raids
-
HYD: డ్రగ్ కంట్రోల్ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: డ్రగ్ కంట్రోల్(డీసీఏ) అధికారులు నగరంలోని మెడికల్ షాపులపై ఆదివారం(నవంబర్17) ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లాల్లోని మెడికల్ షాపులపై ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని గాయత్రి మెడికల్ స్టోర్లలో మందులు సీజ్ చేశారు.1.25 లక్షల విలువగల 45 రకాల మందులు సీజ్ చేశారు. గడువు ముగిసిన మందుల నిల్వలు ఉండడం, అబార్షన్ మెడిసిన్ అనధికారికంగా విక్రయిస్తుండడాన్ని గుర్తించారు. గాయత్రి మెడికల్ షాపు నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.రామంతపూర్‌లోని ఓ మెడికల్ షాపులోనూ నిర్వహించిన తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.కంటి ఇన్ఫెక్షన్ నివారణ కొరకు అమ్ముతున్న నకిలీ మెడిసిన్‌ను సీజ్ చేశారు. -
గ్యాంగ్స్టర్ల స్థావరాలపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ల అరాచకాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కౌశల్ చౌదరి గ్యాంగ్, హిమాన్షు భావు గ్యాంగ్, కాలా జాతేడి, హషీమ్ బాబా, చేను గ్యాంగ్, గోగి గ్యాంగ్, నీరజ్ బవానియా, టిల్లూ తాజ్‌పురియా గ్యాంగ్‌లతో సంబంధమున్న వాంటెడ్ నేరస్థుల రహస్య స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ, ద్వారకా ఏరియా, ఈశాన్య ఢిల్లీ, నరేలా, కంఝవాలా, సంగమ్ విహార్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందం, ప్రత్యేక పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న పలువురు షూటర్లు, హెంచ్మెన్లను అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీలోని గ్యాంగ్స్టర్లు ఇటీవలి కాలంలో తమ అనుచరుల ద్వారా కాల్పులు, హత్యా ఘటనలకు పాల్పడుతున్నారు. 2024 అక్టోబరులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఏడుగురు షూటర్లను అరెస్టు చేసింది. వీరిని పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలలో అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.బాబా సిద్ధిఖీ కేసులో అరెస్టయిన షూటర్లను స్పెషల్ సెల్ విచారిస్తోంది. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. 2022లో నమోదైన రెండు ఎన్ఐఏ కేసుల్లో అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
HYD: హోటళ్లలో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం(నవంబర్ 10) ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు.కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఎక్స్పైర్ అయిన పాడైన ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌తో వంట చేస్తున్నట్లు గుర్తించారు.దీంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ కిచెన్లలోనూ తనిఖీలు చేశారు.కుళ్ళిపోయిన టమాటో, పొటాటోలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారని తేలింది.వీటికి తోడు కాలం చెల్లిన పన్నీర్, మష్రూమ్‌లతో వంటల చేస్తున్నట్లు గుర్తించారు.ఇదీ చదవండి: HYD: హోటల్లో భారీ పేలుడు.. పక్కనున్న బస్తీలో ఎగిరిపడ్డ రాళ్లు -
లిక్కర్ స్కామ్: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ:లిక్కర్ స్కామ్‌లో ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్‌లలోని మొత్తం 17 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఏకకాలంలో సోదాలు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ చౌబే,ఎక్సైజ్ ఉన్నతాధికారి గజేంద్రసింగ్ నివాసాలు, స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల్లో ఈడీ మంగళవారం(అక్టోబర్ 29) తనిఖీలు నిర్వహించింది.ఐఏఎస్ అధికారులతో కలిపి మొత్తం ఏడుగురితో కూడిన సిండికేట్‌పై ఛత్తీస్‌గఢ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సిండికేట్ భారీగా గండికొట్టిందన్న ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మనీలాండరంగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ రంగలోకి దిగింది. ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం.. ఏం జరిగిందంటే.. -
IT Raid : దుల్హన్ హమ్ లేజాయేంగే..
ఐటీ టీమ్‌ల గ్రేట్ డ్రామాదుమ్మురేపిన బారాత్బడాబాబులు బేజారు రెండేళ్ల కిందట.. మహారాష్ట్ర, జాల్నా.. ప్రధాన రహదారంతా పెళ్లి బారాత్‌తో నిండిపోయింది. అవును మరి.. ఒకటా రెండా.. దాదాపు 120 కార్లలో బయలుదేరారు మగపెళ్లివారు. ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అనే స్టికర్స్‌ని విండ్ షీల్డ్స్ మీద అతికించుకుని! పాటలు పాడుతూ, మధ్యమధ్యలో ఆ కార్లను స్లో చేసుకుంటూ.. బ్యాండ్ మేళం వాయించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ.. పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తూ.. లోకంలోని పెళ్లి కళ, సందడంతా వాళ్లతోనే అన్నట్లుంది ఆ సంబడం! ఆ దారి పొడవున ఉన్న జాల్నా వాసులంతా ఆశ్చర్యపోయారు ‘ఎవరింటికబ్బా.. ఇంత ఘనమైన బారాత్’ అనుకుంటూ! ఓ కూడలి దాకా వెళ్లగానే ఆ 120 కార్లు అయిదు టీమ్‌లుగా విడిపోయాయి. ఓ టీమ్ జాల్నాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీని, ఇంకో టీమ్ టెక్స్టైల్ మిల్‌ను, మరో టీమ్ ఆ రెండు ఫ్యాక్టరీలకు చెందిన యజమానుల ఇళ్లను, వేరే టీమ్ ఫామ్హౌసెస్ను, ఒక టీమేమో అక్కడి కో ఆపరేటివ్ బ్యాంక్‌కి.. వెళ్లాయి. ఆయా చోట్లకు చేరుకోగానే ఆ బృందాల్లోని సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ‘ఫ్రమ్ నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్’ అని ఐడీ చూపిస్తూ రెయిడ్స్‌కి దిగారు. సదరు యజమానులు హతాశులయ్యారు. బ్యాంక్ వాళ్లు .. ఐటీ ఉద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సోదాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో ఏమీ దొరకలేదు. ఫామ్హౌసెస్ను అంగుళం అంగుళం గాలించారు. అక్కడ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి. వాటిల్లోనే లెక్కతేలని డబ్బు కోట్లలో దొరికింది. డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల వివరాలు తెలిశాయి. వెంటనే వీళ్లు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో తనిఖీలో ఉన్న ఐటీ టీమ్‌కి సమాచారమిచ్చారు. దాంతో బ్యాంక్‌లోని టీమ్ పని సులువైపోయింది. ఆ వివరాల ప్రకారం అకౌంట్స్ చెక్ చేశారు. లాకర్స్‌లో ఉన్న నగలను తీశారు. అదే సమయంలో యజమానులకు సంబంధించి ఔరంగాబాద్, నాసిక్, ముంబైల్లో ఉన్న ఇళ్లు, ఆఫీస్‌లలోనూ సోదా జరిగింది. రూ. 56 కోట్ల డబ్బు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాలను సీజ్ చేశారు. మొత్తం అన్ని చోట్లా దొరికిన ఆ ఆస్తుల విలువ రూ. 390 కోట్లు. లెక్కాపత్రాల్లేని ఆ డబ్బునంతా జాల్నా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కి తీసుకెళ్లి లెక్కించారట. దాన్ని లెక్కించడానికి ఐటీ టీమ్‌కి పదమూడు గంటల సమయం పట్టింది. స్టీల్, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పేరుమోసిన వ్యాపార సంస్థలు ఎస్సార్జే పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలికా స్టీల్ మాన్యుఫాక్చర్స్కి సంబంధించిన యజమానులపై జరిగిన ఈ రెయిడ్ దాదాపు అయిదురోజుల పాటు సాగింది. ఇందులో నాసిక్, పుణే, ఠాణే, ముంబై ఐటీ డిపార్ట్మెంట్లోని సుమారు 260 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జాల్నాకు చెందిన ఓ సోర్స్ ద్వారా సమాచారం అందుకున్న నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్ ఈ రెయిడ్కి రూపకల్పన చేసింది. యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. డిపార్ట్మెంట్ వాహనాలు వాడితే యజమానులు అప్రమత్తమవుతారని భావించి 120 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే ఫార్మల్గా వెళితే వాళ్లకు ఉప్పందే ప్రమాదం ఉంటుందని అలా పెళ్లి బృందంలా తయారయ్యారు. ఆ ఆపరేషన్‌కి ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అని పేరుపెట్టుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ రెయిడ్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. -
‘ఆప్’ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
న్యూఢిల్లీ:పంజాబ్‌కు చెందిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం(అక్టోబర్7) సోదాలు జరిపింది. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్‌లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు జరిగాయి. ఈ సోదాలపై ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.పార్టీని చీల్చేందుకే ఎంపీ సంజీవ్అరోరాపై ఈడీ సోదాలు చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐలతో ఆప్ సభ్యులను ఆపలేరని, ఎవరినీ కొనలేరని, భయపట్టలేరని సిసోడియా పేర్కొన్నారు.వ్యాపారవేత్త కూడా అయిన ఎంపీ సంజీవ్ అరోరాపై దాడులతో తమ ధైర్యాన్ని దెబ్బతీయలేరని పార్టీకి చెందిన మరో ఎంపీ సంజయ్‌సింగ్ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్ -
తిరుపతి స్పా సెంటర్లపై పోలీసుల దాడులు..
-
హైదరాబాద్ పబ్బులపై దాడులు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. టెస్టులో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఐదు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించాగా, 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో శాంపిల్స్ సేకరించారు.పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కోరం క్లబ్లో ఇద్దరికి, బేబిలోన్ పబ్‌లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. చిన్న నిగేష్(వరంగల్), నార్త్ రవికుమార్(శ్రీకాకుళం), కేశవరావు(మూసేపేట), చార్మినార్‌కు చెందిన రహీమ్‌లకు పాజిటివ్‌గా గుర్తించారు. -
కోల్‌కతా డాక్టర్ కేసు: రంగంలోకి ‘ఈడీ’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్లోని హౌరా, సోనార్పూర్, హుగ్లీ ప్రాంతాల్లో శుక్రవారం(సెప్టెంబర్ 6) ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.హత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. ఆర్జీకర్మెడికల్ కాలేజీ అక్రమాల సీబీఐ కేసులో సందీప్‌ఘోష్ అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. 8 రోజుల పాటు ఘోష్‌ను విచారించేందుకు కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది. మరోవైపు మహిళా డాక్టర్ హత్యాచారం కేసును సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. ఇదీ చదవండి.. బలవంతంగా దహనం చేశారు -
హైదరాబాద్ లోని 25 పబ్ ల్లో పోలీసుల తనిఖీలు
-
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
హైదరాబాద్ లోని పబ్బుల్లో ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు
-
హైదరాబాద్: స్పా సెంటర్ల మాటున గలీజు దందా!
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది. చందానగర్‌లో స్పా కేంద్రాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు కేపీహెచ్‌బీలోని సెలూన్ షాప్‌పై పోలీసులు దాడులు చేయగా.. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బట్టబయలలైంది. ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్లపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని పలు స్పా సెంటర్లలో గుర్తించారు.గత నెలలో ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారంపై దాడులు చేశారు. జీహెచ్ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్లు, ప్రొఫెషనల్ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్ మసాజ్ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు -
హైదరాబాద్: పబ్బులపై పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు పబ్బులపై పోలీసు అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్, టీఎస్ న్యాబ్ సంయుక్తంగా పబ్బులపై ఆపరేషన్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని 25 పబ్బుల్లో ఏకాకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఒక్కొక్క పబ్‌లో 50 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. కొత్తగా వచ్చిన డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేశారు. డ్రగ్స్ సేవిస్తున్నారన్న సమాచారంతో పబ్బుల్లో తనిఖీలు చేశారు. -
తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్న ఏసీబీ
-
అన్యాయంగా నా కొడుకు అరెస్ట్: జోగి రమేష్
-
జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో అక్రమాలపై ఏసీబీ సోదాలు
-
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..
-
హైదరాబాద్ పబ్బుల్లో తనిఖీలు.. డ్రగ్స్ పరీక్షలో 11 మందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోర పబ్బులో నార్కెటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు చేశారు. పబ్బులోని ఓ ఈవెంట్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 11 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్‌గా తేలడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్బు లోపలికి డ్రగ్స్ ఏ విధంగా చేరాయి? ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. -
మొదటిసారి డ్రగ్స్ కోసం స్నిఫర్ డాగ్స్ తో పోలీసుల రైడ్స్
-
వెలుగులోకి అసలు నిజాలు..!
-
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ
-
అలసత్వంతో అరాచకం
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాల అనంతరం ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హింసను సత్వరమే కఠినంగా అణిచి వేసేలా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. బాధితులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తలపెడుతున్న వ్యక్తులు, సమూహాలను నియంత్రించేందుకు చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షిత హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హింసకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హింసకు దారి తీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని నియమించేలా ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరపనుంది. పరిహారం బాధ్యత ప్రభుత్వానిదే.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తక్షణమే కేంద్ర పారా మిలటరీ బలగాలను రప్పించాల్సిన అవసరం ఉందని సుబ్బారెడ్డి కోర్టుకు నివేదించారు. లక్షిత దాడుల్లో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోజాలవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని గుర్తు చేశారు. మరో ప్రత్యామ్నాయం లేనందున పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించి సత్వర న్యాయం అందించేందుకు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఓటర్లే లక్ష్యంగా... ప్రజల ప్రాణాలు, స్వేచ్చ, ఆస్తులను కాపాడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి పారిపోవడానికి వీల్లేదని సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మారుమూల గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులు, హింసాకాండకు తాజాగా అధికారం చేపట్టిన పార్టీ ఆమోదం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టుకు విన్నవించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులను నిరాశ్రయులను చేయడం, వారిపై రాళ్లతో దాడులు చేయడం లాంటి ఘటనలు ఆ వీడియోలో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. డీజీపీ హరీ‹Ùకుమార్ గుప్తా, అదనపు డీజీ బాగ్చీ, పల్నాడు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి టీడీపీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అధికారులు హింసను నిరోధించకుండా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. గంటల వ్యవధిలో దాడులు మొదలు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే రాష్ట్రంలో దాడులు, హింసాకాండ మొదలయ్యాయని, ఉద్దేశపూర్వకంగా కొందరిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయని సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు కొంత సమయం ఉండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని దాడులకు, హింసకు తెర తీశారని నివేదించారు. ఇళ్లు, గ్రామాలను వదిలేసి వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారన్నారు. ఈ హింస, దాడులపై తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ జోక్యానికి రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి లేఖలు రాశారని తెలిపారు. నిర్దిష్ట రాజకీయ పారీ్టతో సంబంధాలున్న వారినే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పౌరుల ప్రాణాలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారన్నారు. విధ్వంసకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా, మైనారిటీలపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారన్నారు. -
ఏసీబీ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గత కొద్ది నెలలుగా దూకుడు పెంచింది. వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్’లతో ఏసీబీ అధికారులు హల్చల్ చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే వనపర్తి జిల్లా టీజీఎస్పీడీఎల్ ఉద్యోగులు ముగ్గురు, గొర్రెల కుంభకోణంలో ఇద్దరు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సై, మరో ప్రైవేటు వ్యక్తి కలిపి ముగ్గురు..గండిపేట్ ఎమ్మార్వో కార్యాలయంలో నలుగురు అధికారులు కలిపి మొత్తంగా 12 మంది అవినీతి అధికారులను కటకటాల వెనక్కి నెట్టారు. ఇక గొర్రెల కుంభకోణం కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్‌ను అరెస్టు చేసి కొరడా ఝుళిపిస్తున్నామనే సంకేతాలనిచి్చంది ఏసీబీ. కొద్ది రోజుల ముందు ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టులలో ఏకకాలంలో 15 ఏసీబీ అధికారుల బృందాలు 12 ప్రాంతాల్లో సోదాలు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారు వేషాల్లో వెళ్లి మరీ ఆర్టీఏ చెక్పోస్టులపై సోదాలు చేయడం గమనార్హం. ఆనంద్ రాకతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో క్షేత్రస్థాయిలోని అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 78 కేసులు నమోదు చేయగా.. గతేడాది(2023)లో మొత్తం కలిపి కేసులు 94 మాత్రమే కావడం గమనార్హం. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్,పట్టణాభివృద్ధిశాఖతోపాటు పోలీస్‌శాఖలో అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. దీంతో పాటు ఇటీవల ఆర్టీఏ కార్యాలయాలపై మెరుపు దాడులు చేయడంతో అవినీతికి నిలయాలుగా మారినన మిగతా ప్రభుత్వ శాఖలపైనా ఏసీబీ నజర్ ఉన్నట్టుగా తేటతెల్లం అయ్యింది. రాష్ట్రంలో అవినీతికి మూల కేంద్రాలుగా చర్చ జరుగుతోన్న ఎక్సైజ్, రిజి్రస్టేషన్ల శాఖలపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు శాఖలే టార్గెట్‌గా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినా ఆశ్చర్యపోవక్కర్లేదని తెలుస్తోంది. చిక్కుతున్న అవినీతి తిమింగలాలు.. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతుండడంతో అవినీతి తిమింగలాలు విలవిలలాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే హెచ్ఎండీఏలో పరాకాష్టకు చేరిన అవినీతి బాగోతం బయటకు లాగారు ఏసీబీ అధికారులు. ఆ శాఖలో అవినీతితో వేళ్లూనుకున్న హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించింది.. వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతోపాటు వరుస అరెస్టులు ఈ కేసులో జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా గిరిజన సంక్షేమశాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) జగజ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు అధికారి ఇంట్లో సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైంది. మార్చిలో జరిపిన ఏసీబీ సోదాల్లో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నట్టు విశ్వసనీయ సమాచారంతో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతోపాటు, తనతోపాటు అవినీతి భాగస్వాములుగా ఉన్న మరికొందరి పోలీస్ అధికారుల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించడం సంచలనంగా మారింది.ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీగతంలో ఏసీబీ అధికారులను సంప్రదించేందుకు కేవ లం 1064 టోల్‌ఫ్రీ నంబర్ మాత్రమే అందు బాటులో ఉండేది. ఇటీవల కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. 94404 46106 వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా"www. acb.telangana.gov.in ’వెబ్సైట్లో, ఫేస్బుక్"http//www.facebook.com/ ACBtelangana లో, "https://x.com/ Telangana ACB'sìæÓrt-ÆŠ‡ÌZ, "dg&acb@telangana.gov.in' ఈ–మెయిల్‌లోనూ ఏసీబీ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.