Share Market
-
షేర్లు కొంటా అంటున్న రాజేష్
-
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్ సెషన్లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్‌ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు. -
రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పటికీ చాలా మంది జంకుతారు. ఎందుకంటే ఇందులో లాభాలతో పాటు నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కానీ ఓ ఇంజినీరు ఈక్విటీ మార్కెట్లో తన అద్భుతమైన ప్రయాణంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూపించారు.పంజాబ్‌లోని లుధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ 1986లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ సందర్భంగా రూ.1,000 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ విభజనలు, బోనస్ ఇష్యూల తర్వాత 2024 జూన్ 7న ఆయన పెట్టుబడి విలువ రూ.1.36 కోట్లు అయింది. అప్పట్లో రూ.10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు.కుల్దీప్ సింగ్ ప్రస్తుతం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన 7,580 షేర్లను కలిగి ఉండగా, 2024 జూన్ 7న ఒక్కో షేరు విలువ రూ.1,800 వద్ద ముగిసింది. 2017లో పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన ఆయన పోర్ట్‌ఫోలియో విలువ ప్రస్తుతం రూ.4 కోట్లుగా ఉంది. -
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్‌షా
షేర్ మార్కెట్‌పై హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత షేర్లు అమాంతం దూసుకెళ్తాయని (షూట్ అప్) జోస్యం చెప్పారు. ఆలోపే షేర్లు కొనేసుకోవాలని సూచించారు.అయితే ఇటీవలి మార్కెట్ పతనం గురించి హోంమంత్రి పెద్దగా ఆందోళన చెందడం లేదు. గత ఆరు నెలల వ్యవధిలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 12 శాతం పెరిగింది. అలాగే ఏడాది వ్యవధిలో దాదాపు 20 శాతం పెరిగింది. ‘‘గతంలో కూడా మార్కెట్ చాలా సార్లు పడిపోయింది. కాబట్టి మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలతో ముడిపెట్టడం సరి కాదు. మార్కెట్ల పతనానికి బహుశా కొన్ని పుకార్లు కారణం కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం.. జూన్ 4 లోపు కొనండి (షేర్లు). తర్వాత మార్కెట్ షూట్-అప్ కానుంది’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు.భారత స్టాక్ మార్కెట్ల పయనంపై తాను ఎందుకు ఆశాజనకంగా ఉన్నది అమిత్‌షా వివరించారు. “స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు, మార్కెట్లు బాగానే ఉంటాయి. మోదీజీ మళ్లీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. కాబట్టి, ఇది నా అంచనా" అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు మూడు దశలు ఎలా సాగాయని అడిగినప్పుడు తమ పార్టీ 190 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మొదటి మూడు దశల్లో 283 స్థానాలకు పోలింగ్ జరగింది. -
నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' (Infosys) కంపెనీ షేర్లు గత ఐదు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా సంస్థ షేర్స్ రెండు శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణం ఏంటి, మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి డిసెంబర్ 22 సాయంత్రం మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) రద్దు చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించిన తర్వాత సంస్థ షేర్లు పతనమవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ ప్రకటన ముందు వరకు దూసుకెళ్లిన షేర్లు ఒక్కసారిగా పడిపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. మూడు రోజుల వరుస సెలవుల తర్వాత డిసెంబర్ 26న(మంగళవారం) కంపెనీ ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాక్ రూ. 1,534 స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తేరుకుని 1.08 శాతం నష్టంతో రూ. 1546 వద్ద నిలిచింది. ఇదీ చదవండి: అప్పులపాలు.. యంత్రాలన్నీ తుప్పుపట్టి పనికిరాని దశలో.. టాటా రాకతో అంతా తారుమారు! ఇన్ఫోసిస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతో సంస్థ చేసుకున్న 1.5 బిలియన్ డాలర్లు లేదా సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఈ కారణంగానే కంపెనీ షేర్స్ ప్రస్తుతం తగ్గు ముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. -
కొత్త విభాగంలో అడుగెట్టిన ఫోన్‌పే - వివరాలు
బెంగళూరు: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. షేర్డాట్మార్కెట్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి బుధవారం దీన్ని ఆవిష్కరించారు. ప్రాథమికంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లతో ప్రారంభించి క్రమంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తదితర సెగ్మెంట్స్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తేనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరిస్తారు. స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ద్వారా తమ ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియో సంపూర్ణమైందని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరోవైపు, 2025 నాటికల్లా ఫోన్‌పే నిర్వహణ లాభాలను సాధించే అవకాశం ఉందని సమీర్ నిగమ్ తెలిపారు. -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
రామోజీ, శైలజకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాలకు సంబంధించిన కేసులో విచారించేందుకు సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించిన సీఐడీ వారిద్దరిని ఈ నెల 29న గానీ 31న గానీ లేదా ఏప్రిల్ 3న గానీ 6న గానీ విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగా సమాచారం అందజేస్తూ వారికి అనువైన తేదీని తెలియచేయాలని సూచించింది. రామోజీరావు, శైలజ వారి నివాసంలోగానీ కార్యాలయంలోగానీ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. చిట్‌ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్ 34, కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. అదో ఆర్థిక నేర సామ్రాజ్యం... మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. సొమ్ములు రాష్ట్రంలోని చందాదారులవి కాగా ఆర్థిక ప్రయోజనాలు మాత్రం పొరుగు రాష్ట్రంలో మకాం వేసిన రామోజీరావువని వెల్లడైంది. రాష్ట్ర చందాదారుల కష్టార్జితానికి రక్షణ లేదని గుర్తించిన స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ నిర్వహించిన సోదాల్లో మరిన్ని అక్రమాలు బయటపడ్డాయి. మరోవైపు స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక నివేదిక (ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్)లను పరిశీలించగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది చందాదారులు తాము మోసపోయినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడి¯] ట్లు తేలడంతో ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సీఐడీ నివేదించింది. మార్గదర్శిలో గుర్తించిన అక్రమాలు ఇవీ.. అక్రమ డిపాజిట్లు.. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ డిపాజిట్లను సేకరిస్తోంది. చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారుడికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తున్నట్టే. చిట్‌ఫండ్ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది. గతంలో కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర రామోజీరావుది. అదే తరహాలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు. నిధుల మళ్లింపు.. అక్రమ పెట్టుబడులు చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును అక్రమ పెట్టుబడులకు మళ్లించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపిస్తూ నిధులను అక్రమంగా మళ్లించారు. ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలెన్స్ షీట్లో చూపించారు. అయితే ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. బ్యాలన్స్ షీట్లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. అయితే ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు పరిశీలనలో వెల్లడైంది. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెని్షయల్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడుసార్లు రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్ ఆర్బిట్రేడ్ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. పోంజీ తరహా మోసం.. రామోజీరావు పోంజీ (గొలుసుకట్టు) తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మార్గదర్శి సంస్థ చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచు తోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. చందాదారుల హక్కులకు విఘాతం రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్లకు (ఫోర్మేన్) చట్టప్రకారం ఉండాల్సిన చెక్ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్ పవర్ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. రాష్ట్రంలో చందాదారులు చెల్లించిన మొత్తానికి బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. -
కోట్లు వచ్చేలా చేస్తాం.. రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా!
హిమాయత్‌నగర్: షేర్ మార్కెట్‌పై నగర వాసికి ఉన్న మక్కువను క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయన అకౌంట్‌ను హ్యాక్ చేసి తెలియకుండా అతి తక్కువ ధరకు షేర్స్‌ను అమ్మేశారు. మళ్లీ షేర్ హోల్డర్‌తోనే ఎక్కువ రేట్‌కు షేర్స్‌ను కొనుగోలు చేపించి రూ.లక్షలు నష్టపోయేలా చేయడంతో.. బాధితుడు శుక్రవారం సిటీసైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్లకుంటకు చెందిన హరీష్‌చంద్రారెడ్డి కొంతకాలంగా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్స్‌ను కొనుగోలు చేసి ఎల్ఐఎస్బ్లూ ఫైనాన్షియల్ త్రూ అమ్మడం, కొనడం చేస్తుంటాడు. ఈ క్రమంలో పరిచయం అయిన సైబర్ కేటుగాళ్లు హరీష్‌చంద్రారెడ్డి అకౌంట్‌ను హ్యాక్ చేశారు. రూ.700 విలువ గల షేర్స్‌ను కేవలం రూ.100కు ఇతరులకు అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్‌చంద్రారెడ్డి వెబ్సైట్లో ఉన్న వారిని ప్రశ్నించగా.. కోట్లు వచ్చేలా చేస్తామని నమ్మించారు. లాభాలు లేని వాటిని రూ.700–800 చొప్పున కొనుగోలు చేయించారు. ఇలా పలు దఫాలుగా కేవలం రెండు గంటల్లో రూ.65 లక్షలు స్వాహా చేశారు. మోసపోయినట్లు గుర్తించిన హరీష్‌చంద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. మీ డబ్బంతా ఏజెంట్ తినేశాడంటూ.. వృద్ధుడికి రూ.25లక్షలు టొకరా ఇన్సురెన్స్ ఎక్స్పైరీ అయినా సరే..సైబర్ కేటుగాళ్లు మాత్రం అమాయకుల్ని వదలట్లేదు. మీకు రావాల్సిన దానికంటే తక్కువ డబ్బును పొందారు. మీకేం బాధ అనిపించడం లేదా అంటూ సింపతితో లక్షలు కాజేశారు. కుల్సుంపురాకు చెందిన వృద్ధుడు రెండు సంస్థల్లో ఇన్సురెన్స్ చేశాడు. అది చాలా కాలం క్రితం ఎక్స్పైరీ కూడా అయ్యింది. తాజాగా రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కాల్ చేసి ఆధార్, పాన్, బ్యాంక్ డిటైల్స్ తీసుకున్నాడు. కొంత డబ్బు కట్టాలనడంతో వృద్ధుడు చెల్లించాడు. రూ.3 లక్షలు వస్తాయని నమ్మించి పలు దఫాలుగా అతడి నుంచి రూ.25లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీసైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దేవుడా క్షమించు నీ హుండీ ఎత్తుకెళ్తున్నా!.. వీడియో వైరల్ -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సరైన తరుణం ఏది?
మార్కెట్లు పడినప్పుడు ఈక్విటీ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసినట్టుగానే.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుకూల సమయం ఏది? డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టుకునేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునే ముందు, లంప్ సమ్ (ఒకే విడత మొత్తం) అయినా సరే.. మీ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఫథకాన్ని ఎంపిక చేసుకోవడం అన్నది కీలకమవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఎంపిక చేసుకున్న పథకం రక్షణ ఎక్కువగా ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేలా ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు పడినప్పుడు కొనుగోలు చేసే మాదిరి అని అన్నారు. కానీ, అదేమంత సులభం కాదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు పడిపోతున్నప్పుడు దిద్దుబాటు చివరికి వచ్చిందా.. ఇంకా కరెక్షన్ మిగిలి ఉన్నదా అన్నది మీకు తెలియదు. అందుకని ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని ఆచరించాలని చెబుతుంటాను. మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే కొంత మొత్తాన్ని మార్కెట్లు పడినప్పుడు పెట్టే విధంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవచ్చు. కనిష్ట స్థాయిల్లో పెట్టుబడి పెట్టాలన్న దానిపై దృష్టి పెట్టడం వల్ల మంచిగా పెరిగే వాటిల్లో పెట్టుబడుల అవకాశాలను కోల్పోవచ్చు. నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉంటే, 30 శాతం ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఈక్విటీ పెట్టుబడుల్లో 10 శాతాన్ని తీసుకెళ్లి రీట్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి రాబడులు సెన్సెక్స్‌ను అధిగమిస్తాయా? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చస్తుంటాయి. వీటి అద్దె రాబడులు అన్నవి ప్రస్తుతం అంత ఎక్కువేమీ లేవు. వచ్చే పదేళ్లలో కొంత పురోగతి ఉంటుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ప్రస్తుతం చూస్తున్న మాదిరి ప్రతికూలతలు మధ్యలో ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ, సెన్సెక్స్ పట్ల నేను ఎంతో ఆశావహంతో ఉన్నాను. రీట్ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను. ప్రతి నెలా ఫండ్స్‌లో రూ.50,000కు మించి పెట్టుబడులు పెట్టేట్టు అయితే పథకాల విభజన ఎలా? ప్రతి నెలా రూ.50,000తో ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ, పోర్ట్‌ఫోలియో సరళంగా ఉండేలా చూసుకోవాలన్నది నా సూచన. రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ పథకాలు సరిపోతాయి. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు తోడు, రెండు స్మాల్‌క్యాప్ పథకాలను కూడా చేర్చుకోండి. పెట్టుబడులు సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
రెడీగా ఉండండి.. 18 ఏళ్ల తర్వాత ఆ దిగ్గజ సంస్థ నుంచి ఐపీఓ
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఓ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ ఐపీఓకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్‌ను టాటా నియమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు టాటా గ్రూప్ మరో అనుబంధ సంస్థ అయిన టాటా స్కై కూడా ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఐపీఓ వార్తలపై టాటా గ్రూప్ స్పందించేందుకు నిరాకరించాయి. చదవండి: Anand Mahindra: ఎలాన్ మస్క్‌పై ఆనంద్ మహీంద్రా ట్విట్.. అది పొగిడినట్లు లేదే..! -
ప్లస్ 631 నుంచి మైనస్ 100 పాయింట్లకు
ముంబై: మిడ్‌సెషన్ నుంచి ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లు పతనమై 15,798 వద్ద నిలిచింది. మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ అరశాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.20శాతం నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ 30 తేదీ తర్వాత తొలిసారిగా రూ.1,296 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.258 కోట్ల అమ్మేశారు. ఆసియాలో జపాన్, హాంగ్‌కాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా మార్కెట్లు లాభపడ్డాయి. చైనా, సింగపూర్ స్టాక్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం క్షీణించాయి. బర్త్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్(జూలై 4) సందర్భంగా సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు కాగా అక్కడి స్టాక్ సూచీలు 2 శాతం మేర భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి 731 పాయింట్ల పతనం సెన్సెక్స్ ఉదయం 266 పాయింట్ల లాభంతో 53,501 వద్ద మొదలైంది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 15,909 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రథమార్థంలో ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు అందాయి. భారత్‌లో సేవారంగ కార్యకలాపాలు జూన్ నెలలో 11 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు గణాంకాలు వెలువడ్డాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం క్షీణించి 20.79 శాతానికి దిగివచ్చింది. ఈ సానుకూలాంశాలతో ఒక దశలో సెన్సెక్స్ 631 పాయింట్లు బలపడి 53,866 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు బలపడి 16,026 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. అయితే ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో యూరప్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడంతో సెంటిమెంట్ దెబ్బతింది. ద్వితీయార్థంలో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో విక్రయాలు తలెత్తడంతో ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(53,866) నుంచి 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16,200 స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్‌లో గరిష్టస్థాయి (16,026) నుంచి 215 పాయింట్లు క్షీణించి 15,811 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦క్యూ1 ఫలితాలు ప్రకటన విడుదలకు ముందు(జూన్ 8న టీసీఎస్ క్యూ1 గణాంకాలు వెల్లడి) ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్అండ్టీ షేర్లు ఒకశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. ♦జూన్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడంతో ఆర్బీఎల్ బ్యాంక్ షేరు ఏడుశాతం క్షీణించి రూ.81.40 వద్ద స్థిరపడింది. ♦మోతీలాల్ ఓస్వాల్ ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో ఎల్ఐసీ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.703 వద్ద నిలిచింది. -
మార్కెట్లో ఆర్బీఐ అప్రమత్తత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టంతో ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు ఒకశాతానికి పతనాన్ని చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్ల క్షీణించింది. చివరికి 568 పాయింట్ల నష్టంతో 55,107 వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ట్రేడింగ్‌లో నిఫ్టీ 223 పాయింట్లు పతనమైంది. మార్కెట్ ముగిసే సరికి 153 పాయింట్ల నష్టంతో 16,416 వద్ద నిలిచింది. సూచీలకిది మూడోరోజూ నష్టాల ముగింపు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో షేర్లకు మాత్రమే కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. విస్తృతస్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,294 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,311 కోట్ల షేర్లు కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 77.78 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయం సెన్సెక్స్ పతనంతో బీఎస్ఈలో రూ.2.13 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.254.28 లక్షల కోట్లకు దిగివచ్చింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ఎల్ఐసీ షేరు ఆరోరోజూ పడింది. 3%పైగా పతనమై రూ.753 వద్ద ముగిసింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 20% క్షీణించింది క్రూడాయిల్ పెరుగుదల ఆయిల్ ఇండియా షేరుకు కలిసొచి్చంది. బీఎస్ఈలో మూడు శాతం లాభపడి రూ.286 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో రూ.301 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నష్టాలకు నాలుగు కారణాలు ఆర్బీఐ పాలసీ సమావేశం: ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. వడ్డీరేట్ల పెంపు ఖాయమే అయినప్పటికీ.., ఎంతమేర పెంపు ఉండొచ్చనే అంశంపై మార్కెట్ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు, అంతర్జాతీయ అనిశి్చతులపై ఆర్బీఐ స్పందన కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. క్రూడాయిల్ ధరల సెగలు ఆసియా దేశాలకు ఎగుమతి చేసే అన్ని రకాల ఆయిల్ ధరలను జూలై నుంచి పెంచుతున్నట్లు సౌదీ అరేబియా చేసిన ప్రకటనతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 120 డాలర్లు దాటింది. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. బాండ్లపై పెరిగిన రాబడులు ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడంతో ఈక్విటీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తాజాగా పదేళ్ల కాలపరిమితి గల బాండ్లపై రాబడులు మూడేళ్ల గరిష్ట స్థాయి 7.54 శాతానికి చేరింది. క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, ఆర్బీఐ పాలసీ సమావేశం సందర్భంగా అప్రమత్తతతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా ఈక్విటీలను అమ్మేసి.., పెట్టుబడులను బాండ్లలోకి మళ్లిస్తున్నారు. యూఎస్ స్టాక్ ఫ్యూచర్ల పతనం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీ శాయి. ఆ్రస్టేలియా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణ కట్టడికి ఇతర దేశాల కేంద్ర బ్యాంకులూ ఇదే కఠినతర ద్రవ్యపాలసీ వైఖరిని అనుసరించవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కె ట్లు 1% నుంచి 1.5% క్షీణించాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 1% నష్టాల్లో ట్రేడయ్యాయి. -
అదే నా కొంప ముంచింది: పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ!
Paytm Share Decline Reason, న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎమ్ షేరు విలువ పతనంకావడానికి మార్కెట్ల ఆటుపోట్లే కారణమని వన్97 కమ్యూనికేషన్స్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్‌పై ఇటీవల మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. రానున్న ఆరు త్రైమాసికాల్లోకంపెనీ లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరుకోగలదని అంచనా వేశారు. నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే స్థాయికి చేరగలదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్‌లో మార్కెట్ ఒడిదుడుకులు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వాటాదారులకు రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. పేటీఎమ్ బ్రాండుతో వన్97 కమ్యూనికేషన్స్ డిజిటల్ పేమెంట్ సర్వీసులందిస్తున్న సంగతి తెలిసిందే. నేలచూపుల్లో...: గతేడాది షేరుకి రూ. 2,150 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన వన్97 కమ్యూనికేషన్స్ కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతూ వస్తోంది. ఇటీవల బీఎస్ఈలో రూ. 520 వద్ద జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. తాజాగా 5 శాతం బలపడి రూ. 637 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022) ఫలితాలు ప్రకటించవలసి ఉన్నదని, ప్రస్తుతం కంపెనీ బిజినెస్ అవకాశాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని లేఖలో శర్మ ప్రస్తావించారు. ఇది కొనసాగనున్నట్లు భావిస్తున్నామంటూనే, ఏడాదిన్నర కాలంలో నిర్వహణ ఇబిటాను సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. వెరసి 2023 సెప్టెంబర్‌కల్లా ఆశించిన ఫలితాలు అందుకోగలమని అభిప్రాయపడ్డారు. తద్వారా దీర్ఘకాలంలో వాటాదారులకు విలువ చేకూర్చనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్ విలువ ఐపీవో స్థాయికి చేరాకమాత్రమే తనకు జారీ అయిన షేర్లు తనకు సొంతమవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం
-
షేర్ మార్కెట్ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో ఘరానా మోసం
-
స్టాక్ మార్కెట్‌కి బడ్జెట్ బూస్ట్.. లాభాల్లో సూచీలు
ముంబై: కేంద్ర బడ్జెట్ ఇచ్చిన బూస్ట్‌తో దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. బడ్జెట్లో ఇన్‌ఫ్రాకి పెద్ద పీట వేయడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. దీంతో వరుసగా రెండో రోజు దేశీ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:10 గంటలకి 430 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ 59,293 పాయింట్ల వద్ద కదలాడుతోంది.మరోవైపు నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,706 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దేశీ సూచీలు జోరుమీద ఉండటంతో మరోసారి బీఎస్ఈ సెన్సెక్స్ 59 వేల మార్క్‌ని దాటింది. -
లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1
Elon Musk Wealth Drops 15billion Dollars as tech stocks plunge: షేర్ మార్కెట్ పరిణామాలు.. ఎప్పుడు? ఎవరి తలరాతను ఎలా? మార్చేస్తాయో ఊహించడం కష్టం. ఒక్కపూటలో కాసులు కురిపించి.. అదేటైంలో రోడ్డు మీదకు లాగేస్తుంది కూడా. ఐపీవో పరిణామాలైతే మరీ ఊహించని రేంజ్లో ఉంటున్నాయి. అయితే అపరకుబేరుల విషయంలో ఈ పరిణామాలన్నీ పెద్దగా అనిపించకపోయినా.. వాళ్ల ర్యాంకింగ్‌లను మాత్రం పైకి కిందకి మార్చేస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. ఈ తరుణంలో లక్ష కోట్లకుపైగా పొగొట్టుకున్నా ఆ అయ్యగారు.. ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈ అయ్యగారు ఎవరో కాదు.. స్పేస్ఎక్స్ అధినేత, అపరకుబేరుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్. శుక్రవారం అమెరికా ఈ-వెహికిల్స్ తయారీదారు కంపెనీ ‘టెస్లా’ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు ఎలన్ మస్క్. ఈ విలువ మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైనే. ఇదిగాక స్పేస్ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్లు(ఏడున్నర వేల కోట్ల రూపాయలకుపైనే) నష్టపోయాడు. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల(లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టంతో.. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లుగా ఉంది. ఇక ఈ లిస్ట్‌లో మస్క్ మొదటి ప్లేస్‌లో ఉండగా.. రెండో ప్లేస్‌లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. 195.6 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ బ్లూ ఆరిజిన్ బాస్. ఇక అమెజాన్ షేర్లు కూడా 1.20 శాతం పడిపోవడంతో.. 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయాడు బెజోస్. జాబితాలో బ్రిటిష్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్‌గేట్స్ (136.4 బిలియన్ డాలర్లు) నాలుగో ప్లేస్‌లో, లారీ పేజ్ (121.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో మార్కెట్లన్నీ పతనం దిశగా పయనిస్తుండగా.. ఫోర్బ్స్ టాప్ టెన్‌లో ఉన్న బిలియనీర్లంతా షేర్ల నష్టాలతో భారీగా సంపదను కోల్పోవడం విశేషం. ఎటు చూసినా టాపే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్లాలోని తన షేర్లను అమ్మేసుకున్నాడు ఎలన్ మస్క్. పైసా తీసుకోని జీతగాడిగా(జీరో శాలరీ) కేవలం టెస్లా షేర్లతోనే లాభాలు అందుకుంటున్న ఎలన్ మస్క్.. ఈ మధ్య 10 శాతం వాటా అమ్మేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తికర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి అమ్మకంతో 10.9 బిలియన్ డాలర్ల విలువైన 10.1 మిలియన్ షేర్లు అమ్మేసుకున్నాడు. ఇంకా దాదాపు ఏడు మిలియన్లు అమ్మేయాల్సి ఉంది. మరి మొత్తంగా తన వాటాగా ఉన్న 17 మిలియన్ షేర్లను వదులుకోవడం ద్వారా మస్క్ నష్టపోడా? బిలియనీర్ జాబితాలో కిందకి జారిపోడా? అనే అనుమానాలు చాలామందికే కలుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షేర్ల అమ్ముకోవడం ద్వారా కట్టాల్సిన ట్యాక్స్ నుంచి భారీ మినహాయింపు పొందాడు ఎలన్ మస్క్. పైగా ఈ అమ్మకాల ద్వారా వాటిల్లిన నష్టం(1,084 డాలర్లు) నుంచి తప్పించుకుని లాభపడ్డాడు కూడా!. ఇక ఈ ఏడాది మొదట్లో ఏకంగా 384 బిలియన్ డాలర్ల సంపదతో(266.8 బిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం) రిచ్చెస్ట్ మ్యాన్‌గా అవతరించాడు ఎలన్ మస్క్. మరోవైపు స్పేస్ఎక్స్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల సంపదను పోగేశాడు. ఇదీగాక ఈ మధ్యే కేవలం స్పేస్ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా స్పేస్ఎక్స్ అవతరించింది. ఇవిగాక భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్‌లు, శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్‌లింక్’ సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఎలా చూసుకున్నా అయ్యగారి నెంబర్ వన్‌స్థానానికి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ఫోర్బ్స్ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది ఈ మధ్య. చదవండి: ట్విటర్ సీఈవో పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్ -
బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థికసంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 53 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 1,302 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,244 కోట్లకు చేరా యి. కన్జూమర్ ప్రొడక్టుల విభాగం ఆదాయం 31 శాతం జంప్‌చేసి రూ. 1035 కోట్లను తాకగా.. ఈపీసీ బిజినెస్ 37 శాతం క్షీణించి రూ. 267 కోట్లకు పరిమితమైంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 1,092 వద్ద ముగిసింది. -
గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు మంగళవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 112 పాయింట్లు పతనమై 60,433 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లను కోల్పోయి 18,044 వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లైన హెచ్డీఎప్సీ ద్వయం, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్ల క్షీణత కూడా సూచీల లాభాల్ని హరించివేశాయి. ఆర్థిక, కన్జూమర్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, ఆటో, ఇంధన, మౌలిక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 456 పాయింట్లు పరిధిలో, నిఫ్టీ 130 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యాయి. లార్జ్ క్యాప్ షేర్లు విక్రయాల ఒత్తిడికి లోనప్పటికీ.., చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతం చొప్పున రాణించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు నివేదికలు తెలపడంతో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు డిమాండ్ లభించింది. సెమీ కండెక్టర్ల సమస్యలు తీరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి అమ్మకాలు పుంజుకోవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆటో రంగ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,445 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్ల రూ.1,417 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! ప్రపంచ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ఉదయం సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 60,610 వద్ద మొదలైంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 18,084 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 124 పాయింట్లు ర్యాలీ చేసి 60,670 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు ఎగసి 18,113 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మిడ్‌సెషన్ నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడమే కాక నష్టాల బాటపట్టాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►క్యూ2లో మార్జిన్లు నిరాశపరచడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.3,622 వద్ద ముగిసింది. ►విద్యుత్ వాహన వ్యాపారానికి నిధులనుసమీకరణకు సిద్ధమవడంతో టీవీఎస్ మోటార్ షేరు ఇంట్రాడేలో 14 శాతం ఎగసి రూ.814 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. అయితే లాభాల స్వీకరణ జరగడంతో చివరికి మూడుశాతం లాభంతో రూ.731 వద్ద స్థిరపడింది. ►భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో ఎల్అండ్టీ రెండు లాభంతో రూ.1964 వద్ద 52–వారాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం లాభంతో రూ.1944 వద్ద నిలిచింది. -
ఈ షేర్లు... తారాజువ్వలు!
ఇన్వెస్టర్లకు సంవత్ 2077 బంపర్‌గా గడిచింది. ప్రజలను కరోనా భయాలు వెంటాడుతున్నా.. దేశీ మార్కెట్లు మాత్రం తారాజువ్వల్లాగా దూసుకెళ్లిపోయాయి. స్మాల్, మిడ్.. లార్జ్ క్యాప్ అనే భేదం లేకుండా అన్ని విభాగాల్లోని షేర్లూ గణనీయంగా పెరిగాయి. గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది అక్టోబర్ దాకా చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 40 శాతం రాబడులు అందించగా.. మిడ్‌క్యాప్ సూచీలు 60 శాతం, స్మాల్‌క్యాప్ సూచీలు 79.7 శాతం మేర రాణించాయి. కరోనా కేసుల కారణంగా అంతటా నిస్పృహ, నిరాశ నెలకొన్న పరిస్థితుల్లో ఊహకు కూడా అందని విధంగా స్టాక్ మార్కెట్లు ఎగిశాయి. కారణాలు అంతర్జాతీయంగా నిధుల లభ్యత పెరగడం, ఆర్థిక విధానాలు సానుకూలంగా ఉండటం, ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో డీమ్యాట్ ఖాతాలు (2021లో 2 కోట్ల పైచిలుకు) తెరవడం, టీకాలతో మహమ్మారిని కొంత కట్టడి చేయగలగడం, ఇంధన ధరలు పెరగడం, రిస్క్ సామర్థ్యాలు పెరగడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లో జోష్‌కి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్ 2078లోనూ మార్కెట్లు మరింత ఎగిసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే రాబడులు తగ్గడం, దేశీ ఇన్వెస్టర్ల రిస్కు సామర్థ్యాలు పెరగడం, జీడీపీ వృద్ధి మెరుగుపడుతుండటం, టీకా ప్రక్రియ పుంజుకుంటూ ఉండటం ఇందుకు దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రంగాల్లో ట్రావెల్, టూరిజం, రియల్ ఎస్టేట్ దాని అనుబంధ రంగాలు మొదలైనవి మెరుగ్గా రాణించే అవకాశాలు ఉన్నాయని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. మరోవైపు, హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాలు ఆశావహంగా ఉండగలవని యాక్సిస్ సెక్యూరిటీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్‌లో మెరిసే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని బ్రోకరేజి సంస్థలు సూచిస్తున్న స్టాక్స్ కొన్ని మీకోసం. బ్రోకింగ్ సంస్థ: ఎస్బీఐ సెక్యూరిటీస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,721 వృద్ధి: 33% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 4.8 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్, అసెట్ క్వాలిటీ, మెరుగైన మార్జిన్లు, రాబడులు దీనికి సానుకూల అంశాలు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ మొండి బాకీలు మరింత తగ్గగలవు. వ్యయాలు తగ్గించుకునే దిశగా డిజిటల్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రతి నెలా డిజిటల్ మాధ్యమం ద్వారా 5 లక్షల పైచిలుకు కస్టమర్లను చేర్చుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించడం, లాక్డౌన్లు విధిస్తే రిటైల్ సెగ్మెంట్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం, ఫిన్‌టెక్ కంపెనీల నుంచి పోటీ వంటివి బాంకుకు ప్రతికూలాంశాలు కాగలవు. .. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రస్తుత ధర రూ. 292 టార్గెట్ ధర రూ. 358 వృద్ధి: 22% వివిధ మౌలిక రంగ ప్రాజెక్టుల అభివృద్ధిలో రెండు దశాబ్దాలపైగా అనుభవం. పటిష్టమైన ఇన్‌హౌస్ ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సేవలు) విభాగం. ఇన్ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థలతో సత్సంబంధాల కారణంగా సంయుక్తంగా బిడ్డింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు మెరుగైన అవకాశాలు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,786 టార్గెట్ ధర రూ. 2,151 వృద్ధి: 20% ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన కంపెనీ. దేశీయంగా విస్కస్ స్టేపుల్ ఫైబర్ (వీఎస్ఎఫ్), లినెన్, ఇన్సులేటర్స్ తయారీ సంస్థ. అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి అనుబంధ సంస్థలున్నాయి. డెకరేటివ్ పెయింట్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో వ్యాపారాలపై రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఆకర్షణీయమైన వేల్యుయేషన్‌లో లభిస్తోంది. చైనా నుంచి సరఫరాపరమైన ఆటంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్, ముడి వస్తువులు..విద్యుత్, ఇంధనాల ఖర్చులు పెరగడం తదితర రిస్కులు పొంచిఉన్నాయి. .. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 612 టార్గెట్ ధర రూ.774 వృద్ధి: 26% ఇది మురుగప్పా గ్రూప్‌లో భాగమైన ఆర్థిక సేవల విభాగం. గృహ, వాహన రుణాలు, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సేవలు మొదలైనవి అందిస్తోంది. నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 67000 కోట్ల పైగా ఉంది. దాదాపు 16.6 లక్షల పైచిలుకు కస్టమర్లకు సర్వీసులు అందిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏయూఎం వార్షికంగా 7 శాతం వృద్ధి నమోదు చేసింది. మహమ్మారి కారణంగా వసూళ్లపై అనిశ్చితి,హామీగా పెట్టుకున్న వాటి విలువలో అత్యధిక శాతం రుణం ఇవ్వడం తదితర అంశాలు ప్రధానమైనరిస్కులు. సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ.836 టార్గెట్ రూ.1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్రోకింగ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.100 టార్గెట్ ధర రూ.135 వృద్ధి: 35% పేరొందిన పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. బ్యాంక్ మొత్తం అసెట్స్ రూ. 2.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు రూ. 1.72 లక్షల కోట్లుగా, ఇచ్చిన రుణాలు రూ. 1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రొవిజనింగ్ తగ్గింది. అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ధర రూ.1582 టార్గెట్ ధర రూ.1,859 వృద్ధి: 17% దేశీయంగా ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం. డిపాజిట్లు రూ. 14 లక్షల కోట్లు, ఇచ్చిన రుణాలు రూ. 12 లక్షల కోట్లుగాను ఉన్నాయి. రిటైల్ రుణాల వాటా 46 శాతంగా ఉంది. రెండో త్రైమాసికంలో ఎన్పీఏలు తగ్గడంతో ఊహించిన దానికన్నా మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అసెట్ క్వాలిటీ మెరుగ్గా ఉండటం, ద్వితీయార్ధం వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండటం తదితర అంశాలు ఈ స్టాక్‌కు సానుకూలమైనవి. సుప్రజిత్ ఇంజినీరింగ్ ప్రస్తుత ధర రూ.373 టార్గెట్ ధర రూ.425 వృద్ధి: 13% సుప్రజిత్ ఇంజినీరింగ్ దేశీయంగా ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్యాసింజర్ వాహనాల సంస్థలకు ఆటోమోటివ్ కేబుల్స్ సరఫరా చేస్తోంది. ఉత్పత్తులను చౌకగా అందించడం ద్వారా మార్కెట్ షేరును పెంచుకోవడంతో పాటు ప్రస్తుత కస్టమర్ల నుంచి మరింతగా ఆర్డర్లు దక్కించుకుంటోంది. వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తిని పెంచుకునే కొద్దీ సుప్రజిత్ కూడా గణనీయంగా ప్రయోజనాలు పొందగలదు. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర రూ.143 టార్గెట్ ధర రూ.175 వృద్ధి: 22% దేశీయంగా వాణిజ్య వాహనాల విభాగ దిగ్గజాల్లో ఒకటి. మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాల మార్కెట్లో సుమారు 28 శాతం వాటా ఉంది. సీవీ సెగ్మెంట్ కోలుకునే కొద్దీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోగలగే సత్తా ఉంది. స్క్రాపేజీ పాలసీ వల్ల కూడా కంపెనీ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పీఐ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ.2733 టార్గెట్ ధర రూ.3,950 వృద్ధి: 44% అంతర్జాతీయ ఆగ్రోకెమికల్ కంపెనీలకు కస్టమ్ సింథసిస్, తయారీ సొల్యూషన్స్ (సీఎస్ఎం) అందిస్తోంది. కంపెనీ ఆదాయాల్లో ఈవిభాగం వాటా 70 శాతం పైగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కెమికల్స్, ఫార్మా ఏపీఐ, ఫ్లోరో కెమికల్స్ మొదలైన వాటిల్లోకి విస్తరిస్తోంది. బ్రోకింగ్ సంస్థ: యాక్సిస్ సెక్యూరిటీస్ ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ధర రూ. 2,420 టార్గెట్ ధర రూ. 2,570 వృద్ధి: 6% వ్యయాల తగ్గింపు చర్యలు, ఉత్పత్తులకు భారీ డిమాండ్, మెరుగైన ధర మొదలైనవి కంపెనీకి సానుకూలాంశాలు. ప్రస్తుతం ఈ రంగంలోని మిగతా సంస్థలతో పోలిస్తే షేరు ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. సైయంట్ ప్రస్తుత ధర రూ.1,105 టార్గెట్ ధర రూ.1,300 వృద్ధి: 17% దీర్ఘకాలిక కోణంలో కంపెనీ వ్యాపార స్వరూపం పటిష్టంగా మారింది. అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు సంస్థ చేతిలో ఉన్నాయి. రూపాయి మారకం తక్కువ స్థాయిలో ఉంటడం, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గటం వంటి కారణాలతో సమీప భవిష్యత్తులో సైయంట్ ఆదాయాలు మరింత మెరుగుపడవచ్చు. మైండ్‌ట్రీ ప్రస్తుత ధర రూ.4,627 టార్గెట్ ధర రూ.5,100 వృద్ధి: 10% ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించగలగడంతో పాటు ప్రాజెక్టులను సమర్ధంగా పూర్తి చేయగలిగే ట్రాక్ రికార్డు కంపెనీకి సానుకూలాంశం. రూపాయి క్షీణత, ప్రయాణ వ్యయాలు.. ఆన్ సైట్ వ్యయాలు తగ్గుతుండటం కలిసొచ్చే అంశాలు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర రూ.744 టార్గెట్ ధర రూ.940 వృద్ధి: 26% నవీకరించిన కొత్త వ్యాపార విధానం ఊతంతో తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడంతో పాటు మార్కెట్ వాటాను కూడా పెంచుకోగలిగే అవకాశం ఉంది. బ్రాండ్ రీకాల్, వివిధ రకాల కస్టమర్లకు వినూత్న ఆఫర్లు అందిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ధర రూ.1,178 టార్గెట్ ధర రూ.1,350 వృద్ధి: 14% ప్రైవేట్ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఎస్బీఐ లైఫ్‌కు అత్యంత విస్తృతమైన బ్యాంక్ఎష్యూరెన్స్ నెట్వర్క్ ఉంది. కార్యకలాపాలను స్వల్ప వ్యవధిలో విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వ్యయాలకు సంబంధించిన నిష్పత్తులు అత్యంత తక్కువగా ఉండటం వల్ల వ్యాపా రం నెమ్మదించినా మార్జిన్లపై ఎక్కువగా ప్రభావం పడకపోవడం, లాభదాయక పాలసీలపై దృష్టి పెడుతుండటం సంస్థకు సానుకూలాంశం. బ్రోకింగ్ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుందరం ఫాజెనర్స్ ప్రస్తుత ధర రూ. 836 టార్గెట్ రూ. 1,059 వృద్ధి: 26% ఆటోమోటివ్, ఇన్ఫ్రా, పవన విద్యుత్, ఏవియేషన్ తదితర రంగాలకు అవసరమైన పవర్ ట్రెయిన్ విడిభాగాలు, మెటల్ ఉత్పత్తులు మొదలైన వాటిని సుందరం ఫాజెనర్స్ అందిస్తోంది. కాలక్రమంలో వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించింది. 8.5 బిలియన్ డాలర్ల పైగా అమ్మకాలు ఉన్నాయి. ఫాజెనర్స్ సెగ్మెంట్లో దిగ్గజంగా ఎదగడంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా మెరుగ్గా రాణిస్తుండటం సానుకూల అంశం. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం, అంతర్జాతీయంగా చిప్‌ల కొరత తదితర అంశాల కారణంగా వ్యాపారానికి రిస్కులు ఉండవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ధర రూ. 101 టార్గెట్ ధర రూ. 120 వృద్ధి: 18% క్రమంగా కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలను ఎత్తివేత, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం తదితర అంశాల ఊతంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుంది. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడంతో ఎన్పీఏల భారం తగ్గుతుంది. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రావాల్సిన బాకీలు కూడా క్రమంగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రస్తుత ధర రూ. 253 టార్గెట్ ధర రూ. 300 వృద్ధి: 18% మెటీరియల్ హ్యాండ్లింగ్, నిర్మాణ రంగ పరికరాల వ్యాపారం పటిష్టంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు–నాలుగేళ్లలో 35–30 శాతం పెరగవచ్చని అంచనా. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీకి ఇది సానుకూలాంశం. బాటా ఇండియా ప్రస్తుత ధర రూ. 2,036 టార్గెట్ ధర రూ. 2,380 వృద్ధి: 17% వ్యయాలను తగ్గించుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగించడం, ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు మొదలైనవి కంపెనీకి లాభించగలవు. అలాగే భారం పెంచుకోకుండా ఫ్రాంచైజీ విధానంలో రిటైల్ నెట్‌వర్క్‌ను క్రమంగా పెంచుకుంటూ ఉండటం సంస్థకు సానుకూల అంశం. మహీంద్రా లైఫ్‌స్పేస్ ప్రస్తుత ధర రూ. 283 టార్గెట్ ధర రూ. 325 వృద్ధి: 14% పటిష్టమైన మాతృ సంస్థ తోడ్పాటు, కార్యకలాపాల స్థాయిని విస్తరించడంపై మేనేజ్మెంట్ మరింతగా దృష్టి పెడుతుండటం కంపెనీకి సానుకూల అంశాలు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలాలతో రెసిడెన్షియల్ వ్యాపారాన్ని కూడా పెంచుకోవడానికి తోడ్పడగలదు. మధ్యకాలికంగా షేర్ టార్కెట్‌ను తాకవచ్చు. -
స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా.. నేల ముఖం పట్టిన సూచీలు
ముంబై: అనూహ్యంగా పెరుగుతూ పోయిన స్టాక్ మార్కెట్ క్రమంగా దిద్దుబాటు దిశగా పయణిస్తోంది. ఆరంభంలో దేశీ సూచీలు లాభాలు పొందినా.. మధ్యాహ్నం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలు షురూ చేయడంతో తిరిగి నష్టాలతోనే దేశీ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. చివరి నిమిషంలో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో భారీ నష్టాలు తప్పాయి. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, టాటాస్టీల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఈ రోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 61,044 పాయింట్లతో మొదలవగా ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో 61,420 పాయింట్లను తాకింది. దీంతో తిరిగి మార్కెట్లో బుల్ జోరు మొదలైందనే భావన ఏర్పడింది. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారింది. లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,627 పాయింట్ల కనిస్టానికి పడిపోయింది. చివరల్లో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో మార్కెట్ ముగిసే సమయానికి 102 పాయింట్లు నష్టపోయి 60,821 పాయింట్ల దగ్గర ఆగిపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 63 పాయింట్లు నష్టపోయి 18,144 దగ్గర క్లోజయ్యింది. -
చెన్నై‘సూపర్ కింగ్స్’.. అరుదైన ఘనత!
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశ్చర్యకర పరిణామాలకు కారణం కాబోతోంది. ధనా ధన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఇటు ఐపీఎల్ లీగ్పరంగానే కాకుండా అటు మార్కెట్ వేల్యుయేషన్పరంగానూ దుమ్ము రేపుతోంది. ఏకంగా క్రీడా రంగంలో తొలి యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా విలువ) హోదా దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ విషయంలో మాతృ సంస్థ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్‌ను కూడా దాటిపోతుండడం మరో విశేషం. ఈమధ్యే నాలుగోసారి లీగ్‌ను గెల్చుకోవడంతో సీఎస్కే టీమ్ విలువపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే సీజన్లో రెండు జట్లకు చోటు కల్పించనున్నారని, వీటి విలువను సుమారు రూ. 4,000– 5,000 కోట్లుగా లెక్కించనున్నారని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టి చూస్తే, తొలి నుంచి నిలకడగా రాణిస్తున్న సీఎస్కే వేల్యుయేషన్ దాదాపు రెట్టింపు స్థాయికి చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘‘గత శుక్రవారం అనధికారిక మార్కెట్లో సీఎస్కే షేరు ధర రూ. 135గా ఉంది. దీని ప్రకారం సీఎస్కే మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 4,200 కోట్లు. అయితే, కొత్తగా వచ్చే జట్ల విలువ దాదాపు రూ. 4,000– 5,000 కోట్లుగా ఉంటే సీఎస్కే రిటైల్ షేరు ధర ఏకంగా రూ. 200కి చేరవచ్చు. దీంతో టీమ్ విలువ రూ. 8,000 కోట్లకు ఎగియవచ్చు. తద్వారా యూనికార్న్‌గా మారవచ్చు’’ అని పేర్కొన్నాయి. మరోవైపు, మంగళవారం నాటి పరిస్థితుల ప్రకారం సీఎస్కే మాతృ సంస్థ ఇండి యా సిమెంట్స్ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో షేరు ధర రూ. 205) మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 6,343 కోట్లుగా ఉంది. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే సీఎస్కే విలువ ఇండియా సిమెంట్స్ వేల్యుయేషన్‌ను కూడా దాటిపోనుంది. ఇండియా సిమెంట్స్‌కు ఊతం ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్ శ్రీనివాసన్ కూడా ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే విలువ.. మాతృ సంస్థ వేల్యుయేషన్‌ను దాటేసే అవకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ లీగ్‌లు మరింతగా ప్రాచుర్యంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరో సందర్భంలో ఇండియా సిమెంట్స్‌కు సీఎస్కే ఊతంగా నిలుస్తోందంటూ ఆయన అంగీకరించారు. ‘‘ఇండియా సిమెంట్స్ నెలకొల్పి 75 ఏళ్లవుతోంది. అది స్వయంగా ఒక పటిష్టమైన బ్రాండ్. కానీ ఇప్పుడు సీఎస్కే మాతృ సంస్థగా గుర్తింపు పొందుతోంది. సీఎస్కే అనతికాలంలోనే ఇండియా సిమెంట్స్ ప్రాచుర్యాన్ని అధిగమించింది’’ అని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ‘‘సీఎస్కే స్వయంగా ఒక భారీ బ్రాండ్‌గా ఆవిర్భవిస్తోంది. వేల్యుయేషన్ గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఇండియా సిమెంట్స్ దీన్నేమీ విక్రయించకపోవచ్చు. ఎందుకుంటే బ్రాండింగ్పరంగా ఇది మాతృ సంస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది’’ అని బ్రాండ్ మార్కెటింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఇండియా సిమెంట్స్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎస్కే టీమ్ ప్లేయర్లు సందడి చేయడం ఇందుకు నిదర్శనంగా తెలిపాయి. సీఎస్కే టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అటు ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. నిలకడగా రాణింపు 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పట్నుంచీ .. మిగతా టీమ్‌లతో పోలిస్తే సీఎస్కే నిలకడగా రాణిస్తోంది. 196 మ్యాచ్‌లలో 117 మ్యాచ్‌లలో గెలుపొంది.. 59.69 శాతం విజయాల రేట్‌తో కొనసాగుతోంది. ధోనీ సారథ్యంలో సీఎస్కే ఇప్పటికే పటిష్టమైన బ్రాండ్‌గా ఎదిగిందని, ఒకవేళ రేపు ఎప్పుడైనా అతను తప్పుకున్నా కూడా దాని ప్రాభవం తగ్గకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఎస్కే టీమ్ నిర్వహణ తీరు ఇందుకు కారణమని వివరించాయి. ‘‘మంచి బ్రాండ్స్ ఎలా వ్యవహరించాలన్నది సీఎస్కే చూపించింది. నిలకడగా రాణించడం, ప్రజల ఆప్యాయతను చూరగొనడం ఇలా అన్ని కీలకమైన అంశాల్లోనూ ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. పనితీరులో నిలకడగా రాణిస్తోంది. మిగతా బడా పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన టీమ్‌లను ధైర్యంగా ఎదుర్కొని, నిలబడగలుగుతోంది. పేరుకు చెన్నై సూపర్ కింగ్స్ అయినప్పటికీ చెన్నై పరిధిని దాటి దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడే టీమ్‌గా ఎదిగింది’’ అని పేర్కొన్నాయి. చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ షాక్