sangaredddy
-
భర్త వివాహేతర సంబంధం భార్యకు తెలియడంతో.. పెట్రోల్ పోసి
సంగారెడ్డి: దాంపత్య జీవితానికి అడ్డుగా మారిందని మహిళలపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటన నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం వెలుగు చూసింది. జిన్నారం సీఐ వేణు కుమార్, హత్నూర ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..హత్నూర మండలం బడంపేటకు చెందిన మల్లమ్మను (37)అదే మండలం పన్యాలకు చెందిన గొర్రెలకాడి మొగులయ్యతో గత 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 16ఏళ్ల కూతురు ఉంది. బతుకుదెరువు కోసం గతంలో దంపతులిద్దరూ గుమ్మడిదల మండలం మంబాపూర్లోని ఓ కోళ్ల ఫారంలో కొన్నినెలల పాటు పనిచేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజాతో మల్లమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. స్వగ్రామానికి చేరుకున్న తరువాత కొన్ని రోజులకు మల్లమ్మ భర్త మొగులయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో మల్లమ్మ మహమ్మద్ ఖాజా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మహమ్మద్ ఖాజా భార్యకు వివాహేతర సంబంధం గురించి తెలియడంతో భర్తను పలుమార్లు మందలించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మల్లమ్మను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఓ పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా ఈ నెల 3న మహ్మద్ ఖాజా మల్లమ్మకు ఫోన్ చేసి నర్సాపూర్ పిలిపించుకున్నాడు. అక్కడికి చేరుకుదున్న ఆమెను స్కూటీపై నల్లవల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మల్లమ్మను చున్నీతో బిగించి హత్య చేసి ఆనవాళ్లు దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి పరారయ్యాడు. తన కూతురు కనిపించకపోవడంతో మల్లమ్మ తల్లి అంజమ్మ ఈ నెల 4న హత్నూర పోలీస్టేషన్లో ఫిర్యా చేసింది. దర్యాప్తులో భాగంగా నల్లవల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి మొహమ్మద్ ఖాజాను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో తను హత్యానేరాన్ని ఒప్పుకోవడంతో నిందితుడు మహమ్మద్ ఖాజాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలుచోట్ల వడగండ్ల వాన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. ఇక, హైదరాబాద్‌లో గురువారం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా జిల్లాలో వడగండ్ల వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా అల్పపీడన ద్రోణి కారణంగా గంటకు 40 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో, వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జహీరాబాద్‌లో వడగళ్ల వాన#Telangana #Zaheerabad #TelanganaRains #HyderabadRains @HiHyderabad #Rain pic.twitter.com/NLT1R7vasY — Mothe Vikramreddy (@MVRBRS) March 16, 2023 #Hyderabad #HyderabadRains pic.twitter.com/PS9AR84u9i — R Rajinikanth (@RRajinikanthGo2) March 16, 2023 Hailstorm reported in Kohir, Sangareddy district with -
అర్థరాత్రి షాకింగ్ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..
జహీరాబాద్(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్‌లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్రోడ్డులో అటకాయించారు. కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ శ్రీకాంత్‌ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్‌చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! -
మహిళా సర్వోదయంస్త్రీ శక్తి
సాధారణంగా స్వయం సహాయ సంఘాల మహిళలంటే తాము పొదుపు చేసుకున్న మొత్తానికి తోడు, బ్యాంకు లింకేజీ కింద వచ్చే రుణాలతో కిరాణాషాపులు.. పాడి పశువుల పెంపకం వంటి పనులకు పరిమితమవుతుంటారు. అయితే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గంగ్లూర్ గ్రామానికి చెందిన మహిళలు ఓ అడుగు ముందుకేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామంలోని 126 మంది మహిళలు సంఘటితమై మూడు కుటీర పరిశ్రమలను స్థాపించారు. సర్వోదయ ఉమెన్ ఎంటర్పైజెస్ పేరుతో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలోనే స్వయం సహాయక బృంగాల మహిళలు కాస్తా మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ‘సర్వోదయ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన 15 రకాల సబ్బులు తయారు చేస్తున్నారు. 20కిపైగా రసాయనాలతో తయారయ్యే సాధారణ సబ్బులకు భిన్నంగా ఇవన్నీ బొప్పాయి, టమాట వంటి సహజ వనరులతో తయారు చేసినవే కావడం గమనార్హం. ఈ పరిశ్రమల్లో కోల్డ్‌ప్రెస్ వంటనూనెలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనె, కొబ్బరినూనెలను తయారు చేస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు. స్థానికంగా పండే పప్పుదినుసుల ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తున్నారు. జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు.. బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యత విషయంలో రాజీ పడటం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్) వంటి జాతీయ సంస్థల లైసెన్సులు తీసుకున్నారు. హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మోటిక్స్ ఉత్పత్తుల కోసం ఆయుష్ విభాగం నుంచి అనుమతి పొందారు. త్వరలో మార్కెట్లోకి ఉత్పత్తులు.. సర్వోదయ ఉత్పత్తులు మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2022 జనవరిలోనే ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం కారణంగా మరో పక్షం రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల కోసం వినియోగదారుల అభిరుచుల సేకరణ ప్రక్రియను కూడా చేపట్టారు. వారి అభిరుచుల మేరకు తమ ఉత్పత్తుల్లో మార్పు చేర్పులు కూడా చేసినట్లు మహిళలు చెబుతున్నారు. బాధ్యతగా పనిచేస్తున్నాం... ‘సర్వోదయ’లో పనిచేసే మేము అందరం ఈ పరిశ్రమలకు ఓనర్లమే. అందరికీ యాజమాన్య వాటా ఉంది. వచ్చే లాభాల్లో డివిడెండ్ వస్తుంది. అందువల్ల బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మేమందరం పప్పుల ప్రాసెసింగ్, నూనెలు తయారు చేయడం నేర్చుకుంటున్నాము. గ్రామంలోనే మా సొంత పరిశ్రమ లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. – అంకమ్మగారి చిట్టెమ్మ, ‘సర్వోదయ’ సభ్యురాలు సొంతూరులోనే పని దొరుకుతోంది... ఇప్పటివరకు ఇంటిపనికే పరిమితమైన మాకు ఈ పరిశ్రమ వల్ల సొంత ఊరిలోనే పని దొరుకుతోంది. ఈ పరిశ్రమలో మా కుటుంబం పెట్టుబడి ఉండటంతో అందులో పనిచేస్తున్న నేను కార్మికురాలిగా కాకుండా యజమానురాలిగా భావిస్తున్నాను. ప్రస్తుతం నేను సబ్బుల తయారీలో పనిచేస్తున్నాను. – జంగం శిరీష, ‘సర్వోదయ’ సభ్యురాలు గ్రామీణాభివృద్ధి సేవలందిస్తున్నాం... సర్వోదయ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యా, వైద్యం, ఉపాధి, పర్యావరణం వంటి విషయాల్లో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నాము. ఐఆర్ఎస్ అధికారులం కలిసి ఇప్పటి వరకు జిల్లాలో ఆరు గ్రామాల్లో కార్యకలాపాలను ప్రారంభించాం. కరస్‌గుత్తి, ఎద్దుమైలారం, మునిపల్లి, మైనంపల్లి, హన్మంతరావుపేట్‌లలో కూడా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాము.. అనే నినాదం తో ముందుకెళుతున్నాం. – డాక్టర్ సుధాకర్ నాయక్, సర్వోదయ సంస్థ ఐఆర్ఎస్ అధికారుల సహకారం.. ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్కే పాలివాల్ అనే ఉన్నతాధికారి ఈ గంగ్లూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ఐఆర్ఎస్ ఉన్నతాధికారులు సర్వోదయ సంస్థను స్థాపించి ఈ గ్రామంలోని మహిళలను సంఘటితం చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా మహిళలకు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నత స్థాయి శిక్షణ ఇప్పించారు. ఈ సంస్థ సహకారంతో మహిళలు ముందడుగు వేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఫొటోలు: బగిలి శివప్రసాద్ సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ మహిళలు గొంగ్లూర్‌లో ఏర్పాటు చేసుకున్న పరిశ్రమ యూనిట్లు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తితో సమావేశమైన గొంగ్లూర్ మహిళలు -
అప్పటి వరకు సరదాగా ఆడుకున్నాడు.. అంతలోనే..
సాక్షి, జోగిపేట(అందోల్): అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఆడుకుంటున్న ఇంటిగేటే ప్రాణం తీసింది. పోలీసుల కథనం మేరకు.. అందోల్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నీరుడి మల్లేశం, మంజుల దంపతులు. వారికి కూతురు, కుమారుడు రోహిత్(5) ఉన్నారు. ఆదివారం రాత్రి బాలుడు సరదాగా ఇంటి గేట్‌ను పట్టుకొని వేలాడుతూ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గేట్‌కు బిగించి ఉన్న దిమ్మె ఒక్కసారిగా కూలి అతడి తలపై పడిపోయింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే ఆడుకుంటున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
సాక్షి, నిజాంసాగర్ (జుక్కల్) : దీపావళి నాడు సరదా కోసం నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్ఫీ మోజులోపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ మన్నన్, పిట్ల ప్రశాంత్, సయ్యద్ సుమేర్, చెగుళ్ల బాలరాజు, కటికె శివ స్నేహితులు. శనివారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన వీరు నీటి మడుగుల వద్ద బండరాళ్లపైకి వెళ్లారు. ప్రాజెక్టు వరద గేట్ల నుంచి దిగువకు నీరు జాలు వారుతుండటంతో మడుగుల్లో సెల్ఫీలు దిగుతూ స్నానాలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మడుగుల లోతు అధికంగా ఉండటంతో శివ, సయ్యద్ సుమేర్ ఈతరాక నీటమునిగి పోయారు. అనంతరం పోలీ సులు గజ ఈతగాళ్లతో గాలించగా ఇరువురి మృతదేహాలు లభ్యమయ్యాయి. విహారయాత్రకు వచ్చి... ఎడపల్లి(బోధన్): సెల్ఫీమోజు ముగ్గురు బాలికల ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యానవనంలోని చెరువులో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బోధన్ రాకాసిపేటకు చెందిన జుబేరా (10) ఇంటికి నిజామాబాద్ నుంచి మీరజ్ బేగం(16), హైదరాబాద్ నుంచి బషీరా బేగం (16) తమ కుటుంబసభ్యులతో వచ్చారు. ముగ్గురి కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది అలీసాగర్ ఉద్యానవనానికి విహార యాత్రకు వెళ్లారు. అబ్దుల్‌తో పాటు ఈ ముగ్గురు పిల్లలు స్నానాలు చేయడానికి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశంలోకి జారిపోయి నీట మునిగారు. వీరిని గమనించిన కుటుంబ సభ్యులు సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బోటింగ్ పాయింట్ సభ్యుడు నగేష్ , చెరువులో చేపలుపడుతున్న జాలరి గంగాధర్ నీట మునుగుతున్న యువకుణ్ణి రక్షించగలిగారు. అప్పటికే బాలికలు నీట మునిగి మృతి చెందారు. పుట్టినరోజు వేడుకల్లో విషాదం వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం మరికాల గ్రామ సమీపంలోని గోదావరిలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. వెంకటాపురం మండల పరిధి రంగరాజాపురం కాలనీకి చెందిన శశికుమార్ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి శనివారం గ్రామానికి చెందిన 21 మంది యువకులు పాతమరికాల గ్రామ సమీపంలోని గోదావరి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 16 మంది సరదాగా నదిలోకి ðదిగారు. కొంతసేపటికి ప్రవాహం పెరగడంతో తుమ్మ కార్తీక్ (21), సంఖ్యా శ్రీకాంత్ (22), రాయవరపు ప్రకాశ్ (22), కోడిరెక్కల అన్వేశ్ (21) నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మిగతా మిత్రులు ఒడ్డుకు వచ్చారు. సాయంకోసం అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చసరికే ఆ నలుగురు పూర్తిగా మునిగిపోయారు. అనంతరం గజ ఈతగాళ్లతో గాలించగా.. శనివారం రాత్రి రెండు, ఆదివారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చెక్‌డ్యాంలో పడి ఇద్దరి మృతి న్యాల్కల్(జహీరాబాద్) : ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈనెల 13న గ్రామానికి చెందిన ఫకీర్ ఇస్మాయిల్ కుమారుడు సాజిద్, నాగేందర్ కుమారుడు రాకేష్ మేకలు మేపడానికి వెళ్లారు. రాత్రి వరకు ఇద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కానీ మేకలు మాత్రం ఇంటికి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కాగా 14వ తేదీ ఉదయం గ్రామ శివారులోని చెక్‌డ్యాంలో సాజిద్ (14) మృతదేహం కనిపించింది. చెక్‌డ్యాంలో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల రాకేశ్ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఉదయం రాకేష్ (18) మృతదేహం లభించింది. -
దారుణం..ఐదేళ్ల బాలికపై అత్యాచారం
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా ఎత్తు కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత బాలికను ఇంటి ముందు వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. -
11 మంది డీలర్ల లైసెన్స్ రద్దు చేశాం: హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు చెప్పారు. రూ. 14 వేల కోట్లు రైతు బంధు ద్వారా సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని, సంగారెడ్డి జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్ ఆలోచనకు దగ్గరగా ఉందన్నారు. కాగా సంగారెడ్డి జిల్లాలో 55 శాతం పత్తి సాగు జరుగుతున్నందున.. కల్తీ విత్తనాలు అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్స్ రద్దు చేశామని ఆయన చెప్పారు. (పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి సమీక్ష) కంది ఎలా ఉన్న రూ. 5800 ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రైతులు అధికారుల దగ్గరికి వెళ్లడం కాదు.. అధికారులే రైతుల దగ్గరికి వెళ్లాలన్నారు. 4 నెలల్లో రైతు బంధు వేదికల నిర్మాణాలు జరగాలన్నారు. జిల్లాలో 116 రైతు బందు వేదికలు ఒకేరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగాలని ఆయన అధికారులకు సూచించారు. రైతు బంధు వేదికల నిర్మాణాలకు దాతల సహకారం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటి అవుతందన్నారు.. కానీ నీళ్లు, నిధులు, విద్యుత్ వచ్చి అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఉద్యమ స్పూర్తితో అధికారులు, ప్రజా ప్రతినిధులు పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. -
పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి సమీక్ష
సాక్షి, సంగారెడ్డి: పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం, కరోనా నివారణకి తీసుకుంటున్న చర్యలపై ఇండస్ట్రీ యాజమాన్యాలతో, అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. యాజమాన్యాలు బస్సులలో కనీస దూరం పాటించకుండా కార్మికులను తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనిని అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. కరోనాకి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. (ఇక కరువన్న మాట ఉండదు) విశాఖ గ్యాస్ లికేజీ ఘటనతో జిల్లాలో అప్రమత్తం అయ్యామన్నారు. బాయిలర్, ఫైర్, సెఫ్టీ వాళ్లు సరిగా ఇండస్ట్రీలను తనిఖీ చేయడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో గత సంవత్సరం ఇండస్ట్రీ ప్రమాదాలతో 20 మంది చినిపోయారని, గ్యాస్, బాయిలర్ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాలకు సూచించారు. పరిశ్రమల నుంచి రాత్రి సమయంలో విషవాయువు వదులుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సెఫ్టీ అధికారులు వాళ్ల పని చేయడం లేదని యాజమాన్యాలపై ఆయన విరుచుకుపడ్డారు. -
ప్రాణం తీసిన సరదా
-
మత్తు దిగేలా చర్యలు
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిధిలోని హైదరాబాద్–ముంబై 65వ నంబరు జాతీయ రహదారి, అకోలా–నాందేడ్ 161 నంబరు జాతీయ రహదారులున్నాయి. ఈ రహదారుల్లో లారీ డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు రాత్రివేళల్లో ఎక్కువగా మద్యం సేవించి నడుపుతున్నట్లు వెల్లడైంది. దీంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌తో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని కోర్టులకు తరలిస్తూ శిక్ష పడేవిధంగా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తరచుగా వాహనాల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరికరం ద్వారా మద్యం తాగారా? లేదా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నా పలువురు పట్టుబడుతూనే ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాగి నడుపుతూ తనిఖీలలో పట్టుబడుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2018 సంవత్సరంలో 1705 మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.3,52,700 జరిమానాగా వసూలు చేశారు. ఇందులో 1130 మందికి తాగిన పరిమాణాన్ని (క్వాంటిటీ)ని బట్టి 1 నుంచి 10 రోజుల వరకు జైలుశిక్ష విధించారు. అదే విధంగా 2019 డిసెంబరు 5వతేదీ వరకు 1221 డ్రంకెన్ డ్రైవ్ కేసులు కాగా, వీరినుంచి రూ.25,33,100 జరిమానాగా వసూలు చేశారు. వీరిలో 454 మందికి జైలుశిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం 18 నుంచి 35 సంవత్సరాల వారే అధికంగా ఉంటున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడమే కాకుండా అతి వేగంగా ప్రయాణిస్తూ మూలమలుపుల వద్ద ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందుబాటులో లేని క్యాబ్ డ్రైవర్ల వ్యవస్థ.. జిల్లాలో పబ్‌లు లేవు. బార్లు మాత్రం 19 ఉన్నాయి. పబ్‌లలో మద్యం సేవించిన వారిని సురక్షితంగా ఇంటివద్దకు చేర్చడానికి హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా క్యాబ్ సర్వీస్‌లను అందుబాటులో ఉంచారు. అకున్ సబర్వాల్ నగర పోలీసు కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సొంత వాహనాలు కలిగి ఉంటే డ్రైవర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మద్యం సేవించిన వారు సురక్షితంగా ఇంటికి చేరడమే కాకుండా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో పట్టుబడే అవకాశం ఉండకపోవడం, ప్రమాదాలను నివారించవచ్చుననే ఉద్దేశ్యంతో బార్ల యజమానులు ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ తరహా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జిల్లాలో ఎక్కడా కల్పించలేదు. జిల్లాలో పబ్ కల్చర్ లేనప్పటికీ బార్లు మాత్రం ఉన్నా..ఎక్కడా కూడా క్యాబ్ వ్యవస్థను గాని ప్రత్యేకంగా పేయింగ్ డ్రైవర్లను ఏర్పాటుచేయలేదు. ఈ విషయంపై జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రయ్యను వివరణ అడుగగా..జిల్లాలో బార్ల వద్ద క్యాబ్‌లు గాని, డ్రైవర్ల వ్యవస్థగాని అందుబాటులో లేదని తెలిపారు. దాబాల్లో మద్యం.. జిల్లా పరిధిలో జాతీయ రహదారులు ఉండడంతో రాత్రి వేళ అనుమతులు లేకుండా కొన్ని చోట్ల దాబాల్లో మద్యం సేవించడంతో పాటుగా విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దాబాల్లో మద్యం సేవనం, విక్రయాలు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అవగాహన కార్యక్రమాలు.. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే అనర్థాలను పట్టుబడిన వారికి అవగాహన కార్యక్రమాల ద్వారా వివరిస్తున్నారు. ప్రమాదాలపై వీడియోలు చూపించడం, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్, పోలీసు కళాబృందాలచే జనచైతన్య కార్యక్రమాలు, మద్యం తాగి వాహనాలు నడిపిన సంఘటనల్లో మృతిచెందిన కుటుంబాల దుర్భర పరిస్థితులు, తదితర విషయాలపై పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. వీటిని అరికట్టడానికి గాను నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాత్రి వేళ ప్రధాన రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాం. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానాలు, జైలుశిక్ష పడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. సురక్షిత ప్రయాణానికి మద్యం జోలికి వెళ్లకపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ -
అమీన్‌పూర్‌కు పండుగ రోజు
సాక్షి, పటాన్చెరు: అమీన్ పూర్‌కు ఈ రోజు నిజమైన పండుగ రోజని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీరంగూడ– కిష్టారెడ్డిపేట రోడ్డు పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రూ.61 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అమీన్ పూర్‌కు వచ్చినప్పుడు స్థానికులు మంచినీటి సమస్య ఉందని చెప్పారని గుర్తు చేశారు. రెండు వేల ఫీట్ల లోతు వరకు బోరు వేసినా నీరు రాని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. అమీన్ పూర్లోని 67 కాలనీలకు లాభం చేకూర్చే విధంగా నిర్మించిన 30 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను ప్రారంభించామని చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 20 ఏళ్ల వరకు జనాభా పెరిగినా ఇబ్బంది లేని విధంగా మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు నీటి కష్టాలు ఎక్కువగా తెలుస్తాయంటూ అమీన్ పూర్ మహిళలకు నీటి కష్టాలు తప్పుతాయన్నారు. ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక.. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రోడ్డు కావాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం కేసీఆర్ పటాన్ చెరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట మీదుగా సుల్తాన్ ఫూర్ వరకు రోడ్డు మాత్రమేనని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పటికే పటాన్ చెరులో అన్ని ప్రధాన రోడ్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిర్మించామని ఆయన తెలిపారు. అయితే అమీన్ పూర్లోని బీరంగూడ కమాన్ నుంచి సుల్తాన్పూర్ జంక్షన్ వరకు రూ.49 కోట్లతో రోడ్డు నిర్మాణానికి కేసీఆర్ సూచనలతో కేటీఆర్ మంజూరు చేశారని మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోడ్డు పనులను ప్రారంభించామని, త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పటాన్ చెరులో రోడ్డుపై అంగడి జరిగేదని, ఆ సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేకు డబుల్ ధమాకా పటాన్ చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతున్నాయని తెలిపారు. త్వరలోనే పటాన్ చెరులోని పేదలకు ఇళ్లను ఇస్తామన్నారు. పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉందని, దాంతో ఎమ్మెల్యేకు డబుల్ ధమాకాలా రెండు కోటాలు దక్కాయని మంత్రి చమత్కరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి రావాల్సిన డబుల్ బెడ్రూంకోటాతోపాటు, జీహెచ్ఎంసీ కోటా కింద కూడా ఈ ప్రాంతానికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులకు అభినందనలు మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్న అధికారులను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలోనే ప్రతీ ఇంటికి యావత్ రాష్ట్రంలో నీటిని అందించే కార్యక్రమానికి అధికారులు గొప్పగా సేవలందించారని హరీశ్‌రావు వారిని అభినందించారు. ఇదిలా ఉండగా అమీన్పూర్లో మండల్ లెవల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను మంత్రి ఆర్డీఓకు అందించారు. అలాగే అమీన్ పూర్లో డంప్ యార్డు ఏర్పాటుకు కూడా మరో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను కమిషనర్ వేమనరెడ్డికి అందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ బీరంగూడ రోడ్డు మంజూరు నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి, దాని పనుల ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్మంజుశ్రీ,, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెపై మంత్రి ఆగ్రహం.. కుట్రవారిదే!
సాక్షి, సంగారెడ్డి: దసర పండుగ ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరైనది కాదని కార్మికులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆర్టీసీ కార్మికులకు అత్యధిక జీతాలు ఇచ్చేది తామేనని పేర్కొన్నారు. ఎక్కడాలేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, 16 శాతం ఐఆర్ కూడా ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి.. బతుకమ్మ, దసరా పండుగలోస్తే సమ్మె చెస్తామంటే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికే ఐదు వేల కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని.. ఏటా 11 వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కార్మికులు రోజుకో డిమాండ్ చేయాటాన్ని మంత్రి తప్పుపట్టారు. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేవని, యూనియన్ లీడర్లే కుట్రపూరితంగా ఈ సమ్మె చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చెప్పింది చేశాం: మంత్రి హరీశ్
సాక్షి, సంగారెడ్డి : పేదలు ఆత్మగౌరవంగా బ్రతుకాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన అని ఆర్థిక మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని సోమవారం సామూహిక గృహప్రవేశం కార్యక్రమంలో భాగంగా బాచేపల్లి గ్రామంలో 50 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అంటే కాగితాల్లో ఇండ్లు.. చేతుల్లో బిల్లులు అని విమర్శించారు. సంక్షేమానికి కొత్త నిర్వచనం టీఆర్ఎస్ ప్రభుత్వమని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని ప్రగాల్భాలు పలికి.. ఒక్క తండాను కూడా పంచాయతీలుగా చేయలేదన్నారు. టీఆర్ఎస్ వచ్చాక ఏం చేప్పామో అవి చేసి చూపించామన్నారు. గతంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో రెండు రెసిడెన్షియల్ స్కూల్లు ఉంటే టీఆర్ఎస్ వచ్చాక ఎనిమిది కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో నమ్మకాన్ని కలిగించామన్నారు. ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేలు ఖర్చు చేశామని, రాష్ట్రంలో 600 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మంజూరు చేశామన్నారు. పెన్షన్లను పెంచి లబ్ధి దారుల ముఖాల్లో ఆనందాన్ని నింపామన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమాతో రైతులకు తమ ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు. బాచేపల్లి గ్రామ డబుల్ బెడ్రూం ఇళ్లు దేశానికి ఆదర్శంగా నిలుస్థాయని, గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా బాచేపల్లి తండాను భక్తిదామ తండాగా పేరు మార్చాలని గ్రామస్తులు కోరగా వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. -
జగ్గారెడ్డి నాడు వైరం.. నేడు సన్మానం
సాక్షి, సంగారెడ్డి: గురువారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంత్రి హరీశ్‌రావును సన్మానించి అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేశారు. దశాబ్ద కాలానికిపైగా వీరిమధ్య మాటలు లేని విషయం తెలిసిందే. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగ్గారెడ్డి మంత్రి హరీశ్‌రావును కలసి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తాజాగా ఎమ్మెల్యే, హరీశ్‌రావుకు శాలువాకప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించడం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రి హరీశ్‌రావు కూడా చిరునవ్వుతో జగ్గారెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మరోసారి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. -
సొంతూరుకు సీఎం..
తమ కళ్ల ఎదుటే తిరిగిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి హోదాలో ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించనున్నాడనే ఆనందం కొందరిలో.. తమతో ఆటలు ఆడి, పాటలు పాడిన బాల్యమిత్రుడు వస్తున్నాడనే సంతోషం మరి కొందరిలో.. వెరసి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చింతమడక గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముఖ్యమంత్రి గ్రామంలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య శోభారాణి, కుమారుడు కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు రానున్నారు. గ్రామ ప్రజలతో సభ, ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనం, పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందడితో చింతమడక మురవనుంది. ఆదివారం పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. సాక్షి, సిద్దిపేట: సీఎం కేసీఆర్ గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణను పూర్తి చేసింది. గ్రామంలో రూ.20 కోట్లతో బీసీ సంక్షేమ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అలాగే అర్హులైన నిరుపేదలకు 54 డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణం, పెద్దమ్మ దేవాలయం, రామాలయం వాటిని ప్రారంభించనున్నారు. మరోవైపు గ్రామంలో ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఉండకుండా ఇప్పటికే రెవెన్యూ అధికారులు, కుటుంబ సర్వే ఆధారంగా పూర్తి నివేదికను తయారు చేశారు. చిన్నప్పటినుంచే అన్నింటా దిట్ట.. చిన్నతనం నుంచే కేసీఆర్ అన్ని రంగాల్లో చలాకీగా ముందు ఉండేవాడు. దుబ్బాక పాఠశాలలో చదువుకునే రోజుల్లో క్లాస్‌లో మొదటి వరసలో కూర్చొని శ్రద్ధగా పాఠాలను వినేవాడు. పరీక్షలకు కూడా సన్నద్ధం కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు పొందేవాడు. కేసీఆర్ మొదట 5వ తరగతి వరకు గ్రామంలో చదువుకున్నప్పటికీ, అనంతరం తొమ్మిది వరకు దుబ్బాకలో చదువుకున్నాడు. అనంతరం 10వ తరగతి పుల్లూరులో, ఇంటర్మీడియట్ సిద్దిపేటలో పూర్తి చేశాం. నేను కేసీఆర్‌తో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ఊరు రుణం తీర్చుకోవడానికి సీఎం హోదాలో గ్రామానికి వస్తుండడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. –భైరి కృష్టారెడ్డి, కేసీఆర్ స్నేహితుడు గ్రామ రూపురేఖలు మారుతున్నాయి.. చాలా రోజుల తరువాత చింతమడక బిడ్డ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడంతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. అదేవిధంగా ఒక రోజంతా మాతోనే గడిపి మా బాగోగులను తెలసుకుని గ్రామ ప్రజలకు బంగారు భవిష్యత్‌ను అందించేందుకు కేసీఆర్ గ్రామానికి రావడం చాలా సంతోషం. చిన్నతనంలో కేసీఆర్‌కు చింతమడకలో ప్రధానోపాధ్యాయునిగా పాఠాలు బోధించాను. గ్రామంలోని అందరి గురించి ఇప్పటికి కేసీఆర్ గుర్తుంచుకున్నారు. ఎదైనా విషయం ఉంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేవాడు. రాష్ట్ర ఉద్యమం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరిగి గ్రామానికి వçస్తుండడతో మాకు సంతోషంగా ఉంది. కేసీఆర్ పుట్టుక మాఊరు ఏదో ఒక గొప్పపుణ్యం చేసుకున్నట్లుగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గ్రామ భవిష్యత్‌ను చూస్తుంటే తెలుస్తోంది. –ప్రతాప్‌రెడ్డి, కేసీఆర్ చిన్ననాటి ప్రధానోపాధ్యాయుడు -
ఎండిన సింగూరు...
సాక్షి, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పారిశ్రామిక ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చే సింగూరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. ఫలితంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోయింది. పుల్కల్, అందోల్ మండలంలోని 35 గ్రామాలకు మాత్రమే ప్రస్తుతం పోచారం సత్యసాయి నీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పెద్దారెడ్డిపేట, బుసరెడ్డిపల్లి శివారుల్లో నిర్మించిన మిషన్ భగీరథ నీటి పంపింగ్ కేంద్రాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లావాసులు మంచినీటి కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. అయితే వేసవిలోనే ప్రాజెక్టు ఎండుముఖం పట్టింది. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో పడిపోవడంతో గత నెల నుంచి ప్రాజెక్టు లోపలి భాగంలో తాత్కాలిక కాల్వల ద్వారా మోటార్లను ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. తాజాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో తాగునీటి సరఫరా నిలిపివేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, మెదక్, నారాయణఖేడ్‌తోపాటు అందోల్ నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీటిని తరలిస్తున్నారు. మార్చిలో ఉన్న 5.21 టీఎంసీల నీటి మట్టం ఆధారంగా జూలై వరకు తాగు నీటిని సరఫరా చేస్తామని అంచాన వేశారు. కానీ వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఎండిపోయింది. మిషన్ భగీరథ స్కీం ద్వారా ప్రతీ రోజు లక్ష మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ మూడు నెలలుగా రోజుకు 50 వేల మిలియన్ లీటర్ల నీటినే సరఫరా చేశారు. సింగూరులో నీటి కొరత ఫలితంగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. జూలై నెల పూర్తి కావస్తున్నా ఇంతవరకు సరైన వర్షాలు లేనందున నాలుగు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వర్షాకాలంలోనూ తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..
సాక్షి, సంగారెడ్డి: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు గురువారం పట్టణ సీఐ డి.వెంకటేష్ తెలిపారు. అప్పుగా ఇచ్చిన రూ.95 వేలను తిరిగి ఇమ్మన్నందుకే భూమమ్మ అనే మహిళను భార్యభర్తలైన మన్నె వీరేశం, రేణుకలు హత్య చేశారని తెలిపారు. రాజంపేట కాలనీలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న యెర్ర భూమమ్మ (41) భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు భూమమ్మ హత్యపై అన్ని కోణాల్లో కేసును పరిశోధించామన్నారు. భూమమ్మది టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామం అని తెలిపారు. రాజంపేటలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. వీరితో పాటు పని చేస్తున్న నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి కాలనీకి చెందిన మన్నె వీరేశం, అతని భార్య రేణుకలను ఈ కేసు విషయమై విచారించామన్నారు. వీరేశం భూమమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెను డబ్బులు అడిగాడు. దీంతో ఆమె తన భర్తకు తెలియకుండా రూ. 95 వేలు ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగివ్వమని అడగడంతో 7 నెలల క్రితం కిరాయి గది ఖాళీ చేసి నర్సాపూర్‌కు వెళ్లారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తుండడంతో వీరేశం అతడి భార్య రేణుకలు ఇద్దరు కలిసి భూమమ్మను చంపాలని పథకం వేశారన్నారు. ఈ క్రమంలో మే 11న దౌల్తాబాద్‌కు రమ్మని చెప్పి ఓ చెరువు వద్ద ఫుల్లుగా మద్యం తాగించడంతో భూమమ్మ స్పృహ కోల్పోయింది. ఈ సమయంలో వీరేశం, రేణుకలు ఇద్దరూ కలిసి బండరాయితో భూమమ్మను కొట్టి చంపి వేశారు. అనంతరం సెల్‌ఫోన్, వెండి కాళ్ల కడియాలు, పుస్తె, గుండ్లు ఎత్తుకెళ్లి సాక్ష్యం లభించకుండా చేశారని చెప్పారు. ఒంటిపై బట్టలు తొలగించి సంగారెడ్డి గాలి పోచమ్మ గుడి దగ్గర చెరువులో శవాన్ని వేశారని వివరించారు. నిందితులను అరెస్టు చేసి ఈ నెల 16న జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. -
ఇంకా దొరకని పసికందు ఆచూకీ
-
మేక కడుపులో పందిని పోలిన పిల్ల
కంగ్టి(నారాయణఖేడ్): మేక కడుపులో పంది జన్మించిందంటే అందరూ వేళాకోలం అని కొట్టి పారేస్తారు. కానీ కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామంలో ఓ మేక పందిని పోలిన పిల్లకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన రఘునాథ్‌రావు పాటిల్‌కు చెందిన మేక ఈనిన ప్రతీసారి నాల్గు పిల్లలకు జన్మనిచ్చేది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిండు చూలుతో ఉన్న మేక అస్వస్థతకు గురి కావడంతో సమీపంలోని తడ్కల్‌కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎంఏ రహీం పరిశీలించి మందులు ఇచ్చారు. కాగా గురువారం రాత్రి మేక మూడు మేక పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం మృతిచెందింది. మూడు మేక పిల్లలు జన్మించిన అనంతరం మేక కడుపు ఉబ్బెత్తుగా ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు మేక కడుపు కోసి చూడగా ఆశ్ఛర్యకరంగా వింత జంతువు బయట పడింది. వింత జంతువు పిల్ల దాదాపు ఐదు కిలోగ్రాముల బరువుతో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్తులే కాకుండా పొరుగు గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చి వింతను తిలకించారు. ఈ విషయంలో వీఏఎస్ డాక్టర్ ఎంఏ రహీంను విచారించగా చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలని తెలిపారు. -
గ్రామాల్లో అభివృద్ధి పనుల ‘పవర్’ ఎవరికి..?
సాక్షి, మెదక్ అర్బన్ : గ్రామల్లో కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్‌లకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో చెక్‌పవర్ విషయంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సమష్టి అధికారాన్ని కొత్త చట్టం కల్పించింది. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయగా సర్పంచ్, ఉపసర్పంచ్‌ల జాయింట్ చెక్‌పవర్ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్‌లో పెట్టింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కొత్త పంచాయతీలకు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు తమ అధికార బాధ్యతలను గత నెల (ఫిబ్రవరి) 2వ తేదీన స్వీకరించారు. అలాగే తొలి పంచాయతీ గ్రామసభ, సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. స్పష్టత కరవు.. అధికారుల బదలాయింపు జరుగుతుండగా ఆర్థిక లావాదేవీల బదలాయింపులు కూడా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ జాయింట్ చెక్‌పవర్ అంశంపై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. జాయింట్ చెక్‌పవర్‌కు సంబంధించి చట్టంలో నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం కొత్తగా ఎన్నికైన ఉపసర్పంచ్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జాయింట్ చెక్‌పవర్ ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతున్నారు. తప్పని తిప్పలు... చెక్‌పవర్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో జిల్లాలోని గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, పాలకవర్గాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయడం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు ఏర్పాటు చేయడం వంటివి ఎప్పటికప్పుడూ చేయాల్సిన పనులు. అయితే వీటికి వెచ్చించాల్సిన నిధులకు ఎలాంటి ఆర్థిక వనరులు లేకపోవడంతో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు తమ సొంత ఖర్చులతో కొన్ని పనులు చేయిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో నీటి కోసం కొత్తగా మోటార్ల కొనుగోలు, పాత మోటార్లు రిపేరింగ్ చేయించడం, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం వంటి వాటికి వేల రూపాయల్లో ఖర్చులు చేయాల్సి వస్తోంది. అలాగే గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లించాడానికి కూడా నిధులు లేకపోవడం, వీరికి చెక్‌పవర్ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో 469 సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో 469 మంది సర్పంచ్‌లు, 469మంది ఉపసర్పంచ్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వీరి అధ్యక్షతన పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయి. లావాదేవీలన్నీ ఇద్దరితోనే... పంచాయతీ ఆర్థిక లావాదేవీలన్నీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ద్వారానే కొనసాగనున్నాయి. ఆర్థిక లావాదేవీల అధికారం బదలాయింపు జరుగుతుండటంతో చెక్‌పవర్ అంశం ప్రస్తుతం గ్రామాల్లో చర్చనీయాంశమైంది. జాయింట్ చెక్‌పవర్ అంశాన్ని హోల్డ్‌లో పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ మొదటివిడత గ్రామసభ, సమావేశాలు ఆయా గ్రామాల్లో ఇప్పటికే నిర్వహించారు. జాయింట్ చెక్‌పవర్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడు జారీచేస్తుందోనని విషయాలు అధికారులు చెప్పలేకపోతున్నారు. సొంత డబ్బులతో పనులు.. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి సర్పంచ్‌గా ఎన్నికైనా ఇంతవరకు చెక్‌పవర్ రాకపోవడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇబ్బందులు తప్పడంలేదు. నేను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా అభివృద్ధి పనులను చేపట్టాను. గ్రామాభివృద్ధికోసం ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షల వరకు సొంత డబ్బుల.ు ఖర్చు చేశాను. గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాను. సర్పంచ్ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని చెక్‌పవర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – పరశురామ్రెడ్డి, సర్పంచ్, అజ్జిమర్రి, చిలిప్‌చెడ్ మండలం త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. తాము సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి రెండునెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చెక్‌పవర్ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామంలోని అన్ని చోట్ల నీటి ఎద్దడి నివారణకు పాత బోరు మోటార్లు రిపేరు చేయించడం జరిగింది. అలాగే కొత్తవి కొనుగోలు చేశాము. ఇవన్నీ సొంత డబ్బులతో చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం చెక్‌పవర్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. – మహిపాల్‌రెడ్డి, సర్పంచ్, లింగ్సాన్‌పల్లి, హవేళిఘణపూర్ మండలం -
కూరగాయలు మీకు.. ఓట్లు నాకు
సాక్షి, సంగారెడ్డి: ప్రచారంలో భాగంగా పట్టణంలో కూరగాయలు విక్రయిస్తున్న బీజేపీ అభ్యర్థి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే -
ఫోన్లో వద్దు ప్లీజ్
జోగిపేట(అందోల్): ఈ ఎన్నికల సీజన్లో సెల్ఫోన్లో మాట్లాడాలంటేనే నాయకులు జంకుతున్నారు. ముఖ్య నేతలు ఫోన్ల ద్వారా రాజకీయ అంశాలను చర్చించాలన్నా ఇతర విషయాలు మాట్లాడాలన్న వెనుకముందాడుతున్నారు. ఫోన్ రికార్డింగ్, ట్యాపింగ్ భయం వారిని వేధిస్తోంది. వ్యూహాలు ప్రత్యర్థి పార్టీలకు తెలిసి పోతుందోనన్న హైరానా వారిని వెంటాడుతోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అంటూ తేడా లేకుండా అన్ని పార్టీల నేతల్లోనూ ఇదే రకమైన ఆందోళన నెలకొంది. సదాశివపేట(సంగారెడ్డి): అసెంబ్లీ ఎన్నికల సందడి సంగారెడ్డి నియోజకవర్గంలో రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎన్నికల సమీపిస్తుండడంతో ఓట్లను ప్రభావితం చేసే ఎదుటి పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను, క్రియశీలక కార్యకర్తలకు గాలం వేస్తున్నారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ముఖ్య నాయకులే నేరుగా వారితో లైన్లోకి వస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డిలోనూ ‘సెల్’ సమస్య.. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఆశపెడుతున్నారు. నయానో, భయానో ముట్టజెప్పి దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి ప్రత్యేక ప్యాకేజీలతో ఆఫర్ ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో సెల్ఫోన్లలో జరిపే చర్చలు, మాటలు బయటకు పొక్కకుండ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఫోన్లో కంటే నేరుగా మాట్లాడడానికే మొగ్గు చూపుతున్నారు. అభ్యర్థులకు అత్యంత సన్నిహితంగా ఉండే వారైతే ప్రత్యర్థి నేతల ఫోన్లను లిఫ్ట్ చేయాలంటేనే జంకుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హడలిపోతున్న నేతలు కాంగ్రేస్ నేతలను ఫోన్ ట్యాంపరింగ్ వెంటాడుతునే ఉంది. ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నేతల ఫోన్లపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించారని, ఏ నేతలు ఎవరెవరితో ఫోన్ల ద్వారా సంభాషణలు సాగిస్తున్నారో? రాజకీయాలు నేర్పుతున్నారోనని అధికార పార్టీ పరిశీలిస్తుందని ప్రచారం సాగుతోంది. ప్రగతి భవన్‌లోనే ఈ తంతు జరుగుతుందని ఇటీవల కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో నాయకులు ఫోన్లలో మాట్లాడాలంటేనే హైరానా పడుతున్నారు. రాజకీయ అంశాలు చర్చకు రాగానే ఫోన్లను కట్ చేసి కలిసినడుప్పుడు మాట్లాడుదామన్నట్లుగా దాటవేస్తున్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సెగ్మెంట్లో ఫోన్ ట్యాంపరింగ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్య నేతలు అందరూ ఫోన్లలో మాట్లాడలంటేనే భయ పడుతున్నారు. ఎవరెవరీ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయోనన్న అనుమానంతో నేతలు సతమతమవుతున్నారు. కొందరు నేతలైతే ఏకంగా వ్యక్తిగత అంశాలను, వ్యక్తిగ తమైన వ్యవహారాలను చర్చించుకునేందుకు ప్రత్యేక నంబర్లను సైతం తీసుకుంటున్నారు. తాము ఉపయోగించే ఫోన్ నంబర్ల ద్వారా రాజకీయాలు, ఇతర అంశాలను మాట్లాడడం మానేశారు. టీఆర్ఎస్ నేతలు సైతం ఎవరైన ముఖ్య విషయం కోసం ఫోన్ చేస్తే ఎందుకు అన్నా ఫోన్లో వద్దు నేరుగా కలుద్దామంటూ ముగిస్తున్నారట. కాల్ రికార్డింగ్, ట్యాపింగ్ సమస్య వారిని వేధిస్తోంది. ఈ వ్యవహరం అందోలు సెగ్మెంట్లో తీవ్ర చర్చలకు తావులేపుతోంది. ప్రతీ విషయం అత్యంత గోప్యం ప్రధాన పార్టీల అభ్యర్థులు నిధులు సమీకరించుకోవడంలో, ఎన్నికల ప్రచారంలో విధులు పంచుకోవడంలోను అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు తమ ప్రణాళికలు, వ్యూహాలు, బయటపడకుండా చూసుకుంటున్నారు. పోలింగ్ నాటికి అవసరమయ్యే ఖర్చులను ఎవరికెంత పంపాలనేది కూడ రహస్యంగానే సమాచారాన్ని సేకరిస్తున్నారు. అత్యంత నమ్మకస్తులతోనే వ్యవహరాలు నడిపిస్తున్నారు. అడుగడుగునా జరుగుతున్న వాహనాల తనిఖీలు, ఎన్నికల అధికారుల నిఘాతో అన్ని పార్టీల్లోను గోప్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు మాట్లాడుకునే సమయంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
జ్యోతిష్యంతో ‘పెళ్లి’కి ఎసరు!
సిద్దిపేటటౌన్ : తప్పుడు జ్యోతిష్యం చెప్పడంతో ఓ పెళ్లి ఆగిపోయింది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందంటూ జ్యోతిష్యుడు చెప్పడంతో అబ్బాయి తరఫు వాళ్లు పెళ్లి సంబంధం వదులుకున్నారు. ఆ మాటే అబ్బాయి తరఫు వాళ్లు అమ్మాయి వాళ్లకు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆ జ్యోతిష్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. మూఢ నమ్మకంతో పెళ్లి ఆగిన ఘటన సోమవారం సిద్దిపేటలోని శ్రీనివాసనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీనివాస నగర్లో రాజు పంతులు అనే వ్యక్తి జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నాడు. అదే కాలనీలోని ఓ కుటుంబం తమ కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటున్నామని తాము చూసిన అమ్మాయి జాతకం చూడమని ఆ జ్యోతిష్యునికి చూపించారు. దాన్ని చూసిన పంతులు ఇద్దరికి జాతకాలు కలవడం లేదని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఇంట్లో ఒకరికి ప్రాణ హాని ఉందని ఖంగు తినే విషయం చెప్పాడు. ఆ పంతులు చెప్పిన మాట నమ్మిన వారు అమ్మాయి వాళ్లకు అదే విషయాన్ని చెప్పి పెళ్లి ఆలోచన మానుకోవాలని చెప్పారు. అంతకుముందే కట్నకానుకల విషయం మాట్లాడుకొని ఈ నెల 22న నిశ్చితార్థం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే జాతకాల వ్యవహారం అమ్మాయి తరఫువాళ్లను ఆందోళనలో పడేసింది. అమ్మాయి వాళ్లు ఆదివారం వచ్చి జ్యోతిష్యున్ని సంపద్రించడంతో మీ అమ్మాయికి జన్మలో పెళ్లి కాదని చెప్పాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జాతకంలో దోషం ఉందని పేరు మార్చుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుందని చెప్పినట్టు తెలిపారు. నాలుగు నెలల నుంచి కలిసి మెలిసి తిరిగిన అమ్మాయి, అబ్బాయి రాజు పంతులు చెప్పిన మాటలతో పెళ్లి చేసుకోలేకపోతున్నారని, దీనంతటికి పంతులే కారణమని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తన మీదకు దాడికి వచ్చారని రాజు పంతులు పోలీసులకు ఫోన్ చేసి రక్షణ కోరడంతో పోలీసులు అతడిని, అబ్బాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి తరఫు వాళ్లు మాట్లాడుకొని సయోధ్య కుదుర్చుకున్నారు. పెళ్లి కారణంగా అమ్మాయివాళ్లకైన డబ్బులు ఇవ్వడానికి అబ్బాయి వాళ్లు అంగీకారం తెలపడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. మమ్మల్ని ఆగం చేసిండ్రు.. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న టైంల శనివారం రాత్రి అబ్బాయి వాళ్లు ఫోన్ చేసి మా అమ్మాయిని చేసుకుంటే వారి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందని చెప్పిండ్రు. పెళ్లి క్యాన్సల్ చేస్తున్నట్టు చెప్పిండ్రు. ఏం చేయాల్నో మాకు ఏం అర్థం కావడం లేదు. మమ్మల్ని ఆగం చేసిండ్రు. గుట్టుగా బతికే మమ్మల్ని రోడ్డు మీదకు గుంజిండ్రు.. –అమ్మాయి తల్లి పెళ్లి యోగం లేదన్నాడు ముందుగా మేం చూపించిన పంతులు జాతకం బాగానే ఉందన్నాడు. రాజు పంతులు మా అమ్మాయికి జన్మలో పెళ్లి కాదన్నాడు. పెళ్లి యోగం లేదన్నాడు. ఒక వేళ పెళ్లి అయితే నా తల నరుక్కుంటా అని చెప్పి.. ఇంకా ఎవరినైనా పండితులను అడిగి తెలుసుకొని నాకు ఫోన్ చేయమని తన నంబర్ నాకిచ్చాడు. రాజు పంతులు వల్లనే మా బిడ్డ పెళ్లి ఆగిపోయింది. – అమ్మాయి తండ్రి పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమన్నా.. నా దగ్గరకు ముందుగా ఒక తప్పుడు డేట్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూసి చెప్పాను. మళ్లీ ఇంకో డేట్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూస్తే జాతకంలో కొంచెం దోషం ఉందని, పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమని చెప్పాను. అదే జాతకం తీసుకొని వేరే పంతులు దగ్గరకు వెళ్లినా నేను చెప్పిందే చెప్తాడు. నేను తప్పుడు జాతకం చెప్పలేదు. –రాజు పంతులు, జ్యోతిష్యుడు -
విద్యతోనే మహిళలకు గౌరవం
సంగారెడ్డిజోన్ : స్వశక్తి, విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని.. ఇందుకు సమాజ ఆలోచనా విధానంలోనూ మార్పులు రావాలని ప్రముఖ న్యాయవాది శైలజ పేర్కొన్నారు. రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ఎంచుకున్న న్యాయవాది వృత్తిలో రాణిస్తున్నారు. ఆమె మాటల్లో మరిన్ని వివరాలు.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీకే నారాయణరెడ్డి, జయప్రద దంపతుల మూడో కుమార్తె నేను. లెఫ్ట్ భావజాలం కలిగిన నాన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ప్రధాన ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్న అమ్మే మమ్మల్ని పెంచింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా మమ్మల్ని చదివించింది. అమ్మే నాకు రోల్ మోడల్. తన జీవితాన్నే మాకు పాఠంగా నేర్పింది. వేర్వేరు కుటుంబల నుంచి వచ్చి ఆదర్శ వివాహం చేసుకున్నామని అమ్మె మాకు చెప్పేది. ఈక్రమంలో భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను మాకిచ్చింది. నాటి ప్రముఖ రచయిత శరత్ సాçహిత్యం ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. విద్యార్థి దశలో లెఫ్ట్ రాజకీయాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అమ్మనాన్నల వల్ల నిజాయితీగా బతకడం నేర్చుకున్నా. ఎమ్మెల్యే కోటాలో హైదరాబాద్‌లో ఫ్లాట్ ఇస్తే తిరస్కరించాం. 1985లో సంగారెడ్డిలో నేను న్యాయవాద వృత్తిని చేపట్టిన సమయంలో మహిళలు ఎవరూ లేరు. నా సీనియర్ కుటుంబ స్నేహితుడు చల్ల నరసింహారెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశా. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ.. నిజాయితీగా పని చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. కుటుంబంతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండటం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నా. సమస్యల పరిష్కారానికి చట్టాలు సమస్యలు ఎన్ని ఉన్నయో.. వాటి పరిష్కారానికి అన్ని చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబాల ఆలోచనలో మార్పులు రావాలి. ఆడపిల్లలు అన్న చిన్నచూపు ఉండకూడదు. హంగు, ఆర్భాటం మధ్య వివాహాలు చేయడం వల్ల ఖర్చులు పెరిగి ఆడపిల్ల వివాహాన్ని తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. మోసపోతున్న బాలికలు కిశోర దశలో ఉండే సందిగ్ధం, ఆకర్షణ వల్ల బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. సమాజంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బాధితులకు చట్టపరమైన రక్షణ, సమాజ సహకారంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది.