suspenses
-
పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్
-
రాహుల్ ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టారా?
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ తాజాగా అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఈ రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీల ఊసే ఎత్తలేదు. దీంతో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్‌గానే మిగిలింది. మరోవైపు రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాంటూ యూపీ కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. ఇంత జరుగుతున్నా పార్టీ హైకమాండ్ ఈ రెండు సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ఆమె బరేలీకి రాలేదు. అయితే ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగాలేదని, అందుకే యాత్రలో పాల్గొనలేకపోయారని పార్టీ నేతలు తెలిపారు. ప్రియాంక ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని కూడా వారు అంటున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ ఈసారి రాయ్‌బరేలీపై కన్నేసింది. రాయ్‌బరేలీ రాజకీయాలలో కీలకంగా ఉంటున్న ప్రముఖ నేతలు దినేష్ సింగ్, అఖిలేష్ సింగ్, మనోజ్ పాండేలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇది కాంగ్రెస్‌కు గట్టిపోటీ నిచ్చేలా ఉంది. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
సస్పెన్స్‌లో తల్లీకొడుకుల సీట్లు.. విడిగా వరుణ్ గాంధీ పోటీ?
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి చెందిన 51 స్థానాలకు బీజేపీ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో పిలిభిత్, సుల్తాన్పూర్, కైసర్‌గంజ్, రాయ్‌బరేలి, మైన్‌పురి, మరికొన్ని ముఖ్యమైన స్థానాలు లేవు. వీటిలో పిలిభిట్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడి రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నాయకత్వంతోపాటు స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించిన వరుణ్ గాంధీకి ఈసారి టిక్కెట్ ఉండకపోవచ్చు అంటున్నారు. ఒకప్పుడు తన తండ్రి సంజయ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ప్రతిపక్ష భారత కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. -
తెలంగాణ సీఎం సీటుపై వీడని ఉత్కంఠ..రాజ్ భవన్ లో ఆగిపోయిన సీఎం ప్రమాణ స్వీకారం
-
కాంగ్రెస్ తో సీపీఎం పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్
-
బీజేపీ ఫస్ట్ లిస్ట్ పై సస్పెన్స్..!
-
గవర్నర్ పేరుతో టీడీపీ దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్.. రిమాండ్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో టీడీపీ నేతలు గవర్నర్ పేరుతో రకరకాల ప్రచారాలకు తెరలేపారు. గవర్నర్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చారని, కలవడానికి తమ నేతలు వెళుతున్నారని ప్రకటనలు విడుదల చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు గవర్నర్ తమ పార్టీనేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. తర్వాత కొద్దిసేపటికి అపాయింట్మెంట్ మరునాటికి మారిందని టీడీపీ వర్గాలు మాట మార్చాయి. వాస్తవానికి శనివారం గవర్నర్ విశాఖపట్నంలో ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా టీడీపీ జనాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్‌ను కలుస్తున్నట్లు ప్రచారం చేశాయి. కానీ.. అది కూడా జరగలేదు. మరోవైపు ఎల్లో మీడియా ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబు అరెస్ట్ పట్ల గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, తనకు తెలియకుండా ఎలా జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారానికి దిగాయి. శనివారం సాయంత్రం చంద్రబాబు అరెస్ట్‌పై వివరణ ఇవ్వాలని గవర్నర్ సీఐడీ అధికారులను కోరారని, వాళ్లు ఫైళ్లు పట్టుకుని పరుగులు పెడుతున్నారని వార్తలు ప్రసారం చేశాయి. చివరకు అవన్నీ ఎల్లో మీడియా పుకార్లేనని తేలింది. కోర్టులో ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కావాలని రకరకాల ప్రచారాలకు తెరలేపి ప్రజల్లో గందరగోళం సృష్టించారు. -
కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతోన్న సస్పెన్స్
-
ఢిల్లీలో పవర్ ప్లే.. పదవిపై పట్టువీడని ఇద్దరు నేతలు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక సీఎం అభ్యర్థిని తేల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు హస్తినలో మల్లగుల్లాలు పడుతున్నారు. పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తీవ్రంగా తలపడుతుండటంతో రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కడం తెలిసిందే. సీఎల్పీ భేటీలోనూ పీటముడి వీడకపోవడంతో సంప్రదింపుల కోసం వారిద్దరినీ అధిష్టానం హస్తినకు పిలిచింది. దాంతో సిద్ధరామయ్య సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరగా డీకే మాత్రం ‘ఆరోగ్య కారణాల’తో బెంగళూరుకే పరిమితమై మరింత సస్పెన్స్‌కు తెర తీశారు. ఢిల్లీ వెళ్తున్నట్టు మధ్యాహ్నం దాకా చెబుతూ వచ్చిన ఆయన చివరికి పర్యటనను రద్దు చేసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెంటే ఉన్నారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా, తాను మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకూ నాయకుడినంటూ డీకే నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం బెంగళూరులో డీకే 61వ పుట్టినరోజు వేడుకల్లో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. ఆ వెంటనే ఒకరు హస్తినలో, మరొకరు బెంగళూరులో తమ ప్రయత్నాలకు పదును పెడుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. అసెంబ్లీ పోరులో పార్టీని కలసికట్టుగా విజయ తీరాలకు చేర్చిన వీరిద్దరిలో ఎవరూ పట్టు వీడకపోవడం, వారి మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, నేతలు రెండు శిబిరాలుగా చీలిన నేపథ్యంలో ఈ చిక్కుముడిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీలతో చర్చించి మంగళవారం సాయంత్రానికల్లాల సీఎం అభ్యర్థిని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేస్తారని చెబుతున్నారు. సీఎం అభ్యర్థి ఎంపికకు ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ముగ్గురు అధిష్టానం ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగిన సీఎల్పీ భేటీ ఎటూ తేల్చలేకపోవడం, నేతలతో, ఎమ్మెల్యేలతో దూతల విడివిడి చర్చలు, రహస్య బ్యాలెట్ వంటివి ఏ ఫలితమూ ఇవ్వకపోవడంతో అభ్యర్థి ఎంపిక అధికారాన్ని పార్టీ అధ్యక్షునికే కట్టబెడుతూ సీఎల్పీ తీర్మానం చేయడం తెలిసిందే. సీక్రెట్ బ్యాలెట్ బాక్సులతో ఢిల్లీ ప్రతినిధులు సోమవారం ఢిల్లీ చేరారు. ఖర్గేకు పరిస్థితి వివరించడంతో పాటు నివేదిక కూడా అందజేశారు. -
బెంగళూరు నుంచి ఢిల్లీ బయల్దేరిన ఏఐసీసీ పరిశీలకులు
-
కర్ణాటక సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
-
ఎమ్మెల్సీ కవిత విచారణపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
Bharat Jodo Yatra: ఎన్నికలప్పుడే చెబుతా
కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ చేపడతారా లేదా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలోనే తాను అధ్యక్షుడిగా ఉంటానా లేదా అన్న విషయం తెలుస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే దీనిపై తాను స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని, ఒకవేళ పోటీలో లేకపోతే దానికి గల కారణాలు కూడా వివరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ శుక్రవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘నేను నా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి గందరగోళం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడే నేను అధ్యక్షుడిని అవుతానా లేదా మీకు తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టండి. ఒకవేళ నేను పోటీలో లేకపోతే అప్పుడు మీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెబుతాను’’అని రాహుల్ బదులిచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి సోనియా గాంధీయే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాజకీయ పోరాటం కాదు ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, వారితో మమేకమవడానికే పాదయాత్ర చేస్తున్నానని రాహుల్ స్పష్టం చేశారు. ‘‘యాత్రయ్యే పూర్తయ్యే సరికి నాపై తనకి అవగాహన పెరుగుతుంది. తెలివితేటలూ కాస్త పెరుగుతాయి’’ అని చమత్కరించారు. కాంగ్రెస్‌కూ ఎంతో కొంత లబ్ధి చేకూరితే మంచిదేనన్నారు. దేశంలో వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేస్తోందన్నారు. రూ.41 వేల టీ షర్టు రాహుల్ పాదయాత్రపై బీజేపీ విసుర్లు న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ఖరీదైన టీ షర్ట్ వేసుకున్నారంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. దాని ఖరీదు రూ.41,257 అంటూ శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ధరించే ఖరీదైన దుస్తుల మాటేమిటంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ‘‘మోదీ వేసుకునే రూ.10 లక్షల సూట్, రూ.1.5 లక్షల కళ్లద్దాలు గురించి కూడా బీజేపీ మాట్లాడాలి’’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి సుప్రియ ట్వీట్ చేశారు. యాత్రకు లభిస్తున్న స్పందన చూసి బీజేపీ భయపడుతోందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకు దోహదం కన్యాకుమారి: దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు పాదయాత్ర ఉపకరిస్తుందని రాహుల్ గాంధీ మీడియాతో చెప్పారు. ఒకే తాటిపైకి రావడం విపక్షాల బాధ్యతన్నారు. ‘‘కాంగ్రెస్‌తో పాటు ఇందులో ప్రతి పార్టీకి ఇందులో పాత్ర ఉంది. విపక్షాల ఐక్యతపై చర్చలు సాగుతున్నాయి. కొందరు నాయకులు బీజేపీ ఒత్తిళ్లకు లొంగిపోయి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ప్రభుత్వం ప్రయోగిస్తున్న దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి దాసోహమంటున్నారు. పాత్రికేయులు సైతం ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు’’ అని ఆయనన్నారు. -
బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపుపై సస్పెన్స్
-
Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదుపరి అడుగులపై స్పష్టత రావడం లేదు. రెండ్రోజులు హుజూరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన.. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సుదీ ర్ఘంగా చర్చించారు. బుధవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. టీఆర్ఎస్ తనను వదిలించుకోవాలనే నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టత రావడంతో.. ఆచితూచి అడుగులు వేయాలని ఈటల భావిస్తున్నారు. అధినేత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెదిలిన నేత ఈటల. అందుకే.. ఆవేశంతో కాకుండా ఆలోచనతోనే టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎదుర్కోవాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలు స్తోంది.‘పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. వేరే పార్టీ ల్లో చేరిక.. సొంత పార్టీ స్థాపన’ అనే అంశాలపై మేథోమధనం చేస్తున్నారు. బలమైన శత్రువును ఎదుర్కోవలసి వ చ్చినప్పుడు అన్నివిధాల సమాయత్తమై అడుగులు వేయాల్సి ఉంటుందని తన సన్నిహితులతో జరిపే సంభాషణల్లో వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో టీఆర్ఎస్ ఈటలపై దాడిని పెంచింది. ఆయన స్వయంగా పార్టీని వదిలి పోయేలా పథకాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సస్పెండ్ చేసే వరకూ ఇదే ధోరణి.. టీఆర్ఎస్తో సుమారు 20 ఏళ్ల అనుబంధాన్ని నైతి కంగా ఇప్పటికే తెంచుకున్నప్పటికీ, సాంకేతికంగా ఈటల రాజేందర్ అధికార పార్టీ ఎమ్మెల్యేనే. మెదక్ జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన భూముల వ్యవహారంలో దోషిగా చూపించి మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో తొలగించారని భావించిన ఆయన హుజూరాబాద్‌కు వెళ్లిన తరువాత తన సన్నిహితులతో చర్చించి పార్టీకి, పదవికి రాజీనా మా చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన మాత్రం ‘హైదరాబాద్ వెళ్లిన తరువాత’ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షం ఊసు లేకుండా అన్ని ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న తీరు, పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు.. ఇవన్నీ తెలిసిన ఈటల తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి వర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో తనకు తానుగా పార్టీకి రాజీనామా చేస్తే.. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవలసిన అనివార్య పరిస్థితులు తలెత్తుతాయి. కొత్తగా పార్టీ స్థాపించినా, వేరే ఏ పార్టీలోకి వెళ్లినా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద గెలిచిన ఎమ్మెల్యే పదవిని కోల్పోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానమే పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి కల్పించాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. ఈలోగా తనపై వచ్చిన మాసాయిపేట భూకబ్జా, దేవరయాంజల్ దేవుడి భూముల ఆక్రమణ వంటి ఆరోపణలు నిజం కాదని కోర్టు ద్వారా నిరూపించుకునే పనిలో ఉన్నారు. ఆచితూచి అడుగులు మంత్రి పదవి నుంచి అకారణంగా తొలగించారనే సానుభూతి జనాల్లోకి వెళ్లిందని భావిస్తున్న ఈటల వర్గం ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు ప్రజలతో ఉన్న సంబంధాల వల్ల స్థానికంగా ఆయనకు వచ్చే ఇబ్బందులేమీ లేవు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ను పెంచుకునే దిశగా ఈటల రాజేందర్ అడుగులు వేస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక పంపాయి. రాష్ట్రంలోని ముదిరాజ్ సామాజిక వర్గం అండ ఉందని భావిస్తున్న ఆయన ఇతర బీసీ సంఘాల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తుందా అని కూడా వేచి చూస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. తద్వారా ప్రజల నుంచి సానుభూతి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీ సస్పెండ్ చేసినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో కూడా తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించే ధోరణితో ఉన్నట్లు సమాచారం. మరో రెండేళ్లలో వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఇదే టెంపో కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. నిన్నటి సహచరులు.. నేటి శత్రువులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చే పేరు ఈటల రాజేందర్. ఉద్యమ కాలం నుంచే కాకుండా.. ప్రభుత్వంలోనూ కీలక మంత్రిత్వ శాఖల్లో కొనసాగారు. పార్టీలోనూ ప్రధాన నాయకుడిగా ఉన్నారు. ఇతర మంత్రులు, నాయకులు కూడా అదే స్థాయిలో ఈటలకు గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు భూకబ్జాల ఎపిసోడ్ తెరపైకి వచ్చి ఆయన పదవికి గండం రావడంతో నిన్నటి వరకు సహచరులుగా ఉన్నవారంతా శత్రువులయ్యారు. కేసీఆర్‌పై ఈటల స్వరం పెంచడంతో ఉమ్మడి జిల్లాలో సహచర మంత్రులుగా ఉన్న కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈటలపై విరుచుకుపడ్డారు. గంగుల కమలాకర్ మరో అడుగు ముందుకేసి ‘బీసీగా చెప్పుకునే దొర.. మేకవన్నె పులి’ అంటూ విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌పైనే ఇక దృష్టి పెడతామని, నియోజకవర్గంలో పర్యటిస్తామని చెప్పుకొచ్చారు. తాజాగా ఉమ్మడి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈటలపై ఫైర్ అయ్యారు. సొంతపార్టీ వారినే ఇబ్బందులకు గురిచేశారని, ఉప ఎన్నికల్లో తానే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతల దాడి రోజురోజుకూ పెరుగుతుందని తెలుసు కాబట్టే.. ఈటల కూడా సంయమనంతో వ్యవహరిస్తూ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: అసైన్డ్ భూమిని ఆక్రమించడం తప్పు కాదా..? రెండోసారి పవర్.. ఈటలపై నజర్! -
‘సాగర్’.. సస్పెన్స్: పోటీదారులెవరో..?
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 30తో ముగియనున్న సం గతి తెలిసిందే. నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓట్లను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయడంపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. బీసీ సామాజికవర్గానికే టికెట్ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, నియోజక వర్గంలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న యాదవ సామాజికవర్గానికే టికెట్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా, బీజేపీ తమ అభ్యర్థిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యం లోనే చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో నోముల భగత్ తదితరులు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, దూది మెట్ల బాలరాజు యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు టికెట్ రేసులో ఉండటంతో, ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు చేజారకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుం టోంది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతల అభిప్రాయాలను కేసీఆర్ ఇప్పటికే సేకరించారు. నోముల భగత్‌కు మినహా ఎవరికి టికెట్ దక్కినా అది అనూహ్యమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముమ్మరంగా ప్రచారం గత ఏడాది డిసెంబర్ నుంచే స్థానికంగా పార్టీ యం త్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించిన టీఆర్ఎస్, ప్రస్తుతం అభ్యర్థిని ప్రకటించకుండానే పూర్తి స్థాయిలో ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహి స్తోంది. గత నెల 10న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు హాలియాలో బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా కేసీఆర్ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. ప్రైవేటు సంస్థల సర్వేతో పాటు వివిధ వర్గాల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా ఆ పార్టీ ఎప్పటికప్పుడు తన ఎన్నికల ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు సుమారు మూడు నెలలుగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధినేతకు వివరించడంతో పాటు, పార్టీ వ్యూహాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. 15 రోజులుగా ఎమ్మెల్యేల మకాం ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే క్షేత్ర స్థాయిలో ప్రచారం కోసం ఇన్చార్జిలుగా నియమితులైన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పదిహేను రోజులుగా సాగర్ నియోజకవర్గంలో తమకు బాధ్యతలు అప్పగించిన చోట ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కోణప్ప, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జీవీ రామకృష్ణారావు తమ నియోజకవర్గాలకు చెందిన నేతలు, క్రియాశీల కార్యకర్తలతో బృందాలుగా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సైతం వీరు దూరంగా ఉండటం గమనార్హం. సామాజికవర్గాల వారీగా సమావేశాలు 2.17 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధానంగా యాదవ, లంబాడీ, రెడ్డి, మాదిగ, మాల, ముస్లిం, ముదిరాజ్, గౌడ, రజక, మున్నూరుకాపు సామాజికవర్గాలకు చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్చార్జిలు సామాజికవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా టీఆర్ఎస్కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. -
కరోనా రోగులకు రెమిడెసివిర్ ఇవ్వొద్దు: డబ్ల్యూహెచ్‌వో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో ప్రాచుర్యం పొందిన యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం సస్పెండ్ చేసింది. కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని డబ్ల్యూహెచ్‌వో తాజాగా తెలిపింది. ఆస్పత్రిలో చేరిన కోవిడ్ రోగులకు రెమిడెసివిర్ ఇవ్వొద్దని వైద్యులకు సూచించింది. ఈ ఔషధంతో రోగుల ప్రాణాలు కాపాడగలమనడానికి ఆధారాలు లేవని పేర్కొంది. కాగా ఇప్పటివరకు కోవిడ్-19 కి వ్యతిరేకంగా ఆమోదించబడిన ఏకైక చికిత్స గా రెమిడెసివిర్ ఉంది. భారతదేశంలో, రిమిడెవిర్ సరఫరాను పెంచడానికి అనేక ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. -
రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ సస్పెన్స్
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వాడి వేడిగా చర్చ సాగుతోంది. రజనీ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక లేఖ తీవ్ర ఆందోళనకి, గందరగోళానికి గురి చేసింది. అయితే ఆ లేఖ తాను రాయలేదని స్పష్టం చేసిన రజనీ అందులో ఉన్న అనారోగ్య అంశాలు వాస్తవమేనన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని తనకు వైద్యులు సలహా ఇచ్చినట్టుగా రజనీ గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన అనారోగ్యం గురించి ఆయన బహిరంగంగా చెప్పడం ఇదే తొలిసారి. ‘కరోనా వైరస్ ఉన్నంతవరకు నేను ప్రచారానికి వెళ్లడం మంచిది కాదని వైద్యులు సూచించారు. నా వయసు 70 ఏళ్లు. కిడ్నీ మార్పిడి జరిగింది. నా రోగనిరోధక వ్యవస్థ బాగా క్షీణించింది. బయటకి వెళితే సులభంగా కరోనా దాడి చేస్తుంది. వ్యాక్సిన్ వచ్చినా నాకు పని చేస్తుందన్న భరోసా వైద్యులు ఇవ్వడం లేదు. నేను నా ఆరోగ్యం గురించి బాధపడడం లేదు. నా చుట్టూ ఉన్న వారి క్షేమం గురించి ఆలోచిస్తున్నాను’అని మీడియాలో చక్కర్లు కొట్టిన లేఖలో ఉంది. అనారోగ్యం వాస్తవమే: రజనీ ఆ లేఖ తాను రాసినది కాదని వెల్లడించిన రజనీకాంత్ అందులో పేర్కొన్న అనారోగ్య అంశాలు వాస్తవమేనని తెలిపారు. వైద్యులు తనని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చినట్టుగా వెల్లడించారు. రజనీ మక్కల్ మంద్రమ్‌తో చర్చించిన తర్వాత సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. -
హైదరాబాద్ లాక్‌డౌన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
-
ఏం జరిగింది?
ప్రేమ ఉంది. సస్పెన్స్ ఉంది. యాక్షన్ ఉంది.. అన్నీ ఉన్నాయి. అసలేం జరిగింది? అంటే ఇప్పుడు కాదు.. మేలో తెలుస్తుంది. శ్రీరాం, సంచితా పదుకునే జంటగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న ‘అసలేం జరిగింది’. షూటింగ్ పూర్తయింది. ‘‘దాదాపు 40 రోజులు చేసిన షూటింగ్లో టాకీ, పాటలు, ఫైట్లు తీశాం. ఫైట్ మాస్టర్ శంకర్ తెరకెక్కించిన భారీ ఫైట్స్ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. అలాగే కొత్త కొరియోగ్రాఫర్ ఈశ్వర్, మరో కొరియోగ్రాఫర్ హరి పాటలకు అద్భుతమైన స్టెప్స్ సమకూర్చారు. ఓ మాస్ సాంగ్‌లో దాదాపు రెండు వందల మంది, మరో పాటలో నాలుగు వందల మంది పాల్గొన్నారు. ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. 8కె రెజల్యూషన్ గల రెడ్ మాన్‌స్ట్రో కెమెరాను ఈ సినిమా చిత్రీకరణ కోసం వినియోగించాం. దర్శకుడు ఎన్వీఆర్ అద్భుతంగా తెరకెక్కించారు. మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
టీఆర్ఎస్ లో కొనసాగుతున్న సస్పెన్షన్లు
సాక్షి, పెద్దపల్లి : ఎన్నికల సమయంలో రామగుండం టీఆర్ఎస్లో వేటు పర్వం కొనసాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులను వరుసగా సస్పెండ్ చేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. అధినేత కేసీఆర్ గోదావరిఖని పర్యటనకు కొన్ని గంటల ముందు పార్టీ ఈ సస్పెన్షన్ల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న సస్పెన్షన్లు పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు రామగుండం టీఆర్ఎస్లో అసమ్మతి వ్యవహారం మరోసారి వెలుగు చూస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ సహా 26 మందిని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మంగళవారం సస్పెండ్ చేశారు. ఇదే కారణంతో టీబీజీకేఎస్ నాయకులు లక్కాకుల లక్ష్మణ్, జలపతి, అల్లి శంకర్లను సస్పెండ్ చేస్తున్నట్లు టీబీజీకేఎస్ నేత టి.వెంకట్రావు బుధవారం ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖనికి రానున్న కొద్దిగంటల ముందు సస్పెన్షన్ల వ్యవహారం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అసమ్మతికి పెట్టింది పేరు. సంవత్సరాలుగా అసమ్మతి కార్యకలాపాలు చోటుచేసుకుంటుండడం, ప్రతిపక్ష పార్టీలకన్నా... సొంత పార్టీ నాయకులే విమర్శించుకోవడం ఇక్కడ సర్వసాధారణం. తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణల నడుమ వర్గపోరు గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. మాజీ మేయర్ వర్గానికి ఎంపీ బాల్క సుమన్ మద్దతుందనే ప్రచారమూ జరిగింది. నగరపాలకసంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అసమ్మతి ప్రత్యక్షపోరుకు కారణమైంది. టీఆర్ఎస్ నుంచే రెండు వర్గాలు పోటీపడగా, ఎమ్మెల్యే వర్గం పైచేయి సాధించింది. ఈ క్రమంలోనే అప్పటి మేయర్ లక్ష్మీనారాయణపై సోమారపు వర్గం అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దింపేయించింది. అవిశ్వాసం సమయంలో పార్టీ అధిష్టానాన్ని సైతం తనతో వచ్చేట్లు చేయడంలో సోమారపు సఫలమయ్యారు. అవిశ్వాసాన్ని నిలిపివేయాలన్న అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించి, ఏకంగా ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. చివరకు అధిష్టానం అంగీకరించడంతో లక్ష్మీనారాయణను పదవి నుంచి దింపి తనపంతం నెగ్గించుకున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఉద్యమనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోరుకంటి చందర్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఈ సారికూడా సిట్టింగ్‌లకే టికెట్ దక్కడంతో చందర్ ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో అసమ్మతి నేత పెద్దంపేట శంకర్ బీఎస్పీ నుంచి రంగంలో ఉన్నారు. రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి రెబల్‌గా పోటీకి సిద్ధపడ్డా.. చివరకు కోరుకంటి చందర్‌కు మద్దతుగా పోటీనుంచి తప్పుకున్నారు. సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్‌లు పోటీపడుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా రెండుగా విడిపోయారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థికి కాకుండా, రెబల్ అభ్యర్థికి మద్దతునిస్తున్న నాయకులపై పార్టీపరంగా చర్యలు ప్రారంభించారు. జెడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ మేయర్ లక్ష్మీనారాయణలతో పాటు 26 మంది నాయకులను సోమారపు సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బుధవారం టీబీజీకేఎస్ నాయకులు ముగ్గురిపై కూడా వేటువేశారు. పార్టీ అభ్యర్థినైన తనకుకాకుండా.. తిరుగుబాటు అభ్యర్థికి మద్దతుగా ఉన్న నాయకులపై పార్టీపరంగా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంవత్సరాలుగా తారాస్థాయిలో ఉన్న అసమ్మతి, కీలక ఎన్నికల వేళ సస్పెన్షన్లకు కారణమవుతుండడంతో, మరోసారి అసమ్మతిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. నియోజకవర్గ చరిత్ర కోసం మరిన్ని వార్తలు... -
కాంగ్రెస్ టికెట్లపై ఉత్కంఠ..!
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు మహాకూటమి పొత్తులు.. కాంగ్రెస్ అగ్రనేతలు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో ఇక్కడ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్‌లకు టికెట్లు ఖాయమంటున్న సమాచారం.. మహాకూటమిలోని పార్టీలు కోరుతున్న స్థానాల విషయం ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో రేపు టీపీïసీసీ ప్రకటించనున్న అభ్యర్థుల మొదటి జాబితాపై ఆసక్తి నెలకొంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ అధినాయకత్వం తమ అభ్యర్థులను ప్రకటించి దాదాపు రెండు నెలలు కావొస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఇప్పటికే పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులు గత నెల ఆరో తేదీ నుంచి ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ పార్టీకి జిల్లాలో నల్లగొండ, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడలో సిట్టింగులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారికే టికెట్లు దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లెక్కన పీసీసీ ప్రకటించే తొలి జాబితాలో సిట్టింగులు.. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేర్లు ఉంటాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చోట్ల ఎవరికి అవకాశం? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలేరు, భువనగిరి, ము నుగోడు, దేవరకొండ, మిర్యాలగూడెం, నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆలేరులో ఉమ్మ డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌కు దాదాపు టికెట్ ఖాయమని చెబుతున్నారు. భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. ఇక మునుగోడు నుంచి పాల్వా యి స్రవంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ నుంచి జగన్‌లాల్‌నాయక్, బిల్యానాయక్, బాలూనాయక్, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట నుంచి ఆర్.దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరిని టికెట్ వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. మరి మహాకూటమి..? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వివిధ రాజకీయ పక్షాలతో కూటమి గడుతోంది. సీపీఐ, టీడీపీ, టీజేఎస్, తె లంగాణ ఇంటి పార్టీ మహాకూటమిలో ఉన్నా యి. టీడీపీ కోదాడ, నకిరేకల్, తుంగతుర్తిల్లో కనీసం రెండు స్థానాలను కోరుతోంది. సీపీఐ ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లో ఒకటి, అవకాశ ఉంటే దేవరకొండ స్థానాలు ఆశిస్తోంది. ఇక టీజేఎస్ మిర్యాలగూడ, తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్ ఆశిస్తున్నాయి. ఇప్పటి వరకు మహాకూటమి పొత్తులు కొలిక్కి రాకపోవడంతో ఈ స్థానాల్లో ఎవరికి టికెట్ దక్కుతుందో.. తెలియకపోవడంతో అయోమయం నెలకొంది. టీపీసీసీ నవంబర్ ఒకటో తేదీన కొందరు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండడంతో ఆ జాబితాలో ఎవరెవరికి స్థానం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
డార్లింగ్ గారు
అది 1979 సంవత్సరం. నాకు హైదరాబాద్ నేరేడ్మెట్లోని గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. ఇన్స్టిట్యూట్కు దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాను. మిగిలిన రెండు గదుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉన్నారు.ప్రతిరోజూ ఉదయం బావి దగ్గర అంట్ల గిన్నెలు కడుక్కోవడానికి వెళ్లినప్పుడు మిగిలిన అన్నం ఒక కుక్కకు వేసేవాడిని. అన్నం తిన్న తర్వాత కిందకు వెళ్లకుండా ఆ కుక్క గడప దగ్గరే పడుకునేది.‘ఛాయ్.... ఛాయ్’ అని దాన్ని తోలేవాడిని.నేను ‘ఛాయ్... ఛాయ్’ అని అరిచినప్పుడల్లా పక్క రూమ్ మిత్రులు నవ్వేవాళ్లు.ఎందుకంటే వాళ్లు ‘హడీ.... హడీ’ అని కుక్కను తోలేవాళ్లు.నేను ఆ కుక్కకు ప్రతిరోజూ అన్నం వేయడాన్ని గమనించిన పక్కరూమ్ మిత్రులు కుక్క పైకి రాగానే ‘నీ డార్లింగ్ వచ్చింది’ అనేవాళ్లు.కొన్ని నెలల తర్వాత కుక్క కడుపు లావుగా కనిపించింది.అది గర్భవతని, పిల్లల్నికంటుందని చెప్పాడు ఫ్రెండ్. అప్పటి నుండి నేను దానికి ఎక్కువ అన్నం పెట్టేవాడిని. ఒకసారి కాలేజీకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు నేను మా ఇంటికి వచ్చేశాను. నేనుఇంటికి వచ్చేసిన మరుసటి రోజే కుక్కకు నాలుగు పిల్లలు పుట్టాయి.ఈలోపు మిత్రులు ఒక లెటర్ రాశారు. అందులో ఇలా ఉంది...‘మీ డార్లింగ్ ప్రసవించింది.తల్లీ పిల్లలూ బాగున్నారు. డార్లింగ్ మీ కోసం ఎదురుచూస్తుంది’వాళ్లు లెటర్ రాసిన సంగతి, అది మా ఇంట్లో వాళ్లు చదివిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్ అందిన రోజు నేను∙ఇంటి దగ్గర లేను.లెటర్ చదివి మా ఇంట్లో వాళ్లు ఏవేవో ఊహించుకున్నారు.‘డార్లింగ్ ఎవరు?’ ‘ఆమె నీకు ఎలా పరిచయం?’‘మాకు తెలియకుండా పెళ్లి ఏమైనా చేసుకున్నావా?’‘ఈ ఉత్తరం రాసింది ఎవరు? ఆ అమ్మాయి వైపు వాళ్లా?’‘చదువుకోవడానికి వెళ్లావా? సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడానికి వెళ్లావా?’ఇలా ఒకటా రెండా...ఎన్ని ప్రశ్నలు. ఎన్ని డౌట్లు. ఎన్ని ఎత్తి పొడుపులు!వీళ్లేమంటున్నారో కొద్దిసేపటి వరకు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అనుకున్నాను...‘అసలు విషయం చెప్పకుండా కొద్దిసేపు సస్పెన్స్‌లో ఉంచాలి’ అని.‘ఆమె సంగతి మీకెలా తెలుసు! ఎవరు చెప్పారు?’ అన్నాను.‘‘ఏదో ఒక విధంగా తెలిసిందిలేగాని అసలు సంగతి చెప్పు’’ అన్నారు.‘‘ఆమె నీతో పాటే చదువుతుందా?’’ అని అడిగారు.నాకేమో నవ్వు వస్తుంది.బలవంతంగా నవ్వు ఆపుకొని...‘‘అవును’’ అన్నాను.‘‘నీ రూమ్‌లో ఉంటుందా?’’ అని అడిగితే...‘‘ఉండదు. రోజూ వచ్చిపోతుంది’’ అన్నాను.‘‘పెళ్లి చేసుకున్నావా?’’ అని కోపంగా అడిగితే...‘లేదు’’ అని కూల్‌గా చెప్పాను.‘‘పెళ్లికాని పిల్ల రోజూ నీ రూమ్‌కు వచ్చిపోవడం ఏమిటి? పిల్లల్ని కనడం ఏమిటి?’’ అన్నారు సీరియస్‌గా.ఇలా కొద్దిసేపు ప్రశ్నలు–జవాబులు కార్యక్రమం తరువాత అసలు విషయం చెప్పాను. అంతే.... అందరూ ఒకటే నవ్వడం!! నవ్వుల కెమిస్ట్రీ! అవి మేము నాగార్జున యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజులు. ఒకసారి కెమిస్ట్రీ ల్యాబ్‌లో ఎక్స్పెరిమెంట్ విడివిడిగా చేయాల్సి వచ్చింది. బర్నరు వెలిగించి ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాం. ఆరుగంటలు నిల్చొని ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టమే కదా... శ్రమను మరిచిపోవడానికన్నట్లు పిచ్చాపాటి మొదలుపెట్టాం. ఎక్స్పెరిమెంట్ మాటేమిటోగానీ...ఒకటే జోక్‌లు... నవ్వులు! ప్రయోగం కంటే ముచ్చట్లే ప్రధానమయ్యాయి.ఎవరో తలుపు దబదబమని బాదుతున్నారు.నవ్వుల శబ్దానికి ఆ చప్పుడు వినిపించలేదు.తరువాత ఆ చప్పుడు విని తలుపు కొద్దిగా తీసి ‘కమ్ ఇన్’ అన్నది మా ఫ్రెండ్.అంతే, మా మాష్టారు బాణంలా దూసుకొచ్చారు. అందరం బిక్కచచ్చిపోయాం!‘‘తలుపులు వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే.... ఏదైనా అంటుకుంటే చస్తారు ’’ అని పెద్దగా అరిచారు. కొన్ని నిమిషాల పాటు అందరం భయంగా, సీరియస్‌గా ముఖాలు పెట్టాం. ఆయన అటు వెళ్లాడో లేదో షరామామూలుగా ముచ్చట్లే ముచ్చట్లు, నవ్వులే నవ్వులు! – డి.వి.తులసి, విజయవాడ – నక్కా రాజశేఖర్, కఠెవరం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. -
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
-
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ
సాక్షి, అమరావతి: రాజ్యసభ నామినేషన్ల చివరితేదీ సోమవారంతో ముగియనుండటంతో అమరావతి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనున్నా అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కసరత్తు కొలిక్కిరాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావుతో నేడు భేటీ కానున్నారు. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వీరితో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని అభ్యర్ధుల కసరత్తు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు సీట్లకే పోటీచేయాలని టీడీపీ భావిస్తోంది. రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో తమ సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తారని ఎస్సీ, బీసీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధానిలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఉండాలని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికతోపాటు టీటీడీ బోర్డు చైర్మన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.