Soha Ali Khan
-
‘హుష్.. హుష్’ అంటున్న బాలీవుడ్ భామలు(ఫొటోలు)
-
రామ్ జఠ్మలానీ బయోపిక్ తీస్తున్నాం: హీరోయిన్
ప్రముఖ న్యాయవాది దివంగత రామ్ జెఠ్మలానీ ఆత్మకథను తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ వెల్లడించారు. గత మూడేళ్లుగా వార్తల్లో ఉన్న ఈ బయోపిక్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంపూర్థ కుటుంబానికి అవసరమైన పోషకాహార ఉత్పత్తులపై కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత కొన్నేళ్లు అనుకుంటున్న రామ్ జెఠ్మలానీ బయోపిక్ స్క్రిప్ట్ పూర్త కావచ్చిందని, త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుందని నాయక పాత్రను తన భర్త నటుడు కునాల్ పోషించనున్నట్లు తెలిపారు. దాదాపు 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో ఉండి, అనేక మంది అతిరథ మహారథుల వంటి రాజకీయ నేతలు, క్రిమినల్స్‌కు వకల్తాగా, వ్యతిరేకంగా పని చేసిన జెఠ్మలానీ కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
వంటింటి చిట్కాలతో వింటర్ కష్టాలు పరార్: సోహా అలీఖాన్
బాలీవుడ్ తారల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ అందర్నీ ఆకట్టుకునే కొందరిలో సైఫ్ సోదరి నటి సోహా అలీఖాన్ కూడా ముందు వరుసలో ఉంటుంది. తాజాగా తన వర్కవుట్స్ వీడియోస్ ద్వారా ఈ మధ్య వయసు నటి అందర్నీ ఆకట్టుకున్న సోహా... సంప్రదాయ వైద్య చిట్కాలనే తాను ఫాలో అవుతానని అంటోంది. తన ఆరోగ్య రహస్యం అదేనని చెప్పిందీమె. ప్రస్తుత వింటర్ సీజన్‌ను ఎదుర్కోవడానికి ఫ్యాన్స్ కోసం కొన్ని టిప్స్ కూడా ఇస్తోంది. ఆమె ఏం చెప్తోందంటే... ‘వర్షాకాలం ముగియడం, శీతాకాలం ఆరంభం కావడం వంటి వాతావరణ మార్పుల కారణంగా దగ్గు, జలుబు లాంటి సమస్యలు అధికంగా కనిపిస్తుంటాయి. మన ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస ఆరోగ్యం నిర్వహించుకోవడంలో అత్యంత కీలకం ఇది. యోగా సాధన ఈ సీజన్లో చాలా మంచిది. వాతావరణంలో అకస్మాత్తుగా జరిగే మార్పులను తట్టుకుని నిలబడటానికి శరీరానికి కొంత సమయం ఇవ్వడం అవసరం. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు నేను మా పెద్ద వాళ్ల అడుగు జాడల్లో నడుస్తుంటాను. మా అమ్మ చిన్నప్పుడు మా కోసం చేసినట్టు.. విక్స్ వ్యాపోరబ్తో ఆవిరి పట్టడం, యూకలిప్టస్, కర్పూరం, పుదీనా వంటి వాటిని వంటింటి వైద్యంలో భాగంగా వినియోగించడం చేస్తాను. తగినంత వేడిగా ఉండే వంటకాలు, సీజన్‌కు తగ్గట్టుగా సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా శ్వాస కోస వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. నా కుమార్తె ఇన్నాయాతో కలిసి సూర్యాస్తమయం చూడటాన్ని అమితంగా ఇష్టపడతాను. అది కూడా నాకు చాలా రిలీఫ్ ఇస్తుంది’ అని తెలిపారు. -
ఆ సర్జరీ తర్వాత ‘ప్లాస్టిక్ చోప్రా’ అని వెక్కిరించేవారు
ఆకాశమంత జీవితం నిప్పై జ్వలిస్తుంది. నీరై ఎగసిపడుతుంది. ప్రభంజనమై గొంతెత్తుతుంది.ఎప్పడో శేషజీవితంలో పుస్తకం రాసుకుందాం లే...అనుకోకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు పుస్తకాలు రాస్తున్నారు. తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తున్నారు...పుస్తకం పంచభూతాల సమాహారం క్రాకింగ్ ది కోడ్ మై జర్నీ ఇన్ బాలీవుడ్ –ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా ఎవరు? అనగానే వచ్చే సమాధానం బ్యాక్–టు–బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరో అని! ఈయనలో మంచి రచయితను పరిచయం చేసిన పుస్తకం క్రాకింగ్ ది కోడ్. భార్య తహీర కష్యప్‌తో కలిసి ఈ పుస్తకం రాశారు. చండీగఢ్ నుంచి ముంబైకు ఎంత దూరమో తెలియదుగానీ ‘జీరో టు హీరో’కు మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అలా అని దూరభయంలోనే ఉంటే కలలు ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. ఈ విషయం తెలిసే తన కలల దారిని వెదుక్కుంటూ డ్రీమ్స్ సిటీ ముంబైకి వచ్చాడు ఖురాన. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలకు ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చాడు. ఫేమ్, మై భీ హీరో, మైనే స్ట్రగులర్ హుమ్, టికెట్ టు బాలీవుడ్...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యం. పుస్తకం నుంచి మంచి వాక్యం: మనలోని ‘నాకు అంతా తెలుసు’ అనే ద్వారం మూతపడితే తప్ప ‘తెలుసుకోవాలి’ అనే ద్వారం తెరుచుకోదు. ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్మోడరేట్లీ ఫేమస్ సోహా అలీ ఖాన్ పెద్ద మర్రిచెట్టు కింద చిన్న మొక్క కూడా మొలవదు అంటారు. అదేమిటోగానీ, ఆ పెద్ద నీడ మాటున ‘వ్యక్తిగత ప్రతిభ’ అనేది చాలాసార్లు చిన్నబోతుంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సినిమాల్లో నటిగా తన ప్రతిభ చాటుకున్న సోహా అలీఖాన్ చాలామంది దృష్టిలో పటౌడీ–షర్మిలా ఠాగూర్ల కూతురు మాత్రమే, ఇంకొందరి దృష్టిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సోదరి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని హాస్యధోరణిలో రాసి నవ్వించారు సోహా. తన స్కూల్, కాలేజీ జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఈనాటి సోషల్ మీడియా కల్చర్‌పై తనదైన శైలిలో రాశారు. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితం అయిదుసార్లు కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిల్చోవాలి.శక్తినంతా కూడదీసుకొని పోరాడాలి. అమ్మ మియా: ఇషా డియోల్ మాతృత్వం మధురిమపై ఇషా డియోల్ రాసిన అద్భుత పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు, ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్ పేరెంటింగ్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. స్థూలంగా చెప్పాలంటే న్యూ మదర్స్‌కు ఇదొక మంచి గైడ్‌లా ఉపకరిస్తుంది. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితంలో మంచి విషయాలు అంటే అనుకోకుండా ఎదురయ్యే ఆనందక్షణాలే! అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హాలీవుడ్ వరకు ఎదగడం సాధారణ విషయమేమీ కాదు. తన ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. తన ప్రస్థానంలో ఎదురైన అవమానాలు, చేసిన పోరాటాలను ‘అన్ఫిన్ఫినిష్డ్’లో రాశారు ప్రియాంక చోప్రా. ఒకానొక రోజు ప్రమాదవశాత్తు పెదవి తెగి రూపమే మారిపోయిన సందర్భంలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ‘ప్లాస్టిక్ చోప్రా’ అనే వెక్కిరింపులు ఎదురయ్యాయి. అయితే ఇవేమీ తన విజయానికి అడ్డుపడలేకపోయాయి. పుస్తకం నుంచి మంచి వాక్యం: నీలాంటి వ్యక్తి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నువ్వు మాత్రమే. నీ బలాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నువ్వు మాత్రమే! -
కరోనా నివారణకు సోహా అలీఖాన్ చిట్కాలు..
ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ నివారణకు బాలీవుడ్ సెలబ్రిటీలు అనేక చిట్కాలు చెబుతున్నారు. తాజాగా కరోనా నివారణకు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ కొన్ని చిట్కాలు చెప్పారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో ముఖ్యంగా మహిళలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. అందులో భాగంగా శరీరానికి విటమిన్లు లభించే ఆహారాలు తీసుకోవాలని కోరారు. అరటి పండ్లు, ఆల్మండ్లను నిత్యం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. త్వరలోనే ఓ భారీ సనిమాలో హీరోయిన్గా సోహా అలీఖాన్ నటించనున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాలు తెలిపాయి. -
అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్
ముంబై : లాక్డౌన్ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ , తన భార్య కరీనా కపూర్ ఖాన్, కొడుకు తైమూర్‌తో కలిసి ముంబైలోని ఇంట్లో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ను సమయాన్ని సైఫ్.. తన ముద్దుల కొడుకు తైమూర్‌కు తోట పని నేర్పించడం, కరీనాతో వంట చేయడం వంటి పనులతో బిజీగా గడుపుతున్నాడు. అయితే సైఫ్ తన తల్లి, సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోంది. దీంతో తన తల్లిని ఎంతగానో మిస్ అవుతున్నానని సైఫ్ అన్నారు. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ కాలంలో తన తల్లి షర్మిలాతోపాటు సోదరీమణులు(సాబా, సోహా)గురించి తనెంత ఆందోళన చెందుతున్నాడో వివరించాడు. (సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు..) "నేను నా తల్లి గురించి ఆందోళన చెందుతున్నాను, కానీ ఆమె చాలా తెలివైనది. ఆమె తన పూర్తి జీవితాన్ని అనుభవించానని. తన జీవితంపై ఎలాంటి విచారం లేదని చెప్పింది. నా తల్లి నుంచి ఇలాంటి మాటలు వినడం, ఆమె మాట్లాడిన తీరు నన్నుభయాందోళనకు గురిచేస్తోంది. అలాగే నా ఇద్దరు సోదరీమణులు సాబా, సోహాను మిస్ అవుతున్నాను. ప్రస్తుతం వారిని చూడలేకపోతున్నాను. కానీ మేము తరచుగా ఫోన్ కాల్ ద్వారా టచ్‌లో ఉంటున్నాం. ఆపద సమయంలో ఉన్నప్పుడు మనం అన్ని, అందరినీ వదులుకోవాల్సి వస్తుంది. అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సైఫ్ లాక్‌డౌన్‌ను 19 వ శతాబ్ధపు ఓడతో పోల్చారు. ఓడలో ఉన్నప్పుడు భూమిని దూరం నుంచి చూడొచ్చు. కానీ మీరు నీటిలీ భూమికి మైళ్ల దూరంలో ఉన్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనం దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు. స్నేహితులతో దగ్గరగా ఉండటానికి వీలవుతుంది.’’ అంటూ సైఫ్ చెప్పుకొచ్చారు. (ఇంగ్లాండ్ బోర్డింగ్ స్కూల్‌కు తైమూర్!) -
అవ్వలా కనిపిస్తోంది.. ఆ నటికి ఏమైంది?
సోహ అలీఖాన్‌కు ఏమైంది. ఆమె ఫొటోను చూసిన నెటిజన్లు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఒకప్పటి బాలీవుడ్ నటి, సైఫ్ అలీఖాన్ పటౌడీ సోదరి సోహ అలీఖాన్ తాజాగా తన ముద్దుల కూతురు ఇనాయ నౌమీ కేముతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. లండన్‌లోని రద్దీ వీధుల్లో తీసిన ఈ ఫొటోలో స్ట్రోలర్పై ఇనాయ క్యూట్‌గా ఏదో అడుతుండగా.. పక్కన సోహ ఉన్నారు. ప్రస్తుతం పటౌడీ కుటుంబమంతా లండన్‌లో విహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీఫుల్ ఫొటోలో సోహ లుక్‌పై నెటిజన్లు, ఆమె అభిమానులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ఆమె మరీ సన్నగా కనిపించడం, వయసైన వృద్ధురాలి తరహాలో ముఖంపై ముడతలు ఉండటంతో అభిమానులు సోహకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఆమె ముసలి అవ్వలా కనిపిస్తోందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా టెన్సన్ పడకండి.. ఆ టెన్షన్ ముఖంపై కనిపిస్తోందని మరికొందరు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. మరికొందరు ఒక ఫొటో ఆధారంగా ఇలా ట్రోల్ చేయడం సరికాదని, ఇది బాడీషేమింగ్గేనని అంటున్నారు. -
ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!
లండన్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ ప్రస్తుతం హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. సైఫీనా జంటతో పాటు సైఫ్ సోదరి సోహా అలీఖాన్ దంపతులు కూడా లండన్‌లో విహరిస్తున్నారు. ఇక వీరి వెంట స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, ఇనాయా కూడా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులతో కలిసి హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ చిన్నారుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. ‘ఎన్నాళ్లవుతుందో నిన్ను చూసి అనుకుంటూ ఇనాయా.. తైమూర్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హత్తుకుంది. ఈ చిన్నారుల అనుబంధాన్ని చూడండి’ అంటూ సోహా అలీఖాన్ వారి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందుకు బదులుగా... ‘పిల్లలు ఎంత ముద్దొస్తున్నారో..’ అంటూ బాలీవుడ్ స్టార్స్ నేహా ధూపియా, సోఫీ చౌదరిలు కామెంట్ చేయగా నెటిజన్లు వారి ప్రేమానురాగాలకు ఫిదా అవుతున్నారు. ‘మీ బంధాన్ని ఎవరూ విడదీయలేరు’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక... ‘పసిపిల్లలు ఎంతో బాగా కలిసిపోయారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ! కానీ కొన్నిసార్లు ఏం పట్టనట్టు ఉంటారు. మళ్లీ వారి ప్రపంచంలో మునిగిపోతారు. వాళ్లు ఆడుకుంటున్నప్పుడు ఇనాయా కొన్నిసార్లు తైమూర్ జుట్టును లాగి ఏడిపిస్తుంటుంది. తైమూర్ భరిస్తాడే తప్ప ఏమీ అనడు. తైమూర్ ఇనాయాను చాలా బాగా చూసుకుంటాడు. బహుశా వాడికి అప్పుడే తెలిసిపోయిందేమో మాది ఒకే కుటుంబమని..! ’ అంటూ సోహా తన మేనల్లుడి గురించి చెబుతూ మురిసిపోయిన సంగతి తెలిసిందే. -
అవకాశం వస్తే టాలీవుడ్లో నటిస్తా
సనత్‌నగర్: బాలీవుడ్ తార సోహా అలీఖాన్ బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో సందడి చేశారు. కంట్రీక్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘మిలీనియర్స్ క్లబ్’ను బుధవారం ఆమె ప్రారంభించారు. తనకు హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం ఉందని, నా బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచిందని చెప్పుకొచ్చారు. మా అత్త గారు ఇక్కడే బేగంపేటలో ఉండేవారని, తరచూ హైదరాబాద్ వస్తానన్నారు. అవకాశం వస్తే టాలీవుడ్లో నటిస్తానన్నారు. ఫ్యామిలీ క్లబ్బింగ్, హాలిడే, ఫిట్నెస్, లీజర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కంట్రీక్లబ్ ప్రపంచ వ్యాప్తంగా ల్యాండ్‌మార్క్‌గా మారిందన్నారు. ముంబయ్‌లోని కంట్రీక్లబ్‌కు తాను తరచూ వెళ్తుంటానని, తనకిష్టమైన చికెన్ టిక్కాను తింటానన్నారు. కంట్రీక్లబ్ సీఎండీ రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్ళలో ఒక మిలియన్ కుటుంబాలు కంట్రీక్లబ్‌లో సభ్యులుగా చేరతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
చాలెంజింగ్ పాత్ర..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ జీవితకథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్నది. ప్రముఖ నటి సోహా అలి ఖాన్ తన భర్త కునాల్ కెముతో కలసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ‘రెనగెడ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా సహ నిర్మాత. ఈ సినిమాలో కునాల్ కేము రాం జెఠ్మలానీ పాత్రను చేయబోతున్నారు. ఎంతో చాలెంజ్‌గా తీసుకొని.. ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని సోహా అలీఖాన్ తెలిపారు. జెఠ్మాలనీ వయసు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆయన తన 70 ఏళ్ల వృత్తిజీవితంలో ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి కరుడుగట్టిన నేరస్తుల వరకు ఎన్నో సంచలన కేసులను వాదించారని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి పూర్తి జీవితాన్ని తాము కేవలం రెండున్నర గంటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ ముఖ్యమైన అంశాలను తెరకెక్కిస్తామన్నారు. స్క్రిప్ట్, దర్శకుడు ఫైనల్ అవ్వగానే సెట్స్ మీదకు వెళ్తామన్నారు. -
అమ్మగా ప్రమోట్ అయిన బాలీవుడ్ నటి
సాక్షి, ముంబై : బాలీవుడ్ జంట కునాల్ ఖేము, సోహా అలీఖాన్‌ల నివాసంలో విజయదశమి పండుగ ముందే వచ్చేసింది. సోహా శుక్రవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కునాల్ ఖేమ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, మహార్నవమి రోజున పుట్టిన తన చిన్నారికి ప్రేమ, ఆశీస్సులు అందించిన అందరికీ అతడు ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తాయి. సోహా అలీఖాన్, కునాల్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. We are over the moon to share we have been blessed with a beautiful baby girl on this auspicious day Thank you for the love&blessings — kunal kemmu (@kunalkemmu) 29 September 2017 -
'తను తప్పు చేసిందని అనుకోవడం లేదు'
ముంబయి: ప్రముఖ నటి సోహా అలీ ఖాన్‌కు మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ అండగా నిలిచారు. ఆమె చీరకట్టుకోవడంలో తప్పేముందని అన్నారు. సోహా ఏ తప్పు చేసినట్లు తనకు అనిపించడం లేదని దన్నుగా నిలిచారు. బాలీవుడ్ నటి అయిన సోహా అలీఖాన్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. గర్భవతి అయిన ఆమెకు ఇంట్లో సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోహా అలీఖాన్ ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇళ్లంతా అలకరించిన బెలూన్ల నడుమ.. గులాబీ రంగు చీర కట్టుకొని, భర్త , ఆమె భర్త కునాల్ ఖేముతో దిగిన ఫొటోను ఆమె పోస్టు చేసింది. అయితే, ఆమెచీర కట్టుకొని, బొట్టు పెట్టుకున్నందుకు విమర్శలు చేశారు. ముస్లిం మతంలో నుంచి హిందువుగా మారిపోయావా అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన టైగర్ ష్రాఫ్.. 'ప్రతి ఒక్కరికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. తమకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో దాని ప్రకారం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సోహా అందరూ గర్వించదగిన నటి, పౌరురాలు. ఆమెకు నచ్చినది ఏదో ధరించినంతమాత్రానా ఆమె తప్పు చేసిందని నేను అనుకోవడం లేదు.. కానీ, ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది' అని అన్నారు. అదే సమయంలో తాను నటిస్తున్న మున్నా మైఖెల్ చిత్రం గురించి స్పందిస్తూ 'నేను చాలా అసంతృప్తితో ఉన్నాను. నా మూడో చిత్రం ద్వారానైనా నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను' అని చెప్పారు. -
చీర కట్టుకున్నదని నటిని తిట్టేశారు!
బాలీవుడ్ నటి సోహా అలీఖాన్, ఆమె భర్త కునాల్ ఖేము త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గర్భవతి అయిన ఆమెకు తమ ఇంట్లో సంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోహా అలీఖాన్ ట్విట్టర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇళ్లంతా అలకరించిన బెలూన్ల నడుమ.. గులాబీ రంగు చీర కట్టుకొని, భర్తతో దిగిన ఫొటోను ఆమె పోస్టు చేసింది. ఆమె ఇలా ఫొటోలు పెట్టిన కాసేపటికే.. కొందరు విద్వేషకులు ఆమెపై మండిపడ్డారు. సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకున్నందుకు ఆమె తీరుపై విమర్శలు గుప్పించారు. ఆమె ఇక ఎంతమాత్రం ముస్లిం కాదంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఆమె తన శ్రీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. రంజాన్ ఈద్ సందర్భంగా ఈ ఫొటోలు పెట్టారంటూ కొందరు నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కొందరు నెటిజన్లు ఆమె హిందూమతంలోకి మారిందంటూ విమర్శించారు. కాగా, పలువురు నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. ఈ ఫొటోలకు మతానికి ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి వైఖరితోనే ఇస్లాం మతంపై తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చీర కట్టుకోవడం భారతీయ సంప్రదాయం అని, దీనిని మతకోణంలో చూడొద్దంటూ హితవు పలుకుతున్నారు. It isn't a party without balloons 🎈! pic.twitter.com/VjWnntegjS — Soha Ali Khan (@sakpataudi) 27 June 2017 The love of family and friends is reason enough to dress up 💕 pic.twitter.com/7UP6YMU7UM — Soha Ali Khan (@sakpataudi) 28 June 2017 so finally you have become a hindu — Rizwan Khan (@rizwan_khan1012) 28 June 2017 I wll not abuse,But Ppl like u are responsible ,y Islam is being Blamed.for godsake come out of this mentality @SahilThoughts @purujimishra — Legion's Guru (@Avishal9) 28 June 2017 -
మాకు పనీపాటా లేక కాదు..!
బాలీవుడ్ కథానాయికలు ఇప్పుడు నిర్మాతలుగా మారడం ఓ ట్రెండ్ అయింది. ఇప్పటికే దియా మీర్జా, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ వంటి తారలు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వీళ్ల లిస్ట్‌లో సోహా అలీఖాన్ కూడా చేరారు. తన భర్త కునాల్ ఖేమూతో కలిసి ఆమె సినిమాలు నిర్మించనున్నారు. తొలి ప్రయత్నంగా ఓ లివింగ్ లెజెండ్ జీవితం ఆధారంగా సినిమా నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఆ లెజెండ్ సినీ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ‘‘మాకు పనీపాటా లేకపోవడం వల్ల నిర్మాతలుగా మారలేదు. మేం నిర్మించే సినిమాల్లో మేం నటించం. కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలనే సంకల్పంతోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాం’’ అని సోహా పేర్కొన్నారు. -
ఓ నిజమైన కథ!
భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ డైనమిక్ లేడీ అనిపించుకున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంగ రక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆమె మరణించిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఇందిరా గాంధీ చనిపోయి ఇప్పటికి 32 ఏళ్లవు తోంది. ఆమె చనిపోయిన అనంతరం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే కథాంశంతో ‘థర్టీ ఫస్ట్ అక్టోబర్’ పేరుతో శివాజీ లోథన్ పాటిల్ దర్శకత్వంలో హ్యారీ సచ్దేవ్ సినిమా నిర్మించారు. ‘ఎ ట్రూ స్టోరి’ అనేది ఉపశీర్షిక. వీర్ దాస్, సోహా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంది. పలు సన్నివేశాలకు కట్ చెప్పడంతో రివైజింగ్ కమిటీకి కూడా పంపించారు. అక్కడ పలు కత్తెర్లు సూచించగా, వాటిని తీసేసి మళ్లీ పంపించడం, ఆ తర్వాత ఇంకొన్ని మార్పులు చెప్పడం, అవి చేసి మళ్లీ సెన్సార్ బోర్డ్ కమిటీకి పంపించడం.. మొత్తం మీద దర్శక-నిర్మాతలు చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాగైతేనేం సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమా విడుదలకు ఆమోదం పొందారు. ‘‘తొమ్మిది కట్స్ చెప్పారు. ‘సాలా’ అనే డైలాగ్‌ని, మరికొన్ని డైలాగ్స్‌నీ తీసేయమన్నారు. ఆ డైలాగ్స్ వచ్చే చోట మ్యూట్ చేశాం. కొన్ని సీన్స్ తీసేస్తే, కథకు న్యాయం జరగదని చెప్పడంతో కన్విన్స్ అయ్యారు. వచ్చే నెల విడుదల చేస్తాం’’ అని దర్శక-నిర్మాతలు చెప్పారు. 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత జరిగిన మత కల్లోలాలను ధైర్యంగా ఎదుర్కొన్న తేజీందర్ కౌర్ పాత్రను సోహా చేశారు. ఆమె భర్త దేవేందర్ సింగ్ పాత్రను వీర్ దాస్ చేశారు. -
'నీకు ఆర్బీఐ ఫుల్ ఫామ్ తెలుసా'.. నటిపై మండిపాటు!
ఆర్బీఐ గవర్నర్ పదవిలో రెండో టర్మ్ కొనసాగబోనని రఘురామ్ రాజన్ స్పష్టంచేయడంతో ఈ విషయమై ఆన్ లైన్ లో పెద్ద చర్చే నడుస్తోంది. రఘురాం రాజన్ నిర్ణయంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండో పర్యాయం కూడా ఆయన ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలన్న నెటిజన్లకు తాజాగా బాలీవుడ్ నటి సోహ ఆలి ఖాన్ గొంతు కలిపింది. రాజన్ నిర్ణయం దేశానికి తీవ్ర నష్టమని పేర్కొంది. 'ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి రాజన్ తప్పుకునేలా బలవంత పెట్టారు. ఇది దేశానికి తీవ్ర నష్టం. ఇది సిగ్గుపడాల్సిన విషయం' అంటూ సైఫ్ ఆలిఖాన్ సోదరి అయిన సోహ ట్వీట్ చేసింది. ఆమె వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. సోహా ఆలిఖాన్ కు ఆర్థిక శాస్త్రంపై అవగాహన ఉందా? కనీసం ఆమెకు ఆర్బీఐ పూర్తి పేరు (ఫుల్ ఫామ్) అయినా తెలుసా? ఎలాంటి పరిజ్ఞానం, సమాచారం లేకుండా రాజన్ ను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకునేలా బలవంతపెట్టారని విమర్శించడం ఎంతవరకు సబబు అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి సోహాకు ఏం తెలుసు అని పలువురు ప్రశ్నించగా.. మరికొందరు నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసిన సోహాకు దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడే అర్హత ఉందని, ఆమె వ్యాఖ్యలను విమర్శించడం సరికాదని ఆమెకు మద్దతు పలికారు. -
అప్పుడే కదా ఫ్యామిలీలో హ్యాపీ
బాలీవుడ్ అందాల తార సోహా అలీఖాన్ నగరంలో తళుక్కుమన్నారు. తన తల్లి, అలనాటి అందాల నటి షర్మిలా ఠాగూర్‌తో కలిసి గురువారం నగరంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. శ్రీనగర్‌కాలనీ: సమానత్వం మా ఇంట్లో ఉంటుందని, తన భర్త పటౌడి లాండ్రీ బాగా చేస్తారని అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్ కితాబివ్వగా కూతురు హీరోయిన్ సోహా అలీఖాన్ అవునంటూ చమత్కరించారు. గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్‌దక్కన్‌లో ఏరియల్-వర్ల్‌పూల్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న డాడ్స్ టు షేర్ ద లోడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమానత్వం కోసం, తండ్రులకు భారాన్ని తగ్గించి వారికి తోడుగా ఉండేలా చేస్తూ విలువలను కాపాడే ప్రయత్నమే ఈ కార్యక్రమమని, ఇందులో తాను, అమ్మ భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని నటి సోహా అలీఖాన్ అన్నారు. ఇంటి పనులు కేవలం ఆడవారే చేయాలనే అపోహ దేశంలో ఉందని, అలాకాకుండా ఆ భారాన్ని మగవారు కూడా పంచుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. పిల్లలు సైతం చిన్నతనం నుండే ఈ విధానానికి అలవాటుపడతారని నటి షర్మిలా ఠాగూర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా షేర్ ద లోడ్ ప్యాక్‌ను ఆవిష్కరించారు. -
తాము విడిపోవడం లేదంటున్న బాలీవుడ్ జంట
ముంబై: బాలీవుడ్లో ఇటీవల విడాకుల సీజన్ నడుస్తోంది. విబేధాల కారణంగా ఇటీవల కొన్ని జంటలు విడిపోయాయి. తాజాగా బాలీవుడ్ జంట హీరో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్, నటుడు కునాల్ కెమ్ము విడిపోతున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కునాల్ స్పందిస్తూ.. తమకు విడిపోవాలనే ఆలోచనే లేదని చెప్పాడు. 'మా వివాహ బంధం చిక్కుల్లో పడిందా? నేను విడాకులు తీసుకోబోతున్నానా? కొంతమంది లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. నా భార్య నుంచి విడిపోవడం లేదు' అంటూ కునాల్ ట్వీట్ చేశాడు. 2014లో కునాల్, సోహాలకు పారిస్‌లో నిశ్చితార్థం జరిగింది. గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ జంట సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్లు విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరమూ విడిపోతున్నామంటూ మలైకా, అర్బాజ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మరో నటి కరిష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్‌తో విడాకుల విషయంలో ఒప్పందం చేసుకుంది. -
అక్టోబర్ 4 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సంఘవి (నటి), సోహా అలీఖాన్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వ ఆస్తిపాస్తులు చేతికి అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరతాయి. కోర్టుకేసుల నుండి విముక్తి లభిస్తుంది. వివాదాలలో చిక్కుకున్న ఆస్తులను గెలుచుకుంటారు. అయితే న్యాయసంబంధమైన, చట్టసంబంధమైన వివాదాలలో ఇరుక్కుంటే వాటినుంచి బయట పడటం అంత సులభం కాదు కాబట్టి రాజీ ధోరణి మంచిది. మేనేజ్మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు, ఫైనాన్స్ రంగ ంలోని వారికి బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ తమ రంగాలలో బాగా పుంజుకుంటారు. మీరు పుట్టిన తేదీ 4. ఇది కూడా రాహు సంఖ్య కావడం వల్ల కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. లక్కీ నంబర్లు: 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, బ్లూ, వయోలెట్, గ్రీన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
మొదట డిటెక్టివ్ కావాలనుకున్నా : సోహా
హైదరాబాద్ : ‘మొదట నేను డిటెక్టివ్ కావాలనుకున్నట్లు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ తెలిపింది. 'యుక్త వయసులో లాయర్ కావాలనుకున్నా. ఇంకా ఏవేవో చేయాలనుకున్నా. రాయాలని కూడా అనుకున్నా. చివరికి నటినయ్యా. సిటీబ్యాంక్‌లో ఏడాదిన్నర పాటు పనిచేసిన తర్వాత నేను సినిమాల్లోకి వచ్చా. ఒకప్పుడు సినిమా అంటే ఏముంది? పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం.. అంతే కదా అనుకున్నా. నటించడం మొదలుపెట్టాక నా ఆలోచన మారింది. మనలోని ప్రతిభను వెలికితీసే నటనకు అవకాశం ఇచ్చే పాత్రలు కూడా ఉన్నాయని గుర్తిస్తున్నాను. షర్మిల తల్లి పాత్రలు చేసిన సినిమాలన్నింటిలోనూ చనిపోతుంది. నిజానికి ప్రేక్షకులు కూడా అదే కోరుకున్నారు. అయితే, తల్లిపాత్రలు చేయడంలో ఎటువంటి నష్టం కలగదనే విషయంలో ఆమెతో నేను అంగీకరిస్తాను. ఈ ఏడాది అక్టోబరు 30న రిలీజ్ అవుతున్న నా సినిమాలో నేను ముగ్గురు బిడ్డల తల్లిగా చేస్తున్నా. చాలా మంది యువకులు తాము అభిమానించేలా యుక్తవయసు మహిళలనే తెరపై చూడాలని కోరుకుంటారు. అలాంటి యవతులతో మాత్రమే ఫాంటసైజ్ చేసుకుంటారనేది నిజం (నవ్వు). ఏదేమైనా మన దేశం రెండు రకాల కాలాల్లో జీవిస్తోంది. ఒకటేమో 12వ శతాబ్ధంలో అయితే, మరొకటి ఆధునిక భారతదేశాన్ని నడిపిస్తోంది. ఈ రెండు యుగాల మనస్తత్వాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లగలిగే సత్తా మన మహిళలకు ఉంది’ పేర్కొంది. బుధవారం హైదరాబాద్ నగరంలోని యంగ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలబ్రేట్ ఉమెన్హుడ్ కార్యక్రమంలో తల్లీ షర్మిలా ఠాగూర్, సోహా అలీఖాన్ పాల్గొన్నారు. -
నటించడం మొదలెట్టాక నా ఆలోచన మారింది
సోహా అలీఖాన్ ‘మొదట నేను డిటెక్టివ్ కావాలనుకున్నాను. యుక్త వయసులో లాయర్ కావాలనుకున్నా. ఇంకా ఏవేవో చేయాలనుకున్నా. రాయాలని కూడా అనుకున్నా. చివరికి నటినయ్యా. సిటీబ్యాంక్‌లో ఏడాదిన్నర పాటు పనిచేసిన తర్వాత నేను సినిమాల్లోకి వచ్చా. ఒకప్పుడు సినిమా అంటే ఏముంది? పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం.. అంతే కదా అనుకున్నా. నటించడం మొదలుపెట్టాక నా ఆలోచన మారింది. మనలోని ప్రతిభను వెలికితీసే నటనకు అవకాశం ఇచ్చే పాత్రలు కూడా ఉన్నాయని గుర్తిస్తున్నాను. షర్మిల తల్లి పాత్రలు చేసిన సినిమాలన్నింటిలోనూ చనిపోతుంది. నిజానికి ప్రేక్షకులు కూడా అదే కోరుకున్నారు. అయితే, తల్లిపాత్రలు చేయడంలో ఎటువంటి నష్టం కలగదనే విషయంలో ఆమెతో నేను అంగీకరిస్తాను. ఈ ఏడాది అక్టోబరు 30న రిలీజ్ అవుతున్న నా సినిమాలో నేను ముగ్గురు బిడ్డల తల్లిగా చేస్తున్నా. చాలా మంది యువకులు తాము అభిమానించేలా యుక్తవయసు మహిళలనే తెరపై చూడాలని కోరుకుంటారు. అలాంటి యవతులతో మాత్రమే ఫాంటసైజ్ చేసుకుంటారనేది నిజం (నవ్వు). ఏదేమైనా మన దేశం రెండు రకాల కాలాల్లో జీవిస్తోంది. ఒకటేమో 12వ శతాబ్ధంలో అయితే, మరొకటి ఆధునిక భారతదేశాన్ని నడిపిస్తోంది. ఈ రెండు యుగాల మనస్తత్వాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లగలిగే సత్తా మన మహిళలకు ఉంది’. -
మితంగానా? సన్నీహితంగానా?
ఒకనాటి సూపర్‌హిట్ ఘాయల్కి సీక్వెల్ తీస్తున్నాడు సన్నీ డియోల్. ఘాయల్ వన్స్ అగైన్ పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో సన్నీడియోల్తో సైఫ్ సోదరి, రంగ్ దే బసంతిలో సిద్ధార్ధతో జోడీ కట్టిన సోహా అలీఖాన్ నటిస్తోంది. ఇందులో సైకియాట్రిస్ట్ పాత్ర పోషిస్తున్న సోహాకి, సన్నీడియోల్‌కి మధ్య కధలో సందర్భానుసారం వచ్చే కొన్ని శృంగార సన్నివేశాలు ఉన్నాయట. ఇంకా చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉన్న ఆ హాట్ సీన్ల గురించి 36 ఏళ్ల సోహా అలీఖాన్ ఇప్పటి నుంచి నెర్వస్‌గా ఫీలవుతోందట. సన్నీడియోల్ వంటి సీనియర్ నటుడితో నటించడం అనేది ఓ వైపు ఆనందంగానే అనిపిస్తున్నా... అదే సమయంలో సదరు సన్నివేశాల్లో ఎలా నటిస్తానో అనే ఆందోళన తనకు ఉందని సన్నిహితుల వద్ద ఓపెన్ అవుతోందట సోహా. మరో విషయమేమిటంటే... సోహా భర్త కునాల్ ఖేము కూడా నటుడే. నాటి హీరో ధర్మేంద్ర దర్శకత్వంలో రూపొందుతూ, నవంబరులో విడుదల కానున్న ‘ఘాయల్ వన్స్‌మోర్’ ప్రేక్షకుల ముందుకు వస్తే కానీ... సోహా అలీఖాన్ నెర్వస్‌నెస్‌ను తగ్గించుకోగలిగిందా లేదా అనేది మనకి తెలియదు. -
సివంగీ...స్
పోలీస్ పాత్రల్లో కనబడ్డ నలుగురు సివంగులు ఈ బాలీవుడ్ భామలను అందరూ గ్లామర్ డాల్స్ అంటారు. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటారు అనుకుంటారు. కానీ ఒక్కసారి వీళ్లని ఖాకీ డ్రెస్సులో చూస్తే తెలుస్తుంది... వారిలో ఎంత కరకుదనం ఉందో! బిపాసా బసు... గ్లామర్ క్వీన్. హాట్ బ్యూటీ. అందాలతో మత్తెక్కిస్తుంది. సోయగాలతో మైమరపిస్తుంది. ‘గునాహ్’ సినిమా చూసేవరకూ ఇలాగే మాట్లాడుకున్నారు బిప్స్ గురించి. కానీ ఆ సినిమాలో యూనిఫామ్‌లో రఫ్‌గా కనిపించిన ఆమెను చూసి గతుక్కుమన్నారు. సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా హుందాగా కనిపించిన బిపాసాను చూసి సూపర్బ అన్నారు. ఆ తర్వాత ‘ధూమ్ 2’లో కూడా పోలీసు పాత్రలో నటించి మెప్పించింది బిప్స్! సోహా అలీ ఖాన్ అమ్మ షర్మిలా ఠాగూర్ అందాన్ని, అన్న సైఫ్ అలీ ఖాన్ స్టైల్‌ని పుణికి పుచ్చుకుంది సోహా అలీ ఖాన్. కొత్త కొత్త ఫ్యాషన్లను అనుసరించడం, వీలైనంత గ్లామరస్‌గా కనిపించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పని. కానీ ‘మిస్టర్ జో భీ కర్వాలో’ చిత్రం చూస్తే ఈమె సోహాయేనా అనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ శాంతిప్రియా ఫడ్నిస్గా యూనిఫామ్‌లో ఎంతో డిఫరెంట్‌గా కనిపిస్తుంది సోహా. తుపాకులు పేలుస్తూ, రౌడీల మక్కెలు విరగదన్నుతూ యాక్షన్ హీరోలను మరిపించింది. ఇషా గుప్తా హాలీవుడ్ నటి ఏంజిలీనా జోలీకి చెల్లెలేమో అనిపిస్తుంది ఇషా గుప్తాని చూస్తే. తన గ్లామర్‌తో బాలీవుడ్ వారి మతులు పోగొట్టేసిన ఈ సుంద రాంగికి పోలీసు పాత్రలో నటించాలనేది డ్రీమ్. ఆ కలను ‘చక్రవ్యూహ్’ సినిమా తీర్చింది. అందులో ఐపీఎస్ ఆఫీసర్ రియా మీనన్‌గా జీవించి మార్కులు కొట్టేసింది ఇషా. చాన్స్ దొరికితే మళ్లీ యూనిఫామ్ వేయడానికి రెడీ అనేంత పిచ్చి ఆమెకు పోలీసు పాత్ర అంటే! షమితాశెట్టి ‘మొహొబ్బతే’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శిల్పాశెట్టి చెల్లెలు షమితాశెట్టి. కానీ పాపం కెరీర్ అనుకున్నంతగా సాగలేదు. పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే తన పేరు చెబితే గుర్తొచ్చే పాత్రలు కొన్ని చేసింది షమిత. ‘క్యాష్’, ‘జెహెర్’ చిత్రాల్లో స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీసా ఫీరుగా ఆమె నటనను మెచ్చుకుని తీరాలి. ఓ పక్క కూల్‌గా కనిపిస్తూనే ఖాకీ డ్రెస్సులో కరకుదనాన్ని ప్రదర్శించి అదరగొట్టేసింది! -
బెని‘గిఫ్ట్’!
పెళ్లొకరిది... గిఫ్ట్ ఇంకొకరిదంటే ఇదే మరి! ఆడపడచు సోహా అలీఖాన్ మెహందీ ఫంక్షన్లో బాలీవుడ్ కలల రాణి కరీనా కపూర్‌కు ఓ అపురూప బహుమతి దక్కింది. ఇచ్చింది కూడా తన అక్క కరిష్మానే! సోహా మెహందీ సందర్భంగా... వారసత్వంగా వస్తున్న అమ్మమ్మ కృష్ణారాజ్‌కపూర్ రింగ్‌ను చెల్లికి మురిపెంగా ప్రజెంట్ చేసింది కరిష్మా. ఈ ఉంగరాన్ని ఇరవై ఏళ్ల కిందట కృష్ణ... కరిష్మాకు ఇచ్చిందట. ప్రస్తుతం కరణ్‌జోహార్ చిత్రం షూటింగ్లో క్షణం తీరిక లేకుండా ఉన్న కరీనా... సోహా ఫంక్షన్‌కు వచ్చి వెళ్లిపోయిందట. ఈ కార్యక్రమంలో అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా ఎంతో ఆప్యాయంగా గడిపారనేది ఓ వెబ్సైట్ కథనం. -
ఒక్కటైన కునాల్, సోహా