retired judge
-
విలువలు లోపించాయి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగ విలువలు లోపించాయని, అధికారం వచ్చాక తాము ఏది చేసినా చెల్లుతుందనే ధోరణి కొనసాగుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా గురువారం ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడు గురించి రచించిన ‘మూడు దారులు’పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ జె.చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరంగా విధివిధానాలు వేరైనా.. ముగ్గురి గమ్యం ఒక్కటేనని అన్నారు. పాదయాత్ర అనంతరం వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. ఒక సందర్భంలో వైఎస్‌ను కలసినప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. నేరుగా ప్రజల చెంతకు వెళ్లి, వారికి నమ్మకం కల్పించిన నాయకుడే అధికారాన్ని పొందగలుగుతాడని ఆయన పేర్కొన్నారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి జననేతగా నిలిచారన్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాడు.. ఒక పాత్రికేయునిగా తాను చూసిన వాస్తవ సంఘటనలను తన అభిప్రాయాలుగా మూడు దారలుగా తీసుకువచ్చానని రచయిత దేవులపల్లి అమర్ అన్నారు. ఉత్తరాది రాజకీయ నాయకులకు దక్షణాదిలో కొనసాగుతున్న వాస్తవ రాజకీయ పరిణామాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఇదే పుస్తకాన్ని ‘డక్కన్ పవర్ ప్లే’పేరుతో ఇంగ్లిష్‌లో కూడా తీసుకువచ్చానని చెప్పారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అసమ్మతి నేతగా కొనసాగి, ప్రజల మొప్పుతో ఆ పార్టీనే తనపైన ఆధారపడేలా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులతోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారుకానీ, చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసిన ప్రతీసారి బాబు ఓడిపోయారన్నారు. 1993లో ఎన్టీఆర్ తనకు జరిగిన మోసాన్ని తిప్పికొట్టి 1994లో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారని, కానీ కొద్ది రోజుల్లోనే ఆయనకు వెన్నుపోటు పోడిచి చంద్రబాబు సీఎంగా మారారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన తండ్రికి భిన్నంగా ప్రయాణం చేశారని, ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ నిరాకరిస్తే ఆ పార్టీనే వదిలి ప్రజల చెంతకు చేరారని అన్నారు. కక్షసాధింపుతో ఆ పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టినా 16 మాసాలు జైల్లో ఉండి, అనంతరరం ప్రజల మెప్పుతో 2019లో ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరం, చక్రధర్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
UCC CODE: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ)ని హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ త్వరలో అమలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారమే ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని తెలుస్తోంది. తద్వారా దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అది నిలవనుంది. యూసీసీపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఒకట్రెండు రోజుల్లో సీఎం పుష్కర్‌సింగ్ ధామికి నివేదిక సమరి్పంచనుంది. దీపావళి అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై యూసీసీ బిల్లును ఆమోదించనుంది. తద్వారా దానికి చట్టబద్ధత కలి్పంచనుంది. ఎన్నికల వాగ్దానం: ఉత్తరాఖండ్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లో యూసీసీ అమలు ప్రధానమైనది. ఆ మేరకు జస్టిస్ దేశాయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి కేబినెట్ భేటీలోనే సీఎం ధామీ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ తయారీ కోసం రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మందితో కమిటీ చర్చలు జరిపింది. యూసీసీ డ్రాఫ్ట్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు. ఏమిటీ ఉమ్మడి పౌర స్మృతి? ► కులం, మతం, ఆడ–మగ వంటి తేడాలు, లైంగిక ప్రవృత్తులతో నిమిత్తం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం ఉమ్మడి పౌర స్మృతి ప్రధానోద్దేశం. ► ఇది అమలైతే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు మత, ఆచార, సంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. ► వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత తదితరాలతో పాలు పలు ఇతర వ్యక్తిగత అంశాలు కూడా యూసీసీ పరిధిలోకి వస్తాయి. ► రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెరపైకి తెచ్చారు. ► 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనుందని చెబుతున్నారు! ► గోవాలో ఇప్పటికే గోవా పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది చాలా రకాలుగా యూసీసీని పోలి ఉంటుంది. రాజ్యాంగం ఏమంటోంది? ‘‘దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలి’’ అని రాజ్యాంగంలోని 4వ భాగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే దీన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేర్కొన్నారు. కనుక దీని అమలు తప్పనిసరి కాదు. ఆ దృష్ట్యా యూసీసీ అమలుకు కోర్టులు ఆదేశించజాలవు. సుప్రీంకోర్టు కూడా... అత్యున్నత న్యాయస్థానం కూడా పలు తీర్పుల సందర్భంగా యూసీసీ అమలు ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అయితే 2018లో మోదీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూసీసీపై లోతుగా పరిశీలించిన కేంద్ర లా కమిషన్ మాత్రం భిన్నాభిప్రాయం వెలిబుచ్చడం విశేషం. ‘‘ఈ దశలో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమూ లేదు. అభిలషణీయమూ కాదు’’ అంటూ కేంద్రానికి ఏకంగా 185 పేజీల నివేదిక సమరి్పంచింది! పారీ్టల్లో భిన్నాభిప్రాయాలు... యూసీసీ అమలుపై రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ దీన్ని గట్టిగా సమరి్థంచడమే గాక అధికారంలోకి వస్తే దేశమంతటా యూసీసీని కచి్చతంగా అమలు చేస్తా మని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో హా మీ కూడా ఇచ్చింది. ఇక కాంగ్రెస్, మజ్లిస్ తదితర పక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి... ► ప్రధాని మోదీ తొలినుంచీ యూసీసీ అమలును గట్టిగా సమరి్థస్తూ వస్తున్నారు. రెండు రకాల చట్టాలతో దేశం ఎలా నడుస్తుందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశ్నించారు. ► ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ తదితరులు కూడా పలు సందర్భాల్లో యూసీసీని సమరి్థంచారు. ‘‘దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలన్నదే మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం కూడా. దాని అమలుకు ఇదే సమయం’’ అని ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. ► యూసీసీ పేరుతో ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పెను సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యమని కాంగ్రెస్ దుయ్యబడు తోంది. ► రాజ్యాంగంలోని 29వ అధికరణానికి యూసీసీ విరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ‘‘బహుళత్వం, వైవిధ్యమే మన దేశ సంపద. యూసీసీ పేరుతో వాటికి తూట్లు పొడిచేందుకు మోదీ ప్రయ తి్నస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ► యూసీసీ వస్తే తమ సాంప్రదాయిక ఆచారాలకు అడ్డుకట్ట పడుతుందేమోనని దేశవ్యాప్తంగా 30 పై చిలుకు గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే సందేహం వెలిబుచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీ నూతన గవర్నర్‌గా రిటైర్డ్ జడ్జి.. ఎవరీ జస్టిస్ అబ్దుల్ నజీర్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు. కాగా ఏపీకి మూడో గవర్నర్‌గా రానున్న సయ్యద్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి. గత నెల జనవరిలో పదవీ విరమణ చేశారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ఫకీర్ సాహెబ్. ముడబిద్రి ప్రాంతంలోని మహవీర కళాశాలలో బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన మంగళూరులోని కొడియాల్‌బైల్‌లోని ఎస్డీఎమ్ కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు. చదవండి: ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు హైకోర్టు న్యాయమూర్తిగా 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోషన్ పొందిన మూడో న్యాయమూర్తి నజీర్ కావడం విశేషం. కీలక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ పలు కీలక తీర్పులను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి. ముస్లిం షరియా చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ అనుమతించబడుతుందని నజీర్‌తోపాటు మరొ న్యాయమూర్తి సమర్థించారు. అయితే బెంచ్‌లో 3:2 మెజారిటీతో ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించడంతో ఈ కేసు వీగిపోయింది. అయోధ్య రామమందిరంపై తీర్పు 2019లో అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ నజీర్ కూడా సభ్యుడు. ధర్మాసనంలోని అయిదుగురు జడ్జీలు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగానే తీర్పునిచ్చారు. అయితే రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు జస్టిస్ నజీర్ రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2016లో రూ.500,1000 నోట్ల రద్దుకు సంబంధించిన కేసులను విచారించింది. జనవరి 4న రిటైర్మెంట్ అవ్వగా.. నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవికి సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. -
ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం.. ఆయన వల్లే!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదట్లో పంజాబ్ పర్యటన సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసనలతో కొద్దిసేపు ఆయన కాన్వాయ్ నిలిచిపోవడం తీవ్ర దుమారం చెలరేగింది. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటనపై సుప్రీం కోర్టు ఓ కమిటీని నియమించగా.. ఆ కమిటీ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఆ రిపోర్ట్‌ను ఇవాళ(గురువారం) సుప్రీం ధర్మాసనం బయటపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యం వ్యవహారానికి సంబంధించి.. ఫెరోజ్‌పూర్(ఫిరోజ్‌పూర్) ఎస్ఎస్పీ(సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్) నిర్లక్ష్యమే కారణమని నివేదిక వెల్లడించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. కమిటీ నివేదికను చదివి వినిపించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్.. సరిపడా సిబ్బంది ఉన్నా ఫెరోజ్‌పూర్ ఎస్ఎస్పీ విధి నిర్వహణలో విఫలం అయ్యారని, అదీగాక ప్రధాని మోదీ పర్యటన గురించి రెండు గంటల ముందే ఆయనకు(ఫెరోజ్‌పూర్ ఎస్ఎస్పీ) సమాచారం ఉన్నా సరైన చర్యలు చేపట్టలేకపోయారని కమిటీ నివేదిక పేర్కొందని తెలిపారు. ఇది సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యం ఎంత మాత్రంకాదని, కేవలం పంజాబ్ పోలీస్ అధికారి వైఫల్యమని తమ దర్యాప్తులో స్పష్టంగా తేలిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని, తద్వారా సంబంధిత చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. ఇదిలా ఉంటే.. జనవరి 5వ తేదీ, 2022 పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ కాన్వాయ్.. రైతుల నిరసనలతో ఫెరోజ్‌పూర్-మోగా మార్గంలో పియారియానా రోడ్డు ఓవర్‌బ్రిడ్జిపై సుమారు 20 నిమిషాలపాటు ఆగిపోయింది. ఊహించని ఈ ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధానికి ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో భద్రతపై ఆందోళన వ్యక్తం అయ్యింది. విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో ఓ కమిటీని నియమించగా.. అందుకు సంబంధించిన నివేదికను కూడా సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదీ చదవండి: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు -
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్డ్ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం ఏప్రిల్ 4వ తేదీని గడువుగా విధించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతు నిరసనల సందర్భంగా.. రైతుల మీదుగా కారు పనిచ్చి వాళ్ల మరణాలకు కారణం అయ్యాడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బాధిత కుటుంబం. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వింటోంది. ఈ మేరకు ఇంతకు ముందు(మార్చి 16న) యూపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన నిందితుడు అశిశ్ మెహ్రాకు ‘బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ నోటీసులు సైతం జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్ ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా. -
మాజీ జడ్జి ఆధ్వర్యంలోనే దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నియమించిన సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డు న్యాయమూర్తిని నియమించాలన్న సుప్రీంకోర్టు ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘ధర్మాసనం సరైన వ్యక్తిగా భావించి ఎవరిని నియమించినా యూపీ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఈ విషయంలో సదరు అధికారి సమర్థతే తప్ప, రాష్ట్రంతో సంబంధం లేదు’అని హరీశ్ సాల్వే ధర్మాసనానికి నివేదించారు. దీంతో న్యాయమూర్తి పేరును బుధవారం ఖరారు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తు ప్రగతిని ఈ న్యాయమూర్తి రోజువారీ సమీక్షిస్తారని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందంలో దిగువ స్థాయి..సబ్ ఇన్స్పెక్టర్, డీఎస్పీలు అదికూడా లఖీమ్‌పూర్ ఖేరికి చెందిన అధికారులే ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. సిట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. యూపీ క్యాడర్లో సొంత రాష్ట్రానికి చెందని ఐపీఎస్ అధికారుల జాబితాను మంగళవారం సాయంత్రానికల్లా అందజేయాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా సిట్ చీఫ్‌ను బదిలీ చేశారన్న పిటిషనర్ అభ్యర్థనపైనా పరిశీలన జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. పరిహారం దక్కని వారు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకునేలా చేస్తానని యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు. -
ఆ రిటైర్డు జడ్జి విచారణ ఎదుర్కోవాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డు న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులను అంత తేలికగా తీసిపడేయలేమని, రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. బాధితురాలు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నంత మాత్రాన, డిపార్టుమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించకుండా హైకోర్టును అడ్డుకోవడం సాధ్యంకాదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్‌లోని రిటైర్డు జిల్లా జడ్జిపై ఆయన జూనియర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే, అనివార్య కారణాల దృష్ట్యా కొన్నాళ్ల క్రితం ఆమె కేసు వాపసు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సదరు జడ్జిపై ఇన్‌హౌజ్ డిపార్టుమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు విచారణ నుంచి విముక్తి కల్పించాల్సిందిగా కోరారు. ఆయన తరఫు న్యాయవాది శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ.. ‘‘నా క్లైంట్ హైకోర్టు జడ్జిగా ప్రమోట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసిన సమయంలోనే ఈ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నానని చెబుతూ బాధితురాలు కేసు వెనక్కి తీసుకున్నారు’’ అని తెలిపారు. ఇందుకు స్పందించిన సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘లైంగిక వేధింపుల కేసులను తేలికగా తీసిపడేయలేం. ఒక వ్యక్తి ఒక సన్నని మంచుగడ్డపై నడుస్తూ ఉన్నారు.. అది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు. దాంతో అతడు కూడా కిందపడతాడు. మీ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. విచారణకు అంగీకరిస్తే నిర్దోషిగా తేలే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి విచారణ ఎదుర్కోండి. జూనియర్‌తో ఓ జడ్జి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఒకవేళ బాధితురాలు వేధింపుల కారణంగానే కేసు వెనక్కి తీసుకున్నారేమో! కాబట్టి హైకోర్టును విచారణకు ఆదేశించకుండా అడ్డుకోవడం కుదరదు. నిజంగా ఏ తప్పు చేయకపోతే, విచారణ ద్వారా నిర్దోషిగా తేలే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు’’ అంటూ కచ్చితంగా విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. చదవండి: చెక్ బౌన్స్ కేసుల సత్వర విచారణపై సుప్రీం దృష్టి -
ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి?
సాక్షి, అమరావతి: కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలహాబాద్ హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దంతులూరి శ్రీనివాస రంగనాథవర్మ స్పష్టం చేశారు. ఇంట్లో వాళ్లు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదనేందుకు న్యాయమూర్తులేమీ చట్టాలకు అతీతులు కారన్నారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధన పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తరువాత ఈ విషయాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమంటే అది గొంతు నొక్కేయడమేనన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం.. ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ, లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. గతంలోనూ చాలా మంది రాశారు. ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత హోదాలో కాకుండా ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేఖను బహిర్గతం చేయడంలో మంచి చెడులను ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం. గతంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, జోసెఫ్ మరొకరు మీడియా ముందుకు వచ్చి రోస్టర్ విషయంలో నాటి ప్రధాన న్యాయమూర్తి పారదర్శకంగా వ్యవహరించడం లేదని బహిరంగంగా తమ ఆవేదనను గొంతెత్తి చెప్పారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు.. 2004–05లో ఇంగ్లాడ్ బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయవ్యవస్థపై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టుకలిగి ఉన్నారని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. విదేశీ స్కాలర్స్ కూడా భారత న్యాయవ్యస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయకూడదంటే ఎలా..? ముఖ్యమంత్రి ఫిర్యాదుపై సుప్రీంకోర్టు సీజే ఓ కమిటీ ద్వారా అంతర్గత విచారణ జరుపుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఆరోపణలు రుజువైతే సాధారణంగా బదిలీ చేస్తారు. లేదా రకరకాల కారణాలతో చర్యలు తీసుకుండానే వదిలేస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేశారనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? ఆధారాలున్నప్పుడు కూడా ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? బాధతోనే సీఎం స్పందించారు.. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించరాదు. వ్యవస్థలను అభద్రతా భావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదు. అలా అభద్రతా భావం కలిగించినప్పుడు బాధతోనే ముఖ్యమంత్రి స్పందించి సీజేఐకి లేఖ రాశారు. అందులో తప్పేమీ లేదు. కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు వాడరాదు. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడమే అవుతుంది. లోతుగా విచారణ జరిపి ఆరోపణలకు ఆస్కారం రాకుండా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు... ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు. అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత దర్యాప్తు పూర్తి చేయాలి. అది ఆపడానికి వీల్లేదు. హైకోర్టు దర్యాప్తును ఆపేయడమే కాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చింది. అలా చేసి ఉండాల్సింది కాదు. నియామకాల్లో పారదర్శకత ఉండాలి.. న్యాయవ్యవస్థలో చాలా వరకు రాజకీయ నియామకాలేనన్న ఆరోపణలున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత ఉండాలి. అభిప్రాయ సేకరణ జరగాలి. సమర్థతకు పట్టం కట్టాలి. ఇష్టానుసారంగా నిందలు సరికాదు... న్యాయమూర్తుల బెంచ్ మీద నుంచి ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నది నా అభిప్రాయం. నేను జడ్జిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఒకరు ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారని వ్యాఖ్యానించడంపై సీజేకు ఫిర్యాదు వెళ్లింది. ప్రభుత్వమే భూ కబ్జాదారంటే ఎలా? అది ఎంత పెద్ద మాట? కోర్టులు, న్యాయమూర్తులు ఇలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఇక సుప్రీంకోర్టు సీజేకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు? ఆ లేఖలు.. మక్కీకి మక్కీ జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఓ న్యాయమూర్తికి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిర్గతం చేయడం సంచలనం రేకెత్తించింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు లేఖ వచ్చింది. రెండు లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి? ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నదే ప్రజల ఆకాంక్ష. -
కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కరోనా భయం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో శుక్రవారం రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి మియాపూర్‌లోని న్యూసైబర్ హిల్స్‌లో కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో రామచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా బెడ్రూంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కోవిడ్‌తో ‘లోక్‌పాల్’ త్రిపాఠీ కన్నుమూత
న్యూఢిల్లీ: లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్ సోకి చనిపోయారు. కోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో శనివారం రాత్రి కన్నుమూశారని అధికారులు తెలిపారు. ఆయన కుమార్తె, పని మనిషికి కూడా ఈ వైరస్ సోకిందని, వారు కోలుకున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరు. -
ఎన్ కౌంటర్ పై విచారణకు రిటైర్డ్ జడ్జి
-
ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: దిశ హత్యాచారం ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రతిపాదించింది. బాధ్యులైన పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఘటనపై దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని, ఇదివరకే ఈ కోర్టు జారీచేసిన 16 మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని న్యాయవాదులు జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం, ముకేశ్‌కుమార్ శర్మ దాఖలు చేసిన మరో ప్రజాహిత వ్యాజ్యం బుధవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద విచారించాల్సిన కేసుల జాబితాలో నమోదయ్యాయి. అయితే మధ్యాహ్న భోజన సమయంలో ఈ పిటిషన్లను సంబంధిత న్యాయవాదులు ప్రస్తావించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ.బాబ్డే తొలుత స్పందిస్తూ.. ‘ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం మాకు తెలుసు. ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించేందుకు ఈ పిటిషన్‌ను అనుమతిస్తున్నాం. రిటైర్డ్ న్యాయమూర్తి ఇక్కడి (ఢిల్లీ) నుంచే దర్యాప్తు ప్రక్రియ చేపడతారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డిని ఈ విషయమై సంప్రదించాం. అయితే ఆయన సుముఖత చూపలేదు. ఈ విధి నిర్వహణకు మరో రిటైర్డ్ న్యాయమూర్తిని సంప్రదిస్తాం..’అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘పీయూసీఎల్ కేసులో 2014లో ఈ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉత్తర్వులు జారీచేసే ముందు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినాలి..’అని నివేదించారు. సలహాలు, సూచనలుంటే చెప్పొచ్చన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదావేసింది. ఈ సందర్భంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ గోడా రఘురాం నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఎన్కౌంటర్లపై ఇచ్చిన తీర్పును కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ.బాబ్డే ప్రస్తావించారు. -
అయోధ్య తీర్పును వ్యతిరేకించిన జస్టిస్ గంగూలీ
సాక్షి, న్యూఢిల్లీ : దీర్ఘకాలంగా నలుగుతున్న అయోధ్య వివాదానికి స్వస్తిపలుకుతూ సుప్రీం కోర్టు వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కు అప్పగిస్తూ వెలువరించిన తీర్పు పట్ల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఏకే గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం కేంద్రానికి అప్పగించాలన్న సర్వోన్నత న్యాయస్ధాన నిర్ణయం మైనారిటీల దృష్టిలో సరైంది కాదని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో తాను కలత చెందానని ఆయన చెప్పారు. ‘రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులు ప్రసాదించింది. అయితే ఈ కేసులో మైనారిటీలకు న్యాయం జరగలేద’ని రిటైర్డ్ జస్టిస్ గంగూలీ వ్యాఖ్యానించారు. బాబ్రీమసీదును కూల్చివేశారనేది కాదనలేని విషయమని, సుప్రీం కోర్టు సైతం తన తీర్పులో బాబ్రీ విధ్వంసం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిందని అన్నారు. దీన్నిబట్టి చూస్తే సుప్రీం తీర్పుతో మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నది స్పష్టమని చెప్పారు. -
‘అగ్ర’ కోటా మౌలిక సూత్రాలకు వ్యతిరేకం
హైదరాబాద్ : అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సామాజిక న్యాయానికి తీవ్ర వ్యతిరేక మని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఓ బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. బిల్లుకు వ్య తిరేకంగా ఫిబ్రవరి 11న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు. బిల్లును వ్యతిరేకించిన ఆర్జేడీ, ఆప్, ముస్లింలీగ్, ఎంఐఎం పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలభార తీయ ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, బీసీ మహాజన సమితి సంయుక్త ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. సామా జికంగా వెనకబడి ఉన్న వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉంటే దాన్ని పట్టించుకోకుండా రిజర్వేషన్లు కల్పించడమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల రాజ్యాంగం పరం గా అంటరాని తనం చూపినట్లే అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీకి మద్దతుగా గులాబీ , పచ్చ పార్టీలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై వీధిపోరాటం చేస్తూనే న్యాయపోరాటం చేస్తున్నామని దీనిలో భాగంగానే ఢిల్లీలో ధర్నా నిర్ణయం, తాను హైకోర్టులోనూ, జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 9 శాతం, ఆఖరుకు 9.5 శాతం ఉన్న అగ్రవర్ణాలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 27 శాతం ఇవ్వడం దారుణమన్నారు. 56 శాతం ఉన్న బీసీలు ఉద్యోగాల్లో 8 శాతం మాత్రమే ఉన్నారని ఇంకా రిజర్వేషన్లలో కోత విధించడం సబబా అని ప్రశ్నించారు. గతంలో వర్సి టీ యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఇచ్చేవారని, కానీ అగ్రవర్ణాలకు చెందిన కొందరు కోర్టుకు వెళ్లగా డిపార్ట్మెంట్ యూనిట్‌గా కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనితో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించిందన్నారు. దీనివల్ల బీసీలకు నష్టంవాటిల్లుతోందని, వర్సిటీ ఉన్నత ఉద్యోగాల్లో ఇక బీసీలు ఉండరని తెలిపారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ, అసమానతల మధ్య సమాన పోటీ ఉండరాదని రిజర్వేషన్లు కేటాయించగా తిరిగి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వ డం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 85 శాతం ఉన్న బడుగులకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన 50 శాతం జనరల్ కోటా కింద 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు, అందరికీ కేటాయించారని ఇంకా వారికి రిజర్వేషన్లు ఎందుకన్నారు. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి పాలకులకు తగిన బుద్ధి చెపుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పలువురు పాల్గొన్నారు. -
మాజీ సీజేఐ మిశ్రాపై బయటి ఒత్తిళ్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీజేఐ జస్టిస్ మిశ్రా బాహ్య శక్తుల ఒత్తిడికి లోబడి పనిచేశారని, దీని ప్రభావం న్యాయవ్యవస్థ పరిపాలనపై పడిందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అప్పటి సీజేఐ కొన్ని బాహ్య శక్తుల ప్రభావానికి లోబడి పనిచేశారు. ఆయన రిమోట్ కంట్రోల్ నియంత్రణలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ఆ వెలుపలి శక్తి రాజకీయ పార్టీనా లేక ప్రభుత్వమా అనే విషయం వివరించేందుకు, ఏఏ కేసుల కేటాయింపులో సీజేఐ ఏకపక్షంగా వ్యవహరించారో తెలిపేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా.. సుప్రీంకోర్టులోని అందరు జడ్జీలు ఇదే నమ్మకంతో ఉన్నారని జస్టిస్ కురియన్ బదులిచ్చారు. సీజేఐ జస్టిస్ మిశ్రా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న విషయం స్పష్టమయ్యాకే తాము మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతి వంటి కీలక కేసు కేటాయింపు కూడా అసంతృప్తికి కారణమా అని ప్రశ్నించగా ఫలానా విషయమంటూ ప్రత్యేకంగా చెప్పలేనన్నారు. కేసుల కేటాయింపుతోపాటు సుప్రీంకోర్టు పరిపాలన సంబంధిత అంశాలు కారణమని వివరించారు. కీలకమైన సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి బీహెచ్ లోయా 2014లో నాగపూర్‌లో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిందితుడిగా ఉన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతిపై తిరిగి దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయనది సహజ మరణమేనని స్పష్టం చేసింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు పనితీరు మెరుగైందనీ, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు. -
మాజీ జడ్జి ఆత్మహత్య.. భార్య కూడా...
తిరుపతి క్రైం: తిరుచానూరులో నివాసముంటున్న ఓ మాజీ జడ్జి ఆనారోగ్యంతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం నగరంలో చోటుచేసుకుంది. భర్త మరణాన్ని భరించలేని ఆయన భార్య సైతం కొద్ది గంటల తర్వాత అదే ప్రదేశంలో అదే రీతిలో రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడడం తిరుపతి నగరంలో కలకలరం రేపింది. రైల్వే సీఐ ఆశీర్వాదం కథనం మేరకు.. పామూరు సుధాకర్ (63), భార్య వరలక్ష్మి (56) తిరుచానూరులోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. సుధాకర్ అదనపు జిల్లా జడ్జిగా మహబూబ్‌నగర్‌లో పనిచేస్తూ 2014లో రిటైరయ్యారు. వీరికి సందీప్, అజిత అనే ఇద్దరు పిల్లలు వున్నారు. వీరివురికి వివాహమైంది. సుధాకర్ గత కొంతకాలంగా కాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీంతో తీవ్ర మనోవేదన చెందిన ఆయన.. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్ రాసి శుక్రవారం తెల్లవారుజామున ఇల్లు వదలి వెళ్లిపోయారు. ఉదయం 11 గంటల సమయంలో చదలవాడ విద్యాసంస్థల సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీలకు సమాచారమిచ్చారు. కుమారుడు సందీప్ ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. అదే చోట భార్య కూడా.. మరోవైపు.. భర్త ఆత్మహత్యతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మీ.. కుటుంబ సభ్యుల దృష్టి మళ్లించి సాయంత్రం అదే ప్రదేశంలో ఆమె కూడా రైలుకింద పడి తనుకు చాలించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఆమెను సుధాకర్ భార్యగా గుర్తించారు. మరణంలోనూ భర్త అడుగుజాడల్లో ఆమె నడవడం బంధుమిత్రులు, చుట్టుపక్కల వారిని కంటనీరు పెట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. ఇదిలా ఉంటే.. సుధాకర్ ఓ ప్రైవేట్ చిట్స్ కంపెనీలో కేసుల పరిష్కారానికి ఆర్బిట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన తిరుపతిలో సీనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుధాకర్ దంపతుల మృతికి తిరుపతి న్యాయవాదుల సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వి. శ్రీనివాసులు, పలువురు న్యాయవాదులు సంతాపం వ్యక్తంచేశారు. -
సినిమా దర్శకుడిగా మారిన రిటైర్డ్ న్యాయమూర్తి!
సాక్షి, తమిళసినిమా: ఇతర రంగాల్లో పేరు, ప్రఖ్యాతలు గండించిన ప్రముఖులు సైతం సినిమారంగంలోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ కోవలో విశ్రాంత న్యాయమూర్తి చేరబోతున్నారు. విశ్రాంత న్యాయమూర్తి అయిన ఎం. పుహళేంది త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వంతోపాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టి.. సెల్లమ్ అన్కో క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘వేదమానవన్’ .. మనోజయంత్ అనే నూతన నటుడు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మధ్యప్రదేశ్ మోడల్ ఊర్వశీ జోషీ హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఢిల్లీగణేశ్, బెంజిమిన్, బోండామణి, ములైయూర్ సోనై ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఎస్.కన్నన్... సంగీతం సౌందర్యన్ అందిస్తున్నారు. ‘ఒక ఉరి శిక్ష ఖైదీ విడుదలై వస్తే అతన్ని ఊరు ప్రజలు తమతో కలుపుకుంటారా లేదా అన్న ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం వేదమానవన్’అని దర్శకుడు పుహళేంది తెలిపారు. ఇందులో ప్రేమ, శోకం, వీరం, హాస్యం తదితర అంశాలుంటాయని, సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాలన్న ఉద్దేశంతో తాను తీర్పులిచ్చిన అంశాలను తీసుకుని ఈ చిత్రకథను తయారు చేసుకున్నానని తెలిపారు. తాను ఇప్పటివరకూ తమిళం, ఇంగ్లిష్ భాషల్లో 22 నవలలు రాశానని తెలిపారు. అదేవిధంగా 2015లో చెన్నైని ముంచెత్తిన వరద ఘోరాన్ని యథాతథంగా పుస్తకంగా రాసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్.మోహన్ సలహాతో తాను సాహితీరంగం నుంచి సినీ రంగంలోకి వచ్చినట్లు తెలిపారు. -
రిటైర్డు జస్టిస్ కోదండ రామయ్య కన్నుమూత
న్యూఢిల్లీ: రిటైర్డు జస్టిస్ పమిడిఘంటం కోదండ రామయ్య (92) శుక్రవారం ఢిల్లీలో కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనున్నాయి. 1926లో జన్మించిన కోదండ రామయ్య 1952లో మద్రాసు హైకోర్టులో అడ్వకేటుగా జీవితాన్ని ప్రారంభించారు. 1982లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1988 వరకు ఈ బాధ్యతల్లో ఉన్నారు. ‘అర్ష విజ్ఞాన ట్రస్ట్’ అనే పబ్లిషింగ్ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. -
రణరంగంగా తూత్తుకుడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ యూనిట్‌కు వ్యతిరేకంగా తూత్తుకుడిలో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. బుధవారం పోలీసులు జరిపిన కాల్పులకు 22 ఏళ్ల యువకుడు బలయ్యాడు. మంగళవారం నాటి కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు. దీంతో రెండ్రోజుల వ్యవధిలో ఇక్కడ మృతిచెందిన వారి సంఖ్య 13కు పెరిగింది. ఆందోళనకారులు అన్నానగర్‌లో బుధవారం కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోలీసులపైకి రాళ్లు, ఇటుకలు రువ్వడంతో వారు కాల్పులు జరిపారు. తూత్తుకుడి హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. మరోవైపు, స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెం డు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. -
నోట్లో యాసిడ్ పోసి.. చోరీకి యత్నం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): చోరీ కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడింది. వృద్ధురాలి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేయగా... బాధితురాలు గట్టిగా అరవడంతో నోటిలో యాసిడ్ పోసి నిందితురాలు పరారయింది. ఈ దుర్ఘటన రిటైర్డ్ జడ్జి ఇంటిలో చోటు చేసుకుంది. ఎంవీపీ జోన్ ఎస్ఐ గోవింద్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 2లో రిటైర్డ్ జడ్జి రామారావు, సత్యవతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవా రం సాయంత్రం రామరావు వాకింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో వారి ఎదురింటిలో పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళ సత్యవతి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేసింది. సత్యవతి పెద్దగా అరవడంతో రమణమ్మ వెంటనే బాత్రూమ్లో ఉన్న యాసి డ్ తీసుకొచ్చి సత్యవతి నోటిలో పోసి పరారయింది. స్థానికులు సత్యవతిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె భర్త రిటైర్డ్ జడ్జి రామారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిక్కేది ఎవరో?
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై కమ్ముకున్న అనుమానాల మేఘాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఏట్టకేలకూ పనిచేయడం ప్రారంభించింది. కమిషన్ చైర్మన్‌గా గతంలో బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి శుక్రవారం చెన్నై ఎళిలగం భవనంలోని కమిషన్ కార్యాలయానికి వచ్చి విచారణ పనుల్లో నిమగ్నమయ్యారు. జయ మరణ మిస్టరీకిబాధ్యులను చేసే ప్రయత్నంలో ఎవరెవరు విచారణకుగురవుతారోననే చర్చ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై : స్వల్ప అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తరువాత బాహ్య ప్రపంచంలోకి రాకుండానే అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. కోలుకుని ఇంటికెళ్లాల్సిన జయలలిత కానరానిలోకాలకు పోవడంపై అమ్మ అభిమానులు కోపంతో భగ్గుమన్నారు. న్యాయవిచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని అప్పటి అన్నాడీఎంకే చీలిక వర్గనేత పన్నీర్‌సెల్వం, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నలువైపులా ఒత్తిడి పెరగడంతో న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సీఎం ఎడపాడి పళనిస్వామి గత నెల 25వ తేదీన ఒక ప్రకటన చేశారు. కమిషన్ చైర్మన్‌గా రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామిని నియమించి జయ మరణంపై మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చెన్నై మెరీనాబీచ్రోడ్డులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ ఎళిలగం భవనంలో కమిషన్ కార్యాలయాన్ని కేటాయించారు. ఇదిలా ఉండగా కమిషన్ ఏర్పాటై నెలరోజులు పూర్తయినా దాటినా విచారణ ప్రారంభం కాలేదు. కార్యాలయ పనులు పూర్తికానందున మరింత జాప్యం ఖాయం, గడువులోగా నివేదిక సమర్పణ అసా«ధ్యమని రెండురోజుల క్రితం మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమిషన్ కార్యాలయానికి వచ్చి పనులు ప్రారంభించారు. ఈనెల 30వ తేదీన పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని పరిశీలించడం ద్వారా ఆర్ముగస్వామి తన విచారణకు శ్రీకారం చుట్టనున్నారు. న్యాయవిచారణ సందర్భంగా ఎవరెవరిని విచారణకు పిలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పోయెస్‌గార్డెన్‌లోని జయ ఇల్లు వేదానిలయం పరిశీలనతో విచారణలో అసలైన అంకం సోమవారం ప్రారంభం అవుతుంది. విచారణ పారదర్శకంగా జరుగుతుందాని ప్రశ్నించగా ‘తప్పకుండా’ అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఒక నోటీసు బోర్డు పెట్టారు. అందులో...జయలలిత మరణం గురించి ప్రత్యేక సమాచారం ఉన్నవారు, నేరుగా సంబంధాలు ఉన్నవారు తగిన ఆధారాలతో సత్యప్రమాణ పత్రం ద్వారా లిఖితపూర్వకంగా తెలుపవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 22వ తేదీలోగా నేరుగా లేదా పోస్టు ద్వారా తమ సమాచారాన్ని చేరవేయవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా, జయ మరణ నేపథ్యంతో సంబంధం ఉన్నవారిని ఆయన నేరుగా పిలిపించి మాట్లాడతారా లేక ఆయన వెళ్లి విచారిస్తారు, విచారణ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి అనే ప్రశ్నలు నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా, పార్టీ నుంచి చీలిపోయిన తరువాత పన్నీర్‌సెల్వం వర్గంలోని కొందరు నేతలు తమ వద్ద సాక్ష్యాధారాలున్నట్లు మీడియా వద్ద ప్రకటించారు. అయితే ప్రస్తుతం వారంతా ఎడపాడితో కలిసిపోయారు. ప్రజలు ఎక్కువగా అనుమానిస్తున్న శశికళను ప్రధానంగా విచారించాలని కోరుకుంటున్నారు. విచారణ కోసం ఆమెను చెన్నైకి రప్పిస్తారా, కమిషన్ చైర్మనే బెంగళూరు జైలుకు వెళతారా, చికిత్స చేసిన లండన్ వైద్యుడి మొదలుకుని అపోలో వైద్యబృందం కూడా కమిషన్ వద్ద క్యూకట్టాల్సిందేనాని చర్చోపచర్చలు సాగుతున్నాయి. -
అమ్మ కోసం ఒకే ఒక్కడు!
సాక్షి, చెన్నై : అమ్మ మరణంపై నిజాలు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను పన్నీర్ వర్గం లేవనెత్తగా.. దానికి పళని ఓకే చెప్పటంతోనే ఆ రెండు వర్గాలు ఒకయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. జయ ఆస్పత్రిలో చేరేందుకు దారితీసిన పరిస్థితుల దగ్గరి నుంచి ప్రతీ విషయాన్ని ఈ మాజీ న్యాయమూర్తి ఒక్కడిగానే దర్యాప్తు చేయనుందన్న మాట. అయితే కీలకమైన ఈ అంశంలో ఆయన ఒక్కడే ఏం చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే.. అమ్మ మృతి వ్యహారంలో అనుమానాలు నివృత్తి చేయటంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే తాను మాత్రం విచారణను చాలా పారదర్శకంగా చేపడతానని అర్ముగస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలో ఆయన తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అమ్మ అనారోగ్యం, ఆస్పత్రిలో 75 రోజుల చికిత్సకు సంబంధించిన పూర్తి విషయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. -
ఆ స్కామ్‌లో రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రైవేట్ వైద్య కళాశాలల అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను విస్మరించి వాటిలో ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రవేశానికి సహకరించిన ఒడిషా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి. రిటైర్డ్ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దుసి సహా ఇతర నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అనంతరం ఢిల్లీ, లక్నో,భువనేశ్వర్‌లలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. నిందితుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ అధినేతలు బీపీ యాదవ్, పలష్ యాదవ్‌లున్నారు. కాగా, ఢిల్లీలోని ఖుద్దుసి నివాసం పైనా దాడులు చేసిన సీబీఐ బృందాలు మొత్తంమీద రూ 1.91 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఖుద్దూసీ న్యాయపరమైన సలహాలు అందించడమే కాకుండా సుప్రీం కోర్టులో వారికి సానుకూల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మౌలిక వసతుల లేమి, అవసరమైన ప్రమాణాలను పాటించకపోడంతో రెండేళ్ల పాటు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు జరపరాదని ప్రభుత్వం 46 కాలేజీలను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీకి చెందిన బీపీ యాదవ్, పలాష్ యాదవ్‌లు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. -
ఓ ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి
♦ సీబీఐ అధికారుల తప్పటడుగు ♦ విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి వెళ్లబోయి ♦ సిట్టింగు న్యాయమూర్తి ఇంట్లోకి అడుగుపెట్టిన వైనం ♦ తప్పిదం గుర్తించి వెంటనే నిష్క్రమణ ♦ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం భువనేశ్వర్ : అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా సీబీఐ బృందాలు రాష్ట్రంలో పలు చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి పూట కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక ఇల్లు బదులుగా మరో ఇంటిలోకి చొరబడి సీబీఐ గిరీ ప్రదర్శించారు. అంతే కథ అడ్డం తిరిగింది. అదో సిట్టింగు న్యాయమూర్తి అధికారిక నివాస భవనం. విశ్రాంత న్యాయమూర్తి ఇంటికి వెళ్లబోయి సిట్టింగు న్యాయమూర్తి ఇంట్లోకి అడుగు పెట్టారు. తప్పిదం గుర్తించి వెంటనే సీబీఐ అధికారులు అక్కడ నుంచి నిష్క్రమించారు. బుధవారం ఉదయం సరికి ఈ సంఘటన ప్రసారం కావడంతో ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో సిట్టింగు ఎమ్మెల్యే ప్రభాత్ రంజన్ బిశ్వాల్ చిట్‌ఫండ్ మోసాల్లో నిందితునిగా అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు బృందం మంగళవారం రాత్రి కటక్ మహా నగరంలో 3 వేర్వేరు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా సీబీఐ అధికారులు పొరపాటుపడ్డారు. విధుల బహిష్కరణ సీబీఐ అధికారుల తప్పటడుగుపట్ల ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై జుడీషియల్ దర్యాప్తు నిర్వహించాలని పట్టుబట్టింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఒడిశా హై కోర్టు బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. సమావేశంలో తీర్మానం మేరకు తక్షణమే విధుల్ని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. విధుల బహిష్కరణ తదుపరి సర్వసభ్య సమావేశం తీర్మానం వరకు నిరవధికంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బార్ అసోసియేషన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తీర్మానం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. సీబీఐ చర్యల పట్ల అసంతృప్తిని వివరించేందుకు రాష్ట్ర హై కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిథి బృందం ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయింది. విషయాన్ని పూర్తిగా వివరించినట్టు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కాళీ ప్రసాద్ మిశ్రా తెలిపారు. జుడీషియల్ దర్యాప్తునకు డిమాండ్ అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా దాడులు నిర్వహించిన సీబీఐ బృందం రాష్ట్ర హై కోర్టు సిట్టింగు న్యాయమూర్తి సి.ఆర్.దాస్ ఇంట్లోకి చొరబడడం సంఘవిద్రోహంగా హై కోర్టు బార్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. ఈ విచారకర సంఘటనపై హై కోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన జుడీషియల్ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. తప్పటడుగు వేసిన అధికారులు, సిబ్బందిని గుర్తించిన మేరకు వారి వ్యతిరేకంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతో క్రిమినల్ ప్రొసీడింగ్సు చేపట్టాలి. బాధ్యుతలైన వారిని విధుల నుంచి సస్పెండు చేయడం అనివార్యంగా బార్ అసోసియేషన్ ప్రతిపాదించింది. -
ప్రభుత్వానికి 18 మంది రిటైర్డ్ జడ్జిల జాబితా
ఏపీ/తెలంగాణ సహా నాలుగు హైకోర్టుల కోసం ప్రతిపాదన న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ సహా నాలుగు హైకోర్టుల్లో నియామకానికి సంబంధించి 18 మంది మాజీ జడ్జిల జాబితా కేంద్రానికి అందింది. గుట్టలుగా పేరుకుపోరుున అపరిష్కృత కేసుల పరిష్కారానికి రాజ్యాంగంలోని అసాధారణ నిబంధన కింద మాజీ న్యాయమూర్తులను నియమించేందుకు కేంద్రం, న్యాయ వ్యవస్థ అంగీకారానికి వచ్చారుు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుతోపాటు మధ్యప్రదేశ్, అలహాబాద్, కోల్‌కతా హైకోర్టులు ఇందులో ఉన్నారుు. జాబితాలోని పేర్లను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ట్రాక్ రికార్డు ఆధారంగా గతంలో హైకోర్టుల్లో పనిచేసిన జడ్జిల పేర్లను ఎంపిక చేశారు. గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రులు- ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. తాజా నిర్ణయం ప్రకారం హైకోర్టుల్లో నియమితులైన మాజీ న్యాయమూర్తులు ‘ఫైవ్ ప్లస్ జీరో’లక్ష్యాన్ని చేరేందుకూ సహకరించగలుగుతారు. ‘ఫైవ్ ప్లస్ జీరో’ అంటే... ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్య తనిచ్చి పరిష్కరించడం. ఈ కోర్టుల్లో 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.