thadepalli
-
ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్ఆర్సీపీ
-
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
-
Adudam Andhra: విశాఖలో ముగింపు వేడుకలు.. పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహా క్రీడా సంబరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు రానున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు. కాగా సీఎం జగన్.. రేపు(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. చివరి రోజు తలపడనున్న జట్లు ఇవే.. మహిళా క్రికెట్: తొలి సెమీస్‌లో పల్నాడు జట్టుపై ఎన్టీఆర్ జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. మూడో స్థానం కోసం సోమవారం జరిగే పోటీలో పల్నాడు జట్టు ఆడనుంది. టోర్నీ 19వ మ్యాచ్‌గా రెండో సెమీస్ తూర్పుగోదావరి, తిరుపతి జట్ల మధ్య సోమవారం జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా జట్టుతో ఆడనుంది. ఓడిన జట్టు మూడోస్థానం కోసం పల్నాడు జిల్లా జట్టుతో తలపడుతుంది. పురుష క్రికెట్: ఏలూరు, తూర్పుగోదావరి జట్లు ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. క్వార్టర్ ఫైనల్స్‌లో గుంటూరుతో వైఎస్సార్ కడప, అనంతపురంతో ఎన్టీఆర్ జట్టు తలపడనున్నాయి. ఇందులో విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. మహిళా బ్యాడ్మింటన్: సెమీస్‌లో కర్నూలుతో బాపట్ల జట్టు తలపడనుండగా.. ఇప్పటికే పశ్చిమగోదావరి జట్టు సెమీస్‌కు చేరుకుంది. పురుష బ్యాడ్మింటన్: సెమీస్‌లో తిరుపతితో వైఎస్సార్ కడప జట్టు, ఏలూరుతో పల్నాడు జట్టు తలపడనున్నాయి. గెలిచిన జట్లు ఫైనల్స్ ఆడనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీపడనున్నాయి. మహిళా వాలీబాల్: సెమీస్‌కు అన్నమయ్య జట్టుతోపాటు విశాఖ జట్టు చేరుకున్నాయి. క్వార్టర్‌ఫైనల్స్ చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. పురుష వాలీబాల్: క్వార్టర్ ఫైనల్స్‌లో విజయంతో అనకాపల్లి, పార్వతీపురం మన్యం జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా వీటితో తలపడేందుకు క్వార్టర్ ఫైనల్స్‌లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్లు సిద్ధపడనున్నాయి. మహిళా కబడ్డీ: సెమీస్‌లో అనకాపల్లి జట్టుతో ప్రకాశం జట్టు, అనంతపురం జట్టుతో విశాఖ జట్టు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీ పడనున్నాయి. పురుష కబడ్డీ: క్వార్టర్ఫైనల్లో విశాఖ జట్టుతో కర్నూలు జట్టు తలపడనుంది. మహిళా ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో అనకాపల్లితో కృష్ణా, ప్రకాశంతో ఏలూరు, కాకినాడతో నెల్లూరు, విజయనగరంతో అనంతపురం జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. పురుష ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో కాకినాడతో ప్రకాశం, కర్నూలుతో కృష్ణా, అనంతపురంతో బాపట్ల. శ్రీకాకుళంతో అనకాపల్లి జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు చేరుకోనున్నాయి. -
ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎస్సీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, మేరుగు నాగార్జున, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ఈ భేటీలో సజ్జల రామాకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, గురుమూర్తి కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఎస్సీలకు కొన్ని పథకాలు పెట్టి అవి కేవలం టీడీపీ కార్యకర్తలకు అందేలా చేసి అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉందని, వాటన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దిందని తెలిపారు. 'ఈరోజు ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు కల్గించేలా సంస్థాగత మార్పులు, సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాల్లో గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ అందించిన పరిపాలన మీద ఈరోజు చర్చించాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల మీద ప్రతిపక్షాలు వక్రభాష్యంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఈరోజు తీర్మానించాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం మూల సూత్రాలు జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలనను నాలుగు సంవత్సారాలుగా ఏ విధంగా అందిస్తున్నారనే విషయంపైనా చర్చించాం. రాబోయే రోజుల్లో ఎస్సీ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమకు అందుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే జగన్‌ను మరోసారి సీఎం చేయాల్సిన అవసరంపై కూడా చర్చించాం.' అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పార్టీల తీరు మారాలి: సజ్జల సజ్జల మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీల తీరు మారాలన్నారు. మన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని -
సీఎం జగన్‌ను కలిసిన ఎన్సీసీ డీజీ గుర్బీర్పాల్ సింగ్
-
అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలను వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తున్నారు
-
సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు
సాక్షి తాడేపల్లి: రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్ పద్మజ, మానస.. సీఎంకు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆహ్వానించారు. చదవండి: రూ.6కే మధ్యాహ్న భోజనం కాగా, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ బుధవారం తన సందేశంలో పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కుప్పం అభివృద్ధికి అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో భేటీలో భాగంగా.. గురువారం సాయంత్రం మొదటగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ‘ కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్‌ను గనుక గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి మేలు ఎంతో జరిగింది. భవిష్యత్తులోనూ మరింత జరగుతుంది కూడా. ఈ వేళ కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నాం. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటాం అని సీఎం జగన్.. కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్.. దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పంనుంచే ప్రారంభిస్తున్నాం కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని అంతా అనుకుంటారు వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గం బీసీలకు మంచి చేస్తున్నాం అంటే .. అది ప్రతి పనిలోనూ కనిపించాలి బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశాం దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారు అంతటితో ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చాం చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆస్పత్రికి కూడా వెళ్లాను ఆ రోజు భరత్ నాకు పరిచయం అయ్యాడు నేను భరత్‌ను ప్రోత్సహిస్తానని ఆ రోజే చెప్పాను ముందుండి ప్రతి అడుగులోనూ సపోర్ట్ చేశాం మీరు కూడా భరత్‌పై అదే ఆప్యాయతను చూపించారు దీనివల్ల భరత్ నిలదొక్కుకున్నాడు భరత్‌ను ఇదేస్థానంలో నిలబెడతారా? లేదా ఇదే భరత్‌ను మళ్లీ పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది మీమీద ఆధారపడి ఉంది భరత్‌ను గెలుపించుకు రండి..భరత్‌ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతాడు, కుప్పం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారు నిజం చెప్పాలంటే.. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈమూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగింది స్కూళ్లలో నాడు –నేడు, ఇళ్ల పట్టాలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు, ఇక ప్రతి గ్రామంలోనూ సచివాలయం, విలేజ్ క్లినిక్, ఆర్బీకే.. ఇవన్నీకూడా గతంలో ఏ గ్రామంలోనూ కనిపించలేదు మన కళ్ల ఎదుటే ఇవి కనిపిస్తున్నాయి నాడు – నేడుతో బడులన్నీకూడా రూపురేఖలు మారుతున్నాయి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కూడా అమల్లోకి వస్తుంది ఇదీ చదవండి: నాడు అసాధ్యమన్నారు.. నేడు సాధ్యమైందిగా! -
చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తారు: ఎంపీ విజయసాయిరెడ్డి
-
సీఎం జగన్‌ను కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి కలిశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌రెడ్డిని సీఎం జగన్ అభినందించారు. ఎమ్మెల్యే వెంట మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. చదవండి: జగన్ మావయ్యా.. మీరు మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారని.. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించిందని.. అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారన్నారు. నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి సీఎం చర్చించారన్నారు. పారిశ్రామిక ప్రగతి పై దృష్టి పెడుతున్నానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులైలో అన్న గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజినీ సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి తెలిపారు. -
24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
-
చంద్రబాబు నీ పిచ్చి మాటలు ఆపు: మంత్రి బొత్స సత్యనారాయణ
-
విద్యాశాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
సమ్మక్క– సారలమ్మలను తూలనాడలేదు
తాడేపల్లిరూరల్: ‘‘సమ్మక్క–సారలమ్మ గ్రామ దేవతలేనని అన్నాం. వారిని చిన్నచూపు చూసినట్టు, తూలనాడినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. అది పొరపాటు. నేను ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలని ఆలోచించిన సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్లం. వారిని చిన్నచూపు చూసే ఆలోచన చేయబోం. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాలతో నా వ్యాఖ్యలను వక్రీకరించి విమర్శలు చేస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సమాజానికి మంచిది కాదు..’’అని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతతో ఉన్నవారు వివాదాలకు తావు ఇవ్వరని, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారి జ్ఞానానికే ఈ విషయాన్ని వదిలేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో ఉన్న సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై చినజీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు. ఆయా అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ మధ్య నాపై కొన్ని వివాదాలు వచ్చాయి. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా విన్నప్పుడు ఆ మాటల పూర్వాపరాలు చూడాలి. చిన్న వీడియో చూసి ఒక వ్యక్తి ఇలా అన్నాడని ప్రచారం చేయడం హాస్యాస్పదం. మేం ఆదివాసీ జనాలను ఏదో అన్నట్టుగా, కామెంట్ చేస్తున్నట్టుగా వినపడుతుంది. మేం అటువంటి కామెంట్ చేయం. సమాజ హితంపై కాంక్ష ఉన్నవారైతే.. వచ్చి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలి, సరైన పద్ధతిలో స్పందించాలి. 20 ఏళ్లకు ముందు మాట్లాడిన వీడియో నుంచి దానిని తీశారు. ఆ రోజున మాట్లాడినప్పుడు సమ్మక్క–సారలమ్మ స్వర్గం నుంచి దిగివచ్చిన వారు కాదు, గ్రామ దేవతలేనని అన్నాం. వారు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ఎదుర్కొని భక్తులచేత పూజలందుకుంటున్నారని చెప్పాం. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా వివాదం ఇప్పుడే తగ్గుతోంది. దీంతో ప్రచారం కోసం దీన్ని చర్చకు తీసుకువస్తున్నట్లు కనపడుతోంది. మాకు ఆస్తులేమీ ఉండవు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మాకు వ్యక్తిగతఆస్తులేమీ ఉండవు. సేవా కార్యక్రమాలు చేసేప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా మాంసం తినవద్దని చెప్పిన మాట వాస్తవమే. కొందరు దానిని వక్రీకరించి మాట్లాడటం బాధాకరం. సమాజానికి మంచి చేసేవారితో కలిసేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేది మా నినాదం. ఆదివాసుల సంక్షేమానికి వికాస తరంగిణి సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం.. మా జీయర్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలు మంత్రోచ్ఛారణ చేయకూడదని చాలామంది అభిప్రాయం. కానీ మేం మహిళలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నాం. జీయర్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయించి.. మహిళలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నాం. ఇందులో అన్ని మతాలు, కులాలకు చెందిన మహిళలు ఉన్నారు. మేం మెడికల్ క్యాంప్ పెట్టినపుడు సేవ చేయడానికి వచ్చే వైద్యులు కూడా అనేక వర్గాలకు చెందినవారు ఉంటారు. ఆదివాసులను విమర్శించాల్సిన అవసరం మాకు లేదు’’అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల స్వామి, మాజీ ఎంపీ, జీయర్ ట్రస్ట్ సభ్యుడు గోకరాజు గంగరాజు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. మా దగ్గర అందరూ సమానమే.. మేం రాజకీయాలకు దూరం. మా దగ్గర అందరూ సమానమే. రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక మాకు ఉండదు. ఎవరితోనూ గ్యాప్ అనేది ఉండదు. వివాదాలు ఉండవు. మేమెప్పుడూ దక్షతతో మంచి కార్యక్రమాలు చేస్తాం. ఎవరినీ మోసం చేయకుండా ఉంటాం. రాబట్టే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. వారికి వీరికి దడుస్తూ ఏదో మూలన నక్కి మాట్లాడటం మా చర్రితలో ఎప్పుడూ లేదు. మేం సన్యాసులం.. మా పేరుతో బ్యాంకు ఖాతా కూడా ఉండదు. మేం ఎవరికీ భయపడబోం.. అలాగే ఎవరి వెంటా పడబోం. శుక్రవారం ఏపీలోని తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి. చిత్రంలో అహోబిలస్వామి, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు -
న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
New Year 2022: సీఎం నివాసంలో నూతన సంవత్సర వేడుక
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం–2022 సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం వేడుక నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు వైఎస్ జగన్‌తో కేక్ కట్ చేయించారు. చదవండి: Rewind 2021: పడిలేచిన కెరటంలా.. పుష్ప గుచ్ఛాలు అందజేసి సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోక్య రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గవర్నర్ తరఫున ఆయన స్పెషల్ సీఎస్ ఆర్.పి.సిసోడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: AP: 2021లో సంక్షేమ పథకాలు ఇలా.. కోవిడ్ కష్టాల్లోనూ కొనసాగిన యజ్ఞం -
ఏపీలో రూ.1,750 కోట్లతో.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ యూనిట్
-
పచ్చ మీడియా రాతలపై విరుచుకుపడ్డ జగన్ !
-
ZPTC MPTC: ఎన్నికల గ్రాండ్ విక్టరీపై సిఎం వైఎస్ జగన్ స్పందన
-
సీఎం జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు
సాక్షి, తాడేపల్లి: కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. అలాగే కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తాడేపల్లి నివాసంలో తనను మర్యాద పూర్వకంగా కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జ్ఞాపికను బహూకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నేటి మధ్యాహ్నం కనక దుర్గమ్మను కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణికి నూతన వస్త్రాలు బహూకరిస్తున్న సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి -
జీవో 19 అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: మంగళగిరి మునిసిపాలిటీ, తాడేపల్లి మునిసిపాలిటీలను విలీనం చేసి మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 19 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 19పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లకు నోటీసులిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జీవో 19ని సవాలు చేస్తూ తాడేపల్లి మండలం, చిర్రావూరుకు చెందిన సీర్ల లాల్‌చంద్, మరో ముగ్గురు ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి, పిటిషనర్ల తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపించారు. -
పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలు
మంగళగిరి: పైనాపిల్ పండ్ల మాటున లారీలో భారీగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం రాత్రి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కాజ టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ వి.భూషణం సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలను దాచి తరలిస్తున్న లారీ పట్టుబడిందన్నారు. మొత్తం 23 బస్తాల్లోని 1,020 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ డ్రైవర్ వంగలపూడి శ్రీనివాసరావును, ఎత్తుల నూకరాజు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. విచారణలో వీరిద్దరూ తమకు గంజాయి విక్రయించేవారితో కానీ, కొనుగోలు చేసే వారితో కానీ సంబంధం లేదని వెల్లడించారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండలు, విజయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సీతానగరం ఘటనలో మృగాళ్ల గుర్తింపు
తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అతడి కళ్లెదుటే నర్సింగ్ విద్యార్థినిపై అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్ కృష్ణ, వెంకటేష్‌లను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి. ఈ నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, ఓ నర్సింగ్ విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కీలక ఆధారాల సేకరణ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులిద్దరూ పాత నేరస్తులేనని గుర్తించారు. వారిలో ఒక యువకుడు ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి వచ్చి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నట్టు సమాచారం. మరో యువకుడి స్వస్థలం తాడేపల్లి. బోసు బొమ్మ సెంటర్ సమీపంలోనే అతడు నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ను అడ్డాగా చేసుకుని వారిద్దరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ల వెంబడి తిరుగుతూ సీతానగరం బ్రిడ్జి వద్ద రైలు ఆగి.. తిరిగి బయలుదేరే సమయంలో ఆ యువకులిద్దరూ రైలు బోగీల్లోని తలుపులు, కిటీకీల వద్ద కూర్చునే ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలోని గొలుసుల్ని లాఘవంగా తస్కరించి ఉడాయిస్తుంటారు. వాటిని తాకట్టు పెట్టగా.. లేదా విక్రయించగా వచ్చే డబ్బుతో మద్యం, గంజాయి తాగుతుంటారని సమాచారం. వారిద్దరూ రైల్వే ట్రాక్ వెంబడి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళతారని, ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు రెండు మూడు నెలల వరకు కనిపించరని స్థానికులు చెబుతున్నారు. కేసులో అనుమానితులు షేర్ కృష్ణ, వెంకటేశ్ విక్రయించిన సెల్‌ఫోన్ ఆధారంగా... అత్యాచారానికి పాల్పడిన తరువాత నిందితులిద్దరూ పడవలో కృష్ణా నది మీదుగా విజయవాడ వైపు చేరి అక్కడి నుండి రైల్వే ట్రాక్ మీదుగా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. అక్కడ కోర్టు వేలంలో ఉన్న ఓ భవనంలో తలదాచుకున్నట్టు సమాచారం. అనంతరం బకింగ్‌హామ్ కెనాల్‌పై గల రైల్వే బ్రిడ్జిపై మీదుగా చెన్నై రూట్లోని ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. రైల్వే పోలీసులు వీరువురినీ వెంబడించడంతో పరారాయ్యరు. తాడేపల్లిలోని బోసుబొమ్మ సెంటర్లో టైలరింగ్ చేసే ఓ మహిళ వద్ద వారు ఓ ఫోన్ తాకట్టు పెట్టినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను విచారించారు. ఆమె ఆ ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానీ ఆ ఫోన్ అత్యాచారానికి గురైన యువతిది కాదని తేలింది. కాగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న తాపీమేస్త్రి కుటుంబానికి నిందితులు రెండు ఫోన్లు విక్రయించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబం నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ ఫోన్లేనని అత్యాచారానికి గురైన యువతి, ఆమె ప్రియుడు గుర్తించారు. దాంతో ఆ ఇద్దరు యువకులే ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిలో ఓ యువకుడు ఈ నెల 17న రోడ్డుపై మద్యం సేవిస్తూ గొడవ చేయగా.. తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో బుద్ధిచెప్పి విడిచిపెట్టినట్టు కూడా తెలిసింది. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిందితులిద్దరి కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఓ నిందితుడి స్వస్థలం చినగంజాం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితులు హైదరాబాద్‌కు పరారయ్యాయనే సమాచారంతో ఓ బృందాన్ని అక్కడికి పంపారు. కృష్ణా, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, రైల్వే గోడౌన్లు, రైల్వే ట్రాక్ వెంబడి నిర్జన ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవు : హోం మంత్రి నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోం మంత్రి మంగళవారం మరోసారి పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిందితుల్ని ఇప్పటివరకు పట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని.. అసలైన నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. హోం మంత్రి వెంట కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు. -
కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం
తాడేపల్లి రూరల్: అమరావతి, ఉండవల్లి కరకట్టపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వలస కూలీల కుటుంబాన్ని అతి వేగంగా వస్తున్న కారు ఆదివారం ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోట మరియదాసు (35), భార్య యేసుకుమారి, ఇద్దరు కుమారులు తేజ, ప్రవీణ్ (10) అమరావతి మండలం మునుగోడుకు చెందినవారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబం గడవడం కష్టం కావడంతో అత్తగారి ఊరైన మైలవరం వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. లాక్డౌన్ సడలించడంతో తిరిగి ద్విచక్ర వాహనంపై సొంత ఊరు వస్తుండగా అమరావతి కరకట్టమీద మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద మందడం నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఈ నలుగురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న మరియదాసు కుటుంబం పది అడుగుల పైకి లేచి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. బైక్‌ను ఈడ్చుకుంటూ కారు 15 అడుగుల దూరం వెళ్లింది. మరియదాసు, చిన్న కుమారుడు ప్రవీణ్‌లకు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108కు ఫోన్ చేశారు. తీవ్ర గాయాలైన తేజ, యేసుకుమారిలకు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. యేసుకుమారి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్‌లో కన్నుమూసింది. తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ఉమా మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా: మిథున్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్ చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్‌రెడ్డి.. కేవలం రమేష్ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేశారు: బాలశౌరి ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టీడీపీ స్క్రిప్టు ప్రకారమే: శ్రీకృష్ణ దేవరాయలు రఘురామకృష్ణరాజు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. టీడీపీ స్క్రిప్ట్‌ను రఘురామకృష్ణరాజుతో చదివిస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిందే రఘురామకృష్ణరాజు చేస్తున్నారన్న ఎంపీ.. . ట్రీట్మెంట్ కోసం రమేష్ ఆస్పత్రికే ఎందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. చదవండి: రఘురామకృష్ణంరాజు ఒంటిపై గాయాలేవీ లేవు