SaiRam Shankar
-
7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్కి రెడీ అయిపోయింది. అప్పుడెప్పుడో మార్చిలో థియేటర్లలో రిలీజైతే.. ఇన్నాళ్లకు డిజిటల్ మోక్షం కలిగిందనే చెప్పాలి. ఇంతకీ ఇది ఏ సినిమా? ఏ ఓటీటీలోకి రానుంది?స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్.. చాన్నాళ్లుగా నటిస్తున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నారు. ఇతడి చేసిన చివరి మూవీ 'వెయ్ దరువెయ్'. మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథతో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ కోసం జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓటీటీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)దాదాపు ఏడు నెలల తర్వాత అంటే అక్టోబరు 11 నుంచి 'వెయ్ దరువెయ్' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ వీకెండ్ చూడటానికి ఓ తెలుగు సినిమా వచ్చేసిందనమాట.'వెయ్ దరువెయ్' కథ విషయానికొస్తే నకిలీ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాలని యువత ఎలా అడ్డదారులు తొక్కుతున్నారనే పాయింట్‌తో సినిమా తీశారు. సాయిరామ్ శంకర్, యశ్న, సునీల్, సత్యం రాజేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?)Get ready for a thrilling ride! 🎢 #VeyDharuvey premieres on October 11th. 🎉🍿 @YashaShivakumar @ihebahp @dirnaveenreddy @actordevaraj @LyricsShyam pic.twitter.com/2RmkYzhUFl— ahavideoin (@ahavideoIN) October 8, 2024 -
ఆ దూరాన్ని వెయ్ దరువెయ్ తగ్గిస్తుంది
‘‘పూర్తి స్థాయి వినోదం, ఫ్యామిలీ డ్రామా, ఓ చిన్న సందేశం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ‘వెయ్ దరువెయ్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పగలను. నా కెరీర్లో ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ దూరాన్ని ‘వెయ్ దరువెయ్’ తగ్గిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సాయిరామ్ శంకర్ అన్నారు. నవీన్ రెడ్డి దర్శకత్వంలో సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నటించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ ΄పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్పై దేవరాజు ΄పొత్తూరు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నవీన్ ‘వెయ్ దరువెయ్’ కథ చెప్పగానే నచ్చింది. ఇందులో నా పాత్ర చాలా సరదాగా ఉంటుంది. నాకు తప్పకుండా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. ఈ సినిమాని 35 రోజుల్లోనే పూర్తి చేశామంటే ఆ క్రెడిట్ నిర్మాత, డైరెక్టర్, కెమెరామేన్లదే. పైగా నటీనటులందరూ అనుభవం ఉన్నవాళ్లు కావడం కూడా మరో కారణం. ఈ మూవీకి భీమ్స్‌గారి సంగీతం, నేపథ్య సంగీతం ప్లస్ అయింది. నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో విజయాలు, పరాజయాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఆచితూచి మంచి కథలు ఎంచుకుంటున్నా. మా అన్నయ్య (పూరి జగన్నాథ్) దర్శకత్వంలో హీరోగా చేసే స్థాయికి నేనింకా చేరుకోలేదు. ఆ స్థాయి, ఆ స్టార్డమ్, నా మార్కెట్ పరిధి పెరిగినప్పుడు చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘ఒక పథకం ప్రకారం, రీ సౌండ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
‘వెయ్ దరువెయ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
అవార్డ్ విన్నర్స్ పనిచేసిన చిన్న సినిమా రిలీజ్‌కి రెడీ
వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్‌పై వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. సాయిరామ్ శంకర్, అషిమా నర్వాల్, శృతి సోదీలు హీరోహీరోయిన్లుగా నటించారు. పలు జాతీయ అంతర్జాతీయ అందుకున్న దర్శకుడు వినోద్ విజయ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) ఈ సందర్భంగా దర్శక నిర్మాత వినోద్ విజయన్ మాట్లాడుతూ.. 'ఈ థ్రిల్లర్ సినిమాలో సాయిరామ్ శంకర్ పవర్ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. అలానే ఈ సినిమా కోసం నాతో కలిసి ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేశారు' అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?) -
దరువెయ్ బాగా వచ్చింది – సాయిరామ్ శంకర్
‘‘వెయ్ దరువెయ్’ టీజర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలి. సాయి అన్నకి, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు మరిన్ని అవకాశాలు రావాలి’’ అన్నారు హీరో సాయిధరమ్ తేజ్. సాయిరామ్ శంకర్, యాశా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. దేవరాజు పొత్తూరు నిర్మించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్ రిలీజ్ చేశారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలకు విశేష స్పందన లభించింది. సినిమా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సాయిరామ్, దేవరాజుగార్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను’’ అన్నారు నవీన్ రెడ్డి. ‘‘సాయిరామ్గారి కెరీర్లో మరొక మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు దేవరాజ్. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: ముత్యాల సతీష్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జనగాని కార్తీక్, శ్రీపాల్ చొల్లేటి. -
'వెయ్ దరువెయ్' అంటోన్న హీరో సాయిరామ్ శంకర్
సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెయ్ దరువెయ్. శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. "యస్.ఆర్ కల్యాణ మండపం" తర్వాత శంకర్ పిక్చర్స్ తో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ "వెయ్ దరువెయ్". "బంపర్ ఆఫర్" తర్వాత అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ లభించడం నా అదృష్టం. "వెయ్ దరువెయ్" టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది అన్నారు. చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమాలో కాశీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో పోసాని, సప్తగిరి ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరితో పాటు మంచి టెక్నీషియన్స్ దొరికారు అన్నారు. ఈ కార్యక్రమానికి హీరో ఆకాష్ పూరి , నిర్మాత , కోడి దివ్య దీప్తి హాజరయ్యారు. The Crazy Hero 🌟ing: @sairaamshankar Beautiful @yashashivakumar in 🎬@doddanaveen direction Project takes off in a while💥 Muhurtham & Pooja Ceremony of Producer @actordevaraj 💰#saitejaentertainments 🎥#satishmuthyala 🎼#BheemsCeciroleo Production No.2 @ 8.33AM today🪔 pic.twitter.com/MQQXMz7g7F — Ms.திவ்யா 💙 (@naandivya) June 24, 2022 చదవండి: ఈ సినిమాలో నటించిన సూర్య, షారుక్‌లు ఒక్క పైసా తీసుకోలేదు 'కరణ్ అర్జున్' సినిమా రివ్యూ.. -
'ఒక పథకం ప్రకారం' టీజర్ రిలీజ్ చేసిన రవితేజ
Raviteja Launched Sairam Shankar Oka Pathakam Prakaram Teaser: సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. జాతీయ అవార్డుగ్రహీత వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌పై వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. సినిమాని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో రామ–రావణ తరహా పాత్రలో నటించారు సాయిరామ్ శంకర్’’ అన్నారు. కాగా ఇంతకుముందు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. శృతీ సోధి, సముద్రఖని, కళాభవన్ మణి, భాను శ్రీ నటించిన ఈ చిత్రానికి రాహుల్ రాజ్ సంగీతం అందించగా రాజీవ్ రవి, వినోదిల్లంపల్లి, సురేష్ రాజన్ కెమెరా వర్క్స్ చేశారు. చదవండి: 'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు.. -
యాక్షన్ రీసౌండ్
సాయిరామ్ శంకర్, రాశీ సింగ్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రీసౌండ్’. ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్. మురళీకష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఒంగోలులో జరుగుతోంది. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. లాక్డౌన్ అనంతరం హైదరాబాద్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ప్రస్తుతం ఒంగోలులో కొన్ని ప్రధాన ఘట్టాలతో పాటు రెండు పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రంలో ఓవైపు ఎంటర్టైన్ చేస్తూ, మరోవైపు యాక్షన్‌తో అలరించే పాత్రను సాయిరామ్ శంకర్ చేస్తున్నారు. ‘రీసౌండ్’ టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: స్వీకార్ అవస్తి, కెమెరా: సాయిప్రకాష్. -
రీసౌండ్ రీస్టార్ట్
సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రీసౌండ్’. రాశీ సింగ్ కథానాయిక. ఎస్.ఎస్. మురళీకృష్ణ దర్శకత్వంలో సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం పునః ప్రారంభమైంది. ‘‘ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ‘రీసౌండ్’ టైటిల్ మాసీగా ఉండి ఆకట్టుకుంటోంది. మా సినిమా ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. తాజా షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
రీసౌండ్
సాయిరామ్ శంకర్ రీసౌండ్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రీ సౌండ్’ కి కొబ్బరికాయ కొట్టారు. ఎస్ఎస్ మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీసింగ్ కథానాయికగా నటించనున్నారు. జె. సురేష్ రెడ్డి, రాజు, ఎన్వీఎన్ రాజా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి దర్శకుడు సురేందర్‌రెడ్డి కెమెరా సిచ్చాన్ చేయగా, మరో దర్శకుడు సుకుమార్ క్లాస్ ఇచ్చారు. నటుడు పోసాని కృష్ణమురళి గౌరవ దర్శకత్వం వహించారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నేటి నుంచి మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుంది. హైదరాబాద్, వైజాగ్‌లలో చిత్రీకరించనున్నాం’’ అన్నారు . ‘‘అందరికీ నచ్చే మంచి వాణిజ్య అంశాలున్న సినిమా ఇది’’ అన్నారు మురళీ కృష్ణ. సాయిరామ్‌శంకర్ కెరీర్లో ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంది’’ అన్నారు నిర్మాత రాజారెడ్డి. నటుడు ఆకాష్ పూరి పాల్గొన్నారు. ఈ మూవీకి సంగీతం: స్వీకర్ అగస్తి. -
సస్పెన్స్ లవ్ స్టోరీ
హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం మొదలైంది. ఈ చిత్రంతో చిరుమామిళ్ల కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి, రియల్ రీల్స్ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తలుపులమ్మ దేవస్థానంలో ప్రారంభమైంది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ ఇచ్చారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ–‘‘నేను ఇదివరకు నటించిన చిత్రాల్లోకి ఇది విభిన్న కథా చిత్రం అవుతుంది. నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘క్రైమ్, సస్పెన్స్, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అన్నారు చిరుమామిళ్ల కృష్ణ. -
సాయిరాం శంకర్ కొత్త సినిమా ప్రారంభం
సాయిరాం శంకర్ హీరోగా కొత్త సినిమా మంగళవారం ప్రారంభమైంది. తలుపులమ్మ దేవస్థానంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టగా, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయిరాం శంకర్‌పై నూతన దర్శకుడు చిరుమామిళ్ల కృష్ణ తొలి సన్నివేశం చిత్రీకరించారు. తాను ఇంతవరకు నటించిన చిత్రాల్లోనే ఇది విభిన్న కథా చిత్రం అవుతుందని హీరో సాయిరాం శంకర్ అన్నారు. తన కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని, తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందని తెలిపారు. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన క్రైమ్ సస్పెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకొని, ఆగష్టు నుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి, రియల్ రీల్స్ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
అధికార మార్పు అవసరం: సాయిరాం శంకర్
సాక్షి, అమరావతి : ‘ప్రజలు పది కాలాలపాటు గుర్తుంచుకునే పథకాలు అమలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే.. ఆయన వారసుడితోనే అది సాధ్యం. అందుకోసం మార్పు అనివార్యం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు, ముఖ్యంగా యువజనం మార్పుకోసం గళమెత్తుతోంది. దమ్ము, ధైర్యం, విజన్ ఉన్న యువ నాయకుడు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని యువత కోరుకుంటున్నారు. జరగబోయేది కూడా అదే’ అంటున్నారు వర్థమాన హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్. సాక్షి ఇంటర్వ్యూలో సాయిరాం మనోభావాలు.. ఆయన మాటల్లోనే... జనం గుండెల్లో వైఎస్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ లోకంలో లేకపోయినా.. ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారంటే ఆయన ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి ప్రజా పథకాలే అందుకు కారణం. ఆ పథకాలతోనే ఆయన ప్రజల మనసుల్లో చిరకాలం నిలిచిపోతున్నారు. ఆరోగ్యశ్రీ ప్రభావం అంతాఇంతా కాదు. మా సొంత ఊరు ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ చాలామంది జీవితాలను నిలిపింది. జగన్ సీఎం అయితే ఆ పథకాలన్నీ మళ్లీ పక్కాగా అమలుచేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. జగనే చేయగలరు. తన తండ్రికున్న మంచి పేరు ఎలాగైనా నిలబెట్టాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. అందుకే జగన్‌పై ప్రజలకు నమ్మకం. యువనేత జగనే సీఎం : ఓట్ ఫర్ చేంజ్.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జనమంతా అదే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని అన్నిచోట్ల యువత ఎదురు చూస్తోంది. ఇప్పటివరకూ సీనియర్‌ను చూశారు. ఈసారి యువ నేత జగన్‌కు అవకాశం ఇచ్చి పరిపాలనలో మార్పు చూడాలని.. నేనేకాదు, జనమంతా కోరుకుంటున్నారు. కొత్త రాష్ట్రానికి కొత్త నాయకత్వం రావాలని యూత్ కోరుకుంటోంది. జగన్‌కు ఒక అవకాశం ఇద్దామని అందరికీ బలంగా ఉంది. అదే జరగాలి. జరుగుతుందని నా ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోæ యువకుల పట్టుదల చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తోంది. ఎంతోమంది జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కష్టపడి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వారిలో నేను కూడా ఒకడిని! జనాలకు చేరువైన యువనేత పాదయాత్ర ఆయనను జననేతగా చేసింది. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేయడమంటే మామూలు విషయంకాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కంటే ఎక్కువ దూరం ఇది. ఒక రాజకీయ నాయకుడు జనంతో కలిసి అన్ని కిలోమీటర్లు నడుస్తారని మనమెవరూ ఊహించను కూడా ఊహించి ఉండం. హామీలు కచ్చితంగా అమలు చేస్తారు. గత ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఒక్క మాట చెప్పి ఉంటే.. అప్పుడే జగన్ సీఎం అయ్యేవారు. అప్పుడున్న పరిస్థితిల్లో ఇవ్వలేననుకునే ఆయన హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తానన్న నమ్మకంతోనే చెబుతున్నారు. జగన్ హామీలను జనం నమ్ముతున్నారు. ప్రజలు అవకాశం ఇస్తే.. వైఎస్ లాగ సంక్షేమ పాలన, జనరంజక పాలన జగన్ అందించగలరని నమ్ముతున్నా. ఆయన వేగం, విజన్ చూస్తుంటే ప్రజా పథకాల అమలులో వైఎస్‌ను కూడా మించిపోతారనిపిస్తోంది. సినిమా పరిశ్రమ అభివృద్దికి ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తగినంతగా లేవు. ఇండస్ట్రీ అభివృద్ధిపై శ్రద్ధలేదు. చిన్ని సినిమాలకు ఇటీవలే కొన్ని రాయితీలు ప్రకటించారు. అవి కూడా ఆశించినంతగాలేవు. ప్రస్తుత రాయితీలు ఇంకా పెంచితే బాగుండేది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ షూటింగ్‌లను ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి బాట పడుతుంది. అందరూ ఓటేయండి ఓటుహక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దాన్ని అందరూ తప్పకుండా వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లొంగి ఓటేస్తే తరువాత మనమే నష్టపోవాల్సి ఉంటుంది. అభివృద్ధి, ప్రజాశ్రేయస్సుకోసం ఎవరు పాటుపడతారో వాళ్లకే నిర్భయంగా ఓటు వేయండి. ఈసారి మార్పు కోసం ఓటేయండి!! ప్రత్యేక హోదా కోసం పోరాడేది జగనే కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా రాలేదు. తెచ్చుకోలేకపోయాం. దాన్ని చంద్రబాబు వదిలేశారు. కేంద్రం ఇస్తానన్నది సాధించలేక పోతే అది వైఫల్యమే కదా! మళ్లీ ఈమధ్య మొదలు పెట్టారు. ఇదంతా సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ మొదటినుంచి ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడుతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలంతా రాజీనామా చేసింది ప్రత్యేక హోదా కోసమే కదా! దీన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దాని ఫలితం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చూపిస్తారు. -
ఆ రోజు చిరంజీవి అన్నమాట నిజమైంది!
‘‘చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్’ తెలుగులో నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’లో విలన్‌గా చేశాక చిరుగారితో ‘తర్వాత సినిమాలోనూ ఛాన్స్ ఇవ్వండి’ అనడిగా. ‘నువ్ హీరో అయిపోతావ్’ అన్నారు. అలాగే, హీరోనైపోయా. తమిళంలో హీరోగా బిజీ కావడం వల్ల తెలుగులో పెద్దగా ఛాన్సు లు రాలేదనుకుంట!’’ అన్నారు శరత్‌కుమార్. కొంత గ్యాప్ తర్వాత ఆయన చేసిన తెలుగు సినిమా ‘నేనో రకం’. రామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా సుదర్శన్ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. శరత్‌కుమార్ చెప్పిన సంగతులు. ♦‘నేనో రకం’ వంటి మంచి ఛాన్సులొచ్చిన ప్రతిసారీ తెలుగులో నటించా. ఎమోషన్స్‌తో పాటు మంచి సందేశాత్మక కథతో దర్శకుడు సుదర్శన్ ఈ సినిమా తీశారు. ప్రేమంటే ఏంటి? తల్లిదండ్రుల ప్రేమ.. ఇలా అనేక విషయాలను సినిమాలో చర్చించాం. నా పాత్రతో పాటు హీరో రామ్‌శంకర్ పాత్రను బాగా డిజైన్ చేశారు. నాతో పోటాపోటీగా రామ్‌శంకర్ నటించాడు. సినిమా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ♦∙చిరంజీవిగారంటే ప్రత్యేకమైన అభిమానం. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనతో సినిమా నిర్మించాలనుకున్నా. మీ రెమ్యునరేషన్ ఎంతని ఆయన్ను అడగ్గా.. ‘నువ్ నాకు డబ్బులిస్తావా! నువ్వు హెల్ప్ అడిగావ్. ముందు సినిమా, మిగతావన్నీ తర్వాత చూసుకుందాం’ అన్నారు. అప్పుడు సినిమా చేయలేకపోయా. కానీ, ఆయనిచ్చిన ధైర్యం మర్చిపోలేను. ‘ఖైదీ నంబర్ 150’లో చిన్న పాత్రైనా చేస్తానని చిరు, వినాయక్‌లను అడిగా. కానీ, కుదరలేదు. అన్నయ్యతో నటించే ఛాన్స్ వస్తే నేనెప్పుడైనా రెడీ. ♦ మా అమ్మాయి వరలక్ష్మి ఒకడి గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి చెప్పిన విషయాలు వింటే వాడెంత నీచుడో తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో స్త్రీలకూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరి కాదు. ♦ నా వందో చిత్రానికి నేనే దర్శకత్వం వహించా. కానీ, దర్శకత్వం అంత ఈజీ కాదు. ప్రతి క్రాఫ్ట్‌ను దగ్గరుండి చూసు కోవాలి. ప్రస్తుతం నాకంత టైమ్ లేదు. ఇప్పటివరకూ 140 సినిమాల్లో నటించా. ఇప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనుంది. ఉదాహరణకు... హిందీలో అమితాబ్ చేస్తున్న పాత్రలు లేదా ‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్ర వంటివి. నిర్మాతగా విజయ్ ఆంటోనితో ఒకటి, జీవీ ప్రకాశ్‌తో మరొక సినిమా చేస్తున్నా. -
సరికొత్త థ్రిల్
సాయిరామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రం కొత్తగా ఉంటుంది. సాయిరామ్–శరత్ కుమార్ల నటన, వారిద్దరి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌కు సరికొత్త థ్రిల్‌ను కలిగిస్తాయి. మహిత్ స్వరపరచిన పాటలను టాప్ సెలబ్రిటీస్ త్వరలో రిలీజ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను అలరించటంతో పాటు, ఆలోచింపచేసేలా ఉంటుంది. ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. ‘‘మా చిత్రానికి కథే హైలెట్. ఈ నెల 17న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
అందుకే ధైర్యం చేశాం!
‘‘ప్రస్తుతం ప్రజలు డబ్బు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల చేయాలా? వద్దా? అనుకున్నాం. కానీ, ఇటీవల విడుదలైన చిత్రాల వసూళ్లు బాగుండటం, ముఖ్యంగా ‘అరకు రోడ్లో’ చిత్రంపై ఉన్న నమ్మకంతో ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాం’’ అని హీరో సాయిరామ్ శంకర్ అన్నారు. ఆయన హీరోగా, నికిషా పటేల్ హీరోయిన్గా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. వాసుదేవ్ మాట్లాడుతూ- ‘‘విశాఖ-అరకు ప్రాంతాల్లో నడిచే కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ ఇది. పూరీ జగన్నాథ్‌గారికి మా చిత్రం నచ్చడంతో విజయంపై మాకు మరింత నమ్మకం వచ్చింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. -
తమ్ముణ్ని విలన్ని చేస్తోన్న పూరి
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడిగా, 143 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు సాయిరాం శంకర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు, కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. హీరోగా అవకాశాలు వస్తున్నా.. స్టార్ ఇమేజ్ సాధించే స్ధాయి హిట్స్ మాత్రం రావటం లేదు. దీంతో తమ్ముడి కెరీర్‌ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు పూరి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, త్వరలో సాయిరాం శంకర్ కీలక పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో సాయి హీరోగా కాదు, విలన్‌గా నటించనున్నాడట. ఓ ప్రముఖ హీరో నటిస్తున్న ఈ సినిమాతో సాయిని నెగిటివ్ రోల్లో పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్లో విలన్ రోల్స్‌లో చేసిన చాలా మంది.. హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సాయి కూడా విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తిరిగి హీరో అయ్యే ఆలోచనలో ఉన్నాడు. -
ఆ రోడ్డులో ఏం జరిగింది?
సాయిరామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అరకు రోడ్లో’. వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, నక్కా రామేశ్వరిలు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో పాటల్ని, అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. అరకు రోడ్లో ఏం జరిగింది? అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. అరకు రోడ్డులో ఎన్ని మలుపులు ఉన్నాయో సినిమా కూడా అన్ని మలుపులు తిరుగుతుంది’’ అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: చీకటి జగదీశ్, సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్. -
ప్రేమలోకంలో విహరిస్తూ...
హీరో సాయిరామ్‌శంకర్ హీరోయిన్ రేష్మీమీనన్‌తో ప్రేమలో పడ్డారు. నిజంగా కాదులెండి...! సినిమాలో మాత్రమే...! వీరిద్దరూ జంటగా సుదర్శన్ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు పాటలు మినహా టాకీ పార్టు పూర్తి చేసుకుంది. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ-‘‘మంచి టీమ్‌తో కలిసి పనిచేస్తున్నా. నా కెరీర్లో ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. ‘‘దర్శకుడు సుదర్శన్ చెప్పిన కథాకథనాలు నచ్చాయి. పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినా వాటిని కాదని ఈ సినిమా ఒప్పుకున్నా. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది’’ అని శరత్ కుమార్ అన్నారు. ఈ వారంలో టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్ధ్, సంగీతం: మహిత్ నారాయణ్, సమర్పణ: వంశీధర్ రెడ్డి. -
దారితోచని సూత్రధారులు
STAR - రిపోర్టర్ సాయిరామ్ శంకర్ సంక్రాంతి వేళ పల్లెవాకిట తిష్టవేసిన ధాన్యరాశులు పురవీధుల్లో వెతికినా కనిపించవు. కల్లాపి చల్లిన లోగిళ్లు, వాటిల్లో ముత్యాల ముగ్గులు, అందులో కొలువుదీరే గొబ్బిళ్లు సిటీలో ఎక్కడో గానీ కానరావు. పట్నంలో సంక్రాంతి శోభను వినువీధిలో గాలిపటాలు తెలిపితే..! రాజధాని వీధివీధిలో తెలియజేసేది డూడూ బసవన్నలను తోడ్కొని వచ్చే డుం డుం గంగిరెద్దు దాసరులే!! అయ్యగారికి దండం పెట్టు అంటూ సిటీవాసులకు రోజంతా వంద వందనాలు అందించినా వారికి వంద రూపాయలైనా గిట్టుబాటు కావు. బసవడితో సమానంగా తకిట తందనాలాడినా.. వచ్చేది ఓ పాత పంచ మాత్రమే. చాలీచాలని సంపాదనతో దారితెన్నూ లేకుండా సాగుతున్న ఈ సూత్రధారులను సాక్షి సిటీప్లస్ తరఫున సాయిరామ్ శంకర్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. సాయిరామ్ శంకర్: బసవన్నలు ఇళ్లముందుకు వచ్చి తలాడిస్తేనే సంక్రాంతి పండుగ సందడి మొదలవుతుంది. సాక్షి స్టార్ రిపోర్టర్‌గా ఈ రోజు నేను బసవన్నలుండే ప్రదేశానికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నారు? ఎల్లయ్య: బాగనే ఉన్నం సార్. పండగకదా! ఈ నాలుగు రోజులు మంచిగనే ఉంటది. శీను: సంక్రాంతి పండుగ కదా సార్. మా బసవన్నల రోజులు. సాయిరామ్ శంకర్: ఏ ఊరు నుంచి వచ్చారు ఎల్లయ్య? ఎల్లయ్య: మా అందరిదీ మెదక్ జిల్లా మద్దూరు సార్. పండగ రోజులల్ల సిటీకొస్తం. సాయిరామ్ శంకర్: ఇక్కడ ఎన్నిరోజులుంటారు? ఎంకయ్య: నెల రోజులుంటం. సాయిరామ్ శంకర్: ఆ తర్వాత? ఎంకయ్య: మళ్లీ మా ఊరికి పోతం. సాయిరామ్ శంకర్: ఊళ్లో ఏం చేస్తుంటారు? ఎల్లయ్య: ఏం చేస్తం సార్. ఇదే పని. బసవన్నను ఎంట బెట్టుకుని బిచ్చమెత్తుకుంటం. సాయిరామ్ శంకర్: అలాగా, మీరు ఎలా చెబితే గంగిరెద్దులు అలా చేస్తుంటాయి. దండం పెట్టడం నుంచి ఆడటం వరకూ ట్రైనింగ్ మీరే ఇస్తారా..? ఎంకయ్య: మేమేడిత్తం సార్. దాని కోసం గుంటూరుల, తిరుపతిల మాకు గురువులు ఉన్నరు వాళ్ల కాడికి పంపుతం. ఆళ్లే నేర్పిస్తరు. సాయిరామ్ శంకర్: అవునా.. ఈ శిక్షణకు ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చవుతుంది? ఎంకయ్య: పదిహేను వేల వరకు కట్టాలి సార్. ఏడాది నేర్పిస్తరు. సాయిరామ్ శంకర్: వన్ ఇయరా.. అన్నీ ఫర్ఫెక్ట్గా వచ్చేస్తాయా? ఎల్లయ్య: అన్నీ ఒక తీరుంటాయా సార్. మన పిల్లగాళ్లను స్కూల్‌కు పంపిస్తున్నం. అందరికీ ఒక్క తీరుగ చదువొస్తదా? గిదీ అంతే. సాయిరామ్ శంకర్: నిజమే! నీ బసవన్నపేరు ఏంటి ఎల్లయ్య? ఎల్లయ్య: రాముడు. సాయిరామ్ శంకర్: మరి లక్ష్మణుడు, ఆంజనేయుడు? ఎంకయ్య: నా బసవన్న పేరు లక్ష్మణుడు. సాయిలు: మావోడు ఆంజనేయుడు. సాయిరామ్ శంకర్: పేర్లు బాగున్నాయి. ఏదీ ఓసారి రాముడి పనితనం చూపించు? ఎల్లయ్య: రాముడు.. రాముడు.. చూడు మనకాడికి ఎవరొచ్చిండ్రో.. సినిమాలా దొరొచ్చిండు. ఒక్కపారి అయ్యగారికి దణ్ణం పెట్టు.. దొర సంతోషపడ్తడు. సాయిరామ్ శంకర్: వావ్.. భలేగా పెట్టిందే! ఎల్లయ్య: మా రాముడు బతుకమ్మ ఆడినట్టు ఇంకెవ్వడు ఆడలేడు సార్. సాయిరామ్ శంకర్: అవునా.. గుడ్. మీరు పాడే పాటలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు ? అంకయ్య: నేర్చుకునేదేం లేదు సార్. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఆ పాటలు. సాయిరామ్ శంకర్: మరి బసవన్నల ద్వారా ఆదాయం, వాటిపై అయ్యే ఖర్చు గురించి చెప్పండి? సాయిలు: పండుగలప్పుడు బాగానే ఉంటది. మామూలు దినాలల్ల తిండికి కూడా తిప్పలే. మా కడుపు కాలుతున్నా.. బసవన్న పొట్ట మాత్రం మాడ్చలేం సార్. ఇంట్ల అందరూ పస్తు పడుకున్నా.. మా దేవుడికి బువ్వ పెట్టని రోజుండదు. పొద్దుగాళ్ల పిండి పెడ్తం. గడ్డి మామూలే. నెలకు వెయ్యి నుంచి పదిహేనొందల రూపాయలు అయితయి. సాయిరామ్ శంకర్: మీ ఆడవాళ్ల గురించి చెప్పలేదు. ఏమ్మా.. మాట్లాడండి. దుర్గమ్మ: ఏముంది సార్. మగోళ్లు బసవన్నను ఎంటబెట్టుకుని పోతే.. ఊర్లళ్ల ఉన్నప్పుడు పొలం పనికి పోతం. ఈడికొచ్చినప్పుడు అడుక్కోనికి పోతం. సాయిరామ్ శంకర్: మీలో ఆడపిల్లలకు చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తారట నిజమేనా? సాయమ్మ: ఒకప్పుడు చేసేటోళ్లు సార్. ఆడపిల్ల పుట్టిన 21 దినాలకే.. పెళ్లి ముచ్చట తెద్దురు. ఇప్పుడు అందరం పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఎల్లయ్య: మేమంటే నాలుగు మాటలు పడి బతికినం సార్. మా పిల్లలకు ఇసొంటి బతుకొద్దు. అందుకే ఎంత కష్టమైనా పిల్లల్ని చదివిస్తున్నం. సాయిరామ్ శంకర్: మరి ఇక్కడ చాలామంది పిల్లలు ఆవులతో కనిపిస్తున్నారు? అంకయ్య: అందరి పరిస్థితి ఒక్కతీరుగ ఉంటదా సార్! సాయిరామ్ శంకర్: మీ ఊరిలో కనీసం ఇళ్లయినా ఉన్నాయా? భాషా: ఒక్కరికి కూడా సొంతిల్లు లేదు సార్. ఇక్కడ ఎట్లనైతే గుడిసెళ్లో ఉంటున్నమో.. ఊళ్లో కూడా అంతే. సాయిరామ్ శంకర్: పట్నం బసవన్నకు పల్లెటూరు బసవన్నకు తేడా ఏంటి ? శీను: పల్లెల్లో బసవన్నంటే దేవుడి లెక్క సార్. ఇంటిల్లిపాది వచ్చి దండం పెడ్తరు. ధాన్యం పెడ్తరు. వాడికి పంచ కప్పి, మాకు పైసలు ఇచ్చేటోళ్లు. పట్నంల ఆ మర్యాద లేద్సార్. అయితే పది రూపాయలు పడేస్తున్నరు. లేదంటే వెళ్లండి అనేస్తరు. సాయిరామ్ శంకర్: అంతేలే సిటీవాసులు సాటి మనుషుల మీదే అభిమానం చూపడం లేదు. అది సరే, ఏది నాలుగు పాటలు పాడి బసవన్నలతో నాట్యం చేయించండి. ఎల్లయ్య: రాముడు...లక్ష్మణా... ఆంజనేయులు రండ్రి బతుకమ్మ ఆడండి.... అంటూ పాటందుకున్నారు. బసవన్నలు కొమ్ములూపుతూ అడుగులు వేస్తూ నాట్యం చేశాయి. సాయిరామ్ శంకర్: థ్యాంక్యూ. మీకు, మీ బసవన్నలకు హ్యాపీ సంక్రాంతి. బై.. సాయిరామ్ శంకర్: వీటికీ మీకూ అనుబంధం ఎక్కువనుకుంటా..! ఎల్లయ్య: చానా సార్. బిడ్డలెక్కనే.. ఒక్కోసారి అవే మా యజమానుల్లా కనిపిస్తయి. వాటికేమైనా దెబ్బ తగిలినా, పాణం బాగోకపోయినా ఇంట్ల ఎవ్వరం బువ్వ ముట్టం. బసవన్న కాలం చేస్తే.. ఈడికెళ్లి ట్రాక్టరో, డీసీఎంనో మాట్లాడుకుని ఊరికి తీస్కవోయి బొందపెట్టి బంధువులందరికీ భోజనాలు పెట్టుకుంటం. శీను: గవ్వన్ని ఎందుకంటే.. అవికూడా మాలో ఒక్కటే. బసవన్న పలికినట్టు మా బిడ్డ కూడా పలకడు సార్. సాయిరామ్ శంకర్: బిడ్డకంటే గొడ్డు నయం అంటే ఇదే కాబోలు (నవ్వుతూ...). గ్రేట్... మీ అనుబంధం వింటుంటే కడుపు నిండిపోతుంది. ప్రజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
సమకాలీన అంశాలతో అందమైన ప్రేమకథ
ఇటీవలే ‘రోమియా’గా పలకరించిన సాయిరామ్ శంకర్ మరో కొత్త షూటింగ్లో బిజీగా ఉన్నారు. విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తయారవుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని సాయిరామ్ శంకర్ సరసన రేష్మీ మీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ సూపర్‌స్టార్ శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ నెల 21 నుంచి ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘‘అందమైన ప్రేమకథకు సమకాలీన అంశాలను జోడించి, సినిమాగా తీస్తున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. యై వంశీధర్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘రెండో షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ఓ ప్రముఖ హీరోయిన్‌పై ప్రత్యేక గీతాన్ని కూడా తీయనున్నాం’’ అని చెప్పారు. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, మహత్ నారాయణ్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘‘కథ, కథనం, నా వేషభాషలు, పాత్రచిత్రణ-ఇలా ప్రతి అంశంలో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ తీస్తున్న సినిమా ఇది’’ అని సాయిరామ్ శంకర్ నమ్మకంగా చెబుతున్నారు. -
సాయిరామ్ శంకర్ న్యూ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
వారిద్దరితో కలిసి పనిచేయాలనుంది : పూరి జగన్నాథ్
‘‘ఓ కొత్త కథ రాయాలని ప్రతి రచయితకూ ఉంటుంది. అలా కొత్తగా ఆలోచించి, కేవలం రెండు పాత్రలతో నేను రాసుకున్న కథ ‘రోమియో’. సినిమా విడుదలైనప్పట్నుంచీ ఈ కథను అభినందిస్తూ చాలా ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. తక్కువ బడ్జెట్లో విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచాడు గోపీ గణేశ్. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా అభినందించాల్సిన వ్యక్తులు కెమెరామేన్ పీజీ విందా, సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్. వీరిద్దరితో కలిసి పనిచేయాలనుంది’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన కథతో రూపొందిన చిత్రం ‘రోమియో’. సాయిరామ్ శంకర్ కథానాయకునిగా గోపీ గణేశ్ దర్శకత్వంలో ‘టచ్ స్టోన్’ దొరైస్వామి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయోత్సవ సభ హైదరాబాద్‌లో జరిగింది. తమ ప్రయత్నం సఫలమైనందుకు ఆనందంగా ఉందని గోపీగణేశ్ పేర్కొన్నారు’’ రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయని సాయిరామ్ శంకర్ చెప్పారు. తుఫాన్ వల్ల గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారని, ఈ శుక్రవారం వచ్చే వసూళ్లను తుఫాను బాధితులకు అందిస్తామని చిత్ర సమర్పకుడు ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
‘రోమియో’మూవీ సక్సెస్‌మీట్
-
రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది
‘‘అన్నయ్య పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల పాత్రలు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాయో, ఇందులో నా పాత్ర కూడా అంత ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అన్నయ్య ఎంతో ప్రేమించి రాసుకున్న కథ ఇది’’ అన్నారు సాయిరామ్‌శంకర్. ఆయన కథానాయకునిగా గోపీగణేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోమియో’. ‘పూరీ రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ‘టచ్‌స్టోన్’ దొరైస్వామి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో సాయిరామ్‌శంకర్ ముచ్చటిస్తూ -‘‘రోమియో-జూలియట్ కథ జరిగిన ప్రాతం యూరప్ లోని వెరోనా. ప్రేమికులకు అదొక పుణ్యక్షేత్రం. చాలామంది అక్కడకొచ్చి తమ ప్రేమ సఫలం కావాలని మొక్కుకుంటుంటారు. ఆ ప్రాంతానికెళ్లి స్ఫూర్తి పొంది అన్నయ్య రాసిన కథ ఇది. ‘బంపర్ ఆఫర్’ తర్వాత మళ్లీ అన్నయ్య కథలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఆద్యంతం కొత్తగా సాగే ఈ సినిమాలో నా పాత్ర స్టయిలిష్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఇందులో కథానాయికగా నటించిన అడోనికా పక్కా తెలుగమ్మాయి. హైదరాబాద్‌లోనే రేడియో జాకీగా పనిచేసింది. చూడటానికి విదేశాల్లో పెరిగిన అమ్మాయిలా అనిపిస్తుంది. అందుకే... తనను కథానాయికగా ఎంపిక చేశారు. అనుకున్న దానికంటే చక్కగా నటించింది. తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుంది’’ అని సాయి చెప్పారు. రవితేజ గురించి చెబుతూ -‘‘కథ మలుపు తిప్పే పాత్రను రవితేజ పోషించారు. అంతటి స్టార్డమ్ ఉన్న ఏ హీరో ఇలాంటి పాత్ర చేయడానికి అంగీకరించడు. కానీ నాపై అభిమానం కావచ్చు, అన్నయ్య ప్రేరణ కావచ్చు, ఏదైతేనేం రవితేజ నటించారు. రెండుమూడు సీన్లలో కనిపించి, సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లిపోతారాయన. ఈ సినిమాలో ఆయన పాత్రే హైలైట్’’ అన్నారు సాయిరామ్ శంకర్. ఈ సినిమా తర్వాత తప్పకుండా దర్శకుడు గోపీగణేశ్ అగ్ర దర్శకుల జాబితాలో నిలబడతాడనీ, తక్కువ సమయంలో, అనుకున్న బడ్జెట్లో ఈ చిత్రాన్ని ఆయన మలిచాడనీ సాయిరామ్‌శంకర్ పేర్కొన్నారు. దర్శకత్వ శాఖలో పనిచేసినా... ప్రస్తుతం నటనపైనే దృష్టిని కేంద్రీకరించాననీ, భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాననీ ఆయన తెలిపారు. తమిళ నటుడు శరత్‌కుమార్‌తో కలిసి ‘జగదాంబ’ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నట్లు సాయిరామ్‌శంకర్ తెలిపారు.