Quarrel
-
సోదరుడే కాలయముడై..
మైసూరు: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో చెల్లిని సొంత అన్న చెరువులోకి తోసేయగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా జలసమాధి అయ్యింది. ఈ దారుణం మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. మరూరుకు చెందిన సతీశ్, అనిత(43) దంపతుల కుమారుడు నితిన్ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(18) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన యువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన నితిన్ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం బంధువులకు బాగా లేదంటూ నితిన్ బైక్‌పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఇంతలో పట్టరాని కోపంతో నితిన్ తన చెల్లి చేతులను టవల్‌తో కట్టేసి చెరువులోకి తోసేశాడు. ఆ వెంటనే కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి మరణించారు. ఆ తర్వాత నితిన్ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్‌కు ఈ విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. హుణసూరు రూరల్ పోలీసులు నితిన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
చిన్నపాటి గొడవ..పూలు కట్ చేసే బ్లేడ్‌తో యువకుడిని..
సాక్షి, రాంగోపాల్‌పేట్: ముగ్గురు యువకుల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఓ యువకుడి హత్యకు దారితీసిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ గాస్మండికి చెందిన భూక్యా శివాజీ అలియాస్ శివ (25) కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి పక్కన ఉండే వారి పెళ్లికి వెళుతున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో సైనిక్‌పురికి చెందిన తన స్నేహితుడు మింటు అలియాస్ డేనియల్‌తో కలిసి ఇంటి సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న గుర్తు తెలియని యువకుడిని ఆపి ఎవరు, ఇక్కడేమి చేస్తున్నావంటూ ప్రశ్నించడమేగాక అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో సదరు యువకుడు తన స్నేహితుడికి ఫోన్ చేసి తన బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని ఓల్డ్ గాస్మండికి రావాలని సూచించాడు. దీంతో మరో యువకుడు కారులో అక్కడికి వచ్చాడు. అయితే శివాజీ మరోమారు వారితో గొడవ పడ్డాడు. దీంతో అతను తన చేతిలో ఉన్న పువ్వులు కట్ చేసే బ్లేడుతో శివాజీపై దాడి చేసి కారులో పరారయ్యాడు. దీంతో శివాజీ స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న శివాజీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అతను అప్పటికే మృతి చెంది ఉండటంతో మార్చురీకి తరలించారు. శివాజీ స్నేహితుడు డేనియల్ ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. పోలీసుల అదుపులో నిందితులు ? యువకుడిని హత్య చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడిని బన్సీలాల్‌పేట్‌కు చెందిన పూల వ్యాపారిగా గుర్తించారు. కారు ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. (చదవండి: కారుతో తొక్కించి.. దారుణంగా హతమార్చి..) -
వాకిలి తుడవలేదని అత్త.. చల్లబడ్డాక తుడుస్తానని కోడలు.. చివరికి..
పిఠాపురం(కాకినాడ జిల్లా): పొద్దు కునుకుతోంది ఇంకా వాకిలి తుడలేదని అత్త, ఇంకా చాలా ఎండగా ఉంది కదా చల్లబడ్డాక తుడుస్తానని కోడలు అంతే ఇద్దరు పంతాలకు పోవడంతో వారి మధ్య చిన్న గొడవ. ఇంతలో బయటి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తన తల్లిని భార్యను చిన్న దానికి గొడవెందుకంటూ మందలించాడు. అంతా సర్దుమణిగింది అనుకుంటు ఉదయం లేవగానే కోడలు తనను కొడుకుతో తిట్టించిందని కోపగించి అత్త ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లి పోయింది. రెండు రోజుల పాటు ఎంత వెదికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో కొడుకు పోలీసులను ఆశ్రయించగా మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చదవండి: నచ్చని పెళ్లి చేస్తున్నారని.. ఆ యువతి ఎంతకు తెగించిందంటే? పట్టణ ఎస్సై శంకర్రావు కథనం ప్రకారం స్థానిక కత్తులగూడేనికి చెందిన వాకాడ సత్యనారాయణ తన తల్లి భార్యతో కలిసి ఉంటున్నాడు. తల్లి, భార్యకు మధ్య వాకిలి తుడిచే విషయంలో చిన్న గొడవ జరగడంతో సత్యనారాయణ తల్లి వీరరాఘవమ్మ అలిగి ఈనెల 14వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్ల దగ్గర ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
అమ్మా.. తెల్లారింది లేమ్మా!
రామారెడ్డి: రాత్రి జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఉరికి వేలాడుతున్న తల్లిదండ్రులు ఇంకా నిద్రలేవలేదనుకొని ఆరేళ్ల బాలుడు ‘అమ్మా లేమ్మా.. తెల్లారింది. నాన్న నువ్వైనా నిద్ర లెవ్వు’అని తట్టిలేపడం చుట్టుపక్కలవారిని కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నామాల శంకర్ (40), సుజాత (35) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల బాలుడు ప్రేమ్‌కుమార్ ఉన్నాడు. ఆదివారం రాత్రి నిద్రపోయేటప్పుడు ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కొడుకు నిద్రపోయాక ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బాలుడు ఉదయం లేచి మెడకు తాడుతో వేలాడుతున్న తల్లిదండ్రులను చూసి లేపగా వాళ్లు కదళ్లేదు. దీంతో తలుపులు తీసుకొని బయటకు వచ్చి నానమ్మ దగ్గరికెళ్లి అమ్మానాన్న నిద్రలేవట్లేదని చెప్పి తీసుకొచ్చాడు. వారి శవాలను చూసి ఆమె.. పక్కనున్నవారికి సమాచారం అందించింది. బాలుడు ‘లే అమ్మా’అని తల్లిపై పడుకొని ఏడ్వడం అక్కడున్న వారిని కలచి వేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. -
బాయ్‌ఫ్రెండ్ కోసం షాపింగ్ మాల్లో తన్నుకున్న యువతులు
పాట్నా: ప్రేమికుడు ముగ్గురు యువతులు పోట్లాడుకున్నారు. ముగ్గురికి ముగ్గురు జట్లు పట్టుకుని కొట్లాడారు. వారి గొడవను వారి ప్రియుడు చూస్తూ నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తిరుగుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మోతిజిల్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో ముగ్గురు యువతులు ఎదురుపడ్డారు. ఆ సమయంలో వారి ప్రియుడు అక్కడే ఉన్నాడు. చదవండి: సీఎం జగన్‌కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్ ఏం జరిగిందో ఏమో గానీ వారు వచ్చి రాగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు చేస్తూ బాహాబాహీకి దిగారు. మరో యువతి వచ్చి కూడా వారిపై దాడి చేసింది. అయితే వారు కొట్టుకుంటున్నా అక్కడే నిలబడ్డ యువకుడు నివారించే ప్రయత్నం చేయలేదు. వారి సిగపట్ల వీడియోను మాల్‌కు వచ్చిన కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఆ అబ్బాయి చాలా లక్కీ!’, ‘మాకు ఒక్కరే దిక్కులేరు నీకు ముగ్గురా బ్రదరూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం -
ఏడుగురి స్నేహితుల మధ్య ‘లూడో గేమ్’ వివాదం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం ఏర్పడింది. ఆ వివాదం కాస్త తీవ్ర దాడికి దారి తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంత స్థాయికి చేరింది. ఒకరి ప్రాణం మీదకు వచ్చింది. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుత వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చదవండి: మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. గంగాబౌలి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ అనీఫ్ (25), టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన రషీద్ (30), మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముస్తఫా (24)తో పాటు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో లూడో గేమ్ గెలుపోటములపై వివాదం ఏర్పడింది. ఈ సమయంలో ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అప్పటికే వారందరూ మద్యంమత్తులో ఉన్నారు. ఒకరినొకరు దాడి చేసుకొని పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. కొద్దిసేపటి తరువాత బయటికి వెళ్లివచ్చిన యువకులు మహమ్మద్ అనీఫ్పై తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో హనీఫ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మహమ్మద్ ముస్తఫా (24), రషీద్ (30)లకు కత్తిపోట్లకు గురయ్యారు. అక్కడినుంచి బయటకు తప్పించుకుని పారిపోయారు. దీంతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భయాందోళనతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని హనీఫ్, మరో ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముస్తఫా, రషీద్ కోలుకుంటున్నారని మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రణీశ్వర్రెడ్డి తెలిపారు. పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హనీఫ్, హాజీ స్నేహితులు. వీరిద్దరూ లూడో గేమ్ ఆడుతుంటారు. అయితే డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య డబ్బు విషయమై గొడవ ఏర్పడింది. పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే తీవ్ర గాయాలపాలైన హనీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హాజీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మంగళ్‌హాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
ఒకరు అదృశ్యం.. మరొకరు అమ్మకానికి!
డిండి: కళ్లు తెరిచి నెలరోజులు గడిచిందో లేదో.. అప్పుడే అమ్మఒడి నుంచి ఓ ఆడశిశువు అదృశ్యమైంది.. దీనిపై తల్లిదండ్రులు నోరువిప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోఘటనలో ఏడురోజుల పసిగుడ్డును అమ్మకానికి పెట్టారు ఓ పేద తల్లిదండ్రులు. ఇదేమిటని ప్రశ్నించిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాలు... డిండి మండలం కుందేలుబాయితండా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామలబాయితండాకు చెందిన జర్పుల çరమేశ్, సంగీత దంపతులు. వీరికి జూన్ 28న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. కాన్పు అనంతరం కాటికబండతండాలోని తల్లిగారింటికి వెళ్లిన సంగీత వారం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చింది. అయితే శిశువు పేరు రిజిస్టర్లో నమోదు చేయడానికి వెళ్లిన అంగన్వాడీ టీచర్‌కు ఆ శిశువు కనిపించలేదు. శిశువు గురించి అడిగితే తల్లిదండ్రుల్లో ఉలుకూపలుకూలేదు. అదే శ్యామలబాయి తండాకు చెందిన ఇస్లావత్ సక్రూ భార్య అమృత గతనెల 24న మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపను ఇతరులకు అమ్ముకుంటున్నారని చైల్డ్ హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్ 1098కు ఓ కాల్ వచ్చింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు, డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గతనెల 30, 31 తేదీల్లో ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిశువులు తల్లిదండ్రుల వద్దే ఉండాలని, లేనిపక్షంలో ఐసీడీఎస్ గృహానికి అప్పగించాలని, అక్రమంగా దత్తత ఇవ్వకూడదని సూచించారు. అయినా తమ బిడ్డను అమ్ముకుంటామని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీలేక ఆ ఇద్దరు శిశువుల వివరాలు సేకరించాలని కోరుతూ అంగన్వాడీ సూపర్వైజర్ రేణుకారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కాబోయే భర్తతో కలిసి బాస్‌ను హత్యచేసిన మహిళ
సాక్షి, ఢిల్లీ: కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్యచేసిందో మహిళ. ఢిల్లీలో నీరజ్ గుప్తా అనే వ్యాపారవేత్త వాయువ్య ఢిల్లీలో ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. అయితే అతను తప్పిపోయినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని, ఈ ఘటన వెనుక ఫైజల్ అనే మహిళ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కోణంలో విచారించగా గుప్తాను హత్య చేసినట్లు తేలింది. ఇందులో పైజల్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఫైసల్ గుప్తా దగ్గర పనిచేసేదని, గత 10 సంవత్సరాలుగా అతనితో వివాహేతర సంబంధం కలిగి ఉందని వెల్లడైంది.చదవండి:(భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా) వివరాల్లోకి వెళితే.. పైజల్‌కు జుబేర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కాగా, ఆ విషయాన్ని నీరజ్ గుప్తాకు తెలిపింది. అయితే వివాహానికి గుప్తా అభ్యంతరం తెలపడంతో నవంబరు 13న ఆదర్శ్ నగర్ లో కేవాల్ పార్క్ ఎక్స్టెన్షన్లో పైజల్ అద్దె ఇంటికి వచ్చి తల్లి, జుబెర్, తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య వాగ్వాదం తీవ్ర కావడంతో ఫైజల్ కాబోయే భర్త గుప్తా తలపై ఇటుకతో కొట్టి , కడుపులో పొడిచిన తరువాత అతని గొంతును కోశారు. మృతదేహాన్ని తరలించడంలో పైజల్. ఫైజల్ తల్లి జుబెర్‌కు సహయాన్ని అందించారు.అతని మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకెళ్లారు. గుజరాత్ భరూచ్ సమీపంలో రైలు నుంచి బయటకు విసిరేశారు. హత్య చేసిన నిందితులు పైజల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), కాబోయే భర్త జుబెర్ (28)ను అరెస్టు చేసినట్లు నార్త్‌వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు. -
ఆ గాడిద నాదే.. కాదు నాదే!
సాక్షి, వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పోలీసులకు వింత పంచాయితీ వచ్చి పడింది. ఒక గాడిదను ఇద్దరు వ్యక్తులు.. నాదంటే.. నాదేనంటూ పట్టుబట్టడంతో పోలీసులు ఎటూ తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు. దీంతో గాడిదతోపాటు దాని పిల్ల, ఇద్దరు వ్యక్తులు పీఎస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా తన గాడిదకు మేత సరిగ్గా అందకపోవడంతో చిక్కిపోయిందంటూ ఇరువురూ.. కన్నీరు పెట్టుకోవడంతో పోలీసులు జుత్తు పీక్కుంటున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ వద్ద నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదలను మేపుతూ వాటి పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద మొత్తం 22 గాడిదలు ఉండగా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో తొమ్మిది గాడిదలు చనిపోయాయని, మరో నాలుగు తప్పిపోయాయని తెలిపాడు. ఈ విషయంపై గత సెప్టెంబర్‌లో వికారాబాద్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. అయితే గాడిదలను గుర్తుపట్టడం తమకు కష్టమని.. మీరే వాటిని వెతికి ఆచూకీ చెబితే పట్టకొచ్చి ఇస్తామని పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రభు తన గాడిదల కోసం కొన్ని రోజులుగా వెతుకుతుండగా.. ఐదు రోజుల క్రితం మోమిన్‌పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాడిదలు ఉన్న చోటకు పోలీసులు వెళ్లేసరికి.. దాన్ని అప్పటికే డీసీఎంలో లింగంపల్లికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారుడు, ఇద్దరు పోలీసులు శనివారం లింగంపల్లికి వెళ్లి గాడిదను గుర్తించి ఆటోలో వికారాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. దీంతో ఆ గాడిద తనదేనంటూ యజమానురాలు పద్మ తన తండ్రి సత్తయ్యతో కలిసి వికారాబాద్ పీఎస్‌కు చేరుకుంది. పోలీసులు తీసుకొచ్చిన గాడిద తనదేనని.. తనకు ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) ఉన్నారని, ఇటీవల తన భర్త గుండెపోటుతో మృతిచెందాడరని ఆమె పోలీసులకు తెలిపారు. బతకడానికి ఏ ఆధారం లేకపోవడంతో తన తల్లిదండ్రులు ఇటీవలే రెండు గాడిదలను కొనిచ్చారని చెప్పింది. ఈ గాడిదలే తనకు, తన పిల్లలకు బతుకుదెరువని ఆమె విలపించింది. ఇరువురూ గాడిద నాదంటే.. నాదే అనడంతో పోలీసులు ఎటూ తేల్చలేకపోయారు. ఫిర్యాదుదారు ప్రభు మాత్రం.. పద్మ తండ్రి సత్తయ్య 2014లో తన గాడిదలను దొగలించాడని తెలిపారు. ఈ విషయమై కులస్తుల వద్ద పంచాయతీ పెట్టి.. వారికి జరిమానా వేయించినట్లు చెప్పాడు. దీంతో ఏం చేయాలో తోచని పోలీసులు మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు. గాడిద ప్రస్తుతం ప్రభు వద్ద ఉంది. -
టీడీపీ నాయకుల దౌర్జన్యం
సాక్షి, వెల్లలచెరువు (ప్రకాశం): టీడీపీ పార్టీ నాయకులు దౌర్జన్యం, అరాచకానికి అడ్డే లేకుండాపోతుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య మంగళవారం సాయంత్రం మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కొంచెం సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెల్లలచెరువులో సొసైటీ భవనానికి సమీప బజారులో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రచారానికి రావటంతో టీడీపీకి చెందిన చింతా రామారావు వర్గం రోడ్డుమీద అడ్డంగా నిలబడి వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రచారాన్ని ప్రశాంతంగా చేసుకోవడానికి సహకరించాలని టీడీపీ నాయకులను కోరినప్పటికీ వారు ఏ మాత్రం సహకరించకపోగా, గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి ఇరువర్గాలను చెదరకొట్టారు. టీడీపీకి సపోర్టు చేసిన పోలీసులు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి అడ్డుకున్న టీడీపీ నాయకులను చెదరకొట్టినట్లే కొట్టి మళ్లీ పోలీసులు వారిని అక్కడే ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు. కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే ప్రచారం చేయకుండా వెళ్లగొట్టారు. పోలింగ్ రోజు పరిస్థితి ఏంటి? ఎన్నికల ప్రచారంలోనే టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యం చేసిన సంగంతి తెలిసిందే.. గురువారం జరిగే ఎన్నికలు రోజు మాత్రం పోలీంగ్ పరిస్థితి ఏమిటని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి దౌర్జన్యాలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుల కోరుతున్నారు. -
శీతలపానీయంలో విషం కలిపి తాగించి..
సాక్షి, వినుకొండ : వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన రసూల్, సలోమి(35) దంపతులు బతుకు దెరువు కోసం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం వెల్లటూరు పాలేనికి కొన్నేళ్ల కిందట వలస వెళ్లారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బుధవారం సలోమి తన ఇద్దరు కుమారులైన విలియమ్ కేర్(12), బిలీగ్రామ్(8)లకు శీతలపానీయంలో విషం కలిపి తాగించి, తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, శుక్రవారం మృతదేహాలను స్వగ్రామమైన నీలగంగవరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సలోమి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. -
హిజ్రాల మధ్య ఘర్షణ
పోలీస్‌స్టేషన్ ముట్టడి చెన్నై, తిరువణ్ణామలై: మామూళ్ల వసూళ్లలో హిజ్రాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు హిజ్రాలు గాయాలతో తిరువన్నామలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువణ్ణామలై ఎళిల్ నగర్‌కు చెందిన అన్బు అలియార్ అన్బరసి హిజ్రా. ఈమె సహ హిజ్రాలతో బస్టాండు, గిరివలం రోడ్డు తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో మామూళ్లు వసూళ్లు చేస్తుండేది. దీనిపై మరో వర్గానికి చెందిన హిజ్రాలు అన్బరసిని మంగళవారం నిలదీశారు. అన్బరసి వర్గీయులు మరో సంఘానికి చెందిన హిజ్రాల మధ్య ఘర్షణ ఏర్పడింది. అన్బరసి వర్గీయులు ముందుగానే తెచ్చుకున్న కత్తులు, రాడ్లతో వ్యతిరేక వర్గ హిజ్రాలపై దాడిచేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల హిజ్రాలతో బాధితులు పోలీస్స్టేషన్లను ముట్టడించారు. అన్బరసి వర్గీయులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు. -
రూ. 500 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : ఐదు వందల రూపాయల కోసం స్నేహితులు ఘర్షణ పడి, చివరికి కత్తి పోట్లకు దారితీసిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..మల్కాజిగిరి సర్కిల్ రామాంజనేయనగర్లో నివాసం ఉండే సాయి(24), వేణు(20) ఇద్దరూ స్నేహితులు. సాయి కారు డ్రైవర్ కాగా వేణు ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. అయితే వేణు వద్ద సాయి 500 రూపాయలు గతంలో అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని వేణు, సాయిని పలుమార్లు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయమై ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వేణు, సాయిని తీవ్రంగా గాయపరిచాడు. సాయి కడుపు, గొంతు భాగంలో వేణు కత్తితో గాయపరిచాడు. ప్రస్తుతం సాయి జీడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బావిలో దూకి బాలిక ఆత్మహత్య
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరు పట్టణానికి సరఫరా చేసే మంచినీటి బావిలో దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని జగ్జీవన్రాంకాలనీకి జగ్జీవన్ రాం కాలనీ చెందిన రాములు, వెంకటమ్మలకు నలుగురు కూతుళ్లు. గురువారం సాయంత్రం ఇంట్లో చేసుకునే పని విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాలుగో కుమార్తె మానస(15) రాత్రి 7 గంటల సమయంలో అమ్మాయి ఇంటి నుంచి పరుగెడుతూ పక్కనే ఉన్న మున్సిపల్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలాన్ని టూటౌన్ ఎస్ఐ మురళి, తహసీల్దార్ ప్రభాకర్, డీఎఫ్ఓ శ్రీనివాస్ పరిశీలించారు. 65 అడుగుల లోతు.. పట్టణానికి మంచినీరు సరఫరా చేసే బావి లోతు 65 అడుగులు ఉంటుంది. బాలిక బావిలో దూ కిన సమయంలో 30 అడుగులలో మంచినీళ్లు ఉన్నాయి. బాలిక బావిలో దూకిన వెంటనే మృతిచెంది బావి అడుగుకు చేరింది. అయితే మొదట స్థానిక యువకులు బావిలో దూకి వెతికినా ఆచూకీ లభించలేదు. అప్పటికే బాలిక బావిలో దూకిం దని స్థానికులు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం తో వారు అక్కడికి చేరుకున్నారు. అప్ప టికే బావికి సరఫరా అవుతున్న నీటిని బంద్ చేయడంతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది బావిలో ఉన్న నీటిని బయటకు ఎత్తిపోశారు. అనంతరం అగి ్నమాపక సిబ్బంది రాత్రి 7.30 నుంచి దాదాపు 9.30గంటల వరకు 2 గంటలపాటు శ్రమించి బావిలో మృతదేహం వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు.. గొడవ జరిగిన తర్వాత బాలిక రోడ్డు వైపు వెళ్లిందని కొందరు.. బావిలో దూకిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే బాలిక ఎక్కడ వెళ్లింది అనే విషయం గందరగోళం నెలకొనడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చివరికి బాలిక బావిలో పడి మృతిచెందిందని తెలియడంతో తల్లిదండ్రులు, అక్కలు అక్కడికి చేరుకుని ఆర్తనాదాలు చేశారు. మృతదేహాన్ని బావిలో నుంచి తీసిన తర్వాత ప్రాణం ఉందనే ఆశతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో పెట్టకుండా కుటుంబ సభ్యులు పోలీసులకు అడ్డుచెప్పారు. స్థానికుల ఆందోళన.. బస్టాండ్‌కు సమీపంలో ఉన్న మంచినీటి బావికి ఇనుప కంచె ఏర్పాటు చే యాలని ఎన్నోసార్లు క మిషనర్, కలెక్టర్‌కు ఫి ర్యాదు చేసినా ఏర్పాటు చేయకపోవడం వల్లే నష్టం జరిగిందని స్థా నికులు ఆరోపించారు. 65 అడుగుల బావి చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు లేవు. బావిపైన, చుట్టూ ఇనుప కంచె ఏర్పా టు చేస్తే ఇంతటి ఘోరం జరిగేది కాదని వాపోయా రు. జిల్లా ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. -
బాలుడి ప్రాణం తీసిన కబడ్డీ
రంగారెడ్డి, శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : సరదాగా కబడ్డీ ఆడుతుండగా ఇద్దరు బాలుర మధ్య చెలరేగిన వివాదం ఓ బాలుడి మృతికి దారితీసింది. శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన మీసాల నర్సింహ, జయమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు శిరీష పాలెంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి, రెండో కూతురు స్వాతిముత్యం గౌలిదొడ్డి సమీపంలోని నవోదయ పాఠశాలలో 9వ తరగతి, కొడుకు మల్లేష్(12) పాల్మాకులలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. వీరి ఇంటి పక్కన ఉండే ఓ బాలుడు శంషాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఉండడంతో తోటి బాలురతో పాటు మల్లేష్, మరో విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కబడ్డీ ఆడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో అతడు మల్లేష్‌ను కొట్టాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన మల్లేష్‌ను సదరు బాలుడు అక్కడికి వెళ్లి మరోసారి చేతితో కొట్టాడు. స్పృహ తప్పి కింద పడిపోవడంతో మల్లేష్‌ను కుటుంబ సభ్యులు శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మల్లేష్ చనిపోయినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అహ్మద్‌పాషా తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని, మెడ కింద చేతి గోరు గీసుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గ్రామంలో విషాదం.. కాలక్షేపం కోసం ఆడిన ఆట ప్రాణం మీదకు తేవడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదువులో చురుకుగా ఉండే మల్లేష్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
మరి కొద్ది క్షణాల్లో పెళ్లి.. అంతలోనే..
► పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులతో తగాదాకు దిగిన కుల పెద్దలు ►పోలీసులు నచ్చజెప్పిన ఫలితం శూన్యం ►రోలు వద్ద జరిగిన వివాహం ► టెక్కలి గొల్లవీధిలో ఘటన టెక్కలి(శ్రీకాకుళం): డివిజన్ కేంద్రమైన టెక్కలి గొల్లవీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంతో పెళ్లి వేడుక వివాదాస్పదంగా మారింది. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా ఇబ్బందులు పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు గొల్లవీధికి చెందిన యువకునికి, విశాఖపట్నానికి చెందిన యువతితో వివాహాం చేసేందుకు కుటుంబ సభ్యులు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ముహూర్తం కావడంతో మరి కొద్ది క్షణాల్లో మూడు ముళ్లు పడతాయనుకునే సమయంలో అదే వీధికి చెందిన కొంతమంది కుల పెద్దలు మండపం వద్దకు వచ్చి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులతో తగాదాకు దిగారు. పాత కుటుంబ కలహాలు నేపథ్యంలో వివాహం జరుగుతున్న చోట రచ్చ రచ్చ చేశారు. తగాదా తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఆదివారం ఉదయం అంతా ఎటువంటి తగాదా లేకుండా సరిగ్గా ముహూర్తం సమయానికే కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంపై అసలు కారణాలు తెలియకపోవడంతో అంతా బిత్తరపోయారు. తగాదా ఎప్పటికీ సద్దుమణగకపోవడంతో నవ దంపతులను మరో చోటకు తీసుకువెళ్లి రోలు సమక్షంలో వివాహం చేసినట్టు తెలిసింది. -
వీధికెక్కిన వసూళ్ల పర్వం
జంగారెడ్డిగూడెం : జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో వసూళ్ల పర్వం వీధికెక్కింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వసూళ్ల వ్యవహారంపై విచారణ నిర్వహిస్తున్న తన విధులకు ఆటంకపర్చడంతోపాటు వసూళ్ల కేసును నీరుగార్చాలని ఒత్తిడి తెస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆ శాఖ సర్కిల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో వేళ్లూనుకున్న వసూళ్ల వ్యవహారాలు, ఫిర్యాదులొస్తే నీరుగార్చేందుకు అధికారుల్లో కొందరు ఎంతకైనా తెగిస్తారనే విషయాల్ని మరోసారి వెలుగులోకి తెచ్చిన ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలోని వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టు వద్ద నిత్యం పెద్దఎత్తున అనధికారిక వసూళ్లు సాగుతున్నాయి. ఇక్కడి దందా వెలుగులోకి రావడంతో.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జంగారెడ్డిగూడెం సర్కిల్ వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో) వి.కేదారేశ్వరరావుకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన విచారణ చేపట్టగా.. వ్యవహారాన్ని నీరుగార్చే ప్రయత్నాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సీటీవో కేదారేశ్వరరావు సోమవారం రాత్రి పోలీ సులను ఆశ్రయించారు. డీసీటీవో ఎ¯ŒS.దుర్గారావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, అటెండర్ రంగారావు, ఆనందశేఖర్ అనే వ్యక్తి కేసును నీరు గార్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు సీటీవో ఫిర్యాదు చేశారు. డీసీటీవో దుర్గారావు, శ్రీనివాస్, రవికుమార్, రంగారావు తన విధులను ఆటంకపర్చడంతోపాటు రౌడీయిజం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అక్రమ వసూళ్లపై తాను విచారణ నిర్వహిస్తుండగా.. ఈ కేసులో రాజీ పడాలని వేధిస్తున్నారని, లేదంటే తన కుల ధ్రువీకరణ పత్రం విషయంలో హైకోర్టులో అప్పీల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడంతోపాటు మానసికంగా వేధిస్తున్న ఆ ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీటీవో కేదారేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎ¯ŒS.కేశవరావు సోమవారం రాత్రి చెప్పారు. -
గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య
నార్సింగి: గొంతు కోసి, రాళ్లతో కొట్టి గుర్తు తెలియని యువతిని హత్య చేసిన ఘటన నార్సింగి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గండిపేట ప్రధాన రహదారిలోని వీఐఎఫ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రహారీ ప్రాంతంలోని చెట్ల పొదల్లోకి ఆదివారం సాయంత్రం 4.30కి గుర్తు తెలియని యువకుడు ఓ యువతిని తీసుకొచ్చాడు. అక్కడ ఇద్దరూ గొడవపడుతుండగా స్థానిక యువకుడు గమనించి వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుస్టేషన్ ఘటనా స్థలానికి 10 కిలో మీటర్ల దూరం ఉంటుంది. సీఐ రాంచంద్రరావు, ఎస్ఐ ధనుంజయ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువతి హత్యకు గురై పడి ఉంది. మృతురాలి వయసు 20 ఏళ్లు ఉంటాయి. గొంతుకోసి, రాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపించాయి. మృతురాలి ఒంటిపై బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ , బురఖా ధరించి ఉంది. చేతులు నల్లటి వస్త్రంతో కట్టేసి ఉన్నాయి. ఘటనా స్థలంలో మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారా? లేక శారీరికంగా వేధించి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ రాంచంద్రరావు తెలిపారు. యువతి ఎవరు అన్న విషయం తెలిస్తే అన్ని విషయాలు బహిర్గమౌతాయన్నారు. గండిపేట ప్రధాన రహదారితో పాటు సీబీఐటీ ప్రధాన రహదారిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బురఖా ధరించిన ఓ యువతి గుర్తు తెలియని యువకుడి బైక్‌పై ఈ మార్గంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ వాహనం యజమాని వివరాలు తెలుసుకొనే పనిలో పడ్డారు. -
వినాయక మండపం విషయంలో గొడవ
హైదరాబాద్: గణేశ్ మండపాల ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు... అడిక్‌మెట్ బాలాజీనగర్‌కు చెందిన రామకృష్ణ (35) ప్రై వేట్ ఉద్యోగి. అతని ఇంటి పక్కనే ఓ మైనర్ బాలుడు (17) నివాసముంటున్నాడు. బుధవారం రామకృష్ణ ఇంటి ఎదురుగా గణేశ్ మంపం ఏర్పాటుచేయడానికి వెళ్లాడు. దీంతో అక్కడ డ్రైనేజీ పైప్‌లేన్ ఉందని రామకష్ణ వారించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఇద్దరు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. -
కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత
కామారెడ్డి (నిజామాబాద్ జిల్లా) : ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందతూ కామారెడ్డి ఆస్పత్రిలో సోమవారం మృతి చెందాడు. ప్రమాదం వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం అర్ధరాత్రి ఆరుగొండ గ్రామ శివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకర్, అంజయ్యలిద్దరినీ కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ప్రమాదంలోనే గాయపడిన అంజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సుధాకర్ మరణానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ అతని కుటుంబసభ్యులు అంజయ్యను సోమవారం ఆస్పత్రి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణవి గిల్లికజ్జాలు: చంద్రబాబు ధ్వజం
-పార్టీలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడింది -పార్టీలో అసంతృప్తిపెరిగితే రాజకీయంగా నష్టపోతాం -హైదరాబాద్ మీద తెలంగాణ పెత్తనమేంటి ? - పదేళ్ల తర్వాతే హైదరాబాదు తెలంగాణ రాజధానిఅవుతుంది -టీడీపీ రాష్ట్ర విస్తృత సమావేశంలో చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో : హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరచిపోయి తెలంగాణ ప్రభుత్వం ప్రతీదానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం ఉంటుంది. అయినా మన మంత్రులు, ఎంపీలు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం ఎలా చేస్తుంది.. పదేళ్ల తరువాతే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అవుతుందనే విషయం గుర్తించాలి. అలా కాదని మన ఆత్మగౌరవం దెబ్బతీసే పరిస్థితి వస్తే ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తిలేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీఆర్ఎస్ను విమర్శల వర్షం కురిపించారు. విజయవాడ శేషసాయి కళ్యాణమండపంలో శనివారం జరిగిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ 9, 10 పరిధిలో ఉన్న సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి మాట్లాడుకుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని చెబుతున్నా వారు వినడంలేదన్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, వైసీపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అక్టోబర్ 22 దసరా నుంచి అమరావతి రాజధాని పనులు మొదలవుతాయని, తన క్యాంపు కార్యాలయం పూర్తికాకపోయినా ఇకపై వారంలో మూడు, నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటానని, అవసరమైతే బస్సులోనే ఉండి కార్యకలాపాలు నడిపిస్తానన్నారు. త్వరలో అవసరమైన అన్ని శాఖల కార్యాలయాలను విజయవాడకు తరలిస్తానని చెప్పారు. గోదావరి-కృష్ణా నదులను ఆగష్టు 15నాటికి అనుసంధానం చేసి తీరుతానని, దేశంలోనే నదుల అనుసంధానానికి ఏపీ నుంచే శ్రీకారం చుడతానని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఐదేళ్లు పడుతుందని ఈలోపు పట్టిసీమను కడుతుంటే అడ్డుకున్నారని అయినా వెనక్కి తగ్గలేదన్నారు. గోదావరిని పెన్నా, నాగావళికి అనుసంధానిస్తామన్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకెళ్లలేకపోయామన్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాలో పార్టీ కమిటీలు పూర్తికావాల్సి ఉందని, ఏపీలో 70 మండల కమిటీలు, 2,496 గ్రామ కమిటీలను నియమించాల్సి ఉందని, వాటిపై దృష్టి పెట్టాలని నాయకులు సూచించారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎలా గౌరవించాలనే దానిపై నాయకులు దృష్టి పెట్టాలన్నారు. ఎన్ని పనులున్నా కార్యకర్తల సంక్షేమాన్ని వదలకూడదని చెప్పారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులిచ్చామని ఇకపై వీటిని ఇచ్చేముందు 30 ఏళ్ల నుంచి పార్టీలో ఉండి, త్యాగాలు చేసినవారు, వాళ్లలో సమర్థులను ఎంపిక చేయాలని సూచించారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని ఆదరించాలన్నారు. బాబు అసంతృప్తి.. సమావేశం ప్రారభమైన గంటకుపైగా మీటింగ్ హాలులో కుర్చీలు ఖాళీగా ఉండటం, ఇంకా ప్రతినిధులు వస్తునే ఉండటంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆహ్వానితులు కచ్చితంగా టైమ్‌కు రాకపోతే ఎలా అని చంద్రబాబు ఉపన్యాసం ప్రారంభంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు స్థానిక నాయకులు బయటకు వెళ్లి పోలీసులు అడ్డగించిన స్థానిక పార్టీ శ్రేణులను లోపలికి తీసుకొచ్చి హాలు నిండేలా చేశారు. నేతల గైర్హాజరు సమావేశానికి కీలక నేతలు సైతం గైర్హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు, శనివారం పార్టీ సమావేశానికి కూడా హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ జిల్లాలోని 36మంది ఆహ్వానితులకు సమావేశానికి హాజరుకాకపోయినా పర్వాలేదని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం. మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావుతోపాటు ఇందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఈ సమావేశానికి హాజరుకాలేదు. 320 మంది ప్రతినిధులను ఆహానించగా 260మంది హాజరైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్, సీఎం తనయుడు నారా లోకేష్ సమావేశంలో పాల్గొన్నారు. తన ఉపన్యాసంలో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్టు వివరించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్టీ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడారు. -
భర్తతో గొడవ పడి మహిళ మృతి
ఆదిలాబాద్: పురుగుల మందు తాగి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం మద్దికల్లు గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు..భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొత్తపల్లి ప్రమీల(40) సోమవారం పురుగుల మందు తాగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందింది. ప్రమీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఆరని సాగునీటి చిచ్చు
నెల్లూరు: నెల్లూరు జిల్లా మనుబోలులో రెండు మండలాల రైతుల మధ్య సాగునీటి విషయంలో రేగిన చిచ్చు ఇంకా కొనసాగుతోంది. మంగళవారం మళ్లీ ఈ రెండు మండలాల రైతుల మధ్య ఘర్షణ జరిగింది. మనుబోలు సొసైటీ ప్రెసిడెంట్ శేషారెడ్డి కండలేరు వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గుడూరు డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని కొందరిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆ టెండర్ మాదే.. వేశారో జాగ్రత్త!
‘దేశం’లో రహదారి పనుల సెగలు రూ.183 కోట్ల టెండర్లకు పోటీపడొద్దని హుకుం ఎంపీ సీఎం రమేష్‌పై మండిపడుతున్న శ్రేణులు మైదుకూరు, బద్వేల్ నాయకుల నిర సన ముఖ్యమంత్రి ఎదుట పంచాయతీకి సన్నద్ధం కడప: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఏకపక్ష చర్యలపై తెలుగుతమ్ముళ్లు గుర్రుమంటున్నారు. తాజాగా నేషనల్ హైవే రోడ్డు పనుల టెండర్లు దుమారం రేపాయి. తనను కాదని ఎవ్వరూ టెండర్లు కోట్ చేయరాదని హుకుం జారీ చేయడమే అందుకు కారణం. అధినేత వద్దే తేల్చుకొవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు ఓ కీలక నాయకుడు తెరవెనుక నుంచి నడిపిస్తున్నారు. నేషనల్ హైవే-67 రోడ్డు పనుల విస్తరణలో భాగంగా రూ.183 కోట్లుకు ఈ పొక్యూర్మెంట్ టెండర్లు ఆహ్వానించారు. మైదుకూరు, బద్వేల్ మీదుగా వెళ్తున్న ఈరహదారి పనులను ఆప్రాంతం అధికార పార్టీ నేతలు ఆశించారు. టెండర్లు దాఖలు చేసేందుకు సన్నద్ధం కావడంతో వారిని ఎంపీ రమేష్ నియంత్రించినట్లు తెలుస్తోంది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన తనకు తన ప్రాంతంలోని రహదారి పనులు దక్కించుకునే అవకాశం కల్పించాలని ఓ నియోజకవర్గ స్థాయి నాయకుడు కోరినట్లు సమాచారం. అదేం లేదు, ఆ పనులకు నీవు టెండర్ వేయవద్దు అని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం, అనుచరుల్ని కాపాడుకోవడం బహుకష్టంగా మారింది.. తమ నియోజకవర్గ పరిధిలోని రహదారి పనులుకు మేము టెండర్లు వేసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అందుకు ససేమిరా అంటూ తిరస్కరించినట్లు దేశం వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు. ఎవరి పనులు వారివే.... వద్దంటే ఎలా? మైదుకూరు, బద్వేల్ నేతల్ని నియంత్రించిన ఎంపీ రమేష్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌హెచ్ రోడ్డు పనుల టెండర్లుకు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తనయుడు ఒకరు అడ్డుకట్ట వేశారు. ఆన్లైన్లో తనకు అనుకూలమైన కాంట్రాక్టు సంస్థతో టెండర్లు దాఖలు చేశారు. ముందుగా అనుకున్నట్లు కాకుండా తనకు అనుకూలమైన మూడు సంస్థలే దాఖలు కాకుండా నాలుగో సంస్థ కూడా టెండర్ దాఖలు చేసింది. దాంతో ఒక్కమారుగా అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి టీడీపీ నేతలకు ఎదురైంది. ఆ కాంట్రాక్టు సంస్థ ద్వారా ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తనయుడు వేయించారని తెలుసుకుని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ‘తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే’ అంటూ వీరి ఒత్తిళ్లును ఆయన తిరస్కరించడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో మీరు మా నాయకుడు, మేం నియోజకవర్గ నేతలం, పార్టీ పరంగా ఉన్నతి కోసం కష్టపడేందుకు మావంతు సహకారం అందిస్తాం. అయితే వ్యాపారాలు, కాంట్రాక్టులు ఎవ్వరివి, వారు చేసుకుందాం, మాకు పనులు వస్తే మేం చేసుకుంటాం, మీకు వస్తే మీరే చేయండి అంటూ వ్యాఖ్యానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇంతమందిని ఒప్పించుకుంటూ వస్తే ఫైనల్‌గా చేజారిపోతుంది అనే ఆవేదన ఎంపీకి ఉన్నట్లు సమాచారం. కాగా న్యూఢిల్లీలో సోమవారం సాయంత్రం టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. ఆ వివరాలు రాత్రికి సైతం తెలియడం లేదు. ఆమేరకు నేషనల్ హైవే ఎస్ఈ ధ్రువీకరించారు. అధినేత వద్ద పంచాయితీకి సన్నద్ధం... తెలుగుదేశం పార్టీలో ఏకపక్ష నిర్ణయాలపై అధినేత వద్ద తేల్చుకోవాని జిల్లా నేతలు జట్టు కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ రమేష్‌తో విభేదిస్తున్న నాయకులంతా ఒక్కొక్కరుగా ఏకం అవుతోన్నారు. అందుకు కీలకస్థానంలో ఉన్న నాయకుడు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బద్వేల్, మైదుకూరు నాయకులు కూడా ఆ జట్టులోకి వెళ్లినట్లు సమాచారం. పైస్థాయిలోని నేతల మద్దతు కూడగట్టి ఎంపీ చర్యలకు చెక్‌పెట్టాలనే దిశగా పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్ని, పార్టీనే అంటిపెట్టుకుని నెట్టుకొస్తున్న వారిని కాదని అంతా తానై ఎంపీ రమేష్ వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ముఫ్పై ఏళ్లుగా పార్టీనే సర్వసం అనుకొని వచ్చిన తమ లాంటి నాయకులకు కూడా ఎంపీ విలువ ఇవ్వడం లేదని త్వరలో ముఖ్యమంత్రి ఎదుట అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆపార్టీ రాష్ట్ర నేత ఒకరు సాక్షితో వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ తన గుత్తాదిపత్యంలా వ్యవహరిస్తున్నారని ఆ నేత తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. తాము చేసిన సేవలకు గుర్తింపు ఏమిటో తేల్చుకోవాలనే దిశగా తెలుగుతమ్ముళ్లు సన్నద్ధం అవుతోండడం విశేషం. -
తుపాకీతో బెదిరించిన ట్రావెల్స్ యజమాని
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మధ్య బస్సు కొనుగోలు వివాదం గురువారం తారాస్థాయికి చేరింది. దీంతో ఓ బస్సు ట్రావెల్స్ యజమానిని తుపాకీతో బెదిరించాడు. దీంతో మరో బస్సు ట్రావెల్స్ యజమాని అయిన బాధితుడు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బెదిరించిన ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కూకట్‌పల్లిలోని ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డ్ వద్ద కృష్ణవేణి ట్రావెల్స్ యజమాని ప్రతాప్ రెడ్డి మూడు బస్సులు కొనుగోలు చేశాడు. మొత్తం నగదు చెల్లించేందుకు కొద్దిగా గడువు కావాలని ప్రతాప్ రెడ్డి కోరాడు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించాడు. గడువు ముగిసిన నగదు చెల్లించకపోవడంతో ప్రతాప్ రెడ్డి వైఖరిపై సునీల్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డిని గురువారం సునీల్ రెడ్డి తుపాకీతో బెదిరించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉందని సునీల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.