం బాగుందన్న భావనను కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబే కల్పించాడు. టీడీపీ చేసిన ఈ రాజీనామాలేవో 2016 సెప్టెంబర్ 8న అరుణ్ జైట్లీ ప్రకటన అనంతరం చేసి ఉంటే ఇప్పటికి కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే నన్ను ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు అరెస్టు చేయించాడు. ప్రధాని మోదీ వస్తున్నారనే సాకుతో.. నా నిరాహార దీక్షను పోలీసులతో భగ్నం చేయించారు. హోదా కోసం బంద్‌లు నిర్వహిస్తే.. చంద్రబాబు దగ్గరుండి బస్సులు నడిపించి.. వాటిని విఫలం చేసేందుకు ప్రయత్నించారు. హోదా కోసం యువభేరికి హాజరైన విద్యార్థులపై పీడీ యాక్టులు పెడతామని బెదిరించారు. ఇన్నిచేసి ఇప్పుడు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక హోదా నెపాన్ని వేయాలని చూస్తున్నారు. ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో సంవత్సరంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ ఒక్కటే అడుగుతున్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పేవాళ్లు నాయకులుగా కావాలా? మోసాలు చేసేవాళ్లు.. నాయకులుగా కావాలా? ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి? ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయతకు అర్థాన్ని తీసుకురావాలంటే జగన్‌కు మీ అందరి మద్దతు కావాలి. పొన్నూరు నియోజకవర్గంలో పండిన పంటలకు కనీస మద్దతు ధర కరువు అవుతోంది. రబీ కాలంలో గుంటూరు జిల్లాలో మొక్కజొన్నను రాష్ట్రంలోనే అత్యధికంగా సాగు చేస్తారు. అలాంటి పంటకు క్వింటాకు కనీసం రూ. 1150 కూడా అందడం లేదు. ఇందుకు కారణం రైతన్నల దగ్గర నుంచి దళారీల వద్దకు వెళ్లే వరకూ సరకు ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఆ తర్వాతి నుంచి సరకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హెరీటేజ్ ఫుడ్స్ పేరుతో చంద్రబాబు ప్రారంభించిన కంపెనీ నుంచి సరకులను సాధరణ ధరలకు మూడు, నాలుగు రెట్లు అధికంగా అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద దళారీగా మారారు. కృష్ణా డెల్టాలో భాగమైన పొన్నూరు ప్రాంతంలో ఉన్న పురాతన కాలువలు మరమ్మతులకు నోచుకోలేదు. రైతన్నలకు చివరి ఎకరా వరకూ కూడా నీరు అందించేందుకు వైఎస్ఆర్ కృషి చేశారు. పొన్నూరులో పేదవారికి 2,600 ఫ్లాట్లు కడుతున్నామని ప్రభుత్వం ఊదరగొడుతోంది. 3,600 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించే ఒక్కో ఫ్లాట్‌ను అక్షరాల ఆరు లక్షలకు అమ్ముతారట. జీ+3 బిల్డింగ్‌లకు లిఫ్ట్ లేకుండా ఫ్లాట్లు కడితే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి కాంట్రాక్టర్లను అడగండి. కనీసం వెయ్యి రూపాయలు కూడా ఖర్చుకాని చదరపు అడుగుకు రూ. 2 వేలు చెల్లించాలని పేదలతో బాబు చెబుతున్నారు. ఇంటి నిమిత్తం ఖర్చు అయ్యే ఆరు లక్షల్లో మూడు లక్షలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. మిగిలిన రూ. 3 లక్షలను రుణంగా ఇచ్చి ఇరవై ఏళ్ల పాటు రూ. 3 వేల చొప్పున నెలనెలా కట్టమని పేదవాడికి చెబుతున్నారు. రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలకు ఇప్పటివరకూ ఒక్క ఇటుకా పడలేదు. రాజధానిలో అసెంబ్లీ, ప్రభుత్వ భవనాలు ఎలా ఉంటాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. రాజధానిలో కట్టడాల కోసం అడుగుకు రూ. 10 వేలు ఇచ్చారు చంద్రబాబు. ఇంతటి దారణ పరిపాలనను సాగిస్తున్న చంద్రబాబు.. త్వరలో ఎన్నికల ప్రచారానికి మీ వద్దకు వస్తారు. మళ్లీ అధికారాన్ని కట్టబెట్టాలని కోరతారు. అలవిగానీ, సాధ్యం కానీ హామీలతో గాలిలో మేడలు కడతారు. ఆయన చేస్తున్న వాగ్ధానాలను ప్రజలు నమ్మరని ఆయనకూ తెలుసు. అందుకే ఓటుకు రూ. 3 వేలు చేతిలో పెడతారు. చాలదంటూ ఇంకా ఇవ్వండని రూ.5 వేలు లాగండి. అదంతా మన డబ్బే. చంద్రబాబు మనందరి నుంచి దాన్ని దోచేశారు. కానీ ఓట్లు వేసేప్పుడు మనస్సాక్షిని నమ్మి వేయండి. అబద్దాలు చెప్పే వాళ్లను, మోసగించే వాళ్లను బంగాళాఖాతంలో కలపండి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. రేపొద్దున మీ ఆశీర్వదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని నింపుతాం. పేదవాడి చదువు కోసం.. పేద బిడ్డలు డాక్టర్, ఇంజనీరింగ్ చదువులు చదవాలంటే తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. ఏళ్ల పాటు చదువుకు లక్షల్లో ఖర్చు అవుతోంది. ఒక్కసారి ఆ దివంగత నేత వైఎస్ఆర్ పాలనను గుర్తు తెచ్చుకోండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీసీలు ప్రేమ అంటారు చంద్రబాబు. ఆయన ప్రేమ నాలుగు కత్తెరలకు మాత్రమే పరిమితం. నిజంగా బీసీల మీద ప్రేమను చూపించింది వైఎస్ఆరే. పేదవాడి కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అయినప్పుడే పేదరికం నుంచి బయటకు వస్తారని నాన్నగారు బలంగా నమ్మారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్కసారి పరిస్థితిని గుర్తు చేసుకోండి. మన పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ చేయాలంటే భారీగా ఖర్చు అవుతోంది. ప్రతి పేదవాడికి చెబుతున్నాను. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకేశారు. జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందు వేస్తాడని చెబుతున్నా. మీ పిల్లల్ని వారికి నచ్చిన చదువులు చదివించండి. ఆ ఖర్చును ప్రభుత్వమే భరించేలా చేస్తాను. పిల్లలు చదువుకునే సమయంలో మెస్ చార్జీలకు కూడా ప్రభుత్వమే ఏడాదికి రూ. 20 వేలు ఇస్తుంది. పిల్లలు ఇంజనీరింగ్ వంటి పెద్ద చదువులు చదవాలంటే పునాదుల నుంచి చదువులు బలంగా ఉండాలి. పిల్లలను బడులకు పంపించండని ప్రతి తల్లిని కోరుతున్నా. అలా పంపినందుకు ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. 2011 సెన్సెస్ ప్రకారం.. 32 శాతం మంది నిరక్షరాస్యులు రాష్ట్రంలో ఉన్నారు. వారందరినీ చదువుకు చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నవరత్నాల్లో మార్పులు, చేర్పులకు మీరు సలహాలు ఇవ్వండి. -
చంద్రబాబుకు కలలో వస్తున్నానా : వైఎస్ జగన్
సాక్షి, పొన్నూరు (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతి రోజూ తాను కలలోకి వస్తున్నట్లు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన గురించి వైఎస్ జగన్ చిన్న కథ చెప్పారు. ‘ఉదయాన్నే లేచిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ రోజు మంచి జరగాలని కోరుకుంటాం. ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి ఇలా అందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అలా కోరుకోరు. ఉదయాన్నే లేచిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఎలా మాట్లాడాలి? అని ఆయన ఆలోచిస్తారు. అసెంబ్లీలో ప్రసంగ సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడరు. నోరు తెరిస్తే.. జగన్.. జగన్.. జగన్ అనే పేరునే ఆయన జపిస్తారు. బహుశా ప్రతిరోజు ఆయనకు కలలో కూడా నేను వస్తున్నానేమో అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. అసెంబ్లీలో ఆయన తీరు ఎలా ఉందంటే.. ఒక దొంగ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మరొకరిని దొంగా.. దొంగా.. అని అరుస్తున్నట్లు ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు అరుపుల తర్వాత మరునాడు ఉదయం ఆయనకు సంబంధించిన పేపర్లు, టీవీలు కూడా ఆయన మాదిరే దొంగా.. దొంగా అని అరుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇదే జరుగుతోంది. చంద్రబాబు మాదిరిగా నీచ రాజకీయాలు చేసేవారిని ఏమనాలి?. సొంత మామను కూడా వెన్నుపోటు పొడిచి.. చివరకు ఆయన ప్రాణాలు పోయే వరకూ వదిలిపెట్టలేదు చంద్రబాబు. కోట్లాది రూపాయల నల్లధనాన్ని పంచుతూ ఓట్లుకు నోట్లు ఇస్తూ దొరికిన బాబును ఏమంటారు?. రాష్ట్రాన్ని అవినీతి బారి నుంచి కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఇసుక నుంచి మొదలు ఏది దొరికితే అది మేస్తున్న బాబును ఏమంటారు?. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను ఒక్కోక్కరికి రూ. 20 నుంచి 30 కోట్లు ఇచ్చి సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. దగ్గరుండి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను ఎన్నికలకు తీసుకెళ్లే ధైర్యం లేక, గెలిపించుకునే సత్తా లేక రాజీనామాలు చేయించలేదు. ఐదు కోట్ల మంది ప్రజల్లో ఎవరికో ఒక్కరికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది. ఆ వ్యక్తి పాలనను బట్టి పరిపాలన బావుంటే బాగుందని చెప్తాం. ఆ పరిపాలన బాగోలేకపోతే ఎప్పుడెప్పుడు పోతాడా అని ఆశగా ఎదురుచూస్తాం.’ -
పొన్నూరు అబ్బాయి... పోలాండ్ అమ్మాయి
గుంటూరు : ప్రేమకు ఎల్లలు లేవు... ప్రేమ అనేది రెండు అక్షరాలే, అయితేనేమీ... ఎక్కడెక్కడి వారినో ఒక్కటి చేస్తుంది. ఎల్లలు లేవంటుంది. భాషాభేదం అడ్డు కాదంటుంది. చిన్ని పరిచయాన్ని తనలో ఇముడ్చుకుని పెళ్లిపీటల వరకూ తీసుకెళ్తుంది. ఈ పొన్నూరు అబ్బాయి విషయంలో అచ్చం అలాగే జరిగింది. పట్టణానికి చెందిన కొప్పోలు శరత్చంద్ర ఉన్నత విద్యనభ్యసించేందుకు పోలాండ్ వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ముఖ్య పట్టణం వార్సాలో ఫ్యూచర్స్ స్టెప్ కంపెనీలో ఆరునెలల నుంచి రిక్రూట్మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. వార్సాకు చెందిన ఆగ్నేజ్కా పిహెచ్డీ చేస్తోంది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్లే శరత్ చంద్రకు అక్కడ ఆగ్నేజ్యా ఏడాది కిందట పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. సహజంగానే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే ఆగ్రేజ్కా తల్లిదండ్రులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు శరత్ చంద్ర కూడా తన తల్లిదండ్రులను ఒప్పించాడు. దీంతో ఆగ్నేజ్కా, శరత్చంద్ర వివాహానికి రూట్ క్లియర్ అయింది. శనివారం రాత్రి సజ్జా కళ్యాణ మండలంలో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఆగ్నేజ్కాతో పాటు ఆమె తల్లి, సోదరి కూడా భారతీయ సంప్రదాయంలో దుస్తులు ధరించడం అందరినీ ఆకట్టుకుంది. -
పొన్నూరులో టెన్షన్..టెన్షన్
ఉద్రిక్త పరిస్థితుల నడుమ డాక్టర్ రాజారావు అరెస్టు అడ్డుకున్న మహిళలపై పోలీస్ ప్రతాపం లాఠీలతో కొట్టి తరలింపు పొన్నూరు : ఉద్రిక్త పరిస్థితుల మధ్య పొన్నూరులోని ప్రజావైద్యశాల వైద్యుడు డాక్టర్ టీ. రాజారావును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు మహిళలను లాఠీలతో కొట్టి, అదుపులోకి తీసుకుని భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలు... డాక్టర్ రాజారావుపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఐక్యవేదిక ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ ప్రదర్శనను జయప్రదం చేయడానికి గత మూడురోజులుగా కషిచేశారు. సోమవారం ఉదయం ర్యాలీగా బయలుదేరి తాహశీల్దార్ కార్యాలయంలో ‘ప్రజావాణి’లో అర్జీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో రాజారావు మద్దతుదార్లతో పాటు పట్టణంలో సామాన్య ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. ప్రజావైద్యశాలకు వచ్చి వినతి స్వీకరించిన తహశీల్దార్ పట్టణంలోని ప్రజావైద్యశాలకు ఉన్న రాకపోకలన్నింటిని పోలీసులు దిగ్బంధం చేశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులను కూడా అడ్డుకున్నారు. అయినప్పటికీ అతి కష్టంమీద కొంతమంది కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. జనసమీకరణ జరిగిన∙నేప«థ్యంలో డాక్టర్ రాజారావు గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువార్గాల మధ్య కొంత వాగ్వాదం జరగ్గా... తహశీల్దార్ వినతిపత్రం తీసుకోవడానికి రావాలని పట్టుబట్టడంతో తహశీల్దార్ ప్రజావైద్యశాల ప్రాంగణానికి చేరుకొని వినతిపత్రాన్ని స్వీకరించారు. ర్యాలీ భగ్నం...అరెస్టులు డాక్టర్ రాజారావుకు మద్దతుగా వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వారంతా తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ప్రజావైద్యశాల నుంచి రాజారావు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు. అభిమానులతో కలిసి జీబీసీరోడ్డు మీదుగా ప్రజావైద్యశాలకు ర్యాలీగా వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేప«థ్యంలో రాజారావును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈసమయంలో మహిళలు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మహిళలను కూడా అదుపులోకి తీసుకొని, వారి ప్రతాపం చూపించారు. ఈసమయంలో పాత పోలీస్‌స్టేషన్ ప్రాంతం మొత్తం రణరంగంగా మారింది. మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా లాఠీలతో కొట్టారు. మహిళా కార్యకర్తలను డీసీఎం వ్యాన్‌లో భట్టిప్రోలుకు, నాయకులను చందోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డాక్టర్ రాజారావును ఓ ప్రై వేటు వాహనంలో గుంటూరు వైపు తీసుకెళ్ళారు. -
స్కూలు బస్సు నుంచి జారిపడి విద్యార్థి మృతి
పొన్నూరు (గుంటూరు) : స్కూల్ బస్సు డోర్ అకస్మాత్తుగా తెరుచుకోవడంతో విద్యార్థి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపూడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జూపూడికి చెందిన కొడాలి శ్రీనివాసరావు కుమారుడు వీర శశాంక్(7) గోళ్లమూడిపాడు గ్రామంలో నాట్కో స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవుదినం అయినప్పటికి సీబీఎస్ఈ సిలబస్ కావడంతో మంగళవారం కూడా పాఠశాల జరిగింది. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో స్కూల్ పిల్లలను తిరిగి ఇంటికి చేర్చే క్రమంలో బస్సు జూపూడి చేరుకొనే సమయానికి అనుకోకుండా బస్సు డోరు తెరుచుకోవటంతో శశాంక్ జారి కిందపడ్డాడు. తలకు గాయం కావడంతో గుంటూరు తరలిస్తుండగానే చనిపోయాడు. -
ట్రాక్టర్ బోల్తా : ఒకరు మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం పురపాలక సంఘంకి చెందిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సత్తెనపల్లి, పొన్నూరు మున్సిపాలిటీలకు మహర్దశ
సాక్షిప్రతినిధి, గుంటూరు : సత్తెనపల్లి, పొన్నూరు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఈ రెండింటిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 61 డివిజన్లు ఉన్న ఈ రెండు మున్సిపాలిటీల్లో ముందు ముందు మౌలిక వసతుల కల్పనతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలి విడత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 77 కిలోమీటర్ల నిడివిలోని ప్రాంతాలను సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకుంది. ఆ నిడివిలోని గ్రామాలను వివరిస్తూ జనవరి 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడత ఈ రెండు మున్సిపాలిటీలను కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాథమికంగా రూ.వెయ్యి కోట్ల నిధితో ఏర్పాటైన ఈ మండలి రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ, తదితర చర్యలు చేపట్టనుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల మండలం మాదల. సత్తెనపల్లి మండలంలోని 17 గ్రామాలు తొలి విడతలోనే సీఆర్డీఏ పరిధిలోకి వచ్చాయి. సత్తెనపల్లి మున్సిపాలిటీని తొలి విడత మినహాయించారు. పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలంలోని 16 గ్రామాలను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చి మున్సిపాలిటీని మినహాయించారు. తాజాగా ఈ రెండు మున్సిపాలిటీలను సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ బుధ వారం ఉత్తర్వులు వెలువడ్డాయి.50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న పొన్నూరు మున్సిపాలిటీలో 59,859 మంది జనాభా ఉన్నారు. మొత్తం 31 వార్డులున్నాయి. 1964లో మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ 1967లో తొలిసారి ఎన్నికలు జరిగాయి.తొలి మున్సిపల్ చైర్మన్‌గా కొప్పాక వెంకయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు 11 మంది చైర్మన్లుగా, ముగ్గురు ఇన్చార్జి చైర్మన్లుగా పనిచేశారు. 30 వసంతాలు పూర్తిచేసుకున్న సత్తెనపల్లి మున్సిపాలిటీలో 56,663 మంది జనాభా ఉన్నారు. 1984 మార్చి 2న సత్తెనపల్లిని మున్సిపాలిటీగా మా ర్చారు. మొత్తం 30 వార్డులు ఉన్నాయి. ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లను సీఆర్డీఏకు విడు దల చేసినా, క్రమంగా నిధుల విడుదల పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. -
తల్లీకూతుళ్లపై అత్యాచారం
గుంటూరు: బట్టలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తున్న తల్లికూతురిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బెదిరించి... అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే సదరు వ్యక్తుల బెదిరింపులతో భయపడిన వారు మిన్నకుండిపోయారు. అయితే బంధువుల చోరవతో బాధితులు పొన్నూరు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన రమేష్, వినోద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పొన్నూరులో బట్టలు కొనుగోలు చేసి కట్టెంపూడి తిరిగి వస్తున్న క్రమంలో అత్యాచారానికి గురైయ్యారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
పొన్నూరు అల్లుడు చక్రి!
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతితో పొన్నూరు కంట తడిపెట్టింది. పక్కనే ఉన్న నిడుబ్రోలు గ్రామానికి చెందిన శ్రావణిని చక్రి వివాహమాడినప్పటికీ ఆయనను అంతా పొన్నూరు అల్లుడు అని పిలుస్తుంటారు. శ్రావణి చిన్నతనంలోనే కుటుంబం అంతా భద్రాచలం వెళ్లి స్థిరపడిపోయారు. పొన్నూరు రూరల్: హైదరాబాద్‌లో సోమవారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి పొన్నూరు అల్లుడని స్థానికులు పిలుస్తారు. ఆయన భార్య శ్రావణి సొంతూరైన నిడుబ్రోలు గ్రామం పొన్నూరు పక్కనే ఉండటం, చక్రి తరచూ పొన్నూరు రావటం, మండలంలోని నండూరు గ్రామంలో పలుసార్లు కచేరీలు చేయటమే ఇందుకు కారణం. శ్రావణి, తల్లిదండ్రులు అన్నంరాజు మధుసూదనరావు, సురేఖ తొలుత నిడుబ్రోలులోని నేతాజీనగర్‌లో నివాసం ఉండేవారు. శ్రావణి చిన్నతనంలోనే వారంతా భద్రాచలం వెళ్ళిపోయారు. చక్రి మరణవార్త విన్న శ్రావణి నాయనమ్మ రాధాంబ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఇంత హడావుడిలోనూ దుఖాన్ని దిగమింగుకుంటూ ఆమె సాక్షితో మాట్లాడారు. ‘పెద్దలంటే చక్రికి ఎంతో గౌరవం. అయన లేరని నేను భావించడం లేదు. చక్రి ప్రతి పాటలోనూ వేణువై అందరి నోళ్లలో నర్తిస్తూనే ఉంటారు’ అని అంటూ కన్నీరు మున్నీరయ్యూరు. గుప్తదానాలు చేసేవారు.. ‘అల్లుడూ అని నేను పిలిస్తే మామగారూ అంటూ అప్యాయంగా స్పందించే చక్రి గొంతు మరోసారి వినలేనా?’ అని సినీ మాటల రచయిత కృష్ణేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు నేతాజీనగర్‌లో ఉన్న ఆయన చక్రి మరణవార్త విన్న వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గోపి గోపిక గోదావరి’ చిత్రం నుంచి చక్రితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. స్నేహానికి మారుపేరైన చక్రి ఎందరికో గుప్తదానాలు చేశారని వెల్లడించారు. అనేకమంది సంగీత కళాకారులకు సినిమా రంగంలో స్థానం కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. కొత్త రచయితలను పరిచయం చేయడమే కాకుండా వారు ఉండేందుకు సౌకర్యం కల్పించేవారని చెప్పారు.