test captaincy
-
#ViratKohli: పుష్కర కాలం పూర్తి.. లెక్కలేనన్ని ఘనతలు సొంతం
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టి ఇవాళ్టికి పన్నేండేళ్లు. పుష్కరకాలం పూర్తి చేసుకున్న కోహ్లి టెస్టుల్లో ఈ తరంలో గొప్ప క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లి ఇదే రోజున(జూన్ 20న)2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా తరపున వేగంగా వంద టెస్టులు ఆడిన క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈ 12 ఏళ్ల కాలంలో 109 మ్యాచ్‌లాడిన కోహ్లి 8479 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా కోహ్లి ఖాతాలో ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడు డబుల్ సెంచరీలు అతను కెప్టెన్ అయ్యాకే రావడం విశేషం. అంతేకాదు టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా తొలి స్థానంలో ఉన్నాడు. 2014లో ఎంఎస్ ధోని నుంచి టెస్టుల్లో సారధ్య బాధ్యతలు అందుకున్న కోహ్లి అనతికాలంలో టీమిండియాను టెస్టుల్లో నెంబర్‌వన్‌గా నిలిపాడు. ముఖ్యంగా కెప్టెన్‌గా కోహ్లి- హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి ద్వయం విదేశాల్లో భారత్‌కు విజయాలతో పాటు సిరీస్‌లు అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. మొత్తంగా టీమిండియా తరపున 68 టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన కోహ్లి 40 విజయాలు అందుకున్నాడు. అంతేకాదు టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పనిచేసిన కోహ్లి.. ఎంఎస్ ధోని(60 మ్యాచ్‌లు) రికార్డును బ్రేక్ చేశాడు. కెప్టెన్‌గా కోహ్లి విజయాల శాతం 58.8గా ఉంది. టెస్టు క్రికెట్లో టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ధోని 27 టెస్టు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. బలమైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను లాంటి జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్‌లు సొంతం చేసుకున్న టీమిండియాను కోహ్లి ముందుండి నడిపించాడు. ఇక స్వదేశంలో టెస్టుల్లో టీమిండియాకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి 25 మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించగా.. తర్వాతి స్థానంలో ధోని (21 మ్యాచ్‌ల్లో విజయాలు) ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా 20 శతకాలు బాదిన కోహ్లి.. గ్రేమి స్మిత్(సౌతాఫ్రికా మాజీ క్రికెటర్) తర్వాత టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇక గ్రేమి స్మిత్ ప్రొటిస్ కెప్టెన్‌గా 25 శతకాలు బాదాడు 12 years of Virat Kohli in Test Cricket. Lucky and Grateful enough to witness his 12 years. Hopefully You keep playing Test Cricket for a long long Time Kohli Sahab ❤️🥹.@imVkohli pic.twitter.com/GVgkzxCXA0 — S°´ (@Snehexe) June 20, 2023 12 years of Virat Kohli in Test Cricket. Lucky and Grateful enough to witness his 12 years. Hopefully You keep playing Test Cricket for a long long Time Kohli Sahab ❤️#ViratKohli #GOAT𓃵 #TestCricket pic.twitter.com/sSVAOBKzna — cheeks.one8 (@cheeks__one8) June 19, 2023 The legacy is Unmatched 👑#cricket #testcricket #teamindia #ViratKohli𓃵 pic.twitter.com/ufamc4zrNv — Cricket Addictor (@AddictorCricket) June 20, 2023 చదవండి: 'గొడవలు జరగడం ఇష్టం లేదు.. రేసు నుంచి తప్పుకుంటున్నా' -
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా అశ్విన్..!
-
రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు
నాలుగు విజయాలు.. రెండు ఓటములు.. ఒక డ్రా.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఫలితాలు. ఇంత మంచి రికార్డు ఉన్న రోహిత్‌కు ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితం అవడం మింగుడుపడని అంశం. విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ టీమిండియాను టెస్టుల్లో నెంబర్‌వన్ పొజిషన్లో ఉంచినప్పటికి చాంపియన్‌గా నిలబెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అయితే వయసు రిత్యా 36 ఏళ్లు ఉన్న రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడన్నది ఇప్పుడే చెప్పలేం. 2025లో జరిగే మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రోహిత్ వయస్సు 38కు చేరుకుంటుంది. ఇప్పుడే సరైన ఫిట్నెస్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్ అప్పటివరకు కొనసాగడం కష్టమే. ఒకవేళ ఆడినా అతను కెప్టెన్‌గా మాత్రం ఉండకపోవచ్చు. అందుకే రానున్న రెండేళ్లలో జరిగే టెస్టు సిరీస్‌లకు రోహిత్ కెప్టెన్‌గా ఉండకపోతే ఎవరు కెప్టెన్ కావాలనే విషయం అభిమానుల మదిలో ఉంది. ఇప్పటికిప్పుడు ఇదే ప్రశ్న అభిమానులకు వేస్తే అందరినోటి నుంచి వచ్చే పేరు అజింక్యా రహానే.. కాదంటే రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్. విరాట్ కోహ్లికి అవకాశం ఉన్నా అతను మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడా అంటే సందేహమే. అయితే ఇవన్నీ పక్కనబెడితే.. రోహిత్ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎవరైతే బాగుంటుందని Google AI(గూగుల్ ఏఐ)ని అడిగితే ఎవరు ఊహించని పేర్లు వెల్లడించింది. తొలి ఆప్షన్ కేఎల్ రాహుల్ గూగుల్ ఏఐ తన తొలి ఆప్షన్‌గా కేఎల్ రాహుల్ పేరు వెల్లడించింది. అయితే కేఎల్ రాహుల్ ఇదివరకే టీమిండియాకు కెప్టెన్‌గా పనిచేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ నేతృత్వం వహించగా.. ఆ సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. వైస్‌కెప్టెన్ హోదాలోనూ పనిచేసిన టీమిండియా పేలవ ఫామ్‌తో ప్రస్తుతం జట్టులోనే చోటు కోల్పోయాడు. మోకాలి సర్జరీ కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ఎప్పుడు వస్తాడన్నది క్లారిటీ లేదు. అయితే వయసు ప్రాతిపాదికన కేఎల్ రాహుల్ పేరును ఏంచుకున్నట్లు తెలిసింది. ''కొన్నేళ్లుగా కేఎల్ రాహుల్ టీమిండియాలో ప్రధాన బ్యాటర్‌గా ఉన్నాడు. ఎలాంటి కండీషన్స్లోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు.. మంచి ఫీల్డర్ కూడా. డొమెస్టిక్ క్రికెట్లో కర్నాటక, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్(ప్రస్తుతం) కెప్టెన్‌గా పనిచేశాడు. ఫామ్‌లోకి వస్తే అతన్ని ఆపడం కష్టం. భవిష్యత్తు టెస్టు క్రికెట్లో అతని అనుభవం టీమిండియాకు అవసరం.. అందుకే కేఎల్ రాహుల్ తొలి ఆప్షన్ అంటూ'' గూగుల్ ఏఐ తెలిపింది.. రెండో ఆప్షన్ రిషబ్ పంత్.. గూగుల్ ఏఐ తన రెండో ఆప్షన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంచుకుంది. అయితే గతేడాది డిసెంబర్లో పంత్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్ ఈ ఏడాది క్రికెట్ ఆడే అవకాశం తక్కువే. అయితే గతంలో టి20ల్లో టీమిండియా కెప్టెన్‌గా పనిచేసిన పంత్.. మూడు ఫార్మాట్లలోనే కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. ''పంత్ యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్. వికెట్‌కీపర్ అయిన పంత్ షార్ట్ ఫార్మాట్లో తన లీడర్షిప్ క్వాలిటీని మనకు పరిచయం చేశాడు. డొమొస్టిక్ క్రికెట్లో ఢిల్లీ, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా పనిచేసిన పంత్ టీమిండియాకు కూడ పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పంత్ కంటే బెటర్ చాయిస్ ఇంకోటి లేదు'' అని గూగుల్ ఏఐ వివరించింది. మూడో ఆప్షన్‌గా శుబ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో సంచలన ప్రదర్శన ఇస్తున్న శుబ్‌మన్ గిల్‌ను గూగుల్ ఏఐ మూడో ఆప్షన్‌గా ఏంచుకుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమయ్యాడు. కానీ అతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ''మంచి బ్యాటింగ్ టెక్నిక్ కలిగిన గిల్ టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా సమర్థుడని నాకు అనిపిస్తుంది'' అంటూ గూగుల్ ఏఐ తెలిపింది. చదవండి: 'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే? -
విండీస్‌తో టెస్టు సిరీస్.. కెప్టెన్‌గా ఆఖరిది కానుందా?
ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది. అయితే జట్టు ప్రదర్శన కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టెస్టు కెప్టెన్‌గా రోహిత్ పనికిరాడని.. వెంటనే అతన్ని తొలగించాలని అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. కాగా బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మకు అండగా నిలబడినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు, వన్డే, టి20 సిరీస్‌కు బీసీసీఐ సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. కాగా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో విఫలమైన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి విండీస్‌తో టెస్టు సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. పీటీఐ సమాచారం మేరకు విండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తర్వాతే రోహిత్ కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది. ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ''రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహితే కెప్టెన్‌గా ఉంటాడు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన, కెప్టెన్సీని బోర్డు సూక్ష్మదృష్టితో పరిశీలిస్తుందని.. రోహిత్ ఇచ్చే ప్రదర్శనతో అతని కెప్టెన్సీపై గవర్నింగ్ బాడీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికైతే టీమిండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ'' అంటూ పేర్కొన్నాడు. Rohit Sharma likely to captain India for the West Indies Test series. He'll sit with the BCCI later to decide on his future as Test captain. (Reported by PTI). pic.twitter.com/tbs5bGSImv — Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023 కాగా జూలై 12 నుంచి విండీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టులకు, వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ జట్టుతో ఆడనుండగా.. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కోహ్లి, రోహిత్ సహా మరికొంత మంది సీనియర్లు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక టి20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నేతృత్వం వహించే అవకాశం ఉంది. చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్ కొట్టబోతున్నాం: రోహిత్ లిగసీ కంటిన్యూ చేస్తారనుకున్నాం.. మూకుమ్మడి విఫలం -
రోహిత్‌ను తొలగిస్తే!.. భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టుల్లో రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడని.. అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌లు గెలిచినప్పటికి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో జట్టును నడిపించడంలో విఫలం కావడంతోనే రోహిత్‌ను తప్పించాలనే డిమాండ్ ఎక్కవగా వినిపిస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ప్రత్యామ్నాయం ఎవరనే దానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు అజింక్యా రహానే. 512 రోజుల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రహానే అందరికంటే మంచి ప్రదర్శన చేశాడు. అసలు రహానే లేకపోయుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మూడు రోజుల్లోనే ముగిసిపోయేది. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియా పరువు కాపాడడంతో పాటు మ్యాచ్ ఐదురోజులు జరగడానికి కారణమయ్యాడు. ఇక రోహిత్ స్థానంలో రహానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా సరైనోడని చాలా మంది పేర్కొంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టు ఓటమి అనంతరం అప్పటి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ లీవ్స్ పేరిట స్వదేశానికి వచ్చేశాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే.. తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. నడిపించడమే కాదు అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా గెలవడంలో రహానే పాత్ర కీలకం. కెప్టెన్‌గా అతని తీసుకున్న నిర్ణయాలతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీతో మెరవడంతో భారత్ రెండో టెస్టు గెలిచింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో భవిష్యత్తు కెప్టెన్‌గా రహానే పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు రోహిత్ టెస్టు కెప్టెన్‌గా తరచూ విఫలం అవుతుండడంతో అతని స్థానంలో రహానే అయితేనే కరెక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు. రహానేలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. జట్టు ఓటమి దిశగా ఉన్నప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి మ్యాచ్‌ను గాడిన పెట్టడం రహానేకున్న సమర్థత అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కాకపోయినా రోహిత్ తర్వాతి టెస్టు కెప్టెన్ అజింక్యా రహానేనే అవుతాడని అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు. Ajinkya Rahane's Captaincy Record :- No. Of Matches - 5 Wins - 4 Draw - 1 Loss - 0 👑 Also he led India to the historic series victory against AUS while overcoming a 36 runs all out defeat led by kohli. Petition for BCCI to make Rahane nxt Captain If you want any trophies. pic.twitter.com/tN6qADrzBx — 🄺Ⓐ🅃🄷🄸🅁 1⃣5⃣ (@katthikathir) June 11, 2023 He should be the test captain if they want any kind of good test cricket. Thankyou Ajinkya Rahane. pic.twitter.com/HnpMZ5oLaI — mona (@notafsidekick) June 11, 2023 చదవండి: #RetireRohit: 'కెప్టెన్‌గా దిగిపో.. కాదంటే రిటైర్ అయిపో' WTC Final 2023: 21వ శతాబ్దం మొత్తంలో ఈ ఆసీస్ బౌలర్‌ను మించినోడే లేడు -
#RetireRohit: 'కెప్టెన్‌గా దిగిపో.. కాదంటే రిటైర్ అయిపో'
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవ్వగానే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓటమికి తొలి బాధ్యుడిగా కెప్టెన్ రోహిత్ శర్మనే టార్గెట్ చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం #Retire #Rohitsharma హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయంటేనే కోపం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇక అభిమానులు కూడా రోహిత్‌ను ట్రోల్ చేశారు. ''నువ్వు కెప్టెన్‌గా పనికిరావు.. నువ్వు ఏదో చేస్తావని కోహ్లి నుంచి నీకు ఇచ్చారు.. కానీ కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నావు.. చేతగాకపోతే కెప్టెన్‌గా దిగిపో.. అదీ కాదంటే రిటైర్ అయిపో బాగుంటుంది.. ప్లీజ్రిటైర్ వడాపావ్'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయకుండా ఆలౌట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఏదో చేస్తారనుకున్న కోహ్లి, రహానేలు కూడా జట్టును రక్షించడంలో విఫలమయ్యారు. ఇక రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేది. ఐపీఎల్లో నమోదు చేసిన చెత్త ప్రదర్శననే ఇక్కడా కొనసాగించాడు. ఒక కెప్టెన్ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అతనికే చెల్లింది. ఒక బ్యాటర్‌గా విఫలమైన రోహిత్.. తాజాగా కెప్టెన్‌గానూ పనికిరాలేకపోయాడు. కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్.. తాను నాయకుడిగా ఒక్క మేజర్ ట్రోఫీని గెలవలేకపోగా కొన్ని సిరీస్‌లు కోల్పోయాడు. రోహిత్ కెప్టెన్ అయ్యాకా టీమిండియా టి20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్‌ను గెలవలేకపోయింది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. దీనికి తోడు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలకు అతని కెప్టెన్సీలోనే టీమిండియా సిరీస్ కూడా కోల్పోయింది. ఇన్ని ప్రతికూలతల మధ్య రోహిత్ మరో నాలుగు నెలల్లో వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను నడిపించనున్నాడు. ఇక్కడ కూడా రోహిత్ విఫలమైతే కెప్టెన్సీ పోవడమే కాదు కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని చెప్పలేం కానీ ఆ అవకాశముంది. ఒకవేళ రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తే అతని స్థానంలో అజింక్యా రహానే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే క్రమంగా టి20 కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా చేతుల్లోకి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. రానున్న టి20 సిరీస్‌ల్లో రోహిత్ ఆడడం అనుమానమే.. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా జట్టును నడిపించడం దాదాపు ఖాయమే. ఇక వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని రోహిత్‌ను కేవలం వన్డేలకే కెప్టెన్‌గా పరిమితం చేసే చాన్స్ కూడా ఉంది. ఈ లెక్కన రోహిత్ ఒకవేళ వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను విజేతగా నిలపకపోవతే కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగానూ అతని కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే! Rohit Sharma after becoming full time captain : Lost Asia Cup Lost T20 World Cup Lost WTC final .. RETIRE VADAPAV SACK ROHIT...... pic.twitter.com/oj4eQo5PI5 — ☞➸♕ ηίςհαηt☜⚓♕ (@Nishant__907) June 11, 2023 @ImRo45 Do this 1) Retire from T20Is. No need for that format again 2) Step down from Test captaincy. Better focus on batting. He isn't Test captaincy material 3) BIGGEST POINT - Work on fitness 4) Stop that intent thing. The day when he stops this he'll automatically improve — Aadvik (@thecoolguy03) June 11, 2023 No true ICT fan will pass without liking this post !! RETIRE VADAPAV SACK ROHIT SHARMA#WTCFinals #WTCFinal2023 #WTC2023Final pic.twitter.com/SwYcjf7ooN — Cric_uneeb (@GOAT_Virat18) June 11, 2023 చదవండి: 'ఇదొక గుణపాఠం.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మా కొంపముంచింది' ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా -
టీ20 కెప్టెన్‌గా హార్ధిక్, వన్డేలకు రోహిత్, టెస్ట్ కెప్టెన్‌గా పంత్..?
హార్ధిక్ పాండ్యాను భారత టీ20 జట్టు రెగ్యులర్ కెప్టెన్ చేసేందుకు పావులు వేగంగా కదులుతున్నాయని తెలుస్తుంది. కొత్త సెలెక్షన్ కమిటీ ఏర్పాటైన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్-2024ను దృష్టిలో ఉంచుకుని హార్ధిక్‌ను ఇప్పటినుంచే కెప్టెన్‌గా ప్రమోట్ చేయాలని భావిస్తున్న బీసీసీఐ.. అతి త్వరలోనే హార్ధిక్‌కు టీ20 పగ్గాలు అప్పజెప్పనుందని బీసీసీఐకి చెందిన కీలక అధికారి వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్ధిక్.. గత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలోనూ టీమిండియాను విజేతగా నిలిపాడు. ఈ సక్సెస్‌ను, ఇటీవలి కాలంలో అతని ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ అతని పొట్టి క్రికెట్ పగ్గాలు కట్టబెట్టనుందని సమాచారం. ఇదిలా ఉంటే, మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు అనే అంశాన్ని బీసీసీఐ కొత్తగా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫార్ములాను అమలు చేయాల్సి వస్తే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతల్లో మరింత కోత పడే అవకాశం ఉంది. ఇప్పటికే పొట్టి ఫార్మాట్లో హార్ధిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్న బీసీసీఐ.. వన్డేలు, టెస్ట్‌లకు మరో ఇద్దరు కెప్టెన్లను నియమించాల్సి ఉంటుంది. ఒకవేళ.. వయసు పైబడటం, ఇటీవలి కాలంలో ఫామ్‌ను సాకుగా చూపి రోహిత్‌ను వన్డే కెప్టెన్సీకి మాత్రమే పరిమతం చేయాలని బీసీసీఐ భావిస్తే.. టెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ పదవి రేసులో జస్ప్రీత్ బుమ్రా , పుజరా పేర్లు ప్రముఖంగా వినపడుతున్నప్పటికీ.. రిషబ్ పంత్ ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ ఆటగాడినే టెస్ట్ టీమ్ కెప్టెన్ చేయాలని డిమండ్ చేస్తున్నారు. హార్ధిక్‌ను టీ20లకు కెప్టెన్‌ను చేసినప్పుడు, సుదీర్ఘ ఫార్మాట్లో మంచి రికార్డు ఉన్న పంత్‌ను టెస్ట్ కెప్టెన్ చేయాలంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. టీమిండియా చివరగా ఆడిన టెస్ట్‌లో (ఇంగ్లండ్‌లో 5వ టెస్ట్) పంత్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (146), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (57) సాధించాడని, పంత్‌కు విదేశాల్లో మంచి ట్రాక్ రికార్డు ఉందని, ఐపీఎల్లో జట్టును (ఢిల్లీ క్యాపిటల్స్) విజయవంతంగా ముందుండి నడిపించిన అనుభవం కూడా ఉందని.. పంత్‌ను టెస్ట్ కెప్టెన్ చేయడానికి ఈ అర్హతలు చాలవా అని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు అనే అంశం వస్తే, పంత్‌కు తప్పక టెస్ట్ పగ్గాలు అప్పజెప్పాలని కోరుతున్నారు. కాగా, భారత టెస్ట్ జట్టులో సీనియర్లు, రెగ్యులర్ ఆటగాళ్లు అయిన కోహ్లి, జడేజాలు కెప్టెన్సీపై ఆసక్తి చూపకపోతే, కెప్టెన్సీ రేసులో మిగిలేది బుమ్రా, పుజారా, పంత్, అశ్విన్‌లు మాత్రమే. వీరిలో బుమ్రా తరుచూ గాయాల బారినపడుతుండటం, వయసు పైబడిన రిత్యా అశ్విన్‌కు అవకాశాలు తక్కువగా ఉండటం, ఇటీవలి కాలంలో పుజారా నిలకడలేమి సమస్యతో బాధపడుతుండటంతో టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు పంత్‌కే దక్కుతాయని అతని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. చదవండి: రోహిత్ మెడపై కత్తి పెట్టి, హార్ధిక్‌కు పట్టం కట్టి.. ఇవన్నీ జై షా వ్యూహాలేనా..? -
రోహిత్ శర్మ నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు.. అందుకే అలా: డీకే
ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఎత్తుపళ్లాలు సహజం. కొన్నిసార్లు అద్బుత విజయాలతో ప్రశంసలు అందుకుంటే.. మరికొన్ని సార్లు అంచనాల అందుకోలేక విమర్శలపాలవుతారు. ఇక క్రికెటర్ల విషయానికొస్తే.. ఎంతటి మేటి ఆటగాడు అయినా ఒక్కసారి ఫామ్ కోల్పోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి విషయంలో ప్రస్తుతం వినిపిస్తున్న కామెంట్లే ఇందుకు తాజా నిదర్శనం. ఇక కెరీర్ తొలినాళ్లలో ఏ చిన్న తప్పు చేసినా జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ చాలు రాత మారటానికి! భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకప్పుడు ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశాలు బాగానే ఉన్నా.. టెస్టు జట్టులో చోటు కోసం మాత్రం ఈ హిట్‌మ్యాన్ పరితపించిపోయేవాడు. ఐర్లాండ్‌తో వన్డే మ్యాచ్‌లో 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు రోహిత్. అదే ఏడాది టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత! అయితే, ఆరేళ్ల నిరీక్షణ తర్వాతే.. క్రికెటర్‌గా అసలైన గుర్తింపునిచ్చే టెస్టుల్లో రోహిత్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా స్వదేశంలో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న హిట్‌మ్యాన్.. అరంగేట్రంలోనే అద్భుత శతకం బాదాడు. శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఓపికగా క్రీజులో నిలబడి 301 బంతులు ఎదుర్కొని 23 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 177 పరుగులు సాధించాడు. తద్వారా జట్టును ఇన్నింగ్స్ మీద 51 పరుగుల తేడాతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆడిన రెండో టెస్టులోనూ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇబ్బందులు ఎదురైనా! కానీ ఆ తర్వాత నాలుగేళ్ల పాటు రోహిత్ ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. ఈ క్రమంలో 2017లో మూడో సెంచరీ సాధించాడు. అయితే, మళ్లీ నాలుగో సెంచరీ చేయడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఈ క్రమంలో విమర్శలపాలయ్యాడు. అయితే, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పూర్తి ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ పొంది.. ఇప్పుడు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. నాతో చెప్పుకొన్నాడు! ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో చోటు కోసం రోహిత్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి క్రిక్‌బజ్ షోలో తాజాగా ప్రస్తావించాడు. ఈ మేరకు డీకే మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు అతడి పైకి విమర్శల బంతులు దూసుకువచ్చాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగాడు. మరికొన్నింటికి జవాబులు కనుక్కోలేకపోయాడు. నిజానికి.. టెస్టు క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలని రోహిత్ భావించేవాడు. అయితే, అన్నిసార్లూ అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు కదా! అతడు ఇబ్బందుల పాలయ్యాడు. నాతో జరిగిన చర్చల్లో ఆ విషయాల గురించి పంచుకునేవాడు. నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు నిజం చెప్పాలంటే.. ఒక్కోసారి తను నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు. అయితే ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అనూహ్యరీతిలో తిరిగి వచ్చి అద్బుత ఆటతీరుతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. టెస్టుల్లో ఘనమైన అరంగేట్రం చేసిన అతడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చినా తనను తాను నిరూపించుకున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్ ఇప్పటి వరకు 45 టెస్టులాడి 3137 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 212. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2022 టోర్నీకి డీకే ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022 తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన అతడు.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ వల్లే తాను ప్రస్తుతం ఇలా ఉన్నానంటూ గతంలో వ్యాఖ్యానించాడు. చదవండి: Deepak Chahar: చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు! Stuart Broad: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన ఫీట్.. టెస్టు క్రికెట్లో నాలుగో బౌలర్‌గా -
రోహిత్ శర్మ కెప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేసిన యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు వదులుకున్న తర్వాత ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పజెప్పడం భావోద్వేగ నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. ఫిట్నెస్ అంశాన్ని పరిగణలోకి తీసుకుని రోహిత్ శర్మను టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా చేశారని, అలా చేయడం అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించాడు. 34 ఏళ్ల రోహిత్ గత రెండేళ్లుగా గాయాల బారిన పడుతున్నాడని, టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అతని ఫిట్‌నెస్‌పై మరింత ఒత్తిడి పెంచుతాయని అన్నాడు. రోహిత్ టెస్టుల్లో పూర్తి స్థాయి ఓపెనర్‌గా మారి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యిందని, టెస్ట్ బ్యాటర్‌గా అతను ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాడని, ఇలాంటి సమయంలో బ్యాటింగ్‌పై పూర్తి స్థాయి దృష్టి సారించడం అతనికి, టీమిండియాకు ఎంతో అనసరమని తెలిపాడు. మొత్తంగా టెస్ట్ కెప్టెన్సీ రోహిత్ బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై కూడా ప్రభావం చూపుందని కంక్లూడ్ చేశాడు. ఇదే సందర్భంగా రోహిత్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీపై స్పందిస్తూ.. వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా చాలాకాలం క్రితమే నియమించబడాల్సిందని, అయితే విరాట్ కోహ్లి టీమిండియాను అద్భుతంగా ముందుండి నడిపిస్తుండటంతో అది సాధ్యపడలేదని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అద్భుతమైన నాయకుడని, ఈ విషయాన్ని తాను ఐపీఎల్లో అతని సారధ్యంలో ఆడుతుండగా గ్రహించానని తెలిపాడు. రోహిత్ అద్భుతమైన నాయకుడని, అతను చాలా మంచి ఆలోచనాపరుడని, వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియా కెప్టెన్‌గా తన ఓటు రోహిత్కేనని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు స్పోర్ట్స్ 18 ఛానల్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో యువీ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. చదవండి: 'అతడు ఫామ్‌లో లేడు.. 15 కోట్ల ఆటగాడిని పక్కన పెట్టండి' -
"కపిల్ దేవ్ కోసం వెతకడం ఆపండి.. వాళ్లపై దృష్టిపెట్టండి"
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరన్నది అందరి మెదడులని తొలుస్తున్న ప్రశ్న. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని చాలా వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్‌కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ కీలక వాఖ్యలు చేశాడు. కపిల్ దేవ్ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత్‌కు దొరకకపోతే, తర్వాత ఏమి చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని గంభీర్ తెలిపాడు. "భారత జట్టులో కపిల్ దేవ్‌లాంటి ఆల్‌రౌండర్ లేరని మనకు తెలుసు. జట్టులో లేని దానికోసం ప్రయత్నించకూడదు. ఈ నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. తదుపరి కపిల్ దేవ్‌ను వెతికే ప్రయత్నాలనుంచి భారత్ బ్రేక్ తీసుకోవాలి. జట్టును నడపించగల సత్తా ఉన్న ఆటడాడికి భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి. ఇక క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయిలో కాకుండా దేశీయ స్థాయిలోనే అత్యత్తుమ ఆటగాడిగా తీర్చిదిద్దాలి. రంజీ ట్రోఫీ స్థాయిలో క్రికెటర్లను అభివృద్ధి చేయాలి. అనంతరం వారికి అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం ఇవ్వండి. విజయ్ శంకర్, శివమ్ దూబే, వెంకటేష్ అయ్యర్ వంటి చాలా మంది యువ ఆటగాళ్లు అక్కడి నుంచి వచ్చిన వారే" అని గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలుకొడతాడు.. టెస్టు కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాంటింగ్
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక అంశంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లి నిర్ణయం తనను విస్మయానికి గురి చేసిందన్న పాంటింగ్... అతడు గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అజింక్య రహానేకు కూడా టెస్టు సారథిగా మంచి మార్కులే పడతాయని, ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లను గెలిపించిన విధానమే ఇందుకు నిదర్శనమన్నాడు. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పేరు కూడా వినిపిస్తోందని, అయితే, కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలిగేది మాత్రం రోహిత్ శర్మనే అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు పాంటింగ్ మాట్లాడుతూ... ‘‘కోహ్లి నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. అయితే, ఆటగాడిగా కొనసాగుతాననడం మంచి విషయం. తనకు ఇప్పుడు 33 ఏళ్లు. కెప్టెన్సీ భారం లేదు. కాబట్టి ఆటగాడిగా కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టగలడు. కొత్త కెప్టెన్ విషయానికొస్తే.... నేను అజింక్య రహానేతో కలిసి పనిచేశాను. తను చాలా మంచి ఆటగాడు. ప్రస్తుతం తను గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అయితే, ఆస్ట్రేలియా సిరీస్‌లో నాయకుడిగా తానేంటో నిరూపించుకున్న విషయాన్ని మర్చిపోవద్దు. కానీ... అది సరిపోదు కదా! ఇప్పుడు కేఎల్ రాహుల్ పేరును కూడా కొందరు సూచిస్తున్నారు. విదేశీ గడ్డపై అతడి రికార్డు బాగుంది. కానీ... నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ మాత్రమే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలడు. ముంబై ఇండియన్స్ జట్టును ముందుండి నడిపించిన విధానాన్ని నేను దగ్గరగా గమనించాను. తను విజయవంతమైన సారథి. ఇప్పుడు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండు మూడేళ్లుగా టెస్టుల్లో రాణిస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Auction: కొత్త ఫ్రాంఛైజీ 8 కోట్లు పెట్టింది; అతడిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ: హెడ్‌కోచ్ ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ -
రోహిత్ శర్మపై భారత మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... కనీసం సెలక్షన్కైనా..
Test Captaincy- Cannot Have Captain Who Gets Injured Start Of Series: టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఎవరా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ పేరు దాదాపు ఖాయమైపోగా... భారత మాజీ క్రికెటర్లు కొందరు ఈ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడతున్నారు. వయసు, ఫిట్నెస్ దృష్ట్యా హిట్‌మ్యాన్ సరైన ఆప్షన్ కాదేమోనని పేర్కొంటున్నారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్టర్ సబా కరీం కూడా ఇదే మాట అంటున్నారు. ఓ యూట్యూట్ చానెల్‌తో మాట్లాడిన ఆయన.. టీమిండియా టెస్టు కెప్టెన్సీ అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడా? ‘‘రోహిత్ శర్మ తన అద్భుత ప్రదర్శనతో ఎంతో పేరు సంపాదించాడు. తను జట్టుకు ప్రధాన బలం. అయితే తన ముందున్న అసలైన సవాల్ ఏమిటంటే.. ఫిట్నెస్. అవును... అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. కెప్టెన్సీ విషయం పక్కనపెడితే.. అసలు రోహిత్‌కు మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండటమే అతి పెద్ద టాస్క్. ఇప్పటికే ఎన్నోసార్లు గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి తిరిగి వస్తున్నాడు. ఒకవేళ టెస్టు కెప్టెన్‌గా అతడిని నియమించాలని అనుకుంటే ముందుగా... ఫిట్నెస్ కోచ్, ఫిజియోతో చర్చించాలి. టెస్టు సిరీస్‌కు ముందు తరచుగా గాయపడే ఆటగాడిని సారథిని చేయడం సరికాదు కదా’’ అని పేర్కొన్నారు. ఇక రోహిత్ శర్మను వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్ చేసినా.. అది స్వల్పకాలానికి పరిమితమవుతుందని సబా కరీం అభిప్రాయపడ్డారు. ‘‘2023 టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. వన్డే వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ కూడా ఇదే ఏడాది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోహిత్‌ను అన్ని ఫార్మాట్లకు సారథిని చేసినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నాయకుడిని ఎంపిక చేయాలి. ప్రస్తుతానికి రోహిత్ ఒక్కడే ఆప్షన్. ఎందుకంటే.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు ఇంకా పరిణతి చెందాల్సి ఉంది. వాళ్లను నాయకులుగా తీర్చిదిద్దడానికి కాస్త సమయం పడుతుంది’’ అని సబా కరీం చెప్పుకొచ్చారు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా, టెస్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, టూర్ ఆరంభానికి ముందే అతడు గాయపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం, రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ నేతృత్వం వహించిన వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురికావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇక ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో రోహిత్ ఫిట్నెస్ అంశం, కెప్టెన్సీ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చదవండి: IND vs WI: అతడు వచ్చేశాడు.. టీమిండియాకు ఇక తిరుగు లేదు: పాక్ మాజీ కెప్టెన్ -
టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు..!
Mohammed Shami Comments On Team India Test Captaincy: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. స్టార్లతో నిండిన భారత జట్టును ముందుండి నడిపించే అవకాశం వస్తే ఎవరు కాదనుకుంటారని స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ ప్రతిపాదన తన వరకు వస్తే తప్పక స్వీకరిస్తానని.. భారత సారధ్య బాధ్యతలపై మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ప్రస్తుతానికి తన దృష్టంతా మరింత మెరుగ్గా రాణించడంపైనే ఉందంటూ మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. జట్టుకు ఉపయోగపడే ఏ పనికైనా తాను సిద్ధమేనంటూ.. కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలకు పరోక్ష సంకేతాలు పంపాడు. టీమిండియాకు ప్రాతనిధ్యం వహించే అవకాశం రావడమే గొప్ప వరమని, దాన్ని కాపాడుకునేందుకు వంద శాతం కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షమీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లి టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్-2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటను బయల్దేరేముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదంటూ కోహ్లి వన్డే కెప్టెన్సీని లాక్కుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. తదనంతర పరిణామాల్లో కోహ్లి.. టెస్ట్ కెప్టెన్సీకి సైతం గుడ్‌బై చెప్పడంతో ప్రస్తుతానికి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ఇప్పటికే పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ముందుండగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, వికెట్‌కీపర్ రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాజాగా షమీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు అతను కూడా రెడీగానే ఉన్న విషయం స్పష్టమవుతుంది. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న షమీ.. ఆటగాడిగా ఇదివరకే తనను తాను ప్రూవ్ చేసున్నాడు. టెస్ట్‌ల్లో 209 వికెట్లు, వన్డేల్లో 148, టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టి భారత దేశపు విజయవంతమైన పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం సెలెక్టర్లు షమీకి విశ్రాంతినిచ్చారు. అందుకు కొనసాగింపుగా విండీస్‌తో సిరీస్ కోసం కూడా అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: IND Vs WI: 6వ స్థానానికి అతనిని మించిన మొనగాడు లేడు.. -
Test Captain: టెస్టు కెప్టెన్... అవకాశం వస్తే ఎందుకు కాదంటాను: షమీ
టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరు అన్న అంశంపై బీసీసీఐ ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. ఈ క్రమంలో ఇప్పటికే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు... హిట్‌మ్యాన్ నియామకం ఖాయమే అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను కూడా ఈ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నట్లు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చెప్పకనే చెప్పాడు. కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే తప్పక స్వీకరిస్తానని మనసులో మాట బయటపెట్టాడు. కాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. పేసర్లు బుమ్రా, షమీకి పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించేందుకు బీసీసీఐ వారిద్దరికి విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అన్ని ఫార్మాట్ల సిరీస్‌ల సెలక్షన్‌కు నేను అందుబాటులో ఉంటాను. నన్ను నేను నిరూపించుకోవాలని భావిస్తున్నాను. ఇక కెప్టెన్సీ విషయం గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు. అయితే, నాకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నిజాయితీగా చెప్పాలంటే... టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం వస్తే ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు? మరోసారి చెబుతున్నా... నాకు ఏ పని అప్పజెప్పినా కచ్చితంగా వందశాతం న్యాయం చేస్తా’’ అని షమీ పేర్కొన్నాడు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో షమీ 14 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి 200 Test wickets 💪 A terrific 5-wicket haul 👌 An emotional celebration 👍#TeamIndia pacer @MdShami11 chats up with Bowling Coach Paras Mhambrey after a memorable outing on Day 3 in Centurion. 👏👏 - By @28anand Watch the full interview 🎥 🔽 #SAvIND https://t.co/likiJKi6o5 pic.twitter.com/zIsQODjY6d — BCCI (@BCCI) December 29, 2021 -
కేఎల్ రాహుల్‌పై బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు.. అతడు కెప్టెన్ ఏంటి?
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు? భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. విరాట్ కోహ్లి వంటి విజయవంతమైన సారథి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా రోహిత్ శర్మకే ఉందని, అతడి ఎంపిక ఖాయమేననే వాదనలు వినిపిస్తున్నా... వయసు, ఫిట్నెస్ వంటి అంశాలు హిట్‌మాన్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మరోవైపు... కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సారథిగా రాహుల్ పూర్తిగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో గాయం కారణంగా రెండో టెస్టుకు కోహ్లి దూరం కాగా... తొలిసారిగా రాహుల్ పగ్గాలు చేపట్టాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఇక ఇటీవలే వన్డే వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.... రోహిత్ శర్మ గైర్హాజరీలో తొలిసారిగా వన్డే సిరీస్‌కు సారథ్యం వహించాడు. ఇందులో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌లో 0-3 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి రాహుల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన సదరు అధికారిని.. టెస్టు కెప్టెన్సీ విషయంలో రాహుల్‌కు ఉన్న అవకాశాల గురించి చెప్పమని కోరారు. ఇందుకు బదులుగా.. ‘‘అసలు... కేఎల్ రాహుల్ ఏ కోశాన్నైనా మీకు కెప్టెన్‌గా కనిపిస్తున్నాడా?’’ అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇంతకీ.. రాహుల్ టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్నాడా లేడా అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Ind Vs Sa 3rd ODI: రాహుల్ చక్కగా కెప్టెన్సీ చేశాడు.. ఇదో కనువిప్పు: ద్రవిడ్ SA vs IND 3rd ODI: 'కెప్టెన్‌గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు' -
పంత్ పాతుకుపోయాడుగా.. అదృష్టం అంటే ఇట్టానే ఉంటాదేమో!
భారత క్రికెట్ జట్టులోకి వచ్చిన తక్కువ కాలంలోనే రెగ్యులర్ కీపర్‌గా మారిపోయి వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చాడు రిషభ్ పంత్. తన అరంగేట్రం ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత రిషభ్లో వేడి తగ్గింది. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు కీపింగ్‌లోనూ నిరాశపరుస్తూ టీమిండియా మేనేజ్మెంట్ నమ్మకాన్ని కోల్పోతూ వచ్చాడు. మళ్లీ పంత్ తనేమిటో నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కీలక సమయాల్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తాను విలువైన ఆటగాడిననే విషయాన్ని నిరూపించుకుంటాడు పంత్. ఇక్కడ చదవండి: ఆస్ట్రేలియా ప్రభుత్వంపై పరువునష్టం దావా.. ఏకంగా 32 కోట్లకు..! అభిమానులకే డైలమా? రిషభ్ పంత్.. పడి లేచిన కెరటం మాదిరి జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగానే సాగుతున్నాడు. జట్టులో నిలకడగా ఎంతవరకూ ఆడుతున్నాడో అనే విషయంలో అభిమానులకు డైలమా ఉన్నా ఏదొక సమయంలో ఆడతాడు అనే నమ్మకం మాత్రం ఉంది. అది ఎప్పుడు ఆడతాడనే విషయం అతనికే కాదు.. ఎవ్వరికీ తెలియదు. రాహుల్ రిప్లేస్ చేశాడు..! వికెట్ కీపర్‌గా పంత్ స్థానాన్ని రిప్లేస్ చేసేందుకు టెస్టుల్లో సాహా ఉండగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లు అందుబాటులో ఉన్నారు. 2019-2020 సీజన్లో కివీస్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పంత్ గాయపడటంతో రాహుల్ కీపర్‌గా వ్యవహరించాడు. అదే సమయంలో శాంసన్‌కు బ్యాకప్ కీపర్‌గా తీసుకున్నారు. కానీ రాహుల్‌కే కీపింగ్ బాధ్యతలు అప్పగించడంతో శాంసన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు! పంత్ గాయం నుంచి కోలుకున్నా రిజర్వ్ బెంచ్ నుంచే మ్యాచ్‌లు చూస్తుండిపోయాడు. ఇలా సుదీర్ఘ కాలంగా రాహుల్ మెరుగ్గా కీపింగ్ చేయడంతో పంత్ గురించి పట్టించుకోనేలేదు. ఒకానొక దశలో టీమిండియా జట్టులోకి పంత్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా అనే అనుమానం కూడా వచ్చింది. పంత్ ఒక టాలెంటెడ్ క్రికెటర్ అని అతనికి వరుసగా అవకాశాలు ఇస్తే తప్పేముందని చెప్పిన జట్టులోని కొందరు పెద్దలు..అతని ఉంటే ఎంతా.. లేకపోతే ఎంతా అనే మాట కూడా అన్నారు. అసలు పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు ఇచ్చారు. సెంచరీతో శభాష్ అనిపించాడు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్ ఒక్క సెంచరీతో శభాష్ అనిపించాడు. మూడు టెస్టుల సిరీస్‌లకు గాను ఐదు ఇన్నింగ్స్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా చివరి ఇన్నింగ్స్(మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో) సెంచరీ బాదేశాడు. అంతే మళ్లీ పంత్ పేరు మార్మోగింది. అదే సిరీస్‌లో పంత్ వరుసగా ఫెయిల్ కావడంతో తప్పించండి అనే వాళ్లకి సెంచరీతో సమాధానం చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు అందరూ విఫలమైన చోట పంత్ రాణించడంతో టాలెంట్ గురించి ప్రస్తావన రాక తప్పలేదు. భారత క్రికెట్ జట్టు పరువు పోయే స్థితిని దాటించాడని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఆ సెంచరీనే పంత్‌ను మరొక స్థానం కట్టబెట్టటానికి దోహదపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదనేది వారి మనోభావం. కెప్టెన్సీ రేసులో పంత్! ఇటీవల టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లికి గుడ్ బై చెప్పడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని పూడ్చే పనిలో పడింది బీసీసీఐ. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన మరుక్షణమే తన కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు చెప్పడంతో ఇక్కడ బీసీసీఐ గేమ్ ప్లాన్ కూడా ఉండవచ్చని సగటు అభిమాని మదిలో మాట. ఏది ఏమైనా కోహ్లి టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతని టీమిండియా కెప్టెన్సీ కథ ముగిసిపోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనే విషయంలో మొదటగా వినిపించిన పేరు రిషబ్ పంత్‌ది. అసలు జట్టులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నుంచి కెప్టెన్సీ రేసు వరకూ వచ్చాడు పంత్. సఫారీలతో సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో పంత్ ఆడని పక్షంలో అతని స్థానంపై కచ్చితంగా మళ్లీ సందిగ్థత ఏర్పడేది. కానీ శతకంతో ఒక్కసారిగా కెప్టెన్సీ రేసుకొచ్చేశాడు పంత్. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా పంత్‌నే టెస్టు కెప్టెన్‌గా చేస్తే బాగుంటుదనే సలహా కూడా ఇచ్చేశాడు. కేఎల్ రాహుల్ నుంచి పోటీ ఉన్నా ఇక్కడ పంత్‌కే తొలి ప్రయారిటీగా కనబడుతోంది. ఏది ఏమైనా మెల్లగా జట్టులో పాతుకుపోతున్న పంత్.. టీమిండియా టెస్టు కెప్టెన్ అయినా పెద్దగా ఆశ్చర్య పోకుండా, అదృష్టం అంటే ఇట్టానే ఉంటుందేమో అనుకోకతప్పదు. ఐపీఎల్లో కూడా అంతేగా..! గత ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్‌కు గాయం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు తీసుకున్న పంత్.. రెగ్యులర్ కెప్టెన్ అయిపోయాడు. అప్పటివరకూ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీని ఎక్కువ చూసిన అభిమానగణం.. ఆ తర్వాత పంత్ కెప్టెన్సీ సూపర్ అంటూ మురిసిపోయారు. రెండు దశల్లో జరిగిన గత ఐపీఎల్ సీజన్లో అయ్యర్‌ను మలిదశలో కెప్టెన్‌గా చేద్దామనుకున్నా అతనికి భంగపాటు ఎదురైంది. పంత్‌కే మళ్లీ పగ్గాలు అప్పచెప్పింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆపై అయ్యర్‌ను ఢిల్లీ మొత్తంగా వదిలేసుకోవడంతో పంత్ కెప్టెన్సీపై నమ్మకానికి ప్రతీకగా మారింది. -
నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లివే: సిరాజ్ భావోద్వేగం
Virat Kohli Quit Test Captaincy- Siraj Emotional Comments:‘‘నా సూపర్ హీరో.... నాకు మద్దతుగా నిలిచినందుకు.. నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించినందుకు మాత్రమే నీకు రుణపడి ఉంటానని చెబితే సరిపోదు... ఎందుకంటే నువ్వు నాకు అంతకుమించి.. నా పెద్దన్నవు... నా సోదరుడివి. నాపై నమ్మకం ఉంచి కెరీర్లో ఎదిగేలా ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు. నేను డీలా పడిపోయిన స్థితిలోనూ నాలోని గొప్ప ఆటగాడిని చూడగలిగినందుకు థాంక్యూ. నువ్వెప్పుడూ నా కెప్టెన్ కింగ్ కోహ్లివే’’ అంటూ టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్.. విరాట్ కోహ్లికి భావోద్వేగ లేఖ రాశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ పరాజయం తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇకపై ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్ పేసర్ సిరాజ్ తన కెప్టెన్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టా వేదికగా కోహ్లి భయ్యాతో దిగిన ఫొటోలను షేర్ చేసి.... అక్షరాల రూపంలో అతడి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్‌ను ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి ప్రోత్సహించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు ఈ హైదరాబాదీ విఫలమైనా అతడికి మరోసారి అవకాశం ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టాడు. తద్వారా జట్టుకు, వ్యక్తిగతంగా సిరాజ్‌కు ప్రయోజనం చేకూరేలా చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ సిరాజ్‌పై నమ్మకం ఉంచి అతడికి మద్దతుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ ఈ మేరకు కోహ్లిని తన సోదరుడిగా భావిస్తున్నాననంటూ ఉద్వేగభరిత లేఖ రాయడం గమనార్హం. చదవండి: Virat Kohli: అప్పుడు ‘కెప్టెన్’కు ఏడాదికి 180 కోట్లు.. ఒక్కో పోస్టుకు 5 కోట్లు.. మరి ఇప్పుడు అంతే సంపాదనా?! View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) -
మ్యాగజైన్ స్టోరీ 18th January 2022
-
కోహ్లి వారసుడి ఎంపికపై బీసీసీఐ అప్డేట్..!
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి తప్పుకోవడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మనే తదుపరి కెప్టెన్ అంటూ కొందరు.. కేఎల్ రాహుల్ లేదా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి వారసుడి ఎంపికపై అప్డేట్ ఇచ్చాడు. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై ఇప్పటికవరకు ఎలాంటి చర్చ జరగలేదని, అందుకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. కొత్త కెప్టెన్ విషయమై బీసీసీఐ పూర్తి క్లారిటీతో ఉందని, నిర్ణీత సమయంలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుందని, సెలెక్షన్ కమిటీ సిఫార్సు తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టం చేశాడు. కొత్త కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ అంశంపై మీడియా ప్రశ్నించగా.. సహజంగానే ఈ పదవికి పోటీ చాలానే ఉంటుందంటూ మాట దాట వేశాడు. ఇదిలా ఉంటే, టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లతో పాటు రిషబ్ పంత్ పేరును సైతం కొందరు మాజీలు సిఫార్సు చేస్తున్నారు. పంత్‌కు అతని వయసు అడ్వాంటేజ్‌గా మారగా.. రాహుల్, రోహిత్‌లకు ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం అనూకూలంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ నాటికి టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ ఎంపిక జరగనుంది. చదవండి: Viral Pic: పాపం కోహ్లి.. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు..! -
బీసీసీఐ క్రేజీ ఆఫర్.. నో చెప్పిన కోహ్లి..!
BCCI Fare Well Test Offer To Kohli: అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కోహ్లి సంచలన ప్రకటనకు కొద్ది గంటల ముందు బీసీసీఐ నుంచి కోహ్లికి ఓ ఆఫర్ వచ్చిందట. తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరించిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐ ప్రతినిధి కోహ్లిని కోరాడట. అయితే ఈ ఆఫర్‌ను కోహ్లి సున్నితంగా తిరస్కరిస్తూ.. తనకెటువంటి ఫేర్వెల్ టెస్ట్ అవసరం లేదని, నేను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని, తనకు మొదటి మ్యాచైనా, వందో మ్యాచైనా ఒకటేనని సదరు అధికారికి బదులిచ్చాడట. కాగా, కోహ్లి వచ్చే నెలలో(ఫిబ్రవరి 25-30) శ్రీలంకతో తలపడబోయే తొలి టెస్ట్ ద్వారా వంద టెస్ట్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ టెస్ట్‌కు బెంగళూరు వేదిక కానుంది. కోహ్లికి ఐపీఎల్ వల్ల ఈ నగరంతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. దీంతో అతని గౌరవార్ధం ఈ నగరంలో ఫేర్వెల్ టెస్ట్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదివరకు జరిగిన పరిణామాల దృష్ట్యా బీసీసీఐ ఇచ్చిన అఫర్‌ను కోహ్లి తిరస్కరించాడని సమాచారం. కాగా, 68 టెస్ట్‌ల్లో టీమిండియాకు సారధిగా వ్యవహరించిన కోహ్లి.. ఏకంగా 40 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో అతను భారత్ తరఫున అత్యధిక విజయాలు అందుకున్న సారథిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Test Captain: భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా అతడే! -
Kohli: అప్పుడు ‘కెప్టెన్’కు ఏడాదికి 180 కోట్లు.. ఒక్కో పోస్టుకు 5 కోట్లు.. మరి ఇప్పుడు
Virat Kohli Quit Test Captaincy: టీమిండియా ‘కెప్టెన్’గా.. స్టార్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్‌మెషీన్‌గా పేరొందిన కింగ్ కోహ్లి బ్రాండ్ వాల్యూ కూడా ఎక్కువే. సంపన్న బోర్డుకు చెందిన సారథిగా అతడికి అభిమానుల్లో ఉన్న చరిష్మా దృష్ట్యా పలు వాణిజ్య సంస్థలు కోహ్లిని అంబాసిడర్ నియమించుకున్నాయి. ఇందుకు కోట్లలో పారితోషికం చెల్లిస్తున్నాయి. మరి.. ఇప్పుడు కింగ్ కోహ్లికి ‘కెప్టెన్’ అన్న ట్యాగ్ లేదు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తనకు తానుగా తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఇక దక్షిణాఫ్రికా చేతిలో భంగపాటు నేపథ్యంలో కోహ్లి స్వయంగా టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. బ్యాటర్‌గా కూడా కోహ్లి ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ ‘పరుగుల యంత్రం’ సెంచరీ చేసి ఎన్నాళ్లయ్యిందో!! మరి ఇప్పుడు కూడా కోహ్లి బ్రాండ్ వాల్యూ మునుపటిలాగే ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఏడాదికి 180 కోట్లు.. పారిశ్రామిక వర్గాల అంచనా ప్రకారం వివిధ బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి 2021 ఏడాదికి గానూ 180- 200 కోట్ల రూపాయల మేర ఆర్జించాడు. సుమారు 30 బ్రాండ్లకు ప్రచాకర్తగా వ్యవహరిస్తున్న అతడు ఈ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి వల్ల సదరు కంపెనీలకు చేకూరిన ప్రయోజనాల గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. కానీ... అతడి క్రేజ్‌ను క్యాష్ రూపంలోకి మలచుకోవడంలో సదరు కంపెనీలు సఫలమయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కెప్టెన్‌గా వైదొలిగినా... ఆటగాడిగా కొనసాగుతానన్న కోహ్లి ప్రకటన కారణంగా ఇప్పుడప్పుడే అవి అతడితో బంధాన్ని తెంచుకోవు. ముందు కుదిరిన ఒప్పందాల పరంగానైనా కోహ్లితో కలిసి ముందుకు సాగాల్సిందే. కాబట్టి టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు కోహ్లికి వచ్చే నష్టమేమీ లేదు. అతడి ఇమేజ్ వల్లే! ఈ విషయాల గురించి స్పోర్టీ సెల్యూషన్స్ సీఈఓ ఆశిష్ చద్దా ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దూకుడైన ఆటగాడిగా కోహ్లికి ఉన్న క్రేజ్ కంపెనీలకు వరంలాంటిదే. తను భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ధోని చాలా కాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. మరి అతడి బ్రాండ్ వాల్యూ తగ్గలేదు కదా. కోహ్లి విషయంలోనూ అంతే. యువతరానికి కోహ్లి ఐకాన్ లాంటివాడు. తను టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తాడు. కాబట్టి కంపెనీలు అతడిని వదులుకునే అవకాశం లేదు’’ అని చెప్పుకొచ్చారు. మరో అనలిస్టు సంతోష్ దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లికి ఉన్న అశేష అభిమానుల కారణంగా అతడు ఎండార్స్ చేసే కంపెనీలు కోట్లలో లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు కూడా కోహ్లి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి బ్రాండింగ్‌లో అతడి హవా కొనసాగుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి సంపాదన (అంచనా) 2021లో ఎండార్స్మెంట్ల ద్వారా కోహ్లి సంపాదించిన మొత్తం: 179 కోట్ల రూపాయలు. ఒక్కరోజు ఎండార్స్ చేయడానికి కోహ్లి ఫీజు: 7- 8 కోట్లు. ఇప్పటి వరకు కోహ్లి దాదాపు 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా కోహ్లి ఆర్జించే మొత్తం: 5 కోట్లు. డఫ్స్ అండ్ ఫెల్్ప్స డేటా ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ: 237.7 మిలియన్ డాలర్లు చదవండి: India New Test Captain: భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా అతడే!.. అప్పుడే బీసీసీఐ ప్రకటన -
Test Captain: భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా అతడే!
టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకొన్న తర్వాత క్రికెట్ ప్రేమికుల మెదళ్లని తొలుస్తున్న ప్రశ్న... ‘నెక్ట్స్ కెప్టెన్ ఎవరు?’. పరిమిత ఓవర్ల సారథి, టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతున్నా... కేఎల్ రాహుల్, రిషభ్ పంత్... పేర్లు తెర మీదకు వస్తున్నాయి. వయసు, ఫిట్నెస్ రీత్యా బీసీసీఐ హిట్‌మ్యాన్ వైపు మొగ్గు చూపకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం పంత్ మాత్రం కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలడని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు పగ్గాలు చేపడతారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే, బీసీసీఐ మాత్రం ఈ విషయంపై పూర్తి క్లారిటీతో ఉందట. రోహిత్ శర్మకే టెస్టు కెప్టెన్సీ కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ... ‘‘టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు తనకు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు తనే సారథిగా ఉండబోతున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుంది’’ అని పేర్కొన్నాయి. టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత బీసీసీఐ అధికారికంగా రోహిత్ పేరును అనౌన్స్ చేస్తుందనే సంకేతాలు ఇచ్చాయి. అదే విధంగా వైస్ కెప్టెన్ విషయంలోనూ బీసీసీఐలో ఇప్పటికే చర్పోచర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘‘వైస్ కెప్టెన్ భవిష్యత్తు కెప్టెన్ అవుతాడు కదా. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా.. వీళ్లంతా భవిష్యత్తు నాయకులు. వీరిని సారథులుగా తీర్చిదిద్దే క్రమంలో సెలక్టర్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై తీవ్ర కసరత్తు జరుగుతోంది’’ అని వ్యాఖ్యానించారు. కాగా కోహ్లి గైర్హాజరీలో అజింక్య రహానే కెప్టెన్‌గా.. ఛతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీనియర్లు వరుసగా విఫలం అవుతుండటంతో జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. ఇక దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌నే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంత్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: కోహ్లి ఇగోను వదిలేయాలి.. జూనియర్ల కెప్టెన్సీలో ఆడాలి.. నేనూ అలా ఆడినవాడినే: టీమిండియా దిగ్గజం -
కోహ్లి ఇగో వదిలేయాలి.. వాళ్ల కెప్టెన్సీలో ఆడాలి: టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
Virat Kohli Quit Test Captaincy: టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ప్రస్థానం పూర్తిగా ముగిసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే పగ్గాలు చేపట్టగా.. టెస్టు సారథి ఎవరన్న అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వంటి యువ ఆటగాళ్ల సారథ్యంలో కోహ్లి ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు గాయం కారణంగా హిట్‌మ్యాన్ దూరం కాగా.. రాహుల్ నేతృత్వం వహించనున్నాడు. ఈ జట్టులో కోహ్లి సభ్యుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్, అజారుద్దీన్ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు. ఒత్తిడికి లోనయ్యాడు.. తాజా పరిణామాల గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న నాటి నుంచి అతడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. బ్యాటర్‌గా తను మరింత స్వేచ్చగా ఆడటానికి కెప్టెన్సీ వదులుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈ ఆప్షన్‌ను తను ఎంచుకోవడం మంచిదే. తను పరిణతి కలిగిన వాడు. ఇంతటి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటాడు. కెప్టెన్సీని భారంగా భావించినట్లున్నాడు. అందుకే ఇలా చేసి ఉంటాడు. అయితే, ఒక విషయం మాత్రం తప్పక చెప్పుకోవాలి. కోహ్లి ఇప్పుడు తన ఇగోను వదిలేసి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సిన పరిస్థితి. నిజానికి సునిల్ గావస్కర్ నా సారథ్యంలో ఆడాడు. నేను క్రిష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఆడాను. నామోషీ అనుకోలేదు. కోహ్లి కూడా అంతే. అహాన్ని పక్కన పెట్టాలి. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేయాలి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లకు అతడు దిశా నిర్దేశం చేయాలి. ఒక బ్యాటర్‌గా కోహ్లి సేవలను కోల్పోవడం అంటే భారత జట్టుకు తీర్చలేని లోటు. కాబట్టి తను ఆడాలి’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మిడ్ డేతో కపిల్ దేవ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. చదవండి: IPL: అతడికి 16 కోట్లు.. అయ్యర్‌కు ఇప్పటి వరకు 35 కోట్లు.. ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ పోటీ... రికార్డు బద్దలవడం ఖాయం! India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే... -
Virat Kohli: గుడ్ బై.. కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకే టెస్టు కెప్టెన్సీ...!
Virat Kohli Quit Test captaincy : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన మరుసటి రోజే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సంచలన ప్రకటన చేశాడు. టెస్టు ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు కోహ్లి శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దాంతో భారత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా కోహ్లి శకం ముగిసినట్లయింది. గత ఏడాది సెప్టెంబర్ 16న యూఏఈలో ప్రపంచకప్ ముగిశాక టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కోహ్లి నవంబర్‌లో ఈ మెగా ఈవెంట్ ముగిశాక తన మాట నిలబెట్టుకున్నాడు. ఆ సమయంలో కొన్నాళ్లపాటు వన్డే, టెస్టు ఫార్మాట్లకు తానే సారథిగా కొనసాగాలని కోహ్లి నిర్ణయించుకున్నాడు. అయితే గత ఏడాది డిసెంబర్ 8న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ మాత్రం మరోలా ఆలోచించింది. టి20 కెప్టెన్సీకి రాజీనామా చేయవద్దని చెప్పినా తమ మాట వినని కోహ్లికి షాక్ ఇచ్చింది. వన్డే ఫార్మాట్లో కోహ్లిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ రోహిత్ శర్మను కొత్త కెప్టెన్‌గా నియమించింది. స్టార్ క్రికెటర్లు లేని దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్‌లో కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలి టెస్టు గెలిచి శుభారంభం చేసింది. అయితే వెన్నునొప్పితో కోహ్లి రెండో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత జట్టు ఓడిపోయింది. మూడో టెస్టులో కోహ్లి కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత జట్టు ఓటమి చవిచూసి సిరీస్‌ను 1–2తో చేజార్చుకుంది. విజయవంతమైన కెప్టెన్‌గా... టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 2014 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టులో తొలిసారి కోహ్లి టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ ధోని చేతి వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో అడిలైడ్ టెస్టులో కోహ్లికి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. ఆ సిరీస్‌లోనే మూడో టెస్టు ముగిశాక ధోని టెస్టులతోపాటు కెప్టెన్సీ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దాంతో 2015 జనవరి 6 నుంచి సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో కోహ్లి మళ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత కోహ్లి టెస్టుల్లో భారత రెగ్యులర్ కెప్టెన్ అయ్యాడు. 2015 ఆగస్టులో శ్రీలంకలో పర్యటనలో కెప్టెన్‌గా కోహ్లి తొలిసారి టెస్టు విజయం రుచి చూశాడు. ఆ సిరీస్‌ను భారత్ 2–1తో గెల్చుకుంది. అటు నుంచి ఈ స్టార్ ప్లేయర్ నేతృత్వంలో టీమిండియా వెనుదిరిగి చూడలేదు. సారథిగా కోహ్లి రికార్డులు స్వదేశంలో కోహ్లి నాయకత్వంలో భారత జట్టు 11 సిరీస్‌లు ఆడగా ఒక్క సిరీస్‌నూ చేజార్చుకోకపోవడం విశేషం. కోహ్లి సారథ్యంలో సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఏ భారత కెప్టెన్‌కూ సాధ్యంకాని విధంగా విదేశాల్లో కోహ్లి నాయకత్వంలో భారత్ 16 టెస్టుల్లో గెలిచింది. 2018–2019లో కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలవడంతోపాటు 2021లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ఇలా ముందుగానే.. నాకిది అనుభవమే.. టీమిండియా మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు! కోహ్లి టెస్టు కెప్టెన్సీలో భారత్ రికార్డు ఆడినవి 68 గెలిచినవి 40 ఓడినవి 17 డ్రా 11 స్వదేశంలో విజయాలు 24 విదేశాల్లో విజయాలు 16 చదవండి: Kohli Test Captaincy Retirement-Rishab Panth: కోహ్లి రిటైర్మెంట్... పంత్‌కు మద్దతుగా నిలిచిన యువీ కోహ్లి గుడ్ బై ‘దాదాపు ఏడేళ్లపాటు కెప్టెన్‌గా జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేశా. నాకిచ్చిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించా. ప్రతి దానికి ఏదో ఒక రోజున ముగింపు అనేది ఉంటుంది. నా టెస్టు కెప్టెన్సీకి కూడా ముగింపు వచ్చింది. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశా. అయితే కృషి, నమ్మకం లేకుండా ఏ రోజూ ఆడలేదు. విజయం కోసం నావంతుగా 120 శాతం కృషి చేశానని నమ్మకంతో చెబుతా. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే అవకాశమిచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. కెప్టెన్సీ విషయంలో నాపై ఎంతో నమ్మకముంచిన ధోనికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కెప్టెన్సీ కెరీర్లో నాకు తోడ్పాటు అందించిన కోచ్ రవిశాస్త్రికి, సహచర క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి కూడా ధన్యవాదాలు. –ట్విట్టర్లో కోహ్లి రోహిత్‌కే అవకాశం... కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిందని ప్రశంసిస్తూ టెస్టు కెప్టెన్సీకి రాజీమానా చేసిన కోహ్లిని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా అభినందించారు. ఇప్పటికే కోహ్లి స్థానంలో భారత టి20, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మకే టెస్టు ఫార్మాట్లోనూ నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!? ►కెప్టెన్‌గా కోహ్లికి దక్షిణాఫ్రికా సిరీస్ చివరిది Building relationships together on and off the pitch for the better of cricket🙏 #BePartOfIt pic.twitter.com/WNeGNapLCp — Cricket South Africa (@OfficialCSA) January 16, 2022 -
కోహ్లి రిటైర్మెంట్... పంత్‌కు మద్దతుగా నిలిచిన యువీ
కీలకమైన టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి అనూహ్య నిష్క్రమణతో టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంకేముంది టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగిస్తారు కదా! అనే సందేహం రావొచ్చు. అయితే, కొన్ని కారణాల వల్ల అలా జరిగే అవకాశం కనిపించడం లేదు. వయసురిత్యా, ఫిట్నెస్ పరంగా, ముఖ్యంగా గాయాలతో సతమతమవుతున్న రోహిత్ వైపునకు సెలెక్టర్లు మొగ్గు చూపకపోవచ్చని కొందరి క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలో కొందరు యువ ఆటగాళ్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. (చదవండి: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆ యువ ఆటగాడే.. ఎందుకంటే) అందులో ఎవరు కోహ్లి నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపడుతారో ఖచ్చితంగా చెప్పలేం కానీ, రిషభ్ పంత్ అయితే బాగుంటుందని కొందరు దిగ్గజ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. సునీల్ గావస్కర్ పంత్‌కే ఓటేయగా తాజాగా యువరాజ్ సింగ్ సైతం ఈ యువ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌కు మద్దతుగా నిలిచాడు. వికెట్ల వెనక నుంచి పంత్ ఆట మొత్తాన్ని లోతుగా అధ్యయనం చేసి మెరుగ్గా జట్టును నడిపిస్తాడని అన్నాడు. ‘అబ్‌సొల్యుట్లీ! రీడ్స్ ద గేమ్ వెల్ బిహైండ్ ద స్టంప్స్’ అంటూ గావస్కర్ కామెంట్‌కు యువీ ఈ మేరకు ట్విటర్లో స్పందించాడు. కాగా, కేప్‌టౌన్ టెస్టులో కీలక బ్యాటర్లు విఫలమైన చోట పంత్ సెంచరీతో (100 నాటౌట్) మెరిసిన సంగతి తెలిసిందే. (చదవండి: రాజీనామా విషయాన్ని ముందుగా ఆయనతో చర్చించిన తర్వాతే.. కోహ్లి ప్రకటన!) Sunil Gavaskar feels @RishabhPant17 can be the next Test captain. Feels the added responsibility will make him an even better player @NikhilNaz — Vikrant Gupta (@vikrantgupta73) January 15, 2022