T Subbarami Reddy
-
విశాఖ తీరం : మహా కోటి శివ లింగానికి భక్తుల రద్దీ (ఫొటోలు)
-
సహజ నటి జయసుధకు ఎన్టీఆర్ పురస్కారం
సహజ నటి జయసుధ ప్రేక్షకలు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని కేంద్ర మంత్రి టి సుబ్బారామిరెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని సినీ నటి జయసుధకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతకుముందు ఆకునూరి శారద నిర్వహణలో సినీ సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఆ కార్యక్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ స్పికర్ మండలి ఉద్ద ప్రసాద్, సినీ దర్శకుడు ఎ కొదండరామిరెడ్డి, బి గోపాల్, రేలంగి నర్సింహారావు, వైవీఎస్ చౌదరి, వంశఅఈ సంస్థల వ్యవస్థాపకులు వంశీరాజు తదితరులు పాల్గొన్నారు. -
సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగా సుబ్బరామిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయా త్మక కమిటీ సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వాని తునిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.సి.వేణుగోపాల్ నుంచి నియామకపు లేఖ అందింది. సుబ్బరామిరెడ్డి గతంలో కేంద్రమంత్రి, స్టాండింగ్ కమిటీ చైర్మన్, టీటీడీ చైర్మన్ పదవులు చేపట్టడంతో పాటు పార్టీ పరంగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా, సీడబ్ల్యూసీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రులు కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్విలకు అవకాశం ఇచ్చారు. ప్రత్యేక ఆహ్వానితునిగా యూపీ మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ లల్లూను నియమించారు. -
నడిచే నిఘంటువు అక్కినేని
‘‘అందం, అభినయంతో సూపర్‌స్టార్స్ అయిన రేఖ, శ్రీదేవిగార్లకు అక్కినేని నాగేశ్వరరావుగారి అవార్డుని నా చేతులమీదుగా ఇవ్వడం నా అదృష్టం. వారిద్దరూ భారతదేశం గర్వించదగ్గ నటీమణులు’’ అని చిరంజీవి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకు ‘అక్కినేని జాతీయ అవార్డు’లకు శ్రీదేవి, రేఖలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి చిరంజీవి చేతులమీదుగా రేఖ తీçసుకోగా, శ్రీదేవి అవార్డును ఆమె భర్త బోనీకపూర్ స్వీకరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అంజనాదేవిగారికి నాగేశ్వరరావుగారంటే చాలా ఇష్టం. నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన నటించిన ‘రోజులు మారాయి’ సినిమా చూశారు. ఆ టైంలో అమ్మ కడుపులో ఉన్నది నేనే. అందుకేనేమో.. నాకూ సినిమాలంటే ఇష్టం కలిగింది. చదువు అయిపోయాక ఇండస్ట్రీలోకి వచ్చా. అది కూడా నాగేశ్వరరావుగారు, రామారావుగారు వంటి లెజెండ్స్ టైమ్‌లో. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో నాగేశ్వరరావుగారితో నటించడం అద్భుతమైన జ్ఞాపకం. నేను క్రమశిక్షణగా ఉన్నానంటే అది ఆయన వల్లే.. ఓ రకంగా నా గురుతుల్యులు. ఆయన నడిచే నిఘంటువు. నటనలో ఒక ఎన్సైక్లోపీడియా. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఏదో ఒక రోజు ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ అంత గొప్ప స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. శ్రీదేవి, రేఖగార్లు మనందరం గర్వించే స్థాయిలో ఉన్నారు. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేసిన శ్రీదేవిగారు ‘ఇండియా లేడీ సూపర్‌స్టార్’ అయ్యారు. రేఖగారిపై నాకున్న అభిమానంతో నా భార్య సురేఖని ఇప్పటికీ రేఖ అనే పిలుస్తుంటా.. ఆ విషయం తనకి తెలియదు(నవ్వుతూ)’’ అన్నారు. రేఖ మాట్లాడుతూ – ‘‘నా తొలి సినిమా, తెలుగు సినిమా ‘ఇంటిగుట్టు’. శ్రీదేవిగారు గొప్పనటి. ఆమెలా ఉండాలి. నా జీవితంలో తొలిసారి చూసిన సినిమా ‘సువర్ణ సుందరి’. అంజలీదేవిగారి ‘అమ్మకోసం’ సినిమాతో నాకు బ్రేక్ వచ్చింది. నేను ఇక్కడ ఉన్నానంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా నాగేశ్వరరావుగారు, అంజలి అత్తయ్యే కారణం. ‘సువర్ణసుందరి’ సినిమా వందసార్లు చూసి ఉంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నేనూ చూశాను. ముంబైలో ఉన్నప్పుడు టి.రామారావుగారు, పూర్ణచంద్రరావుగారు, దాసరి నారాయణరావుగారు, కె.విశ్వనాథ్‌గారు, జితేందర్గారు ఇక్కడ సినిమాలు చేయమని పిలిచేవారు. మా అమ్మ చెప్పిన మాట ప్రకారం మరో తెలుగు సినిమా తప్పకుండా చేస్తా’’ అన్నారు. ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ వేడుక సందడి చూస్తుంటే అక్కినేనిగారి చిరునవ్వును చూసినట్లుంది. నాకు, ఏయన్నార్‌గారికి వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ క్లాస్‌మేట్స్‌లా ఉండేవాళ్లం. అందంతో పాటు మంచి మనసున్న నటి శ్రీదేవి. 35 ఏళ్ల క్రితం రేఖ ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారు. నాగేశ్వరరావుగారు, ఎన్టీఆర్, చిరంజీవి, నాగా ర్జున వంటి వారి నుంచి నేటితరం నటీనటులు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి’’ అన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాం. శ్రీదేవి, రేఖగార్లకు ఈ అవార్డులు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావుగారు ఉంటారు. ఈ వేదికమీదున్న అవార్డుతో పాటు నాన్న కూడా ఇక్కడే మనమధ్యే ఉంటారు. శ్రీదేవిగారితో నేను నాలుగు సినిమాలు చేశా. బోనీకపూర్గారు భర్తగా లభించడం శ్రీదేవిగారి అదృష్టం. అక్కినేనిగారు, శ్రీదేవిగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. రేఖగారు, శ్రీదేవిగారు ఇద్దరూ తెలుగువాళ్లే.. ఇద్దరూ ఇండియా సూపర్స్టార్సే.. ఇది మనకు గర్వకారణం’’ అన్నారు. ఈ వేడుకలో బ్రహ్మానందం, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, అఖిల్, సుమంత్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, అడివి శేష్, అమల, సుప్రియ, మంచు లక్ష్మీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఒక్కటయ్యారు
సినీ నటి అర్చన(వేద) వివాహం పారిశ్రామికవేత్త జగదీష్‌తో హైదరాబాద్‌లో జరిగింది. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, ‘కళాబంధు’టి. సుబ్బరామిరెడ్డి, నటుడు మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సురేష్ కొండేటి, డైరెక్టర్ ఓంకార్, నటీనటులు మంచు లక్ష్మి, మధుమిత, ఆలీ, శివబాలాజీ, సమీర్, అశ్విన్‌బాబు, రవిశంకర్, యాంకర్ సుమతో పాటు పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
మహోన్నతుడు అక్కినేని
‘‘అందరి గుండెల్లో జీవించి ఉండే మహోన్నతమైన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు(ఏయన్నార్). అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేం. ఆయన పేరిట నెలకొల్పిన ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ అవార్డు గ్రహీతలు అదృష్టవంతులు’’ అని ‘ఏయన్నార్ జాతీయ అవార్డు కమిటీ చైర్మన్’, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. 2018, 2019 సంవత్సరాలకుగానూ ఏయన్నార్ జాతీయ అవార్డు గ్రహీతల పేర్లను హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఏయన్నార్ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2018కి దివంగత ప్రముఖ నటి శ్రీదేవికి, 2019కి నటి రేఖలను ఎంపికచేశారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో హీరో చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘నాకు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారు పిలిచి ‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ను స్థాపించి, అవార్డులు ఇవ్వాలనే ఆలోచన గురించి చెప్పారు. తాను ఉన్నా లేకున్నా తన వారసుల చేత ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూనే ఉండాలన్నారు. అలా 2006లో ‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ను స్థాపించి, తొలిసారి నటుడు దేవానంద్‌కు ఇచ్చాం. 2017లో దర్శకుడు రాజమౌళికి ఇచ్చాం. నటీమణులుగా శ్రీదేవి, రేఖ జాతీయస్థాయిలులో కీర్తి గడించారు. అందరూ గర్వించే గొప్ప నటి శ్రీదేవికి ఈ అవార్డు ఇవ్వాలనేది నాగేశ్వరరావుగారి కోరిక కూడా. అందుకే 2018 అవార్డును శ్రీదేవికి ఇస్తున్నాం. తండ్రి ఆలోచనలను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్న నాగార్జునగారిని అభినందిస్తున్నాను’’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్ నేషనల్ ఫిలిం అవార్డు’ మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నాన్నగారి(ఏయన్నార్) పేరు ఉన్నంతవరకు ఈ అవార్డును ప్రదానం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మా నాన్నగారికి సుబ్బరామిరెడ్డిగారు ఎంత సన్నిహితులో, నాకూ అంతే సన్నిహితులు. ఈ అవార్డు కమిటీ బోర్డ్ చైర్మన్‌గా ఆయన ఉండాలి అనేది నాన్నగారి కోరిక. శ్రీదేవి తరపున ఈ అవార్డును ఆమె భర్త బోనీకపూర్, కుటుంబ సభ్యులు తీసుకుంటారు. రేఖగారికి ఈ అవార్డు గురించి చెప్పగానే చాలా సంతోపడ్డారు. నాన్నగారితో మంచి అనుబంధం ఉందని, ఆయన దగ్గర నటనకు సంబంధించిన సలహాలు తీసుకున్నట్లు చెప్పారామె. అవార్డు గ్రహీతలకు ఐదు లక్షల నగదు బహుమతి అందజేస్తాం. ఈ కార్యక్రమంలో ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రేఖగారు సర్టిఫికెట్లు అందజేస్తారు’’ అన్నారు. -
సైరాలాంటి సినిమాలు ఇంకా రావాలి
‘‘సైరా నరసింహారెడ్డి’లాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి’’ అన్నారు ‘కళాబంధు’, నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. చిత్రబృందాన్ని టి. సుబ్బిరామి రెడ్డి సన్మానించి, మాట్లాడుతూ–‘‘దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చిరంజీవితో నేను ‘స్టేట్‌రౌడీ’ సినిమా నిర్మించాను.ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే సూపర్‌హిట్ సాధించింది. చరణ్‌లాంటి కుర్రాడు ఇంత పెద్ద సినిమా నిర్మించాడంటే ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సైరా’ సినిమా విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పేవారు సుబ్బిరామిరెడ్డి. ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అన్నారు. ‘‘సుబ్బిరామిరెడ్డిగారి ఫంక్షన్ లేకపోతే ఆ ఏడాది మాకు ఏదో వెలితిగా ఉంటుంది’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా ఆ యూనిట్‌ని గౌరవించడం సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘తెలుగు చలన చిత్రపరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన గొప్ప సినిమా ‘సైరా’’ అన్నారు నటుడు మురళీమోహన్. ‘‘తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘చిరంజీవిగారి కెరీర్లో ఇదొక మైలురాయి సినిమా’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సురేందర్‌రెడ్డి, నటి తమన్నా, కెమెరామన్ రత్నవేలు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయి మాధవ్ బుర్రా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నటులు కృష్ణంరాజు, వెంకటేష్, దర్శకులు కోదండరామిరెడ్డి, క్రిష్, సుకుమార్, మెహర్ రమేష్, నిర్మాతలు అశ్వనీదత్, డి.సురేష్‌బాబు, బోనీ కపూర్, కేఎస్ రామారావులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జయసుధకు అభినయ మయూరి బిరుదు ప్రదానం
-
నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు
‘‘ఇన్నేళ్ల నా సినీ జీవితంలో అతి పెద్ద గిఫ్ట్ అంటే అభినయ మయూరి బిరుదే’’ అని సహజ నటి జయసుధ అన్నారు. విశాఖలో మంగళవారం టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నటి జయసుధకు అభినయ మయూరి బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జయసుధ మాట్లాడుతూ – ‘‘నన్ను సినీ పరిశ్రమలోకి తీసుకు వచ్చిన విజయనిర్మల (దివంగత నటి, దర్శకురాలు) ఆంటీ ఈ బిరుదు ప్రదానోత్సవంలో లేకపోవటం నాకు చాలా వెలితిగా ఉంది. నా తొలి సినిమా ‘పండంటి కాపురం’లో జమున నా తల్లి పాత్ర పోషించారు. అప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఇన్నేళ్ల తరువాత నా బిరుదు ప్రదానోత్సవంలో ఆమె పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. సినీ జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే మన నిజ జీవితంలో కూడా ఉంటారు. నాకు జయప్రద, రాధిక, మురళీమోహన్ అలాంటివారే. వారు నా జీవితంలోని అన్ని విషయాల్లో భాగస్వామ్యంగా ఉన్నారు. గత 40 ఏళ్లుగా టీఎస్సార్ (టి. సుబ్బిరామిరెడ్డి) నిర్వహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఏనాడూ ఆయన్ని నేను ఏమీ అడగలేదు. కానీ ఇంత మంది ప్రముఖల సమక్షంలో నాకు ఈ బిరుదు ప్రదానం చేసి నాలోని ఉత్సహాన్ని నింపారు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ వైజాగ్ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అందుకే అన్ని వేడుకలు విశాఖలోనే జరుపుకుంటారు’’ అన్నారు. వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు నటుడు రాజశేఖర్ పేరు చెప్పబోయి రాజశేఖర్ రెడ్డి అని జయసుధ సంభోదించారు. దీనితో వైఎస్సార్ ఆశీస్సులు కూడా తనపై ఉన్నాయని అందుకునే తన నోట వెంట ఆయన పేరు వచ్చిందని జయసుధ అన్నారు. ►నటి జమున మాట్లాడుతూ – ‘‘జయసుధను ఎందుకు అందరూ సహజ నటి అంటారు.. మేము కాదా అనిపించేది. కానీ ఆమె తక్కువ మేకప్‌తో ఎక్కవ నటన ప్రదర్శించి ప్రేక్షకుల మనస్సులను దోచుకోవటం వలనే ఆ బిరుదు వచ్చిందని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కళాకారులకు ఇలాంటి అవార్డులు, బిరుదుల ప్రదానం వలన ప్రోత్సాహం, ఎంతో ఉత్సాహం లభిస్తుంది’’ అన్నారు. ►నటి శారద మాట్లాడుతూ – ‘‘ఒక చిత్రంలో నేను జయసుధ చెంప పై గట్టిగా కొట్టాలి. ఆ సన్నివేశంలో ఆమె నటించిన తీరు ఆద్భుతం’’ అని చెప్పారు. కళ ఒక మహాశక్తి: టీఎస్సార్ టి. సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ –‘‘కళ ఒక మహా శక్తి అని నేను నమ్ముతాను. అందుకే కళాకారులను ప్రోత్సహిస్తాను. సర్వమతాల సారాంశం ఒక్కటే. అందుకే అన్ని మతాల గురువులను సన్మానించాను. అందరూ ప్రతీ సంవత్సరం జన్మదినం జరుపుకుంటారు. అయితే అటువంటి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడేలా చేసుకోవాలని ఆలోచించుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు నాకు మంచి స్నేహితుడు. ఆయన స్ఫూర్తితోనే ఈ విధంగా నలుగురి మధ్యలో నా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఏం సాధించాం, ఏం సా«ధించబోతున్నాం అని నెమరువేసుకుంటాను. కొన్నేళ్లుగా ఇలా విశాఖ నగరవాసుల మ«ధ్యనే ఈ వేడుకలు జరుపుకుంటూ గొప్ప గొప్ప కళాకారులను సన్మానిస్తున్నాను. ఈ ఏడాది జయసుధకు అభినయ మయూరి బిరుదు అందించడం ఆనందంగా ఉంది. జయసుధ సౌమ్యురాలు. ఆమె అందరికీ మంచి స్నేహితురాలు. ఆమె అన్ని పాత్రల్లోనూ జీవించారు’’ అని చెప్పారు.ఈ వేడుకల్లో భాగంగా జయసుధకు బంగారు కంకణాన్ని బహుకరించారు. 20 నిముషాలపాటు టీఎస్సార్ చేసిన ఓంకారం వీక్షకులను ఆకట్టుకుంది.ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, హాస్యనటుడు బ్రహ్మానందం, రాజశేఖర్, శరత్ కుమార్, జయప్రద, రాధిక, జీవిత, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తదితరులు పాల్గొన్నారు. -
సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు
‘‘ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూశా. సినిమా ఆఫీస్ ప్రారంభం నుంచి ఆ చిత్రం విడుదలయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు. సినిమా అనేది అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు’’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ‘తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం’ హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ–‘‘షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లే. కాబట్టి సినిమా సక్సెస్‌లో వారి వంతు చాలా ఉంటుంది. ‘సైరా’ సినిమా షూటింగ్ లొకేషన్ కోసం మా మేనేజర్ లొకేషన్ వారి కాళ్లమీద పడి అనుమతి తీసుకున్నారు. ఇందుకు మేనేజర్స్‌కి మా హృదయపూర్వక నమస్కారాలు. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రజతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ–‘‘సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు ఈ ఫంక్షన్‌కు రావడం హర్షించదగ్గ విషయం. ఈ వేడుకను ఇంత గ్రాండ్‌గా చేసిన మేనేజర్స్ యూనియన్‌కు అభినందనలు. భవిష్యత్తులో కూడా నేను చిత్ర పరిశ్రమకు సహాయపడతాను’’ అన్నారు. నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్స్ ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమాని టైమ్‌లో పూర్తి చేయగలరు. తెలుగు చిత్ర పరిశ్రమలో గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్‌ను చూశాను. వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి’’ అన్నారు. నటుడు గిరిబాబు మాట్లాడుతూ– ‘‘ప్రొడక్షన్ మేనేజర్ల సేవలు చాలా అమూల్యమైనవి. సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు వారు సినిమాకు చాలా సహాయంగా ఉంటారు. వారు పదికాలాల పాటు చల్లగా ఉండాలి’’ అన్నారు. దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన మేనేజర్స్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు. హీరో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్లో చిరంజీవిగారిని కలవడం కొత్త ఎనర్జీని ఇచ్చింది. మేనేజర్స్ చేస్తున్న ఈ వేడుకకు రావడం సంతోషంగా భావిస్తున్నా. భవిష్యత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చేయాలి’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మేనేజర్లు చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవడం సంతోషం. నేను 32 సినిమాలు తీశాను కాబట్టి రూ.32 లక్షలు మేనేజర్స్ యూనియన్‌కు ఇస్తున్నా. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయి’’ అన్నారు. కాగా మేనేజర్స్ యూనియన్‌కు నటీనటులు జీవిత, రాజశేఖర్ రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి, కోటా శ్రీనివాసరావు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, అల్లు అరవింద్, సురేశ్ బాబు, నీహారిక, నాగబాబు, రామ్–లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశీఖన్నా, రెజీనా, ప్రగ్యాజైస్వాల్, పూజాహెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, శ్రీకాంత్, అశ్వినీదత్, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీతో పాటు ‘తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్’ గౌరవ అధ్యక్షుడు ఎమ్.సీతారామరాజు, అధ్యక్షుడు అమ్మిరాజు కాసుమిల్లి, ప్రధాన కార్యదర్శి: ఆర్.వెంకటేశ్వర రావు, కోశాధికారి: కె.సతీష్, ఉపాధ్యక్షులు డి.యోగనంద్, కుంపట్ల రాంబాబు, జాయింట్ సెక్రటరీలు సురపనేని కిషోర్, జి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. రోజారమణి, సుమలత, టి. సుబ్బరామిరెడ్డి, జయప్రద, చిరంజీవి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రఘురామకృష్టం రాజు, అమ్మిరాజు, రాజశేఖర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో భారీ దొంగతనం జరిగింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు, నగదు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టారు. -
చిటపట చినుకులు పాట పాడుతుంటారు
‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే..’ పాట పాడుతూ ఉంటారు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నేను యన్టీఆర్‌ను అన్నయ్యా అంటాను. ఆ సంభాషణను గుర్తుచేసి మళ్లీ మళ్లీ ఆ డైలాగులు చెప్పమని అడుగుతుంటారు. మరోసారి ఈ విషయాలను గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు’’ ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘విశ్వనట సామ్రాజ్ఙి’ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరోజాదేవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకున్న నటి సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు ఇది’’ అన్నారు. ఈ వేడుకలో ప్రముఖ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సంతోషమే నాకు శక్తి
‘‘ఎన్నో ఏళ్లుగా ఈ వేడుకను కన్నుల పండువగా చేస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. మీరొక్కరే ఇలాంటి వేడుకలను ఇంత బాగా చేయగల శక్తి ఎక్కడినుంచి వస్తుందని ఆయన్ని అడిగాను. ‘కళాకారులంటే నాకు అమితమైన ఇష్టం. వారిని ప్రోత్సహించాలి. తద్వారా.. వారు పొందే ఆనందం నుంచి నేను శక్తి పుంజుకుంటాను’ అని సుబ్బరామిరెడ్డిగారు చెప్పడం ఆయన కళాత్మక హృదయానికి నిదర్శనం’’ అని హీరో చిరంజీవి అన్నారు. 2017, 2018 సంవత్సరాల ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ ఫంక్షన్‌ని విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 2017 మోస్ట్ పాపులర్ ఫిల్మ్ (ఖైదీ నెంబర్ 150) నిర్మాతగా, 2018 బెస్ట్ హీరో (రంగస్థలం) అవార్డులకు రామ్‌చరణ్ ఎంపికయ్యారు. ఈ అవార్డులను స్వీకరించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డిగారు పిలవగానే నేను, బాలకృష్ణగారు, నాగార్జునగార్లతో పాటుగా మిగతా హీరోహీరోయిన్లు వచ్చారంటే ఏదో మొక్కుబడిగా రాలేదు. మనసుతో వచ్చాం.. ఇష్టంతో వచ్చాం. ఓ వేడుకకు మేం అందరం కలిసి రావడం జరగదు. ఆ ప్రయత్నం ఎవరూ చేయరు. అది ఒక సుబ్బరామిరెడ్డిగారివల్లే అవుతుంది. మా మ«ధ్య ఒక అన్నదమ్ముల అనుబంధం ఉన్నట్లుగా, మంచి స్నేహితులం అన్నట్లుగా మీకు (ప్రేక్షకులు) తెలియజేసేందుకు ఇదొక చక్కని సందేశం కూడా. మా అభిమానులందరూ ఎటువంటి భేదాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేట్లు ఇది దోహదం చేస్తుంది. ఈ రోజు బాలకృష్ణగారికి, నాగార్జునగారికి, మోహన్‌బాబుగారికి అవార్డు వచ్చింది. నాకే ఏ అవార్డు రాలేదు (నవ్వుతూ). రామ్‌చరణ్ అవార్డులు అందుకొని, ఆ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నా’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డిగారు ఏడాదికి మూడు కార్యక్రమాలు చేస్తారు. ఒకటి శివరాత్రి.. రెండు ఇలాంటి అవార్డుల వేడుక.. మూడు ఆయన పుట్టినరోజు.. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఎన్నని చెప్పగలం. ఎప్పుడెప్పుడు ఆయన వైజాగ్‌కి రమ్మని పిలుస్తారా? వెళ్లి ఆయన చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పాలా? అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. గత ఏడాది మా అమ్మగారు చనిపోవడంతో ఇక్కడికి రాలేకపోయాను. వైజాగ్ వచ్చి దాదాపు ఏడాది అయింది. ఒక ఆత్మీయుడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడంటే అందరూ గర్వించాల్సిన విషయం. ఎన్నికల ముందే ఏదైనా చేస్తుంటారు. కానీ, 18 ఏళ్ల నుంచి నాకు ఓట్లు అక్కర్లేదు.. మీ ఆశీస్సులు కావాలి.. మీ హృదయంలో నాకు చోటు కావాలి అన్న ఏకైక వ్యక్తి, మన ఆత్మబంధువు సుబ్బరామిరెడ్డిగారు. ఇంతమంది సినిమా వాళ్లను ఒక వేదికపైకి తీసుకురావడం మామూలు విషయం కాదు. కొంతమంది చేయరు.. ఇతరులు చేస్తే సంతోషించరు. సుబ్బరామిరెడ్డిగారు పాలులాంటి వారు. పాలల్లో నుంచి పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి వస్తుంది. ఎవరికి ఏది కావాలంటే అది కోరుకునే పాలలాంటి వ్యక్తి ఆయన. నాకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వారు నా గురువు దాసరి నారాయణరావుగారు. ఆయన లేని లోటు ఈ పాతికేళ్ల నుంచి ఉన్న ఈ జనరేషన్‌కి తెలియదు. హీ ఈజ్ ఓన్లీ ఒన్. 1 నుంచి 100 వరకూ ఓన్లీ ఒన్ మేన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మా గురువుగారు. ఆయన ఉండరని, ఆయన పేరుతో ఉన్న ‘దాసరి నారాయణరావు మెమోరియల్ అవార్డు’ నేను తీసుకుంటానని కలలో కూడా ఊహించలేదు’’ అన్నారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇలా అందర్నీ ఒకే వేదికపై తీసుకొచ్చిన ఘనత ఒక్క సుబ్బరామిరెడ్డిగారికే దక్కుతుంది. ఆయన అజాత శత్రువు. మంచి చిత్రాలు తీయాలని మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేది ఇలాంటి ఉత్సవాలే. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రానికి నన్ను ఉత్తమ కథానాయకుడిగా ఎంపిక చేసిన ప్రేక్షకులకు, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు. నాన్నగారు (ఎన్టీఆర్) చేయనటువంటి పాత్ర అది. ఈ పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కళల వెలుగులను ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేసి దేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతున్న ఎందరో మహానుభావులు పుట్టిన మన దేశం.. నిజంగా కళాఖండదేశం అని గర్వపడాలి. కళలకు చావులేదు’’ అన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నా అన్నయ్యలందరూ ఇక్కడే ఉన్నారు. ప్రత్యేకించి నా పెద్దన్నయ్య మోహన్‌బాబుగారు (నవ్వుతూ). నాకు ఇష్టమైన ‘రంగస్థలం, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలకు అవార్డులు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారీ మమ్మల్ని ఇలా పిలుస్తున్నందుకు, మా అన్నయ్యలందరితో కల్పిస్తున్నందుకు సుబ్బరామిరెడ్డిగారికి థ్యాంక్స్.. నాదీ, ఆయన వయసు ఒక్కటే.. కేవలం 30ఏళ్లు (నవ్వుతూ).. ఓంకారంతో ఆయన మొదలు పెట్టే శక్తిని మేము పుచ్చుకుంటాం’’ అన్నారు. కళాబంధు, ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ చైర్మన్ టి.సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంతమంది స్టార్స్‌ని తీసుకురావడం మామూలు విషయం కాదు. ఇందుకు ఎంతో కృషి చేశాను. ఎందుకు అంత కష్టపడ్డానంటే మీ సంతోషం కోసం (ప్రజలు).. మీ సంతోషమే నాకు శక్తి. నాకు పొగడ్త కానీ, ఓటు కానీ ఏదీ అవసరం లేదు. 20ఏళ్ల నుంచి ఆధ్యాత్మికంగా, సామాజికంగా, కళాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను. మిమ్మల్ని ఏ సహకారం అడగకుండా నిస్వార్థంగా ఈ కార్యక్రమం చేస్తున్నా. మీరు సంతోషంగా ఉండటమే నాకు ఇచ్చే సహాయం, శక్తి. ప్రజలే ఈ అవార్డు విజేతలను ఎన్నుకున్నారు. భారతదేశ చరిత్రలో సినిమా ఫంక్షన్స్ అంటే పబ్లిక్‌గా చేయరు. 1000 నుంచి 1500 మందితో ఆడిటోరియంలో చేస్తారు. కానీ నేను చాలెంజ్‌గా తీసుకుని అందరి సహకారంతో రేయింబవళ్లు కష్టపడి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నా. మీ కేరింతలు, ఆనందం నాకు టానిక్ లాంటిది. రఘురామకృష్ణరాజు, ఉమేశ్ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా కోఆర్డినేట్ చేశారు’’ అన్నారు. ‘సిరివెన్నెల’ సీతరామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డిగారి జాతీయ అవార్డుల వేడుక ఎంత అద్భుతంగా జరుగుతుందో మా తారాలోకంలో చెప్పుకుంటున్నప్పుడు విన్నాను.. ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. దేశంలోని భిన్న ప్రాంతాలు, భిన్న భాషల కళాకారులు ఇక్కడ ఉన్నారు. ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు సుబ్బరామిరెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు. నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘దాదాపు తెలుగు సినిమా రాజులందరూ ఒకే వేదికపై ఇక్కడే ఉన్నారు. నాలాంటి కళాకారులు ఇంకా అవార్డులు తీసుకోవడానికి కారణం మాత్రం ఈ జనరేషన్ రచయితలు, డైరెక్టర్స్ రాయడం వల్ల. ‘మహానటి’ నాకు చాలా ఇష్టమైన సినిమా అని ఇందాక నాగ్ (నాగార్జున) చెప్పారు. సో.. నటులకే నచ్చే నటుల సినిమాల్ని రచించి, తీసినటువంటి ఆ దర్శకులకే ఈ క్రెడిట్ చెందుతుంది. నేను, నా మనవరాలు ఒకే వేదికపై ఒకేసారి అవార్డు అందుకోవడం.. మరీ ముఖ్యంగా నా తోటి తాతలందరితో కలిసి (నవ్వుతూ) మనవరాలు అవార్డు తీసుకుంటున్న సందర్భంకంటే ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి. ఇంత అద్భుతమైన ఫంక్షన్ చేస్తేనే కళలకి, కళాకారులకి గౌరవం ఉంటుంది’’ అన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డు వేడుకలో మంత్రి గంటా శ్రీనివాసరావు, నిర్మాతలు అంబికా కృష్ణ, బీవీఎస్ఎన్ ప్రసాద్, చెరుకూరి మోహన్, నిర్మాత బోనీకపూర్, హీరోలు విశాల్, సుమంత్, ఆది పినిశెట్టి, కల్యాణ్ దేవ్, నటులు అలీ, నరేశ్, హీరోయిన్లు విద్యాబాలన్, ఖుష్బూ, రకుల్ ప్రీత్‌సింగ్, పూజా హెగ్డే, కీర్తీ సురేశ్, కేథరిన్ థెరిస్సా, అదితీరావ్ హైదరీ, షాలినీ పాండే, ప్రగ్యా జైస్వాల్, రాశీఖన్నా, రితికా సింగ్, ప్రియాంకా జవాల్కర్, దర్శకులు వెంకీ అట్లూరి, పరశురామ్, అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్లు పరుచూరి గోపాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పింకీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీయస్సార్ మీద బయోపిక్ తీయాలి
2010 నుంచి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి టీవీ 9తో కలసి ‘టీయస్సార్ – టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ పేరుతో అవార్డ్ ఫంక్షన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017–2018 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను వచ్చే నెల 17న విశాఖపట్టణంలో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా టీయస్సార్ వ్యవహరించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, కేయస్ రామారావు, నరేశ్, రఘురామ కృష్ణంరాజు, కామినేని శోభనా, జీవిత, నగ్మా, మీనా, జ్యూరీ సభ్యులు. అవార్డు వేడుక వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ – ‘‘సినిమా పవర్ఫుల్ మీడియమ్. కోట్లాది మందిని ఆనందింపజేస్తుంది. కళాకారులని జనం అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలాగే మా అవార్డ్స్ ఫంక్షన్లో నిర్ణయం కూడా ప్రజలదే. వాళ్ల ఓటింగ్‌ని పరిగణించి జ్యూరీ సభ్యులు విజేతలను ప్రకటిస్తారు. కళాకారులు ఆనందం పొందితే నాకు కొత్త శక్తి వస్తుంది. విద్యాబాలన్‌కు శ్రీదేవి మెమోరియల్ అవార్డ్ అందిస్తాం’’ అన్నారు. ‘‘బ్రతికున్నంత కాలం అవార్డులు గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు ఓసారి నాతో అన్నారు. కళాకారుల ఆకలి అలాంటిది. ఆ కళాకారుల ఆకలి తీరుస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. శివుణ్ణి నటరాజు అంటాం. ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపించిందే చేస్తున్నారు టీయస్సార్‌గారు. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీయాలి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘టీయస్సార్‌గారు నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆయన నిర్మించిన ‘గ్యాంగ్మాష్టార్’ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నగ్మా. ‘‘చలికి దుప్పట్లు, కళాకారులకు చప్పట్లు ముఖ్యం’’ అన్నారు నరేశ్. ‘‘నాన్నగారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. కళాకారులను అభినందించడానికి ఎంతో శ్రమపడతారు నాన్న. నాన్నగారి ఆటోబయోగ్రఫీ రాయిస్తున్నాం. ‘టీచింగ్స్ ఆఫ్ టీయస్సార్’ పేరుతో ఆ బుక్ ఈ ఏడాది తీసుకొస్తాం’’ అన్నారు పింకీ రెడ్డి. ‘‘గవర్నమెంట్లు నంది అవార్డ్స్ ఫంక్షనే వరుసగా చేయలేకపోతున్న తరుణంలో టీయస్సార్ వరుసగా ఈ అవార్డ్ పంక్షన్స్ చేయడం అభినందనీయం’’ అన్నారు నిర్మాత కేయస్ రామారావు. ‘‘హైదరాబాద్ వచ్చి చాలా రోజులైంది. సంతోషంగా ఉంది. మమ్మల్ని జ్యూరీ సభ్యులుగా నియమించినందుకు మా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాం’’ అన్నారు మీనా. ఈ కార్యక్రమంలో కామినేని శోభన పాల్గొన్నారు. -
టీ.సుబ్బిరామిరెడ్డి అతిరుద్ర చండీయాగం ప్రారంభం
-
నేను అనుకున్నవన్నీ జరుగుతాయి
‘‘మనందరి ప్రేమాభిమానాల్లో ఏయన్నార్‌గారు ఎప్పుడూ నిలిచి ఉంటారు. ఈ సినిమా చేయడానికి మూడు కారణాలు. స్క్రిప్ట్, అశ్వనీదత్‌గారు, నాని’’ అన్నారు నాగార్జున. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘దేవదాస్’. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. గురువారం అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఒక సీత కథ’ తర్వాత అశ్వనీదత్‌గారు 24 ఏళ్ల వయసులో తెల్లవారుజామున 4 గంటలకు ఎన్టీఆర్‌గారి ఇంటి ముందు నిల్చున్నారు సినిమా కోసం. ఎన్టీఆర్‌గారు ‘ఎదురులేని మనిషి’ సినిమా చేశారు. పెద్ద హిట్ అయింది. ఆయన ఫొటోనే ఈ సంస్థ లోగోలో ఉంటుంది. సాధారణంగా నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. మల్టీస్టారర్ చేస్తే నానీతో చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అతని డైలాగ్ డెలీవరీ చక్కగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఓ అందమైన అమ్మాయి ఆకాంక్షను నాకు హీరోయిన్గా తీసుకువచ్చారు. రష్మికకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అన్నింటినీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. సెప్టెంబర్ మన (ఫ్యాన్స్‌ను ఉద్దేశించి) నెల. నాన్నగారి బర్త్‌డే. మొగుడు పెళ్లాల సినిమాలు ఒకే రోజు రిలీజవుతాయా? అయ్యాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్’ రెండూ బాగా ఆడాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రివ్యూస్ చూసి సమంత కంగారు పడింది. ఏం ఫర్లేదు.. సాయంత్రానికి ఓకే అవుతాయి అన్నాను. సెట్ అయింది. నా సినిమాకు కలెక్షన్స్ రావడం లేదు అంది. సండేకి సెట్ అవుతుంది అన్నాను.. అయింది. ఈ 27న వస్తున్న ‘దేవదాస్’ని కూడా నాన్నగారు చూసుకుంటారు. గణేశ్, దసరా పండగ మధ్యలో ‘దేవదాస్’ పండగ వస్తుంది. నవ్వులు.. ఓన్లీ నవ్వులే. సీక్వెల్ చేద్దామా నానీ? తప్పకుండా చేద్దాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా చూసినప్పటి నుంచి తాతగారు అనే పేరు వింటే మా తాతకంటే ఏయన్నార్‌గారు కనిపిస్తారు. నాగార్జున ఇంత అందంగా ఉంటారు. రోజూ ఏం తింటున్నారో, తాగుతున్నారో కనుక్కోమని నా అసిస్టెంట్స్‌కి చెప్పాను. అది ట్రై చేసి ఆయనలా అయిపోదాం అని. కానీ మనం తినేవే తింటున్నారు సర్ అని చెప్పారు. మామూలువే తిని మామూలువే తాగితే ఆయనెందుకు అలా ఉన్నారు? మనమంతా ఇలా ఎందుకు ఉన్నాం? ఆ అందానికి కారణం సరదాగా ఉండటమే. ప్యూర్‌గా ఉండటమే. లోపల ఏం పెట్టుకోరు. అశ్వనీదత్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో నా ఆల్బమ్ చూసి ‘నీకెందుకు యాక్టింగ్ బాగా చదువుకో’ అన్నారు. ఇప్పుడు ఆయన బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నాను. స్వప్నా, నేను ‘ఎవడే సుబ్రమణ్యం’ ముందు గొడవపడ్డాం. సినిమా హిట్. ఈ సినిమా స్టార్ట్ కాకముందే గొడవపడ్డాం. సినిమా బ్లాక్బాస్టర్ అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య అందర్నీ బాగా హ్యాండిల్ చేశాడు. మణిగారితో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీ’’ అన్నారు. ‘‘మామయ్యా మజాకా. బంగార్రాజు పాత్ర తర్వాత అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాని నా ఫేవరెట్ కోస్టార్’’ అన్నారు సమంత. ‘‘అన్నయ్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ పోస్టర్ చూసి ‘ఏమున్నాడు మా అన్నయ్య’ అన్నాను. ఇప్పుడు మా నాన్నగారిని చూసి ‘ఏమున్నాడయ్యా బాబు మా నాన్న’ అనాలనిపిస్తుంది. నాని అంటే నాకిష్టం. యాక్టింగ్‌లో తన ఈజ్ కుళ్లు తెప్పిస్తోంది’’ అన్నారు అఖిల్. ‘‘వైజయంతీలో సినిమా చేయడం హానర్‌గా ఫీలవుతున్నాను. నాగార్జునగారితో అప్పట్లో ఓ ఫొటో దిగాను. బయటా హీరోలానే ఉన్నాడమ్మా అని మా అమ్మగారితో అంటే, సినిమా చేయమన్నారు. అది నెరవేరడానికి 4 ఏళ్లు పట్టింది’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. అశ్వనీ దత్ మాట్లాడుతూ: ‘‘నా అభిమాన నటులు నాగేశ్వరరావుగారు ఒకరు. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన హీరో నాగార్జున. నాకు రెండో సినిమా చేస్తున్న హీరో నాని. యంగ్ డైరెక్టర్స్ అందరూ ట్రెండ్ మారుస్తున్నా రు. ఈ సంస్థను నడిపిస్తుంది రెండు మహాశక్తులు. వయాకామ్ ఒకరైతే, స్వప్నా–ప్రియాంకలు మరొకరు’’ అన్నారు. ‘‘ఈ లెగసీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అని వయాకామ్ ప్రతినిథి అజిత్ అన్నారు.‘‘అక్కినేని గారి పుట్టినరోజంటే నాకు పండగే. నా గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటాడు. తండ్రికి మించిన తనయుడు లాగా నాగార్జున కూడా నవయువకుడిలా ఉంటాడు. మనం గర్వించదగ్గ నిర్మాత అశ్వనీదత్. ఈ ‘దేవదాస్’ కూడా ఆ ‘దేవదాసు’ అంత పేరు సంపాదించాలి. నాని చేసిన సినిమాలన్నీ హిట్టే’’ అన్నారు సుబ్బిరామిరెడ్డి. ‘‘నన్ను పరిచయం చేసింది దత్గారే. నాగార్జునతో మళ్లీ సినిమా చేయడం రహ్యాపీ’’ అన్నారు మణిశర్మ. -
టీఎస్సార్ వారి పెళ్లి సందడి
ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత సుబ్బరామి రెడ్డి మనవడు అనిరుద్ వివాహం నేహాతో ఆదివారం హైదరా బాద్‌లో ఘనంగా జరిగింది. సుబ్బరామిరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి, సరిత దంపతుల కుమారుడు అనిరుద్. హితా, నవీన్ రెడ్డి దంపతుల కుమార్తె నేహా. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి, మోహన్‌బాబులతో సుబ్బరామిరెడ్డి సంగీత్‌లో టీఎస్సార్, రెహమాన్, అనిరుద్ వధూవరులను అభినందిస్తున్న కృష్ణ రామ్‌చరణ్, ఉపాసన -
తరలి వచ్చిన అతిరథ మహారధులు
-
కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాత్రికేయరంగంలో ఎనలేని కృషిచేసిన ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత కరణ్ థాపర్‌ను జీకే రెడ్డి స్మారక అవార్డు వరించింది. రాజ్యసభ సభ్యుడు, జీకే రెడ్డి స్మారక అవార్డు వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి, టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా థాపర్ ఈ అవార్డును అందుకున్నారు. సుబ్బరామిరెడ్డి, అవార్డు కమిటీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి కరణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రం, రూ.5లక్షల నగదు అందజేశారు. -
కళాకారుల ఆనందమే ఆయన ఆహారం
‘‘లలిత కళలంటే లలితాగాయత్రి యొక్క అంశ కలిగిన కళలు. ఈ కళలు అబ్బటం ఆ దేవత ఆశీర్వచనం. అటువంటి కళాకారులు ఎక్కడ పుట్టినా గౌరవించేవాళ్లు కొందరు ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన చిరస్థాయిగా ఉన్నారంటే కళలకు, కళాకారులకు ఆయన చేసిన సేవే. ఆయన పేరు వినగానే మనకు ‘భువనవిజయం’ గుర్తొస్తుంది. కళలకు ఉన్న గొప్పతనం అలాంటిది. సుబ్బరామి రెడ్డి మనసెప్పుడూ కళల మీద, కళాకారుల మీదే ఉంటుంది. వాళ్లను గౌరవించటం. వాళ్ల ఆనందమే ఈయన ఆహారం. నా పూర్వ జన్మ సుకృతం వల్ల రేపు కాకతీయ కళలను గుర్తు చేసుకుంటూ తీసుకోబోయే ఈ అవార్డు నాకు ప్రత్యేకమైంది. ఆలీ నాకంటే నటనలో సీనియర్. పరిశ్రమలో నటించటం పక్కన పెడితే, అసలు ఉండటమే కష్టం. అందుకే ఆలీ ‘ఏ’ నేను ‘బీ’’ అన్నారు బ్రహ్మానందం. ‘కాకతీయ లలిత కళా పరిషత్’ ఏర్పాటు చేసి, కళాకారులను సన్మానిస్తున్నారు సుబ్బరామి రెడ్డి. మార్చి 11న మహబూబ్‌నగర్‌లో జరగనున్న ఈ ఉత్సవాల్లో బ్రహ్మానందానికి ‘హాస్య నట బ్రహ్మ’ బిరుదును ప్రదానం చేయనున్నారు. ఈ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ– ‘‘కళలోనే దైవత్వం ఉంది. అందుకే కళాకారులను గౌరవించినా, అభినందించినా, సత్కరించినా.. మనకు ఆ శక్తి వస్తుంది. 700 సంవత్సరాల క్రి తం పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల వైభవం, కళల సంపద అపూర్వం. ఆ తర్వాత మనకు గుర్తు వచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు. కాకతీయ కళా పరిషత్‌ను 2 నెలల క్రితం ప్రారంభించినప్పుడు మోహన్‌బాబును సత్కరించాం. ఇప్పుడు రూరల్ ఏరియాస్‌లో కూడా ఈ కళా వైభవోత్సవాలు నిర్వహించాలనుకుంటున్నాం. తెలంగాణాలో మొట్టమెదటిగా æమహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. కళాకారులను, స్థానిక కళాకారులను, సినీ కళాకారులని ఇందులో సన్మానించదలిచాము. ఈ కార్యక్రమంలో 1100 చిత్రాల్లో నటించి, హాస్యాన్ని పంచిన బ్రహ్మానందంకు ‘హాస్య నట బ్రహ్మా’ అనే బిరుదు ప్రదానం చేయనున్నాం. దాదాపు 40 ఇయర్స్ కెరీర్ ఉన్న ఆలీకు కూడా అవార్డ్ ఇవ్వబోతున్నాం. పలువురు సినీరంగ ప్రముఖులను, స్థానిక కళాకారులను ‘‘కాకతీయ అవార్డు’తో సత్కరిస్తాం’’ అన్నారు. ‘‘బ్రహ్మానందం గారు తెలియని తెలుగువారుండరు. సుబ్బరామిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడి కంటే గొప్ప భక్తుడు,కళా పోషకుడు, కళా బంధువు’’ అన్నారు శాసన సభ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్. ‘‘నటరాజుకి కళాకారులంటే ఇష్టం. ఆ నటరాజే సుబ్బరామిరెడ్డి గారు. కేవలం 33 సంవత్సరాల్లో 1100 సినిమాలు పూర్తి చేసిన బ్రహ్మానందంగారిని సన్మానించటం ఆనందం’’ అన్నారు ఆలీ. -
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
-
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
‘‘అందరూ జన్మిస్తారు. జీవిస్తారు. మరణిస్తారు. కొంత మంది మరణించినా శాశ్వతంగా గుండెలో ఎప్పూడు చెరగని ముద్ర వేసి జీవిస్తారు. అలాంటి కోవకు చెందిన మనిషి శ్రీదేవి’’ అన్నారు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి. ప్రముఖ సినీతార శ్రీదేవి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీదేవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ–‘‘ భారతదేశ చలనచిత్రరంగంలో శ్రీదేవి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. హిందీలో చాందినీగా ఆకట్టుకున్నారు. ఆవిడ మరణవార్త విని దేశం మొత్తం షాక్ అయ్యింది. ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. శ్రీదేవితో మా అమ్మాయి పింకీ రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేది. శ్రీదేవి ఎంత పెద్ద ఆర్టిస్టో అంత మంచి హ్యూమన్ బీయింగ్. ఎంత ఎత్తు ఎదిగినా రూట్స్‌ని మరిచిపోలేదు. అంత గొప్ప నటి, శక్తి స్వరూపిణి దూరమైయేసరికి కోట్లాది అభిమానులు తమ అభిమానాన్ని, దుఃఖాన్ని చూపించారు. బోనీ కపూర్, శ్రీదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు వాళ్లు విడిగా వచ్చేవారు కాదు. శ్రీదేవి మరోజన్మలోను శ్రీదేవిలానే పుట్టాలి. తెలుగమ్మాయిగానే పుట్టాలి. మా శ్రీదేవి మళ్లీ వచ్చిందనుకోవాలి’’ అన్నారు. ప్రముఖ గాయని సుశీల మాట్లాడుతూ–‘‘ దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య శ్రీదేవి. మనల్ని మైమరపించి మళ్లీ తన లోకానికే వెళ్లిపోయింది. 8 ఏళ్ల వయసులో శ్రీదేవికి పాట పాడాను. అంతేకాదు ఆమె మొట్టమొదటి సినిమాకు కూడా పాట పాడాను. మనకు ఎన్నో తీపిగుర్తులను మిగిల్చి తను వెళ్లిపోయింది’’ అన్నారు.‘‘శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాల్లో నటించాను. ఆమె నిగర్విగా ఉండేది’’ అన్నారు నటుడు కోటశ్రీనివాసరావు. ‘‘శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను ఎప్పుడూ సార్ అని పిలిచేది. ఆమెకు పెద్దలంటే ఎంతో గౌరవం. ఇప్పుడు ఆమె లేదు అంటే నమ్మబుద్ది కావడం లేదు. దేశం గర్వించదగ్గ నటి శ్రీదేవి. ఆమె మరణించినా..సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారామె’’ అని అన్నారు కృష్ణంరాజు. ‘‘ శ్రీదేవి మరణవార్త విన్న తర్వాత ఎంతో దుఃఖించాను. తెలుగు అమ్మాయిగా ఎంతో సాధించింది. జీవితంలోని ప్రతి అడుగును ఒక లక్ష్యంగా చేసుకుని నడిచింది. ప్రతి పాత్రను ఒక సవాలుగా తీసుకునేది శ్రీదేవి. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారు శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటారు. శ్రీదేవి గొప్ప నటి మాత్రమే కాదు. మంచి మాతృమూర్తి కూడా. తనలాగే జాన్వీని కూడా తీర్చిదిద్దాలని అనుకున్నారు. జాన్వీ మంచి నటిగా రాణించాలని కోరుకుంటున్నాను’’అన్నారు నటి జయప్రద. ‘‘శ్రీదేవి మరణవార్తను జీర్ణించుకోలేకపోయాను. శ్రీదేవి కుటుంబంతో మా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మరిచిపోలేక పోతున్నాను. జాన్వీ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు నటి జయసుధ. ‘‘శ్రీదేవితో కలిసి నటించలేదు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమెతో ఓ సినిమాలో నటించే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలే. ముంబైలో జరిగిన శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లాలి అనుకున్నాను. కానీ..కుదర్లేదు. ఇప్పుడు సంస్మరణసభలో పాల్గొనే అవకాశం వచ్చింది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘‘1972లో ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవిని చూసిన మొదటి రోజే గొప్ప నటి అవుతుందని అనుకున్నాను. రామానాయుడు ఆమెను ‘దేవత’ను చేస్తే..ఎన్టీఆర్ ఆమెను ‘అనురాగదేవత’ను చేశారు’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘శ్రీదేవి సెట్లో ఎవర్ని బాధపెట్టలేదు. కానీ చనిపోయి అందర్నీ నొప్పించింది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవి నటన చూసి, గొప్ప నటి అవుతుందనుకున్నాను’’ అన్నారు నటుడు బాబుమోహన్. ‘‘శ్రీదేవితో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రీదేవితో నటించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నాను. శ్రీదేవి లాంటి హీరోయిన్ కావాలని కోరుకునే వారిలో నేనూ ఉన్నాను’’ అన్నారు హీరోయిన్ నివేధా థామస్. రేలంగి నరసింహరావు, అమల, శ్రీకాంత్, అల్లు అరవింద్, జగపతిబాబు, సుమంత్, ఆలీ, శివాజీ రాజా, నరేశ్, ఉపాసన కామినేని తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ శుక్రవారం ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు రేఖ అభినందనలు తెలిపి, పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు. -
ఆశా భోంస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్
ప్రముఖ దర్శక–నిర్మాత యశ్ చోప్రా అంటే కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి ఎనలేని అభిమానం. చోప్రాతో టీయస్సార్‌కి మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన భౌతికంగా దూరమయ్యాక టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్’ అవార్డ్‌ను ప్రారంభించారు. 2013లో మొదలుపెట్టి ఇప్పటివరకూ లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్లకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈసారి టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి ఈ అవార్డును ప్రముఖ గాయని ఆశాభోంస్లేకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 16న ముంబైలో ఈ అవార్డు వేడుక జరగనుంది. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. -
సినీ రంగాన్ని చొప్పిస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కళా వైభవం పేరుతో నటులను సన్మానిస్తే సహించబోమని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు.. మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డిని హెచ్చరించింది. ఈ పేరుతో స్థానిక కళలు, కళాకారుల పురోగతికి తోడ్పడితే స్వాగతిస్తామంది. శుక్రవారం కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి సినిమా రంగం తీవ్ర నష్టం చేసిన సంగతి గుర్తించాలన్నారు. సినిమా సంస్కృతిని బుద్ధిస్ట్ హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేయటం తగదన్నారు. ఇలాంటి చర్యలను ముందుగానే అడ్డుకోవాలన్నారు. రెండు రోజుల క్రితం సుబ్బిరామిరెడ్డి నగరంలోని శిల్పకళావేదికలో నటుడు మోహన్‌బాబును సన్మానించి బిరుదు ప్రదానం చేసిన విషయం తెలిసిందే.