Siddham Sabha
-
వైయస్సార్సీపీ సిద్ధం సభలకు అమెరికా NRI ల సంఘీభావం !
ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో లాస్ ఏంజెల్స్, ఇర్విన్ పట్టణంలోని వైయస్సార్సీపీ అభిమానులు సమావేశమైనారు.,ఈ వారం రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులపై సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు .వాస్తవానికి గత అన్ని ప్రభుత్వాలకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించినప్పటికీ , ఆదాయ వనరులతో భావితరాల అభివృద్ధికి బాటలు పరిచినప్పటికీ, కేవలం సంక్షేమానికి సంబందించిన విషయాలు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందినందున, అభివృద్ధికి సంబంధించి మరింత అవగాహన కల్పించాలని తీర్మానించారు .ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ, వైయస్సార్సీపీ తాను చేసిన పనులను చెప్పుకుంటూ, ఓట్లను అభ్యర్థిస్తుండగా , ప్రతిపక్షాలు మాత్రం వారు గతంలో చేసిందేమీ లేక కేవలం తిట్లు , పరుషవాక్యాలతో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఈ వ్యత్యాసం గ్రహించలేని అజ్ఞానులు ఏమాత్రం కాదని , అది ఎన్నికల ఫలితాలలో నిరూపించబడుతుంది అన్నారు . -
YSRCP: మరో జైత్రయాత్రకు సిద్ధం
సాక్షి, గుంటూరు: ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు, 22 రోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని నిరూపించారాయన. ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారాయన. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభంఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్‌మ్యాప్‌కు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలోనే ఆయన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. -
గుడివాడ సిద్ధం సభలో సీఎం జగన్‌పై మరో దాడికి కుట్ర
కంకిపాడు: కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మరో దాడికి కుట్ర జరిగింది. విజయవాడలో శనివారం సీఎంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుడివాడలో సోమవారం మరోసారి దాడిచేసి, అల్లర్లు సృష్టించటమే లక్ష్యంగా టీడీపీ సానుభూతిపరుడు కుట్రపన్నాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేయత్నం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవటంతో కుట్రభగ్నమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన కోటా శరత్ అలియాస్ రాఘవులు మద్యం తాగి రాయితో సభా ప్రాంగణానికి ప్రవేశించే యత్నం చేశాడు. పోలీసులు శరత్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద రాయిని స్వా«దీనం చేసుకున్నారు. అతడు టీడీపీ సానుభూతిపరుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గుడివాడ పట్టణ పోలీసులు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారు. శరత్‌తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతిపరులు కూడా సిద్ధం సభకు వచి్చనట్లు పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించటం లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోను విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడిన మాట వాస్తవమే. సభలో అల్లర్లు, దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? కారణం ఏంటి? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం. – అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణాజిల్లా ఎస్పీ -
నంద్యాల సీఎం జగన్ సభకు భారీ ఏర్పాట్లు
-
సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్
-
Best Photos Of Siddham : మేమంతా సిద్ధం (ఫొటోలు)
-
మేమంతా సిద్ధం.. సీఎం జగన్ 21 రోజుల బస్సు యాత్ర
-
ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి
సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరుగుతున్నందున అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలన్నారు. తమ నియోజకవర్గపరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేలా అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. దీనిపై అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయాలని ప్రాంతీయ సమన్వయకర్తలను ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామన్నారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరిచి, వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని లక్ష్య నిర్దేశం చేశారు. ఈ దిశగా కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని, ఘన విజయాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలని సూచించారు. బస్సు యాత్రను విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. బస్సు యాత్రలో భాగంగా జరిగే సభలు.. సిద్ధం సభల తరహాలోనే చరిత్రాత్మకం కావాలని దిశా నిర్దేశం చేశారు. -
సీఎం జగన్ సక్సెస్ ఫార్ములా.. ప్రతిపక్షాల వెన్నులో వణుకు
-
‘సిద్ధం’ సభలపై ఎల్లో మీడియా ఏడ్చిచస్తోంది
మా చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటే ఒక్కడూ రాడా? అదే జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్దమా అంటే లక్షలాది మంది ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చి జయ జయ ధ్వానాలు పలుకుతారా? ఏంటీ అన్యాయం? ఏంటీ ఘోరం? అని తెలుగుదేశం-జనసేనలతో పాటు ఎల్లో మీడియా ఏడ్చిచస్తోంది. బాబు జేబు మీడియాల్లో ఒకటేమో అసలు జనమే రాలేదంది. ఇంకోటి అబ్బే వాళ్లు జనం కారు గ్రాఫిక్సే అని లోకేష్ చెప్పారంది. ఆ సభలకు ఇంత ఖర్చు అవసరమా అంది. వచ్చిన వాళ్లకి మూడుపూటలా భోజనాలు పెట్టేస్తున్నారని మరో ఏడుపు. ఇది భీమిలి సిద్ధం సభ. ఇదిగో ఇది దెందులూరులో జరిగిన రెండో సభ. ముచ్చటగా మూడోది అనంతపురం జిల్లా రాప్తాడు లోనిది. మొదటి మూడింటినీ తలన్నేసిన మేదరమెట్లలో జరిగిన నాలుగో సిద్ధం సభ. నాలుగు సభల్లోనూ జనసునామీలను చూశారు కదా. ఇంతమంది తరలి రావడం పచ్చ మందకు ఒక ఏడుపు అయితే వచ్చిన వారు తిన్నంగా కూర్చోకుండా జగన్ మోహన్ రెడ్డికి జై జై నినాదాలు కొట్టడం.. ఆయన ప్రసంగం చేసేటపుడు అడుగడుగునా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఎగిరి గంతులేస్తూ చేతులు ఊపుతూ జెండాలు రెపరెప లాడిస్తూ మహాజాతరను తలపించేలా వ్యవహరించడం పచ్చ బ్యాచ్‌కి అస్సలు నచ్చలేదు. అది వాళ్లకి జీర్ణం కాకుండా ఉంది. వాళ్లు అలా ఏడవడంలో అర్ధం కూడా ఉంది. లోకేష్ నిర్వహించే శంఖారావం సభలు చూశారుగా. జనం లేకుండా ఎలా వెలవెల బోతూ ఉంటాయో తెలుసు కదాచంద్రబాబు నాయుడు గొంతు చించుకుని రా కదలి రా బాబూ అని పిలిచినా జనం కుర్చీలు మడత పెట్టేసినట్లు అరకొరగా సభలో ఈసురోమంటూ కూర్చోవడాలు చూశారు కదా. తానొక్కడూ పిలిస్తే రావడం లేదని.. పవన్ కల్యాణ్ ను కూడా పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు తన పుత్రరత్నం లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో నిర్వహించిన బీసీ జయహో సభను చూశారు కదా. లక్షకు పైగా జనం వస్తారని టిడిపి నేతలు అంచనాలు వేసుకుంటే 12 వేల పైచిలుకు మంది మాత్రమే వచ్చిన దృశ్యం గుర్తుంది కదా. మంగళగిరి బీసీ జయహో సభ మంగళగిరిలో టిడిపి నిర్వహించింది బీసీల సభ. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే లక్షమందికి పైగా బీసీలు ఉంటారని అంచనా. ఇక క్రౌడ్ పుల్లర్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు కదా పవన్ అభిమానులు, ఆయన సామాజిక వర్గం ప్రజలూ కూడా తరలి వచ్చేస్తారు కదా అన్నది బాబు లెక్క. కానీ ఆ లెక్క తప్పేసింది. సభ చీదేసింది. బాబు మొహం మాడిపోయింది. పవన్ అహం దెబ్బతింది. లోకేష్ మొహం చిన్నబోయింది. టిడిపి నేతల్తో ఉన్న పిసరంత నమ్మకం కాస్తా పోయింది. రాసుకోడానికి ఎల్లో బ్యాచ్ కీ ఏమీ లేకుండా పోయింది. ఒకటి మన చంద్రబాబు మన పవన్ పెట్టిన సభలకు జనం రావడం లేదాయె.రెండోది జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా జన సునామీలు పోటెత్తుతున్నాయి.ప్రజలు ఇంత దారుణంగా తమని దూరం పెట్టేస్తే బాధగా ఉండదండీ? ఒళ్లు మండిపోదాండీ? పచ్చ పార్టీ ఇంత దైన్యంగా ఉంటే ఎల్లో మీడియాకు కడుపు మంట ఉండదాండీ?ఉంటుందుంటుంది. ఆ మంటతోనే ఈ రాతలు. రామోజీరావు పత్రికలో అయితే గ్రాఫిక్స్ అన్నారు. సరే గ్రాఫిక్స్ అయితే జనం లేనట్లే కదా. ఇక ఎల్లో వారికి ఇబ్బందేమిటి? వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేశారని నీచపు రాత రాయించారు రామోజీ. సిద్ధం సభలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తోంది కానీ..ప్రభుత్వానికి సంబంధం లేదు. అటువంటప్పుడు ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంది? ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రామోజీ పత్రిక నడిపేస్తున్నారు. ఏడుపులు అన్నీ ఇన్నీ కావు. వచ్చిన వారికి బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు ఇచ్చేస్తున్నారని రామోజీ రాసుకొచ్చారు. తమ సభలకు వచ్చిన వారికి కావల్సిన ఏర్పాట్లు చేయడం రాజకీయ పార్టీల బాధ్యత. గతంలో టిడిపి కూడా సభలు నిర్వహించింది. అప్పుడూ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. బాబు హయాంలో అయితే బిర్యానీ ప్యాకెట్టే కాదు మందు బాటిళ్లు కూడా ఇచ్చేవారు. మరప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతోందని ఎందుకు రాయలేదు? సిద్ధం సభలతో మామూలు ప్రయాణికులకు బస్సులు చాలాక ఇబ్బందులు పడ్డారని రాశారు. నిజమే కొన్ని బస్సులు తగ్గినపుడు ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే స్వాతంత్ర్యం వచ్చింది లగాయితు అన్ని రాజకీయ పార్టీల సభలకూ ఆర్టీసీ బస్సులను వాడుకున్న చరిత్రే ఉంది. అపుడూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు హాయంలో టిడిపి సభలకు ఆర్టీసీ బస్సులు కాకుండా బెంజ్ కార్లను వాడారా? విషయం ఏంటంటే ఇబ్బంది పడుతోంది జనం కాదు. రామోజీరావు.రాథాకృష్ణ. అండ్ అదర్ ఎల్లో మీడియాసే. కుత కుత లాడిపోతోంది టిడిపి,జనసేన అధినేతలే.వణికిపోతోంది టిడిపి-జనసేన శ్రేణులే.అయితే దానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదు. తమని జనం ఎందుకు దూరం పెట్టారో చంద్రబాబు పవన్ లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలను వాళ్లు దూరం పెట్టడంతోనే..ప్రజాసంక్షేమాన్ని వారు అడ్డుకుంటున్నారు కాబట్టే..పేదల కు దోచిపెట్టేస్తున్నారని గుక్క పెట్టి ఏడుస్తున్నారు కాబట్టే చంద్రబాబు, పవన్ లను జనం దూరం పెట్టారు. ఇంకా దూరం పెడతారు. రేపు ఎన్నికల్లో మరింత దూరం పెట్టడానికి ఏం చేయాలో అదీ చేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే ముందుగా ప్రజలను ప్రేమించడం నేర్చుకోవాలి. అది వదిలేసి మేం పెత్తందార్ల కొమ్ము కాస్తాం..పేదల పొట్ట కొడతాం.. అయినా అందరూ మా వెంటే ఉండాలంటే కుదిరేపని కాదని ఎల్లో జనం గ్రహించాలి. -
జగన్ అన్న కోసం యూకే సైన్యం సిద్ధం (ఫొటోలు)
-
రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని అడుగే ఇది
అసలు ఆ సభలు ఏమిటి? ఆ జనం ఏమిటి? ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీ రాజకీయాలు చూస్తున్న జర్నలిస్టులకు కూడా అంతు చిక్కని రీతిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్దం సభలు విజయవంతం అయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఏపీలో భారీ సభలు మొదలయ్యాయి. ప్రజా గర్జన పేరుతోనో, మరో పేరుతోను ఐదేళ్లకు ఒకసారి ఇలాంటి సభలు నిర్వహించేవారు. ఉదాహరణకు 1994 శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఒక సభ నిర్వహించారు. అప్పుడు తెలుగుదేశం నేతలు పోటీలు పడి ప్రజలను సమకీరించారు. ఇప్పుడు అలాంటి సభలు ఏకంగా నాలుగు నెలల్లో నాలుగు నిర్వహించడం అంటే తమాషా కాదు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి హేమాహేమీల వల్లే కాని పని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంత సునాయాసంగా చేసేస్తున్నారు! భీమిలి వద్ద జరిగిన సిద్దం సభ చూసిన తర్వాత జనంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికు బాగానే పలుకుబడి ఉంది.. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆయన జనాకర్షణ శక్తి తగ్గలేదులే అనుకున్నారు. దానిని మించి దెందులూరు సిద్దం సభ జరిగింది. తదుపరి రాయలసీమలో అనంతపురం వద్ద రాప్తాడు వద్ద ఊహించలేనంత జనంతో సిద్దం సభ జరిగింది. అంతటితో సభలు అయిపోయాయని అనుకుంటే, మళ్లీ దక్షిణ కోస్తాలో మేదరమెట్ట వద్ద అత్యంత భారీ ఎత్తున సభ జరిపారు. వీటన్నిటిలోను ఒకరే స్టార్ స్పీకర్. మిగిలిన నేతలు ప్రసంగాలు చేసినా, వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్ కోసమే అంతా ఎదురు చూపులు. సరిగ్గా చెప్పిన టైమ్ ప్రకారం నాలుగు గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రావడం, ప్రజలకు అభివాదం చేస్తూ రాంప్వ్యాక్ చేయడం, తదుపరి ప్రసంగం ఆరంభించి సుమారు గంట నుంచి గంటంబావు సేపు మాట్లాడడం.. ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతున్నాయి. వందల ఎకరాలలో సభలు పెట్టడం, వాహనాల పార్కింగ్ కోసమే వంద ఎకరాలు కేటాయించడం.. అయినా ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, అది మొత్తం క్లియర్అవడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటలు పట్టడం. పోని వచ్చిన జనం ఏదో వచ్చాంలే.. వెళ్లాంలే అన్నట్లు ఉంటున్నారా! ఊహూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పే ప్రతిమాటకు స్పందించడం, ఉర్రూతలూగడం, ఉత్సాహంతో ఉరకలెత్తడం.. నినాదాలు చేయడం.. ఐదేళ్ల అధికారం తర్వాత ఒక రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఇన్ని సభలను ఒక రాజకీయ పార్టీ పెట్టడం నేనైతే చూడలేదు. నలభైఆరు సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్న నాకు ఇదంతా కలయో, వైష్ణవ మాయో అన్నట్లుగా ఈ సభలు జరిగిపోయాయనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయా సందర్భాలలో ఒక ప్రశ్న వేస్తే చాలు.. సభలో ఉన్న జనమే సిద్దం..సిద్దం అని నినదించడం, అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్దమా అని అడగ్గానే అదే హోరు.. వందల కిలోమీటర్లను లెక్కపెట్టకుండా జనం తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటే ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలు రాకుండా ఎలా ఉంటాయి!. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఢిల్లీలో రోజుల తరబడి పడిగాపులు పడి ఉండడం, అంతకుముందు నెల రోజులకు పైగా బీజేపీ పెద్దల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తుండడం వంటి ఘట్టాలు గమనించాం. మరో వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరితో పొత్తులతో పని లేకుండా ఒంటరిగా ప్రజలే తన స్టార్ ప్రచారకర్తలు అంటూ ఈ స్థాయిలో సభలు పెడుతుంటే ప్రత్యర్దులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తక ఏమి అవుతుంది. కొద్ది రోజుల క్రితం తాడేపల్లిగూడెం వద్ద టీడీపీ, జనసేన పక్షాలు కలిసి నిర్వహించిన సభకు జనం కోసం కొన్ని గంటలు ఎదురు చూడవలసి వచ్చిందట. మరి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్దం సభలకు ఉదయం నుంచే జనం రావడం. ఒక వృద్ద మహిళ మేదరమెట్ల సభకు ఉదయం పది గంటలకల్లా వచ్చి కూర్చున్నారట. అదేమిటి అని తన మనవడిని చూడడానికి అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఉద్దేశించి అన్నారట. ఆ స్థాయిలో పేదల గుండెల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజంగానే స్థానం సంపాదించుకోవడం చరిత్రలో ఎన్నడూ చూడలేదనే చెప్పాలి. ఇంత భారీగా సభలు జరిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, వారి టీవీ మీడియాలలో ఏమని ప్రచారం చేస్తున్నారు? జనం లేరని, గ్రాఫిక్స్ వేసుకుంటున్నారని ఇలా ఏవేవో కుళ్లు వార్తలు ప్రచారం చేసి పరువు పోగొట్టుకున్నారు. టీవీలలో లైవ్ కవరేజీ ఇచ్చేటప్పుడు గ్రాఫిక్స్ వేయడం కుదరదన్న సంగతిని కూడా విస్మరించి అజ్ఞానంతో అబద్దాలు రాసేస్తున్నారు. వారి ద్వేషం ఆ స్థాయిలో ఉంది... టీడీపీ సభలలో చంద్రబాబు బోరు కొట్టించే ఉపన్యాసం వినలేక జనం మధ్యలో వెళ్లిపోతుంటే, దాని గురించి ఒక్క ముక్క రాయరు. బ్రహ్మాండంగా జరిగిన వైఎస్సార్సీపీ సభలపై మాత్రం విషం కక్కుతుంటారు. ఆర్టీసీ బస్‌లను వైఎస్సార్సీపీ వారు వాడితే ప్రయాణికులకు అసౌకర్యమట. అదే చిలకలూరిపేటలో టీడీపీ కూటమి నిర్వహించే సభకు ఆర్టీసీ వాహనాలు ఇస్తే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదట.. ఇది ఈనాడు దిక్కుమాలిన జర్నలిజం. ఏది ఏమైనా సభల స్టైల్లో కాని, జన సమీకరణలో కాని, వారికి సదుపాయాల కల్పనలో కాని, ఇతరత్రా అన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కచ్చితమైన ప్రమాణాలు నెలకొల్పడం విశేషం. అందువల్లే వచ్చిన జనం ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా సభలో పాల్గొని వెళుతుంటారు. ఈ నేపధ్యంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పొత్తు ప్రజలతోనేనని గర్వంగా ప్రకటించుకుంటున్నారు. చంద్రబాబు, పవన్‌లకు ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. ఒంటరిగా అయితే ఎట్టి పరిస్థితిలోను గెలవలేనన్న భయంతో చంద్రబాబు కాళ్లా, వేళ్లాపడి పొత్తులు పెట్టుకుంటున్నారు. అయినా వీరంతా కలిసినా వారికి వచ్చేది బండ సున్నానేనని వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమాగా సభలో చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇన్ని భారీ సభలు చేసిన తీరు కాని, అందులో ప్రసంగించిన వైనం కాని, దానికి ప్రజలు స్పందించిన విధానం కాని చూశాక వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమన్న విశ్వాసం కలుగుతుంది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలు ఆయనను ఓన్ చేసుకుంటున్న పద్దతి గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. ప్రజలకు పాలనలో విశేషమైన మార్పులు తెచ్చి అందిస్తున్న ఈ సేవలు కొనసాగాలంటే వైఎస్సార్సీపీ ఎన్నుకోక తప్పని అనివార్య పరిస్థితిని వైఎస్ జగన్మోహన్రెడ్డి సృష్టించుకోగలిగారంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘సిద్ధం’ సభలతో విపక్షాల్లో వణుకు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు భీమిలి, దెందులూరు, రాప్తాడులలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు ప్రజాసముద్రం పోటెత్తింది. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభగా రాప్తాడు సభ నిలిచింది. పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన తెచ్చేందుకు వైఎస్సార్సీపీని మళ్లీ గెలిపిచేందుకు సిద్ధమా అని సీఎం జగన్ పిలునిస్తే.. మేం సిద్ధమే అంటూ లక్షలాది మంది ఒక్కసారిగా పిడికిళ్లు పైకెత్తి మేం సిద్ధమే అంటూ చేసిన సింహనాదంతో దిక్కులు పిక్కటిల్లాయి. ఈ మూడు సభలు ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడం.. టీడీపీ–జనసేన పొత్తు లెక్కతేలాక తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేయడంతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తమకు ఘోర పరాజయం తప్పదనే భయంతో గజగజ వణికిపోయారు. ఎన్నికల్లో కనీసం ఉనికినైనా చాటుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ వెళ్లి కాళ్లబేరానికి దిగజారి బీజేపీతో జట్టు కట్టారు. ప్రభంజనాన్ని ముందే పసిగట్టి చౌకబారు డ్రామాలు.. మరోవైపు.. బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక ఆదివారం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం చివరి సభకూ లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని గ్రహించిన చంద్రబాబు తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టారు. సభా ప్రాంగణంలో ఉ.11 గంటలకు ముందు ఫొటోలు తీయించారు. ఆ తర్వాత.. నవ్విపోదురు గాక నా(రా)కేంటి సిగ్గు అనే రీతిలో జనం పలుచగా ఉన్నారని, సిద్ధం సభ ఫెయిల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పచ్చముఠా వీరంగం వేసింది. తండ్రికి తగ్గ తనయుడినని లోకేశ్ కూడా ఎక్కడా తగ్గకుండా చౌకబారు డ్రామాకు తెరతీసి రెచి్చపోయారు. ఇక సభకు హాజరయ్యే ప్రజలు కూర్చోవడం కోసం కింద గ్రీన్‌మ్యాట్ వేస్తే.. జనం హాజరుకాకున్నా హాజరైనట్లు చూపేలా గ్రాఫిక్స్ సృష్టించేందుకు వాటిని వేసినట్లు హోరెత్తించారు. అందుకే సభ ప్రత్యక్ష ప్రసారాలను 45 నిముషాలు ఆలస్యంగా ఇస్తున్నారంటూ ఇష్టమొచి్చనట్లు చౌకబారు ఆరోపణలు చేశారు. సభ పూర్తయిన తర్వాత ఉదయం తాము తీసిన ఫొటోలను గ్రాఫిక్స్ ద్వారా మాయచేసి జనం హాజరుకాకున్నా హాజరైనట్లు వైఎస్సార్సీపీ చిత్రీకరించిందంటూ ఎల్లో మీడియా శివాలెత్తింది. తద్వారా కూటమి శ్రేణులు డీలాపడకుండా చేసేందుకు ఈ ముఠా ఆపసోపాలు పడింది. లైవ్‌లో 1.50 కోట్ల వ్యూస్‌తో రికార్డు.. ఇక మేదరమెట్ల సిద్ధం సభకు దక్షిణ కోస్తాలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 44 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా. వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత రీతిలో జనంతో కిక్కిరిసిపోయింది. మేదరమెట్ల నుంచి రేణంగివరం మధ్య సుమారు 18 కిమీల పొడవున జనప్రవాహం కొనసాగడం.. కోల్‌కత–చెన్నై జాతీయ రహదారితోపాటు అద్దంకి–నార్కాట్‌పల్లి జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయాయి. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్, కేబుల్ టీవీలు, జాతీయ మీడియా ద్వారా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఇలా 1.50 కోట్ల వ్యూస్‌తో మేదరమెట్ల సభ చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేలడంతో కూటమి నేతలు వణికిపోతున్నారు. ఆ భయంతోనే ఎల్లో ముఠా ఇలా చీప్‌ట్రిక్స్ ప్రయోగిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
KSR Live Show: బాబుకి పొత్తులు..జగన్ కి ప్రజలు
-
Public Watching Siddham Meeting: ఊరు వాడ.. జగన్ కోసం జనం (ఫొటోలు)
-
తన మార్ఫింగ్ వీడియోపై అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
సీఎం జగన్ సిద్ధం ప్రజా అభిమానం..చంద్రబాబు గుండెల్లో దడ..
-
‘నా మనవడ్ని చూసేందుకు వచ్చాను’
బాపట్ల: మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. -
30 ఏళ్ళు మహానేతతో ఉన్న..సీఎం జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
అద్దంకి ప్రజలు భయపెడితే భయపడేవారు కాదు..టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్
-
ట్రెండ్ సృష్టించిన సీఎం జగన్..సిద్ధం తరహాలో సీఎం మమతా మీటింగ్
-
సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్..ఏడ్చి చస్తున్న ఎల్లో బ్యాచ్
-
చంద్రబాబుకి ఓటు వేస్తే..చంద్రముఖిని నిద్ర లేపినట్టే..
-
చరిత్ర సృష్టించిన సీఎం జగన్ నాలుగు సిద్ధం సభలు
-
రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ఓటు అనే అస్త్రం ప్రయోగించాలని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు.. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు పోటెత్తిన జనం..ఇంకా ఇతర అప్డేట్స్