Rayagada
-
మహిళా సిబ్బందితో ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో విశాఖపట్నం నుంచి రాయగడకు ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఈకార్వో) ప్రెసిడెంట్ పారిజాత సత్పతి.. వైస్ ప్రెసిడెంట్స్ కవితా గుప్తా, ప్రియాంక శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కలిసి ఈ రైలును మంగళవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలుకు సహనాకుమారి లోకోపైలట్‌గా, కె.నాగమణి అసిస్టెంట్ లోకోపైలట్‌గా, ఎం.కళ్యాణి ట్రైన్ మేనేజర్‌గా, ఎస్.అంబిలి, జి.అచ్యుతాంబ, కె.సంతోíÙరావు, డి.రాధ టికెట్ తనిఖీ సిబ్బందిగా విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఈకార్వో ప్రెసిడెంట్ పారిజాత సత్పతి మాట్లాడుతూ విశాఖ నుంచి మహిళా సిబ్బందిచే ప్రత్యేక రైలును నడిపించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ రోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఆపరేషన్స్, కమర్షియల్, ఆరీ్పఎఫ్.. ఇలా అన్ని విభాగాల్లోను మహిళలే విధులు నిర్వర్తించారని తెలిపారు. వాల్తేర్ డివిజన్ మహిళా సాధికారత విషయంలో ముందుంటుందని, అనేకమంది మహిళలను ట్రాక్ మెయింటెనెన్స్‌లో, ట్రైన్ ఆపరేషన్స్‌లో, ఆర్‌ఆర్‌ఐలో, ట్రైన్ మేనేజర్స్‌గా, టికెట్ తనిఖీ సిబ్బందిగా, కార్యాలయాల్లోను విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. వాల్తేర్ డివిజన్ ప్రత్యేకంగా మహిళల చేత కొన్ని విభాగాలనే నడుపుతున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈకార్వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్కే బీచ్‌లో వాకథాన్ నిర్వహించినట్లు చెప్పారు. -
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్‌కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్‌కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దేశంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఆయా మార్గాలలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ► విశాఖపట్నంలో ఈ నెల 29, వచ్చేనెల 5, 12, 19 తేదీలలో బయల్దేరే విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్(22847) వయా రాయగడ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. ► లోకమాన్యతిలక్ టెర్మినస్‌లో ఈ నెల 31, వచ్చేనెల 7, 14, 21 తేదీలలో బయల్దేరే లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(22848) ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో రద్దయిన రైళ్లు.. ► సంబల్పూర్లో బయల్దేరాల్సిన సంబల్పూర్–రాయగడ(18301) ఎక్స్‌ప్రెస్ ► రాయగడలో బయల్దేరాల్సిన రాయగడ–సంబల్పూర్(18302) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–భువనేశ్వర్(22820) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► భువనేశ్వర్‌లో బయల్దేరాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం (22819) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–పలాస(18532) ఎక్స్‌ప్రెస్ ► పలాసలో బయల్దేరవలసిన పలాస– విశాఖపట్నం(18531) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరవలసిన విశాఖపట్నం–కోరాపుట్(08546) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► కోరాపుట్‌లో బయల్దేరవలసిన కోరాపుట్–విశాఖపట్నం(08545) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► పూరీలో బయల్దేరాల్సిన పూరి–గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్ ► గుణుపూర్‌లో బయల్దేరాల్సిన గుణుపూర్–పూరి (18418) ఎక్స్‌ప్రెస్. -
పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..
సాక్షి, రాయగడ: తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని సొండి వీధిలో మంగళవారం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ అనంత నారాయణ మహంతి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. అనంతరం యువతీ, యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. సొండి వీధికి చెందిన స్వాతి పాత్రో(15), అదే వీధికి చెందిన రాహుల్ కౌసల్య(26) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్‌కు ఇదివరకే పెళ్లయి, ఓ కొడుకు ఉండగా, 5 నెలల క్రితం నుంచి అతడి భార్య, కొడుకు గుణుపూర్‌లోని తన అత్తవారింట్లోనే ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న రాహుల్ స్వాతితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఒకరిపై మరొకరు మరింత ఇష్టం పెంచుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. అయినా పెళ్లయిన వ్యక్తికి మళ్లీ అమ్మాయిని ఎలా ఇచ్చి, పెళ్లి చేస్తారని అనుకున్న వారు చనిపోయేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ ఇంట్లోనే ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. ఎప్పటిలాగే ఉదయం ట్యూషన్‌కి వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన యువతి తల్లిదండ్రులు ట్యూషన్ మాస్టారు ఇంటికి వెళ్లి, తమ కూతురు ఆచూకీ కోసం అడిగారు. ఈరోజు తను ట్యూషన్‌కు రాలేదని మాస్టారు చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తుల సమాచారం మేరకు అదే వీధిలోని రాహుల్ ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు మూసి ఉండడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూశారు. ఈ క్రమంలో ఫ్యాన్‌కు వేలాడుతున్న స్వాతి, రాహుల్ కనిపించారు. అప్పటికే చనిపోయిన స్వాతిని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొనఊపిరితో ఉన్న రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమజంట ఆత్మహత్యపై దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో) -
మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి.. వివస్త్రగా ఉండడం చూసి
రాయగడ (ఒడిశా): మతిస్థిమితి లేని బాలికపై లైంగికదాడి జరిగిన సంఘటన జిల్లాలో సంచలనం రేకిత్తించింది. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి సమీపంలోని నతమ గ్రామంలో భగీరథి నచిక తన 13 ఏళ్ల దివ్యాంగ బాలికను ఎప్పటిలాగే ఇంటి దగ్గరే ఉంచి, కట్టెల కోసం భార్యతో కలిసి సమీపంలోని అడవికి వెళ్లాడు. ఎవ్వరూ లేని సమయం చూసిన దుండగులు బాధిత బాలికపై లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులు తమ బిడ్డ వివస్త్రగా ఉండడం చూసి, మతిస్థిమితం లేదు కదా తనకు తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయనుకున్నారు. అయితే అదేరోజు రాత్రి బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడం చూసి, ఆందోళన చెందారు. చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: (బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..) ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ధ్రువీకరించారు. కన్నీరుమున్నీరైన బాధిత తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ని ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని, కోర్టుకు అప్పగిస్తామని ఐఐసీ అధికారి రస్మీరంజన్ ప్రధాన్ భరోసా తెలిపారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) -
ఐస్‌క్రీం కోసం వెళ్లి, తిరిగి వస్తుంటే..
రాయగడ( భువనేశ్వర్): జిల్లా కేంద్రంలోని కొరాపుట్ మార్గం నువాసాహి రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. మృతుడు ఆర్కే నగర్ స్వీపర్ కాలనీలో నివసిస్తున్న సునీల్ సామల్ కుమారుడు సుధాంశుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ ఎస్కే సత్పతి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం సుధాంశు ఐస్‌క్రీం కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని స్వీపర్ కాలనీవాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళన చేపట్టారు. చదవండి: వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది -
అయ్యో.. ఆ ప్రాంత విద్యార్థులకు చదవాలని ఉన్నా..
సాక్షి,రాయగడ(భువనేశ్వర్): పాఠశాలల్లో డ్రాపవుట్ శాతాన్ని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు సరైన వసతి, రహదారి సౌకర్యాలు లేక ఎంతోమంది విద్యార్ధులు చదువులకు స్వస్తి చెబుతున్నారు. కొలనార సమితిలోని పాత్రపుట్, ఇమిలిగుడ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికీ పాఠశాలలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నివాసాలకు సమీపంలో పాఠశాలలు లేక, పూజారిగుడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళుతున్నారు. విద్యార్థులు ఈ పాఠశాలకు చేరుకోవాలంటే పాత్రపుట్‌కు, పూజారిగుడ మధ్యనున్న నాగావళి నదిని దాటాల్సి ఉంది. ప్రతీఏటా వర్షాకాలంలో నదీప్రవాహం ఎక్కువగా ఉంటుండటంతో విద్యార్థులు తమ పాఠశాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరమని తెలిసికూడా విద్యార్థులు నదిని దాటుతున్నారు. నాలుగేళ్ల క్రితం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.8కోట్లతో పాత్రపుట్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా వంతెన నిర్మాణ పనులు పూర్తి కాలేదు. వంతెన నిర్మాణం పూర్తయితే, తొమ్మిది గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడనుంది. ఈ విషయమై ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ వ్యయం పెరగడంతో వంతెన పనులు నిలిచిపోయాయని, నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. చదవండి: Cyclone Gulab: అందరికీ గుర్తుండి పోయేలా.. ‘గులాబ్’ పేరు పెట్టి మురిసిపోయిన తల్లులు -
భార్య అశ్లీల చిత్రాలు ఫేస్బుక్లో పోస్ట్
సాక్షి, రాయగడ: భార్య అశ్లీల చిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన భర్తని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన జిల్లాలోని గుణుపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. బలంగీర్ జిల్లాలోని టిట్లాగడ్ పరిధిలోని జగన్నాథపడ గ్రామానికి చెందిన గోవిందరావుకి తన భార్యకి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై అతడి భార్య గుణుపూర్ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త తనను వేధిస్తున్నాడని కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందిత భర్తని అరెస్ట్ చేసి, కోర్టుకి తరలించారు. చదవండి: (భార్య పుట్టింటికెళ్తే.. భర్త గోదావరిలో దూకి..) అరెస్టయిన గోవిందరావుతో పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు మళ్లీ తన భార్యని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తాళలేని ఆమె గుణుపూర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడితో ఆగని అతడు తన భార్య అశ్లీల చిత్రాలను, అవమానకరమైన వ్యాఖ్యలతో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై ఆవేదన చెందిన బాధితురాలు గుణుపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 12వ తేదీన ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. చదవండి: (పనిమనిషిపై మోజు... కటకటాలపాలు) -
కేకే.. రాయగడకే!
సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్ కొనసాగుతుందన్న ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయి. డివిజన్ విభజన దాదాపు ఖరారైంది. ఉద్యోగ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. రైల్వేబోర్డు మాత్రం విభజన దిశగా ఒక్కో అడుగు వేస్తూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. 126 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసి రాయగడ డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు తగిన విధివిధానాలు రూపొందించాలని రైల్వే బోర్డు గత నెలలో ఆదేశించడం.. ఆ మేరకు ఈస్ట్ కోస్ట్ జోన్ ఉన్నతాధికారులు నోడల్ అధికారిని నియమించడం తెలిసిందే. ఈ నెల 31 నాటికి దీనిపై నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు సరిహద్దులు దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. రాయగడకు బంగారు బాతు.. ఇప్పుడున్న తూర్పుకోస్తా జోన్‌కు వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం ఇచ్చే బంగారు బాతుగుడ్డు లాంటిది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పుకోస్తా జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజిన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజిన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతం కాబోతోంది. శివలింగపురం వరకు సరిహద్దు.. అధికార వర్గాల సమాచారం ప్రకారం విభజనకు సంబంధించి సరిహద్దు మ్యాపులు ఖరారయ్యాయి. పర్యాటక మణిహారంగా చెప్పుకునే అరకు లైన్ రాయగడ డివిజన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అరకు వరకు రాయగడ డివిజన్ సరిహద్దుగా.. దాని కంటే నాలుగు స్టేషన్లు ఆవల ఉన్న శివలింగాపురం ప్రాంతం విజయవాడ డివిజన్ సరిహద్దుగా నిర్ణయించారని తెలుస్తోంది. కిరండూల్, కొరాపుట్ ..ఇవన్నీ రాయగడ డివిజన్‌లోకి వెళ్లిపోతాయి. పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, నౌపడ జంక్షన్ వరకు విజయవాడ డివిజన్లో ఉంచినట్లు సమాచారం. ఇవే సరిహద్దులు ఖరారైతే అతి పెద్ద డివిజన్‌గా రాయగడ, అత్యల్ప ప్రాధాన్యమున్న డివిజన్‌గా విజయవాడ మిగిలిపోనున్నాయి. యూనియన్లపై ఉద్యోగుల మండిపాటు.. వాల్తేరు విభజన్ ఏర్పాట్లు ఒక్కొక్కటిగా పూర్తి అవుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. డివిజన్‌ను విభజిస్తే ఆదాయం కోల్పోవడమే కాకుండా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 126 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్లో 17,600 మందికి పైగా ఉద్యోగులు ఏ చిన్న పనికోసమైనా డివిజన్ కేంద్రమైన విజయవాడకు పరుగులు తీయాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్‌ను కొనసాగించాలని యూనియన్లు ఉద్యమాలు నిర్వహించినా.. ఉద్యోగులు మాత్రం యూనియన్లపై మండిపడుతున్నారు. దక్షిణ కోస్తా జోన్ ప్రకటన ఫిబ్రవరి 27న వచ్చినప్పుడే వాల్తేరు డివిజన్ విభజన చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడే యూనియన్లన్నీ ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే.. పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంపైనా, రైల్వే బోర్డుపైనా యూనియన్లతో పాటు రాజకీయ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వాల్తేరు డివిజన్‌ను కాపాడాలని కోరుతున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్, పలు రైళ్లు రద్దు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర సరిహద్దుల్లో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా దోయికళ్ళు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ ఒడిశాలో కురిసిన భారీవర్షాలతో వరద నీటికి పట్టాలు ధ్వంసం అవ్వడం వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పలు రైళ్ల రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఎనిమిది రైళ్లు రద్దు కాగా మరో ఐదు రైళ్లను దారిమళ్లిస్తూ అధికారులు ప్రకటించారు. రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. రద్దయిన రైళ్లు వివరాలు : 1) సంబల్పూర్- కొరపుట్ ప్యాసింజర్ 2) కొరపుట్-సంబల్పూర్ ప్యాసింజర్ 3) సంబల్పూర్-జనఘర్ రోడ్ ప్యాసింజర్ 4) జనఘర్-సంబల్పూర్ ప్యాసింజర్ 5)రాజఘన్పూర్-విశాఖ ప్యాసింజర్ 6)విశాఖ-రాజఘన్పూర్ ప్యాసింజర్ 7)సంబల్పూర్-రాయగడ ఎక్స్‌ప్రెస్ 8) రాయగడ-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన రైళ్ల వివరాలు : 1) పూరి _అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ 2)అహ్మదాబాద్ -పూరి ఎక్స్‌ప్రెస్ 3)బెంగళూరు-హతియా ఎక్స్‌ప్రెస్ 4) ధనబాద్-అలప్పి ఎక్స్‌ప్రెస్ 5) విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ వీటితోపాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. -
ఈ బంధం ఇంతేనా?!
శతాబ్దానికిపైగా మహోజ్వల చరిత్ర.. ఆదాయంలో బంగారు బాతు.. ఎన్నో ప్రతిష్టాత్మక వ్యవస్థలు.. ఇవన్నీ వాల్తేర్ రైల్వే డివిజన్ సొంతం. ఇప్పుడవన్నీ చరిత్రలో కలిసిపోక తప్పదా?.. వాల్తేర్ డివిజన్ ఉనికి ఇక చరిత్రగానే మిగిలిపోనుందా??.. విశాఖతో డివిజన్ బంధం తెగిపోక తప్పదా???.. రైల్వే బోర్డు నుంచి వస్తున్న ఆదేశాలు.. ఈ ప్రశ్నలన్నింటికీ అవననే సంకేతాలనే ఇస్తున్నాయి. వాల్తేర్ డివిజన్ విభజన తథ్యమని చెబుతున్నాయి. ఆంధ్రుల చిరకాల డిమాండ్, రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీ అయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో మొట్టిన చందంగా.. వాల్తేర్ డివిజన్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ డివిజన్‌ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో కలపడం.. మరో భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం.. వంటి దురదృష్టకర నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆగస్టు 31లోగా రాయగడ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నాన్ని స్థానికులు, ప్రజాసంఘాలతోపాటు రైల్వే యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. అదే ఉత్తర్వుల్లో కేంద్రం పెట్టిన మెలికతో నీరుగారిపోయింది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను అడ్డంగా విడదీసి ఒక భాగాన్ని కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విజయవాడ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌గా మార్చాలని నిర్ణయించడం ద్వారా వాల్తేర్ డివిజన్ ఉనికే లేకుండా చేస్తున్నారు. ఆగస్టు 31లోగా కొత్త డివిజన్ తూర్పు కోస్తా జోన్ పరిధిలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాల్తేరు డివిజన్ విభజన, కొత్త డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని రైల్వేబోర్డు నుంచి తూర్పు కోస్తా జోన్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు అందాయి. కొత్త డివిజన్ డీపీఆర్‌తోపాటు ఇతర వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్రసింగ్ ఆదేశించారు. వాల్తేరు డివిజన్ అధికారులు, దక్షిణ కోస్తా జోన్ ఓఎస్డీతో కొత్తగా నియమితులయ్యే నోడల్ అధికారిని సమన్వయం చేసుకుంటూ కొత్త డివిజన్‌కు రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఆగస్టు 31లోగా తమకు అందించాలని సూచించారు. ఈ పరిణామాలతో వాల్తేరు డివిజన్ విభజన ఖరారయినట్లే. సింహభాగం ఆదాయం వాల్తేరుదే.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులాంటిది. అతిపెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ.7 వేల కోట్లు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది తూర్పుకోస్తా ప్రధాన కేంద్రం భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. డివిజన్ ఆదాయంలో సింహభాగం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా ఇప్పుడు రాయగడ డివిజన్ సొంతమవుతుంది. ఉద్యోగులకూ తీవ్ర ఇబ్బందులు వాల్తేరు డివిజన్ ఉనికి కోల్పోతే దీని పరిధిలోని ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం డివిజన్లో 16,600 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు. డివిజన్‌ను విడదీసి అటో ముక్క.. ఇటో ముక్క కలిపేస్తే వీరికి డివిజన్ కేంద్రం ఉండది. జోనల్ హెడ్ క్వార్టర్స్‌తో పనీ ఉండదు. జీత భత్యాలు, అలవెన్సుల్లో తేడాలొచ్చినా, సెలవు పెట్టాలన్నా, ఇతర సమస్యలున్నా విజయవాడ డివిజన్‌కు పరుగులు తీయాల్సిందే. ఇక రాయగడ డివిజన్‌కు కేటాయించే ఉద్యోగులు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉద్యోగులకు ఇబ్బందికరమైన పరి ణామాలేనని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్‌తో పాటు వివిధ యూనియన్లు.. వాల్తేర్ డివి జన్ను కొనసాగించాలంటూ ఉద్యమాలు నిర్వహించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. డివిజన్ కొనసాగించాల్సిందే శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఉనికి లేకుండా విడదీయాలనుకోవడం సరికాదు. దీనివల్ల ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు భారతీయ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తాం. ప్రజలు, అన్ని యూనియన్లు, వివిధ ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – డా. పెదిరెడ్ల రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఇది సరైన నిర్ణయం కాదు వాల్తేరు డివిజన్ రద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. జోన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి.. ఆ సాకుతో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరును విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనిపై మరోసారి ఉద్యమాన్ని ఉధ్ధృతం చేస్తున్నాం. డివిజన్ విభజనను వ్యతిరేకిస్తూ.. బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. – బమ్మిడి దామోదరరావు, కార్యదర్శి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ -
రాయగడ పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి
సాక్షి, రాయగడ(శ్రీకాకుళం) : పట్టణంలోని సహిద్ లక్ష్మణ్‌నాయక్ విగ్రహం వద్ద హరిజనులు, గిరిజనులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇదే విషయంపై ఆయా వర్గాలు ఒకరిపై మరొకరు రాయగడ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసుకున్నాయి. ఇదే విషయంపై స్పందించిన ఎస్పీ శరవన్ వివేక్ ఇరువర్గాలను విచారించి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే ఆ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత అప్పలస్వామి కడ్రక, తన మద్దతుదారులతో కలిసి, పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఇదే సమయంలో మోటారు సైకిళ్లతో స్టేషన్‌కు వచ్చిన హరిజన యువకులు, మహిళలు పోలీస్‌స్టేషన్‌పై రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ఎస్పీ కారు అద్దాలు ధ్వంసం కాగా, పోలీస్‌స్టేషన్ కాస్త మరమ్మతులకు గురైంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఆ పరిస్థితులను నిలువరించేందుకు ఆందోళనకారులపై లాఠీచార్జికి దిగి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు మాట్లాడుతూ ఉమేషహీయల్ అనే యువకుడిపై అప్పలస్వామి కడ్రక మద్దతుదారులు దాడి చేశారని, తీవ్రగాయాలతో వచ్చి, ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు చేపట్టలేదని వాపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అప్పలస్వామి కడ్రకకు గిరిజనులు, కాంగ్రెస్ రెబల్‌గా బరిలో దిగిన మకరంద ముదిలికి హరిజనులు మద్దతుపలికారు. ఇదే విషయమై ఆ ఇరువర్గాలు ఎన్నికల అనంతరం పలుమార్లు దాడులకు దిగినట్లు స్థానిక సమాచారం. -
ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు?
సాక్షి, రాయగడ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్ మకాం వేసినట్లు సమాచారంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కొరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటుబ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల కిట్‌లో కీలక సమాచారం లభించడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల్లో జవాన్ల కూంబింగ్ ఉద్ధృతంగా సాగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మన్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో త్రిలోచనపూర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్‌గా మావోయిస్టులు మందుపాతర పేల్చగా...జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. దీంతో కల్యాణ సింగుపురం ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ నాల్గవ బెటాలియన్, ముకుందపుర్ సీఆర్పీఎఫ్ బెటాలియన్ హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని భారీగా కూంబింగ్ చేపట్టారు. కాగా ఈ నెల 10వ తేదీన మల్కన్‌గిరి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన ల్యాండ్‌మైన్ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖకు తరలించారు. -
డ్రైవర్ నిద్రమత్తు.. ఘోర రోడ్డు ప్రమాదం
భువనేశ్వర్: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కలహండీ నుంచి భువనేశ్వరం వెళ్లే జగన్నాథ ప్రైవేటు బస్సు అదుపుతప్పి భారీ చెట్టును ఢీకొట్టింది. రాయగడ జిల్లా సరిహద్దు ప్రాంతం అయిన కలహండీ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బస్సు మొత్తం నుజ్జునుజ్జు అయింది. ఈ దారుణ సంఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 30 మందికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, ఆ రోడ్డులో వెళుతున్న ప్రయాణికులు వెళ్లి క్షతగాత్రులకు సపరియలు చేసి, పలువురికి ఆస్పత్రికి తరలించారు. కాగా, డ్రైవర్ బస్సు స్పీడుగా నడుపుతూ నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలహండీ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాయగడ చేరిన వాజ్‌పేయి చితాభస్మం కలశం
రాయగడ : దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చితాభస్మం కలశం సోమవారం రాయగడకు చేరుకుంది. ప్రజల సందర్శనార్థమై రాయగడ టౌన్హాల్లో దీనిని ఉంచారు. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యుడు పూర్ణచంద్ర మజ్జి మాట్లాడుతూ జిల్లాలోని కాశీపూర్, టికిరి ప్రాంతాలతో సహా కల్యాణ సింగుపురం, తేరువలి, బిసంకటక్, మునిగుడ, అంబొదల, రామన్నగుడ, పద్మపూర్, గుడారి, ప్రాంతాల్లో వాజ్‌పేయి చితాభస్మ కలశం ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఈ నెల 29వ తేదీన జిల్లాలోని వంశధార నదీ తీరంలో నిమజ్జనం చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు కాశీరాం మజ్జి, రజిత్ మదల, శ్రీపాల్ జైన్, ఎం.రామారావు, భాస్కర పండా, సుమంత మహరణ, తిలక్ చౌదరి, వసంత ఉల్క, చిత్త ప్రధాన్, జోగేశ్వర్ చౌదరి, గౌరి ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా ఇసుక రవాణా
రాయగడ : జిల్లాలోని కల్యాణసింగుపురం పట్టణ పరిధిలోని లెల్లిగుమ్మ రైల్వేస్టేషన్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రసుతం జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. కోట్లాది రూపాయాలు విలువ చేసే ఇసుకను అనేక బస్తాలలో నింపి, గూడ్స్ రైలులో తరలిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైల్వే అధికారుల అండతోనే దుండగులు ఇసుకమాఫియాకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో పాటు రాజకీయ నేతల అండదండలు కూడా తోడవ్వడంతో అక్రమదారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. కల్యాణసింగుపురం పరధిలోని నాగావళి నది, ఇతర చిన్న నదుల నుంచి పొక్లెయిన్ల సహాయంతో పెద్ద ఎత్తున ఇసుకను అక్రమదారులు తరలించడం విశేషం. స్థానిక తహసీల్దార్ అనుమతి లేకుండా ఇసుక తరలించడం చట్ట రీత్యా నేరమని తెలిసినా అక్రమదారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే విషయమై జిల్లా అధికారులకు, స్థానిక తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు సార్లు కల్యాణసింగుపురం తహసీల్దార్ అక్రమార్కులపై దాడులు చేసి, వేల సంఖ్యలో ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో దోపిడీదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. నాగావళి నది నుంచి భారీ స్థాయిలో ఇసుకను తరలించడంతో నాగావళి నది వరదలకు గురవుతోందని నదీ పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. దీంతో కల్యాణసింగుపురం పట్టణంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
భారీ వర్షాలు : నీటిలో చిక్కుకున్న రైలు
సాక్షి, విజయనగరం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రా, ఓడిశా సరిహద్దుల్లో రహదారులకు సమాంతరంగా నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయఘడ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి భువనేశ్వర్ నుంచి వెళ్లుతున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైకి భారీగా వరద నీరు చేరింది. రైలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగిపురం, టికిరి స్టేషన్ల మధ్య మరో ట్రైన్, ఇంటర్సిటీ చిక్కుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూలిన వంతెన ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయగడ జిల్లా సులిపోదర గ్రామంలో గోడ కూలి భార్య భర్త మృతి చెందారు. మరో వైపు రాయఘడ జిల్లా జిమిడిపేట వద్ద వరద ఉధృతికి వంతెన కూలిపోయింది. భారీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. పలుచోట్ల రైలు పట్టాల మీదుగా మూడు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. బోల్తా పడ్డ పడవ భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళిలో గల ఉమిలాడ బీచ్‌లో వేటకు వెళ్లిన పడవ బోల్తాపడింది. వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. దీంతో సహాయక చర్యలు చేట్టిన ఉమిలాడ గ్రామస్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు మత్స్యకారులు కాపాడారు. వారిని వెంటనే నరసన్న పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. పడవ బోల్తాపై ముఖ్యమంత్రి ఆరా శ్రీకాకుళంలో పడవ బోల్తా సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గల్లంతైన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తుఫానులు వస్తున్న సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండ అప్రమత్తం చేయాలని సూచించారు. ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగవళి నది పొంగిపొర్లుతోంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం ఐటిడిఏ హెల్స్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎదైనా సహాయం, సమాచారం కోసం 08963221152 హెల్స్ లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
భారీ వర్షాలు : కూలిన వంతెన
-
డెంగీ బెంగ
రాయగడ : వర్షాకాలం ప్రారంభంలోనే డెంగీ జ్వరం ప్రభావం ఉండవచ్చన్న ముందస్తు ఆలోచనతో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ గ్రామీణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆశకార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లకు జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య విభాగం ఆదేశాలు జారీ చేశాయి. ఇటీవల డెంగీ దినోత్సవాన్ని నిర్వహించి మరిన్ని సూచనలు ఇస్తూ డెంగీ జ్వరానికి మందులు లేవని పరిసరాల శుభ్రతతో సహా ఇళ్లలో వేపాకు పొగ వేస్తూ ఇంట్లో మంచినీటి నిలువలు ఉండకుండా ప్రజలు దొమతెరల్లో నిద్రించాలని సూచించారు. అయితే రాయగడ జిల్లా ఆస్పత్రికి 7కిలోమీటర్ల దూరంలో గల కొత్తపేట గ్రామపంచాయతీ వీరనారాయణపురం గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధ పడుతున్న సమాచారంతో జిల్లా వైద్యబృందం గ్రామానికి వెళ్లి 13మంది రక్తనామూనాలు సేకరించి కొరాపుట్ రక్తపరీక్ష కేంద్రానికి పంపగా ఆ నమూనాల్లో ఏడుగురు వ్యక్తులకు డెంగీ జ్వరం సోకినట్టు వైద్య పరీక్షలో తేలింది. గ్రామంలో పారిశుద్ధ్య లోపం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో గొట్టపు బావుల ప్రాంతంలో బురద పేరుకుపోయి, కాలువల్లో టన్నుల కొద్దీ పూడికలు నిండిపోవడంతో జిల్లాలో మొట్టమొదటిసారిగా డెంగీ వ్యాధి బయటపడింది. పంచా యతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమాలు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు సరిగా చేయకపోవడం, పంచాయతీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా డెంగీ విజృంభించింది. గ్రామంలో సక్రమంగా దోమతెరలు వినియోగించక పోవడం, కాలువలు, గొట్టపు బావులు, ఇళ్ల దగ్గర నీటి నిలువలు నిలిచిపోవడంతో దోమలు విస్తరించి గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామ సమీప జీమిడిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ జ్వరం సోకిన పవిత్ర కడ్రక మగవాడు(7) రంజిత తాడింగి(20) అర్జుమహనందియా(15) మధుబాయిసారక (23) కుమారిసారక(17)తదితరులు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇంకా జ్వరపీడితులు అధికంగా ఉన్నారు. -
చివరిరోజు ఉద్రిక్తత
రాయగడ : గ్రామదేవత ఉత్సవాల చివరి రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూజారులు, ఆలయ కమిటీ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. గత నెల 28 నుంచి ఈ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ముగింపు రోజైన బుధవారం.. రాయగడ పట్టణంలో 2వేల కుటుంబాలకు పైబడి ఘటాలు తీసుకురాగా, మజ్జిగౌరి అమ్మవారి ఘటం అంపకం ఉదయం 6గంటల సమయంలో నిర్వహించారు. 3 వేల మంది పైగా గ్రామప్రజలు పథిఘటాలతో భారీ ఉరేగింపు, బాణసంచా కాల్పులతో అంపక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. మజ్జిగౌరి ఘటాన్ని ఎజ్జిరాలు సుశీల తీసుకువెళ్లారు. తదుపరి గ్రామదేవత బురదలపోలమ్మ ఘటాన్ని ఉదయం 8 గంటల మధ్య అంపకం చేయాల్సి ఉంది. మజ్జిగౌరి ఘటన్ని తెల్లవారుజామున 4గంటలకు మందిరానికి చేర్చలేదనే కారణంతో పూజారులు, పూజా కమిటీ మధ్య వివాదం నెలకొంది. ఇదే సమయంలో బురదలపోలమ్మ భక్తులను దృష్టిలో ఉంచుకోకుండా అమ్మవారి అంపకం మల్లేలు తొక్కే పూజను నిర్వహించేందుకు పూజారులు ఇబ్బంది కలిగించడంతో వేరే పూజారిని కమిటీ తీసుకురావాల్సి వచ్చింది. ఈ సమయంలో మజ్జిగౌరి మందిర పూజారులు బురదలపోలమ్మ మందిరానికి వచ్చే ప్రయత్నంలో పూజా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సంతోష్, రమేష్ అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. 11 గంటల సమయంలో వేరే పూజారుల ద్వారా మల్లేలు తొక్కేందుకు పూజలు నిర్వహించారు. అనంతరం బురదలపోలమ్మ ఘటాన్ని బల్లమండ పూజారి వేరే ఎజ్జురాలితో ముందుగా ఊయలకంబాలా వేయించి తదుపరి అంజలిరథం వేయించి పిదప మల్లేలు తొక్కే కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో 5వేల మంది భక్తులు ఘటాలతో వేచి ఉండడంతో చాలా మంది మహిళలు సృహతప్పి పడిపోయారు. పట్టణంలో అనేక సంస్థలు మజ్జిగ, రస్నా, పులిహోర, చల్లని నీటి పౌచ్‌లు, ఐస్‌క్రీమ్‌లు, గ్లూకోజ్ పానీయాలు, తాగునీరు అందజేశారు. అయినా భారీ సంఖ్యలో ప్రజలు సృహతప్పి పడిపొయారు. అమ్మవారి అంపకం ముందు రోజు రాత్రి ఊరుకట్టుట, రాజు, రాణితో విత్తనం పూజ వంటి కార్యక్రామలు రాత్రి 3గంటల వరకు నిర్వహించారు. ఒడిశాలో గంజాం అమ్మవారి పండుగ తర్వాత రాయగడ అమ్మవారి పండుగ అతి పెద్దది. పూజా కమిటీ ముందస్తుగా జిల్లా అధికారులు, పోలీసులకు తెలియజేసినప్పటికీ ఆఖరిరోజైన అమ్మవారి అంపకం సమయంలో కనీసం పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. ప్రధాన రహదారిలో 5 గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో అంపకానికి వచ్చే భక్తులు కార్లు, ఇష్టారాజ్యంగా రహదారిపైనే వదిలేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కనీసం ప్రజలు నడిచేందుకు కూడా దారి లేకుండా పోయింది. తెల్లవారు 4 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి అంపక కార్యక్రమాలు జరుపుకోగా.. మజ్జిగౌరి మందిర ప్రాంగణం, బురదలపోలమ్మ ప్రాంగణం, కోళ్లు, మేకలు, మొక్కుబడులు కారణంగా రక్తసిక్తం అయి కనిపించిది. -
రాయగడ టు ఢిల్లీ
రాయగడ : రాయగడ జిల్లాలోని కాశీపూర్, కల్యాణసింగుపురం, బిసంకటక్, మునిగుడ, ప్రాంతంలో విదేశీ ఎగుమతికి సంబంధించిన ఉన్నత రకాల మామిడి పంటను ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం సహకారంతో ఢిల్లీలోని మదర్‌డైరీకి ఆదివారం పంపించారు. రాయగడ రైల్వేస్టేషన్ నుంచి మామిడిపండ్ల మొదటి ఎగుమతిని డీఆర్డీఏ పీడీ సుఖాంత్ త్రిపాఠి రైల్వే వ్యాగన్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో మామిడి రైతులకు నేరుగా వారి ఖాతాలో మామి డి మద్దతుధర లభించే విధంగా గత సంవత్సరం నుంచి జిల్లా యంత్రాంగం మామిడి ఎగుమతిని చేపట్టింది. గత సంవత్సరం మామిడి రైతులు దళారుల బెడద లేకుండా నేరుగా మంచి లాభా లను ఆర్జించారు. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో మామిడి ఎగుమతి ప్రారంభం కాగా మొదటిరోజు 288కార్టన్ల(4.5 టన్నులు) మామిడి పండ్లు ఎగుమతి చేయగా ఢిల్లీలో కేజీ మామిడిపండ్లు రూ.50 నుంచి రూ.67 వరకు ధర పలుకుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరు కావలసి ఉండగా ఇతర కారణాల వల్ల రాలేకపోవడంతో ఆమెకు బదులుగా డీఆర్డీఏ పీడీ హాజరయ్యారు. మామిడి సీజన్ పూర్తయినంత వరకు రాయగడ నుంచి మామిడి ఎగుమతి జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. -
సీనియర్ సైంటిస్టు మృతి
రాయగడ : రాయగడకు 26కిలోమీటర్ల దూరంలో గల తేరువలి పంచాయతీలో ఇండియన్ మెటల్స్, ఫెర్రోఎల్లాయీస్ (ఇంఫా), చౌద్వార్‌లో విద్యుత్ పరిశ్రమ వ్యవస్థాపకుడు, భారత సీనియర్ సైంటిస్టు అయిన వంశీధరపండా మంగళవారం మృతి చెందారు. వంశీధర్‌పండా భువనేశ్వర్‌లోని చంద్రశేఖర్ పూర్ ప్రాంతంలో ఉంటున్నారు. 1962లో రాయగడ వంటి ఆదివాసీ జిల్లాలో జిల్లా అభివృద్ధి, దేశ ఆర్థికాభివృద్ధి, వెనుకబడిన ప్రాంతంలో విద్యాభివృద్ధి, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తేరువలి ప్రాంతంలో ఇంఫా పరిశ్రమను ఏర్పాటు చేశారు. తదుపరి చౌద్వార్‌లో విభిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి దేశ ప్రగతికి కృషి చేసిన సైంటిస్టులలో వంశీధర్‌పండా ప్రథమ వ్యక్తి. నేటి బీజేడీ నుంచి బయటకు వచ్చిన ఎంపీ వైజయంతిపండా తండ్రి వంశీధరపండా. 1931లో జన్మించిన వంశీధరపండా చిన్నతనం నుంచి విద్యలో గోల్డ్‌మెడలిస్టు. విదేశాలలో చదువుకున్న వంశీధరపండా దేశానికి వచ్చి రాయగడ జిల్లాలోని తేరువలి ప్రాంతంలో ఇంఫా పరిశ్రమను ప్రారంభించారు. ఇంఫా పరిశ్రమపై ఆధారపడి 3వేల మంది పైబడి ఉన్నారు. సుమారు 10గ్రామ పంచాయతీలు ఇంఫా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వంశీధర పండా హఠాత్తుగా మృతి చెందడంతో ఇంఫా కుటుంబంతో సహా జిల్లా, రాష్ట్ర ప్రజలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. -
మహిమ పేరిట మోసం
రాయగడ : మహిమ గల హనుమాన్ నాణెం పేరున మోసం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన టి.రంగారావు అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుని మోసగించిన కేసుకు సంబంధించి రాయగడకు చెంది, ప్రస్తుతం భువనేశ్వర్‌లో సెక్యూరిటీ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రోహిత్‌మాలిక్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయగడ ఐఐసీ ఆర్.కె.పాత్రో, ఏఎస్సై అశోక్ కుమార్ సాహు నేతృత్వంలో గురువారం సాయంత్రం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ఎస్సై ఆస్తులను కూడా సోదా చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 1818వ సంవత్సరం నాటి హనుమాన్ రాగినాణెం అత్యంత మహిమ గలదని నమ్మబలికి విశాఖపట్టణానికి చెందిన టి.రంగారావు నుంచి ముడుసార్లు రూ.5,40,000 తీసుకున్నట్లు రాయగడ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుకు సంబంధించి సూత్రధారి అజిత్‌బాత్రా పరారీలో ఉండగా ప్రధాన నిందితుడైన ఎస్సై రోహిత్ మాలిక్, రాయగడ ఇందిరానగర్‌కు చెందిన టి.ఉమాశంకర్, కల్యాణసింగుపురానికి చెందిన ఆర్.ప్రసాదరావు, ధవలేశ్వరబాగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను కోర్టులో హజరు పరిచారు. నిందితుల బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించడంతో వారిని సబ్‌జైలుకు తరలించారు. -
ఆహుతైన యువతి
రాయగడ : రాయగడ జిల్లా మునిగుడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హటొమునిగుడ గ్రామానికి చెందిన సుస్మితమహనందియా(17) అనే యువతి గ్రామానికి దగ్గరలోని బురిజిగుడ అడవిలో సగం కాలిపోయి పడి ఉంది. సగం కాలి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. హటొమునిగుడకు చెందిన సుస్మిత మహనందియా ఈనెల 24వతేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గాలిస్తున్న పోలీసులకు బురిజిగుడ అడవి ప్రాంతంలో కాలిపోయి పడి ఉన్న సుస్మిత మృతదేహం కనిపించింది. ఆమె సగం కాలిపోయి మృతిచెంది శరీరం కుళ్లిపోయి ఉంది. పోలీసులు వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారంతా సంఘటనా స్థలానికి వచ్చి భోరున రోదించారు. సుస్మితమహనందియాకు ఎటువంటి ప్రేమ, ఇతర వ్యవహారాలు లేకపోయినప్పటికీ ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. గుర్తుతెలియని దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసి కాల్చివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? కుటుంబసభ్యులు ఎవరైనా ఈ పని చేశారా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. -
ఒడిశాలో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి
భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాయగడ అటవీప్రాంతంలో కల్యాణ్సింగ్పూర్ గ్రామంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రత సిబ్బంది పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.