recycle
-
భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడే విభాగం..!
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్‌లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం పెరుగుతోంది.ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి, బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు, ఈ బ్యాటరీలను వాడిన తర్వాత భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలు. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్‌లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్‌ను స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్‌లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. -
ఫ్యాషన్ ట్రెండ్స్: పాత బట్టలను కొత్తగా మార్చేయొచ్చు..
కొత్తగా మెరిసిపోవాలంటే కొత్త డ్రెస్సులు వేసుకోవాల్సిందేనా! ట్రెండ్‌కు తగినట్టు ఉండాలంటే మార్కెట్లో రెడీమేడ్‌గా ఉండే వాటిని కొనుగోలు చేయాల్సిందేనా! ఈ మాటలకు కాలం చెల్లిపోయేలా వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు నేటి మహిళలు. పర్యావరణ అనుకూలంగా ఫ్యాషన్‌లోనూ మార్పులు చేసుకుంటున్నారు. అప్‌సైక్లింగ్ పేరుతో పాత డ్రెస్సులను, చీరలను కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఈ యేడాది వచ్చిన ఈ మార్పు రాబోయే రోజులను మరింత పర్యావరణ హితంగా మార్చేయనున్నారు అనేది ఫ్యాషన్ డిజైనర్ల మాట. పాత వాటిని కొత్తగా మెరిపించడంలో ఖర్చు కూడా తగ్గుతుంది. పర్యావరణంపై కార్బన్ ఉద్గారాల ప్రభావమూ తగ్గుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన దగ్గర ఉన్న డ్రెస్సులనే కొత్తగా మార్చేయవచ్చు. చిన్నపాటి సృజనతో డ్రెస్సింగ్‌లో మెరుగైన మార్పులు తీసుకురావచ్చు. డెనిమ్.. ప్యాచ్ పాతవి అనే పేరే గానీ చాలామంది ఇళ్లలో పక్కన పెట్టేసిన డెనిమ్ జాకెట్స్, ప్యాంట్స్, కుర్తాలు.. ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించుకోవాలంటే రకరకాల మోడల్స్‌ని తయారు చేసుకోవచ్చు. ప్యాచ్‌వర్క్‌తో రీ డిజైనింగ్ చేసి ఓవర్‌కోట్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్ చేసుకోవచ్చు. శారీ ఖఫ్తాన్ కుర్తాల మీదకు సిల్క్ ష్రగ్స్ లేదా లాంగ్ ఓవర్ కోట్స్ వాడటం ఇండోవెస్ట్రన్ స్టైల్. పాత సిల్క్ లేదా కాటన్ చీరలను కూడా లాంగ్ కోట్స్‌కి ఉపయోగించ వచ్చు. అలాగే, ఖఫ్తాన్ డిజైన్స్‌కి కూడా శారీస్‌ను వాడచ్చు. పర్యావరణ అనుకూలం ఆర్గానిక్ కాటన్స్, వీగన్ క్లాత్స్.. స్లో ఫ్యాషన్ కిందకు వస్తాయి. వీటితో చేసే డిజైన్స్‌లో ప్రత్యేకంగా మెరిసిపోవడమే కాదు పర్యావరణ ప్రేమికులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మన దగ్గర ఉన్న పాత బట్టలను ఎలా తీసేయాలా అనుకునేవారు కొందరు, అవసరమైన వారికి తక్కువ ధరకు అమ్ముదాం అనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాంటివాళ్లకోసం కొన్ని వెబ్స్టోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్స్ అమ్మకందారుల దగ్గర నుంచి దుస్తులు సేకరించి కావల్సిన వారికి అందజేసే మాధ్యమంగా పనిచేస్తున్నాయి. -
అపశకునం కాదు, దేవుడి విగ్రహాలతో రీసైక్లింగ్
ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తాం. ఇంట్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఫొటో ఫ్రేములు జారిపడినా, పక్కకు ఒరిగిపోయినా అపశకునంగా భావిస్తారు. అందుకే మరింత శ్రద్ధగా పూజ చేయడంతో పాటు, పూజాసామగ్రిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు విగ్రహాలు పాతబడి విరిగిపోవడం, ఫొటో ఫ్రేములు చిరిగిపోవడం లేదా తుప్పు పట్టి పాడైపోవడం జరుగుతుంటుంది. అలాంటి వాటిని వెంటనే తీసేసి కొత్తవాటిని పూజలో పెట్టుకుంటారు. మనలో చాలామంది ఇలానే పడేస్తుంటాము. తృప్తిౖ గెక్వాడ్ మాత్రం ఈ విగ్రహాలను పడేయకుండా.. రీ సైకిల్ చేసి రకరకాల వస్తువులను తయారు చేస్తోంది. చెత్తగా మారకుండా... సరికొత్త హంగులు అద్ది అందంగా మారుస్తోంది. మహారాష్ట్రలోని యోవలాలో పుట్టిపెరిగిన తృప్తి గైక్వాడ్ వృత్తిపరంగా నాసిక్‌లో స్థిరపడింది. న్యాయవాదిగా క్షణం తీరికలేని పని తనది. అయితే తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే విషయాలను ఎంతో ఆసక్తిగా గమనించే మనస్తత్వం కావడం వల్ల 2019లో ఓసారామె గంగానదిని చూడడానికి వెళ్లింది. అప్పుడు గంగానదిని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇదే సమయంలో ... విరిగిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు, ఫ్రేములు తీసుకుని నదిలో వేయడానికి వచ్చాడు ఒకతను. అతన్ని చూసిన తృప్తి..‘‘వీటిని నదిలో వేయకు. వీటిలో ఉన్న పేపర్, కార్డ్బోర్డ్, మట్టిబొమ్మలు నదిని మరింత కలుషితం చేస్తాయి’’ అని చెప్పి అతను వాటిని నదిలో వేయకుండా వారించింది. అందుకు ఆ వ్యక్తి ఇక్కడ వేయవద్దు.. సరే వీటిని ఏం చేయాలి?’’ అంటూ చికాకు పడ్డాడు. అప్పటికేదో సమాధానం చెప్పి అతణ్ణి పంపింది కానీ తృప్తి మనసులో కూడా ‘అవును వీటిని ఏం చేయాలి?’ అన్న ఆలోచన మొదలైంది. కొద్దిరోజులు తర్వాత వీటిని రీ సైకిలింగ్ చేసి ఇతర వస్తువులు తయారు చేయవచ్చన్న ఆలోచన తట్టింది తనకు. తన ఐడియాను కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగుతో పంచుకుంది. అంతా ప్రోత్సహించేసరికి .. పాత దేవతామూర్తుల విగ్రహాలు రీసైకిల్ చేయడం ప్రారంభించింది. సంపూర్తిగా... విగ్రహాలను రీసైక్లింగ్ చేసేందుకు‘సంపూర్ణమ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. సంపూర్ణమ్ టీమ్ దేవతామూర్తుల పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేములను గుళ్లు, చెట్లకింద పడి ఉన్న వాటిని, ఇళ్లనుంచి సేకరిస్తుంది. ఈ విగ్రహాలను పూర్తిగా పొడిచేసి మొక్కలకు ఎరువులా మారుస్తారు. ఎరువుగా పనికిరాని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలిసిన మట్టిని కుండలు, పాత్రలు, ఇటుక రాళ్లుగా తయారు చేస్తారు. వీటితో పక్షులు, జంతువులకు గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా తయారైన పాత్రల్లో పక్షులు, జంతువులకు ఆహారం, తాగునీటిని అందిస్తున్నారు. సంపూర్ణమ్ సేవలను మహారాష్ట్రలోని పూనే, నాసిక్, ముంబై, సోలాపూర్, సంగమ్నేర్లకు విస్తరించింది తృప్తి. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో సైతం సేవలను ప్రారంభించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ఈ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఆకర్షణీయమైన టాయిస్.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలిసిన విగ్రహాలను పొడిగా మార్చి, ఈ పొడికి కొద్దిగా సిమెంట్‌ను కలిపి టాయిస్‌ను రూపొందిస్తున్నారు. మురికి వాడల్లోని నిరుపేద పిల్లల ద్వారా పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేమ్లనూ సేకరిస్తూ వారికి ఆర్థికంగా సాయపడుతోంది. ‘‘దేవతల విగ్రహాల ఫొటోఫ్రేములను చక్కగా అలంకరించి నిష్ఠగా పూజిస్తారు. ఇటువంటి ఫ్రేములు పాడైతే పడేయాల్సిందే. ఇది నచ్చకే సంపూర్ణమ్ను తీసుకొచ్చాను. దేవుడి విగ్రహాలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసిన తరువాతే రీసైక్లింగ్ చేస్తున్నాను. వాట్సాప్, ఫేస్బుక్లో చాలామంది కస్టమర్లు నన్ను సంప్రదిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా వేల సంఖ్యలో రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడాను. అదేవిధంగా దేవుడి పటాలకు మంచి రూపాన్ని ఇవ్వడం ఎంతో తృప్తినిస్తోంది’’. – తృప్తి గైక్వాడ్ -
వేస్ట్ పేపర్‌తో వావ్ అనిపించే బొమ్మలు!!..చిత్తుకాగితానికి కొత్తరంగు
న్యూస్‌పేపర్ జీవితకాలం ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు పేపర్‌కున్న విలువ మరుసటి రోజుకు ఉండదు. ఏరోజుకు ఆరోజు కొత్తపేపర్ కావాల్సిందే. అందుకే నిన్నటి పేపర్ చిత్తుకాగితంగా మారిపోతుంది. ఇలా టన్నులకొద్దీ పేపర్ భూమిలో కలిసిపోవడం నచ్చని సిమ్రాన్.. కాగితాలతో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తోంది. వేస్ట్ పేపర్‌ను వావ్ అనేలా తీర్చిదిద్దుతోంది. ప్రయాగ్ రాజ్‌కు చెందిన ఇరవైఎనిమిదేళ్ల సిమ్రాన్ కేసర్వాణికి చిన్నప్పటి నుంచి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడమంటే చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సాంప్రదాయ క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తుండేది. ఫ్యాషన్ డిగ్రీ పూర్తయ్యాక, ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. తనతోటివారిలా కార్పొరేట్ రంగంలో అడుగుపెట్టాలనుకోలేదు. తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్ తయారీనే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా సృజనాత్మకంగా చేయాలని ఆలోచిస్తోన్న సిమ్రాన్‌కు.. చిన్నతనంలో చేసిన ‘టోఫీ బాక్స్’ గుర్తుకువచ్చింది. సిమ్రాన్ పుట్టినరోజుకి టోపీ బాక్స్‌లు తయారు చేసి పంచింది. ఆ బాక్స్‌లు చూసిన వారంతా సిమ్రాన్ ప్రతిభను చూసి తెగ మెచ్చుకున్నారు. దీంతో ‘పేపర్మఛే క్రాఫ్ట్స్’ తయారు చేయడం ప్రారంభించింది. పేపర్‌ను పేస్టుచేసి.. పురాతన కాలం నుంచి మఛే క్రాఫ్ట్స్‌కు మంచి గుర్తింపు ఉంది. పేపర్‌ను నానబెట్టి, తరువాత పేస్టులా నూరి వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. దీనినే పేపర్ మఛే క్రాఫ్ట్స్ అంటారు. ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవన్న భరోసాతో సిమ్రాన్ వీటిని ఎంచుకుంది. కస్టమర్ల దృష్టిని ఆకర్షించే విధంగా వివిధ ఆకారాల్లో ఈ క్రాఫ్ట్స్ తయారు చేయడం మొదలు పెట్టింది సిమ్రాన్. పేపర్ వెయిట్స్, ఫోల్డర్స్, చెరియాళ్ మాస్క్‌లు, ఆకర్షణీయమైన వివిధరకాల ఇంటి అలంకరణ వస్తువులను తయారు చేస్తోంది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా అందంగా తయారు చేసేందుకు స్థానిక కళాకారుల వద్ద మెళకువలు నేర్చుకుంటోంది. అడ్డంకులు అధిగమించి... ‘‘పేపర్ మఛే క్రాఫ్ట్స్ తయారీ సర్టిఫైడ్ జాబ్ కాదు. దీనికి పెద్ద గుర్తింపు ఉండదు. నువ్వు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ చదువు’’ అని తల్లిదండ్రులు ఎంతగా హెచ్చరించినప్పటికీ తనని తాను నిరూపించుకోవాలన్న కసితో క్రాఫ్ట్స్ తయారీని ప్రారంభించింది సిమ్రాన్. అయితే సాంప్రదాయ కళాకృతుల గురించి అవగాహన తక్కువ ఉండడం, మార్కెట్ కొత్త కావడంతో సిమ్రాన్‌కు అనేక సమస్యలు ఎదురయ్యాయి. తనకెదురయ్యే ప్రతి వాళ్ల నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ.. సోషల్ మీడియా స్కిల్స్‌తో తన ఉత్పత్తులకు మార్కెట్ చేస్తోంది. వివిధరకాల ఎగ్జిబిషన్లలో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను ప్రదర్శిస్తూ కస్టమర్లకు సరికొత్త అలంకరణ వస్తువులను పరిచయం చేస్తోంది. మద్దారీ మీటర్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మఛే క్రాఫ్ట్స్‌ను విక్రయిస్తోంది సిమ్రాన్. -
వ్యర్థం.. మరొకరికి ఉపయోగం
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ప్రతీ శనివారం ‘పునరాలోచన దినం’ పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం. నిర్ణయించింది. ఈమేరకు అన్ని పురపాలికలకు తాజాగా ఆదేశాలందాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు పాతవస్తువులను సేకరించి అవసరమైన వారికి ఉచితంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పేరుకు పోతున్న చెత్తాచెదారం తొలగించడంతోపాటు, ఇళ్లల్లో నిరుపయోగంగా ఉంటున్న వస్తువులను సేకరించి స్వచ్ఛతను సాధించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్ఆర్ఆర్ పేరుతో ప్రజల్లోకి వెళ్లి పాత దుస్తులు, పుస్తకాలు సేకరించి ఆర్ఆర్ఆర్ కేంద్రాల్లో భద్రపరుస్తారు. ఈమేరకు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్(ఆర్ఆర్ఆర్) పేరిట కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గతనెల 15వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు 20 రోజులపాటు అధికారులు వార్డుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరొకరికి ఉపయోగం ప్రజల నుంచి వీలైనంత వరకు చెత్తను సేకరించేలా పలు కార్యక్రమాలు చేపడుతుండగా, సేకరించిన పనికిరాని వస్తువులను, వాడని పాత వస్తువులను అవసరమైన వారు వినియోగించుకునేలా ప్రతీ మున్సిపాలిటీలో ఆర్ఆర్ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా స్వచ్ఛత అవార్డుల్లో పోటీ పడేందుకు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల మెప్మా సిబ్బంది, మున్సిపల్ అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతీ శనివారం రీథింక్ డే(పునరాలోచన దినం)గా పాటించాలని నిర్ణయించారు. ఇలా సేకరించిన వస్తువులను నిర్వాహకులు పేదలకు పంపిణీ చేస్తారు. సేకరించిన వస్తువుల వివరాలను సేకరించిన వారి చిరునామాను కేంద్రంలోని (తగ్గింపు) దస్త్రాల్లో నమోదు చేస్తారు. చిత్తుకాగితాలు ఉంటే వాటిని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. స్వయం సహాయక సంఘాల కీలకపాత్ర ఆర్ఆర్ఆర్ కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయిదారు వార్డులకు కలిపి ఒక చోట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో 10 మంది సభ్యులున్నారు. వారు ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, వార్డు కమిటీలు భాగస్వామ్యం అయ్యేలా అధికారులు అవగాహన కల్పిస్తారు. మెప్మా ఆర్పీల సహకారం, మున్సిపల్ కార్మికులతో కలిసి మున్సిపల్ అధికారులు వార్డుల్లో శుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వడంపై ప్రజలకు తెలియజేస్తున్నారు. శ్రీమేరా లైఫ్... మేరా స్వచ్ఛ షెహర్శ్రీ పేరిట ఆర్ఆర్ఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాల్లో స్వచ్ఛ ర్యాంకులను సాధించేందుకు అవకాశం ఉంది. -
100 శాతం ఆర్‌పీఈటీ బాటిళ్లు.. దేశంలో ఫస్ట్ టైమ్!
సాక్షి, న్యూఢిల్లీ: కోకా–కోలా సంస్థ 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ మెటిరీయల్ (ఆర్‌పీఈటీ) తో రూపొందించిన కిన్లే సీసాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. 100శాతం ఆర్పీఈటీతో రూపొందించిన సీసాను ఆహారం/పానీయాల కోసం ఉపయోగించడం దేశంలో ఇదే మొదటిసారి అని సంస్థ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలు లేని ప్రపంచం సృష్టించే క్రమంలో 2030 నాటికి ప్యాకేజింగ్‌లో కనీసం 50శాతం రీసైకిల్డ్ బాటిళ్లను ఉపయోగించే లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు టెక్నికల్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకర్మాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కోకా–కోలా ఫ్రాంచైజ్ భాగస్వామి సర్వారాయ సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్బీపీపీ రామ్మోహన్ మాట్లాడుతూ... సంస్థ నిర్ణయం సుస్థిరమైన ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వ దృక్పథానికి అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. -
వనరుల పొదుపు..కాలుష్యం అదుపు.. సర్క్యులర్ ఎకానమీ! అంటే తెలుసా?
టవల్ మసి గుడ్డగా మారడం... వంటింట్లో వ్యర్థాలు మొక్కలకు పోషకాలుగా వినియోగించడం... అవసరం మేరకే విద్యుత్, నీరు, సామాన్లు వాడటం.. ఇలాంటి వాటికి మనం పెట్టుకునే పేరు.. పొదుపు. ఆ తరహా పనులే ప్రపంచం మొత్తం మీద అన్ని రంగాల్లో చేపడితే..? అదే.. సర్క్యులర్ ఎకానమీ! -కంచర్ల యాదగిరిరెడ్డి ప్రపంచం మొత్తం మీద ఏటా వినియోగిస్తున్న వస్తువులు 10,000 కోట్ల టన్నులు. ఇందులో ఒకసారి మాత్రమే వాడగలిగిన ప్లాస్టిక్, లోహాలు, కలప, కాంక్రీట్, రసాయనాలు ఏకంగా 92 శాతం. కాంక్రీట్‌ను పక్కనబెడితే మిగిలినవన్నీ చెత్తకుప్పల్లోకి చేరి మనల్ని ఇబ్బంది పెట్టేవి, ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేవే. ఈ విపత్కర పరిస్థితికి తరుణోపాయం సర్క్యులర్ ఎకానమీ అని నిపుణులుఅంటున్నారు. భూమి మీద ముడి చమురు, ఫాస్పరస్ వంటి రసాయనాలు, సాగుభూమి, తాగునీరు ఇలా అన్నీ పరిమితమైనవే. కానీ మనం ఈ వనరులను వృధా చేస్తున్నాం. ఎంత వృ«థా అంటే.. అవసరానికి మించి 1.6 రెట్లు వాడేస్తున్నామని ప్రపంచ ఆర్థిక వేదిక స్పష్టం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు అన్నిరకాల ఇబ్బందులూ తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుకునేందుకు సర్క్యులర్ ఎకానమీ దోహదపడుతుంది. వాడుకుని వదిలేయకుండా.. ఇప్పటివరకు మనం వస్తువులను తయారు చేసి వాడుకున్న తర్వాత వదిలేయడం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. ఇంగ్లిషులో దీనిని ‘లీనియర్ ఎకానమీ మోడల్’అని పిలుస్తారు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని, కాలుష్యం పెరుగుతోందని, వనరుల దుర్వినియోగం జరుగుతోందని 1970 దశకంలోనే కొంతమంది ఆర్థిక వేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి విరుగుడుగా సర్క్యులర్ ఎకనామీ మోడల్‌ను ప్రతిపాదించారు. ఎలన్ మెకార్థర్ ఫౌండేషన్ వంటివి ఈ ఆలోచనకు మరింత పదునుపెట్టి అన్ని రంగాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్ని స్తున్నాయి. కొత్త సర్క్యులర్ ఎకానమీ మోడల్‌ను అమలు చేస్తే కేవలం కాలుష్యం, పర్యావరణ సమస్యలకు పరిష్కారం లభించడం మాత్రమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వనరుల వినియోగం.. ఎక్కువ మన్నిక సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థలో వస్తువులను వీలైనంత తక్కువ వనరుల వినియోగంతో తయారు చేస్తారు. వ్యర్థాలను, కర్బన ఉద్గారాలను వీలైనంతగా తగ్గించడం అనేది వీటి రూపకల్పనలో ముఖ్యాంశం. పైగా ఏ వస్తువైనా వీలైనంత ఎక్కువ సమయం ఉపయోగపడేలా ఉంటుంది. కొత్త మోడల్ వచ్చి నప్పుడల్లా పాత స్మార్ట్ఫోన్లను పడేసినట్లు కాకుండా.. చెడిపోతే మరమ్మతు చేయడం, డిజైన్లను మార్చడం ద్వారా సదరు వస్తువు జీవితకాలం పెంచడం, పూర్తిగా పనికిరాకుండా పోయిన తర్వాత రీసైకిల్ చేయడం సర్క్యులర్ ఎకానమీలో భాగం. ఉదాహరణకు.. యూరప్ దేశాలు ఏటా సుమారు 250 టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని మళ్లీ వాడుకునేలా చేయడం ద్వారా కొత్త వాటిని కొనుక్కునే అవసరాన్ని తప్పిస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల బోలెడు డబ్బు ఆదా అవుతుంది. అలాగే అవి తిరిగి పనిచేసేలా తయారు చేసేందుకు, మరమ్మతులు చేసేందుకు మానవ వనరులు అవసరమవుతాయి. అంటే కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వస్తే 2030 నాటికి సర్క్యులర్ ఎకానమీ విలువ దాదాపు 4.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే 4.5 లక్షల కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆదా చేయవచ్చని వారు చెబుతున్నారు. వ్యవస్థ మొత్తం మారితేనే.. ఇందుకోసం వ్యవస్థ మొత్తం మారాలి. వినియోగదారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు అందరూ తమవంతు పాత్ర పోషించాలి. సులువుగా రీసైకిల్ చేయగలిగేలా, విడదీసేలా వస్తువులను డిజైన్ చేయడం ఒక పద్ధతి. దీనివల్ల తయారీకి ముడిసరుకులు తక్కువగా అవసరమవుతాయి. ఫెయిర్ ఫోన్ అనే స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. పాడైపోయిన భాగాలను తీసేసి కొత్తవి వేసుకోవడం ఈ స్మార్ట్‌ఫోన్‌లో సాధ్యమవుతుంది. కేవలం వాడుకున్నందుకే డబ్బులు..! కొత్తరకం బిజినెస్ మోడల్ ద్వారా కూడా సర్క్యులర్ ఎకానమీ అమలు చేసేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్, మోటార్‌సైకిల్, ఏసీ, ఫ్రిజ్ వంటి వాటిని కొనడం కాకుండా.. కేవలం వాడుకునేందుకు మాత్రమే కంపెనీలకు డబ్బులు చెల్లించడం ఈ కొత్తరకం బిజినెస్ మోడల్‌కు ఒక ఉదాహరణ. ఈ మోడల్లో ఆయా వస్తువుల జీవితకాలం ముగిసిన తర్వాత సదరు కంపెనీ వెనక్కి తీసుకుంటుంది. వాటిల్లోని పరికరాలను రీసైకిల్ చేస్తుంది. ఉపయోగపడే వస్తువులన్నింటినీ మళ్లీ మళ్లీ వాడుతుంది. వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని 2040 నాటికల్లా దశలవారీగా తగ్గించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే పునర్వినియోగాన్ని, రీసైక్లింగ్‌నూ ప్రోత్సహించడం ద్వారా ఈ రంగంలో సర్క్యులర్ ఎకానమీని అమల్లోకి తెచ్చింది. వ్యర్థాల మోతాదు తగ్గాలి ఈ ఏడాది ఫ్రిబవరిలో ప్రపంచవ్యాప్తంగా సర్క్యులర్ ఎకానమీ అమలుపై ఒక నివేదిక వెలువడింది. ‘ద సర్క్యులేటరీ గ్యాప్ రిపోర్ట్’గా పిలిచే ఈ నివేదిక ప్రకారం.. 1970తో పోలిస్తే మన వస్తు వినియోగం మూడు రెట్లు అంటే ఏడాదికి 10,000 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో సర్క్యులర్ ఎకానమీని కనుక అమలు చేయగలిగితే ఇందులో మూడొంతుల మేరకు వస్తు వినియోగాన్ని తగ్గించవచ్చు. సర్క్యులర్ ఎకానమీ అమల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని, అన్ని రకాల పరిశ్రమల్లో వ్యర్థాల మోతాదును తగ్గించేందుకు ప్రయత్నాలు జర గాలని నివేదిక సూచించింది. నియోమ్‌లో వ్యర్థాలన్నీ రీసైకిల్ సౌదీ అరేబియా కడుతున్న సరికొత్త నగరం ‘నియోమ్’లో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే అత్యాధునిక డీశాలినేషన్ ప్లాంట్లను ఉపయోగించనున్నారు. ఆ దేశంలో ఇది కొత్త కాదు కానీ.. నియోమ్‌లోని ప్లాంట్ల వ్యర్థాల నుంచి విలువైన రసాయనాలను వెలికితీసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. బ్యాటరీల్లో వాడే లిథియంతో పాటు పొటా షియం, సోడియం వంటి అనేక లవణాలు, ఖనిజాలు సమ్రుదపు నీటిలో ఉంటాయన్నది తెలిసిన విషయమే. నియోమ్ ప్లాంట్ల వ్యర్థాల నుంచి జిప్సమ్‌ను వేరు చేసి దాన్ని సిమెంట్ తయారీలో వాడాలన్న ఆలోచన సాగుతోంది. కాగా నియోమ్‌లో వ్యర్థాలన్నింటినీ పూర్తిగా రీసైకిల్ చేయనున్నారు. ఘన వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ఎరువులు, మురుగునీటి లోంచి నైట్రోజన్, ఫాస్పరస్ (సబ్బులు, డిటర్జెంట్ల వాడకంతో కలుస్తుంటాయి) వంటి వనరులను వెలికితీయనున్నారు. వాడేసిన వంట నూనెలతో వాహనాల పరుగు ఇంగ్లండ్‌లోని బౌర్న్మౌత్ ప్రాంతంలో చెత్తను సేకరించే వాహనాలన్నీ వాడేసిన వంటనూనెలతో నడుస్తున్నాయి. ఈ నూనెలను రీసైకిల్ చేసి తయారు చేసిన హైడ్రోట్రీటెడ్ వెజిటబుల్ ఆయిల్ (హెచ్‌వీఓ)ను ఉపయోగిస్తున్నారు. ఆమ్స్టర్డ్యామ్లో మెక్‌డొనాల్డ్స్ కేంద్రాల్లో వాడేసిన నూనెలను రీసైకిల్ చేసి చెత్త సేకరించే వాహనాలకు, స్విగ్గీ, జొమాటో వంటి ఆహారం సరఫరా చేసే కంపెనీలకు అందిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేక రసాయనాల ద్వారా విడగొట్టి ఆ ద్రావణాన్ని కొత్త ప్లాస్టిక్ తయారీకి వాడేలా సింగపూర్ ఇటీవలే ప్రయత్నాలు మొదలుపెట్టింది. -
రీసైకిల్ ప్లాస్టిక్ తో నోకియా ఫోన్లు తయారీ
-
పర్యావరణాన్ని రక్షించే బాధ్యత తీసుకున్న నోకియా
-
ఆర్ఆర్ఆర్- రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్.. స్టార్టప్ వినూత్న ఆలోచన
అట్టహాసంగా జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, పండగ సంబరాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లు వంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వృథాగా మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుండటం అందరికీ తెలిసిన విషయమే! ఈ ఫంక్షన్లు, పార్టీలు ముగియగానే భారీగా వాడిపారేసిన వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులు, ఆహార వ్యర్థాలు, డెకరేషన్ సామాగ్రి గుట్టగుట్టలుగా పోగుపడుతున్నాయి. ఇవన్నీ పర్యావరణంలోకి చేరి తినే తిండిని, పీల్చే గాలిని, తాగేనీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రభుత్వపరంగా పట్టణాలు, నగరాల్లో మునిసిపాలిటీల ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, గ్రామీణ సంస్థల ద్వారా ఈ వ్యర్థాలు, కాలుష్యాలను తొలగించి, వాటిని రీసైకిల్, రీయూజ్ చేసే చర్యలు సాగుతున్నాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పర్యావరణహిత సంస్థలు, ఎన్జీవోలు, స్టార్టప్‌లు ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’కు సంబంధించి తమ వంతు కృషి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ‘ఎర్త్ సిట్టర్స్’ ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ ఒకటి. పెళ్లిళ్లు సహా రకరకాల వేడుకల్లో జరిగే వ్యర్థాలను సేకరించి, వాటిని పునర్వినియోగించేందుకు ‘ఎర్త్ సిట్టర్స్’ అనే ఎకో ఫ్రెండ్లీ–ఎకో కాన్షియస్ స్టార్టప్ సంస్థ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. పెళ్లి వేడుకలు, బర్త్‌డే పార్టీలు, సంప్రదాయ పండుగలు, ఇతర ఫంక్షన్ల వంటివి బాధ్యతాయుతంగా జరుపుకొనేందుకు తమ తమ ఫంక్షన్ల తేదీలకు రెండువారాల ముందుగా ‘ఎర్త్ సిట్టర్స్’ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలి. ఈ ఫంక్షన్లు ముగిశాక ఈ సంస్థ ప్రతినిధులు ఆహారం, డెకరేషన్, ఇతర ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను తీసుకెళ్లి వారు షెడ్లో ఎరువులుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు ఏయే పద్ధతులను అనుసరించాలనే దానిపైనా వారు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ల నిర్వహణకు నెలరోజుల ముందుగానే ‘ఎర్త్ సిట్టర్స్’ను సంప్రదిస్తే ఈ వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులను క్షుణ్ణంగా వివరిస్తారు. వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు తమ బృందం సభ్యులను పంపించి అవగాహన కల్పిస్తారు. జీరో లేదా లో–వేస్ట్ వెడ్డింగ్ ప్లాన్... పర్యావరణ పరిరక్షణ స్పృహతో పాటు ప్రకృతిని కాపాడేందుకు ప్లాస్టిక్, ఇతర రూపాల్లోని కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ ద్వారా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌కు తమ వంతు కృషి ఉండాలనే కావ్య సిం«ధూజ ఆలోచనల్లోంచే ‘ఎర్త్ సిట్టర్స్’ స్టార్టప్ రూపుదిద్దుకుంది. బిట్స్ హైదరాబాద్‌లో డ్యూయల్ డిగ్రీ బీటెక్–ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఆమె 2016–17లో ఓ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినపుడు దీనిపై ఆలోచనలు రేకెత్తాయి. ఢిల్లీలో యంగ్ ఇండియా ఫెలోషిప్, ఆ తర్వాత బెంగళూరులో ‘సస్టెయినబుల్ లివింగ్’లో మరో ఫెలోషిప్ చేశాక కావ్య దృష్టికోణం మరింత విస్తరించింది. దాదాపు రెండేళ్ల క్రితం కరోనా కాలంలో ఇంట్లోనే వ్యర్థాల నిర్వహణ ఎలా చేయాలి, వివిధ అవసరాలకు ఉపయోగించే వస్తువులకు ప్రత్యామ్నాయాలు ఏమిటనే ఆలోచనల నుంచి ఇది విస్తరించింది. గతంలో ఆన్లైన్లో వీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కన్సల్టెంట్‌గా కూడా సలహాలు ఇస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తమ వివాహాన్ని ‘జీరో లేదా లో వేస్ట్ వెడ్డింగ్’గా నిర్వహించాలని నిర్ణయించారు. డెకరేషన్ మొదలు విందులోని ఆహార పదార్థాల వరకు వ్యర్థాలను ఎలా తగ్గించాలన్న దానిపై దృష్టి నిలిపారు. ఏ వస్తువులు వాడితే వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావన్నది పరిగణనలోకి తీసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివిధ ఈవెంట్ల సందర్భంగా వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు తరలించారు. ఈ విధానం నచ్చిన మరికొందరు అదే పద్ధతిలో తమ ఫంక్షన్ల నిర్వహణకు ముందుకు రావడంతో దానిని కొనసాగించారు. ఆ తర్వాత స్టార్టప్‌ను మొదలు పెట్టిæ ఫిబ్రవరి నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నందున ఏపీలోని చిలకలూరిపేటలో త్వరలోనే తమ సొంత ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఆరునెలల తర్వాత దీనిని నిర్వహించాక వచ్చిన ఫలితాలను బట్టి తెలంగాణ, ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. -కె.రాహుల్ చదవండి: ప్లాస్టిక్ కబంధహస్తాల్లో భూగోళ భవితవ్యం? -
అప్పుడే పట్టణాలు శుభ్రపడతాయి!
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పట్టణాలలో చెత్త, వ్యర్థాలు ప్రతి రోజూ కుప్పలు కుప్పలుగా పెరిగిపోవటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందువల్ల ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని కలుగుతోంది. స్థానిక సంస్థలకు ఈ చెత్తను తొలగించడం సవాలుగా మారింది. గత రెండు దశాబ్దాలలో వేగవంతమైన పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుదల, మారుతున్న జీవన ప్రమాణాలు పట్టణాల్లో వ్యర్థాల పెరుగుదలకు హేతువులుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో వ్యర్థాల నిర్వహణను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలలో ఆర్ఆర్ఆర్ఆర్ (రెఫ్యూజ్: తిరస్కరణ, రెడ్యూస్: తగ్గించడం, రీయూజ్: తిరిగి వాడటం, రీసైకిల్: వేరుచేసిన చెత్తను ఇతర వస్తువులను తయారు చేయడానికి లేదా పునర్వినియోగానికి సిద్ధం చేయడం) వంటి వ్యూహాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఇండోర్ నగరంలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఇండోర్ నగంలోని ప్రజలలో వచ్చిన అవగాహన, ప్రవర్తనలోని మార్పులు, మునిసిపల్ సిబ్బంది అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమయింది. ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాలలో పది ట్రాన్స్ఫర్ కలెక్షన్ సెంటర్లను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుండి వేరు వేరుగా సేకరించిన చెత్తను భారీ వాహనాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను ఆరు రకాలుగా విభజించి ఆ తదుపరి మిగిలిన కొద్దిపాటి ఉపయోగం లేని చెత్తను శాస్త్రీయ పద్ధతి ద్వారా లాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ నుండి తరలించిన చెత్తతో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ‘ఇంక్‌వాష్’ సంస్థ నిర్వహించిన సదస్సులో చెత్త రీసైక్లింగ్ చేయడం ద్వారా అత్యధికంగా లాభాలు పొందే ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. చెత్తతో వస్తువులను తయారు చేయడానికి ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. జనాభా పెరుగుతున్న నగరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రచించి పకడ్బందీగా ‘చెత్త’ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాలనీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను సమకూర్చుకోవాలి. అప్పుడే ప్రతి నగరం, పట్టణం పరిశుభ్రతతో అలరారుతుంది. - ప్రొఫెసర్ కుమార్ మొలుగరం భారత ప్రభుత్వ ప్రాంతీయ పట్టణ అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఓయూ -
శభాష్ రమ్య.. నీ ప్రాజెక్ట్ అదిరింది!
సాక్షి,వీరఘట్టం(శ్రీకాకుళం): ఎక్కడ చూసినా ప్లాస్టిక్.. ఏది కొన్నా ప్లాస్టిక్. అంతరించిపోదని తెలిసినా, కీడు చేస్తుందని ప్రచారం చేసినా జనం దీన్ని వదలడం లేదు. కారణం సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం. సరి గ్గా ఈ ఆలోచనే వీరఘట్టం కేజీబీవీ విద్యార్థి ప్రాజెక్టును జాతీయ స్థాయికి పంపించింది. ప్లాస్టిక్‌కు బదులు బయో డీగ్రేడబుల్ కప్పులు వాడవచ్చని విద్యార్థి చేసిన ప్రదర్శన ఆమెను దేశ రాజధానికి పంపిస్తోంది. ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ వర్చువల్ ఎగ్జిబిషన్లో వీరఘట్టం కేజీబీవీ టెన్త్ విద్యార్థిని కె.రమ్య ప్రదర్శించిన గడ్డి కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయి సెమినార్‌కు ఎంపికైందని ఎస్ఓ రోజా తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్లో తమ విద్యార్థి పాల్గొంటుందని, ఇది తమకు గర్వకారణమని ఆమె తెలి పారు. ప్రాజెక్టు రూపొందించడంలో సహకరించిన గైడ్ టీచర్లు ఎల్.సునీత, కె.స్నేహలత, జి.సృజనలను అభినందించారు. ఏంటీ ప్రత్యేకత..? జిల్లా నుంచి 223 ప్రాజెక్టులు పోటీ పడితే ఈ ప్రాజెక్టు ఒక్కటే జాతీయ స్థాయి వరకు వెళ్లగలిగింది. కేజీబీవీ విద్యార్థిని రమ్య రూపొందించిన ప్రాజెక్టు పేరు బయో డీగ్రేడబుల్ కప్స్(గడ్డితో తయారు చేసే కప్పులు). ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ప ర్యావరణం కలుషితమవుతోంది. ముఖ్యంగా సిటీల్లో పానీపూరీ బడ్డీల వద్ద వీటి వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల ప్లాస్టిక్ కప్పుల బదులు బయోడీగ్రేడబుల్ కప్పులు వాడితే ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చునని రమ్య తన ప్రాజెక్టులో స్పష్టంగా చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కప్పుల తయారీ ఇలా.. విద్యార్థిని చెప్పిన వివరాల ప్రకారం.. ఈ బయోడీగ్రేడబుల్ కప్పులు కాలుష్య రహితం. వీటిని తయారు చేయడం చాలా సులభం. మనకు అందుబాటులో ఉండే ఎండుగడ్డిని కొంత తీసుకుని దాన్ని పౌడర్‌గా చేయాలి. ఈ పౌడర్‌ను తగినంత నీటిలో కలపి ఈ ద్రావణాన్ని ఒక పాత్రలో వేసి వేడి చేయాలి. ద్రావణాన్ని వేడి చేశాక అందులో తగినంత కార్న్‌ఫ్లోర్, వెనిగర్ వేసి ముద్దగా తయారు చేయాలి. ఈ ముద్దను కప్పులుగా తయారు చేసి ఎండబెడితే బయోడీగ్రేడబుల్ కప్పులు తయారవుతాయి. ఈ కప్పుల్లో వేడి పదార్థాలు తిన్నా ఎలాంటి హాని ఉండదు. ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ఆనందంగా ఉంది నేను రూపొందించిన బయోడీగ్రేడబుల్ కప్పుల ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికవ్వ డం ఎంతో ఆనందంగా ఉంది. మా ఎస్ఓ మేడమ్, గైడ్ టీచర్ల సలహాలు, సూచనలతో ఈ ప్రాజెక్టు రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ కప్పులను సులువుగా తయారు చేసుకోవచ్చు. పానీపూరీ బడ్డీల వద్ద, మనం నిత్యం ఇంటిలో వాడే ప్లాస్టిక్ కప్పుల బదులు వీటిని వాడితే పర్యావరణాన్ని కాపాడినవాళ్లమవుతాం. ఢిల్లీలో త్వరలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సెమినార్ పాల్గొనేందుకు మరింతగా సిద్ధమవుతున్నాను. – కె.రమ్య, పదో తరగతి విద్యార్థిని, కేజీబీవీ, వీరఘట్టం చదవండి: ఇల వైకుంఠపురంలో..! ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు -
Vidyun Goel: ఈ లైబ్రరీలో పుస్తకాలుండవ్! ఆడుకునే బొమ్మలు మాత్రమే..
టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్‌లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా. మనం కూడా మనవంతుగా టాయ్బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! -
నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...
ఆయన దేశాన్ని పాలించే మహారాజు. ఆయన భార్య మహారాణి. లెక్క ప్రకారం వారికి దేనికీ కొదవే ఉండదు. వాళ్లు వేసుకునే పాదరక్షల నుంచి హెయిర్ క్లిప్‌ల వరకు అన్నీ ఖరీదైనవిగా ఉంటాయి. మహారాణిగారు ఏ కార్యక్రమానికైనా వచ్చారంటే ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. దీనికి తగ్గట్టుగానే వారు రెడీ అవుతుంటారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త ఫ్యాషన్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు స్పెయిన్ మహారాణి లెట్జియా ఓరి్టజ్ రోకసోలానో. కార్యక్రమానికో డ్రెస్ కొనకుండా, తన దగ్గర ఉన్న పాత డ్రెస్సులను సరికొత్తగా తీర్చిదిద్ది వివిధ కార్యక్రమాలకు వాటినే వాడుతూ ఫ్యాషన్ ఐకాన్లకే సవాళ్లు విసురుతున్నారు. ఎప్పుడూ స్టైలి‹Ùగా కనిపించే లెట్జియా రెండు రోజులక్రితం రాయల్ ప్యాలెస్‌లో చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాకు ఆహా్వనం పలికే క్రమంలో నలభై ఏళ్లనాటి డ్రెస్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపించారు. ఈ గౌనుకు పెద్ద చరిత్రే ఉంది. లెట్జియా అత్తగారు క్వీన్ సోఫియా నలభై ఏళ్ల క్రితం ధరించిన ఈ గౌనును ఇప్పటి మహారాణి ధరించడం విశేషం. పొట్టి చేతులు, పింక్ పేస్టల్ కలర్లో ఫ్రాక్. పువ్వులతో మోకాళ్ల కింద వరకు స్కర్ట్‌ను ధరించారు. మహారాజు జువాన్ కార్లోస్–1తో కలిసి, క్వీన్ సోఫియా 1981లో రోమ్ను సందర్శించారు. ఆ సమయంలో సోఫియా ఈ డ్రెస్‌ను ధరించారు. ఆనాటి డ్రెస్‌ను వార్డ్రోబ్ లో నుంచి తీసి దానిని వెండి, రత్నాలతో మరింత అందంగా డెకొరేట్ చేసి, సిల్వర్ బెల్ట్‌తో ధరించి చూపరులను ఆకట్టుకుంది లెట్జియా. అంతేగాక ఈ వారం లో జరిగిన రెటీనా ఈసీవో అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న లెట్జియా ఒక నలుపు రంగు గౌనును వేసుకున్నారు. ఈ గౌనును సేంద్రియ వెదురుతో తయారు చేయడం విశేషం. ఇద్దరమ్మాయిలకు తల్లి అయిన లెట్జియా, ఒకపక్క తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో తరచూ పొల్గొంటూ ఉంటారు. ఆమె ధరించే డ్రెస్‌లు ఎంతో సింపుల్‌గా స్టైలిష్‌గా ఉండడమేగాక, దాదాపు రీసైక్లింగ్ చేసినవి కావడంతో అంతా లెట్జియా డ్రెస్‌లను ఆసక్తిగా గమనిస్తుంటారు. -
మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం
సోషల్ మీడియాకున్న పవర్ అంతా ఇంతా కాదు. ఒక్క వీడియా జీవితాలనే మార్చేస్తుంది. రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్న కాంటా ప్రసాద్ అనే వృద్ధుడి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. మహమ్మారి కాలంలో వ్యాపారం జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతను అందించాలంటూ ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోకు స్పందించిన నెటిజన్లు వారికి సాయం చేసేందుకు వారి ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోయింది. సరిగ్గా మరోసారి అలాంటి కథే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. (‘బాబా కా దాబా’ వీడియో.. రెస్పాన్స్ సూపర్) ముంబైలోని ఫడేకే రోడ్ డోంబివాలిలో రీసైకిల్ బ్యాగులను అమ్ముతూ కుటుంబ పోషణను నెట్టుకొస్తున్న 87 ఏళ్ల జోషి అనే వ్యక్తి కథను ఓ యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. 'చిరిగిన సోఫా కవర్లు, కర్ట్‌న్‌లను అందమైన బ్యాగులుగా తీర్చుదిద్దుతున్నాడు. కేవలం 40-80 రూపాయలకే ఈ అందమైన బ్యాగును సొంతం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరకే చేతిసంచులను అమ్ముతున్న ఈ అంకుల్‌ను మనమూ ఫేమస్ చేద్దాం బ్యాగ్ కొనడం మాత్రం మరవద్దు' అంటూ వీడియాను పోస్ట్ చేయగానే వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం..ఈ వయసులోనూ ఎంతో కష్టపడుతున్న అంకుల్ జోషికి మనమూ బాసటగా నిలుద్దాం అంటూ పలువురు నెటిజన్లు ముందుకొస్తున్నారు. Uncle Joshi age 87 sells bags of Rs 40 to 80.He buys broken pieces of clothes frm sofa and curtain makers.He himself stitches these bags.He sits at Phadeke Road Dombivali,#Mumbai Let's make Joshi Uncle famous & plz don't forget to buy 1 bag from him.🙏 pic.twitter.com/fbI7ZkP2dA — Gauri (@ardor_gauri) October 17, 2020 -
రూ.4,27,500 కోట్లు.. బూడిదపాలు..!!
సాక్షి, అమరావతి: గతేడాది ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్)ను కాల్చివేయడం వల్ల రూ.4,27,500 కోట్లు బూడిద పాలయ్యాయా? ప్రపంచంలో ఈ-వేస్ట్ ఉత్పత్తి 2030లో 69.68 మిలియన్ టన్నులకు చేరుతుందా? ఈ-వేస్ట్‌ను పునర్వి నియోగం చేయకుంటే.. రూ.లక్షలాది కోట్లు బూడిదపాలు కావడమే కాదు.. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం(యూఎన్ఎన్) నివేదిక. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యుత్ బల్బులు, ట్యూబ్లైట్ల నుంచి కంప్యూటర్ల వరకూ భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగిస్తున్నారు. కాలం చెల్లించిన ఎలక్ట్రానిక్ వస్తువులను వ్యర్థాల రూపంలో పడేస్తున్నారు. ఈ ఈ-వేస్ట్‌పై యూఎన్ఎన్ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ.. ప్రపంచంలో 2014లో 42.35 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తయింది. 2019 నాటికి ఈ-వేస్ట్ ఉత్పత్తి 53.6 మిలియన్ టన్నులకు చేరుకుంది. అంటే.. ఐదేళ్లలో ఈ-వేస్ట్ ఉత్పత్తి 21% పెరిగింది. ఈ లెక్కన 2030 నాటికి ఈ-వేస్ట్ ఉత్పత్తి 38% పెరిగి 69.68 మిలియన్ టన్నులకు చేరుతుంది. 2019లో ఆసియా దేశాలు అత్యధికంగా 24.9 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. ఇందులో చైనా మొదటి, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. అమెరికా ఖండపు దేశాలు 13.1 మిలియన్ టన్నులు, ఐరోపా దేశాలు 12 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేశాయి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో.. అత్యంత విషపూరితమైన పాదరసం వంటి పదార్థాలతోపాటు బంగారం, వెండి, రాగి వంటి లోహాలను వినియోగిస్తారు. ఈ-వేస్ట్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల వాటిలోని విషపూరితమైన పదార్థాలు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. 2019లో ఉత్పత్తయిన 53.6 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్‌లో 18% అంటే 9.65 మిలియన్ టన్నులను మాత్రమే రీ-సైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తెచ్చారు. మిగిలిన వాటిని కాల్చివేశారు. దీని వల్ల ఆ వ్యర్థాల్లోని బంగారం, వెండి, రాగి వంటి 57 బిలియన్ డాలర్ల విలువైన లోహాలు బూడిదయ్యాయి. ఈ-వేస్ట్‌ను రీ-సైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకునేలా జాతీయ ఈ-వేస్ట్ విధానాన్ని రూపొందించుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలోభారత్‌తోపాటు 78 దేశాలు మాత్రమే ఈ-వేస్ట్ విధానాన్ని రూపొందించుకున్నాయి. కానీ.. కేవలం 18% మాత్రమే ఈ-సైక్లింగ్ చేస్తున్నాయి. దేశంలో ఈ-వేస్ట్‌ను రీ-సైక్లింగ్ చేసే కేంద్రాలు 315 ఉన్నాయి. వాటిలో ఏడాదికి కేవలం 800 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేయవచ్చు. కానీ.. దేశంలో ఏడాదికి ఏడు మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తవుతుండటం గమనార్హం. ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించకపోతే భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రూ.లక్షలాది కోట్ల విలువైన ప్రజాధనం వృథా అవుతుంది. పర్యావరణానికి విఘాతం కలిగించడంతోపాటు ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. -
వ్యర్థాలతో పాదరక్షలు
పాదాలకు అందమైన నాణ్యమైన ఫ్యాషనబుల్ చెప్పులు, షూస్‌ను అందరూ ఇష్టపడతారు. అందుకే డబ్బు కాస్త ఎక్కువైనా ఖర్చుకు వెనకాడరు. రాజస్థాన్‌కు చెందిన మేఘా రావత్ వాడి పడేసిన వస్తువులతో అందమైన చెప్పులను తయారుచేస్తోంది. . ఫ్యాషనబుల్‌గా ఉండేవి, నాణ్యమైన, సరసమైన ధరలలో లభించే పాదరక్షల తయారీని ప్రారంభించడమే కాకుండా వాటికో బ్రాండ్‌ను క్రియేట్ చేసింది మేఘారావత్. ఇవి పూర్తిగా రీసైక్లింగ్ వస్తువులతో తయారు చేసినవి. వనరుల విలువ తెలుసుకున్నప్పుడు మేఘా రావత్ చాలా చిన్నది. 28 ఏళ్ల మేఘా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెరిగారు. ‘నా చిన్నతనంలో నీళ్లు, కరెంట్ సరఫరా సరిగా ఉండేది కాదు. నా తమ్ముడు, నేను స్కూల్ నుంచి వచ్చాక ఇంటి పనులకు నీళ్ల కోసం దగ్గరలోని కాలువకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. వాడి పడేసిన సీసాలను దీపానికి ఉపయోగించేది అమ్మ’ అని గుర్తు చేసుకుంటుంది మేఘ. తండ్రి ఆర్మీలో ఉద్యోగి. తల్లి స్థానిక పాఠశాలలో టీచర్. తక్కువ వస్తువులతో ఎలా జీవించాలో నేర్పేది తల్లి. అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయడం అలవాటు చేసింది. వాడిన వస్తువులను తిరిగి ఉపయోగించడం సాధ్యమైనంతవరకు ప్రయత్నించేవారు. ‘మా అమ్మ తన పాత చీరలతో నాకు గౌన్లు కుట్టేది. అవి చిరిగాక దిండు కవర్లుగా, టేబుల్ క్లాత్‌గా, దుమ్ము దులపడానికి ఉపయోగించే డస్టర్లుగా వాటిని చూసేదాన్ని’ అని మేఘా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. స్క్రాప్‌తో స్ట్రాప్స్ మేఘా 2014లో కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పై చదువుల కోసం తను ఉంటున్న పట్టణం నుండి నగరానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలామంది ఏవీ ఆలోచించకుండా వస్తువులను కొనడం గమనించేది. ‘వాటిని వాళ్లు ఎంతోకాలం వాడరు. కొంత కాలానికి వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. వాటన్నిటి అసలు ఖర్చు మాత్రమే కాదు, ప్రకృతికి జరిగే నష్టాన్ని కూడా అదే టైమ్‌లో అంచనా వేసుకునేదాన్ని’ అని చెబుతారు మేఘా. ఆ ఆలోచనతోనే మేఘా 2015లో రీ సైక్లింగ్ మెటీరియల్‌తో ఫుట్‌వేర్‌ను డిజైన్ చేయడం కనుక్కుంది. దానికి ‘కురియో’ అని నామకరణం చేసింది. దీనికి ముందు మేఘా ముంబయ్‌లోని ఒక ఐటి సంస్థ, ఎక్స్పోర్ట్ కంపెనీలలో పనిచేసింది. అక్కడ తనకా ఉద్యోగం సంతృప్తిని ఇవ్వడం లేదని అర్థమయ్యాక పర్యావరణ స్పృహ కలిగిన పాదరక్షలను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటి తయారీలో నైపుణ్యం కలిగిన 200 మంది చేతివృత్తులవారిని, మహిళలను ఎన్జీవోల సాయంతో నియమించుకుంది. టైర్లతో చెప్పుల అడుగు భాగం ‘చిన్నప్పటి నుండి సొంతంగా రకరకాల వస్తువులను తయారు చేయడం సరదాగా చేసేదాన్ని. మా అమ్మ టైలరింగ్ పనిచేస్తుంటే నేను పాత పేపర్లతో కటింగ్ నేర్చుకునేదాన్ని. క్లాత్ ముక్కలతో రకరకాల బొమ్మలను తయారుచేసేదాన్ని. రీ సైకిల్ ద్వారా కొత్తవస్తువును తయారు చేసినప్పుడల్లా చాలా ఆనందించేదాన్ని. అదే ఈ చెప్పుల తయారీకి పురికొల్పింది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడంతో బాధ్యత పెరిగింది. ఏ పని చేసినా పర్యావరణ స్పృహతో చేయాలనే ఆలోచన కలిగింది’ అంటుంది మేఘా. కురియో బ్రాండ్ ద్వారా పాదరక్షలు, కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్లు, ఫ్రిజ్ మాగ్నెట్స్, పర్సులు, కోస్టర్స్ వంటి ఉత్పత్తులను తయారుచేస్తుంది మేఘా. వీటిలో బాగా పేరొందినవి కొల్హాపురీ చెప్పులు. అలాగే కవర్ బూట్లు. పాదరక్షలకు ఉపయోగించే పట్టీలు పూర్తిగా చేనేత దారుల నుండి సేకరించిన బట్టతో, టైలరింగ్ యూనిట్ల నుండి సేకరించిన వ్యర్థ వస్త్ర పదార్థాలను ఉపయోగిస్తారు. దానికి తోడు పాదరక్షల అడుగు భాగానికి రీసైకిల్ టైర్లను వాడుతారు. వ్యర్థాల కోసం నెట్వర్క్ ‘కొని వాడిన నాణ్యమైన బట్టలను దేశంలోని వివిధ మూలల నుండి సేకరిస్తాం. ఇవి సహజమైన రంగులు, చేతితో నేసిన క్లాత్స్ అయి ఉంటాయి. వాటిలో ‘ఖాదీ, అజ్రఖ్, కలాంకారి, ఇండీ ఫాబ్రిక్స్ మొదలైనవి. దీనికి స్థానిక చేతివృత్తులు, చేనేత కార్మికులూ సహకరిస్తారు. ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమైనా ఉన్నాయా అంటే రీసైక్లింగ్ పదార్థాల కోసం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే. ఇందుకు సమయం, అనుభవం చాలా అవసరం ఉంటుంది..’ అని వివరిస్తుంది మేఘా. కాలుష్యకారకాలలో అతిపెద్దది ఫ్యాషన్ ప్రపంచం. మేఘా చేసే రీ సైక్లింగ్ ఉత్పత్తులు కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తున్నాయి. ఈ రీ సైక్లింగ్ తయారీ ఉత్పత్తులు ప్రజలకు మరింత అందుబాటులోకి రాగలిగితే పర్యావరణ నష్టాన్ని బాగా తగ్గించవచ్చు. -
ప్లాస్టిక్ భరతం పట్టే కొత్త టెక్!
వీధుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో చేరిపోయి మనిషిని రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు ఓ పరిష్కారం దొరికిందని అంటున్నారు స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. భూమ్మీద ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా కరిగించేయడమే కాకుండా.. దాన్ని మళ్లీ తాజా ప్లాస్టిక్‌లా వాడుకునే అద్భుత టెక్నాలజీని వీరు అభివృద్ధి చేశా రు. ఆవిరితో కరగబెట్టడం ద్వారా ప్లాస్టిక్‌ను అణుస్థాయిలో విడగొట్టడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని ఈ పద్ధతిని ఆవిష్కరించిన శాస్త్రవేత్త హెన్రిక్ థున్‌మన్ తెలిపారు. ప్లాస్టిక్‌ను సుమారు 850 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా వచ్చే వాయువును కొన్ని పద్ధతుల ద్వారా మళ్లీ తాజా ప్లాస్టిక్ మాదిరిగా వాడుకోవచ్చని వివరించారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీల్లోనే ఈ సరికొత్త రీసైక్లింగ్ ప్రక్రియను చేసుకోవచ్చని చెప్పారు. ప్రయోగాల్లో తాము 200 కిలోల ప్లాస్టిక్ చెత్తను గంటలో మళ్లీ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయగల వాయురూపంలోకి మార్చేశామని తెలిపారు. ఏడాదికి 35 కోట్ల టన్నులు.. 2015 నాటి లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద ఏడాదికి ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ దాదాపు 35 కోట్ల టన్నులు. ప్రస్తుతం చాలావరకు ప్లాస్టిక్ చెత్తను మండించి ఆ వేడితో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. లేదా వ్యర్థాలు ఎక్కువ స్థలం ఆక్రమించకుండా చూసేందుకు కాల్చేయడాన్ని ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్‌తోపాటు అనేక ఇతర విషవాయువులు గాల్లోకి చేరి పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో సుమారు 60 శాతం చెత్త కుప్పల్లోకి చేరుతోంది. రీసైక్లింగ్ కోసం సేకరిస్తోంది 14 శాతం మాత్రమే. మొత్తం వ్యర్థాల్లో 8 శాతాన్ని చౌకరకం ప్లాస్టిక్‌గా రీసైకిల్ చేస్తుండగా 2 శాతం కొంచెం నాణ్యమైన పదార్థంగా అందుతోంది. ఒక శాతం వ్యర్థాలు మాత్రం వీధుల్లో, నదుల్లో, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయి సమస్యగా మారుతోంది. కర్బన పరమాణువులతో మ్యాజిక్.. ప్లాస్టిక్‌ను చెత్తగా పడేశాక దాన్ని రీసైకిల్ చేసినా నాణ్యత పెరగదు. ఈ కారణంగానే హెన్రిక్ బృందం ప్లాస్టిక్ పునర్వినియోగానికి ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. పదార్థంలోని కర్బన పరమాణువులను సేకరించి వాడుకునేందుకు ప్రయత్నించింది. వాటిద్వారా మళ్లీ సరికొత్త, నాణ్యమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ముడిచమురుతో ప్లాస్టిక్‌ను తయారు చేయాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ‘మా ఆలోచనలను పరీక్షించుకునేందుకు 200 కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేశాం. అది కాస్తా విజయవంతమవడంతో ప్రస్తుతం మొత్తం ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. చమురు శుద్ధి కేంద్రాలనే రీసైక్లింగ్ ప్లాంట్లుగాను మార్చేందుకు ఏం కావాలో పరిశీలిస్తున్నాం’అని హెన్రిక్ తెలిపారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్: గూగుల్
శాన్ఫ్రాన్సిస్కో : 2022 నాటికి తమ ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక (రీసైకిల్డ్) ప్లాస్టిక్‌ను వినియోగించనున్నామని ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ ప్రతిజ్ఞ చేసింది. వచ్చే ఏడాది నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తామని సోమవారం ప్రకటించింది. గూగుల్ కొత్తగా తీసుకొన్న ఈ నిర్ణయంతో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాల విడుదలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటు ఇది వరకే ప్రతిజ్ఞ చేసిన టెక్ కంపెనీల జాబితాలో చేరింది. గూగుల్ నుంచి ఉత్పత్తి అయ్యే మొబైల్ ఫోన్లు, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లను తరలించడానికి విమానాలకు బదులు ఓడలపై ఎక్కువ ఆధారపడటంతో తమ కంపెనీ రవాణాకు సంబంధించిన కార్బన్ ఉద్గారాలు 2017తో పోలిస్తే గత ఏడాది 40 శాతం పడిపోయాయని గూగుల్ పరికరాలు, సేవల విభాగాధిపతి ‘అన్నా మీగన్’ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గూగుల్ కంపెనీ హార్డ్‌వేర్ వ్యాపారంలో అడుగుపెట్టి కేవలం 3 సంవత్సరాలే అయినప్పటికి, తమ ప్రత్యర్థి ఆపిల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని మీగన్ వెల్లడించారు. తమ సంస్థ ఆన్లైన్లో విక్రయించే గూగుల్ హోమ్ స్పీకర్లు, యూఎస్బీ, పెన్‌డ్రైవ్‌లు ప్రతి తొమ్మిది గూగుల్ ఉత్పత్తులలో మూడింటికి ప్లాస్టిక్‌ను 20 శాతం నుంచి 42శాతం వరకు తిరిగి వినియోగించవచ్చనే అంశాన్ని గూగుల్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అంతేకాక ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ 2022 నాటికి 100 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. -
వైరల్ : కార్‌ను ఇలా కూడా వాడొచ్చా..?!
ఆమిర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్, రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతి. విద్యావ్యవస్థలోని లోపాలను, ఇంజనీరింగ్ పట్ల మనకున్న వ్యామోహాన్ని తప్పు పడుతూ.. చదువుకు అసలైన నిర్వచనం చెప్పింది ఈ సినిమా. ఈ సినిమాలో ఆమిర్ నటించిన ‘పున్సుక్ వాంగ్డు’ పాత్రకు ప్రేరణనిచ్చిని వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్. లడఖ్‌కు చెందిన వాంగ్‌చుక్.. ‘ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆప్ లడఖ్’ అనే సంస్థను స్థాపించి జీవితాలకు పనికి వచ్చే విద్యను నేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాంగ్‌చుక్ చేసిన ఓ ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్‌ను రీసైకిల్ చేసి ఇంటి కప్పుగా మార్చిన వైనం ఆశ్చర్యపరుస్తోంది. వాంగ్‌చుక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫోటో మహీంద్ర గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రను తెగ ఆకర్షించింది. దాంతో ఆయన వాంగ్చుక్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘ఓ స్నేహితుడు పంపించిన ఈ ఫోటో ద్వారా వాంగ్‌చుక్ సృజనాత్మకత నాకు తెలిసింది. మహీంద్ర కారును ఇంటి పై కప్పుగా మార్చిన మీ ఆలోచన నిజంగా సూపర్బ్. మీ ఇన్స్టిట్యూట్లో పనికిరానిదంటూ దేన్ని వదిలేయరు కదా. ఇది మా ఆటో షెడ్డింగ్ వెంచర్‌తో పోటీ పడుతోంది. కానీ మీ ఆలోచన ఎంతో సృజనాత్మకంగా ఉందం’టూ అభినందిస్తూ ట్వీట్ చేశారు. A friend sent these pics from Sonam Wangchuk’s Himalayan Institute of Alternatives,Ladakh.Recycling a Mahindra car into a home roof.A way of life at the Institute, where nothing gets discarded.Well this will compete with our auto-shredding venture but it’s far more creative! pic.twitter.com/p7UwgOvtxD — anand mahindra (@anandmahindra) December 14, 2018 వాంగ్‌చుక్ ఈ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘ఆనంద్ మహీంద్ర మీరు మంచి స్టోరిని షేర్ చేశారు. 1997 - 2007 వరకూ ఈ కార్ మా దగ్గర చాలా విశ్వసనీయంగా పని చేసింది. ఎడ్యూకేషనల్ క్యాంపెయిన్ నిర్వహించడంలో ఈ కార్ మాకెంతో ఉపయోగపడింది. ఫలితంగా కేవలం 5 శాతంగా ఉన్నా మెట్రిక్యులేషన్ ఫలితాలు ఇప్పుడు 75 శాతానికి పెరిగాయి’ అంటూ రీట్వీట్ చేశారు. Dear Mr @anandmahindra the Jeep you tweeted has a lovely story. It was instrumental in educational campaigns in the remotest frontiers of Ladakh... which finally took the matriculation results from 5% to 75%. It served us faithfully between 1997 to 2007 before taking new avatara. pic.twitter.com/N9ejsphOjQ — Sonam Wangchuk (@Wangchuk66) December 17, 2018 దీనికి బదులిస్తూ ఆనంద్ మహీంద్ర ‘సోనమ్ మీరు చెప్పింది వాస్తవం. మీ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.. ఒక వేళ మీ క్యాంపెయిన్ ఇంకా వేటినైనా పూర్తి చేయలేదని భావిస్తే.. అందుకు నేను ఎలాంటి సాయం చేయగలనో తెలపండి’ అంటూ రీట్వీట్ చేశారు. వాంగ్‌చుక్, ఆనంద్ మహీంద్రల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లు వీరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Sonam you’re absolutely right—that IS a lovely story. How do I find out more about the educational campaign you referred to? And how we can support the campaign if the job is unfinished? @Wangchuk66 @manoj_naandi https://t.co/JgidIlv5qU — anand mahindra (@anandmahindra) December 19, 2018 -
చెత్తకుప్ప కానున్న థాయ్‌లాండ్
బ్యాంకాక్: ప్రపంచంలోని గొప్ప పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా విలసిల్లుతున్న థాయ్‌లాండ్ అందం మసైపోతోంది. మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల కుప్పగా ఆ దేశం మారుతోంది. పశ్చిమ దేశాలు, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ తదితర దేశాల నుంచి భారీగా ఈ-వ్యర్థాలు వచ్చిపడుతుండటంతో కాలుష్యం కోరల్లో చిక్కుకునేందుకు థాయ్‌లాండ్ మరెంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది. ఇప్పటివరకూ ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చైనా తన పంథాను మార్చుకుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశపడి చైనాను మరింత కాలుష్యమయంగా మార్చబోమంటూ అక్కడి ప్రభుత్వం జనవరిలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇతర దేశాల నుంచి ఈ-వ్యర్థాలతో పాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం తమ దేశంలోకి అనుమతించేంది లేదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పోగవుతోన్న ఈ-వ్యర్థాల్లో దాదాపు 70 శాతం దిగుమతి చేసుకునే చైనా తన విధానాన్ని మార్చుకోవడంతో, ముందూవెనుక ఆలోచించకుండా థాయ్‌లాండ్ చైనా స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది. అక్కడి పర్యావరణ చట్టాలు సైతం వ్యర్థాల రీ-సైక్లింగ్ వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. దాంతో గత ఆరు నెలల కాలంలో వెల్లువల వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాలతో థాయ్‌లాండ్ తన రూపు కోల్పోయే ప్రమాదంలో పడింది. ఆకాశాన్ని తాకే భవనాలు, తెల్లని రోడ్లు, ప్రకృతి వనరులు నల్లని కాలుష్యపు రంగును పులుముకునే దిశగా అడుగులు వేస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘చెత్త’ బరువుని తలకెత్తుకుంది..! మొత్తం మీద చైనా దించుకున్న ‘చెత్త’ బరువును థాయ్‌లాండ్ తలకెత్తుకుని కష్టాలు కొని తెచ్చుకుంటోంది. ఒక్క యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఏడాదికి 50 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగుపడతాయి. అలాంటిది అమెరికా, జపాన్ తదితర దేశాల నుంచి థాయ్‌లాండ్‌ను ముంచెత్తనున్న ఈ-వ్యర్థాల వరద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కాగా, చైనాలో రీ-సైక్లింగ్ వ్యాపారాలపై నిషేధం విధించడంతో థాయ్‌లాండ్, లావోస్, కాంబోడియాల్లో 100 ఈ-వేస్ట్ రీ-సైక్లింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు ఓ చైనా పారిశ్రామికవేత్త ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ప్రింటర్లు, మానిటర్లు, మౌజ్‌లు, స్క్రీన్లు, జిరాక్స్ మెషీన్ వంటి కంప్యూటర్ వ్యర్థాలను రీసైకిల్ చేసే క్రమంలో థాయ్‌లాండ్ కాలుష్య కాసారంగా మారుతోందన్నది వాస్తవం. అయినా ప్రపంచవ్యాప్తంగా పోగైన వ్యర్థాలను థాయ్‌లాండ్ నెత్తిన వేసుకోవడమేంటని విరచై సంగ్మెట అనే పోలీసు ఉన్నతాధికారి వాపోయారు. అక్రమంగా కొనసాగుతున్న 26 ఈ-వేస్ట్ రీ-సైక్లింగ్ ఫ్యాక్టరీలను ఇటీవల సీజ్ చేశామని ఆయన తెలిపారు. వ్యర్థాలను రీ-సైకిల్ చేసే క్రమంలో గాలిలో ప్రమాదకర వాయువులు చేరి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ప్రతిరోజు వస్తున్న దాదాపు 20 ఈ-వ్యర్థాల కంటెయినర్లను తిప్పి పంపిస్తున్నామని పోర్టు అధికారులు తెలిపారు. కాగా, వచ్చే నెలలో దేశంలోకి ఈ-వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల రవాణాను అడ్డుకొనేందుకు థాయ్ ప్రభుత్వం చట్టం తీసుకురానుందని అధికారులు వెల్లడించారు. -
అమెరికాలోనే తక్కువ!
జెనీవా: రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో యావత్ భారతదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంటే యూరప్, పశ్చిమ దేశాలు అక్కడ పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగంలోకి తెస్తూ క్లీన్ కంట్రీస్‌గా మారేందుకు శ్రమిస్తున్నాయి. పర్యావరణ హితం కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ యూనోమియా చెత్త నిర్వహణపై ఒక నివేదిక తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చెత్తను రీసైకిల్ చేస్తున్న దేశాల జాబితాను యూనోమియా ఇటీవల విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. చెత్త నిర్వహణ, పునర్వినియోగంలో జర్మనీ మొదటి స్థానంలో నిలవగా... ఆస్ట్రియా, దక్షిణ కొరియా, వేల్స్ దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 52 నుంచి 56 శాతం చెత్తను రీసైకిల్ చేస్తూ దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమ దేశంలోని సగం చెత్తను రీసైకిల్ చేస్తూ స్విట్జర్లాండ్ అయిదో స్థానంలో ఉంది. స్థానిక ప్రభుత్వాలను, దేశ ప్రజలను చైతన్యం చేస్తూ ఆయా దేశాలు స్వచ్ఛత సాధిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. ఒకే తరహా చెత్త సేకరణ విధానాలు అవలంభిస్తూ, ఈ దేశాలు చెత్త నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయిస్తున్నాయని స్పష్టం చేసింది. కాగా, జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన వేల్స్ దేశం మిగతా వాటి కంటే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతోందనీ, కొన్ని నెలల్లోనే అది ప్రథమ స్థానానికి చేరుకోవచ్చని రిపోర్టు వెల్లడించింది. 2050 వరకు జీరో వేస్టేజి దేశంగా అవతరించడానికి వేల్స్ ప్రణాళికలు రచించుకుంది. మరోవైపు, ఇప్పటివరకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ఇండస్ట్రియల్ చెత్తను దిగుమతి చేసుకుని రీసైకిల్ చేసే చైనా తన పంథా మార్చుకుంది. 24 రకాల చెత్తను రీసైకిల్ చేయబోమని ప్రకటించింది. దాంతో చెత్త నిర్వహణపై చైనాపై ఆధారపడ్డ ఆయా దేశాలపై మరింత పనిభారం పడింది. కాగా, ఐరోపా దేశాలు 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తుండగా.. అమెరికా కేవలం 9 శాతమే రీసైకిల్ చేస్తోంది. -
అభివృద్ధి మంత్ర.. ‘3ఆర్’
న్యూఢిల్లీ: ‘3ఆర్’అనే అభివృద్ధి మంత్రాన్ని అందరూ అనుసరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తక్కువ వినియోగం (రెడ్యూస్).. పునర్వినియోగం (రీయూజ్).. శుద్ధి చేసి వినియోగం (రీసైకిల్).. ఈ మూడు ఆర్లు వ్యర్థాల నిర్వహణకు, స్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇండోర్‌లో ప్రారంభం కానున్న ఆసియా, ఫసిపిక్ ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్ సదస్సు కోసం ప్రధాని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన 3ఆర్ అనే బంగారు సూత్రం మానవ జాతి స్థిరమైన అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే ఈ సదస్సు 3ఆర్లు నగరాలకు, దేశాలకు ఎలా ఉపయోగపడతాయో విశ్లే షిస్తుందని పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి అందించాలన్నది ఈ సదస్సు లక్ష్యమని వెల్లడించింది. ఈ నెల 10న ఈ సదస్సును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభిస్తారు. జపాన్ పర్యావరణ శాఖ మంత్రి తదహికో ఇటోతో పాటు పలు దేశాల నుంచి 40 మంది మేయర్లు, భారత్ నుంచి 100 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. వీరంతా సమగ్ర పట్టణాభివృద్ధిపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటారని పేర్కొన్నారు. -
చెత్త నుంచి కొత్త ఫర్నిచర్
సాక్షి నాలెడ్జ్ సెంటర్: వీధుల్లోకి వెళితే ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెత్త ఏమైనా ఉందీ అంటే అది ప్లాస్టిక్ మాత్రమే. ఇప్పటివరకూ వదిలించుకునే దారి లేదు కాబట్టి నడిచిపోయిందిగానీ ఇకపై మాత్రం అలా కాదు. ఎందుకు అంటారా? సమాధానం ఈ ఫొటోల్లో ఉంది. ప్లాస్టిక్‌తోపాటు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను కూడా అక్కడికక్కడే రీసైకిల్ చేసే యంత్రం ఇది. పేరు ట్రాష్ ప్రెస్సో. పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతోనే ఇది పని చేస్తుంది. పెంటాటోనిక్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్ తయారు చేస్తుంది. ఇటీవల లండన్‌లో జరిగిన డిజైన్ ఫెస్టివల్లో దీన్ని సోమర్సెట్ హౌస్ వద్ద ప్రదర్శించారు. అక్కడికొచ్చిన వారందరినీ తమ వద్ద ఉన్న వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తమకివ్వమని కోరి.. అక్కడికక్కడే ఆ బాటిళ్లతో ఫుట్‌పాత్‌లపై వేసుకోగల టైల్స్‌ను తయారు చేశారు. ఎలాంటి ప్రమాదకర రసాయనాలను వాడకుండా తాము ఈ పని చేయగలుగుతున్నామని, దీనివల్ల ఉత్పత్తి అయ్యే టైల్స్ కూడా పెద్దగా ఖరీదు చేయవని పెంటాటోనిక్ వ్యవస్థాపకుడు జొహాన్ బోడెకర్ తెలిపారు. దాదాపు వారం రోజుల పాటు ఈ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తయారైన టైల్స్‌ను నల్లటి గోళాల ఆకారంలో అమర్చి వాటిని అక్కడే అందంగా ఏర్పాటు చేశారు కూడా. అమెరికన్ కంపెనీ స్టార్ బక్స్ యూకే విభాగం ఈమధ్యే పెంటాటోనిక్తో చేతులు కలిపింది. తమ కాఫీ షాపుల్లోని ఫర్నిచర్ మొత్తాన్ని ట్రాష్ ప్రెస్సో లాంటి యంత్రాలు తయారు చేసే రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద చూస్తే ప్లాస్టిక్ చెత్తను ఎక్కడో దూరంగా తరలించి రీసైకిల్ చేసే పద్ధతికి ట్రాష్ ప్రెస్సో ఫుల్స్టాప్ పెట్టేయగలదన్నమాట! -
చెత్తకు రీసైక్లింగ్
ప్రపంచంలో ఏ మూలకెళ్లినా కనిపించే సమస్య.. ప్లాస్టిక్ చెత్త!. బాటిళ్లు, పాలిథీన్ కవర్లు ఇలా రకరకాల రూపాల్లో అందరినీ చికాకుపెట్టే ప్లాస్టిక్‌ను వదలించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఈలోపుగా... పర్యావరణానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మినీవిజ్ అనే డిజైనింగ్ కంపెనీ మాత్రం ఇకపై ప్లాస్టిక్ చింత వద్దంటోంది. అన్ని రకాల చెత్తను ఈ మెషీన్ (ఫొటోలో ఉన్నదే)లో పడేయండి.. టైల్స్గా మార్చేసుకోండి అంటోంది. ఈ యంత్రం పేరు కూడా చేసే పనికి తగ్గట్టుగా ఉందండోయ్! ‘ట్రాష్ప్రెస్లో’! ఓ 40 అడుగుల పొడవైన షిప్పింగ్ కంటెయినర్లో ఇమిడిపోగల ట్రాష్ప్రెస్లో చేసే పని చాలా తేలికైనది. వేసిన ప్లాస్లిక్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్తుంది. ఆ తరువాత కరిగించి టైల్స్ రూపంలో అచ్చు వేస్తుందన్నమాట. ఈ టైల్స్‌ను ఇళ్లల్లో, పేవ్మెంట్లపై ఎక్కడైనా వాడుకోవచ్చు. ఐదు ప్లాస్టిక్ బాటిళ్లను వాడితే ఒక టైల్ బయటికొస్తుందని, తగినంత చెత్త ఉపయోగిస్తే గంట తిరక్కుండానే 10 చదరపు మీటర్ల సైజున్న టైల్స్‌ను సిద్ధం చేయవచ్చునని మినీవిజ్ అంటోంది. అంతేకాదండోయ్... ఈ యంత్రం నడిచేందుకు పెట్రోలు, డీజిల్ లాంటివి ఏవీ వాడాల్సిన అవసరం లేదు. మొత్తం సౌరశక్తితోనే పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. హిమాలయ పర్వతాల సమీపంలోని నియాన్బావో యూజీ హిమనదం వద్ద పర్యాటకులు వాడిపారేసిన చెత్త మొతాన్ని చక్కబెట్టేందుకు త్వరలో దీన్ని వాడనున్నారు.