Russia president
-
పుతిన్‌పై పోరాటమే..
మాస్కో: రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్‌పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా ప్రతిజ్ఞ చేశారు. సోమవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పలువురు ఈయూ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. భర్త నవాల్నీ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌ను, ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. నవాల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని, సాక్ష్యాలు దొరక్కుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. -
పుతిన్‌ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్ను సర్వనాశనం చేసేందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంకణం కట్టుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఆయన యుద్ధోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందే. ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా క్షిపణుల వర్షం కురిపించిన వైనం ఈ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది’’ అన్నారు. తమ దేశంపైకి రష్యా ఏకంగా 110 క్షిపణులను ప్రయోగించిందని, ఈ డాడిలో 31 మంది అమాయకులు బలవగా వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం తెలిసిందే. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని ఉక్రెయిన్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్‌ను అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిద్దామని అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు బైడెన్ పిలుపునిచ్చారు. -
అప్పటి దాకా ధాన్యం ఒప్పందం ఉండదు
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్‌ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో ఆయన సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు. -
పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించనున్నాయి క్రెమ్లిన్ వర్గాలు. ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపబడిన అదనపు కేసులు.. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం (నవాల్నీ సభలకు 18 సంవత్సరాల లోపు వారు హాజరైనందుకు), తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు. కొత్తగా నమోదైన కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి నన్ను దూరంగా ఉంచాలన్న కారణంతోనే మరిన్ని కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని పుతిన్ నేతృత్వంలోని క్రెమ్లిన్ వర్గాలు చూస్తున్నాయన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి అభిమతమని అన్నారు. జైల్లో ఉన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా అనుచరుల సాయంతో ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన సోషల్ మీడియాలో పొందుపరిచారు. స్వేచ్ఛతో కూడిన కొత్తదైన ధనిక రాజ్యానికి జన్మనివ్వాలంటే ప్రతి ఒక్కరూ అలాంటి రాజ్యం కోసం త్యాగం చేసి తల్లిదండ్రులు కావాలని కోరారు. ఇది కూడా చదవండి: మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు -
వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ
క్యీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పెయిన్ మీడియా నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తిరుగుబాటు సైన్యమైన వాగ్నర్ గ్రూపుకు సంబంధించిన సుమారు 21000 మందిని చంపామని మరో 80,000 మంది గాయపడి ఉంటారని నిర్ధారించారు. పదహారు నెలలుగా సాగుతున్న యుద్ధంలో బలమైన రష్యాను ఉక్రెయిన్ సమర్థవంతంగానే ఎదుర్కొంది. రష్యా ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన్ ముందుకు సాగుతోంది. ఈ సందర్బంగా స్పానిష్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వారడిగిన కొన్ని సందేహాలకు సమాధానమిచ్చారు. యెవ్గెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూపు చేసిన తిరుగుబాటు ప్రస్తావన రాగా రష్యాతో జరిగిన యుద్ధంలో వారు కూడా ఎక్కువగానే నష్టపోయారని తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రష్యా ప్రేరేపిత సైన్యమమైన వాగ్నర్ గ్రూపుకు చెందిన సుమారు 80000 మంది గాయాల పాలవగా దాదాపు 21000 మందిని మట్టుబెట్టామని అన్నారు. శత్రువును మా నేల మీద నుండి తరిమేయడమే మా ముందున్న ప్రధమ కర్తవ్యమని తెలిపారు. ఈ యుద్ధ నేపథ్యంలో మీ ప్రాణానికి హాని ఉంది భయంగా లేదా..? అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. నాకంటే రష్యా అధ్యక్షుడికే ఎక్కువగా ప్రాణహాని ఉందని, నన్ను చంపాలనే ఉద్దేశ్యం ఆయనకు తప్ప ఎవరికీ లేదని, కానీ ఆయనను చంపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా జూన్ 29న రష్యా సైన్యం పైన తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు రష్యా అధ్యక్షుడికి కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేయడంతో యెవ్గేనీ ప్రిగోజిన్ దళాలు శాంతించి వెనక్కు మళ్ళిన విషయం తెలిసిందే. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రిగోజిన్ దళాలకు మూడు ప్రత్యామ్నాయాలు విధించినట్లు రష్యాతో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవాలని, యధావిధిగా పౌరసత్వాన్ని కొనసాగించాలని లేదా బెలారస్ కు తరలిపొమ్మని సూచించినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఇది కూడా చదవండి: వారు కాపాడటానికి వచ్చారనుకున్నాం.. కానీ.. -
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్‌చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్‌కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్‌చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
Russia-Ukraine war: పుతిన్‌పై హత్యాయత్నం
కీవ్: అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. అందులో భాగంగా బుధవారం తెల్లవారజామున అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్ దాడులు జరిగాయని ప్రకటించింది. ఇది మతిమాలిన ఉగ్రవాద చర్య అంటూ మండిపడింది. ఇందుకు తీవ్రస్థాయిలో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. భారీ స్థాయిలో ప్రతి దాడి ఉంటుందని ప్రకటించింది. సరైన సమయంలో దీటుగా స్పందిస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్నదే వాటి అంతరార్థమని భావిస్తున్నారు. ‘‘దాడులను భగ్నం చేశాం. మా భద్రతా దళాలు డ్రోన్లలో మధ్యలోనే పేల్చేశాయి. ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. క్రెమ్లిన్ భవనానికీ నష్టం జరగలేదు. ఆ సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరు. మాస్కో ఆవల నోవో ఒగర్యోవో నివాసంలో సురక్షితంగా ఉన్నారు’’ అని ఆయన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. మే 9న నగరంలో జరగాల్సిన విక్టరీ డే పరేడ్‌ను అడ్డుకోవడం కూడా దాడి లక్ష్యమని ఆరోపించారు. పరేడ్ యథాతథంగా జరుగుతుందని ప్రకటించారు. దాడిపై అనుమానాలు క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడులు జరిగినట్టు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. రష్యా కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి రుజువులూ బయట పెట్టలేదు. దాడి జరిగితే ఆ విషయాన్ని 12 గంటల పాటు ఎందుకు దాచారన్న దానిపైనా వివరణ లేదు. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడిగా చెబుతున్న వీడియోలు మాత్రం వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మాస్కోలో డ్రోన్లపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. క్రెమ్లిన్‌పై జరిగినట్టు చెబుతున్న డ్రోన్ దాడులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తమపై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు బహుశా ఈ ఉదంతాన్ని సాకుగా రష్యా వాడుకోవచ్చని అభిప్రాయపడింది. తమ నగరాలపై జరుపుతున్న తీవ్ర స్థాయి సైనిక దాడులను ఇలా సమర్థించుకోజూస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్‌తో రష్యా 14 నెలలుగా పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ దాడులను ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతూ వస్తోంది. ఏం జరిగింది? దాడికి సంబంధించి పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒకదాంట్లో క్రెమ్లిన్‌పైకి డ్రోన్ దూసుకొస్తూ కన్పించింది. అతి సమీపానికి వచ్చాక పేలిపోయి నేలకూలింది. క్రెమ్లిన్, సమీప భవనాల మీదుగా పొగ వస్తున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. దాడికి సంబంధించి క్రెమ్లిన్ పక్కనున్న నది ఆవల నుంచి తీసినట్టు చెబుతున్న వీడియో మాస్కో స్థానిక టెలిగ్రా చానల్లో రాత్రి పూట ప్రసారమైంది.డ్రోన్ శకలాలు అధికార భవన ఆవరణలో పడ్డట్టు క్రెమ్లిన్ వెబ్సైట్ కూడా పేర్కొంది. తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలు, పొగ వచ్చినట్టు స్థానికులు చెప్పుకొచ్చారు. దీనిపై రష్యాలో ప్రభుత్వ అనుకూల వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ప్రతి దాడులకు దిగి ఉక్రెయిన్ సీనియర్ నాయకులను వరుసబెట్టి అంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. జెలెన్స్కీ ‘నిర్ణాయక దాడి’ వ్యాఖ్యల నేపథ్యంలో ఘటన ► ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తాజాగా ఫిన్లండ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ► రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని శక్తిమంతమైన ఆయుధాలు అందజేయాలని ఐదు నోర్డిక్ దేశాలు ఫిన్లండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్లను గట్టిగా కోరారు. ► ఈ సందర్భంగా హెల్సింకీలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ అతి త్వరలో ప్రతిదాడికి దిగనుందని ప్రకటించారు. ► ‘‘విజయం కోసం నిర్ణాయక దాడి చేయనున్నాం’’ అని చెప్పు కొచ్చారు. తర్వాత కాసేపటికే రష్యా నుంచి డ్రోన్ దాడి ఆరోపణ వెలువడింది. ► మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. రాజధాని కీవ్‌పై ఇరాన్ తయారీ డ్రోన్లతో రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ► 21 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు దక్షిణ రష్యాలో క్రాస్నోడర్ ప్రాంతంలో ఓ చమురు డిపోలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు. ► ఇది రష్యా సరఫరా వ్యవస్థలను లక్ష్యం చేసుకుని కొంతకాలంగా ఉక్రెయిన్ చేస్తు న్న దాడుల్లో భాగమేనని భావిస్తున్నారు. -
మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్‌లోకి పుతిన్
కీవ్: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్ ప్రావిన్స్‌కు చేరుకున్న పుతిన్ అక్కడి రష్యా సేనల కమాండ్ పోస్ట్‌కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్లోని రష్యన్ నేషనల్ గార్డ్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఖేర్సన్, లుహాన్సŠక్లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాల్లో పుతిన్ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్‌లను స్థానిక ‘రెఫరెండమ్’ల ద్వారా గత సెప్టెంబర్‌లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే. -
Ukraine Russia War: రష్యా కాల్పుల విరమణ
కీవ్: ఉక్రెయిన్‌లో ఈ వారాంతంలో 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా అధినేత పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. రష్యాలో ఆర్థోడాక్స్ క్రిస్మస్ సెలవు నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లోని కొందరు ఇదే రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. కాగా, ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ పునరుద్ఘాటించారు. కానీ, చర్చలు జరగాలంటే ఒక షరతు విధించారు. ఉక్రెయిన్ నుంచి తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను రష్యాకు చెందిన భూభాగాలుగానే జెలెన్స్కీ ప్రభుత్వం అంగీకరించాలని తేల్చిచెప్పారు. ఈ ఒక్క షరతుకు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌తో చర్చలకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాలను రష్యా బలప్రయోగంతో ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. డొనెట్స్క్, లుహాన్స్క్, జపొరిఝాజియా, ఖేర్చన్లలో రష్యా సైన్యం పాగా వేసింది. -
రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు
మాస్కో: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తోంది రష్యా. వేలాది మంది సైనికులను కోల్పోతున్నా వెనక్కి తగ్గటం లేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇప్పటికే సైనిక బలగాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకే మొగ్గు చూపిన పుతిన్.. తాజాగా జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌పై దాడి, నియో-నాజీల భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను సినిమా హాళ్లలో ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాడులు మొదలు పెట్టి ఏడాది కావస్తున్న క్రమంలో ఫిబ్రవరి నాటికి ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది క్రెమ్లిన్. ఫిబ్రవరి 1 నాటికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అమలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌లో పాలుపంచుకుని తమ హీరోయిజాన్ని ప్రదర్శించిన వారికి అంకితం చేసే డాక్యుమెంటరీలు తీసేలా పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఆయా సినిమా నిర్మాతలకు సహాయం అందించాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. ఆ దిశగా తీసుకున్న చర్యలపై మార్చి 1 నాటికి నివేదిక సమర్పించాలని రక్షణ మంత్రి సెర్గీ షోయిగూను ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ ప్రాంత అనుకూల దేశంలో నిరాయుధీకరణ, నాజీ భావజాలం కట్టడి అంటూ ఈ సైనిక చర్య చేపట్టారు. ఈ దాడి చెపట్టినప్పటి నుంచి రష్యాలోని అధికార టీవీ ఛానళ్లు.. తమ సైనిక బలగాలను పొగుడుతూ పలు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ వస్తున్నాయి. మరోవైపు.. స్వతంత్ర మీడియా సంస్థలు మూసివేశారు. జర్నలిస్టులు దేశం దాటి వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌పై దాడిని ఎవరైనా విమర్శిస్తే జైలు శిక్ష విధించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం ! -
పుతిన్‌తో పెట్టుకుంటే అంతే!.. ఆ దేశాలకు చమురు ఎగుమతులు బంద్
మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యాకు ప్రధాన వనరుగా ఉన్న చమురు ఉత్పత్తులపై ప్రైస్క్యాప్ విధించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే, తాజాగా ఆయా దేశాలకు గట్టి షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ దేశాల ప్రైస్ క్యాప్‌కు కౌంటర్ ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా భావిస్తున్న పుతిన్ తాజాగా ఆ దిశగా అడుగు వేశారు. ప్రైస్ క్యాప్ విధించిన దేశాలకు చమురు, చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయకూడదనే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జులై వరకు అమలులో ఉండనుంది. ఐరోపా సమాఖ్యలోని ఏడు పెద్ద దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా సముద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్న ఆయిల్‌పై ప్రైస్ క్యాప్‌ను బ్యారెల్‌కు 60 డాలర్లుగా నిర్ణయించాయి. దానిని డిసెంబర్ 5 నుంచి అమలులోకి తీసుకొచ్చాయి. ఈ నిర్ణయానికి తాజాగా కౌంటర్ ఇచ్చింది క్రెమ్లిన్. చమురు ఎగుమతులను నిలిపివేస్తూ తీసుకొచ్చిన ఆదేశాలు 2023 ఫిబ్రవరి 1 నుంచి జులై 1 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ముడి చమురు ఎగుమతులపై నిషేదం ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వస్తుండగా.. చమురు ఉత్పత్తులపై బ్యాన్ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని రష్యా ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు.. ఈ ఆదేశాల్లో ప్రత్యేక క్లాజ్‌ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. ప్రత్యేకమైన సందర్భంలో ఈ బ్యాన్‌ను అధ్యక్షుడు పుతిన్ ఎత్తివేసే అవకాశం కల్పించింది. ఇదీ చదవండి: అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్ -
రష్యా అధ్యక్షుడికి మోదీ ఫోన్.. అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులు చేస్తున్న క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసింది. ఈ ఫోన్ సంభాషణపై అగ్రరాజ్య అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని ప్రధాని మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపింది. మీడియా సమావేశంలో పుతిన్, మోదీ ఫోన్ సంభాషణపై ప్రశ్నించగా.. ఈ మేరకు స్పందించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్. ‘భారత ప్రధాని మోదీ మాటలను పరిగణనలోకి తీసుకుంటాం. ఆయన సూచనలు ఆచరణలోకి వచ్చినప్పుడు వాటిని స్వాగతిస్తాం. రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే, యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు మేము మిత్రదేశాలతో సమన్వయంతో పని చేస్తాం. యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు పాటుపడాలనే ఆసక్తి ఉన్న ఏ దేశమైనా.. ఉక్రెయిన్ మిత్ర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.’ అని తెలిపారు వేదాంత్ పటేల్. పుతిన్‌తో మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని పునరుద్ఘాటించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు రష్యా, భారత్ దేశాధినేతల మధ్య ఈ ఏడాది ఐదుసార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. ఇదీ చదవండి: భారత ప్రధానమంత్రి కసాయి -
రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే
మాస్కో: రష్యాను ‘ఫ్లూ’ భయం వణికిస్తోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చాలామంది అంటువ్యాధి బారినపడినట్లు తెలిసింది. అధ్యక్ష భవనంలో అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పనిచేసే సిబ్బందికి సైతం ఫ్లూ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ను అధికారులు రష్యా తూర్పు ప్రాంతంలోని ఉరాల్ పర్వతాల వెనుక ఉన్న ఓ బంకర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం పుతిన్ అక్కడే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బంకర్లోనే జరుపుకుంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 70 ఏళ్ల పుతిన్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఏడాది రష్యా పార్లమెంట్ ఎగువ సభ డ్యుమాలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి ఏటా సంవత్సరం ఆఖరున నిర్వహించే మీడియా సమావేశాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. పుతిన్ ఇలా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వైఫల్యానికి సంబంధించి విలేకరులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకే ఆయన వార్షిక మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అణు యుద్ధంపై మరోమారు పుతిన్ వ్యాఖ్యలు.. ఏం జరుగుతోంది?
మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని, అయితే, తాము అణ్వాస్త్రాలను వినియోగించబోమని పేర్కొన్నారు. రష్యాలోని మానవ హక్కుల మండలితో వర్చువల్‌గా మాట్లాడారు పుతిన్. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ఉక్రెయిన్‌లో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న ప్రక్రియ. అణు యుద్ధం ముప్పు పెరుగుతోందనడంలో అనుమానాలు లేవు. ఏ పరిస్థితిలోనూ రష్యా మొదట అణ్వాయుదాలను ప్రయోగించదు. వాటిని చూపించి బెదిరించదు. అణ్వాయుధాల సంగతి మాకు తెలుసు. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోం. ప్రపంచమంతా తిరుగుతూ ఆ ఆయుధాలను బ్రాండింగ్ చేసుకోం. ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వాస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ఇతర దేశాల భూభాగాలపై మా అణ్వాయుధాలు లేవు.’ అని పేర్కొన్నారు పుతిన్. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబ్స్ ఉండడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం ఆత్మ రక్షణకే రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుందన్నారు. ఇదీ చదవండి: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్స్కీ -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే నాటికి పుతిన్ అవుట్!
కీవ్: రష్యాతో యుద్ధం ముగిసేనాటికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవిలో ఉండరని చెప్పారు ఉక్రెయిన్ రక్షణ అధికారి కిరిలో బుడనోవ్. పుతిన్‌ను అధ్యక్షుడిగా తొలిగించేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే పుతిన్ పదవిని కోల్పోతారని జోస్యం చెప్పారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో రష్యా ఆక్రమించుకున్న ఖేర్సాన్ను ఉక్రెయిన్ తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నవంబర్ నాటికి ఈ ప్రాంతమంతా మళ్లీ తమ అధీనంలోకి వస్తుందని బుడనోవ్ పేర్కొన్నారు. ఆ తర్వాత క్రిమియాను కూడా తిరిగి పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని రష్యా 2014లోనే తమ భూభాగంలో విలీనం చేసుకుంది. సెప్టెంబర్ నుంచి రష్యా సేనలను చావుదెబ్బ కొడుతూ తమ ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటోంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే పుతిన్ పదవి కోల్పోతారని బుడనోవ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ దాడులకు ప్రతిఘటనగా ఇటీవల డ్రోన్లతో క్షిపణుల వర్షం కురిపించింది రష్యా. విద్యుత్ కేంద్రంపై బాంబులతో విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్‌లో 40 శాతం మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లారు. అయినా ఏమాత్రం వెనక్కితగ్గకుండా రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నాయి కీవ్ సేనలు. తమ ప్రాంతాలని తిరిగి చేజిక్కించుకుంటున్నాయి. చదవండి: షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్! -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
-
Ukraine-russia war: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేనేలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. రాజకీయంగా, సైనికపరంగా కూడా తమకు అలాంటి అవసరం లేదన్నారు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని అన్నారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయంటూ అమెరికా, మిత్ర పక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. కాగా, ఖేర్సన్ను తిరిగి తమ వశం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకొస్తున్న ఉక్రెయిన్ సేనల ధాటికి ఖేర్సన్‌లోని రష్యా అనుకూల ఉన్నతాధికారులు పారిపోయారు. వీరితోపాటు వేలాది మంది స్థానికులు దాడుల భయంతో స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ‘తాజాగా అమెరికా, పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య ఉపగ్రహాలను యుద్ధంకోసం ఉక్రెయిన్ వాడుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం’ అని ఐరాసలో ఆయుధాల నియంత్రణ ప్యానెల్లో రష్యా ప్రతినిధి కాన్స్టాంటిన్ ఆరోపించారు. యుద్ధం కారణంగా శిలాజ ఇంధనాలకు ఎవరూ ఊహించనంతగా డిమాండ్ పెరిగే ప్రమాదముందని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ తన నివేదికలో హెచ్చరించింది. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు
మాస్కో: ఉక్రెయిన్‌లో భారీ ఎదురుదెబ్బల నేపథ్యంలో ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు ఆదేశించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌తో పాటు మొత్తం పాశ్చాత్య దేశాల సంఘటిత యుద్ధ వ్యవస్థతో తాము పోరాడుతున్నామని ఈ సందర్భంగా వాపోయారు. ‘‘పోరు బాగా విస్తరించింది. సరిహద్దుల్లోనూ, విముక్త ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. దాంతో ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అమెరికా సారథ్యంలో పాశ్చాత్య దేశాలు అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘‘రష్యాను బలహీనపరిచి, విభజించి, అంతిమంగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ను ముక్కలు చేశామని ఇప్పుడు బాహాటంగా ప్రకటించుకుంటున్నాయి. రష్యాకూ అదే గతి పట్టించాల్సిన సమయం వచ్చిందంటున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తమ భూభాగాలను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని రకాల ఆయుధ వ్యవస్థలనూ వాడుకుంటామంటూ నర్మగర్భ హెచ్చరికలు చేశారు. ఇది అన్యాపదేశంగా అణు దాడి హెచ్చరికేనంటూ యూరప్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యా అంతటి దుస్సాహసం చేయకపోవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పుతిన్ ప్రకటనను రష్యా బలహీనతకు ఉదాహరణగా, దురాక్రమణ విఫలమవుతోందనేందుకు రుజువుగా అమెరికా, బ్రిటన్ అభివర్ణించాయి. ఉక్రెయిన్‌తో పోరులో ఇప్పటిదాకా 5,937 మంది రష్యా సైనికులు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ అంతకు పదింతల మంది సైనికులను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. రష్యాను వీడుతున్న యువత పుతిన్ తమనూ నిర్బంధంగా యుద్ధానికి పంపుతారేమోనని రష్యా యువకులు భయపడుతున్నారు. బుధవారం ఆయన ప్రకటన వెలువడగానే వారు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న విమానాల్లో దేశం వీడారు. దాంతో టికెట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. మాస్కో–ఇస్తాంబుల్ టికెట్ ఏకంగా 9 వేల డాలర్లు దాటింది. అయినా కొనేందుకు ఎగబడటంతో టికెట్లన్నీ హట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. రానున్న కొద్ది రోజుల దాకా అన్ని విమానాల్లోనూ సీట్లన్నీ నిండిపోయాయి. దాంతో రైలు తదితర మార్గాల వెదుకులాట మొదలైంది. -
SCO Summit 2022: యుద్ధాన్ని ముగించండి
సమకాలీన ప్రపంచంలో యుద్ధాలకు తావు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. ఎస్ఈఓ సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యాల ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. ‘‘ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం నేడు వర్ధమాన దేశాలకు అతి పెద్ద సమస్య. వీటికి వెంటనే పరిష్కారం కనిపెట్టేందుకు మీరు కృషి చేయాలి’’ అని పుతిన్‌కు సూచించారు. యుద్ధంపై భారత్ వైఖరిని, ఆందోళనను అర్థం చేసుకోగలనని పుతిన్ బదులిచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ, పుతిన్ సమావేశమవడం ఇదే తొలిసారి. చర్చలు అద్భుతంగా సాగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘‘వర్తకం, ఇంధనం, రక్షణ వంటి పలు రంగల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకొచ్చాయి’’ అని వివరించారు. రష్యాతో బంధానికి భారత్ ఎంతో ప్రాధాన్యమిస్తుందని పునరుద్ఘాటించారు. శనివారంతో 72వ ఏట అడుగు పెడుతున్న మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రేపు నా ప్రియమిత్రుడు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. రష్యా సంప్రదాయంలో ముందుగా శుభాకాంక్షలు చెప్పరు. అయినా మీకు, భారత్‌కు శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్ మరింత అభవృద్ధి చెందాలి’’ అని ఆకాంక్షించారు. గత డిసెంబర్లో తన భారత పర్యటన తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. -
Russia-Ukraine war: ఎండ్ కార్డ్ ఎప్పుడు?
రణరంగం కానిచోటు భూ స్థలమంతా వెదకిన దొరకదు; గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో – శ్రీశ్రీ ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితీ ఇదే! దేశంలో రక్తపుటేరులు పారుతున్నాయి. అమాయక పౌరులు శవాల గుట్టలుగా మారుతున్నారు. విధ్వంసం తాండవిస్తుంటే తలదాచుకునే నీడ కరువై దేశం వీడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. రష్యా విసిరిన పంజాకు ఉక్రెయిన్ తల్లడిల్లుతుంటే, ప్రత్యక్షంగా ఈ యుద్ధ ప్రభావానికి లోనుకాని వాళ్లకు ఈ దృశ్యాలన్నీ చరిత్ర చెక్కుతున్న రుధిర చిత్రాలే! ఈ ఏడాది ఫిబ్రవరి 24న వ్లాదిమిర్ పుతిన్ తన పొరుగు దేశమైన ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దండయాత్రను ప్రకటించినప్పుడు ప్రపంచం యావత్తూ షాక్‌కు గురైంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ దురాక్రమణను తాము ముందే ఊహించినట్టు చెప్పుకొచ్చారు. నెలలు గడుస్తున్నా రోజూ తెల్లారుతున్న మాదిరిగానే యుద్ధమూ కొనసాగుతూనే ఉంది. చాలామంది యుద్ధం వార్తలు చదవడం ఆపేశారు కూడా. మొదట్లో పతాక శీర్షికలకెక్కిన యుద్ధ వార్తలు ఇప్పుడు అట్టడుగుకు చేరుకున్నాయి. ప్రసార మాధ్యమాల్లో సైతం యుద్ధ వార్తలపై ఇదే ధోరణి. వీటితో నిమిత్తం లేకుండా కదనరంగంలో మాత్రం విధ్వంసం కొనసాగుతూనే ఉంది. రోజుకెందరు ప్రాణాలు విడుస్తున్నారో, ఇంకెందరు నిరాశ్రయులవుతున్నారో లెక్క లేదు. ఈ విధ్వంసం, మానవ హననం ఏ స్థాయికి వెళ్తాయో ఊహించలేము. మరోవైపు యుద్ధానికి అంతమెప్పుడన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమోనని నెటిజన్లంతా ఇంటర్నెట్ను శోధిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే యుద్ధం కేలండర్‌ను గానీ, మారుతున్న తేదీలను గానీ పట్టించుకోదు. ఒకరకంగా యుద్ధానికి కేలండర్పై చిన్నచూపనే అనుకోవాలి. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన సిసిలీ ద్వీపానికి, నెదర్లాండ్స్‌కు ఓ వివాదం ఏకంగా 335 ఏళ్లు కొనసాగింది. ఒక రకంగా ఇదో రక్తపాత రహిత యుద్ధం. ఒక్క బులెట్ ఫైర్ కాలేదు. ఒక్క మరణమూ చోటుచేసుకోలేదు. దేనికోసమైతే యుద్ధం మొదలైందో ఆ సమస్యకు కదనరంగంలో జవాబు దొరికినప్పుడే ఏ యుద్ధమైనా ముగుస్తుంది. లేదా వైరిపక్షాల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడినప్పుడు ముగుస్తుంది. యుద్ధానికి ప్రేరేపించిన లక్ష్యాలు నెరవేరినప్పుడూ, లేదా నెరవేరడం అసాధ్యమని తేలినప్పుడు కూడా యుద్ధం ముగుస్తుంది. ఇలాంటి ముగింపులు అఫ్గానిస్తాన్, సిరియా, లిబియా విషయాల్లో కనిపించాయి కూడా. ఈ నేపథ్యంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఎందుకు ముగియడం లేదన్నది నెటిజన్లు ఎక్కువగా వెదికిన అంశం కావడం ఆసక్తికరం. పుతిన్ అసలెందుకు ఉక్రెయిన్‌పై దాడికి దిగినట్టు? దాన్ని ఆక్రమించే సత్తా తనకుందని గట్టిగా నమ్మే దండయాత్ర ఆరంభించాడు. ఉక్రెయిన్‌కు నాటో ఆయుధాలు అందించగలదే గానీ దానికి మద్దతుగా కదనరంగంలో కాలుపెట్టదనీ విశ్వసించాడు. అమెరికా ప్రతిచర్య మాటలకే పరిమితమవుతుందని కూడా ముందే ఊహించాడు. రెండు శతాబ్దాలు రష్యాలో భాగంగానే ఉన్న ఉక్రెయిన్ నాటోకు వ్యతిరేకంగా తనతో చేయి కలపాలని పుతిన్ ఆశించాడు. మాట విననందుకు దాన్ని మిలిటరీరహిత దేశంగా చూడాలని పంతం పట్టాడు. పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాటలయుద్ధం కదనరంగానికి దారితీసి సామాన్యుల ప్రాణాలతో ఆటలాడుకుంటోంది. ఇద్దరూ ‘తగ్గేదే లే’ అంటూ కలబడుతున్నారు. యుద్ధం వల్ల వాణిజ్యం తీవ్రంగా దెబ్బ తినడంతో రష్యా, ఉక్రెయిన్ నుంచి క్రూడాయిల్, గోధుమల ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్రూడ్, గోధుమలకు వాటిపై ఆధారపడ్డ దేశాలన్నీ తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయి. కనీసం కొంతకాలంపాటు కాల్పుల విరమణ ప్రకటించినా వెసులుబాటుగా ఉండేదంటున్నాయి. కానీ ఇప్పట్లో ఆ అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. రష్యాకు లొంగిపోయి పుతిన్ కనుసన్నల్లో బతకడానికి జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు. మరోవైపు పుతిన్‌ది విచిత్రమైన పరిస్థితి. పైకి బలంగా కనిపించినా భారీగా బలగాలను కోల్పోయిన రష్యా, ఇప్పుడు యుద్ధం ఆపడమంటే వెనకడుగు వేసినట్టేననే భావనలో ఉంది. మరి యుద్ధం ఆగేదెట్లా? ఇప్పటికిది సమాధానం లేని ప్రశ్నే. – సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి -
రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించేది మరో రెండేళ్లే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్(69) ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్ నిఘా విభాగం అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ వెల్లడించారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన మిలటరీ అధికారులతో తరచుగా సమావేశమవుతున్నారు. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. రష్యా విడుదల చేస్తున్న చిత్రాల్లో పుతిన్ అస్వస్థతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరో కార్యక్రమంలో నీరసంగా వెనుకా ముందు ఊగుతూ దర్శనమిచ్చారు. బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడు. గతంలో క్యాన్సర్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
ఖబడ్దార్! ఆ సంగతి మర్చిపోవద్దు.. పుతిన్ తీవ్ర హెచ్చరికలు
ఉక్రెయిన్‌కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు. అయితే, ఆ లక్ష్యాలు ఏమిటన్నది బయటపెట్టలేదు. ఆదివారం ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఆయుధాలు అందజేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో తెలుసని, తమవద్ద కూడా ఆయుధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని పుతిన్ హెచ్చరించారు. -
Sakshi Cartoon: ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా సార్!
ఈ మూడేండ్లలో ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా ఏంటీ సార్! -
Russia Ukraine War: పుతిన్‌కు క్యాన్సర్?!
రష్యా అధినేత పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియా ప్రాజెక్ట్ సంస్థ ‘ఇన్వెస్టిగేషన్ ఆన్ వ్లాదిమిర్ పుతిన్ హెల్త్’ పేరిట విడుదల చేసిన ఒక కథనంలో అనుమానం వ్యక్తం చేసింది. రష్యా ప్రజల నుంచి ఆయన తన అనారోగ్యాన్ని దాచిపెడుతున్నారని, ఇందుకోసమే ఉక్రెయిన్‌పై దాడికి దిగారని గతంలో వచ్చిన ఆరోపణలకు తాజా కథనం బలం చేకూరుస్తోంది. ఈ మీడియా ప్రాజెక్ట్ (మీడియా ప్రొకెట్ అంటారు) సంస్థను రష్యాలో నిషేధించారు. దీంతో సంస్థ విదేశాల నుంచి కార్యకలాపాలు నడుపుతోంది. పుతిన్ స్టెరాయిడ్ వాడకంలో ఉన్నారని, అందుకే ఆయన మెడ, ముఖం వాచినట్లున్నాయని కథనంలో పేర్కొంది. పుతిన్‌తో ఎప్పుడూ ఉండే కొందరు డాక్టర్ల గురించి కథనంలో ప్రస్తావించారు. వీరిలో ఒకరు థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు కాగా మరొకరు న్యూరో సర్జన్. పుతిన్ 2020 జూలైలో నేషనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అధిపతి ఇవాన్ దెదోవ్ను కలిసారని కథనం తెలిపింది. పుతిన్ పెద్ద కూతురు ఇక్కడే పనిచేస్తారు. ఈ సమావేశంలో థైరాయిడ్ క్యాన్సర్, లక్షణాలు, దానికి కనిపెట్టిన టైరోజిన్ అనే ఔషధం తదితర వివరాలను పుతిన్‌కు ఇవాన్ వివరించారని కథనం పేర్కొంది. కొత్త ఔషధం వల్ల రికవరీ ఎంత వరకు ఉండొచ్చని పుతిన్ ప్రశ్నించారని తెలిపింది. అప్పుడే పుతిన్ ఆరోగ్యంపై చర్చలు మొదలయ్యాయని తెలిపింది. కరోనా సమయంలో పుతిన్ చాలా రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆ సమయంలో థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు ఆయనతో ఎప్పుడూ ఉండేవారని పేర్కొంది. తర్వాత రోజుల్లో ఆయన జనాలతో చాలా దూరం నుంచి మాట్లాడేవారని గుర్తు చేసింది. 2016 నుంచే? పుతిన్ అనారోగ్య సమస్యలు 2016–17 నుంచే సీరియస్‌గా మారాయని కథనం పేర్కొంది. ఆ సమయంలో ఆయనకు డిమిట్రీ వెర్బోవోయ్ అనే డాక్టరు చికిత్స చేశారు. సోచీలోని ఒక రిసార్టులో పుతిన్ ఎక్కువగా గడుపుతుంటారు. ఇక్కడ ఆయన చుట్టూ ఎప్పుడూ కనీసం 5– 17మంది డాక్టర్లుండేవారని తెలిపింది. అనారోగ్య కారణాలతో పుతిన్ సడెన్‌గా మాయమవడం ఐదుసార్లు జరిగిందని గుర్తు చేసింది. ఆయనకు చికిత్సనందించినందుకు కృతజ్ఞతగానే ఓలెగ్ మిస్కిన్ అనే వైద్యుడికి పుతిన్ డాక్టర్ ఆఫ్ రష్యా అవార్డిచ్చారని తెలిపింది. థైరాయిడ్ ప్రాంతంలో వాపు, మాట బొంగురుగా రావడం, మింగడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, పొడిదగ్గు తదితరాలుంటే థైరాయిడ్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. పుతిన్‌కు ఈ సమస్యలున్నాయని, అందుకే డాక్టర్ అలెక్సీ షెగ్లోవ్ అనే స్పెషలిస్టు పుతిన్‌తో 282 రోజుల పాటు కలిసిఉన్నారని కథనం తెలిపింది. ఆయనతో పాటు ఇగోర్ ఇసకోవ్ అనే స్పెషలిస్టు 152 రోజులు, క్యాన్సర్ సర్జన్ సెలివనోవ్ 166 రోజుల పాటు పుతిన్‌తో గడిపారని తెలిపింది. అయితే వీరు ఏ సమయంలో పుతిన్‌తో కలిసిఉన్న విషయం కథనంలో వెల్లడించలేదు. ఎంతవరకు నిజం? గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై పలు కథనాలు వచ్చాయి. వచ్చే అక్టోబర్‌కు ఆయనకు 70 సంవత్సరాలు వస్తాయి. కేవలం వయసు కారణంగా వచ్చే సమస్యలు తప్ప ఆయనకు మరీ తీవ్రమైన అనారోగ్యాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య ప్రభుత్వాలు కావాలని ఇలాంటి కథనాలు వ్యాప్తిచేస్తుంటాయని రష్యా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనకు మానసిక సమస్యలున్నాయంటూ జపాన్‌కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ సంస్థ ఒక కథనం వెలిబుచ్చింది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ ముదిరిపోయిందన్న కథనం కూడా ఇలాంటి కల్పిత కథేనని కొందరు నిపుణుల భావన. రష్యా లాంటి దేశంలో అధికారికంగా ప్రకటించేవరకు ఏ సంగతి తెలియదని వీరు గుర్తు చేస్తున్నారు. ఐదుసార్లు గాయబ్! గతంలో అనారోగ్య కారణాలతో పుతిన్ అకస్మాత్తుగా కొన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన ఘటనలివే.. 1. 2012 నవంబర్: వ్యాపార యాత్రలు, దూర ప్రయాణాలను పుతిన్ రద్దు చేసుకున్నారు. ఆయన యథావిధిగా విధులు నిర్వహిస్తున్నట్లు చూపడానికి పాత వీడియోలను కొన్నాళ్లు క్రెమ్లిన్ ప్రసారం చేసేది. 2. 2015 మార్చి: ప్రజలకు దూరంగా కొన్నాళ్లు కనిపించలేదు. ఆయన పాల్గొనాల్సిన సమావేశాలు రద్దయినా గత వీడియోలను చూపి సదరు సమావేశాలు జరిగినట్లు మేనేజ్ చేశారు. 3. 2017 ఆగస్టు: సోచీ రిసార్టుకు వెళ్లిన పుతిన్ వారం పాటు కనిపించలేదు. 4. 2018 ఫిబ్రవరి: ఎన్నికల ప్రచారం మధ్యలో అకస్మాత్తుగా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొన్నారు. ఆయనకు జలుబు చేసినందున విశ్రాంతికి వెళ్లారని అధికారులు చెప్పారు. 5. 2021 సెప్టెంబర్: సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అన్ని కార్యక్రమాలకు వీడియో ద్వారా హాజరయ్యారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై ‘అణు’ ఖడ్గం!
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి 25 రోజులు గడుస్తున్నా రష్యా పెద్దగా సాధించిందేమీ కన్పించడం లేదు. అమ్ములపొదిలో ఆయుధాలు ఖాళీ అయిపోతున్నాయి. రష్యా సైనికుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అంతర్జాతీయ ఆంక్షల చట్రంలో ఇరుక్కొని దేశం నలిగిపోతోంది. అధ్యక్షుడు పుతిన్ యుద్ధోన్మాదంపై స్వదేశంలోనే తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఆయన ఓవైపు రాజీమార్గాలను అన్వేషిస్తూనే మరోవైపు దాడులను తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా, మున్ముందు అణు దాడులకూ పాల్పడుతుందేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి... రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఎటూ పాలుపోకపోవడంతో పుతిన్ అసహనంతో రగిలిపోతున్న మాట నిజమేనని స్లేట్ ఆన్లైన్ మ్యాగజైన్ జాతీయ భద్రతా వ్యవహారాల ప్రతినిధి ఫ్రెడ్ కప్లన్ అన్నారు. ‘‘ది బాంబ్: ప్రెసిడెంట్స్, జనరల్స్, అండ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ వార్’’ రచయిత అయిన ఆయన రష్యా అణు యుద్ధ భయాలపై లోతైన విశ్లేషణ చేశారు. ‘ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఓటమి అంచుల్లో ఉంది. అంతమాత్రాన పుతిన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తారని అనుకోలేం. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించడానికి నాటో నిరాకరించింది గనుక రష్యా ఆ సాహసం చేయకపోవచ్చు. అమెరికా, నాటో దేశాలు యుద్ధంలోకి నేరుగా ప్రవేశిస్తే అది వేరే సంగతి. వాటిని అడ్డుకోవడానికి రష్యా ఎంతకైనా తెగించవచ్చు. రష్యా, అమెరికా దగ్గర పరస్పరం నామరూపాల్లేకుండా చేసుకోగలిగినన్ని అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి. కానీ వాటిని ప్రయోగించే అవకాశాలు లేవనే చెప్పాలి. రష్యా చిన్న అణు బాంబుల్ని ప్రయోగించినా కనీసం 8 వేల టన్నుల రేడియేషన్ వెలువడి ఊహాతీతమైన విధ్వంసం జరుగుతుంది. అదీగాక అణ్వాయుధాలను వాడే దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షలు మరింతగా పెరుగుతాయి. అందుకే 1945 తర్వాత ఏ దేశమూ ఆ సాహసం చేయలేదు. అయినా ఏ దేశం యుద్ధ వ్యూహం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధానికి దిగనంత వరకూ అణు ముప్పుండకపోవచ్చు. అందుకే ఉక్రెయిన్ ఎంత ప్రాధేయపడ్డా నో ఫ్లై జోన్ ప్రకటించకుండా అ మెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. పరోక్ష సాయానికే పరిమితమవుతోంది’’ అని అన్నారాయన. చైనా సహకారం లేకుండా... రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా లేదా అన్నదాన్ని చైనాతో ముడిపెట్టి చూడాలని బ్లూమ్‌బర్గ్ యూరప్ రిపోర్టర్ మారియో టాడియో అన్నారు. ‘‘చైనా నుంచి రష్యాకు ఆశించిన సైనిక తదితర సహకారం అందడం లేదు. పుతిన్ దౌత్య పరిష్కారం కోరుకుంటున్నారు. అణ్వాయుధ ప్రయోగానికి దిగకపోవచ్చు’’ అని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన ఆయుధాలు ► కల్బీర్ క్రూయిజ్ క్షిపణులు: పౌర ప్రాంతాలపై వీటిని విరివిగా ప్రయోగించింది. 2015లో సిరియాలో జరిపిన దాడుల్లోనూ వీటిని వాడింది. ► ఇస్కాండర్ క్షిపణులు: 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే వీటిని భారీ భవనాలను నాశనం చేయడానికి ప్రయోగించింది. ► రాకెట్ దాడులు: కీవ్‌తో పాటు ఖర్కీవ్, ఒడెశా, చెర్నిహివ్, ఇర్పిన్‌లపై వీటిని భారీగా ప్రయోగిస్తోంది. స్మెర్క్, గ్రాడ్, ఉరకాన్ రాకెట్ లాంఛర్ల ద్వారా వీటిని ప్రయోగించి ధ్వంసరచన చేస్తోంది. ► శతఘ్నులు: అత్యంత శక్తిమంతమైన 203ఎం ఎం పియోని, 152–ఎంఎం హైసింథ్, అకాకియా హొవిట్జర్ శతఘ్నులను ప్రయోగిస్తోంది. ► క్లస్టర్, వాక్యూమ్ బాంబులు: అత్యంత ప్రమాదకరమైన వీటిని జనసమ్మర్ధ ప్రాంతాలపై విస్తృతంగా ప్రయోగించింది. – సాక్షి, నేషనల్ డెస్క్