Telangana election commissioner
-
ఎస్ఈసీగా రాణీ కుముదిని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్ఈసీ) విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఐ.రాణీ కుముదిని నియమితులయ్యారు. మంగళవారం ఈ మేరకు ఆమెను ఎస్ఈసీగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీచేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. గత నాలుగేళ్లుగా ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహించిన సి.పార్థసారధి పదవీకాలం ఈ నెల 8న ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం గత ఫిబ్రవరితో ముగియగా ఏడున్నర నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.అదే విధంగా గత జూలై మొదటివారంలో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తులో భాగంగా, అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాల తయారీపై పార్థసారధి హయాంలో షెడ్యూల్ జారీచేశారు. ఈనెల 13న ముసాయిదా జాబితాల ప్రచురణ మొదలుపెట్టి, 28న ఓటర్ల తుది జాబితాలను ప్రచురించాలని ఈ షెడ్యూల్లో పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. 1988 బ్యాచ్ ఐఏఎస్... ఉమ్మడి ఏపీలో అనేక హోదాల్లో పనిచేసిన దివంగత ఐపీఎస్ అధికారి ఇస్మాల్ పుల్లన్న కుమార్తె రాణీ కుముదిని. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా 2023 దాకా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. తొలుత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జేసీగా, కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగానూ కొంతకాలం ఉన్నారు. కారి్మక, ఐఎల్వో కమిషనర్‌గా, ఉద్యానశాఖ కమిషనర్‌గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సరీ్వసుల్లోకి వెళ్లారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శిగా, ఎన్ఎఫ్డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో కార్మికశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (స్పెషల్ సీఎస్) పనిచేశారు. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ పొందారు. విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్ తెలంగాణ విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోపాల్ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పురపాలక శాఖ, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. -
‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. వాస్తవానికి రెండు టర్మ్‌ల వరకు రిజర్వేషన్లు మారకుండా గత ప్రభుత్వం చట్టం చేసిన విష యం తెలిసిందే. అయితే కొత్త ఓటర్ల జాబితాలకు అనుగుణంగా మళ్లీ రిజర్వేషన్లు మారుతాయని, సామాజికవర్గాల రిజర్వేషన్లు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. 50 శాతం మించరాదనే విషయంలో స్పష్టత ఉందని చెప్పింది. అయితే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అని, ప్రభుత్వపరంగా ఇచ్చే రిజర్వేషన్లను తాము అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న ట్రిపుల్ టెస్ట్ పేరిట సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాల యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధు లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా పార్థ సారథి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,966 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 1,14,620 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఎలాంటి మార్పులు లేకుండా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా తయారు చేసి సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రకటిస్తారని వెల్లడించారు. 7వ తేదీ నుంచి 13 వరకు ముసా యిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 19వతేదీ లోగా జిల్లా పంచాయతీ అధికారి పరిష్కరించి.. 21న గ్రామ పంచాయతీ తుది ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటిస్తారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రచురణకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్న విధంగా 9న జిల్లా స్థాయిలో, 10న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఓటరు ముసాయిదాలో లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని చెప్పారు.కిలోమీటర్ పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండాలి : పార్టీల ప్రతినిధులు పోలింగ్స్టేషన్లు ఒక కిలోమీటర్ పరిధిలో ఉండేలా చూడాలని, ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీలోని వార్డులుగా విభజించేటప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లను సంబంధిత వార్డుకు మాత్రమే అనుసంధానిస్తామని, కానీ చివరివార్డుకు కాదని కమిషనర్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు ఓటర్లకు తగిన సూచనలు, సలహాలు చేసి వారితో అభ్యంతరాలు క్లెయిమ్ చేయించి.. వారిని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని కోరారు.రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ రాజకీయపార్టీ ప్రతినిధుల సందేహాలపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో గోపిశెట్టి నిరంజన్, పి.రాజేశ్‌కుమార్(కాంగ్రెస్), భరత్‌కుమార్ గుప్తా, పి.శశిధర్‌రెడ్డి, దుదిమెట్ల బాలరాజ్యాదవ్ (బీఆర్ఎస్) చింతల రామచంద్రారెడ్డి, రామారావు (బీజేపీ), పల్లా వెంకటరెడ్డి, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), ఎన్.నర్సింహారెడ్డి, నర్సింగరావు (సీపీఎం) బండ సురేందర్‌రెడ్డి (ఏఐఎఫ్బీ), ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
లైలా.. ఓ అంబాసిడర్
సాక్షి, హైదరబాద్: లైలా ఓరుగంటి. ఒక ట్రాన్స్‌జెండర్. దశాబ్దాలుగా ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్త. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆమెను అంబాసిడర్‌గా నియమియారు. వివిధ సామాజిక వర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అన్ని వర్గాలకు చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్ వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన క్యాంపెయిన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి లైలా ఎన్నికల అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.‘తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.కానీ ఓటర్లుగా నమోదైన వాళ్లు కనీసం 3 వేల మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.’అని లైలా అభిప్రాయపడ్డారు. వివక్ష తొలగలేదు... చాలామంది ట్రాన్స్జెండర్లుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ ఓటింగ్‌లో మాత్రం ‘పురుషులు’ లేదా ‘మహిళలు’గా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.‘ట్రాన్స్జెండర్లు’గా నమోదు కావడం లేదు. దీంతో సామాజికంగా లక్షన్నర మంది ట్రాన్స్జెండర్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం 2,737 మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా నమోదయ్యారు. ఈ వర్గంపైన ఉండే సామాజిక వివక్ష కారణంగా తమ ఉనికిని చాటుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గోప్యంగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంఖ్యరీత్యా మెజారిటీగా ఉండే ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే రాజకీయ పారీ్టలు ట్రాన్స్జెండర్లను గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సామాజిక రుగ్మతను తొలగించుకొనేందుకు ప్రతి ట్రాన్స్‌జెండర్ ఓటరుగా నమోదు కావలసి ఉందని లైలా పేర్కొన్నారు. గత పదేళ్లలో ట్రాన్స్జెండర్ల సంఖ్య రెట్టింపయింది.‘అనేక రకాలుగా ‘ట్రాన్స్’గా జీవనం కొనసాగిస్తున్నవాళ్లు ఉన్నారు.కానీ కుటుంబం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచి్చన వాళ్లు నిర్భయంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కమ్యూనిటీకి చెందిన పుష్ప ఎన్నికల్లో పోటీ చేయగా, 2018లో జరిగిన ఎన్నికల్లో చంద్రముఖి ఎన్నికల బరిలో నిలిచారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పోటీ ఎంతో దోహదం చేసిందని ఆ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ లైలాను అంబాసిడర్‌గా నియమించడాన్ని కూడా ట్రాన్స్జెండర్లు, సామాజిక సంస్థలు ఆహ్వానిస్తున్నాయి.కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ చదివిన లైలా ... స్వచ్చంద సంస్థల ద్వారా ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పథకాలు అందడం లేదు... వివిధ కారణాల వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకుండా బతుకుతున్న తమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, చదువుకున్న వాళ్లకు కూడా ఉద్యోగా లు లభించడం లేదని లైలా ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగులు, పేద మహిళలు, తదితర వర్గాలకు లభించే రాయితీ సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, అణగారిన వర్గాలకు ఇళ్లు, ఇంటిస్థలాలు అందజేస్తున్నట్లుగానే తమకు కూడా సొంత ఇళ్లకు ఆర్ధికసహాయం అందజేయలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల సంఖ్య 1.50 లక్షలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లుగా నమోదైన ఓటర్లు : 2000 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు : 2,885 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు : 2,557 ప్రస్తుతం జరుగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన ట్రాన్స్‌జెండర్ ఓటర్లు : 2,737. -
తెలంగాణ ఎన్నికలు.. నేటి అప్డేట్స్
జంగ్ తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికలు 2023 లైవ్ అప్డేట్స్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ రేపటి కౌంటింగ్ నేపథ్యంలో కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ హ్యట్రిక్ లోడింగ్ 3.0... వేడుకలకు సిద్ధంగా ఉండండి.. గెలుపుపై ధీమా Hattrick Loading 3.0 👍 Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w — KTR (@KTRBRS) December 2, 2023 రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత 29 వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కిపంపించని అధికారులు.. విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో కొద్ది సేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన అధికారులు పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే ఇప్పుడు సీల్ వేసిన అధికారులు పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడం కాంగ్రెస్ నాయకుల తీవ్ర అభ్యంతరం ఆర్డీఓ ను నిలదీస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, ఉద్రిక్తత కర్ణాటక నుండి ఎమ్మెల్యేలను పిలిచిన కాంగ్రెస్ ఒక్కో నియోకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను పంపనున్న కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తీసుకొని వచ్చే బాధ్యత గజ్వేల్ ఫలితాలు ఆలస్యం!: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 10గం. తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం గజ్వేల్ నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వెల్లడి పోటీ అభ్యర్థులు ఎక్కువగా(44 మంది) ఉండడమే కారణమన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రాత్రి 8గం. తర్వాతే గజ్వేల్ ఫలితం రావొచ్చనే అంచనా 23 రౌండ్లలో కౌంటింగ్ ఇప్పటికే మాక్ కౌంటింగ్ పూర్తైందన్న కలెక్టర్ చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ములుగు జిల్లాలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆడబిడ్డల ములుగు ప్రజలు ఆదరించారు చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు నా జీవితానికి ఇంకేం కావాలి నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు నేనెప్పుడూ మీ సేవకు రాలినే నేను ములుగు ప్రజల వెంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నా వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు ఆడబిడ్డ ఉసురు తగులుతుంది మార్ఫింగ్ వీడియో, ఫోటోలతో దుష్ప్రచారం చేశారు నా కార్యకర్తలను పైసలతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటా పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తా ఎన్నికల్లో కష్ట పడ్డ అందరికీ కృతజ్ఞతలు వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. వెలుగులే ప్రతి ఇంటా.. కేసీఆర్‌కు బైబై చెప్తున్నారు: షర్మిల ఫలితాల ముందర.. వైఎస్సార్టీపీ నేత షర్మిల స్పందన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారని కామెంట్ బైబై కేసీఆర్ సూట్‌కేసును ప్రదర్శించిన షర్మిల కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులుగా సమర్థులైనవాళ్లు ఉన్నారు ఉత్తమ్, భట్టిలాంటి వాళ్లు ఉన్నారు బ్లాక్మెయిలర్స్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు సీఎం అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ వాళ్లు నిర్ణయించుకుంటారు సీఈవోను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్ నేత ఉత్తమ్.. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోంది రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు అసైన్డ్ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరాం ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరాం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశాం రంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల లెక్కింపు కోసం.. ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో రేపు ఉదయం ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇబ్రహీంపట్నం,మహేశ్వరం,కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడు అంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం 14 టేబుల్ 25 రౌండ్లు లెక్కింపు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు విజయావకాశాలపై వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలపై సీనియర్ నేత వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది దళితబంధు, డబుల్ బెడ్రూంల విషయంలో ప్రజలు విసిగిపోయారు మై హీరో: కవిత ట్వీట్ మై హీరో అంటూ తండ్రి కేసీఆర్ వీడియోను షేర్ చేసిన కవిత My hero❤️#KCR#JaiTelangana pic.twitter.com/LU5AEuOCi7 — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 2, 2023 ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ ఈసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, మధు యాష్కీ, ఉత్తమ్, పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు డిసెంబర్ 4న ఏర్పాటు చేయనున్న కేబినెట్ భేటీపైనా ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై నిఘా ఉంచాలని ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కీలక భేటీ హైదరాబాద్ హైదర్ గూడ ఎమ్మెల్యే. క్వార్టర్స్ లో భేటీ అయిన టీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యకతన భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పలువురు ముఖ్య నేతలు.. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేదాని పై చర్చ కౌటింగ్ నేపథ్యంలో రేపు తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు బంద్ ఎల్బీ నగర్ ఏర్పాట్లు ఇలా.. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి ఎల్బీనగర్ నియోజకవర్గంకి సంబంధించి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ మూడంచెల భద్రత నడుమ ఇండోర్ స్టేడియం ఎలాంటి ర్యాలీలు, విజయోస్తవ సంబురాలు చేయయూడదని ఇప్పటికే నేతలకు ఆదేశాలు కౌటింగ్ కేంద్రం చుట్టూ అరకిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్ అమలు కౌంటింగ్.. కౌంట్‌డౌన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి రాష్ట్రవ్యాప్తంగా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కేంద్రాల్లో కౌంటింగ్ ఉదయం 8గంటలకే తెరుచుకోనున్న బాక్స్‌లు తొలి అరగంట బ్యాలెట్.. ఆ తర్వాతే ఈవీఎంల్లో పోలైన ఓట్ల లెక్కింపు కౌంటింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ టెలీ కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రేపు జరుగనున్న ఓట్ల కౌంటింగ్ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతస్థాయి అధికారులకు డీజీపీ అంజనీకుమార్ ఆదేశం కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో ఇవాళ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి పాల్వంచ అనుబోస్ ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. కౌంటింగ్ కేంద్రం అనుబోస్ కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు మొత్తం 80 రౌండ్లలో.. జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 బూత్లలకు సంబంధించి 18 రౌండ్స్ లో కౌంటింగ్ ఇల్లందు నియోజకవర్గం లోని 241 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ పినపాక నియోజకవర్గం లోని 244 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ అశ్వారావుపేట నియోజకవర్గం లోని 184 బూత్ లలో 13 రౌండ్స్ లో కౌంటింగ్ భద్రాచలం నియోజకవర్గం లోని 176 బూత్ లలో 12 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భాగానే నమోదైన పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 78.67 శాతం పోలింగ్ నమోదు జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 80.13 శాతం పోలింగ్ నమోదు కౌంటింగ్ విధుల్లో.. 5,250 మంది సిబ్బంది క్లాస్ ఓటు బీఆర్ఎస్కే: పోచారం బీఆర్ఎస్ విజయావకాశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందన బీఆర్ఎస్కు 70-75 సీట్లు పక్కా మాస్-క్లాస్ ఓటర్ల పల్స్ వేరు క్లాస్ ఓటర్లంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు సైలెంట్ ఓటు KCRకు అనుకూలంగా ఉంది కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. కరీంనగర్ జిల్లా నాలుగు నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, మానకొండూర్.. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఒక్కో గదిలో 14 టేబుల్స్ ఏర్పాటు కరీంనగర్ ఓట్ల లెక్కింపు 28 రౌండ్లు మానకొండూరు ఓట్ల లెక్కింపు 23 రౌండ్లు చొప్పదండి ఓట్ల లెక్కింపు 24 రౌండ్లు హుజురాబాద్ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు... బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు.. వేములవాడ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లు....పొస్టల్ బ్యాలెట్ కొసం 3 టేబుల్స్ సిరిసిల్ల ఓట్ల లెక్కింపు కొరకు 21 రౌండ్లు , పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని మూడు నియోజకవర్గాలు.. మంథని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు రామగుండం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 11 రౌండ్లు పొస్టల్ బ్యాలెట్ కొసం 4 టేబుల్స్. పెద్దపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్,15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ ఏర్పాటు మంథని ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 14 రౌండ్లలో లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల కోసం వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు జగిత్యాల నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలొ ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు కోరుట్ల నియోజకవర్గం కోసం14 టేబుల్స్ పై 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం నాలుగు టెబుల్స్ ధర్మపురి నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కొసం నాలుగు టేబుల్స్ ఏర్పాటు బెట్టింగ్‌లో పొలం కూడా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరుగా పందేలు అభ్యర్థుల గెలుపోటములు.. మెజార్టీ ఎంత సాధిస్తారనేదానిపై బెట్ యాప్‌ల సాయంతో నెలరోజులుగా బెట్టింగులు వేస్తున్న ముఠా సిర్పూర్లో లక్షల్లో బెట్టింగ్ డబ్బులతో పాటు పొలంపైనా పందేలు వేస్తున్న కొందరు తన రెండు ఎకరాల భూమిని పందేంలో ఉంచిన ఓ వ్యక్తి! బీజేపీ ధీమా ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి పోలింగ్ ముందుదాకా ప్రభుత్వం రాబోతోందంటూ ప్రకటనలు ఆ స్టేట్‌మెంట్‌తోనే అగ్రనేతల హడావిడి ఎగ్జిట్‌పోల్స్‌తో ఢీలా పడ్డ పార్టీ కేడర్ తాజాగా బీజేపీ మరో ధీమా 2018 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ లీడర్ల స్టేట్మెంట్లు ఓట్లు-సీట్లు పెరుగుతాయని అంచనా 2018లో కేవలం 14 లక్షల ఓట్లు ఈసారి మాత్రం పోలైన ఓట్లలో.. 20 శాతం ఓట్లు వస్తాయని బీజేపీ అంచనా ..అయినా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనే! తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ భవితవ్యంపై టెన్షన్ పడుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ధీమా నిన్న ప్రగతి భవన్లో నేతలతో సమావేశం వార్ రూమ్ నివేదికపైనా సుదీర్ఘమైన చర్చ బయటకు వచ్చిన విక్టరీ సింబల్ చూపించిన కొందరు నేతలు హైదరాబాద్ దాటిన తర్వాత మళ్లీ గెలుస్తామా? లేదా? అని చర్చలు నేతల అధైర్యంతో.. కేడర్‌లోనూ ఆందోళన సీనియర్లలోనూ కొందరికి ఓటమి భయం? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్ 10:06AM రేపు కాంగ్రెస్ బిగ్ ప్లాన్ రేపు డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అభ్యర్థులు చేజారకుండా అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ అభ్యర్థుల వెంట ఏఐసీసీ పరిశీలకులు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా హైదరాబాద్ తాజ్‌కృష్ణకు తీసుకురానున్న పరిశీలకులు మంచి మెజారిటీ వస్తే నో క్యాంప్ ఇవాళే హైదరాబాద్‌కు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ఈ మొత్తం వ్యవహారాలను డీకే శివకుమార్‌కే అప్పగించిన అధిష్టానం హమ్మయ్యా.. ఇక రిలాక్స్ తెలంగాణలో రిలాక్స్ అవుతున్న పొలిటీషియన్స్ ఇంతకాలం ప్రచారంతో బిజీబిజీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇంటింటికి తిరిగి ప్రచారం అలసిపోయిన లీడర్లు పోలింగ్ ముగియడంతో ఇళ్లకు చేరుకున్న వైనం కుటుంబ సభ్యులతో గడుపుతూ కూల్ అవుతున్న నేతలు రేపు ఎలాగూ కౌంటింగ్ టెన్షన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. ఖమ్మం జిల్లా లో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి తల్లంపాడు శ్రీ చైతన్య ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. అక్కడే కౌంటింగ్ కేంద్రం శ్రీ చైతన్య కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కు ఏర్పట్లు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు 104 రౌండ్లలో ఖమ్మం జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు ఖమ్మం నియోజకవర్గం లోని 355 బూత్ లకు సంబంధించి 25 రౌండ్స్ లో కౌంటింగ్ పాలేరు నియోజకవర్గం లోని 289 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ మధిర నియోజకవర్గం లోని 268 బూత్ లలో 19 రౌండ్స్ లో కౌంటింగ్ వైరా నియోజకవర్గం లోని 252 బూత్ లలో 18 రౌండ్స్ లో కౌంటింగ్ సత్తుపల్లి నియోజకవర్గం లోని 292 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భారీగా నమోదైన పోలింగ్ 5250 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు జిల్లా వ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదు జిల్లా లో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కేసీఆర్‌పై నమ్మకం ఉంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు అనుకూలంగా పలువురి పోస్టులు కేసీఆర్‌పై నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల నేపథ్యంతో ఢీలా పడిన బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ప్రగతి భవన్ మీటింగ్ ధైర్యం నూరిపోసిన కేసీఆర్ అండ్ కేటీఆర్ ప్రజల కారువైపే ఉన్నారంటూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ నేతలకు భరోసా ఎగ్జిట్ పోల్స్ చెత్త అంటూ ఖండన ఎగ్జాక్ట్(కచ్చితమైన) పోల్స్ తమకు అనుకూలంగా ఉంటాయంటూ ప్రకటనలు అదే సమయంలో కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం 09:40 AM 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ మహిళ గురుకులంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయము 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.మొదట పోస్టల్ బ్యాలెట్,మరియు హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు ఉదయం 8:30 నిమిషాలకు ఈవీయము ఓట్ల లెక్కింపు ప్రారంభం మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలిపి 283 పోలింగ్ బూతులు కలవు,మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 53 వేల 342 పోలింగ్ శాతము 82.34.పోలైన ఓట్లు మొత్తం 2 లక్షల 8 వేల 958 ఓట్లు మొత్తం కౌంటింగ్ కి 14 టేబుల్స్ ఏర్పాటు,ఒక్కో టేబుల్ కి ఒక్కో ఈవీఎం లెక్కింపు, ప్రతి రౌండ్ కి 14 ఈవీఎం లెక్కింపు మొత్తం 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ ప్రతి రౌండ్ కౌంటింగ్ కి 20 నిమిషాల సమయము పట్టే అవకాశం మొదటి రౌండ్ పలితము కొద్దిగా ఆలస్యము అయ్యే అవకాశం 9:30 నిమిషాలకు మొదటి ఈవీఎం రిజల్ట్! మధ్యాహ్నాం 2 గంటల వరకు చివరి ఫలితం తేలే ఛాన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు స్ట్రాంగ్ రూంలు ఉదయము 6 గంటలకే ఓపెన్ చేసే అవకాశం 09:23 AM జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 56 మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. ముగ్గురు నోడల్ ఆఫీసర్లు, ఆరుగురు కౌంటింగ్ సూపర్వైజ ర్లు, 12మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈవీఎంలను అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు 09:15 AM కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ ఫిర్యాదు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) వికాస్ రాజ్‌ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు ముఖ్య నాయకులు కూడా ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్ 07:59 AM తెలంగాణ ఫలితాలు.. కాయ్‌రాజా కాయ్! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా సాగుతున్న బెట్టింగులు? ఏపీలోనూ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం గెలుపుపై అన్ని పార్టీల ధీమా ఎగ్జిట్‌పోల్స్ వచ్చాక.. రెట్టింపు అవుతున్న బెట్టింగ్ సొమ్ము ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు అంటేనే బెట్ వేయాలంటూ జోరుగా పందేలు సామాజికవర్గాలు, అనుకూల,ప్రతికూల అంశాలపై లెక్కలేసుకుని మరీ.. కీలక నేతల గెలుపోటములపైనా భారీగా.. కీలక నేతల మెజార్టీ ఫిగర్పైనా బెట్టింగులు బెట్టింగ్ ముఠాలపై పోలీసుల నజర్ 07:31 AM ఆ అంచనాలు నిజం అవుతాయా? తప్పుతాయా? ఆసక్తికరంగా తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కే ఎక్కువ అవకాశాలున్నాయంటూ మెజార్టీ సర్వే సంస్థల వెల్లడి పోలింగ్ ముగిసిన సాయంత్రం 5గం. వరకే అభిప్రాయ సేకరణ కానీ.. ఆ తర్వాత జరిగిన ఓటింగ్ తమకు కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో.. కాంగ్రెస్ సంబురాలు అధైర్య పడొద్దంటూ బీఆర్ఎస్ కేడర్‌కు కేసీఆర్ ధైర్యం ఎగ్జిట్‌పోల్స్‌ను రబ్బిష్ అంటూ కొట్టిపారేసిన కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్‌ను తామూ తారుమారు చేస్తామంటూ బీజేపీ ప్రకటన ఫలితాలు షాకింగ్‌గా ఉంటాయంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు 07:22 AM ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి కౌంటింగ్ ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు నాలుగు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో పీవీటీజీ బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంచిర్యాల జిల్లా ముల్కల ఇంజనీరింగ్ కళశాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఓట్ల లెక్కింపు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్ , ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ సందర్భంగా.. ఆయా కేంద్రాల వద్ద ఆంక్షల అమలు.. 144 సెక్షన్ విధింపు ఉదయం 6గం. నుంచి సాయంత్రం 6గం. ఆంక్షలు అమలు కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు నిషేధం 7:16 AM కాంగ్రెస్ గెలవబోతోంది: రేవంత్‌రెడ్డి ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమా విజయం తమదేనంటూ నేతల సంబురాలు.. టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఇంటికి క్యూ ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచన 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.. అదే రోజు గ్యారంటీ హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందంటూ నేతల ప్రకటనలు నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతల బృందం ఓటమి భయంతో కేసీఆర్ రైతు బంధు నిధుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు 07:09 AM పటిష్ట భద్రత.. పక్కా ఏర్పాట్లతో కౌంటింగ్: సీఈవో వికాజ్‌రాజ్ స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలు మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో రేపు తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ పోలింగ్ అనంతరం అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంల తరలింపు స్ట్రాంగ్‌రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు సీసీ కెమెరాలు ఏర్పాటు 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే టేబుల్స్14 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగింపు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు 07:00 AM మళ్లీ హైదరాబాద్‌కు డీకేఎస్ మళ్లీ తెలంగాణకు రానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటింగ్.. ఫలితాల నేపథ్యంలో రేపు సాయంత్రం హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడిగా డీకేఎస్‌ను నియమించిన ఏఐసీసీ రిసార్ట్ రాజకీయాల అవసరం ఉండబోదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకేఎస్ 06:57 AM ఆగం కావొద్దు.. మనమే వస్తాం: కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారిలోనే ధీమా పార్టీ కేడర్‌ను ధైర్యం నూరిపోసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో నిన్న భేటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి గాబరా పడొద్దు.. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ భరోసా ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రశాంతంగా ఉండండి.. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం చివరి గంటలో జరిగిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చని కేసీఆర్ అభిప్రాయం ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తూ విక్టరీ సింబల్ చూపించిన పలువురు నేతలు డిసెంబర్ 4వ తేదీన సచివాలయంలో కేబినెట్ భేటీకి సీఎం కేసీఆర్ నిర్ణయం 06:54 AM నగరంలో రేపు అక్కడ ఆంక్షలు ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఆంక్షలు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు ప్రదర్శించకూడదు విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలటరీ, ఎలక్షన్ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై నిషేధం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాల బంద్ 06:40 AM రేపే కౌంటింగ్.. తెలంగాణలో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ మధ్యాహ్నాం కల్లా ఫలితాలపై రానున్న క్లారిటీ తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ వన్ సైడెడ్‌గా ఎగ్జిట్ పోల్స్ అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమా 06:38 AM అత్యల్పంగా రాజధానిలోనే.. పోలింగ్ కేంద్రాలకు మోహం చాటేసిన రాజధాని వాసులు జిల్లా వారీగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా నమోదు అయిన పోలింగ్ కేవలం 47.88 శాతం మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గం వారీగా.. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటింగ్ మలక్‌పేట్‌లో 41.32 శాతం, చార్మినార్‌లో 43.27 శాతం, చాంద్రాయణగుట్టలో 45.26 శాతం బహదూర్ పురాలో 45.50 శాతం, జూబ్లీహిల్స్ లో 47.49 శాతం, అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో 48.75 శాతం, ఎల్బీనగర్లో 49.07శాతం, కంటోన్మెంట్లో 49.36 శాతం పోలింగ్ మేడ్చల్ - మల్కాజ్ గిరిలో 56.17 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతం, హన్మకొండలో 68.81 శాతం ఓటింగ్ 06:36 AM పోలింగ్ ఇలా.. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,793 మంది పోలింగ్ పాల్గొన్న 2,32,59,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో.. .. 1,15,84,728 మంది పురుషులు, మహిళలు 1,16,73,722 మంది, ఇతరులు 806 మంది జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నియోజకవర్గాల వారీగా చూస్తే.. నల్గొండ మునుగోడులో 91.89 శాతం ఓటింగ్ ఖమ్మం పాలేరులో 90.89, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 90.77 శాతం పోలింగ్ 06:32 AM ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఇలా.. నవంబర్ 30వ తేదీ గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5.గం దాకా.. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గం. కే ముగింపు అప్పటికే లైన్లో ఉన్నవాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాత్రి 10:30గం. దాకా కూడా క్యూలో ఓటర్లు ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం అధికారిక పోలింగ్ శాతం విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్ శాతం 71.34 శాతం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 73.37 శాతం నమోదు గతంలో కంటే రెండు శాతం పోలింగ్ తగ్గింది -
ఎన్నికల విధుల్లో లక్షమంది పోలీస్ సిబ్బంది
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ
-
TS Elections: పోలింగ్ శాతం పైకా? కిందకా?
రేపే తెలంగాణలో పోలింగ్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత చూసుకుంటే మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి (సాంకేతికంగా రెండోసారే). పైగా రెండు దఫాలుగా అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? లేదంటే ప్రజా తీర్పు మరోలా ఉండనుందా? అనే చర్చా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లు ఏమేర పోటెత్తుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. సగటున 67.57% పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంతో 2014లో జరిగిన ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. పైగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో కలిపే జరిగాయి. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతంలో అప్పటికి 2.81 కోట్ల ఓటర్లు ఉండగా.. దాదాపు 74 శాతం నమోదు అయ్యిందని అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. సొంత రాష్ట్ర కల నెరవేరిన జోష్‌లో ఓటు హక్కు అత్యధికంగా సంఖ్యలో వినియోగించుకున్నారనే విశ్లేషణలు నడిచాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల కోసం కేవలం 69.5 శాతమే ఓటింగ్ నమోదు అయ్యిందని ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ వివరాల్ని వెల్లడించిన అప్పటి ఎన్నికల అధికారి రజత్‌కుమార్ 73.20 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని ప్రకటించారు. ఆ సమయంలో గ్రామీణ ఓటింగ్ ఎక్కువగా నమోదు అయ్యింది. అర్బన్ ఓటర్లు చాలావరకు ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు 2023 ఎన్నికల విషయానికొస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన గతంలో కంటే మెరుగ్గా జరిపినట్లు .. అలాగే ఓటు హక్కు వినియోగంపైనా అవగాహన కల్పించినట్లు చెబుతోంది. మరోవైపు దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ ఓటు ద్వారా ఇంటి వద్దనే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 28 వేల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు కూడా. అన్నింటికి మించి 10 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంపుదలపై దృష్టి సారించడం గమనార్హం. ఇలా ఎలా చూసుకున్నా.. ఈసారి అత్యధిక ఓటింగ్ నమోదు కావొచ్చని.. అందునా అర్బన్ ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
500కు పైగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పహారా
-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు
-
TS: ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఎస్ఎఫ్సీ పార్థసారథి పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
మునుగోడు ఉప ఎన్నికపై 500 ఫిర్యాదులు: సీఈవో వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్‌రాజ్ సాక్షితో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
మునుగోడు ఉపఎన్నిక కోసం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
-
ఆ తర్వాత మునుగోడులో స్థానికేతరులు ఉంటే కఠిన చర్యలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూదని ఆదేశించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఈఓ. నాన్ లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరు ఉన్నా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మునుగోడులో అణువణువు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. ‘మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించాము. ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. రేపు సాయంత్రం 6గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లకు ఇప్పటికే కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పటి వరకు 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాము. 185 కేసులు నమోదు కాగా.. 6.80కోట్ల నగదు 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నాము. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందింది. దీనిపై ఈసీకి నివేదిక పంపాము. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు. ’ అని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ కీలక అంశాలు ► నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► 3366 పోలింగ్ సిబ్బందిని, 15 బలగాల సిబ్బంది మునుగోడులో మోహరిస్తున్నారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇవాళ (గురువారం) ప్రారంభమైంది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఓటర్ల జాబితాను తమకు సమర్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రచనా రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని వాదించారు. ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాల లో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని ఆమె వాదించారు. ఇక.. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటున్నారు. జనవరి 2021 వరకు రెండు లక్షల 22 వేలు ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం లో 2 లక్షల 38 వేలు ఓట్లు ఉన్నాయి. 25వేల ఓట్లలో ఏడు వేలు తొలగించాం. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది’ అని వాదించారు. రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులు ఎలా వచ్చాయని ఈసీని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వివరాలు, ఓటర్ల జాబితా తమకు సమర్పించాలని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. -
తేలిన స్థానిక సంస్థల మండలి ఓటర్ల లెక్క.. 6 స్థానాల్లో 5,326 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఆరు స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు స్థానాల్లో 2,997 మంది మహిళలు, 2,329 మంది పురుషులు.. కలిపి మొత్తం 5,326 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీలు 3,223, జెడ్పీటీసీలు 325, మున్సిపల్ కౌన్సిలర్లు 1,544, కార్పొరేటర్లు 169, ఎక్స్అఫీషియో ఓటర్లు 65 మంది ఉన్నారు. రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల అథారిటీల (12 సీట్లకు) మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, ఆరు సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన ఆదిలాబాద్, కరీంనగర్ (2 సీట్లు), మెదక్, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహించి 12న ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ స్థానాల్లో ఓటేయనున్న వారి వివరాలను పట్టికలో చూడవచ్చు.. -
తెలంగాణ ఈసీ పార్థసారధిని కలిసిన బీజేపీ నేతలు
-
ఊపందుకుంటున్న ‘గ్రేటర్’ ఎన్నికల ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా, మొత్తం 150 డివిజన్ల (వార్డుల) వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 7న ముసాయిదా జాబితాలు ప్రచురిస్తారు. మిగతా ప్రక్రియలను ముగించి 13న తుది ఓటర్ల జాబితాలను ప్రచురించనున్న నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించే ఓటర్ల జాబితాల్లో ఏ ఓటరు కులం లేదా మతం వెల్లడించే విధంగా వివరాలు ఉండకూడదని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలిచ్చింది. వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాల్లో ఏవైనా క్లరికల్ లేదా ప్రచురణ దోషాలుంటే.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు మొదట అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఆ విధమైన లోపాలను సరిచేసి, ఆ తర్వాత వార్డు ఓటరు జాబితాల్లో సరిచేయాలని సూచించింది. ఈ విధంగా చేయడం ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లోని వివరాలకు అనుగుణంగానే వార్డుల వారీ జాబితాలు ఉంటాయని స్పష్టం చేసింది. హార్డ్, సాఫ్ట్ కాపీలు.. వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు ఈసీ వద్ద నమోదై రిజర్వ్ చిహ్నం కేటాయించిన రాజకీయ పార్టీలకు ఉచితంగా సరఫరా చేసి వాటి నుంచి రశీదులు పొందాలని మున్సిపల్ అధికారులకు ఎస్ఈసీ సూచిం చింది. ఈ జాబితాల కాపీలు ఇతరులు కావాలని కోరిన పక్షంలో దానికయ్యే వాస్తవ ధర వసూలు చేసి హార్డ్, సాఫ్ట్ కాపీలు అందజేయొచ్చునని తెలిపింది. అవసరమైన ఓటరు జాబితా కాపీల ముద్రణకు అనుగుణంగా ముందుగానే అంచనా వేసి ప్రింట్ చేసుకోవాలని సూచించింది. వార్డుల వారీ ఓటర్ల జాబితాలను ఫొటోలు లేకుండా జీహెచ్ఎంసీ, ఎస్ఈసీ వెబ్‌పోర్టళ్లలో ఉంచాలని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కీలకమైనందున వివిధ అంశాలకు సంబంధించి ఎస్ఈసీ స్పష్టతనిచ్చింది. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం) కరోనా నేపథ్యంలో విశాల గదుల్లోనే కరోనా నేపథ్యంలో విశాలమైన గదులు, హాళ్లు ఉన్న భవనాలల్లోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. సాధ్యమైన మేర ఓటేసేవారు ఒక ద్వారం నుంచి ప్రవేశించి మరో ద్వారం గుండా బయటకు వెళ్లగలిగే హాళ్లు, గదులున్న భవనాలనే పోలింగ్ స్టేషన్లుగా ఎంపిక చేయాలి. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించాలి. ఆయా వార్డుల పరిధిలోనే సంబంధిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలి. ఓటర్‌కు అందు బాటులో ఉండేలా ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం లేకుండా పోలింగ్ కేంద్రాలు కేటాయించాలి. పోలింగ్ కేంద్రాలుగా పాఠశాల భవనాలను ఎంపిక చేస్తే ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటినే ఎంపిక చేయాలి. ళీ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతేనే చివరి ప్రయత్నంగా పోలింగ్ కేంద్రా లను తాత్కాలిక నిర్మాణాల్లో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దు. పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను ఎంపిక చేయొద్దు. భవనాల కింది అంతస్తుల్లోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. 7న ముసాయిదా ఓటర్ల జాబితాల తయారీ మొదలై 13న తుది జాబితాలను ప్రచురించనున్నందున.. అర్హులైన ఓటర్లు అసెంబ్లీ జాబితాల్లో తమ పేర్లను సరిచూసుకోవాలి. ళీ పేర్లు లేకుంటే తమ ఓటు నమోదుకు ఎన్వీఎస్పీ.ఇన్ పోర్టల్ ద్వారా నమోదు పత్రం లేదా నిర్దేశిత ఫారం– 6లో అసెంబ్లీ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారి వద్ద దరఖాస్తు పత్రం సమర్పించాలి. వాటిని పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను ముందుగా అసెంబ్లీ జాబితాల్లో చేర్చి తదనుగుణంగా సంబంధిత వార్డు ఓటరు జాబితాల్లో చేరుస్తారు. ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే తేదీ వరకు ఈ అవకాశముంటుంది. -
బ్యాలెట్ విధానంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు
-
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించామన్న ఎస్ఈసీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా.. 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయని ఈసీ ప్రకటించింది. బీజేపీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. స్థానిక ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. -
ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి వెల్లడించారు. మున్సిపల్ డివిజన్ల డీ లిమిటేషన్, రిజర్వేషన్లు, ఎన్నికలు పాత జీహెచ్ఎంసీ చట్టం ప్రకారమా.. కాదా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ స్పందన మేరకు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారై తమకు అందాక నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డివిజన్ల డీ లిమిటే షన్‌కు సంబంధించి వైఖరిని వెల్లడించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయని, సంబంధించిన జీవోలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించే వరకు ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరుందో.. లేదో.. చెక్ చేసుకుని, లేకపోతే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల కోసం ఎస్ఈసీ మొబైల్యాప్ కూడా అందుబాటులో ఉంచిందని, ఎస్ఈసీ వెబ్సైట్లోనూ తమ ఓటు ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలు చూసుకోవచ్చన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పార్ధసార«థి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఓటరే కీలకం... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో ఓటర్‌దే కీలకపాత్ర. ఓటు హక్కున్న ప్రతీ పౌరుడు ఓటు వేయ డాన్ని బాధ్యతగా తీసుకో వాలి. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేం దుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు పోస్టర్లు, ప్రకటనలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం, సెలబ్రిటీల సందేశాలు వంటివి చేపడుతున్నాం. సవాళ్లతో కూడుకున్నదే... కరోనా భయం నేపథ్యంలో ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజలను మోటివేట్ చేసే చర్యలు తీసుకుంటున్నాం. ఓటేసేందుకు అవసరమైన సురక్షిత చర్యలను చేపడుతున్నాం. బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టాం. అన్ని పరిశీలించాకే ఈ–ఓటింగ్.. కరోనా నేపథ్యంలో ఓటింగ్ పెంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటేసేందుకు పరిస్థితులు అనుకూలించని వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది కోసం ఈ–ఓటింగ్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావిస్తున్నాం. అయితే ఐటీశాఖ నుంచి సాఫ్ట్వేర్ అందాక, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నాకే పైలట్ బేసిస్‌తో చేపట్టడంపై నిర్ణయం తీసుకుంటాం. ఏర్పాట్లు పూర్తికావొస్తున్నాయి... ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) నుంచి అసెంబ్లీ ఓటర్ల జాబితా డేటా త్వరలోనే రానుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ ఏరియా వరకు 26 శాసనసభ నియోజకవర్గాల వారీగా 30 మంది జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కార్పొరేషన్ డివిజన్ల వారీగా అసెంబ్లీ జాబితాలతో ఓటర్ల జాబితాలను మ్యాపింగ్ చేసి ఎస్ఈసీకి ఇవ్వగానే పోలింగ్ స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రక్రియకు ముందు పోలింగ్‌బూత్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాల ఎంపికను అధికారులు పూర్తిచేస్తారు. బూత్‌కు వెయ్యిమంది ఓటర్లు... ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లుండేలా చూడాలని ఈసీ ఇదివరకే సూచించింది. దీనికనుగుణంగా ఏర్పాట్లుచేస్తాం. వెయ్యికంటే తక్కువ మందికి ఒక బూత్ చేయాలనే ఆలోచన ఉన్నా బిల్డింగ్లు, సిబ్బంది ఏ మేరకు అందుబాటులో ఉంటాయనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఫేస్ రికగ్నిషన్ పద్ధతి... 150 పోలింగ్ బూత్‌లలో ఫేస్ రికగ్నిషన్ అమలుకు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించాం. వీటి కోసం ఎంపిక చేసే భవనాల్లో సరైన వెలుతురు, ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించాం. ఐటీ శాఖ, టెక్నాలజీ సర్వీసెస్ విభాగం సహకారంతో ఈ ప్రక్రియను చేపడుతున్నాం. ఈవీఎంలా, బ్యాలెటా.. త్వరలోనే నిర్ణయం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్ పేపర్లతోనా.. ఈవీఎంలతోనా.. అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు అందాయి. ఏ విధానంతో ఎలాంటి సమస్యలు అన్న దానిని పరిశీలించి, నిపుణుల సలహాలు తీసుకున్నాక దీనిని ప్రకటిస్తాం. (చదవండి: బ్యాలెట్‌తోనే జీహెచ్ఎంసీ పోరు!) -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సి.పార్థసారథిని నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీచేశారు. మంగళవారం ఆయన్ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు కమిషనర్‌గా ఉన్న వి.నాగిరెడ్డి ఏప్రిల్‌లోనే పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచిమూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన బుధవారం బాధ్యతలు చేపడుతున్నట్టుగా అధికారవర్గాల సమాచారం. కమిషనర్‌గా నియమితులైన పార్థసారథి మంగళవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన వెంట సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నారు. ఇదీ పార్థసారథి ప్రస్థానం... 1993 సర్వీస్ కేడర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి బీఎస్సీ (అగ్రికల్చర్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)–ఆగ్రోనమి డిస్టింక్షన్లో పూర్తిచేశారు. 1988 డిసెంబర్ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్‌గా ఆదిలాబాద్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతల నిర్వహణ మొదలుపెట్టారు. అనంతరం అనంతపురం, వరంగల్ జిల్లాల జేసీగా విధులు నిర్వహించారు. 2004 జూన్ 19న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2006 జూన్ 6న మార్క్‌ఫెడ్ ఎండీగా, ఆ తర్వాత ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా, 2011 జూన్ 18న ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీగా బాధ్యతలు నిర్వహించారు. 2014 జూన్ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, 2015 ఏప్రిల్ 15న వ్యవసాయశాఖ కమిషనర్‌గా, ఆ తర్వాత ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా బదిలీపై వెళ్లి, ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగిరెడ్డి కమిషనర్‌గా ఉండగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మినహా మిగతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన మెజారిటీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయినందున, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి, కార్పొరేటర్ల కాలపరిమితి వచ్చే ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. దీంతో పాటు మార్చినెలలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల కాలపరిమితి కూడా ముగియనుంది. సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, నకిరేకల్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఇప్పటికే మారగా, ఈ పంచాయతీ కాలపరిమితి త్వరలో ముగియగానే ఆ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో దాని కాలపరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా లేక 2,3నెలలు ముందుగానే ఆ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగియడానికి మూడునెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో వెసులుబాటు ఉండడంతో ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. -
మున్సిపల్ ఎన్నికలు.. ఎవరి గుర్తులు వారికే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై వారితో చర్చించారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఈనెల 10న సిద్ధమవుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. షెడ్యూల్ లోపే ఎన్నికలు జరుపుతామని.. సుమారు 50 లక్షల ఓటర్లు పొల్గొనే అవకాశం ఉందని చెప్పారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. పలు వివరాలను వెల్లడించారు. ‘‘మున్సిపల్, వార్డుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తాం.12వ తేదీలోపు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వచ్చు. 14వ తేదీ వరకు ఎన్నికల ఓటర్ జాబితాను ప్రకటిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొని నూతన జాబితా సిద్ధం చేస్తాం. ప్రతి వార్డులో ఎంత మంది ఉన్నారో తెలిశాక పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలను నిర్వహిస్తాం. దాదాపు పాత పోలింగ్ కేంద్రాలనే ఈ ఎన్నికలకు కూడా ఉపయోగిస్తాం. ఈ నెల11న అధికారులతో మరోసారి సమావేశం ఉంటుంది. 13వ తేదీన పోలింగ్ కేంద్రాలపై మున్సిపల్ కమిషనర్లతో సమావేశం అవుతాం. 14న రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తాం’’ అని తెలిపారు. నాగిరెడ్డితో భేటీలో హాజరైన రాజకీయ పార్టీల నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నిరంజన్, బీజేపీ మల్లారెడ్డి, సీపీఐ పళ్ల వెంకట్ రెడ్డి, సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డి, ఎంఐఎం జాఫ్రీ మున్సిపల్. -
నెలాఖరులో మున్సి‘పోల్స్’!
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు జరపాలని మొదట భావించినా.. ఈ నెలలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో షెడ్యూల్‌ను కూడా కుదించింది. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్ జరగగా.. ఈసారి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 పురపాలక సంఘాలు, మూడు నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. 15 లేదా 16న నోటిఫికేషన్! ఈ నెల 15 లేదా 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, జూలై 30 లేదా 31వ తేదీన ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. ఆగస్టు 2న ఓట్ల లెక్కింపు, 4న కొత్త పాలకమండళ్లు కొలువుదీరేలా ఈసీ ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సాధ్యమైనంత త్వరగా ఎలక్షన్లు జరపాలని యోచిస్తున్న ఈసీ.. వార్డుల వారీగా ఓటర్ల తుదిజాబితాను ఈ నెల 14 నాటికి ప్రకటించాలని శనివారం సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 13 తేదీలోపు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితాను ఎస్ఈసీకి అందజేసేందుకు మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని విభాగాలూ సిద్ధమేనా? ఈ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంలో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ప్రింటింగ్ స్టేషనరీ డీజీ తేజ్‌దీప్ మీనన్, సీడీఎంఏ కమిషనర్ శ్రీదేవి తదితరులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలకు అవసరమైన బడ్జెట్ విడుదలకు ఆర్థికశాఖ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కరదీపికలు, సమాచార పుస్తకాలు, కవర్లు తదితరాలను 17వ తేదీకల్లా ఇచ్చేందుకు, బ్యాలెట్‌పేపర్లకు అవసరమైన కాగితం సరఫరాకు ప్రింటింగ్ విభాగం, మున్సిపాలిటీల్లో ఎన్నికల సందర్భంగా బందోబస్తుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పోలీస్‌శాఖ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల నిర్వహణకు మున్సిపల్ శాఖ, మొత్తంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు సీఎస్ సన్నద్ధంగా ఉన్నట్టు ఎస్ఈసీకి తెలియజేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిర్ణయించే తేదీలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తమ తమ విభాగాలు సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి ఎన్.జయసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో భాగంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తేదీలపై ఎస్ఈసీ స్పష్టత నిచ్చినట్టు తెలిసింది. సోమవారం రాజకీయ పక్షాలతో ఎస్ఈసీ సమావేశం కానుండగా, మరో ఒకట్రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలకు జిల్లా యంత్రాంగాలను ఎస్ఈసీ సన్నద్ధం చేయనుంది. ప్రతి 800 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు ప్రతి 800 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖకు ఎస్ఈసీ సూచించింది. తాజాగా ఓటర్ల తుది జాబితా ప్రకటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను నాలుగు రోజులు ముందుకు అంటే 18వ తేదీకి 14కు కుదించి, 14న ఫోటోలతో కూడిన తుది జాబితాను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సవరణ ఉత్తర్వుల్లో భాగంగా ఈనెల 10న వార్డుల్లో ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేసి, 12 వరకు అభ్యంతరాలను పరిష్కరించాలని, అంతకు ముందు ఈ నెల 11న రాజకీయ పక్షాలతో జిల్లా కలెక్టర్లు సమావేశం కావాలని షెడ్యూల్లో వివరించారు. ఈనెల 13న ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి, 14న ఓటర్ల తుది జాబితా విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 13న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు ఖరారైన జాబితా అందిన తర్వాత.. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ప్రభుత్వానికి ముసాయిదా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ఎస్ఈసీ సమర్పించినట్టు తెలుస్తోంది. ఆగస్టు మొదటివారంలోగా ఓట్ల లెక్కింపు పూర్తిచేయడంతో పాటు నూతన పాలకవర్గాలకు పదవీ బాధ్యతలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సామాగ్రి సిద్ధం చేసుకోవడంపై ఎన్నికల నిర్వహణకు వివిధరూపాల్లో అవసరమైన సామాగ్రిని తయారు చేసుకోవాలని వివిధ శాఖలు, విభాగాలను ఎస్ఈసీ ఆదేశించింది. ఇందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన పేపర్ వర్క్‌ను పూర్తి చేయాలని సూచించింది. గైడ్‌లైన్స్ పుస్తకాలు, కవర్లు, నామినేషన్ల పత్రాలతో పాటు ఎన్నికల సంబంధించిన సామాగ్రిని సేకరించడం, ప్రింటింగ్ చేయడం వంటి వాటిని ఈనెల 17లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. శాంతిభద్రతలపై చర్చించారు. పురపాలక ఎన్నికల ఏర్పాట్లకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని డీజీపీ వివరించారు. మూడు వార్డులకో గెజిటెడ్ అధికారి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తిచేసి జాబితాను వెంటనే పంపించాలని మున్సిపల్æశాఖను ఎస్ఈసీ ఆదేశించింది. ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రతి మూడు వార్డులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని సూచించారు. దీని ప్రకారం నామినేషన్ల దాఖలు కూడా ప్రతి మూడు వార్డులకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
క్యాంపులు పెడితే వేటు
సాక్షి, హైదరాబాద్: జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ పదవులకు నిర్వహించే ఎన్నికలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పరోక్ష, ప్రత్యక్ష పద్ధతుల్లో ఎలాంటి క్యాంప్‌లు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని, స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ పదవులకు జరిగిన ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు.. డబ్బు, అంగబలమున్న అభ్యర్థులు ఇళ్లు, రిసార్ట్‌లలో క్యాంప్‌లు నిర్వహించి గెలిచిన ప్రజాప్రతినిధులను సుదీర్ఘకాలం పాటు ఎక్కడో ఉంచడం తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న పార్టీకి అదనపు అవకాశాలుండటంతో ప్రభుత్వ యంత్రాంగా న్ని ఉపయోగించి ఏదోక రూపంలో ప్రభావితం చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పేర్కొంది. ఇలాంటి పద్ధతుల కారణంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రలోభాలకు లొంగి, విప్‌లను ధిక్కరించి ఓటేసే పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. ప్రలోభాల నివారణకు.. జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను వివిధ రూపాల్లో ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ప్రత్యేక సెక్షన్‌ను ఎస్ఈసీ చేర్చింది. పరిషత్ (జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు), పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీ)ని పదవులకు పరోక్ష పద్ధతుల్లో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఈ మేరకు సవరించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారిపై ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అంశాన్ని చేరుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల కోడ్ స్థానిక ఫలితాల వెల్లడి నుంచి మొదలై పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీల్లో ఆయా పదవులకు ఎన్నికలు ముగిసే వరకు అమల్లో ఉం టుందని స్పష్టం చేసింది. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు (ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతుల్లో) కోరుకునే ఏ రాజకీయపార్టీకి చెందినవారైనా ప్రజాప్రాతినిథ్య చట్టంలో పొందుపరిచిన లంచం ఇతరత్రా రూపాల్లోని ప్రలోభాలకు పాల్పడొద్దని పేర్కొంది. పార్టీలు ఇచ్చిన విప్‌ను ధిక్కరించి ప్రజాప్రతినిధులు ఓటేసేలా ఒత్తిళ్లు తేవొద్దని తెలిపింది. విప్‌ను ధిక్కరిస్తే పదవి కానీ ప్రోత్సాహకం కానీ ఇస్తామన్న ప్రలోభాలకు పాల్పడొద్దని హెచ్చరించింది. అధికార పార్టీ లేదా ప్రభుత్వ ప్రతినిధులు తమ అధికార హోదా లేదా పదవులను ఉపయోగించి కాంట్రాక్ట్‌ల కల్పన, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, లైసెన్సులు, సర్టిఫికెట్లు అందజేయడం, పెండింగ్‌కేసుల ఎత్తివేత వంటి వాటికి పాల్పడొద్దని స్పష్టంచేసింది.