thalasani srinivas yadav
-
టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా ముందుకు వెళుతున్నందునే, ప్రభుత్వం టార్గెట్ చేసి రచ్చచేస్తోందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల సొంతంగా ఫామ్‌హౌస్ కట్టుకుని గృహ ప్రవేశం చేశారని, దాన్ని రేవ్‌పార్టీ అంటూ కుట్రలకు తెరతీశారని వారు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వా రు మాట్లాడారు.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ప్రభుత్వంపై కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నందునే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో ఇప్పుడే చూస్తున్నాం అన్నారు. వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని, ఆయనపై కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎవరూ శుభకార్యం చేసుకోవద్దా అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.పోలీసు కుటుంబాలు రోడ్డెక్కితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించలేదని, రాజ్ పాకాల విషయంలో మా త్రం వీడియో రిలీజ్ చేశారని విమర్శించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు లేవని, ఇప్పుడు కొత్తగా అలాంటి సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. లేని ఆధారాలను సృష్టించి నా తమ్ముడిని అరెస్ట్ చేశారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తు న్నారని బీఆర్ఎస్ సీని యర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నమిదికాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమ లు చేయకుండా, సమస్యలపై నిలదీస్తున్న కేటీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, నాయకు లు గెల్లు శ్రీనివాస్, సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జన్వాడ పార్టీ వ్యవహారంలో ఆయనను కావాలనే ఇరికిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. -
తొమ్మిదిన్నరేళ్లలో నగర రూపురేఖల్నే మార్చాం
యాభయ్యేళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించిందని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇప్పటి వరకూ చేసిన పనులేమిటో చెబుతూ, మున్ముందు మరిన్ని పనులు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న ఇతర పార్టీల వారెవరన్నది తాను పట్టించుకోనన్నారు. ఏ పనులు చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో సరిగ్గా తెలియని కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ కూడబెట్టిన అవినీతి సొమ్మును వెలికితీసి దాంతో తమ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలు హాస్యాస్పదమన్నారు. గాలి మాటలతోనే కాంగ్రెస్ హామీలు ఫేక్ అని వెల్లడవుతోందని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వెల్లడించారు. మీ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలేమిటి? వాటినెలా పరిష్కరిస్తారు? సమస్యలనేవి నిరంతరం ఉంటాయి. ఒకటి పరిష్కరిస్తే మరొకటి పుట్టుకొస్తుంది. సమస్యల్ని క్రమేపీ తగ్గించుకుంటూ, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా పనులు చేస్తున్నాను. అందుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం ఇస్తోంది. నగరానికి, మీ నియోజకవర్గానికి ఇస్తున్న హామీలు? హైదరాబాద్ నగరానికి కేసీఆర్ ప్రభుత్వం చాలా చేసింది. దేశంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దింది. ఈ అభివృద్ధిని ఇంకా విస్తరించుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రజలకు 24 గంటల కరెంటుకు ఢోకాలేదు. యాభయ్యేళ్ల వరకు తాగునీటి సమస్యల్లేకుండా చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాలు ఇప్పటికే అందుతున్నాయి. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నుంచీ నీటిని రప్పించే పనులున్నాయి. ముంపు సమస్యల్లేకుండా ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టాం. పూర్తయిన పనులతో వరద సమస్యలు కొంత తగ్గాయి. అన్నీ పూర్తయితే ఈ సమస్యలిక ఉండవు. వాటికోసం ఎంత ఖర్చయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చేసిన పనుల్లో ముఖ్యమైనవి? చెప్పాలంటే చాలా ఉన్నాయి. 70 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జీఓ 58, 59ల ద్వారా ఇళ్ల పట్టాలు చేతికొచ్చాయి. పేదలకు ఇప్పటికే 70వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చాం. మరో 30వేల ఇళ్లు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. దళితబంధు, కళ్యాణలక్ష్మి, పెన్షన్లు తదితర పథకాలు అమలవుతున్నాయి. అధికార బీఆర్ఎస్పై వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు ? డబుల్బెడ్రూం ఇళ్లు వచ్చిన ప్రజలు సంతోషంగా ఉన్నారు. రానివారు బాధపడుతున్నారు. వారి బాధ కూడా తీరుస్తాం. మరో లక్ష ఇళ్లు నిర్మిస్తాం. అసలీ పథకాలు తెచ్చింది. అమలు చేస్తున్నదే కేసీఆర్ ప్రభుత్వం. గత పాలకులకు కనీసం ఇలాంటి ఆలోచనలు కూడా రాలేదు. చేసిన పనులు కళ్లముందే కనిపిస్తున్నాయి. దశల వారీగా అన్ని పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. మిగతా పార్టీల మాటలు నమ్మొద్దు. అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తగ్గించలేరా ? డబ్బుతో ప్రజలను కొనలేరు. అభ్యర్థులు కూడా వీలైనంత మేరకు ఎన్నికల వ్యయం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంటింటికీ వెళ్లి చేసిన పనులు, చేయబోయే పనులు చెప్పుకోవడం ద్వారా ఖర్చు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాంగ్రెస్ హామీలను ఎలా చూడొచ్చు? మాకు పాలనానుభవం ఉంది. వచ్చే రెవెన్యూ ఎంతో, ఎంత ఖర్చు చేయొచ్చో తెలిసిన నాయకుడున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు ఇంతకుముందే విన్నా. బీఆర్ఎస్ దగ్గరి అవినీతి సొమ్ము వెలికితీసి వారి ఆరు గ్యారంటీలు అమలు చేస్తారట. గాలి మాటలు తప్ప అది సాధ్యమా ? అలాంటి హామీలు ఫేక్ కాక , వాటికి శాంక్టిటీ ఉంటుందా ? కాబట్టి కాంగ్రెస్‌ను ఎవరూ నమ్మరు కూడా. నగరంలో సీఎం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ? ఈనె ల 25వ తేదీన గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. భారీయెత్తున నిర్వహించనున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా పార్టీ క్యాడరే కాక నగర ప్రజలకు, చదువుకున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం బాగా పని చేస్తోందనే నమ్మకం ఉంటే అధిక సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో, కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ బలం కనిపించడం లేదు ఎందుకంటారు? రాజకీయ నేతలపై, వివిధ రంగాల్లో ప్రముఖులపై కనీస గౌరవం లేకపోవడంతో పాటు సోషల్ మీడియాలో వారిని ఇష్టానుసారం చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్‌గా, ప్యాషన్‌గానూ మారింది. ఇంకొందరు సర్వేలపేరిట తోచింది రాస్తున్నారు. సర్వేల నివేదికలంటూ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. వాటికెలాంటి శాంక్టిటీ లేదు. వాటి గురించి పట్టించుకోవద్దు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరేమిటో గ్రహిస్తున్నారు. చేసిన మంచి పనులు కళ్లముందే ఉన్నాయి. ఉదాహరణకు కరోనా వైరస్ తరుణంలోనూ ప్రభుత్వపరంగా ఏంచేశామో ప్రజలు చూశారు. నియోజకవర్గంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ప్రత్యర్థి గురించి ఆలోచించను. నియోజకవర్గంలో నేను చేసిన పనులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నా. గత ప్రభుత్వాలు యాభయ్యేళ్లలో చేయని పనులు తొమ్మిదిన్నరేళ్లలో చేశాం. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాం. వాటితోపాటు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, రాత్రుళ్లు ఎల్ఈడీ వీధి దీపాలు, ఇండోర్ స్టేడియాలు, తగినన్ని తాగునీటి రిజర్వాయర్లు తదితరమైన వాటిపైనే నా ఫోకస్. -
బల్దియా టు అసెంబ్లీ
చెరుపల్లి వెంకటేశ్: కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచినా, ఓడి నా పట్టు వదలకుండా కృషి చేసి పైమెట్టు ఎక్కారు. ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలవడంతోపాటు మంత్రులైన తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్, సి.కృష్ణయాదవ్, ముఖేశ్‌గౌడ్ తదితరులు నగరపాలకసంస్థ కార్పొరేటర్లుగా పోటీచేసిన వారే. ఎంసీహెచ్ నుంచే మొదలు తొలిసారిగా చాలామంది ఎంసీహెచ్(మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) 1986 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో మోండా డివిజన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని, పద్మారావు చేతిలో ఓడిపోయారు. అనంతరం తలసాని 5 పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పలుశాఖలు నిర్వహించారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్మారావు బీఆర్ఎస్ ప్రభు త్వంలో మంత్రిగానూ, డిప్యూ టీ స్పీకర్‌గా నూ పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగానూ, ప్ర భుత్వ విప్‌గానూ పనిచేశారు. మూడుసార్లు ఎమ్మె ల్యే అయిన ముఖేశ్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తొలుత టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు పర్యాయాలు ఎమ్యెల్యేగా ఎన్నికై మూడోసారి పోటీ చేస్తున్నారు. ఓటమి నుంచి గెలుపు.. దోమలగూడ, జవహర్‌నగర్ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ జి.సాయన్న, డా.కె.లక్ష్మణ్ తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో సాయన్న ఐదు పర్యాయాలు, లక్ష్మణ్ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. లక్ష్మణ్ ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సాయన్న మరణానంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె లాస్య నందిత తండ్రి ప్రాతినిధ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి 2002లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్‌గా గెలిచారు. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీన్ రివర్స్ ►మోండా డివిజన్‌కు పోటీ చేసిన పద్మారావు చేతిలో శ్రీనివాస్‌యాదవ్ కార్పొరేటర్‌గా ఒకసారి, సికింద్రాబాద్ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోగా, శ్రీనివాస్‌యాదవ్ చేతిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్మారావు ఒకసారి ఓడిపోయారు. ►జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గోపాల్ చేతిలో ఓటమిపాలైన లక్ష్మణ్, ముషీరాబాద్‌లో 2014లో గోపాల్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి 2018లో గోపాల్ గెలవగా లక్ష్మణ్ ఓడారు. పార్టీ అధ్యక్షులుగానూ కార్పొరేటర్లుగా పోటీ చేయడం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలైన శ్రీనివాస్‌యాదవ్, కృష్ణయాదవ్ , సాయన్న, ముఠా గోపాల్ హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగానూ పనిచేశారు. పద్మారావు టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. లక్ష్మణ్ బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎంపీలుగానూ.. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ సైతం కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా చేసిన రేణుకాచౌదరి ఎంపీగా, కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇలా బల్దియా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించి తదనంతరం గెలిచినవారు, ఓడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. పలువురు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లుగానూ పనిచేశారు. కృష్ణారెడ్డి, సు«దీర్‌రెడ్డి హుడా చైర్మన్లుగానూ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో... పోటీలో సిట్టింగ్ కార్పొరేటర్లు ప్రస్తుతం బల్దియా సిట్టింగ్ కార్పొరేటర్లలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుంచి , విజయారెడ్డి ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తోకల శ్రీనివాసరెడ్డి(బీజేపీ) రాజేంద్రనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌గా ఉన్న మహ్మద్ మోబిన్ బహదూర్‌పురా నుంచి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. షేక్‌పేట కార్పొరేటర్ రాషెద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీలు సైతం.. మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డి ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్ కూడా జీహెచ్ఎంసీ మేయర్లుగా పనిచేసిన జులి్ఫకర్ అలీ, మాజిద్‌హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థులుగా చారి్మనార్, నాంపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన జాఫర్ హుస్సేన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నాంపల్లి ఎమ్మెల్యేగా చేసి మూడోసారి యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. వీరిలో జుల్ఫికర్‌అలీ, మాజిద్ హుస్సేన్‌లు మేయర్ల పదవీకాలం ముగిశాక సైతం తిరిగి కార్పొరేటర్లుగానూ పనిచేశారు. మాజిద్ ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. సుదీర్‌రెడ్డి ఎల్బీనగర్ నుంచి రెండుపర్యాయాలు గెలిచి మళ్లీ బరిలో ఉన్నారు. ముఠాగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, తిరిగి పోటీ చేస్తున్నారు. పద్మారావు సికింద్రాబాద్‌లో మూడుసార్లు గెలిచారు. మళ్లీ బరిలో నిలిచారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణయాదవ్ రూపాంతరం చెందిన అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరి లో ఉన్నారు. -
రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు బీసీలకు సీఎం పదవి అనడం హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ఏదైనా చెప్పేముందు దానిలో వాస్తవికత ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామన డం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తలసాని స్పష్టం చేశారు. తమది ఏ టీమ్ అని, సింగిల్ గానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీఆర్ఎస్కు తగినన్ని సీట్లు రావనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, 78 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు! పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లేరని తలసాని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 27 మందికి సీట్లివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి వెంటనే సీట్లు ఇస్తోందన్నారు. బల్దియా ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తేవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడిన డ్రామా అని విమర్శించారు. తాము అమలు చేస్తు న్న పథకాలను దేశమే కాపీ కొడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటువేసే హక్కును ఉపయోగించుకోవాలని, ఓట్లు వేయరనే అపప్రదను చెరిపి వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాల ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ, తమ(ఎమ్మెల్యేల)ఇళ్ల స్థలా లు కూడా ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. -
ఇలాంటి ఇళ్లు చూపిస్తే రాజీనామా చేస్తా
రామచంద్రాపురం (పటాన్చెరు): సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పేదల కోసం ఇలాంటి ఆధునిక ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా తానే తీసుకెళ్లి ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను చూపించానని తలసాని చెప్పారు. కానీ ఈ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదన్నట్లు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వివేకానికే వదిలేశానని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నరేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
‘డబుల్’పై బీజేపీ డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మేనని అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కిషన్ రెడ్డికి అధికారికంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏం ఆశించి, ఎందుకోసం ఈ రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, పేద ప్రజల సంక్షేమం కోసం మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే.. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. కొల్లూరులో రూ. 6,700 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల కాలనీని ఇటీవలే సీఎం ప్రారంభించారన్నారు. గతంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. -
వృద్ధులకు ఇంటి వద్దే ఉచిత చికిత్స
కంటోన్మెంట్: ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద ప్రభుత్వ, రెడ్ క్రాస్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో లేని ప్రాంతాలు, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ వాహనం ద్వారా 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. అవసరమైన మందులు కూడా ఉచితంగానే అందజేస్తామన్నారు. 14 జిల్లాలలో ఈ తరహా 17 వాహనాల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వాహనంలో డాక్టర్, నర్స్, టెక్నీషియన్, అసిస్టెంట్ ఉంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడమే కాకుండా 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రజలు ఈ సేవలను సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సీఈఓ మదన్ మోహన్, కో ఆర్డినేటర్ స్వర్ణలత, అడ్వైజర్ శ్రీనివాస్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రాజేందర్, సీనియర్ సిటిజన్ సహదేవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కవాడిగూడ (హైదరాబాద్): మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గొల్లకురుమల వృత్తిని కించపరిచేలా, యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ న్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ యాదవ, కురుమ సంఘాల జేఏసీ కన్వీనర్ అయిలయ్య, కో కన్వినర్ జి. శ్రీనివాస్ యాదవ్‌లు డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కురుమ, యాదవ సంఘాలు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాయి. దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాదవులు, కురుమలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గొల్ల వృత్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాలు డెడ్‌లైన్ ప్రకటించినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మహాధర్నా చేపట్టామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. చలో గాందీభవన్‌తో ఉద్రిక్తత ధర్నా అనంతరం కురుమ, యాదవ సంఘాలు గాందీభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ధర్నా చౌక్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. -
8,9,10 తేదీల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్ : మృగశిరకార్తె సందర్భంగా వచ్చే నెల 8,9,10 తేదీల్లో మత్య్సశాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని అధికారులకు మత్య్స, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. ఫిష్ పుడ్ ఫెస్టివల్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌పై బుధవారం సచివాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చరాం భూక్యాలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫెస్టివల్లో 20 నుంచి 30 వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్, విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఫెస్టివల్ మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. సమీక్ష సందర్భంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ నూతన చైర్మన్‌గా నియమితులైన పిట్టల రవీందర్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ (వీఏఎస్) అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వీఏఎస్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల వారీగా పశుసంవర్ధక శాఖ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ పశువైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. -
పెండ పిసికేటోడు నన్నేం పిసుకుతాడు.. తలసానికి రేవంత్‌రెడ్డి కౌంటర్
కంటోన్మెంట్ (హైదరాబాద్): చాలాకాలం దున్నపోతు లతో తిరిగి వాటి పెండ పిసికే అలవాటున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనను పిసికేస్తానంటూ ప్రగ ల్భాలు పలకడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయినా ఆయన ఏం పిసకాలనుకుంటు న్నాడో సమయం చెబితే తాను వస్తానని చెప్పారు. తలసాని ఎన్నాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాళ్లు పిసికినా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడినైన తన స్థాయికి రాలేడ ని వ్యాఖ్యానించారు. బుధవారం కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్‌పరాగ్ నమిలేటోడు కూడా తన గురించి మాట్లాడితే గౌరవంగా ఉండదని రేవంత్ అన్నారు. తలసాని పాన్‌పరాగ్ మానేస్తే బాగుంటుందని, ప్రజాప్రతినిధులుగా మనం యువ కులకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. కేంద్రం, రాష్ట్రం నిధులివ్వాల్సిందే.. కంటోన్మెంట్‌కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాల్సిందేనని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సర్విసు చార్జీల బకాయిలు ఇప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఉందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌కు రావాల్సిన పన్నుల వాటాను తన ఖాతాలోకి మళ్లించుకోకుండా నేరుగా కంటోన్మెంట్‌కే చెల్లించాలన్నారు. హైటెక్ సిటీ సమీపంలో మెట్రోకు అప్పగించిన 15 ఎకరాలను దొడ్డిదారిన ప్రైవేటు సంస్థకు ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తలసానికి రేవంత్ క్షమాపణ చెప్పాలి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను దూషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిని ప్రజా క్షేత్రంలో యాదవ్ కురుమలు అడ్డుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. యాదవ కురుమలకు పెండ పిసకడం తెలుసు, బరాబర్ నీ కుతిక పిసకడం కూడా తెలుసు అని హెచ్చరించారు. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. చదవండి: నీకు మైండ్ ఉందా.. నువ్వు నోర్మూసుకో -
పర్సనాలిటీ గింత.. పిసికితే ప్రాణం పోద్ది
సనత్‌నగర్ (హైదరాబాద్): ‘ప్రియాంకా గాంధీ సభలో డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. ఎమ్మెల్యే అని లేదు.. మంత్రి అని లేదు.. వాడు.. వీడు అని మాట్లాడతాడు.. ఉన్న పర్సనాలిటీ గింత.. పిసికితే ప్రాణం పోద్ది.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నడు..’ అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రస్థాయిలో దూషించారు. ప్రియాంకా గాందీపై కూడా విమర్శలు కురిపించారు. ‘మా తాత ఇదుండే..మా అమ్మమ్మ అదుండే.. మా నాయన అది అని ప్రియాంకా గాంధీ చెబుతుంది. మరి 40 సంవత్సరాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని మీరే పరిపాలించారు కదా..పేద వాళ్ళకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని, 24 గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచన..మీకు ఎందుకు రాలేదు?..’అని నిలదీశారు. మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని ధనియాలగుట్ట వైకుంఠ ధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసాని పాల్గొని మాట్లాడారు. ఎక్కడైనా ఇళ్లు మునిగిన పరిస్థితి ఉందా? ‘వరదల ఇబ్బందులు గతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్ పాపం కాదా? ఎక్కడపడితే అక్కడ ఆక్రమణలు, నాలాలు మూసుకుపోయిన పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ హయాంలో.. వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గతంలో కంటే ఎక్కువగా వర్షాలు వచ్చాయి. ఎక్కడైనా ఇళ్లు మునిగిన పరిస్థితి ఉందా?..’అని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు వరదలు వస్తే ముఖ్యమంత్రి ఇంటికి పది వేల రూపాయలు చొప్పున ఇచ్చారని తెలిపారు. నాకు బొట్టు పెట్టడం బీజేపీ వాళ్లు నేర్పిస్తారా? ‘ప్రైమ్ మినిస్టర్, వీళ్లు హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్‌యాదవ్‌కు కొత్తగా బొట్టు పెట్టడం నేర్పిస్తారా? నేను చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటున్నా. ప్రధానమంత్రి గానీ, దేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానీ ఇక్కడి వైకుంఠధామం లాంటిది ఒక్కటైనా కట్టారా? ఎంతకూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలి.. వైషమ్యాలు, లేనిపోని సమస్యలు సృష్టించాలి. ఇదే పని. జై హనుమాన్, జై బజరంగ్ అంటూ దేవుళ్ల పేర్లు చెప్పడమే తప్ప బీజేపీ నాయకులు ఎక్కడైనా ఒక్క దేవాలయం కట్టారా? అద్భుతమైన యాదాద్రిని నిర్మించిన కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా?. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది. కేసీఆర్ వచ్చాక నేను పోతాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అన్న పరిస్థితి రాష్ట్రంలో వ చ్చింది..’అని చెప్పారు. ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ‘చూస్తే అమెరికాలో వైట్‌హౌస్ చూడాలి..లేదా తెలంగాణలో సెక్రటేరియట్ చూడాలి. దేశంలోని నాయకులందరూ అంబేడ్కర్ పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవాలని చూస్తారు..కానీ నిజమైన నాయకుడు కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు..’అని తలసాని తెలిపారు. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాన్ని, నాయకులను కాపాడుకోవాలని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి..కొత్త బిచ్చగాళ్లు వస్తుంటారు..ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటారు..పనిచేయని వాడు మనకు అవసరం లేదు. ఎవరైతే మనకు పనిచేస్తారో వారి గురించే ఆలోచన చేయాలని తలసాని విజ్ఞప్తి చేశారు. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా: తలసాని ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలు సరికాదని, రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసేటప్పుడు హుందాతనంతో వ్యవహరించాలని తలసాని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రేవంత్ అసభ్యకర భాషతో చేసిన విమర్శలతో తాను ఆవేదన చెందానని, ఆ ఆవేదన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను బాధ్యత కలిగిన మంత్రిగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం సరికాదని, ఇకనైనా బాధ్యతగా మాట్లాడదామని సూచించారు. -
నీరా కేఫ్, క్యాంటీన్ ప్రారంభం
పంజగుట్ట: తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరాతోపాటు వాటి ఉప ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్, క్యాంటీన్ హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్, క్యాంటీన్లను రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి బుధవారం ప్రారంభించారు. నీరాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, నీరా దేవతల పానీయం అని చెప్పేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలతో కలసి మంత్రులు ఈ సందర్భంగా నీరా తాగారు. నీరాలో ఎలాంటి ఆల్కహాల్ ఉండదని... ఇది తాగడంవల్ల మత్తు రాదని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇందులో పుష్కలంగా విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయని చెప్పారు. సహజంగా లభించే పానియాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... వారికి గీత కార్మికుల ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకొచ్చిన నీరా కేఫ్ చెంపపెట్టులాంటిదన్నారు. నీరా వంటకాలు సైతం.. క్యాంటీన్లో నీరా విత్ బోటీ, నీరా విత్ తెలంగాణ వంటకాలు, నీరా విత్ బిర్యానీ, నీరా విత్ వెజ్ స్నాక్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర, తేనె, నీరాతో చేసిన ‘బూస్ట్’ పొడి కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే నీరా ఐస్‌క్రీం, తాటి ముంజ ఐస్క్రీంలను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని... అందులో భాగంగానే రైతు బీమా తరహాలో గీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా తీసుకొచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారని, ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. నీరా కేఫ్ ప్రారంభించినందుకు, గీత కార్మికులకు బీమా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు అఖిల భారత గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర పర్యాటక, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆంజనేయ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన రాజమౌళి కాదు.. రాజముని
‘‘ఆస్కార్’ అవార్డు సాధించి ఎంతో మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన రాజమౌళి కాదు.. రాజముని. ఆయన చేసిన గొప్ప ప్రయోగం (ఆర్ఆర్ఆర్) తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ–‘‘ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌లకు అభినందనలు. తెలుగువారు గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపిన వారికి ఏపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున అభినందనలు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ రావాలని లక్షల మంది ఎదురు చూశారు.. ఆ అవార్డు రానే వచ్చింది. ఈ విజయాన్ని సాధించిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్గార్లకు అభినందనలు’’అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ–‘‘ఒక సినిమాకి నంది అవార్డు వచ్చిందంటే చాలా గొప్పగా అనుకుంటున్నాం. అలాంటిది తొలిసారి ఒక తెలుగు పాటకి ప్రపంచంలో అత్యున్నతమైన ‘ఆస్కార్’ అవార్డు రావడం తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సమయం. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ అవార్డు రావడం వెనుక రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్ డ్యాన్సర్స్ కృషి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నచ్చింది కాబట్టే ‘నాటు నాటు..’ పాట నచ్చింది, అవార్డు వచ్చింది. ఇది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సమిష్టి కృషికి లభించిన విజయం’’ అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘తమ్ముడూ.. నువ్వు పాడటంపై దృష్టి పెట్టొద్దు.. రాయడంపై దృష్టి పెట్టు’ అని చెప్పిన గుర్రా శ్రీనాథ్ అన్న, ‘పెళ్లిసందడి’ సమయంలో ‘బోస్‌ని మనతోపాటు చెన్నై తీసుకెళదాం’ అంటూ రాఘవేంద్రరావుగారితో చెప్పిన కీరవాణిగార్ల మాటలు నా జీవిత గమనాన్ని మార్చి ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆస్కార్‌ని చేతిలో పట్టుకున్నప్పుడు భారత సాహిత్య పతాకాన్ని పట్టుకున్నంత ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొత్తవారిని ప్రోత్సహించాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త తరం అవసరం చాలా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ ‘అష్టదిగ్బంధనం’ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్తవారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూర్య భరత్ చంద్ర, ఇషికా ముఖ్య తారలుగా బాబా పీఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాం. ఒక వినూత్న కథాంశంతో బాబా పీఆర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది’’ అని బాబా పీఆర్ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు సూర్య భరత్ చంద్ర. ‘‘తెలుగులో నాకు ఇది మూడో సినిమా’’ అన్నారు ఇషికా. -
టాలీవుడ్‌కి యువత రావాలి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు యువత రావాల్సిన అవసరం ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేకుండా ప్రతిభతో చరిత్ర సృష్టించే అవకాశం సినిమా పరిశ్రమలోనే ఉంటుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా అరుణ్ భారతి ఎల్.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. అస్లాం కీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదలకు తలసాని శ్రీనివాస్, హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘యష్ పూరి నాన్నగారు నా చిన్నప్పటి స్నేహితుడు. యువత చూడాల్సిన చిత్రం ‘చెప్పాలని ఉంది’’ అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ‘‘మన యూత్ సినిమా ఇది.. థియేటర్లో చూద్దాం’’ అన్నారు నిఖిల్. ‘‘అన్ని భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం ఒక విధంగా పాన్ ఇండియా ఫిలిం’’ అన్నారు అరుణ్ భారతి. యష్ పూరి, స్టెఫీ పటేల్, సంగీత దర్శకుడు అస్లాం కీ, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడారు. -
గణేష్ నిమజ్జనం ఆంక్షల వివాదంపై తలసాని స్పందన
-
నిర్మాతలు ఆ విషయం చెప్పడం సంతోషంగా ఉంది: నిఖిల్
‘‘కార్తికేయ’ సినిమా చూశాను.. బాగుంది. ఆ సినిమాలానే ‘కార్తికేయ 2’ కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్రపరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా ముందుకు వెళ్లాలి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘కార్తికేయ 2’ తీసిన స్పిరిట్ నన్ను ఇక్కడికి నడిపించింది. ఇండస్ట్రీకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, సినిమానే దాన్ని అధిగమిస్తుంది.. ఎటువంటి పరిస్థితులకి ఇండస్ట్రీ లొంగలేదు’’ అన్నారు. ‘ ‘కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా మొహమాటానికి కొన్నిసార్లు ఫంక్షన్స్‌కి రావాల్సి ఉంటుంది. కానీ, ‘కార్తికేయ 2’ చాలా బాగుంది’’ అన్నారు ఎంపీ, రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘మా సినిమా కచ్చితంగా బాగుంటుంది’’ అన్నారు చందు మొండేటి. ‘‘మంచి కంటెంట్‌తో సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని ఇటీవల ‘బింబిసార, సీతారామం’ నిరూపించాయి. అలానే మా సినిమాకి కూడా బుకింగ్స్ బాగున్నాయని మా నిర్మాతలు చెప్పడం సంతోషంగా ఉంది’’ అన్నారు నిఖిల్. -
వజ్రోత్సవ వేడుకలపై సినీ ప్రముఖులతో మాట్లాడిన తలసాని
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుండి 22 వరకు ఘనంగా నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ అధికారులు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు తలసాని. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుగారి ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నాం. ఇక విద్యార్థులందరికీ మహాత్మా గాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాలను రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్థ్యంతో ఉన్న 563 స్క్రీన్లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను థియేటర్లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేపడుతుంది. అలాగే సినిమాల ప్రదర్శన సమయాల్లో వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తాం’’ అని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్‌బాబులతో పాటు యూఎఫ్ఓ క్యూబ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి
ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూమార్తె జాన్వి వివాహ వేడుక గురువారం రాత్రి హైదబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధమిత్రుల సమక్షంలో ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేసింది. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్‌తో పాటు నిర్మాతలు సురేశ్ బాబు, సి. కల్యాణ్, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: 10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్ అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీల్ నారంగ్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల ఈ బ్యానర్లో వచ్చిన లవ్‌స్టోరీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో పలు ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల-ధనుశ్ కాంబినేషన్లోని ఓ చిత్రం కాగా.. అనుదీప్-శివ కార్తికేయ కాంబోలో రూపొందుతున్న ప్రిన్స్ మూవీ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరు మా సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుతారు: హీరో ధృవ
మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన సినిమా కిరోసిన్. పెళ్లి చూపులు, ఘాజీ, టెర్రర్, చెక్, చైతన్యం వంటి సినిమాలతో తన నటన అందరిని ఆకట్టుకున్న ధృవ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమాను బగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ లు నిర్మించారు. తాజాగా ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఇక జాన్ 17న ఈ సినిమాగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. ‘కిరోసిన్ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. నేను గతంలో పోషించిన పాత్రల కంటే ఇది విభిన్నంగా ఉంటుంది. నా దర్శకత్వంలో రాబోందుతున్న సినిమా కావడం, అందులో నేనే హీరోగా ఉండడం ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. జూన్ 17వ తేదీన థియేటర్లలోకి వస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి’ అని అన్నారు. -
గోడౌన్లో అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి మంత్రి తలసాని చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంఘటన చాలా బాధాకరమని, మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా కృషి చేసినప్పటికీ భారీగా ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఉదయం మూడున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని, అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులకు ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. -
సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నారు. -
భారీగా పెరిగిన మటన్, చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్ : పప్పులు, నూనెలే కాదు..మటన్, చేపల ధరలు మార్కెట్లో మండిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం ఒక కిలో కొనుక్కుని వండుకోవాలన్నా అందనంత దూరానికి వెళ్లిపోయాయి. మామూలుగా కిలో రూ.500 అంతకంటే కొంచెం ఎక్కువ ఉండే మటన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.800 అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మటన్ ధర కిలో రూ.700 దాటకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మటన్ ధరను అదుపు చేయలేకపోతున్నాయి. పరిస్థితిని బట్టి మటన్ రూ.1000 వరకు కిలో అమ్ముతుండటం గమనార్హం. ఇక, చేపల ధరలు కూడా కొండెక్కాయి. రవ్వ, బొచ్చె, కొరమీను..ఏదైనా కిలోకు మూడొంతుల ధర పెరగడంతో మత్స్య ప్రియులు కూడా వెనక్కు తగ్గాల్సి వస్తోంది. కొరమీను కిలో రూ.650 వరకు చేపల ధరలు సైతం రోజురోజుకూ పైపైకి వెళ్లుతున్నాయి. రవ్వ, బొచ్చలు మామూలుS రోజుల్లో అయితే కిలో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతారు. ఇప్పుడు కిలో రూ.180 నుంచి రూ.220 వరకు అమ్ముతున్నారు. కొరమీను అయితే కిలో రూ. 600 నుంచి రూ.700 వరకు అమ్ముతున్నారు. పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి తక్కువగా ఉండటం, తెలంగాణలో ప్రభుత్వం ఉచితంగా విడుదల చేసిన చేపలు ఇంకా పెరగకపోవడం వంటి అంశాలు కూడా ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. వినియోగం పెరిగింది.. ధరలు పెరిగాయి గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో మటన్ కనీసంగా రోజుకు 60 టన్నుల నుంచి 70 టన్నుల వరకు అమ్మేవారు. పండుగ సమయంలో అయితే ఇది 100 టన్నులకు పైగానే అమ్ముతారు. పోయిన వారంలో ఏకంగా మటన్ 170 టన్నుల వరకు వెళ్లిందని అధికారులు చెబుతున్నాయి. ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కిలో మటన్ రూ. 700లకు మించి అమ్మొద్దని నిబంధనలు ఉన్నా అధికారులు మాటలకే పరిమితం కావడంగమనార్హం. చేపల ధరలు గతంలో, ఇప్పుడు చేపలు రవ్వ బొచ్చెలు కొరమీను రొయ్యలు (కిలోకు రూపాయల్లో) గతంలో 150 160 500–600 250–350 ఇప్పుడు 200 220 600–700 350–450 ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలే మార్కెట్లో మాంసం ధరలు పెంచి అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. సోమవారం దీనిపై ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ -
అందరూ బాగుండాలి...
‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే మంచి కథ ఉన్న సినిమాలో అలీ, నరేశ్ నటిస్తుండడం సంతోషంగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నటుడు అలీ ‘అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను ప్రారంభించి, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అలీ, సీనియర్ నరేశ్, మౌర్యాని ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొనతాల మోహనకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కెమెరామేన్ ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నేను, ఈ చిత్రదర్శకుడు కిరణ్ చెన్నైలో రూమ్ మేట్స్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వికృతి’ సినిమాకు ఇది రీమేక్’’ అన్నారు అలీ. ‘‘అలీ ఓ చిత్రం చేస్తున్నాడంటే దానికి ఒక బ్రాండ్ వస్తుంది’’ అన్నారు నరేశ్. ‘‘బుధవారమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు శ్రీపురం కిరణ్. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్ పళిడమ్, కెమెరా: ఎస్. మురళీ మోహన్ రెడ్డి. -
మా ఇంటి నుంచి పోటీ చేయడం లేదు: మంత్రి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వరదలపై పక్క రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం 4,75,781 మందికి నేరుగా వరదసాయం అందజేసిందని మంత్రి తెలిపారు. అనంతరం మీసేవ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించామని, గత మూడురోజుల్లో రూ. 165 కోట్లు మీసేవ ద్వారా వరద బాధితులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ వరదసాయం నిలిపివేసినా, ఫలితాల అనంతరం ఈ మొత్తాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నేను ఫైటర్ని.. దేనికి భయపడను : కేసీఆర్) ప్రజలు ఆలోచించాలి ‘‘ప్రతిపక్షాలు టీఆర్ఎస్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్తే ప్రజలే తేల్చుతారు. స్వాతంత్రం వచ్చాక ఇక్కడ ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది. వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏమి చేసిందో హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. దేశంలోని ప్రతీ ఒక్కరూ నగరం వైపు చూస్తున్నారు. ఆధునాతన రోడ్లు, సీసీ కెమెరాలు, ఎల్ఈడీలు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. భారతదేశంలో మేము కట్టిన ఇళ్లు ఎవరూ కట్టలేదు’’ అని మంత్రి తలసాని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఇక దుబ్బాకలో బీజేపీ విజయం నేపథ్యంలో... ఒక ఎన్నిక గెలిచిన్నంత మాత్రాన మొత్తం అదే ప్రపంచం అనుకుంటే ఎలా అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్నిరకాలుగా అడ్డుపడినా, ఎన్నికల తర్వాత ప్రజలకు వరద సాయం అందిస్తామని వెల్లడించారు. పోటీ చేయడం లేదు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తమ ఇంటి నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రజాస్వామ్యం లో పోటీ చేసే హక్కు అందరికి ఉంటుందని, మేయర్ అభ్యర్థిపై తమకు ఆశలు లేవని పేర్కొన్నారు. చిన్న వయసులోనే తన కుమారుడికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని, అదే ఎక్కువగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ బరిలో నిలపగా, ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.