RSS chief Mohan Bhagwat
-
దేవుడు, విశ్వరూపి... ఆ తర్వాతేమిటి?
గుమ్లా (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీపై తరచూ సునిశిత విమర్శలు గుప్పిస్తున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవుడు వికాస క్రమంలో మనిషి లక్షణాలు సంతరించుకుంటాడు. ఆనక అతీత శక్తులున్న సూపర్‌మ్యాన్ కావాలని ఆశపడతాడు. తర్వాత దేవుడు, భగవంతుడు కావాలనుకుంటాడు. ఆ తర్వాత విశ్వరూపి కావాలని ఆశిస్తాడు. దాన్నీ దాటితే? ఆపైన ఏముందో ఎవరికీ తెలియదు. అంతర్గత, బహిర్గత వికాసానికి అంతన్నదే ఉండదు’’ అన్నారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచాన్ని అందమైన నివాసయోగ్య ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పాటుపడటమే మన బాధ్యతన్నారు.మోదీపై ఆరెస్సెస్ అగ్ని క్షిపణి: కాంగ్రెస్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ పేర్కొంది. ‘‘అవి లోక్ కల్యాణ్ మార్గ్ (ఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం)పైకి నాగ్‌పూర్ (ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం) ప్రయోగించిన అగ్ని క్షిపణి’ అంఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందరిలా తాను తల్లి కడుపు నుంచి పుట్టలేదని చెప్పుకున్న ప్రధానికి ఆరెస్సెస్ తాజా సందేశం విన్పించే ఉంటుందంటూ వాగ్బాణాలు విసిరారు. -
సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి
జైపూర్: సమాజంలో పేరు రావాలనే ఉద్దేశంతోకాకుండా ఎలాంటివి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయండని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. రాజస్తాన్‌లోని జామ్దోలీలో జరుగుతున్న సేవా సంఘ్‌లో ‘రాష్ట్రీయ సేవా భారతి’ ప్రతినిధులు, సంఘ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవత్ ఉపన్యసించారు. ‘ వ్యవస్థీకృతమైన శక్తులు ఎల్లప్పుడూ ఘన విజయాలను సొంతం చేసుకుంటాయి. విశ్వమానవాళి శ్రేయస్సు కోసం నిశ్శబ్దంగా సేవచేసే కార్యకర్తలం మనం. నిస్వార్థ సేవ అలవాటు చేసుకోండి. మనల్ని ఇంకెవరో పొగడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలపైకి దృష్టిని పోనివ్వకండి. సామాజిక సేవ చేస్తే పేరు అదే వస్తుంది. అంతమాత్రానికే దానిపై ధ్యాస పెట్టొద్దు. అహం మీకు అవరోధంగా మారొద్దు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటపుడు హుందాగా ఉండాలి. మనమేం గొప్ప పని చేయడంలేదు. సమాజం కోసం మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు. -
దేశ విభజనను పాక్ ప్రజలూ తప్పుబడుతున్నారు
భోపాల్: పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ విభజన తప్పని పాకిస్తాన్ ప్రజలంతా అంటున్నారన్నారు. అఖండ భారత్ వాస్తవం కాగా విభజిత భారత్ ఒక పీడకల అని అభివర్ణించారు. భారతదేశ విభజన తప్పనే విషయాన్ని, స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల అనంతరం ఇప్పుడు వారు నమ్ముతున్నారని భగవత్ వ్యాఖ్యానించారు. ‘స్వాతంత్య్రానికి ముందు భారత్ నుంచి తెగదెంపులు చేసుకుని అహంకారపూరితంగా వెళ్లిన వారింకా సంతోషంగా ఉన్నారా? లేదు, బాధలు పడుతున్నారు’ అంటూ పాకిస్తానీయులనుద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలపై ఆయన.. ‘పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. ఇతరులపై దాడులు చేయాలంటూ పిలుపునిచ్చే సంస్కృతి భారత్‌లో లేదు. ఆత్మరక్షణ కోసం దాడులకు తగిన బుద్ధి చెప్పాలనేదే భారత్ సంస్కృతి. దీనినే ఆచరిస్తాం. ఇదే కొనసాగుతుంది’అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర యోధుడు హేము కలానీ జయంతిని పురస్కరించుకుని సింధీలు భోపాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. -
RSS చీఫ్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు : ఎంపీ లక్ష్మణ్
-
జ్ఞానవాపి వివాదం: ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆయన. గురువారం సాయంత్రం నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన. జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు.. దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే!.సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి. ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్‌పై వాదనలు జులై 4న విననుంది. జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్‌మహల్‌లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన్ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యలు -
క్రిప్టోపై కర్ర పెత్తనం? ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
క్రిప్టో కరెన్సీపై రాష్ట్రీయ స్వయం సేవక్ కన్నెర్ర చేసింది. దేశంలో క్రమంగా విస్తరిస్తున్న క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం నియంత్రించాలంటూ ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ డిమాండ్ చేశారు. విజయదశమిని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంచలన వ్యాఖ్యలు దసరా పండుగ రోజున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఓటీటీ కంటెంట్, డ్రగ్స్ వినియోగం, జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రించాలి ‘బిట్ కాయిన్లను ఏ దేశం, ఏ వ్యవస్థ దాన్ని నియంత్రించగలదో నాకు తెలియడం లేదు. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కానీ అప్పటి వరకు ఏం జరుగుతుందనేది ఆందోళన కలిగిస్తోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాను మించి తాజాగా వెల్లడైన గణాంకాల్లో అమెరికాను మించి ఇండియాలో క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం పెరుగుతోంది. మరో రెండు మూడేళ్లలో యూరప్‌ని సైతం వెనక్కి నెట్టేలా క్రిప్టో ఇండియాలో దూసుకుపోతుంది. యువతలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పట్ల క్రేజ్ రోజురోజుకి పెరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో సైతం బిట్‌కాయిన్, ఈథర్నెట్ తదితర కాయిన్లు వర్చువల్‌గా చలామనీ అవుతున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీ వ్యవస్థ మన ప్రభుత్వం దగ్గర నిర్థిష్టమైన విధానమంటూ లేదు. ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భద్రతపై సందేహాలు సాధారణ మార్కెట్లో మనుషుల పెత్తనం, ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. దీంతో వీటిని శక్తివంతమైన వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీని వల్ల మిగిలినవారు నష్టపోయే ప్రమాదం ఉంది. క్రిప్టో కరెన్సీ పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇక్కడ మనుషులు, ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బుకి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. అందువల్ల క్రిప్టో ట్రేడ్‌పై అనేక సందేహాలు ఉన్నాయి. చదవండి :బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ పాఠాలు -
ప్రతీ భారతీయ పౌరుడు హిందువే: RSS చీఫ్ మోహన్ భగవత్
-
భారతీయుల డీఎన్ఏ ఒక్కటే!
‘భారతదేశంలో నివసించే హిందూ–ముస్లింల డీఎన్ఏ ఒకటేనని, పూజావిధానం ప్రాతిపదికన మనుషులను వేరుగా చూడలేమ’ని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్న మాటలు సంచలనం కలిగించాయి. ఆరెస్సెస్ ప్రవచించే జాతీయవాదాన్ని హిందూ మతోన్మాదంగా చిత్రీకరించి, సనాతన భారతీయ విలువల్ని తూర్పారబట్టే మానసిక భావజాలంతో మనుగడ సాగిస్తున్న భారతీయ మేధావులను ఆయన ప్రకటన సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఉంటుంది. మనిషి శారీరక మానసిక ఆరోగ్యాలను చక్కబెట్టడానికి మన మహర్షులు అందించిన యోగాను, ప్రాణాయామ ప్రక్రియను ఒక మత ఆచారంగా తేల్చి కొన్ని వర్గాల ప్రజలకు దాన్ని దూరం చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. హిందూ సమాజంలోని కుల పైత్యాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉండే ప్రజలందరి డీఎన్ఏ ఒకటేనని, వీరందరూ అనుసరించే సంస్కృతి ఒకటేనని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తేల్చి చెప్పారు. ఈ దేశ దురదృష్టమేమో కానీ ఆయన మాటలను చాలామంది పాలకులు, మేధావులు చెవికి ఎక్కించుకోలేదు. ’భారతీయులందరూ ఒక జాతి కాదు. ఈ దేశంలో నివసించే ప్రజలందరూ అనేక దేశాల నుంచి వచ్చినవారు. ఇక్కడ జాతీయులు ఎవరూ లేరు’ అనే కొత్త వాదాన్ని బ్రిటిష్ పాలకులు ఈ దేశ విద్యావిధానంలో ప్రవేశపెట్టారు. ఈ వాదం స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో గందరగోళాన్ని కలిగించింది. ఈ వాదాన్ని బలంగా నమ్మిన ప్రజలు దేశం నుంచి విడిపోయారు. బ్రిటిష్ వారు నాటిన విషబీజాల ప్రభావం భారతీయ జనత మెదళ్ల నుండి ఇంకా తొలగిపోలేదనే సత్యాన్ని గుర్తు చేయడం కోసమే మోహన్ భాగవత్ ఈ మాటలు అన్నారేమో అని అర్థం చేసుకోవచ్చు. ఆయన మాటల్లో చారిత్రక వాస్తవం ఉంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్‌లో జీవించే చాలామంది ముస్లింలు ఇస్లామిక్ పరిపాలనలో మతం మార్చుకున్న ‘సనాతన భారతీయులే’ అనేది చారిత్రక వాస్తవం. ఈ చారిత్రక సత్యాన్ని భారతీయ యువతకు బోధించి ఉంటే హిందూ ముస్లింల మధ్య ఇంత అగాథం ఏర్పడి ఉండేది కాదు. ఈ దేశంలో మతం పేరుతో జిహాదీ ఉగ్రవాదం చలామణి అయ్యేది కాదు. ఇక మతం పేరుతో మూక దాడులకు పాల్పడే వారు హిందువులకు శత్రువులని చెప్పడం ద్వారా మోహన్ భాగవత్ సనాతన భారతీయ ఆలోచనా ధోరణి ఏమిటో భారతీయుల ముందు ఉంచారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆలోచన విధానాన్ని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ దేశ ప్రజలు మత పరంగా కాకుండా సనాతన భారతీయ జీవన విధానంతో కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పిన మాటలు జాతి మొత్తానికి శిరోధార్యం. ఇక ఇస్లాం ప్రమాదంలో పడిపోతుంది అనే భ్రమలో ఈ దేశ ముస్లింలు ఉండవలసిన అవసరం లేదని, కుహనా లౌకిక వాదాన్ని నెత్తిన పెట్టుకున్న రాజ కీయ నాయకుల మాటలను నమ్మొద్దని ఆయన ముస్లిం లను కోరడం వెనుక దేశ విశాల ప్రయోజనం దాగి ఉందని అర్థం చేసుకోవాలి. ఉల్లి బాలరంగయ్య, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి -
అసదుద్దీన్ ఒవైసీ విమర్శలపై విజయశాంతి ఫైర్
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఇస్లాం వ్యతిరేకత లేదని, భయం లేకుండా ఉండాలని ముస్లింలను ఉద్దేశించి ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని తప్పుబడుతూ ఒవైసీ నిన్న ట్వీట్లు చేశాడు. ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె.. ‘‘భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటిచెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే... రామ అనే పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమో అన్న అనుమానం కలుగుతోంది. దేశంలో ముస్లింలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులను ఖండించడంతోపాటు... ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరం. sounding synonymous to the claims that flares up religious hatred. It would be no surprise if the tolerant statements of Mohan Bhagavath ji sound criminal for a person like mr Asaduddin who is horribly habituated to delight upon hearing... — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 మొదట్లో భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల కారణంగా ముస్లింలు గాను, ఇతర మైనార్టీ వర్గాల వారీగా రూపాంతరం చెందారని... ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారు. కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు అసదుద్దీన్ గారి దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయి. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్ గారికి.. భగవత్ గారి అభిప్రాయం క్రిమినల్ ఆలోచన గానే కనిపిస్తుంది. Why Mr. Asaduddin maintained complacence when Akbar said that if the police close their eyes and refrain themselves from their duties, he would definitely witness the end of Hindus. — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 అయితే భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ, గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలి. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఎందుకు నోరు మెదపలేదు? ఇప్పుడు మోహన్ భగవత్ మీద వచ్చిన పౌరుషం ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుంది'' అని విజయశాంతి వరుస ట్వీట్లలో ఒవైసీని నిలదీశారు. -
దుర్గమ్మను దర్శించిన మోహన్ భగవత్..
-
దుర్గమ్మను దర్శించిన మోహన్ భగవత్..
సాక్షి, విజయవాడ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విజయవాడ దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్ధ ప్రసాదాలను అందచేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం పొందారు. భగవత్‌కు ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు దుర్గ గుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో నేటి నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని మోహన్ భగవత్ ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గుంటూరు జిల్లా నూతక్కికి మోహన్ భగత్
సాక్షి, గుంటూరు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో శనివారం నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన మోహన్ భగవత్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు భరత్, వాసు, పలువురు కార్యకర్తలు స్వాగతం పలికారు -
ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇతర ఏ దేశంలోనూ లేని విధంగా భారతీయ ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారని, అన్ని మతాలకు చెందిన ప్రజలు భారత్‌ని రక్షించుకోవడానికి ఒక్కతాటిపైన నిలబడ్డారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్ సామ్రాజ్యాధిపతి అక్బర్‌కి వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. దేశ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడల్లా భారతదేశ చరిత్రలో అన్నిమతాల వారు ఐక్యంగా నిలబడి తిప్పి కొట్టారని తెలిపారు. భారతదేశంలో లాగా ఇతర మతస్తులకు పాకిస్తాన్ ఎటువంటి హక్కులు కల్పించలేదని వ్యాఖ్యానించారు. (హథ్రాస్: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు) -
యువత సన్మార్గంలో నడవడం లేదు
-
జైళ్లలో గోశాలలు ఏర్పాటు చేయాలి : మోహన్ భగత్
సాక్షి, పుణె : ఖైదీలలో మానసిక పరివర్తన కోసం దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అభిప్రాయపడ్డారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. శనివారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆవుల పెంపకం వల్ల ఖైదీల మానసిక స్థితిలో మార్పును తీసుకురాగలిగామని కొందరు జైలర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ పద్ధతిని దేశంలో ఉన్న అన్ని జైళ్లలో అమలు పరచాల్సిన అవసరం ఉంది. ఖైదీల మానసిక పరిస్థితిని ఆవుల పెంపకానికి ముందు, ఆ తర్వాత ఎలా ఉందనేది మానసిక నిపుణులతో శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలి. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి డాక్యుమెంటేషన్ చేయాలి. ఇలా వేలాది జైళ్ల నుంచి ఒకే రకమైన ఫలితాలతో రిపోర్టులు వస్తే అది ఒక వాస్తవంగా అంతర్జాతీయ సమాజం ముందు ఆవిష్కరించవచ్చ’ని తెలిపారు. మరోవైపు ఆవు పట్ల విదేశీయుల ధృక్కోణాన్ని వివరించారు. ఆవు అంటే పాలు, మాంసం కోసం పెంచుకునేదిగా విదేశీయులు భావిస్తారని, అదే భారతీయ సంస్కృతిలో ఆవు పట్ల ప్రజలు మానసిక బంధం ఏర్పరచుకుంటారని వెల్లడించారు. దానికి ఉదాహరణగా మన దేశంలో ఆవును వాణిజ్య వస్తువుగా చూడరని, ఆవు సంబంధిత ఉత్పత్తులను అమ్ముకోరని తెలిపారు. ఆవు ప్రాముఖ్యత తెలిసిన మన పూర్వీకులు రసాయన ఎరువులు లేకుండా ఆవు పేడతో వ్యవసాయం చేసేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలు ఆవుల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
‘మహారాష్ట్ర’లో మార్పేమీ లేదు!
ముంబై: ‘మహా’ ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివిధ పార్టీల నేతల వ్యాఖ్యల మాటెలా ఉన్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు మాత్రం పడటం లేదు. ముఖ్యమంత్రి పీఠం సహా అధికార పంపిణీ సమంగా జరగాలన్న తమ డిమాండ్ నుంచి శివసేన వెనక్కు తగ్గడంలేదు. అదే విషయాన్ని మంగళవారం శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు జరగాలంటే.. అధికారాన్ని సమంగా పంచుకోవడంపై బీజేపీ లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనన్నారు. శివసేన నేతనే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని పునరుద్ఘాటించారు. సేన, బీజేపీల కూటమికి మెజారిటీ లభించినా.. రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు, బీజేపీ నుంచి మంగళవారం ఒక ఆశావహ ప్రకటన వెలువడింది. ‘ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన శుభవార్త ఏ క్షణమైనా రావొచ్చు’ అని సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల భేటీ అనంతరం ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఆ భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ మాట్లాడుతూ.. శివసేన నుంచి సానుకూలమైన ప్రతిపాదన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బీజేపీతో, ఎన్డీయేతో శివసేన సంబంధాలు తెంచుకుంటేనే.. రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది. ఆరెస్సెస్ చీఫ్‌తో ఫడ్నవిస్ భేటీ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు పరిష్కారం లభించని నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యేందుకు మంగళవారం రాత్రి నాగపూర్ వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇరువురు ఏం చర్చించారనే విషయంలో ఆరెస్సెస్ వర్గాలు నోరు విప్పడం లేదు -
‘భారత్‌లో ముస్లింలు సంతోషంగా ఉన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో హిందూ సంస్కృతి ఫలితంగానే ఇతర దేశాలతో పోలిస్తే ముస్లింలు భారత్‌లో అత్యంత సంతోషంగా ఉన్నారని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఒడిషాలో ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొంటున్న మోహన్ భగవత్ హిందూ అనేది ఓ మతం లేదా భాష కాదని, ఓ దేశం పేరూ కాదని చెప్పుకొచ్చారు. భారత్‌లో నివసించే వారందరి సంస్కృతి హిందూ అని వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులను హిందూ విధానం ఆమోదించి గౌరవిస్తుందని చెప్పారు. యూదులు సంచరిస్తున్నప్పుడు వారికి ఆశ్రయం కల్పించిన ఏకైక దేశంగా భారత్ ఆవిర్భవించిందని ఆయన అన్నారు. పార్శీలు కేవలం భారత్‌లోనే స్వేచ్ఛగా తమ మతాన్ని అనుసరిస్తారని ఇదంతా హిందూ మతం గొప్పతనమేనని పేర్కొన్నారు. ఆరెస్సెస్ ముద్ర అంతరించి సమాజమంతా ఒకే వర్గంగా మెలగాలన్నది తన ఆక్షాంక్షని స్పష్టం చేశారు. భిన. సంస్కృతులు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా మెలిగినప్పుడు ముస్లింలు, పార్శీలు ఇతరులు దేశంలో సురక్షితంగా ఉన్నామనే భావనతో ఉంటారని చెప్పారు. మెరుగైన సమాజం ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన పిలుపు ఇచ్చారు. -
ఇమ్రాన్‌కు ఆరెస్సెస్ చీఫ్ కౌంటర్
నాగపూర్ : ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాని ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. విజయదశమిని పురస్కరించుకుని ప్రసంగించిన మోహన్ భగవత్ ఆరెస్సెస్ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమ విషప్రచారాలు ఫలించని స్థితిలో పలువురు విమర్శకులు ఆరెస్సెస్‌పై విరుచుకుపడతారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో సంఘ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు ఈ మంత్రం నేర్చుకున్నారని ధ్వజమెత్తారు. తమపై సాగుతున్న దుష్ర్పచారానికి ఆరెస్సెస్ భయపడదని, వెనుకడుగు వేయదని ఇమ్రాన్ ఖాన్ గుర్తెరగాలన్నారు. ప్రతిఒక్కరితో సామరస్యంగా పనిచేయడాన్నే ఆరెస్సెస్ విశ్వసిస్తుందని చెప్పుకొచ్చారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల సంఘ్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. కాగా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇమ్రాన్ ఖాన్ ఇంటా బయటా పలు వేదికలపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఐరాస వేదికగా ఇమ్రాన్ మాట్లాడుతూ హిట్లర్ వంటి నియంత్రల భావజాలంతో ఏర్పడిన ఆరెస్సెస్ కనుసన్నల్లో భారత ప్రధాని మోదీ పనిచేస్తారని వ్యాఖ్యానించారు. -
సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్
యూకేకు చెందిన గాయని తరన్ కౌర్ ధిల్లాన్ (హర్ద్ కౌర్) వ్యాఖ్యలు దుమారాన్నే రాజేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వారణాసిలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలీవుడ్ గాయని హర్ద్ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏకంగా రేప్‌మేన్ అని పిలవాలంటూ సోషల్ మీడియాలో కమెంట్ చేశారు. అంతేకాదు మోహన్ భగవత్ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. దీంతో వివాదం రాజుకుంది. పలువురు నెటిజర్లు ఆమెకు మద్దతిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రధానంగా వారణాసికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, న్యాయవాది శశాంక్ శేఖర్ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి అమర్ ఉజాలా తెలిపారు. FIR registered under sections 124A (Sedition), 153A, 500 ,505 of the Indian Penal Code and 66 IT Act against singer Hard Kaur for her comments against Uttar Pradesh CM Yogi Adityanath and RSS Chief Mohan Bhagwat. https://t.co/3XABzwKOJ6 — ANI (@ANI) June 20, 2019 -
ఆరెస్సెస్ చీఫ్‌తో అమిత్ షా భేటీ
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సంఘ్ పరివార్ నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. మందిర నిర్మాణంపై వీరిరువురూ సంప్రదింపులు జరిపారు. మోహన్ భగవత్‌తో పాటు పలువురు సంఘ్ నేతలతోనూ అమిత్ షా సమాలోచనలు చేపట్టారు. కాగా, సుప్రీం కోర్టులో రామమందిర అంశం పెండింగ్‌లో ఉన్నందున ఆర్డినెన్స్ ద్వారా మందిర నిర్మాణానికి పూనుకోవాలని ఆరెస్సెస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వోన్నత న్యాయస్ధానం మందిర్ వ్యవహారంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని, ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి రామజన్మభూమి స్ధలంలో మందిర నిర్మాణం చేపట్టాలని ఆరెస్సెస్ ప్రతనిధి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గుజరాత్లో సోమనాధ్ ఆలయాన్ని సర్ధార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించిన తరహాలో మందిర నిర్మాణానికి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ పట్టుబడుతోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన సైతం ఇదే తరహా డిమాండ్లను ప్రభ్తువం ముందుంచింది. రామ మందిర నిర్మాణం ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఈనెల 25న అయోధ్య యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. -
మందిర్ ఎన్నికల అంశం కాదన్న మహా సీఎం
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని, అయితే ఇది తమ పార్టీ ఎన్నికల అంశం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణాన్ని బీజేపీ ఎన్నడూ స్వార్ధరాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టలేదన్నారు. మందిర నిర్మాణంపై ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఆయన గతంలోనూ ఇలా కోరారని, రానున్న ఎన్నికలతో దీనికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో చట్టం చేయడం లేదా కోర్టు తీర్పు వంటి రెండు మార్గాల ద్వారానే మందిర నిర్మాణం చేపట్టవచ్చన్నారు. సోమనాథ్ దేవాలయం విషయంలో ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన విషయాన్ని ఫడ్నవీస్ ప్రస్తావించారు. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం సమస్యగా ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదన్న సంగతి గుర్తెరగాలన్నారు. మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకుందన్నారు. -
వీలైనంత త్వరగా రామమందిరం
న్యూఢిల్లీ: వీలైనంత త్వరగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాల్సిందేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. ఈ దిశగా జరుగుతున్న చర్చలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా పదవీ విరమణకు ముందే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో భాగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ‘భవిష్యత్ భారతం: ఆరెస్సెస్ దృక్పథం’ కార్యక్రమం చివరి రోజు (మూడోరోజు) పలు అంశాలపై ఆయన సంఘ్ ఆలోచనలను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. రామమందిరం, కోటా వ్యవస్థపై రామమందిర నిర్మాణం త్వరగా జరగాలి. అయితే మందిర నిర్మాణ ఉద్యమాన్ని నడుపుతున్న ‘రామమందిర సమితి’దే తుది నిర్ణయం. ఈ అంశంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చే విషయంపై (ఆహూతులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ) నాకు ఎలాంటి సమాచారం లేదు. వివిధ వర్గాలకు ఉద్దేశించిన ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ బాగుంది. జనాభా సంతులనం: ప్రపంచమంతా జనాభా సంతులనాన్ని పాటిస్తున్నారు. భారత్‌లోనూ ఇది అమలవ్వాల్సిందే. వచ్చే 50 ఏళ్లలో దేశ జనాభా ఎలా ఉండబోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జనాభా విధానాన్ని సిద్ధం చేయాలి. ఒకసారి విధానాన్ని నిర్ణయించిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. ఇందులో సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములవ్వాలి. ఎక్కువ మంది సంతానం ఉండి.. వారిని పోషించేందుకు తక్కువ వనరులున్న వారినుంచే ఈ విధానం అమలు మొదలవ్వాలి. హిందుత్వ, మత మార్పిడులపై.. ప్రపంచవ్యాప్తంగా హిందుత్వకు ఆమోదం పెరుగుతోంది. అయితే హిందుత్వలోని కొన్ని దురాచారాల వల్ల అక్కడక్కడ వ్యతిరేకత ఎదురవుతోంది. ఇలాంటి వాటిని తొలగించి ప్రజల్లో ఒకటేనన్న భావన కలిగించేందుకు సంఘ్ పనిచేస్తోంది. మత మార్పిడులకు ఆరెస్సెస్ వ్యతిరేకం. కుట్రపూరిత, దురుద్దేశాలతోనే మత మార్పిడులు జరుగుతున్నాయి. జనాభా అసంతులనానికి ఇదో కారణం. ‘గో సంరక్షణ’ దాడులు: గోసంరక్షణ జరిగి తీరాల్సిందే. కానీ దీని పేరుతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటాన్ని అంగీకరించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం. మరిన్ని అంశాలపై.. ఏకాభిప్రాయంతో కులాంతర వివాహాలు జరిగితే సంఘ్ సమర్థిస్తుంది. ఇలాంటి ఎక్కువ వివాహాలు సంఘ్ నుంచే ఉంటాయి. మహిళలపై దాడులు దారుణం. మహిళలు భద్రంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్‌జీబీటీక్యూలు సమాజంలో భాగస్వాములే. వారిని వేరుగా చూడొద్దు. ఇంగ్లిష్ భాషకు సంఘ్ వ్యతిరేకం కాదు. ఈ భాషలో గొప్ప వ్యాఖ్యాతలు రావాలనేది మా అభిమతం. అయితే ఇది భారతీయ భాషగా మారొద్దనేనే మా సూచన. సరికొత్త విద్యావిధానం రావాల్సిన అవసరం ఉంది. -
ఆరెస్సెస్ చీఫ్‌తో వేదిక పంచుకోనున్న రతన్ టాటా
సాక్షి, ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో ముంబైలో వచ్చే నెల జరగనున్న ఓ కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకోనున్నారు. గత నెల నాగపూర్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రతన్ టాటా, భగవత్ ఆగస్ట్ 24న ముంబైలో నానా పాల్కర్ స్మృతి సమితి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సంఘ్ ప్రతినిధి వెల్లడించారు. సంఘ్ ప్రచారక్ నానా పాల్కర్ పేరిట ఈ ఎన్జీవో ఏర్పాటైంది. ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి సమీపంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ప్రాంగణం నుంచే క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు సమితి సేవలందిస్తోంది. రతన్ టాటా తమ ప్రాంగణాన్ని సందర్శించారని, సంస్థ కార్యకలాపాల గురించి ఆయనకు అవగాహన ఉందని సంఘ్ ప్రతినిధి పేర్కొన్నారు. -
నోట్ల రద్దు ఐడియా ఆర్ఎస్ఎస్దే..
సాక్షి, బళ్లారి: దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట పెట్టుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఇప్పటికే ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆరెస్సెస్ నుంచి ఓ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) ఉన్నారని అన్నారు. ఏ మంత్రీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదనీ, నోట్లరద్దు ఆరెస్సెస్‌కు చెంది ఉన్న ఓ వ్యక్తి సలహా మేరకే జరిగిందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకరిస్తామని హామీనిచ్చారు. రాహుల్ కర్ణాటకలో తన నాలుగు రోజుల జనాశీర్వాద యాత్రను మంగళవారం బీదర్‌లో ముగించారు. గుల్బర్గాలో వ్యాపారులు, రైతులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్టీని ముందు ప్రయోగాత్మకంగా అమలు చేసి లోపాలు తెలుసుకోవాలన్న కాంగ్రెస్ సూచనను సైతం బీజేపీ పట్టించుకోలేదన్నారు. భారత్ ఏకాకి అవుతోంది.. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్ల దక్షిణాసియా ప్రాంతంలో భారత్ ఏకాకిగా మిగులుతోందని రాహుల్ హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తన వైఖరితో భారత విదేశాంగ విధానంలో ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు. పాక్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, మయన్మార్ తదితరాల్లో చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా, ఆయా దేశాలతో భారత్ బంధం బలహీనపడుతోందని రాహుల్ విశ్లేషించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నేను లక్షల మందిని కలిసి మాట్లాడాను. కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉంది’ అని చెప్పారు. -
మందిర్ ఒక్కటే మార్గం..
సాక్షి,ఉడిపి(కర్ణాటక): అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని వేరే నిర్మాణాలు అనుమతించమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశవ్యాప్తంగా హిందూ సన్యాసులు, మఠాల అధిపతులు, వీహెచ్‌పీ నేతలు హాజరైన ధర్మ సంసద్‌లో మోహన్ భగవత్ మాట్లాడారు.అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనడంలో ఎలాంటి సందిగ్ధత లేదని స్పష్టం చేశారు.‘మందిరాన్ని తప్పక నిర్మిస్తాం..ఇది జనాకర్షక నిర్ణయం కాదు..తమ విశ్వాసానికి సంబంధించిన అంశ’మన్నారు. ఈ అంశం కోర్టులో ఉన్నదంటూనే ఏళ్ల తరబడి చేసిన ప్రయత్నాలు, త్యాగం ఫలించే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో రామాలయం ఉన్న మాదిరిగానే ఆలయం నిర్మించడం జరుగుతుందని, గత 25 ఏళ్లుగా రామజన్మభూమి ఉద్యమంలో పాలుపంచుకున్న వారి మార్గదర్శకాలతో మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మందిర నిర్మాణానికి ముందు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.రామ మందిర నిర్మాణం, మత మార్పిడుల నిరోధం, గో సంరక్షణ వంటి అంశాలపై ధర్మసంసద్‌లో చర్చిస్తామని నిర్వాహకులు తెలిపారు.