ruled out
-
WTC ఫైనల్ లో ఆస్ట్రేలియాకి కోలుకోలేని దెబ్బ స్టార్ పేసర్ అవుట్
-
కేన్ మామ కథ ముగిసే.. గాయంతో ఐపీఎల్ మొత్తానికి దూరం
న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్స్‌న్ ఐపీఎల్ 2023 టోర్నీ నుంచి వైదొలిగాడు. మోకాలి గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ఆదివారం తన ట్విటర్లో అధికారికంగా ప్రకటించింది. ‘‘సీఎస్కేతో మ్యాచ్‌లో ఆడుతూ గాయపడిన కేన్ విలియమ్సన్.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌కి వెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 జరగనుండటంతో అప్పటిలోపు గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.'' అంటూ పేర్కొంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో గత శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ విలియమ్సన్ గాయపడ్డాడు. అతని మోకాలికి తీవ్ర గాయమవగా.. ఫిజియో, సపోర్ట్ ప్లేయర్ సహాయంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను బ్యాటింగ్‌కి రాలేదు. దాంతో అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ని ఆడించిన గుజరాత్ టైటాన్స్ ఫలితం అందుకుంది. సీఎస్కేతో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్ సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇస్తుండగా.. కేన్ విలియమ్సన్ స్థానంలో ఏ ప్లేయర్‌ని ఇంకా గుజరాత్ టైటాన్స్ తీసుకోలేదు. We regret to announce, Kane Williamson has been ruled out of the TATA IPL 2023, after sustaining an injury in the season opener against Chennai Super Kings. We wish our Titan a speedy recovery and hope for his early return. pic.twitter.com/SVLu73SNpl — Gujarat Titans (@gujarat_titans) April 2, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్.. లక్నో తరపున తొలి బౌలర్‌గా -
డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్ షాక్.. కరీమ్ బెంజెమా దూరం
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఆరంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్ పోగ్బా, కాంటే, కుంకూలు గాయాలతో సాకర్ సమరానికి దూరమయ్యారు. తాజాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు విజేత కరీమ్ బెంజెమా గాయంతో ఫిఫా వరల్డ్‌కప్ నుంచి వైదొలిగాడు. 34 ఏళ్ల కరీమ్ బెంజెమా ఎడమ తొడ గాయంతో బాధపడుతున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించించి. అసలు సమరానికి ముందు శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గంట పాటు మైదానంలో ఉన్న బెంజెమా చాలా ఇబ్బందిగా కదిలడంతో వైద్యలు అతన్ని పరీక్షించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని పేర్కొనడంతో బెంజెమా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బెంజెమా దూరమవడం ఫ్రాన్స్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. గతేడాది కాలంగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బాలన్ డీ ఓర్ విజేత అయిన కరీమ్ బెంజెమా రియల్ మాడ్రిడ్ తరపున 46 మ్యాచ్‌ల్లో 44 గోల్స్ సాధించడం విశేషం. ఇక గ్రూప్-డిలో ఉన్న ఫ్రాన్స్ మరోసారి చాంపియన్‌గా నిలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడనున్న ఫ్రాన్స్ .. ఆ తర్వాత డెన్మార్క్, ట్యూనిషియాలను ఎదుర్కోనుంది. 1962లో బ్రెజిల్ వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను నిలుపుకుంది. అప్పటినుంచి ఏ జట్టు కూడా వరుసగా రెండోసారి చాంపియన్ అవలేకపోయింది. తాజాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్ 1962 సీన్‌ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. Karim @Benzema has pulled out of the World Cup with a thigh injury. The whole team shares Karim's disappointment and wishes him a speedy recovery💙#FiersdetreBleus pic.twitter.com/fclx9pFkGz — French Team ⭐⭐ (@FrenchTeam) November 19, 2022 చదవండి: FIFA: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్ FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే -
టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన..
టి20 ప్రపంచకప్‌కు బుమ్రా అధికారికంగా దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత టీమిండియా స్పీడస్టర్ మంగళవారం ఉదయం తన ట్విటర్ వేదికగా స్పందించాడు. ''నేను ఈసారి టి20 ప్రపంచకప్‌లో భాగం కాలేనని తెలిసినప్పటికి ధైర్యంగానే ఉన్నాను. నేను తొందరగా కోలుకోవాలని నాపై ప్రేమ చూపిస్తూ కోరుకున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇక ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ ఆడనున్న టీమిండియాను బయటి నుంచి ఉత్సాహపరుస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా చాలాకాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే పూర్తిగా కోలుకోకముందే అతన్ని ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసి బీసీసీఐ మూల్యం చెల్లించుకుంది. ఆసీస్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. ఆ తర్వాత బుమ్రా ప్రపంచకప్‌కు పూర్తిగా దూరం కాలేదని బీసీసీఐ బాస్ గంగూలీ పేర్కొనడం.. కోచ్ ద్రవిడ్ కూడా బుమ్రా టి20 ప్రపంచకప్ ఆడే అవకాశాలున్నాయని చెప్పడంతో అభిమానులు బుమ్రా తిరిగి మళ్లీ జట్టులోకి వస్తాడని భావించారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ మెగా ఈవెంట్‌కు బుమ్రా దూరమయ్యాడని బీసీసీఐ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు. పూర్తిగా కోలుకోలేదంటూ వైద్యబృందం నివేదిక ఇచ్చిన అనంతరం బీసీసీఐ సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. బుమ్రా గాయాన్ని పూర్తిగా సమీక్షించడంతో పాటు నిపుణులతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. బుమ్రా స్థానంలో ఎంపిక చేసే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఇక 2016లో తొలి టి20 మ్యాచ్ ఆడిన బుమ్రా ఇప్పటివరకు 57 టి20 మ్యాచ్‌లాడి 67 వికెట్లు పడగొట్టాడు. I am gutted that I won’t be a part of the T20 World Cup this time, but thankful for the wishes, care and support I’ve received from my loved ones. As I recover, I’ll be cheering on the team through their campaign in Australia 🇮🇳 pic.twitter.com/XjHJrilW0d — Jasprit Bumrah (@Jaspritbumrah93) October 4, 2022 చదవండి: బుమ్రా దూరం.. హార్దిక్ పాండ్యా ఎమోషనల్ ట్వీట్ -
'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం
వెస్టిండీస్ స్టార్.. హార్డ్ హిట్టర్ షిమ్రన్ హెట్‌మైర్ టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అయితే గాయంతో దూరమయ్యాడనుకుంటే పొరపాటే. ఫ్లైట్ మిస్ అయిన కారణంగా ఆఖరి నిమిషంలో మేనేజ్మెంట్ హెట్మైర్ను జట్టు నుంచి తప్పించింది. కాగా హెట్‌మైర్ స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా హెట్‌మైర్ రీ షెడ్యూల్ ఫ్లైట్‌ను కూడా మిస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. విషయంలోకి వెళితే.. మొన్నటి దాకా కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్ 2022)లో హెట్‌మైర్ గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే టి20 ప్రపంచకప్ ఆడేందుకు మిగతా జట్టంతా కాస్త ముందుగానే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సీపీఎల్‌లో ఫైనల్ చేరిన రెండు జట్లలోని ఆటగాళ్లకు(టి20 ప్రపంచకప్‌కు ఎంపికైన వాళ్లు) మాత్రం అక్టోబర్ 1న ఆస్ట్రేలియా వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. టి20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 5, 7 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. హెట్‌మైర్ మాత్రం వ్యక్తిగత కారణాల రిత్యా అక్టోబర్ 1న వెళ్లలేనని విండీస్ బోర్డుకు తెలిపాడు. దీంతో విండీస్ బోర్డు అక్టోబర్ 3న హెట్‌మైర్‌కు ఫ్లైట్‌ను రీషెడ్యూల్ చేసింది. ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టి20కి కూడా హెట్‌మైర్ అందుబాటులో ఉండడని క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు. అంతేకాదు ఈసారి ఫ్లైట్ మిస్ అయితే మాత్రం టి20 ప్రపంచకప్‌కు దూరమవ్వాల్సి ఉంటుందని హెట్మైర్ను బోర్డు హెచ్చరించింది. అయితే హెట్‌మైర్ మాత్రం రీషెడ్యూల్ ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. ''కొన్ని కారణాల రిత్యా ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాను.. సారీ ఫర్ డిలే'' అంటూ బోర్డుకు సమాచారమిచ్చాడు. కాగా హెట్‌మైర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు.. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ముందుగా హెచ్చరించిన ప్రకారం రీషెడ్యూల్ ఫ్లైట్ ఎక్కకపోతే హెట్మైర్ను టి20 ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయానికే ప్యానెల్ కట్టుబడింది. ఇందుకు ప్యానెల్ సభ్యులు కూడా యునానిమస్‌గా ఒప్పుకోవడంతో హెట్మైర్ను జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో షమ్రా బ్రూక్స్‌ను ఎంపిక చేసింది. ''హెట్‌మైర్ విషయంలో మేం క్లారిటీగా ఉన్నాం. రీషెడ్యూల్ ఫ్లైట్ కూడా మిస్ అయితే జట్టు నుంచి తప్పిస్తామని ముందే హెచ్చరించాం. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్ మరోసారి ఫ్లైట్ మిస్ అయ్యాడు. దీంతో రూల్ ప్రకారం అతన్ని జట్టు నుంచి తప్పించాం. అతని స్థానంలో బ్రూక్స్‌ను ఆస్ట్రేలియాకు పంపించాం'' అంటూ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు. ఇక సీపీఎల్ 2022లో షమ్రా బ్రూక్స్ సెంచరీతో చెలరేగి తన జట్టు జమైకా తలైవాస్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫైనల్లో బార్బడోస్ రాయల్స్‌ను ఓడించిన జమైకా తలైవాస్ సీపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. ఇక అక్టోబర్ 17న స్కాట్లాండ్తో జరిగే మ్యాచ్‌తో వెస్టిండీస్ తమ ప్రపంచకప్ ఆటను షురూ చేయనుంది. వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టు: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవమన్ పోవెల్, యన్నిక్ కరై, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షమారా బ్రూక్స్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఓబెడ్ మెక్‌కామ్, రేమన్ రీఫర్, ఓడియన్ స్మిత్ చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
బుమ్రాకు తిరగబెట్టిన గాయం.. టి20 ప్రపంచకప్‌కు దూరం!
టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే టీమిండియాకు నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అసలే బౌలింగ్ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఇక సౌతాఫ్రికాతో తొలి టి20కి బుమ్రాను రెస్ట్ పేరుతో పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి బుమ్రా జట్టుతో పాటు తిరువనంతపురంకు రాలేదని సమాచారం. ఆస్ట్రేలియాతో మూడో టి20 మ్యాచ్ అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రాను బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీకి పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బుమ్రా జట్టుతో పాటే వచ్చి ఉంటాడని అనుకున్నారు. కానీ బుమ్రాకు వెన్నునొప్పి గాయం తిరగబెట్టిందని.. అయితే సర్జరీ అవసరం లేకపోవచ్చు గానీ.. కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు విశ్రాంతి అవసరం అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు తెలిసింది. కాగా బీసీసీఐ అధికారిక సమాచారం ఇచ్చిన తర్వాతే బుమ్రా గాయంపై మరింత క్లారిటీ వస్తుంది. చదవండి: Ind VS SA: ప్రపంచకప్ టోర్నీకి ముందు ఎందుకిలా? అతడికి రెస్ట్ అవసరమైతే! పికిల్‌బాల్ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్! -
టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాక్‌కు ఎదురుదెబ్బ
ఆసియాకప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌లు ఈ ఆదివారం(సెప్టెంబర్ 4న) మరోసారి తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ షాహనవాజ్ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. నిజానికి హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూనే దహనీ గాయపడ్డాడు. అయితే మ్యాచ్‌లో దహనీ తన కోటా ఓవర్లను పూర్తి చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్‌కు దహనీ స్థానంలో ముహ్మద్ హస్నైన్, హసన్ అలీలలో ఎవరు ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పీసీబీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. '' సూపర్-4లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో దహనీ అందుబాటులో ఉండడం లేదు. పక్కటెముకల గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడే దహనీ గాయపడ్డాడు. మరో 48 గంటలు గడిస్తే దహనీ గాయంపై మరింత స్పష్టత వస్తుంది. కాగా దహని స్థానంలో హసన్ అలీ లేదా ముహ్మద్ హస్నైన్‌లలో ఎవరో ఒకరు ఆడుతారు.'' అంటూ తెలిపింది. ఇక దహనీ గాయపడినా.. నసీమ్ షా, హారిస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ల రూపంలో పాకిస్తాన్‌కు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. చదవండి: Mohammad Hafeez: టీమిండియాపై పొగడ్తలు.. పాక్ క్రికెటర్‌పై భారత్ ఫ్యాన్స్ తిట్ల దండకం పాక్‌తో బిగ్ ఫైట్‌కు ముందు కోహ్లి కఠోర సాధన.. స్పెషల్ మాస్క్ పెట్టుకుని..! -
జట్టును ప్రకటించి 24 గంటలు కాలేదు.. టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ స్టార్ దూరం
అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. కాగా జట్టును ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇంగ్లండ్‌కు బిగ్‌షాక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో అనూహ్య రీతిలో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ''బెయిర్ స్టో దూరమవడం మా దురదృష్టం. శుక్రవారం లీడ్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది.దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బెయిర్ స్టోను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు'' అని ఈసీబీ పేర్కొంది. కాగా ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు బెయిర్ స్టో స్థానంలో బెన్ డకెట్‌ను ఎంపిక చేశారు. అయితే టి20 ప్రపంచకప్‌కు మాత్రం బెయిర్ స్టో స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. కాగా బెయిర్ స్టో తన గాయంపై స్పందించాడు. ''ఇవాళ ఉదయం గోల్ఫ్ కోర్సులో గేమ్ ఆడుతుండగా జారి పడ్డాను. దీంతో కాలి కింది భాగంలో గాయం కావడంతో వైద్యులు సర్జరీ అవసరమన్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు దూరం కావడం బాధిస్తోంది. నేను ఆడకపోయినప్పటికి మా కుర్రాళ్లకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్‌కు ఈసీబీ ప్రకటించిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్‌కు మొండిచేయి ఎదురైంది. తాజాగా గాయంతో బెయిర్ స్టో కూడా దూరమయ్యాడు. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2022కు ఈసీబీ ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' KL Rahul: 'మరో రెండు మ్యాచ్‌లు చూస్తారు.. తర్వాత తీసేయడమే' -
IND Vs SA: కేఎల్ రాహుల్ దూరం.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. గాయంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రాహుల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా టి20 సిరీస్ నుంచి వైదొలిగాడు. కాగా కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ జట్టును నడిపించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి టి20 జరగనున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం సాయంత్రం ప్రాక్టీస్ అనంతరం గజ్జల్లో గాయం ఇబ్బంది పెడుతున్నట్లు కేఎల్ రాహుల్ మేనేజ్మెంట్కు తెలిపాడు. కాగా ఇవాళ ఉదయమే రాహుల్ గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించారు. అయితే సాయంత్రానికి నొప్పి ఎక్కువ అవడంతో మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ వైదొలిగినట్లు మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక కుల్దీప్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయం బారీన పడ్డాడు. దీంతో అతను కూడా కొన్ని రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇక గురువారం(జూన్ 9న) ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్ మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్ ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు.. పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! -
ఐపీఎల్ 2022 నుంచి వైదొలిగిన కేకేఆర్ స్టార్ బౌలర్
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్.. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2022 నుంచి వైదొలిగాడు. తుంటి ఎముక గాయం కారణంగా కమిన్స్ లీగ్‌ను వీడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికి వచ్చే నెలలో శ్రీలంక పర్యటన ఉన్న కారణంగా కమిన్స్ ఐపీఎల్ వీడినట్లు సమాచారం. ప్రస్తుతం స్వదేశానికి పయనమయిన కమిన్స్ సిడ్నీలోని రీహాబిలిటేషన్ సెంటర్‌కు చేరుకోనున్నాడు. లంకతో సిరీస్ వరకు ఫిట్నెస్ సాధించి వన్డే, టెస్టు సిరీస్‌లకు సిద్దంగా ఉండాలని కమిన్స్ భావించాడు. కాగా లంకతో టి20 సిరీస్‌కు కమిన్స్ దూరంగా ఉండనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా సిరీస్ జరగడంపై అనుమానాలు ఉన్నప్పటికి.. దుబాయ్ వేదికగా ఈ సిరీస్‌ను నిర్వహించాలనే యోచనలో లంక్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్లో కేకేఆర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కమిన్స్ ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 56 పరుగులు సాధించి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ అందుకున్న బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌తో కలిసి కమిన్స్ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 63 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ 22 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కేకేఆర్ ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కేకేఆర్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికి ప్లే ఆఫ్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. చదవండి: Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్.. కీలక సమయంలో యువ ఆటగాడు దూరం! IPL 2022: సీఎస్కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా! -
ప్రొటీస్‌తో టి20 సిరీస్.. టీమిండియాకు ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరస్‌కు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోచేతి కండరం గాయంతో బాధపడుతున్న సూర్యకుమార్ ఐపీఎల్ 15వ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం తీవ్రతను బట్టి సూర్యకు నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరం అని తేలింది. దీంతో అతను సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇక జూన్ 9 నుంచి 19 వరకు ఇరుజట్ల మధ్య 5 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక గాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగిన సూర్య రీహాబిలిటేషన్‌లో భాగంగా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నాడు. కాగా సూపర్‌ఫామ్‌లో ఉన్న సూర్య ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున 8 మ్యాచ్‌ల్లో 309 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..! -
'ఈ సీజన్ మాకు కలిసిరాలేదు'.. సూర్యకుమార్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఏది కలిసిరావడం లేదు. ఘోర ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ రూపంలో బిగ్‌షాక్ తగిలింది. మోచేతి గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్లేఆఫ్‌కు దూరమైనప్పటికి విజయాలతో టోర్నీని ముగించాలని ముంబై భావించింది. అయితే సూర్యకుమార్ లేని లోటు కేకేఆర్‌తో మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై సీజన్లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకుంది.11 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. కాగా సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున టాప్ స్కోరర్ సూర్యకుమార్ యాదవ్. 8 మ్యాచ్‌లాడిన సూర్య 43.29 సగటుతో 303 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీజన్లో ముంబై ఇండియన్స్ సాధించిన రెండు విజయాల్లో ఒకటి సూర్య కుమార్ చలువతోనే వచ్చింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూర్య 39 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. తాజాగా గాయంతో ఐపీఎల్ 2022కు దూరమైన సూర్యకుమార్ యాదవ్ అభిమానులనుద్దేశించి ట్విటర్ వేదికగా భావోద్వేగా పోస్టు షేర్ చేశాడు.''మీ ఆశీస్సులు, అభిమానం.. సహకారంతో తొందరలోనే తిరిగి వస్తాను. అయితే ముంబై ఇండియన్స్ తరపున మాత్రం మళ్లీ వచ్చే సీజన్లోనే కనిపిస్తానేమో. ఇక ముంబై ఇండియన్స్ ఫ్యామిలీని మిస్సవుతున్నా. ఈ సీజన్లో మనకు ఏది కలిసిరావడం లేదు. ఎలాగూ ప్లే ఆఫ్ అవకాశాలు లేవు.. మిగతా మ్యాచ్‌లను గెలిచి విజయంతో సీజన్‌ను ముగించే ప్రయత్నం చేయండి.. మిస్ యూ ముంబై ఇండియన్స్'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా సూర్యకుమార్ ఆరంభంలో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. చదవండి: Venkatesh Iyer: 'అప్పటివరకు బాగానే.. ఇషాన్ చెప్పగానే ఔటయ్యాడు' With all your good wishes and support, I will be back in no time 😇 To my MI family, I will be cheering for you from the other side, this time. Let’s finish the tournament on a high note and display our true character on field. 💪 pic.twitter.com/WXfd2iwZIW — Surya Kumar Yadav (@surya_14kumar) May 9, 2022 -
యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం
టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. లంకతో టి20 సిరీస్‌కు ఎంపికైన రుతురాజ్ గాయంతో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొలి టి20లో బెంచ్‌కే పరిమితమైన రుతురాజ్ రెండో టి20లో జట్టులో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ రుతురాజ్‌కు కుడిచేయి మణికట్టు గాయం తిరగబెట్టిందని.. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తోందన్నారు. గాయం తీవ్రత తేలకపోవడంతో మిగతా మ్యాచ్‌లకు రుతురాజ్ దూరమయ్యాడని తెలిపారు. రుతురాజ్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేశామని పేర్కొన్నాడు. దీంతో చండీఘర్‌లో ఉన్న మయాంక్ ధర్మశాలలో ఉన్న టీమ్‌తో జాయిన్ అయ్యాడు. మయాంక్ జట్టుతో కలిసినప్పటికి బయోబబూల్‌లో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. కాగా రుతురాజ్ వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్‌లు దూరమైన సంగతి తెలిసిందే. ఇక లంకతో తొలి టి20లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా శనివారం రెండో టి20 ఆడనుంది. ఒక మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్‌ను గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్ లైనఫ్‌ను లంక బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే... -
ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ ఆల్‌రౌండర్.. రూ. 14 కోట్లు వ్యర్థమేనా!
టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ దీపక్ చహర్ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దీపక్ చహర్‌కు గాయం త్రీవత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో చహర్ ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తన్నాయి. ఇదే నిజమైతే సీఎస్కే పెద్ద దెబ్బ పడినట్లే. ఎందుకంటే ఈసారి మెగావేలంలో సీఎస్కే దీపక్ చహర్‌ను రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సీజన్‌కు చహర్ దూరమైతే మాత్రం సీఎస్కే భారీ మొత్తంలో నష్టపోనుంది. గతేడాది ఐపీఎల్లో చహర్ సీఎస్కే తరపున అదరగొట్టాడు. ఒక రకంగా సీఎస్కే టైటిల్ గెలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. చహర్ దూరమైతే అతనికి రీప్లేస్మెంట్ విషయంలోనూ సీఎస్కేకు సరైన ఆటగాడు లేడు. అంతేకాదు ఏడాది కాలంగా దీపక్ చహర్ బంతితోనే కాదు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో 65 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో తనలో ఆల్‌రౌండర్ ఉన్నాడని నిరూపించిన చహర్ ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ టీమిండియా తరపున పలు మ్యాచ్‌లో మెరిశాడు. ఇక విండీస్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టి20లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ప్రస్తుతం దీపక్ చహర్ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్నాడు. ఇప్పటికైతే చహర్ గాయం తీవ్రత గురించి ఎలాంటి సమాచారం లేనప్పటికి.. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌ను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటివారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ సన్నాహాకాలు చేస్తుంది. చదవండి: Formula One: 'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు' 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్
లంకతో టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లు దూరమవ్వగా.. దీపక్ చహర్ కూడా తొడ కండరాల గాయంతో లంకతో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా టీమిండియాకు మరో షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది. లంకతో సిరీస్‌కు సిద్ధమైన సూర్య మంగళవారం లక్నోలో ప్రాక్టీస్ సెషన్లో కనిపించినప్పటికి కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. చేతికి ప్రాక్చర్ అయినట్లు తేలడంతో లంకతో టి20 సిరీస్‌కు అతన్ని దూరంగా ఉంచనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.కాగా దెబ్బ ఎక్కడ తగిలిందనే విషయంపై స్పష్టత రాలేదు. బహుశా విండీస్‌తో మూడో టి20లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనే సూర్యకుమార్ చేతికి గాయమై ఉంటుంది. అయితే చేతికి బ్యాండేజీ వేసుకోకపోవడంతో గాయం తీవ్రత పెద్దగా కనిపించలేదు. కాగా రెస్ట్ పేరుతో కోహ్లి, రిషబ్ పంత్‌లు టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సూర్యకుమార్ యాదవ్ విండీస్‌తో టి20 సిరీస్‌లో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మూడో టి20లో 31 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కాగా మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. సూర్యకుమార్ గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. చదవండి: IND Vs SL: గాయంతో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం -
సుందర్‌ది దురదృష్టమే.. కాకపోతే చెప్పండి
ఐదేళ్ల తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌తో వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. కాకపోతే చెప్పండి.. వన్డే సిరీస్‌లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడు వన్డేల సిరీస్‌లో సుందర్ బ్యాటింగ్‌లో 67 పరుగులు.. బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా మూడో వన్డేలో 33 పరుగులు చేసిన సుందర్.. దీపక్ చహర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. సూపర్ రీ ఎంట్రీ మనం అనుకునే లోపు సుందర్ మరోసారి గాయం బారిన పడ్డాడు. చదవండి: Keegan Petersen: టీమిండియాపై దుమ్మురేపాడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా విషయంలోకి వెళితే.. కండరాల గాయంతో సుందర్వెస్టిండీస్తో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడమకాలు కండరాల గాయంతో బాధపడ్డాడు. రిపోర్ట్స్‌లో గాయం తీవ్రత గ్రేడ్-1 గా తేలడంతో సుందర్ టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 15(మంగళవారం) సుందర్ ఎన్సీఏ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నాడు. మూడువారాల పాటు సుందర్ రీహాబిటేషన్‌లో ఉండనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా సుందర్ స్థానంలో లెగ్స్పన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇప్పటికే గాయంతో కేఎల్ రాహుల్, రీహాబిటేషన్ పేరుతో అక్షర్ పటేల్‌లు టి20 సిరీస్‌కు దూరమవ్వగా.. తాజాగా సుందర్ కూడా ఆ జాబితాలో చేరాడు. కాగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ స్థానాల్లో దీపక్ హుడా, రుతురాజ్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 16,18,20వ తేదీల్లో విండీస్‌తో టీమిండియా మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఐపీఎల్ మెగావేలంలో వాష్టింగ్టన్ సుందర్‌ను రూ. 8.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND vs WI: విరాట్ కోహ్లిని ఊరిస్తున్న ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా! విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా -
టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. కీలక ఆటగాళ్లు దూరం
వెస్టిండీస్‌తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లు టి20 సిరీస్‌కు దూరమయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలను జట్టులోకి ఎంపికచేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా టీమిండియా వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ విండీస్‌తో రెండోవన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఎడమకాలు కండరాల నొప్పితో మూడో వన్డేకు దూరంగా ఉన్నాడు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో టి20 సిరీస్‌కు రాహుల్ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. ఇక వన్డే సిరీస్ ఆరంభానికి అక్షర్ పటేల్, ధావన్, శ్రేయాస్ అయ్యర్లు కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురు కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికి అక్షర్ పటేల్ ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడం కోసం రిహాబిటేషన్ పేరుతో సిరీస్‌కు దూరంగా ఉంచినట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ ఇద్దరు బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా -
దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం
Anrich Nortje Ruled Out Of Test Series Vs IND.. టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే దక్షిణాఫ్రికా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే టెస్టు సిరీస్ మొత్తానికే దూరమయినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ట్విటర్లో ప్రకటించింది. టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నోర్ట్జే వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. తాజాగా మోకాలి గాయం తిరగబెట్టడంతో టీమిండియాతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక నోర్జ్టే దక్షిణాఫ్రికా తరపున 12 టెస్టుల్లో 47 వికెట్లు తీశాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల హాల్‌ను సాధించాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లోనూ నోర్ట్జే మంచి ప్రదర్శన కనబరిచాడు. నెట్‌రన్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాలను చేజార్చుకుంది. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న నోర్ట్జే రెండేళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తూ స్థిరంగా వికెట్లు తీశాడు. ''దక్షిణాఫ్రికాకు కీలకబౌలర్‌గా ఉన్న నోర్జ్టే టీమిండియాతో టెస్టు సిరీస్‌కు దూరమవ్వడం మాకు పెద్ద లోటు. కానీ వరుస గాయాలతో అతను ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వన్డు సిరీస్‌కు కూడా నోర్జ్టే అందుబాటులోకి వస్తాడా లేదో చెప్పలేని పరిస్థితి. ఇక నోర్ట్జే స్థానంలో టెస్టు సిరీస్‌కు ఎవరిని ఎంపికచేయడం లేదు. నోర్జ్టే గైర్హాజరీలోనూ కగిసో రబాడ, బీరన్ హెండ్రిక్స్, గ్లెంటన్ స్టుర్మాన్, డ్యుయాన్నే ఒలివర్, సిసండా మగాలాలతో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. వీరితో పాటు వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్లు పేస్ ఆల్రౌండర్లుగా సేవలందించనున్నారు. అని సీఎస్ఏ చెప్పుకొచ్చింది. -
కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్; సూర్య ఇన్.. రాహుల్ ఔట్
KL Rahul Ruled Out From NZ Test Series.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ గాయంతో సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ''కేఎల్ రాహుల్ తొడ కండరంపై ఒత్తిడి పడుతుండడంతో నొప్పి పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అతనికి విశ్రాంతి అవసరం. అందుకే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. గాయం తగ్గిన తర్వాత రాహుల్ నేరుగా ఎన్సీఏకి వెళ్లిపోతాడు. అక్కడే ఫిట్నెస్ నిరూపించుకొని వచ్చే నెలలో జరగనున్న సౌతాఫ్రికా టూర్‌కు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేస్తూ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.'' అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా ఇప్పటికే రోహిత్, కోహ్లి గైర్హాజరీ కానుండడం.. తాజాగా రాహుల్ కూడా దూరమవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారనుంది. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ప్రతీ టెస్టు మ్యాచ్ కీలకమే. ఇక రహానే సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. రాహుల్ గాయంతో దూరమవ్వడంతో శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌లు ఓపెనింగ్ చేయనున్నారు. ఇక నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. టీమిండియా టెస్టు జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, అక్సర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చదవండి: Cheteshwar Pujara: '1055 రోజులైంది.. కచ్చితంగా సెంచరీ కొడతా' Suryakumar Yadav: ద్రవిడ్ ప్రణాళికలు... సూర్యకుమార్‌కు బంపరాఫర్!.. దక్షిణాఫ్రికాకు శార్దూల్?! -
T20 World Cup 2021: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్..
Tymal Mills Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021 కీలక దశకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ తైమాల్ మిల్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సోమవారం(నవంబర్ 1) శ్రీలంకతో మ్యాచ్‌లో 1.3 ఓవర్లు వేసిన మిల్స్.. తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రమైందిగా తేలడంతో అతను టోర్నీ నుంచి వైదొలుగుతాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం ప్రకటించింది. దీంతో ఈసీబీ అతని స్థానాన్ని రీస్ టాప్లేతో భర్తీ చేసింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన మిల్స్.. 15.42 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత మెగా టోర్నీలో మోర్గాన్ సేన సూపర్ ఫామ్‌లో కొనసాగుతుంది. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో ఇంగ్లండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లీష్ జట్టు నవంబర్ 6న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: పసికూనపై మార్టిన్ గప్తిల్ ప్రతాపం.. పలు రికార్డులు సొంతం -
T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు భారీ షాక్..
Shakib Al Hasan Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో బంగ్లాదేశ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. సూపర్-12లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్‌కు ఇది మరో మింగుడుపడని విషయం. కాగా, షకీబ్ ప్రస్తుత మెగా టోర్నీలో బంగ్లా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తంలో 6 మ్యాచ్‌లు ఆడిన షకీబ్ 21.83 సగటుతో 131 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌కు ఈ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నవంబర్ 2న దక్షిణాఫ్రికా, 4న ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంది. చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత -
న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో మరో ఆటగాడు ఔట్
Lockie Ferguson Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021లో న్యూజిలాండ్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలై కుంగిపోయి ఉన్న ఆ జట్టుకు పుండు మీద కారం చల్లినట్లుగా గాయాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. తొలుత పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ మార్టిన్ గప్తిల్ గాయపడి భారత్‌తో కీలక మ్యాచ్‌కు దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాలి గాయంతో బాధపడుతున్న ఫెర్గూసన్‌కు ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అని తేలడంతో వైద్యులు అతన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో న్యూజిలాండ్ బోర్డు ప్రపంచకప్ జట్టును నుంచి ఫెర్గూసన్‌ను తప్పించి, అతని స్థానంలో ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే, పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఈనెల 31న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవడం చాలా ముఖ్యం. భారత్, న్యూజిలాండ్ జట్లు పాక్ చేతిలో పరాజయం పాలవ్వడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. కాగా, గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, జట్లతో పాటు బలహీనమైన అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా జట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరు జట్ల నుంచి కేవలం రెండు జట్లకు మాత్రమే సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉండడం.. పాక్ సెమీస్ బెర్తు దాదాపు ఖరారు కావడంతో మిగిలిన ఒక్క బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. చదవండి: T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్ -
T20 World Cup 2021: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Sam Curran Ruled Out T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందు ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వెన్నునొప్పి కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు నుంచి వైదొలిగాడు. సామ్ కరన్ స్థానంలో అతని సోదరుడు టామ్ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. కాగా రీస్ టోప్లేను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికచేసినట్లు తెలిపింది. ఇప్పటికే బెన్ స్టోక్స్ రూపంలో సేవలు కోల్పోయిన ఇంగ్లండ్ తాజాగా సామ్ కరన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను కోల్పోవడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక సామ్ కరన్ ఇంగ్లండ్ తరపున 24 టెస్టుల్లో 815 పరుగులు.. 47 వికెట్లు, 11 వన్డేల్లో 141 పరుగులు.. 12 వికెట్లు, 16 టి20ల్లో 91 పరుగులు.. 16 వికెట్లు తీశాడు. చదవండి: T20 World Cup: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు ప్రస్తుతం ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడుతున్న సామ్ కరన్ శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం సామ్ కరన్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపించారు. తాజాగా వెల్లడించిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ తెలిపింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్ కరన్‌ను తదుపరి మెడికల్ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్ టి20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్,టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్ -
యూఎస్ ఓపెన్ నుంచి సెరెనా ఔట్
న్యూయార్క్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దూరమవుతున్నట్లు ప్రకటించింది. తన ఎడమ కాలి మడమ గాయం వల్ల ఈ ఏడాది యూఎస్ ఓపెన్ కు అందుబాటులో ఉండనని సెరెనా తెలిపింది. దీనికోసం ఆమె ఇదివరకే చికిత్స కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ పూర్తి ఫిట్నెస్ను సాధించలేకపోయారు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. ప్రపంచంలో తనకు ఇష్టమైన నగరం న్యూయార్కేనని, అక్కడ యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఆడటం కంటే ఇష్టమైనది మరొకటి లేదని సెరెనా విలియమ్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా , ఇప్పటికే.. డిఫెండింగ్ చాంపియన్ డొమినిక్ థీమ్ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. మరో వైపు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు లేవని సోషల్ మీడియాలో తెలిపాడు. చదవండి: IND Vs ENG 3rd Test Day 1: ఇంగ్లండ్ పేసర్ల విశ్వరూపం.. 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన భారత్ -
ఇంగ్లండ్‌తో సిరీస్.. ఆ ఆటగాడు దూరం
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆసీస్ పర్యటనలో భాగంగా గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడేజా గబ్బా టెస్టుకు దూరమయ్యాడు. కాగా బ్యాటింగ్ సమయంలో బంతి జడేజా బొటనవేలికి బలంగా తగిలింది. దీంతో జడేజాకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ నిర్వహించిన వైద్యులు కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరమని తెలిపారు. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమవడంతో పాటు వన్డే సిరీస్‌లోనూ ఆడడం అనుమానంగానే ఉంది. టెస్టు సిరీస్ ముగిసేసరికి జడేజాకు ఆరు వారాలు పూర్తవుతాయి.. అనంతరం అతని ఫిట్నెస్ను పరీక్షించి పరిమిత ఓవర్లలో ఆడేది లేనిది సెలక్టర్లు నిర్ణయిస్తారని బీసీసీఐ తెలిపింది. కాగా ఆసీస్ పర్యటన ముగించుకొని గురువారం ఉదయం ఇతర టీమిండియా క్రికెటర్లతో కలిసి జడేజా భారత్ చేరుకున్నాడు. రిహాబిలిటేషన్ కోసం జడ్డూను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపనున్నారు. ఆసీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా.. జడేజా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. అదే మ్యాచ్‌లో బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో కంకషన్‌కు గురయ్యాడు. అతని స్థానంలో వచ్చిన చహాల్ మ్యాచ్ గెలిపించిన సంగతి తెలిసిందదే. అనంతరం ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో బరిలో దిగిన జడ్డూ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. చదవండి: అతడితో నన్ను పోల్చడం అద్భుతం కానీ..: పంత్ భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.