T20 format
-
సరిలేరు మీకెవ్వరు!
ప్రపంచ క్రికెట్లో ఏ జట్టయినా మేటి ఆటగాళ్ల నిష్క్రమణతో డీలా పడటం సహజమే! టీమిండియా విషయంలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ ఫార్మాట్లోనైనా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలికితే వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఈ ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... దిగ్గజాలను మైమరిపించేందుకు మేమున్నామంటూ యువతరం దూసుకొస్తోంది!సంజూ సామ్సన్ సుదీర్ఘ కెరీర్‌ను గాడిన పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే... అడిగి మరీ బరిలోకి దిగిన మూడో స్థానంలో తానే సరైన వాడినని హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ తన సారథ్యంతో సత్తా చాటుతుంటే... హార్దిక్ పాండ్యా అసలు సిసలు ఆల్‌రౌండర్‌గా తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు. ‘ఛోటా పటాకా... బడా ధమాకా’ మాదిరిగా అభిõÙక్ శర్మ చెలరేగుతుంటే... ‘నయా ఫినిషర్’ తానే అని రింకూ సింగ్ నిరూపించుకుంటున్నాడు. టి20ల్లో ప్రమాదకర బౌలర్‌గా అర్‡్షదీప్ సింగ్ పరిణతి సాధిస్తే... వరుణ్, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వైవిధ్యంతో కట్టిపడేస్తున్నారు. వీరంత సమష్టిగా కదం తొక్కుతుండటంతో భారత జట్టు ఈ ఏడాది టి20ల్లో జైత్రయాత్ర సాగించింది. ఆడిన 26 మ్యాచ్‌ల్లో 24 విజయాలతో అదరగొట్టిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. –సాక్షి క్రీడా విభాగం టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ప్రపంచకప్ (2007) గెలిచిన తర్వాత... మరోసారి వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడేందుకు సుదీర్ఘ కాలం నిరీక్షించిన టీమిండియా... ఈ ఏడాది రెండోసారి జగజ్జేతగా నిలిచింది. చాన్నాళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు ఆ కల నెరవేర్చుకోవడంతో పాటు... అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్ కైవసం చేసుకున్న టీమిండియా... మరో ఐదు సిరీస్‌లు సైతం చేజిక్కించుకుంది. అఫ్గానిస్తాన్‌పై 3–0తో, జింబాబ్వేపై 4–1తో, శ్రీలంకపై 3–0తో, బంగ్లాదేశ్‌పై 3–0తో, దక్షిణాఫ్రికాపై 3–1తో సిరీస్‌లు హస్తగతం చేసుకుంది. ఇందులో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ తర్వాత టి20 వరల్డ్‌కప్ జరగ్గా... ఆ తర్వాత నుంచి సీనియర్ ప్లేయర్లు లేకుండా యువ ఆటగాళ్లతోనే టీమిండియా అద్భుతాలు చేసింది. కోహ్లి, రోహిత్, జడేజా వంటి సీనియర్లు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం... మిగిలిన కీలక ఆటగాళ్లు కూడా అన్ని సిరీస్‌లకు అందుబాటులే లేకపోవడం ఇలాంటి ఎన్నో ప్రతికూలతల మధ్య కూడా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. భవిష్యత్తుపై భరోసా ఇస్తూ... బాధ్యత తీసుకునేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది ఆడిన 26 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో భారత్ 24 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అందులో రెండు ‘సూపర్ ఓవర్’ విజయాలు కూడా ఉన్నాయి. ఓడిన రెండింట్లో ఒకటి వరల్డ్‌కప్ నెగ్గిన వారం రోజుల తర్వాత సరిగ్గా కుదురుకోకుండానే జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ ఒకటి అయితే... తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి వరకు పోరాడి ఓడిన రెండో టి20 మరొకటి. ఈ రెండు మినహా మిగిలిన మ్యాచ్‌లు చూసుకుంటే మన జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్‌గా విజయాల శాతాన్ని పరిశీలిస్తే... భారత్ 92.31 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో పాకిస్తాన్ 19 మ్యాచ్‌లాడి 17 గెలిచి 89.47 శాతంతో రెండో స్థానంలో ఉంది. ప్రతి 12 బంతులకో సిక్స్... టీమిండియా జైత్రయాత్ర వెనక యువ ఆటగాళ్ల దూకుడు ఉందనేది వాస్తవం. ఈ ఏడాది గణాంకాలు చూస్తే... భారత జట్టు సగటున ప్రతి 12 బంతులకో సిక్స్ బాదింది. జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనుకునే ప్రతి ఆటగాడు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చెలరేగుతుండటం వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, అభిõÙక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ వంటి హిట్టర్ల వల్ల జట్టు బ్యాటింగ్ శైలి మారిపోయింది. గతంలో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడాలనే ధోరణి ఎక్కువగా కనిపించే టీమిండియాలో... ఇప్పుడు బాదుడే పరమావధి అనేది స్పష్టమవుతోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా వన్‌డౌన్‌లో అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మకు... టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే నూరిపోసానని వెల్లడించాడు.‘వికెట్ పడ్డా ఫర్వాలేదు. దూకుడు మాత్రం తగ్గించొద్దు. సహజసిద్ధమైన షాట్లు ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి’అని లక్ష్మణ్ తనకు చెప్పినట్లు తిలక్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ ఏడాది 4.68 బంతులకో బౌండరీ (ఫోర్, సిక్స్) కొట్టిన భారత జట్టు ఈ జాబితాలో ఆస్ట్రేలియా (4.39) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఏడు సెంచరీలు.. 2024 క్యాలెండర్ ఏడాదిలో భారత ఆటగాళ్లు ఒక్క టి20 ఫార్మాట్లోనే ఏడు సెంచరీలు బాదారు. సంజూ సామ్సన్, తిలక్ వర్మ తాజా సిరీస్‌లోనే చెరో రెండు సెంచరీలు బాదగా... అంతకుముందు సామ్సన్ హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై మరో శతకం సాధించాడు. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ కూడా ఒక్కోసారి మూడంకెల స్కోరు అందుకున్నారు. ఒక ఏడాదిలో టి20ల్లో ఒక జట్టు ప్లేయర్లు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే కావడం విశేషం. సెంచరీ నమోదైన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా 200 పైచిలుకు పరుగులు చేసింది. మొత్తంగా 2024లో తొమ్మిది సార్లు భారత జట్టు 200+ స్కోర్లు నమోదు చేసింది. ప్రపంచంలో మరే జట్టు ఏడు సార్లకు మించి ఈ ఫీట్ అందుకోలేదు. ఈ క్రమంలో టీమిండియా 9.55 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. ఇది ఆ్రస్టేలియా (9.87) తర్వాత రెండో అత్యధికం. కేవలం బ్యాటింగ్‌లోనే మెరుపులు మెరిపిస్తే ఈ స్థాయి జైత్రయాత్ర సాధ్యమయ్యేది కాదు! బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం కూడా తోడవడంతోనే ఈ నిలకడ సాధ్యమైంది. ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో భారత జట్టు పదిసార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది. సగటున ప్రతి మ్యాచ్‌లో టీమిండియా 8.39 వికెట్లు పడగొట్టింది. 2023 వరకు టీమిండియా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ప్రత్యర్థిపై 100 పరుగుల తేడాతో విజయం సాధించగా... ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు ఆ ఫీట్ నమోదు చేయడం కొసమెరుపు! ఫ్యూచర్ స్టార్స్ యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇప్పటికే నిరూపించుకోగా... ఇప్పుడు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన తిలక్ వర్మ... ఈసారి సఫారీ టూర్లో రెండు సెంచరీలతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డు గెలుచుకున్నాడు. నాలుక మడతేసి కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్న తరహాలో... దక్షిణాఫ్రికాలో విధ్వంస రచన చేసిన తిలక్‌పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఒకే బంతికి భిన్నమైన షాట్లు ఎలా ఆడొచ్చో తిలక్ చివరి మ్యాచ్‌లో నిరూపించాడు. జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి తిలక్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్ చూస్తే అతడు ఎంత పరిణతి సాధించాడో ఇట్టే చెప్పేయోచ్చు. గతంలో సంప్రదాయ షాట్లతోనే పరుగులు రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నించిన తిలక్... తాను కూడా వికెట్‌కు నాలుగు వైపులా పరుగుల వరద పారించగలనని నిరూపించుకున్నాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ , కోచ్ మాటలను బట్టి చూస్తే... తిలక్ మూడో స్థానంలో కుదురుకున్నట్లే అనిపిస్తోంది. ఇప్పటి వరకు 20 టి20లు ఆడిన తిలక్ వర్మ రెండు సెంచరీలు, రెండు హాఫ్‌సెంచరీలతో 51.33 సగటుతో 616 పరుగులు సాధించాడు. ఇన్నాళ్లు కోహ్లి ఆడిన మూడో స్థానంలో నిలకడ కొనసాగించగలిగితే 22 ఏళ్ల తిలక్‌కు మంచి భవిష్యత్తు ఉండనుంది. -
Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’!
ప్రపంచంలోని ఏ మూల ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో అతడు ఉండాల్సిందే! జాతీయ జట్టు మొదలుకొని... విశ్వవ్యాప్తంగా మొత్తం 43 జట్లకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర అతడిది! అటు బౌలర్‌గా ఇటు బ్యాటర్‌గా మైదానంలో ఆల్‌రౌండ్ మెరుపులకు కేరాఫ్ అడ్రస్ అతడు! రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు, పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యధిక ట్రోఫీలు సాధించిన ప్లేయర్... ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించిన అతడే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. రెండు దశాబ్దాలుగా ఏదో ఒక జట్టులో ప్లేయర్‌గా కొనసాగుతున్న డ్వేన్ బ్రావో ఆటగాడిగా తన క్రికెట్ ఇన్నింగ్స్‌కు శుభంకార్డు వేశాడు. ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నా ఏదో ఒక హోదాలో ఈ ఆటలోనే కొనసాగేందుకు బ్రావో నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున బ్రావో ‘మెంటార్’ పాత్రలో కనిపించనున్నాడు. రెండు దశాబ్దాలుగా మైదానంలో తన ఆటతీరుతో పాటు ఆటాపాటతోనూ అశేష అభిమానులను సొంతం చేసుకొని ప్లేయర్‌గా రిటైరైన నేపథ్యంలో ‘చాంపియన్’ బ్రావోపై ప్రత్యేక కథనం. టి20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి పొట్టి క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. మూడేళ్ల క్రితమే జాతీయ జట్టు తరఫున చివరి టి20 మ్యాచ్ ఆడిన బ్రావో... తాజాగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. కెరీర్లో 582 టి20 మ్యాచ్‌లాడిన 41 ఏళ్ల బ్రావో... 631 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ స్టార్ రషీద్ ఖాన్ 613 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకునే సమయానికి 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించిన బ్రావో... వచ్చే సీజన్ నుంచి ‘మెంటార్’గా దర్శనమివ్వనున్నాడు. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న బ్రావో... డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు సాధించిన బ్రావో... టి20ల్లో చివరి నాలుగు (17 నుంచి 20) ఓవర్లలో 322 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్స్‌లో 201 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై చిన్నోడు! ఐపీఎల్ ఆరంభం నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడటాన్ని ఎంతగానో ఇష్టపడే బ్రావో... సుదీర్ఘ కాలం పాటు చెన్నై ప్రధాన బౌలర్‌గా కొనసాగాడు. ప్రత్యర్థి ప్లేయర్లు భారీ షాట్లు కొడుతున్న ప్రతిసారీ ధోని బంతిని బ్రావో వైపు విసిరే వాడంటే... అతడిపై మహీకి ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇతర లీగ్‌లతో పోల్చుకుంటే ఐపీఎల్లో తన బౌలింగ్‌తోనే ఎక్కువ ఆదరణ పొందిన బ్రావో... అత్యుత్తమ ఫీల్డర్ అనడంలో సందేహం లేదు. సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తే చుట్టు పక్కల గోడ కట్టినట్లే అనే గుర్తింపు తెచ్చుకున్న బ్రావో... బౌండరీ మీద ఎన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. సిక్సర్ ఖాయమనుకున్న బంతిని సైతం కచ్చితమైన అంచనాతో గాల్లోకి ఎగిరి అమాంతం ఒడిసి పట్టడంలో బ్రావోది అందెవేసిన చేయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్రావో ఎప్పుడూ బౌండరీ వద్దే కనిపించేవాడు. ఆటతీరుతోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి వాటికి నృత్యరీతులను జత చేయడంలోనూ బ్రావో సిద్దహస్తుడు. ఆటతో పాటే పాట! మైదానంలో ఎంతో సరదాగా ఉండే బ్రావోను ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఇష్టపడేవారు. వికెట్ తీసినప్పుడు జరుపుకునే సంబరాల నుంచి మొదలుకొని విజయం సాధించినప్పుడు చేసే డాన్స్ వరకు అన్నిట్లో ప్రత్యేకత చాటుకున్న బ్రావో.. ఐపీఎల్లో రెండు సీజన్లలో 25 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013 సీజన్లో 32 వికెట్లు తీసిన బ్రావో... 2015లో 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 ఫార్మాట్లో 684 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉండగా... 582 మ్యాచ్‌లతో బ్రావో రెండో స్థానంలో నిలిచాడు. షోయబ్ మాలిక్ (542 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (525 మ్యాచ్‌లు), రసెల్ (523 మ్యాచ్‌లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్లో విశ్వవ్యాప్తంగా 28 జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2012, 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జాతీయ జట్టులో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కెరీర్లో పదో స్థానంలో మినహా అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దిగిన బ్రావో... 442 ఇన్నింగ్స్‌ల్లో 6970 పరుగులు సాధించాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేకపోగా... 20 అర్ధశతకాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం బ్యాట్‌తో 5 వేల పైచిలుకు పరుగులు... బంతితో 300 వికెట్లు... 200 క్యాచ్‌లు పట్టిన బ్రావో నిఖార్సైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. పురుషుల టి20 క్రికెట్లో 17 టోర్నమెంట్ ఫైనల్స్‌లో బ్రావో విజేతగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధికం కాగా... కీరన్ పొలార్డ్ 16 టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు (2015, 2017, 2018, 2020, 2021), ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడు (2011, 2018, 2021), ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో రెండు (2012, 2016), కరీబియన్ టి20 లీగ్‌లో రెండు (2011/12, 2012/13), స్టాన్ఫోర్డ్ లీగ్ (2007/08), సీఎల్‌టి20 (2014), బీపీఎల్ (2016/17), పీఎస్ఎల్ (2019), ఐఎల్టి20 (2023/24)ల్లో ఒక్కో టైటిల్ సాధించాడు.ఆటగాడిగా ఉన్న సమయంలోనే సహచరులకు అవసరమైన సమయాల్లో సూచనలిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన బ్రావో... ఇప్పుడు ఇక పూర్తిస్థాయిలో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సుదీర్ఘ కాలంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా కనిపించనున్నాడు. -
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
ఐసీసీ మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 టైటిల్ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్ ర్యాంకు పదిలంగా ఉంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-51. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లుమెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లుచదవండి: -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్‌జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్‌జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్‌కు షూటింగ్‌లోనే రెండు కాంస్యాలు, రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా స్టార్
ICC Men's T20I Cricketer of the Year 2022: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ మిస్టర్ ప్లేయర్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం వెల్లడించింది. కాగా 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది పలు కీలక మ్యాచ్‌లలో టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బ్యాటర్ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా ఎదిగాడు. ఈ క్రమంలో అనేక రికార్డులు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 68 సిక్సర్లు బాది.. పొట్టిఫార్మాట్లో ఏడాది కాలంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా సూర్య నిలిచాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో సూర్య అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో ఆరు ఇన్నింగ్స్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. 189కి పైగా స్ట్రైక్‌రేటుతో దుమ్మురేపాడు. ఆ సెంచరీ ప్రత్యేకం ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 890 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో నాటింగ్‌హాం మ్యాచ్‌లో భాగంగా సూర్య తన కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకం బాదిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు సూర్య. చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ -
యువ జట్టును సిద్ధం చేస్తున్నామన్న ద్రవిడ్! రోహిత్ స్పందన ఇదే! నేనింకా..
India vs Sri Lanka, 1st ODI - Rohit Sharma- గువహటి: వచ్చే టి20 వరల్డ్‌కప్ కోసం జట్టును సిద్ధం చేస్తున్నామని ఇటీవల కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టి20ల భవిష్యత్తుపై సందేహాలు రేగాయి. వారిని పక్కన పెట్టి జట్టును పునర్నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కెప్టెన్ రోహిత్ స్పందించాడు. తానేమీ అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకోలేదని, ఐపీఎల్ తర్వాతే దీనిపై ఆలోచిస్తానని అతను అన్నాడు. ‘మనం ఈ ఏడాది ఆరు టి20లు ఆడాల్సి ఉంటే మూడు ముగిశాయి. మిగతా మూడులో ఏం చేయాలో తెలుసు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. నేను అంతర్జాతీయ టి20లకు గుడ్‌బై చెప్పలేదు. అందరూ అన్ని మ్యాచ్‌లు ఆడలేరు ఐపీఎల్ తర్వాతే దీనిపై ఆలోచిస్తా. అయితే ఈ ఏడాది మా అందరి దృష్టీ వన్డేలపైనే ఉంది. అందరూ అన్ని మ్యాచ్‌లు ఆడలేరు. సీనియర్లకు పని భారం తగ్గించడంలో భాగంగానే లంకతో సిరీస్‌లో కొత్త ఆటగాళ్లు ఆడారు. నేను కూడా విశ్రాంతి తీసుకున్నవారిలో ఉన్నాను’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా- శ్రీలంక మధ్య గువహటి వేదికగా మంగళవారం తొలి వన్డే ఆరంభం కానుంది. రికార్డుల వీరుడు! ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. లంకతో టీ20 సిరీస్‌కు తను అందుబాటులో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో రోహిత్ శర్మకు ఘనమైన రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హిట్‌మ్యాన్ ఏకంగా జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు లీగ్, అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు. చదవండి: Ind Vs SL: సూర్య, ఉమ్రాన్‌కు నో ఛాన్స్!.. ఇంత వరకు ఇక్కడ ఒకే ఒక వన్డే.. ఫలితం? AUS Vs IND: టీమిండియాతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్! -
యాదృచ్చికం.. కింగ్ కోహ్లి, సూర్య భాయ్ ఒకేలా..!
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కెరీర్లు ఒకే రకంగా సాగకపోయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఈ ఇద్దరికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. జట్టులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరూ..యాదృచ్చికం ఓ విషయంలో ఒకే రకమైన గణాంకాలు కలిగి ఉన్నారు. అదేంటంటే.. పొట్టి క్రికెట్లో ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. తమ టీ20 కెరీర్లో 9వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును 39వ ఇన్నింగ్స్‌లోనే గెలుపొందారు. Fact of the day:Virat Kohli Had Won his '9th T20I M.O.M Award' in his 39th Inning! Suryakumar Yadav Won his '9th T20I M.O.M Award' in his 39th Inning!— IPLnCricket | Everything 'Cricket' & #IPL2023 🏏 (@IPLnCricket) November 24, 2022 ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ పోటీపడి మరీ పరుగులు సాధించారు. మెగా టోర్నీలో చెరో 6 మ్యాచ్‌లు ఆడిన ఇద్దరూ.. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 1, 3 స్థానాల్లో నిలిచారు. కోహ్లి 4 హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేయగా.. సూర్య 3 అర్ధశతకాలతో 239 రన్స్ చేశాడు. వీరిద్దరూ రాణించినప్పటికీ.. టీమిండియా వరల్డ్‌కప్‌లో సెమీస్ గండాన్ని దాట లేకపోయింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జగజ్జేతగా కూడా అవతరించింది. వరల్డ్‌కప్ అనంతరం టీమిండియా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇదివరకే భారత జట్టు 1-0 తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకోగా.. రేపటి నుంచి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో సూర్య భాయ్ సుడిగాలి శతకంతో చెలరేగిపోయాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
టీ20 జట్టు కోచ్‌గా ద్రవిడ్ కంటే అతనే బెటర్..!
టీమిండియా కోచ్ పదవిపై టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఎంపీ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత టీ20 జట్టు కోచ్‌గా తన మాజీ సహచరుడు ఆశిష్ నెహ్రా అయితే బెటర్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తక్కువ చేయాలన్నది తన ఉద్దేశం కాదని, నెహ్రా అయితే టీ20 జట్టు కోచ్ పదవికి పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నానని మనసులో మాటను బయటపెట్టాడు. నెహ్రాకు పొట్టి ఫార్మాట్‌పై మంచి పట్టు ఉందని, కెరీర్ చరమాంకంలో అతను టీ20ల్లో అద్భుతంగా రాణించాడని, కేవలం ఇదే కారణంగానే ద్రవిడ్ బదులు నెహ్రాకు తను ఓటు వేస్తానని చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కోచ్‌ల ప్రతిపాదన తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని, ఇందులో ఎవ్వరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నాడు. ఒకవేళ బీసీసీఐ ముగ్గురు కోచ్‌ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే.. ద్రవిడ్‌తో పాటు నెహ్రాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అపార అనుభవమున్న ద్రవిడ్‌ను భారత టెస్ట్ జట్టు కోచ్‌గా, నెహ్రాను టీ20 టీమ్ కోచ్‌గా నియమిస్తే..భారత్‌కు రెండు ఫార్మాట్లలో తిరుగుండదని అన్నాడు. ఇదే సందర్భంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌పై కూడా భజ్జీ స్పందించాడు. మొదటి మూడూ స్థానాల్లో వచ్చే వీరు స్ట్రయిక్ రేట్ మరింత పెంచుకోవాలని, తద్వారా 4, 5 స్థానాల్లో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందని సూచించాడు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022లో భారత్ సెమీస్‌లో నిష్క్రమించాక కోచ్‌తో సహా జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అభిమానులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ఇప్పటినుంచే కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లను ఈ ఫార్మాట్ నుంచి తప్పించాలని, కోచ్‌గా ద్రవిడ్ కూడా ఈ ఫార్మాట్‌కు సూట్ కావట్లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. -
బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్ కన్ఫర్మ్, వన్డే, టెస్ట్‌లకు..?
టీ20 వరల్డ్‌కప్-2022లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిందన్న కారణంతో ఏకంగా జాతీయ సెలెక్షన్ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో SPLIT CAPTAINCY (వేర్వేరు కెప్టెన్లు) అమలు చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐలోని కీలక అధికారి జాతీయ మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. ఇటీవలికాలంలో టీ20 ఫార్మాట్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేక, వ్యక్తిగతంగానూ దారుణంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మను టెస్ట్, వన్డేలకు మాత్రమే పరిమితం చేసి, హార్ధిక్ పాండ్యాను టీ20 సారధిగా నియమించేందుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. కొత్త సెలెక్షన్ కమిటీ చార్జ్ తీసుకోగానే ఈ విషయంపై డిస్కస్ చేసి అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. వయసు పైబడిన రిత్యా రోహిత్‌పై భారం తగ్గించేందుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కూడా ఏదో దానిపై కోత పెట్టే అంశాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉంటే టీమిండియా సత్ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్న బీసీసీఐ, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో రోహిత్‌ను ఏదో ఒక దానిని నుంచి తప్పించాలని (కెప్టెన్సీ) బీసీసీఐ భావిస్తే మున్ముందు హిట్‌మ్యాన్ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రోహిత్ టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఉంటే, పుజారా, అశ్విన్‌లలో ఎవరో ఒకరికి టెస్ట్ కెప్టెన్సీ అప్పజెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, రోహిత్ పూర్తిస్థాయి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే, ఈ ప్రయోగాలేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ మినహాయించి రోహిత్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా అంటూ హిట్‌మ్యాన్‌ను వెనకేసుకొస్తున్నారు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ను మరికొంత కాలం కొనసాగించాలని బీసీసీఐని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడే టీ20 కెప్టెన్సీ మార్పు అవసరం లేదని సూచిస్తున్నారు. ఇంకొందరైతే.. టీ20 ప్రపంచకప్-2024ను దృష్టిలో పెట్టుకుని హార్ధిక్‌ను ఇప్పటినుంచే టీ20 కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. కాగా, హార్ధిక్ నేతృత్వంలోనే ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్‌తో టీ20 ఆడుతున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిన్న (నవంబర్ 18) జరగాల్సిన తొలి మ్యాచ్ పూర్తిగా రద్దైంది. చదవండి: బీసీసీఐ షాకింగ్ ప్రకటన.. సెలక్షన్ కమిటీ రద్దు -
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..?
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మాజీ, విశ్లేషకులు ఇందుకనుగుణంగా తగు సూచనలు కూడా చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే.. 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు, ముగ్గురు వేర్వేరు కోచ్‌లు ఉండాలని సలహా ఇవ్వగా.. చాలామంది ఫ్యాన్స్ ఈ ప్రతిపాదనకు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు కొత్త కెప్టెన్, కొత్త కోచ్ అనే అంశంపై గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. కెప్టెన్, కోచ్ పోజిషన్ల కోసం ఎవరికి తోచిన ప్రతిపాదనలు వారు చేస్తున్నారు. కొందరు రోహిత్‌నే కంటిన్యూ చేయాలంటుంటే, మరికొందరు హార్ధిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు అప్పగిస్తే బెటరని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై క్రికెట్‌కు సంబంధించిన ఓ వ్యక్తే సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఓ ఆటగాడికి ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ రేసులోకి కొత్తగా వచ్చిన ఆటగాడెవరు.. అతని పేరు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు..? వివరాల్లోకి వెళితే.. వినాయక్ మానే అనే ముంబై మాజీ క్రికెటర్ టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి ఎవరూ ఊహించని విధంగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పేరును తీసుకువచ్చాడు. గతంలో స్థానిక క్లబ్ క్రికెట్ ఆడే సమయంలో సూర్యకుమార్ ఆడిన జట్టుకు కెప్టెన్‌గా, ఆ సమయంలో స్కైకు పర్సనల్ కోచ్‌గా వ్యవహరించిన మానే.. సూర్యకుమార్ భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టేందుకు అన్ని విధాల అర్హుడని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసలో మాట బయటపెట్టాడు. సూర్యకుమార్‌ను చిన్నతనం చూస్తున్నాను.. అతనికి బ్యాటింగ్ లైనప్‌ను లీడ్ చేయగలిగిన సామర్ధ్యంతో పాటు క్లిష్ట సమయాల్లో జట్టు సారధ్య బాధ్యతలు భుజాన ఎత్తుకునే మనోస్థైర్యం, చాణక్యం కూడా ఉన్నాయని ఆకాశానికెత్తాడు. అతనితో కలిసి ఆడిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నా.. టీమిండియా నాయకత్వ మార్పును కోరుకుంటే, సూర్యకుమార్ పేరును తప్పక పరిశీలనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నా అని అన్నాడు. మానే ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి మరో కొత్త పేరు వచ్చి చేరిందని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. వాస్తవానికి సూర్యకుమార్‌కు గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. 2014-15 రంజీ సీజన్లో అతను ముంబై జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే బ్యాటింగ్‌పై దృష్టి సారించలేకపోతున్నాన్న కారణంతో అదే సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2019-20 సీజన్లో ముంబై రంజీ టీమ్ కెప్టెన్‌గా మళ్లీ ఎంపికయ్యాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. చదవండి: Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..! -
టీమిండియాకు రోహిత్ శర్మ భారమవుతున్నాడా..?
రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ సాధించాలన్న కృత నిశ్చయంతో టీ20 వరల్డ్‌కప్-2022 బరిలోకి దిగింది. ఈ క్రమంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు (పాకిస్తాన్, నెదర్లాండ్స్) సాధించినప్పటికీ.. మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మినహా జట్టు మొత్తం అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలో డొల్లతనం మరోసారి బయటపడింది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ సహా టాపార్డర్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టింది. టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని చాలామంది కేఎల్ రాహుల్ ఒక్కరి వరకే పరిమితం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన భయంకరమైన నిజం మరొకటి దాగి ఉంది. అదేంటంటే.. బ్యాటింగ్‌లో టీమిండియా కెప్టెన్ ఘోర వైఫల్యాలు. గణాంకాలపై ఓ లుక్కేస్తే.. ఈ ఏడాది హిట్‌మ్యాన్ ఇప్పటివరకు ఆడిన 20 టీ20 మ్యాచ్‌ల్లో కేవలం 3 అర్ధసెంచరీలు మాత్రమే సాధించాడు. అందులో ఒకటి బలహీనమైన నెదర్లాండ్స్‌పై (53) సాధించినది కాగా.. మరో రెండు శ్రీలంక(ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో 72), వెస్టిండీస్ (విండీస్ పర్యటనలో 64)లపై సాధించినవి. ఈ మూడు అర్ధసెంచరీలు మినహా రోహిత్ గత 20 ఇన్నింగ్స్‌ల్లో సాధించింది ఏమీ లేదు. అతి కష్టం మీద రెండంకెల స్కోర్ చేరుకుంటున్నాడే తప్ప.. జట్టు కోసం ఏ ఒక్క సందర్భంలోనూ ప్రయోజనకరమైన ఇన్నింగ్స్ ఆడింది లేదు. చెత్త షాట్ సెలెక్షన్లతో వికెట్ సమర్పించుకుంటూ టెక్నిక్ పరంగానూ దారుణం అనిపించుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు రాణిస్తుండటంతో జట్టు మ్యాచ్‌లు గెలుస్తుంది కాబట్టి.. జనాల ఫోకస్ రోహిత్‌పై పడలేదు కానీ, అతని గత 20 ఇన్నింగ్స్‌ల్లో గణాంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక్కడ మరో విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తే.. కెప్టెన్సీ విషయంలోనూ హిట్‌మ్యాన్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. మైదానంలో కలిసి కట్టు నిర్ణయాలు లేదా ఎవరో ఒకరి నిర్ణయంపై ఆధారపడటం, ఫీల్డ్‌లో యాక్టివ్‌గా లేకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడం.. ఇలా చాలా విషయాల్లో హిట్‌మ్యాన్ అప్ టు ద మార్క్ లేడని సుస్పష్టం అవుతుంది. ఇవి కాదని ఫీల్డ్‌లో బద్ధకంగా ఉండటం.. చీటికి మాటికి సహచరులపై కస్సుబుస్సులాడటం.. కెప్టెన్ స్థాయి కాదని విశ్లేషకులు అభిప్రాయం. ఈ పరిస్థితుల నేపథ్యంలో హిట్‌మ్యాన్ జట్టుకు భారంగా మారుతున్నాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జట్టు గెలుపు ట్రాక్‌లో ఉన్నంత కాలం అంతా సాఫీగానే నడిచినప్పటికీ, ఒక్కసారిగా ట్రాక్ తప్పిందంటే హిట్‌మ్యాన్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి రోహిత్ ఇకనైనా తేరుకుని, బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుని పూర్వవైభవాన్ని సాధించాలని ఆశిద్దాం. రోహిత్ శర్మ గత 20 ఇన్నింగ్స్‌ల్లో సాధించిన స్కోర్ల వివరాలు.. టీ20 వరల్డ్‌కప్-2022లో సౌతాఫ్రికాపై 15, నెదర్లాండ్స్‌పై 53, పాకిస్తాన్‌పై 4 స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్‌లో 0, 43, 0 స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో 17, 46, 11 ఆసియా కప్‌లో సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై 72 పాకిస్తాన్‌పై 28 హాంగ్‌కాంగ్‌పై 21 పాకిస్తాన్‌పై ఆరంభ మ్యాచ్‌లో 12 వెస్టిండీస్ పర్యటనలో 33, 11, 0, 64 ఇంగ్లండ్ పర్యటనలో 11, 31, 24 -
రన్‌మెషీన్ విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడా ..?
-
రోహిత్ తర్వాత నాలుగేళ్లకు ద్రవిడ్ అరంగేట్రం! ఇప్పుడు అతడు కెప్టెన్.. ఇతడేమో!
Rohit Sharma 15 Years Of T20 Journey: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసి నేటికి(సెప్టెంబరు 19) సరిగ్గా పదిహేనేళ్లు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2007లో భాగంగా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు హిట్‌మ్యాన్. ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 3620 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు. 28 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ మేటి! ఇక టీ20 ఫార్మాట్లో రోహిత్ అత్యధిక స్కోరు 118. ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మకు ఉన్న రికార్డు గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్ సారథిగా జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్ సొంతం. క్యాష్ రిచ్ లీగ్‌లో 227 మ్యాచ్‌లలో భాగమైన రోహిత్ 5879 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో అతడి అత్యధిక స్కోరు 109. ఇలా పదిహేనేళ్ల క్రితం ఐసీసీ మెగా ఈవెంట్‌తో తన టీ20 ప్రయాణం మొదలుపెట్టిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. రోహిత్ తర్వాత అరంగేట్రం.. కానీ! ఇప్పటికే టీమిండియా సారథిగా పలు టీ20 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డులు నెలక్పొలిన ఈ హిట్‌మ్యాన్.. ప్రపంచకప్-2022లో తొలిసారిగా టీమిండియా టీ20 కెప్టెన్ హోదాలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ తర్వాత టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన 10 మంది భారత ఆటగాళ్లు.. రోహిత్ కంటే ముందే రిటైర్ కావడం విశేషం. వారెవరో తెలుసుకుందాం! యూసఫ్ పఠాన్ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్.. రోహిత్ శర్మ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన కొన్నిరోజులకే భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2007 ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక భారత్ తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన యూసఫ్.. ఫిబ్రవరి 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. మురళీ కార్తిక్ మురళీ కార్తిక్ 2007లో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. ఇక ఐపీఎల్-2014లో భాగంగా తన చివరి టీ20 ఆడిన మురళీ కార్తిక్ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా 2008లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు ప్రవీణ్ కుమార్. భారత్ తరఫున మొత్తం 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తరచూ గాయాల బారిన పడిన కారణంగా 2018లో ఆటకు గుడ్‌బై చెప్పాడు ప్రవీణ్ కుమార్. ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 2009 టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. 2010లో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన ఓజా.. 2020లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున అతడు మొత్తం ఆరు టీ20లు ఆడాడు. ఆశిష్ నెహ్రా భారత మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా శ్రీలంకతో మ్యాచ్ ద్వారా 2009లో తన అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆరంభించాడు. మొత్తంగా టీమిండియా తరఫున 27 టీ20 మ్యాచ్‌లు ఆడిన నెహ్రా.. 2017లో తన చివరి టీ20 ఆడాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. తొలి సీజన్లోనే క్యాష్ రిచ్లో గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలిపి.. ఈ ఘనత అందుకున్న తొలి భారత హెడ్‌కోచ్‌గా నిలిచాడు నెహ్రా. సుదీప్ త్యాగి 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సుదీప్ త్యాగి.. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా అదే ఏడాది అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. అయితే, దురదృష్టవశాత్తూ అదే అతడికి చివరి టీ20 అయింది. 2020లో అతడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. వినయ్ కుమార్ టీ20 వరల్డ్‌కప్-2010 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు వినయ్ కుమార్. భారత్ తరఫున 2010- 12 మధ్యకాలంలో తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2021లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. రాహుల్ శర్మ టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ 2012లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆటకు వీడ్కోలు పలికాడు. రాహుల్ ద్రవిడ్ టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం రోహిత్ శర్మ తర్వాత.. నాలుగేళ్లకు అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టడం విశేషం. 2011లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్లో ద్రవిడ్ తన తొలి టీ20 ఆడాడు. అదే ద్రవిడ్‌కు ఆఖరిది కూడా! ఇక 2012లో అతడు రిటైర్ అయిన విషయం తెలిసిందే. పార్థివ్ పటేల్ పార్థివ్ పటేల్ 2011 వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్లో రెండే రెండు టీ20లు ఆడాడు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక పార్థివ్ పటేల్ యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో భాగంగా ఇటీవలే ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. -
Pak Vs HK: గత రికార్డులు ఘనమే! కానీ ఇది టీ20! హాంగ్ కాంగ్‌ను లైట్ తీసుకుంటే!
Asia Cup 2022 Pakistan vs Hong Kong- Head To Head Records: ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ తమ రెండో మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం(సెప్టెంబరు 2)న గ్రూప్-ఏలోని ఈ రెండు జట్లు సూపర్-4లో ఎంట్రీ కోసం పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పసికూన హాంగ్ కాంగ్‌పై పాకిస్తాన్ విజయం నల్లేరు మీదే నడకేనని గత రికార్డులు చెబుతున్నాయి. అయితే, అప్పటికీ.. ఇప్పటికీ హాంగ్ కాంగ్ జట్టు ఆట తీరు మెరుగుపడింది. అంతేకాదు తాజా టోర్నీలో పటిష్టమైన టీమిండియాతో మ్యాచ్‌లోనూ హాంగ్ కాంగ్ ఆఖరి వరకు పోరాట పటిమ కనబరిచిన తీరు గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత్ చేతిలో ఆరంభ మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ కీలకం. భారత్‌తో పాటు సూపర్-4కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. పసికూనే కదా అని బాబర్ ఆజం హాంగ్ కాంగ్‌ను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. అందుకు గల ప్రధాన కారణాలేమిటో గమనిద్దాం. కీలక బౌలర్‌కు గాయం పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఇప్పటికే గాయం కారణంగా ఆసియా కప్-2022 టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. గాయపడిన మహ్మద్ వసీం సైతం జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నసీం షా, హారిస్ రవూఫ్, షానవాజ్ దహానీలతో బరిలోకి దిగింది. అయితే, భారత్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సందర్భంగా 19 ఏళ్ల నసీం షా గాయపడిన విషయం తెలిసిందే. కాలి నొప్పితో విలవిల్లాడిన ఈ యువ బౌలర్ మైదానంలోనే కుప్పకూలాడు. అతడు ఫిట్నెస్ సాధించినా ఈ మ్యాచ్‌లో ఆడించకపోవచ్చు. నసీం స్థానంలో మహ్మద్ హస్నైన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో కీలక వికెట్లు తీసిన నసీం షా సేవలు కోల్పోతే మాత్రం పాక్‌కు నిజంగా ఎదురుదెబ్బే. కుప్పకూలిన మిడిలార్డర్ పాకిస్తాన్ జట్టుకు ప్రధాన బలం ఓపెనర్లు. మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజం ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, టీమిండియాతో మ్యాచ్‌లో రిజ్వాన్(42 బంతుల్లో 43 పరుగులు) పోరాడినా.. బాబర్ ఆజం 10 పరుగులకే పరిమితం కావడంతో పాక్ కష్టాల్లో పడింది. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన మిడిలార్డర్ కుప్పకూలడంతో 147 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగితే పాకిస్తాన్ భారీ షాక్ తప్పదు. ముఖ్యంగా ఓపెనర్లను కట్టడి చేయగలిగితే హాంగ్ కాంగ్‌కు మంచి ఆరంభం లభిస్తుంది. ఒత్తిడి సహజమే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే అసోసియేట్ దేశం హాంగ్ కాంగ్ పెద్దగా కోల్పోయేది ఏమీ లేదు. క్వాలిఫైయర్స్‌లో యూఏఈని ఓడించి టోర్నీకి అర్హత సాధించి.. గ్రూప్-ఏలో టీమిండియా, పాకిస్తాన్ వంటి మేటి జట్లతో ఆడటమే ఓ మంచి అవకాశం. అలాంటిది మొదటి మ్యాచ్‌లో భారత్‌కు పోటీనివ్వగలిగింది. ఈ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్ ప్రదర్శనను తేలికగా తీసిపారేయలేం. ఇప్పుడు పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. మరోవైపు.. ఆరంభ మ్యాచ్‌లోనే దాయాది భారత్ చేతిలో ఓడిన పాక్‌కు హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో గెలిస్తేనే రేసులో నిలిచే పరిస్థితి. గాయాల బెడద వెంటాడుతున్న తరుణంలో బాబర్ ఆజం బృందంపై కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. గత రికార్డులు ఘనమే.. కానీ.. ఆసియా కప్ చరిత్రలో పాకిస్తాన్, హాంగ్ కాంగ్ ఇప్పటి వరకు మూడు సందర్భాల్లో తలపడ్డాయి. 2004, 2008, 2018లో వన్డే ఫార్మాట్లో హాంగ్ కాంగ్‌పై పాక్ జట్టు ఘన విజయాలు సాధించింది. 2004లో డీఎల్ఎస్ మెథడ్‌లో 173 పరుగులు, 2008లో 155 పరుగులు, 2018లో 8 వికెట్ల తేడాతో పసికూనపై అలవోకగా గెలుపొందింది. అయితే, ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతోంది. ఇక పొట్టి ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు. మ్యాచ్ ఎప్పుడు ఏ జట్టు చేజారుతుందో అంచనా వేయలేని పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్.. ఈ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌ను తేలికగా తీసుకుంటే అంతే సంగతులు! చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ Asia Cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు' -
Asia Cup 2022: ఆసియా కప్ 15వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు
Asia Cup 2022: Full Schedule: మరికొన్ని గంటల్లో క్రికెట్ మెగా ఈవెంట్ ఆసియా కప్- 2022 టోర్నీకి తెరలేవనుంది. దుబాయ్ వేదికగా శ్రీలంక- అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ 15వ ఎడిషన్ ఆరంభం కానుంది. ఇక భారత్, శ్రీలంక, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫైయర్స్‌లో నెగ్గిన హాంకాంగ్ సైతం పాల్గొననుంది. గ్రూపు- ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్ జట్టు ఉండగా.. గ్రూప్- బిలో శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. మరి.. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022 ఈవెంట్ పూర్తి షెడ్యూల్, మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర పూర్తి వివరాలు... ఆసియా కప్- 2022 షెడ్యూల్ 1. ఆగష్టు 27- శనివారం- శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్(గ్రూప్- బి)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ 2. ఆగష్టు 28- ఆదివారం- ఇండియా వర్సెస్ పాకిస్తాన్(గ్రూప్- ఏ)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ 3. ఆగష్టు 30- మంగళవారం- బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్(గ్రూప్- బి)- షార్జా క్రికెట్ స్టేడియం 4. ఆగష్టు 31- బుధవారం- ఇండియా వర్సెస్ హాంకాంగ్(గ్రూప్-ఏ)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ 5. సెప్టెంబరు 1- గురువారం- శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్(గ్రూప్ బి)- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ 6. సెప్టెంబరు 2- శుక్రవారం- పాకిస్తాన్ వర్సెస్ హాంకాంగ్(గ్రూప్- ఏ)- షార్జా క్రికెట్ స్టేడియం- షార్జా సూపర్ 4 స్టేజ్ మ్యాచ్‌లు- వేదిక- దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ 7. సెప్టెంబరు 3- శనివారం- గ్రూప్ బి టాపర్ వర్సెస్ గ్రూప్ బి సెకండ్ టాపర్ 8. సెప్టెంబరు 4- ఆదివారం- గ్రూప్ ఏ టాపర్ వర్సెస్ గ్రూప్ ఏ సెకండ్ టాపర్ 9. సెప్టెంబరు 6- మంగళవారం- గ్రూప్ ఏ టాపర్ వర్సెస్ గ్రూప్ బి టాపర్ 10. సెప్టెంబరు 7- బుధవారం- గ్రూప్ ఏ సెకండ్ టాపర్ వర్సెస్ గ్రూప్ బి సెకండ్ టాపర్ 11. సెప్టెంబరు 8- గురువారం- గ్రూప్ ఏ టాపర్ వర్సెస్ గ్రూప్ బి సెకండ్ టాపర్ 12. సెప్టెంబరు 9- శుక్రవారం- గ్రూప్ బి టాపర్ వర్సెస్ గ్రూప్ ఏ సెకండ్ టాపర్ 13. సెప్టెంబరు 11- ఫైనల్ మ్యాచ్ ఆరంభ సమయం టీ20 ఫార్మాట్లో జరుగనున్న ఆసియా కప్ 15 ఎడిషన్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం ప్రసార వేదికలు స్టార్ స్పోర్ట్స్ చానెల్ లైవ్ స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‌స్టార్ చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Asia Cup 2022: మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా!
Asia Cup 2022 India Vs Pakistan:ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభమైంది. అంతకంటే ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ యావత్ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నేడు(ఆదివారం) జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2021లో కనీవినీ ఎరుగని రీతిలో కోహ్లి సేనకు పాకిస్తాన్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ శర్మ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి పైచేయి సాధించాలని బాబర్ ఆజం బృందం ఆశపడుతోంది. మరి ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో భారత్- పాకిస్తాన్ ముఖాముఖి రికార్డులు ఎలా ఉన్నాయో గమనిద్దాం. మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా.. 1984 నుంచి ఆసియా కప్ నిర్వహణ ఆరంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రౌండ్ రాబిన్ పద్ధతిలో వన్డే ఫార్మాట్లో ఈ ఈవెంట్ జరిగింది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్ పోటీపడ్డాయి. భారత్- లంక ఫైనల్ చేరాయి. మొత్తంగా రెండు విజయాలతో టీమిండియా విజేతగా నిలిచింది. శ్రీలంక రన్నరప్ కాగా.. పాక్ రెండు మ్యాచ్‌లు ఓడి భంగపాటుకు గురైంది. టీమిండియా చేతిలో 54 పరుగులు, శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ఎన్నిసార్లు తలపడ్డాయంటే.. ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మొత్తం 14 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడ్డాయి. వీటిలో టీమిండియా 8 సార్లు గెలవగా.. పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. టీ20 ఫార్మాట్లోనూ మనదే పైచేయి.. ఆసియా కప్ టోర్నీని 2016లో టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అప్పటి నుంచి ఓ దఫా వన్డే.. మరో దఫా పొట్టి ఫార్మాట్లో.. ఇలా రొటేషన్ పద్ధతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా టీమిండియా భారత్- పాకిస్తాన్ మధ్య వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్‌లు జరుగగా.. భారత్ ఏడు గెలిచింది. అయితే 1997 నాటి వన్డే మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఇక 2016లో జరిగిన ఏకైక టీ20లోనూ విజయం భారత్‌నే వరించింది. ఐదు వికెట్ల తేడాతో ధోని సేన.. ఆఫ్రిది బృందాన్ని మట్టికరిపించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు సార్లు చాంపియన్‌గా నిలవగా.. శ్రీలంక ఐదుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్తాన్ కేవలం రెండుసార్లు ట్రోఫీ అందుకుంది. వేదిక స్టేడియం ఫార్మాట్ విజేత తేది దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం 23 సెప్టెంబరు 2018 దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ గెలుపు 19 సెప్టెంబరు 2018 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం టీ20 ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం 27 ఫిబ్రవరి 2016 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం 2 మార్చి 2014 మీర్పుర్ షేర్-ఇ- బంగ్లా నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 18 మార్చి 2012 డంబుల్లా రంగిరి ఇంటర్నేషనల్ స్టేడియం వన్డే 3 వికెట్ల తేడాతో టీమిండియా జయకేతనం 19 జూన్ 2010 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ గెలుపు 2 జూలై 2008 కరాచి కరాచి నేషనల్ స్టేడియం వన్డే 6 వికెట్ల తేడాతో భారత్ విజయం 26 జూన్ 2008 కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియం వన్డే 59 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు 25 జూలై 2004 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 44 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం 3 జూన్ 2000 కొలంబో ఎస్ఎస్సీజీ వన్డే ఫలితం తేలలేదు 20 జూలై 1997 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 97 పరుగుల తేడాతో పాక్ గెలుపు 7 ఏప్రిల్ 1995 ఢాకా బంగబంధు నేషనల్ స్టేడియం వన్డే 4 వికెట్ల తేడాతో భారత్ విజయం 31 అక్టోబరు 1988 షార్జా షార్జా క్రికెట్ స్టేడియం వన్డే 54 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు 13 ఏప్రిల్ 1984 చదవండి: Asia Cup 2022: కళ్లన్నీ కోహ్లి మీదే! తిరుగులేని రన్‌మెషీన్.. టోర్నీలో ఎన్ని సెంచరీలంటే? ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
విజయసాయిరెడ్డి నోట క్రికెట్ మాట.. టెస్ట్ ఫార్మాట్‌పై ఐసీసీకి పలు సూచనలు
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తొలిసారి రాజకీయేతర అంశాలపై స్పందించారు. ట్విటర్ వేదికగా క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ మనుగడపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు (ఐసీసీ) పలు సూచనలు చేశారు. టీ20 క్రికెట్ అంటే మనందరికీ ఇష్టమంటూనే, పొట్టి క్రికెట్ మోజులో పడి ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టులకు దూరం కావడం విచారకరమని అన్నారు. We love T20 cricket but it's worrisome that accomplished players like Trent Boult & Quinton de Kock have distanced themselves from classic Test cricket. ICC must ensure it manages to retain the interest of top players towards the purest form of game,keeping entertainment intact. — Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2022 ఆటగాళ్లు టీ20ల కోసం సుదీర్ఘ ఫార్మాట్‌ను నిర్లక్ష్యం చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐసీసీకి సూచించారు. స్వచ్ఛమైన క్రికెట్‌కు ప్రతిరూపమైన టెస్ట్ ఫార్మాట్ నుంచి అగ్రశ్రేణి ఆటగాళ్లు వైదొలగకుండా చూడాల్సిన బాధ్యత ఐసీసీపై ఉందన్నారు. టెస్ట్ క్రికెట్ వైభవం పది కాలాల పాటు పదిలంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ అంశంపై ఐసీసీ ప్రత్యేకమైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: 9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం -
రోహిత్‌కు జతగా ధవన్ ఉండగ, ఈ ప్రయోగాలు ఎందుకు దండగ..!
ఇటీవలి కాలంలో టీమిండియా పొట్టి ఫార్మట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నా ఓ విషయం మాత్రం అభిమానులను పెద్ద ఎత్తున కలవరపెడుతుంది. సిరీస్‌కు ఓ కెప్టెన్ మారుతుండటంతో ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న సగటు టీమిండియా అభిమానిని.. కొత్తగా ఓపెనింగ్ సమస్య జట్టు పీక్కునేలా చేస్తుంది. ఏడాది కాలంలో టీమిండియా ఏకంగా తొమ్మిది ఓపెనింగ్ జోడీలను మార్చడమే అభిమాని ఈ స్థితికి కారణంగా మారింది. తాజాగా విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మకు జతగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగడంతో అభిమానులు ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా హైలైట్ చేస్తున్నారు. అన్నీ సజావుగా సాగుతూ, జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని టీమ్ మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఓ జోడీకి కనీసం నాలుగైదు అవకాశాలైనా ఇవ్వకుండానే మార్చేయడం పద్దతి కాదని చురకలంటిస్తున్నారు. పేరుకు మాత్రమే రోహిత్-కేఎల్ రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లని, వీరిద్దరిలో ఒకరు అందుబాటులో ఉంటే మరొకరు ఉండరన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏదైన కొత్త జోడీని తయారు చేయాల్సిందిపోయి, వరుస పెట్టి ఓపెనర్లను మార్చడం ఎంతమాత్రం సమంజసంకాదని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే రోహిత్‌కు జతగా శిఖర్ ధవన్ ఉండగా.. ఈ ప్రయోగాలెందుకు దండగ అంటూ అని అంటున్నారు. ఎలాగూ ధవన్ ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి రోహిత్‌కు జతగా అతన్ని పర్మనెంట్‌గా ఆడించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ డిస్కషన్ హాట్ హాట్‌గా సాగుతుంది. 12 నెలల కాలంలో టీమిండియా మార్చిన ఓపెనింగ్ జోడీలు.. 1. రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, 2. కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్ 3. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ 4. రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్ 5. సంజు శాంసన్-రోహిత్ శర్మ 6. దీపక్ హుడా-ఇషాన్ కిషన్ 7. ఇషాన్ కిషన్-సంజు శాంసన్ 8. రోహిత్ శర్మ-రిషభ్ పంత్ 9. రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ చదవండి: Ind Vs WI: నిజంగా వాళ్లిద్దరు గ్రేట్! ప్రపంచకప్ జట్టులో మనిద్దరం ఉండాలి! -
టి20ల్లో స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధన
దుబాయ్: అంతర్జాతీయ టి20ల్లో ఓవర్‌రేట్ ఇటీవల చాలా సమస్యగా మారిపోయింది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, జరిమానాలు విధించినా జట్లు ఓవర్లు పూర్తి చేసేందుకు నిర్ణీత షెడ్యూల్‌కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో వ్యూహ ప్రతివ్యూహల కోసం సుదీర్ఘంగా చర్చిస్తుండటంతో ఇది మారడం లేదు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. జరిమానాలకంటే ఆ తప్పునకు మైదానంలోనే శిక్ష విధించాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంకంటే ఓవర్లు ఆలస్యం చేస్తే చివరి ఓవర్లో 30 గజాల సర్కిల్ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గిస్తారు. ఇప్పటి వరకు ఐదు మందికి అవకాశం ఉండగా నలుగురినే అనుమతిస్తారు. కీలక సమయంలో బౌండరీ వద్ద ఒక ఫీల్డర్ తగ్గడం స్కోరింగ్‌పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి జట్లు ఇకపై జాగ్రత్తలు తీసుకుంటాయని ఐసీసీ భావిస్తోంది. సాధారణంగా ఒక టి20 మ్యాచ్‌లో 85 నిమిషాల్లో 20 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ‘85వ నిమిషంలో 20వ ఓవర్ మొదలు కావాలి’ అనేది తాజా నిబంధన. అలా చేస్తేనే సరైన ఓవర్‌రేట్ నమోదు చేసినట్లుగా భావిస్తారు. లేదంటే ఫీల్డర్ కోత పడుతుంది. అయితే చివరి ఓవర్‌ను 85వ నిమిషంలోనే ప్రారంభిస్తే ఆ ఓవర్ కాస్త ఆలస్యంగా సాగినా చర్యలు ఉండవు. మూడో అంపైర్ ఈ టైమింగ్‌ను పర్యవేక్షిస్తారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగితే మాత్రం దానికి అనుగుణంగా సమయాన్ని సరి చేస్తారు. టి20 ఇన్నింగ్స్ మధ్యలో (10 ఓవర్ల తర్వాత) రెండున్నర నిమిషాల డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చనేది మరో కొత్త నిబంధన. ఈ నెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
డ్వేన్ బ్రావో ఖాతాలో 16వ టి20 టైటిల్
టి20 ఫార్మాట్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డు నెలకొల్పాడు. 15 టైటిల్స్‌తో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. బ్రావో టైటిల్స్ వివరాలు 3 ఐపీఎల్ (చెన్నై; 2011, 2018, 2021) 1 చాంపియన్స్ లీగ్ (చెన్నై; 2014) 2 టి20 వరల్డ్ కప్ (వెస్టిండీస్; 2012, 2016) 1 స్టాన్ఫోర్డ్ కప్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 2008) 2 బిగ్‌బాష్ లీగ్ (విక్టోరియన్ బుష్రేంజర్స్; 2010, సిడ్నీ సిక్సర్స్–2011) 5 కరీబియన్ ప్రీమియర్ లీగ్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 2015, 2017, 2018; ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 2020, సెయిట్ కిట్స్ అండ్ నెవిస్ 2021) 1 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఢాకా డైనమైట్స్; 2016) 1 పాకిస్తాన్ సూపర్ లీగ్ (క్వెట్టా గ్లాడియేటర్స్; 2019) -
టీ20 క్రికెట్‌కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను
Ashwin Is Not A Wicket Taker In T20 Format Says Sanjay Manjrekar : టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై వివాదాస్పద వ్యాఖ్యాత, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ టీ20 క్రికెట్‌కు అనర్హుడని, ఈ ఫార్మాట్లో అతనికి వికెట్లు తీసే సామర్ధ్యమే లేదని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో అశ్విన్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్‌ను అసలు జట్టులోకే తీసుకోనని వ్యాఖ్యానించాడు. అశ్విన్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశామని, టీ20 బౌలర్‌గా అతను ఏ జట్టుకు కూడా ఉపయోగపడింది లేదని అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్లో అశ్విన్ బౌలింగ్ శైలి మారాలనుకుంటే అది జరిగేది కాదని, గత ఐదారేళ్లుగా అతను ప్రాతినిధ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టర్నింగ్ వికెట్లపై తాను వికెట్ టేకింగ్ బౌలర్లవైపే మొగ్గుచూపుతానని.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, చహల్ లాంటి వారు తన బెస్ట్ ఛాయిస్ బౌలర్లని వెల్లడించాడు. సాంప్రదాయ టెస్ట్ ఫార్మాట్లో అశ్విన్ అద్భుతమైన బౌలరే అయినప్పటికీ.. పొట్టి ఫార్మాట్‌కు మాత్రం అస్సలు పనికిరాడని తెలిపాడు. ఓ ప్రముఖ క్రీడా ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ.. మంజ్రేకర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఐపీఎల్-2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్-2 పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడిన సంగతి తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరి ఓవర్ వేసిన అశ్విన్ తొలుత వరుస బంతుల్లో వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించినప్పటికీ.. ఐదో బంతికి కేకేఆర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. చదవండి: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
ఏ ఇతర భారత క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు.. కేవలం 71 పరుగుల దూరంలో
Kohli 71 Runs Away To Achieve Rare Milestone In T20 Cricket: ఐపీఎల్-2021 సెకండ్ ఫేస్‌లో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ ఇతర భారత బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కాని ఈ రికార్డుకు కోహ్లి కేవలం 71 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి నేటి మ్యాచ్‌లో ఆ పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్లో 10000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటరగా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్ రికార్డుల్లోకెక్కుతాడు. భారత జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున మొత్తం 311 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఇప్పటివరకు 133.95 స్ట్రైక్ రేట్‌తో 9929 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం పొట్టి క్రికెట్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 446 మ్యాచ్‌ల్లో 14,261 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 22 సెంచరీలు, 87 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతను 561 మ్యాచ్‌ల్లో సెంచరీ, 56 హాఫ్ సెంచరీల సాయంతో 11,159 పరుగులు సాధించాడు. వీరి తర్వాత పాక్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (436 మ్యాచ్‌ల్లో 10,808 పరుగులు), ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (304 మ్యాచ్‌ల్లో 10,017 పరుగులు) వరుసగా 3,4 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్లో అత్యధిక పరుగులు రికార్డు కూడా కోహ్లి పేరిటే నమోదై ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 199 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 5 శతకాలు, 40 అర్ధశతకాల సాయంతో 6076 పరుగులు స్కోర్ చేశాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ విషయానికొస్తే.. తొలిదశలో జరిగిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని ఆర్సీబీ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: మంచి పొజిషిన్‌లో ఉన్నారు.. ఇప్పుడిలా ఎందుకు కోహ్లి: గంభీర్ -
ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు..
Rohit Sharma Three Sixes Away To Record 400 Sixes In T20s: ఓవరాల్ టీ20 ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో మూడు అడుగుల దూరంలో ఉన్నాడు. నేటి నుంచి ప్రారంభంకానున్న రెండో దశ ఐపీఎల్-2021 తొలి మ్యాచ్‌లోనే రోహిత్ ఈ ఘనతను సాధించే అవకాశం ఉంది. టీ20ల్లో ఇప్పటివరకూ 397 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్.. నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో మరో మూడు సిక్సర్లు కొడితే, ఈ ఫార్మాట్లో 400 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. గేల్ ఏకంగా 1042 సిక్సర్లు బాది ఈ జాబితాలో అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గేల్ తర్వాతి స్థానాల్లో విండీస్ యోధులు పోలార్డ్(755), ఆండ్రీ రసెల్(509) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో రోహిత్(397) ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ కంటే ముందు ఆరోన్ ఫించ్(399), ఏబీ డివిలియర్స్(430), షేన్ వాట్సన్(467), బ్రెండన్ మెక్‌కలమ్(485) ఉన్నారు. ఇక పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ క్రికెటర్ల విషయాకొస్తే.. ఈ లిస్ట్‌లో రోహిత్ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా(324), విరాట్ కోహ్లి(315), ఎంఎస్ ధోని(303) ఉన్నారు. ఇదిలా ఉంటే, క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్ రిచ్ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో పునః ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధికంగా 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై(10), బెంగళూరు(10), ముంబై(8) జట్లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. చదవండి: మ్యాచ్‌కు ముందు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. భయంతో వణికిపోయాం -
పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని దాటేసిన విండీస్ యోధుడు
సెయింట్ కిట్స్: టీ20 క్రికెట్లో విండీస్ పరిమిత ఓవర్ల సారధి, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఓ అరుదైన మైలురాయిని క్రాస్ చేశాడు. ఈ ఫార్మాట్లో 11వేల పరుగుల ల్యాండ్ మార్క్‌ను దాటిన రెండో బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్లో 554 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్(11,008).. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2021లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. 14,108 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(10,741) మూడో స్థానంలో, ఆసీస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్(10,0017) నాలుగో ప్లేస్‌లో, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(9922) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. పోలార్డ్ బౌలింగ్‌లో 297 వికెట్లు పడగొట్టి.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ముఖ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
టీ20 క్రికెట్ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదు..
ముర్షియా: టీ20 క్రికెట్ చరిత్రలో పరమ చెత్త రికార్డులు నమోదవుతున్నాయి. ముర్షియా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్(యూరోప్ రీజియన్) పోటీలు ఈ పరమ చెత్త రికార్డులకు వేదికగా నిలిచాయి. ఆగస్ట్ 26న మొదలైన ఈ క్వాలిఫయర్ పోటీల్లో యూరోపియన్ మహిళా క్రికెట్ జట్లు ఒకదాని మించి ఒకటి పోటీపడుతూ.. పొట్టి ఫార్మాట్ పరువును బజారుకీడ్చాయి. నెదర్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టీ20ల్లో జరగకూడని ఘోరాలన్నీ జరిగిపోయాయి. ఓ జట్టేమో(జర్మనీ) 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులు మాత్రమే స్కోర్ చేసి అత్యంత జిడ్డు బ్యాటింగ్‌ను ప్రేక్షకులకు రుచి చూపించగా, మిగతా జట్లు తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీ పడి మరీ జిడ్డు ఆటకు బ్రాండ్ అంబాజిడర్లుగా నిలిచి టీ20ల్లో అత్యల్ప స్కోర్లను నమోదు చేసాయి. ఈ జట్లలో ఫ్రాన్స్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో వరుసగా 33 ఆలౌట్(నెదర్లాండ్‌పై), 45 ఆలౌట్(ఫ్రాన్స్‌పై), 24 ఆలౌట్(ఐర్లాండ్‌పై), 24 ఆలౌట్(స్కాట్లాండ్పై) స్కోర్లు నమోదు చేసింది. ఈ అత్యల్ప స్కోర్లన్నీ అటుఇటు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సాధించినవే కావడంతో క్రికెట్ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఈ జట్టుకు ఐసీసీ పోటీల్లో అనుమతిచ్చింది ఎవడ్రా అంటూ సోషల్‌మీడియలో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక స్కాట్లాండ్తో ఫ్రాన్స్ ఆడిన చివరి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ మహిళా జట్టు 17.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 24 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే నమోదైంది. అనంతరం స్కాట్లాండ్ కేవలం14 బంతుల్లోనే మూడు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధించింది. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి..