started
-
అప్పుడే దీపావళి షాపింగ్ షురూ చేసిన నటి (ఫొటోలు)
-
హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లాహౌల్ స్పితి జిల్లా కుకుమ్సేరిలో కనిష్ట ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్. గరిష్ట- కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఏర్పడిన వ్యత్యాసం పలువురికి అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. పగటిపూట ఎండవేడిమి, సాయంత్రం వీచే చల్లని గాలి వ్యాధులకు కారణంగా నిలుస్తోంది.సిమ్లా వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 17 వరకు వాతావరణం నిర్మలంగా ఉండనుంది. అంటే వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన మొదలైనవి ఉండవు. మరోవైపు కిన్నౌర్ జిల్లా కల్పాలో తేలికపాటి వర్షం నమోదైంది. ధర్మశాలలోని ధౌలాధర్ పర్వతాలపై కూడా తేలికపాటి హిమపాతం కనిపించింది.దీనిని ఈ సీజన్లో మొదటి హిమపాతంగా చెబుతున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని కుకుమ్సేరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 2.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉనాలో అత్యధికంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిమ్లాలో 23.8 డిగ్రీలు, కల్పాలో 21.8 డిగ్రీలు, ధర్మశాలలో 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది కూడా చదవండి: ఎయిరిండియా విమానంలో బాంబు? -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు
త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఆదివారం జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, అధికారులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సమావేశంలో బీజేపీ నేతలు అభినందనలు తెలియజేయనున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చర్యలను ఖండిస్తూ, పలు రాజకీయ తీర్మానాలను కూడా ఆమోదించనున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 2025 మొదట్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. -
హజ్‌యాత్రలో అంతిమ ఘట్టం షురూ
సౌదీ అరేబియాలో లక్షలాది మంది ముస్లిం యాత్రికులు ఆదివారం నాడు సైతానును రాళ్లతో కొట్టి చంపే ఆచారాన్ని ప్రారంభించారు. ఈ ఆచారం హజ్‌యాత్ర చివరి రోజులలో నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన ఈద్ అల్-అధా వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది.సైతాను(దుష్టశక్తి)ను రాళ్లతో కొట్టడం అనేది ఇస్లాంలోని ఐదు ప్రముఖ ఆచారాలలో ఒకటి. ఇది హజ్‌యాత్రలో చివరి ఆచారం. పవిత్ర నగరం మక్కా వెలుపల ఉన్న అరాఫత్ పర్వతం వద్ద లక్షలమంది ముస్లిం యాత్రికులు గుమిగూడి ఈ ఆచారాన్ని నెరవేరుస్తారు. ఐదు రోజుల పాటు ఈ హజ్ ఆచారం కొనసాగుతుంది.యాత్రికులు శనివారం సాయంత్రం ముజ్దలిఫా అనే ప్రదేశంలో గులకరాళ్లను సేకరించారు. వీటితో సైతానుకు ప్రతీకంగా నిలిచిన స్తంభాలను కొడతారు . ఈ స్తంభాలు మక్కాలో మీనా అనే పవిత్ర స్థలంలో ఉన్నాయి.హజ్‌కు వచ్చే యాత్రికులు మూడు రోజుల పాటు మీనాలో ఉంటారు. అక్కడ నుండి వారు భారీ స్తంభాలు కలిగిన బహుళ అంతస్తుల సముదాయానికి వెళ్తారు. యాత్రికులు ఇక్కడి మూడు స్తంభాలను ఏడు గులకరాళ్లతో కొడతారు. దీనిని వారు చెడును తరిమికొట్టడానికి చిహ్నంగా పరిగణిస్తారు. అనంతరం మీనా నుండి మక్కా చేరుకునే ముస్లింలు అక్కడ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు. -
‘చార్ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు?
చార్ధామ్ యాత్ర సాఫీగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలించడం లేదు. దీంతో చాలా మంది భక్తులు యాత్ర చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు రిషికేశ్ నుండి తిరుగుబాట పట్టారని సమాచారం. ఉత్తరాఖండ్‌కు చేరుకున్న తరువాత కూడా చార్ధామ్ యాత్ర చేయలేకపోవడం విచారకరమని వారు వాపోతున్నారు. యాత్రకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయడంతోనే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆపివేసిన నేపధ్యంలో సుమారు 12 వేల మంది యాత్రికులకు ధామ్‌లను సందర్శించడానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రకటించింది. అయితే అది పూర్తి స్థాయిలో కార్యారూపం దాల్చలేదు. దీంతో పలువురు యాత్రికులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.ట్రాన్సిట్ క్యాంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఆరు వేల మంది యాత్రికులకు మాత్రమే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో మిగిలిన ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు చార్ధామ్ దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దాదాపు రెండున్నర వేల మంది యాత్రికులు ఇప్పటికీ ట్రాన్సిట్ క్యాంపు ప్రాంగణం, ధర్మశాలలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వేచిచూస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను మే 31తో నిలిపివేయాలని పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. అయితే ట్రాన్సిట్ క్యాంపులో ఉన్న యాత్రికులలో సుమారు 800 మంది ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. కాగా ఈ యాత్రికులకు వసతి, భోజన ఏర్పాట్లను స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. -
అయోధ్యలో 10 పడకల మినీ ఆసుపత్రి!
మండుతున్న ఎండల్లో అయోధ్యకు వస్తున్న భక్తులకు వైద్య సదుపాయాలు అందించేందుకు రామాలయ ట్రస్ట్ 10 పడకల మినీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చింది. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఈ నూతన ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. అయోధ్యలో భక్తుల కోసం మినీ ఆసుపత్రితోపాటు దర్శన్ మార్గ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రస్ట్ మీడియాకు తెలిపింది. మండుతున్న ఎండల్లో రామభక్తులకు ఉపశమనం కలిగించేందుకు రామ మందిర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం జన్మభూమి పాడ్ నుంచి రామాలయం వరకు వివిధ ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి మార్గంలో ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల సౌకర్యాల కేంద్రంలో వెయ్యిమంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ సేవా కేంద్రంలోనే 10 పడకల మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.మూడు రోజుల క్రితం రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ఇద్దరు భక్తులు అపస్మారక స్థితికి చేరారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తర్వాత ట్రస్ట్ వెనువెంటనే 10 పడకల మినీ ఆసుపత్రిని భక్తులకు అందుబాటులో ఏర్పాటు చేసింది. ఈ మినీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు రామమందిర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఇక్కడ వైద్యులతో పాటు సిబ్బందిని కూడా నియమించారన్నారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు (ఫొటోలు)
-
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్‌కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్‌నాథ్, సోనాలి, ఎఫ్‌ఎఫ్‌జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
విశాఖలో పోలీస్ కమాండో పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలకు చెందిన 23 టాప్ కమాండో బృందాలు పాల్గొనే 14వ ఆలిండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్(ఏఐపిసిసి) సోమవారం విశాఖలోని ఏపీ గ్రేహౌండ్స్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విశాఖ నగర సీపీ ఎ.రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి ప్రతిభ కలిగిన జట్టు విజయం సాధిస్తుందని, క్రీడాస్ఫూర్తితో తలపడాలన్నారు. ఏపీ గ్రేహౌండ్స్ అదనపు డీజీ రాజీవ్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోందన్నారు. విశాఖలో 16 రాష్ట్రాల పోలీస్ కమాండో జట్లతో పాటు ఏడు పారామిలిటరీ దళాల కమాండో జట్లు ఐదు దశల్లో జరిగే పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ సమగ్రతకు ఈ పోటీలు చక్కటి ఉదాహరణ అన్నారు. తొలుత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ జట్టుతో ప్రారంభమై, ఉత్తరాఖండ్ జట్టు చివరగా మొత్తం 23 జట్లు గౌరవవందనం సమర్పించాయి. గ్రేహౌండ్ బ్యాండ్ మార్చ్‌పాస్ట్ అలరించింది. ఈ కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సింగ్, పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ ఏడీజీ అతుల్‌సింగ్, రేంజ్ ఐజీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
నవ్వుల జాతర
క్రిష్ సిద్ధిపల్లి, కష్వీ జంటగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ సినిమా షురూ అయింది. వాల్మీకి దర్శకత్వంలో శ్రీ నిధి క్రియేషన్స్ సమర్పణలో సన్ స్టూడియో బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘పూర్తి హాస్యభరిత చిత్రంగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ ఉంటుంది. ఈ సినిమాకు జంధ్యాలగారి పేరు పెట్టడంతో మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘విందు భోజనం లాంటి చిత్రమిది’’ అన్నారు క్రిష్ సిద్ధిపల్లి. నటులు రఘుబాబు, పృథ్వీ, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ కృష్ణ, కెమెరా: విజయ్ ఠాగూర్. -
తొలి ΄పౌరుడు తనే!
సమర సింహారెడ్డి, అక్సా ఖాన్ జంటగా తెలుగు శ్రీను దర్శకత్వంలో ‘మగపులి’ సినిమా ఆరంభమైంది. ‘ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్’ (రైతే ప్రపంచంలో తొలి ΄పౌరుడు) ఉపశీర్షిక. ఎమ్బీడబ్ల్యూడీఏ సమర్పణలో నారాయణ స్వామి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి రైతు టి. రంగడు కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు సుమన్ క్లాప్ ఇచ్చారు. ‘‘నిరుద్యోగులు, రైతులు, రాజకీయ నాయకుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు తెలుగు శ్రీను. ‘‘ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల కన్నడలో సినిమాలు చేశాను. ఇప్పుడు మాతృ భాషలో సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు సమర సింహారెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్. జె, కెమెరా: శివారెడ్డి యస్వీ. -
బీజేపీలో దరఖాస్తుల వెల్లువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు మొదటిరోజే ఏకంగా 182 దరఖాస్తులు సమర్పి చారు. ఐతే కొందరు ఒకటికి మించి స్థానాలకు తమ దరఖాస్తులను సమర్పి చడంతో... వాస్తవానికి 63 నియోజకవర్గాలకే అభ్యర్థులు అప్లికేషన్లు ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దర ఖాస్తుల స్వీకరణ నిమిత్తం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, పార్టీనేతలు సుభాష్చందర్జీ, మల్లేశం గౌడ్లతో రాష్ట్ర పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 4 చోట్ల పోటీకి దరఖాస్తు చేసిన శ్రీవాణి: సికింద్రాబాద్ నుంచి పోటీకి రవిప్రసాద్‌గౌడ్ మొదటగా ఈ కమిటీకి దరఖాస్తు సమర్పి చారు. భద్రాచలం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, వేములవాడ సీటుకు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అప్లికేషన్ పెట్టుకున్నారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఏకంగా నాలుగు చోట్ల పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీకి అవకాశమివ్వాలంటూ వేర్వేరు దరఖాస్తులు సమర్పించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ కోసం సామా రంగారెడ్డి దరఖాస్తు చేశారు. – కిషన్‌రెడ్డి పరిశీలన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అప్లికేషన్ ఇచ్చి న వారు మీడియాతో మాట్లాడకుండా నేరుగా నియోజకవర్గం వెళ్లి పనిచేసుకోవాలని ఆయన సూచించారు. మీడియా ముందు హంగామా చేసే వారి దరఖాస్తులు పక్కన పెట్టాలని పార్టీనాయకులను ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే... ఈ నెల 10వ తేదీ వరకు ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఇది ముగిశాక మూడు స్థాయిల్లో అంటే జిల్లా, రాష్ట్ర, జాతీయపార్టీ స్థాయిలలో వడపోత కార్యక్రమం నిర్వహిస్తారని పార్టీ నేతల సమాచారం. – 25 స్థానాలకు ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా పార్టీ ముఖ్యనేతలు, కచ్చి తంగా గెలిచే అవకాశాలున్న వారిని దాదాపు 25 స్థానాల వరకు కేవలం ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా సిద్దం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఒక్కో సీటుకు ముగ్గురు లేదా నలుగురు చొప్పున ప్రతిపాదిత పేర్లతో రఫ్ జాబితా సిద్ధం చేసి రాష్ట్రపార్టీ నుంచి పార్లమెంటరీ బోర్డుకు సమర్పి చవచ్చునని సమాచారం. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 113మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఎక్కడికక్కడ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ సైతం పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నేపథ్యంలో బీజేపీలోనూ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తుల ప్రక్రియ మొదటిరోజే వేగం పుంజుకుంది. రాబోయే ఆరు రోజుల్లో (ఈ నెల 10 వరకు) భారీగానే దరఖాస్తులు అందుతాయని పార్టీనాయకులు అంచనా వేస్తున్నారు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్‌షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్‌షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్‌రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
ఎమర్జెన్సీ సేవలు మరింత పటిష్టం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 అంబులెన్స్, అమ్మ ఒడి, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి, 34 హర్సె వాహనాలు ఉన్నాయి. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన సభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఆశ కార్యకర్తలకు సెల్ ఫోన్ బిల్లు: హరీశ్‌రావు తెలంగాణ ఏర్పడే నాటికి 108 అంబులెన్సులు 316 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455కు పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచి్చందన్నారు. గతంలో అంబులెన్స్ చేరుకునే సగటు సమయం 30 నిమిషాలు ఉంటే.. ఇప్పుడది 15 నిమిషాలకు తగ్గిందని తెలిపారు. 108 ఉద్యోగుల వేతనాలు 4 స్లాబులుగా పెంచుతున్నామని చెప్పారు. అమ్మ ఒడి వాహనం ద్వారా రోజుకు 4 వేల మంది గర్భిణులకు, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయని చెప్పారు. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని, కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని అన్నారు. ఆ ఒక్క శాతం లోపంతో చెడ్డపేరు వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది 99 శాతం బాగా పనిచేస్తున్నప్పటికీ, ఒక్క శాతం లోపం వల్ల కూడా చెడ్డపేరు వస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కూడా లోపాలు మాత్రమే కాకుండా చేస్తున్న మంచిని కూడా చూపాలని కోరారు.బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయని చెప్పారు.ఆ పార్టీ రాష్ట్రాల్లో కొట్లాటలు, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని హరీశ్‌రావు విమర్శించారు. -
శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టులో జలవిద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాల్లో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 22,573 క్యూసెక్కులు చేరాయి. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు.. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 808.90 అడుగుల్లో 33.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్‌లకు దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధాన పాయ, భీమాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 41,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 37,930 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్‌లోకి 2,015 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాల ప్రభావంతో మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 8,685 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.39 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన మున్నేరు, వాగులు, వంకల ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజ్‌లోకి 15,698 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 6,114 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 9,584 క్యూసెక్కులను అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. ఆల్మట్టిలోకి పెరిగిన వరద పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,07,769 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 54.56 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదలుతున్న ఆరు వేల క్యూసెక్కులు నారాయణపూర్ డ్యామ్‌కు చేరుతున్నాయి. సోమవారం ఆల్మట్టిలోకి మరింతగా వరద పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తుంగభద్రలోనూ పెరిగిన ప్రవాహం తుంగభద్ర డ్యామ్, తుంగ ఆనకట్ట దిగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల తుంగభద్రలో వరద ఉద్ధృతి కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 54,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.36 టీఎంసీలకు చేరుకుంది. -
రిలయన్స్ ఎంజే క్షేత్రం నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: కేజీ–డీ6 బ్లాక్‌లోని ఎంజే చమురు, గ్యాస్ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీ వెల్లడించాయి. ఈ బ్లాక్‌లోని మరో రెండు క్షేత్రాలైన ఆర్–క్లస్టర్ నుంచి 2020 డిసెంబర్లో, శాటిలైట్ క్లస్టర్ నుంచి 2021 ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఎంజే క్షేత్రం గరిష్ట స్థాయికి చేరినప్పుడు కేజీ–డీ6 బ్లాక్‌లోని మొత్తం మూడు క్షేత్రాల నుంచి రోజుకు 30 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి కాగలదని రిలయన్స్–బీపీ తెలిపాయి. ఇది దేశీయంగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో సుమారు మూడో వంతు ఉంటుందని, డిమాండ్‌లో 15 శాతానికి సరిపోవచ్చని పేర్కొన్నాయి. ఎంజే క్షేత్రంలో కనీసం 0.988 టీసీఎఫ్ గ్యాస్ ఉంటుంది. -
Golconda Bonalu 2023 : గోల్కొండ బోనాలు షురూ (ఫొటోలు)
-
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
న్యూజిలాండ్ లో మొదలైన న్యూ ఇయర్ సంబరాలు
-
BRS ఆవిర్భావం తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం
-
బిగ్ క్వశ్చన్: చంద్రబాబు చావు తెలివితేటలు..!
-
షోరూమ్ ను ప్రారంభించిన అనకాపల్లి ఎంపీ సత్యవతి
-
వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్‌గా ?
Salman Khan Venkatesh Starrer Kabhi Eid Kabhi Diwali Shoot Started: కొత్త సినిమా షూటింగ్ షురూ అంటున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్ కబీ దీవాలి’ (‘బాయిజాన్’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మే 11న ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం ముంబైలో ఉంటున్న వెంకటేశ్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. విలన్‌గా.. దక్షిణాదిన తిరుగు లేని విలన్‌గా దూసుకెళుతోన్న జగపతిబాబు ‘కబీ ఈద్ కబీ దీవాలి’లో విలన్‌గా నటిస్తారనేది బీ టౌన్ టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్ తెలిపింది. చదవండి: ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు అడల్ట్ సైట్లో ఫోటో లీక్, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి -
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం