swamiji
-
సజీవ సమాధికి స్వామీజీ యత్నం
మద్దూరు: ఓ స్వామీజీ ఐదురోజులు సమాధికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు నిలువరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్లలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రెనివట్ల గ్రామానికి చెందిన సత్యానందస్వామి అలియాస్ హనుమంతు కొద్దిరోజులుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా చెలామణి అవుతున్నాడు. ఈయన భార్య ఏడాది క్రితం పొలంలో ఎద్దు పొడవడంతో మృతిచెందింది. దీంతో ఆమెకు పొలంలోనే సమాధి కట్టించి పూజిస్తున్నాడు.అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. శుక్రవారం అమావాస్య రోజున ‘తాను ఐదు రోజులు సమాధిలోకి వెళతానని.. బయట అఖండభజనలు చేయాలని’ భక్తులకు చెప్పి సమాధిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని సమాధిలో ఉన్న స్వామీజీని బయటకు రప్పించారు. అనంతరం డాక్టర్ స్వామీజీకి వైద్య పరీక్షలు చేయగా, ఆర్యోగం నిలకడగా ఉంది. కొన్నేళ్ల క్రితం స్వగృహంలోనే ఒక అమావాస్య రోజు హనుమంతు మౌనదీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుండటంతో సొంత పొలంలోనే జీవ సమాధి కోసం ఒక ఆలయం నిర్మించినట్టు గ్రామస్తులు చెప్పారు. -
వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి
దొడ్డబళ్లాపురం: దేశంలో 2024 ఉగాది నాటికి ఫెర దుర్ఘటన జరుగుతుందని కోడిమఠం స్వామి జోస్యం చెప్పారు. విపత్తుల గురించి ఆయన తరచ జోస్యాలు చెప్పడం తెలిసిందే. ఆదివారంనాడు హాసన్ జిల్లా అరసికెరె తాలకా హారనహళ్లిలోని కోడిమఠంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచానికి మూడు గండాలు ఉన్నాయని అన్నారు. ఒకటి రెండు దేశాలు కనుమరుగవుతాయని, జనం అకాల మృత్యువాత పడతారని చెప్పారు. 2024 ఉగాదిలోపు ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు గండం ఉందని, పాలకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండాలను తప్పించవచ్చన్నారు. ఆ గండాలేమిటో కాలం వచ్చినప్పుడు చెబుతానన్నారు. భారీవర్షాలు కురిసి పట్టణాలకు, నగరాలకు అపాయం ఉందన్నారు. పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలుతాయన్నారు. అందరూ ఆధ్యాతి్మక చింతన అలవరచుకోవాలన్నారు. -
లైంగిక వేధింపుల కేసులో పూర్ణానందకు షాక్
సాక్షి, విశాఖపట్నం: జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) ఆశ్రమం లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విశాఖ పొక్సో కోర్టులో పూర్ణానంద వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో ఇద్దరు బాధిత మైనర్ బాలికలూ పూర్ణానందను.. గుర్తు పట్టారు(మూడు సార్లు ). దీంతో.. బెయిల్ పిటిషన్‌ను పోక్సో కోర్టు డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్ కోసం పూర్ణానంద పోక్సో కోర్టును ఆశ్రయింగా.. ఈ కేసులో అన్ని ఆధారాలు పూర్ణానందకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయడం ప్రమాదకరమని, పైగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన పోక్సో కోర్టు.. పూర్ణానందకు బెయిల్ తిరస్కరించిది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణానంద సరస్వతి స్వామీజీ 14 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో ఓ బాలిక(13) కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఓ కుటుంబం సాయంతో కంకిపాడు చేరుకుని.. ఆపై సీడబ్ల్యూసీ సహకారంతో విజయవాడ దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పూర్ణానంద వ్యవహారం వెలుగు చూసింది. -
అత్యాచారం కేసు: పూర్ణానంద రిమాండ్ పొడిగింపు
సాక్షి, విశాఖ: పూర్ణానంద అత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈనెల 17వ తేదీన దిశ పోలీసులు.. ఐడెంటిఫికేషన్ టెస్టు పెరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. మరోవైపు.. ఈ కేసులో దిశ పోలీసులు.. అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’ -
లోక కళ్యాణార్థం స్వామీజీ జలావాసం
రాయచూరు రూరల్: దేశ సుభిక్షం, రైతుల సంక్షోభ నివారణ, లోక కళ్యాణార్థం ఓ స్వామీజీ 12 రోజుల క్రితం జలావాసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాలూకాలోని మలియాబాద్ రామలింగేశ్వరాలయం కొండ గుహలో తాలూకాలోని ఉడుంగల్, ఖానాపుర, మంగళవారపేట మఠాధిపతి బాల శివయోగి వీర సంగమేశ్వర శివాచార్య మహాస్వామీజీ 48 రోజుల పాటు నిరాహారంతో మౌనంగా జలావాసంతో నిత్య తపస్సులో నిమగ్నులయ్యారు. జలావాసం నిర్వహణ పూర్తి బాధ్యతలను సోమవారపేట హిరేమఠం మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్యులు, రాఘవేంద్ర, అయ్యప్పలు సహకరిస్తున్నారు. కాగా స్వామీజీ జలావాసం తిలకించడానికి కలబుర్గి, రాయచూరు, బళ్లారి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. -
పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’
సాక్షి, విశాఖపట్నం: భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక, తాజాగా పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి -
పూర్ణానంద స్వామి చేష్టలు బయట పెట్టిన మైనర్ బాలిక
-
బాలికపై రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం!
(విశాఖ తూర్పు): అనాథ మైనర్ బాలికకు(15) అశ్రయం కల్పించిన నిర్వాహకుడే రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన అసల్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గొలనుగొండకు చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో సమీపంలో ఉండే ఒక మహిళ బాలికను ప్రభుత్వ హాస్టల్లో ఉంచి చదివించేది. ఆ మహిళా అధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉండటంతో బాలికను గత రెండేళ్ల క్రితం విశాఖలోని వెంకోజీపాలెం జాతీయ రహదారిని ఆనుకొని జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) చేర్పించింది. ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీ బాలికతో పాటు మరో 13 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో బాలిక కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో విశాఖ నుంచి విజయవాడ వస్తున్న ఒక కుటుంబం బాలికను చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. తమతో పాటు కంకిపాడు తీసుకువెళ్లి కొన్ని రోజులు వాళ్ల ఇంట్లోనే ఉంచి సోమవారం కంకిపాడు పోలీసుల సహకారంతో విజయవాడలోని సీడబ్ల్యూసీ సభ్యులకు అప్పగించింది. వారు బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికపై జరుగుతున్న వరుస లైంగిక దాడులు తెలుసుకుని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్రమం పేరుతో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై బాలిక చేత దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. విజయవాడ పోలీసుల సమాచారం మేరకు ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆశ్రమానికి చేరుకొని కీచక స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ మాట్లాడుతూ విజయవాడలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైందని, దీంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. అయితే స్వామీజీని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అసలు విషయాన్ని పక్కనపెట్టి సాధు ఆశ్రమం స్వామీజీ ఎంవీపీ పోలీసులను బోల్తాకొట్టించారు. ఏమీ తెలియనట్లు సాధు ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్లు ఈనెల 15న ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆశ్రమం వద్ద గల సీసీ కెమెరాలు పరిశీలించినా బాలిక వివరాలు తెలియరాలేదు. -
రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదన్న స్వామిజీలు
-
స్వామీజీ కార్యక్రమంలో భారీ చోరీ.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం..
ముంబై: స్వయంప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మీరా రోడ్‌లోని సలసార్ సెంట్రల్ పార్కు గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించారు. స్వామీజీ ఆశీర్వాదం కోసం దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆయితే నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇక్కడ దాదాపు తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. వేలమంది భక్తులు మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే భక్తుల మెడలో ఉన్న బంగారు గొలుసులు మాయమయ్యాయి. మొత్తం 36 మంది బాధితులు తమ బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారని లబో దిబోమన్నారు. స్వామీజీ కార్యక్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మెడలో మంగళసూత్రం కూడా పోయిందని ఓ మహిళా భక్తురాలు కన్నీటిపర్యంతమైంది. స్వామీజీ రోగాలను నయం చేస్తారని ఫోన్లో వీడియోలు చూసి ఇక్కడకు వెళ్లినట్లు చెప్పింది. తన రెండేళ్ల బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తే నయం చేస్తారని కార్యక్రామానికి వచ్చినట్లు పేర్కొంది. కానీ తోపులాట జరిగి మంగళసూత్రం పోగొట్టుకోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమైంది. కాగా.. కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఒక్కరు మాత్రమే గాయపడ్డారు. బంగారు ఆభరణాలు పోయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. శాంతాబెన్ మిథాలాల్ జైన్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ పోలీసులకు శుక్రవారం మెమోరాండం కూడా సమర్పించాయి. చదవండి: నీట్‌గా స్కెచ్ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి -
కర్ణాటకలో సంకీర్ణం వస్తుందా? కోడిమఠం స్వామీజీ జోస్యం ఇదే
సాక్షి, బెంగళూరు: త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, సంకీర్ణ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోను అధికారంలోకి రాదని కోడిమఠం స్వామీజీ జోస్యం చెప్పారు. విజయనగర జిల్లా హొసపేటెలో ఆయన మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తును తెలియజేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కొందరు చర్చించుకుంటున్న నేపథ్యంలో కోడిమఠం పీఠాధికారి డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ భవిష్యత్ రాజకీయాల గురించి నర్మగర్భంగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇద్దరు గొప్ప వ్యక్తులు కనుమరుగవుతారన్నారు. ఉగాది అనంతరం గత ఏడాది కంటే మంచి వర్షాలు పడుతాయన్నారు. కరోనా వచ్చినా భయమేమీ లేదని, ప్రాణహాని ఉండదన్నారు. -
సింగపూర్ లో స్వామీజీల రచ్చ
-
అబ్బా..! ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్
మనసులో అవతలి వాళ్ల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. బహిరంగ వేదికల్లో మాత్రం లేనిపోని ప్రేమలు ఒలకబోయడం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి ఘటనే ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అవతలివాళ్ల పట్ల, అదీ ప్రత్యేకించి దళితుల పట్ల తన సోదరభావం ఏపాటిదో చూపించే ప్రయత్నంలో.. ఓ ఎమ్మెల్యే చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.. ఓ దళిత స్వామిజీతో కలిసి తిండి పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత బయటకు ఉమ్మించి.. తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే తిన్నాడు. దళిత వర్గానికి చెందిన స్వామి నారాయణ.. చామరాజ్‌పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఈ చేష్టలకు దిగారు. తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మద్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నాడాయన. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో గా హాలును మారుమోగించారు. ఆదివారం చామరాజ్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు ఎమ్మెల్యే ఈ చేష్టలకు పాల్పడ్డాడు. #WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS ANI (@ANI) May 22, 2022 -
యువతిపై యాసిడ్ దాడి: ఆ క్లూ రాకుంటే దొరికేవాడు కాదేమో
బనశంకరి(బెంగళూరు): యువతిపై యాసిడ్ దాడికి పాల్పడి పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడు నాగేశ్ బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బాధిత యువతి కూడా ఆస్పత్రిలో క్రమంగా కోటుకుంటోంది. పరారీలోనున్న నాగేశ్ తిరువణ్నామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో తలదాచుకోవడంతో ఆచూకీ తెలియక పోలీసులు తలకిందులయ్యారు. చివరకు స్థానిక ఓ విద్యార్థి సహాయంతో దుండగున్ని పట్టుకున్నారు. ఫోటో తీసి పంపితే కామాక్షిపాళ్య పోలీసులు తిరువణ్ణామలై ప్రభుత్వ బస్టాండు వద్ద నాగేశ్ కోసం వాంటెడ్ ప్రకటనలు అంటించి పలు ఫోన్ నంబర్లు ఇచ్చారు. అతన్ని ఆశ్రమంలో ధ్యానం చేస్తుండగా చూశానని ఒక విద్యార్థి పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. అతని ఫోటోను కూడా రహస్యంగా తీసి పంపాడు. ఫోటో చూసి నాగేశ్ అని పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐ రవికుమార్, పోలీసులు మారువేషంలో ఆశ్రమానికి వెళ్లి నాగేశ్ పక్కన కూర్చున్నాడు. తమిళంలో మీ పేరు అని అడిగారు. దీనికి అతను జవాబివ్వలేదు. పోలీసులు నాగేశ్ అని పిలవడంతో అతను తిరిగి చూశాడు. దీంతో నిర్బంధించి తరలించారు. క్లూ రాకపోయి ఉంటే అతడు ఇప్పట్లో దొరక్కపోయేవాడు. చదవండి: వివాహేతర సంబంధం.. వాకిలి ఊడుస్తుండగా ఇంట్లోకి పిలిచి.. -
దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు..
సాక్షి,మరిపెడ రూరల్(వరంగల్): తాయత్తులు, పూజలు చేస్తానని ఓ దేశ గురువు పేరుతో దొంగ బాబా గ్రామస్తులను భయపెట్టి రూ.80వేలు వసూలు చేశాడు. అతనిపై అనుమానం వచ్చి కొందరు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ గురువుగా బయటపడింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలోకి ఈ నెల 25వ తేదీన దేశగురువు పేరుతో ఓ వ్యక్తి తన నలుగురు శిష్యువులతో కలిసి వచ్చాడు. (చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. ) వసతి కోసం అక్కడి సర్పంచ్‌ను ఆశ్రయించగా పాఠశాలలో ఓ గదిని చూపించారు. తన శిష్యులతో కలిసి దేశ గురువు తన గుర్రంపై గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు నీళ్లు అరబోయడంతో పాటు కొబ్బరికాయలు కొట్టారు. ఈ క్రమంలో వితంతువుని పిలిచి నీ కొడుకుకు ప్రాణగండం ఉందని అది పోవాలంటే తాయత్తు కట్టాలని అందుకు రూ. 7 వేలు, పెండ్లి కావడం లేదని మరొకరి ఇంట్లో రూ.5 వేలు, ఆరోగ్య సమస్య అని మరో ఇంట్లో రూ.10 వేలు చొప్పున ఒక్కరోజే రూ.80 వేలు కాజేశాడు. బయట ఊరినుంచి వీరారం వచ్చిన ఓ వ్యక్తి దేశ గురువు నిజస్వరూపం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బయటపడ్డ నిజస్వరూపం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన బూడిగ జంగాలకు చెందిన యాకయ్యగా బాబాను గుర్తించారు. కొందరితో ముఠాగా ఏర్పడి ఓ గుర్రాన్ని రోజుకు రూ. వెయ్యి కిరాయికి తీసుకొచ్చి దేశ గురువుగా యాకయ్య అవతారమెత్తాడు. పలు గ్రామాలు తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరారం గ్రామ బాధితుల ఫిర్యాదు మేరకు యాకయ్య, తన అనుచరులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. చదవండి: కన్నీటి గాథ: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆ నాన్న అనాథే -
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామీజీ
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్ శివమూర్తి మురుఘా గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్‌కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణానంతరం ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించటానికి రావాలని పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు. అభిమానుల అన్నదానం మైసూరు: హీరో పునీత్ రాజ్‌కుమార్ పుణ్య స్మరణగా టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళిలో అభిమానులు, గ్రామస్తులు భారీఎత్తున అన్నదానం నిర్వహించారు. సుమారు 2 వేల మందికి మాంసాహారంతో కూడిన భోజనం వడ్డించారు. మంచే గౌడ అనే అభిమాని గుండు చేయించుకుని నివాళులు అర్పించారు. చదవండి: ఇతని పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు. -
యడ్డీని ఎవరూ టార్గెట్ చేయలేరు
సాక్షి, గంగావతి (కర్ణాటక): మాజీ సీఎం యడియూరప్పను టార్గెట్ చేసే శక్తి ఎవరికీ లేదని ఆయన కుమారుడు బీ.వై. విజయేంద్ర అన్నారు. ఆయన సింధగి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గం మధ్యలో కొప్పళ గవిమఠాన్ని సందర్శించి గవిసిద్దేశ్వర స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సింధగి, హానగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. చంద్రశేఖర్ పాటిల్, కనకగిరి ఎమ్మెల్యే ధడేసూగూరు బసవరాజ్, అమరేష్ కరడి పాల్గొన్నారు. -
కరోనా విపత్తులో సీఎం జగన్ సేవలు భేష్
తుమకూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై స్ఫటికపురి మహా సంస్థాన మఠాధ్యక్షుడు నంజావదూత స్వామీజీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా రోగులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నారని అభినందించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్‌లా కోవిడ్ రోగులకు ఉచిత చికిత్సనందించి వారి ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆదివారం కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా తాలూకా పట్టనాయకనహళ్లిలో ఉన్న స్ఫటికపురి మహాసంస్థాన మఠంలో స్వామీజీ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల కర్ణాటకలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరుపేదలు చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీ అప్పుల్లో ఉన్నా అక్కడ సీఎం వైఎస్ జగన్ ఔదార్యంతో ఎంతో మంది కరోనాకు ఉచితంగా చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు ఉచిత వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. -
సడెన్‌గా రజనీకి స్వామిజీ ఆశీస్సులు
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి హఠాత్తుగా ఓ స్వామీజీ ప్రవేశించి ఆశీస్సులు అందించి వెళ్లారు. ఆ స్వామీజీ పేరు నమోనారాయణస్వామి. రాజకీయ పార్టీ లేదన్న ప్రకటన తర్వాత రజనీ పోయెస్‌గార్డెన్‌లోని ఇంటికే పరిమితం అయ్యారు. అపోలో వైద్యుల సూచన మేరకు ఆయన పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. ఆయన్ను కలిసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఈ పరిస్థితుల్లో శనివారం నమో నారాయణస్వామి రజనీ ఇంటికి వెళ్లారు. ఆయన్ను రజనీకాంత్, లతారజనీకాంత్ ఆహ్వానించారు. రజనీ,స్వామీజీ అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. రజనీకి స్వామిజీ ఆశీస్సులు అందించి వెళ్లారు. ఇంటి నుంచి బయటకు వచ్చి స్వామీజీకి వీడ్కోలు పలికారు. రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్ మండ్రం వర్గాలు పేర్కొన్నాయి. స్వామీజీ వచ్చి వెళ్లడం, ఇందుకు తగ్గ ఫొటోలు బయటకు రావడం గమనార్హం. (చదవండి: అమెరికాకు తలైవా?) -
పెజావర స్వామీజీ అస్తమయం
సాక్షి, బెంగళూరు: దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 9 రోజులుగా మణిపాల్ లోని కేఎంసీ ఆస్పత్రిలో స్వామీజీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం స్వామీజీ ఆరోగ్యం మరింత విషమించడంతో మఠానికి తీసుకుని వెళ్లారు. అనంతరం, ఉదయం 9.20 గంటల సమయంలో స్వామీజీ తుదిశ్వాస విడిచారు. స్వామీజీ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు స్వామీజీకి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. స్వామీజీ కోరిక మేరకు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 20న స్వామీజీని మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. శనివారం రాత్రి ఆయన శరీరంలోని కీలక అవయవాలు స్పందించడం ఆగిపోయింది. తుది శ్వాస మఠంలోనే విడవాలన్న స్వామీజీ కోరిక మేరకు ఆదివారం ఉదయం పెజావర మఠానికి తరలించారు. ప్రధాని సంతాపం స్వామీజీ మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘లక్షలాది ప్రజల హృదయాల్లో స్వామీజీ ధ్రువతారగా నిలిచి ఉంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ఎంతో కృషి చేశారు. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు. ఉడుపి నుంచి బెంగళూరుకు స్వామీజీ మరణవార్త విన్న అశేష భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే మఠానికి చేరుకున్నారు. భక్తుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉడుపిలోని అజ్జనగూడు మహాత్మాగాంధీ మైదానంలో ఉంచారు. తర్వాత హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించారు. బసవనగుడిలోని నేషనల్ కాలేజీ మైదానంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తర్వాత సంప్రదాయాల ప్రకారం పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. మధ్వాచార్యుడు స్థాపించిన మఠం 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు. హిందూజాతికి తీరని లోటు – స్వరూపానందేంద్ర సరస్వతి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ పరమపదించడం పట్ల విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశతీర్థ మరణం హిందూజాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరన్నారు. హిందూధర్మ పరిరక్షణకు విశ్వేశతీర్థ విశేష కృషి చేశారన్నారు. బెంగళూరులో పూర్ణప్రజ్ఞ విద్యా పీఠాన్ని ఏర్పాటు చేసి 63 ఏళ్లుగా వేదాంతంలో ఎంతోమందిని నిష్ణాతులను చేశారన్నారు. స్వామీజీ సేవలు చిరస్మరణీయం – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో స్వామీజీ విశేష సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి స్వామీజీ చేసిన నిరుపమాన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. -
ఉడిపి స్వామీజీ శివైక్యం
-
పుస్తకాలు కదా మాట్లాడింది..!
అతను ఓ యువకుడు. ఆ నోటా ఈ నోటా విని ఆ గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే ఉండి వైరాగ్యం, సన్న్యాసం గురించి తెలుసుకోవాలనుకున్నాడు యువకుడు. కానీ ఆ గురువుగారు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. శిష్యుడు ఏదైతే తెలుసుకోవాలనుకున్నాడో అది తప్ప మిగిలినవి చెప్పసాగారు గురువుగారు. ఆయన చెప్పే విషయాలు అతనిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. అవి అంత ప్రాధాన్యమైనవిగా కూడా అనిపించలేదు. దాంతో శిష్యుడికి గురువుగారి మీద ఒకింత కోపమొచ్చింది. నిరాశానిస్పృహలూ కలిగాయి. అప్పటికీ కొంత కాలం ఉండి ఇక లాభం లేదనుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఓ సంఘటన జరిగింది. ఆ తర్వాత అతను అక్కడినుంచి వెళ్ళనే లేదు. ఇంతకూ ఆ రోజు జరిగిన సంఘటన ఏమిటో చూద్దాం... ఆ రోజు మరొక యువకుడు ఆ గురువుగారి దగ్గరకు వచ్చాడు. అతను ఓ సాధువు. అక్కడున్న వారికి తన గురించి పరిచయం చేసుకున్న ఆ కొత్త సాధువు అందరితోనూ అవీ ఇవీ మాట్లాడుతూ వారి మాటలు వింటూ కొత్త కొత్త విషయాలను ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఆధ్యాత్మిక అంశాలపై కనీసం రెండు గంటలపాటు ఆ యువసాధువు మాట్లాడాడు. అందరూ గుడ్లప్పగించి విన్నారు. గురువుగారు కళ్ళు మూసుకుని ఆ యువకుడి మాటలను వినసాగారు. అప్పటికే అక్కడున్న పాత శిష్యుడు ఆ కొత్త సాధువు మాటలు విని తానింతకాలమూ ఆశించింది ఇటువంటి విషయాలనే కదా అని మనసులో అనుకున్నాడు. గురువు అనే వాడు ఇలా ఉండాలని, ఆ కొత్త సాధువుతో వెళ్ళిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. అక్కడున్న వారందరూ అతని మాటలను ఎంతగానో మెచ్చుకున్నారు. తమకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఓ రెండు గంటల తర్వాత ఆ కొత్త సాధువు తన ప్రసంగం ఎలా ఉందని గురువుగారిని అడిగాడు ఒకింత గర్వంతో. గురువుగారు కళ్ళు తెరచి ‘‘నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు... నేను రెండు గంటలుగా చూస్తున్నాను. నువ్వేం మాట్లాడావు...’’ అని అన్నారు.‘‘అదేంటీ అలా అంటారు... అలాగైతే ఇప్పటి వరకూ మాట్లాడిందెవరని అనుకుంటున్నారు...’’ అని కొత్త సాధువు ప్రశ్నించాడు. ‘‘శాస్త్రాలు మాట్లాడాయి... నువ్వు చదువుకున్న పుస్తకాలు మాట్లాడాయి... నువ్వు నీ స్వీయానుభవం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు... అటువంటప్పుడు నీ ప్రసంగంపై నా అభిప్రాయం ఏం చెప్పగలను?’’ అని గురువుగారు ప్రశ్నించారు. ఎప్పటికైనా స్వీయానుభవమే నిజమైనది. దోహదపడేది కూడానూ. – యామిజాల జగదీశ్ -
నాడు ఆధ్యాత్మిక గురువు.. నేడు అనాథ
నిన్నమొన్నటి వరకూ ఆయనో స్వామీజీ.. ఒంటి నిండా కాషాయ వస్త్రాలు ధరించి గ్రామగ్రామాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు తన జీవితాన్ని ధారపోశారు. విధి వక్రీకరించి పక్షవాతం సోకి ఒక కాలు, ఒక చేయి పనిచేయకుండా పోయాయి. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరిగి మంచాన పడ్డారు. ఆలనా.. పాలనా చూసేవారు లేక అనాథగా మారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సాక్షి, నల్లమాడ (ప్రకాశం): చీరాలకు చెందిన ఓ స్వామీజీ 15 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చేరుకున్నారు. ఎన్.ఎనుమలవారిపల్లి సమీపంలోని దేవరగుళ్ల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తూ జ్యోతిస్వరూపానంద స్వామీజీ అలియాస్ చీరాల స్వామీజీగా మండలంలో గుర్తింపు పొందారు. చాలా ఏళ్లపాటు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనే ఉంటూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఆలయంలో తరచూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు కృషి చేశారు. పాతబత్తలపల్లి పంచాయతీలోని గ్రామాల్లోనే గాక నల్లమాడ మండల వ్యాప్తంగా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా స్వామీజీ పాల్గొని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవారు. కుటుంబ బంధాలు తెగి.. ఆరు దశాబ్దాలు పైబడిన వయసున్న స్వామీజీకి చీరాలలో భార్యాపిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే 15 సంవత్సరాల క్రితమే వారితో సంబంధాలు తెగిపోయి.. ఒంటరిగా ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1న స్వామీజీకి పక్షవాతం సోకింది. ఎడమ చేయి, కాలు చచ్చుబడ్డాయి. చికిత్స అనంతరం ఊతకర్ర సాయంతో నడిచేవాడు. నెల రోజుల క్రితం ఊతకర్ర సాయంతో నడుస్తున్న స్వామీజీ అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో అతని ఎడమకాలు విరిగింది. సహాయకులు లేక అనాథలా.. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచాన పడ్డారు. నా అనే వారు లేకపోవడంతో ఆలనాపాలనా కరువైంది. గ్రామస్తులెవరైనా ఇంత తెచ్చిపెడితే తినాలి. లేదంటే పస్తులే. అన్నపానీయాలతో పాటు వైద్యం అందక రోజురోజుకూ స్వామీజీ ఆరోగ్యం క్షీణిస్తోంది. చెండ్రాయునిపల్లి క్వార్టర్స్‌లోని ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చుతున్నాడు స్వామీజీ. ఆస్పత్రికి వెళ్లి చూపించుకుందామంటే సహాయకుడు లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తూ రోజులు లెక్కిస్తున్నారు. దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి తనకు చికిత్స అందించాలని ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన వారిని స్వామీజీ వేడుకుంటున్నారు. లేని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాతలు ఎం.జ్యోతిస్వరూపానంద స్వామి, కదిరి ఎస్బీఐ అకౌంట్ నం.3559 549 9432 (ఐఎఫ్‌సీ కోడ్: ఎస్బీఐఎన్0000849)కు విరాళం పంపవచ్చు. -
శ్రీదర్గా పీఠాధిపతి సధురు స్వామీజీ ఇకలేరు
-
దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు
సాక్షి, న్యూఢిల్లీ : స్వామీజీగా చెప్పుకునే దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ కేసును సీబీఐకి బదలాయించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. గతంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు విచారణను చేపట్టారు. దాతీ మహరాజ్‌తో పాటు ఆయన శిష్యులపై 25 ఏళ్ల మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేశారు. పదేళ్లుగా దాతీ మహరాజ్ వద్ద తాను శిష్యరికం చేశానని, అయితే ఆయనతో పాటు ఇద్దరు శిష్యులు తనపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం తాను రాజస్థాన్‌లోని తన స్వస్ధలానికి వెళ్లిపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఓ మహిళా శిష్యురాలు స్వామీజీ గదిలోకి తనను బలవంతంగా తీసుకెళ్లిందని, తాను తిరస్కరించగా ఇతర శిష్యురాళ్లూ ఆయనతో గడిపారంటూ తనను లొంగదీసుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. స్వామీజీని, ఆయన సోదరులను అరెస్ట్ చేసి, రెండు ఆశ్రమాలను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బాధితురాలు కోర్టును కోరారు. దాతీ మహరాజ్‌ను అరెస్ట్ చేయడంలో విఫలమైన పోలీసులను, దర్యాప్తు సంస్ధలను కోర్టు తీవ్రంగా మందలించింది.