pushpaka vimanam
-
Reusable Launch Vehicle: పుష్పక్.. తగ్గేదేలే!
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ విషయంలో మరో మైలురాయిని అధిగమించింది. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ (రాకెట్లు)ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్‌ను ఇస్రో తయారు చేయడమే కాకుండా ముద్దుగా ‘పుష్పక్’ అని పేరు పెట్టుకుంది. ఈ పుష్పక్‌కు సంబంధించి తొలి ధపాలో గతేడాది నిర్వహించిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–01 మిషన్ పరీక్ష విజయవంతమైంది. తాజాగా రెండో దఫాలో పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సైతం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–02 మిషన్ పరీక్ష నిర్వహించారు. నింగిలోకి పంపిన రాకెట్‌కు స్వయంగా ల్యాండింగ్ సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించారు. పుష్పక్‌ను భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్ హెలీకాప్టర్ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు వదిలేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, స్వతహాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం రన్‌వే మీద పుష్పక్ సురక్షితంగా దిగింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్‌వీల్ సిస్టమ్ సాయంతో పుష్పక్ తనంతట తానే వచ్చి నిలిచిపోవడం గమనార్హం. పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అభినందించారు. -
ఈ వారం అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు..
Upcoming Movies And Web Series In December Second Week: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం విజయంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఇక్కడి నుంచి సంక్రాంతి వరకు వరుస సినిమాలు అలరించనున్నాయి. అంతకుముందు దీపావళి కానుకగా వచ్చిన బాలీవుడ్ మూవీ 'సూర్యవంశీ' మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ రెండో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం. 1. లక్ష్య యంగ్ హీరో నాగశౌర్య నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రలు పోషించగా కేతిక శర్మ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. విలువిద్య నేపథ్య కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు నాగశౌర్య. కాల భైరవ స్వరాలు సమకూరుస్తున్నారు. 2. గమనం శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గమనం’. ఈ చిత్రాన్ని సుజనారావు తెరకెక్కించారు. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది. 3. నయీం డైరీస్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన ‘నయీం డైరీస్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. 'రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్కౌంటర్ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశా. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.' అని చిత్ర బృందం చెబుతోంది. 4. మడ్డీ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న పాన్ ఇండియా చిత్రం 'మడ్డీ'. ఈ సినిమాలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ కృష్ణదాస్ నిర్మాణంలో ప్రగభల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 'మడ్ రేసింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు.' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. ఇవే కాకుండా బుల్లెట్ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం చిత్రాలు కూడా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆహా * పుష్పక విమానం డిసెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ * ద ఎక్స్పాన్స్ (వెబ్ సిరీస్ సీజన్-6) డిసెంబరు10 * ఎన్కౌంటర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు10 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ * ఆర్య (హిందీ వెబ్ సిరీస్ సీజన్-2) డిసెంబరు 10 నెట్‌ఫ్లిక్స్ * ద లైట్ హౌజ్ (హాలీవుడ్) డిసెంబరు 6 * వాయిర్ డిసెంబరు 6 * టైటాన్స్ (వెబ్‌సిరీస్ సీజన్-3) డిసెంబరు 8 *అరణ్యక్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 * ద అన్ ఫర్‌గివబుల్ (హాలీవుడ్) డిసెంబరు 10 జీ5 కాతిల్ హసీనోంకే నామ్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 -
'ఆహా'లో పుష్పక విమానం, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే!
Pushpaka Vimanam In AHA: దొరసాని, మిడిల్‌క్లాస్ మెలోడీస్ వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. ఇటీవలే పుష్పక విమానంతో ప్రేక్షకులను పలకరించాడీ యంగ్ హీరో. పెళ్లైన కొద్ది రోజులకే భార్య కనిపించకుండా పోయిందన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకుంది. నవంబర్ 12న రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీ ట్రాక్ ఎక్కింది. డిసెంబర్ 10 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను థియేటర్లో చూడటం మిస్సయినవారు ఎంచక్కా ఇంట్లోనే ఆహా యాప్‌లో చూసేయొచ్చు. ఇక ఈ చిత్రంలో గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్థవర్దన్ తదితరులు నటించారు. దామోదర దర్శకత్వం వహించాడు. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం అందించగా హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. Newly weds: Missing my wife! Sundar as a newly wed: MISSING WIFE. Where is she? Find out with #PushpakVimanamOnAHA, Dec 10 nundi.@ananddeverkonda @SaanveMegghana @TheDeverakonda @ItsActorNaresh @harshachemudu @Mee_Sunil @GeethSaini @itsdamodara pic.twitter.com/w1G80eVkjP — ahavideoIN (@ahavideoIN) December 1, 2021 -
‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ
టైటిల్ : పుష్పక విమానం నటీనటులు : ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్థవర్దన్ తదితరులు నిర్మాణ సంస్థ : కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ నిర్మాతలు : గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ని దర్శకత్వం : దామోదర సంగీతం : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్ విడుదల తేది : నవంబర్ 12, 2021 దొరసాని, మిడిల్ క్లాస్‌మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంనో అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్పక విమానం’మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పుష్పక విమానం కథేటంటే..? చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయకపు చక్రవర్తి. అతనికి మీనాక్షి(గీత్ సైని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లైయిన కొద్ది రోజులకే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు? అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది? భార్య పారిపోయిందనే విషయాన్ని సమాజానికి తెలియనీకుండా సుందర్ ఎలాంటి పనులకు ఒడిగట్టాడు? వాటి వల్ల సుందర్‌కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వెబ్ సీరీస్, షార్ట్‌ఫిలిం హీరోయిన్ రేఖకు సుందర్‌కు మధ్య సంబంధం ఏంటి? ఈ కథలోకి పోలీసాఫీసర్ రంగా(సునీల్) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చివరకు మీనాక్షి దొరికిందా లేదా? అనేదే ‘పుష్పక విమానం’ కథ ఎలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండకు మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్ నటన కాస్త మెరుగుపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. అమాయకపు చేష్టలతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. భార్య పారిపోయిందనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, దానికి కప్పిపుచ్చడానికి సుందర్ చేసే పనులు అందరిని నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆనంద్ అద్భుత నటనను కనబరిచాడు. ఇక మీనాక్షిగా గీత్ సైని మెప్పించింది. కథ మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ తెరపై ఆమె చాలా తక్కువ సమయమే కనిపిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సుందర్ నకిలీ భార్య రేఖ పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయింది. వెబ్‌సీరీస్, షార్ట్ ఫిల్మ్‌లు తీసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేఖ పాత్ర తనది. తెరపై మాస్ లుక్‌లో కనిపిస్తుంది.ఇక పోలీసాఫీసర్ రంగగా సునీల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే తనదైన పంచ్‌లతో నవ్వించాడు. స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పుష్పక విమానం ఎలా ఉందంటే.. ? పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం అంత ఆస్తక్తికరంగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయిందనే పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని.. తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడతాయి. కానీ ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుకుంది. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకు చెప్పకుండా, సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్. దానికి తోడు కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’అనే సాంగ్ మినహా మిగతా పాటలన్ని అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం చక్కగా అందించారు. కథలో భాగంగానే పాటలు వస్తాయి తప్ప తెచ్చిపెట్టినట్లు ఎక్కడా అనిపించదు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పుష్పక విమానం ట్విటర్ రివ్యూ
Pushpaka Vimanam Movie Twitter Review In Telugu: దొరసాని, మిడిల్ క్లాస్‌మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాకు దామోదర అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు.పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబర్ 12)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా కామెడీకి పెద్ద పీట వేశారట. ఫస్టాప్ అంత సోసోగా సాగుతుదంట. భార్య మిస్సయ్యిందనే పాయింట్ చూస్తూనే కథ తిరుగుతుందట. కీలకమైన ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందట. ఇక సెకండాఫ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ ఎంట్రీ ఇచ్చి విచారణ కొనసాగించడం లాంటి సీన్స్, అక్కడక్కడా కొన్ని ట్విస్ట్స్ ఇలా కథను ముందుకు తీసుకెళ్లారట. Bagundhi movie..very unpredictable screenplay..chinna konda did well..a must watch for thriller lovers👍#PushpakaVimanam https://t.co/R978xpPTlV — Steve Stifler (@steve_reddy_) November 12, 2021 1st half - Avg 👎 2nd half - Below avg 👎 Overall OTT bomma theatre lo skip cheseyachu👍#PushpakaVimanam — Nathan (@Benett_Nathan) November 11, 2021 @ananddeverkonda 🔥♥️ Maanchi family thriller 👌✨ Must match bomma 🎉@GeethSaini & @SaanveMegghana ♥️ Every cast of the film performed so well, cinematography & screenplay 👌 Go and watch with your friends & family@itsdamodara @tanga_official#PushpakaVimanam pic.twitter.com/mwL4XlOPU5 — 𝑹 𝒐 𝒘 𝒅 𝒚 (@TheNarendar) November 11, 2021 Both #RajaVikramarka and #PushpakaVimanam are not impressive.. Another dull week at the Telugu BO 😑 — vickRRRy (@VlCKY__264) November 12, 2021 Review : #PushpakaVimanam Average Thrilling Drama !! Positives 1st half Comedy works in parts Lead Pair Rating : (2.5/5) 👎 — InsidetalkZ (@InsideTallkz) November 12, 2021 Second half lo those two scenes are lit 🔥🔥 #PushpakaVimanam https://t.co/KjjPsgNKhU — Mokshith reddy (@OutsideRelax) November 12, 2021 comedy route aina vellundalsindi 2nd half routine aina atleast safe project ayyedhi emo atu itu kakunda aa chettha investigation sodhi. Oka thrill ledu em ledu. Random char ni introduce chesi red herrings pettesi climax ki aa char tho big twistt 🥱 #PushpakaVimanam — Silent GuaRRRdian (@Kamal_Tweetz) November 12, 2021 Chass feel bad. Had good potential & good setup but got screwed by over ambition. Lost interest as soon as it shifted to a crime investigation drama. Shock value ending failed miserably. Sunil tried too hard. AD acted well. Didn't care much for rest of the cast. #PushpakaVimanam — Silent GuaRRRdian (@Kamal_Tweetz) November 12, 2021 For the first time, you look soo promising chotu @ananddeverkonda...😎 No more needed your tag to your lad my dear @TheDeverakonda...😉#PushpakaVimanam #Liger pic.twitter.com/9GtudFaO3n — Kranthi Saketh (@livlikeK) November 11, 2021 Kottesam annaa 🔥🔥 #pushpakavimanam — Mokshith reddy (@OutsideRelax) November 12, 2021 Show full . 👌#PushpakaVimanam https://t.co/SrsU7pYZzD — Venkat (@urs_ms) November 12, 2021 Hittting hardd 🤘🤘🤘 #PushpakaVimanam — Rowdy (@Rowdyfan_Nani) November 12, 2021 First half 🤣👌🏼👍🏼 2nd half mid lo some lag.. rest 👍🏼 2nd heroine 🤣🤣👌🏼 Overall decent watch 3/5 #PushpakaVimanam — Manoj Rahul (@DHFM_endlessly) November 12, 2021 A comedy thriller with a twist and some emotional scenes @ananddeverkonda ‘s performance 👏 Songs and bgm are good Excluding a bit lag in both the halves its a good watch for this weekend Go for it! Rating : 3/5#PushpakaVimanam Review pic.twitter.com/wTEnZfvTKK — aRRRun (@ArunJai999) November 12, 2021 -
అందుకే ఆఫర్స్ వచ్చినా వదులుకున్నాను: హీరోయిన్
Pushpaka Vimanam Fame Geeth Saini : ‘‘పుష్పక విమానం’లో చిట్టిలంక సుందర్ భార్య మీనాక్షి పాత్ర చేశా. పెళ్లయ్యాక మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. సినిమా చూశాక ప్రేక్షకులు నా పాత్రని ఇష్టపడతారు’’ అని గీత్ సైనీ అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, గీత్ సైనీ, శాన్వీ మేఘన హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గీత్ సైనీ మాట్లాడుతూ– ‘‘మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. అయితే ‘పుష్పక విమానం’ ఆడిషన్స్‌కి నా స్నేహితురాలు నా ఫొటోలు పంపింది.. మీనాక్షి క్యారెక్టర్‌కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. కెరీర్ ఆరంభంలోనే ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు.. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా వేరే సినిమాలు చేయకూడదనుకుని కొన్ని ఆఫర్స్ వదులుకున్నాను. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది’’ అన్నారు. -
‘పుష్పక విమానం’ డైరెక్టర్ దామోదర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): తండ్రి పేరున్న కథా రచయిత, తాత నక్సలైట్ నాయకుడు... అతను మాత్రం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అనే సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్ర దర్శకుడు సృజన్(దామోదర) శ్రీకాకుళం వాసే. దర్శకుడి తండ్రి ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో నివాసముంటున్నారు. సృజన్ తాత ప్రముఖ నక్సలైట్ నాయకులు మామిడి అప్పలసూరి. వీరి స్వగ్రామం కోమర్తి. లఘు చిత్రాల నుంచి.. సృజన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి సినిమాలపై ఇష్టంతో అటువైపు వెళ్లారు. తొలి తెలుగు కథగా చెప్పుకునే గురజాడ ‘దిద్దుబాటు’ ఆధారంగా సృజన్ ‘కమిలిని’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశారు. సృజన్ అభిరుచికి ఈ లఘుచిత్రం ఓ మచ్చుతునక. ఈ షార్ట్ ఫిలింను అప్పట్లో దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు కూడా. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ లఘుచిత్రంతోనే సృజన్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అలాగే ఓ గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తీసిన ‘సన్నాయి’ అనే షార్ట్‌ఫిలిం కూడా సృజన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం ఫిలిం సర్కిళ్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గోవర్దనరావు ప్రోత్సాహంతోనే.. ఈ సినిమాపై సృజన్ మాట్లాడుతూ విజయ దేవర కొండ తండ్రి గోవర్దనరావు ప్రోత్సాహంతోనే పుష్పక విమానం సినిమాను తెరకెక్కించానని తెలిపారు. నూతన దర్శకులు, నటులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే తనకూ అవకాశం ఇచ్చారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ కూడా అండదండలు అందించారని తెలిపారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రోజూ వింటున్న సంఘటనల ఆధారంగా తీసినట్లు వివరించారు. -
నా ఫ్రస్ట్రేషన్ చూసి నవ్వుకుంటారు: ఆనంద్ దేవరకొండ
‘‘నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. పెళ్లి వల్ల మన జీవితంలో కొత్త బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. ‘పుష్పక విమానం’లో పెళ్లి గురించి ఓ మంచి విషయాన్ని చూపించాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశిస్తున్నాం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ముందు ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ ‘పుష్పకవిమానం’ అనగానే ఓ పాజిటివ్ వైబ్ ఉందనిపించింది. సింగీతం శ్రీనివాసరావుగారికి ఫోన్ చేసి, ‘మీ టైటిల్ వాడుకోవచ్చా?’ అని దామోదర అడిగితే, ‘అది నా టైటిల్ కాదు... ఎప్పట్నుంచో ఉంది. మీ సినిమాకి సెట్ అవుతుందంటే వాడుకోండి’ అని పాజిటివ్‌గా స్పందించారు. ► ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అప్పటి నుంచి మా అన్నయ్య విజయ్‌కు దామోదరతో పరిచయం ఉంది. వాళ్లిద్దరూ సినిమా చేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత అన్న చేసిన ‘పెళ్ళి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ హిట్స్ కావడం వంటివి జరిగిపోయాయి. ఈ సమయంలో మా నాన్నగారు గోవర్థన్‌కు దామోదర దగ్గరయ్యారు. ‘పుష్పక విమానం’ కథను దామోదర నాన్నకు చెప్పారు. నేనూ కథ విన్నాను. మొదట్లో ఈ సినిమాలో నేను హీరోగా చేయాలనుకోలేదు. కొందర్ని సంప్రదించగా... హీరో భార్య లేచిపోవడం ఏంటీ అని ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి సుందర్ పాత్రకు నేను సరిపోతానని అనుకోవడంతో ఓకే చేశారు. ►ఈ సినిమాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్ర చేశాను. కానీ పెళ్లయిన పదిరోజుల లోపే సుందర్ భార్య వెళ్లిపోతుంది. బయటకు తెలిస్తే పరువు పోతుందని తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ ప్రాసెస్‌లో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సి వస్తుంది. పోలీసాఫీసర్‌గా సునీల్ అన్న, స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్‌గారు చేశారు. సినిమా చూసే ప్రేక్షకులకు సుందర్‌పై జాలి కలుగుతుంది... కానీ నా ఫ్రస్ట్రేషన్ చూసి నవ్వుకుంటారు. ►‘పుష్పక విమానం’ను మా అన్నయ్య చూశారు. నచ్చడంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్‌కు టైమ్ కేటాయించారు. నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నా స్క్రిప్ట్స్ నేనే వింటాను. ఓ సందర్భంలో దర్శకుడు వంశీ పైడిపల్లికి ‘మా తమ్ముడు ఆనంద్ ఆఫ్‌బీట్ సినిమాలు చేస్తుంటాడు’ అని అన్నయ్య నన్ను పరిచయం చేశారు. ఇప్పడు కొత్త తరహా కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ అందరూ కొత్తగా ఆలోచిస్తున్నారు. భిన్నమైన సినిమాలు చేయడానికి ఓ యాక్టర్‌గా నేను సిద్ధంగానే ఉన్నాను. అలాంటి సినిమాల్లో నటించినప్పుడే యాక్టింగ్‌కు మరింత స్కోప్ దొరుకుతుంది. ప్రస్తుతం దర్శకులు కేవీ గుహన్‌గారు, సాయి రాజేశ్‌లతో పాటు ఓ కొత్త దర్శకుడితో సినిమా కమిటయ్యాను. -
రెండు ఎపిసోడ్స్ షూట్ చేశాక జయసుధ భర్త చనిపోయారు: నటి
‘‘పుష్పక విమానం’లో ఆనంద్ దేవరకొండ పాత్రతో నా బంధం ఏంటి? అనేది తెరపైనే చూడాలి. నా పాత్ర సందర్భానుసారంగా వస్తుంది’’ అన్నారు శాన్వీ మేఘన. ఆనంద్ దేవరకొండ హీరోగా, శాన్వీ మేఘన, గీత్ సైనీ హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. శాన్వీ మేఘన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘నాది హైదరాబాద్. మా కాలేజ్ క్యాంపస్‌లో షూటింగ్ జరిగినప్పుడు నన్ను చూసి ఓ సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు. నాకు నటనంటే ఆసక్తి ఉండేది కాదు.. మా ఇంట్లో నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. జయసుధగారు నిర్మిస్తున్న టీవీ ప్రోగ్రామ్ కోసం స్వయంగా అడగడంతో మా అమ్మా నాన్న అభ్యంతరం చెప్పలేదు. రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత జయసుధగారి భర్త నితిన్ కపూర్‌గారు చనిపోవడంతో ఆ టీవీ కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో హీరోయిన్గా చేశాను. ‘సైరా నరసింహా రెడ్డి’లో చిన్న పాత్ర చేశాను. తరుణ్ భాస్కర్గారి ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్ చేశాను. ఆయనే ‘పుష్పక విమానం’ చిత్రానికి నన్ను సిఫారసు చేశారు. దామోదరగారు ఆడిషన్ చేసి సెకండ్ లీడ్‌గా సెలక్ట్ చేశారు. నాకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవిగారు. హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టం. విజయ్ దేవరకొండగారితో నటించే అవకాశం వస్తే వదులుకుంటానా?’’ అన్నారు. -
ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ, అదేంటో చూశారా!
విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పరిశ్రమలో ఎక్కువగా యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా తనదైన మ్యానరీజంతో విజయ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. మొదట సహా నటుడిగా పరిశ్రమలో అడుగు పెట్టిన విజయ్ ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగాడు. హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా మారాడు. సొంతంగా బ్యానర్ పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీతో నిర్మాత మారాడు విజయ్. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ తాజాగా తన సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ మూవీని తెరకెక్కించాడు. నవంబర్ 12 విడుదలకు సిద్దమైన ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయాడు విజయ్. ఈ క్రమంలో తాజాగా విజయ్ తనదైన స్టైల్లో ‘పుష్పక విమానం’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ తన తమ్ముడు ఆనంద్‌ను ఆటపట్టించిన ఆసక్తికర వీడియోను వదిలాడు. ఈ నేపథ్యంలో ఉదయం బెడ్ మీద నుంచి లేస్తూనే నాతో ఈ రోజు బెడ్ షేర్ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్న వ్యక్తి వైపు తిపుతూ దుప్పటి లాగాడు విజయ్. చదవండి: ఆ బాధ్యత మోయడం చాలా కష్టంగా ఉంది: విజయ్ విజయ్ పక్కన ఉన్నది ఎవరాని చూడగా.. ఆనంద్ దేవరకొండ కనిపించాడు. ఇక కెమెరా ఆనంద్ వైపు చూపిస్తూ ‘నీ పెళ్లాం ఎక్కడా?’ అంటూ అని అడుగుతూ ఆనంద్‌ను ఆటపట్టించాడు విజయ్. నిద్ర మోహంతో ఉన్న ఆనంద్ కాస్తా విసుక్కుంటూ మరోవైపు తిరుగ్గా అలాగే దుప్పటి లాగిన విజయ్‌కి.. ఆనంద్ సిగ్గు పడుతూ ‘నా పెళ్లాం లేచిపోయింది’ అంటూ సమాధానం ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఇలా వినూత్నంగా విజయ్ ‘పుష్పక విమానం’ మూవీని ప్రమోట్ చేయడం చూసి ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా ఈ మూవీ నవంబర్ 12న విడుదల థియేటర్లో విడుదల కానుంది. ఇక విజయ్, పూరీ జగన్నాథ్‌తో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. -
సొంత డబ్బు పెట్టి చేస్తున్నా.. నన్ను మీరే కాపాడాలి: విజయ్ దేవరకొండ
-
ఆ బాధ్యత మోయడం చాలా కష్టంగా ఉంది: విజయ్
ఒక వైపున హీరోగా తనని తాను నిరూపించుకుంటూ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విజయ్ దేవరకొండ, మరో వైపున నిర్మాతగా కూడా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నిర్మాణంలో తన సోదరుడు ఆకాశ్ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా నిన్న రాత్రి వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. చదవండి: విడాకులపై పూనమ్ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్ డిలిట్ ‘హీరోగా నేను ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నిర్మాతలు దొరక్క చాలా కష్టాలు పడ్డాను. నా తరువాత వచ్చేవాళ్లు ఆ కష్టాలు పడకూడదనే ఒక బలమైన ఉద్దేశంతో నేను సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టాను. ఈ బాధ్యతను మోయడం చాలా కష్టంగా ఉంది .. అయినా అవకాశం పొందినవాళ్లు స్టేజ్‌పై మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. కష్టమైనా కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే అనుకుంటున్నాను. మా పేరెంట్స్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతూనే నాకు పెట్రోల్ డబ్బులు ఇచ్చి ఆడిషన్స్‌కి పంపించారు. చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు సినిమాల్లోకి రాకముందు నేను ఎవరనేది మా గల్లీలో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి నేను ఇప్పుడు ఒక నటుడిగా.. నిర్మాతగా వైజాగ్‌లో స్టేజ్‌పై నిలబడి ఉన్నా. నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ .. మీ మీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వలో లైగర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే చిత్రాలివే
జనాలు కరోనా భయాన్ని వీడడంతో థియేటర్లకు మళ్లీ మునుపటి రోజులు వచ్చాయి. దసరా, దీపావళి పండగలకు వరుస సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేశాయి. గతవారం సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’తో పాటు పూరి ఆశాశ్ ‘రొమాంటిక్’, సంతోష్ శోభన్ ‘మంచి రోజులు వచ్చాయి’లాంటి చిత్రాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాయి. ఇక సూర్య నటించిన ‘జైభీమ్’ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఇలా గతవారం స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వడంతో సినీ ప్రియులు దీపావళి పండగను మరింత ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ వారం కూడా పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాయి. అవేంటో చూద్దాం. రాజా విక్రమార్క యంగ్ హీరో కార్తీకేయన్ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీతోనే తమిళ నటి తన్యా రవిచంద్రన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్‌గా కనిపించారు. తనికెళ్ల భరణి, సాయి కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. పుష్పక విమానం యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం'. ఈ చిత్రం నవంబర్12న థియేటర్స్‌లో విడుదల అవుతోంది. దామోదర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శాన్వి మేఘన హీరోయిన్ .పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్(ఆనంద్ దేవరకొండ) అనే స్కూల్ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అనేదే పుష్పక విమానం కథ. ఈ చిత్రానికి రామ్ మరియాల సంగీతం అందించాడు. తెలంగాణ దేవుడు శ్రీకాంత్ హీరోగా నటించిన కెసిఆర్ బయోపిక్ ‘తెలంగాణ దేవుడు’ సినిమా కూడా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. జిషాన్ ఉస్మాన్ హీరోగా సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్ , తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి, ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్రతో ఈ సినిమా రూపొందించారు. ఉద్యమం చేసి, సాధించుకున్న తర్వాత తెలంగాణలో ఏర్పడిన పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్రం బృందం పేర్కొంది. వీటితో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన ‘కె3 కోటికొక్కడు’ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా 12వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ‘ది ట్రిప్’ అనే చిన్న సినిమా కూడా 12వ తేదినే థియేటర్లలో రానుంది. ఆహాలో ‘3 రోజెస్’ తెలుగు ఓటిటి ఆహాలో పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘3 రోజెస్’ సీరిస్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సిరీస్‌కి మగ్గీ దర్శకత్వం వహిస్తున్నాడు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు.. ఒకేచోట కలిసి స్నేహితులయ్యాక.. వాళ్ల కథలు ఎటు మలుపు తిప్పాయి. అస్సలు సమాజంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనే ఆసక్తికర అంశంతో ఈ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చే చిత్రాలివే... డిస్నీ+ హాట్‌స్టార్ డోప్ సిక్(నవంబర్ 12) కనకం కామిని కలహం(నవంబరు12) జంగిల్ క్రూయిజ్(నవంబరు12) స్పెషల్ ఆప్స్(నవంబరు12) షాంగ్-చి(నవంబరు12) జీ5 అరణ్మణై 3(నవంబరు12) స్క్వాడ్ (నవంబరు12) నెట్‌ఫ్లిక్స్ రెడ్‌నోటీస్ (నవంబరు 12) -
‘పుష్పకవిమానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
నన్ను నడిపిస్తున్నది ఆ రెండే!
‘‘పుష్పకవిమానం’ సినిమాకు నిర్మాతను నేను. ఈ సినిమాపై కొందరి కెరీర్స్ ఆధారపడి ఉన్నాయి. ఒక్కోసారి నిర్మాణం అవసరమా? అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరూ తమకు దక్కిన అవకాశాల గురించి మాట్లాడుతుంటే.. ఇలాంటి ఎమోషన్‌తోనే కదా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందని గుర్తొచ్చి, కష్టమైనా చేయాలనిపిస్తుంది. నన్ను రెండే నడిపిస్తున్నాయి. అనుకున్నది సాధించగలనన్న నా ఆత్మవిశ్వాసం. రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్. అది మీ (అభిమానులు, ప్రేక్షకులు) మీద ఉన్న కాన్ఫిడెన్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధనరావు, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సృజన్ (చిత్రదర్శకుడు దామోదర) మంచి రైటర్, డైరెక్టర్. ఈ సినిమాకు మరో పిల్లర్ ఆనంద్. నటన చింపేశాడు.’’ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్ర చేశాను. వైవాహిక జీవితం గురించి ఎన్నో ఊహించుకున్న చిట్టిలంక సుందర్ భార్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నదే కథ’’ అన్నారు. ‘‘చాలామందిని సపోర్ట్ చేయడానికి విజయ్ ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు విజయ్ మిట్టపల్లి. ‘‘ఆనంద్ నటనతో పాటు ఈ సినిమాలోని కామెడీ, థ్రిల్లింగ్ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు దామోదర. నటుడు హర్షవర్థన్, మ్యూజిక్ డైరెక్టర్స్ మార్క్ కె రాబిన్, సిద్దార్థ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్‌ను మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాను . సమస్యలుంటే ఈ యాప్ ద్వారా పోలీసులను కాంటాక్ట్ కావొచ్చు. పోలీసులు రెస్పాండ్ అవుతారు. కానీ ఎవరికీ ఈ యాప్ అవసరం రాకూడదనే కోరుకుంటున్నాను . -
గరం గరం వార్తలు 06 November 2021
-
రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Reveals About His Break Up: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన బ్రేకప్ను బయటపెట్టేశాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమాకు విజయ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు. తాజాగా తమ గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పలు ప్రశ్నలకు దేవరకొండ బ్రదర్స్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ డేటింగ్లో ఉన్నారా? సింగిలా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. 'ఈ మధ్యే నా హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే కొంచెం బాధలో ఉన్నా' అని తెలిపాడు. అంతేకాకుండా ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదని కూడా చెప్పుకొచ్చాడు.దీంతో దేవరకొండతో బ్రేకప్ అయిన ఆ అమ్మాయి ఎవరా అని ఫ్యాన్స్ మళ్లీ ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఆనంద్ దేవరకొండ..తాను ఇంకా సింగిల్ అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చాడు. -
పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ చేసిన అల్లు అర్జున్.. ఫోటోలు
-
పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ
Allu Arjun And Vijay Devarakonda About Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సంతాపం వ్యక్తం చేశారు. పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పునీత్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన మా ఇంటికి వచ్చేవారు. కలిసి భోజనం చేసేవాళ్లం. నేను బెంగళూరుకు వెళ్లినప్పుడు కలిసేవాళ్లం. ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం. ఓ డ్యాన్స్ కార్యక్రమానికి ఇద్దరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఎప్పుడు కలిసినా బెంగళూరు రమ్మనేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన లేరనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యాను. పునీత్ గొప్ప వ్యక్తి అని, ఆయన చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..కొన్నాళ్ల క్రితం ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లి తనతో రెండు, మూడు గంటలు మాట్లాడాను. ఆయన అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం కలిచివేసింది. ఏదో ఒకరోజు ఈ లోకం నుంచి మనం వెళ్లిపోతాం. ఉన్నంతకాలం కలిసి పనిచేద్దాం. సంతోషంగా ఉందాం. ప్రేమిద్దాం..ఇతరకులకు మద్ధతుగా నిలుద్దాం అని విజయ్ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి -
పుష్పక విమానం: పెళ్లైన 10 రోజులకే భార్య లేచిపోయిందా?
దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. తాజాగా పుష్పక విమానం సినిమాతో ప్రయోగం చేయబోతున్నాడీ హీరో. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు. ఈ ట్రైలర్లో ఆనంద్‌ను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చూపించారు. అతడికి ఓ అందమైన అమ్మాయితో పెళ్లి జరిపించారు. పెళ్లైన 8 రోజులకే సిటీలో కొత్త జీవితం ప్రారంభించిందీ జంట. అయితే అతడు తన భార్యను ఎవరికీ చూపించకపోగా ఆమె ఇంట్లోనే ఉన్నట్లు నమ్మిస్తాడు. తనే ఇంటి ముందు ముగ్గులేస్తూ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తన భార్యే చేసిందని స్కూల్లో స్టాఫ్‌కు వడ్డిస్తాడు. ఆనంద్ తన భార్యను ఎవరికీ చూపించకపోవడానికి కారణం ఆమె పెళ్లైన పది రోజులకే లేచిపోతుంది. ఈ విషయంలో పోలీసులు అతడినే అనుమానిస్తారు. నీ భార్య లేచిపోయిందని చెప్పడానికి ఒక్క సాక్ష్యం చూపించు అని పోలీస్ పాత్రలో ఉన్న సునీల్ ఆనంద్‌ను అడుగుతాడు. దీనికి హీరో ఆమె రాసిన లెటర్ ఉందంటూనే దాన్ని మింగేసానని చెప్తాడు. అలా వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నవంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవబోతోంది. ఇదిలా వుంటే అతడు ‘మధురా’ శ్రీధర్ రెడ్డి, బలరామ్ వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా రూపొందనున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే కేదారం సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. -
పుష్పక విమానం’ హీరోయిన్ శాన్వీ మేఘన బ్యూటిఫుల్ ఇమేజస్
-
రిలీజ్‌కు రెడీ అయిన 'పుష్పక విమానం'
Pushpaka Vimanam Release Date: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం' రిలీజ్‌కు రెడీ అవుతుంది. నవంబర్12న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. దామోదర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘కల్యాణం’పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ గాయకుడు సిద్‌శ్రీరామ్, మంగ్లీ పాడారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించారు. ఆనంద్‌కు జోడీగా గీతా షైనీ నటించింది. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. Fasten your seatbelts because it is going to be a rollercoaster bride! 😉🎺🥁#PushpakaVimanamOnNov12 in a theatre near you#PushpakaVimanam @TheDeverakonda @ananddeverkonda@itsdamodara @Mee_Sunil @SaanveMegghana @GeethSaini pic.twitter.com/yyGMv4XmM5 — Anand Deverakonda (@ananddeverkonda) September 28, 2021 -
మూడు సినిమాలు ప్రకటించిన ఆనంద్ దేవరకొండ
‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అతని పుట్టినరోజు సందర్భంగా సోమవారం మూడు సినిమాలను ప్రకటించారు. ‘మధురా’ శ్రీధర్ రెడ్డి, బలరామ్ వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా రూపొందనున్న సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తారు. అలాగే కేదారం సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలుగా ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. మరోవైపు ప్రస్తుతం ఆనంద్ నటిస్తున్న ‘పుష్పకవిమానం’ చిత్రంలోని ‘సిలకా’ అనే పాట కూడా పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. చదవండి: వివాదాస్పద 'బాంబే బేగమ్స్' అసలు కథేంటి..? -
పుష్పకయాత్ర
ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరం ఒకే ద్వారం గుండా విమానం ఎక్కే చోటికి చేరుకున్నాం.ఎంత గొప్పవాళ్ళు అయినా కూడా ఈ పుష్పకవిమానంలో ఎక్కాలంటే మాత్రం రాసి పెట్టి ఉండాలి. కొంతమంది విమానం వరకూ వచ్చినా సరే, వారిని తిరిగి వెనక్కి పంపుతున్నారు ద్వారం దగ్గర ఉన్న విచిత్ర వేషధారులు. పాపం దురదృష్టవంతులు. మామూలువిమానం కంటే ఇది ఏంతో భిన్నంగా ఉంది, బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. పూల మీద కాలు పెట్టామా అన్నట్లున్న మెట్లెక్కి విమానంలోకి చేరుకున్నాము. లోపల ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉండేటట్లు ఉంది మరి! కొంతమందిని ఎందుకు వెనక్కి పంపారో అర్ధం అవటంలేదు. చుట్టూ ఇనుప రేకుల బదులు అద్దాలు బిగించినట్టు బయట పరిసరాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అద్దాలు కూడా లేవేమో, బయట నుండి మంచి సువాసనలతో కూడిన గాలి వీస్తూ ఉంది. దాని రెక్కలు ఏవో పక్షి రెక్కల లాగా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంది. మేము మొత్తం ముప్పై ఆరుమందిమి పుష్పక ట్రావెల్స్ వారి విమానంలో యాత్రకు బయలుదేరాము. వాళ్ళలో ఇరవై మంది వరకూ నాకు తెలిసిన వాళ్ళే అవడం కాస్త విచిత్రంగా ఉంది. అందరం కూర్చున్నాము. ఉన్నట్టుండి విమానం సమాంతరంగా కాకుండా నిట్టనిలువుగా గాలిలోకి లేచింది. విమానం ముందుకు వెళ్ళే కొద్ది మేఘాలు కిందకు వెళుతున్నాయి. అయినా కూడా దారంతటా కొత్త మేఘాలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఒక్కో ఆకారంలో ఉన్నాయి. విమానం అందమైన ఉద్యానవనంలోకి ప్రవేశించి ఆగింది. అందరు కిందికి దిగి చూడవచ్చని ఒక కంఠం ప్రకటించింది. ఆగొంతు ఎవరిదో? ఎవరూ కనబడలేదు. ఆకాశంలో ఉద్యానవనం ఏమిటా అని అందరం ఆశ్చర్యంగా చూస్తూ విమానం నుండి కిందికి దిగాము. ఆ వనంలో మరలా ఆకాశానంటుతున్నాయా అన్నట్టుగా ఏపైన చెట్లు,రంగురంగుల పూలు, పూల పుప్పొడిని గ్రోలుతున్నఅందమైనసీతాకోకచిలుకలు, పక్షులు, భారీ ఆకారం గల జంతువులూ తిరుగాడుతున్నాయి. మేము తప్ప ఎక్కడా మనుషులు కనిపించలేదు. అద్భుతపరిమళంతోట అంతటా పరుచుకుని ఉంది. అందరూ ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు పరిచయం లేదు. పరిచయం ఉన్న కొద్దిమంది మాత్రం కచ్చితంగా అంత ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. మొదటగా చూసింది ఈ విమానం ఎక్కక ముందు, బస్సులో మేము చేసిన చార్ధామ్ యాత్రలో మాకు వంట చేసిపెట్టిన అరవవాడు. నేను ఎన్నో సార్లు వాడితో వంటల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడినా, వాడి పేరు నాకు తెలియదు. లేదు నేనడగలేదు. ముతక లుంగీ, మాసిపోయిన బనీను కట్టుకొని ఉండే వాడు కాస్తా, అందమైన తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు. ఎన్నో సార్లు వాడి మీద ఆధారపడి ఉండే కుటుంబం గురించి చెప్పేవాడు. నెలలో సగం రోజులు వారికి దూరంగా ఉంటున్నందుకు బాధపడుతూ ఉండే వాడు. ఇప్పుడు వాడి ముఖంలో అటువంటి ఛాయ లేమీ లేవు. కులాసాగా తిరుగుతూ చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లు చెబుతున్నాడు. నాకేసి చూసి నవ్వాడు. అదే వాణ్ని నవ్వుతూ చూడటం. హటాత్తుగా నాకో అనుమానం వచ్చింది, వాడు ఇక్కడ ఉంటే మాకు వంట చేసే వాళ్ళు ఎవరు? చుట్టూ చూశాను అటువంటి ఏర్పాట్లు ఏమీ చేసినట్టు కనిపించలేదు. గంటకోసారి ఏదో ఒకటి తినే నాకు ఆశ్చర్యంగా అస్సలు ఆకలే అనిపించలేదు. ఎవరికీ ఆ ఆలోచన లేనట్టుంది. పాన్పు కంటే మెత్తగా ఉన్న గడ్డి మీద లేడి పిల్లలా గెంతుతూ అగుపడ్డాడు మా బస్సుకు క్లీనర్‌గా వచ్చిన అబ్బాయి. ఇంటి నుండి దూరంగా వచ్చానని ఎప్పుడూ ఉలుకూపలుకూ లేకుండా నత్తలాగుండే పద్నాలుగేళ్ళ కుర్రాడు. వాడు అంత ఆనందంగా ఉండటంచూసి నాకు ఆశ్చర్యమేసింది. మరో వైపున ఉన్న జనాలలో నవ్వుతూ, తుళ్ళుతూ సరదాగా కబుర్లు చెప్తూ కనబడింది ఆమె. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకోవడంతో ఎప్పుడూ కోపంగా, దిగులుగా, అకారణంగా పోట్లాడుతూ ఒంటరిగా ఉండేది. అలాంటి ఆమె ఇలా అందరితో కలిసి ఉల్లాసంగా కబుర్లాడుతూ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆనందమే సుమా అసూయ మాత్రం కాదు, నిజంగా. ఒకచోట కొందరు చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు. బస్సులో కదలకుండ గంట కూర్చుంటే కాళ్ళు ఉబ్బిపోయి, గట్టిగా నాలుగు అడుగులు వేస్తే ఆయాసపడే అతడు పూనకం వచ్చిన వాడిలా గాల్లో ఎగిరెగిరి చిందులు వేస్తున్నాడు. ఒకప్పుడు తన ఆటపాటలతో జనాలను ఓలలాడించిన అతనికి, అప్పటి జవసత్వాలు తిరిగి వచ్చినట్టున్నాయి. మైమరిచి ఆడుతున్నాడు అతను. విమానంలోకి తిరిగి రమ్మని గొంతు వినిపించేసరికి అందరూ వచ్చి విమానం లోనికి ఎక్కుతున్నారు. నిన్నటి దాకా నేను చూసిన వాళ్ళలా అగుపించలేదు ఎవరూ. కర్మ ఫలాన్ని రోగాల రూపంలో అనుభవిస్తూ, కడుపున పుట్టిన వారి ఆదరణకు నోచుకోక నిరాశా పూరిత వదనాలతో, ఇష్టమైనది తినలేక, కనీసం ఏదో ఒకటి తినడానికి కూడా సహకరించని వణికే శరీరాలతోఉండేవారు కాస్తా ఇప్పుడు ధవళ వర్ణదుస్తులు ధరించి, వెలిగే కండ్లతో, నిటారుగా నిలిచిన శరీరాలతో, అంతులేని ప్రశాంతత గలిగిన వదనాలతో ఉన్నారు. ఇంత మార్పు ఎలా సాధ్యమైందో తెలియలేదు. కనీసం విమానం వాళ్ళు తాగడానికి కూడా ఏమీ ఇవ్వలేదు, దాని వల్ల ఇలా మారాము అనుకోవడానికి. నేను కూడా అలాగే మారానా? నా శరీరంలో కూడా మార్పు తెలుస్తోంది. ఒకసారి నన్ను నేను అద్దంలో చూసుకుందామని అనుకున్నా. విమాన సహాయకులను అద్దం అడుగుదామని చుట్టూ చూశాను. అటువంటి వారు ఎవరూ కనబడలేదు. అసలు విమానాన్ని నడుపుతున్నట్టు కూడా ఎవరూ కనబడలేదు. కంగారు కలిగిందా, లేదు అస్సలు కలగలేదు. విమానం తిరిగి బయలుదేరి ఎంతో సేపు అయింది. ఇంకా గమ్యం రాలేదు. అయినా చిరాకు కలగలేదు. ఇంత ప్రశాంతత నాలో ఎలా కలిగింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. చుట్టూ చూశాను, అందరూ అలాగే ఉన్నారు. ఎవరూ అలిసిపోయినట్టు, నిద్రపోతున్నట్టు అనిపించలేదు. గమ్యస్థానం చేరుకున్నాము, అందరూ దిగవలసిందిగా కోరుతున్నాం అంటూ మరోసారి ఆ కంఠం వినబడింది.అందరం కిందికి దిగాం. ఇక్కడ ఎటు చూసినా జనమే కనబడుతున్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. దూరంగా కొన్ని కౌంటర్లు, ప్రతి కౌంటర్ ముందు పెద్ద వరుసలో చాలా మంది నిలబడి ఉన్నారు. మేమూ ఆ లైన్లో నిలబడ్డాము. ఆకౌంటర్లలో ఉన్న వ్యక్తులు లైన్లో నిలబడి ఉన్న వాళ్ళను ఏదో అడుగుతూ, లైన్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాక తన దగ్గర ఉన్న కంప్యూటర్ లాంటి దాంట్లో ఏదో రాసుకుంటున్నారు. సమాధానం చెప్తున్న వాళ్ళ ముఖాలు కాసేపు ఆనందంతో, కాసేపు బాధతో రకరకాలుగా మారుతున్నాయి. సమాధానం చెప్పిన తర్వాత పక్కకు వచ్చిన వాళ్ళు రెండు వేరువేరు ద్వారాల గుండా వెళుతున్నారు. కొంతమంది విచిత్ర వేషధారులు వాళ్ళను దగ్గర ఉండి లోపలి తీసుకెళ్తున్నారు. మొదటి ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళు ఆనందంగా వెళుతుంటే, రెండో ద్వారం గుండా వెళ్తున్నవాళ్ళు వడలిన ముఖాలతో వెళుతున్నారు. రెండో ద్వారం గుండా వెళ్తున్న వాళ్ళలో మళ్ళీకొంతమంది నిర్భయంగా వెళ్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. మా ముప్పై ఆరు మంది వంతు వచ్చింది. మెల్లగా ఒక్కొక్కరు కౌంటర్ దగ్గరకు చేరుకుంటున్నారు. నా వంతు వచ్చింది. నేను కౌంటర్ లోని వ్యక్తి వైపు చూశాను. అత్యంత గంభీరంగా ఉన్న అతని వదనంలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. అతను నా పేరు అడిగాడు. నేను కథకుడు అని చెప్పాను. అతను కథకుడు జననం 1963, మరణం 2019 అని రాసుకున్నాడు. మరణం, మరణమా, అంటే నేను మరణించానా అని ఆశ్చర్యంగా అడిగాను అతన్ని. అతను నా చేతిని అతని దగ్గర ఉన్న పుస్తకంపై ఉంచాడు.అప్పటివరకు నా జీవితంలో జరిగిన ప్రతి విషయం కండ్ల ముందు మెదలసాగాయి. మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రతి సంఘటన కనపడుతున్నది. ఆయా సంఘటనలు నాకు మిగిల్చిన అనుభూతులకు అనుగుణంగా ముఖంలోని రంగులు మారుతున్నాయేమో. పెదవులు నవ్వుతున్నాయి, బిగుసుకుంటున్నాయి, కండ్ల నుండి నీళ్ళు కారుతున్నాయి. చివరగా నేను బస్సులో నిద్రలో ఉన్నాను, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ చీకట్లో చిన్న వెలుగు దగ్గర బస్సు ఆగింది. బస్సు దిగి వెళ్ళిన డ్రైవర్ కాసేపటికి తూలుతూ వచ్చాడు. ఇంకాసేపటికి బస్సు కూడా తూలడం మొదలుపెట్టింది. దాదాపు ఎదురుగా వస్తున్న వాహనాన్నిఢీ కొట్టబోయి తృటిలో తప్పించుకుంది. డ్రైవర్ ఊగుతూ చివరికి స్టీరింగ్ మీదకు ఒరిగిపోయాడు. బస్సు అదుపుతప్పింది. వందల అడుగుల లోతున్న లోయలోకి దొర్లింది. అందరం నిద్రలో ఉండగానే చనిపోయాము. ఎలా చనిపోయామో కూడా ఎవరికీ తెలియదు. చెయ్యి పుస్తకం పైనుండి తీశాను. మరి విమానం దగ్గరి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిన వారు ఎవరు అని అడిగాను. ఓ అదా వాళ్లు చావు అంచుల దాకా వచ్చి, భూమి మీద ఇంకా నూకలు ఉండి తప్పించుకున్నవారు. అంటే వాళ్లు దురదృష్టవంతులు కారు, అదృష్టవంతులు అని గ్రహించాను. అందరితో పాటూ నేను ద్వారాల వైపు నడవసాగాను.కొందరు విచిత్రవేషధారులు వచ్చి ఒక ద్వారం వైపు నన్ను తీసుకుని వెళ్లి అక్కడి వరుసలో నిలబెట్టారు. అదిఏం ద్వారం అని అడిగాను. స్వర్గానికి వెళ్ళే ద్వారం అని చెప్పాడు. అటు వైపుది నరకానికి వెళ్లే ద్వారం అని చెప్పాడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే నేను నిలబడింది స్వర్గ ద్వారానికి ఎదురుగా. నిలబడి అందరి వైపు చూడసాగాను. ఇప్పుడువాళ్ళ మనసులో విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇంతకూ ఆత్మలకు మనసు ఉంటుందా ఏమో తెలియదు. కాని వాళ్ళు అనుకునే విషయాలు కూడా తెలియసాగాయి.మోకాళ్ళనొప్పులతో బాధ పడే కళాకారుడు,బాధ, నొప్పి నుండి విముక్తి లభించిందని ఆనందంగా ఉన్నాడేమో.పెద్దకొడుకు దగ్గర ఒకరు, చిన్న కొడుకు దగ్గర ఒకరు ఉంటూ యాత్రకు కలిసి వచ్చిన ఆ దంపతులు ఇక ఒకరికిఒకరు దూరంగా ఉండక్కర్లేదని భావిస్తున్నారేమో. పిల్లలకు భారం అవలేదని, ఛీత్కారాలు పడక్కర లేదని ఆ పండు ముదుసలి అనుకుంటుందేమో. దేవుణ్ణి దగ్గర నుంచి చూసేంత దరికి చేరానని, కైవల్యం ప్రాప్తించిందని ఆ పంతులు భావిస్తున్నాడేమో. నరకపు ద్వారం వైపు చూశాను.. అనవసరంగా డబ్బు సంపాదనలో పడి పాపాలు చేసి, కనీసం కడుపుకు కూడు కూడా సరిగా తినలేకపోయానని ఆ వ్యాపారి వగరుస్తున్నాడేమో, నలుగురు మరణించిన ప్రమాదానికి కారణమైన అతను ఫోన్ మాట్లాడుతూ కారు నడపకుండ ఉండాల్సిందని భావిస్తున్నాడేమో, ఇక నుంచి తన సంపాదన గురించి తల్లిదండ్రులు, భార్య వాదులాడుకోనక్కర లేదని ఆ కుర్రాడు సంతోషిస్తున్నాడేమో. అనయాస మరణం లభించిందని ఆ రోగిష్టి వాడు నవ్వులు చిందిస్తున్నాడేమో, నరకప్రాయమైన ఆ జీవితం కంటే ఈ నరకమే మేలేనేమోనని ఆ అతివ స్థిమితంగా ఉందేమో, అంతమంది జీవితాలను నాశనం చేశానని మా బస్సు డ్రైవర్ దుఃఖిస్తున్నాడో. లేక బాధల నుండి అందరికి ముక్తి చేకూర్చానని ఉప్పొంగిన గుండెలతో ఉన్నాడో...అందరూ ఎలా ఉన్నా నాలో ఉన్న కథకుడు మాత్రం నేను చూసిన, చేసిన ఈ మరణాంతర ప్రయాణాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కాంక్ష మొదలయింది. ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆ కోరిక తీవ్రమైంది. ద్వారం దగ్గరి అద్దాలలో నన్ను చూసుకున్నాను. నా ముఖంలో ఆందోళన ప్రస్పుటంగా కనబడుతోంది. ద్వారం దగ్గర ఉన్న భటుడు నన్ను ఆపాడు. నా ముఖం వైపు చూసి తీవ్రమైన కోరికలతో ఉన్న వాళ్ళు స్వర్గప్రవేశానికి అనర్హులు. కోరికలను తీర్చుకోవడానికి మరొక జన్మ ఎత్తుపో అంటూ తన శూలంతో నన్ను నెట్టి వేశాడు. భూమి మీద మళ్ళీజన్మెత్తాను. నాకు తెలిసిన కథనంతా ప్రపంచమంతా ఎలుగెత్తి చాటుతున్నాను. బతికుండగానే మంచి పనులు చేయండి,మరణిస్తే మీతో పాటూ ఏదీ రాదు అని గొంతు చించుకుని అరుస్తున్నాను. అరిచీ అరిచీ అలిసిపోయి చుట్టూ చూశాను. నన్ను ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. తిరిగి మళ్ళీ అరవాలని గొంతెత్తాను. ఛీ ఎదవ కుక్క ఊరికే అరుస్తా ఉంది అంటూ ఎవడో రాయి విసిరాడు. కుయ్ మనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తాను నా నాలుగు కాళ్ళ మీద. - శ్రీకాంత్ రెడ్డి -
పుష్పక విమానంపై సప్తగిరీశుని దివ్య దర్శనం