rajanna dora
-
కుట్రపూరితంగానే జగన్ పై కేసు నమోదు చేశారు: రాజన్న దొర
-
సీఎం జగన్ మహిళల ఆత్మగౌరవం పెంచారు - డిప్యూటీ సీఎం
-
‘అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 19న విజయవాడలో జరిగే125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం రాజన్న దొర, బీసీ సంక్షేమం, సమాచార శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. 139 కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర కార్పొరేషన్లలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఛైర్మన్లు, డైరక్టర్ల సమావేశం తాడేపల్లిలోలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి శాసనమండలి విప్, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం అని అన్నారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్ననిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంబేద్కర్ సిధ్దాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను నమ్మి సీఎం జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం.. ఎంతో ఆనందం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మి దాన్ని ఆకళింపు చేసుకున్నారన్నారు. అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా స్వేచ్చా, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ మెచ్చే నిర్ణయమని కొనియాడారు. సాధారణంగా దళితవాడలలో, పల్లెల్లో అంటే ప్రతి ఊరి చివరన కాలనీలలో కనబడే అంబేద్కర్ విగ్రహాలను సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ నెల 19 న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను పండుగలా నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం కింద ఏర్పాటుచేస్తున్న వేదికతో కూడితే దాదాపు 195 అఢుగుల ఎత్తులో కారణజన్ముడైన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందన్నారు. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సగర్వంగా చూడవచ్చన్నారు. వివిధ దేశాలలో అధ్యయనం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంత పెద్ద భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ పరిఢవిల్లేలా చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఘనత సీఎందే.. గ్రామసచివాలయాల పరిధిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి ప్రచారం చేయాలని కోరారు. ఆ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు పాలకులు కాదు సేవకుడు అని అంబేద్కర్ చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్ననాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది జగన్ మాత్రమేనని చెప్పారు. జనరల్ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా కూడా బడుగు,బలహీనవర్గాలను నియమించిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. -
అత్యంత బలహీన గిరిజన సమూహాల అభివృద్ధికి ఆరు సూత్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత బలహీన గిరిజన సమూహాలు (పీవీటీజీ) అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి సంక్షేమానికి ఆరు ప్రధాన సూత్రాలను అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రాథమికంగా సర్వే నిర్వహించి రాష్ట్రంలో 12 తెగల పీవీటీజీలను గుర్తించింది. ఈ 12 తెగల్లో 2,99,516 మంది ఉన్నట్టు నిర్ధారించింది. ఈ క్రమంలో 3,367 గిరిజన గ్రామాల్లో పీవీటీజీలకు చెందిన లక్షా 528 నివాసాలకు ప్రధాన వసతులు ఏ మేరకు ఉన్నాయి? ఇంకా ఏం చేయాలి? అనే కోణంలో ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా వారికి సురక్షిత గృహాలు, పరిశుభ్రమైన తాగునీరుతోపాటు పారిశుధ్య నిర్వహణ, విద్యకు ప్రాధాన్యత, ఆరోగ్యంతోపాటు పోషకాహారం, రహదారులతోపాటు టెలిఫోన్ అనుసంధానత, స్థిరమైన జీవనోపాధి వంటి ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కాగా, అత్యంత బలహీన గిరిజన సమూహాల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.20,948.15 కోట్లు ఎస్టీ కాంపోనెంట్ నిధులను ఖర్చు చేసింది. అలాగే అన్ని నవరత్న పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను వారికి అందిస్తోంది. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం కూడా పీవీటీజీల కోసం ‘పీఎం పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్’ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో వారి అభివృద్ధికి మరింత ఊతమిచ్చినట్టు అయ్యింది. పీవీటీజీల అభివృద్ధికి ప్రాధాన్యం.. రాష్ట్రంలో పీవీటీజీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఈ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ‘పీఎం పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్’ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని అమలు కోసం పీవీటీజీల స్థితిగతులపై సర్వే నిర్వహించి వారికి ఉన్న ప్రాథమిక సౌకర్యాలు, నివాసాల వివరాలు సేకరించాం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘బిసాగ్–ఎన్’ మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అధికారులు వివరాలు నమోదు చేస్తారు. యాప్ వినియోగంపై శిక్షణ కూడా ఇస్తాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
సీఎం జగన్ హయాంలో గిరిజన జీవితాల్లో వెలుగులు
సాక్షి, అమరావతి/సాలూరు: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల జీవితాలు అభివృద్ధి పథంలో పయనింపజేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. సీఎం జగన్ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువగా గిరిపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నేతలు బీఆర్ అంబేడ్కర్, వైఎస్సార్, గిరిజన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాల్గుణ మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 18 సెల్ టవర్లతో అన్ని గ్రామాలకు కమ్యూనికేషన్ వచి్చందన్నారు. గిరిజన మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు మాట్లాడుతూ గిరిజనలకు సీఎం జగన్ నాణ్యమైన విద్య, ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషును అందిస్తున్నారని కొనియాడారు. అడవుల్లో రోగాలతో వందలాది మంది చనిపోయేవారని ఇప్పుడు సీఎం జగన్ వైద్యం అందుబాటులోకి తెచ్చారని, గిరిజనులు కోసం ట్రైబల్ మెడికల్ కాలేజీని తెచ్చారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిరిజనులను కనీసం మనుషులుగా కూడా చూడలేదన్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నేతలు డాక్టర్ వెంకటలక్షి్మ, మేరాజోత్ హనుమంత్‌నాయక్, రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి గుండా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గిరిజనులకు అండగా సీఎం జగన్ : డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర గిరిజనులకు అండగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన అధ్యక్షతన, పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాజ్యాంగపరమైన గిరిజన చట్టాలు జగనన్న పాలనలో పరిరక్షింపబడుతున్నాయన్నారు. గత టీడీపీ పాలనలో ఎన్నికలకు ఆరు నెలలు ముందు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.70 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.డీవీజీ శంకరరావు, ఎమ్మెల్సీ పి.రఘువర్మ, జీసీసీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు. చదవండి: రక్తం కారుతున్నా.. ‘అన్నా.. తను జాగ్రత్త’ -
అల్లూరి ఒక మహోన్నత శక్తి
భీమవరం(ప్రకాశం చౌక్)/కొమ్మాది: ‘అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి. ఆయన పోరాటం ఆదర్శనీయం. ఆయన తెలుగువారు, మన ప్రాంతంవారు కావడం మన అదృష్టం. మనందరికీ గర్వకారణం’ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాçసరాజు (వాసు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటాలు బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించాయని కొనియాడారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అల్లూరి స్మృతివనం, కాంస్య విగ్రహం ఏర్పాటుపై చొరవ చూపారని, రూ.20 కోట్ల విలువైన భూమిని కేటాయించడంతోపాటు 125వ జయంతి వేడుకలకు రూ.10 కోట్ల నిధులు కూడా అందించారని చెప్పారు. ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యే మంతెన రామరాజు, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ,, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, సీనియర్ నాయకులు గోకరాజు గంగరాజు, గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. అల్లూరి లేకపోతే మన్యం లేదు : రాజన్నదొర మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు లేకపోతే నేడు మన్యం ప్రాంతం ఉండేది కాదని, ఆయన పోరాటం వల్లే గిరిజనుల జీవన విధానం దెబ్బతినకుండా నేటికీ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అల్లూరి 126వ జయంతి వేడుకలను రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి ప్రధాన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర విగ్రహాలను అరకు ఎంపీ మాధవి, విశాఖ మేయర్ జి.హరివెంకటకుమారితో కలసి రాజన్నదొర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గిరిజన విద్యాభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని చెప్పారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి పోరాటం చిరస్మరణీయమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, గిరిజన కో–ఆపరేషన్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, డైరెక్టర్ రవీంద్రబాబు, ఈడీ చిన్నబాబు, నాగరాజు పాల్గొన్నారు. అల్లూరి స్మృతివనం ప్రారంభించిన రాష్ట్రపతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి నుంచే ఆమె భీమవరంలో అల్లూరి స్మృతివనాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
సాక్షి, అమరావతి: గిరిజన విద్యాసంస్థల్లో చదువుకొనే పిల్లల ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్న దొర హెచ్చరించారు. గిరిజన విద్యాసంస్థల్లో విద్యార్థుల సంరక్షణకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాజన్నదొర పలు అంశాలను సమీక్షించి అధికారులకు ఆదేశాలను జారీ చేసారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించడానికి గతంలో ఉన్న ఏఎన్ఎంల సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 590 మంది ఏఎన్ఎంలను నియమించడంతో పాటుగా ఆయా పాఠశాలల పరిధిలోని సచివాలయాల్లో ఉండే ఏఎన్ఎంతో గిరిజన విద్యార్థులను ముందుగా మ్యాపింగ్ చేయించాలని సూచించారు. పాఠశాలలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకొని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించాలని చెప్పారు. అత్యవసరమైన పరిస్థితుల్లో అన్ని స్థాయిల్లోని అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులను ఆస్పత్రులకు చేరవేసి అవసరమైన చికిత్సలను చేయించాలన్నారు. ఈ విషయంలో ఏ అధికారులైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని రాజన్న దొర స్పష్టం చేసారు. గిరిజన విద్యా సంస్థల్లో భద్రతను పెంచడంలో భాగంగా ఇదివరకే ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మత్తులు చేయించాలని, అవసరమైన అన్ని చోట్లా కొత్తగా కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గిరిజన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేలా డీటీడబ్ల్యుఓలు, డీడీలు, ఇతర అధికారులు పాఠశాలల పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. చింతపల్లిలోని ఎస్టీ డిగ్రీ కళాశాలకు అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని, సీతంపేటలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు భవనాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని అధఇకారులను కోరారు. మాతృభాషా వాలంటీర్లకు సంబంధించిన గౌరవ వేతనాలను సక్రమంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జీసీసీలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాజన్న దొర అధికారులను ఆదేశించారు. కాఫీ రైతులకు సంబంధించిన బకాయిలను త్వరితగతిన చెల్లించడానికి, కాఫీ రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జీజీసీ అధికారులను కోరారు. గిరిజన సంక్షేమశాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 1633 మంది టీచర్లు, జూనియర్ లెక్చరర్ల వేతనాల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీఆర్టీ టీచర్లు తమకు 12 నెలల వేతనాలు ఇవ్వాలంటూ కోరుతున్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షిస్తూ, సబ్ ప్లాన్ నిధులతో గిరిజన ప్రాంతాల్లో అవసరమైన రహదారుల నిర్మాణానికి చర్యలను చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను రాజన్న దొర ఆదేశించారు. గిరిజన సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేష్ కుమార్, ఇఎన్సీ శ్రీనివాసులు, ట్రిప్ కో ఎండీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల గుండె చప్పుడు సీఎం జగన్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తూ వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ బిర్సా ముండా జయంతి సందర్భంగా మంగళవారం విశాఖలో గిరిజన గౌరవ దిన వారోత్సవాలను రాజన్నదొర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనులకు 2 లక్షల పుడక భూములను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. గిరిజన నాయకులు, సమరయోధుల గురించి, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు గిరిజన కార్నివాల్‌ను ప్రారంభించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ సాగర తీరాన్ని హోరెత్తించారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, భాగ్యలక్ష్మి, కళావతి, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి పాల్గొన్నారు. -
అల్లూరి తొలి దాడికి వందేళ్లు
సాక్షి, అమరావతి/చింతపల్లి/చింతపల్లి రూరల్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విల్లంబులు ఎక్కుపెట్టి.. చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసిన ఘటనకు సరిగ్గా వందేళ్లు నిండాయి. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి తన బృందంతో తొలి దాడి జరిపారు. నాటి వీరోచిత ఘట్టాన్ని స్మరించుకుంటూ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సభ జరగబోతోంది. చింతపల్లితో మొదలుపెట్టి.. మన్యంలో గిరిజనులపై బ్రిటిష్ సేనలు సాగిస్తున్న దౌర్జన్యాలను ఎదురించాలంటే.. సాయుధ పోరాటమే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు. మన్యానికే చెందిన గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు (అగ్గిరాజు), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు వంటి 150 మందికి పైగా వీరులతో బృందాన్ని ఏర్పాటు చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేయాలని 1922 ఆగస్టు 19న నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడటంతో మన్యంలో తిరుగుబాటు మొదలైంది. ఈ దాడిలో 11 తుపాకులు, 5 కత్తులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్నెట్లను ఆ బృందం ఎత్తుకెళ్లింది. ఆగస్టు 23న రాత్రి కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపైనా అల్లూరి బృందం దాడి చేసింది. ఆ మూడు పోలీస్ స్టేషన్ల నుంచి మొత్తం 26 తుపాకులు, 2,500కు పైగా మందుగుండు సామగ్రిని అల్లూరి బృందం ఎత్తుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ పాలకులు మన్యంలో విప్లవ దళాన్ని అంతం చేయడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతానికి పంపించింది. ఆ ఇద్దరు అధికారులను రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో సెప్టెంబర్ 24న హతమార్చింది. ఆ తరువాత ఆక్టోబర్ 15న ముందుగానే సమాచారం ఇచ్చి మరీ అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై అల్లూరి బృందం దాడి చేయడం అత్యంత సాహసోపేతమైనదిగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించారు. ఆ తరువాత 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్, 1923 జూన్ 10న మల్కన్‌గిరి పోలీస్ స్టేషన్, ట్రెజరీ, సెప్టెంబర్ 22న పాడేరు పోలీస్ స్టేషన్‌పైన దాడులు జరిగాయి. కాగా, కొయ్యూరు గ్రామ సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రామరాజును 1924 మే 7న బ్రిటిష్ పోలీసులు బంధించగా.. మేజర్ గుడాల్ తుపాకీతో కాల్చి చంపాడు. నేడు భారీ బహిరంగ సభ చింతపల్లి స్టేషన్‌పై అల్లూరి బృందం దాడిచేసి వందేళ్లయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలోని డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. -
సామాజిక న్యాయం ఘనత సీఎం జగన్‌దే: రాజన్నదొర
-
సర్కారు వారి ఆరా
సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి సాలూ రు నియోజకవర్గంలోని సాలూరు పట్టణ పరిధిలోని 3వ వార్డు గుమడాం గ్రామానికి చెందిన నారాపాటి అప్పారావు తెలుగుదేశం పార్టీ అభిమాని. ఇంట్లో ఎన్టీఆర్ ఫొటోను కూడా పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈయన ఇంటికి వెళ్లగానే లేచి వచ్చి ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ పాలన చూశాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తున్నాం. ఎటువంటి ప్రలోభాలు, అడ్డంకులు లేకుండా మా ఇంట్లో వారికి అర్హత ఉన్న అన్ని పథకాలు, పింఛన్ అందుతున్నా యి. ఇంత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు. ఎన్టీఆర్ అభిమానినే అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలన చూసిన తరువాత నాకు ఆనందం కలిగిందంటూ తమకు అందుతున్న పథకాల గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. గుమడాం గ్రామంలో నిర్వహించిన గడగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామస్తుల అందరి నుంచి ఇదే స్పందన వచ్చింది. పార్టీలకు అతీతంగా సంక్షేమం పొందుతున్న ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జైజగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం రెట్టింపైంది. సంక్షేమమే లక్ష్యంగా పాలనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఆరా తీస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా జరుగుతోంది. గ్రామా ల్లోని ప్రతి ఇంట్లో సంక్షేమ పథక లబ్ధిదారులు ఉండ గా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి గడప ఎక్కుతుండడంతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. టీడీపీ అభిమానులు సైతం ప్రభుత్వానికి అభిమానులుగా మారి తాము పొందుతున్న లబ్ధిని తమ గడపకు వచ్చిన నాయకులకు వివరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సచివాల య వ్యవస్థ ద్వారా కల్పించిన ఉద్యోగాల్లో తమ పిల్లలు స్థిరపడిన విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుమడాంలో సందడి సందడిగా.. సాలూరు నియోజకవర్గం గుమడాం గ్రామంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారకముందే స్వయాన డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తమ గ్రామంలోకి వచ్చి తలుపుతడుతున్నారనగానే గ్రామం మొత్తం కదిలింది. డిప్యూటీ సీఎం తమ ఇంటికి వచ్చి కష్టసుఖాలు తెలుసుకోవ డం చాలా ఆనందంగా ఉందని అందరూ సంబరపడుతున్నారు. గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎంకు ప్రతి ఇంటి నుంచి ఆధారాభిమానాలతో పాటు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పక్కాగా పథకాలు అమలవతున్నాయని, ఎవరికి ఒక్క పైసా కూడా చెల్లించలేదని లబ్ధిదారులు ఆయనకు చెబుతుంటే ఆయన మనసంతా సంతోషంతో నిండిపోయింది. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడు తూ ఇంతటి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఘనమైన మెజార్టీ అందించాలని గ్రామస్తులను కోరారు. అక్కడక్కడ ఒకరిద్దరు టీడీపీ కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని, గొంతులు చించుకుని లేని పోని ఆరోపణ లు చేసినంత మాత్రాన సంక్షేమ పథకాలు ఆగవని, ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ చైర్మన్ పూల ఈశ్వరమ్మ, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ పాచిపెంట నాయకులు పి.గౌరీశ్వరరావు, పాచిపెంట వీరన్నాయుడు, మండల కన్వీనర్ గొట్టాపు ముత్యాలనాయుడు, దండి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ తాడ్డి లక్ష్మి, వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ కన్వీనర్ జరజాపు సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదు’
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో నిమ్మగడ్డ ఎప్పుడూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండానే ఈ-వాచ్ యాప్ తీసుకొచ్చారని అంబటి పేర్కొన్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. గతంలోనూ చాలాచోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని.. నిమ్మగడ్డ మాత్రం ఎందుకు ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారని ఆయన నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆంక్షల నేపథ్యంలో అంబటి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు సరికావని ఆయన అన్నారు. మంత్రిని కట్టడి చేసే అధికారం నిమ్మగడ్డకు లేదని ఆయన తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ కూడా చట్టానికి లోబడే పనిచేయాలని హితవు పలికారు. గీత దాటితే నిమ్మగడ్డకు రాజ్యాంగ రక్షణ ఉండదని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని అంబటి గుర్తుచేశారు. ఇది దుర్మాగం ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ తీరు దుర్మార్గంగా తయారైందని ఆయన అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ ఆంక్షలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. నిమ్మగడ్డ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధుల హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మండిపడ్డారు. మా హక్కులకు అడ్డుతగిలితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. -
ఆ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళిత సంక్షేమానికి పెట్టని కోటగా పరిస్థితి కొనసాగుతుంటే టీడీపీ నాయకులు భరించలేక పోతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు రాజన్నదొర, చెట్టి ఫాల్గుణలతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. సీఎం జగన్ మాత్రం ఏడాది కాలంలోనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆయనలో అంబేద్కరిజం కనిపిస్తోంది. ఈమధ్య టీడీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే ప్రజల ప్రయోజనాల కోసం ఏమైనా అడుగుతారేమోనని అనుకున్నాను. కానీ స్కాం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రులను విడిచిపెట్టాలని రాష్ట్రపతిని కలిశారని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులు బయట పడినప్పుడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పుడు ఈ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?’ అంటూ ప్రశ్నించారు. టీడీపీ పాలనలోచంద్రబాబు సొంతంగా రాజ్యాంగాన్ని అమలు చేశారే తప్పా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడా అమలు చేయలేదు. చంద్రబాబుకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని, గతంలో అన్ని రంగాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్‌గా న్యాయ కోవిదుడైన దళితుడిని నియమిస్తే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే టీడీపీ నేతలు అమరావతిలో వ్యాపారాల కోసం అక్కడ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. (చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ) అభివృద్ధి భయం పట్టుకుంది: రాజన్నదొర విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు స్వాగతిస్తున్నామని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. ఐదేళ్లూ ఉత్తరాంధ్రను పట్టించుకోని టీడీపీ నాయకులు.. ఇప్పుడు సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో గిరిజనులకు ఎంత ఖర్చు చేశారో, తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఎంత ఖర్చు చేశామన్నదానిపై చర్చకు సిద్ధమని రాజన్నదొర అన్నారు. టీడీపీ నాయకులకు జగన్మోహన్రెడ్డి అభివృద్ధి మంత్రం భయం పట్టుకుందని అన్నారు. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. శవ రాజకీయం కోసం అర్హత లేని వ్యక్తికి ఆరు నెలలు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోని తీసేసారంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో కనీసం గిరిజన సలహా మండలి కూడా నియమించలేదని రాజన్నదొర పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు గిరిజనుల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదరించారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. బీసీ ,ఎస్సీ ఎస్టీ మహిళలకు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గిరిజనులకు భూమి పట్టాలిస్తే ఇప్పడు సీఎం జగన్.. నాలుగింతలు ఎక్కువగా భూమి పట్టాలిచ్చారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాల పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికే ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతలకు భయం పట్టుకుంది
-
'ఆర్టీవో కార్యాలయాన్ని అమ్ముకుంది ఎవరు?'
సాక్షి, విజయనగరం : చంద్రబాబుకు రాజ్యసభ ఎన్నికల ద్వారా మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరం జెడ్పీ గెస్ట్ హౌస్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రాజన్నదొర, అప్పల నరసయ్య, కంబాల జోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. ' 23 మంది ఎమ్మెల్యే లు ఉంటే కేవలం17 ఓట్లు మాత్రమే రావడం సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకత తేటతెల్లం అవుతుంది. రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు భూ సేకరణ చేసింది ఎవరు.. ఏం చేద్దామని అవసరానికి మించి భుమిని టీడీపి ప్రభుత్వం సేకరించింది.. వైసీపీ నాయకుల భూములను బలవంతంగా లాక్కుంది మీరు కాదా? భూములు అమ్ముకునే సంస్కృతి మా నాయకులకు లేదు. గతంలో మయూరి సెంటర్లో ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని మీరు అమ్ముకో లేదా.. మాది నీతి గల ప్రభుత్వం... సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో విసృతంగా జరుగుతున్నాయి.. నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు కానీ గతంలో డబ్బులన్ని మంత్రులు, మిగతా నాయకుల జేబుల్లోకి వెళ్లేవి. కాని ఇప్పుడు మాత్రం నేరుగా ప్రజలకు అందుతుంది' అంటూ తెలిపారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఒక్క సాలూరు నియోజకవర్గానికే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రూ. 110 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జీవో నెంబర్ మూడు గిరిజన చట్టంపై న్యాయస్థాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. -
'స్వార్థపూరిత రాజకీయాలే చంద్రబాబు నైజం'
సాక్షి, విజయనగరం : జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక పరిపాలన వికేంద్రీకరణ అవసరమని చెప్పినట్లు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర తెలిపారు. బుదవారం విజయనగరంలో నిర్వహించిన సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేశారు. స్వార్థపూరిత రాజకీయాలే చంద్రబాబు నైజమని రాజన్న దొర దుయ్యబట్టారు. కృష్ణా, గుంటూరు మాత్రమే అభివృద్ధి చెందాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే నిరంతరం ధర్నాలకు దిగుతున్నారని మండిపడ్డారు. చాళుక్యులు, శాతకర్ణులు తమ పాలనలో రాజధానులు మార్చిన చరిత్ర బాబు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేవలం 29 గ్రామాల కోసంఅత్యంత వెనుకబడిన జిల్లాలకు రాజధాని ఇవ్వడం తప్పా అంటూ నిలదీశారు. కుప్పిగంతులేయడమే తప్ప విశాఖపట్నం టీడీపీ నేతలు రాజధానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. జయప్రకాశ్ నారాయణ్, వెంకయ్యనాయుడు వంటి నేతలే వికేంద్రికరణపై మద్దతు ఇస్తుంటే.. చంద్రబాబు రాద్దాంతం చేస్తుండడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.ఇన్సైడ్ ట్రేడింగ్‌పై దర్యాప్తు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రకటనను మేం స్వాగతిస్తున్నాం : బొత్స అప్పలనర్సయ్య దశాబ్ధాల తరబడి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వెనకబడిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై జగన్‌కు స్పష్టత ఉందని , జీఎన్ రావు కమిటి ఇచ్చిన నివేదికను యధావిధిగా అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వికేంద్రికరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే, ఎంపీలంతా ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, హైకోర్టు బెంచ్‌లు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. -
‘గిరిజనులతో మైత్రిని కొనసాగిస్తాను’
సాక్షి, విజయనగరం: గిరిజనుల జీవన విధానాన్ని తను వ్యక్తిగతంగా చూశానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వారితో మైత్రిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పాచిపెంట మండలం అమ్మవలస ఆదివాసి గ్రామాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన గిరిజన రైతులతో మాట్లాడారు. వాళ్ల బ్యాంకు ఖాతాలకు ఎంత సొమ్ము జమ అవుతుందో ఆరా తీశారు. ఈ క్రమంలో అమ్మవలస ఆదివాసి గిరిజన రైతులు సాగుచేస్తున్న ఉద్యానవన పంటలను సందర్శించి గిరిజన రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వరి , మొక్కజొన్న, అరటి, పత్తి, మామిడి, జీడిమామిడి తదితర పంటల సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవలస ఆదివాసి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. గిరిజనుల జీవన విధానాన్ని వ్యక్తిగతంగా చూసి, వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. సమస్యల పరిష్కార చర్యలపై ప్రభుత్వానికి సూచిస్తానని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు వేల సంవత్సరాలు నుంచి వచ్చాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కాపాడటం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం రెండు ప్రధాన అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నిర్వహించే క్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గిరిజనులు విద్యకు ప్రాధ్యాన్యత ఇచ్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఎన్ఎం వ్యవస్థ, పీహెచ్‌సీలు ఏర్పాటు చేసినా భౌగోళికపరంగా సమస్యలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గిరిజన యువత ఉపాధి కోసం కొత్త రంగాలను ఎంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోటీ పరిక్షలకు సిద్ధం అవుతూ.. తమను తాము మార్చుకుని ప్రభుత్వం సహకారం పొందాలని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పరిష్కారం కోసం ఆ వివరాలను ప్రభుత్వానికి సూచించడం తన బాధ్యత అన్నారు. గిరిజనులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని.. ఈ మైత్రి బంధాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వాభివృద్ధి ఫలాలు అందుతున్న తీరును పరిశీలించేందుకు గవర్నర్ రావడం శుభసూచకం అన్నారు. ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం అందాల్సి ఉందని గుర్తుచేశారు. పాడేరులో మెడికల్ కళాశాల, సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం రాబోతున్నాయని వెల్లడించారు. గిరిజన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీవాణి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోటియా గ్రామాల సమస్యను ఎమ్మెల్యే రాజన్నదొర గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ.. కోటియా గ్రామాల గిరిజనులు సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధిలో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌కి విన్నవించినట్టు తెలిపారు. -
రీపోలింగ్ నిర్వహించాలి
సాలూరు: సాలూరు మండల పరిధిలోని కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనులను ఓటేయకుండా అడ్డుకుని తిప్పిపంపిన ఎన్నికల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం నేరెళ్లవలస పోలింగ్ కేంద్రంలో తమను ఓటేయనీయకుండా అడ్డుకుని, ఎన్ని కల అధికారులు తిప్పి పంపించారని ఎమ్మెల్యేకు పలువురు గిరిజనులు ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ బీసు ఆధ్వర్యంలో కలిసి తమ వేదన వినిపించారు. స్పందించిన ఎమ్మెల్యే వారితో కలిసి కాలినడకన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి కనకారావుకు విషయాన్ని వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకరిద్దరు ఒడిశాలో ఓటేసినవారు పోలింగ్ కేంద్రాలకు వస్తే, అందర్నీ తిప్పి పంపించడం దారుణమన్నారు. గతంలో జరిగి న ఎన్నికల్లో ఒడిశాలో ఓటేసి, ఇక్కడ ఓటేసేందుకు వచ్చేవారని, అలాగే ఇక్కడ ఓటేసి, అక్కడకు కూడా గిరిజనులు వెళ్లేవారన్నారు. ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులతో వెళ్లినా ప్రిసైడింగ్ అధికారులు ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఓటరు ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కై కుట్ర చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు. విషయాన్ని రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు తెలిపేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వస్తోం దన్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల వివాదం కారణంగా నలి గిపోతున్న అమాయక గిరిజనుల విషయంలో ఇలా వ్యవహరించడం తగదన్నారు. రాజన్నదొర వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సూరిబా బు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు తదితరులున్నారు. -
సంక్షేమపాలన జగన్‌తోనే సాధ్యం
సాక్షి, సాలూరు: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, జగనన్న సంక్షేమ పాలన తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కోరా రు. మంగళవారం రాత్రి పట్టణంలోని 8,9 వార్డులపరిధిలోని గాంధీనగర్, మెట్టువీధి, కొంకివీధి, మహంతివీధి, మత్రాసువీధులలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో ఇం టింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న నవరత్నాల పథకాలను వివరించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలలో ఏఒక్కటీ అమలు చేయలేదని, ఇంటికో ఉద్యోగంఇస్తానని నమ్మించి మోసం చేశారన్నా రు. యువత నిరుద్యోగులుగా కాలక్షేపం చేస్తున్నారన్నారు. జగన్ సీఎం కాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని, పిల్లలను బడికి పంపించే తల్లులకు నెలకు రూ.500 నుంచి రూ.2వేల వరకు అందిస్తారన్నారు. మాటతప్పని రాజశేఖరరెడ్డి బిడ్డగా జగన్ కూడా ఇచ్చిన మాటను నిలుపుకుంటారని, అమలుచేయలేని హామీలను ఆయన ఇవ్వరన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రచారానికి వచ్చిన రాజన్నదొరకు మహిళలు హారతులు పట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు, అర్బన్బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కొంకి అప్పారావు, గొర్లె జగం, హరి స్వామినాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కాకి రం గ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గిరి రఘు, కౌన్సిలర్ నాగార్జున తదితరులు పాల్గన్నారు. జగన్‌కి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి పాచిపెంట: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఆపార్టీ రాష్ట్ర బీసీసెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, నాయకుడు ఇజ్జాడ అప్పలనాయుడు ప్రజలను కోరారు. మండలంలోని కొటికిపెంట పంచాయతీ గోగాడవలస, కోడికాళ్లవలస, గరేళ్లవలస గ్రామాల్లో సలాది అప్పలనాయుడు, కొటికిపెంట,మోదుగ, గొట్టూ రు పంచాయతీల్లో ఇజ్జాడ అప్పలనాయుడు వేర్వేరుగా మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నవరత్నాలతో నవశకానికి నాంది మెంటాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది పలకనున్నాయని ఆపార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. మండలంలోని గుర్ల గ్రామంలో పార్టీ నాయకులలో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించి..ప్యాన్గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, ప్రచార కన్వీనర్ కనిమెరక త్రినాథ, తిరుపతి, ఎంపీటీసీ చింతకాశీనాయుడు, దాట్ల హనుమంతురాజు, పల్లి అప్పలనాయుడు, పల్లి కన్నమ్మ, సతీష్, పుర్నాన అప్పలనాయుడు, డి.దేముడుబాబు, పుర్నాన రామునాయుడు పాల్గొన్నారు. -
చంద్రబాబు దీక్షలను ప్రజలు నమ్మరు...
విజయనగరం, పార్వతీపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ప్రజలు నమ్మరని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. సోమవారం పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా.... ప్రత్యేక హోదా ఇచ్చిన 11 రాష్ట్రాల్లో ఏమి అభివృద్ధి జరిగిందని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో దీక్ష చేశారని ప్రశ్నించారు. నాడు ప్రత్యేక హోదా కావాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పోరాటం చేస్తుంటే పోలీసులతో బెదిరించిన చంద్రబాబు నేడు ఢిల్లీలో చేస్తున్న దొంగ దీక్షకు ఉద్యోగులు, విద్యార్థులు రావాలని బ్రతిమలాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు రాహుల్‌గాంధీ మన రాష్ట్రానికి వస్తే చచ్చామో, బతికామో చూడడానికి వస్తున్నాడా? అని ప్రశ్నించిన చంద్రబాబు నేడు ఆయనతో స్నేహం చేసి ప్రధాని మోదీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మోదీ లాంటి సమర్థవంతమైన ప్రధానమంత్రి మరొకరు ఉండరని శాసనసభ సాక్షిగా చెప్పిన చంద్రబాబు... నేడు మోదీ గోబ్యాక్ అంటూ దీక్షలు చేయడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా తరచు చెప్పుకొనే చంద్రబాబు ప్రతిపక్ష నేత ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను కాపీ కొట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజలే తరిమికొడతారు... రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే రాజన్నదొర జోష్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను భారీగా పెంచి కమీషన్లు తింటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నమ్మరని.. రాబోవు ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. వైఎస్సార్సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఏనాడో తాకట్టుపెట్టారన్నారు. 416 అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను మాట్లాడుతూ, 2014 నుంచి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నది ఒక్క జగన్మోహన్రెడ్డేనన్నారు. పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ, ఒకపక్క డబ్బులు లేవని చెబుతూ మరోపక్క వృథా ఖర్చులు పెడుతున్న టీడీపీ నా యకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఎస్. శ్రీనివాసరావు, రణభేరి బంగారునాయురడు, పొట్నూరు జయంతి, చందక సూర్యప్రకాష్, తోట శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్’
సాక్షి, విజయనగరం : ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక వ్యక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.రాజన్న దొర అన్నారు. సోమవారమిక్కడ విలేరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దొంగదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నిలకు ముందు ఓట్ల కోసమే బాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత డబ్బునో, పార్టీ డబ్బునో కాకుండా ప్రజాధనాన్ని దొంగ దీక్షలకు ఉపయోగించడమేమిటని ప్రశ్నించారు. నలభై సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకొంటున్న చంద్రబాబు.. నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఆయన పథకాలు కాపీ కొట్టడం హాస్యాస్పదమని రాజన్న దొర ఎద్దేవా చేశారు. సర్వేల పేరిట వైఎస్సార్ సీపీ మద్దతుదారులను భయాందోళనకు గురిచేసి, ప్రలోభపెట్టే కార్యక్రమంలో చంద్రబాబు మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజన్నరాజ్యం జగన్‌తోనే సాధ్యం
విజయనగరం, సాలూరురూరల్: మాట తప్పని, మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సువర్ణయుగం మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలంలోని గిరిశిఖర కేరంగి పంచాయతీలో ఆయన గురువారం పర్యటించారు. కేరంగి పాస్టర్ డోనేరు లచ్చయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను వినిపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిం చాలంటూ పలువురు పాస్టర్లు, క్రైస్తవ సోదరీ సోదరిమణులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ సన్మార్గంలో నడుస్తూ మంచి వైపు ఉంటూ మాట తప్పని, మడమ తిప్పని నాయకులకు అండగా నిలబడాలని కోరారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్పీ భంజ్‌దేవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించినా నాడు ఈ గిరిశిఖర గ్రామాల అభివృద్ధికి చేసిందేమిటో తెలపాలని ప్రశ్నించారు. తను నిజమైన గిరిజనుడునని, కొండల్లో పుట్టి పెరిగానని, అందుకే ప్రజలు బాధలు, ఇబ్బందులు తనకు తెలుసన్నారు. పల్లెలకు తాగునీరు, రోడ్లు మంజూరుతో పాటు పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు కృషిచేశానని తెలిపారు. ఈ ప్రాంతానికి బీటీ రోడ్డు మంజూరైందని, ఎన్నికలు తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రానుందని, ప్రజానాయకుడైన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రం లో ప్రజాపాలన ప్రారంభంకాబోతుందని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, పార్టీ రాష్ట్ర బీసీసెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, తాజా మాజీ సర్పంచ్‌లు చింతా సీతయ్య, నారాయణరావు, నాయకులు పెద్దిబాబు, కొండలరావు, భాస్కరరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు పసుపు రంగు దుస్తులా..?
విజయనగరం ,సాలూరు: విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రస్‌ల స్థానంలో టీడీపీ నాయకులు తమ పార్టీ రంగు సూచించే దుస్తులు పంపిణీ చేయడాన్ని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు రాజన్నదొర తప్పుబట్టారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సాలూరు మండలంలోని మామిడిపల్లి హైస్కూల్ విద్యార్థులకు టీడీపీ నాయకులు టీడీపీ డ్రస్‌లను పంపిణీ చేశారన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో ఐక్యత ఉంటుందా అని ప్రశ్నించారు. విద్యాసంస్థలను రాజకీయాలకు వేదికగా చేస్తారా?.. హైస్కూళ్లను పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తారా అంటూ మండిపడ్డారు. పిల్లలతో పార్టీలకు ప్రచారం చేయిస్తే కేసులు నమోదైన సంఘటనలున్నాయి.. అలాంటిది ఏకంగా పాఠశాలలో డ్రస్‌లు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య ప్రాతినిథ్య చట్టం, ఎన్నికల నియమావళికి పూర్తి వ్యతిరేకమన్నారు. కలెక్టర్, డీఈఓ బదులివ్వాలి.. ఈ విషయమై జిల్లా కలెక్టర్, డీఈఓ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రాజన్నదొర డిమాండ్ చేశారు. పార్టీ డ్రస్‌లను పంపిణీ చేసిన సాక్షి కథనాన్ని, ఫొటోలను చూపారు. హైస్కూళ్లలో విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వర్తించేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే ఇతర పార్టీలతో సహా వైఎస్సార్సీపీకి కూడా పార్టీ డ్రస్‌లను ఇచ్చేందుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ సాలూరు మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ, పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి సలాది అప్పలనాయుడు పాల్గొన్నారు. -
బీసీలను నమ్మించి మోసం చేశారు
విజయనగరం, పార్వతీపురం: బీసీ సామాజిక వర్గానికి చంద్రబాబు చేసిన మోసాన్ని తెలియజేసేందుకు గురువారం వైస్సార్ సీపీ అరకు పార్లమెంట్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్వతీపురం డివిజన్ కేంద్రంలో బీసీ గర్జన నిర్వహించారు. అరకు పార్లమెంట్ జిల్లా పరిధి లోని సాలూరు, పార్వతీపుం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలోని బీసీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. 2014 ఎన్నికల మేనిఫేస్టోలో 119 హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ముందుగా పార్వతీపురం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ చంద్రబాబుకు నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యగా పేర్కొన్నారు. ఏటా రూ.10 వేలు కోట్ల ఖర్చు చేస్తామని చెప్పారని, ఆ లెక్కను ఐదేళ్లకు రూ.50 వేలు కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. బాబు పాలనలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు. బీసీ మంత్రి కొల్లు రవీంద్ర మొద్దు నిద్రలో ఉన్నారని, బీసీల సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ టీడీపీ అరాచక పాలనను అంతమొందించడానికి బీసీలంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ బీసీలకు రూ.80 వేల కోట్లు కేటాయిస్తానని చెబుతూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారన్నారు. బీసీల సత్తా ఎమిటో చంద్రబాబుకు చూపిద్దామని అరకు పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు అన్నారు. ఆదరణ పథకం అవినీతిమయమైందని, నాణ్యతలేని పరికరాలు పంపిణీ చేస్తూ టీడీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతోందన్నారు. వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ నేత పాలవలస విక్రాంత్, జిల్లా బీసీసెల్ మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, పట్ణణ అ«ధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు ముగడ జగన్మోహన్, బీసీ నేత వంగపండు క్రిష్ణ, సాలూరు మత్స్యకార ప్రతినిధి పాండ్రంకి అచ్చిబాబు తదితరులు మాట్లాడారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసి వైఎస్సార్ సీపీని గద్దెనెక్కిద్దామన్నారు. అనంతరం బీసీల అనచివేతను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ బీసీ గర్జనలో వైఎస్సార్సీపీ సినియర్ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్,రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, మువ్వల సత్యం నాయుడు, బలగ నాగేశ్వరావు, మండల పకీరునాయుడు, గుంట్రెడ్డి దామోదరావు, వల్లేపు చిన్నారావు, ఆర్వీ పార్థసారథి, బోను రామినా యుడు, ఉరిటి రామారావు, మూడడ్ల రామారావు, డి.జనార్దనరావు, శెట్టి నాగేశ్వరరావు, వి.సూర్యనారాయణ థాట్రాజ్, పోలా ఈశ్వరనారాయణ, బి.సత్యనారాయణమూర్తి, బి.శ్రీ రాములునాయడు, టి.సత్యనారా యణ, డి.అప్పలనాయు డు, ఆర్.బి.నాయుడు, బి.తమ్మినాయుడు, జె.శ్రీదేవి, గంగయ్య, గోపినాయుడు, మజ్జి శేఖర్, వై.తిరుపతి, బొమ్మి రమేష్, వై.ప్రతాప్, మజ్జి శేఖర్, సీహెచ్.సత్యనారాయణ, ఎన్.బలరాం, ఎం.గణేష్, అల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
‘విపక్ష నేతల భద్రతపై బాబు సర్కార్ నిర్లక్ష్యం’
సాక్షి, విజయనగరం : విపక్ష నేతల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. గిరిజన ప్రాంతంలోని ఎమ్మెల్యేలకు నలుగురు గన్ మెన్లను కేటాయించాల్సి ఉండగా తనకు ఇద్దరిని మాత్రమే కేటాయించారని ఆరోపించారు. చంద్రబాబు విజయనగరం జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. విషజ్వరాలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైస్సార్‌సీపీలోని భారీ చేరికలు ఎమ్మెల్యే రాజన్న దొర ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీలోకి చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో మాజీ జడ్పీటీసీ రెడ్డి తిరుపతి నాయడుతోపాటు 45మంది మండల స్థాయి నాయకులు పార్టీలో చేరారు.